Bank employee
-
కూతురంటే ఎంత ప్రేమో.. 70ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్ : ఉద్యోగ విరమణకాగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలం గడపాలనుకునేవాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. కన్నబిడ్డ దూరమై మిగిల్చిన విషాదం ముందు.. వయసు మీదపడి ఓపిక తగ్గే తరుణంలో ఉరకలేసే ఉత్సాహంతో నీట్ యూజీ 2020 ఫలితాల్లో ర్యాంక్‌ను సాధించారు. ఎంబీబీఎస్ విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలో డాక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు.ఒడిశాకు చెందిన 64ఏళ్ల జే కిషోర్ ప్రధాన్ ఎస్బీఐ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగం. ఇద్దరు కవలలు. అందమైన కుటుంబం. ఏచీకూ చింతాలేదు. ఎందుకో ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.మలిదశలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న కుమార్తెను దూరం చేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది.అదుగో అప్పుడే తనలాగే మరో ఆడబిడ్డ తండ్రికి గుండె కోత మిగిల్చకూడదనుకున్నారు. డాక్టర్‌గా సేవలందించాలని దీక్షబూనారు. ఎస్బీఐ అసిస్టెంబ్ బ్యాంక్ మేనేజర్‌గా పదవీ విరమణ చేసినా డాక్టర్‌గా సేవలందించాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. దృఢ సంకల్పంతో ఓ వైపు విద్యార్థి, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే పెద్దగా ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత కఠినమైన నీట్ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాలనే లక్ష్యం ముందు అవి చిన్నవిగా కనిపించాయి. ముందుగా నీట్ యూజీ 2020 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పోటీ పడ్డారు. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యారు. మొక్కవోని దీక్షతో అనేక సవాళ్లను అధిగమించారు. చివరికి అనుకున్నది సాధించారు.నీట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వచ్చే ఏడాది డాక్టర్‌గా ప్రజా సేవ చేయనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు మీద ఆశలేదు. దూరమైన నా కుమార్తె కోసం నేను బతికి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. ‘దేశ వైద్య విద్యా చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఇంత వయస్సులో వైద్య విద్యార్థిగా అర్హత సాధించి ప్రధాన్ ఆదర్శంగా నిలిచారు’ అని విమ్స్‌ఆర్ డైరెక్టర్ లలిత్ మెహెర్ ప్రధాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.👉చదవండి : ‘మేం ఏపీకి వెళ్లలేం’ -
కొట్టేసిన బంగారం విలువ మినహా మిగతా డబ్బు ఇచ్చేయండి!
సాక్షి, అమరావతి: పదవీ విరమణకు ముందు ఖాతాదారుని లాకరు నుంచి బంగారం చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్న యూనియన్ బ్యాంకు ఉద్యోగికి చోరీకి గురైన బంగారం విలువ మినహా మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆయనపై శాఖాపరమైన విచారణ మూడు నెలల్లో ముగించాలని, ఆలోగా ముగియకపోతే నిలిపివేసిన సొమ్మునూ ఇచ్చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది.పల్నాడు జిల్లా నర్సరావుపేట యూనియన్ బ్యాంకులో 2019 మార్చి 5న ఓ ఖాతాదారుడి లాకర్ నుంచి బంగారం సంచి మాయమైంది. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన బ్యాంకు అధికారులు ఆ బంగారాన్ని ఆ శాఖ ఉద్యోగి నాయక్ చోరీ చేశారని నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాయక్‌పై కేసు నమోదు చేశారు. అదే నెల 31న నాయక్ పదవీ విరమణ చేశారు. ఆ ఏడాది డిసెంబరు 3న బ్యాంకు అధికారులు నాయక్‌పై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.పదవీ విరమణ అనంతరం నాయక్‌కు రావాలి్సన రిటైర్మెంట్ ప్రయోజనాల డబ్బు ఆయన ఖాతాలో జమ చేసినప్పటికీ, క్రిమినల్ కేసు, శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండటంతో వాటిని బ్యాంకు అధికారులు జప్తు చేశారు. ప్రొవిజినల్ పెన్షన్ మినహా మిగిలిన ప్రయోజనాలని్నంటినీ నిలిపేశారు. ఖాతాల జప్తుపై నాయక్ 2022లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బంగారం చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు సమాచారం ఆధారంగా కేసు పెట్టారని తెలిపారు. సింగిల్ జడ్జి బ్యాంకు వాదనను కూడా విన్నారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉన్న నెపంతో పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఆయనకు రావాలి్సన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ విడుదల చేయాలని బ్యాంకు యజమాన్యాన్ని ఆదేశించారు.సింగిల్ జడ్జి ఆదేశాలపై యూనియన్ బ్యాంకు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. యూనియన్ బ్యాంకు తరఫు సీనియర్ న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనరసింహ వాదనలు వినిపిస్తూ.. శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను ఆపే అధికారం తమకుందన్నారు.ఆ ఉద్యోగి బంగారం కాజేయడం వల్ల బ్యాంకుకు ఎంత నష్టం వాటిల్లిందని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ.4.42 లక్షలు నష్టం వాటిల్లిందని లక్ష్మీనరసింహ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నాయక్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను నిలిపేయడాన్ని, బ్యాంకు ఖాతాల జప్తును తప్పుపట్టింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.4.42 లక్షలు మినహా మిగతా సొమ్మంతా విడుదల చేయాలని, బ్యాంకు ఖాతాల నిర్వహణకు నాయక్‌కు అనుమతినివ్వాలని బ్యాంకును ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు సహకరించాలని నాయక్‌ను ఆదేశించింది. -
ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’
దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల అట్రిషన్(ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం)రేటు తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా 31-51 శాతం పెరిగిన ఈ రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో తగ్గినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌లో ప్రధానంగా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల్లో నియామకాలు పెరగడం, తమ కెరియర్ కోసం యువత ఎక్కువగా బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకోవడం ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొవిడ్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంది. లాక్డౌన్ కారణంగా లోన్లు ఇవ్వడం ఆగిపోయింది. ఆ సమయంలో నెలవారీ ఈఎంఐలు చెల్లించేందుకు ఆర్థికశాఖ గడువు ఇచ్చింది. ఫలితంగా బ్యాంకింగ్ నిర్వహణ భారంగా మారింది. దాంతో చాలామంది ఉద్యోగులు ఇతర సంస్థల్లో చేరడం, ఉద్యోగాలు మానడం వంటివి జరిగాయి. గత మూడు త్రైమాసికాల నుంచి బ్యాంకులు మెరుగైన పలితాలు విడుదల చేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో 2023 ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు 31-51 శాతంగా ఉంది. 2023లో ఎంప్లాయి టర్నోవర్ రేటు(ఉద్యోగుల ద్వారా వచ్చే ఆదాయం) 25-45%గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , బంధన్ బ్యాంక్ , ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు కలిసి మార్చి చివరి నాటికి సుమారు 7,30,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం వరకు ఉద్యోగుల అట్రిషన్ రేటు గతంలో కంటే 4.5-14 శాతం పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 2023లో 34.2 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 2024లో 26.9%కి చేరింది. ఐసీఐసీఐ బ్యాంకులో 2023లో 30.9% నుంచి 2024లో 24.5%కు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 2023లో 45.9% నుంచి 2024లో 39.6%కి పడిపోయింది.ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో బ్యాంకులు తమ శాఖల విస్తరణకు పూనుకున్నాయి. దాంతో నియామకాలపై దృష్టి సారించాయి. లోన్ల జారీ క్రమంగా పెరుగుతోంది. యువత తమ కెరియర్ అభివృద్ధికి బ్యాంకింగ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. దాంతో టాప్ బ్యాంకుల్లో చేరుతున్న ఉద్యోగులు సంస్థలు మారడం లేదని, క్రమంగా అట్రిషన్రేటు తగ్గుతుందని చెబుతున్నారు. -
టీడీపీ నేతల వేధింపులకు పల్నాడు ఉద్యోగి బలి
సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులతో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఉద్యోగులను ఎవరినీ వదలకుండా వేధింపులకు తెగపడుతున్నారు. తాజాగా పచ్చ నేతల వేధింపులకు పల్నాడులో ఓ ఉద్యోగి బలి అయ్యారు. పల్నాడు జిల్లాలోని అన్నారం సొసైటీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని టీడీపీ సానుభూతిపరులు దొప్పలపూడి శ్రీనివాసరావు, సురేంద్రబాబులు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు సైతం శ్రీనివాస్ రెడ్డికి రెండు నెలల నుంచి జీతం ఆపేశారు. ఉద్యోగం మానేయాలని ఆ ఉద్యోగంలో తమ వారిని ఎంపిక చేసుకుంటామని ఆయన్ను టీడీపీ నేతలు వేధించారు. వారి వేధింపులు భరించలేక శ్రీనివాస్ రెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి టీడీపీ నేతల వేధింపులు కారణమని కుటుంసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. -
‘వాట్సాప్ గ్రూప్‌లో సూటిపోటి మాటలు.. భరించలేకపోతున్నా!’
ఢిల్లీ: ఆమె ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగిణి. కానీ, పని చేసే చోట ఏదో ఒకరూపంలో వేధింపులు ఎదుర్కొంది. వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి.. ఆమె తినే తీరు, మాట్లాడే విధానం.. ఇలా తోటి ఉద్యోగులు అన్నింటా ఆమెను హేళన చేస్తూ వచ్చారు. అది పరిధి దాటి వాట్సాప్ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్ చేసే స్థాయికి చేరుకుంది. భరించలేక లేఖ బలవన్మరణానికి పాల్పడిందామె.నోయిడా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేసే శివాని త్యాగి ఆత్మహత్య ఘటన ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఘజియాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందామె. ఆరు నెలలపాటు ఆఫీస్‌లో తోటి ఉద్యోగులు ఆమెను వేధించారని, అది భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని శివాని కుటుంబం ఆరోపిస్తున్నారు. వీటికి తోడు..ఆమె గదిలో దొరికిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్ వాట్సాప్ గ్రూప్‌లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్ డీసీపీ గ్యానన్‌జయ్ సింగ్ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్ చేసేందుకే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారాయన.వేధింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. వేధింపులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించింది. కానీ, పైఅధికారులు ఆమెను ఆపుతూ వచ్చారు. అయితే ఓ సహోద్యోగిణితో వాగ్వాదంలో శివాని ఆమెపై చెయ్యి చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఆమెకు తొలగింపు నోటీసులు ఇచ్చారు. శివాని అది తట్టుకోలేకపోయింది అని ఆమె సోదరి మీడియాకు చెబుతూ కంటతడి పెట్టింది. -
గుండెపోటుతో బ్యాంక్‌లోనే కుప్పకూలిన ఉద్యోగి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సడెన్ హార్ట్ ఎటాక్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో 30 ఏళ్ల యువకుడు ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది.మహోబాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 30 ఏళ్ల అగి జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తన ల్యాప్ టాప్‌లో పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన కుర్చీపై కుప్పకూలిపోయాడు. పక్కన కూర్చున్న అతని సహచరులు ఇతరులను అప్రమత్తం చేసి, అతన్ని అతని డెస్క్ నుండి బహిరంగ ప్రదేశంలోకి మార్చారు. వారు అతని ముఖం మీద నీరు చల్లి, మేల్కొలిపే ప్రయత్నం చేశారు. యువకుడికి సీపీఆర్ ఇచ్చేందుకు సైతం యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే యువకుడు బ్యాంక్‌లో కుప్పకూలిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.खौफनाक...लैपटॉप पर काम करते करते कुर्सी पर ही HDFC Bank मैनेजर की मौत हो गई।38 साल उम्र थी। कुछ सेकंड पहले तक कीबोर्ड पर हाथ चला रहे थे। अगले पल कुर्सी पर ही जान निकल गई।यूपी के महोबा ब्रांच में थे।#mahoba#covidvaccines #covid #heartattack #hdfc #uttarpradesh pic.twitter.com/xXuw9Ndhnu— Sunil Yadav B+ (@sunilyadav21) June 26, 2024 -
భర్త వేధింపులతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
అనకాపల్లి: మాకవరపాలెం మండలం కె.వెంకటాపురానికి చెందిన ఎస్బీఐ ఉద్యోగి సిహెచ్. హేమ అరుంధతి (36) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూరల్ ఎస్సై ధనుంజయనాయుడు వివరాల ప్రకారం.. నర్సీపట్నం ఎస్బీఐ(బజార్)లో పనిచేస్తున్న ఆమె భర్త వేధింపులతో మనస్తాపానికి గురైంది. శుక్రవారం సాయంత్రం పెదబొడ్డేపల్లి సెయింట్ ఆన్స్ స్కూల్ వెనుక జీడితోటల్లోకి స్కూటీపై వెళ్లింది. అక్కడ స్కూటీ పార్కు చేసి, తన శవాన్ని చూసిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటూ తెల్లకాగితంపై ఫోన్ నంబరు రాసింది. తన దగ్గర చున్నీతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మొదటి భర్త చనిపోవడంతో రాజమహేంద్రవరానికి చెందిన సహాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి వేధింపులు భరించలేక గతేడాది నవంబర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. మృతురాలికి మూడేళ్ల బాబు, తల్లిదండ్రులు ఉన్నారు. సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని పీఎన్‌కాలనీలో నివాసముంటున్న ఓ బ్యాంకు ఉద్యోగిని ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం రెండో పట్టణ ఎస్ఐ కె.లక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పీఎన్‌కాలనీ మొదటి లైన్ సాయిసత్య అపార్ట్మెంట్లో ఉరిటి స్వప్నప్రియ(39) తల్లి సరళ, సోదరుడు కిరణ్బాబులతో కలిసి నివాసముంటోంది. స్వప్నప్రియ గార మండలం స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచి ఆఫీసులో డిప్యూటీ మేనేజరు/అకౌంటెంట్‌గా , కిరణ్‌బాబు శ్రీకాకుళం ఎస్బీఐ రీజియన్‌లో పనిచేస్తున్నారు. వీరి స్వగ్రామం నరసన్నపేట సమీపంలోని యారబాడు. స్వప్నప్రియకు 2010లో శ్రీకాకుళానికి చెందిన కుప్పలి ప్రదీప్‌కుమార్‌తో వివాహం జరిగినా అభిప్రాయ భేదాలు రావడంతో 2019లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తాను ఒంటరిననే బాధతో ఉండేవారు. తనఖా బంగారం మాయమవ్వడంతో.. గార ఎస్బీఐలో ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.3 కోట్ల బంగారం మాయమైందని, దీని వెనుక డిప్యూటీ మేనేజర్/అకౌంటెంట్‌గా ఉన్న ఓ మహిళా ఉద్యోగినితో పాటు కొందరి హస్తముందని కొన్ని పత్రికల్లో(సాక్షి కాదు) వరుస కథనాలు వస్తున్నాయి. ఖాతాదారులు బ్యాంకు వద్ద ఆందోళనకు దిగడం, చివరకు బుధవారం గార సీఐ కామేశ్వరరావు సమక్షంలో రీజనల్ మేనేజర్ ఖాతాదారులకు బంగారం ఇప్పించే బాధ్యత తనదని సర్దిచెప్పి వెళ్లిపోయారు. ఆ కథనాలతో మనస్థాపం చెంది.. పత్రికల్లో వస్తున్న కథనాలు తన గురించే అని ఇంటి వద్ద తల్లితో చెప్పి స్వప్నప్రియ తీవ్రంగా మనోవేదన చెందేదని, సోషల్ మీడియాలో కూడా కావాలనే తనపై తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని స్వప్నప్రియ వాపోయేది. ఈ క్రమంలో ఈ నెల 24న బయటకు వెళ్లి వచ్చిన స్వప్నప్రియ వాంతులు చేయడంతో తల్లి ఆందోళన చెందింది. ఏమైందని అడగ్గా.. తన బతుకు ఇలా అయిపోయిందని ఏడుస్తూ పడుకుంది. మరుసటి రోజు నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చి ఎలుకల మందు తాగానని తల్లితో చెప్పింది. అప్పటి నుంచి మందులు వాడుతున్నా వాంతులు తగ్గలేదు. ఈక్రమంలో ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా బుధవారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వప్నప్రియ స్వగ్రామం యారబాడుకు తరలించనున్నట్లు ఎస్ఐ లక్ష్మి చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
400 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు!
ముంబై నగర పరిధిలోని బాంద్రా-వోర్లి వంతెనపై నుంచి సముద్రంలోకి దూకి ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతున్ని సెంట్రల్ ముంబైలోని పారెల్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం (నవంబర్ 10) రాత్రి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుంచి పారెల్‌కు ట్యాక్సీ బుక్ చేసుకున్న ఆకాశ్ సింగ్.. బాంద్రా-వోర్లి సముద్ర వంతెన మీదకు వెళ్లాలని ట్యాక్సీ డ్రైవర్‌కు చెప్పాడు. ట్యాక్సీ వంతెన మీదకు రాగానే తన ఫోన్ పడిపోయిందని చెప్పిన ఆకాశ్ సింగ్ డ్రైవర్ ట్యాక్సీ ఆపగానే దిగి సముద్రంలోకి దూకేశాడు. ఈ వంతెన ఎత్తు సుమారు 400 అడుగులు ఉంటుంది. ఆకాశ్‌సింగ్ మృతదేహం అర్ధ రాత్రి తర్వాత పైకి తేలిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఆకాశ్‌సింగ్ తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడని, మూడు నెలల క్రితం ప్రియురాలితో విడిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. -
అత్తారింటికి వెళ్తుండగా వెనకే వచ్చిన మృత్యువు.. భార్య, బిడ్డలను చూడకుండానే
తూర్పు గోదావరి: అత్తారింట్లో ఉన్న భార్య, పాపలను చూసి వద్దామని బైక్‌పై బయలు దేరిన బ్యాంకు ఉద్యోగిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి గామన్ బ్రిడ్జి రోడ్డుపై ఆటోనగర్ వద్ద ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన చిట్టూరి అజయ్ (33) సీతానగరం ఎస్బీఐలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతనికి రెండేళ్ల కిందట వివాహమైంది. 4 నెలల పాప కూడా ఉంది. ఈ క్రమంలో పెదపూడి మండలం కడకుదురులో అత్తారింటి వద్ద ఉన్న భార్య, పాపలను చూసి వద్దామని ఆదివారం ఉదయం ఇంటి నుంచి బైకుపై బయలు దేరాడు. గామన్ బ్రిడ్జిపై వెళ్తున్న అతను ఆటోనగర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొని అతని పైనుంచి వెళ్లిపోయింది. దీంతో శరీరంతో పాటు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై సుధాకర్ తెలిపారు. వాహనం తలపై నుంచి వెళ్లడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులా మారింది. కష్టాలు తీరేవేళ..: ఇద్దరు బిడ్డలు అందివచ్చారు.. కష్టా లు తీరిపోతాయనుకుంటున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఇలా జరిగిందంటూ పెద్ద కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి బాపన్నకు 10 సెంట్ల భూమి ఉంది. కొంతకాలం కౌలు రైతుగా పనిచేసిన ఆయన వృద్ధాప్యంతో వ్యవసాయం చేయడం లేదు. ఇద్దరు మగ సంతానంలో ఒకరు ఎస్బీఐలో, మరొక రు కాటవరం ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నారు. అ జయ్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట
బెంగళూరు: కర్ణాటకలో ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆన్లైన్లో రమ్మీ వంటి గ్యాంబ్లింగ్ గేమ్స్‌కు బానిసైన అతడు మొత్తం రూ.2.36 కోట్లు తన స్నేహుతుడి ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. వాటితో తరచూ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడాడు. బ్యాంకుకు రూ.2.36 కోట్లు నష్టం రావడంతో షాక్ అయిన మేనేజర్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ మేనేజరే ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరేశ్ కేషిమఠ్(28) కర్ణాటక హవేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకు శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడి వాటికి బానిసయ్యాడు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం ప్రతిరోజు రూ.5లక్షలు బదిలీ చేసే అధికారం ఇతనికి ఉంటుంది. దీన్నే అదునుగా తీసుకొని ఖాతాదారుల ఖాతాల నుంచి తరచూ రూ.5లక్షలు తన స్నేహితుడు మహంతేషయ్య పీ హిరేమఠ్కు బదిలీ చేశాడు. వాటితో రమ్మీ, ఇతర ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఇలా చేస్తున్నాడు. కొన్ని నెలలపాటు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఇటీవల ఈ బ్రాంచ్‌లో ఆడిటింగ్ నిర్వహించినప్పుడు రూ.2.36కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో మేనెజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసిస్టెంట్ నిర్వాకం బహిర్గతమైంది. గతేడాది ఆగస్టు నుంచి జరగుతున్న ఈ వ్యవహారం గురించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియడం గమనార్హం.మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేషిమఠ్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లకు పైగా మోసం జరగడంతో ఈ కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. -
‘అప్పు తీర్చకపోతే చావు’
మైసూరు: అప్పు కంతు చెల్లించకపోతే చావు అంటూ మహిళా రైతును ఒక బ్యాంకు ఉద్యోగి దూషించాడు. నీవు చస్తేనే నీ రుణం మాఫీ అవుతుందంటూ హేళన చేసిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా కొళఘట్ట లో జరిగింది. లతా అనే మహిళ రైతు ప్రైవేటు బ్యాంకులో రూ. 50 వేల రుణం తీసుకుంది. వారానికి రూ. 500 కంతు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో రుణం వసూలు కోసం వచ్చిన బ్యాంకు సిబ్బంది సురేశ్ నడి రోడ్డుపై ఆమెను దూషించాడు. వెంటనే రూ. 500 చెల్లించాలని పట్టుబట్టాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోలేదు. అప్పు తీర్చలేకపోతే చావు... అప్పుడే నీ రుణం మాఫీ అవుతుందని అందరి ఎదుట దూషించాడు. చదవండి: భారత ఆర్మీని పెళ్లికి ఆహ్వానించిన నవజంట.. సైన్యం రిప్లై ఇదే.. -
బ్యాంక్ మేనేజర్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్.. మచిలీపట్నంలో ఏం జరిగింది?
యానాం: యూకో బ్యాంకు మేనేజర్ విస్సాప్రగడ సాయిరత్న శ్రీకాంత్(33) ఆత్మహత్య ఘటన నేపథ్యంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. బ్రాంచ్‌లో బ్యాలెన్స్ షీట్లో రూ.29 లక్షలు తక్కువగా వుందని, ఆ సొమ్మును ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ అనధికారికంగా తీసుకున్నారని పేర్కొంటూ బుధవారం యానాం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బడుగు కనకారావుకు అసిస్టెంట్ మేనేజర్ కోమలి, క్యాషియర్ విమలాజ్యోతి ఫిర్యాదు చేశారు. మంగళవారం తాము బ్రాంచ్ తెరిచేటప్పటికి కంప్యూటర్ నగదు తక్కువగా చూపిందని పేర్కొన్నారు. ఆ కోణంలో బ్యాంకు ఉన్నతాధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. బ్రాంచ్‌లో ఉన్న రికార్డుల తనిఖీ, ఆడిటింగ్ సైతం చేసినట్లు తెలిసింది. మచిలీపట్నంలో రుణ గ్రహీతల అప్పులు తీర్చేందుకు.. మచిలీపట్నం బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసేటప్పుడు ఇచ్చిన రుణాలను సంబంధిత రుణగ్రహీతలు తీర్చకపోవడంతో తానే బ్యాంకు నిబంధనల ప్రకారం తీర్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురి దగ్గర మేనేజర్ శ్రీకాంత్ అప్పులు చేసినట్టు, వాటికి వడ్డీలు సైతం కడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యానాం బ్రాంచ్‌లో ఘటన చోటు చేసుకుంది. మా ఒత్తిడి లేదు యానాం యూకో బ్రాంచ్ మేనేజర్‌పై రుణాల రికవరీ కోసం బ్యాంకు యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందన్న వార్తల్లో వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమని ఆ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్ మృతికి చింతిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బ్యాంకు లావాదేవీలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
Loan Apps: నలుగురికి చెప్పాల్సిన బ్యాంకు ఉద్యోగే ఇలా చేశాడేంటి?
బెంగళూరు: ఇన్స్టాంట్ లోన్ యాప్‌ల వలలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే.. కొందరు అన్నీ తెలిసి కూడా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. అయితే.. నలుగురికి చెప్పాల్సిన ఓ బ్యాంకు ఉద్యోగి లోన్‌యాప్ ఉచ్చులో పడి చనిపోవటం గమనార్హం. కేవలం రూ.40వేలు లోన్‌యాప్‌ల ద్వారా తీసుకుని, వారి వేధింపులు తట్టుకోలేక ట్రైన్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెంగరీ జిల్లాలోని దొడ్డగొల్లారహట్టి గ్రామానికి చెందిన టీ నంద కుమార్(52) అనే వ్యక్తి కోఆపరేటివ్ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ బెంగళూరులోని నయాందహల్లి సమీపంలో సోమవారం రైలు కింద పడి చనిపోయారు. లోన్‌యాప్‌తో పాటు తనకు డబ్బులు ఇచ్చిన స్థానికుల వేధింపులు తట్టుకోలేకే జీవితాన్ని ముగిస్తున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు నంద. తనకు మెయిల్ ద్వారా లోన్‌యాప్ ప్రతినిధులు అసభ్యకర సందేశాలు పంపారని, అలాంటి వాటిని నిషేధించాలని సూసైడ్ నోట్లో కోరినట్లు బెంగళూరు నగర రైల్వే పోలీసులు తెలిపారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక మొదట లోన్‌యాప్ ద్వారా రూ.3వేలు అప్పు తీసుకున్నారు నంద. ఈ క్రమంలో లోన్‌యాప్ ఉచ్చులో పడిపోయారు. పాత లోన్ తీర్చేందుకు మరో యాప్ ద్వారా రుణం తీసుకున్నారు. వివిధ యాప్‌ల ద్వారా మొత్తం రూ.36,704 రుణం తీసుకున్నారు నంద. వాటిని వసూలు చేసుకునేందుకు అసభ్యకర మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేశారు యాప్ ప్రతినిధులు. దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నంద తన వద్ద రూ.3.6 లక్షల అప్పు చేశాడని, కేవలం రూ.1.5 లక్షలు చెల్లించినట్లు ఓ మహిళ అతడిపై కేసు పెట్టింది. మొత్తం రూ.5 లక్షలు ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం నంద ఆత్మహత్య చేసుకున్న క్రమంలో 46 లోన్‌యాప్‌లు సహా మహిళపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదీ చదవండి: తినేందుకు రోటీ ఇవ్వలేదని గొడవ.. కత్తితో పొడిచి హత్య -
దారి తప్పడంతో.. దొంగ అనుకుని బ్యాంక్ ఉద్యోగిని కొట్టి చంపాడు
బనశంకరి(బెంగళూరు): ఎక్కడో చత్తీస్ఘడ్ నుంచి వచ్చాడు. ఇక్కడి భాష తెలియదు, ఊరు తెలియదు, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు బ్యాంకు ఉద్యోగిని రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ సంఘటన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మారతహళ్లి వద్ద వంశీ సిటాడెల్ అపార్టుమెంట్ వద్దకు ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెళ్లాడు. సెక్యూరిటీగార్డు శ్యామనాథ్ అతన్ని ఎవరని ఎన్నిసార్లు అడిగినా జవాబివ్వలేదు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో సెక్యూరిటిగార్డు రాడ్‌తో అతడి తలపై దాడిచేశాడు. తలకు తీవ్రగాయం కావడంతో వ్యక్తి అక్కడే మృతిచెందారు. హతుడు చత్తీస్ఘడ్ చెందిన బ్యాంకు ఉద్యోగి కాగా శిక్షణ తీసుకోవడానికి బెంగళూరుకు వచ్చినట్లు తెలిసింది. స్నేహితులతో విందులో పాల్గొని ఒక్కడే స్నేహితుడి రూమ్ కు నడుచుకుని బయలుదేరాడు. మొబైల్లో అడ్రస్ అడుగుతూ వస్తుండగా అది బ్యాటరీ అయిపోయి స్విచాఫ్ అయ్యింది. దీంతో దారి తప్పి వేరే అపార్టుమెంట్ వద్దకు వెళ్లాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు దాడి చేసినట్లు తెలిసింది. హెచ్ఏఎల్ పోలీసులు పరారీలో ఉన్న శ్యామ్‌నాథ్‌ను ను ఆదివారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. చదవండి: 11ఏళ్ల అనంతరం వీడిన మర్డర్ మిస్టరీ! -
ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా!
పుత్తూరు రూరల్(చిత్తూరు జిల్లా): రెండేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు.. ఆరు నెలల క్రితం తల్లి కూడా కన్నుమూసింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయింది. తల్లిదండ్రులు లేరన్న బాధతో బ్యాంకు ఉద్యోగిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పుత్తూరులో బుధవారం వెలుగుచూసింది. సీఐ లక్ష్మీ నారాయణ కథనం మేరకు.. స్థానిక రెడ్డిగుంట వీధిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్‌గా పనిచేస్తున్న వి.సరస్వతి(38), తన అన్న సుబ్రమణ్యంతో కలిసి నివసిస్తోంది. వీరిరువురూ అవివాహితులే. తండ్రి గోవిందస్వామి విశ్రాంత అటవీ ఉద్యోగి. చదవండి: తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి.. రెండేళ్ల క్రితం తండ్రి, జనవరిలో తల్లి కృష్ణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగేళ్లుగా తల్లిదండ్రులను కాపాడుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరిగి, చివరకు వారిని కోల్పోవడంతో మానసికంగా సరస్వతి కుంగిపోయింది. అన్న సుబ్రమణ్యం మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సరస్వతి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి పిన్నమ్మ ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నన్ను ఒంటరిని చేసి అమ్మనాన్నలతో పాటు వెళ్లిపోయావా చెల్లీ.. అంటూ అన్న సుబ్రమణ్యం ఆక్రందన అందరిని కలిచివేసింది. ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే..! ఈ పాడుబడిన బావిని పూడ్చేసే సమయంలో టీడీపీ నాయకులు అడ్డురాకుండా ఉండివుంటే యువతి బతికేది కదా అంటూ స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి ఆత్మహత్య చేసుకున్న బావి రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంటూ దుర్వాసన వెదజల్లుతోంది. స్థానికుల కోరిక మేరకు 24వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కె.ఏకాంబరం ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డికి బావిని పూడ్చివేయాల్సిందిగా వినతిపత్రం అందించారు. స్పందించిన కమిషనర్ జనవరి 31వ తేదీ సిబ్బందితో బావిని పూడ్చివేసేందుకు ఉపక్రమించారు. అదే సమయంలో టీడీపీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ యుగంధర్ తన అనుచరులతో వచ్చి బావిని పూడ్చేందుకు వీలులేదంటూ అడ్డుకున్నారు. విధులకు అడ్డుతగలడమే కాకుండా దుర్భాషలాడారని కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుండా ఉంటే యువతి చావుకు ఆ బావి సాక్షి భూతంగా నిలిచేది కాదని మహిళలు వాపోయారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఉద్యోగి ఘనకార్యం.. రిచ్‌గా పెళ్లి చేసుకునేందుకు ఏం చేశాడంటే..?
యశవంతపుర(కర్ణాటక): వైభవంగా పెళ్లి చేసుకోవడానికి తను పనిచేసే బ్యాంకునే దోచుకున్నాడో ఘనుడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావి జిల్లా సవదత్తి తాలూకా మురుగోడు డీసీసీ బ్యాంక్‌లో మార్చి 6న రూ.ఆరు కోట్ల విలువ గల బంగారం, నగదును దొంగలు దోచుకెళ్లారు. అయితే కేసు విచారించిన పోలీసులు బ్యాంక్‌లో పనిచేస్తున్న క్లర్క్ బసవరాజు సిద్ధంగప్ప హుణిసికట్టి (30), అతడి అనుచరులు సంతోష్ కాళప్ప కుంబార (31), గిరీశ్ (26) దొంగతనం చేశారని తేల్చారు. చదవండి: కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే? దీంతో వీరిని అరెస్టు చేసి.. నాలుగుకోట్ల 20 లక్షల నగదు, రూ. కోటి 63 లక్షల విలువచేసే మూడు కేజీల బంగారు నగలను, ఒక కారు, బైకును స్వాదీనం చేసుకున్నారు. నకిలీ తాళాల్ని ఉపయోగించి క్లర్క్ బసవరాజు, అతని స్నేహితులతో కలిసి బ్యాంకు దోపిడీ చేసినట్లు తేలింది. దోచుకున్న సొత్తును జిల్లాలోని రామదుర్గ తాలూకా తోరణగట్టి గ్రామంలోని వ్యవసాయతోటలో పాతి పెట్టారు. తన పెళ్లిని వైభవంగా చేసుకోవడానికి డబ్బు కోసం ఈ చోరీకి పాల్పడినట్లు క్లర్క్ విచారణలో తెలిపాడు. -
బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం.. చిన్న విషయాలకే భయం అంటూ..
సాక్షి, ప్రకాశం (టంగుటూరు): భరించలేని పని ఒత్తిడి ఓ వైపు.. ఆందోళన మరో వైపు వెరసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి కారణమైంది. ఈ సంఘటన స్థానిక వాణి నగర్ మొదటి వీధిలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, ఉద్యోగులు కథనం ప్రకారం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన ఐశ్వర్య నర్నత్ రణ్‌దేవ్ (24) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బంధువులు పిన్ని, బాబాయి పెంచి పెద్ద చేశారు. ఉన్నతంగా చదువుకున్న ఐశ్వర్య పట్టుదలతో రెండేళ్ల క్రితం బ్యాంక్ ఉద్యోగం సాధించింది. ఆరు నెలల క్రితం టంగుటూరి సిండికేట్ బ్యాంక్ శాఖలో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధుల్లో చేరింది. అయితే చిన్న పనులకే ఒత్తిడి గురవుతుండేదని తోటి సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం అధికారులకు రిజైన్ పత్రాలను అందించింది. కానీ ఉద్యోగం లేకపోతే ఏం చేయాలో తెలియక.. ఈ పని చేయలేక మానసికంగా కుంగిపోయింది. ఇటువంటి పరిస్థితుల మధ్య తాను నివసిస్తున్న బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. బంధువులు ఫోన్ చేయడంతో.. ఐశ్వర్య పిన్ని, బాబాయ్‌లు రోజూ ఐశ్వర్యతో ఫోన్లో మాట్లాడుతుంటారు. అలాగే ఘటన జరిగిన రోజు ఉదయం 8 గంటలకు ఫొన్ చేయగా తీయలేదు. దీంతో బ్యాంక్ మేనేజర్ కాకర్ణ కృష్ణ ప్రసాద్‌కు ఫోన్ చేశారు. మేనేజర్ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఉదయం 9: 30 గంటలకు అటెండర్‌ను ఆమె ఇంటికి పంపించారు. అతను ఇంటి యజమానితో కలిసి పైకి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా పలక్కపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఉరి వేసుకొని అప్పటికే మృతి చెందింది. ఎస్సై ఖాదర్ బాషా, సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించారు. యువతి కుడి చేతి మణికట్టుకు ఉన్న దారంలో ఉంచిన లెటర్, ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి ఎవరూ కారణం కాదని.. పని ఒత్తిడి, చిన్న విషయాలకే భయం అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. బ్యాంక్ మేనేజర్ కాకర్ణ కృష్ణ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ తరలించారు. -
బ్యాంకు ఉద్యోగి వక్రబుద్ధి.. జల్సాలు.. అడ్డదారులు.. చివరికి కటకటాలు
అతనో బ్యాంకు ఉద్యోగి. జల్సాలకు అలవాటు పడ్డాడు. వక్రబుద్ధి చూపించాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. తాను పనిచేస్తున్న బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో నగదు చోరీ చేయించాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): ఏటీఎంలో నగదు చోరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఏటీఎంలో రూ.4.95 లక్షలు చోరీకి గురైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తిరుపతి వేదాంతపురం అగ్రహారానికి చెందిన నారగంటి నరేష్(32) డీసీసీబీ బ్యాంకు అధికారిగా పనిచేస్తున్నాడు. అతను గతంలో పనిచేసిన బ్యాంకు ఏటీఎం తాళం దొంగలించి ఇంట్లో పెట్టుకున్నాడు. అలాగే ఏటీఎంల పాస్‌వర్డ్‌ను కూడా తెలుసుకున్నాడు. తాను చోరీ చేస్తే సీసీ పుటేజీల్లో దొరకిపోతానని భావించాడు. గుర్తుతెలియని వ్యక్తులతో చోరీ చేయించాలని నిర్ణయించుకుని తన స్నేహితుడైన తిరుపతి జీవకోనకు చెందిన బట్టల వినోద్(25)కు చెప్పాడు. అతను నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన కొట్టు జయసూర్య(24)కు చెప్పాడు. అతని ద్వారా నెల్లూరు జిల్లా డక్కిలి మండలం, ఆల్తూరుపాడుకు చెందిన పల్లి వంశీ(23), నెల్లూరు నగర్ బీవీనగర్‌కు చెందిన మహ్మద్ రమీజ్(23)తో ఒప్పందం చేసుకున్నారు. నరేష్, వినోద్ పథకం ప్రకారం అందరూ కలిసి 13వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న డీసీసీబీ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.4,95,700లు చోరీ చేశారు. అనంతరం 14వ తేదీ రాత్రి పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఉన్న డీసీసీ బ్యాంకు ఏటీఎంలో రూ.11,49,900 చోరీ చేశారు. పోలీసులు నిందితుడైన నారగంటి నరేష్, వినోద్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వీరు ఇప్పటి వరకు రూ.15,20,380 చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.11,49,900 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఒక కారు, బైక్ స్వా«దీనం చేసుకున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి.విశ్వనాథ్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ.కోటికి పైగా బ్యాంకు సొమ్ము మాయం
కారంపూడి(మాచర్ల): కారంపూడి ఎస్బీఐ బ్రాంచ్ ఉద్యోగి ఒకరు సుమారు కోటి రూపాయలు బ్యాంకు సొమ్ము స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంకులో గోల్డ్ లోన్ అధికారిగా పనిచేస్తున్న సేవ్యానాయక్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గత నాలుగో తేదీ ఒక ఫేక్ అకౌంట్ ద్వారా నగదు స్వాహా విషయాన్ని గుర్తించిన బ్యాంక్ చీఫ్ మేనేజర్ అప్రమత్తమై పై అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్బీఐ టీం, రీజినల్ ఆఫీస్ అధికారులు రంగంలోకి దిగి శోధించడంతో నగదు స్వాహా పర్వం వెలుగు చూసింది. గత మూడు నెలలుగా బ్యాంకు ఏటీఎంలలో పెట్టడానికి బ్యాంకు నుంచి తీసుకెళ్లిన నగదులో కొంత స్వాహా చేస్తూ మిగతాది ఏటీఎం మిషన్లలో పెడుతూ సేవ్యానాయక్ నగదు స్వాహాకు పాల్పడ్డాడు. చదవండి: భక్తుడిలా రెక్కీ .. రాత్రికి చోరీ! ఇలా మూడు నెలల కాలంలో సుమారు రూ.కోటికి పైగా దారి మళ్లించాడు. క్రికెట్ బెట్టింగులకు బానిసగా మారిన సేవ్యానాయక్ బ్యాంకు సొమ్ముతో క్రికెట్ బెట్టింగులు ఆడాడంటున్నారు. అయితే ఇతని స్వాహా పర్వాన్ని అధికారులు గత నాలుగో తేదీనే గుర్తించి, ఖాతాలన్నింటినీ జల్లెడ పట్టి ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకున్నారు. సేవ్యానాయక్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై వివరణ ఇవ్వడానికి బ్యాంకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. -
బ్యాంక్ ఉద్యోగి: భార్య వేధిస్తోంది.. చనిపోతున్నా..
గోల్కొండ: ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షేక్‌పేట్‌కు చెందిన సంతోష్(36) నగరంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 2013లో పాత నగరానికి చెందిన కళ్యాణితో పెళ్లి అయింది. వీరికి అభిరామ్(6) కొడుకు ఉన్నాడు. అభిరామ్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో సంతోష్‌ను భార్య కళ్యాణి వేధిస్తోంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్లో పురుగుల మందు తెప్పించుకున్నాడు. శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్‌లో ఆ మందును కలిపి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందాడు. సెల్ఫీ వీడియో.. సంతోష్ ఆత్మహత్య చేసుకునే ముందే ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి భార్య కళ్యాణి కారణమని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు మూడుసార్లు తనపై కళ్యాణి కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని, కేసులు, పంచాయితీలతో తనను ఇబ్బంది పెట్టారని రికార్డ్ చేశాడు. కళ్యాణి తల్లిదండ్రులు అరుణ, పండరినాథ్, కళ్యాణి సోదరుడు గణేష్, బాబాయి భీమ్ హత్యాయత్నం చేశారని ఆరోపించాడు. -
కారు హారన్ మోగించాడని... ఎంత పని చేశారంటే..
కర్నూలు: తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు ఎస్బీఐ శాఖ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గుట్టపాటి ముని మహేశ్వరరెడ్డి హత్య కేసు మిస్టరీని 4వ పట్టణ పోలీసులు ఛేదించారు. బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ముని మహేశ్వరరెడ్డి కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ వెనుక వైపు ఉన్న విజయ లక్ష్మీ నగర్లో ఇళ్లు నిర్మించుకుని స్థిరపడ్డాడు. వీరి ఇంటి వరుసలోనే కొంత దూరంలో తెలుగు చంద్రకాంత్ ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి మహేశ్వరరెడ్డి ఇంటికి కారులో వెళ్తూ.. చంద్రకాంత్ ఇంటి ముందు దారికి అడ్డంగా ఉన్న కారును పక్కకు తీయాలని హారన్‌ను కొట్డాడు. అయితే హారన్ మోగించాడనే కోపంతో ఇరువురు తిట్టుకోవడం, తోసుకోవడం జరిగింది. కొద్ది సేపటి తర్వాత ఇంటి ముంగిట ఉన్న మహేశ్వరరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి భార్య రామేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులు బెస్త చంద్రకాంత్, బెస్త శ్రీకాంత్, పటాన్ రెహన్‌ఖాన్, పటాన్ ఇలియాస్ ఖాన్, షేక్ ఇమ్రాన్ బాషా, సొప్పారం ధనుంజయ్, కుమ్మరి రామదాస్ అలియాస్ రామిరెడ్డి తదితరులను సంతోష్ నగర్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. వారు నేరానికి ఉపయోగించిన బొలొరో వాహనంతో పాటు రెండు వేటకొడవల్లు, పిడుబాకు స్వాధీనం చేసుకుని కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ ఎదుట హాజరుపరిచారు. బుధవారం సాయంత్రం 4వ పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐలు గోపాల్‌రెడ్డి, చిరంజీవి, రామయ్యలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలను వెల్లడించారు. చదవండి: తన చావుకు వారే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసి.. సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు -
బ్యాంకులో ఉద్యోగం .. మరి ఇదేం కక్కుర్తి బాబు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అయిన అతగాడు తండ్రి మెడికల్ షాపును అడ్డాగా చేసుకుని రెమిడెసివిర్ (రెడీఎక్స్‌ఎల్) ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించడం మొదలెట్టాడు. ఒక్కో దాన్ని రూ.35 వేలకు అమ్ముతున్న ఇతడి వ్యవహారంపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని పాన్ బజార్‌కు చెందిన ఆకుల మేహుల్ కుమార్ హైటెక్ సిటీలోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉద్యోగి. ఇతడి తండ్రి విజయ్‌కుమార్ పాన్ బజార్లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ డ్రగ్స్‌కు భారీ డిమాండ్ వచ్చింది. తన తండ్రి దుకాణంలో కూర్చున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న మేహుల్ వాటిని సమీకరించుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయించాలని పథకం వేశాడు. దీన్ని అమలులో పెడుతూ వివిధ మార్గాల్లో రెమిడెసివిర్ సంబంధిత ఇంజక్షన్ అయిన రెడీఎక్స్‌ఎల్ సమీకరిస్తున్నాడు. వీటిని అవసరమున్నవారికి అధిక ధరలకు విక్రయిండం మొదలెట్టారు. గరిష్టంగా ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బృందం మేహుల్ ను పట్టుకుని నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని మహంకాళి పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీకాలనీ పరిధిలో.... రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్ వద్ద గల ఓ మెడికల్ షాపు వద్ద రెమిడిసెవిర్ ఇంజక్షన్ కలిగి ఉన్న జోసఫ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న ఓ వ్యక్తికి లక్ష రూపాయలకు నాలుగు ఇంజక్షన్లు విక్రయించాడు. మరో ఇంజక్షన్‌ను 25 వేలకు అమ్మకానికి పెట్టాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు జోసఫ్‌రెడ్డిని ఇంజక్షన్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌లో... రెమిడెసివిర్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ కొర్ర బాల్‌రాజు, భాషపంగు పరశురాములు, భాషపంగు రవీందర్‌లు పథకం ప్రకారం తమకు తెలిసిన మెడికల్ దుకాణాలు, డి్రస్టిబ్యూటర్ల ద్వారా కొనుగోలు చేసిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను రూ.30 నుంచి 35 వేలకు అమ్మడం మొదలు పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆస్పత్రి సమీపంలో ఇంజక్షన్ అమ్మడానికి సిద్ధంగా ఉన్న బాల్రాజును అరెస్టు చేశారు. ( చదవండి: కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్ మార్కెట్లో రెమిడెసివర్ ) -
4సార్లు పెళ్లి..మూడు సార్లు విడాకులు..32 సెలవులు
ఆఫీసుల్లో సాధారణంగా సెలవు కావాలంటే.. పంటి నొప్పి నుంచి ఈ లోకంలో లేనివారి చావు వరకూ చాలా కథలే వినిపిస్తుంటాయి. అయితే తైవాన్ కి చెందిన ఓ బ్యాంక్ క్లర్క్.. కేవలం సెలవు కోసం ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకుని, మూడు సార్లు విడాకులు ఇచ్చాడు. తైవానీస్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి వివాహానికి 8 రోజుల వేతన సెలవులు(పెయిడ్ లీవ్స్) పొందే హక్కు ఉంది. దాని ప్రకారం సదరు హీరో.. గత ఏడాది ఏప్రిల్ 6న పెళ్లి చేసుకుని పెయిడ్ లీవ్స్ పొందాడు. అయితే.. 8వ(చివరి) రోజు తన భార్యకు విడాకులు ఇచ్చి.. ఆ మరునాడే మళ్లీ పెళ్లి అంటూ మరో 8 రోజుల పెయిడ్ లీవ్స్‌కి అప్లై చేసుకున్నాడు. ఇలా 37 రోజుల్లో 4 సార్లు పెళ్లి, 3 సార్లు విడాకులతో 32 రోజులు సెలవులు తీసుకున్నాడు. ఇతగాడి గారడీలను గుర్తించిన సదరు బ్యాంక్.. ఆ సెలవులకు అనుమతించకపోవడంతో న్యాయం చెయ్యాలంటూ తైపీ సిటీ లేబర్ బ్యూరోని ఆశ్రయించాడు ఆ పెళ్లికొడుకు. దర్యాప్తు ప్రారంభించిన బ్యూరో.. బ్యాంక్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిందని అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో యజమానికి 7వందల డాలర్లు జరిమానా కూడా విధించింది. ‘లేబర్ లీవ్ రూల్స్’ ఆర్టికల్ 2 ప్రకారం ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టంలోని లూప్ హోల్స్ ఉపయోగించుకున్నప్పటికీ.. దాన్ని కారణంగా తీసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే వాదోపవాదాల నడుమ బ్యాంక్‌కి, క్లర్క్‌కి జరిగిన సమరంలో ఈ ఏడాది ఏప్రిల్ 10న బ్యూరో మరో తీర్పునూ వెలువరించింది. బ్యాంక్ క్లర్క్ ప్రవర్తన అనైతికం అయినప్పటికీ.. గతంలో ఇచ్చిన తీర్పును అయిష్టంగానే సమర్థించుకుంటూ ‘అతను చట్టాన్ని ఉల్లంఘించలేదు’అని స్పష్టం చేసింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అక్రమాలకు పాల్పడ్డ బ్యాంకు ఉద్యోగి రంగాచారి