authority
-
త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ(జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఫైనల్ రిపోర్ట్ అందజేయనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై విచారణ పూర్తి చేసిన ఎన్డీఎస్ఏ.. తుది నివేదికను కేంద్ర జలశక్తికి ఎన్డీఎస్ఏ చీఫ్ చంద్రశేఖర్ అయ్యర్ అందజేశారు. జలశక్తి శాఖ పరిశీలన తర్వాత రాష్ట్రానికి ఎన్డీఎస్ఐ నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచకూడదని మధ్యంతర నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ.. ప్రాజెక్టు పని చేస్తుందా లేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వనుంది.కాగా, మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి డిజైన్లు, డ్రాయింగ్స్‌లో లోపాలే కారణమని ఐఐటీ–రూర్కీ తాజాగా నిర్వహించిన మాడల్ స్టడీలో తేలిన విషయం తెలిసిందే. బరాజ్‌ను 2019 జూన్ 21న ప్రారంభించగా, అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్ దిగువన రక్షణ కోసం నిర్మించిన కాంక్రీట్ బ్లాక్‌లు కొట్టుకుపోయాయి. బరాజ్ గేట్లను ఎత్తినప్పుడు భీకర వేగంతో వరద కిందకు దూకుతుంది. ఆ సమయంలో వరదలో ఉండే భీకర శక్తిని నిర్వీర్యం(ఎనర్జీ డిస్సిపేషన్) చేసేందుకు తగిన నిర్మాణాలను డిజైన్లలో ప్రతిపాదించలేదు.దీంతో ఆ శక్తి ధాటికి దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. బరాజ్‌ను ప్రారంభించిన తొలి ఏడాదే కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయినా, పునరుద్ధరించలేదు. ఆ తర్వాత బరాజ్‌కు 2020–23 మధ్యకాలంలో వరుసగా నాలుగేళ్ల పాటు వరదలు రాగా, ‘ఎనర్జీ డిస్సిపేషన్’ఏర్పాట్లు లేక బరాజ్ దిగువన మట్టి క్రమంగా కొట్టుకుపోయి గుంతలు మరింతగా లోతుగా మారాయి.నిరంతర వరదలతో బరాజ్ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా నిర్మించిన సికెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. దీంతో సికెంట్ పైల్స్ దెబ్బతినడంతో ర్యాఫ్ట్ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడడానికి దారితీశాయి. దీనిద్వారా నీళ్లు బయటకు లీకైనట్టు గుర్తించినా, వాటిని పూడ్చివేసే విషయంలో తాత్సారం చేశారు. దీంతో కాలం గడిచిన కొద్దీ బుంగల తీవ్రత పెరిగి బరాజ్ కుంగిపోవడానికి దారితీసిందని ఐఐటీ–రూర్కీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. ఈ నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ సమర్పించింది. -
ఓలా ఎలక్ట్రిక్‌కు మరో షాక్
న్యూఢిల్లీ: విద్యుత్ స్కూటర్ల సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలతో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలతో సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. అయితే, తమ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. అలాగే, సీసీపీఏ ఎలాంటి జరిమానాలు విధించలేదని తెలిపింది. ఈ వార్తలతో ఓలా షేరు మంగళవారం మరో 6% పడింది. చివర్లో కోలుకుని 5 శాతం లాభంతో రూ. 95 వద్ద క్లోజైంది. వాహనాల సర్విస్ నాణ్యతపై సోషల్ మీడియాలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ మధ్య వాగ్వాదం ప్రభావంతో సోమవారం కంపెనీ షేరు 8 శాతం పైగా పతనమైంది. -
TG: మేడిగడ్డపై మరో కమిటీ?
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డపై మరో కమిటీ వేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) ఇచ్చే నివేదిక(మధ్యంతర!).. అందులోని సిఫార్సుల ఆధారంగా నిపుణుల కమిటీ వేయొచ్చని సమాచారం. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన మరమ్మత్తుల విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సులపై సర్కార్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. కమిటీ చేసిన సూచనలు, వాటిపై చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించనుంది. ఈ భేటీలోనే మరో నిపుణుల కమిటీ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న మేడిగడ్డ బ్యారేజీ 7వ గేటను ఇంజినీర్లు ఎత్తేశారు. మరోవైపు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ పరిధిలోకి వచ్చే రిపేర్లు మాత్రమే చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ఓకే చెప్పింది. దెబ్బ తిన్న ఏడో బ్లాక్‌లోని 20, 21 గేట్లను తెరిచి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఇక బ్యారేజీకి మరోసారి జియో ఫిజికల్ టెస్టుల కోసం పుణే సంస్థ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
గుంటూరు: రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(11): మన్యం జిల్లాలో 2 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 8మండలాలు, విజయనగరం వేపాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(134): శ్రీకాకుళం జిల్లా 17 మండలాలు, విజయనగరం జిల్లాలో -25, పార్వతీపురంమన్యం-11, అల్లూరిసీతారామరాజు-10, విశాఖపట్నం-3, అనకాపల్లి- 16, కాకినాడ- 10, కోనసీమ- 9, తూర్పుగోదావరి- 19, పశ్చిమగోదావరి- 4, ఏలూరు- 7, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో-2, పల్నాడు అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైనలస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు. మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్‌లో -
నేడు తెలంగాణకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది. బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటి పారుదల శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలతో సమావేశం కానుంది. ఈ నెల 7, 8వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి తనిఖీలు నిర్వహించనుంది. మళ్లీ 9న హైదరాబాద్‌లో అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. మరోవైపు బ్యారేజీల డిజైన్లు మొదలు నిర్మాణం వరకు ఇందులో పాలుపంచుకున్న అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన 19 రకాల సమాచారం అందించాలని లేఖ రాసింది. ఇదీ చదవండి: వీడ్కోలు సమయాన విన్నపాలు -
వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కొత్త చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్‌్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్ఎంబీ అధికార పరిధి, కేఆర్ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్‌లపై శ్రీరామ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. ఎన్డీఎస్ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. ప్లంజ్‌పూల్‌తో ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్‌పూల్ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్‌ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు. -
మేడిగడ్డపై ‘నివేదిక’ అర్థరహితం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్‌కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. డిజైన్ల ప్రకారమే నిర్మాణం మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్‌గా నిర్మించారని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్‌కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్‌కి సమర్పించామన్నారు. వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్‌లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు. తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా? ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్‌కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు. ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్‌కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం స్పష్టం చేసిన ఎల్అండ్టీ సంస్థ సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది. నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్అండ్టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం ఎన్డీఎస్ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్‌కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్‌కుమార్ ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. -
కాళేశ్వరం మేడిగడ్డపై NDSA సంచలన నివేదిక
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. అంతేకాదు.. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ పేర్కొనడం గమనార్హం. పిల్లర్లు కుంగడానికి NDSA చెప్పిన కారణాలు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్‌ని ఉపయోగించడానికి అవకాశం లేదు ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయి’’ అని తన నివేదికలో డ్యామ్ అథారిటీ పేర్కొంది. కాళేశ్వరం మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి కమిటీ కోరినా.. మేడిగడ్డ బ్యారేజ్ 2019లో నిర్మించబడింది. 2023 అక్టోబర్ 21వ తేదీన బ్యారేజ్ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 24వ తేదీన మేడిగడ్డ డ్యామ్‌ను సందర్శించింది. అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ, సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్ 29లోపు పూర్తి డేటాను ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. -
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
ఢిల్లీ ఆర్డినెన్స్ పిటిషన్ రాజ్యాంగ బెంచ్‌కు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికార యంత్రాంగంపై నియంత్రణ తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయిదుగురు న్యాయమూర్తులున్న రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాల డివిజన్ బెంచ్ సిఫారసు చేసింది. ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన తర్వాత దీనిపై విచారణ చేపడుతుందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. -
చరిత్ర సృష్టించిన విశాఖ పోర్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్టు అథారిటీ చరిత్ర సృష్టించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో తన రికార్డును తానే తిరగరాసింది. మునుపెన్నడూ లేనివిధంగా 73.73 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. 7 శాతం వృద్ధిని నమోదు చేసి తూర్పు తీరంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ దఫా స్టీమ్ కోల్, క్రూడ్ ఆయిల్, కుకింగ్ కోల్, ఎరువులు వంటి సరుకు రవాణాలో వృద్ధిని నమోదు చేసింది. పోర్టులో ఆధునికీకరణ పనులు భవిష్యత్‌లో విశాఖ పోర్టు మరింత ప్రగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆధునికీకరణ వైపు పయనిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2022–23 ఆర్థిక సంవత్సరంలో పోర్టు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయడంతో ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2022 డిసెంబర్ 31 నుంచి బేబీ కేప్(260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు) వెస్సల్స్ ఇన్నర్ హార్బర్లోకి వచ్చే విధంగా ఆధునికీకరణ చేపట్టారు. రూ.151 కోట్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పోర్టును ల్యాండ్‌లార్డ్ పోర్టు చేయడంలో భాగంగా పీపీపీ పద్ధతిలో రూ.655 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయి. స్టాక్ నిల్వ కేంద్రాల నుంచి కాలుష్యం వెదజల్లకుండా ఉండేందుకు రూ.120 కోట్లతో 15 లక్షల నిల్వ సామర్థ్యంతో కవర్డ్ స్టోరేజ్ యార్డుల నిర్మాణం చేపట్టారు. మరిన్ని ప్రాజెక్ట్‌లు పురోగతిలో ఉన్నాయి. తుది దశలో క్రూయిజ్ టెర్మినల్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా క్రూయిజ్ టెర్మినల్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2,500 మంది పర్యాటకులు ఉండే క్రూయిజ్ వెస్సల్‌ను ఈ బెర్త్‌లో అపరేట్ చేసే విధంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ క్రూయిజ్ టెర్మినల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో కార్యకలాపాలు ♦ 2022 ఫిబ్రవరి 25న ఈస్ట్ క్యూ–6 బెర్త్‌లో ఎంవీ దిస్పిన.కె నౌక నుంచి రికార్డు స్థాయిలో 20,050 టన్నుల క్రోమ్ ఓర్‌ను పోర్టులో దించింది. ♦ 2022 సెపె్టంబర్ 25న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో ఫెర్రో మాంగనీస్ స్లాగ్‌ను ఎంవీ ఎస్జే స్టార్ నౌక నుంచి పోర్టులో దించారు. ♦ 2022 అక్టోబర్ 16న ఈస్ట్ క్యూ7 బెర్త్ నుంచి హై కార్బన్ ఫెర్రో మాంగనీస్‌ను ఎంవీ ఆలమ్ సయాంగ్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2022 అక్టోబర్ 17న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో 29,500 టన్నుల ఐరన్ ఓర్(పిల్లెట్స్)ను ఎంవీ విశ్వవిజేత నౌకలోకి లోడింగ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 1న వెస్ట్ క్యూ–3 బెర్త్‌లో 23,030 టన్నుల ఐరన్ ఓర్ ఆక్సైడ్‌ను ఎంవీ అగియా ఇరిని ఫోర్స్ నౌక నుంచి అన్లోడ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 23న వెస్ట్ క్యూ–6 బెర్త్‌లో 16,478 టన్నుల ఫ్లైయా‹Ùను ఎంవీ కింగ్ ఫిషర్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 మార్చి 10న ఈస్ట్ క్యూ–6 బెర్త్ నుంచి 8,864 టన్నుల స్టీల్ బ్లూమ్స్‌ను ఎంవీ ఎంఎక్స్ డిక్సియామెన్ నౌకలోకి లోడ్ చేశారు. ♦ 2023 ఏప్రిల్ 26న వెస్ట్ క్యూ–2 బెర్త్‌లో 44,374 టన్నుల ఐరన్ ఓర్‌ను ఎంవీ జల కల్పతరు నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 ఏప్రిల్ 29న ఈస్ట్ క్యూ–1 బెర్త్‌లో 36,177 టన్నుల పెట్రోలియం కోక్‌ను ఎంవీ అన్ చాంగ్ నౌక నుంచి దించారు. -
ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు చట్టబద్ధమే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పండ్లను పక్వానికి వచ్చేలా చేసేందుకు ఎథిఫాన్, ఎన్‌రైప్‌ల వినియోగానికి అనుమతిస్తూ ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జారీచేసిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టంచేసింది. అనేక పరిశోధనల తర్వాత ఎథిఫాన్, ఎన్‌రైప్ రసాయనాలు ప్రమాదకరం కాదనే విషయం తేలడంతో వాటి వినియోగానికి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఎథిఫాన్, ఎన్‌రైప్ వినియోగానికి అనుమతిస్తూ జారీచేసిన ఉత్తర్వులు కొట్టేయాలంటూ కాలేజ్ ఆఫ్ పోస్టుగాడ్యుయేట్ స్టడీస్ డైరెక్టర్ నళిన్ వెంకట్ కిషోర్ కుమార్‌తోపాటు రిటైర్డ్ ఉద్యోగి ఎల్.రమేశ్‌బాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని, మరో రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘‘పండ్లను మగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఎన్‌రైప్’వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎన్‌రైప్ ద్వారా కూడా ఎథిలీన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఎన్‌రైప్‌ను మాత్రమే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు. పరిశోధనలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎథిఫాన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఎన్‌రైప్‌ను వినియోగించాలని కోరుతోంది. ఎథిఫాన్‌ను విక్రయించరాదని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేం’’అని ధర్మాసనం పేర్కొంది. -
మాన్యువల్ స్కావెంజర్ల వ్యవస్థ ఇంకెన్నాళ్లు?
సాక్షి, న్యూఢిల్లీ: చేత్తో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్లు) మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పేర్కొంది. దేశంలో ఈ వ్యవస్థను గతంలోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కార్మికుల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు ఎన్హెచ్ఆర్సీ పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల అమలు విషయంలో తీసుకున్న చర్యలపై మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ఎన్హెచ్ఆర్సీ సిఫార్సులు ► మాన్యువల్ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. వారి పిల్లలకు ఉపకార వేతనాలతో కూడిన విద్య అందించాలి. ► కార్మికుల డేటాబేస్ ఏర్పాటు చేయాలి. ► సెప్టిక్ ట్యాంకులు, కాలువలను శుభ్రం చేసే వారికి హెల్మెట్లు, రక్షణ జాకెట్లు, గ్లౌజులు, బూట్లు, రక్షణ కళ్లజోళ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టార్చిలైట్లను స్థానిక సంస్థలు లేదా నియమిత సంస్థలు అందజేయాలి. ► ప్రమాదకర రసాయనాల శుద్ధికి నిపుణులైన కార్మికులను వినియోగించాలి. వారికి ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వర్తింపజేయాలి. ► యంత్రాలతో శుభ్రం చేసేలా మురుగు కాలువలను నిర్మించాలి. ► నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బయో టాయిలెట్లు నిర్మించాలి. ► పాతం కాలం మరుగుదొడ్లను ఆధునిక మరుగుదొడ్లుగా మార్చాలి. -
ఏపీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజన్
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు. చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది.. స్మార్ట్ కిల్లర్స్.. రక్తం చుక్క బయట పడకుండా.. -
పోలవరం పనులపై పీపీఏ సీఈవో సంతృప్తి
సాక్షి, పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పరిశీలించారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పీపీఏ కమిటీ సీఈవో పనులను పరిశీలించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. స్పిల్ వే పైన ఉన్న కాంక్రీట్ నిర్మాణ పనులను చంద్రశేఖర అయ్యర్‌తో పాటు కమిటీ సభ్యులు డి.గణేష్ కుమార్, కే.లలిత కుమారి ఆయనతో పాటు పనులను పరిశీలించారు. నిర్మాణం వివరాలు నిర్మాణం జరుగుతున్న విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.(చదవండి: చంద్రబాబూ.. అవాస్తవాలు మానండి) ఇప్పటివరకు జరిగిన పనులను మ్యాపు ద్వారా ప్రాజెక్ట్ సిఈ సుధాకర్ బాబు, ఎస్సీ నాగిరెడ్డిలు వివరిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానాలిచ్చారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన విషయాలను కూడా కూలంకుషంగా పరిశీలిస్తున్న కమిటీ బంధం సభ్యులు పని జరిగిన విధానాన్ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు. అనంతరం స్పిల్‌వేలో ఏర్పాటు చేస్తున్న గేట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు ఏర్పాటుచేసిన ఆర్మ్ గడ్డర్ల నాణ్యతను, బిగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నాలుగు రోజులపాటు పశ్చిమ, తూర్పు గోదావరి జలాల్లో పర్యటిస్తామన్నారు. పోలవరం లో పనులు ఏవిధంగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వచ్చామని ప్రాజెక్ట్ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పిల్ వే, కాంక్రిట్ , ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కుడి, ఎడమ కాలువలు భూసేకరణ ఎలా ఉన్నది అనే అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నామఅని, ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు 2230 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పనులు, బిల్లులు పరిశీలించాక మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ వెల్లడించారు. -
కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ రంగంలోకి దిగింది. పలు మెట్రో నగరాల్లో వారికి ఉచిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య సంస్థ ( నేషనల్ హెల్త్ అథారిటీ) తో ఒక భాగస్వామ్యానికి వచ్చినట్టు వెల్లడించింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరునకు నాయకత్వం వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు భారీ ఊరట కల్పించింది. ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలకు సురక్షితమైన, నమ్మదగిన, సమర్థవంతమైన రవాణాను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉబెర్ తెలిపింది. కరోనా పోరాటంలో ముందు నిలిచిన ఆరోగ్య కార్యకర్తలకు సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఇందు భూషణ్ తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన ఉబెర్ మెడిక్ సేవ ద్వారా ఢిల్లీ నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, పట్నా నగరాల్లో వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని అందివ్వనుంది. ఇందుకు ప్రత్యేకంగా తయారు చేసిన150 కార్లను అందుబాటులో వుంచింది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, భద్రత, పరిశుభ్రతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను అమలు చేస్తామని తెలిపింది. ప్రతీ రైడ్ తరువాత శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపింది. డ్రైవర్లు భద్రతా విధానాలలో ప్రత్యేకంగా శిక్షణతోపాటు మాస్క్ లు శానిటైజర్లు సహా ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలను అందిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అపూర్వ సేవలందిస్తున్న వైద్య సిబ్బదికి ఉబెర్ ఇండియా సౌత్ అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ధన్యవాదాలు తెలిపారు. -
పోలవరంపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ డంపింగ్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేసి పర్యావరణానికి ముప్పు తెస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌ను ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షిస్తుందని సమాధానమిచ్చారు. దాంతో ప్రాజెక్టు అథారిటీ సీఈవో హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. అంతేకాకుండా పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్లో వరద ముంపు ప్రధాన అంశంగా ఉందని, పోలవరం డంపింగ్ కేసుతో పాటే వరద ముంపు పిటిషన్‌ను కూడా విచారిస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. -
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న ప్రాజెక్ట్ అధారిటీ
-
తెలంగాణ రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్
ఎట్టకేలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) వెబ్సైట్ ప్రారంభమైంది. టీ–రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్‌గా రాజక్షేత్ర నిలిచింది. ఏ వ్యాపారంలోనైనా కస్టమరే రాజు. అలాంటి రాజులకు రాజసంలా నిలిచే రాజక్షేత్ర.. రెరాలో మొదటి ప్రాజెక్ట్‌గా నమోదవ్వటం ఆనందంగా ఉందన్నారు రాజక్షేత్రను నిర్మిస్తున్న గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి. కిస్మత్పూర్లో నిర్మిస్తున్న ఆర్ట్ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలోనే రెరాలో నమోదు చేయనున్నామని చెప్పారు. సాక్షి, హైదరాబాద్: 2017, జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ పరిధిలో 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లు ప్రతి నివాస, వాణిజ్య సముదాయాలు రెరాలో నమోదు తప్పనిసరి. ఇవన్నీ 90 రోజుల్లోగా ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 57 ప్రాజెక్ట్‌లు డేటాను ఎంట్రీ చేశాయని, 173 మంది ప్రమోటర్లు, ఏజెంట్లు నమోదయ్యారని పేర్కొన్నారు. రెరాకు ముందు.. తర్వాత.. స్థిరాస్తి రంగాన్ని రెరాకు ముందు, తర్వాత అని విభజించే రోజులొచ్చాయి. గతంలో మార్కెట్ బాగున్నప్పుడు బుకింగ్ సొమ్ము చెల్లించేసి మళ్లీ కనబడని కస్టమర్లు తీరా మార్కెట్ ప్రతికూలంగా మారగానే నానా హంగామా చేసేవారు. కానీ, ఇప్పుడు బుకింగ్ సొమ్ము పట్టుకొచ్చే ప్రతి కస్టమర్‌కూ ఫ్లాట్లను విక్రయించరు. అర్ధంతరంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తే ప్రాజెక్ట్ మీద ప్రభావం çపడుతుంది. కస్టమర్ల చరిత్ర, ఆర్థిక క్రమశిక్షణ పరిశీలించాక నిజమైన కొనుగోలుదారులతో మాత్రమే క్రయవిక్రయాలు జరుపుతారు. కొనుగోలుదారులే కాదు రియల్టీలో పెట్టుబడిదారులూ అంతే! మార్కెట్ బాగున్నప్పుడు అందరూ రియల్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాస్త నెమ్మదించగానే వైదొలుగుతారు. దీంతో స్థానిక మార్కెట్‌పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ, రెరాలో ప్రణాళిక ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అవకాశముంటుంది. రెరాలో కస్టమరే బాహుబలి.. రెరాలో కొనుగోలుదారులూ నమోదు చేసుకునే వీలుంది. ఫ్లాట్ కొనేముందు ఎలాంటి అంశాలను పరిశీలించాలని తెలిపే చెక్ లిస్ట్, మార్గదర్శకాలను అందుకోవచ్చు. కొనుగోలుకు ముందే ప్రాజెక్ట్, డెవలపర్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో తోకజాడించే బిల్డర్లు నిలబడలేరు. రెరా రాకముందు గడువులోగా గృహ ప్రవేశం చేయడమనేది సవాలే. కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఒక ప్రాజెక్ట్ నుంచి మరొక ప్రాజెక్ట్‌కు మళ్లించడంతో గడువలోగా పూర్తికాకపోవటం, మధ్యలోనే నిర్మాణం ఆగిపోవటం వంటివి జరిగేవి. కానీ, రెరాలో గడువులోగా నిర్మాణం పూర్తి చేయటం ప్రధాన నిబంధన. పారదర్శక లావాదేవీలతో పాటూ నిధులు మళ్లింపులకు ఆస్కారమే లేదు. ఏ ప్రాజెక్ట్‌లో వసూలు చేసే సొమ్మును అందులోనే వినియోగించాలి కాబట్టి గడువులోగా నిర్మాణం పూర్తవుతుంది. ఆర్ధిక క్రమ శిక్షణ కారణంగా డెవలపర్‌కు, కస్టమర్‌కు ఇద్దరికీ ప్రశాంతత. రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే.. రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే.. నిర్మాణంలో వేగం, నాణ్యత, వినూత్న పాటించే డెవలపర్లే! గడు వు, నాణ్యత విషయంలో డెవలపర్లు, చెల్లింపుల్లో కస్టమర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. దీంతో విలువలతో కూడిన పరిశ్రమ తయారవుతుంది. ఉత్పత్తుల వారంటీ, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత వంటి కారణంగా 10–15 శాతం ధరలు వృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే రెరాతో రియల్టీ పరిశ్రమ పునాది బలంగా ఉంటుంది. -
అభిశంసనే సమాధానం కాదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అభిశంసన అన్ని సమస్యలకు పరిష్కారం కాదని.. వ్యవస్థను సరిచేయటమే సరైన మార్గమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ‘ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనాలకు కేసులు కేటాయించటంలో సీజేఐ పాత్రకు సంబంధించిన పలు ప్రశ్నలకూ చలమేశ్వర్ సమాధానమిచ్చారు. ‘రోస్టర్‌పై సంపూర్ణాధికారం సీజేఐదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ధర్మాసనాలను ఏర్పాటుచేయటం సీజేఐకి ఉన్న అధికారం. అయితే ఇది అధికారాన్ని అనుభవించేందుకు మాత్రమే కాదు. ప్రజా సమస్యలకు సరైన పరిష్కారాలిచ్చేందుకు కూడా దోహదపడాలి. అలాగని అభిశంసన సరైన సమాధానం కాదు. పరిష్కారం వెతకాలి కానీ.. తొలగింపు సరికాదు’ అని చలమేశ్వర్ తెలిపారు. జనవరి 12న ప్రెస్‌మీట్ పెట్టి సీజేఐపై బహిరంగ విమర్శలు చేసిన నలుగురిలో జస్టిస్ చలమేశ్వర్ ఒకరన్న విషయం విదితమే. హార్వర్డ్ క్లబ్ ఆఫ్ ఇండియా (అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన భారతీయులు ఏర్పాటుచేసుకున్న క్లబ్) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్.. జస్టిస్ చలమేశ్వర్‌కు కొంతకాలంగా న్యాయవ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లపై పలు ప్రశ్నలు సంధించారు. అయితే ‘ప్రభుత్వానికి మేలు చేసే ఉద్దేశంతోనే సీజేఐ ధర్మాసనాలను ఏర్పాటుచేస్తున్నారా? తను కోరుకున్న తీర్పులు ఇప్పించుకునేందుకే సీజేఐ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా?’ అనే ప్రశ్నలపై స్పందించేందుకు చలమేశ్వర్ నిరాకరించారు. ‘జస్టిస్ సీఎస్ కర్ణన్‌పై వెల్లడించిన తీర్పులోనూ మేం (జస్టిస్ గొగోయ్‌తో కలిసి).. వ్యవస్థను సరైన దార్లో పెట్టాల్సిన మెకానిజం గురించే పేర్కొన్నాం’ అని అన్నారు. కొలీజియంలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు సీజేఐతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్న వ్యాఖ్యలపై చలమేశ్వర్ విభేదించారు. ‘మేం మా వ్యక్తిగత ఆస్తుల కోసం పోరాడటం లేదు. సంస్థాగత అంశాలపైనే భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నాం. దీనర్థం మేం ఒకరినొకరం విమర్శించుకుంటామని కాదు’ అని తెలిపారు. జూన్ 22న తన రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి ఏ పదవులూ ఆశించటం లేదన్నారు. విపక్ష పార్టీలు అభిశంసనకోసం సంతకాల సేకరణ చేపడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చలమేశ్వర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
అహుడాకు రూ.10 కోట్లు విడుదల
అనంతపురం న్యూసిటీ : అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవేన్ జీఓ 421 విడుదల చేశారు. వాస్తవంగా ఏడాదికి రూ.40 కోట్లు మంజూరు చేస్తారు. మొదటి విడతలో భాగంగా రూ.10 కోట్లు విడుదల చేశారు. అహుడాకు కార్యాలయం, అవసరమైన సామగ్రి, వాహనాలు, ఉద్యోగులకు వేతనాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అహుడా ఏర్పాటుకు జీఓ 279 విడుదల చేసిన విషయం విదితమే. అనంతపురం, హిందూపురంలోని 18 మండలాలకు సంబంధించి 180 గ్రామాలు అహుడా పరిధిలోకి వస్తాయి. అహుడా విస్తీర్ణం 3,120 చదరపు కిలోమీటర్లు. అహుడా పనులు వేగవంతం చేసేందుకే కమిషనర్‌గా ఉన్న పీవీవీఎస్ మూర్తికి అహుడా వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ పనులు ఏ మేరకు వేగవంతం చేస్తారో వేచి చూడాలి. -
ఆయనలదే పెత్తనం
భార్యల మౌనం భర్తలదే రాజ్యం అధికారికమైనా అంతావారే ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల దగ్గరా అదేసూత్రం పెచ్చుమీరిపోతున్న ‘పచ్చ’పాతం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారపార్టీ నేతల పెత్తనం పెచ్చుమీరిపోతోంది. ఆ పార్టీ నేతలు జిల్లాలో రా జ్యాంగేతర శక్తులుగా తయారయ్యా రు. ఇందుగలడందు లేడనే సామెత ను తలపించే రీతిలో ఆ పార్టీ నేతలు అన్నింటా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వ యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నేతలే తమకు ముఖ్యమని, వారు చెప్పిన పనులు చేయాల్సిందేనని హుకుం జారీచేశారు. సీఎం స్థాయి నుంచే అటువంటి ఆదేశాలు రాడంతో కలెక్టర్లే చేసేదేమీ లేక వారు చెప్పినట్టు చేసుకుపోతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవరం లేదు. ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతల సిఫార్సులకు అగ్రతాంబూలం వేయాల్సిన అనివార్య పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, గృహనిర్మాణాలు, బీసీ, ఎస్సీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరవ్వాలన్నా పార్టీ నేతల సిఫార్సులు తప్పడం లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాన అర్హత పార్టీ నేతల ఆమోదముద్రే అన్నట్టుగా తయారైంది. ఈ పథకాల ఎంపిక దగ్గర నుంచి పంపిణీ వరకు అడుగడుగునా జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇటీవల ముగిసిన జన్మభూమి కార్యక్రమంలో ప్రతి చోటా వారి పెత్తనమే కనిపించడంతో ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదురైంది. ప్రజాగ్రహంతో తమకు పని లేదన్నట్టుగానే ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇదిగో తాజా ఘటన... తాజాగా రెండు రోజుల కిందట కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశం తీరు ఆ పార్టీ నేతల వ్యవహారశైలికి అద్దంపడుతోంది. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాపు, బీసీ రుణాలకు వచ్చిన దరఖాస్తులు పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇది ప్రభుత్వ కార్యక్రమం. కానీ మొత్తం కార్యక్రమాన్ని పార్టీ నేతలే నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీడీవో విశ్వనాథరెడ్డి వేదికపై ఉన్నా ఎప్పటి మాదిరిగానే పెత్తనమంతా ఎమ్మెల్యే భర్త, టీడీపీ సీనియర్ నేత పిల్లి సత్తిబాబుదే. సత్తిబాబుతోపాటు ఆ మండల ఎంపీపీ, జడ్పీటీసీలు పుల్లా సుధ, కాకరపల్లి సత్యవతి భర్తలు చందు, చలపతిరావులు పెత్తనం చెలాయించడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోను దాదాపు ఇదే ఒరవడిని పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలైనా, పనుల కాంట్రాక్ట్లైనా, అధికారులు బదిలీలైనా పెత్తనమంతా వారిదే. చివరకు శిలాఫలకాలపై వారి పేర్లు లేకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించే ధైర్యం అక్కడి అధికారులకు లేనేలేదు. ఈæ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం లేకుండా నామ్కేవాస్తే అన్నట్టుగా మార్చేశారని నియోజకవర్గ ప్రజలు ఆక్షేపిస్తున్నారు.మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలకు పోయే అధికార పార్టీ నేతలు మహిళా ఎమ్మెల్యేతోపాటు మహిళా ఎంపీపీ, జెడ్పీటీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చోటా అంతే... జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న కొత్తపేట, తుని, రంపచోడవరం నియోజకవర్గాల్లో వారిని అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. కొత్తపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని కాదని పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇ¯ŒSఛార్జి బండారు సత్యానందరావుతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల ఆలమూరు మండలంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు మైక్‌ను లాగేసుకుని దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే. తుని నియోజకవర్గంలో అయితే మరీ దారుణంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కాదని పార్టీ నేతలే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. అక్కడ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పెత్తనమంతా తమ్ముళ్లదే. మిగిలిన నియోజకవర్గాల్లోను దాదాపు ఇదేరకంగా పార్టీ నేతలు రాజ్యాంగేతర శక్తులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. -
సెలవుల నిర్ణయాధికారం హెచ్ఎంలకు ఇవ్వాలి
ఎస్టీయూ డిమాండ్ భానుగుడి (కాకినాడ) : పాఠశాలల్లో స్థానిక సెలవుల నిర్ణయాధికారాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాలకే ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియ¯ŒS జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్టీయూ భవ¯ŒS ఆదివారం సమావేశమైన కార్యవర్గ సభ్యులు ఈ విషయమై తీర్మానం చేశారు. దీనిపై డీఈఓ స్పందించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇప్పటివరకు సెలవుల నిర్ణయాధికారం ఎంఈఓ లేదా డీవైఈఓల ప్రత్యేక అనుమతితో తీసుకోవాల్సి వస్తుంది. దీనిపై ఉపా«ధ్యాయులకు సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఈ నిబంధనను మార్చాలని కోరింది. దీనిపై డీఈఓను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని, ఆయన స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్టీయూ జిల్లా అ««దl్యక్షుడు పి.సుబ్బరాజు తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.శేఖర్, కార్యవర్గ సభ్యులు పి.రాంబాబు, ఎం.శివప్రసాద్, డి.వెంకటరావ్, పి.వి.వి.సత్యనారాయణరాజు, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి జిల్లా కేంద్రానికి అథారిటీ
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ► అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు ► చుట్టూ పది కిలోమీటర్ల విస్తీర్ణంలో లేఅవుట్లు ► అన్నింటికీ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం ► పట్టణాలు అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికలు ► శరవేగంగా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు అనతి కాలంలోనే అభివృద్ధి కేంద్రాలుగా మారుతాయని... అవి అడ్డదిడ్డం గా, అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికాబద్ధం గా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతర పాలనా వ్యవస్థపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జీఏడీ కార్యదర్శి అదర్ సిన్హా, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాలన్నీ త్వరలోనే పెద్ద పట్టణాలుగా, నగరాలుగా అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో పట్టణ జనాభా ఇప్పటికే 45 శాతం ఉందని.. ఇది ఇంకా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సమగ్ర ప్రణాళిక ఉండాలి ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని.. ప్రభుత్వ కార్యాలయాలు, నివా స గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ఎక్కడ ఎలా ఉండాలనే దానిపై సమగ్ర ప్రణాళికలు ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు జరపకుండా, సమగ్ర పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునేలా విధాన రూపకల్పన చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ల తరహాలో ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పట్టణాల పరిధిలోనే కాకుండా చుట్టూ దాదాపు 10 కి.మీ. విస్తీర్ణంలో లేఅవుట్లు రూపొందించాలన్నారు. హైదరాబాద్ నగరం మాదిరిగా కిక్కిరిసిపోకుండా ఉం డేందుకు ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెరిగే జనాభాను కూడా అంచనా వేసి పట్టణాలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉత్సాహంతో పనిచేస్తున్నారని.. వారికి తగు సూచనలు చేస్తూ పాలన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక వనరులను గుర్తించి ఉపయోగంలోకి తేవాలని ఆదేశించారు. -
తెలంగాణలో MPTC, ZPTCలకు మంగళం
-
ఖాళీ కనిపిస్తే కబ్జానే
♦ అధికారం అండతో కొందరు... అక్రమమార్గాల్లో మరికొందరు ♦ వెలుగులోకి తెచ్చేంతవరకు పట్టించుకోని అధికారులు ♦ బైపాస్‌లో ఎకరం స్థలం తాజాగా స్వాహా ♦ ప్లాట్లువేసి విక్రయిస్తున్నా.. కన్నెత్తి చూడని యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కడప: ఖాళీ స్థలం కన్పిస్తే చాలు అక్రమార్కులు పాగా వేస్తున్నారు. అధికారం అండతో కొందరు, అక్రమమార్గాల్లో మరికొందరు కబ్జాలకు పాల్పడుతున్నారు. జిల్లాకేంద్రంలో ఇలాంటి తంతు ఇటీవల కాలంలో అధికమైంది. ప్రభుత్వ స్థలాన్ని వశపర్చుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతుంటే, అందుకు కొందరు అధికారులు సైతం తెరవెనుక వత్తాసుగా నిలుస్తున్నారు. తాజాగా రాజంపేట బైపాస్‌లో వైఎస్సార్ సర్కిల్ సమీపంలోని రాజరాజేశ్వరీ కళ్యాణ మండపం పక్కనున్న రోడ్డు, రోడ్డు పోరంబోకును కొందరు ఆక్రమించారు. ఈ స్థలం తమదేనంటూ రాళ్లు పాతి ఏకంగా ప్లాట్లు కూడా వేశారు. గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు, కార్యకర్త నుంచి ఓ మోస్తారు నేత వరకు, ఎవరి స్థాయిలో వారు ఖాళీ కన్పిస్తే కబ్జా చేస్తున్నారు. వాగులు, పొరంబోకు స్థలాలు, శ్మశానాలను సైతం వదలడం లేదు. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగానికి నిద్రమత్తు వదలడం లేదు. వెలుగులోకి వచ్చాక కూడా కట్టడి చేసే సాహసం చేయడం లేదు. యంత్రాంగం సహకారంతోనే.. మూడు దశాబ్దాలుగా రోడ్డు వినియోగంలో ఉంది. దానికి ఇరువైపులా పోరంబోకు స్థలం సైతం ఉంది. ఇదంతా స్థానికులకు తెలిసిన విషయమే. తాజాగా అధికారపార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సమీప బంధువునంటూ ఓ వ్యక్తి అక్కడ తిష్టవేశారు. వాహనాలు తిరగకుండా ఇరువైపులా రోడ్డును తవ్వేశారు. రోడ్డు పక్కనే ఉన్న పోరంబోకును సైతం ఆక్రమించి ఏకంగా ప్లాట్లు వేశారు. సుమారు ఎకరం స్థలాన్ని ఆక్రమించి విక్రయాలకు పెట్టారు. సెంటు రూ.4 లక్షలు చొప్పున విక్రయించేందుకు సన్నద్ధమయ్యారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలియకుండా జరిగిందనుకుంటే పొరపాటే. వారి కనుసన్నల్లోనే పక్కా స్కెచ్‌తోనే అక్రమార్కులు రంగంలోకి దిగుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. నూతన కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమార్కులు పంచుకునే ఎత్తుగడలో ఉంటే తెరవెనుక రెవెన్యూ అధికారుల సహకారం అందుతోంది. అదే పరిస్థితి బైపాస్‌రోడ్డు పరిధిలో కూడా ఉందని పలువురు చెప్పుకొస్తున్నారు. కడపలో చెలరేగుతున్నారు జిల్లా కేంద్రంలో భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. కాలనీలు, చెరువులు, వంకపోరంబోకులు వీరికి కల్పతరువుగా మారాయి. మునుపు ఏకంగా పాతకడప చెరువులో సుమారు పదెకరాల భూమి అన్యాక్రాంతమైంది. స్థానిక నాయకుడొకరు ఎస్సీల పేరుతో స్వాహాకు యత్నించారు. ప్రకాష్‌నగర్, రామాంజనేయపురం, బాలాజీనగర్, చిన్నచౌకు, అక్కాయపల్లిలో భూకబ్జాదారులకు హద్దు లేకుండాపోయింది. ఓమోస్తారు తిరకాసుదారులంతా కబ్జా వీరులయ్యారు. కబ్జాలతో అనతికాలంలో కోటీశ్వరుల అవతారం ఎత్తుతున్నారు. ఇలాంటి వారిని నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదంతా ఒక ఎత్తై హౌస్ బిల్డింగ్ సొసైటీలు, ట్రస్టులు పేరుతో సైతం ప్రభుత్వ స్థలాలు స్వాహా అవుతున్నాయి. కడపలోని టెలికాం ఎంప్లాయీస్ హౌస్‌బిల్డింగ్ సొసైటీ పరిధిలోని 16సెంట్లు, వంకపొరంబోకు మరో 20సెంట్లు స్థలానికి కలిపి రూ.కోటి విలువ చేసే భూమికి ఓట్రస్టు పేరుతో ప్రహరీ ఏర్పాటైంది. సభ్యులందరికీ చెందిన స్థలాన్ని ఒకవ్యక్తి మాత్రమే సొంతం చేసుకున్నారు. అటు సొసైటీ, ఇటు ప్రభుత్వ భూమి స్వాహా చేసినప్పటికీ అధికారులు మిన్నకుండిపోయారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు నగరంలో ఇటీవల కాలంలో అధికమయ్యాయి. కలెక్టర్ కేవీ సత్యనారాయణ చొరవ తీసుకొని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
జాగ్రత్తగా బ్రీఫ్ చేయాలి...
‘ఓటుకు కోట్లు’ సంఘటనలో ఫోన్ సంభాషణల్లో బాస్ వాడిన ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’ లాంటి పదాలు తరహా లాంటివి కాకుండా, కేంద్రంతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో ఇంగ్లీషు పదప్రయోగం ఎలాంటి పొరపాట్లు లేకుండా కరెక్ట్‌గా ఉండాలని ఇటీవల తరచూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తి విభజన హామీలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న ఈ తరుణంలో అధికార యంత్రాంగం కేంద్రానికి పంపే ప్రతిపాదనల్లో సరైన పదాలు, పరిభాష సరిగా ఉండాలని బాస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయట. ఎప్పుడూ లేనిది ఇదేందబ్బా.. అని ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. ఇంగ్లీషు పదప్రయోగానికి సంబంధించి తాజాగా జారీ అయిన ఓ ఆదేశాన్ని ఉటంకిస్తున్నారు. అదేంటంటే.. రాజధానికి ఉద్యోగుల తరలింపు అంశంలో ‘స్థానికత’ కు కేంద్రం సవరణలు చేయాల్సి ఉంది. స్థానికతపై కేంద్రం సవరణలు చేస్తే ఒక్క ఉద్యోగులకు మాత్రమే స్థానికత వర్తించదు. ఉద్యోగులతో పాటు ఏపీకే చెందిన తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకి ఈ ఉత్తర్వు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా సవరణకు సంబంధించి సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేంద్రానికి సిఫారసు చేసేందుకు ఎలాంటి తప్పులు లేకుండా, స్థానికత ఒక్క ఉద్యోగులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వర్తింపచేసే అవకాశం ఉంటుందా? అన్న కోణంలో సమగ్ర పరిశీలన జరిపి, సరైన ఇంగ్లీషు పదాలు వాడాలని బాస్ నుంచి ఉన్నతాధికారులకు సూచనలు అందాయట. ఈ సూచనలు ఆసాంతం విన్న ఉన్నతాధికారులకు అసలు విషయం అప్పుడు అర్ధమైందట. ఫోన్ సంభాషణల్లో బాస్ వాడిన ఇంగ్లీషు ప్రపంచానికి అర్ధమై బాగా పాపులారిటీ సంపాదించుకున్న దరిమిలా ఇప్పడాయన ఆదేశాలు సచివాలయంలోని ఉన్నతాధికారుల్లో పెద్ద చర్చకు దారితీసింది. -
భూదాన్ లెక్క తేలుద్దాం
- గణాంకాలతో రెవెన్యూ తికమక - మూడు వేల ఎకరాల మేర వ్యత్యాసం - భూముల చిట్టాపై మరోసారి - యంత్రాంగం కసరత్తు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ లెక్క తప్పింది. రెవెన్యూ రికార్డులు, భూదాన్ బోర్డు గణాంకాలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. లెక్క తప్పిన ఈ భూములను కొలిక్కి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కుస్తీ పడుతోంది. భూదాన్ యజ్ఞ బోర్డు నివేదించిన దాంట్లో దాదాపు 3వేల ఎకరాల మేర తేడా కనిపిస్తోంది. దీన్ని సరిచేసేందుకు క్షేత్రస్థాయిలో మరోసారి సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు చాలామంది దాతలు భూదానం చేశారు. ఈ భూముల్లో అధికశాతం పరాధీనమైనట్లు, ల్యాండ్ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భూదాన్ బోర్డును రద్దు చేసి రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే భూదానం చిట్టా తీయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదే శించింది. దీంతో రికార్డుల ఆధారంగా భూముల చిట్టాను రూపొందించింది. అయితే, దీంట్లో రెవెన్యూ రికార్డులకు, భూదాన్ బోర్డు సమర్పించిన అంకెలకు పొంతన కుదరడంలేదు. భూదాన్ బోర్డు లెక్కల ప్రకారం 13,693 ఎకరాలుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 11,020 ఎకరాలే నమోదైంది. ఇందులో క్షేత్రస్థాయిలో కేవలం 10,717 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో తేడా వచ్చిన 2,976 ఎకరాల లెక్క తీసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన తహసీల్దార్ల సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరిపిన జాయింట్ కలె క్టర్ రజత్‌కుమార్ సైనీ భూదాన్ భూములపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అయితే, భూదాన్ బోర్డు ఇచ్చిన కాకిలెక్కలను విశ్వసించడం కన్నా, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం కూడా విస్తీర్ణంలో వ్యత్యాసం కనిపించడానికి దారితీసింద ని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా 721 ఎకరాలను చూపుతున్నారు. వీటికి సంబంధించిన సర్వే నంబర్లు ప్రస్తావించకుండా భూమి ఉందని భూదాన్‌బోర్డు వాదించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. చేతులు మారిన భూమి భూమిలేని పేదలకు 6,625 ఎకరాలను అసైన్డ్ చేయగా, దీంట్లో ప్రస్తుతం 4,395 ఎకరాలు మాత్రమే వారి ఆధీనంలో ఉందని, మిగతా భూమి పరాధీనమైందని రెవెన్యూ యంత్రాంగం లెక్క తేల్చింది. సదుద్దేశంతో భూ వితరణ చేసిన దాతల లక్ష్యాన్ని నీరుగార్చేలా భూదాన్బోర్డే భూములను కొల్లగొట్టిందని విచారణలో తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర సర్కారుకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. సమగ్ర నివేదికను ఈ నెలాఖరులోగా తయారు చేసి పంపేందుకు కసరత్తు చేస్తోంది. -
ప్రకాశం బ్యారేజీకి పెనుముప్పు
♦ ఇసుక దోపిడీకి సహకరిస్తున్న అధికారులు ♦ ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి రూరల్ : ప్రకాశం బ్యారేజికి పెనుముప్పు వాటిల్లుతుందని తెలియదా? బకింగ్‌హామ్ కెనాల్ కూలిపోయే స్థితిలో ఉందని మరిచారా? ఉన్నత స్థాయి అధికారులై ఉండి, ఇసుక దోపిడీకి సహకరిస్తారా?... అంటూ మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జీరో పాయింట్ ఇసుక క్వారీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు ఓ చోట... ఇసుక నిల్వ మరో చోట చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా ఇసుక తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. 2012లో బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జిపై భారీ వాహనాలను నిషేధిస్తూ అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా పక్కనే మరో బ్రిడ్జి కడుతున్నారని గుర్తు చేశారు. అయితే జీరో పాయింట్ నుంచి వెళుతున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాత వంతెనపై నుంచే ప్రయాణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పారాపిట్ వాల్ పూర్తిగా ధ్వంసమైందని, బ్రిడ్జి కింది భాగంలో భారీ పగుళ్లు వచ్చాయన్నారు. అధికారుల నిర్లక్ష్యవైఖరితో బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లితే రెండు జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగునీటి ఇబ్బందులు తప్పవని అన్నారు. ప్రకాశం బ్యారేజీలో సైతం చుక్కనీరు ఉండే అవకాశం ఉండదని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే, జిల్లా కలెక్టర్ ఒత్తిళ్ల మేరకు అనుమతులు ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారన్నారు. రెండు రోజుల వ్యవధిలో పాత వంతెనపై ఇసుక వాహనాల రాకపోకలు నిలిపివేసి, ప్రత్యామ్నాయ దారి చూసుకోని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తాడేపల్లి ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, జిల్లా నాయకులు ఈదులమూడి డేవిడ్‌రాజు, తాడేపల్లి పట్టణ, మండల పార్టీ కన్వీనర్లు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, కౌన్సిలర్లు మాచర్ల అబ్బు, ఓలేటి రాము, ఎండి గోరేబాబు, పార్టీ యువజన నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి, ఎంపీటీసీలు మేకల హనుమంతరావు, పట్టణ ఎస్సీ సెల్ కన్వీనర్ ముదిగొండ ప్రకాష్, మంగళగిరి రూరల్ కన్వీనర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘తటస్థత’కు తూట్లు
ఇంటర్నెట్ తటస్థత విషయంలో మన దేశం నిర్దిష్టంగా, ఖచ్చితంగా వ్యవహరించ కపోవచ్చునని కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయాలే నిజమయ్యేలా ఉన్నాయి. టెలికాం విభాగం నియమించిన నిపుణుల నివేదికను పరిశీలిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. నిపుణుల కమిటీ నివేదికను ఇంకా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) పరిశీలించి కేంద్రానికి సిఫార్సులు చేయాల్సి ఉంది. దానిపై చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని పక్కనబెడితే కమిటీ సిఫార్సు ల్లోని హేతుబద్ధతను ఒకసారి చూడాల్సి ఉంది. ఇంటర్నెట్ తటస్థతను సమర్థిం చినట్టు కనబడుతూనే కమిటీ దానికి విరుద్ధమైన ప్రతిపాదనలు చేసింది. కమిటీ చేసిన కొన్ని సూచనలను గమనిస్తే ఆ అనుకూలతలో దాగున్న ప్రమాదకర ధోరణు లు కనిపిస్తాయి. ఇప్పుడు అమల్లో ఉన్న విధానం పారదర్శకమైనది. వినియో గదారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేది. టెలికాం సంస్థలకు నిర్దిష్టమైన రుసుం చెల్లించి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులే అందులో ఏ వెబ్సైట్ చూడాలో నిర్ణయించుకుంటారు. ఆయా వెబ్సైట్లు సమకూర్చే డేటాను అవి విధించే నిబంధ నలకు లోబడి డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు అనుసరిస్తున్న ఈ విధానంలో ఎయిర్‌టెల్‌లాంటి కొన్ని టెలికాం సంస్థలు మార్పులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఆయా వెబ్సైట్లు వినియోగించుకునే బ్యాండ్ విడ్త్ ఆధారంగా వాటి నుంచి చార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదిస్తున్నాయి. ఉదాహరణకు యూ ట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి వెబ్సైట్లు ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగించుకుం టాయి గనుక వాటినుంచి అధిక చార్జీలను వసూలు చేస్తారు. అంతిమంగా ఆ చార్జీల భారాన్ని ఆయా సంస్థలు వినియోగదారులపైనే మోపుతాయి. ఫలితంగా అప్పటికే ఇంటర్నెట్ కోసం డబ్బు చె ల్లించే వినియోగదారులు అదనంగా ఆయా వెబ్సైట్లు డిమాండ్‌చేసే అదనపు మొత్తాన్ని సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టెలికాం సంస్థల విధానాన్ని వెబ్సైట్లు వ్యతిరేకిస్తే అవి వినియోగదారులకు అందుబాటులోకి రాకుండాపోతాయి. అలా చూసినా చివరకు నష్టపోయేది ఇంటర్నెట్ వినియోగదారులే. ఇంటర్నెట్లో ప్రవహించే సమాచారాన్ని ఇలా అంతరాల దొంతరలో చిక్కుకు నేలా చేయడం...ఎలాంటి సమాచారమైనా క్షణాల్లో అందుబాటులోకొచ్చే ప్రస్తుత విధానం స్థానంలో డబ్బు నిర్ణయాత్మక శక్తిగా మారడం ఆందోళన కలిగించే అంశం. ఏ డేటా తమకు ముఖ్యమైనదో నిర్ణయించుకునే స్వేచ్ఛ వినియోగదారులకు ఉండే ప్రస్తుత విధానానికి బదులు ఎవరు డబ్బు ఎక్కువిచ్చారో వారికి సంబంధించిన డేటాయే పెనువేగంతో వినియోగదారులకు చేరుతుంది. వారు అవసరమనుకునే సమాచారం మాత్రం సుదీర్ఘ సమయం వేచిచూసినా అందుబాటులోకి రాదు. ఈ విషయంలో ఫేస్బుక్ అనుసరించిన విధానాన్ని నిశితంగా విమర్శించిన కమిటీ... అదే ఫలితాన్నిచ్చే జీరో రేటింగ్ పద్ధతిని మాత్రం అంగీకరించింది. ఎయిర్టెల్ రూపొందించిన ఈ పద్ధతి ప్రకారం కొన్ని వెబ్సైట్లు ఉచితంగా అందుబాటులో కొస్తాయి. ఈ ప్లాట్‌ఫాంలో భాగం కాదల్చుకున్న వెబ్సైట్లు అందుకు కొంత మొత్తాన్ని ఎయిర్‌టెల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో తప్పేం లేదన్న అభిప్రా యంలో కమిటీ ఉంది. వాస్తవానికి ఫేస్బుక్, ఎయిర్టెల్ అనుసరించే విధానాలు వేరు తప్ప ఫలితం ఒకటేనని ఎవరికైనా అర్థమవుతుంది. ఫోన్ టారిఫ్‌లను నిర్ణ యించే ప్రస్తుత విధానం తరహాలోనే జీరో రేటింగ్‌కు సంబంధించికూడా అందులో ఏ వెబ్‌సైట్‌కు చోటిస్తున్నారు...దాన్నుంచి ఎంత వసూలు చేస్తున్నారనేది ట్రాయ్ సమీక్షించాలని, ఇంటర్నెట్ తటస్థతకు దెబ్బతగిలే అవకాశం ఉన్న కేసుల్లో అనుమ తిని నిరాకరించే విధానాన్ని అనుసరిస్తే సరిపోతుందని కమిటీ అభిప్రాయపడింది. ఆచరణలో ఇది తటస్థతను దెబ్బతీస్తుంది. వివక్షకు బాటలు పరుస్తుంది. ఇప్పు డున్న విధానంలో దండిగా డబ్బును వెదజల్లే పెద్ద సంస్థకూ, అంతంతమాత్రం పెట్టుబడితో వచ్చిన వ్యక్తికి సమానావకాశాలున్నాయి. సంస్థ స్థోమతనుబట్టి కాక...ఎవరి అప్లికేషన్వల్ల అధిక ప్రయోజనమో, దేనిలో సృజనాత్మకత ఎక్కువగా ఉందో వినియోగదారులు నిర్ణయించుకుంటారు. ఆ అప్లికేషన్‌ను అందించే సంస్థ వైపు మొగ్గుచూపుతారు. జీరో రేటింగ్ ప్లాట్‌ఫాంలు ఈ సమానతను దెబ్బ తీస్తాయి. వినియోగదారుల ఎంపికకు పరిమితులు విధిస్తాయి. అన్నిటికీ మించి వాట్సప్, స్కైప్, వైబర్వంటి ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్ల విషయంలో నిపుణుల అభిప్రాయాలు వింతగా ఉన్నాయి. ఈ అప్లికేషన్ల ఆధారంగా విదేశాలకు పంపే డేటా విషయంలోగానీ, ఫోన్ కాల్స్ విషయంలోగానీ అభ్యం తరం లేదన్న కమిటీ...దేశీయంగా మాత్రం నియంత్రణలు విధించడం అవసరమని సూచించింది. ఒకే విధానాన్ని విదేశాలకు సంబంధించి ఒకవిధంగా, దేశీయంగా వినియోగిస్తే మరో విధంగా పరిగణించడం అన్యాయం, వివక్షాపూరితమవుతుం దని వేరే చెప్పనవసరం లేదు. ఈ అప్లికేషన్లు వాడుకలోకొచ్చాక ఫోన్ కాల్స్ వినియోగం తగ్గిన మాట వాస్తవమే. ప్రస్తుతం ఫొటోలు, వీడియోలు వేగంగా చేరే యడానికి ఉపయోగపడుతున్న వాట్సప్ ద్వారా త్వరలో సంభాషించుకునే వీలు కూడా కలుగుతుందని చెబుతున్నారు. అది అందుబాటులోకొస్తే టెలికాం సంస్థలకు నష్టం వస్తుందన్న ఉద్దేశంతోనే కమిటీ ఈ మాదిరి సిఫార్సు చేసిందంటున్నారు. టెలికాం సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో ఒక విధానాన్ని నిరుత్సా హపర్చడం, దానికి ఖరీదుకట్టి అందుబాటులోకి రాకుండా చేయడం అన్యాయం అనిపించుకుంటుంది. టెలికాం సంస్థలు నిలదొక్కుకోవాలంటే తమ సేవలను మరింత మెరుగుపర్చుకోవడం, అనుబంధ సేవలను అందించడం వగైరా మార్గాలను అనుసరించాలి తప్ప ప్రపంచమంతటా అందుబాటులోకొచ్చిన విధానం ఇక్కడ ఎవరికీ దక్కకుండా చేయాలనుకోవడం సరికాదు. ఇంటర్నెట్ తటస్థతపై నాలుగు నెలలనుంచి నెటిజన్లలో ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇంటర్నెట్ తటస్థత విషయంలో రెండో మాటకు తావులేద నే చెప్పింది. ఇప్పుడు నిపుణుల కమిటీ ఇంటర్నెట్ తటస్థతను నిర్ద్వంద్వంగా సమ ర్థిస్తున్నామని అంటూనే దాన్ని దెబ్బతీసే సిఫార్సులు చేసింది. ఈ నివేదిక విషయం లో ట్రాయ్ సక్రమంగా వ్యవహరించి కేంద్రానికి సహేతుకమైన సూచనలు అందిం చాలి. ట్రాయ్ ఏం చెప్పినా ప్రజాస్వామిక విధానాలకు అనుగుణంగా కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాలి. ఇంటర్నెట్ తటస్థతకు విఘాతం కలగకుండా చూడాలి. -
అధికారులదీ అదే జపం
కందుకూరు అర్బన్( ప్రకాశం జిల్లా): కందుకూరు మున్సిపాలిటీలో అధికార పార్టీ నాయకులు చెప్పిందే వేదం. మున్సిపాలిటీ ఏమైపోయినా ఫర్వాలేదు... వారు చెప్పినవారికి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలను సైతం లెక్కచేయకుండా అడ్డగోలుగా అప్పగిస్తున్న వైనంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలకతీతంగా పని చేయాల్సిన కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కందుకూరు మున్సిపాలిటీలో శానిటేషన్, ఇంజినీరింగ్, కంప్యూటర్ ఆపరేటర్లు టెండర్ల గడువు మార్చినాటికి ముగిసింది. అధికారులు 2015-16 సంవత్సరానికి మార్చి 23న టెండర్లు పిలవగా శానిటేషన్, ఇంజినీరింగ్ టెండర్లకు సాయి హెచ్ఎల్సీసీఎస్ (ఓగూరు), ఆర్ఎస్ఎంఎల్సీసీఎస్ (దూబగుంట) మార్చి 30వ తేదీన కంప్యూటర్ ఆపరేటర్లకు టెండర్లు పిలవగా పీఎస్ మ్యాన్‌పవర్ సప్లయిర్స్ ప్రతినిధులు టెండర్లు వేశారు. టెండరుదారుల్లో అధికారపార్టీకి చెందిన వారు లేకపోవడంతో సరైన ధ్రువపత్రాలు లేవని రదు ్దచేస్తున్నట్లు ప్రకటించారు. గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీకి పట్టం ఏప్రిల్ నెలలో కంప్యూటర్ ఆపరేటర్లకు టెండర్లు పిలవగా పీఎస్ మ్యాన్‌పవర్ 2 శాతం ఎక్కువుగా టెండరు వేసింది. వెల్ఫేర్ అసోసియేషన్ 4.94 శాతం ఎక్కువకు టెండర్లు వేసింది. రెండు నెలలు తరువాత మళ్లీ సరైన పత్రాలులేవంటూ డీఈ సుబ్రమణ్యం, కమిషనర్ ఎస్వీ రమణకుమారిలు ప్రకటించి ఆ రెండు టెండర్లను తిరస్కరించారు. రెండు రోజుల తరవాత గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీకి చెందిన 4.94 ఎక్కువ శాతం వేసిన వెల్ఫేర్ అసోసియేషన్‌కి కట్టబెట్టి తమ ప్రభు భక్తిని చాటుకున్నారు. ఒంగోలు ఇన్చార్జిగా ఆర్డీఓ మే 2వ తేదీన ఫీఎస్ మ్యాన్‌పవర్ సప్లయిస్ టెండర్ల దారులకు ఫోన్ చేసి నిబంధనల ప్రకారం టెండరు ఖరారు చేసినట్లు చెప్పారు. తరువాత కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టడంతో తరువాత సీన్ రివర్స్ అయింది. తక్కువ శాతం వేసిన టెండరును పక్కన పెట్టేసి ఎక్కువ శాతం టెండరును ఎలా ఓకే చేస్తారని పీఎస్ మ్యాన్‌పవర్ టెండరు ప్రతినిధులు నిలదీసినా పట్టించుకునే నాధుడే కరవయ్యారు. ఈ చర్యలతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. టెండరు నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా సమర్పించినా రద్దుచేసి, డీఈ, కమిషనర్ సంబంధంలేని సమాధానాలు చెబుతున్నారని టెండరుదారుడు వాపోతున్నారు. ఒకసారి టెండరు రద్దుచేసిన తరువాత మళ్లీ టెండర్లు పిలవాలని నిబంధనలున్నా మూడో కంటికి తెలియకుండా టెండర్లు దఖలు పరచడం వెనుక అంతరార్థమేమిటని పురపాలిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కంప్యూటర్ టెండరుతోపాటు ఏప్రిల్ 27వ తేదీన ఓపెన్ చేసిన శానిటేషన్, ఇంజినీరింగ్ టెండర్లను రద్దు చేశారు. ఆ టెండర్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్‌పై కలెక్టరు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తా : ఎమ్మెల్యే పోతుల కందుకూరు మున్సిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆపరేటర్ విభాగానికి వేసిన టెండరు పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ రద్దుచేసి గుట్టుచప్పుడు కాకుండా అధికారపార్టీ వ్యక్తికి కట్టపెట్టిన కమిషనర్‌పై కలెక్టరు, విజిలెన్స్‌అధికారులకు ఫిర్యాదు చేస్తా. స్థానిక రోడ్లు,భవనాల శాఖ అతిధి గృహానికి వచ్చిన ఎమ్మెల్యేకు పి.ఎస్. మ్యాన్‌పవర్ సప్లయిర్స్ తరుపు టెండరుదారులు కలిసి సమస్యను వివరించారు. ఇన్చార్జి ఆర్డీఓ నిబంధనల ప్రకారం టెండరు ఖారారు చేసినా ఇందుకు భిన్నంగా అధికారపార్టీకి అనుకూలమైన వారికి టెండరు ఖరారు చేశారని వాపోయారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ టెండర్లు రద్దుచేశామని చెప్పిన తరువాత మళ్లీ టెండర్లు పిలిచి ఇవ్వాల్సిన కనీస బాధ్యత కమిషనర్‌కు ఉందన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి మున్సిపాలిటీకి నష్టం జరిగే చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. శానిటేషన్,ఇంజనీరింగ్ టెండర్లను కూడా పదేపదే రద్దుచేయడం మంచిపద్దతి కాదన్నారు. మున్సిపల్ అభివృద్ధికి దోహదపడాల్సిన కమిషనర్ ఇలా ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న విధానం మంచిది కాదన్నారు. -
డబ్బు దారుల్లో చోద్యాలు
ధనం అన్ని అనర్థాలకు మూలం అంటారు కొందరు. డబ్బంటే సుఖం. డబ్బంటే అధికారం. డబ్బంటే మనమాటను అందరూ వినడం అనుకుంటారు అధికులు. కాబట్టే కదా చరిత్ర నిండా ఇన్ని రక్తపాతాలు- కన్నీళ్లు! దీన్నెవడు కనిపెట్టాడో కాని, లోకంలో డబ్బనేది లేకపోతే చీకూచింతా ఉండదు కదా అని వాపోతారు మరి కొందరు. ఊహల్లోంచి బయటకు వస్తే డబ్బు ఆక్సిజన్ ! డబ్బు కావాలి! ఎంత? ‘చాలు చాలు’ అనేంత! కలవారు డబ్బు వ్యర్థం అనుకుంటారు. లేనివారు వెంపర్లాడతారు. డబ్బొద్దు అనుకున్నా డబ్బుండాలి కదా!. డబ్బు చేసుకోవడానికి మంచి సలహాలు ఎవరిస్తారు? సంపాదన చేతకాని వాళ్లు మాత్రమే! సంప్రదాయక విజ్ఞానం మనిషి ముందు మూడు దారులు పరచింది. బెగ్-బారో-స్టీల్! అడుక్కో-అప్పుచేయి-లాక్కో! కొందరు అడుక్కునే వారిని మనం గుర్తించలేం. వారు మనోవిజ్ఞానంలో మాస్టర్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడలిలో ఎర్రలైటు పడగానే ప్రత్యక్షమవుతారు. వారి వల విడిపించుకోలేనిది. డబ్బివ్వకపోతే అపరాధ భావన కు గురవుతాం! ప్రార ్థన స్థలాల్లో భగవంతుడేమో కాని అడుక్కునేవారు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతారు. ‘దైవాన్ని రహస్యంగా అడుక్కున్నదాంట్లో కొంచెమేగా మేము ఆశిస్తున్నది, మాకు చిల్లర విదిలించకపోతే మీకు టోకు లభిస్తుందా?’ అన్నట్లుగా కళ్లల్లోకి సూటిగా సంభాషిస్తారు. రెస్టారెంట్లో బిల్లు చెల్లించిన తర్వాత మీ స్థాయిని అంచనా వేస్తారు కొందరు బేరర్స్. మీరు అతిథి కావచ్చు, ఆతిథ్యం ఇచ్చిన వారు కావచ్చు, ఆత్మశోధనకు గురిచేస్తారు. తగిన మొత్తం ఘరానాగా చదివించి ఒక తలపంకింపును స్వీకరిస్తేగాని మీ మనస్సు తేలికపడదు. చోర్ మచాకే.. దొంగిలించడం అనే కళలోనూ రిస్క్ ఉంది. మీరు ఉద్యోగులా? అయితే పెట్టిన ఖర్చుకంటే అదనంగా చట్ట ప్రకారం దొంగిలించవచ్చు. టీఏ డీఏలను అదనంగా చూపవచ్చు. రాని వ్యక్తులను అతిథులుగా, తినని పదార్థాలను, ద్రవాలను సేవించినట్లు రికార్డులను చూపవచ్చు! అప్పు చేయడం ద్వారానూ కొందరు డబ్బు సంపాదిస్తారు. కుటుంబసభ్యుల్లో ఎవరి అంత్యక్రియలకో వెళ్లాలనడం, అయిన వారిని తక్షణం దవాఖానాలో చేర్పించాలనే నెపం అభినయించి అప్పిచ్చే వారిలో మానవత్వాన్ని తట్టిలేపాలి. తిరిగి చెల్లించకపోయినా ఫర్వాలేదనుకునే అమౌంట్‌కు ఎర్త్ పెట్టాలి. జ్ఞాపకశక్తి లోపించిన వారి దగ్గర, అడిగేందుకు మొహమాటపడే వారి దగ్గర అప్పు చేయడం శ్రేయస్కరం. దురదృష్టం ఏంటంటే అంతంత మాత్రం జ్ఞాపకశక్తి ఉన్నవాళ్లు కూడా అప్పిచ్చిన వైనాల్లో చురుగ్గా ఉంటారు! ఆమ్యామ్యా.. డబ్బు సంపాదనలో లంచం కూడా ఒక మార్గమే! ఇందుకు ఒక కొలువు తప్పనిసరి. కొలువు ఏదైనా లంచానికి కాదేదీ అన ర్హం! లంచం తీసుకున్నందుకు చట్టం శిక్షించదు, తీసుకున్నట్లు పట్టుబడితేనే సుమా! లంచం ఆశించేవారు తెలివిగా ఉండాలి. మరీ దురాశకు పోరాదు. ఈ ఆశ లేనివాళ్లు ఏదైనా రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా వెళ్లవచ్చు. - ప్రెజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రచయిత. సెల్ నెం : 7680950863 -
ఓటేద్దాం రండి!
సాక్షి, హన్మకొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. బరిలో 22 మంది అభ్యర్థులు నిలవగా, జిల్లాలో పట్టభద్రుల ఓట్లు 1,04,364 ఉన్నారుు. వీరిలో పురుషులు 76,873, మహిళా ఓటర్లు 27,487 కాగా ఇతర కేటగిరీలో నలుగురు ఓటర్లు ఉన్నారు. వీరు 144 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 99 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1000 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని మరో 45 చోట్ల అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించేందుకు వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఐదు చోట్ల అనువైన పరిస్థితి లేదు. ఏర్పాట్లు పూర్తి ఎన్నికల నిర్వాహణలో పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి 1000 మంది వరకు ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగనున్న దృష్ట్యా శనివారం సాయంత్రానికే ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇందుకోసం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, జనగామ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి పోలింగ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సూక్ష్మ పరిశీలకులుగా, పోలింగ్ పార్టీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరు అవసరాన్ని బట్టి పోలింగ్ సరళి, ఇతర సమాచారాలను నేరుగా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు సమాచారం ఇస్తారు. జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మినహా మిగతా అన్నింటిలో 1000 లోపు ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రంలో కూడా ఆలస్యం కాకుండా 800లోపు ఓట్లు ఉన్నట్లయితే రెండు ఓటింగ్ కంపార్టుమెంట్లు, ఆపైన ఓటర్లు ఉన్నట్లయితే మూడు ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్యాలెట్ బ్యాక్స్‌లు కూడా ఒక్కో బూత్‌లో రెండుకన్నా తక్కువ కాకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రాంతాన్ని 27 రూట్లు, 27 జోన్లుగా విభజించారు. వాటికి ప్రత్యేక ఇన్చార్జీలను నియమించారు. పోలింగ్ పూర్తరుున వెంటనే బ్యాలెట్ బాక్సులను డివిజన్ ప్రధాన కేంద్రాలు చేరుస్తారు. అన్ని బాక్సులు వచ్చినతర్వాత కట్టుదిట్టమైన భద్రత నడుమ నల్గొండకు తరలిస్తారు. స్థానికులనే ఏజెంట్లుగా నియమించుకోవాలి.. నియోజకర్గ పరిధిలోని వ్యక్తినే పోలింగ్ ఏజెంట్‌గా నియమించుకోవాలి. ఏజెంటుగా నియమితులైన వారు ఉదయం 7:00 గంటల వరకు పోలింగ్ కేంద్రాలను చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తీరు తెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు వరంగల్ క్రైం : ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అర్బన్ పరిధిలో ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 35 మంది ఎస్సైలు, 400 కానిస్టేబుళ్లతో పాటు ఒక కంపెనీ సీఐఎస్ఎఫ్ బలగా లు పో లింగ్ నిర్వహణలో సేవలందించనున్నాయి. కాగా, రూరల్ పరిధిలో 20 మంది సీఐలు, 56 మంది ఎస్సై లు, 83 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 300 కానిస్టేబుళ్లు, 67 మహిళా కానిస్టేబు ళ్లు, హోంగార్డులు, 100 మంది కానిస్టేబుళ్లు, 34 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, ఒక కంపెనీ సీఐఎస్ఎఫ్ బలగాలను బందోబస్తు కోసం నియమించారు. -
సర్వం సన్నద్ధం
సాక్షి, మహబూబ్‌నగర్ : హైదరాబాద్- మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. దాదాపు నెల రోజులపాటు సాగిన ప్రచార పర్వానికి తెరపడడంతో అధికార యంత్రాంగం రంగ ప్రవేశం చేసింది. ఎన్నికలు సవ్వయంగా జరగానికి రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖలు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. జిల్లాలోని మొత్తం 68,491 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి 114 పో లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ విభాగాల జిల్లా అధికారులు శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వారు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గుర్తింపు కార్డు తప్పనిసరి: డీఆర్వో ఎన్నికల్లో పాల్గొనే గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని డీఆర్వో రాంకిషన్ తెలిపారు. దాదాపు ఎనిమిది రకాల గుర్తింపు కార్డులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. పాస్‌పోర్టు, ఆధార్, డ్రైవింగ్‌లెసైన్స్, పాన్‌కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డు, పీహెచ్సీ సర్టిఫికెట్, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకురావాలని సూచిం చారు. అదేవిధంగా ప్రతి పోలింగ్‌బూత్ ఎదుట హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో ఏజెంట్లుగా ఉండేందుకు ప్రజాప్రతినిధులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఏజెంట్లు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం 7గంటల లోపు ప్రిసైడింగ్ అధికారి వద్ద గుర్తింపుకార్డులు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని మొత్తం 114 పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఒక ఏపీఓ, మరో ముగ్గురు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయడం కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే 08542-241200 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు: ఎస్పీ విశ్వప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పి.విశ్వప్రసాద్ తెలిపారు. ఎన్నికల విధుల్లో తనతో పాటు ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 23 ఇన్స్పెక్టర్లు, 85మంది ఎస్ఐలు, 134మంది ఏఎస్ఐలు, 500మంది కానిస్టేబుళ్లు, 114 మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డు, ఒక సీఆర్పీఎఫ్ బృందంతో పాటు 103మంది ఏఆర్ కానిస్టేబుళ్లు విధుల్లో పాల్గొననున్నారు. జిల్లాలో ఏడు బోర్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. చె క్పోస్టులలో 24 గంటల పాటు గస్తీ ఉంటుందన్నారు. బల్క్ ఎస్ఎంఎస్ పంపడం నిషేధం కాబట్టి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఓటరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతామన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా జిల్లాలో 14 ప్లైయింగ్ స్కాడ్లు విధిగా పరిశీలిస్తాయన్నారు. శాంతిభద్రతలకు సంబంధించి ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఫోన్:9494600100నంబర్‌ను సంప్రదించాలని ఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు. మద్యం అమ్మకాలు బంద్ :గోపాలకృష్ణ, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎన్నికల నిబంధ నల ప్రకారం మద్యం అమ్మకాలను నిషేధించినట్లు ఎక్సైజ్ డిప్యూటీ క మిషనర్ గోపాలకృష్ణ తెలిపారు. మద్యం అ మ్మడం, పంచడం నిషేధం కాబట్టి షాపులు మూసివేసినట్లు వివరించారు. జిల్లాలో ఉన్న బార్లు, వైన్‌షాపులు, కల్లు దుకాణాలన్నింటినీ మూసివేయించామన్నారు. -
పొత్తు పేరుతో పెత్తనమా!
టీడీపీ తీరుపై కమలనాథుల ఆగ్రహం మంత్రులనూ అవమానిస్తున్నారు.. ఇక కలిసి పనిచేయలేం.. బీజేపీ చీఫ్ అమిత్ షాకు నేతల ఫిర్యాదు.. ఓపికపట్టాలని షా హితవు విజయవాడ : తెలుగుదేశం పార్టీ నేతలు పైకి పొత్తు అంటూనే తమపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జిల్లాలోని కమలనాథులు రగిలిపోతున్నారు. నియోజకవర్గాల్లో తమ మాట చెల్లకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. తమ ఆవేదనను శుక్రవారం నగరానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నివేదించారు. మంత్రులను కూడా పలు రకాలుగా అవమానిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. నియోజకవర్గ స్థాయి నాయకులతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా టీడీపీపై పలు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన అమిత్ షా... ముందుగా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని, టార్గెట్ పూర్తయితే 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుదామని చెప్పినట్లు సమాచారం. మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ.. జిల్లాలో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. పొత్తులో భాగంగా ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే, ఆయన తాము చెప్పినట్లు వినాల్సిందేననే ధోరణిలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంత్రి పదవి చేపట్టిన వారం రోజులకే ఇరిగేషన్ మంత్రి అయిన ఉమ.. ఆయనకు సంబంధం లేకపోయినా కామినేని పరిధిలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లి అధికారులను మందలించే ప్రయత్నం చేశారని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత కామినేని ఈ విషయంపై తీవ్రంగా స్పందించారని పేర్కొన్నారు. ‘నేను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా.. నా శాఖలో నీ పెత్తనం ఏమిటీ..’ అంటూ నేరుగా దేవినేని ఉమాను కామినేని ప్రశ్నించారని వివరించినట్లు తెలిసింది. ఇటీవల తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఒక డాక్టర్ బదిలీని ఆపాలని మంత్రి కామినేనికి చెప్పడం.. ఆయన తీవ్రంగా ప్రతిస్పందించడం వంటి అంశాలను అమిత్‌షాకు చెప్పినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల తీరుతో కామినేని విసిగిపోయారని, ఇటీవల నగరంలోని ఓ హోటల్లో జరిగిన డీఎం అండ్ హెచ్‌వోల సమావేశంలో టీడీపీ నాయకుల మాటలు వినవద్దని చెప్పేంత వరకు పరిస్థితి దిగజారిందని చెప్పినట్లు తెలిసింది. దేవాదాయ శాఖ మంత్రి విషయంలోనూ అదే వైఖరి.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావును సైతం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అవమానించారని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా గత ఉత్సవాల సమయంలో దేవినేని ఉమా పట్టువస్త్రాలు సమర్పించి మాణిక్యాలరావును అవమానించారని అధినేతకు ఫిర్యాదు చేశారు. అగ్రస్థాయి నేతలు సైతం ఫిర్యాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాల్లో టీడీపీ నేతల జోక్యం ఎక్కువైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కొన్ని విషయాలను ఆయన వద్ద ప్రస్తావించి టీడీపీ నేతల జోక్యాన్ని తగ్గించేలా చూడాలని కోరినట్లు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా పలు విషయాల్లో టీడీపీ వైఖరిపై అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందరి ఆవేదనను తెలుసుకున్న అధినాయకుడు ‘కాస్త ఓపిక పట్టండి.. మనం రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. తొలుత భారీగా సభ్యత్వాలు చేర్పించండి. అనుకున్న మేర సభ్యత్వాలు చేర్పిస్తే 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దాం. అప్పుడు ఎవరితోనూ ఇబ్బందులు ఉండవు..’ అని చెప్పినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. -
పరిశ్రమలను అడ్డుకుంటున్న టీడీపీ
మాచర్ల టౌన్ అధికారం ఉంది కదా అని దౌర్జన్యం చేయించి, అక్రమ కేసులు పెట్టించి టీడీపీ నాయకులు పరిశ్రమల ఏర్పాటును అడ్డుకుంటున్నారని మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాచవరం మండలం చెన్నాయపాలెంలో సరస్వతీ సిమెంట్స్ ఏర్పాటుకు టీడీపీ నేతలు అవరోధం కల్పిస్తున్నారని ఆరోపించారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పరిశ్రమ నెలకొల్పేందుకు మార్కెట్ విలువ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రైతులను రెచ్చగొట్టి రిజిస్ట్రేషన్, కన్వర్షన్ చేసుకున్న భూములను ఆక్రమించుకోవాలని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఒకవైపు పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు చెబుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వారితో కలసి సరస్వతి సిమెం ట్స్‌ను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే విక్రయించేసిన భూముల్లో అక్రమంగా పంటలు వేయించారని, తీరా దీనిపై రైతులతో చర్చించేందుకు వెళ్లేవారిని గూండాలుగా చిత్రీకరించి కేసులు బనాయిస్తున్నారన్నారు. రైతు పక్షపాతిగా పేరొందిన దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిని విమర్శించడం దారుణమన్నారు. యరపతినేనికి ఇది అలవాటే గతంలో కూడా దాచేపల్లి ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీల నిర్వాహకులను వివిధ సాకులతో బెదిరించి నగదు వసూలు చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన చరిత్ర యరపతినేనిదని పిన్నెల్లి వ్యాఖ్యానించారు. వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉండి జైలుకి వెళ్లి ఆ తరువాత ఆ కుటుంబానికి డబ్బులిచ్చి రాజీ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కారంపూడి మండలం చినగార్లపాడులో గోవిందరెడ్డి భార్యపై దాడి చేసింది టీడీపీ నాయకులేనన్నారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడం, నగదు కోసం బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, అమాయక కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిని యరపతినేని మానుకోవాలని హితవు పలికారు. అధికార దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు మారం వెంకటేశ్వరరావు (లడ్డు), యరబోతుల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పురపాలక సంఘ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ లీడర్లు బోయ రఘరామిరెడ్డి, షేక్ కరిముల్లా, వైఎస్సార్సీపీ నాయకులు బిజ్జం నాగిరెడ్డి,మస్తాన్, రామిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
రుణమాఫీపై నీలి నీడలు!
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ రుణమాఫీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎలాగైన అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధారణ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని దాట వేస్తున్నారు. రోజుకో ప్రకటనలతో వారిని నాలుగునెలలుగా మభ్యపెడుతున్నారు. వీలైనంత వరకు నీరు రుణమాఫీని నీరుగార్చాలని ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో బ్యాంకర్లకు పంట రుణాల రూపంలో ఆరు లక్షల మందికి పైగా రూ.3600 కోట్లు బకాయి పడ్డారు. ఎన్నికల సమయంలో ప్రచారం ముగింపు రోజు వరకు బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలను ఎవ్వరు చెల్లించవద్దు. నేను అదికారంలోకి వచ్చిన తర్వాత రుణాలన్నింటిని మాఫీ చేస్తానని విస్పష్టంగా ప్రకటించారు. తీరా అధికారం చేపట్టి విధి విధానాల రూపొందించేందుకు మొదటి సంతకంతో కమిటీ వేసి జాప్యానికి తెర లేపారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత 2013 డిసెంబర్ చివరిలోగా తీసుకున్న రుణాల్లో నిల్వ ఉన్న వాటినే మాఫీ చేస్తామంటూ ప్రకటించారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని ఒకరు ఉంటే రూ.1.50 లోలు ఇద్దరు ఉంటే రూ.75 వేలు, ముగ్గురు సభ్యులు ఉంటే రూ.50 వేలకు మాత్రమే రుణమాఫీని పరిమితం చేశారు. పంట రుణాల మాఫీ లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. తర్వాత వీటికి అదనంగా రైతు సాగు చేసిన భూముల విస్తీర్ణం, పంట, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వివరాలు కూడా రైతు వారీగా తయారు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పంట రుణాల మాఫీకి అర్హులైన వారి జాబితాను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో పంట రుణాల మాఫీ కాదు.. రైతులకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా రైతులకు రుణ విముక్తి పత్రాలు అందించే నాలుగేళ్లలోగా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించే విధంగా నిర్ణయించారు. తొలుత సన్న, చిన్నకారు రైతులకు రూ.50 వేల ప్రకారం ఆర్థిక సహాయం చేసేలా రుణ విముక్తి పత్రాలు జారీ చేస్తామని ప్రకటించడం గమనార్హం. రైతులను నిండా ముంచారు..: ముఖ్యమంత్రి చంద్రబాబు పంట రుణాలను మాఫీ చేస్తారనే ఉద్దేశంతో రైతులు గతేడాది తీసుకున్న రుణాలను చెల్లించలేదు. కనీసం 95 శాతం మంది రైతులు రెన్యువల్ కూడా చేసుకోలేదు. రుణమాఫీ అమలు చేయకపోవడం రెన్యువల్ గడువు ముగియడంతో రైతులు తీసుకున్న పంట రుణాలను 13.75 శాతం వడ్డీతో బ్యాంక్ అధికారులు వసూలు చేస్తున్నారు. పంట రుణాల మాఫీ కాదు.. ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరుతో జిల్లా రైతులపై రూ.250 కోట్ల వడ్డీ భారం పడుతోంది. డ్వాక్రా రుణాల మాఫీని నీరు గార్చిన తరహాలోనే రైతుల వ్యవసాయ రుణాల మాఫీని చంద్రబాబు నీరు గార్చే యత్నాల్లో ఉన్నట్లు ఆయన రోజుకో విధంగా చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాము. మభ్యపెట్టేవిధంగా ఉన్న ప్రభుత్వ వెఖరిని జన్మభూమి కార్యక్రమంలో రైతులు ఎండగడుతున్నారు. -
ముక్కలు కానివ్వం
అఖండ కర్ణాటక విడిపోదు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం హై-క విమోచన దినోత్సవంలో సీఎం సిద్ధరామయ్య రాయచూరు రూరల్ : ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని, అఖండ కర్ణాటక ఎప్పటికీ విడిపోదని రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. గుల్బర్గాలో బుధవారం నిర్వహించిన హై-క విమోచన దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. అంతకు ముందు పటేల్ రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉత్తర కర్నాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి ఉమేష్ కత్తి.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంపై ఎం దుకు నోరు విప్పలేదని సీఎం ప్రశ్నిం చారు. అన్నదమ్ముల్లా మెలుగుతున్న కన్నడిగుల మధ్య ఉమేష్ కత్తి చిచ్చు రాజేస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే మాటలతో అలజడి సృష్టించవద్దని హితవు పలికారు. హై-క అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేసి రూ.600 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.150 కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. రాయచూరులో ఐఐటీ, ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నవంబర్‌లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అతివృష్టి, అనావృష్టి పీడిత ప్రాంతాల్లో నష్టంపై అంచనాలను వారం రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
ఎత్తులు.. పై ఎత్తులు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : మంత్రి పదవి కోసం మాజీ మంత్రులు పోటీ పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి రావటంతో జిల్లాలో మళ్లీ చక్రం తిప్పాలని ఇద్దరు మాజీ మంత్రులు తహతహలాడుతున్నారు. ముందునుంచీ టీడీపీలో ఉన్న ఎన్ఎండీ ఫరూక్.. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన టీజీ వెంకటేష్ ప్రస్తుతం ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. ఈ ఇద్దరూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటీ పడుతూ.. పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో 2011లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించడంతో పదవిని వదులుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగటంతో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. జిల్లాలో టీడీపీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ నేతలు దౌర్జన్యంగా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీకి మెజారిటీ లేదు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో 1102 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 30 మంది జెడ్పీటీసీ సభ్యులు, 394 మంది ఎంపీటీసీ సభ్యులు, 108 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలుపొందిన వారే. మొత్తం 545 మంది ఓట్లు వైఎస్సార్‌సీపీవే. ఈ లెక్కన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం వైఎస్సార్సీపీదే. అయితే వీరిలో ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారిలో కొందరిని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. వారి సహకారంతో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్సీ అయితే మంత్రి పదవి ఖాయం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిస్తే మంత్రి పదవి ఖాయమని తమ్ముళ్లు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ కోసం మాజీ మంత్రులు ఫరూక్, టీజీ వెంకటేష్ పోటీ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలుపొందలేదు. దీంతో మైనారిటీ సంక్షేమ శాఖను కూడా ఆ సామాజిక వర్గానికి కట్టబెట్టలేని దుస్థితి నెలకొంది. సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డికి మైనారిటీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం అభ్యర్థిని ఎమ్మెల్సీని చేసి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లా నుంచి ఎన్ఎండీ ఫరూక్‌ని ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌కు ఎమ్మెల్సీ టికెట్ దాదాపు ఖరారైందని టీడీపీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబుకి సన్నిహితుడైన సీఎం రమేష్ ద్వారా టికెట్ ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీగా పోటీ చేసి టీడీపీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకుని జిల్లాలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. అయితే ఫరూక్ ఎమ్మెల్సీ అయితే ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒకరైనా మంత్రివర్గంలో ఉన్నారని చెప్పుకునేందుకు ఉంటుందని టీడీపీ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. అయితే వీరిద్దరిలో ఎమ్మెల్సీ టికెట్ ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. ఒకవేళ టికెట్ దక్కినా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుస్తారా? లేదా? అనే సందేహం తెరపైకి వస్తోంది. -
నిరుద్యోగ యువతకు చేయూత ఏదీ ?
బడ్జెట్ కేటాయింపుల నిధుల విడుదలలో జాప్యం హామీలే గానీ చేతల్లో కొరవడిన సహకారం చిలకపూడి (మచిలీపట్నం) : నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేయూతనిచ్చే అంశం ప్రహసనంగా మారింది. వారి సంక్షేమానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు కాగితాలకే పరిమితమవుతోంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాలకపక్ష ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారని, వాటి అమలు విషయంలో వారినుంచి సహకారం కొరవడుతోందని పలువురు వాపోతున్నారు. 2013- 14 ఆర్థిక సంవత్సరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉపాధి అవకాశాలు కల్పిం చేం దుకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టి 15 నెలలు కావస్తున్నా నిధులు నేటికీ విడుదల కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. తా ము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని ప్రస్తుత అధికార పార్టీ నేతలు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిన విష యం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విధంగా ఆలోచన చేయకపోగా.. సంక్షేమ పథకాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు విడుదల చేయించడంలో కూడా సహకారం అందించటం లేదని నిరుద్యోగ యువత వాపోతున్నారు. 2013 నుంచి ఎదురు చూపులు 2013 జూన్ నెలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు జారీ చేయటంతో అర్హులైన వారు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం బ్యాంకుల అధికారుల నుంచి హామీ పత్రాలను పొంది, దరఖాస్తులతోపాటు సమర్పించారు. వీటితో పాటు ఆయా కార్పొరేషన్లకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టును కూడా అందజేశారు. నిధుల విడుదల గురించి సం బంధిత అధికారులను ప్రశ్నిస్తే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఖా తాలను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడదీయాల్సి ఉందని కుంటిసాకులు చెబుతున్నారని యువత ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు తమకు నిధులు మంజూరవుతాయా? లేదా? అనే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. లబ్ధిదారుల వివరాలు.. ఎస్సీ సొసైటీ ద్వారా 3,567, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ద్వారా 4,398, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 822, వికలాంగ సంక్షేమశాఖ ద్వారా 51 యూనిట్లు మంజూరు చేయడానికి నిర్ణయించారు. వీటిలో మొత్తం 5,307 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు. అ యితే 2013-14 ఆర్థిక సంవత్సరానికి బీసీ సొసైటీ ఆధ్వర్యంలో మొత్తం 1782 మంది లబ్ధిదారులకు రూ. 6.37 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి ముందు 851 మంది లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో ఉంచారు. ప్రవర్తనా నియమావళి అమలులోకి రావటంతో ఆన్లైన్ నిలుపుదల చేశారు. 542 మం ది ఖాతాల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అ యితే ఇంకా 389 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు, ఇతర ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉందన్నారు. ఎస్సీ సొసైటీ ద్వారా 3,500 యూనిట్ల మంజూరుకు బడ్జెట్లో మొత్తం రూ. 39.46 కోట్ల కేటాయింపు జరిగింది. వీటిలో 3,816 యూనిట్ల మంజూరుకు అనుమతి ఇవ్వటంతో బ్యాంకింగ్ ప్లాన్ కింద 3,710, నాన్ బ్యాకింగ్ ప్లాన్ కింద 106 యూనిట్లు కేటాయించి, రూ. 33.34 కోట్లు చెల్లించడానికి ప్ర ణాళిక రూపొందించారు. గిరిజన సంక్షేమశాఖకు సంబంధించి మొత్తం 822 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయిం చగా, 346 యూనిట్లు మాత్రమే మం జూరు చేశారు. వికలాంగుల సంక్షేమశాఖకు సంబంధించి 51 యూనిట్లు మంజూరు చేయాల్సి ఉం డగా, 21 యూనిట్లు మాత్రమే మంజూరు చేశా రు. ఈ లబ్ధిదారులకు ఆయా శాఖల్లో కేటాయింపులు, నిధుల విడుదలలో భారీ వ్య త్యా సం ఉండటంతో రుణాలు మంజూరవుతా యా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా నిరుద్యోగ యువతకు ఎంత మేర చేయూత అందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. -
పెద్దల సభలో ఆధిక్యత దిశగా కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత శాసన మండలిలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సాధించనుంది. సాధారణంగా కొత్తగా అధికారంలోకి వచ్చే పార్టీకి ఎగువ సభలో తక్షణమే మెజారిటీ లభించదు. అంతకు ముందు అధికారాన్ని చెలాయించిన పార్టీ ఆధిక్యతలో ఉండడం ఆనవాయితీ. నామినేటెడ్ సభ్యుల నియామకం, శాసన సభ నుంచి ఎన్నికైన అభ్యర్థులతో కాంగ్రెస్ బలం పెరిగింది. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 75. వీరిలో ప్రస్తుతం బీజేపీకి 38, కాంగ్రెస్‌కు 19, జేడీఎస్‌కు 12 మంది సభ్యులున్నారు. చైర్మన్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో పాటు మూడు ఖాళీలున్నాయి. కొత్తగా నామినేట్ అయిన ఐదుగురిలో నలుగురు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఎన్నికైన మరో 12 మంది జులై 1న ప్రమా ణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఎగువ సభలో బలాబలాలు తారుమారవుతాయి. ప్రస్తుతం మండలి చైర్మన్‌గా డీహెచ్. శంకరమూర్తి, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా విమలా గౌడ వ్యవహరిస్తున్నారు. వీరు పూర్వాశ్రమంలో బీజేపీకి చెందిన వారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ వారిని ఆ స్థానాల్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలను ప్రారంభించనుంది. నామినేటెడ్ సభ్యులు, శాసన సభ, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేస్తే కాంగ్రెస్ బలం 28కి పెరుగుతుంది. జేడీఎస్ బలం 13 వద్దే కొనసాగుతుంది. బీజేపీ హయాం లో నామినేట్ అయిన ఎండీ. లక్ష్మీనారాయణ కేజీపీలో తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. తద్వారా కాంగ్రెస్ బలం 29కి పెరిగి, బీజేపీ బలం 30కి తగ్గుతుంది. చిత్రదుర్గ స్థానిక సంస్థల నుంచి గెలుపొందిన రఘు ఆచార్, శాసన సభ నుంచి ఇండిపెండెంట్‌గా ఎన్నికైన బైరతి సురేశ్ ఇప్పటికే కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో కాంగ్రెస్ బలం బీజేపీతో సమానంగా 31కి పెరిగినట్లయింది. ఇటీవల బీజేపీ, జేడీఎస్ మద్దతుతో శాసన సభ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన డీయూ. మల్లిఖార్జున ఎటు వైపు మొగ్గుతారనే విషయమై సందిగ్ధత నెలకొం ది. ఆయన నిర్ణయంపైనే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకునే వ్యూహం ఆధారపడి ఉంటుంది. -
నేటి నుంచి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఐనవోలు (వర్ధన్నపేట రూరల్), న్యూస్‌లైన్ : కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా భక్తుల హృదయాల్లో కొలువైన ఐనవోలు మల్లికార్జునస్వామి(ఐలోని మల్లన్న) జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ పాలకమండలి, అధికార యంత్రాంగం చేపట్టింది. ఈ జాతరకు ప్రత్యేకలెన్నో ఉన్నాయి. బోనాలు, ఒగ్గుపూజారులు వేసే పట్నాలు, గజ్జెల లాగులతో భక్తుల నృత్యాలు, శివసత్తుల పూనకా లు, వరాల మొక్కుబడులు, కోడెలు కట్టడం.. అరుదైన వారసత్వ సంస్కృతికి నిలయం ఈ ఆలయం. ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు మల్లికార్జునస్వామి కొలిచిన వారికి కొంగుబంగారంగా, ఆపద లో ఆదుకునే దేవునిగా నిత్యపూజలందుకుంటున్నాడు. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు జిల్లాతోపాటు రాష్ట్రంలో ని పలు ప్రాంతాల నుంచి లక్షలా మంది భక్తులు తరలివస్తుంటారు. ముడుపులుగా కొబ్బరికాయలు ఆపదల నుంచి గట్టేక్కించమని భక్తులు గర్భగుడిలో టెంకాయ ముడుపులు కట్టడం ఆనవాయితీ. వస్త్రంలో కొబ్బరికాయను భద్రపరిచి స్వామి వారికి ఉత్తరం వైపు ముడుపుకడతారు. కోర్కెలు నెరవేరాక మొక్కులు చెల్లిస్తుంటారు. ఇక్కడి పసుపును బండారిగా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఆదివారం : విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణతో ఉత్సవాలు ప్రారంభ మవుతాయి. సోమవారం : భోగి పండుగ సందర్భంగా స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, తోరణ బంధనం, విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచనం, ధ్వజారోహణం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం : మకర సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగంతో పాటు సాయంత్రం ఎడ్లబండ్లకు ప్రభలు కట్టి గుడిచుట్టు ప్రదక్షిణలు చేస్తారు. గురువారం : ఉదయం నుంచి సాయంత్రం వరకు మహా సంప్రోక్షణ సమారాధన, పూజాధికాలు జరుగుతాయి. అనంతరం గణపతి పూజ, పుణ్యహవచనం, శతరుద్రాభిషేకాలు, అన్నపూజలు, తీర్థప్రసాద వినియోగం, మహదాశీర్వచనములు, పండిత సన్మానములు నిర్వహిస్తారు. -
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు షురూ
దగదర్తి, న్యూస్‌లైన్: మండలంలోని సున్నపుబట్టి వద్ద ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఎయిర్‌పోర్టు అథారిటీ బృందం స్ప ష్టం చేసింది. దీంతో ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు త్వరలో శ్రీకారం జరిగే అవకాశాలు ఉన్నాయని జిల్లా అధికారులు చెబుతున్నా రు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 3,407.77 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని రెవెన్యూ అధికారులు ఎయిర్‌పోర్టు అథారిటీ బృందానికి తెలిపారు. శుక్రవారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కమిటీ సభ్యులు భూములను పరిశీ లించారు. గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు పర్యటించేటప్పటికీ 2,480 ఎకరాలు మాత్రమే రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రస్తుత అవసరాల అనుగుణంగా రన్‌వేకు ఇబ్బంది అనుకూలంగా ఢిల్లీ అధికారుల ప్రణాళిక ప్ర కారం 60 మిలియన్స్ పాసింజర్స్ కెపాసిటీకి అనుకూలంగా ఉండేందుకు 3,407 ఎకరాల భూమి విస్తీర్ణాన్ని గుర్తించారు. అందులో పట్టా భూమి 419.66, డీ-ఫారం పట్టా భూమి 526.71, అటవీ భూమి 1121.09, ప్ర భుత్వ భూమి 545.74, సీజేఎఫ్ఎస్ భూమి 483.84, చె రువు 29.86, కొండ 281.87 వెరసి మొత్తం 3407.77 ఎ కరాల భూమి ఉందని వివరించారు. దగదర్తి నుంచి సు న్నపుబట్టి వరకు తూర్పు, పడమరకు ఆరు కిలో మీటర్ల పొడవుతో, సున్నపుబట్టి నుంచి దామవరం రోడ్డు వరకు రెండు కిలో మీటర్ల వెడల్పులో ఉన్న భూముల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉందని ఢిల్లీ అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొత్త సర్వే ప్రకారం సున్నపుబట్టిలోని చెరువుతో పా టుగా జాతీయ రహదారికి పడమర వైపునున్న గృహాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. తమ గృహాలు విమానాశ్రయానికి పోతాయని తెలిసి ఆందోళన చెందుతున్నా రు. అధికారులు మాత్రం నెల్లూరు, ఒంగోలు పట్టణాలకు మధ్య భాగంలో విమానాశ్రయం ఏర్పాటు చేయడంత్లో రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పారిశ్రామికంగా ఫ్యాక్టరీలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. -
మరో వి‘భజన’
సాక్షి ప్రతినిధి, కర్నూలు:తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుంచి జనం సమైక్యాంధ్ర కోసం ఉద్యమబాట పట్టగా... ఆ ఉద్యమస్ఫూర్తిని నీరుగార్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్ జిల్లా నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి ముందు నుంచే రాయల తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ అంటూ అధిష్టానం ముందు కూడా భిన్న వాదనలు వినిపించిన జిల్లా కాంగ్రెస్ నేతలు ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలోనూ తమ రాజకీయ కుట్రలను మానుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణతో కలిసి ఉండటమొక్కటే మార్గమంటూ మరో విభజనను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆంటోని కమిటీ ముందు అనంతపురం జిల్లా నేతలు జేసీ దివాకర్ రెడ్డి, మధుసూదన్ గుప్తా బాహాటంగానే తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపాలని కోరగా, జిల్లాకు చెందిన నేతలు మాత్రం పైకి సమైక్యాంధ్ర అంటూ లోపాయికారీగా రాయల తెలంగాణకు కూడా సిద్ధమేనంటూ తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. రోజుకో మాట: మంగళవారం ఆంటోని కమిటీ ముందు రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమకు రాళ్లే మిగులుతాయని చెప్పిన న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తెలంగాణ ప్రకటన వెలువడినప్పటి నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నా రు. ఆయనతో పాటు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటన వెలువడిన తర్వాత ‘ఉంటే సమైక్యంగా ఉంచండి... లేదంటే మూడు ముక్కలు చేయండి’ అని అధిష్టానానికి తేల్చిచెప్పారు. జిల్లాలో విలేకరుల సమావేశాల్లోనూ ఇదే మాట చెప్పుకొచ్చారు. తెలంగాణ ఒక్క రాష్ట్రాన్నే ఇవ్వాలని కేంద్రం భావిస్తే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలనే వాదన కూడా తీసుకొచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో బహిరంగంగా సమైక్య మాటలు చెబుతూ ఢిల్లీలో రాయల తెలంగాణకు లాబీయింగ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన రోజు నుంచి ఢిల్లీకే పరిమితమై తనకున్న పెద్దల సంబంధాలతో ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాయల తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాతే ఆయన కర్నూలుకు వస్తారని సన్నిహితులు చెబుతున్నారు. మీటింగ్ సాకుతో దేశం విడిచిన టీజీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుంచి భవిష్యత్ వ్యూహంపై మల్లగుల్లాలు పడుతున్న చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేశ్ ప్రస్తుత పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఏకంగా దేశాన్నే వదిలి పెట్టారు. ఓ సమావేశంలో పాల్గొనే నెపంతో ఆయన బుధవారం అమెరికా పయనమయ్యారు. వచ్చే నెల 5వ తేదీ వరకు అక్కడే ఉంటారు. కర్నూలు జిల్లాకు అన్యాయం చేసే విధంగా 72 జీవో జారీతో పాటు గుండ్రేవుల బ్యారేజీకి మోకాలడ్డుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఆయన జిల్లా వాసుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ రెండు నిర్ణయాలపై తనకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదని ముఖ్యమంత్రిని కూడా ఆయన తప్పు పట్టారు. ఇందులో భాగంగా సీమాంధ్ర ఎమ్మెల్యేల సమావేశానికి హాజరుకాని ఆయన మంగళవారం నాటి ఆంటోని కమిటీ ముందుకు కూడా వెళ్లలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లిపోవడం గమనార్హం. మొత్తంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉద్యమం పట్ల అంటీ ముంటనట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వారిని ఎక్కడిక క్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.