Biplab Kumar Deb
-
త్రిపుర సీఎం బిప్లవ్‌దేవ్ రాజీనామా
అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అనుహ్య పరిణామం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్ శనివారం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ హై కమాండ్ ఆదేశాలతో బిప్లవ్‌దేవ్ రాజీనామా చేశారు. ఈరోజు మధ్యాహ్నం బిప్లవ్‌దేవ్ గవర్నర్ సత్యదియో నారాయిన్ ఆర్యను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కాగా, బిప్లవ్‌దేవ్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత రోజే నేడు(శనివారం) రాజీనామా చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రమే కొత్త సీఎంను అధిష్టానం నియమించనున్నట్టు సమాచారం. మరోవైపు.. వచ్చే ఏడాదే త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా ఇలా సీఎం మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్ -
త్రిపుర సీఎంపై హత్యాయత్నం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వాకింగ్‌కు వెళ్లినప్పడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఆయనని ఢీకొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాస్త ఆలస్యంగా ఆ ఘటన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు. హత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బిప్లవ్ కుమార్ తన అధికారిక నివాసమైన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ లేన్‌కి సమీపంలో గురువారం ఈవెనింగ్ వాక్‌కి వెళ్లారు. ఆయన చుట్టూ భద్రతా వలయం ఉన్నప్పటికీ వారి మీదుగా హఠాత్తుగా ఒక కారు దూసుకువచ్చింది. కారు రావడాన్ని గమనించిన బిప్లవ్ పక్కకి జరగడంతో పెను ముప్పు తప్పింది. అయితే ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. ఆ కారుని పట్టుకోవడానికి సీఎం భద్రతా సిబ్బంది విఫలయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు గురువారం అర్ధరాత్రి కారుని, అందులో ఉన్న ముగ్గుర్ని అదుపులోనికి తీసుకున్నారు. వారి వయసు సుమారుగా 20 ఏళ్లు ఉంటుంది. వారు ఎందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారో కారణాలు ఇంకా తెలియలేదు. కోర్టు ఎదుట వారిని హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
కరోనా బారిన మరో ముఖ్యమంత్రి
అగర్తాల: కరోనా వైరస్ బారిన మరో ముఖ్యమంత్రి పడ్డారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌కు తాజాగా కరోనా వైరస్ సోకింది. తాజాగా చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్ తేలిందని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. ఒక్కరోజే లక్ష 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. దీంతో పలు రాష్ట్రాలు, ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. చదవండి: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
త్రిపుర బీజేపీ సర్కార్‌లో అసమ్మతి
అగర్తలా: త్రిపుర రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో అసమ్మతి రగులుతోంది. సీఎం విప్లవ్‌కుమార్ దేవ్‌పై 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి తమ వాదన వినిపించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సుదీప్‌రాయ్ బర్మన్ ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 36 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 25 మంది మార్పును కోరుకుంటున్నారని, మంత్రివర్గాన్ని మార్చాలని వారు ఆశిస్తున్నారని అసమ్మతి ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. సీఎం విప్లవ్‌కుమార్ దేవ్ అసమర్థ పాలన వల్ల త్రిపురలో బీజేపీ బలహీన పడుతోందని అన్నారు. నడ్డాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని మరో ఎమ్మెల్యే పేర్కొన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో బీజేపీకి 36, దాని మిత్రపక్షం ఐపీఎఫ్‌టీకి 8, ప్రతిపక్ష సీపీఎంకు 16 మంది ఎమ్మెల్యేలున్నారు. -
కమలంలో కలకలం: సీఎంపై తిరుగుబాటు
న్యూఢిల్లీ: త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కుమార్‌ను సొంత ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీ అప్రదిష్టపాలవుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఢిల్లీకి చేరారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాష్ట్ర మాజీ ఆరోగ్య, హెవీ వెయిట్ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బార్మన్ నేతృత్వంలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలను కూడా కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా ఢిల్లీలోని త్రిపుర భవన్లో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘మేం దాదాపు 12 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. రాష్ట్రంలో నెలకొన్న నియంతృత్వ, పేలవమైన పాలన గురించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. సీఎం వ్యాఖ్యలు, చేతలతో పార్టీ అప్రదిష్ట పాలవుతుంది’ అన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కితగ్గిన విప్లవ్ దేవ్) ‘ఇప్పటికే పలు అంశాల గురించి ముఖ్యమంత్రి తర అనుచిత వ్యాఖ్యలతో పార్టీని అనేక సార్లు ఇబ్బందుల్లో పడేశారు. ఇక రాష్ట్రంలో కోవిడ్-19 సంక్షోభ నిర్వహణ పేలవంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్య మంత్రి లేరు. దాంతో త్రిపురకు ఓ కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా కోరతాం. ఇక అనుభవజ్ఞులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు డిప్యూటేషన్, స్వచ్ఛంద పదవీ విరమణతో రాష్ట్రాన్ని వీడుతున్నారు. కారణం ఏంటంటే వారు ముఖ్యమంత్రి నియంతృత్వ స్వభావాన్ని భరించలేకపోతున్నారు. ఆఖరికి మీడియాను కూడా బెదిరించారు. దాంతో పాత్రికేయులు కూడా సీఎంకు వ్యతిరేకంగా ముందుకొచ్చారుఝ’ అని తెలిపాడు. అంతేకాక ‘మేమంతా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండే కార్యకర్తలం అని జాతీయ నాయకత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో బీజేపీ దీర్ఘకాలం పదవిలో ఉండాలని భావిస్తున్నాం. కానీ ప్రస్తుత నాయకత్వం కొనసాగితే.. వామపక్షాలు, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు బలపడతాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారు’ అని తెలిపాడు. (చదవండి: అమ్మాయిని కలిసేందుకు వచ్చాడని...) అయితే ఈ వ్యాఖ్యలను విప్లవ్ దేవ్ ప్రధాన అనుచరులు ఖండించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మండి పడ్డారు. ‘రాష్ట్రంలో పాలన సాజవుగా సాగుతుంది. వీరు అవాంతరాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారు పార్టీలో 7-8 మంది ఉంటారు. వీరంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు. బీజేపీ పాత నాయకులు, కార్యకర్తలు, వివిధ స్థాయిలోని నాయకులు విప్లవ్ దేవ్ నాయకత్వం మీద పూర్తి స్థాయి విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నార’ని తెలిపారు. త్రిపురలో బీజేపీ, దాని మిత్రపక్షమైన ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) రాష్ట్రంలో 25 సంవత్సరాల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని తొలగించి 2018లో అధికారంలోకి వచ్చింది. 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తరఫున 36 మంది, ఐపీఎఫ్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. -
సెల్ఫ్ ఐసోలేషన్‌లో త్రిపుర ముఖ్యమంత్రి
అగర్తలా: తమ కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా సోకడంతో తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్నట్లు త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ తెలిపారు. తనకు నిర్వహించిన కరోనా పరీక్షా ఫలితాలు ఇంకా వెలువడలేదని దీంతో ముందు జాగ్రత్త చర్యగా హోం ఐసోలేషన్లోకి వెళుతున్నట్లు వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని పేర్కొన్న విప్లవ్ దేవ్.. కుటుంబసభ్యుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సీఎం ట్వీట్ చేశారు. రాష్ర్టంలో కరోనా బాధితుల సంఖ్య 1742కు చేరింది. పలువురు రాజకీయ ప్రముఖులకు సైతం కరోనా సోకుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా నిర్దారణ అయ్యింది. నూతన విద్యా విధానంపై చర్చించడానికి గతవారం జరిగిన సమావేశానికి షా హాజరయ్యారు. దీంతో పలువురు మంత్రులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. (18 లక్షల పైమాటే) ఇక కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుమార్తెలకు సైతం కరోనా సోకింది. ప్రస్తుతం యడియూరప్ప ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. దేశంలో ఇప్పటిదాకా మొత్తం కరోనా కేసులు 18,03,695, మరణాలు 38,135కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలియజేసింది. ఇదిలా ఉండగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై రెండు, మూడో దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతించింది. Two of my family members found COVID19 POSITIVE.Other family members found NEGATIVE I have undergone COVID19 test, result is yet to come I am following self isolation at my residence & all precautionary measures have been taken Praying for the speedy recovery of family members — Biplab Kumar Deb (@BjpBiplab) August 3, 2020 -
వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కితగ్గిన విప్లవ్ దేవ్
అగర్తలా : పంజాబీలు, జాట్లపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ వెనక్కితగ్గారు. పంజాబీలు, జాట్లు శారీరకంగా దృఢంగా ఉంటారని, అయితే బెంగాలీలకున్న తెలివితేటలు వారికి ఉండవని విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పంజాబీలు, జాట్లపై కొందరికున్న అభిప్రాయాలను మాత్రమే తాను తేటతెల్లం చేశానని, ఏ ఒక్కరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని మంగళవారం ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పంజాబీలు, జాట్లను చూసి తాను గర్విస్తానని, వారితో కలిసి తన జీవిత పయనం సాగిందని చెప్పుకొచ్చారు. ‘ ఈ రెండు వర్గాల్లో నాకు పలువురు స్నేహితులున్నారు..నా వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే క్షమించాలని వేడుకుంటున్నా..దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబీ, జాట్ సోదరుల పాత్రను నేను ఎప్పటికీ గౌరవిస్తుంటా..ఆధునిక భారత నిర్మాణంలో వీరి పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం తాను ఎన్నడూ ఊహించబోన’ని విప్లవ్ దేవ్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, అగర్తలా ప్రెస్ క్లబ్లో ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. దేశంలో ప్రతి వర్గానికీ ఓ ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెబుతూ బెంగాలీలు తెలివితేటలకు పెట్టింది పేరని..పంజాబీలు, జాట్లు శారీరకంగా బలంగా ఉన్నా తెలివితేటల్లో బెంగాలీలకు సరిపోరని విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పంజాబీని సర్ధార్ అంటారని, వారికి తెలివితేటలు తక్కువగా ఉన్నా చాలా దృఢంగా ఉంటారని వారిని బలంలో ఎవరూ గెలవలేరని, ప్రేమతోనే వారిని జయించాలని అన్నారు. ఇక హరియాణాలో పెద్దసంఖ్యలో ఉండే జాట్లకు తెలివితేటలు తక్కువగా ఉన్నా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. జాట్తో ఎవరైనా పెట్టుకుంటే అతడు ఇంటి నుంచి తుపాకీతో బయటకు వస్తాడని అన్నారు. విప్లవ్ దేవ్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దేవ్ వ్యాఖ్యలు బీజేపీ సంస్కృతికి అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ సహా పలు విపక్ష నేతలు ఆరోపించారు. ఇక విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన ‘మహాభారతంలో ఇంటర్నెట్ ఉంది.. మే డే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు?.. విద్యావంతులైన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలి.. లేదంటే పాన్‌షాప్ పెట్టుకోవాలి’ వంటి సూచనలు చేసి విమర్శలపాలయ్యారు. చదవండి : బెంగాలీలతో సరితూగలేరు; ఇది సిగ్గుచేటు! -
తండ్రి ప్రేమ
‘నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అని ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో నిరూపితమైన విషయమే. అయితే కోవిడ్ 19 విజృంభణ నేపథ్యంలో మరోసారి రుజువైంది. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ తన రాష్ట్రంలోని ఓ తండ్రిని ప్రశంసిస్తూ పై నానుడిని ఉదహరించారు. త్రిపుర రాజధాని అగర్తలలో పార్థ సాహా తన కూతురి కోసం కొత్తరకం బైక్ తయారు చేశాడు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మనిషికి మనిషికీ మధ్య భౌతిక దూరం పాటించడం తప్పని సరి కావడంతో పార్థ తన కూతురిని స్కూలుకు తీసుకెళ్లడానికి పైన ఫొటోలో కనిపిస్తున్నట్లు బైక్‌కు రూపకల్పన చేశాడు. పార్థ సాహా టీవీలు రిపేర్ చేస్తాడు. ఈ లాక్డౌన్ ఖాళీ సమయాన్ని అతడు ఇలా ఉపయోగించుకున్నాడు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత స్కూళ్లు తెరుస్తారు. లాక్డౌన్ పూర్తయినా సరే మనుషుల మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించి తీరాల్సిందే. రద్దీగా ఉండే బస్సుల్లో కూతురిని స్కూలుకు పంపించడం తనకు ఇష్టం లేదని, తాను రూపొందించిన ఈ బైక్ మీదనే తీసుకెళ్తానని చెప్పాడు పార్థ సాహా. దీనికి సోషల్ డిస్టెన్సింగ్ బైక్ అని పేరు పెట్టాడతడు. స్క్రాప్ నుంచి ఈ బైక్ పార్థ సాహా అగర్తలలోని పాత ఇనుప సామానుల దుకాణం నుంచి తూకానికి అమ్మేసిన ఒక బైక్‌ను కొన్నాడు. కొద్దిపాటి మార్పులు చేసి, రెండు చక్రాల మధ్య ఒక మీటరు రాడ్‌ను పెట్టి వెల్డింగ్ చేయించాడు. ఈ బైక్ బ్యాటరీతో పని చేస్తుంది. గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. బైక్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఒక సారి ఫుల్‌గా చార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. పార్థ సాహా తాను రూపొందించిన బైక్‌కు ట్రయల్ రన్లు పూర్తి చేసి, ఇప్పుడు ఈ బైక్ మీద కూతుర్ని ఎక్కించుకుని అగర్తలలో విహరిస్తున్నాడు. ఈ బైక్ నగరంలో తిరుగుతుంటే కోవిడ్ 19 నివారణకు తీసుకోవాల్సిన సోషల్ డిస్టెన్స్ గురించి జనానికి మళ్లీ మళ్లీ గుర్తు చేసినట్లవుతోంది. పార్థ బైక్ ప్రజలను చైతన్యపరచడానికి బాగా ఉపయోగపడుతోందని, అవసరం కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. పార్థ ప్రయత్నాన్ని అవసరం చేసిన ఆవిష్కరణ అనుకుంటున్నాం, కానీ నిజానికి ఇది తండ్రి ప్రేమ నుంచి పుట్టిన ఆవిష్కరణ. సోషల్ డిస్టెన్సింగ్ ఈ బైక్ పెంచింది తండ్రీకూతుళ్ల మధ్య భౌతిక దూరాన్ని మాత్రమే. మానసికంగా ఇద్దరి మధ్య ఎంతో దగ్గరితనాన్ని తెచ్చి తీరుతుంది. తన కోసం తండ్రి చేసిన ఈ పని కూతురికి ఎప్పటికీ గర్వకారణమే. సైకిల్‌పై కుమార్తెతో పార్థా సాహా -
సీఎం విడాకులు తీసుకుంటున్నారా; ఛీప్ పబ్లిసిటీ!
అగర్తలా : తన భర్త గురించి కొంతమంది వ్యక్తులు పనిగట్టికుని మరీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ భార్య నితి దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిప్లవ్ దేవ్ తన భార్యను వేధింపులకు గురిచేస్తూ, గృహహింసకు పాల్పడ్డారని.. ఈ క్రమంలో నితి ఆయనకు విడాకులు ఇవ్వనున్నారంటూ కొన్ని మీడియా ఛానెల్‌లలో ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ విషయాల గురించి నితి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆమె సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘ పుకార్లకు నోరు ఉండదు కదా. నీచమైన బుద్ధి కలిగిన, అనారోగ్యంతో బాధ పడుతున్న కొంతమంది వ్యక్తులు ఛీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటివి ప్రచారం చేస్తారు. నా భర్తను చెడుగా చూపించి రాజకీయంగా లబ్ది పొందాలని భావించిన వాళ్లే డబ్బులు చెల్లించి మరీ ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఒకరి భార్య, మరొకరి వదినగా, కూతురిగా, కోడలిగా ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తున్నా. మన రాష్ట్ర ప్రజలకు నిజంగా నాపై ప్రేమానురాగాలు ఉంటే, నన్ను పూర్తిగా విశ్వసించినట్లైతే అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిని బాయ్‌కాట్ చేయండి. నా భర్త పట్ల నాకు అనిర్వచనీయమైన ప్రేమ ఉంది. ఎవరో ఏదో అన్నారని వారికి సమాధానం చెప్పాల్సిన పని లేదు’ నితి దేవ్ పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీజేపీ గతేడాది త్రిపురలో అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువ నాయకుడు బిప్లవ్ దేవ్‌ను.. కమలనాథుల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇక పదవి చేపట్టిన నాటి నుంచి బిప్లవ్ కుమార్ అనేకమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని మతి చెడిందంటూ ఎద్దేవా చేయడం... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుసగా తన వ్యవహార శైలితో ఆయన మీడియాలో దర్శనమిచ్చారు. -
పుకార్ల హత్యలు.. ఆనందంలో త్రిపుర : సీఎం
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనుమానితులుగా కనిపిస్తే మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలపై మీరేంమంటారు? అని విప్లవ్‌ను మీడియా ప్రతినిధులు అడుగ్గా.. రాష్ట్రం ఆనందంలో ఉందని సమాధానం ఇచ్చారు. ‘నా ముఖం చూడండి. ఆనందంతో ఎంతలా వెలిగిపోతోందో’ అచ్చూ నాలానే రాష్ట్రంలోని ప్రజలు ఆనందంతో ఉన్నారని విప్లవ్ పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత నోరు జారానని తెలుసుకున్న సీఎం తప్పుగా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. అగర్తల విమానాశ్రయాన్ని ఉద్దేశించి అన్నానని వివరణ ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్టుకు ఇటీవల ‘మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య కిశోర్ ఎయిర్‌పోర్టు’గా నామకరణం చేశారు. గత నెల 28న త్రిపురలో మూడు ‘మాబ్ లించింగ్’ (కొట్టి చంపడం) ఘటనలు జరిగాయి. పిల్లల కిడ్నాపర్లుగా భావించి ఇద్దరిని, కిడ్నీ స్మగ్లర్ల్‌గా అనుమానించి కొట్టి చంపారు. -
మళ్లీ వివాదం రాజేసిన విప్లవ్ దేవ్
గౌహతి : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతిని వెనక్కిఇచ్చేశారని అన్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన రవీంద్ర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1919లో జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా ఠాగూర్ తనకు బ్రిటన్ ప్రకటించిన సర్ టైటిల్‌ను నిరాకరించారు. 1913లో ఠాగూర్‌కు సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. కాగా బీర్భంలోని శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీ మ్యూజియం నుంచి ఆయన నోబెల్ బహుమతి, సైటేషన్ 2004లో చోరీకి గురైంది. దీనిపై అప్పటి బెంగాల్ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య సీబీఐకి కేసును అప్పగించగా, తగిన ఆధారాలు లేవంటూ 2009లో కేసును మూసివేసింది. 2009లో విచారణను మూసివేసిన క్రమంలో చోరీ కేసును పశ్చిమ బెంగాల్ దర్యాప్తు ఏజెన్సీకి ఎందుకు అప్పగించడం లేదంటూ కోల్‌కతా హైకోర్టు 2017లో సీబీఐని ప్రశ్నించింది. మరోవైపు విప్లవ్ దేవ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సివిల్ ఇంజనీర్లే సివిల్ సర్వీసు పరీక్షలు రాయాలని వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూడకుండా పాన్ షాపులు పెట్టుకోవాలని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విప్లవ్ దేవ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని మందలించినా పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం. -
మోదీ తర్వాత విప్లవ్ కుమారే అంటూ సెటైర్
-
త్రిపుర సీఎంను ఓ ఆటాడుకున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ద తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కాంగ్రెస్ వ్యూహత్మకంగా అడుగేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది. మే 6(ఆదివారం)న ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా తమ అధికారిక ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ వివాదస్పద వ్యాఖ్యలను జోడించింది. 150 సెకన్ల పాటు నిడివి కలిగిన ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం బీజేపీకి ఊపు తీసుకొచ్చే నేత త్రిపుర సీఎం విప్లవ్ కుమారేనని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలు విప్లవ్ కుమార్, బీజేపీల అభిప్రాయాలు మాత్రమేనని పేర్కొంది. త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విప్లవ్ కుమార్ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం విప్లవ్‌ను మందలించినట్లు వార్తలొచ్చాయి. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన విప్లవ్ వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, బీజేపీని ఇరుకున పెట్టేసాయి. ఈ వ్యాఖ్యాలనే ట్వీట్ ద్వారా కాంగ్రెస్ మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేసింది. -
ట్వీట్ల మీద ట్వీట్లు కుమ్ముతున్నారు...
సాక్షి, న్యూఢిల్లీ : మహాభారతం కాలం నుంచి ఇంటర్నెట్ సౌకర్యం మనకుందంటూ వాదించి నవ్వులపాలైన త్రిపుర బీజేపీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ రోజుకో వ్యాఖ్యతో మనల్ని తెగ నవ్విస్తున్నారు. మెకానికల్ ఇంజనీర్లు కాకుండా సివిల్ ఇంజనీర్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఎంపిక చేసుకుంటే బాగుంటందని, ఎందుకంటే రెండింట్లో సివిల్ ఉందని, ఒక సివిల్ పట్ల ఉన్న అవగాహన రెండు సివిల్‌కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్య ట్విటర్లో నవ్వులు పూయిస్తోంది. ఎవరికివారు తమదైన శైలిలో ఆయన వ్యాఖ్యపై స్పందిస్తున్నారు. ‘మెకానికల్ ఇంజనీర్లు మెకానిక్స్, కెమికల్ ఇంజనీర్లు కేవలం కెమెస్ట్స్ కావాలి.....హయ్యర్ ఎడ్యుకేషన్ హిల్ స్టేషన్లలో మాత్రమే చేయాలి....సింగ్‌లు మాత్రమే సింగర్లు కావాలి....వర్జిన్స్ మాత్రమే వర్జిన్ ఏర్‌లైన్స్‌లో ప్రయాణించాలి......లీవ్స్ కోసం ట్రీస్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి....బస్టాప్‌లో బస్సు దొరికినప్పుడు, ఫుల్స్టాప్లో ఫుల్ ఎందుకు దొరకదు....ఇండియానా జోన్స్ ఇండియన్ ఎందుకు కాదు......హిప్సోస్కు మాత్రమే హిప్స్ ఉంటాయి. ...ఫిజిక్స్ డిగ్రీవారే ఫిజిషియన్లు అవుతారు.....జీబ్రాలు మాత్రమే బ్రాలు వేసుకోవాలి....అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు కుమ్ముతున్నారు. -
త్రిపుర ముఖ్యమంత్రి ట్వీట్లతో సెటైర్లు..
-
వీళ్లు ఆయనకు వారసులా?..ఖర్మ!
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ల వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. విచిత్రమైన వ్యాఖ్యలతో బీజేపీ ముఖ్యమంత్రులిద్దరూ వార్తల్లో నిలిచింది తెలిసిందే. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వీరి వ్యాఖ్యలపై మండిపడుతోంది. తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వీళ్ల వ్యవహారంపై స్పందించారు. ‘ఒకయాన(విజయ్ రూపానీ) గూగుల్‌ను-నారదుడ్ని పోలుస్తూ మాట్లాడతారు. ఆయన జ్ఞానం ఇంతేనేమో. ఇంకోకరేమో(విప్లవ్) మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉందంటాడు. ఆయన అక్కడితోనే ఆగలేదు. యువకులను ఉద్దేశించి ‘ఉద్యోగాలేం చేస్తారు.. పాన్ షాపులు పెట్టుకుని బతకండి’ అంటాడు. మరోసారి అందాల పోటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తాడు. వాళ్లిద్దరి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. మోదీగారి వారసులు ఇలా ఉన్నారు. వీళ్లేం ముఖ్యమంత్రులు. వీళ్లా ప్రజల్ని పాలించేంది?. జనాలకు వీళ్లసలు ఏం చెప్పదల్చుకున్నారు. ఇది ఇంతటితోనే ఆగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు’ అని రేణుకా చౌదరి తెలిపారు. సోమవారం సాయంత్రం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే విప్లవ్ కుమార్ దేవ్‌కు అధిష్టానం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిందన్నది తెలిసిందే. అయితే ఆ వార్తలను విప్లవ్ తోసిపుచ్చారు. ‘మోదీ నన్ను కొడుకులా భావిస్తారు. ఆయన నాపై ఆగ్రహంగా ఉన్నారన్నది నిజం కాదు. చాలా కాలం క్రితమే ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్నా. అది ఇప్పుడు కుదరటంతో వెళ్లి కలవబోతున్నా’ విప్లవ్ వివరణ ఇచ్చుకున్నారు. -
ఆ ముఖ్యమంత్రిని ఆడేసుకుంటున్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రాకులాడకుండా ఆవులను పెంచుకోండి, పాన్ షాపులు పెట్టుకోండంటూ హాస్యస్పద వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ సోషల్ మీడియోలో విపరితంగా జోకులు పేలుతున్నాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారే సివిల్స్ రాయలని, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారు రాయకుడదంటూ చేసిన వ్యాఖ్యలపై అయితే ఇంక ఎక్కువగా జోకులు పేలుతున్నాయి. టైగర్ బిస్కెట్లను కేవలం టైగర్స్ మాత్రమే తినాలని, గేట్ ఎగ్జామ్‌ను కేవలం గేట్ కిపర్స్ మాత్రమే రాయాలంటూ ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ ఫొటోలు పెట్టి ఆయనను తెగ ఆడేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రెటిలు పప్పులో కాలేసి మాట్లాడిన మాటలే సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఎవర్ని వదిలిపెట్టట్లేదు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన ‘బీకాంలో ఫిజిక్స్’ వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. దాంతో ఆయనకు ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేసింది. ఇప్పుడు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్‌ని కూడా నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు. ఆయన గతంలో ఇంటర్నెట్ మహాభారత కాలంలోనే ఉందని అన్నారు. ఇలాంటి హాస్యస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. -
‘గూగూల్లాగే ఆయనకూ అన్నీ తెలుసు..’
అహ్మదాబాద్ : గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌కుమార్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా.. సోషల్ మీడియాలో ఆయనను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు పీఎంవో నుంచి సమన్లు కూడా అందినట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా విప్లవ్ తరహాలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) మీడియా వింగ్ విశ్వ సంవాద్ కేంద్ర ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న విజయ్ రూపానీ మాట్లాడుతూ.. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను నారద మహర్షితో పోల్చారు. ‘ప్రపంచంలో ఉన్న సమాచారమంతా నారద మహర్షి దగ్గర ఉండేది. అంటే గూగుల్‌ను ఆయనతో పోల్చవన్న మాట. అయితే నారదుడు తన దగ్గరున్న సమాచారాన్ని మంచి కోసమే వినియోగించేవారని’ విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. ‘నారదుడు అందరికీ మంచి చేశాడు. అందుకే ఆయనను రుషిగా అంగీకరించారు. నారదుడు మనుషుల మధ్య కలహాలు సృష్టించాడనే అపవాదు ఉంది. కానీ అది నిజం కాదు. ప్రజల సంక్షేమం కోసమే ఆయన అలా చేశారంటూ’ రూపానీ పేర్కొన్నారు. నారదుడు నిజమైన జర్నలిస్టు అని, ప్రస్తుతమున్న జర్నలిస్టులు కూడా నారద మహర్షిలాగే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలంటూ సూచించారు. -
విప్లవ్ యవ్వారం.. రంగంలోకి మోదీ
అగర్తలా: వివాదాస్పద వ్యాఖ్యలతో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా.. సోషల్ మీడియాలో విప్లవ్, బీజేపీలను విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో విప్లవ్కు నోటికి అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. విప్లవ్‌ను తన ఎదుట హాజరుకావాల్సిందిగా ఆయన సమన్లు జారీ చేశారు. మే 2న విప్లవ్‌ను తమ ఎదుట హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్లు సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. తన వ్యాఖ్యలపై ఆయన వారికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పీఎంవో కార్యాలయం కూడా సమన్లు జారీ చేసిన విషయాన్ని ధృవీకరించాయి. కాగా, గత నెలలో త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుస తన వ్యవహార శైలితో ఆయన మీడియాలో రోజు నిలుస్తున్నారు. -
‘ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు.. పాన్ షాప్ పెట్టుకోండి’
సాక్షి, అగర్తలా : సివిల్ ఇంజనీర్లు మాత్రమే సివిల్ సర్వీసులు చేపట్టాలని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాజకీయ నేతల వెంటపడరాదని సూచించారు. చదువుకున్న యువత పాన్ షాపులు పెట్టుకుని స్వయం ఉపాధికి మొగ్గుచూపాలని సర్కారీ కొలువుల కోసం నేతలపై ఒత్తిడి పెంచవద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూడకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రుణాలు పొంది వివిధ వ్యాపారాలు చేపట్టేందుకు మొగ్గుచూపాలని సలహా ఇచ్చారు. త్రిపుర యువకులు ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి తమ విలువైన సమయం వృధా చేసుకుంటున్నారని, నేతల చుట్టూ తిరిగే బదులు సొంతంగా పాన్ షాపు పెట్టుకుని ఉంటే ఆయా యువకుల వద్ద ఈపాటికి రూ 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేదని అన్నారు. రూ 75 వేల బ్యాంకు రుణంతో నిరుద్యోగ యువత నెలకు సులువుగా రూ 25,000 ఆర్జించవచ్చని చెప్పుకొచ్చారు. చదువుకున్న వారు వ్యవసాయం, పౌల్ర్టీ పనులు వంటివి చేయరాదనే చులకన భావం ప్రజల్లో నెలకొందని అన్నారు. స్టార్టప్ ప్రాజెక్టులకు ప్రధాని ప్రవేశపెట్టిన ముద్ర రుణంతో యువకులు గౌరవంగా స్వయం ఉపాధితో జీవించే అవకాశం ఉందని చెప్పారు. -
సర్కార్ కొలువుకి గవర్నర్ సిఫార్సు.. రచ్చ
అగర్తలా: త్రిపుర గవర్నర్ తథాగత రోయ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి బీజేపీ నేత పేరును ఆయన సిఫార్సు చేశారు. బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సర్వదామన్ రాయ్‌కు అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం ఇప్పించాంటూ కోరుతూ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌కు స్వయంగా గవర్నర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖ బయటకు రావటంతో తీవ్ర దుమారం చెలరేగింది. ‘సర్వదామన్తో నేను బీజేపీలో పని చేశా. ఆయన ఛార్టెడ్ అకౌంటెంట్‌లో నిపుణులు. పలు ప్రముఖ కంపెనీలో పని చేశారు. ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటే మంచిదని భావిస్తున్నా’ అని తథాగత రాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖ బయటకు పొక్కటంతో అసలు వ్యవహారం మొదలైంది. ప్రతిపక్ష సీపీఎం.. గవర్నర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి ఈ లేఖ గురించి తెలీదని చెబుతుండగా.. సీఎం కార్యాలయం మాత్రం ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించింది. చివరకు తథాగత రోయ్ ట్వీటర్లో స్పందించారు. ‘ఆ లేఖను నేనే రాసింది. ఓ ఉద్యోగం కోసం సత్ప్రవర్తన కింద ఆ లేఖ ఇచ్చాను. ఆ మాత్రం దానికే కొలంబస్ అమెరికాను కనిపెట్టి మీరు భావిస్తున్నారు. అలాగైతే మిమల్ని మీరు వెధవలను చేసుంటూ ముందుకు సాగినట్లే’ అంటూ ఓ ట్వీట్లో ఆయన చురకలంటించారు. ఇక ఈ లేఖపై కథనాలు ప్రసారం చేస్తున్న ఓ న్యూస్ ఛానెల్‌పైనా ఆయన మండిపడ్డారు. కాగా, తథాగత వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఆయన ఓ గవర్నర్ మాదిరి కాకుండా.. బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడంటూ సీపీఎం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. Of course I wrote that letter! It isn’t even confidential because it is a normal recommendation for a perfectly bona fide purpose. But,as I said,if you are feeling the way Columbus felt on discovering America,go ahead and make bigger fools of yourselves — Tathagata Roy (@tathagata2) 28 April 2018 -
మెకానికల్ ఇంజినీర్లు పనికిరారు : సీఎం
అగర్తలా : మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తరుచూ అలాంటి కామెంట్లతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ వివాదాలకు దూరంగా ఉండాలని ఆదేశించినా.. బిప్లబ్ అవేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా సివిల్ సర్వీసెస్ పై కామెంట్లు చేసి విమర్శలపాలయ్యారు. సివిల్, మెకానికల్ ఇంజినీర్లను పొల్చుతూ బిప్లబ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. శుక్రవారం అగర్తలాలో జరిగిన సివిల్ సర్వీస్ డేలో ఆయన మాట్లాడుతూ.. సివిల్స్‌కు సివిల్ ఇంజనీర్లు మాత్రమే సరిపోతారని, మెకానికల్ ఇంజినీర్లు అందుకు పనికిరారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకునే అనుభవం కలిగిన సివిల్ ఇంజినీర్లు అయితేనే సమాజాన్ని చక్కగా నిర్మించగలరని తెలిపారు. ఒకప్పుడు హ్యూమానిటీస్ చదివిన వారు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారని.. కాలం మారుతున్నందున ప్రస్తుతం డాక్టర్లు కూడా సివిల్స్ ఉద్యోగాల్లో అద్భుతంగా రాణించగలరని పేర్కొన్నారు. రోగాన్ని నయం చేసే తెలివితేటలు కలిగిన వారు సమాజంలోని సమస్యలను అలాగే పరిష్కరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బిప్లబ్ ఇలాంటి వ్యాఖ్యల చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు రెండు రోజుల ముందే నటి డయానా హెడెన్ కు మిస్ వరల్డ్ కిరీటం ఎలా ఇచ్చారంటూ కామెంట్ చేసిన బిప్లబ్‌పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన బిప్లబ్ స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. -
డయానాకు క్షమాపణలు చెప్పిన సీఎం!
-
వెనక్కి తగ్గి, క్షమాపణలు చెప్పిన సీఎం!
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తనపై చేసిన ‘బాడీ షేమింగ్’, వర్ణ వివక్ష పూరిత కామెంట్లపై 1997 ‘మిస్ వరల్డ్’, నటి డయానా హెడెన్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు ఓసారి ఆలోచించుకోవాలని సీఎం బిప్లబ్‌కు సూచించారు. దాంతోపాటుగా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి బుద్ధి చూపించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, డయానా హెడెన్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై బిప్లబ్ దేబ్ వెనక్కి తగ్గారు. స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో జరుగుతున్న మోసాలను వివరించే యత్నంలో ఆ కామెంట్లు చేసినట్లు తెలిపారు. వివాదం ఇది.. గత కొంతకాలం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ఇటీవల మరో వివాదంలో చిక్కుకుని వెనక్కి తగ్గారు. మహా భారతం కాలంలోనే మనకు ఇంటర్నెట్ ఉండేదని, పాస్వర్డ్ కోసమే కురుక్షేత్ర యుద్ధం జరిగిందని ఆయన చెప్పిన మాటలను జోక్‌లా తీసుకుని నవ్వుకున్నారు. ఆపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మతి చెడిందని, ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలంటూ కామెంట్లు చేశారు. తాజాగా శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిప్లబ్ ‘భారతీయ అందానికి ప్రతీక ఐశ్వర్యరాయ్ మాత్రమే. డయానా హైడన్‌ను అందగత్తె అంటారా ఎవరైనా? ఆమె మిస్ వరల్డ్ గెలిచిందంటే నవ్వొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కేవలం ‘సౌందర్య సాధనాల సంస్థలు మన దేశ మార్కెట్‌ను వశపరుచుకోవడానికి దేశ యువతులకు వరుసగా అందాల టైటిల్స్ ఇచ్చాయని అందులో భాగంగానే డాయానాకు సైతం మిస్ వరల్డ్ ఇచ్చారని ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. . డయానా ఏమన్నారంటే.. నేను చామన ఛాయ రంగుతో ఉన్నాందుకు గర్వపడుతున్నాను. విదేశీయులు సైతం భారతీయుల రంగును మెచ్చుకుంటున్నారు. అయితే నాకు మిస్ వరల్డ్ టైటిల్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడం వరకు వారి వ్యక్తిగత అభిప్రాయమే. కానీ రంగు గురించి మాట్లాడి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం త్రిపుర సీఎం బిప్లబ్‌కు సబబు కాదు. ఒకరిపై కామెంట్లు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని కామెంట్ చేయడం మంచిదని హైదరాబాద్‌కు చెందిన డయానా హితవు పలికారు. -
అవునా సార్?!
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ డయానా హైడన్ పై చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? దేశంలో ‘మీటూ’ ఉద్యమం జరుగుతోంది. ఆడవాళ్ల మీద, పసి పిల్లల మీద ఆత్యాచారాల విషయంలో, స్త్రీల హక్కులను భంగపరిచే విషయంలో భూగోళంలోనే భారతదేశం ముందు వరసలో ఉందని సర్వేలు చెబుతున్నాయి. స్త్రీలను గౌరవించే, వారి మర్యాదను కాపాడే వ్యక్తిత్వాన్ని అలవరుచుకునే పరిస్థితుల లేమి గురించి, వాటి అవసరాన్ని గురించి చర్చ జరుగుతున్నది. ఇలాంటి సమయంలో నేతలు ఆచితూచి మాట్లాడాలి. కాని అలా జరగడం లేదు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నోరు జారుతున్నారు. ‘దేశంలో అత్యాచారాలు ఆపలేం.. అవి ఏవో ఒక మూల జరుగుతూనే ఉంటాయి. వాటిని రాద్ధాంతం చేయవద్దు’ అని ఒక పురుషనేత అంటే ‘అత్యాచారాలు సంస్కృతిలో భాగం’ అన్నట్టుగా ఒక మహిళా నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి ‘బాడీ షేమింగ్’కు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ జోరుగా వార్తలకెక్కుతున్నారు. మహా భారతం కాలంలోనే మనకు ఇంటర్నెట్ ఉండేదని ఆయనన్న వ్యాఖ్యతో దేశంలో కొందరు నొసలు చిట్లిస్తే మరికొందరు మంచి జోక్ విన్నట్టుగా హాయిగా నవ్వారు. ఈయన ఇప్పుడు ‘అందంను కొలిచే’ షరాబు అవతారం ఎత్తారు. శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిప్లబ్ ‘భారతీయ అందానికి ప్రతీక ఐశ్వర్యరాయ్ మాత్రమే. డయానా హైడన్‌ను అందగత్తె అంటారా ఎవరైనా? ఆమె మిస్ వరల్డ్ గెలిచిందంటే నవ్వొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఐశ్వర్యారాయ్ 1994లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలుచుకున్నారు. మన హైదరాబాద్‌కు చెందిన డయానా హైడన్ 1997లో ‘మిస్ వరల్డ్’ గెలుచుకున్నారు. బిప్లబ్ ఏమంటారంటే ‘సౌందర్య సాధనాల సంస్థలు మన దేశ మార్కెట్‌ను వశపరుచుకోవడానికి దేశ యువతులకు వరుసగా అందాల టైటిల్స్ ఇస్తూ వెళ్లాయి. ఆఖరుకు డయానా హైడన్‌కు కూడా ఇచ్చాయి’ అనే అర్థంలో మాట్లాడారు. ఇది డయానా రంగు, రూపును అవమాన పరచడమే అని సోషల్ మీడియాలో చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. రూపాన్ని, ఆకారాన్ని బట్టి అందాన్ని వ్యాఖ్యానించడం ఏమిటి అంటున్నారు. ద్రవిడులు రంగు తక్కువగా ఉండొచ్చు, కొందరు పొట్టిగా ఉండొచ్చు, కొందరి ముక్కు వెడల్పుగా ఉండొచ్చు... కాని దేని సౌందర్యం దానిదే... ఫలానా విధంగా ఉండటమే అందం అని నిర్థారించడం సాంస్కృతిక ఆధిపత్యం అని విమర్శిస్తున్నారు. ‘అందమైన యువతి లక్ష్మీ దేవి, సరస్వతి దేవిలా ఉండాలి’ అని బిప్లబ్ వ్యాఖ్యానించారు. ఇలా అనడం వల్ల అలా లేని వాళ్లను ఎద్దేవా చేయొచ్చని ప్రోత్సహించినవారయ్యారు. ఇది కచ్చితంగా ‘బాడీ షేమింగ్’ కింద వచ్చే అంశమే అంటున్నారు నెటిజన్లు. ‘మన ఆడపిల్లలకు అందాల టైటిల్స్ ఇచ్చి ఇక్కడి మార్కెట్‌ను వశ పరుచుకున్నాక ఇక అలాంటి టైటిల్స్ ఇవ్వడం మానుకున్నారు’ అని బిప్లబ్ అన్నారు. ‘ఈ పెద్ద మనిషికి గత సంవత్సరమే మానుషి చిల్లర్‌కు మిస్ వరల్డ్ వచ్చిన సంగతి తెలియనట్టుంది’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని నరేందర్ మోడీ ఇటీవల తన పార్టీ శ్రేణులకీ, పదవుల్లో ఉన్నవారికి ‘ఆచి తూచి మాట్లాడండి’ అని ఆదేశాలు ఇచ్చారు. కాని– ఈ బిజెపి ముఖ్యమంత్రి మాత్రం నోరు దఫదఫాలుగా తెరుస్తూ విమర్శలకు పాత్రమవుతున్నారు.