Bairstow
-
పరుగుల పంజా...
37 ఫోర్లు... 42 సిక్సర్లు... ఇరు జట్లు కలిపి ఏకంగా 523 పరుగులు... ఈడెన్ గార్డెన్స్ పరుగుల వరదతో తడిసి ముద్దయింది. ఈ సీజన్ ఐపీఎల్లో భారీ స్కోర్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో మ్యాచ్‌లో ‘రన్’రంగం కొనసాగింది ... అయితే ఈసారి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే కాకుండా రెండో టీమ్ కూడా అంతే బదులుగా జవాబిచ్చింది. ఫలితంగా టి20 చరిత్రలోనే రికార్డు ఛేదనతో మ్యాచ్ ముగిసింది... పేలవ ఆటతో వెనుకబడి ఒక్క విజయం కోసం తపిస్తున్న పంజాబ్ కింగ్స్ అసాధారణ బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించడమే పెద్ద విశేషం.సొంతగడ్డపై 261 పరుగులు చేసి కోల్‌కతా నిశ్చింతగా నిలబడగా... తామూ తగ్గమంటూ రెచ్చిపోయిన కింగ్స్ మరో 8 బంతులు ఉండగానే 262 పరుగులతో ఘన విజయాన్నందుకుంది. వరుస వైఫల్యాల తర్వాత మెరుపు సెంచరీతో చెలరేగిన బెయిర్‌స్టో, యువ ఆటగాడు శశాంక్ ఈ మ్యాచ్‌లో పంజాబ్ హీరోలుగా నిలిచారు. కోల్‌కతా: పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు జూలు విదిల్చింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత అత్యద్భుత ప్రదర్శనతో ఆ జట్టు కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు సాధించి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అసాధ్యంగా అనిపించిన లక్ష్యాన్ని ఛేదించి చూపించారు. శతక భాగస్వామ్యం... సొంత మైదానంలో కోల్‌కతా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. టోర్నీలో తమ ఫామ్‌ను కొనసాగిస్తూ ఓపెనర్లు సాల్ట్, నరైన్ మరోసారి మెరుపు వేగంతో జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరి ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 76 పరుగులు చేసింది.7 ఓవర్లలోపే 3 క్యాచ్‌లు వదిలేసిన పంజాబ్ ప్రత్యర్థికి సహకరించింది. ఈ క్రమంలో నరైన్ 23 బంతుల్లో, సాల్ట్ 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 137/0 కాగా... ఎట్టకేలకు 11వ ఓవర్లో పంజాబ్ తొలి వికెట్ పడగొట్టగలిగింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కూడా నైట్‌రైడర్స్ జోరు తగ్గలేదు. వెంకటేశ్ దూకుడుగా ఆడగా... రసెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ (10 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా ధాటిని ప్రదర్శించారు. దాంతో 15.2 ఓవర్లలో స్కోరు 200 పరుగులకు చేరింది. చివరి 5 ఓవర్లలో కేకేఆర్ 71 పరుగులు సాధించింది. వీర విధ్వంసం... ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, బెయిర్‌స్టో కూడా చెలరేగారు. ప్రభ్‌సిమ్రన్ ఒకదశలో 10 బంతుల వ్యవధిలో 4 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. 18 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. అనుకూల్ వేసిన ఓవర్లో బెయిర్‌స్టో వరుసగా 4, 6, 4, 4, 6తో చెలరేగాడు. వీరిద్దరు 36 బంతుల్లో 93 పరుగులు జోడించిన తర్వాత తొలి వికెట్ తీసి కోల్‌కతా కాస్త ఊరట చెందింది. అయితే 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న తర్వాత బెయిర్‌స్టో మరింత ధాటిగా ఆడాడు. కొద్దిసేపు రోసో (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతనికి సహకరించాడు. ఆరు వరుస ఇన్నింగ్స్‌లలో వైఫల్యాల తర్వాత ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో శతకాన్ని చేరుకున్నాడు. మరోవైపు శశాంక్ ఎక్కడా తగ్గకుండా సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.చమీరా ఓవర్లో అతను కొట్టిన 3 సిక్సర్లతో పంజాబ్ విజయానికి చేరువైంది. ఆఖరి 3 ఓవర్లలో 34 పరుగులు కావాల్సి ఉండగా... హర్షిత్ వేసిన 18వ ఓవర్లోనే శశాంక్ 3 సిక్స్‌లు, ఫోర్ బాదగా 25 పరుగులు రావడంతో పంజాబ్ గెలుపు లాంఛనమే అయింది. బెయిర్‌స్టో, శశాంక్ మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జత చేశారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) స్యామ్ కరన్ 75; నరైన్ (సి) బెయిర్‌స్టో (బి) చహర్ 71; వెంకటేశ్ అయ్యర్ (రనౌట్) 39; రసెల్ (సి) హర్షల్ (బి) అర్‡్షదీప్ 24; శ్రేయస్ (సి) రబడ (బి) అర్‡్షదీప్ 28; రింకూ సింగ్ (సి) అశుతోష్ (బి) హర్షల్ 5; రమణ్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–138, 2–163, 3–203, 4–246, 5–253, 6–261. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–60–1, అర్‡్షదీప్ 4–0–45–2, హర్షల్ 3–0–48–1, రబడ 3–0–52–0, రాహుల్ చహర్ 4–0–33–1, హర్‌ప్రీత్ 2–0–21–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (రనౌట్) 54; బెయిర్‌స్టో (నాటౌట్) 108; రోసో (సి) శ్రేయస్ (బి) నరైన్ 26; శశాంక్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 2 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–93, 2–178. బౌలింగ్: చమీరా 3–0–48–0, హర్షిత్ 4–0–61–0, అనుకూల్ 2–0–36–0, నరైన్ 4–0–24–1, వరుణ్ 3–0–46–0, రసెల్ 2–0–36–0, రమణ్‌దీప్ 0.4–0–9–0. 262 టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా (259/4; వెస్టిండీస్‌పై మార్చి 26న, 2023లో) జట్టు పేరిట ఉంది. 42 ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ గుర్తింపు పొందింది. ఈ సీజన్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో 38 సిక్స్‌లు వచ్చాయి. 24 ఐపీఎల్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా పంజాబ్ కింగ్స్ గుర్తింపు పొందింది. ఈ సీజన్లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో, బెంగళూరు జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ 22 సిక్స్‌లు చొప్పున కొట్టింది.ఐపీఎల్లో నేడుఢిల్లీ X ముంబై (మ. 3:30 నుంచి) లక్నో ్ఠX రాజస్తాన్ (రాత్రి 7:30 నుంచి)స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
100th Test: అశ్విన్, జానీ బెయిర్ స్టో ఎమోషనల్ మూమెంట్స్.. పడిక్కల్ కూడా (ఫొటోలు)
-
‘వంద’కు అటు ఇటు...
ధర్మశాల: టి20ల మెరుపులతో సంప్రదాయ టెస్టు సిరీస్‌లే కుదించబడుతున్నాయి. 3, 5 టెస్టుల సిరీస్ నుంచి 2, 3 టెస్టుల సిరీస్ లేదంటే అనామక జట్లయితే మొక్కుబడిగా ఏకైక టెస్టుతో ఐదు రోజుల ఆటను కానిచ్చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా ధనాధన్ ఆట మాయలో అసలైన ఫార్మాట్‌కు మంగళం పాడి లీగ్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లతోనే కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక క్రికెటర్ 100వ టెస్టు ఆడటం ఆ ఆటగాడికే కాదు... ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌కే మైలురాయిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మరి ప్రత్యర్థి జట్ల నుంచి చెరొకరు 100వ టెస్టు ఆడటమైతే అనూహ్యం! ఆతిథ్య భారత్ నుంచి దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ బృందం నుంచి బెయిర్‌స్టోలకు రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ధర్మశాలలో జరిగే ఐదో టెస్టు చిరస్మరణీయం కానుంది. ఈ ఇద్దరు 99 మ్యాచ్‌లాడి టెస్టు క్రికెట్‌కు అభి‘వంద’నం పలుకేందుకు సిద్ధమయ్యారు. 14వ భారత క్రికెటర్‌గా... భారత క్రికెట్లోనే విజయవంతమైన సారథులుగా వెలుగొందిన అజహరుద్దీన్ (99), ధోని (90)లు కూడా 100 టెస్టులు ఆడలేకపోయారు. జహీర్ ఖాన్ (92) సైతం ‘వంద’ భాగ్యానికి నోచుకోలేకపోయాడు. కొందరికే సాధ్యమైన ఈ మైలురాయిని అందుకోవడానికి అశ్విన్ సిద్ధమయ్యాడు. ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్ ... కుంబ్లే తర్వాత ఈ మైలురాయి అందుకున్న రెండో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2011లో వెస్టిండీస్‌పై ఢిల్లీ టెస్టులో అరంగేట్రం చేసిన అశ్విన్ 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టుల్లో టీమిండియా ఘనవిజయాల్లో భాగమైన అశ్విన్ ... ధోని సారథ్యంలో తురుపుముక్కగా రాటుదేలాడు. 99 టెస్టులాడి 507 వికెట్లు పడగొట్టాడు. 35 సార్లు ఐదేసి వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశాడు. వందో టెస్టు ఆడుతున్న 14వ భారత ఆటగాడిగా అశ్విన్ ఘనత వహిస్తాడు. 17వ ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్‌స్టో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గురించి మనవాళ్లకి, ప్రత్యేకించి హైదరాబాద్ వాసులకి బాగా తెలుసు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా వార్నర్‌తో కలిసి మెరిపించాడు. టెస్టుల్లో నిలకడైన బ్యాటర్. 2012లో వెస్టిండీస్‌తో అరంగేట్రం చేసిన బెయిర్‌స్టో 99 టెస్టుల్లో 36.42 సగటుతో 5974 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 26 అర్ధ శతకాలున్నాయి. కీపర్‌గా 242 క్యాచ్‌ల్ని పట్టడంతో పాటు 14 స్టంపౌట్లు చేశాడు. వందోటెస్టు ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్ ఈ ఘనతకెక్కనున్న 17వ ఇంగ్లండ్ క్రికెటర్. వన్డేల్లో వందో మ్యాచ్ కూడా ధర్మశాలలోనే ఆడిన బెయిర్‌స్టో ఇప్పుడు అక్కడే మరో 100కు సై అంటున్నాడు. ఇది అతిపెద్ద సంబరం. ఎందుకంటే నా కెరీర్లో ఇది గమ్యాన్ని మించిన పయనం. ఎప్పటికీ ప్రత్యేకం. ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాను. ఎంతో నేర్చుకున్నాను. 2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. నాలుగు టెస్టుల్లో 52.64 సగటుతో 14 వికెట్ల పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్నా. కెరీర్ ఆరంభంలోనే పనైపోయిందనుకున్న ప్రతీసారి నన్ను నేను మార్చుకుంటూ సరికొత్త బౌలింగ్ అస్త్రాలతో ఇక్కడిదాకా ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. –అశ్విన్ ఇది నాకు భావోద్వేగానికి గురిచేసే మ్యాచ్. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే అందరూ కలలు కంటారు. నేనైతే ఆ కలల్ని నిజం చేసుకొని కెరీర్లో వందో ఆటకు రెడీ కావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. 8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన నాకు నా తల్లే సర్వస్వం. అందుకే ఈ ఘనత ఆమెకే అంకితం. –బెయిర్‌స్టో -
IND vs ENG: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా?
ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యం... ఒకదశలో స్కోరు 107/0... ఇంగ్లండ్‌దే పైచేయిగా అనిపించింది. ఇంతలో బుమ్రా బౌలింగ్, బ్యాటర్ల స్వయంకృతం కలిపి 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... 109/3... భారత్‌కు పట్టు చిక్కినట్లే కనిపించింది. కానీ రూట్, బెయిర్‌స్టో అనూహ్యంగా ఎదురు దాడికి దిగారు. నాలుగో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్ ఇంత సులువా అన్నట్లుగా పరుగులు సాధిస్తూ దూసుకుపోయారు. వీరిద్దరి 150 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో ఇంగ్లండ్ జట్టు విజయంపై కన్నేసింది. చేతిలో 7 వికెట్లతో చివరి రోజు ఆ జట్టు మరో 119 పరుగులు చేస్తే చాలు... ఇలాంటి స్థితిలో చివరి రోజు భారత్ ఏదైనా అద్భుతం చేయగలదా...ప్రత్యర్థిని కుప్పకూల్చగలదా! బర్మింగ్‌హామ్: భారత్‌తో ఐదో టెస్టులో ఇంగ్లండ్ గెలుపు బాటలో పయనిస్తోంది. 378 పరుగులను ఛేదించే క్రమంలో ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. జో రూట్ (112 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు), బెయిర్‌స్టో (87 బంతుల్లో 72 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 125/3తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది. పంత్ (86 బంతుల్లో 57; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. పంత్ అర్ధసెంచరీ... నాలుగో రోజు ఆటను పుజారా (168 బంతుల్లో 66; 8 ఫోర్లు), పంత్ కొన్ని చక్కటి షాట్లతో ఆరంభించడంతో తొలి 7 ఓవర్లలో 27 పరుగులు వచ్చాయి. అయితే స్టువర్ట్ బ్రాడ్ తన తొలి ఓవర్లోనే పుజారాను అవుట్ చేసి 78 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. భారత్ ఆధిక్యం 300 పరుగులు దాటిన తర్వాత 76 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం ఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, శ్రేయస్ అయ్యర్ (19) అవుట్ కావడంతో భారత్ కాస్త నెమ్మదించింది. రవీంద్ర జడేజా (23) కొద్ది సేపు గట్టిగా నిలబడినా, శార్దుల్ ఠాకూర్ (4) విఫలమయ్యాడు. చివరి వరుస వికెట్లను పెద్దగా ఇబ్బంది పడకుండా వెంటవెంటనే పడగొట్టిన ఇంగ్లండ్ బౌలర్లు భారత్ ఇన్నింగ్స్‌ను తొందరగా ముగించారు. సోమవారం 36.5 ఓవర్లు ఆడిన టీమిండియా మిగిలిన 7 వికెట్లతో 120 పరుగులు సాధించింది. అదిరే భాగస్వామ్యం... భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఓపెనర్లు లీస్, క్రాలీ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు ఆకట్టుకునే షాట్లతో పరుగులు రాబట్టారు. ధాటిగా ఆడిన లీస్ 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చూస్తుండగానే భాగస్వామ్యం 100 పరుగులు దాటడంతో భారత బృందంలో ఆందోళన మొదలైంది. అయితే బంతి ఆకారం దెబ్బ తినడంతో మరో బంతిని తీసుకున్న భారత్ అదృష్టం కూడా మారింది. బుమ్రా బంతిని అంచనా వేయడంలో పొరపడిన క్రాలీ క్లీన్‌బౌల్డయ్యాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు 21.4 ఓవర్లలోనే 107 పరుగులు జోడించారు. టీ విరామం తర్వాత భారత్ మళ్లీ ఆధిక్యం ప్రదర్శించింది. తొలి బంతికే పోప్ (0) అవుట్ కాగా, రూట్ పొరపాటుతో లీస్ రనౌటయ్యాడు. ఈ దశలో పరిస్థితి చూస్తే ప్రత్యర్థిని కూల్చడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే రూట్, బెయిర్‌స్టో భాగస్వామ్యం టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. ఆరంభంలో రూట్ చక్కటి షాట్లు ఆడగా, కుదురుకున్న తర్వాత బెయిర్‌స్టో దూకుడు పెంచాడు. మన బౌలర్లు పూర్తిగా పట్టు కోల్పోవడంతో ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు చేసిన రూట్, బెయిర్‌స్టో విజయానికి బాటలు వేస్తూ పటిష్ట స్థితిలో రోజును ముగించారు. 14 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో విహారి వదిలేశాడు. అది పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో! స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284; భారత్ రెండో ఇన్నింగ్స్: గిల్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 4; పుజారా (సి) లీస్ (బి) బ్రాడ్ 66; విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్ 11; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 20; పంత్ (సి) రూట్ (బి) లీచ్ 57; శ్రేయస్ (సి) అండర్సన్ (బి) పాట్స్ 19; జడేజా (బి) స్టోక్స్ 23; శార్దుల్ (సి) క్రాలీ (బి) పాట్స్ 4; షమీ (సి) లీస్ (బి) స్టోక్స్ 13; బుమ్రా (సి) క్రాలీ (బి) స్టోక్స్ 7; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (81.5 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–75, 4–153, 5–190, 6–198, 7–207, 8–230, 9–236, 10–245. బౌలింగ్: అండర్సన్ 19–5–46–1, బ్రాడ్ 16–1– 58–2, పాట్స్ 17–3–50–2, లీచ్ 12–1–28–1, స్టోక్స్ 11.5–0–33–4, రూట్ 6–1–17–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (బ్యాటింగ్) 76; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 72; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (57 ఓవర్లలో 3 వికెట్లకు) 259. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 13–0–53–2, షమీ 12–2–49–0, రవీంద్ర జడేజా 15–2–53–0, సిరాజ్ 10–0–64–0, శార్దుల్ ఠాకూర్ 7–0–33–0. -
ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న క్రికెటర్లు వీరే
జూన్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లకు ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, జో రూట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ ఉన్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో, రూట్ అదరగొట్టారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో 394 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు,ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల సాధించిన జాబితాలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఇదే సిరీస్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డార్లీ మిచెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో 538 పరుగులు చేసి మిచెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సెంచరీలు, రెండు ఆర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక రూట్ విషయానికి వస్తే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌లలో రూట్ 396 పరుగులు సాధించాడు. అతడు ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ చేశాడు. చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..! -
బెయిర్‌స్టో విధ్వంసకర శతకం.. కివీస్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో సూపర్ శతకంతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136) చెలరేగడంతో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో చేజిక్కించుకుంది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలుపుకు 74.3 ఓవర్లలో 299 రన్స్ చేయాల్సి ఉండగా.. బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 75 నాటౌట్), బెయిర్‌స్టో వేగంగా పరుగులు సాధించి, కేవలం 50 ఓవర్లలోనే జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఇంగ్లండ్ ధీటుగా బదులిచ్చి 539 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌కు 299 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. చదవండి: దినేశ్ కార్తీక్‌ను టీ20 ప్రపంచకప్ ఆడనివ్వను.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
థాంక్యూ బుమ్రా.. బెయిర్‌స్టోను డకౌట్ చేశావ్: జార్వో సంబరం
లండన్: జార్వో 69... ఈ పేరు క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తతం సోషల్ మీడియాలో జార్వో ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ్యాచులు జరుగుతున్నప్పుడు గ్రౌండ్లోకి వచ్చి అతడు ఆటకు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. అయితే జార్వో చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారత బౌలర్ బుమ్రాకి కృతజ్ఞతలు చెబుతూ పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. "నేను జస్ప్రీత్ బుమ్రాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. ఎందుకంటే అతడు జానీ బెయిర్‌స్టోను డకౌట్ చేశాడు. ఎందుకంటే ఈ జానీ బెయిర్‌స్టో నన్ను ఆ రోజు తిట్టాడు.. అందుకే ఇలా" అని రాసుకొచ్చాడు. ఇక జార్వో విషయానికి వస్తే.. లార్డ్స్ టెస్టులో టీమిండియా జెర్సీ వేసుకొని ఫీల్డింగ్ చేస్తూ ''టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి బరిలోకి దిగిన తొలి ఇంగ్లండ్ వ్యక్తిని నేనే '' అంటూ రచ్చ చేశాడు. ఇక మూడో టెస్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి కోహ్లి స్థానంలో ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక నాలుగో టెస్టులో ఏకంగా బౌలర్ అవతారమే ఎత్తాడు. అయితే ఆ సమయంలో క్రీజులో ఉన్న బెయిర్‌స్టోని అమాంతం తోసేసినంత పనిచేశాడు. దీంతో బెయిర్ స్టో అతడిని కోపంతో చూశాడు. అంతకుముందు రెండో టెస్టు సమయంలోనూ బెయిర్ స్టో, జార్వోని తిట్టడం కనిపించింది. చదవండి: Ind Vs Eng: ఆ విషయం నాకు ముందే తెలుసు: శార్దూల్ #Jarvo69 New Video: India's First White Bowler! FULL VIDEO HERE = https://t.co/Mv0QJV3334 pic.twitter.com/zOs0IQHZjS — Daniel Jarvis (@BMWjarvo) September 5, 2021 India's 12th man 😂#ENGvINDpic.twitter.com/bS1OYIl6Tv — The Cricketer (@TheCricketerMag) August 14, 2021 -
గెలుపు ముంగిట హైదరాబాద్ బోల్తా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభ విధ్వంసం ముంబై బౌలింగ్ ముందు ఆవిరైంది. బాధ్యత పంచుకోని బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ బృందం ముందు తలవంచారు. ఒకదశలో 76 బంతుల్లో 84 పరుగులు చేయాల్సిన సునాయాస లక్ష్యాన్ని మ్యాచ్ జరిగేకొద్దీ క్లిష్టంగా మార్చుకుంది. గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పూర్తి 20 ఓవర్లయినా ఆడకుండానే ఓడిపోయింది. చెన్నై: హైదరాబాద్ లక్ష్యాన్ని బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం ముంచేసింది. గెలుస్తుందనున్న మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది. ఐపీఎల్లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (39 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్, విజయ్ శంకర్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. బెయిర్‌స్టో (22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కాసేపే ఉన్నా కసిదీరా బాదేశాడు. రాహుల్ చహర్ (3/19) స్పిన్ మాయాజాలం, బౌల్ట్ (3/28) పేస్ అటాక్ ముంబైని విజేతగా నిలబెట్టాయి. ముంబై కట్టడి ముంబై ఇండియన్స్ ఆట ఓపెనింగ్ జోరుతో మొదలైంది. తర్వాత కట్టడి అయింది. చివరకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కీరన్ పొలార్డ్ (22 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 3 సిక్స్‌లు) ఆఖరి ఓవర్ మెరుపులతో పోరాడే స్కోరుకు చేరింది. భువనేశ్వర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డికాక్ బౌండరీలతో బాదేశాడు. ముజీబ్‌ను రోహిత్ 4, 6తో శిక్షించాడు. ఇదే జోరుతో భువీ ఓవర్లో సిక్సర్ బాదాడు. 5 ఓవర్లలో ముంబై స్కోరు 48/0. ఇంచుమించు ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సాగిన ఇన్నింగ్స్ రోహిత్ (25 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔటయ్యాక నెమ్మదించింది. విజయ్ శంకర్ తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 7వ) ముంబై కెప్టెన్‌ను బోల్తా కొట్టించాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ (6 బంతుల్లో 10; 1 ఫోర్, 1 సిక్స్) వచ్చీ రాగానే బ్యాట్ ఝుళిపించినా అదెంతోసేపు నిలువలేదు. శంకరే అతన్నీ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. రషీద్ ఖాన్ కూడా కట్టడి చేయడంతో ముంబై ఆటలు సాగలేదు. పరుగులు యథేచ్ఛగా రాలేదు. పొలార్డ్ సిక్సర్లు ముంబై హిట్టర్ పొలార్డ్ 14వ ఓవర్లో క్రీజులోకి వచ్చినా... హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలవంచక తప్పలేదు. 15వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. కానీ ఇషాన్ కిషన్ (12) ముజీబ్ ఉచ్చులో పడ్డాడు. హార్దిక్ పాండ్యా (7)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. ఇలా ఎవరొస్తే వారిని హైదరాబాదీ బౌలర్లు తప్పించారు. ఇలా 18 ఓవర్లు ముగిసినా కూడా ముంబై స్కోరు 4 వికెట్లకు 126 పరుగులే! ఆఖరి ఓవర్లో పొలార్డ్ రెండు సిక్స్‌ర్లతో మెరవడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. దంచేసిన బెయిర్‌స్టో రెండు ఓవర్లు పూర్తయినా హైదరాబాద్ 5 పరుగులను మించలేకపోయింది. కానీ మరుసటి ఓవర్ తొలి బంతి నుంచే బెయిర్‌స్టో దంచేసే ఆట మొదలుపెట్టాడు. బౌల్ట్ బౌలింగ్‌లోనైతే తొలి నాలుగు బంతుల్ని వరుసగా 4, 4, 6, 4తో లైన్ దాటించడంతో ఆ ఒక్క ఓవర్లోనే 18 పరుగులొచ్చాయి. నాలుగో ఓవర్ వేసిన మిల్నేపైనా బెయిర్‌స్టో ప్రతాపం కొనసాగింది. రెండు భారీ సిక్సర్లతో మెరిపించాడు. ఈ దశలో వార్నర్ ఆచితూచి ఆడినా కూడా 4.4 ఓవర్లలోనే హైదరాబాద్ స్కోరు 50 పరుగులకు చేరుకుంది. స్కోరు కూడా వడివడిగా సాగిపోయింది. ఈ దశలో దురదృష్టవశాత్తూ బెయిర్‌స్టో హిట్‌వికెట్ కావడం హైదరాబాద్‌ను దెబ్బతీసింది. తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇతను ఔటయ్యే సమయానికి సన్‌రైజర్స్ విజయానికి 76 బంతుల్లో 84 పరుగులు కావాలి. వార్నర్లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్న హైదరాబాద్‌కు ఇది ఏమాత్రం కష్టం కాదు. కానీ అవతలివైపు కాస్త పట్టు బిగించేసరికి హైదరాబాద్ బెదిరిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ చెదిరిపోయింది. స్కోరు బోర్డుపై కెప్టెన్ వార్నర్ (34 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బెయిర్‌స్టో, విజయ్ శంకర్ (25 బంతుల్లో 28; 2 సిక్స్‌లు) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరైన చేయలేకపోయారు. కృనాల్ పాండ్యా, బుమ్రా చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) సబ్–సుచిత్ (బి) ముజీబ్ 40; రోహిత్ (సి) విరాట్ సింగ్ (బి) శంకర్ 32; సూర్యకుమార్ (సి అండ్ బి) శంకర్ 10; ఇషాన్ కిషన్ (సి) బెయిర్‌స్టో (బి) ముజీబ్ 12; పొలార్డ్ (నాటౌట్) 35; హార్దిక్ (సి) విరాట్ సింగ్ (బి) అహ్మద్ 7; కృనాల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–55; 2–71, 3–98, 4–114, 5–131. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–45–0, ఖలీల్ అహ్మద్ 4–0–24–1, ముజీబ్ 4–0–29–2, అభిషేక్ శర్మ 1–0–5–0, శంకర్ 3–0–19–2, రషీద్ 4–0–22–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (రనౌట్) 37; బెయిర్‌స్టో (హిట్‌వికెట్) (బి) కృనాల్ పాండ్యా 43; మనీశ్ పాండే (సి) పొలార్డ్ (బి) రాహుల్ చహర్ 2; విరాట్ సింగ్ (సి) సూర్యకుమార్ (బి) రాహుల్ చహర్ 11; శంకర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 28; అభిషేక్ (సి) మిల్నే (బి) రాహుల్ చహర్ 2; సమద్ (రనౌట్) 7; రషీద్ ఖాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్ 0; భువనేశ్వర్ (బి) బౌల్ట్ 1; ముజీబ్ (నాటౌట్) 1; ఖలీల్ అహ్మద్ (బి) బౌల్ట్ 1; ఎక్స్‌ట్రాలు 137; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 137. వికెట్ల పతనం: 1–67, 2–71, 3–90, 4–102, 5–104, 6–129, 7–130, 8–134, 9–135, 10–137. బౌలింగ్: బౌల్ట్ 3.4–0–28–3, బుమ్రా 4–0–14–1, మిల్నే 3–0–33–0, కృనాల్ పాండ్యా 3–0–30–1, రాహుల్ చహర్ 4–0–19–3, పొలార్డ్ 2–0–10–0. ఐపీఎల్లో నేడు రాయల్ చాలెంజర్స్ X బెంగళూరు కోల్‌కతా నైట్‌రైడర్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
బెయిర్‌స్టో ధనాధన్ ఇన్నింగ్స్
సౌతాంప్టన్: ఆరంభంలో బెయిర్‌స్టో ధనాధన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 82; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు)... చివర్లో స్యామ్ బిల్లింగ్స్ (61 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు), డేవిడ్ విల్లీ (46 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత బ్యాటింగ్ ఇంగ్లండ్‌కు సిరీస్ విజయాన్ని కట్టబెట్టింది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తొలుత ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. కర్టిస్ క్యాంఫర్ (68; 8 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం ఇంగ్లండ్ 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి గెలుపొందింది. ఒక దశలో 131/3తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్... 6 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయింది. అయితే బిల్లింగ్స్, విల్లీ అజేయమైన ఏడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. -
నాకేం తక్కువ: భజ్జీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా తనలో ఇంకా వుందని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వూ్యలో మాట్లాడుతూ ‘నేను ఆడేందుకు సిద్ధం. ఒక వేళ నేను ఐపీఎల్లో బాగా బౌలింగ్ చేస్తే... అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదే చేస్తాగా! బౌలర్లకు ఐపీఎల్ క్లిష్టమైన టోర్నమెంట్. ఎందుకంటే బౌండరీ దూరం తక్కువుండే ఈ టోర్నీల్లో ప్రపంచ మేటి ఆటగాళ్లంతా ఆడతారు. అలాంటి వారికి పవర్ ప్లే, మధ్య ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన నాకు అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా లేదంటారా చెప్పండి’ అని అన్నాడు. ప్రపంచ క్రికెట్లో అన్ని జట్లు బలమైనవి కావని... అదే ఐపీఎల్లో అయితే అత్యుత్తమ ఆటగాళ్లంతా కలసి ఆడటం వల్ల అన్ని జట్లు పటిష్టమైనవని భజ్జీ విశ్లేషించాడు. ‘ఈ లీగ్‌లో బెయిర్ స్టో (ఇంగ్లండ్), డేవిడ్ వార్నర్ (ఆసీస్) వికెట్లను తీయగలిగే నేను అంతర్జాతీయ క్రికెట్లో తీయలేనా? అయితే తిరిగి భారత్‌కు ఆడే అంశం నా చేతిలో లేదు. సెలక్షన్ కమిటీ చూడాలి’ అని ముక్తాయించాడు. -
ఇంగ్లండూ వచ్చేసింది
చెస్టర్ లీ స్ట్రీట్: హాట్ ఫేవరెట్‌గా ప్రపంచ కప్‌ను మొదలుపెట్టి, ఓ దశలో అనూహ్య ఓటములతో ముప్పు కొనితెచ్చుకున్న ఆతిథ్య ఇంగ్లండ్... కీలక సమయంలో జూలు విదిల్చి 1992 తర్వాత ప్రపంచకప్‌లో మళ్లీ సెమీఫైనల్ మెట్టెక్కింది. ఆ జట్టు బుధవారం న్యూజిలాండ్‌ను 119 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (99 బంతుల్లో 106; 15 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (61 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ శతకం చేశాడు. కెప్టెన్ మోర్గాన్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించాడు. నీషమ్ (2/41), హెన్రీ (2/54), బౌల్ట్ (2/56) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో లాథమ్ (65 బంతుల్లో 57; 5 ఫోర్లు) మినహా మరెవరూ నిలవకపోవడంతో న్యూజిలాండ్ 45 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. ఎంతో అనుకుంటే...! 194/1... సరిగ్గా 30 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరిది. అప్పటికి బెయిర్‌స్టో శతకం (95 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. రూట్ (24) కుదురుకున్నాడు. దీంతో 350 పైగానే చేసేలా కనిపించింది. కానీ, వీరిద్దరినీ వరుస ఓవర్లలో ఔట్ చేసి బౌల్ట్, హెన్రీ పరిస్థితిని మార్చివేశారు. మోర్గాన్ నిలిచినా బట్లర్ (11), స్టోక్స్ (11), వోక్స్ (4)లను పెవిలియన్ చేర్చి కివీస్ బౌలర్లు పైచేయి సాధించారు. ప్లంకెట్ (15 నాటౌట్), రషీద్ (16) శక్తిమేర పోరాడి 300 దాటించారు. అంతకుముందు రాయ్, బెయిర్ స్టో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. వీరి ధాటికి 15 ఓవర్లలోపే స్కోరు 100 దాటింది. నీషమ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రాయ్ మరుసటి బంతికి ఔటవడంతో 123 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కివీస్ పోరాడకుండానే... ఓపెనర్లు నికోల్స్ (0), గప్టిల్ (8) పేలవ ఫామ్ కొనసాగడంతో ఛేదనలో న్యూజిలాండ్ ముందే తేలిపోయింది. మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిన పెడుతున్న సమయంలో తొలుత కెప్టెన్ విలియమ్సన్ (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), తర్వాత రాస్ టేలర్ (42 బంతుల్లో 28; 2 ఫోర్లు) దురదృష్టవశాత్తు రనౌటయ్యారు. ఆల్‌రౌండర్లు నీషమ్ (19), గ్రాండ్‌హోమ్ (3) విఫలమయ్యారు. దీంతో కివీస్ ఏ దశలోనూ లక్ష్యాన్ని అందుకునేలా కనిపించలేదు. ఓటమి ఖాయమైన నేపథ్యంలో మిగతావారి పోరాటం పరుగుల అంతరాన్ని తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సాన్‌ట్నర్ (బి) నీషమ్ 60; బెయిర్‌స్టో (బి) హెన్రీ 106; రూట్ (సి) లాథమ్ (బి) బౌల్ట్ 24; బట్లర్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 11; మోర్గాన్ (సి) సాన్‌ట్నర్ (బి) హెన్రీ 42; స్టోక్స్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 11; వోక్స్ (సి) విలియమ్సన్ (బి) నీషమ్ 4; ప్లంకెట్ (నాటౌట్) 15; రషీద్ (బి) సౌతీ 16; ఆర్చర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 305. వికెట్ల పతనం: 1–123, 2–194, 3–206, 4–214, 5–248, 6–259, 7–272, 8–301. బౌలింగ్: సాన్‌ట్నర్ 10–0–65–1; బౌల్ట్ 10–0–56–2; సౌతీ 9–0–70–1; హెన్రీ 10–0–54–2; గ్రాండ్‌హోమ్ 1–0–11–0; నీషమ్ 10–1–41–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 8; నికోల్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వోక్స్ 0; విలియమ్సన్ (రనౌట్) 27; టేలర్ (రనౌట్) 28; లాథమ్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 57; నీషమ్ (బి) వుడ్ 19; గ్రాండ్‌హోమ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 3; సాన్‌ట్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వుడ్ 12; సౌతీ (నాటౌట్) 7; హెన్రీ (బి) వుడ్ 7; బౌల్ట్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (45 ఓవర్లలో ఆలౌట్) 186. వికెట్ల పతనం: 1–2, 2–14, 3–61, 4–69, 5–123, 6–128, 7–164, 8–166, 9–181, 10–186. బౌలింగ్: వోక్స్ 8–0–44–1; ఆర్చర్ 7–1–17–1; ప్లంకెట్ 8–0–28–1; వుడ్ 9–0–34–3; రూట్ 3–0–15–0; రషీద్ 5–0–30–1; స్టోక్స్ 5–0–10–1. -
బెయిర్ స్టో శతక్కొట్టుడు
బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ శతకంతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన బెయిర్ స్టో 90 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఇది బెయిర్ స్టోకు 8వ వన్డే సెంచరీ. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆది నుంచి ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టోలు చేలరేగి ఆడారు. ఈ జోడి తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత జేసన్ రాయ్(66) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రాయ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తరుణంలో బెయిర్ స్టో-జోరూట్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలోనే బెయిర్ స్టో సెంచరీ నమోదు చేశాడు. కాగా, బెయిర్ స్టో 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇంగ్లండ్ 32 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. -
‘ఇంగ్లండ్ ఓడాలని కోరుకుంటున్నారు’
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆసీస్, శ్రీలంక చేతిలో పరాజయాలు చవి చూసిన తర్వాత ఇయాన్ మోర్గాన్ సేనపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్లు మండిపడ్డారు. వరల్డ్‌కప్ వేదికలో ఇంగ్లండ్‌కు ఇది అత్యంత చెత్త ప్రదర్శన అంటూ వాన్ తీవ్రంగా విమర్శించగా, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను చూసి మోర్గాన్ వెనుకడుగు వేశాడు అంటూ పీటర్సన్ ధ్వజమెత్తాడు. ఇలా తమపై వస్తున్న విమర్శలపై ఓపెనర్ బెయిర్ స్టో ఘాటుగా బదులిచ్చాడు. ‘ మా జట్టు సమిష్టి పోరాటంలో ఎటువంటి వెనుకంజ లేదు. వన్డే ఫార్మాట్లో గడిచిన మూడేళ్ల కాలంలో అద్భుతాలు విజయాలు సాధించాం. దాదాపు ప్రస్తుతం ఉన్న జట్టుతోనే నంబర్ ర్యాంకును సుదీర్ఘ కాలం కాపాడుకున్నాం. అసలు వరల్డ్‌కప్‌లో మేము ముందుకు వెళ్లకూడదనే చాలా మంది కోరుకుంటున్నారు. మేము పరాజయం చెందితే చూసి ఆనందించాలని చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఈ తరహా విమర్శలు చేస్తున్నారు’ అని బెయిర్ స్టో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సహచరులకు బెయర్ స్టో విజ్ఞప్తి చేశాడు. వాటిని పట్టించుకోకుండా రిలాక్స్ ముందుకు సాగుదామని పిలుపునిచ్చాడు. ఇంగ్లండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో ఆ జట్టు పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది. వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరాలంటే ఆ రెండు మ్యాచ్‌ల్లో విజయం ఇంగ్లండ్ అవసరం. అందులోనూ భారత్, న్యూజిలాండ్ జట్లతో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌లు మిగిలి ఉన్న తరుణంలో ఆ జట్టు ఎంతవరకూ నెట్టికొస్తుందో అనేది ఆసక్తికరం. -
ఇంగ్లండ్ కెప్టెన్‌పై నిషేధం!
స్లో ఓవర్ రేటు కారణంగా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై ఐసీసీ నిషేధం విధించింది. దీంతో మ్యాచ్ ఫీజులో కోతతో పాటుగా.. శుక్రవారం నాటి వన్డేకు అతడు దూరం కానున్నాడు. ఈ మేరకు ఐసీసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బ్రిస్టల్‌లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైన కారణంగా మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ మోర్గాన్‌పై సస్సెన్షన్ విధించాడు. ఈ క్రమంలో మోర్గాన్ ఫీజులో 40 శాతం, జట్టు సభ్యుల ఫీజులో 20 శాతం కోత పడింది. ఇక మోర్గాన్ స్లో ఓవర్ రేటుకు కారణమవడం ఇది రెండోసారి అని ఐసీసీ పేర్కొంది. గత ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మోర్గాన్ ఇదే విధంగా ప్రవర్తించాడని వెల్లడించింది. కాగా మూడో వన్డేలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెయిర్ స్టో(128; 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడింది. మరో 31 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యం పూర్తి చేసిన ఆతిథ్య జట్టు సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాక్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ హీరో ఫఖర్ జామన్(2) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(151; 131 బంతుల్లో 16 ఫోర్లు, 1సిక్సర్) భారీ శతకం సాధించాడు. ఇమామ్‌తో పాటు అసిఫ్ అలీ(52), సోహైల్(41)లు రాణించడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా, టామ్ కరన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన బెయిర్‌స్టో ప్లేయర్ ఆఫ్ ద అవార్డు దక్కించుకున్నాడు. ఇక శుక్రవారం నాటింగ్హోం వేదికగా నాలుగో వన్డే జరుగనుంది. -
సన్ ధనాధన్
సన్‌రైజర్స్ పుంజుకుంది. సొంతగడ్డపై మరో గెలుపు అందుకుంది. వార్నర్, బెయిర్‌స్టో మెరుపులకు... యువ పేసర్ ఖలీల్ అహ్మద్ నిప్పులు చెలరేగే బంతులు తోడవ్వడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రైజర్స్ పైచేయి సాధించింది. బాదడమే లక్ష్యమన్నట్లుగా బరిలోకి దిగుతోన్న వార్నర్–బెయిర్‌స్టో జోడీ మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ చిన్నబోయింది. సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ జోరు కనబరుస్తోంది. ఓ దశలో హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన రైజర్స్... మళ్లీ విజయాల బాట పట్టింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి హైదరాబాద్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. సునీల్ నరైన్ (8 బంతుల్లో 25; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం హైదరాబాద్ కేవలం 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 161 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), బెయిర్‌స్టో (43 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆంధ్ర పేసర్ పృథ్వీరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని అందుకున్నాడు. అదిరిపోయిన ఆరంభం... తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. నదీమ్ వేసిన రెండో ఓవర్లో లిన్ 4, 6... నరైన్ 6 బాదడంతో నైట్‌రైడర్స్ 18 పరుగులు రాబట్టింది. ఖలీల్ వేసిన మూడో ఓవర్లో మరింతగా చెలరేగిన నరైన్ చివరికి అతనికే చిక్కి పెవిలియన్ చేరాడు. తొలి మూడు బంతుల్లో 6, 4, 4 బాది నాలుగో బంతికి ఔటయ్యాడు. దీంతో 16 బంతుల్లోనే నైట్‌రైడర్స్ తొలి వికెట్‌కు 42 పరుగుల్ని జోడించింది. ఆదుకున్న లిన్... నరైన్ ఔటయ్యాక హైదరాబాద్ బౌలర్లు కోల్‌కతాపై ఒత్తిడి పెంచారు. క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ (3)ను ఖలీల్ ఔట్ చేయగా... నితీశ్ రాణా (11) భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కొద్దిసేపటికే కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6) రనౌటయ్యాడు. దీంతో 73 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి కోల్‌కతా ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఈ దశలో లిన్, రింకూ సింగ్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరును పెంచారు. సందీప్ ఓవర్లో లిన్ బౌండరీ బాదగా... రింకూ సిక్సర్‌తో అలరించాడు. దీంతో 15 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 116/4. తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన రింకూ సింగ్ సందీప్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరుసటి బంతికే ఔటయ్యాడు. అప్పటి వరకు సింగిల్స్‌కే మొగ్గుచూపుతూ 45 బంతుల్లో బౌండరీతో అర్ధశతకాన్ని అందుకున్న లిన్ కూడా విలియమ్సన్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. 18వ ఓవర్ వేసిన రషీద్ కేవలం ఒకే పరుగు ఇచ్చి స్కోరును కట్టడి చేశాడు. 19వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేసిన రసెల్ (9 బంతుల్లో 15; 2 సిక్సర్లు)ను భువీ ఔట్ చేశాడు. చివరి ఓవర్లో కరియప్ప (3 బంతుల్లో 9; 1 సిక్స్) సిక్స్ బాదడంతో కోల్‌కతా 150 పరుగులు దాటగలిగింది. మళ్లీ వారిద్దరే.. అరంగేట్ర బౌలర్ పృథ్వీరాజ్ వేసిన రెండో ఓవర్లో వార్నర్ సిక్సర్‌తో రైజర్స్ మెరుపులు మొదలయ్యాయి. అదే ఓవర్లో బెయిర్‌స్టో రెండు బౌండరీలతో చెలరేగాడు. చావ్లా ఓవర్లో 4, 6తో అతను 11 పరుగులు రాబట్టాడు. ఇక తనవంతు అన్నట్లుగా నరైన్ ఓవర్లో భారీ సిక్సర్‌గా బాదిన వార్నర్... కరియప్పకు 6, 4, 6తో చుక్కలు చూపించాడు. దీంతో పవర్‌ప్లేలో రైజర్స్ 72 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ, లేదా సిక్సర్ అన్నట్లుగా వీరిద్దరూ బ్యాట్ ఝళిపించారు. పాపం కరియప్ప ఈసారి బెయిర్‌స్టోకు దొరికిపోయాడు. అతను వేసిన తొమ్మిదో ఓవర్ తొలి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాదిన బెయిర్‌స్టో నాలుగో బంతికి సింగిల్ తీశాడు. దీంతో ఈ సీజన్లో వార్నర్–బెయిర్‌స్టో జోడీ నాలుగో సెంచరీ భాగస్వామ్యం పూర్తయింది. ఈ క్రమంలో వార్నర్, బెయిర్స్టోలిద్దరూ 28 బంతుల్లోనే అర్ధశతకాల్ని అందుకున్నారు. దీంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 109కి చేరింది. తర్వాత నరైన్ బౌలింగ్‌లో వార్నర్ వరుసగా 4, 6తో జోరు కనబరిచాడు. కానీ మరుసటి ఓవర్లోనే పృథ్వీరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో జట్టు విజయానికి 46 బంతుల్లో 29 పరుగులు అవసరం. మరోవైపు 12, 13 ఓవర్లలో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న బెయిర్‌స్టో... విలియమ్సన్ (8) అండతో 15వ ఓవర్లో చెలరేగిపోయాడు. చావ్లా బౌలింగ్‌లో వరుసగా మూడు బంతుల్లో 4, 6, 6 బాది మరో 30 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. -
సన్‌రైజర్స్ అలవోకగా..
-
సన్‌రైజర్స్ అలవోకగా..
హైదరాబాద్: సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 15 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. డేవిడ్ వార్నర్(67; 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), బెయిర్ స్టో(80 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు)లు సన్‌రైజర్స్ ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 131 పరుగులు సాధించడంతో సన్‌రైజర్స్ సునాయాసంగా గెలుపును అందుకుంది. ఇది సన్‌రైజర్స్‌కు ఐదో విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లలో క్రిస్ లిన్(51; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్(30; 25 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు),సునీల్ నరైన్(25; 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు సాధించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేకేఆర్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శర్మ, రషీద్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఇన్నింగ్స్‌ను క్రిస్ లిన్, సునీల్ నరైన్‌లు ఆరంభించారు. ఒకవైపు క్రిస్ లిన్ కుదురుగా ఆడితే, నరైన్ మాత్రమ బ్యాట్ ఝుళిపించాడు. తాను ఎదుర్కొన్న ఎనిమిది బంతుల్లో ఐదు బంతుల్ని బౌండరీలు దాటించాడు. అయితే నరైన్ మరింత ప్రమాదకరంగా మారుతున్నసమయంలో ఖలీల్ అహ్మద్ బౌల్డ్ చేశాడు. దాంతో కేకేఆర్ 42 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై శుభ్‌మన్ గిల్(3), నితీష్ రాణా(11), దినేశ్ కార్తీక్(6)లు విఫలం కావడంతో కేకేఆర్ 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో లిన్-రింకూ సింగ్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 51 పరుగులు జోడించడంతో పరిస్థితి కాస్త కుదుటపడింది. వీరిద్దరూ 9 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో కేకేఆర్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ఆండ్రీ రసెల్(15;9 బంతుల్లో 2 సిక్సర్లు) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోవడంతో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. -
వార్నర్-బెయిర్ స్టో జోడి మరో రికార్డు
హైదరాబాద్: ఇప్పటికే ఓవరాల్ ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా నిలిచిన డేవిడ్ వార్నర్-బెయిర్ స్టోలు..తాజాగా మరో ఘనతను కూడా సాధించారు. ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు వార్నర్-బెయిర్ స్టోలు వందకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా ఒక సీజన్లో అత్యధిక పరుగుల సాధించిన ఓపెనింగ్ జోడిగా కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలోనే వార్నర్-ధావన్‌ల గత రికార్డు తెరమరుగైంది. 2016 సీజన్లో వార్నర్-ధావన్‌ల జోడి 731 పరుగులు సాధించారు. ఇదే ఇప్పటివరకూ ఐపీఎల్లో ఓపెనింగ్ జోడి సాధించిన అత్యధిక పరుగులు కాగా, దాన్ని బెయిర్ స్టోతో కలిసి ఈ సీజన్లో వార్నరే సవరించడం విశేషం. ఇక టాప్-4 ఓపెనింగ్ భాగస్వామ్యాల్ని చూస్తే మూడింట వార్నర్-ధావన్‌ల జోడినే ఉంది. 2015లో వార్నర్-ధావన్‌ల జోడి 646 పరుగులు సాధించగా, 2017లో 655 పరుగులు సాధించారు. ఇక 2014 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న వార్నర్(2018 సీజన్లో ఆడలేదు) ప్రతీ సీజన్లోనూ ఐదు వందలకు పైగా పరుగులు సాదించిన ఘనత సాధించాడు. 2014 సీజన్లో 528 పరుగులు సాధించిన వార్నర్, 2015లో 562 పరుగులు, 2016లో 848 పరుగులు, 2017లో 641 పరుగులు సాధించాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఐదు వందలకు పైగా పరుగులు నమోదు చేసి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో వార్నర్(67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ 131 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. -
వార్నర్-బెయిర్ స్టో జోడి సరికొత్త రికార్డు
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడు. 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ సీజన్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు కోల్‌కాతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్లపై వార్నర్ హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో అర్థ శతకాన్ని నమోదు చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో మరో సన్‌రైజర్స్ ఓపెనర్ బెయిర్ స్టో 28 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించడంతో సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభం లభించినట్లయ్యింది. కాగా, అర్థ శతకాన్ని సెంచరీగా మలచుకున్నాడు బెయిర్ స్టో. 52 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని చేసిన జోడిగా నిలిచారు. ఈ క్రమంలోనే 2017లో వార్నర్-ధావన్‌లు నమోదు చేసిన 138 పరుగుల భాగస్వామ్యం రికార్డు బద్దలైంది. 185 పరుగుల ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత బెయిర్ స్టో(114;12 ఫోర్లు, 7 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఓవరాల్ ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డు కూడా బ్రేక్ అయ్యింది. 2017లో గౌతం గంభీర్-క్రిస్ లిన్లు 184 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. కేకేఆర్ తరఫున నమోదు చేసిన ఈ ఓపెనింగ్ భాగస్వామ్యమే ఇప్పటివరకూ అత్యధికం. దీన్ని తాజాగా వార్నర్-బెయిర్ స్టోలు బద్దలు కొట్టారు. -
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
బాసెటెర్: వెస్టిండీస్ పర్యటనను ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్‌తో ముగించింది. మూడు టి20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 3–0తో కైవసం చేసుకుంది. ఆఖరి టి20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 13 ఓవర్లలో 71 పరుగులే చేసి ఆలౌటైంది. నలుగురు బ్యాట్స్‌మెన్ క్యాంప్‌బెల్ (11), హోల్డర్ (11), పూరన్ (11), మెక్కాయ్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే (4/7) కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో విండీస్‌ను వణికించాడు. వుడ్ 3, రషీద్ 2 వికెట్లు తీశాడు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు బెయిర్‌స్టో 37, హేల్స్ 20 పరుగులు చేశారు. టి20ల చరిత్రలో విండీస్ చెత్తరికార్డును లిఖించుకుంది. వరుస మ్యాచ్‌ల్లో కనీసం 75 పరుగుల్లోపే ఆలౌటైన జట్టుగా నిలిచింది. రెండో టి20లో విండీస్ 45 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. విల్లేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆల్‌రౌండర్ జోర్డాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
ఇంగ్లండ్‌పై పసికూన పంజా
పసికూన స్కాట్లాండ్ ఇంగ్లండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన ఏకైక వన్డేలో 6 పరుగుల తేడాతో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు కళ్లు చెదిరేరీతిలో శుభారంభాన్ని అందించారు. జాసన్ రాయ్(34), బెయిర్ స్టో(105; 59 బంతుల్లో 12ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. మార్క్ వాట్ బౌలింగ్‌లో జాసన్ రాయ్ వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన అలెక్స్ హేల్స్(52) అర్థసెంచరీతో రాణించాడు. టాప్ ఆర్డర్ రాణించడంతో భారీ లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తారనుకున్న తరుణంలో రూట్(29), కెప్టెన్ మోర్గాన్(20), బిల్లింగ్స్(12) వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో మొయిన్ అలీ(46), ప్లంకెట్(47) పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఇన్నింగ్స్ మొదట్లో ధారాళంగా పరుగులిచ్చిన స్కాట్లాండ్ బౌలర్లు, చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచి వరుసగా వికెట్లు సాధించారు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వ్యాట్ మూడు వికెట్లు సాధించగా.. ఎవాన్స్, బెరింగ్టన్ చెరో రెండు వికెట్లు తీయగా, షరీఫ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన స్కాట్లాండ్కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. బ్యాట్స్‌మెన్ మాథ్యూ క్రాస్ (48; 39 బంతుల్లో 10ఫోర్లు), కెప్టెన్ కైలే కోయెట్జర్ (58; 49బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగడంతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రషీద్ విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కామ్ మెక్లీడ్ (140 నాటౌట్; 94 బంతుల్లో 16ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ నమోదు చేశాడు. చివర్లో జార్జ్ మున్సే(55), బెరింగ్టన్(39) చెలరేగడంతో స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 371 పరుగుల భారీస్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, ప్లంకెట్ తలో రెండు వికెట్లు సాధించగా, మార్క్ వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
బెయిర్‌స్టో విధ్వంసం..సిరీస్ ఇంగ్లండ్ కైవసం
సాక్షి, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 3-2తో సిరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 223 పరుగులకు కుప్పకూలింది. కివీస్ బ్యాట్స్మన్లలో సాంట్నర్(67), నికోలస్(55) తప్ప మిగిలిన ఆటగాళ్లు నిరాశపర్చడంతో స్పల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్‌స్టో విధ్వంసానికి 32.4 ఓవర్లలోని విజయాన్ని అందుకుంది. 58 బంతుల్లోనే సెంచరీ సాధించిన బెయిర్‌స్టో వేగంగా శతకం బాదిన మూడో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. పాకిస్తాన్‌పై బట్లర్ 46 బంతుల్లో శతకం బాదగా.. మొయిన్ అలీ వెస్టిండీస్‌పై 53 బంతుల్లో సెంచరీ సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బెయిర్‌స్టో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేసి హిట్ వికెట్ అయ్యాడు. ఇంగ్లండ్ 229/3 (32.4) న్యూజిలాండ్ 223 ఆలౌట్ (49.5) -
'విజయాల బాట పడితేనే అది సాధ్యం'
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోవడానికి అడుగుదూరంలో నిలిచిన తమ జట్టు అభిమానుల నమ్మకాన్ని గెలవాల్సిన సమయం ఆసన్నమైందని ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో పేర్కొన్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్.. రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఇంకా మూడు టెస్టుల మాత్రమే మిగిలి ఉండటంతో గురువారం పెర్త్‌లో ఆరంభం కానున్న మూడో టెస్టులో విజయం గెలుపు ఇంగ్లండ్‌కు అనివార్యం. దానిలో భాగంగా బ్రిటీష మీడియాతో మాట్లాడిన బెయిర్ స్టో.. కీలకమైన మూడో టెస్టులో గెలవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నాడు. ' ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టుల ఓడిపోయి కష్టాల్లో పడ్డాం. ఇవన్నీ ఆటలో భాగమే..కానీ అభిమానుల నమ్మకాన్ని గెలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మిగతా టెస్టుల్లో గెలిచి గాడిలో పడాల్సిన అవసరముంది. గురువారం నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టులో గెలుపు బాట పడతామని ఆశిస్తున్నా. జట్టులోని సభ్యులంతా సమష్టిగా రాణించి విజయానికి నాంది పలకాలి. విజయాలు సాధిస్తేనే అభిమానుల మనుసు గెలవడం సాధ్యమవుతుంది' అని బెయిర్ స్టో పేర్కొన్నాడు. -
ఆ రికార్డును ఇద్దరూ మిస్సయ్యారు!
చెన్నై: దాదాపు పుష్కరకాలానికి పైగా ఉన్న ఒక అరుదైన రికార్డుకు ఇద్దరు ఇంగ్లండ్ క్రికెటర్లు అత్యంత చేరువగా వచ్చినా దాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఇంగ్లండ్ తరపున ఒక ఏడాది అత్యధిక పరుగులు రికార్డును నెలకొల్పే అవకాశాన్ని తొలుత జో రూట్ కోల్పోగా, ఆ తరువాత దాన్ని బెయిర్ స్టో కూడా మిస్సయ్యాడు. 2002లో ఇంగ్లండ్ జట్టు తరపున టెస్టుల్లో ఒక క్యాలెండర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(1481) పేరిట ఉంది. అదే ఆ జట్టు తరపున ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. అయితేఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జో రూట్ ఆ రికార్డుకు పది పరుగుల దూరంలో నిలిచిపోగా, బెయిర్ స్టో 12 పరుగుల దూరంలో ఆ మైలురాయిని చేరుకునే కోల్పోయాడు. 2016లో జో రూట్ మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీ సాయంతో 1471 పరుగులు నమోదు చేయగా, బెయిర్ స్టో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1469 పరుగులు నమోదు చేశాడు. దాంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్, బెయిర్ స్టోలు వరుసగా రెండు,మూడు స్థానాల్లో నిలిచారు. ఈ మ్యాచ్ లో స్టో 49 పరుగులు చేసి అవుట్ కాగా,రూట్ 88 పరుగులు చేసి అవుటయ్యాడు. -
ఆ రికార్డును బెయిర్ స్టో అధిగమిస్తాడా?
ముంబై: మైకేల్ వాన్.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి. అతని సారథ్యంలో ఇంగ్లండ్ అనేక అద్భుత విజయాలను సాధించింది. ఇంగ్లండ్ జట్టుకు అతనొక సక్సెస్ఫుల్ కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతని 9 ఏళ్ల టెస్టు కెరీర్లో 82 మ్యాచ్‌లు ఆడిన వాన్..147 ఇన్నింగ్స్‌లో 18 సెంచరీలు, మరో 18 హాఫ్ సెంచరీలు సాధించాడు. తన టెస్టు కెరీర్లో 41.44 సగటుతో 5,719 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. అతని అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు 197. అయితే అతని 2002లో ఇంగ్లండ్ తరపున నమోదు చేసిన అత్యధిక పరుగులు రికార్డుకు మరో ఇంగ్లిష్ ఆటగాడు అత్యంత చేరువలో ఉన్నాడు. దాదాపు పుష్కరకాలానికి పైగా వాన్ పేరిట ఉన్న రికార్డు చెరిగిపోవడానికి అతి కొద్ది దూరంలోనే ఉంది. 2002లో వాన్ టెస్టుల్లో 1481 పరుగులను సాధించాడు. అప్పట్నుంచి ఇప్పటివరకూ అదే ఇంగ్లండ్ తరపున ఒక క్యాలెండర్ ఇయర్లో సాధించిన అత్యధిక పరుగుల రికార్డు. ఆ సమయంలో శ్రీలంక, భారత్‌లపై విశేషంగా రాణించి అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, ఇప్పడు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో ఆ రికార్డుకు అత్యంత చేరువగా ఉన్నాడు. భారత్ జరిగిన నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో ఈ ఏడాది 1420 పరుగులను సాధించి ఇంగ్లండ్ నుంచి ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంకా వాన్ కు 61 పరుగుల దూరంలో ఉన్న బెయిర్ స్టో.. భారత్ తో జరిగే ఐదో టెస్టులో రాణిస్తే మాత్రం ఆ రికార్డును తన పేరిటి లిఖించుకునే అవకాశం ఉంది. ఈ పరుగులు చేసే క్రమంలో వాన్ 61.70 సగటును కల్గి ఉండగా, బెయిర్ స్టో 61.73 యావరేజ్‌ను నమోదు చేశాడు. అయితే వాన్ ఆ సంవత్సరంలో 6 సెంచరీలు సాధిస్తే, బెయిర్ స్టో మూడు శతకాలను సాధించాడు. అయితే బెయిర్ స్టో ఎనిమిది హాఫ్ సెంచరీలను ఈ ఏడాది సాధించడం విశేషం. ఇదిలా ఉంచితే గతేడాది మూడు సెంచరీలు,10 హాఫ్ సెంచరీలు చేసిన స్టార్ ఆటగాడు జో రూట్ కు కూడా ఆ రికార్డును అధిగమించలేకపోయాడు. 2015లో జో రూట్ 1385 పరుగులతో సరిపెట్టుకున్న జో రూట్ ఆ రికార్డుకు 96 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇప్పుడు వాన్ రికార్డను బెయిర్ స్టో సాధిస్తాడా?లేదా?అనేది తదుపరి మ్యాచ్‌లో తేలిపోనుంది.