Apparao
-
‘సాక్షి’ విలేకరిపై జనసేన ఎమ్మెల్యే దాడి
రాంబిల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల సాక్షి విలేకరి, యలమంచిలి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బుదిరెడ్డి అప్పారావుపై జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దాడికి పాల్పడ్డారు. శనివారం దిమిలి గ్రామంలో తన నివాసంలో అప్పారావు తనపై దాడి ఘటనను మీడియాకు వివరించారు. ‘ఈ నెల 3వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నా మొబైల్‌కు ఫోన్ చేశారు. నేను లిఫ్ట్ చేయకపోవడంతో తర్వాత ఆయన పీఏ చంద్రారావుతో ఫోన్ చేయించారు.అయినప్పటికీ నేను ఫోన్ తీయలేదు. మళ్లీ 20 నిమిషాల తర్వాత ఎమ్మెల్యే ఫోన్ చేసి మీతో మాట్లాడాలని, అచ్యుతాపురంలోని ఎస్టీబీఎల్ లేఅవుట్లో ఉన్న తన స్వగృహానికి రావాలని చెప్పారు. దానికి నేను రానని చెప్పాను. అయితే వెంటనే పంపించేస్తానని.. రాంబిల్లి మండలం కొత్తూరు వరకు కారు పంపిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అయినప్పటికీ నేను రానంటే రావాలని ఒత్తిడి తెచ్చారు. తప్పనిసరి పరిస్థితిల్లో నా స్వగ్రామం దిమిలి నుంచి బైక్‌పై కొత్తూరుకు వెళ్లాను. అప్పటికే అక్కడ బ్లాక్ స్కార్పియోతో ఎమ్మెల్యే డ్రైవర్ జగదీష్ ఉన్నాడు. నన్ను కారు ఎక్కించుకుని ఎస్టీబీఎల్‌లో అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు ఇంటి ముందు దించారు. అక్కడ 40 నిమిషాలు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ కోసం ఎదురుచూశాను. అప్పటికి కూడా ఎమ్మెల్యే నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో నేను వెళ్లిపోతానని ఎమ్మెల్యే పీఏకు ఫోన్ చేసి చెప్పాను. దానికి పీఏ తన రూమ్ పక్కనే ఉందని, అక్కడకు రమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్లగా గదిలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఉన్నారు. తాను లోపలకు వెళ్లగానే రూమ్ డోర్ మూసేశారు’ అని అప్పారావు వివరించారు.చంపేస్తానని హెచ్చరించారు..‘నన్ను గదిలో బంధించి ‘యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలు’ పేరిట సాక్షిలో ఎందుకు వార్త రాశావు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాగే ఎన్నికలకు ముందు సాక్షిలో ప్రచురించిన కథనాలపై నిలదీశారు. తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ వచ్చాక ఎన్నికల్లో ఓడించడానికి కథనాలు రాశావంటూ మండిపడ్డారు. ఆ కథనాలు నేను రాయలేదని, విశాఖ ప్రధాన కార్యాలయం నుంచి సీనియర్లు రాశారని సమాధానమిచ్చినా ఆయన వినిపించుకోలేదు. వారం క్రితం ‘యథేచ్ఛగా మట్టి దందా’ పేరుతో ఎందుకు వార్త రాశావని బెదిరించారు. దానికి నేను సమాధానంగా అక్రమంగా మట్టి దందా చేస్తే ఖచ్చితంగా రాస్తానని.. ఇదే వార్త సాక్షితో పాటు ఈనాడులో కూడా వచ్చిందని చెప్పాను. దీంతో వెంటనే ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నిన్ను చంపేస్తాను’ అని హెచ్చరించారు. నా తల్లిని తిట్టడంతోపాటు నీ సంగతి తేలుస్తానంటూ కోపంతో మెడ పట్టుకుని చంపేస్తా అని బెదిరించారు. ఆ క్షణంలో నాకు ప్రాణహాని ఉందని గ్రహించి అక్కడ నుంచి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బయటపడ్డాను. నాకు, నా కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని విన్నవిస్తున్నా’ అని అప్పారావు తెలిపారు. -
నవ్వులే నవ్వులు
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్ధన్ , యాదమ్మ రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్లాంట్ మ్యాన్’. కె.సంతోష్ బాబు దర్శకత్వం వహించారు. డీఎం యూనివర్సల్ స్టూడియోస్‌పై పన్నా రాయల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పన్నా రాయల్ మాట్లాడుతూ–‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ‘ప్లాంట్ మ్యాన్’. ప్రారంభం నుంచి చక్కని వినోదం ఉంటుంది. ఒక కొత్త అంశం కూడా ఉంది.. అందుకే ఈ సినిమాకి ‘ప్లాంట్ మ్యాన్ ’ అనే టైటిల్ నిర్ణయించాం. ఈ చిత్రం తర్వాత కూడా మా బేనర్లో కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీఎస్. మణికర్ణన్ , నేపథ్య సంగీతం: వినోద్ యాజమాన్య, సంగీతం: ఆనంద బాలాజీ, నిర్మాత–దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్. -
దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
మంగళగిరి: రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ప్రకటించిన దసరా పండుగ సెలవుల నిబంధనలను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు తప్పని సరిగా పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ నియమ నిబంధనలును కొన్ని ప్రైవేటు, కార్పోరెట్ పాఠశాలలు పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోమ్ వర్కులు చేయమని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే apscpcr2018@gmail.com మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్ -
అక్టోబర్ నుంచి బాలల అదాలత్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నుంచి బాలల అదాలత్‌లు నిర్వహించనున్నట్లు ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. మంగళగిరి కమిషన్ కార్యాలయంలో సభ్యులు జంగం రాజేంద్రప్రసాద్, గోండు సీతారాం, బత్తుల పద్మావతితో ఆయన సమావేశమయ్యారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు, సన్నాహాలపై వారు చర్చించారు. 18 సంవత్సరాల్లోపు బాలలు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు, ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ఇలాంటి విషయాలు తమ దృష్టికి తీసుకురావడానికి ఈ అదాలత్‌లు సువర్ణావకాశమని వివరించారు. -
జగన్ సంక్షేమ పథకాలతో బాబు, రామోజీలకు భయం
జగన్ సంక్షేమ పథకాలతో చంద్రబాబు, రామోజీరావులకు భయం పట్టుకుందని ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు తోడల్లుడు అప్పారావు తెలిపారు. వారికి ఇక భవిష్యత్ ఉండదని భయపడుతున్నారని వెల్లడించారు. అందుకే జర్నలిజం విలువలకు పాతరేసి ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సహకారంతో రామోజీరావు శంషాబాద్ విమానాశ్రయం వద్ద 450 ఎకరాలు కొన్నారన్నారు. అలాగే అమరావతిలోనూ బినామీల ద్వారా భూములు కొనిపించారని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండానే రాజధానిని ప్రకటించారని తప్పుబట్టారు. అమరావతి ప్రాంతంలో మంచి పంటలు పండే భూములను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ రాజధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఊరు రాజధాని అయిపోయినంత సంతోషంగా ఉందని తెలిపారు. ఈ మేరకు రామోజీరావు తోడల్లుడు అప్పారావు సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... మా అబ్బాయిని రామోజీరావు వేధించారు.. డాల్ఫిన్ హోటల్‌కు మా అబ్బాయి శ్రీనివాస్ రెండేళ్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కానీ.. మా అబ్బాయిని రామోజీ వేధించారు. దీంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తర్వాత.. డాల్ఫిన్ హోటల్‌కు ఎండీగా తన కోడలు విజయేశ్వరిని రామోజీ నియమించుకున్నారు. ఇక కళాంజలిని మా అమ్మాయి ఎంతో అభివృద్ధి చేసింది. ఆమెని కూడా బయటకు తరిమేశారు. రామోజీరావు, చంద్రబాబు గురుశిష్యులు చంద్రబాబు సహకారంతో రామోజీ అన్నింటినీ నిలబెట్టుకుంటూ వచ్చారు. శంషాబాద్‌లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నప్పుడు 400 నుంచి 450 ఎకరాలు రామోజీరావు కొనుగోలు చేశారు. అదేవిధంగా అమరావతిలో రాజధాని అని ముందుగానే చంద్రబాబు సంకేతాలు ఇవ్వడంతో అక్కడ కూడా రామోజీ తన బినామీలతో భూములు కొనిపించారు. ఆ విషయంలో చంద్రబాబు, రామోజీ ఇద్దరూ గురుశిష్యులు... టూ ఇన్ వన్. చంద్రబాబుది పవర్.. రామోజీది కోరిక. జగన్‌ను చూసి రామోజీ, చంద్రబాబులో భయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు చూసి.. రామోజీ, చంద్రబాబులో భయం ఏర్పడింది. ఇదే తరహాలో జగన్ వెళ్తే.. తమకు భవిష్యత్తు ఉండదనివారిద్దరూభయపడుతున్నారు. అందుకే పూర్తిగా బరితెగించి.. జర్నలిజం విలువల్ని రామోజీరావు దిగజార్చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంపైనా ఇష్టం వచ్చి నట్లుగా రాతలు రాస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఈనాడు ద్వారా బయటవాళ్లకు మాత్రం నీతులు చెబుతూ.. తాను మాత్రం పాటించననే అహం రామోజీరావుకే సొంతం. రామోజీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు.. రాజకీయాలకు ఎన్టీఆర్ కొత్త. ఆ సమయంలో ఎన్టీఆర్ రామోజీని విశ్వసించేవారు. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తుంటే ముందు రామోజీకి చెప్పేవారు. క్రమంగా ఎన్టీఆర్ జాతీయ నేతగా ఎదుగుతున్న సమయంలో కొన్నిసార్లు రామోజీకి చెప్పకుండానే కొన్ని పనులు చేశారు. దీంతో రామోజీకి భయం పట్టుకుంది. ఎన్టీఆర్ తన గుప్పిట నుంచి జారిపోతున్నారని భావించారు. యూఎల్‌సీకి సంబంధించి ఈనాడుకు చెందిన ఫైల్ వెళ్తే ఎన్టీఆర్ దాన్ని పక్కన పెట్టమని అధికారులకు చెప్పారు. అప్పట్లో ఉపేంద్ర అనే వ్యక్తి ఎన్టీఆర్‌కు పీఏగా ఉండేవారు. అయితే.. అతడి వ్యవహారం నచ్చక ఎన్టీఆర్ పక్కన పెట్టేశారు. ఆ సమయంలో చంద్రబాబు వచ్చారు. అప్పటి నుంచి రామోజీరావు, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్‌కు ప్రతికూలంగా మారిపోయారు. వైస్రాయ్ హోటల్ సాక్షిగా దుర్మార్గానికి తెరతీసి ఆయనను పదవీచ్యుతుడిని చేశారు. అప్పట్లో లిక్కర్ కాంట్రాక్టర్ల నుంచి చంద్రబాబుకు భారీగా నిధులు ముట్టిన విషయం తెలిసి.. ఈనాడులో దీనిపై కార్టూన్ వేశారు. ఆ మరుసటి రోజు చంద్రబాబు రామోజీ కాళ్లు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ ఒక్కటైపోయారు. శివరామకృష్ణన్ నివేదిక బయటకు రాకుండానే రాజధాని ప్రకటన శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆ కమిటీ నివేదికను పూర్తిగా మార్చేశారు. నారాయణను బినామీగా పెట్టుకొని.. ఆయనతో పనికిరాని నివేదిక ఇప్పించారు. అలాగే శివరామకృష్ణన్ నివేదిక బయటకు రాకుండానే అమరావతిని ప్రకటించారు. రామోజీరావుతో శంషాబాద్ వద్ద 450 ఎకరాలు కొనిపించినట్లుగానే అమరావతి ప్రకటనకు ముందు అక్కడ వాళ్ల వాళ్లతో భూములు కొనిపించారు. మంచి పంటలు పండే భూములను నాశనం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖను రాజధాని చేయడం అవసరం. అలాగే కర్నూలును కూడా న్యాయ రాజధానిగా చేయాలి. ప్రజలు వైఎస్ జగన్‌తోనే ఉంటారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలతో 2019లో విజయం సాధించారు. ప్రస్తుతం అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా సామాన్య ప్రజల అన్ని అవసరాలు తీరుస్తున్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కూడా బాగా జరిగింది. ప్రజలు తప్పకుండా జగన్‌తోనే ఉంటారు. ఆయనను మించిన మగాడెవరూ కనిపించడం లేదు. రామోజీలో మానవత్వం లోపించింది మనుషుల్లో ఆప్యాయత, అనురాగం ఉండాలి. కానీ రామోజీలో మానవత్వం లోపించింది. ఆనాడు మేము బయటకు రావడానికి, ఈనాడు ప్రజలు ఆయనకు దూరమవ్వడానికి ఇదే కారణం. ఆయన ప్రజలను పూర్తిగా విశ్వసించి ఉంటే ఈనాడులో ఈ తరహా రాతలు ఉండేవి కాదు. ప్రతి ఊరు రాజధాని అయినంత సంతోషంగా ఉంది అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతుంటే ఇబ్బంది ఏముంది? ఒక దగ్గరే పాలన చేయాలనేముంది? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఊరు రాజధాని అయిపోయినంత హ్యాపీగా ఉంది. గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ఎవరూ రాజధానికి వెళ్లాల్సిన పనిలేదు. అందరికీ వారున్న గ్రామాల్లోనే అన్నీ అందుతున్నాయి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎలా తన ఛరిష్మాతో జనంలో నాటుకుపోయారో.. అదే తరహాలో జగన్ కూడా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. -
స్ట్రెయిట్ టాక్ విత్ రామోజీ తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు
-
రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: రామోజీరావు ఓ విషసర్పమని ఆయన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాడును అడ్డుపెట్టుకుని రాయలసీమ, ఉత్తరాంధ్రలపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా అమరావతిలో కొన్న భూముల కోసం విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనాడు పత్రిక చంద్రబాబు కరపత్రికగా మారిపోయిందన్నారు. గతంలో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినట్టే ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్ జగన్‌ను కూడా గద్దె దించాలని కుట్రలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును అధికారంలోకి తేవడమే రామోజీరావు అంతిమ లక్ష్యమన్నారు. మొదట్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ మంచిగానే నడిచిందని.. అయితే డిపాజిట్లు మళ్లించడం ప్రారంభించినప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల కేసులో సీఐడీ అధికారులు ఏ–1గా ఉన్న రామోజీరావును, ఏ–2గా శైలజా కిరణ్‌ను విచారిస్తున్న నేపథ్యంలో సంస్థలో లోపాలు, నిధుల మళ్లింపులను మార్గదర్శిలో చాలా కీలకంగా వ్యవహరించిన రామోజీరావు తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు వివరించారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఈగో ఫీలింగ్‌తో ఈనాడు ప్రారంభమైంది.. ఒకసారి కేఎల్ఎన్ ప్రసాద్‌తో రామోజీరావు మాట్లాడుతున్న సమయంలో మాటామాటా పెరిగింది. పేపర్ ప్రారంభించడమంటే సులభం కాదన్న మాటలతో రామోజీలో ఈగో ఫీలింగ్ తలెత్తింది. ఎందుకు సులభం కాదో చూద్దామని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఎంటీ రాజుకు చెందిన బిల్డింగ్ చూశాం. 1974 ఆగస్టు 10న ఫౌండర్ ఎండీగా నేను వ్యవహరిస్తూ ఈనాడు ప్రారంభించాం. నంబర్‌వన్ పేపర్‌గా వచ్చేంత వరకూ నేను కృషి చేశాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మొదలు పెట్టినప్పుడు భానోజీరావు, మాజీ మంత్రి వెంగళరావుతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే భానోజీరావుకు చెందిన స్థలంలో డాల్ఫిన్ హోటల్ పెట్టేందుకు వెంగళరావుతో సిఫారసు చేయించారు. అయితే డాల్ఫిన్ హోటల్లో అనుకున్నంతగా డబ్బులు రాలేదు. రామోజీ దీన్ని ఓర్వలేకపోయారు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చిన్నగా ప్రారంభమైంది. ఆ తర్వాత రామోజీకి బ్రాంచ్‌లు విస్తరించాలన్న ఆలోచన వచ్చింది. విజయవాడ వచ్చినప్పుడు నన్ను పిలిచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ విస్తరిస్తామని చెప్పారు. విజయవాడలో మొదటి బ్రాంచ్ ఏర్పాటు పనుల్ని రెండు మూడు నెలల్లోనే ప్రారంభించాం. ఆ తర్వాత విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు సహా 8 బ్రాంచ్‌లను వెంటనే మొదలుపెట్టాం. క్రమంగా చిట్స్ పెరిగాయి. అప్పట్లో ఆ నగదును ఎటూ మళ్లించకపోవడంతో మార్గదర్శి బాగానే ఉంది. ఇంతలో ఈనాడు క్రమంగా విస్తరించి నంబర్‌వన్‌గా మారింది. ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్‌పై దృష్టిసారించాం. ఆ బాధ్యతలు కూడా నేనే తీసుకొని.. అద్భుతంగా తీర్చిదిద్దాను. ఈనాడు, డాల్ఫిన్.. ఇలా అన్నింటిని లీజుకు తీసుకున్న స్థలాల్లోనే నడిపాం. అందుకే మాకు లీజు మాస్టర్లు అని పేరొచ్చింది. నన్ను చూసే ఆ స్థల యజమానులు లీజులకు ఇచ్చారు. దీన్ని కూడా రామోజీ ఓర్వలేకపోయారు. నేను ఎదిగిపోతానేమోననే భయం రామోజీని వెంటాడింది. అప్పటికే రూ.వేల కోట్లు మళ్లించేశారు.. ఒక స్థాయి వరకూ డిపాజిట్లు తీసుకునేంత వరకూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాగానే ఉంది. ఈ డిపాజిట్లను మొదట ఈనాడు, డాల్ఫిన్ విస్తరణకు తరలించాం. ఎక్కడా ఇబ్బంది కలగకుండా.. లాభాలు రాగానే తిరిగి మళ్లీ మార్గదర్శిలోకి మళ్లించేవాళ్లం. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనలను కఠినతరం చేసింది. ఆ సమయంలో ఒక సుప్రీంకోర్టు జడ్జి అభిప్రాయాల్ని తీసుకున్నాం. దాని లూప్‌హోల్‌ని పసిగట్టిన రామోజీరావు మార్గదర్శి డిపాజిట్లను మళ్లించడం మళ్లీ మొదలు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించడంతో నిధుల మళ్లింపును నిలుపుదల చేశారు. అయితే అప్పటికే రూ.వేల కోట్లు మళ్లించేశారు. ఈనాడు అప్పటికే అగ్రస్థానానికి చేరుకోవడంతో ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. ఆ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపై పోరాటం మొదలుపెట్టారు. వైఎస్సార్ చొరవతో కొంతమందికి చెల్లింపు 2,600 మంది కస్టమర్ల సొమ్ముని వెంటనే కట్టాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటికప్పుడు సొమ్ములు తిరిగి వెనక్కు తీసుకురాలేని తరుణంలో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో రామోజీరావు చర్చలు జరిపారు. అయితే అంత పెద్దమొత్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రామోజీ.. చంద్రబాబుని సంప్రదించారు. ఆయన రిలయన్స్ని, నిమేష్ అంబానీ అనే బ్రోకర్ని పట్టుకున్నారు. రామోజీ సంస్థల షేర్లు ఒక్కోటి రూ.500గా ఉంటే రూ.5 వేలుగా చూపించి నిధులు తెచ్చారు. తద్వారా 2,600 మంది కస్టమర్లలో కొంతమందికి చెల్లించారు. అయితే ఎంతమందికి ఇచ్చామనే వివరాల్ని ఇప్పటికీ రామోజీ బయటపెట్టలేదు. పైగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదిస్తుంటారు. అంత పెద్ద వ్యక్తిపైన ఫిర్యాదు చేస్తే.. తమ భవిష్యత్తు ఏమవుతుందనే భయంతోనే డిపాజిటర్లు వెనకడుగు వేశారు. అది కూడా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్రమత్తమవ్వడంతోనే కొంతమందికి చెల్లించారు. మూడో వ్యక్తికి తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు.. మార్గదర్శిలో మేనేజర్లు అకౌంట్స్ చేయడం, రిజిస్టర్స్ నిర్వహించడం మొదలైనవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ.. వారందర్నీ రామోజీ డమ్మీలుగా చేసేశారు. ఏ బ్రాంచ్‌లో డబ్బులు వచ్చినా ప్రధాన కార్యాలయానికి పంపించాలనే హుకుం జారీ చేశారు. వివిధ జిల్లాల్లో వసూలైన చిట్స్ డబ్బులు మొత్తం ప్రధాన కార్యాలయంలోనే ఉంటాయి. ఏ జిల్లాలో ఎన్ని డిఫాల్టులుఉన్నాయి.. ఎంత మొత్తం వస్తుంది.. అనేది ఎవరికీ తెలీదు. రామోజీ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా చూశారు. ఇందులో ఏం జరుగుతుందనేది మూడో వ్యక్తికి కూడా తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఒక్కటే.. బ్రేక్ ది లా.. లాఫుల్లీ. అంటే.. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తుంటారు. అక్రమాలకు వజ్రాయుధంగా ఈనాడు.. అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఈనాడుని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. గతంలో అలానే ఉపయోగపడింది. కానీ.. రానురానూ ఈనాడుని స్వార్థానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తున్నారు. తమ అక్రమాలకు పత్రికని వజ్రాయుధంగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయంలో అడుగులు వేస్తున్న సమయంలో.. ఈనాడు ఎంతో ఉపయోగపడింది. ఎన్టీఆర్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చే విషయంలో ఈనాడు రిపోర్టర్ల ద్వారా అభ్యర్థుల పేర్లుని ఎంపిక చేసి నేనే ఉత్తరాంధ్ర నుంచి 37 పేర్లు పంపించాను. దాన్నే ఎన్టీఆర్ పరిగణనలోకి తీసుకోవడం.. వారంతా విజయం సాధించడంతో నాపై ఆయనకు నమ్మకం కలిగింది. ఆ సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని భావించారు. ఆ పేర్ల జాబితాని రామోజీరావుకు ఎన్టీఆర్ వినిపించడంతో.. రామోజీ నన్ను ఫోన్ చేసి అడిగారు. నాకు తెలీదని చెప్పాను. ఎక్కడ రాజకీయాల్లో ఎదిగిపోతానో అనే భయంతో రాజకీయాల్లోకి వద్దని అడ్డుకున్నారు. రామోజీ భయపడ్డారు.. మార్గదర్శిపై సీఐడీ దాడులతో రామోజీ భయపడ్డారు. అందుకే మంచం పట్టినట్లు కనిపించారు. దాని వల్ల ఎక్కువగా ప్రశ్నించరని అనుకున్నారు. కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఆ ఫొటో (మంచంపై పడుకున్న రామోజీని సీఐడీ విచారిస్తున్న) చూశాక నాకే ఆశ్చర్యమనిపించింది. ఆ స్థితిని చూసినప్పుడు ఈ మధ్య చంద్రబాబు ఏడ్చిన విషయం గుర్తొచ్చింది. గతంలో ఆరోగ్యం కూడా బాగోలేని ఎన్టీఆర్‌ని చంద్రబాబు, రామోజీ కలిసి ఏడిపించారు. చాలా మానసిక వేదనకు గురిచేశారు. రామోజీ మంచంపై పడుకోవడానికి.. చంద్రబాబు ఏడవడానికి కారణం కూడా అదే. చేసిన పాపాలు మనకు తిరిగి తగులుతాయని వీళ్లని చూస్తే తెలుస్తుంది. సుమన్ ఉండి ఉంటే.. మార్గదర్శికి సంబంధించి అప్పుడే గొడవలు జరిగి ఉండేవేమో. ఎందుకంటే సుమన్‌కి ఈ తరహా మోసాలు అసలు నచ్చవు. లెక్కలన్నీ పక్కాగా ఉంటే భయమెందుకు? వచ్చిన చిట్స్ మొత్తాన్ని రామోజీ ఇష్టం వచ్చినట్లు మళ్లించేస్తుంటే.. భవిష్యత్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా లక్షల మందికి ఎలా చెల్లించగలరు? ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉంది. మార్గదర్శి డిపాజిటర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం మార్గదర్శిపై విచారణ ప్రారంభించడం చాలా మంచిపని. ఇన్నాళ్లూ మోనార్క్‌గా వ్యవహరించి.. మన మీదకు ఎవరు విచారణకు వస్తారనే ధీమాతో రామోజీ ఉండేవారు. ఇప్పుడు ఇలా ఒక్కసారిగా విచారణకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. లెక్కలన్నీ పక్కాగా ఉన్నప్పుడు రికార్డులు ఇవ్వడానికి భయమెందుకు? టీడీపీకి కరపత్రంగా ఈనాడు మారిపోయింది ప్రస్తుతం మార్గదర్శిలో జరిగిన అవకతవకలు బయటపడతాయన్న విషయాన్ని రామోజీ గ్రహించారు. వాటిని ప్రజల్లోకి వెళ్లకూడదని భావించారు. అందుకే... టీడీపీ నేతలు, తెలిసినవారితో పత్రికపై దాడి చేస్తున్నారంటూ మాట్లాడిస్తున్నారు. డిపాజిట్లు అంటే ఏమిటో, చిట్స్ అంటే ఏమిటో తెలియనివారు కూడా మీడియా ముందుకు వచ్చి ఈనాడుపై దాడి, మార్గదర్శిపై దాడి అని మాట్లాడుతున్నారు. ఈనాడు తెలుగుదేశం పార్టీకి కరపత్రంగా ఉంది. కాబట్టి.. వారు దీన్ని కప్పిపుచ్చాలని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనేది చూడాలి. ఇది కరెక్టో, కాదో.. డిపాజిటర్లని విచారించాలి. ప్రతివాదుల్ని పిలవకుండా.. గతంలో కేసు కొట్టించేశారు. ఇప్పుడు మళ్లీ పోరాటం జరుగుతోంది. న్యాయం ఆలస్యమవ్వొచ్చు కానీ.. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. ఇప్పుడు మార్గదర్శికి ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి రామోజీరావే ప్రధాన కారణం. రామోజీకి తానే చక్రవర్తిననే అహం పెరిగిపోయింది.. ఇదంతా.. తన సామ్రాజ్యం.. ఇందులో వేరెవరికీ చోటుండకూడదని రామోజీరావు ఎప్పుడూ భావిస్తుంటారు. దీనికి చంద్రబాబు సహకారం అందించారు. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేశాక ఇద్దరూ ఒక్కటైపోయారు. అప్పటి నుంచి రామోజీకి తానే చక్రవర్తిననే అహం పెరిగిపోయింది. ఫిల్మ్‌సిటీని 1,000 నాగళ్లతో దున్నించేస్తానని కేసీఆర్ చెప్పడంతో.. ఆయనను మభ్యపెట్టేందుకు కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఓం సిటీ కడతానని ప్లాన్లు చూపించారు. ఇది ఫిల్మ్‌సిటీని మించిపోతుందని నమ్మించారు. దాన్ని మోదీకి కూడా చూపించారు. కానీ.. ఓం సిటీ ఏమైంది..? పేపర్లకే పరిమితమైంది. -
బాల్య వివాహాలు చేసేవారిపై కేసులు పెట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసేవారిపై కేసులు పెట్టాలని జిల్లా ఎస్పీలను ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని బాల్య వివాహాలు రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఇటీవల కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న బాలలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడంతో వారి ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు దేశాభివృద్ధికి దోహదం చేసే యువశక్తి నిర్వీర్యమైపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్య వివాహాల వల్ల బాలల భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడుతుందని, మాతా, శిశు మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. -
రవాణా మంత్రిగా ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చా!
సాక్షి, హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పలు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను రవాణా మంత్రిగా చేసిన కృషి, ముఖ్యమంత్రిగా సింగపూర్ పర్యటనలో ఎదురైన అనుభవం, మాజీ డీజీపీ అప్పారావు కొన్నేళ్ల క్రితం కలిసినప్పటి అంశాలను ప్రస్తావించారు. ఆ విషయాలు కేసీఆర్ మాటల్లోనే.. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చా ‘‘అప్పారావు ఆర్టీసీ ఎండీ, నేను రవాణా మంత్రి. మేం బాధ్యతలు తీసుకునే నాటికి ఆర్టీసీ రూ.13 కోట్ల నష్టాల్లో ఉంది. ఏం చేద్దాం అప్పారావుగారు అని అడిగితే.. మీరు సరేనంటే గట్టిగా పనిచేసి లాభాల్లోకి తీసుకొద్దాం అన్నారు. చాలెంజ్‌గా తీసుకుని పనిచేశాం. అప్పట్లో ఆంజనేయరెడ్డి గారిని కలవాలనుకున్నాను. నేను ఈ విషయం చెబితే ఆయనే వస్తానన్నారు. మీరు మా కంటే సీనియర్, నేను మంత్రిని కాగానే కొమ్ములేవీ మొలవలేదు అంటూ నేనే స్వయంగా వెళ్లి మాట్లాడిన. అనేక సలహాలు తీసుకున్నా. ఆపై అప్పారావు గారితో కూర్చుని ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుని పని ప్రారంభించాం. రూ.13 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రూ.14 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చాం. మా తర్వాత వచ్చిన కొందరు మళ్లీ ముంచేశారు. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా పోలీసు ఉన్నతాధికారులే ఆదుకున్నారు. వారి నాయకత్వమే ఇప్పటికీ ఆర్టీసీని నడిపిస్తోంది’’ సింగపూర్ పరిస్థితులపై మహిళా ఐఏఎస్‌తో.. ‘‘సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు మహేందర్‌రెడ్డి సూచనల మేరకు అక్కడి పోలీసు విభాగం, పనితీరును పరిశీలించాం. అప్పట్లో నాతో సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, మరో మహిళా ఐఏఎస్ వచ్చారు. అక్కడి ఓ బిజినెస్ మీట్లో కొందరు ‘‘వెన్ ఆర్ యూ గోయింగ్ టూ మేక్ హైదరాబాద్ అజ్ సింగపూర్ (మీరు హైదరాబాద్‌ను ఎప్పుడు సింగపూర్‌గా మారుస్తారు?)’ అని అడిగారు. ఇప్పుడే కదా ప్రారంభమయ్యాం.. కొంత సమయం పడుతుంది అని చెప్పా. సింగపూర్‌లో మహిళలు అర్థరాత్రి ధైర్యంగా బయటికి వెళ్లి పనులు చేసుకోగలరని వాళ్లు గర్వంగా చెప్పారు. మేం టెస్ట్ చేశాం. రాజశేఖర్‌రెడ్డిని, మా వెంట వచ్చిన మహిళా ఐఏఎస్ అధికారిని క్షేత్రస్థాయిలో పర్యటనకు పంపాం. నిజంగానే ఆమెకు ఎక్కడా ఏ ఇబ్బందీ ఎదురుకాలేదు. అలాంటి రోజులు ఇక్కడ కూడా రావాలి. వస్తాయి.’’ సిటీపై మాజీ అధికారులకు మమకారం మాజీ పోలీసు అధికారులకు రాష్ట్రంపై, పోలీసింగ్‌పై మంచి కన్సర్న్ ఉంది. ఓ ఏడాది గణేశ్ నిమజ్జనం రోజున మాజీ డీజీపీ అప్పారావు నా దగ్గరకు వచ్చారు. అప్పుడు మహేందర్‌రెడ్డి సిటీ పోలీసు కమిషనర్. అప్పారావు కూడా గతంలో సిటీ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఏదో విషయం మాట్లాడుతున్నాం. అ సమయంలో అప్పారావు నా ముందే ఫోన్ తీసి మహేందర్‌రెడ్డికి కాల్ చేశారు. గణేశ్ ఊరేగింపు ఎక్కడి వరకు వచ్చింది? అక్కడ జాగ్రత్త, ఫలానా చోట మన వాళ్లు అలర్ట్‌గా ఉన్నారా? అని అడిగి సలహాలు ఇచ్చారు. ఇప్పటికీ మాజీ పోలీసు ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు అవసరం. -
ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్ అప్పారావు
అద్దంకి రూరల్(ప్రకాశం జిల్లా): నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు పేర్కొన్నారు. బుధవారం అద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక పెండ్యాల ప్లాజాలో విలేకర్లతో ముచ్చటించారు. చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ ఉండేదన్నారు. ‘శుభవేళ’ చిత్రం ద్వారా వెండి తెరకు పరిశ్రమకు పరిచయమైనట్లు తెలిపారు. షకలక శంకర్ ప్రోత్సాహంతో ఓ తెలుగు చానల్ కామెడీ షోలో పాత్రలు పోషించానని, ప్రాధాన్యత లేని పాత్రలు రావడంతో 6 నెలల క్రితమే తప్పుకున్నాని చెప్పారు. చదవండి: బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్ విశాఖ జిల్లాలోని అక్కాయపాలెం తన స్వస్థలమని, పట్టుదలతోపాటు భార్య సహకారంతో ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తన భార్య 18 ఏళ్లు టీచర్‌గా పనిచేస్తూనే ప్రోత్సహించిందన్నారు. ఇప్పటి వరకు 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించినట్లు వివరించారు. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు దక్కాయని తెలిపారు. తనకు రాని ఇంగ్లిష్ భాషతోనే అందరినీ ఆకట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సినీ రంగాన్ని ఎంచుకునే యువకులు ఏ శాఖలో ప్రతిభ ఉందో గ్రహించి శిక్షణ పొందితే విజయం సాధించవచ్చని సలహా ఇచ్చారు. ప్రతిభ ఉన్నవారిని ఎవరూ అడ్డుకోలేరని హాస్యన టుడు అప్పారావు స్పష్టం చేశారు. -
గ్యాంగ్ వార్
అలీ ప్రధాన పాత్రలో ధన్‌రాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ముఖ్య తారాగణంగా ఎస్. శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగుపడుద్ది’. కిషోర్ రాఠి సమర్పణలో మనీషా అర్డ్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహేష్ రాఠి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ– ‘‘మనీషా బ్యానర్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ఫేమస్ అయిన రంగు పడుద్ది డైలాగ్‌నే ఇప్పుడు టైటిల్‌గా పెట్టి ఇదే బ్యానర్లో సినిమా చేశారు. ‘యమలీల’ చిత్రంలోని ‘చినుకు చినుకు..’ పాటను అప్పారావు, హీరోయిన్ హీనల మధ్య రీ క్రియేట్ చేశారు. శ్యామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘చాలాకాలం తర్వాత ఈ బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లాలో రెండు గ్యాంగ్‌ల మధ్య చోటు చేసుకునే ఘర్షణే మా చిత్రకథాంశం. హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్యామ్‌ప్రసాద్. ‘‘ఈ సమ్మర్ వెకేషన్‌కు అవుట్ అండ్ అవుట్ కూల్ కామెడీ చిత్రం అవుతుంది’’ అన్నారు మహేశ్. -
థ్రిల్ చేస్తుంది
సాగర్ శైలేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రహస్యం’. శ్రీ రితిక కథానాయికగా. ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్ర చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లేదని, థియేటర్లు దొరకటం లేదని అంటుంటారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నా పూర్తిగా కాదు. చిన్న సినిమాల్లో ఎన్నో చిత్రాలు బాగా ఆడుతున్నాయి. మంచి చిత్రాలకు థియేటర్స్ దొరుకుతున్నాయి. అందుకు నేను నిర్మించిన చిన్న చిత్రాలే ఉదాహరణ. కొత్త తరహా కథాంశంతో, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రమిది. సాగర్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా చక్కని ప్రతిభ కనబర్చారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు, టీజర్లకు స్పందన బాగుంది’’ అన్నారు. -
ఆడపిల్లని కాపాడదాం
‘సేవ్ గర్ల్ చైల్డ్’.. అంటే ఆడపిల్లని కాపాడదాం అని. ఇదే నినాదంతో ‘సమాజానికో హెచ్చరిక’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. చామకూరి కంబైన్స్ పతాకంపై చామకూరి. యమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లోని ఎస్.ఏ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివకృష్ణ, జబర్దస్త్ అప్పారావు, రాకింగ్ రాజేశ్, అలేఖ్య, ప్రియాంక, నటి గీతాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామకూరి. యమ్ మాట్లాడుతూ– ‘‘ముగ్గురు యువకులు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ, సమాజానికి ఎలా ఉపయోగపడ్డారో తెలియజేసే సినిమా ఇది. ఈ చిత్రానికి కథ, మాటలు నేను అందిస్తున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, పాటలు: సురేంద్ర కృష్ణ. -
థ్రిల్‌కి గురి చేసేలా..
‘‘విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా నిరంతరం సినిమాలు నిర్మిస్తుంటారు రామసత్యనారాయణగారు. ఏక కాలంలో రెండు, మూడు సినిమాలు నిర్మించే ఆయన చిన్న నిర్మాతలకు ఆదర్శం’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. సాగర్ శైలేష్, శ్రీ రితిక జంటగా సాగర శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రహస్యం’. ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం 3వ ట్రైలర్‌ను రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సాగర్ శైలేష్ షార్ట్ ఫిలిమ్స్ చాలా తీసాడు. నాకు ‘రహస్యం’ ట్రైలర్ బాగా నచ్చింది. మంచి టీమ్ కుదిరింది కాబట్టే సినిమా ఔట్పుట్ సూపర్‌గా వచ్చింది’’ అన్నారు. ‘‘సరికొత్త కథతో తెరకెక్కిన చిత్రమిది. సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. డిసెంబర్ 14న సినిమాను రిలీజ్ చేయాలనుకుం టున్నాం’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్య నారాయణ. -
రహస్యం ఏంటి?
సాగర్ శైలేష్, శ్రీ రితిక జంటగా నటించిన చిత్రం ‘రహస్యం’. ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించారు. సాగర శైలేశ్ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘రహస్యం’ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించి చిత్ర బృందానికి మంచి పేరు, డబ్బు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘కొత్త కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. రహస్యం ఏంటి? అన్నది తెరపైనే చూడాలి. వినాయక్‌గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది ’’ అన్నారు సాగర శైలేశ్. -
నవ్వుల్ పువ్వుల్
సీతంపేట (విశాఖ ఉత్తర) : ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా లాఫ్టర్ ఫన్ క్లబ్, ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ సంయుక్తంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వినోదాల విందు అలరించింది. జబర్దస్త్ ఫేం రాపేటి అప్పారావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అప్పారావు తనదైన శైలిలో కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. క్లబ్ కళాకారులు కోరుకొండ రంగారావు, జి.వి.త్రినాథ్, ఎం.వి.సుబ్రహ్మణ్యం నిర్వహణలో విశాఖ హ్యూమర్ క్లబ్, క్రియేటివ్ కామెడీ క్లబ్, హాస్యప్రియా కామెడీక్లబ్, అనకాపల్లి లాఫింగ్క్లబ్ కళాకరులు పాల్గొని స్కిట్స్ ప్రదర్శించారు. భలే టైలర్, ఆర్టీటీ ఎంక్వైరీ, గుడ్ మెమరీ, మీ వాళ్లేమీ చెప్పలేదా స్కిట్స్ అలరించాయి. పోలవరపు ప్రశాంతి చేసిన నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులు ఎఫ్.ఎం.బాబా య్, రామానుజం, అంజలి ఘోష్, ఇమంది ఈశ్వరరావు, భాను, శివరామకృష్ణ తదితరులు స్కిట్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డి.వి.మూర్తి, కొసనా, లక్ష్మీ భార్గవి, ప్రసన్నకుమార్, కొమ్మినేని రామారావు,నండూరి రామకృష్ణ పాల్గొన్నారు. -
జబర్దస్త్ మా కన్నతల్లి
హాస్య రసామృతంలో తేలియాడిస్తారు. అలసిన మనసులను సేదదీరుస్తారు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ ఇద్దరు జబర్దస్త్ రాపేటి అప్పారావు, అద్దంకి శేషు. వీరిద్దరు సహా పలువురు జబర్దస్త్ నటులు సీఎంఆర్ వద్ద జరిగిన ప్రైవేటు కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షితో వారు పంచుకున్న ముచ్చట్లివి. షకలక శంకర్ నా దేవుడు విజయనగరం టౌన్ : నేనీ స్థాయిలో ఉన్నానంటే అది షకలక శంకర్ పుణ్యమే. విశాఖ అక్కయ్యపాలెంలో ఆటోమెబైల్స్ వ్యాపారం చేసుకునేవాడిని. లెంక సత్యానందం మా గురువు. థియేటర్ ఆర్ట్స్ చదివేటప్పుడు ఆయన మాకు తరగతులు చెప్పేవారు. ఆయన చెప్పే ప్రతి మాట నా జీవితంలో పాతుకుపోయాయి. రోజా, నాగబాబులు ఎంతో అభిమానంతో మమ్మల్ని చూస్తారు. జబర్దస్త్‌కి ముందు 50.. ఆ ర్వాత 150కి పైగా సినిమాలు చేశాను. శ్రీ ఆంజనేయం, చందమామ, మహాత్మ, గోవిందుడు అందరివాడేలే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనింతే తదితర చిత్రాలకు ఆడిషన్స్ ద్వారా ఎంపికయ్యాను. చిన్నికృష్ణ దర్శకత్వంలో వీడుతేడా సినిమాలో అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సీనియర్ ఆర్టిస్ట్ బొమ్మలాట చిట్టి సారిక నన్ను అయిదేళ్ల పాటు ఆదరించారు. సినీరంగంలోకి రావాలనుకున్నవారు డిగ్రీ చేసి, కళను పూర్తిగా నేర్చుకోవాలి. కుటుంబ సభ్యుల ఆమోదం పొందాలి. అంకితభావంతో కష్టపడాలి. నటి శ్రీరెడ్డి ఆశయం చాలా గొప్పది. కానీ ఆమె ఎంచుకున్న మార్గం సరైంది కాదనేది నా అభిప్రాయం. చిన్న సినిమాలు విడుదల కాకుండా ఉండిపోతున్నాయి. కనీసం రోజుకు రెండైనా ప్రదర్శించాలి. – రాపేటి అప్పారావు గ్లిజరిన్ లేకుండా నటించా జబర్దస్త్ కార్యక్రమంతో సినీ పరిశ్రమలో ప్రవేశించాను. సీక్రెట్ కెమెరా.. ముందుగా వెళ్తున్న వారిని బకరా చేస్తూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కార్యక్రమాల ద్వారా మంచి పేరు వచ్చింది. సుప్రీం సినిమాతో నా జీవితం మారిపోయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశాను. వరుణ్ తేజ్ సినిమా మిస్టర్‌లో నా ప్రతి డైలాగ్ పేలింది. కుమారి 21 ఎఫ్కి సూర్యప్రతాప్ అనే దర్శకుడు నా గురించి రిఫరెన్స్ ఇచ్చారు. దర్శకుడు సుకుమార్ నిర్వహించిన ఆడిషన్స్‌లో గ్లిజరిన్ పెట్టుకుని ఏడుపు సీన్ చేయాల్సి ఉంది. అందుకు గ్లిజరిన్ వాడకుండానే చేసిన సీన్‌కి కెమెరామన్, కో–డైరెక్టర్ ఏడ్చారు. అంత అద్భుతంగా ఆ సీన్ వచ్చింది. రంగస్థలం సినిమాకు ఆ విధంగానే నాకు అవకాశం వచ్చింది. నా అదృష్టం ఏమిటంటే ఒకదానికొకటి అద్భుతమైన పాత్రలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ 40కి పైగా సినిమాలు చేశాను. బెల్లంకొండ శ్రీనివాస్, హీరో గోపీచంద్ సినిమాలతో పాటు బృందావనమిది అందరిదీ వంటి చిత్రాలలో నటిస్తున్నాను. విజయనగరంతో చాలా పరిచయం ఉంది. ఆర్కెస్ట్రా ద్వారా పరిసర ప్రాంతాల్లో పనిచేశాను. – అద్దంకి శేషు కుమార్ -
కష్టమే.. ఆ కార్మికుడి చుట్టం!
- నిత్యం వెన్నంటే కష్టాలు ∙అనారోగ్యంతో కుదేలైన జీవితం - వెన్నుపూసపై కణితి తొలగించే ఆపరేషన్‌తో మంచం పట్టిన వైనం - ఇదీ.. చెప్పులు కుట్టుకుని జీవనం సాగించే ఓ కార్మికుడి కన్నీటి వ్యథ టెక్కలి : తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ చెప్పులు కుట్టుకునే వృత్తినే నమ్ముకున్నాడు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకుని వచ్చాడు. అదే వృత్తిలో ఉంటూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడికి వివాహం చేశాడు. ఉన్న దాంతో తృప్తి పడుతూ.. జీవితం గడుపుతున్న సమయంలో హఠాత్తుగా అతని భార్య మరణించింది. అక్కడకు కొద్ది రోజుల్లోనే చిన్న కుమారుడికి పక్షవాతం వచ్చింది. వీటికి తోడుగా అతని వెన్నుపూసపై కణితి ఏర్పడింది. దానిని తొలగించే ఆపరేషన్ చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆపరేషన్ తరువాత ఆ కార్మికుడు మంచానికే పరిమితమైపోయాడు. సాఫీగా సాగిపోతున్న ఆ కార్మికుడి జీవితం అల్లకల్లోలంగా మారింది. మేడే.. ప్రపంచ కార్మిక దినోత్సవం. ఈ రోజున ఓ కార్మికుడి దీనగాథ తెలుసుకుందాం. టెక్కలి రామదాసుపేటవీధికి చెందిన కటారి అప్పారావు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న దుకాణంలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగించేవాడు. అయితే 2014 సంవత్సరంలో అతని భార్య సుశీల హఠాత్తుగా మరణించింది. అక్కడకు ఆరు నెలల తరువాత చిన్న కుమారుడు సత్యనారాయణకు పక్షవాతం వచ్చింది. చెప్పులు కుట్టుకుంటే వచ్చిన డబ్బులతోపాటు.. చుట్టుపక్కల వారి దగ్గర అప్పులు చేసి మరీ అప్పారావు తన చిన్న కుమారుడికి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందజేశాడు. ఇలా అప్పులు చేసి వైద్యం అందజేస్తున్న సమయంలో.. అప్పారావు వెన్నుపూసపై కణితి ఏర్పడింది. రాగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని స్థానికులు చెప్పడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అప్పారావు ఆపరేషన్ చేయించుకున్నాడు. అంతే.. ఆ తరువాత అప్పారావు మంచం పట్టాడు. నెలలు గడుస్తున్నప్పటికీ కోలుకోవడం లేదు. పెద్ద కుమారుడు నారాయణరావుకు వివాహం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన కూడా చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం తండ్రి, సోదరుడి భారం నారాయణరావుపై పడింది. ప్రభుత్వం దృష్టిలో ‘ముచ్చి’ (ఎస్సీ) కులంగా గుర్తింపు ఉన్నప్పటికీ.. ఏనాడూ తమను ఆర్థికంగా ఆదుకునే సాయం లేదంటూ ఆ కుటుంబం వాపోయింది. చేతి వృత్తి కార్మికులకు అందజేసే కనీస సంక్షేమ పథకాలు కూడా ఏనాడూ తాము అందుకోలేదని.. మంచం పట్టిన అప్పారావు భోరున విలపించాడు. తనతోపాటు చిన్న కుమారుడి వైద్యం కోసం ప్రభుత్వంతోపాటు దాతలు దయ చూపాలని వేడుకుంటున్నాడు. -
సీఐ, ఎస్సై, ఏఎస్సై సస్పెండ్
కరీంనగర్: అదిలాబాద్ వన్‌టౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్ చేస్తూ.. కరీంనగర్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ తగాదాలో తలదూర్చారనే సమాచారంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ ఎం. శ్రీనివాస్ నివేదిక ఆధారంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై బి. అనిల్, ఏఎస్సై జి. అప్పారావులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ రేంజ్ డీఐజీ సి. రవివర్మ ఆదేశాలు జారీచేశారు. -
కుటుంబ తగాదాలతో ఆత్మహత్య
అన్నవరం : అన్నవరం దేవస్థానం కేశ ఖండనశాలలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుడు పెండ్యాల అప్పారావు(33) శనివారం పంపా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి భార్య, పాప, బాబు ఉన్నారు. కుటుంబ తగాదాలే ఆత్మహత్యకు కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలిందని అన్నవరం ఎస్ఐ కె.పార్థసారథి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అప్పారావు మద్యానికి బానిస కావడం, ఇతర కుటుంబ కారణాలతో అతడి భార్య రెండు వారాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంటికి రావాల్సిందిగా రెండు రోజుల క్రితం అప్పారావు వెళ్లి, తన భార్యను కోరగా ఆమె తిరస్కరించింది. ఈ క్రమంలో అప్పారావు శుక్రవారం సాయంత్రం అన్నవరం రైల్వేస్టేçÙ¯ŒS సమీపంలో రైల్వేట్రాక్‌పై రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీనిని గమనించిన రైతులు అతడిని అడ్డుకుని, అప్పారావు తండ్రి పెండ్యాల చక్రరావుకు అప్పగించారు. కుటుంబ తగాదాలు పరిష్కరించుకుందామని, ఆత్మహత్య వంటి ప్రయత్నాలు చేయవద్దని తన కుమారుడికి చక్రరావు నచ్చజెప్పాడు. కాగా శనివారం ఉదయం దేవస్థానంలోని కేశఖండన శాలకు అప్పారావు విధులకు హాజరయ్యాడు. కొండమీద నుంచి కిందకు వచ్చి, మధ్యాహ్నం 12 గంటల సమయంలో పంపా బ్యారేజీ గేట్ల వద్ద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంఘటన స్థలానికి కొద్దిదూరంలో అతడి మృతదేహం తేలింది. మృతదేహాన్ని అప్పారావు కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. తండ్రి చక్రరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాకినాడ ఎవీఐ ఇంటిపై ఏసీబీ దాడి
-భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ)గా పనిచేస్తున్న అప్పారావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఇంటితో పాటు మరో ఏడు చోట్ల ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో బుధవారం ఉదయం ఈ తనిఖీలు చేపట్టారు. రూ.1.50 లక్షల నగదు, అరకేజీ బంగారు ఆభరణాలు, 70 లక్షల రూపాయలకు చెందిన ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడతో పాటు ఏలూరు తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని భావిస్తున్నారు. కాకినాడ ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. -
రైలు ఢీకొని జ్యూట్ మిల్లు కార్మికుడు దుర్మరణం
ఏలూరు అర్బన్ : రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక జ్యూట్ మిల్లులో పనిచేస్తున్న పెంటకోటి అప్పారావు (55) ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ మరడాని రంగారావు కాలనీలో నివశిస్తున్నాడు. అప్పారావు శనివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనులపై అతను రామకృష్ణాపురం వెళ్లేందుకు సీఆర్ఆర్ కళాశాల సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. రైలు పట్టాలపై మృతదేహాన్ని చూసిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'నా బిడ్డ మరణానికి వీసీనే కారణం'
హైదరాబాద్: రోహిత్ వేముల మరణానికి వీసీ అప్పారావే కారణమని తల్లి రాధిక అన్నారు. వీసీ చర్యలను వ్యతిరేకిస్తే విద్యార్థులను అరెస్ట్ చేస్తారా..? అని మండిపడ్డారు. హెచ్‌సీయూలో వీసీ అప్పారావు మళ్లీ విధులకు హాజరై ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు హెచ్‌సీయూలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చక్కదిద్దేందుకు యూనివర్సిటీ స్థాయి కమిటీని వేశారు. రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం కొనసాగుతున్న ఆందోళనను విరమింపజేసి తిరిగి యధాస్థితికి తెచ్చేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో తెలియజేసేందుకు ప్రొఫెసర్ కామయ్య చైర్మన్ గా ఏడుగురితో కమిటీని వేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
గొల్లప్రోలు : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్న నర్సింపేట గ్రామానికి చెందిన మొగిలి అప్పారావు(30) అనే కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పారావు నాలుగెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, వరి పంటలు వేశాడు. అయితే వర్షాభావంతో పంటలు చేతికి రాక అప్పులు పేరుకు పోవడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో శనివారం వేకువజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
కొత్తూరు: విధివశాత్తూ రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయింది. అంతిమ సంస్కారాలు చేసేందుకు అతని బంధువులెవరూ ముందుకు రాకపోవటంతో చివరకు భర్త అంత్యక్రియలు తానే నిర్వహించిన ఇల్లాలి విషాదగాథ. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని కృష్ణాపురంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలోని విష్టల గ్రామానికి చెందిన మీసాల అప్పారావు (55) ఐదేళ్ల క్రితం కృష్ణాపురం గ్రామంలో స్థిరపడి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి బైక్ ఢీకొన్న ప్రమాదంలో అప్పారావు ప్రాణాలు కోల్పోయాడు. అప్పారావు, సుందరమ్మ దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. అయితే, ఒక్కగానొక్క కుమారుడు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. అల్లుడు కూడా రెండేళ్ల కిందట గుండె పోటుతో చనిపోయాడు. ఈ పరిస్థితిలో అంత్యక్రియలు ఎవరు నిర్వహిస్తారనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఒడిశాలో ఉంటున్న మృతుని ఇద్దరు సోదరులకు అప్పారావు మృతి సమాచారాన్ని స్థానికులు తెలియజేసినప్పటికీ.. వారు ఏవో సాకులు చెప్పి రాకుండా తప్పించుకున్నారు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్త సంబంధీకులు ఎవరూ లేని పరిస్థితి తలెత్తింది. ఇలాంటి స్థితిలో మృతుని భార్య సుందరమ్మ భర్త మృతదేహానికి తలకొరివి పెట్టింది.