audio launch event
-
రేవు ఆడియో లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఇండియా ఫైల్స్‌లాంటి సినిమా అవసరం
‘‘ప్రస్తుత సమాజానికి ‘ఇండియా ఫైల్స్’ లాంటి సినిమా చాలా అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్ లీడ్ రోల్లో ఇంద్రజ, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ ఇతర ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండియా ఫైల్స్’. బొమ్మకు హిమమాల సమర్పణలో డా. బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘అద్దంకి దయాకర్ నటన చూడలేదు. కానీ ఆయనకు ప్రతి సబ్జెక్ట్, సమస్యల పట్ల ఉన్న అవగాహన నాకు తెలుసు. దయాకర్ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలి’’ అన్నారు. ‘‘గద్దర్‌గారు ΄ాడి, నటించిన ΄ాటకి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎంఎం కీరవాణి. డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ– ‘‘నటనంటే తెలియని నాకు 40 రోజులు శిక్షణ ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ కల్పించిన మురళిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ సినిమా సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది... ఆలోచింపజేస్తుంది’’ అన్నారు బొమ్మకు మురళి. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ మాట్లాడారు. -
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో సెలబ్రిటీల జోష్ (ఫోటోలు)
-
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
ప్రతిభ అనేది ఎవరబ్బ సొత్తు కాదు. ప్రతిభావంతులు తమ సత్తాను ఏ రంగంలోనైనా చాటుకోవచ్చు. అలా నృత్య దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రాధిక ఇప్పుడు మోగాఫోన్ పట్టారు. ఆమె తెరకెక్కించిన చిత్రం ది ప్రూఫ్. గోల్డెన్ స్టూడియోస్ పతాకంపై గోమతి నిర్మించిన ఈ చిత్రంలో నటి సాయి ధన్సిక ప్రధాన పాత్రను పోషించింది. తాజాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయకుమార్, నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శకుడు మిష్కిన్, యూకీ సేతు, గీత రచయిత స్నేహన్, నటుడు రోబో శంకర్, సంతోష్ ప్రతాప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్వీ ఉదయకుమార్ మాట్లాడుతూ ప్రూఫ్ చిత్రంలో అన్నీ అంశాలు బాగున్నాయన్నారు. ఇది ఒక క్లాస్ దర్శకురాలు చేసినట్లుగా ఉందన్నారు. దర్శకురాలు రాధిక చాలా సింపుల్‌గా ఉంటారని.. అయితే చాలా ప్రతిభావంతురాలని ప్రశంసించారు. ఇప్పుడు సినిమా ట్రెండ్ మారిపోయిందన్నారు. దర్శకులు నటిస్తున్నారని.. నృత్యదర్శకులు, నటులు, సంగీత దర్శకులు కూడా దర్శకత్వం వహిస్తున్నారన్నారు. సినిమా అందరినీ ఆదరిస్తుందని పేర్కొన్నారు.అయితే మేకింగ్ స్టైల్ తెలియకుండానే కొందరు దర్శకత్వం వహిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి కొన్ని చిత్రాలు హిట్ అయినంత మాత్రాన.. అది సరైన విధానం అని తాను చెప్పలేనన్నారు. ఎక్కడ ఏ షాట్ ఉండాలి.. ఇంటర్వెల్ ఎక్కడ ఉండాలి అన్న విషయాలను సహాయ దర్శకులు తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు మాదక ద్రవ్యాల నేపథ్యమే సరికొత్త ట్రెండ్ అని పేర్కొన్నారు. దానితోనే మనం సంసాదించుకుంటున్నామన్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు కథల గురించి పట్టించుకోవడం లేదని కాంబినేషన్ సరిగా సెట్ అయితే చాలు అనుకుంటున్నారన్నారు. ఈ మూవీ డైరెక్టర్ రాధికకు ఒక్క విషయం చెప్పదలచుకున్నానని.. ఇక్కడ చాలా మంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారని, వారి గురించి పట్టించుకోకుండా ట్రెండ్‌కు తగినట్లుగా చిత్రాలు చేయాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో రుద్వీర్ వదన్, మెమ్గోపీ, రిత్విక, ఇంద్రజ ముఖ్యపాత్రలు పోషించారు. దీపక్ సంగీతం అందించారు. -
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్‌గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్‌ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
విజయ్ ఏమంటాడోనని తెగ భయపడిపోయా..: డైరెక్టర్
పాప్ సురేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇరవిన్ కన్గళ్. ప్రతాప్ నిర్మించిన ఈ మూవీలో డాలీ ఐశ్వర్య హీరోయిన్గా నటించారు. చార్లెస్ ధనా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయకుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు ప్రజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇరవిన్ కన్గళ్ఆడియో లాంచ్ దర్శకులు కథ సరిగా చెప్పట్లేదు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, కథానాయకుడు పాప్ సురేష్ మాట్లాడుతూ చిన్న చిత్రంగా ప్రారంభించిన ఈ చిత్రం విడుదలవుతుందా? అనే సందేహం కలిగిందన్నారు. అలాంటిది ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రమని పేర్కొన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు పాప్ సురేష్ కథను చాలా బాగా చెబుతారని, నటుడు ప్రజన్ చెప్పారని.. నిజానికి ఇప్పుడు దర్శకులు కథను చెప్పడం లేదన్నారు. ఇంతకు ముందు కథ చెప్పగానే చిత్రం చూసినట్లు ఉండేదన్నారు. కొందరైతే చెప్పిన కథను అలానే తెరకెక్కించలేకపోతున్నారని, అక్కడే సమస్య తలెత్తుతుందన్నారు. తిరుపాచ్చి సినిమాలో ఓ స్టిల్ టాప్ 5లో ఉన్నా.. తాను తిరుపాచ్చి చిత్రానికిగానూ విజయ్‌కు కథ చెప్పి తెరకెక్కించానని, అయితే చిత్రం పూర్తి అయిన తరువాత ప్రసాద్ ల్యాబ్‌లో తానూ, విజయ్ కలిసి చిత్రాన్ని చూశామని అనంతరం విజయ్ ఏమంటారోనని బిక్కు బిక్కుగా ఉన్నానన్నారు. అయితే ఆయన మీరు కథ చెప్పిన దాని కంటే మూడు రెట్లు బాగా చిత్రం వచ్చిందని చెప్పారన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది టాప్ 10 దర్శకుల్లో మీరు ఉంటారని చెప్పారన్నారు. అయితే ఆ ఏడాది టాప్ ఐదుగురి దర్శకుల్లో తాను ఉన్నానని చెప్పారు. కాగా ఇరవిన్ కన్గళ్ చిత్రాన్ని ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేరరసు పేర్కొన్నారు. చదవండి: తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్ -
అటు డాక్టర్‌గా ఇటు హీరోగా.. త్వరలోనే డబుల్ టక్కర్..
ధీరజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డబుల్ టక్కర్. మీరా మహతి దర్శకత్వం వహిస్తుండగా ఏర్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. స్మృతి వెంకట్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని, గౌతమ్ రాజేంద్రన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. నటి కోవై సరళ, ఎంఎస్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం యానిమేషన్ పాత్రలతో కలిసి నటీనటులు నటించడం అన్న వినూత్న ప్రయోగంతో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా తెరపై రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో చైన్నెలోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. ఇందులో హీరో ధీరజ్ మాట్లాడుతూ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, షారుక్ ఖాన్ వంటి ప్రముఖ హీరోల సినిమాల ఆడియో ఆవిష్కరణ వేడుకలు తరువాత ఇదే వేదికపై డబుల్ టక్కర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ నిర్వహించే అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సపోర్ట్ చేసిన దర్శకుడు రవికుమార్, జయం రవిలకు ప్రేమతో కూడిన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడండి.. ఆనందంతో థియేటర్ నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు. జయంరవి మాట్లాడుతూ.. డబుల్ టక్కర్ టైటిల్.. హీరో కోసమే పెట్టినట్లు అనిపిస్తోందన్నారు. డాక్టర్ అయిన ధీరజ్ ఇప్పుడు యాక్టర్‌గా మారి రెండు రంగాల్లో రాణిస్తున్నానన్నారు. తన మంచి మిత్రుల్లో ధీరజ్ ఒకరని, ఆయనతో కలిసి త్వరలో ఒక చిత్రం చేయాలనిపిస్తోందన్నారు. విద్యాసాగర్ సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. చదవండి: కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌కు పెళ్లయిపోయింది -
పాత సినిమాల పోస్టర్లు అలా ఉండేవి.. కానీ ఇప్పుడు?: వైరముత్తు
మాపిల్ లీఫ్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు ఈవీ గణేష్ బాబు కథానాయకుడిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కట్టిల్. ప్రముఖ ఎడిటర్ బి.లెనిన్ కథ, కథనాలు అందించిన ఈ చిత్రంలో సృష్టిడాంగే హీరోయిన్గా నటించారు. వైరముత్తు మదన్ పాటలను రాసిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. తుపాకీ శబ్ధాల మధ్య పిల్లనగ్రోవిలా ఉంటుందీ సినిమా ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో చిత్ర ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీత రచయిత వైరముత్తు మాట్లాడుతూ కట్టిల్ వంటి చిన్న చిత్రాలు బాగా ఆడితేనే తమిళ సినిమాకు మంచిదని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలతోనే ప్రతిభావంతులైన నూతన కళాకారులు లభిస్తారన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చూడాలని ఆసక్తిని కలిగిస్తాయని.. అలాంటి తుపాకీ శబ్దాల మధ్య గణేష్ బాబు కట్టిల్ చిత్రంతో పిల్లల గ్రోవి వాయిస్తున్నారని పేర్కొన్నారు. మంచి కథాంశంతో రూపొందిన చిన్న చిత్రాలు మన మనసుల్ని ఉల్లాసపరిచి గాల్లో తేలేలా చేస్తాయన్నారు. కట్టిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణలో ప్రముఖులతో యూనిట్ సభ్యులు అలాంటివి చూస్తున్నారా? ఇలాంటి చిత్రాలే ఆలోచనలను పెంచుతాయన్నారు. పాత సినిమాల పోస్టర్లను చూస్తే అందులో మహిళలకు ప్రాముఖ్యత నిచ్చేవిగా ఉన్నాయన్నారు. ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాలను చూడగలుగుతున్నామా..? అని ప్రశ్నించారు. మహిళలకు సమానత్వం కలిగించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజయినప్పుడే అది మంచి కాలం అనీ, అలాంటి కాలాన్ని గణేష్ బాబు కట్టిల్ చిత్రంతో తీసుకొచ్చారని వైరముత్తు పేర్కొన్నారు. ఆయన భావాలను, బాధను తెరపై ఆవిష్కరించిన చిత్రం కట్టిల్ అనీ, ఈ చిత్ర గీత రచయిత మదన్ కార్తీకి, దర్శకుడు గణేష్ బాబుకు జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చదవండి: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్? ఈ నటి మాటల్లోనే ఆన్సర్ దొరికేసింది! -
ఫ్రెండ్షిప్ నేఫథ్యంలో వస్తున్న కుంబారి.. ఆడియో రిలీజ్!
రాయల్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై టి.కుమారదాస్ నిర్మిస్తున్న చిత్రం 'కుంబారి'. ఈ చిత్రంలో విజయ్ విశ్వ, నటి నలీఫ్ జియా, మహిళా సంజీవి నాయకిగానూ, జాన్ విజయ్ పరుత్తివీరన్ సరవణన్, శ్యామ్స్, మధుమిత, సెంథి, కాదల్ సుకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. కవి జోసెఫ్ కథ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ చిత్రానికి జై ప్రకాష్ జై సన్, పృథ్వీ కలిసి సంగీతమందించారు. తాజాగా ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు కే భాగ్యరాజ్, ఆర్వీ ఉదయ్ కుమార్, ఎస్సార్ ప్రభాకరన్, శరవణ శక్తి, జీవ, అప్పుకుట్టి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా? ) ఈ సందర్భంగా నిర్మాత కుమార్ దాస్ మాట్లాడుతూ.. స్నేహం కథాంశంగా రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ప్రేమ, వినోదం, అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో పాటు మంచి జనరంజకమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా చిన్న చిత్రాలని పక్కన పెట్టేస్తున్నారని, ఇలాంటి చిన్న చిత్రాల ద్వారానే ప్రముఖ స్టార్స్ తయారవుతున్నారని ఆయన అన్నారు. అప్పట్లో చిన్న చిత్రంలో నటించిన శివాజీరావు అనే వ్యక్తి ఇప్పుడు సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ విశ్వ మాట్లాడుతూ.. కుంబారి చిత్ర షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేసినట్లు చెప్పారు. నిర్మాత చిత్ర బడ్జెట్ గురించి ఆలోచించ వద్దని మొదట్లోనే చెప్పారన్నారు. చిత్రం బాగా వచ్చిందని ఆయన వెల్లడించారు. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!) -
Jailer Audio Launch Photos: రజనీకాంత్ 'జైలర్' సినిమా ఆడియో లాంచ్.. సందడి చేసిన స్టార్లు (ఫోటోలు)
-
అలా.. హిట్ కావాలి
ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆడియో ఫంక్షన్ హిందూపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌కి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్, పాటలను విడుదల చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ ‘ఆలా ఇలా ఎలా’ చిత్రం ట్రైలర్ ను ఇప్పుడు చూసాం, చాలా బాగుంది, ఇలాంటి వేడుక హిందూపూర్ లో జరగడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి ఈ చిత్రం మంచి విజయం సాదించాలి’ అని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి గారు మాట్లాడుతూ ‘ఆలా ఇలా ఎలా’ ట్రైలర్ చాలా బాగుంది, నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి నా శుభాకాంక్షలు. రాజకీయాల్లో మేము ఎంత విజయం సాధించామో నిర్మాత నాగరాజు గారు కూడా ఈ చిత్రం తో సినీరంగం లో కూడా అంతటి విజయం సాదించాలి’ అని కోరుకున్నారు. హీరో శక్తి వాసుదేవన్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం కోసం 83 రోజులు శ్రమించాం. మా డైరెక్టర్ రాఘవ ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా చాలా బాగుంటుంది.అందరికి నచ్చుతుంది’అని తెలిపారు. -
ప్రత్యక్ష దైవం సాయిబాబా
షిర్డీ సాయిబాబా జీవితం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. సాయిబాబాగా రామలింగా రెడ్డి నటించారు. కొండవీటి సత్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాటల ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. విశ్రాంత ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ ఛీప్ కమీషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఓం సాయి ప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘సాయిభక్తుల అనుభవాలతో సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించారు మచ్చా రామలింగారెడ్డి’’ అన్నారు చీఫ్ కమిషనర్ నరసింహప్ప. ‘‘యం.ఆర్. రెడ్డి మంచి భక్తిరస చిత్రాన్ని నిర్మించాలనుకోవడం అభినందనీయం’’ అని ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నారు. చిత్రదర్శకుడు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్, వి. సుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్ కవాడియా, పాటల రచయిత బిక్కి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘పొన్నియన్ సెల్వన్ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్ చేశా’
దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇదే పేరుతో ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా ఫిలింస్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి దరైమురుగన్ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్ చేశానన్నారు. వాద్ధియదేవన్ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్ ఊర్ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. -
పొన్నియిన్ సెల్వన్ తీయాలంటే ధైర్యం కావాలి
‘‘పొన్నియిన్ సెల్వన్ ’ చిత్రాన్ని తీయాలంటే ధైర్యం కావాలి.. అది డైరెక్టర్ మణిరత్నం, నిర్మాత సుభాస్కరన్ గార్లకు ఉంది. అందుకే ఈ చిత్రం అద్భుతంగా తెరకెక్కింది’’ అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. సుభాస్కరన్ , మణిరత్నం నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల వేడుకని చెన్నైలో నిర్వహించారు. ఈ మూవీ ఆడియోను కమల్ హాసన్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పొన్నియిన్ సెల్వన్ ’ నవల రాసిన కల్కీని చూసి ఇతర రచయితలు అసూయ పడుతున్నట్లుగా, మణిరత్నంగారిని చూసి రచయితలు, దర్శకులు అసూయ పడుతున్నారు.. వారిలో నేనూ ఒకణ్ణి. ఈ మూవీలో నటించే అవకాశం నాకు మిస్ అయ్యింది. తమిళ చిత్ర పరిశ్రమకు ఇది స్వర్ణయుగమే. దీన్ని కాపాడుకోవాలి. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ఈ వేడుకలో తమిళనాడు రాష్ట్ర మంత్రి దురైమరుగన్, దర్శకుడు భారతీరాజా, నటుడు శింబు, నటి ఐశ్వర్యారాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రవివర్మన్ కెమెరామేన్‌గా పనిచేశారు. -
తల్లిదండ్రుల్ని పట్టించుకోని స్టార్ హీరో.. వారిని నిజంగానే అవమానించాడా?
దళపతి విజయ్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే వారసుడు మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆయన నటించిన వారీసు తమిళనాట భారీ విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమంలో ఆయన చేసిన పని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈవెంట్లో ఆయన తల్లిదండ్రులను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. వారికి కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. జనవరి 2న వారీసు ఆడియో లాంఛ్ చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు విజయ్ తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభన కూడా పాల్గొన్నారు. విజయ్ అక్కడికి రాగానే అందరినీ పలకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పలకరించారు. అయితే సొంత తల్లిదండ్రుల్ని ఏదో మొక్కుబడిగా పలకరించారన్న వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై విజయ్ తల్లి శోభన స్పందించారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వేడుక ‘వారీసు’ సినిమా కోసం జరిగిందని.. ఓ పెద్ద ఈవెంట్లో నా కుమారుడి నుంచి అంతకన్నా కోరుకునేది ఏముందని అన్నారు. కాగా.. గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటినుంచి విజయ్‌కి కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం నడుస్తోంది. -
అలా ఎందుకు చేశానా అని ఇప్పటికి చింతిస్తున్నా: ధనుష్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్(తమిళంలో వాతి). తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాష(తెలుగు, తమిళం) తెరకెక్కిన ఈచిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విద్యా వ్యవస్థ నేపథ్యం రూపొందిన ఈ చిత్రం ఆడియో లాంచ్ వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ తన స్టూడెంట్ లైఫ్‌ని గుర్తు చేసుకున్నాడు. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ చదువును నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానని, తనలా ఎవరూ చేయొద్దని అభిమానులకు సూచించాడు. ‘‘మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో నా పిల్లల్ని చదివిస్తుంటే నాకు అర్థమవుతోంది. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేస్తూ అల్లరి చేసేవాడిని. చదవడానికి కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్లో చేరా. ట్యూషన్ టీచర్ ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేకపోయేవాడిని. ట్యూషన్‌కి కూడా సరిగా వెళ్లకుండ బయట ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసేవాడిని. చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే.. నేను వచ్చిన విషయం తనకి తెలియాలని బైక్ సౌండ్ చేస్తుండేవాడిని. అది గమనించిన మా ట్యూషన్ టీచర్ ‘మీరంతా బాగా చదువుకుని పాసై ఉన్నత స్థానంలో ఉంటారు. బయట వాహనంతో శబ్దం చేసేవాడు మాత్రం వీధుల్లో డాన్స్ చేసుకోవాల్సిందే’ అన్నారట. ఆయన చెప్పినట్లు తమిళనాడులో నేను డాన్స్ చేయని వీధి లేదు(నవ్వుతూ చెప్పాడు). ఇక వెనక్కి తిరిగి చూస్తే నేనెందుకు చదువుని నిర్లక్ష్యం చేశానా? అని చింతిస్తున్నా. మీరు నాలా చేయకండి’’ అంటూ చెప్పుకొచ్చాడు. -
సార్ ఆడియో లాంచ్: స్టేజీపై పాట పాడిన ధనుష్
తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ధాత్రి. తెలుగులో సార్ అనే పేరును నిర్ణయించారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 17వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలోని ఓ ప్రైవేట్ కళాశాల ఆవరణలో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న కెప్టెన్ మిల్లుల చిత్ర గెటప్‌లో రావడం విశేషం. మరో విషయం ఏంటంటే ఆయన ఇద్దరు వారసులు లింగ, యాత్ర పాల్గొనడం మరో విశేషం. వేదిక ముందు ధనుష్‌కు ఇరువైపులా ఆయన కొడుకులు కూర్చోవడంతో ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్‌మనిపించారు. కాగా వేదికపై ధనుష్ చిత్రంలోని పాటను పాడి అభిమానులను అలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను వెంకీ తనకు లాక్డౌన్ టైంలో చెప్పారన్నారు. కథ నచ్చడంతో ఓకే చెప్పానన్నారు. ఇది 1990లో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వడచెన్నై పార్ట్– 2 ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయం దర్శకుడు వెట్రిమారన్‌ను అడగాలని, అయితే సీక్వెల్ మాత్రం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. #Dhanush X #SwethaMohan 🥺❤️#Vaathipic.twitter.com/H46Bfxewyr — AmuthaBharathi (@CinemaWithAB) February 5, 2023 చదవండి: పెళ్లి బిజీలో కియారా అద్వానీ, డ్యాన్సింగ్ టైం అంటున్న చరణ్ నయనతారను పొగిడిన షారుక్ -
స్టేజ్‌పై మాట్లాడుతూ రష్మికకు దిష్టి తీసిన విజయ్, వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం వారిసు(తెలుగులో వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ ఈ సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజగా చిత్రం బృందం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్ ఎలా ఉందంటే! స్టేజ్ హీరో విజయ్, రష్మికకు దిష్టి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలోని రంజితమే.. రంజితమే.. పాట గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌లో ఎక్కడ చూసిన ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇక ఇటీవల ఈ సూపర్ హిట్ సాంగ్‌కు లైవ్‌లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది నటి రష్మిక మందన్నా. అభిమానులకు కోసం డాన్స్ చేయాలని కోరడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి ఆమె ఈ పాటకు కాలు కదిపింది. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి ఇక రష్మిక డాన్స్ చూసి హీరో విజయ్‌తో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో విజయ్ స్టేజ్‌పై మాట్లాడుతూ.. రష్మికపై ప్రశంసలు కురిపించాడు. రష్మికను ఉద్దేశిస్తూ.. ఆమె మంచి నటి. రీల్, రియల్ లైఫ్‌లోనూ ఒకేలా ఉంటుంది. స్టార్ నటి అయిన ఒదిగి ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ కోసం అందరి ముందు లైవ్‌లో డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆమెపై అందరి దృష్టి పడకుండా దిష్టి తీస్తున్నా’ అంటూ సరదాగా ఆయన తమిళంలో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా మూవీ టీం విడుదల చేసింది. ఈ వీడియోను చూసి రష్మిక ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. Rashmika Dance for #Ranjithame (HD) #Varisu • @actorvijay 🤩🔥#VarisuSecondSingle #VarisuAudioLaunch #VarisuUpdate pic.twitter.com/1OEHn02oSa — VMI IT WING HEAD-KUMBAKONAM YOUTH WING (@KUMVMIITWING) January 1, 2023 -
చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదు : డైరెక్టర్ ఆవేదన
తమిళసినిమా: చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదని ఎం కళైంజియం ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్ న్యూస్ ఫిలిం పతాకంపై జవహర్ సమర్పణలో శ్రీమతి రతి జవహర్ నిర్మింన చిత్రం కల్లరై. ఏబీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఇందులో నూతన తారలు నటించారు. రాంజీ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియా, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని లీ మ్యాజిక్ ల్యాంటన్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆర్.ముత్తరసన్, నిర్మాత, నటుడు కే రాజన్, దర్శకుడు ఎం కళంజియం, సంగీతకుడు సౌందర్యన్, నిర్మాతల మండలి కార్యవర్గ సభ్యుడు విజయ మురళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత రతి జవహర్ మాట్లాడుతూ.. ఇది తమ తొలి ప్రయత్నం అని, దర్శకుడు అనుకున్న బడ్జెట్లో చిత్రాన్ని చక్కగా తెరకెక్కిం ఎంతగానో సహకరించారని చెప్పారు. రాజన్ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందుకంటే చిత్ర పరిశ్రమను బతికించేది చిన్న చిత్రాల నిర్మాతలే అన్నారు. ఈ చిత్రం పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకొస్తే ఈ నిర్మాతలు మళ్లీ చిత్రం చేస్తారన్నారు. పెద్ద చిత్రాల హీరోల వల్ల ఎవరికి ఏమీ వొరిగేది లేదని.. వారు సంపాదించుకోవడమేనని అన్నారు. దర్శకుడు ఎం కలైంజయం మాట్లాడుతూ.. చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదని, పెద్ద హీరోల చిత్రాలే థియేటర్లను ఆక్రమిస్తున్నాయని తెలిపారు. ఈ విషయమై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్ తగిన చర్యలు తీసుకుని చిన్న చిత్రాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
టాలీవుడ్‌కి యువత రావాలి
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు యువత రావాల్సిన అవసరం ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేకుండా ప్రతిభతో చరిత్ర సృష్టించే అవకాశం సినిమా పరిశ్రమలోనే ఉంటుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా అరుణ్ భారతి ఎల్.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. అస్లాం కీ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదలకు తలసాని శ్రీనివాస్, హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘యష్ పూరి నాన్నగారు నా చిన్నప్పటి స్నేహితుడు. యువత చూడాల్సిన చిత్రం ‘చెప్పాలని ఉంది’’ అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ‘‘మన యూత్ సినిమా ఇది.. థియేటర్లో చూద్దాం’’ అన్నారు నిఖిల్. ‘‘అన్ని భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం ఒక విధంగా పాన్ ఇండియా ఫిలిం’’ అన్నారు అరుణ్ భారతి. యష్ పూరి, స్టెఫీ పటేల్, సంగీత దర్శకుడు అస్లాం కీ, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడారు. -
'కోలీవుడ్‌లో నిర్మాతలకు విలువ లేదు.. అందుకే తెలుగులో తీస్తున్నారు'
తమిళసినిమా: నృత్య దర్శకుడు దినేష్,యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం లోకల్ సరుకు. నటి ఉపాసన నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఎస్పీ రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. యువ సంగీత దర్శకుడు స్వామినాథన్ రాజేష్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఈయన కరోనా కాలంలో వేలాది మందికి పలు రకాలుగా సాయం చేశారు. అందులో సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. అలా సినిమా నిర్మించాలని ఆలోచన వచ్చిందట. ఆ చిత్రమే లోకల్ సరుకు అని బుధవారం ఉదయం వడపళణిలోని కమలా థియేటర్లో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. యువ సంగీత దర్శకుడు స్వామినాథన్ రాజేష్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఈయన కరోనా కాలంలో వేలాది మందికి పలు రకాలుగా సాయం చేశారు. అందులో సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. అలా సినిమా నిర్మించాలని ఆలోచన వచ్చిందట. ఆ చిత్రమే లోకల్ సరుకు అని బుధవారం ఉదయం వడపళణిలోని కమలా థియేటర్లో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. ఇది మంచి సందేశంతో కూడిన ప్రేమ కథా త్రం అని చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నిర్మాత, నటుడు కె.రాజన్, నటుడు రాధారవి, సంగీత దర్శకుడు శంకర్ గణేష్, విజయ్‌మురళి, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వర్ తంగం, పెప్సీ శివ, గీత రచయిత స్నేహన్, నటి ఇనియ, సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు దినా తదితరులు పాల్గొన్నారు. నటుడు కె.రాజన్ మాట్లాడుతూ సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న రాజేష్ నిర్మితగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. అయితే తమిళ సినీ రంగంలో నిర్మాతకు విలువ లేదని అందుకే ఆర్బీచౌదరి వంటి వారు కూడా ఇప్పుడు తమిళంలో చిత్రాలు చేయకుండా తెలుగులో నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. రాజేష్‌కు ఇచ్చే సలహా ఏంటంటే సంగీత దర్శకుడిగా బాగా పేరు తెచ్చుకున్న తర్వాత నిర్మాతగా చిత్రాలలో చేయాలన్నారు. లోకల్ సరుకు చిత్ర ట్రైలర్ పాటలు బాగున్నాయని తెలిపారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నా సినిమా థియేటర్స్‌లో విడుదలై మూడేళ్లు అయ్యింది : విక్రమ్
తమిళసినిమా: పాత్రలకు జీవం పోయడానికి ఎంతవరకైనా వెళ్లే నటుడు విక్రమ్. వైవిధ్యభరిత కథా చిత్రాల కోసం తపించే ఈయన తాజాగా నటించిన చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్‌కుమార్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని వీఆర్ మాల్లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు విక్రమ్ వారసుడు, నటుడు ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. తన తండ్రి విక్రమ్ నుంచి చాలా విషయాలు గ్రహించినట్లు చెప్పారు. కోబ్రా చిత్రం పెద్ద హిట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం విక్రమ్ మాట్లాడుతూ.. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇంతకు ముందు డిమాంటీ కాలనీ, ఇమైకా నొడిగళ్ చిత్రాలను ఒక్కో జానర్లో తెరకెక్కించారన్నారు. ఈ కోబ్రా చిత్రాన్ని తనదైన శైలిలో వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించారని తెలిపారు. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతుండటంతో ఆయన కార్యక్రమంలో పాల్గొనలేకపోయారన్నారు. ఈయన కల్పన కథకు తామంతా సహకరించామని పేర్కొన్నారు. తాను నటించిన చిత్రాలు థియేటర్లలో విడుదలై మూడేళ్లు అయ్యిందన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల తిరుచ్చి, మదురై, కోయంబత్తూర్ తిరిగొచ్చామని తెలిపారు. అభిమానులు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి తూత్తుక్కుడి, తిరునెల్వెల్లి ప్రాంతాల్లో చిత్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోబ్రా చిత్రం కోసం చాలా శ్రమించామని, ఈ నెల 31వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని విక్రమ్ కోరారు. -
శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్
హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. ఇది ఆమెకు 50వ చిత్రం కావడం మరో విశేషం. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ తాను దర్శకత్వం వహించిన పుళన్ విచారణై చిత్రం ట్రైలర్‌ను గుర్తుకు తెచ్చిందన్నారు. శింబు ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించడం అభినందనీయమన్నారు. ఆయన మంచి నటుడని, సకాలంలో చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే తమకు ఎన్ని పనులు ఉన్నా రోజూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అంతకంటే ముఖ్యచిత్రాలకు సంబంధించిన వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. నిర్మాత మదియళగన్ సినిమా పరిశ్రమలో ప్రముఖులని, మహా చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సెల్వమణి తెలిపారు. చదవండి: కాజల్ రీఎంట్రీ.. ఇండియన్ 2తో వస్తుందా? -
విక్రమ్ ‘కోబ్రా’ ఆడియో లాంచ్ (ఫొటోలు)