brics
-
ఒక ముందడుగు!
నాలుగేళ్ళ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు తొలి అడుగు పడింది. హిమాలయ సరిహద్దు వెంట కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత, చైనాల మధ్య అంగీకారం కుదిరింది. విస్తృతమైన సరిహద్దు వివాదం అలాగే అపరిష్కృతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయ ఘర్షణలకు ముందున్న పరిస్థితికి తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతోంది. చైనా సైతం పాల్గొన్న ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని వెళ్ళే ముందు గత వారమే ఈ ఒప్పందం గురించి వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ చర్యలు తుది రూపానికి వచ్చాయి. ఒప్పందంలోని మరిన్ని వివరాలు విశదం కావాల్సి ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ఫలితంగా నెలకొనే ప్రాంతీయ సుస్థిరతకు ఇది ఓ సానుకూల పరిణామమని చెప్ప వచ్చు. ఆసియా ఖండంలోని రెండు భారీ శక్తుల మధ్య రాజకీయ, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు మళ్ళీ మార్గం సుగమం కానుందని భావించవచ్చు.2020 జూన్‌లో చైనా సైనిక బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. భారత బలగాలు సైతం త్వరితగతిన అందుకు దీటుగా బదులిచ్చాయి. బాహాబాహీ సాగిన ఆ ఘర్షణల్లో రెండు పక్షాల నుంచి గణనీయమైన సంఖ్యలో సైనికులు మరణించారు. గాయపడ్డారు. 1975 తర్వాత రెండు దేశాల మధ్య మళ్ళీ అంతటి ఉద్రిక్తతకు అది కారణమైంది. సరిగ్గా ఆ ఘర్షణలు జరిగిన గాల్వాన్ లోయ ప్రాంతం వద్దే ఇప్పుడు శాంతి, సాంత్వన యత్నానికి శ్రీకారం చుట్టడం ఒక రకంగా శుభపరిణామం. నాలుగేళ్ళ ప్రతిష్టంభన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కొంత మెరుగయ్యేందుకు ముందడుగు వేసినందుకు ఇరుపక్షాలనూ అభినందించాల్సిందే. ఇరు పక్షాల మధ్య అనేక వారాలుగా సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా భారత, చైనా భూభాగాలను విభజించే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట, తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని దెప్సాంగ్, దెమ్ఛోక్ మైదాన ప్రాంతాల్లో భారత, చైనా సైనిక బలగాలను తగ్గించడం ఇప్పటికే మొదలైంది. అలాగే, గతంలో అంగీకరించిన పద్ధతిలోనే గస్తీ పునఃప్రారంభం కానుంది.వ్యూహాత్మకంగా ఇటీవల ‘బ్రిక్స్’ సమిట్ సమయంలోనే ఈ గస్తీ ఒప్పందాల గురించి బయటకు చెప్పడం గమనార్హం. తద్వారా రెండు దేశాల మధ్య వైషమ్యాలను దూరం పెట్టి, ఆర్థిక సహకార పునరుద్ధరణకు బాటలు పరవాలనుకోవడం మంచిదే. అందుకు తగ్గట్లుగా ‘బ్రిక్స్’ సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సుహృద్భావ పూర్వక భేటీ జరిగింది. సమావేశానికి కొద్ది రోజుల ముందే కుదిరిన ఈ సరిహద్దు గస్తీ ఒప్పందం, దరిమిలా ఆ భేటీ వల్ల ఉద్రిక్తతలు కొంత సడలడం ఖాయం. అలాగని ఈ ఒప్పందాన్ని కేవలం సైనిక సమన్వయ చర్యగా తక్కువ చేసి చూడడం సరికాదు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలనూ, అలాగే అంతర్జాతీయ స్థాయిలో దౌత్య సంబంధాలనూ పునర్ నిర్వచించే సామర్థ్యం కూడా ఈ ఒప్పందానికి ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందంతో భారత, చైనాల మధ్య రాత్రికి రాత్రి అపూర్వ సత్సంబంధాలు నెలకొంటాయని అనుకొంటే అత్యాశే. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నిజానికి, భారత – చైనాలది సుదీర్ఘమైన 3440 కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దు. నదులు, సరస్సులు, హిమఖండాలతో కూడిన ఆ దోవలో విభజన రేఖను నిర్దుష్టంగా పేర్కొనడమూ చిక్కే. ఈ పరిస్థితుల్లో భూటాన్ – నేపాల్‌ల మధ్య సిక్కిమ్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఇరుపక్షాల సైనికులు ముఖాముఖి ఎదురుపడి, ఘర్షణకు దిగడం జరుగుతున్నదే. దానికి తోడు భారత భూభాగంలోకి పదేపదే జొరబడుతూ చైనా చూపుతున్న విస్తరణ కాంక్ష తెలియనిదీ కాదు. ఈ పరిస్థితుల్లో ఎల్ఏసీ వెంట రోడ్లు, నివాసాల సహా ప్రాథమిక వసతి సౌకర్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచి, ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనే ప్రయత్నం రెండు వైపులా సాగింది. ఆ నేపథ్యమే గాల్వాన్ ఘర్షణకూ దారి తీసింది. రెండు దేశాల మధ్య సాధారణ స్థితి రావాలంటే, తూర్పు లద్దాఖ్కే పరిమితమైన ఒప్పందంతో సరిపోదు. మొత్తం ఎల్ఏసీ వెంట సాధారణ పరిస్థితులకు కృషి సాగాలి. దానికి ఇరుపక్షాలలోనూ చిత్తశుద్ధి ముఖ్యం. డ్రాగన్ సైతం చెప్పేదొకటి, చేసేదొకటి విధానాన్ని ఇకనైనా మానుకోవాలి. భారత్, చైనాలు కేవలం పొరుగుదేశాలే కాదు, ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశాలు. కాబట్టి, పరస్పర స్నేహ సౌహార్దాల వల్ల రెండిటికీ లాభమే. భారత అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వా ముల్లో అమెరికాతో పాటు చైనా ఒకటి. సరుకుల నుంచి టెలికమ్యూనికేషన్ల హార్డ్‌వేర్, భారతీయ ఫార్మా రంగానికి ముడి పదార్థాల దాకా అనేకం భారత్‌కు అందించే అతి పెద్ద వనరు చైనాయే. గాల్వాన్ ఘటన తర్వాత చైనా పెట్టుబడులు, వీసాలు, యాప్‌లపై మన దేశం సహజంగానే తీవ్ర షరతులు పెట్టింది. అవన్నీ తొలగాలంటే, మళ్ళీ పరస్పరం నమ్మకం పాదుకొనే చర్యలు ముఖ్యం. గస్తీ ఒప్పందం కుదిరింది కదా అని నిర్లక్ష్యం వహించకుండా భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే. అవతలి పక్షాన్ని విశ్వసిస్తూనే, అంతా సజావుగా సాగుతున్నదీ లేనిదీ నిర్ధరించుకోవాల్సిందే. ఒప్పందాల మాట ఎలా ఉన్నా... సరిహద్దు వెంట సన్నద్ధతను మానరాదు. సరిహద్దులో ప్రాథమిక వసతి సౌకర్యాల నిర్మాణాలను కొనసాగించడమే దీర్ఘకాలంలో మన దేశానికి ఉపకరిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే భారత్ బలీయంగా తయారైందని గాల్వాన్‌లో మన సైన్యాల దీటైన జవాబు రుజువు చేసింది. ఆ బలాన్ని కాపాడుకుంటూనే, డ్రాగన్‌తో బంధాన్ని పటిష్ఠం చేసుకోవడమే మార్గం. -
బ్రెజిల్ అధ్యక్షుడి తలకు గాయం.. రష్యా పర్యటన రద్దు
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనాల్సిన ఆయన బాత్రూంలో జారిపడిపోవటంతో తలకు గాయం అయింది. తలకు రక్తస్రావం కారణంగా సుదూర విమానాలను తాత్కాలికంగా నివారించాలని వైద్య సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆయన బ్రిక్స్ సమావేశాలు జరిగినే రష్యా పర్యటను రద్దు చేసుకున్నారు. అయితే.. ఆయన కాన్ఫరెన్స్ ద్వారా బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారని బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రష్యాకు ఆయన బయలుదేరాల్సింది.Lula cai no banheiro, bate a cabeça, na região occipital, que permite a visão, e tem de ficar em observação, p/ descartar coágulos de sangue.Não poderá estar na cúpula dos BRICS, na Rússia, nem na Campanha de Boulos em SP.https://t.co/TFZ4o766pM #domingoespetacular #richardrios pic.twitter.com/dxa5TOHOG4— Grupo do bem estar (@Grupodobemestar) October 20, 2024 లూయిజ్ డాక్టర్ రాబర్టో కలీల్ మీడియాతో మాట్లాడారు. ‘‘అధ్యక్షుడు లూయిజ్ బాత్రూంలో జారీపడిపోయారు. దీంతో ఆయన తల వెనుక భాగంలో గాయం అయింది. గాయానికి కుట్లు వేయవలసి వచ్చింది. తలకు రక్తస్రావం అయింది. వారం రోజులు పాటు చికిత్స అందిస్తూ.. పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని అన్నారు. మరోవైపు.. బ్రిక్స్ సదస్సులో బ్రెజిల్ ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి మౌరో వియెరా నేతృత్వం వహించనున్నారు. -
మరోసారి రష్యాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఈనెల 22, 23 తేదీల్లో ఆ దేశంలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో మోదీ పాల్గొననున్నారు.‘గ్లోబల్ డెవలప్మెంట్, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ అనే థీమ్‌తో జరిగే ఈ సమ్మిట్ లో పలు కీలక ప్రపంచ సమస్యలపై చర్చించనున్నారు. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడంతోపాటు.. భవిష్యత్ సహకారంకోసం శిఖరాగ్ర సమావేశం ఉపయోగపడుందని విదేశాంగశాఖ పేర్కొంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని వెల్లడించింది.గడిచిన నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తరువాత తొలిసారి మాస్కోలో ఈ ఏడాది జులై నెలలో మోదీ పర్యటించారు. ఆ సమయంలో 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో కూడా భేటీ అయ్యారు.2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్‌గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి. -
నా మంచి స్నేహితుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నా: పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకు నా శుభాకాంక్షలు’అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు పేర్కొంది.బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్లో పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ కరచాలనం చేశారు. ఆ ఫొటోల్ని భారత్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg. 👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024 గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్ దోవాల్ పుతిన్‌కు వివరించారు. మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ దోవాల్ పుతిన్‌కు వివరించారు. ఈ చర్చల్లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు మోదీ వస్తే, ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు దోవల్‌కు పుతిన్ చెప్పారు.ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రస్తావించింది.ఇదీ చదవండి : బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు..రంగంలోకి సంపన్న మహిళరష్యన్ ఎంబసీ సైతం మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ - రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించి వచ్చిన ఫలితాలు,సమీప భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు అని టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో రష్యన్ ఎంబసీ తెలిపింది.కాగా, ఉక్రెయిన్ పర్యటనలో ఆదేశ అధ్యక్షుడు వ్లాదమీర్ జెలెన్ స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్-రష్యాలు చర్చలు జరుపుకోవాలని, ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్ క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. -
ఆయేషా.. వారెవ్వా..!
సాక్షి, హైదరాబాద్: రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్‌తోపాటు వివిధదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. అప్పుడే ఒకమ్మాయి లేచి నిల్చుంది. తన మదిలో మెదులుతున్న భావనలను వేదికపై నిలబడి సగర్వంగా చాటిచెప్పింది. ఆమె చెప్పిన మాటలకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పేరే షేక్ ఆయేషా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆయేషా దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏౖకైక తెలుగమ్మాయి కావడం విశేషం.పెందుర్తి టు సెంట్రల్ యూనివర్సిటీ ఏపీలోని గాజువాక జిల్లా పెందుర్తికి చెందిన మదీనాబీబీ– రెహ్మాన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో చిన్నకూతురు ఆయేషా. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సామాజిక చైతన్యంలో ఆయేషా ముందుండేది. డిగ్రీ వరకు విశాఖపట్నంలో చదవగా, విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సింథటిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీలో చేరింది.సామాజిక సమస్యలపై పోరాటం చదువుతోపాటు సామాజిక స్పృహ కూడా ఆయేషాకు ఎక్కువే. ఎప్పుడూ తన తోటి విద్యార్థులతో కలిసి హక్కుల కోసం గొంతుక వినిపించేది. ఇటీవల హెచ్‌సీయూలో జరిగిన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. గెలుపోటములు పక్కన పెడితే విద్యార్థుల కోసం తాను ఉన్నానంటూ తెలియజెప్పడమే తన ధ్యేయమని ఆయేషా చెబుతోంది.ఐదు రోజుల సదస్సు.. ఈ నెల 22న రష్యాలో ప్రారంభమైన బ్రిక్స్ యూత్ సదస్సు శుక్రవారంతో ముగియనుంది. ఈ సదస్సులో సామాజిక సేవ విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య ఎక్సే్చంజ్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయేషా ప్రతిపాదించింది. సంస్కృతి, యువతనాయకత్వం, కమ్యూనిటీ సర్వీస్ విషయంలో వలంటీర్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయాలను బ్రిక్స్ దేశాల యువత పరస్పరం పంచుకోవాలని చెప్పింది. దీనిపై సదస్సులో చర్చ జరిగిందని, బ్రిక్స్ దేశాలు మద్దతు ఇచ్చాయని ఆయేషా వెల్లడించింది. కేంద్ర యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ సహాయమంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే కూడా తనపై ప్రశంసలు కురిపించారని ఆమె పేర్కొంది. -
అనంతపురం మేయర్‌కు అరుదైన గౌరవం
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీంకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 21న రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మేయర్ల సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా మేయర్లు పాల్గొననున్నారు. భారత్ నుంచి ఐదుగురు మేయర్లకు ఆహ్వానం అందగా..అందులో అనంతపురం మేయర్ ఒకరు. మిగిలిన వారిలో జైపూర్, క్యాలికట్, త్రిసూర్, నాగర్ కోయిల్ మేయర్లు ఉన్నారు. అనంతపురం మేయర్‌కే ఎందుకంటే.. అనంతపురానికి, రష్యాకు చారిత్రక సంబంధం ఉంది. 550 ఏళ్ల కిందట రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురాన్ని సందర్శించాడు. ఆ∙అంశాలు ఇటీవల కజాన్‌లో జరిగిన అసోసియేషన్ వ్యవస్థాపక సమావేశంలో చర్చకు వచి్చ.. అనంతపురం ప్రాధాన్యతను గుర్తు చేశాయి. కాగా, అనంతపురం నగరాన్ని సందర్శించిన రష్యన్ యాత్రికుని రచనలను పరిగణనలోకి తీసుకుని మేయర్ల సదస్సుకు అనంతపురం నగరాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది అని మేయర్ అన్నారు. -
బ్రిక్స్‌లోకి మరో ఆరు దేశాలు
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు. బ్రిక్స్ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్ విస్తరణకు భారత్ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వర్చువల్ ప్రసంగంలో బ్రిక్స్ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్‌గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. బ్రిక్స్‌లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్‌ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ బ్రిక్స్ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఇరాన్ అధ్యక్షుడు ౖఇబ్రహీం రైసీ సహా పలు దేశాల నేతలతో సమావేశమయ్యారు. రైసీతో చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్ వంటి ద్వైపాక్షిక అంశాలతో చాబహర్ పోర్టు అభివృద్ధిపైనా చర్చించారు. బ్రిక్స్‌లో ఇరాన్ చేరికకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి రైసీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్–3 విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ప్రధాని మోదీ ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్ అలీ, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ తదితరులతో జరిగిన భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారని బాగ్చీ వివరించారు. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రం అనంతరం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జొహన్నెస్‌బర్గ్ నుంచి గ్రీస్‌కు బయలుదేరారు. ఆఫ్రికాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి ‘ఎజెండా 2063’సాధనలో ఆఫ్రికాకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్‌కు భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. బ్రిక్స్, ఆఫ్రికా దేశాల ముఖ్య నేతలతో గురువారం జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా యూనియన్ శక్తివంతంగా రూపుదిద్దుకునేందుకు వచ్చే 50 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై 2013లో తయారు చేసిన ఆర్థికాభివృద్ధి నమూనాయే ‘అజెండా 2063’. ప్రపంచమే ఒక కుటుంబమనే భావనను భారత్ వేల ఏళ్లుగా విశ్వసిస్తోందని ప్రధాని చెప్పారు. ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల్లో భారత్ నాలుగు, అయిదో స్థానాల్లో ఉందన్నారు. ఎల్ఏసీని గౌరవిస్తేనే సాధారణ సంబంధాలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ«దీన రేఖ(ఎల్ఏసీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఉద్దేశాలు, అభిప్రాయాలు చైనా అధినేత షీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్నేహభావం నెలకొనాలని, ఎల్ఏసీని గౌరవించాలని మోదీ తేలి్చచెప్పారు. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే చర్యలను వేగవంతం చేసేలా తమ అధికారులను ఆదేశించాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య త్రీవస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. -
బ్రిక్స్ మీటింగ్‌లో జిన్‌పింగ్‌కు అనుకోని ఘటన..
జోహెన్నస్‌బర్గ్: జోహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అయోమయ ఘటన ఎదురైంది. సమావేశానికి హాజరయ్యే క్రమంలో జిన్‌పింగ్ సెక్యూరిటీని అడ్డుకున్నారు అక్కడి భద్రతా సిబ్బంది. తన వెనక ఏం జరిగిందో తెలియని జిన్‌పింగ్ సందేహాంగా వెనక్కి ముందుకు చూస్తూ వెళ్లారు. బ్రిక్స్ మీటింగ్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన భేటీ జరిగే సెంట్రల్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన వెనకే కొద్ది దూరంలో వస్తున్న వ్యక్తిగత సిబ్బంది వస్తున్నారు. జిన్‌పింగ్ హాల్లోకి అడుగుపెట్టగానే ఆయన్ని వెనకే వెళ్లాలనుకున్న పర్సనల్ సెక్యూరిటీ వేగంగా వచ్చారు. జిన్‌పింగ్ వ్యక్తిగత సిబ్బంది నడక కాస్త అనుమానంగా ఉండే సరికి.. అక్కడి సెక్యూరిటీ వారిని అడ్డగించారు. వెంటన్ డోర్లు మూసుకుపోయాయి. వెనక ఏం జరిగిందో తెలియని జిన్‌పింగ్.. వెనకకు ముందుకు చూస్తూ వెళ్లారు. South African Security Officers physically stop Chinese Officials from entering BRICS main venue behind Xi Jinping. Forcibly shut the door.🤣🤣🤣#Prigojine #Prigozhin #republicanDebate #Wagner #BRICSSummit2023 #XiJinping #BRICS #BRICSSummit2023 #BRICSSummit #ChinaNews #China pic.twitter.com/dY4CgLZadq — Mr. R V (@Havoc3010) August 24, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జిన్‌పింగ్‌కు అయోమయ పరిస్థితి ఎదురైందని నెటిజన్లు కామెంట్ పెట్టారు. అయితే.. దక్షిణాఫ్రికా జోహెన్నస్‌బర్గ్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇదీ చదవండి: వీడియో: బ్రిక్స్‌లో జిన్‌పింగ్, మోదీ ముచ్చట్లు.. కరచలనం -
జిన్‌పింగ్, మోదీ ముచ్చట్లు.. కరచలనం
జొహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్-2023 సదస్సులో ఇవాళ ప్రధానకర్షణగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిలిచారు. కరచలనంతో పాటు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి బ్రిక్స్ వేదికగా అయినా ఇద్దరూ సమావేశం అవుతారనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటు భారత, అటు చైనా విదేశీ వ్యవహారాల శాఖలు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో.. ఈ ఇద్దరి మధ్య బ్రిక్స్ వేదికగా ప్రత్యేక భేటీ జరగనప్పటికీ ముచ్చట్లు మాత్రం సాగాయి. బ్రిక్స్‌కు హాజరైన నేతలు వేదికపైకి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో.. జింగ్‌పిన్‌తో మోదీ ఏదో ముచ్చటించారు. ఆపై వేదికపై ఇద్దరూ కరచలనం చేసుకున్నారు కూడా. ఆ సమయంలో అందరి చూపు ఆ ఇద్దరివైపే ఉండిపోయింది. ఇరుదేశాల వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితుల తర్వాత ఈ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యింది లేదు. కాకుంటే.. గత ఏడాది జీ20 సదస్సులో ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోలు ఒకటి బాగా వైరల్ అయ్యింది. అది కొద్దిసేపే అయినా ఏం మాట్లాడుకున్నారనే చర్చ నడిచింది. ఇక బ్రిక్స్‌లో దక్షిణాఫ్రికా, భారత, చైనా, రష్యా, బ్రెజిల్ సభ్య దేశాలు కాగా.. ఉక్రెయిన్ యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్‌జారీ చేయడంతో రష్యా తరపున వ్లాదిమిర్ పుతిన్ కాకుండా సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. Moments when PM @narendramodi and Chinese President Xi Jinping had brief exchange of greetings, hand shake or some small conversations at #BRICSSummit2023 in #Johannesburg pic.twitter.com/OsXtKXhQ89 — Abhishek Jha (@abhishekjha157) August 24, 2023 -
నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..
జోహన్నెస్‌బర్గ్‌లో ఇవాళ జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన దేశభక్తిని చాటుకున్నారు. కింద ఉంచిన జాతీయ జెండాను గమనించి అప్రమత్తయ్యారు ఆయన. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా.. ఇవాళ హాజరైన నేతలతో ఓ ఫొటోషూట్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వేదిక ఎక్కబోయారు. తమకు కేటాయించిన స్థానాల్లో నిల్చుని ఫొటోలు దిగాల్సి ఉంది. అయితే.. అక్కడ నేతలు ఎవరెక్కడ నిల్చోవాలనే గుర్తు కోసం ఆయా నేతలకు సంబంధించిన దేశాల జెండాల పేపర్ పీస్‌లను ఉంచారు. PM Narendra #Modi notices the Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at #BRICS, makes sure to not step on it, picks it up, and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit.#ModiInBRICS pic.twitter.com/pXCypilo4H — அகத்தியன் (@riverinerabbit) August 23, 2023 ఈ క్రమంలో వేదిక ఎక్కబోతూ.. అక్కడ జెండాను గమనించిన మోదీ.. దానిని తీసుకుని తన జాకెట్ జేబులో పెట్టుకున్నారు. మరోవైపు అప్పటికే తమ దేశపు జెండాపై అడుగేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు.. మోదీ చర్యను గమనించి అక్కడే ఉన్న సిబ్బందికి ఆ జెండాను అందించారు. -
Brics Summit 2023: ప్రపంచానికి ‘గ్రోత్ ఇంజిన్’ భారత్
జోహన్నెస్‌బర్గ్: రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారత్ ‘గ్రోత్ ఇంజిన్’గా మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌లో సంస్కరణలను మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్యంలో వేగం పుంజుకుందని చెప్పారు. మంగళవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత్ త్వరలోనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లో ఉందన్నారు. 100కుపైగా యూనికార్న్ కంపెనీలు పని చేస్తున్నాయని వెల్లడించారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి అనువైన రంగాలను గుర్తించడంలో 15వ బ్రిక్స్ సదస్సు సఫలమవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన దక్షిణాఫ్రికా చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం విషయమై అంతర్జాతీయ నేర న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన వర్చువల్‌గా పాల్గొననున్నారు. -
BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్-2023 సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా ప్రయాణమయ్యారు. అంతా సజావుగా సాగితే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించే అవకాశముందంటున్నాయి పీఎంవో కార్యాలయ వర్గాలు. జోహన్నెస్‌బెర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశాల్లో బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలతో కలిసి పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా బయలుదేరారు. చివరిసారిగా ఈ సమావేశాలు 2019లో జరగగా కోవిడ్-19 కారణంగా ఈ సమావేశాలు వర్చువల్‌గా జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశాల్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఏమైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశముందా అన్న ప్రశ్నకు విదేశీ కార్యదర్శి వినయ్ ఖ్వత్రా మేము కూడా ఆ విషయంపై సానుకూలంగానే ఉన్నాము. మా ప్రయత్నాలైతే మేము చేస్తున్నామని అన్నారు. అదే అజరిగితే మే 2020 తర్వాత చైనాతో భారత్ ముఖాముఖి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. చివరిసారిగా వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో బాలి వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు కానీ ఏమీ చర్చించలేదు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశాల్లో అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. బ్రిక్స్ సమావేశాలకు ముందు సన్నాహకంగా భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజోత్ దోవల్ గత నెల చిన్నా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. అప్పుడే ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై సానుకూల, నిర్ణయాత్మక, లోతైన చర్చలు జరిగాయి. 2020లో గాల్వాన్ లోయలోనూ, పాంగాంగ్ నదీ తీరంలోనూ, గోగ్రా ప్రాంతంలోనూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహారించి ఉద్రిక్తతకు తెరతీసింది. ఈ సమావేశాల్లో ఇరుదేశాల మధ్య సంధి కుదిరి సత్సంబంధాలు నెలకొంటాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బ్రిక్స్-2023 సమావేశాల్లో ప్రధానంగా దక్షిణదేశాల సంబంధాలపైనా భవిష్యత్తు కార్యాచరణపైనా దృష్టి సారించనున్నాయి ఈ ఐదు దేశాలు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
ఒడిదుడుకులను ఎదుర్కొంటాం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే అత్యుత్తమ స్థాయిలో భారత్ ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర పేర్కొన్నారు. ’బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి’ అనే అంశంపై ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (డీఎస్ఈ), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► 2013తో పోల్చితే ప్రస్తుతం పరిస్థితి ఎంతో మెరుగుపడింది. భారత్ ప్రస్తుతం పటిష్ట స్థానంలో ఉంది. దేశ ఆర్థిక మూలస్తంభాలు బలంగా ఉన్నాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా తట్టుకుని నిలబడగలిసే సమర్థ్యాన్ని సంబంధిత సూచీలు సూచిస్తున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ విధాన వైఖరిని మహమ్మారి ప్రభావిత స్థితి నుంచి సాధారణ స్థితికి మార్చాలని యోచిస్తున్నాయి. సరళతర ద్రవ్య విధాన వైఖరి కొంత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాల ప్రభావం భారత్ పైనా ఉంటుంది. కొంత ఒడిదుడుకుల పరిస్థితి ఉంటుంది. అయితే దీనిని తట్టుకునే సామర్థ్యం భారత్‌కు ఉంది. ► ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) పరంగా చూస్తే, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ► 2040 నాటికి భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనాలు ఉన్నాయి. బ్రిక్స్ దేశాలతో (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) కలిసి ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా ఉండేందుకు భారత్ తొలుత సిద్ధపడాలి. ► 2009–10లో బ్రిక్స్ ప్రారంభం అయిన తర్వాత పలు కీలక మైలురాళ్లను అధిగమించడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ), కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (లేదా సీఆర్ఏ), బ్రిక్స్ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం (2021–2025), బ్రిక్స్ పేమెంట్స్ టాస్క్ ఫోర్స్ (బీపీటీఎఫ్) వంటి కీలక వ్యవస్థల ఏర్పాటును ప్రస్తావించుకోవచ్చు. మూడు దశల్లో దేశ వృద్ధి తీరు... డిప్యూటీ గవర్నర్ వివరించిన దానిప్రకారం, జీడీపీ వృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి సూచికగా విస్తృతంగా వినియోగిస్తున్నారు. గత 75 ఏళ్లలో భారతదేశ వృద్ధి పథం మూడు దశల్లో సాగిందని భావించవచ్చు. 1970 దశకం చివరి వరకు భారతదేశం సగటు వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంది. హిందూ వృద్ధి రేటు అని కూడా దీనిని పిలిచేవారు. ఇది ఆ కాలంలో అవలంబించిన విధానాలతో ముడిపడి ఉంది. 1980–2002 వరకూ చూస్తే సరళీకరణ, ఆర్థిక వ్యవస్థ క్రమంగా అంతర్జాతీంగా ముడివడ్డం అంశాలతో వృద్ధి ధోరణి 5.5 శాతానికి చేరుకుంది. 2003 నుంచి 2020 మహమ్మారి సవాళ్లు ప్రారంభమయ్యే వరకూ వరకూ సగటు 7 వృద్ధి ఏడు శాతంగా ఉంది. 2020లో వృద్ధి క్షీణతలోకి మారింది. అయితే సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయికి భారత్ పురోగమించింది. భారతదేశంలో వృద్ధి చోదకాలు ఏమిటన్నది గమనించాలి. గృహ, ప్రైవేటు వినియోగం ఇక్కడ కీలకమైన అంశాలు. ఈ రెండింటి వాటా మొత్తం 1960 జీడీపీలో 75 శాతం. ఇటీవల 55 శాతానికి తగ్గింది. అయినప్పటికీ, జీడీపీలో ఈ రెండింటిపాత్రే కీలకం కావడం గమనార్హం. దేశంలో ఎగుమతులు, పెట్టుబడుల ప్రేరిత వృద్ధి ధోరణి పటిష్టం కావాల్సి ఉంది. పటిష్ట రికవరీ బాటన ఎకానమీ: ఆర్బీఐ ఆర్టికల్ అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందని ఆర్బీఐ ఆర్టికల్ ఒకటి పేర్కొంది. తగిన ద్రవ్య, రుణ పరిస్థితులు ఇందుకు దోహపడుతున్నట్లు వివరించింది. అంతర్జాతీయంగా నెలకొన్ని ఉన్న సరఫరాల సమస్యలు, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లు, కరోనా కేసులు కొన్ని దేశాల్లో పెరుగుతుండడం వంటి అంశాలను ఆర్బీఐ ప్రచురించిన ఆర్టికల్ ప్రస్తావించింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ దేశంలో రవాణా, ఉపాధి రంగాల్లో మంచి పురోగతి ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ అభిప్రాయాలు పూర్తిగా ఆర్టికల్ రాసిన రచయితలకు చెందుతాయని, వీటితో సెంట్రల్ బ్యాంక్ ఏకీభవించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. -
Srishti Jupudi: అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా సృష్టి జూపూడి
సాక్షి, న్యూఢిల్లీ: వాణిజ్య ప్రోత్సాహక అంతర్జాతీయ సంస్థ బ్రిక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ(సీసీఐ) అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్ (2021–22)గా హైదరాబాద్‌కు చెందిన సృష్టి జూపూడి నియమితులయ్యారు. ఈ నియామకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. జూనియర్ బ్యాడ్మింటన్ ప్రపంచ మాజీ ఛాంపియన్ సృష్టి జూపూడి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాల్లో ఎంఎస్ఎంఈ రంగంలోని వ్యాపారాలు, యువ, మహిళా వ్యాపారవేత్తలు, అంకుర సంస్థల ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారని సంస్థ తెలిపింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన సృష్టి జూపూడి పలు జాతీయ, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొన్నారు. సంపూర్ణ నైపుణ్యం సాధించాలంటే పదివేల గంటల శిక్షణ అవసరం అని నిర్వచించే మాల్కమ్ గ్లాడ్వెల్ ‘10,000 గంటల నిబంధన’ను సృష్టి జూపూడి సాధించారని, జూనియర్ విభాగంలో టాపర్‌గా ఉన్న సమయంలోనే బ్యాడ్మింటన్‌కు విరామమిచ్చి సామాజిక మార్గాన్ని ఎంచుకున్నారని సంస్థ పేర్కొంది. ఇక్కడ చదవండి: యూట్యూబ్ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్కి చెక్ పెట్టనుందా? వామ్మో! బ్యాంక్‌లకు ఇన్ని రోజులు సెలువులా? -
యథేచ్ఛగా ఇటుక బట్టీలు
మేడ్చల్ : రైతుల బలహీనతలు, ఆర్థిక సంపాదనలు అంతంత మాత్రంగా ఉండటంతో వాటిని ఆసరా చేసుకున్న ఇటుక బట్టీల వ్యాపారులు మేడ్చల్ డివిజన్లోని మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, మేడ్చల్ శివారు మండలం కుత్బుల్లాపూర్ మండలాల్లో వివిధ గ్రామాల్లో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లోనే ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల పంట సాగుకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తుండగా వ్యాపారులు ఇటుకల తయారీకి ఉచిత విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నారు. డివిజన్ మండలాల్లో ఇటుక బట్టీల వ్యాపారం యథేచ్చగా కొనసాగుతున్నా రెవెన్యూ, ట్రాన్స్‌కో శాఖ అధికారులు మామూళ్ల మాయలో కళ్లకు గంతలు కట్టుకున్నారు. ప్రభుత్వం పేదల బతుకుదెరువు కోసం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. వంద ఎకరాల అసైన్డ్ భూముల్లో.... మేడ్చల్ మండలంలోని గౌడవెళ్లి, శ్రీరంగవరం, బండమాదారం, రాయిలాపూర్, గుండ్లపోచంపల్లి, నియోజకవర్గంలోని కీసరతో పాటు యాద్గార్పల్లి, తిమ్మాయిపల్లి, కరీంగూడ,భోగారం, శామీర్‌పేట మండలం ఉద్దెమర్రి, అలియాబాద్, జవహర్‌నగర్, కుత్బుల్లాపూర్ మండలం నాగులూర్, దుండిగల్ గ్రామాల పరిధిలో దాదాపు 300 ఎకరాల భూములను ఇటుక బట్టీల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 100 ఎకరాల వరకు అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణ రంగం పెరగడంతో పాటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, కీసర, శామీర్‌పేట్ మండలాల్లో ఇటుకల వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ప్రైవేట్, ప్రభుత్వ అసైన్డ్ పొలాల్లో బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. దుర్వినియోగం అవుతున్న ఉచిత విద్యుత్ ఇటుక బట్టీల నిర్వాహకులు వ్యవసాయ బోర్ల నీటినే వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ దుర్వినియోగమవుతుంది. డివిజన్లో సుమారు 300 వరకు ఇలా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారు. ఇటుకల తయారీకి పొలాల్లో ఉండే బోర్ల నుంచి బట్టీల వరకు పైప్లైన్ల వేసుకుంటున్నారు. కొందరైతే బట్టీల వద్ద ఎకంగా కాలువలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండీ కొడుతున్నా అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్లు వ్యవహరించడం గమనార్హం. అక్రమార్కులకు అధికారుల అండదండలు ఇటుక బట్టీల వ్యాపారంలో అక్రమార్కులకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న కొంతమంది అధికారులు అక్రమ వ్యాపారాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులకు ఏవి అసైన్డ్ భూములో ఏవి పట్టా భూములో ఖచ్చితంగా తెలుసు. కానీ అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు నడుస్తున్నా పట్టించుకోరు. గ్రామాల రెవెన్యూ అధికారులు బట్టీల వ్యాపారులతో నెలకు కొంత అమౌంట్ ఇవ్వాలని వ్యాపారం ప్రారంభంకాక ముందే మాట్లాడుకుంటున్నారని పలువురు బహీరంగంగానే అంటున్నారు. ట్రాన్స్‌కో వారికి కాసుల పంట ఇటుక బట్టీల వ్యాపారం ట్రాన్స్‌కో అధికారులకు కాసుల పంటగా మారింది. గ్రామాల్లో ఉచిత కరెంట్ బోరు నుంచి నీరు అందెలా చూసేది కరెంటోళ్లే. పేరుకు ఒక చోట కమర్షియల్ మీటర్ పెట్టి మిగతాదంతా ఉచిత కరెంటును వాడుకుంటున్నారు. విద్యుత్ సిబ్బందికి అన్ని తెలిసినా వారికి ముట్టాల్సింది ముట్టడంతో అక్రమ వ్యాపారులకు అండగా నిలబడుతున్నారని స్థానికులు అనుకుంటున్నారు. తాము ఉన్నామని చెప్పుకునేందుకు అప్పుడప్పుడు విజిలెన్స్ అధికారులతో కలిసి దాడులు చేసి నామమాత్రపు అపరాధ రుసుములు విధిస్తున్నారు. -
బ్రిక్స్ కొత్త పుంతలు
ఈసారి చైనాలోని జియామెన్‌లో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో మన దేశానికి దౌత్యపరంగా ఘనవిజయం లభించింది. ఉగ్రవాద ఉదంతాలకు కారణమవుతున్న జైషే మహమ్మద్, లష్కరే తొయిబా సహా పలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై ఆ సదస్సు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఇలాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని, ఆ ఉగ్రవాద సంస్థ లపై సమష్టిగా పోరాడాలని నిర్ణయించింది. ఇలాంటి తీర్మానం కోసం మన దేశం పలు సంవత్సరాలుగా పట్టుబడుతోంది. కానీ ప్రతిసారీ మన ప్రయత్నాలకు ఏదో సాకు చూపి అడ్డుతగులుతోంది. ఇన్నాళ్లకు చైనా సైతం భారత్‌తో గళం కలిపింది. తీర్మానానికి సహకరించింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎలాంటి నేపథ్యంలో జరి గిందో అందరికీ తెలుసు. రెండు నెలలక్రితం డోక్లాం వద్ద భారత్–చైనాల మధ్య తలెత్తిన వివాదం ఎటువైపు పోతుందో, దానివల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడ తాయోనని చాలామంది ఆందోళనపడ్డారు. ఒకవైపు బ్రిక్స్ సదస్సు తేదీలు దగ్గర పడుతున్నా పరిస్థితి మెరుగుపడకపోవడం కలవరం కలిగించింది. దీనికితోడు చైనాకు చెందిన వివిధ స్థాయి అధికారులు బెదిరింపులకు దిగారు. దీన్నంతటినీ గమనించాక ఆ సదస్సుకు అసలు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తారా లేదా అన్న సందేహం తలెత్తింది. కానీ చడీచప్పుడూ లేకుండా సాగిన దౌత్యం ఫలించింది. దళా లను వెనక్కు తీసుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. పర్యవసానంగా బ్రిక్స్‌లో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయం చిన్నదేమీ కాదు. గోవాలో నిరుడు బ్రిక్స్ సదస్సు జరిగినప్పుడు ఉగ్రవాద సంస్థలను నేరుగా ఖండించాల్సిన అవసరం ఉన్నదని సభ్య దేశాలైన రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు నచ్చజెప్పేందుకు మన దేశం చేయని ప్రయ త్నమంటూ లేదు. ఆ సదస్సులో మాట్లాడిన నరేంద్రమోదీ పాకిస్తాన్ తీరు తెన్నులను బ్రిక్స్ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఉగ్రవాద సంస్థలకు వత్తాసుగా నిలుస్తున్న పాకిస్తాన్‌కు రాజకీయ, ఆయుధ సాయాన్ని తగ్గించుకోవాలని పరో క్షంగా చైనాకు చెప్పారు. తీరా సంయుక్త ప్రకటన రూపొందే సమయానికి చైనా అడ్డుపుల్ల వేసింది. తనతో రష్యాను కూడా కలుపుకొంది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని ‘ప్రపంచ దేశాలకు’ పిలుపునివ్వడం మినహా ఆ ప్రకటన మరేమీ చెప్ప లేకపోయింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్నూ, సిరియాలో విధ్వంసాలకు పాల్పడుతున్న అల్‌కాయిదా, జభత్ అల్ నస్రా సంస్థలనూ ఖండించిన ఆ ప్రకటన జైషే మహ మ్మద్, లష్కరే తొయిబా, హక్కానీ నెట్ వర్క్ లాంటి సంస్థల పేరెత్తేందుకు ముందుకు రాలేదు. నిజానికి ఐఎస్‌తోపాటు ఈ సంస్థలన్నిటినీ ఐక్యరాజ్యసమితి చాన్నాళ్లక్రితం నిషేధించింది. అటువంటప్పుడు పాక్ ప్రేరేపిత సంస్థల విషయంలో వ్యత్యాసం చూపాల్సిన అవసరం ఏమున్నదని మన దేశం అడిగితే మౌనమే జవా బైంది. జైషే మహమ్మద్ మన పార్లమెంటు భవనంపై 2001లో దాడులకు పాల్ప డింది. 2008లో ముంబైపై లష్కరే తొయిబా దాడిచేసి 166మందిని పొట్టనబెట్టు కుంది. ఈ దాడులకు సూత్రధారులైనవారిని అప్పగించాలని కోరుతున్నా పాకిస్తాన్ బుకాయిస్తోంది. ఈ సంస్థల గురించి, వీటికి మద్దతిస్తున్న పాకిస్తాన్ తీరు గురించి గోవా సదస్సులో మోదీ చెప్పినప్పుడు చైనా, రష్యాలు ఆ దేశానికి బ్రిక్స్‌లో సభ్య త్వం లేదు కదా అన్న వాదన తీసుకొచ్చాయి. అయితే వాటి కార్యకలాపాల వల్ల బ్రిక్స్ సభ్య దేశం ఆర్ధికంగా దెబ్బతింటున్నప్పుడు దాని ప్రభావం సంస్థలో ఇతర దేశాలపైనా, అంతిమంగా సంస్థ ప్రగతి పైనా పడదా అని మన దేశం నిలదీసింది. అయితే చైనా, రష్యాలు చొరవ చూపలేదు. ఈసారి జియామెన్ సదస్సు చేసిన తీర్మానం మన ప్రచ్ఛన్న దౌత్యం సాధించిన విజయమని చెప్పుకోవాలి. అయితే ఈ విషయంలో చేయాల్సిన కృషి ఇంకా చాలా ఉంది. ఎందుకంటే రెండేళ్లక్రితం లష్కరే తొయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాక్ వైఖరిని ఖండించే అభిశంసన తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీలో చైనా అడ్డుపడింది. లఖ్వీకి సంబంధించి భారత్ తమకు సరైన సాక్ష్యాలు అందించలేకపోయిందని సాకు చెప్పింది. అటు తర్వాత జైషే చీఫ్ మసూద్ అజర్‌ను ‘ప్రపంచ ఉగ్రవాది’గా ప్రకటించే తీర్మానంపై కూడా ఇలాగే వ్యవహరించింది. ఐక్యరాజ్యసమితిలో ఏ దేశంపైన అయినా చర్య తీసుకోవడం మాట అటుంచి కనీసం అభిశంసించడం కూడా చాలా ప్రయాసతో కూడిన పని. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమున్న అయిదు దేశాల్లో ఏ ఒక్కటి కాదన్నా ఆ తీర్మానాలు వీగిపోతాయి. ఇప్పుడు బ్రిక్స్ సంయుక్త ప్రకటన చూస్తే ఉగ్రవాద సంస్థలపై చైనా వైఖరిలో మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. అది ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపైన కూడా ప్రతిఫలిస్తుందా లేదా అన్నది చూడాలి. ఉగ్రవాదం విషయంలో మాత్రమే కాదు...ఇతరత్రా అంశాల్లో కూడా ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. మారిన అంతర్జాతీయ పరిస్థితులకనుగుణంగా ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎం ఎఫ్)లలో సంస్కరణలు తీసుకురావాలని బ్రిక్స్ కోరింది. అమెరికా కనుసన్నల్లో ఉండే ఈ రెండు సంస్థల తీరుతెన్నులు, వర్ధమాన దేశాలకు సాయం అందించడంలో అవి విధించే ఆంక్షలు ఆ దేశాల అభివృద్ధికి అవరోధంగా ఉంటున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. డబ్లు్యటీఓ వంటి సంస్థల్లో వర్ధమాన దేశాలు కలిసికట్టుగా వ్యవహరించి అగ్రరాజ్యాలను ఎంతోకొంత అదుపు చేస్తున్నాయి. రాయితీలు పొందగలుగుతున్నాయి. కానీ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లలో మాత్రం ఆ పని చేయలేకపోతున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని బ్రిక్స్ తాజా తీర్మానం వెల్లడిస్తోంది. అలాగే ప్రపంచీకరణ పేరిట వర్ధమాన దేశాలపై అనేక నిబంధనలు విధించి అక్కడి మార్కెట్లను కబళించిన అగ్రరాజ్యాలు ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’వంటి రక్షణ విధానాలతో గోడలు నిర్మించుకుంటున్నాయి. ఈ తీరును కూడా బ్రిక్స్ తప్పుబట్టింది. ఈ పరిణామాలన్నీ శుభసూచకమైనవి. ఈ ఐక్యత ఇకపై కూడా కొనసాగుతుందని ఆశిద్దాం. -
బ్రిక్స్ వేదికగా జీఎస్టీపై ప్రశంసలు
జిమెన్: ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన జీఎస్టీని భారత్‌లో అతిపెద్ద పన్ను సంస్కరణగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జీఎస్టీ ద్వారా 130 కోట్ల జనాభా ఏకతాటిపైకి వచ్చిందని అన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా తరలివస్తూ 40 శాతం మేర వృద్ధి చెందాయని చెప్పారు. బ్రిక్స్ వాణజ్య మండలి సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ సులభంగా వ్యాపారం నిర్వహించే ప్రపంచ బ్యాంక్ జాబితాలో గత రెండేళ్లలో భారత్ స్ధానం గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేస్తున్నాయన్నారు.దేశాన్ని విజ్ఞాన ఆధారిత, నైపుణ్యంతో కూడిన సాంకేతిక ఆధార సమాజం దిశగా ఇవి నడిపిస్తున్నాయని పేర్కొన్నారు.బ్రిక్స్ కౌన్సిల్ సభ్య దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చూపుతున్న చొరవను ప్రశంసించారు. వివిధ భాగస్వామ్యాలు, వ్యవస్థల ద్వారా బ్రిక్స్ దేశాలు ఆర్థికంగా పలు విజయాలు సాధిస్తున్నాయన్నారు. న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)తో బ్రిక్స్ కౌన్సిల్ చేతులు కలపడాన్ని ఆయన స్వాగతించారు. పాశ్చాత్య దేశాల రేటింగ్ ఏజెన్సీలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ప్రత్యేక రేటింగ్ ఏజెన్సీల ఏర్పాటుకు పూనుకోవడం అభినందనీయమన్నారు.భేటీలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ తెమెర్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పాల్గొన్నారు. -
చైనా బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం చైనా బయల్దేరారు. ఉదయం మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం పూర్తయ్యాక.. కొత్త మంత్రులతో సమావేశమైన అనంతరం మోదీ.. చైనా బయల్దేరి వెళ్లారు. బ్రిక్స్ సదస్సులో మోదీ ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలపై సదస్సులో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు నుంచి ఫలవంతమైన, సానుకూల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. గోవా బ్రిక్స్ సదస్సుద్వారా సాధించిన ఫలితాల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సైతం ఆయన అందులో పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సు అనంతరం ఆయా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. -
చైనాకు సంకేతాలు పంపిన భారత్
►టెర్రరిజం గురించి మేం మాట్లాతాం.. నో డౌట్! ►చైనాకు సంకేతాలు పంపిన భారత్ న్యూఢిల్లీ : చైనా తాటాకు చప్పుళ్లుకు భారత్ దీటుగానే బదులిస్తోంది. మొన్న డోక్లాం సమస్య పరిష్కారం అనంతరం.. తాజాగా బ్రిక్స్ వేదికగా భారత్ ఉగ్రవాద సమస్య గురించి, ప్రత్యేకంగా పాకిస్తాన్ గురించి మాట్లాడకూడదని చైనా పంపిన సంకేతాలకు భారత్ గట్టిగానే సమాధానం చెబుతోంది. ఈ నెల 3 నుంచి 5 వరకూ చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదం గురించి గట్టిగా మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు పంపాయి. బ్రిక్స్ వేదికపై ఉగ్రవాదం, పాక్ గురించి మాట్లాడకూడదని చైనా సంకేతాలు పంపింది. అయితే గంటల వ్యవధిలో అందుకు స్పందించిన భారత్.. ప్రధాని మోదీ గట్టిగానే ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తారన్న సిగ్నల్స్‌ను బీజింగ్‌కు పంపింది. బ్రిక్స్ సదస్సుల్లో భాగంగా ఈ నెల 4న అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఉగ్రవాదం, పాకిస్తాన్ గురించి మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రిక్స్ సమావేశానికి హాజరవుతున్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సమావేశమవుతారా? లేదా? అన్న విషయంపై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు. బ్రిక్స్ సదస్సులో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు పాల్గొంటారు. -
‘డోక్లామ్’ సుఖాంతం
దాదాపు 75 రోజుల తర్వాత భారత్–చైనాల మధ్య భారత్–భూటాన్–చైనా సరిహద్దుల కూడలిలో తలెత్తిన వివాదం సద్దుమణిగింది. అయితే ఇదంత సజావుగా ఏమీ పూర్తి కాలేదు. ఇరు దేశాల మధ్య దౌత్య స్థాయిలో సాగిన సంభాషణల పర్యవసానంగా రెండు పక్షాలూ దళాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం జరిగిందని మన విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. అందుకు సంబంధించిన పని ప్రారంభమై కొనసాగుతున్నదని చెప్పింది. కానీ చైనా విదేశాంగ శాఖ మాత్రం భారత దళాలు తిరిగి తమ సరిహద్దులకు మళ్లాయని, చైనా దళాలు వివాదాస్పద ప్రాంతంలో కొనసాగుతాయని ప్రకటించి గందరగోళంలో పడేసింది. ఇరుగుపొరుగు దేశాల మధ్య వివాదాలు తలెత్తడం, అవి కొనసాగుతున్న సమయంలో మాటల తీవ్రత పెరగడం సహజమే. అవి సద్దుమణిగే క్రమంలో సైతం ఆ తీవ్రత ఎంతో కొంత కొనసాగుతుంది. ముఖ్యంగా వీరావేశంతో మాట్లాడినవారు వెనక్కి తగ్గే క్రమం కొంత భిన్నంగా ఉంటుంది. డోక్లామ్ వివాదం మొదలైన దగ్గరనుంచీ మన దేశం సంయమనంతోనే మాట్లాడింది. సమస్యపై సైన్యం స్థాయిలోనూ, దౌత్య స్థాయిలోనూ చర్చలు కొనసాగుతాయని, త్వరలోనే వివాదం సమసిపోతుందని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల జూలైలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు దేశాలూ తమ తమ సైన్యాలను వెనక్కి పిలిపించుకుని, అటుమీదట చర్చలు ప్రారంభించాలని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రకటనలన్నిటికీ చైనా వైపునుంచి దూకుడే జవాబైంది. 1962నాటి అనుభవాలు మర్చిపోవద్దని హెచ్చరించడంతో మొదలుపెట్టి రెండు దేశాల సైనిక వ్యయం, జీడీపీ, రక్షణ సామర్ధ్యం వగైరాల మధ్య పోలిక తెచ్చి మీరు అన్నివిధాలా తీసికట్టని చెప్పడం వరకూ అందులో ఎన్నో ఉన్నాయి. ఎలాంటి చర్చలు జరగాలన్నా ముందు భారత్ బేషరతుగా అక్కడినుంచి వెనక్కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. దళాల ఉపసంహరణ విషయంలో అంగీకారానికొచ్చాక కూడా ఈ ధోరణి పోలేదు. అందుకే ఉపసంహరించుకున్నది భారత్ మాత్రమే తప్ప తాము కాదంటోంది. దీన్నుంచి గుణపాఠం తీసుకోవాలని హితవు చెబుతోంది. సరిహద్దుల్లో యథాతథంగా తమ దళాల గస్తీ కొనసాగుతుందని చెప్పింది. చైనా దళాలు సరిహద్దుల్లో గస్తీ కాస్తే భారత్‌కు అభ్యంతర ఉండాల్సిన పనిలేదు. ఆ సరిహద్దును వదిలి 2012 సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించి డోక్లామ్ పీఠభూమి వరకూ రహదారిని పొడిగించడానికి చైనా ప్రయత్నించడమే వివాదానికి కారణం. చైనా రోడ్డు పనుల్ని నిలిపేసిందని, అక్కడి సామగ్రిని, దళాలను తరలించిందని ఇప్పటికే వెల్లడైంది. ఇతరత్రా మాటలన్నీ భారత్ కంటే చైనా జనాన్నుద్దేశించి చేసినవే. తీవ్ర పదజాలంతో ప్రకటనలు చేశాక ఇవన్నీ తప్పనిసరి. త్వరలో చైనా రాజధాని బీజింగ్‌లో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడానికి ఈ దళాల ఉపసంహరణ నిర్ణయం ఎంతో దోహదపడింది. ఆ సదస్సుకు మోదీ వెళ్లకపోతే చైనాపై బ్రిక్స్‌లోని ఇతర సభ్య దేశాల్లో సందేహాలు తలెత్తుతాయి. బ్రిక్స్‌లో చైనా తర్వాత భారత్ ఆర్థిక వ్యవస్థే పటిష్టంగా ఉంది. ఈ రెండు దేశాలూ సరిహద్దు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటేనే బ్రిక్స్ వంటి సంస్థలు సమర్ధవంతంగా పనిచేయగలవని ఆమధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చైనా తన దూకుడు ధోరణిని తగ్గించుకున్నదని కొందరు చెబుతున్నారు. అయితే తాజా పరిణామాలకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను ప్రక్షాళన చేయాలని గత కొంతకాలంగా చైనా అనుకుంటోంది. ముఖ్యంగా ఉన్నతస్థాయి సైనికాధికార వ్యవస్థను చక్కదిద్దాలని, దళాల సామర్ధ్యాన్ని పెంచేలా పునశ్చరణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా వైమానిక, నావికాదళాల సామర్ధ్యం మరింత మెరుగుపరచాలని చైనా నాయకత్వం అనుకుంటోంది. మరోపక్క అక్టోబర్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ కాంగ్రెస్ జరగాల్సి ఉంది. భారత్‌తో యుద్ధం వచ్చి ఆ సమయానికి తేలకపోతే రాజకీయంగా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అది ఇబ్బందికరం. మరోపక్క పొరుగునున్న ఉత్తర కొరియాకు అమెరికాతో తలెత్తిన వివాదం ఒక కొలిక్కి రాలేదు. అంచనాలకు దొరక్కుండా క్షిపణి పరీక్ష ద్వారానో, అణు పరీక్ష ద్వారానో అమెరికాను కవ్విస్తున్న కిమ్ వల్ల ఆ ప్రాంతంలో ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇలాంటి తరుణంలో భారత్‌తో ఘర్షణకు దిగి శక్తియుక్తులన్నీ దానిపైనే కేంద్రీకరించడం వల్ల సమస్య అవుతుందని చైనాకు అనుమానాలున్నాయి. వచ్చేది శీతాకాలం కావడంతో డోక్లామ్ పీఠభూమి ప్రాంతం చైనా దళాల కదలికకు అనువుగా ఉండదు. భారత దళాలకు అది అలవాటైన ప్రాంతం. యుద్ధం దేనికీ పరిష్కారం కాదు. అది ప్రారంభించడం తేలిక. గౌరవప్రదంగా దాన్నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. ప్రత్యర్థి పక్షంపై మొదట వేసుకున్న అంచనాలు తలకిందులవుతున్నాయని తెలిసినప్పుడు మరింత దూకుడుగా ముందుకెళ్లాలి తప్ప వెనక్కిరావడం కుదరదు. ఉన్నకొద్దీ ఇది తీవ్రమవుతున్నదనుకుంటే ఎవరో ఒకరి మధ్యవర్తిత్వం కోసం అర్రులు చాచటం తప్ప గత్యంతరం ఉండదు. అందుకు భిన్నంగా వివాదం తలెత్తిన పక్షంతో చర్చించడం ప్రారంభిస్తే తన వైఖరిలోని సహేతుకతను చెప్పవచ్చు. ఒప్పించే ప్రయత్నాలు చేయొచ్చు. పరస్పర అవగాహన సాధ్యమవుతుంది. ప్రపంచ దేశాల్లో పరిణతితో వ్యవహరించిన ఖ్యాతి దక్కుతుంది. సంక్షోభం తలెత్తినప్పుడు సంయమనం పాటించడం, ఓపికతో వేచి ఉండటం అవసరం. అది అర్ధం చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటికీ అతీతంగా ఆచితూచి వ్యవహరించినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇదే స్ఫూర్తితో చైనాతో ఉన్న ఇతర వివాదాల విషయంలోనూ పరిష్కారాన్ని సాధిస్తుందని ఆశిద్దాం. -
పట్టు సడలిస్తున్న చైనా!
బీజింగ్: డోకాలమ్ విషయంలో పట్టువిడుపుల దిశగా చైనా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో భారత్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ చైనా రాయబారులతో సమావేశం కానున్నారు. గురువారం బ్రిక్స్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత భద్రతా విషయాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పలువురు నాయకులను కలుస్తారు. అయితే, జిన్‌పింగ్‌తో జరిగే సమావేశానికి మిగతా బ్రిక్స్ దేశాల భద్రతా సలహాదారులు కూడా హాజరవుతారు. డోకాలమ్లో ఉద్రిక్తతలపై చైనా స్టేట్ కౌన్సిలర్, సరిహద్దు భద్రతా సలహాదారు యాంగ్ జీచీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ధోవల్ పర్యటన సందర్భంగా చైనా మీడియా ప్రధానమంత్రి మోదీని పొగుడుతూ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేసింది. మోదీ ఆర్థిక ప్రగతిశీలురని, ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు వర్ధిల్లాలని జిన్హువా న్యూస్ పేర్కొంది. తమ వస్తువులకు కీలకమార్కెట్గా ఉన్న భారత్‌తో గొడవపడేందుకు చైనా అధిష్టానం సుముఖంగా లేకపోవడంతోనే ఆ దేశ మీడియా రూటు మార్చినట్లు తెలుస్తోంది. -
మంచి ఉగ్రవాది..చెడ్డ ఉగ్రవాది ఉండరు!
బీజింగ్: ఉగ్రవాదంపై పోరాటానికి ఐక్య రాజ్యసమితిలో ఓ సమగ్ర విధానం అవసరమని బ్రిక్స్ దేశాలకు భారత్ స్పష్టం చేసింది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగి స్తున్న ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాది... చెడ్డ ఉగ్రవాది అని ఉండరని... అందరూ నేరస్తులేనని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అంతమొందించాలన్న విషయాన్ని సదస్సులో నొక్కి చెప్పామని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ మీడియా సమావేశంలో వెల్లడిం చారు. బ్రిక్స్‌లోని ఐదు దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. -
గోడకూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృతి
ఎస్.కోట(విజయనగరం): నిర్మాణం లో ఉన్న గోడ కూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సీతంపేటకు చెందిన పూడి ఈశ్వరరావు(26), నాగభూషణం(25) తాపీ మేస్త్రీలు. సోమవారం పోతనాపల్లిలో గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా గోడ నిర్మిస్తున్నారు. అయితే, గోడ పటిష్టం కాకపోవటంతో నిర్మిస్తుండగానే కూలింది. ఇటుకలు మీద పడటంతో తాపీ మేస్త్రీలు అక్కడికక్కడే మృతిచెందారు. -
'బ్రిక్స్ ప్లస్'కు చైనా ప్లాన్.. భారత్ ఆశలపై నీళ్లు!
ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న చైనా కొత్త ప్రపోజల్‌ను తెచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి 'బ్రిక్స్ ప్లస్' కూటమిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు చెప్పింది. ఇదే జరిగితే బ్రిక్స్ దేశాల్లో ఎక్కువ నష్టపోయేది భారతే. బ్రిక్స్‌ను బ్రిక్స్ ప్లస్‌గా మారిస్తే.. భారత్‌లో బ్రిక్స్ సాయంతో చేస్తున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహకాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా చైనా రాజకీయంగా ఎదగడానికి బ్రిక్స్ ప్లస్ దోహదపడుతుంది. తనకు ఆప్త మిత్రులుగా మారిన పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు మెక్సికోను బ్రిక్స్ ప్లస్‌లోకి చైనా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా చైనా వేసిన ఈ స్కెచ్ భారత్‌కు ఆందోళన కలిగించేదే. 2016లో గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత్ చేసిన వ్యాఖ్యలను చైనా వ్యతిరేకించింది. బ్రిక్స్ ప్లస్ కూటమి ఏర్పాటైతే చైనా బలం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం బ్రిక్స్ బ్యాంకు(న్యూ డెవలప్మెంట్ బ్యాంకు) ద్వారా భారత్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం-చెన్నై పారిశ్రామికి కారిడార్‌కు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రూ.3 వేల కోట్లకు పైగా ఆర్ధిక సాయం చేసింది. బ్రిక్స్ ప్లస్ కూటమి ఏర్పాటు ఆలోచనను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బయటపెట్టారు. అభివృద్ధి చెందతున్న కొన్ని రాజ్యాలతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. దక్షిణాసియా ఉన్న స్నేహితులతో మరింత సంబంధాలను పెంచుకునేందుకు మరిన్ని దేశాలను బ్రిక్స్ ప్లస్‌లో చేర్చాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి చైనా అధ్యక్షత వహించనుంది. అయితే, బ్రిక్స్ ప్లస్ ఆలోచనకు భారత్ ఆమోదం ఇవ్వదనే ఆలోచనలో కూడా డ్రాగన్ దేశం ఉన్నట్లు తెలిసింది. -
దక్షిణాఫ్రికాతో కలిసినడుస్తాం: చైనా
బీజింగ్: చైనా, సౌత్ఆఫ్రికాలు సమస్యలపై ఒకరికొకరు సాయం చేసుకుంటామని చైనా పేర్కొంది. ప్రపంచీకరణలో భాగంగా బ్రిక్స్ సదస్సు దేశాల మధ్య సుస్ధిరాభివృద్ధి ఉండేలా చూస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ తెలిపారు. సెప్టెంబర్‌లో ఆగ్నేయ చైనాలోని గ్జియామెన్ నగరంలో జరిగే సదస్సులో బ్రిక్స్ దేశాల సుస్ధిరాభివృద్ధిపై చర్చిస్తుందన్నారు. ఆయన దక్షిణాఫ్రికా ప్రతినిధి కోనా మాశబానేను బీజింగ్‌లో కలిశారు. వాంగ్ చైనా దక్షిణాఫ్రికాల సంబంధాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇరుదేశాల సంబంధాలు పరస్పర సహకారంతో అభివృద్ధి వైపు పయనిస్తున్నాయన్నారు. ప్రధాన సమస్యలను చర్చించుకుని ముందుకు వెళ్తామని తెలిపారు.