bharata ratna
-
టాటాకు భారతరత్న ఇవ్వాలని పిటిషన్ దాఖలు.. కోర్టు ఏం చెప్పిందంటే?
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా యావత్ ప్రపంచం రతన్ టాటా దేశానికి చేసిన సేవల్ని, సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే పలువురు టాటాను భారతరత్నతో భారతరత్నతో సత్కరించాలని కోరుకుంటున్నారు.అదే సమయంలో గతంలో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు, ఆ పిటిషన్లపై జరిగిన చర్చ గురించి ప్రస్తావిస్తున్నారు.2022లో టాటాకు భారతరత్న ఇవ్వాలని కోర్టులో పిల్రతన్ టాటా 2000 సంవత్సరంలో దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను, 2008లో భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. కానీ అన్నీ రంగాల్లో అసమాన్య సేవలు చేసినప్పటికీ భారతరత్న అవార్డ్‌ను ఆయన్ని వరించలేకపోయింది.కోర్టు ఏం చెప్పిందంటే? ఇదే విషయంపై విచారణ చేపట్టాలంటూ పిటిషనర్ 2022లో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలు చేశారు. ఆ పిల్లో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కోరారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను.. రతన్ టాటాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై అప్పటి ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం పిల్‌ను కొట్టివేసింది, కోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని పేర్కొంది.పిటిషనర్ స్పందిస్తూదీనిపై పిటిషనర్ స్పందిస్తూ రతన్ టాటా సేవలు అమోఘం. అద్భుతం. అనిర్వచనీయం. అలాంటి మచ్చలేని వ్యక్తికి భారతరత్న అవార్డ్‌ను అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనరే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చని సూచించింది. అనంతరం పిటిషనర్.. దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని లేదంటే జరిమానా విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.దీనిపై నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో #BharatRatnaForRatanTata అనే హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేయగా.. నెటిజన్ల డిమాండ్‌పై రతన్ టాటా స్పందించారు. While I appreciate the sentiments expressed by a section of the social media in terms of an award, I would humbly like to request that such campaigns be discontinued. Instead, I consider myself fortunate to be an Indian and to try and contribute to India’s growth and prosperity pic.twitter.com/CzEimjJPp5— Ratan N. Tata (@RNTata2000) February 6, 2021రతన్ టాటా ట్వీట్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై రతన్ టాటా ట్వీట్ చేశారు. మీ మనోభావాలను నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయండి. దేశాభివృద్ధి, శ్రేయస్సు కోసం నావంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని, దేశ ప్రగతికి సహకరించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానన్నారు.కాగా, రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా, శివసేన (ఏక్నాథ్ షిండే) నేత మహరాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సన్నిహితుడు రాహుల్ కునాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కునాల్ షిండేకి లేఖరాశారు. -
అద్వానీకి భారతరత్న.. మోదీ భావోద్వేగం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానికి(96) ఇవ్వనున్నారు. భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో అద్వానీని గౌరవించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ.. ఎల్కే అద్వానీ జీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప అంతర్దృష్టులతో నిండి ఉన్నాయి అని కొనియాడారు. Advani Ji’s decades-long service in public life has been marked by an unwavering commitment to transparency and integrity, setting an exemplary standard in political ethics. He has made unparalleled efforts towards furthering national unity and cultural resurgence. The conferring… — Narendra Modi (@narendramodi) February 3, 2024 ఎల్కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రస్తుత పాకిస్తాన్(భారత్ విభజన కాకముందు)లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. అలాగే పాక్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను చదివారు. ఇక, 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు నిర్వర్తించారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో అద్వానీ కూడా ఒకరు. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్‌కు అద్వానీ వలస వచ్చారు. 1957లో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి అద్వానీ. 1960లో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్ట్‌గా విధుల్లో చేరారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక. 1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక. 1973-76లో జన్‌సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం 1977 మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖామంత్రిగా నియామకం 1980 రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1990 సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారు 1998 వాజపేయ్ మంత్రివర్గంలో హోంమంత్రిగా వ్యవహరించారు 2002 ఉప ప్రధానమంత్రిగా నియామకం. 2004 లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు 2005 జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదలిపెట్టాల్సి వచ్చింది 2007 ప్రధాన మంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది 2008 "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల చేశాడు. మలుపు తిప్పిన అయోధ్య రథయాత్ర.. అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న ప్రారంభమైంది. అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అద్వానీ విశేష ప్రజాదరణను పొందారు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం, ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు. పార్టీ అధ్యక్ష పదవిలో అద్వానీ కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించారు. అద్వానీ మొట్టమొదటి సారిగా 1986లో అటల్ బిహారీ వాజపేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు, రెండోసారి 1993 నుంచి 1998 వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు. చివరగా 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి మెరుగైనస్థితిలోకి తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ‘ఉక్కుమనిషి’గా పేరుగాంచాడు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం.. భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బీహార్ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం జనవరి 23న ప్రకటించింది. ఇప్పటివరకూ 49 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు.. ఇలా పలువురు ‘భారతరత్న’ అందుకున్నారు. -
చేతకాని చిన్నమ్మ.. దద్దమ్మ టీడీపీ
నటనతోనే కాదు.. తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ముఖ్యమంత్రిగా ఏడేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల మన్ననలు అందుకున్న వ్యక్తికి భారతరత్న అనే దేశ అత్యున్నత గౌరవం ఇప్పటిదాకా దక్కలేదు. కేంద్రం గుర్తించడం లేదా? లేకుంటే కావాలనే ఎవరైనా అడ్డుకుంటున్నారా?.. ఈ విషయంలో నారా-నందమూరి కుటుంబాలపై ఆయన అభిమానుల కోపం సరైందేనా?.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ కొత్తదేం కాదు కదా. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ విషయంలో మొదటి నుంచి శ్రద్ధ పెట్టలేదు. ఇటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నందమూరి కుటుంబం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో.. ఆటోమేటిక్‌గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్‌ను సీరియస్‌గా పరిశీలించలేదు. కాబట్టి దీనిపైన చర్చ జరిగిన దాఖలాలు కూడా లేవు. కానీ.. ►నిరుడు నందమూరి తారక రామారావు శతజయంతోత్సవాల టైంలో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ ఎన్టీఆర్‌పై ప్రేమను ఒలకబోస్తూ.. భారతరత్న డిమాండ్‌తో రోడ్డెక్కింది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథిగా ఎన్టీఆర్ వంద రూపాయల కాయిన్ రిలీజ్ చేయించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న ఎన్టీఆర్ వారసులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అక్కడా నారావారి రాజకీయాన్ని తెలుగు ప్రజలు చూసిందే. అయితే ఆ వెంటనే ఆమె బీజేపీ ఏపీ చీఫ్ కావడంతో ఎన్టీఆర్ భారతరత్నకు లైన్ క్లియర్ అయినట్లేనని అంతా భావించారు. కట్ చేస్తే.. ►కేంద్రం తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు ఆర్జేడీ చీఫ్ లాలూకు.. అలాగే పలువురు రాజకీయ దిగ్గజాలకు కర్పూరి ఠాకూర్ రాజకీయ గురువు. ఇక్కడ ఎన్టీఆర్‌తో ఠాకూర్‌కు పోలికలు అప్రస్తుతం. కానీ, ఈ ఇద్దరికీ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలం నుంచే ఉంది. పైగా నితీశ్‌కు బీజేపీకి కటీఫ్ అయ్యి చాలా కాలమే అవుతోంది. రాజకీయంగానూ నిత్యం ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతుంటాయి. అలాంటిది ఠాకూర్‌కు పురస్కారం ఇవ్వడంలో కేంద్రం తనదైన రాజకీయం ప్రదర్శించిందనుకున్నా.. ఎన్టీఆర్ విషయంలో ఇవతల నుంచి సరైన ఒత్తిడి కేంద్రంపైకి వెళ్లలేదనే విమర్శే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. బీజేపీకి పెద్దగా అభ్యంతరాల్లేవ్ ఇటీవలికాలంలో జాతీయ పురస్కారాల గ్రహీతలను పరిశీలిస్తే.. సమాజానికి వాళ్లు పెద్దగా తెలియకపోయినా.. వాళ్లు చేస్తున్న సేవ ఆధారంగా ఎంపిక జరిగినట్లు అర్థమవుతుంది. అదే సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూలురకే ఎక్కువ పురస్కారాలు దక్కుతున్నాయని..అందులోనూ కేంద్రం రాజకీయం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు.. 2019లో బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఒకవేళ ఇప్పుడు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తే అడ్డుకునేవారెవరూ ఉండరు. ఎందుకంటే అది బీజేపీకే మైలేజ్ ఇచ్చే అంశం. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గానికి బీజేపీ దగ్గరయ్యేందుకు అవకాశం కలుగుతుంది. అంతేకాక.. చంద్రబాబు చేయలేని పని తాము చేశామని చెప్పుకోవచ్చు. అప్పుడు టీడీపీని ఇరుకున పెట్టొచ్చు. ఎన్నికల వేళ ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి మంచి అవకాశమే కదా. చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? ఎన్టీఆర్ తనయ.. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి. సుష్మాస్వరాజ్ తర్వాత చిన్నమ్మగా ఆమెకంటూ ఓ ట్యాగ్ లైన్ క్రియేట్ అయ్యింది. కాంగ్రెస్ హయాంలో.. కేంద్ర మంత్రిగా ఉన్న టైంలోనూ ఆయన రాజకీయాలు అర్థవంతంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆమె రాజకీయాలను తల్చుకుంటే జాలేస్తోంది. పురంధేశ్వరి బీజేపీలో చేరి తొమ్మిదేళ్లు అవుతోంది. బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తి కావొస్తోంది. ఈ 9 ఏళ్లు, పోనీ చీఫ్‌గా 6 నెలల కాలంలో ఆమె బీజేపీకి విజ్ఞప్తులు చేసినా.. ఆఖరికి ఒత్తిడి చేసినా తన తండ్రికి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలించేదేమో. కానీ, ఆమె ఆ విషయంపై మాత్రం ఎందుకనో శ్రద్ధ పెట్టలేదనే అనిపిస్తోంది. మొక్కుబడి ప్రకటనలకు తప్ప.. ఏనాడూ ఆమె మనసు పెట్టింది లేదనేది స్పష్టం అవుతోంది. ఆమె చేతకానితనం వెనుక మరిది చంద్రబాబు హస్తం ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. టీడీపీ దద్దమ్మ.. ఇది తెలిసిందే! ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడంలో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఎన్టీఆర్ మరణానంతరం.. చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదు. అందుకే ఆయనకు భారతరత్న రాలేదనే ఆరోపణలూ ఉన్నాయి. లేకుంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పిన రోజుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడం పెద్ద సమస్య కాదు కదా. ఇక.. గతంలో వాజ్‌పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న అంశాన్ని పరిశీలించింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందనే చర్చ నడిచింది. ఒకవేళ ఎన్టీఆర్‌కు ఇప్పిస్తే.. తెలుగుదేశం పార్టీ తన సొంతంది కాదనేది .. ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటు రాజకీయం దేశానికి తెలిసిపోతుందన్న భయం ఆయనలో ఉండొచ్చు. అందుకే నందమూరి కుటుంబాన్ని కూడా మొదటి నుంచి తన గుప్పిట ఉంచుకుని అణగదొక్కుతూ వస్తున్నాడు. ఏదైతేనేం.. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడంలో చంద్రబాబే ప్రధాన భూమిక పోషించాడనేది తేటతెల్లం అవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో నారా-నందమూరి కుటుంబాలపై ఎన్టీఆర్ అభిమానుల కోపం సరైంది కాదంటారా? ‘‘ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నారు. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు.. మళ్లీ పురంధేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారు. కానీ, నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు. ఎన్టీఆర్‌కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారు. బీజెపీకి చెబుతున్నా.. పురందేశ్వరి టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తోంది. పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోండి.. ’’ దివంగత నందమూరి తారకరామారావు పేరు మీద 100 రూపాయల స్మారక నాణేం విడుదల కార్యక్రమ సమయంలో ఆయన సతీమణి లక్ష్మీపార్వతి చెప్పిన మాటలు.. ::లోకీ, సాక్షి డిజిటల్ పొలిటికల్ డెస్క్ -
క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే ఘంటసాల: చంద్రబోస్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు టీవీ చర్చ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రెండు భాగాల్ని 21, 28 ఆగస్టు నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 4 సెప్టెంబర్ నాడు మూడవ భాగం ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ.. మాస్టార్కి భారతరత్న కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఘంటసాల గురించి చెప్పే అర్హత గాని, అనుభవం కానీ తనకు చాలదని ఆయితే ఆయనపైన తనకున్న అపారగౌరవంతో కొన్ని విషయాలను పంచుకున్నారు. మాస్టార్ పాటలు పాడకముందు జాతీయోద్యమంలో పాల్గొన్నారని, ఓ సందర్భంలో జైలు జీవితం కూడా గడిపినట్లు తెలిపారు. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే అది ఘంటసాల మాస్టారని కొనియాడారు. 1944 వరకు పాత్రధారులే వారి వారి పాత్రలకు పాటలు పాడేవారని.. మొట్టమొదటి నేపధ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు అయితే, వారి తరువాత 1945లో స్వర్గసీమ చిత్రంతో మొదలుపెట్టి - 1974 వరకు అలా అప్రతిహతంగా మాస్టారు ప్రయాణం సాగిందని చెప్పారు. శారద ఆకునూరి (హ్యూస్టన్, USA) బృందం, ఫణి డొక్కా (అట్లాంటా, USA) బృందం, డాక్టర్ రెడ్డి ఉరిమిండి (డల్లాస్, USA) బృందం ఈ కార్యక్రమంలో ఘంటసాల పాటలు పాడి, చక్కటి వ్యాఖ్యానంతో ఆయనను స్మరించుకున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని పాటలతో అందరిని అలరించారు. శతగళార్చన చివరి భాగంలో ముఖ్య అతిథిగా అనంత శ్రీరామ పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. శతగళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని చాలా మంది ప్రముఖులు "ఘంటసాలకి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. -
మనీష్ సిసోడియా ‘భారతరత్న’కు అర్హుడు: కేజ్రీవాల్
అహ్మదాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై సీబీఐ దాడుల నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధ తారస్థాయికి చేరుకుంది. ఇరుపార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు గుజరాత్లో పర్యటించారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెలరోజుల్లోనే ఐదోసారి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కేజ్రీవాల్. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసి అద్భుతం చూపించిన వ్యక్తిపై సీబీఐ దాడులు చేసింది. మీకు సిగ్గుగా లేదా? అలాంటి వ్యక్తికి భారత రత్న ఇవ్వాలి. విద్య కోసం ఆయనని సంప్రదించాలి. ఆయన విషయంలో జరుగుతున్న పరిణామాలతో దేశంలోని ప్రతిఒక్కరు నిరాశకు గురవుతున్నారు. మనీష్ సిసోడియా అరెస్ట్ కావచ్చు. నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇదంతా గుజరాత్ ఎన్నికల కోసమే చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. మరోవైపు.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి వ్యతిరేకంగా సిసోడియాపై సీబీఐ దాడుల అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఆప్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: Manish Sisodia: ‘ఆప్‌ని వదిలేసి బీజేపీలో చేరమని మెసేజ్ పంపారు’ -
ఘంటసాలకు భారతరత్న కోసం కలిసి పోరాడుదాం
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకు భారతరత్న పురస్కారం తెలుగువారంతా కలిసి ప్రయత్నించాలని టూరిజం, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో జూలై 3న నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఘంటసాల పేరు వినపడగానే మన అందరికి సుమధురమైన పాటలు గుర్తుకువస్తాయని అన్నారు. ఘంటసాల గాయకుడు మాత్రమే కాదని స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిన విషయాన్ని గుర్తుచేశారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవాలని తెలుగువారంతా కోరుకుంటున్నారని చెప్పారు. మరొక ముఖ్య అతిథి తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఘంటసాల అమర గాయకుడని, భగవద్గీతని వింటున్నప్పుడు భగద్గీతని గానం చేయడం కోసమే ఆయన జన్మించినట్టుగా అనిపిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహాదీక్ష చేస్తూ చనిపోయినపుడు వారికి అంత్యక్రియలు జరపడానికి ఎవరు ముందుకు రాని సందర్భంలో తన ఉత్తేజమైన పాటలతో మద్రాస్ లో వున్నా తెలుగువారందని రప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. యావత్ భూగోళంలో నివసిస్తున్న తెలుగు వారందరు ఏకతాటిపై వచ్చి ఘంటసాలకు భారతరత్న కోసం చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందించారు. మరొక విశిష్ట అతిధి రామజోగయ్య శాస్త్రిమాట్లాడుతూ.. ఘంటసాలను కారణజన్ముడిగా వర్ణించారు. శత జయంతి సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలనే ఒక నినాదంతో చేస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చాలామందికి మరణాంతరం భారతరత్న ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నామని, అలాంటి వాళ్ళలో ముందువరుసలో ఉండే వారు ఘంటసాల అని పేర్కొన్నారు. ఘంటసాల విశిష్టత, బహుముఖప్రజ్ఞ గురించి ఎంత చెప్పిన తనివితీరదని, ఆయనకు కచ్చితంగా భారతరత్న ఇవ్వాలని కోరుకున్నారు. చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి మాట్లాడుతూ.. నిర్వాహకులను అభినందించారు. ఇటీవల మంత్రి రోజాను కలిసినట్టు వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కల్పించి ఈ మహాయజ్ఞాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి తనవంతు కృషి చేస్తానని రోజా హామీ ఇచ్చారని తెలిపారు. సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ.. ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 33 దేశాల సేవలను కొనియాడారు. యూఎస్ఏ నుంచి నాటా మాజీ అధ్యక్షుడు, ఫిలడెల్ఫియా డా. రాఘవ రెడ్డి గోసాల, శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, అట్లాంటా , శ్రీని వంగిమల్ల, కలైవాణి డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్, అట్లాంటా, శ్రీమతి పద్మజ కేలం, శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, రాక్‌విల్లే ఉదయ్ భాస్కర్ గంటి, శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఆస్టిన్, డాక్టర్ జగన్నాథం వేదుల, జర్మనీ నుంచి రాజా రమేష్ చిలకల, భారతదేశం నుంచి బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, కోలపల్లి విఆర్ హరీష్ నాయుడు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించాలని అందరూ ముక్తకంఠంతో కోరారు. విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా ఏకతాటిపై తెచ్చి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రామ్ దుర్వాసుల(యూఎస్ఏ) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, తైవాన్ , ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 143 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (change.org/BharatRatnaForGhantasalaGaru) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాల ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ఈమెయిల్‌కు ghantasala100th@gmail.com వివరాలు పంపవచ్చు. -
ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికిభారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకరనేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 130 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగుసంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి విజు చిలువేరు, మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, వ్యాఖ్యాతగా 26 జూన్ 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో గీతరచయిత, టాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్,SIIMA, నంది, మిర్చి మ్యూజిక్, మా మ్యూజిక్ అవార్డుల విజేత అనంత శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. అమరగాయకుడు, ప్రముఖ సంగీతదర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారికోసం 32 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కలసి ఏకతాటిపై వచ్చి వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయం అని తెలిపారు. ఘంటసాల గారు గొప్ప జాతిరత్నం అని చెపుతూ, కళేజీవితంగా భావించి, ఆ కళే వృత్తిగా జీవించి, తన చివరి క్షణం వరుకు తన జన్మను కళకే అర్పించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు... గాయకుడికా పదివేల పాటలకు పైగా పాడి, 110 పైగాచిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి మహా కవులను గౌరవిస్తూ కుంతి విలాపమ, పుష్పవిలాపము లాంటి అరుదైన కావ్యాలను అందించి ఈ సంగీతానికి, తనను నమ్ముకున్నకళలకు, తన పూర్వజన్మ ఋణం అన్నట్లుగా ఆ కళ కోసం తన జన్మనే అర్పించారు, అటువంటి వ్యక్తికి భారతరత్న రావడం ఎంతో సమంజసం అని చెప్పారు. అడిలైడ్ ఆస్ట్రేలియా నుంచి ఘంటసాల శ్యామల అతిథిగా పాల్గొని వారి నాన్నగారితో చిన్ననాటి రోజులును ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంభం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతికకళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతు ఇప్పటిదాక ఈకార్యక్రమలో పాల్గొన్న 32 దేశాల సేవలను కొనియాడారు. యూఎస్ఏ నుండి అంజయ్య చౌదరి లావు, తానా అధ్యక్షుడు, యు.యెస్.ఏ శంకరనేత్రాలయ బోర్డు సభ్యులు పార్థ చక్రవర్తి, సోమ జగదీష్, రమేష్ వల్లూరి వ్యవస్థాపక అధ్యక్షుడు, అట్లాంటా తెలుగు సంస్కృతి, శ్రీనివాస్ దుర్గం గాయకుడు, అట్లాంటా, నెదర్లాండ్స్ నుండి సురేందర్ బోడకుంట అధ్యక్షుడు నెదర్ల్యాండ్సు తెలుగు అసోసియేషన్, తైవాన్ నుండి డా. దామోదర్ జన్మంచి, అధ్యక్షుడు తైవాన్ తెలుగు అసోసియేషన్, కోలపల్లి వీఆర్ హరీష్ నాయుడు బ్యాంక్ ఆఫ్శ్రీ ఘంటసాల (స్థాపించబడింది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు నెథర్లాండ్స్, తైవాన్, స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 133 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, వివరాలు మీఅందరి మద్దతు కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాల ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ అడ్డ్రస్సు కి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు. -
అమరగాయకుడు ఘంటసాలకు భారతరత్న పురస్కారం: సంతకాల సేకరణ
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఘంటసాలకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ప్రచారాన్ని చేపట్టారు. ఈక్రమంలో ఇప్పటివరకు 110 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూల ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా న్యూజిలాండ్ నుండి శ్రీలత మగతల వ్యాఖ్యాతగా 2022 జూన్ 5 న జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమంలో నంది పురస్కార గ్రహిత, గానసామ్రాట్ డా.మనో (నాగూరుబాబు) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 28 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అమరగాయకుడు, పద్మశ్రీ ఘంటసాలకు భారత రత్న పురస్కారం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఘంటసాల గళంనుంచి జాలువారిన కొన్ని పాటల పల్లవులను పాడి అలరించారు మనో. ముఖ్య ఉపన్యాసకులు శైలేష్ లఖ్టాకియా (ఐ.ఎఫ్.యస్) ఈ కార్యక్రమంలో పాల్గొని ఘంటసాల స్వయంగా హిందీలో పాడి స్వరకల్పన చేసిన ఝండా ఊంచా రహే హమారా పాటను గుర్తు చేసారు. అలాగే చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణకుమారి అతిథిగా పాల్గొని అందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న 28 దేశాల సేవలను సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు కొనియాడారు. శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు ప్రసాద్ రాణి, ఆస్ట్రేలియా సిడ్నీ నుండి తబలా విధ్వాంసులు, ఆదిశేషు కోట, తెలుగు భాగవత ప్రచారసమితి అధ్యక్షులు, భాస్కర్ వులపల్లి, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్, అనిత మొగిలిచెర్ల, ఇండియానుంచి జీవీ రమణ (RACCA, రాజమహేంద్రవరం) గాయకుడు, నిర్వాహకుడు, శివరామి రెడ్డి వంగ అడ్మిన్, మా నాన్నాఘంటసాల, తెలంగాణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, పాటలలోని మాధుర్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న పురస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని కోరారు. ఇందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా కలుపుకొని భారతరత్న వచ్చేంతవరకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు స్విట్జర్లాండ్ ,నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 113 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. అలాగే ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందన్నారు. change.org ద్వారా తమ ఉద్యమానికి మద్దతు తెలియజేయాలసిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. -
ఘంటశాలకి భారతరత్న ఇవ్వాలి
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 90 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి అమెరికా గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా 1 మే 2022 నాడు జరిగిన అంతర్జాల కార్యక్రమములో పూజ్య బ్రహ్మశ్రీ పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భార్య భర్తని ఎలా పేరు పెట్టి పిలవదో, గురువుని కూడా పేరు పెట్టి పిలవరని, ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మనందరికీ గురువు అని చెపుతూ, వారు ఒక కర్మయోగి, మహాజ్ఞానీ, తపశ్వి అని, వారి జీవితం ఒక తపస్సు అని చెప్పారు... నేను ఒక స్వామిజి అయినా మీరు అందరు చేస్తున్న ప్రయత్నాలకు నేను నమస్కరిస్తున్నాను అని చెపుతూ ఎందుకంటె మీరందరు ఒక తపస్వికి, జ్ఞానికి, కర్మయోగికి భారతరత్న కోసం చేస్తున్న కృషిని కొనియాడారు... భారతరత్నకి ఘంటసాల గారు పూర్తిగా అర్హులు అని చెపుతూ గారి గొప్పతనాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు... ఒక అమరగాయకుడుగా మరియు సంగీత దర్శకుడుగా 10,000 పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మరియు తులు బాషలలో పాటలుతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ పుష్ప విలాపం, కుంతీ విలాపం, దేశభక్తి గీతాలు పాడటం మరియు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత ఇప్పటికి తెలుగువారి ఇళ్లలో మారుమోగుతోందని అని చెప్పారు. అలాగే స్వీయ సంగీత దర్శకుడుగా 110 కంటే ఎక్కువ సినిమాలుకు సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాలాంటి పాటలను, వాగ్గేయకారుడుగా పాటలను రచించి, సంగీత స్వర కల్పన కూర్చి మరియు వారి అమృత గాత్రంతో ఆ పాటలకు జీవం పోశారు అని చెప్పారు, అలాగే 15వ శతాభ్దం అన్నమయ్య తరువాత తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గంధర్వ గాయకుడు అని తెలియచేస్తూ... వీటన్నటితోపాటు పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్షని అనుభవించిన గొప్ప దేశభక్తుడని అని కొనియాడారు. ఘంటసాల గారికి భారతరత్న కోసం change.org లో నేను సంతకం చేస్తున్నాని చెపుతూ మీరందరు కూడా సంతకాల సేకరణను ఇంకా ఉదృతం చేయాలనీ కోరారు. 15 కోట్ల మంది తెలుగు వారి ఆకాంక్షని కేంద్ర పాలకులకు చేరేంతవరకు అందరు కలసి కృషి చేయాలనీ దిశా నిర్దేశము చేసారు... యూఎస్ఏ నుంచి నాటా మాజీ అధ్యక్షుడు డా. రాఘవ రెడ్డి గోసాల, నాట్స్ అధ్యక్షుడు విజయ శేఖర్ అన్నే, ధర్మయోగి ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాంకుమార్ యడవల్లి, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు రమేష్ బాబు చాపరాల, నారాయణరెడ్డి ఇందుర్తి, భారతదేశం నుండి సంకలనకర్త, ఘంటసాల గాన చరిత, చల్లా సుబ్బారాయుడు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.., పరిపూర్ణానంద స్వామి పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి ఒక కొత్త ఉత్సాహాం వచ్చిందన్నారు. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 93 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, -
ఘంటసాలకి భారతరత్న ప్రకటించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్‌తో శంకర నేత్రాలయ (యూఎస్ఏ) అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో వరుసగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 80 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యూఎస్ఏ నుంచి నుండి నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యాతగా 24 ఏప్రిల్ 2022 నాడు జరిగిన అంతర్జాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆపి (AAPI) పూర్వ అధ్యక్షులు డాక్టర్ సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా, చెన్నై నుంచి ఘంటసాల కోడలు శ్రీమతి కృష్ణ కుమారి ఘంటసాల అతిధులుగా పాల్గొన్నారు. సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర పాలకులు మొదటి నుంచి దక్షిణాది వారి మీద చిన్నచూపుతో వ్యవహరించారని, ముఖ్యంగా తెలుగు వారికీ అన్ని విధాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఘంటసాల గారికి భారతరత్న విషయంలో అదే జరిగిందన్నారు. ఇప్పటికయినా ఘంటసాలకి భారతరత్న వచ్చేంతవరకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (IAMA) సంస్థలో ఉన్న తెలుగు డాక్టర్లందరి సహకారంతో భారతరత్న కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతుని ప్రకటించారు. కృష్ణ కుమారి ఘంటసాల మాట్లాడుతూ నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు, ఈ సందర్భంగా బాల ఇందుర్తిని ప్రత్యేకంగా అభినందించారు. అతిత్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలసి వారి సహకారంతో మన అందరి ప్రయత్నాలను ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని అభ్యర్ధించారు. ఆస్ట్రేలియా, సిడ్నీ నుండి సంగీత దర్శకుడు, తబలా ప్లేయర్ ఆదిశేషు కోట, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, డెన్మార్క్ నుండి తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు అమర్నాధ్ పొట్లూరి, ఉగాండా నుండి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా చైర్మన్ వి.పార్థసారథి, సౌదీ అరేబియా నుండి సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపికా రవి, UK నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సట్టన్ (TAS) అధ్యక్షుడు నవీన్ జలగడుగు, హంగేరి నుండి యోగహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, అరవింద కొల్లిపార, యు.యెస్.ఏ నుండి శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు, ఉపేంద్ర రాచుపల్లి తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది తెలుగు వారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 83 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని శ్రీమతి కృష్ణ కుమారి ఘంటసాల అందిస్తున్నారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు. చదవండి: ఘంటసాలకు భారతరత్న వచ్చే వరకు కృషి చేద్దాం -
ఘంటశాలకి భారతరత్న ఇవ్వాలి
అమర గాయకుడు ఘంటసాలకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని అమెరికాకి చెందిన శంకర నేత్రాలయ అధ్యక్షులు బాల ఇందుర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రెడ్డి ఊరిమిండి నిర్వహణలో 2022 మార్చి 20న మరొకసారి వర్చువల్ సమావేశం నిర్వహించారు. అన్నమాచార్య భువనవాహిని సంస్థ అధ్యక్షురాలు పద్మశ్రీి శోభారాజు మాట్లాడుతూ ఘంటసాలకి భారతరత్న ఇవ్వడం అంటే ఆయనకు ఘనమైన నివాళి అందివ్వడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, అట్లాంటా నుండి శంకర నేత్రాలయ పాలక మండలి సభ్యులు శ్రీనిరెడ్డి వంగిమళ్ళ, దక్షిణ ఆఫ్రికా నుండి దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ అధ్యక్షులు విక్రమ్ పెట్లూరు, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ కడించెర్ల, ఖతార్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు ఉసిరికల్ల తాతాజీ, నార్వే నుంచి వీధిఅరుగు అధ్యక్షులు వెంకట్ తరిగోపుల, యూఏఈ నుంచి తెలుగు తరంగిణి అధ్యక్షులు వెంకట సురేష్, లండన్ నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ ఉపాధ్యక్షులు రాజేష్ తోలేటి తదితరులు పాల్గొన్నారు. -
ఈసారి భారతరత్న వాళ్లకే ఇవ్వండి: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం ముందు సరికొత్త డిమాండ్‌ను ఉంచారు. కరోనాపై పోరాటంలో ముందు వరసలో నిలిచి ప్రజల ప్రాణాలు కాపాడిన భారతీయ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఈ ఏడాది భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక లేఖ కూడా రాశాడు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందరికీ సమూహంగా భారత రత్న ఇవ్వాలని, అసరమైతే నిబంధనలు మార్పు చేయాలని కోరారు. ఈ ఏడాది భారతరత్నను వైద్యుడికి ఇవ్వాలని దేశం కోరుకుంటోందని అలా అని ఎవరో ఒకరికి ప్రకటించమని తాను కోరడం లేదన్నారు. దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందరినీ కలిపి సముచిత గౌరవం కల్పించాలని కోరారు. ఈ విధంగా ప్రకటించడమే కరోనాతో పోరాడి మృతి చెందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికిచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. చదవండి: ఉచిత విద్యుత్.. రోజంతా కరెంట్ లక్షలాది మంది వైద్య సిబ్బంది నిస్వార్థంగా సేవలందించారని, దేశం మొత్తం వైద్యులను కీర్తిస్తోందని, వారందరినీ భారతరత్నతో గౌరవిస్తే భారతీయులందరూ సంతోషిస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఐఎంఏ లెక్కల ప్రకారం.. కరోనాతో ఇప్పటిదాకా 1,492 మంది వైద్యులు చనిపోగా.. కరోనా వారియర్లుగా వేల సంఖ్యలో మిగతా వైద్య సిబ్బంది మృత్యువాత పడ్డారు. -
అది సీఎం జగన్ మంచితనానికి నిదర్శనం: పింగళి మనవళ్లు
సాక్షి, గుంటూరు: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సత్కరించిన సంగతి తెలిసిందే. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. దీనిపై పింగళి వెంకయ్య మనవళ్లు హర్షం వ్యక్తం చేశారు. తమ తాతగారికి భారత రత్న ఇవ్వాలంటూ సీఎం జగన్, ప్రధానికి లేఖ రాయటం గొప్ప విషయమని.. అది సీఎం మంచితనానికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా పింగళి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య మనవళ్లు గోపి కృష్ణ, నరసింహారావు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో గడపడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తారని మా అమ్మగారిని సన్మానిస్తామని మేం ఎప్పుడూ ఊహించలేదు. సీఎం జగన్ మా అమ్మ గారిని సన్మానించడం ఆనందంగా ఉంది. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధానికి, ముఖ్యమంత్రి లేఖ రాయడం ఒకవైపు ఆశ్చర్యాన్ని.. మరోవైపు ఆనందాన్ని కలిగిస్తోంది’’ అన్నారు. చదవండి: పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వండి: సీఎం జగన్ -
బాలూ.. భారతరత్నమే..
సాక్షి, హైదరాబాద్: గానమే ప్రాణమని.. ప్రాణమే గానమని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సినీ నేపథ్య గాయకుల్లోనే నూతన ఒరవడిని సృష్టించిన ఆయన గాత్రం శిఖరసమానం. అయిదు దశాబ్దాల పాటు సుమారు 18 భాషల్లో 45వేల పైచిలుకు గీతాలతో సినీ కళామతల్లికి స్వరాభిషేకం గావించిన మేరునగం. ఇటీవల అస్తమించిన ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని, ఈ పురస్కారానికి అన్నివిధాలా ఆయన అర్హులని డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాలూకు భారతరత్న అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదించారు. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సినీ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇదొక మంచి నిర్ణయమని ‘సాక్షి’తో పేర్కొన్నారు. భారతరత్న ఎప్పుడో ఇవ్వాల్సింది ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి ‘భారతరత్న’ అవార్డు ఎప్పుడో రావాల్సింది. ఆలస్యం అవ్వడం బాధగా ఉంది. ఆయన మరణం తర్వాత అటువంటి అవార్డుతో సత్కరించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఏపీ ప్రభుత్వంప్రతిపాదించడం నిజంగా అభినందనీయం. నాలుగు తరాల హీరోలకి సంగీతమందించిన గొప్ప వ్యక్తి ఎస్పీ బాలు. పాట ప్రారంభించే ముందు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ బాలు గారు నమస్కరించి పాట పాడటం మొదలుపెట్టేవారు. – అనూప్‌రూబెన్స్, మ్యూజిక్ డైరెక్టర్ మంచి ప్రతిపాదన దివంగత ఎస్పీ బాలు సార్‌కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదన ఆహ్వానించదగిన నిర్ణయం. ఎస్పీబీ ఒక సంగీతంలోనే కాకుండా డబ్బింగ్లో, నటనలో సైతం తన ప్రతిభను 100 శాతం కనబర్చారు. గొప్ప మనసున్న వ్యక్తికి భారతరత్న పురస్కారం ఇవ్వడం మనమిచ్చే అరుదైన గౌరవం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన ఎంతో సముచితం. – సునీత, గాయని 100 శాతం అర్హులు బిఫోర్ ఎస్పీ బాలు..ఆఫ్టర్ ఎస్పీ బాలు అనే స్థాయికి భారతీయ సంగీతాన్ని తీసికెళ్లిన మహనీయుడు ఎస్పీ బాలు గారు. భారతరత్నతో ఆయన్ని సత్కరించుకోవాలని కోరడం నిజంగా అభినందనీయం. ఆ అవార్డుకు బాలు గారు 100శాతం అర్హులు కూడా. – భాస్కరభట్ల, పాటల రచయిత చాలా సంతోషంగా ఉంది ఎస్పీ బాలు గారికి భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదన చాలా సంతోషమనిపించింది. ఇప్పటికే దీనిపై నేను ఓ ప్రతిపాదనపై సంతకం చేసి ఇతరులతో కూడా చేపించా. నిజంగా ఆయన్ని భారతరత్నతో సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది. – కౌసల్య, సింగర్ గాయకుల దిక్సూచి ఎస్పీ బాలు గారి హాయాంలో పాటలు పాడే భాగ్యం కలిగినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. నాలాంటి ఎందరో యంగ్ సింగర్స్‌కి ఆయనో దిక్సూచి. అంతగొప్ప వ్యక్తిని ‘భారతరత్న’తో సత్కరించుకోవాలి. ఇటువంటి గొప్ప ఆలోచన ఏపీ ప్రభుత్వానికి రావడం నిజంగా హ్యాపీ.. – సమీర భరద్వాజ్, సింగర్. పురస్కారంతో సత్కరించుకోవాలి బాలు గారికి ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రతిపాదించడం వంద శాతం ఆహ్వానించదగ్గ నిర్ణయం. బాలు గారు ఒక లెజండరీ. అటువంటి వ్యక్తిని మనం అంతటి గొప్ప పురస్కారంతో సత్కరించుకోవాల్సిందే. – రాహుల్ సిప్లిగంజ్, సింగర్ అది మన బాధ్యత వేలపాటలు పాడిన గొప్ప గాయకుడు బాలుగారిని భారతరత్నతో సత్కరించుకోవడం మన బాధ్యత కూడా. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ పురస్కారానికి ఆయన నిజంగా అర్హులు. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. – అంజన సౌమ్య, సింగర్ -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, అమరావతి: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను భారతరత్న అవార్డు ఇవ్వాలని లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎస్పీ చరణ్ అన్నారు. భారతరత్న అవార్డుకు ప్రతిపాదించినట్లు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఉత్తరం అందగానే ఎంతో సంతోషించానని ‘సాక్షి’తో చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఎంజీఎం హెల్త్‌కేర్ అస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాన్నకు భారతరత్న ఇస్తే ఎంతో గౌరవంగా భావిస్తానని అన్నారు. వదంతులు నమ్మెద్దు బాలసుబ్రహ్మణ్యం వైద్యసేవలకు అయిన ఖర్చు గురించి సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని ఎస్పీ చరణ్ అన్నారు. అటువంటి వాటిని నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు. బిల్లు చెల్లించిన తర్వాతే తన తండ్రి భౌతిక కాయాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది పట్టుబట్టినట్లు, తాము ఉపరాష్ట్రపతికి ఫోన్ చేయడంతో వివాదం సద్దుమణిగినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ప్రతి వారం తాను కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చానని తెలిపారు. చివరి రోజున ఇంకా ఎంత బ్యాలెన్స్ చెల్లించాల్సి ఉందని ఆస్పత్రి నిర్వాహకులను అడిగితే వారు ఏం చెల్లించవద్దు..ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడండని చెప్పారన్నారు. వైద్య ఖర్చుల్లో కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినట్లు చరణ్ చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం తాను ప్రభుత్వాన్ని సాయం కోరిన విషయం వాస్తవమేనని, ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధమని ప్రకటించడమే అందుకు కారణమన్నారు. ఈ విషయమై ఆరోగ్య శాఖ కార్యదర్శిని సంప్రదించగా ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి చెబుతానన్నారని తెలిపారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: కమల్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాయడంపై సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. బాలుకి భారతరత్న ఇవ్వాలని కోరినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతటా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు.’ అంటూ కమల్ హాసన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
బాలుకు భారత రత్న!
సాక్షి, అమరావతి: గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, బిస్మిల్లాఖాన్, భీంసేన్ జోషి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి లాంటి గొప్ప గాయకులు, సంగీత విద్యాంసులకు భారత రత్నను ఇచ్చి సత్కరించినట్లుగానే అసాధారణ ప్రతిభాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించి గౌరవించాలని లేఖలో కోరారు. ► సంగీత సామ్రాజ్యంలో ఐదు దశాబ్దాల పాటు విశేష ప్రతిభ ప్రదర్శించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వడం అత్యున్నత స్థాయి గుర్తింపు నిచ్చినట్లు అవుతుంది. ఆయనకు అదే అత్యున్నత నివాళి. ► నెల్లూరులో ఇలాంటి మహా గాయకుడు జన్మించడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఆయన అకాల మరణం అశేష అభిమానులను విషాదంలో ముంచెత్తింది. అంతర్జాతీయంగా సంగీతాభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆయన విజయగాథ, సాధించిన ఘనత ఎల్లలు లేనివి. అసమానమైన ప్రతిభతో అసమాన స్థాయికి ఎదిగారు. ► తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎస్పీ 40 వేలకుపైగా పాటలు పాడారు. అత్యుత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. ► తెలుగు సినిమాల్లో అత్యుత్తమ గాయకుడిగా 25 రాష్ట్ర స్థాయి నంది అవార్డులను సాధించారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్ర అవార్డులను కూడా అనేకం గెల్చుకున్నారు. ► ఫిలింఫేర్ అవార్డు, ఫిలింఫేర్ దక్షిణాది ఉత్తమ గాయకుడుగా ఆరు అవార్డులు పొందారు. 2016లో భారత సినీ రంగ ప్రముఖుడుగా(ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్) ఆయనకు వెండి నెమలిని ప్రదానం చేశారు. ఎస్పీ బాలుకు కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ , 2011లో పద్మభూషణ్ అవార్డులను ఇచ్చి గౌరవించింది. (థాంక్యూ సీఎం జగన్: కమల్ హాసన్) -
పీవీకి భారతరత్న పురస్కారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్ర«ధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని రాష్ట్ర అసెంబ్లీ కోరింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మంగళవారం సభ ప్రారంభం కాగానే పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టాలని, హైదరా బాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి స్వల్ప కాలిక చర్చను ప్రారంభించారు. పీవీ దార్శనికతను కొనియాడుతూ ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిన ఆవశ్యకతను ఉటంకిస్తూ ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల తరఫున మల్లు భట్టి విక్రమార్క, కేటీఆర్, సత్యవతి రాథోడ్, రాజాసింగ్, గంగుల కమలాకర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజయ్య, శ్రీధర్ బాబు, శ్రీనివాస్‌గౌడ్, రెడ్యానాయక్‌లు ప్రసంగించి సీఎం ప్రవేశపెట్టిన తీర్మా నానికి మద్దతు తెలిపారు. ఎంఐఎం తరఫున ఎవరూ చర్చలో పాల్గొనలేదు. తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతి వ్వడంతో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమో దించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. తీర్మాన ప్రసంగంలోసీఎం ఏమన్నారంటే... ‘దేశ ప్రధాని కాగలిగే అవకాశం చాలా తక్కువ మందికి లభించే గొప్ప అవకాశం. వ్యక్తిగత ప్రతిభ, అకుంఠిత దీక్ష ద్వారా మంచి కార్యసాధకుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు ఈ పదవి దక్కింది. కానీ ఆయనకు లభించాల్సిన మర్యాద లభించలేదనే బాధ, వెలితి తెలంగాణ బిడ్డలకు ఉంది. అందులో సందేహం లేదు. దానికి బాధ్యులెవరూ, మంచి, చెడు గురించి మాట్లాడుకునే సందర్భం కాదు. పీవీ శతజయంతి ఉత్సవల సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పుకుంటున్న సమయంలో ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ తీర్మానాన్ని పెడుతున్నాం. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధోసంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారతదేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు. పీవీ శతజయంతి దేశ చరిత్రలో ఒక విశిష్ట సందర్భం. తెలంగాణ అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించడానికి ప్రభుత్వం సÜంకల్పించి జూన్ 28న జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ఈ ఉత్సవాల నిర్వహణ ద్వారా ఆయన దేశానికి చేసిన సేవలను ప్రజలంతా స్మరించుకునేలా చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. మూలకారకుడు పీవీ... ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నిలవడానికి, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పురోగమించడానికి మూలకారకుడు పీవీ. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా, తెలంగాణ ముద్దుబిడ్డగా ఆయన చరిత్ర çసృష్టించారు. అందుకే ఇది పీవీ మన ఠీవి అని తెలంగాణ సగర్వంగా చాటుకుంటున్న సందర్భం. ఆధునిక భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నాయకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు మోడరన్ ఇండియా నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ.. రెండో నేత గ్లోబల్ ఇండియా నిర్మాత పీవీ. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమయ్యేది. కాలానుగుణంగా ఆర్థిక దృక్పథంలో మార్పులు తేవాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో దేశం ఉంది. మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పాలి. కాలం విసిరిన ఇన్ని సవాళ్ల నడుమ తనదైన దార్శనికతతో పీవీ ధైర్యంగా ముందడుగు వేశారు. నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అత్యంత సాహసోపేతంగా, వేగంగా, చాకచక్యంగా, సమర్థంగా అమలు చేశారు. ఆయన దార్శనికతే కారణం భారతీయ మేధావులు విదేశాల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారన్నా... దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీగా సమకూరాయన్నా... దేశానికి ప్రపంచం నలుదిక్కుల నుంచీ పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నా... స్వదేశీ కంపెనీలు విదేశీ కంపెనీలను కొనే స్థాయికి ఎదిగాయన్నా... ప్రభుత్వరంగ సంస్థల్లో సైతం పోటీతత్వం పెరిగిందన్నా... ప్రైవేటు రంగంలో ఉపాధి పెరిగిందన్నా... సగటు భారతీయుని జీవనశైలి ఎంతో మారిందన్నా.... వీటన్నిటి వెనకా పీవీ దార్శనికత ఉంది. ఆయన సంస్కరణలనే మొక్కలు నాటితే ప్రస్తుతం మనం వాటి ఫలాలు అనుభవిస్తున్నాం. అందుకే ఆయన నూతన ఆర్థిక విధానాల విధాత, గ్లోబల్ ఇండియాకు రూపశిల్పి. విదేశాంగ విధానంలో మేలి మలుపులు పీవీ దౌత్యనీతి ఫలితమే. ‘లుక్ ఈస్ట్ పాలసీ’ప్రవేశపెట్టి సింగపూర్, మలేసియా, ఇండోనేసియా వంటి ‘ఏషియన్ టైగర్స్’కి భారత్‌ను చేరువ చేసి వ్యాపారాభివృద్ధికి దోహదం చేసింది ఆయన దూరదృష్టే. ఇప్పుడు ఆ విధానాన్నే ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’గా కొనసాగిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యను పక్కనపెట్టి వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాలని ప్రతిపాదించి, బీజింగ్ వెళ్లి ఒప్పందం కుదుర్చుకొని వచ్చింది పీవీనే. దాదాపు మూడు దశాబ్దాలు భారత్–చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పీవీ దౌత్యమే కారణం. రెండో అణు పరీక్షకు రంగం సిద్ధం చేసిన దక్షత కూడా పీవీదే. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆయన భూ సంస్కరణలకు నాంది పలికారు. దేశంలో భూ సంస్కరణలను అత్యంత నిజాయితీగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయన. భూ సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేసినందుకు, ముల్కీ రూల్స్‌ను సమర్థించినందుకు ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించారు. అయినా పీవీ చలించలేదు. అనన్య సామాన్యమైన మేధో సంపత్తి, సామాజిక సమస్యలపై లోతైన అవగాహన ఉన్న పీవీ... విద్యా మంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. కేంద్రంలో మానవవనరుల శాఖ మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. ఈ విద్యాలయాలు గ్రామీణ విద్యార్థులకు నేటికీ ఉచితంగా ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తున్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారెందరో ఉన్నతస్థాయి పదవులు పొందారు. ఉన్నత ఉద్యోగాలలో రాణించారు. అన్ని కోర్సుల అకడమిక్ పుస్తకాలన్నీ తెలుగులో లభించాలనే ఉద్దేశంతో తెలుగు అకాడమీని పీవీ నెలకొల్పారు. పీవీ వ్యక్తిత్వం ఒక సహస్రదళ పద్మం. అనేక కోణాలున్న సమున్నత వ్యక్తిత్వం. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలలోను అనర్గళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు. రాజకీయాల్లో మునిగి తేలుతూనే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ’వేయి పడగలు’బృహన్నవలను హిందీలోకి సహస్ర ఫణ్ పేరుతో అనుసృజించారు. ఎన్నో కథలు, పద్యాలు, గేయాలు, నవలికలు రాశారు. చిన్న గ్రామంలో పుట్టి విద్యార్థి దశలోనే నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించి ఓయూ నుంచి బహిష్కరణకు గురైనా పీవీ వెరవలేదు. మహారాష్ట్ర వెళ్లి నాగపూర్, పుణెలో ఇంటర్, బీఎస్సీ, లా డిగ్రీలలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. పేదలపట్ల సానుభూతి, ప్రయోగశీలత, పార్టీపట్ల, ఆదర్శాలపట్ల అంకితభావంతో ఉన్న ఆయన రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై ప్రధానిగా సర్వోన్నత పదవిని అధిష్టించారు. అటువంటి మహనీయుడికి, తెలంగాణ ముద్దుబిడ్డకు, ప్రపంచ మేధావికి, బహుభాషావేత్తకు, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారత నిర్మాతకు జాతిరత్నమై భాసిల్లిన నాయకునికి భారతరత్న పురస్కారం ఇచ్చి భారతజాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించడం సముచితంగా ఉంటుంది.’ తీర్మానం ఇదే.. ’తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదుడు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వల దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాల్లో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువునూ ప్రతిష్టించాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది’అని సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, కేసీఆర్ సూచన మేరకు శాసనసభ ప్రాంగణంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. మండలిలోనూ ఏకగ్రీవంగా ఆమోదం పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనమండలి సైతం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం కేసీఆర్ తరఫున వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి పీవీ దార్శనికతను కొనియాడారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు టి. జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పురాణం సతీష్, భానుప్రసాద్, నారదాసు లక్ష్మణరావు ప్రసంగించారు. నెక్లెస్ రోడ్డుకు ‘పి.వి. నరసింహారావు నెక్లెస్ రోడ్డు’గా నామకరణం చేయాలని, పదో తరగతి పాఠ్యాంశాల్లో పీవీపై ఒక చాప్టర్‌ను పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఈ తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. వర్షాకాల శాసనసభ రెండో రోజు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఈ సందర్భంగా సభలో ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ మన ఠీవి అని, ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గ్లోబల్ ఇండియా నిర్మాత పీవీ నరసింహారావు అని, దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధాని అయ్యారని కేసీఆర్ తెలిపారు. పీవీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రి చేసిన ఘనత పీవీది అని పేర్కొన్నారు. పీవీ నాటిన సంస్కరణ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని సీఎం తెలిపారు. భూ సంస్కరణలకు పీవీనే నాంది పలికారని గుర్తుచేశారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడురు. హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి: భట్టి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతిస్తున్నామని తెలిపారు. సంక్షోభాల సమయంలో చాకచాక్యంగా పీవీ పాలన చేశారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని భట్టి పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యుద్ధంలో గెలిచినవారే చరిత్రను రాస్తారని తెలిపారు. పీవీ స్థాయికి తగ్గ విధంగా భారత ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటమని పీవీ చెప్పారని గుర్తు చేశారు. కాగా, నేడు అసెంబ్లీలో నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును మంత్రి సబితారెడ్డి సభలో పెట్టనున్నారు. తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020, తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్లు -2020, ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. -
‘వెన్నుపోటుకు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం సిగ్గు చేటు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వెన్నుపోటుకు టీడీపీ నేతలు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు చేసిన వెన్నుపోటుపై ప్రజలు తలదించుకుంటున్నారు. ఎన్టీఆర్‌పై కుట్రలు పన్ని ఆయనను పదవి నుంచి దించడమే కాకుండా చెప్పులతో కొట్టి అవమానించారు. టీడీపీ నేతలు చేస్తున్న పనికి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది. ఆయన నుంచి అన్యాయంగా పార్టీతో పాటు సింబల్‌ని కూడా లాక్కున్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఎందుకు భారత రత్న అవార్డ్‌కు సిఫార్సు చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా బలంతో అధికారంలోకి వస్తే.. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చారు. 25 ఏళ్ళలో చంద్రబాబు రాష్ట్రనికి చేసింది ఏమీలేదు. ఒక్క పథకం కూడా చంద్రబాబు పేరు గుర్తుకు వచ్చేలా పెట్టలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. (చదవండి: తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే) అంతేకాక ‘మీడియా మేనేజ్మెంట్తో చంద్రబాబు బతుకుతున్నారు. వ్యవసాయం దండగన్న సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం ఎత్తివేసిన ఘనత చంద్రబాబుది. ఆయన ఇచ్చిన లేఖతో రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యేక హోదకు బదులు ప్యాకేజీకి అంగీకరించారు. అమరావతిలో 55 వేల కోట్లకు టెండర్లు పిలిచి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హీరోనా...151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి హీరోనా’ అంటూ పార్థసారథి ప్రశ్నించారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ‘పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చినవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొ న్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలచుకునేలా, చిరస్మరణీయంగా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాదంతా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పీవీ జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞాన భూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమితంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని, అదే రోజు దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని, మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షిస్తారని సీఎం వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి, నిధులు విడుదల చేసుకుంటూ పోతామన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి సోమేశ్‌కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, కుమార్తె వాణిదేవి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.ఉత్సవాల నిర్వహణలో భాగం గా చేయాల్సిన కార్యక్రమాలను సీఎం నిర్దేశించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ► యావత్ దేశ ప్రజలకు ఆయన గొప్పతనం చెప్పుకునేలా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలి. ► భారత పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరాలి. ► రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ పెట్టిన విధంగానే హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ ఏర్పాటు కావాలి. కేకే నేతృత్వంలోని కమిటీ రామేశ్వరం వెళ్లి వచ్చి, పీవీ మెమోరియల్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలి. ► వివిధ సందర్భాలకు సంబంధించిన పీవీ ఫొటోలను సేకరించాలి. వాటిని భద్రపరచాలి. ఫొటో ఎగ్జిబిషన్లు నిర్వహించాలి. ► హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీవీ కాంస్య విగ్రహాలను నెలకొల్పాలి. ► రాష్ట్ర అసెంబ్లీలో పీవీ చిత్ర పటాన్ని పెట్టాలి. ► పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయి. పీవీకి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? పీవీ తర్వాత ఎలా మారింది? అనే విషయాలను పొందుపరుస్తూ ప్రత్యేక సంచిక రావాలి. ► పీవీ సర్వేల్లో పెట్టిన మొదటి రెసిడెన్షియల్ స్కూల్ దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికింది. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారు. ఇలా విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషిని వివరించేలా రచనలు చేయించాలి. ► పీవీ గొప్ప సాహితీవేత్త. అనేక భాషలపై పట్టున్న పండితుడు. అనేక రచనలు చేశారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ రాసిన పుస్తకాలను పునర్ముద్రించాలి. అముద్రితంగా ఉన్న వాటిని అచ్చువేయాలి. వాటిని లైబ్రరీలకు, విద్యా సంస్థలకు, ప్రముఖులకు ఉచితంగా పంపిణీ చేయాలి. ► విద్య, సాహిత్య, రాజకీయ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం పీవీ స్మారక అవార్డు నెలకొల్పాలి. క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వాలి. ► రాష్ట్రంలోని ప్రతి ఊరికీ పీవీ గొప్పతనం తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందులో భాగస్వాములు కావాలి. ► పీవీ తెలుగువాడు. తెలంగాణవాడు. జర్నలిస్టు. సాహితీవేత్త. కాబట్టి పీవీకి ఘనమైన అక్షర నివాళి అర్పించేలా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి. కవులు పాటలు రాయాలి. పత్రికలు ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాలి. బిల్ క్లింటన్, జాన్ మేజర్ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో పీవీకి అనుబంధం ఉంది. వారి అభిప్రాయాలు కూడా సేకరించాలి. వీలయితే వారిని ఉత్సవాలలో భాగస్వాములను చేయాలి. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్య్ర సమరయోధుడుగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా ఆయన చేసిన కృషిని తెలిపేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీర్, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు రావాలి. పీవీకి తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలతో, దేశ వ్యాప్తంగా అనేక మందితో అనుబంధం ఉంది. ప్రధానిగా, విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించడం వల్ల విదేశాల్లో కూడా ఆయనతో అనుబంధం కలిగిన వారున్నారు. పీవీ జయంతిని రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించాలి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉంది. వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలి. -
ప్రణబ్ ముఖర్జీ (మాజీ రాష్ట్రపతి) రాయని డైరీ
ఎవరో తట్టి లేపుతున్నారు. ‘‘ఏమిటీ?’’ అన్నాను. ‘‘భారత రత్న వచ్చింది’’ అంటున్నారు. కళ్లు తెరిచి చూసే ప్రయత్నం చేశాను. పడక్కుర్చీలో ఉన్నాననుకుంటా అంతసేపూ. నేను పడక్కుర్చీలో ఉన్న విషయం తెలుస్తూనే ఉంది కానీ, ఆ పడక్కుర్చీ ఎక్కడ ఉన్నదీ వెంటనే గ్రహింపునకు రాలేదు. న్యూఢిల్లీలోని టెన్ రాజాజీ మార్గ్ రిటైర్మెంట్ హోమ్లోనా లేక, కోల్‌కతా లేక్ రోడ్‌లోని నా పూర్వీకుల కవి భారతి శరణి గృహంలోనా.. ఎక్కడుంది నా పడక్కుర్చీ! గుండెలపై వాల్చుకున్న పుస్తకం కింద పడి ఉంది. ‘ది కోయెలేషన్ ఇయర్స్’. నేను రాసిందే. ఇప్పుడెందుకు బయటికి తీశానో మరి! నేనే తీశానా? పిల్లలెవరైనా తీసి నామీద పడేసి వెళ్లిపోతే, నేను నిద్రలోకి జారుకున్న ప్పుడు దానంతటదే కిందకి జారి పడిందా? ‘కోయెలేషన్ ఇయర్స్’ తర్వాత ఏడాదిగా మళ్లీ ఏమీ రాయలేదు. పబ్లిషర్లు కూడా ఏమీ ఆసక్తి చూపడం లేదు. ‘‘ప్రణబ్‌జీ.. మీరు రాస్తున్నారు కానీ, రాసుకోవడం లేదు’’ అన్నారు రూపా పబ్లికేషన్స్ ప్రతినిధి ఒకరు ఈమధ్య ఇంటికి వచ్చినప్పుడు. వాళ్ల ఉద్దేశం అర్థమయింది. గాయపడ్డ పులి ఆటోబయోగ్రఫీ రాసుకోకుండా ఉంటుందా అని కొన్నేళ్లుగా వాళ్లు ఎదురు చూస్తున్నారు. ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైజ్’ అని రాస్తే, అందులో కాంగ్రెస్ పార్టీ సతాయింపులు – నా రాజకీయ జీవితంలోని త్యాగాలు ఉంటాయని వెయ్యి ఆశలు పెట్టుకున్నారు! ‘ది డ్రమాటిక్ డికేడ్ : ది ఇందిరా గాంధీ ఇయర్స్’ అని రాస్తే, అందులో పెద్దావిడను తిట్టిపోసి, మిగిలింది ఏమైనా ఉంటే చిన్నావిడపై పోసి ఉంటానని ఉత్కంఠకు, ఉద్వేగానికీ లోనయ్యారు. ‘‘మీరెప్పుడు కొత్త పుస్తకం సిద్ధం చేస్తున్నా అందులోంచి దేశాన్ని కుదిపివేసే కొన్ని సంగతులు బయట పడబోతున్నాయని ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది ప్రణబ్‌జీ. తీరా చూస్తే, ఇండియన్ ఎకానమీ, దేశం ముందున్న సవాళ్లు.. ఇలాంటివి తప్ప వాటిల్లో ఇంకేమీ ఉండవు’’ అని పబ్లిషర్లు నిరుత్సాహపడటం చూస్తుంటే.. పాపం వారిని ఎప్పుడైనా ఒకసారి అనూహ్యంగా ఉత్సాహపరచడానికి మార్గాలేమైనా ఉన్నాయా అని నన్ను నేను అన్వేషించు కోవాలని అనిపిస్తూ ఉంటుంది. ‘‘ఇప్పటికైనా మీ మనసులోని భావాలను బయటపెడతారా?’’ అని అడిగారు కపీష్ మెహ్రా. రూపా పబ్లికేషన్స్ ఎండీ ఆయన. నేరుగా ఆయన నా పడక్కుర్చీ దగ్గరకే వచ్చి అడిగారు! ‘‘ఓ.. ఇంతక్రితం మీరేనా నన్ను తట్టి లేపి, భారత రత్న వచ్చిందని చెప్పారు! చెప్పి, మళ్లీ ఎక్కడికి వెళ్లారు?’’ అని అడిగాను. ‘‘ఎక్కడికీ వెళ్లలేదు ప్రణబ్‌జీ. మీరు పూర్తిగా మేలుకోడానికి కొంత సమయం ఇచ్చేందుకు బాల్కనీలోకి వెళ్లి నిలుచున్నాను’’ అన్నారు మెహ్రా. ‘‘చెప్పండి’’ అన్నాను నవ్వుతూ. ‘‘ప్రణబ్‌జీ.. మీకు భారత రత్న రావడాన్ని.. మీ మనోభావాలను వెల్లడించ డానికి ఒక తిరుగులేని సందర్భంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రణబ్‌జీ.. మీకు భారత రత్న వచ్చిన ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరూ మీకు భారత ప్రధాని పదవి రాని సందర్భాలతో పోల్చి చూస్తున్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, ప్రధాని అవవలసి ఉన్న మీరు ప్రధాని కాలేకపోయారు. శ్రీమతి సోనియాగాంధీ మిమ్మల్ని ప్రధానిని చేయవలసి ఉన్నప్పుడూ మీరు ప్రధాని కాలేకపోయారు. అందుకే మీకు భారత రత్న రావడం కన్నా, మీరు భారత ప్రధాని కాలేకపోవడం ఇప్పుడు ముఖ్యమైన విషయం అయింది..’’ అన్నారు మెహ్రా. నవ్వాను. ‘‘ముఖ్యమైన విషయాలను ముఖ్యమైన విషయాలు గానే ఉంచుదాం మెహ్రాజీ’’ అని చెప్పాను. -
ప్రణబ్ ‘భారతరత్న’ ఆనందదాయకం
సాక్షి, అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు లభించ డం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రణబ్ ఈ అవార్డుకు అన్నివిధాలా అర్హుడన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని ప్రశంసించారు. ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా, ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌కు మరణానంతరం భారతరత్న గౌరవం దక్కడంపై జగన్ సంతోషం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలను పొందిన తెలుగువారికి జగన్ అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు వేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ శుక్రవారం అభినందనలు తెలిపారు. ప్రణబ్‌ముఖర్జీకి భారతరత్నపై కేసీఆర్ హర్షం సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ప్రణబ్ ముఖర్జీ పూర్తి అర్హుడని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి, రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న చొరవను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. రాజనీతిజ్ఞుడిగా.. రచయితగా, దౌత్యవేత్తగా, పాలనాదక్షుడిగా ప్రణబ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. -
వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌కు చేదు అనుభవం
-
వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌పై దాడి
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. కడసారి వాజ్‌పేయిని దర్శించుకునేందుకు వచ్చిన అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తలు సామూహికంగా దాడి చేశారు. ఈ విషయం గురించి అగ్నివేష్ మాట్లాడుతూ ‘వాజ్‌పేయి గారికి నివాళులర్పించేందుకు నేను ఇక్కడకు వచ్చాను. కానీ పోలీసు బందోబస్తు ఉండటం వల్ల నడుచుకుంటూ వస్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి కొందరు యువకులు వచ్చి నా మీద దాడి చేయడం ప్రారంభించారు. మేము ఇద్దరం, ముగ్గరమే ఉన్నాం.. కానీ వాళ్లు గుంపుగా వచ్చారు. వాళ్లు నా తలపాగాను పడేసి, మమ్మల్ని తిడుతూ, మా పై దాడి చేశార’ని తెలిపారు. అంతేకాక ‘వారిలో కొందరు నన్ను ఉద్దేశిస్తూ అతను దేశద్రోహి.. కొట్టండి, కొట్టండి అంటూ నా మీద దాడికి పురిగొల్పార’ని అగ్నివేష్ తెలిపారు. అయితే అగ్నివేష్‌పై దాడి జరగడం ఇది రెండో సారి. గతంలో ఒకసారి జార్ఖండ్‌లో బీజేపీ కార్యకర్తలు అగ్నివేష్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ ఛోడ్ దో : మోదీకి వాజ్‌పేయి ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ : భరత మాత ముద్దుబిడ్డ, బీజేపీ పెద్ద దిక్కు అటల్ బిహారీ వాజ్‌పేయి(93) దివికెగిశారు. వాజ్‌పేయి ఇక లేరని వార్తను యావత్ భారత్ దేశం తట్టుకోలేకపోతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయితే అటల్జీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్‌పేయి లేకపోవడం ఒక యుగాంతంలా ఉంది అని కన్నీరు పెట్టుకున్నారు. వాజ్‌పేయికి, ప్రధాని నరేంద్ర మోదీ అవినాభావ సంబంధం ఉంది. మోదీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వాజ్‌పేయితో మంచి సంబంధాలు కొనసాగేవి. 1995, 1998లలో జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా మోదీ పోషించిన పాత్రను వాజ్‌పేయి ఎంతో అభినందించారు. 1998 ఎన్నికల సమయంలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలన్నీ మోదీనే తన భుజంపై వేసుకున్నారు. ఆ సమయంలోనే గుజరాత్‌కు కూడా మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో మోదీ ఢిల్లీలోనే ఉన్నారు. కానీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. 1995, 1998 ఎన్నికల్లో మోదీ వ్యూహాల రూపకల్పనపై వాజ్‌పేయి ఎంతో ఇంప్రెస్ అయ్యారట. ఆ తర్వాత రెండు మూడేళ్లకు గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణించడం, అడ్మినిస్ట్రేషన్ కుదుపులకు లోనుకావడం జరిగింది. ఇక 2001 రిపబ్లిక్ డే రోజునే గుజరాత్‌ను పెను భూకంపం కబళించింది. ఈ పర్యావరణ విపత్తులో 15వేల మంది నుంచి 20 వేల మంది వరకు మరణించారు. ఆ సమయంలో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాజ్‌పేయి నుంచి మోదీకి పిలుపు అందింది. వెంటనే వచ్చిన 7 రేస్ కోర్స్ రోడ్డు(ప్రస్తుతం 7, లోక్ కల్యాణ్ మార్గ్)లో ఉన్న తన అధికారిక నివాసంలో తనను కలవాల్సిందిగా వాజ్‌పేయి మోదీని ఆదేశించారు. వాజ్‌పేయి ఆదేశాల మేరకు, మోదీ వెళ్లి ఆయన్ను కలిశారు. ‘వెంటనే నీవు ఢిల్లీ వదిలి వెళ్లాలి. ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే’ అన్నారట. వాజ్‌పేయి మాటలకు ఏమైందోనని తీవ్ర షాకింగ్‌కు గురైన మోదీ, ఎక్కడికి వెళ్లాలి అని అడిగారట? కేవలం ఒక్క పదంలోనే వాజ్‌పేయి సమాధానం కూడా చెప్పారు. గుజరాత్ అని. కొన్ని రోజుల అనంతరం 2001 అక్టోబర్ 7న కేశుభాయ్ పటేల్ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నాలుగు నెలలకు అంటే 2002 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి గోద్రా రైలులో వస్తున్న కర్ సేవకులకు, దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తదనంతరం గుజరాత్లో పెద్ద ఎత్తున్న మతహింస కాండ జరిగింది. ఆ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులూ మరణించినట్టు తెలిసింది. కానీ వాస్తవానికి 2,000 కు పైగా మరణించి ఉంటారని అంచనా. ఈ అల్లర్ల సమయంలో మోదీకి, వాజ్‌పేయి ఒక్కటే సూచించారట. ఎట్టిపరిస్థితుల్లో ‘రాజధర్మా’న్ని వదలొద్దని. రాజధర్మం అంటే అధికారంలో ఉన్న వాళ్లు ఎగువ, దిగువ కులాల మధ్య వ్యత్యాసం చూపరాదని సమాజంలోని అన్ని మతాల ప్రజల పట్ల సమాదరణ కలిగి ఉండాలని స్పష్టంచేశారట. ఈ అల్లర్లు మోదీ ఇమేజ్ను ఏ మాత్రం దెబ్బతీయలేదు. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ.. సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి, మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు. 2007, 2012 ఎన్నికల్లో గుజరాత్లో మోదీనే ఘన విజయం సాధించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ వేవ్, 2014 గుజరాత్ ఎన్నికల్లో కూడా సఫలమై, ఎన్డీయే తరుఫున భారత్ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు.