cancellation of the notes
-
విపక్షాల ‘వర్షాకాల’ వ్యూహం
ఏకాభిప్రాయంతో సర్కారుపై కత్తులు నూరుతున్న 18 పార్టీలు ► జీఎస్టీ, నోట్లరద్దు సహా ఐదు అంశాల గుర్తింపు ► పార్లమెంటు లోపలా, బయటా పోరాటానికి నిర్ణయం ► రాజకీయ కుట్రపైనా ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచన ► నేడు విపక్ష నేతలతో రాజ్‌నాథ్, సుష్మ భేటీ న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు 18 విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో జీఎస్టీ, నోట్ల రద్దుతోపాటు పలు అంశాలపై మోదీ సర్కారును ఇబ్బంది పెట్టాలని వ్యూహం రచిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మంగళవారం జరిగిన విపక్షాల భేటీలోనే వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఐదు కీలకాంశాలపైనా పార్లమెంటు లోపలా, బయటా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించారు. నోట్లరద్దు దుష్పరిణామాలు, జీఎస్టీ అమలు సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, రాజకీయ కుట్ర, సమాఖ్య విధానాన్ని కాపాడటం, మతపరమైన తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయటం వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించాయి. విపక్షాలతో రాజ్‌నాథ్, సుష్మ చర్చలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల విమర్శల వేడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితి, సిక్కిం సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ విషయాలపై పూర్తి వివరాలను విపక్షాలకు తెలపాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ శుక్రవారం విపక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే విపక్ష నేతలకు ఆహ్వానం అందింది. కశ్మీర్ విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకే కేంద్రం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. భారత్–భూటాన్–టిబెట్ ట్రై జంక్షన్‌లోని డోక్లామ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించటం, దీన్ని భారత్ తిప్పికొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అటు జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల కాల్పులు, కొంతకాలంగా ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరం చేసిన భద్రతాదళాలు వంటి అంశాలను కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో వెల్లడించనున్నారు. లోయలో అశాంతి కారణంగా ఐదు నెలల్లో ఇద్దరు పోలీసులు సహా 76 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చైనా, కశ్మీర్ అంశాల్లో కేంద్రం వ్యవహరించిన తీరుపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. రాహుల్ భారత్‌లో చైనా రాయబారితో సమావేశమై బహిరంగంగానే మోదీపై విమర్శలు చేయటంతో కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని యోచిస్తోంది. జట్టుగా ప్రతిపక్షం! పశ్చిమబెంగాల్లో తృణమూల్ ప్రభుత్వంపై నారదా స్కామ్ ఆరోపణలు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాలపై ఈడీ, సీబీఐ దాడులన్నీ రాజకీయ కుట్ర కారణంగానే జరిగాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘మేమంతా ఓ జట్టులా పని చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఒకపార్టీకి, ఒక వ్యక్తికి ప్రాధాన్యం అనే మాటే లేదు. అం దరం సమానమే’ అని తృణమూల్ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ తెలిపారు. నెలకోసారైనా విపక్షాలన్నీ సమావేశమై ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించా లని, పలు రాష్ట్రాల్లో ఒక్కోసారి ఈ సమావేశాలు ఏర్పాటుచేయాలని ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. తామంతా ఏకతాటిపై ఉన్నామని తెలిపేందుకే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాల కృష్ణ గాంధీ పేరుపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న తృణమూల్‌కు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించే అవకాశం రాగా మిగిలిన పార్టీలు బలపరిచాయి. -
పెద్ద నోట్ల మార్పిడి పేరిట మోసం
►ఐదుగురు నిందితుల అరెస్టు ►రూ.23.50 లక్షలు కాజేసిన వైనం ►రూ.9 లక్షల నగదు స్వాధీనం చిత్తూరు (అర్బన్): పెద్ద నోట్ల రద్దు సమయంలో పాత నోట్లు తీసుకుంటామని పలువురిని మోసం చేసి నగదు పారిపోయిన అంతర్రాష్ట్ర ముఠాను చిత్తూరు పశ్చిమ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో పుత్తూరుకు చెందిన కోదండరాజు (40), కర్ణాటకలోని కేజీఎఫ్‌కు చెందిన అశ్వర్థనారాయణ (45), బంగారుపేటకు చెందిన ప్రభాకర్ (48), వినోద్ (30), చిన్నరాజ (45) ఉన్నారు. మంగళవారం డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐ ఎం.ఆదినారాయణ ఈ వివరాలను వెల్లడించారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన శేఖర్ నాయుడు, కాణిపాకానికి చెందిన రఫి స్నేహితులు. వీళ్లకు ఈ ఏడాది జనవరిలో ఓ ఫోన్‌కాల్ వచ్చింది. రద్దు చేసిన రూ.500, రూ.1000 వెయ్యి నోట్లు తమ వద్ద రూ.17 లక్షల వరకు ఉన్నాయని, వీటిని తీసుకుని కొత్త నోట్ల రూపంలో రూ.9 లక్షలు ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నారు. నమ్మకం కలిగించేందుకు హైదరాబాద్‌కు చెందిన మధ్యవర్తి రాణి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు సాయిచరణ్‌ను చిత్తూరుకు పంపించారు. శేఖర్‌నాయుడు, రఫి రూ.9 లక్షలు సిద్ధం చేసుకుని జనవరి 4న కాణిపాకం ఆలయ శివారు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న రాణి, ఆమె కుమారుడు పాత నోట్ల తీసుకురావాలని ఫోన్ చేయడం.. హఠాత్తుగా ఐదుగురు వ్యక్తులు ఓ కారులోంచి దిగి, తాము పోలీసులమని చెప్పి శేఖర్, రఫి వద్ద ఉన్న రూ.9 లక్షలు లాక్కున్నారు. స్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పి నగదు తీసుకెళ్లాలని చెప్పి వెళ్లిపోయారు. బాధితులు తేరుకుని వచ్చింది నకిలీ పోలీసులని గుర్తించి కాణిపాకం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చిత్తూరు పశ్చిమ సీఐ ఆదినారాయణ.. ఘటనలో సంబంధమున్న రాణి, సాయిచరణ్‌లను అప్పట్లో అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. తాజాగా కాణిపాకం రోడ్డులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పది మందిలో ఏడుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పలు చోట్ల మోసాలు : నిందితులు ఇదే తరహాలో కుప్పంలో ఓ వ్యక్తి నుంచి రూ.2.5 లక్షలు, తిరుపతి ఎంఆర్.పల్లెలో రూ.5 లక్షలు, చిత్తూరులోని బాన్స్ సమీపంలో రూ.7 లక్షలు మోసం చేసి కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ మూడు ఘటనలపై ఎక్కడా బాధితులు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం! కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన కాణిపాకం ఎస్ఐ నరేష్‌బాబు, సిబ్బంది శివ, వినోద్, రమేష్, సీపీవోలు సోమేష్, దుర్గ తదితరులకు డీఎస్పీ, సీఐలు నగదు రివార్డులను అందచేశారు. -
నోట్లు..కోట్లు
►పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్ ►పోలీసులు అదుపులో 16మంది నిందితులు ►రూ.1.20 కోట్ల పాత నోట్లు స్వాధీనం కంటోన్మెంట్: నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నెలాఖరుకు పాతనోట్ల మార్పిడీ గడువు ముగియనుండటంతో పాతనోట్లు కోట్లల్లో చేతులు మారుతున్నాయి. సోమవారం బంజా రాహిల్స్ ప్రాంతంలో రూ.1.30 కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటలు గడవకముందే నార్త్ జోన్ పరిధిలో రూ.1.20 కోట్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాత మార్చి ఇస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను నార్త్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 16 మందిని అరెస్టు చేయగా మరొ కరు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ.1.20 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..సోమవారం అర్ధరాత్రి బేగంపేటలోని శ్యామ్‌లాల్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు కనిపించడంతో వారి ని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడమేగాక పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారి ని వెంబడించగా సదరు వ్యక్తులు వెంకట్ రెసిడెన్సీ ప్లాట్ నెం బర్ 301లోకి వెళ్లడాన్ని గుర్తించి అక్కడికి వెళ్లగా సదరు ప్లాట్‌లో పెద్దసంఖ్యలో ఉన్న ముఠా సభ్యులు పరారయ్యేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా భారీగా పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు గుర్తించారు. ఫ్లాట్ యజమానితో పాటు 16 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.20 కోట్ల విలువైన పాత నోట్లు, నాలుగు కార్లు, 17 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా, అరెస్టైన వారిలో ఒక మాజీ కార్పొరేటర్, ఓ మహిళ ఉండటం గమనార్హం. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో బేగంపేట ఏసీపీ రంగారావు, ఇన్స్పెక్టర్ జగన్, ఎస్ఐలు మధు, సాయినాథ్ రెడ్డి పాల్గొన్నారు. మార్పిడి పేరుతో మోసం... డిమానిటైజేషన్ తర్వాత నగదు మార్పిడి దందాను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి వెంకట్ రెసిడెన్సీ కేంద్రంగా భారీ మోసాలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. గత 5 నెలలుగా సదరు ప్లాట్‌లో నగదు మార్పిడి లావాదేవీలు జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. తాజా ఘటనలో నెల్లూరుకు చెందిన సుభాన్ అనే వ్యక్తి నుంచి రూ.90 లక్షలు, కూకట్‌పల్లికి చెందిన పవన్ కుమార్‌రెడ్డి నుంచి రూ.30 లక్షల విలువైన పాత నోట్లను ముఠా సభ్యులు సేకరించారు. ఇందుకు సత్యవతి, వెంకన్న, శ్రీరామ్ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిపారు. సదరు సొమ్ముకు బదులుగా తమకు తెలిసిన వ్యాపారవేత్తల వద్ద ఈపాటికే పోగైన బ్లాక్ మనీ (కొత్త కరెన్సీ)ని ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇందుకు యాదగిరికి చెందిన ఫ్లాట్‌ను అడ్డాగా చేసుకున్న నిందితులు పాత నోట్లతో తమ వద్దకు వచ్చే వారికి తమకు బ్యాంకు అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నట్లు నమ్మించేవారని సమాచారం. 5 నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు వారిచ్చే సమాచారం ఆధారంగా త్వరలో మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలిపారు. పట్టుబడింది వీరే: అంతం యాదగిరి, షేక్ సుభాన్, మారం రెడ్డి పవన్ కుమార్ రెడ్డి, నానే సత్యవతి, కె. వెంకన్న, ఎస్. ఎల్లాగౌడ్, కె. అమర్నాథ్ రెడ్డి, షేక్ షావలి, ఎండీ ముజామ్మిల్, సి. మధన్ గోపాల్, వీవీ రమణ, బి. పురన్ చందర్, వెంగల పవన్ మూర్తి, ఎంపీ శ్రీరామ్ చందర్, హస్ముత్ పటేల్, సుబ్బారావులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
క్యాష్ కష్టాలు
మళ్లీ బ్యాంకుల్లో నగదు కొరత ఆర్బీఐ నుంచి జిల్లాకు అరకొర సరఫరా రూ.100 నోట్లతో నెట్టుకొస్తున్న బ్యాంకర్లు మళ్లీ నగదు కొరత సమస్య తలెత్తింది. వారం రోజులుగా జిల్లాలో ఉన్న ఏటీఎంలు 50 శాతం ‘నో క్యాష్ బోర్డు’లతో దర్శనమిస్తున్నాయి. అవసరమైన మేరకు ఆర్బీఐ నుంచి నగదు రాకపోవడంతేనే ఈ సమస్య తలెత్తింది. దీంతో సామా న్య, మధ్యతరగతి జనం మళ్లీ అవస్థల పాలవుతున్నారు. తిరుపతి (అలిపిరి) : పెద్దనోట్ల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో బ్యాంకుల్లో తీవ్ర నగదు కొరత నెలకొంది. నెలన్నరగా బ్యాంకుల లావాదేవీలు పూర్తిస్థాయిలో పుంజుకున్నాయి. అయితే గత వారం రోజులుగా ఆర్బీఐ జిల్లా అవసరాలకు సరిపడా నగదు కేటాయించకపోవడంతో జాతీయ బ్యాంకుల్లో నగదు కష్టాలు ప్రారంభమయ్యాయి. నగదు నిల్వలు లేకపోవడంతో రూ.100 నోట్లతో బ్యాంకర్లు నెట్టుకొస్తున్నారు. వారానికి రూ.250 కోట్లు అవసరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో జాతీయ బ్యాంకు శాఖలకు మోస్తరు లావాదేవీలు కొనసాగించాలంటే వారానికి రూ.250 కోట్ల మేర నగదు అవసరం. అంత మొత్తంలో నగదు అందకపోతే లావాదేవీలు కొనసాగించాలంటే సమస్యలు తప్పవు. కనీసం అందులో సగభాగం కూడా ఆర్బీఐ జిల్లా బ్యాంకులకు నగదు బదిలీ చేయడం లేదు. జిల్లాలో 593 జాతీయ బ్యాంకు శాఖలున్నాయి. ఏటీఎంలు మొదలుకుని, బ్యాంకు శాఖల లావాదేవీలు జరపాలంటే రోజుకు రూ.20నుంచి రూ.40 కోట్లమేర అవసరం. అయితే అంత మొత్తంలో ఆర్బీఐ జిల్లాకు పంపే పరిస్థితులు లేవు. మొదటి వారంలో.. ప్రతి నెలాటి వారంలో బ్యాంకు శాఖలు లావాదేవీలు కొనసాగించాలంటే కనీసం రూ.వెయ్యి కోట్ల నగదు అవసరమవుతుంది. జిల్లాలో 38వేల మంది ఉద్యోగులకు వేతనాల కింద రూ.400 కోట్లు, 26వేల మంది విశ్రాంత ఉద్యోగులకు రూ.250 కోట్లు, ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పొందుతున్న 3,90,728 మందికి రూ.42 కోట్లు అవసరం. ఇవి కాకుండా ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు పొందిన వారికి నగదును చెల్లించాలి. ఇలా ప్రతి నెలా మొదటి వారంలో రూ.వెయ్యి కోట్ల మేర నగదు జిల్లాకు అవసరం. అయితే ఆర్బీఐ మాత్రం నగదు రహితం పేరుతో అరకొర నగదును కేటాయిస్తుండడంతో అటు బ్యాంకర్లు, ఇటు ఖాతాదారులకు అవస్థలు తప్పడం లేదు. ఏటీఎంలలో నో క్యాష్ జిల్లాలో 709 ఏటీఎం కేంద్రాలున్నాయి. అందులో కనీసం 50 శాతం కూడా పనిచేయడం లేదు. పలు ఏటీఎం ముందు నో క్యాష్ బోర్డులు, ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లాకు సకాలంలో ఆర్బీఐ నుంచి బదిలీ కాకపోవడంతో ఏటీఎం కేంద్రాల నిర్వహణపై బ్యాంకర్లు దృష్టి సారించడం లేదు. దీంతో ఖాతాదారులు అత్యవసర పరిస్థితుల్లో నగదు కోసం అవస్థలు పడక తప్పడం లేదు. నగదు కొరత నిజమే బ్యాంకుల్లో నగదు కొరత ఉన్న మాట నిజమే.. ఆర్బీఐ నుంచి అధిక మొత్తంలో నగదు బదిలీ అయితేనే పూర్తిస్థాయిలో లావాదేవీలు జరుగుతాయి. అప్పుడే ఏటీఎంలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఆర్బీఐ నుంచి జిల్లాకు నగదు రావాల్సి ఉంది. –లక్ష్మీనారాయణ, డీజీఎం, ఇండియన్ బ్యాంక్, తిరుపతి జోనల్ కార్యాలయం -
ముగిసిన సమరం
యూపీ ఆఖరి విడతలో 60%, మణిపూర్‌లో 86% పోలింగ్ లక్నో: నోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీ పనితీరుకు, ప్రజాదరణకు రిఫరెండంగా మారిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉత్తరప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ బుధవారం జరిగింది. మణిపూర్‌లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. యూపీలో ఏడో, ఆఖరి విడతలో 40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ నమోదైంది. 51 మంది మహిళలు సహా 585 మంది పోటీపడ్డారు. మణిపూర్ రెండో, ఆఖరి విడతలో 22 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా రికార్డు స్థాయిలో 86% పోలింగ్ రికార్డయింది. 98 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రాష్ట్రంలో 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 79.80 శాతం నమోదైంది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు ఇటీవలే ఎన్నికలు జరగడం తెలిసిందే. తాజా పోలింగ్‌తో మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల మృతి వల్ల వాయిదా పడిన యూపీలో ఒక స్థానానికి, ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా నేడే వెలువడనున్నాయి. ఈ నెల 11న ఎన్నికల ఓట్లను లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. యూపీలో ఏడు దశల్లో పోలింగ్ సగటున 60 నుంచి 61 శాతం నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. -
పెద్ద నోట్ల దందా
వరంగల్ పోస్టల్ శాఖలో అక్రమాలు అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు వరంగల్ : పెద్ద నోట్ల రద్దుతో జరిగిన అక్రమాల వ్యవహారం వరంగల్ నగరానికి తాకింది. నల్లధనం వెలికితీత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులతోపాటు పోస్టాఫీసులలో మార్పిడి చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా పెద్ద నోట్ల మార్పిడి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని వరంగల్ నగరంలోని పోస్టల్ శాఖ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) కేసు నమోదు చేసింది. వరంగల్ పోస్టల్ విభాగంలో పనిచేస్తున్న ఎ.సోమయ్య(ట్రెజరర్), పి.ఎ.సురేశ్‌కుమార్(అసిస్టెంట్ ట్రెజరర్), ఎన్.శివకుమార్(క్లర్క్), జి.కేదారి(క్లర్క్) పెద్ద నోట్ల మార్పిడిలో కమీషన్లు పొంది అక్రమాలు చేసినట్లు అసిస్టెంట్ పోస్టుమాస్టర్ జనరల్ శేషగిరిరావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు 2016 నవంబరు 9 నుంచి 24 వరకు వీరంతా కలిసి రూ.11 లక్షల కొత్త నోట్లను మార్పిడి కోసం వినియోగించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అంశాలను పరిశీలించిన సీబీఐ వీరిపై కేసు నమోదు చేసింది. వరంగల్ నగరంలోని వీరి ఇళ్లలో బుధవారం సోదాలు జరిపి వివరాలను సేకరించారు. మొత్తంగా సీబీఐ కేసు నమోదు, అధికారుల ఇళ్లలో సోదాలతో పోస్టల్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అక్రమాలకు పాల్పడిన మరికొందరు అధికారులలో భయాందోళన మొదలైంది. మరోవైపు తొర్రూరు పోస్టల్ అధికారులు సైతం పెద్ద నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఇప్పటికే దృష్టిసారించాయి. ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత కేసు నమోదు చేసేందుకు నిఘా అధికారులు సిద్ధమవుతున్నారు. పెద్ద నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడిన పోస్టల్ శాఖ అధికారుల ఆస్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, నిఘా సంస్థలు సేకరిస్తున్నాయి. -
నల్లధనంతో నడుస్తున్న సర్కార్: రాఘవులు
ఖమ్మం: నల్లధనాన్ని రద్దు చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేసినట్లు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ నల్లధనంతోనే నడుస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు. ఖమ్మంలోని మంచికంటి భవన్లో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. 50 రోజుల్లో అద్భుతం జరుగుతుందని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలపై పెనుభారం మోపారని ఆరోపించారు. -
పెద్ద నోట్ల రద్దుతో కుంటుపడిన అభివృద్ధి
పడిపోయిన జాతీయ స్థూల ఆదాయం జనవేదన సమ్మేళన్ జిల్లా కోఆర్డినేటర్ మర్రి ఆదిత్యరెడ్డి వరంగల్ : కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడంతో దేశంలో అభివృద్ధి కుంటుపడిందని జనవేదన సమ్మెళన్ జిల్లా కోఆర్డినేటర్ మర్రి ఆదిత్యరెడ్డి అన్నారు. డీసీసీ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అభివృద్ధి తిరోగమన దిశలో పడిందన్నారు. ఈ రద్దుతో జాతీయ స్థూల ఆదాయం 2 శాతం కంటె ఎక్కువ పడిపోయిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 50 రోజుల్లో రూ.లక్షా 28వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రం, రాష్టంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణమని దీనికి వ్యతిరేకంగా గ్రామ, మండల స్థాయిల్లో ప్రజలను జాగృతం చేసి ఈనెల 27న హైదరాబాద్ తిరుమలగిరిలోని జయలక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న జనవేదన సమ్మెళనంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అజ్మతుల్లా హుస్సేనీ, గ్రేటర్ కాంగ్రెస్ అ«ధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మంద వినోద్‌కుమార్, లక్ష్మారెడ్డి, మానుపాటి శ్రీను, మండల వెంకన్న, సంజీవరెడ్డి, విజయ్, అయూబ్, రాధా, లక్ష్మణ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
అంచనాలు తారుమారు
తగ్గిన రబీ సాగు సీజన్ ముగుస్తున్నా పెరగని విస్తీర్ణం రుణాలు అందక.. అప్పులు పుట్టక.. నోట్ల రద్దు, గిట్టుబాటు కాని ధరలు మంచిర్యాల అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు.. వ్యవసాయ రుణాలు అందక.. సాగుకు అప్పులు పుట్టక జిల్లాలో యాసంగి సాగు(రబీ) అంచనాలు తారుమారయ్యాయి. సాగు సీజన్ ఆరంభంలో సాధారణ సాగు విస్తీర్ణం 22 వేల హెక్టార్లుగా అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు ఏడు వేల హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.వెయ్యి, రూ.500 రద్దు చేసినప్పటి నుంచీ బ్యాంకర్లు రబీ సాగుకు రుణాలు అం దించడం లేదు. నగదు కొరత కారణంగా రైతులకు ప్రైవేటు వ్యక్తులు అప్పులు ఇవ్వడం లేదు. దీంతోపాటు జిల్లాలో సెప్టెంబర్ అనంతరం వర్షం చినుకు లేకుండా పోయింది. యాసంగి సాగు సమయంలో ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఓ మోస్తరు వర్షాలు పడుతుండేవి. దీంతో నీటి సౌకర్యం లేని వరికోతల అనంతరం ఇతర పంటలు సాగు చేసేవారు. కాని ఈ ఏడాది ఆ సమయంలో వర్షాలు కురవలేదు. ఆరుతడి పంటగా సాగు చేసుకునే శనగ సాగు విస్తీర్ణం సైతం తగ్గిపోయింది. దీంతో వ్యవసాయ శాఖ అంచనా తలకిందులైంది. సాధారణ సాగు ప్రణాళికను మరోమారు సవరించి 13,325 హెక్టార్లకు కుదించారు. ఏటా యాసంగి సాగు అక్టోబర్ నుంచి మొదలువుతుంది. నవంబర్ నుంచి జనవరి మధ్యకాలంలో పంటలు విత్తుకుంటారు. కాని జనవరి ముగింపు దశకు వచ్చినా పంట విత్తుకోవడం పూర్తి కాలేదు. జిల్లాలో ప్రధానంగా సాగువుతున్న పంటల్లో వరి పంటనే ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్ కాలంలో కురిసిన వర్షాలతో జలశయాలు నిండుకున్నా వరి సాగు చివరి ఆయకట్టు వరకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. కడెం, ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వలకు కింద అరుతడి పంటలకే అది కూడా వారబందీ ప్రకారం నీటి విడుదల చేస్తుండడంతో అన్నదాతలు వరి సాగుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం వరి నాట్లు బోరుబావులు నాన్ అయకట్టు ప్రాంతాల్లో మాత్రమే పూర్తయ్యాయి. అందని రుణాలు.. ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. యాసంగి సీజన్ ఆశాజనకంగా ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనాలు రైతుల్లో పెద్ద ఎత్తున ఆశలకు ఊపిరి పోసింది. చెరువులు, కుంటలన్నీ ఎక్కడికక్కడా నీటితో కళకళలాడుతున్నాయి. బోరుబావుల్లోనూ నీటిమట్టం అమాంతం పైకి పెరిగింది. ఈ యాసంగి కాలం ఢోకా లేదని రైతలంతా అనుకున్నా.. బ్యాంకు అధికారుల తీరుతో ఆశలు అడియాసలవుతున్నాయి. పాత రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో వెలుగు చూసిన పరిణామాలతో ఆగమయ్యారు. బ్యాంకుల్లో రుణాలు పురుద్ధరించుకోలేక, మరోవైపు కొత్త రుణాలు పుట్టకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వానకాలం సీజన్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకున్నా బ్యాంకులు, వ్యాపారుల నుంచి డబ్బులు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగి సాగుకు పెట్టుబడులకు ఆర్థిక సహకారం అన్నదే బ్యాంకుల నుంచి లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. రబీ సీజన్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురవాల్సిన వర్షాలు ముఖం చాటేయడంతోపాటు జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తుండడంతో వరి సాగు చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. సాగు ప్రణాళికలు తారుమారు యాసంగిలో పుష్కలమైన వనరులు అందుబాటులో ఉండడంతో వ్యవసాయశాఖ భారీ అంచనాలు పెట్టుకుంది. ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికి సాగు ఈ ఏడాది 22 వేల హెక్టార్ల వరకు అవుతుందని అంచనా వేసింది. గత రెండేళ్లు కరువుతో అల్లాడిన రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాలతో సాగు విస్తీర్ణం పెరుగుతుందని ప్రణాళిక రూపొందించింది. కాని పెద్ద నోట్ల రద్దు, ఖరీఫ్ పండించిన ధాన్యం అమ్ముకుంటే చేతికి నగదు అందక, గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రబీ సాగుకు వెనకడగు వెస్తున్నారు. దీంతో వ్యవసాయ శాఖ అంచనాలే తారుమారు అవుతున్నాయి. సాగు జనవరి నెల చివరి వరకు 90 శాతం పూర్తి కావాల్సి ఉంది. కాని 50 శాతం కూడా లేదు. -
ఆన్లైన్ నమోదు నత్తనడక...!
గ్రామీణ పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు, ఆధార్ వివరాలు ఇప్పటి వరకు 24 శాతం మాత్రమే ఆన్లైన్ ఎనిమిది మండలాల్లోనే చురుగ్గా నమోదు వచ్చేనెల బ్యాంకులో డబ్బులు జమ కష్టమే ఇందూరు : పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు నిల్వలు లేకపోవడంతో జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభావం పడింది. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో నగదు లేక పింఛన్ లబ్ధిదారులు, ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు డబ్బులు పొందలేకపోతున్నారు. ఇకపై వచ్చే నెల నుంచి పట్టణ ప్రాంతాల్లో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోని పింఛన్ లబ్ధిదారులకు కూడా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులను జమ చేయాలని నిర్ణయించాం. ఇందుకు అన్ని మండలాల ఎంపీడీఓలు గ్రామీణ ప్రాంతాల్లోని పింఛన్ లబ్ధిదారుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్, ఫోన్ నెంబర్లు సేకరించి ఆసరా వెబ్సైట్లో ఈ నెల 7 లోగా నమోదు చేయండి. (జిల్లా కలెక్టర్ యోగితా రాణా పది రోజుల క్రితం ఎంపీడీఓలకు జారీ చేసిన ఆదేశాలు.) అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరయ్యాయి. గ్రామాల నుంచి పింఛన్ లబ్ధిదారుల వివరాలైన బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఫోన్ నెంబర్ల సేకరణ చాల మండలాల్లో జరగనేలేదు. కలెక్టర్ వివరాల నమోదుకు ఇచ్చిన ఈ నెల 7 గడువు ముగిసిపోయింది. ఇందుకు 10 తేదీ వరకు గడువు పొడగించగా... ప్రస్తుతం వివరాలు సేకరించిన మండలాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఆన్లైన్లో వివరాలను నమోదు చేయిస్తున్నారు. దీంతో కలెక్టర్ అనుకున్నట్లు వచ్చే నెల పింఛన్ల పంపిణీ బ్యాంకు ఖాతాల ద్వారా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మళ్లీ నగదు డబ్బుల కోసం పింఛన్ లబ్ధిదారులు ఆందోళనలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ఇప్పటి వరకు కొనసాగుతోంది. డిసెంబర్‌కు సంబంధించిన పింఛన్ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇదే నెలలో 18 లేదా 20 తేదీకి జిల్లాకు రానున్నాయి. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్ల వివరాలు పూర్తి స్థాయిలో ఆసరా పింఛన్ల వెబ్సైట్లో ఇంకా నమోదు కాలేదు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పింఛన్ లబ్ధిదారులు కలిపి 1,90,357 మంది ఉన్నారు. ఇప్పటి వరకు అన్ని మండలాలు కలిపి కేవలం 45,724 మంది (24శాతం) వివరాలను మాత్రమే నమోదు చేశారు. ఇంకా 1,46,633 (76శాతం) మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. రెండు రోజుల్లో వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం కష్టమని సిబ్బంది అంటున్నారు. ఆ ఎనిమిది మండలాలు బెటర్... గ్రామాల్లోని పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్లను ఇవ్వాలని ఇందుకు గ్రామాల్లో దండోరా, టాంటాం చేయించాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. పంచాయతీ కార్యదర్శికి పింఛన్ లబ్ధిదారుల వివరాలు అందజేయాలని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. కలెక్టర్ ఈ ఆదేశాలిచ్చి పదిరోజులు అవుతున్నా కొన్ని మండలాల్లోనే పింఛన్ లబ్ధిదారుల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. మిగతా మండలాల్లో నమోదు ఇంకా ప్రారంభం కాకపోగా, మరికొన్ని మండలాల్లో 5 నుంచి 10 శాతం మంది వివరాలు నమోదు కాక నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం చురుగ్గా పని చేస్తున్న మండలాలు నిజామాబాద్ (75 శాతం), జక్రాన్‌పల్లి (57శాతం), ఆర్మూర్ (25శాతం), మోర్తాడ్ (35శాతం), నందిపేట్ (30శాతం), వర్ని (35శాతం), భీమ్‌గల్ (28శాతం), డిచ్పల్లి (25శాతం) ఉన్నాయి. మిగతా మండలాలైన బాల్కొండ, సిరికొండ, వేల్పూర్, ఎడపల్లి, మాక్లూర్, బోధన్, ధర్పల్లి, కమ్మర్పల్లి, సిరికొండ, నవీపేట్ తదితర మండలాలు వివరాల నమోదులో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఈ మండలాల్లో 5 నుంచి 10 శాతం కూడా వివరాల నమోదు దాటలేదు. ఒత్తిడి తెస్తున్న కలెక్టర్... నగదు నిల్వలు లేనందున డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులను చేతికి ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. లబ్ధిదారుల వివరాలు వేగంగా సేకరించి ఆన్లైన్లో నమోదు చేయించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో పై ఎనిమిది మండలాల ఎంపీడీఓలు చురుగ్గా పని చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లతో రాత్రింబవళ్లు, సెలవు దినాల్లో కూడా పని చేయిస్తూ డాటా ఎంట్రీ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు డీఆర్డీఏ అధికారులతో వివరాల నమోదు ఎంత వరకు వచ్చిందో కలెక్టర్ ఆరా తీయిస్తున్నారు. నమోదు వేగవంతం చేయాలని ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న ఎంపీడీఓలకు నోటీసులు అందే సూచనలు కనిపిస్తున్నాయి. -
రుణమో రామచంద్రా..!
మూడు జిల్లాల్లో నిలిచిన ఎస్‌హెచ్‌జీ రుణాలు 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సింది రూ.763.54 కోట్లు నవంబర్ నాటికి కేవలం రూ.234.22 కోట్ల చెల్లింపులు రుణాల కోసం 33,324 సంఘాల ఎదురుచూపులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు క్యాష్‌లెస్ లావాదేవీలతో కొత్త తిప్పలు సంఘాల తీర్మానంతోనే రుణాలు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి సంస్థ ఆదేశాలు నల్లగొండ : మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు వలలో చిక్కుకుని మహిళా సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను సంఘాలకు చెల్లించాల్సిన లింకేజీ రుణాలను బ్యాంకులు నిలిపేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి.. వారిని అన్ని రంగాల్లో బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మంజూరవుతుంటాయి. అదే పద్ధతిలో ఈ ఏడాది కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. అప్పటికే జిల్లాల పునర్విభజనలో అధికార యంత్రాంగం బిజీగా ఉండటంతో రుణాలివ్వడంలో బ్యాంకులు వెనుకంజ వేశాయి. దీంతోపాటు ప్రభుత్వం విడుదల చేయాల్సిన పావలా వడ్డీ రాయితీ కూడా బ్యాంకుల్లో జమ కాలేదు. ఈ క్రమంలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా మొండికేశారు. ఇదే క్రమంలో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో రుణాల మంజూరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇదీ పరిస్థితి.... 2016–17కుగాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 43,825 సంఘాలకు రూ. 763.54 కోట్లు రుణ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ మేరకు అక్టోబర్ మాసాంతానికి కేవలం 10 ,501 సంఘాలకు రూ.234.22 కోట్లు మంజూరు చేశారు. నిర్ధారించిన లక్ష్యం ప్రకారం బ్యాంకులు నవంబర్ నాటికి 21,898 సంఘాలకు రూ.397.61 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ.. పది వేల సంఘాలకు మాత్రమే రుణాలు ఇచ్చాయి. దీంతో 33,324 సంఘాలు రుణాల కోసం ఎదురుచూస్తున్నాయి. మండలాల వారీగా ఇలా.. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలంలో 737 సంఘాలకు రూ.15.21 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 85 సంఘాలకు రూ.3.47 కోట్లు ఇచ్చారు. మిర్యాలగూడ మండలంలో 1,338 సంఘాలకు రూ.26.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 387 సంఘాలకు రూ.11.28 కోట్లు మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండలంలో 1313 సంఘాలకు రూ.21.93 కోట్ల రుణాలు ఇవ్వాలి. 262 సంఘాలకు రూ.7.11 కోట్లు మాత్రమే ఇచ్చారు. చివ్వెంల మండలంలో 765 సంఘాలకు రూ.13.90 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 69 సంఘాలకు రూ.2.15 కోట్లు ఇచ్చారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు మండలంలో 783 సంఘాలకు రూ.12.49 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్దేశించగా.. 166 సంఘాలకు రూ.3.59 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. వలిగొండ మండలంలో 1,049 సంఘాలకు రూ.18.59 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 255 సంఘాలకు రూ.7.19 కోట్లు చెల్లించారు. తీర్మానం తప్పనిసరి.. రుణాలు రాక సంఘాలు సతమవుతున్న పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహి ంచడం కోసం చేపట్టిన చర్యలు సంఘాలను మరింత ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. సంఘం లోని ప్రతి సభ్యురాలికి బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు ఉంటే తప్ప రుణం ఇచ్చే పరిస్థితి లే కుండా పోయింది. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, చెక్కుబుక్కు కలిగిన సంఘ సభ్యురాలికి మాత్రమే రుణం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. గతంలో రుణం మంజూరైన సంఘం బ్యాంకుకు వెళ్లి ఆ మొత్తాన్ని డ్రా చేసి సభ్యులకు పంచడం చేసేవారు. ప్రస్తుతం నగదు ర హిత లావాదేవీల వైపు మహిళా సంఘాలను మళ్లించాలన్న నిర్ణయంతో కొత్త నిబంధన వి ధించారు. రుణ మంజూరు పొందిన సంఘం సభ్యుల ఆమోదంతో తప్పనిసరిగా తీర్మానం చేయాలి. ఈ పత్రాన్ని బ్యాంకులకు అందజేయాలి. తీర్మాన పత్రంలో సభ్యుల బ్యాంకు ఖాతా నంబర్లు రాయాలి. దీంతో బ్యాంకర్లు రుణ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత సభ్యులు ఏటీఎం నుంచి నగదు పొందాలి. సభ్యులు మరొకరి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాల్సిన పరిస్థితి వస్తే చెక్కులు ఉపయోగించుకోవాలి. మొత్తంగా ఇక ముందు బ్యాంకుల నుంచి రుణాలు పొందే సంఘాలు నగదు రహిత లావాదేవీలనే కొనసాగించాలి. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ క్షేత్రస్థాయిలో సీసీలకు, ఏపీఎంలకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు మాసాలే గడువు... ఆర్థిక సంవత్సరం మరో మూడు మాసాల్లో ముగియనుంది. ఈ మూడు నెలల్లో బ్యాంకులు 33,324 సంఘాలకు రూ.529.32 కోట్లు రుణం ఇవ్వాల్సి ఉంది. నోట్ల రద్దు సమస్య నుంచి బ్యాంకులు ఇంకా కోలుకోలేదు. పూర్తిస్థాయిలో బ్యాంకులకు నగదు నిల్వలు చేరుకోలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత స్వల్ప వ్యవధిలో బ్యాంకులు ఏమేరకు రుణ లక్ష్యాన్ని పూర్తిచేస్తాయో వేచిచూడాల్సిందే. -
ఆ డబ్బెవరిది?
నాలుగు రోజులు.. రూ.43 కోట్లు.. డీసీసీబీ డిపాజిట్లపై నాబార్డు ఆరా.. విచారణ చేపట్టిన ఉన్నతాధికారుల బృందం నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సహకార బ్యాంకుల్లోని డిపాజిట్లపై నాబార్డు ఉన్నతాధికార బృందం విచారణ చేపట్టింది. డిపాజిట్ల మాటున బ్లాక్ మనీని.. వైట్‌గా మార్చుకున్నారా? అనే దానిపై ఆరా తీసింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం జిల్లాలోని కో–ఆపరేటివ్ బ్యాంకులను సందర్శించి డిపాజిట్లపై విచారణ చేపట్టింది. సుమారు మూడు రోజుల పాటు విచారణ జరిగింది. రూ.రెండు లక్షలు, అంతకు మించి డిపాజిట్ చేసిన ఖాతాలపై ఆరా తీసింది. అలాగే పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన ఖాతాలకు కేవైసీ ఉందా? లేదా? అనే కోణంలో విచారణజరిపింది. రూ.50 వేలకు మించి చేసిన డిపాజిట్లకు పాన్‌కార్డు జత చేశారా? వంటి అంశాలను పరిశీలించింది. డిపాజిట్ల సేకరణలో ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించారా? లేదా? అనే అంశాలపై విచారణ జరిగింది. రాజకీయ నేతల పాలనలో నడుస్తున్న ఈ కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీని, వైట్‌గా మార్చారనే ఆరోపణలు పలు రాష్ట్రాల్లో వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమవైన ఆర్బీఐ విచారణ చేపట్టాలని నాబార్డును ఆదేశించింది. ఈ మేరకు నాబార్డు ఉన్నతాధికార బృందం జిల్లాలో విచారణ జరిపింది. రాష్ట్రంలో ఎక్కువ డిపాజిట్లు.. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 41 కో–ఆపరేటివ్ బ్యాంకులున్నాయి. వీటిలో సుమారు 1.30 లక్షల మంది ఖాతాదారులున్నారు. డిమానిటైజేషన్ నేపథ్యంలో ఇతర బ్యాంకుల మాదిరిగా కో–ఆపరేటివ్ బ్యాంకులకు పాతనోట్ల ఎక్చే ్సంజీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మొదటి నుంచి అనుమతి ఇవ్వలేదు. కేవలం డిపాజిట్లు మాత్రమే తీసుకునేందుకు వీలు కల్పించింది. గత నెల 9, 10, 11, 12 తేదీల్లో నాలుగు రోజులు మాత్రమే డిపాజిట్లు తీసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ 13వ తేదీ నుంచి ఈ డిపాజిట్ల స్వీకరణకు కూడా బ్రేకు వేసింది. ఈ నాలుగు రోజుల్లోనే జిల్లాలో సుమారు రూ.43 కోట్ల మేరకు డిపాజిట్లు వచ్చాయి. దీంతో ఇలా ఇతర జిల్లాల్లోని కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు రావడంతో ఆర్బీఐ నాబార్డును విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా నాబార్డు బృందం ఈ డిపాజిట్లపై ఆరా తీసింది. ఇందులో ఏమైనా నల్లధనాన్ని తెల్లదనంగా మార్చారా? అనేక కోణంలో ఆరా తీయడం సహకార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సహకార బ్యాంకుల్లో నామమాత్ర డిపాజిట్లపై విచారణల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం పలు ప్రైవేటు బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో జరిగిన వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్లధనం మార్చుకునేందుకు కొన్ని ప్రైవేటు బ్యాంకులు యథేచ్ఛగా నల్ల కుబేరులకు సహకరించారనే అభిప్రాయం ఉంది. పాత నోట్ల మార్పిడితో పాటు, డిపాజిట్ల సేకరణలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. -
నగదు రహితం వైపు అడుగులు
ఆరెపల్లి గ్రామస్తుల నిర్ణయం ఇప్పటికే గ్రామపంచాయతీతీర్మానం గ్రామంపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ అందరికీ బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలు అందించడంపై దృష్టి గీసుకొండ : వంద శాతం నగదు రహిత లావాదేవీలు సాధించే దిశగా గీసుకొండ మండలంలోని ఆరెపల్లి గ్రామం అడుగులు వేస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా నగదు రహిత లావాదేవీలు జరిగేలా గ్రామాల్లో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఆరెపల్లి గ్రామస్తులు కూడా పూర్తిగా నగదు రహిత లావాదేవీలవైపు మొగ్గుచూపాలని గ్రామపంచాయతీలో తీర్మానం కూడా చేశారు. ఈక్రమంలోనే గ్రామంలో 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉండేలా చర్యలు చేపట్టారు. పూర్తయిన సర్వే గ్రామంలో ఎంత మందికి అకౌంట్లు ఉన్నాయో, లేని వారెవరు అనేది తెలుసుకోవడానిని సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ ద్వారా ఇంటింటి సర్వే చేయించారు. ఈ సందర్భంగా గ్రామంలో 602 మందికి బ్యాంకు అకౌంట్లు లేని వారు కేవలం 25 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరికీ త్వరలో బ్యాంకు ఖాతాలను తెరిపించే పనిలో సర్పంచ్, తదితరులు నిమగ్నమయ్యారు. గ్రామంలోని చాలా మందికి మండలంలోని ఊకల్ కార్పొరేషన్ బ్యాంకు, మచ్చాపూర్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. అయితే, ఖాతాలు ఉండడమే కాదు.. అందరికీ ఏటీఎం కార్డులు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలో కార్పొరేషన్ బ్యాంకు మినీ శాఖ ఉండగా.. ఇక్కడ స్వైప్ మిషన్ వాడుతున్నారు. అలాగే రెండు కిరాణాషాపులతో పాటు ఇద్దరు మక్కల వ్యాపారులు గ్రామంలో ఉన్నారు. వీరికి సైతం త్వరలో స్వైప్ మిషన్లు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్పంచ్‌తో కలెక్టర్ సమీక్ష ఆరెపల్లె గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఈనెల 19వ తేదీన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ తుమ్మనపెల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురునగదు రహిత లావాదేవీల విషయమై కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మరుసటి రోజు సర్పంచ్‌ను పిలిపించుకుని నగదు రహిత లావాదేవీలు జరిగే గ్రామాన్ని తీర్చిదిద్దాలని.. ఇందుకు తన సహకారం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌ను పిలిపించి అందరికీ ఖాతాలు ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికే సిద్ధిపేటలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని పూర్తిగా నగదురహిత లావాదేవీలు జరిగేలా తీర్చిదిద్దారు. ఇక్కడ కూడా అనుకున్నవన్నీ సజావుగా జరిగితే త్వరలోనే ఆరెపల్లె కూడా ఇబ్రహీంపూర్ సరసన నిలవనుంది. 15 రోజుల్లో పూర్తి చేస్తా తుమ్మనపెల్లి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రానున్న 15 రోజుల్లో గ్రామంలోని అందరికీ బ్యాంకు ఖాతాలతో పాటు ఏటీఎం కార్డులు అందేలా కృషి చేస్తున్నాం. ఆ తర్వాత స్వైప్మిషన్ల ద్వారా లావాదేవీలు జరిగేలా చర్యలు చేపడుతున్నాం. గ్రామం నుంచి నగరానికి వెళ్లి ఆర్థిక లావాదేవీలు చేసే వారి వద్ద ఏటీఎం కార్డులు ఉండటంతో నగదు కొరత సమస్య ఎదురుకాదు. -
నోట్ల రద్దు ఆర్థిక దోపిడీ: రాహుల్ గాంధీ
-
నోట్ల రద్దు ఆర్థిక దోపిడీ
రాహుల్ గాంధీ విమర్శ అల్మోరా(ఉత్తరాఖండ్): నోట్ల రద్దు నల్లధనంపై యుద్ధం కాదని, అది ఆర్థిక దోపిడీ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అల్మోరాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. 1 శాతం ప్రజలను మరింత ధనవంతులను చేసేందుకు 99 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న దొంగల పేర్లు వెల్లడించాలని రాహుల్ ప్రధానిని డిమాండ్ చేశారు. స్విస్ ప్రభుత్వం నల్లధనం కలిగిఉన్నవారి పేర్లను వెల్లడించిందని, వారి పేర్లను లోక్‌సభ, రాజ్యసభల్లో ఎందుకు వెల్లడించలేదని, ప్రశ్నించారు. అత్యంత ధనికుల రూ. 8 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడానికే పెద్దనోట్లను రద్దు చేశారన్నారు. నోట్ల రద్దు వల్ల 99 శాతం పేదల నుంచి డబ్బు లాక్కుని 50 ధనిక కుటుంబాలకు కట్టబెడతున్నారని, నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో జరిగే ప్రతి ఆన్లైన్ లావాదేవీలో 5 శాతం ఆ కుటుంబాలకు వెళ్తుందని ఆరోపించారు. కాగా మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు బిర్లా సంస్థ ముడుపులిచ్చిందన్న రాహుల్ ఆరోపణ గురించి తమకు తెలియదని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం అన్నారు. -
విచారణకు సహకరించడం లేదు
► ముసద్దీలాల్ ఎండీ తదితరులపై హైకోర్టుకు పోలీసుల నివేదన ► లోతుగా విచారణ జరపాల్సి ఉందని వినతి ► ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలన్న న్యాయస్థానం హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రక టన వెలువడిన వెంటనే భారీ ఎత్తున బం గారం విక్రయించినట్లు దొంగ రసీదులు సృష్టించి రూ.100 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొం టున్న ముసద్దీలాల్ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్లు విచారణకు సహ కరించడం లేదని పోలీసులు బుధవారం ఉమ్మడి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో లోతైన విచారణ చేపట్టి వాస్త వాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికి స్పందించిన హైకోర్టు, ఏం చేసినా సీఆర్పీసీ సెక్షన్ 41ను అనుస రించే చేయాలని పోలీసులకు స్పష్టం చేస్తూ దీనిపై విచారణను ముగించింది. ఈ మేర కు న్యాయమూర్తి రాజా ఇలంగో ఉత్తర్వు లు జారీ చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం ముసద్దీలాల్ యాజమాన్యం 5,200 తప్పుడు రసీదులను సృష్టించి భారీ స్థాయిలో బంగారం విక్రయించినట్లు చూపి పాత నోట్లను మార్పిడి చేసిందని, తద్వారా రూ.100 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీ సులు కేసు నమోదు చేశారు. ఈ కేసు సీసీఎస్ పోలీసులకు బదిలీ అయింది. తమపై కేసు నమోదు చేయడంతో పాటు సీసీ టీవీ ఫుటేజీలను జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ముసద్దీలాల్ ఎండీ, ఇతరులు హైకోర్టును ఆశ్రయించిన విష యం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలీసులు అడిగిన ప్రశ్న లన్నింటికీ పిటిషనర్లు సమాధానాలు ఇచ్చారని తెలిపారు. పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. అయితే ఈ వాదనలను హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణుగోపాల్ తోసిపుచ్చారు. విచార ణకు ఎంత మాత్రం సహకరించడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రేషన్ కిరోసిన్‌కు రెక్కలు
ఆరు నెలల్లో రెండు సార్లు పెరిగిన ధర తాజాగా లీటరుపై రూ.2 వడ్డన జిల్లా పేదలపై నెలకు రూ.4.32 లక్షల భారం గీసుకొండ : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సామాన్యులు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే కిరోసిన్ లీటరుకు రూ.2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల క్రితమే లీటరు కిరోసిన్‌కు రూ.2 పెంచిన ప్రభుత్వం మళ్లీ రూ. 2 పెంచడంతో కిరోసిన్ వినియోగించే పేదలపై అధికభారం పడనుంది. ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈనెల నుంచే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ సరుకులు పేదలకు సరిగా అందేలా చూడటానికి సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం మరో దారిలో వాటి ధరలను పెంచుతుండటం విమర్శలకు తావిస్తోంది. తద్వారా సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. గతం నుంచి ధర పెరుగుదల ఇలా.. గతంలో లీటర్ కిరోసిన్‌ను ప్రభుత్వం రూ.15కు అందజేసింది. దీనిని రూ.2 పెంచి రూ.17తో ఇటీవల వరకు కిరోసిన్ సరఫరా చేశారు. తాజాగా మరో రూ. 2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా లీటరు కిరోసిన్‌కు రూ.19 చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఆరు నెలల్లోనే రెండు సార్లు పెంచడంతో పేదలపై లీటరుకు రూ. 4 భారం పడినట్లయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలు దీపాలు, వంట తయారీ, పవర్స్రేయర్ల వాడకానికి అధికంగా కిరోసిన్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ధర పెంచడం వారికి ఆశనిపాతంలా మారనుంది. కాగా, కిరోసిన్ ధర పెరుగుదలతో వరంగల్ రూరల్ జిల్లాలోని పేదలపై ప్రతి నెల రూ.4,32,984 అదనంగా భారం పడనున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 464 రేషన్ షాపులు ఉండగా 2,19,462 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. అక్రమాలను నిరోధిస్తే మేలు.. రాష్ట్రప్రభుత్వం పేదల అవసరాలకు కిరోసిన్ సరఫరా చేస్తుండగా.. ఇందులో ఎక్కువ శాతం పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ఆహార భద్రత కార్డులు ఉన్న వారికి రాయితీపై లీటరు చొప్పున, గ్యాస్ లేనివారికి రెండు లీటర్ల చొప్పున కిరోసిన్‌ను ప్రతి నెలా ప్రభుత్వం అందిస్తోంది. కిరోసిన్ అధికంగా అవసరం ఉన్న నిరుపేదలు మాత్రమే రేషన్ షాపుల నుంచి తీసుకువెళ్తున్నారు. ఇక ఎక్కువవగా వ్యవసాయ అవసరాలైన ఆయిల్ ఇంజన్లు, పవర్ స్పేయ్రర్లు, తైవాస్ స్పేయ్రర్లు నడిపేందుకు కిరోసిన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కిరోసిన్ హ్యాకర్లు కేవలం కొద్దిమంది లబ్ధిదారులకే కిరోసిన్ ఇచ్చి మిగతా వారికి మొండిచేయి చూపిస్తున్నారు. అలా మిగిలిన కిరోసిన్‌ను నల్లబజార్‌కు తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హాకర్ల నుంచి రూ.25 నుంచి రూ.30వరకు లీటర్ చొప్పున కిరోసిన్ కొనుగోలు చేసే బయటి వ్యాపారులు లీటరుకు రూ.35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని.. తద్వారా తరచూ ధర పెంచకుండా నిరుపేదలను భారం నుంచి కాపాడొచ్చని పలువురు భావిస్తున్నారు. -
గీకేస్తారు జాగ్రత్త!
మర్రిపాలెం : పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నారుు. డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ సేవలు అమాంతంగా పెరిగారుు. గతంలో రోజుకు లక్షలాదిగా ఉంటే ప్రస్తుతం కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుండడం విశేషం. జిల్లా వ్యాప్తగా రోజు దాదాపు రెండు లక్షల నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నారుు. అరుుతే ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియలో ఖాతాదారులు అప్రమత్తంగా లేకపోతే నష్టం తప్పదు. జాగ్రత్త పాటించకపోతే మోసాలకు అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కొత్త కొత్త సైబర్ నేరాలు పుట్టుకొస్తున్నారుు. బ్యాంకు ఖాతాల్లోని నగదు మాయమవుతోంది. క్రెడిట్ కార్డుతో యజమానికి తెలియకుండా చెల్లింపు జరుగుతోంది. ఇలాంటి పరిణామాలతో ఖాతాదారులు భయపడే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆన్లైన్ మోసాలతో అనేకులు బాధితులయ్యారు. సైబర్ నేరంతో పట్టుబడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందని తెలియక మోసాలకు పాల్పడుతున్నా రు. అరుుతే చిన్నపాటి జాగ్రత్తలతో మోసా లకు దూరంగా ఉండవచ్చుననేది కాస్త ఉపశమనమే. వివిధ రకాల మోసాలు : సైబర్ నేరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంటే ముంబరుు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాలు అదే కోవలో నడుస్తున్నారుు. సైబర్ స్టాల్కింగ్, బ్లాక్ మెరుులింగ్, హాకింగ్, ఫిషింగ్, స్పామింగ్, ఫార్మింగ్, అబ్సెయానిటీ, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, డేటా థెఫ్ట్, క్యాష్ ట్రాన్సఫర్, తదితర సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారుు. లాటరీ లు, గిఫ్ట్‌లు, బంపర్ డ్రాల పేరుతో మోసపోతున్న బాధితులున్నారు. బయటకు చెబితే పరువు పోతోం దని సైబర్ బాధితులు బయటపడటం లేదు. ఇప్పటికే సైబర్ నేరాలతో రూ.లక్షలు పోగొట్టుకున్న బాధితులు పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యారుు. సైబర్ నేరాలకు పాల్పడేవారంతా అధికంగా 25నుంచి 40 ఏళ్ల మధ్య యువకులని తేలింది. సైబర్ నేరాలకు పాల్పడేవారికి ఐటీ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) చట్టంలో ఆయా సెక్షన్ల ప్రకారం శిక్ష పడుతోంది. అవగాహన లోపంతోనే చిన్నపాటి తప్పిదాలతోనే జనం సైబర్ మోసాల బారిన పడుతున్నారు. నేరగాళ్లు బ్యాంక్ అధికారుల్లా మాట్లాడి వివరాలు రాబట్టడం, అంతర్జాతీయ కంపెనీల లాటరీలో మీరు ఎంపికయ్యారంటూ చెప్పగానే ’ఈ-మెరుుల్’ సందేశాలకు తిరిగి వివరాలు పంపడం, డెబిట్ కార్డు పిన్ నంబర్ చెప్పడంతో సైబర్ నేరాలు సులభంగా జరిగిపోతున్నారుు. ఇలా జాగ్రత్త పడొచ్చు ఖాతాదారులు బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ కార్డు నంబర్ ఇతరులకు చెప్పొద్దు పిన్ నంబర్ రహస్యంగా ఉంచాలి. కార్డు మీద, పర్సులో ఎక్కడా రాసి పెట్టుకోకూడదు బ్యాంకుల నుంచి సిబ్బంది, ఇతర స్థారుు అధికారులు ఫోన్లలో వివరాలు సేకరించరని గ్రహించాలి అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదివ్వాలి ఏటీఎం కేంద్రాలు, పోస్ (పీవోఎస్)యంత్రాలలో పిన్ నంబర్ స్వయంగా నమోదు చేయగలగాలి. ఇతరుల సహాయం తీసుకోవద్దు. ఆన్లైన్లో షాపింగ్ చేసే సందర్భాలలో సదరు సంస్థ గుర్తింపును పరిశీలించాలి. అతి తక్కువ ధరలు, మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. -
ఫస్ట్ కష్టాలు
సగటు జీవి అయోమయం అసలు సమస్యలు నేటి నుంచే మొదలు బ్యాంకుల ముందు భారీగా క్యూలు గంటల వ్యవధిలో ఖాళీ అవుతున్న క్యాష్ట జీతం డబ్బులు చేతికొచ్చేనా అంటున్న ఉద్యోగులు పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడి 22 రోజులు దాటింది. అప్పటినుంచి చిల్లర నోట్ల కోసం సామాన్యుడి పాట్లు అన్నీ ఇన్నీ కావు. డిసెంబర్ ఒకటో తారీఖు నాటికైనా ప్రభుత్వం కొంత ఊరట కల్పిస్తుందని ఆశించారు. అరుుతే ఆ పరిస్థితి లేదు. మొదటి తేదీ వస్తే చాలు.. నెలవారీ బకారుులు, ఇంటి అద్దె, పాల బిల్లు, కిరాణా, పిల్లల ఫీజులు, చీటీలు.. ఇలా ఎన్నో సమస్యలుంటారుు. చేతిలో డబ్బుంటే వీటిని చెల్లించి హారుుగా ఊపిరి పీల్చుకుంటారు మధ్య తరగతి జనం. ప్రస్తుతం బ్యాంకులో చాలీ చాలనీ నగదు కారణంగా ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు. ఇక ప్రైవేటు సంస్థలో పనిచేసే చిరుద్యోగుల ఖాతాల్లోకి నగదు జమ అరుునప్పటికీ అవి చేతికందడం గగనంగా మారింది. రోజంతా బ్యాంకు క్యూలో నిల్చున్నా రూ. రెండు వేలు చేతికందడం కష్టంగా ఉంది. చిత్తూరు /పలమనేరు: ప్రతి నెలా ఒకటో తారీఖు కొంత ఆనందాన్నిస్తుంది. ఈ ఒకటో తేదీ మాత్రం ఆందోళన రేకిత్తిస్తోంది. ప్రభుత్వం దగ్గర నుంచి సామాన్యుడి వరకు అమ్మో ఒకటో తారీఖు అంటూ వణికిపోతున్నారు. నల్లధనం కట్టడి చేసేందుకు పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. ప్రధాని ప్రకటన అనంతరం ఖాతాల నుంచి నగదు తీసుకునేందుకు ఎదురవుతున్న ఇబ్బందులు సామాన్యులను అయోమయానికి గురిచేస్తున్నారుు. నోట్ల రద్దు ప్రకటన తరువాత సామాన్యులు మూడు వారాల పాటు ఓపిగ్గా నెట్టుకొచ్చారు. నేడు ఒకటో తారీఖు. పాల బిల్లు నుంచి ఇంటి అద్దె వరకు ఎన్నో చెల్లింపులు. ఏటీఎంలు రూ.2 వేల కంటే విదల్చవు. బ్యాంకుల ఎదుట ఉన్న బారులు చూసి ఈ గండం గడిచేదెట్టా అని సగటు జీవి సతమతం అవుతున్నాడు. పెట్రోలు బంకుకు వెళ్తే చిల్లర ఉంటేనే పోస్తామంటున్నారు. రైతులు తమ పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు. మొదటి వారాన్ని ఎలా దాటాలా అంటూ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గురువారం నుంచి కొత్త నెల ప్రారంభం అవుతుండటంతో ఏటీఎంల వద్ద ఉండే చేంతాడంత బారులను తలచుకొని సామాన్యులు చింతచెందుతున్నారు. బుధవారం నాడే ఎక్కడైనా నగదు దొరుకుతుందేమోనని ఏటీఎంల చుట్టూ చక్కర్లు కొట్టారు. కానీ ఏం లాభం. ఎక్కడా నగదు లేదు. ఇదిగో సాక్ష్యం... పలమనేరు మండలంలోని పెంగరగుంటకు చెందిన గిరిబాబు రెండు పాడి ఆవులను మేపుతూ నెలకు పది వేల ఆదాయాన్ని గడిస్తున్నాడు. ఇతని ఇద్దరు పిల్లలు వారి చదువుకు నెలకు రూ.1.200 కరెంటు చార్జీకి రూ.450, బియ్యం, ఇంటి సరుకులకు రూ.4,200, ఆస్పత్రి ఖర్చుగా రూ.500, బైక్ పెట్రోల్‌కు రూ.1,000, గ్యాస్ సిలిండర్‌కు రూ.600. మొబైల్ రీచార్జ్, డిష్ రీచార్జ్‌లకు రూ.600, అదనపు ఖర్చులుగా మరో 1,500 అవుతోంది. ఆ లెక్కన నెలకు ఇతని కుటుంబం ఖర్చు రూ.10 వేలు అవుతోంది. ఇతని రెండు పాడి ఆవుల ద్వారా రోజుకు పది లీటర్ల పాలుపోస్తాడు. అరుుతే బ్యాంకులో జమ అరుున పాలబిల్లు ఒకేదఫా తీసుకునేందుకు వీలుకావడం లేదు. దీంతో బ్యాంకులో నగదు ఉన్నా ఈ నెల 5వేలు అప్పుచేయాల్సిందే. అరుుతే అప్పు పుట్టడం లేదు. దీంతో ఈనెల పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన చెందుతున్నాడు. క్షేత్రస్థాయిలో తప్పని సమస్యలు అధికారులు చెబుతున్నట్టు నగదు రహిత లావాదేవీలతోనే అన్ని సమస్యలు తీరడం లేదనే విషయం క్షేత్రస్థారుులో తెలుస్తోంది. ఉదాహరణకు పలమనేరు పట్టణంలో 15వేల కుటుంబాలు 55వేల జనాభా ఉంది. వీరిలో 2వేల కుటుంబాలకు పైగా అద్దె ఇళ్లలో ఉన్నారు. వీరు నెల అద్దెలుగా కొందరు చెక్కులిస్తున్నారు. ఖాతాలు లేనివారి పరిస్థితి గందరగోళంగా మారింది. పట్టణంలో పలు ఇళ్లకు పాడిరైతులే పాలు పోసున్నారు. వీరి వద్ద స్వైపింగ్ మిషన్లు లేవు. స్కూళ్లు, కాలేజీల్లో నగదు లావాదేవీలే జరుగుతున్నారుు. చిన్నపాటి దుకాణాల్లో సరుకుల అమ్మకాలు నగదుతోనే, ప్రతినెలా చీటీలు కట్టేవారు కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఫలితంగా బ్యాంకుల నుంచి డబ్బులు దొరక్క సాధారణ ప్రజలు ఇబ్బందుల పడుతున్నారు. పెన్షనర్లకు ప్రత్యేక కౌంటర్లు తమకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. చిల్లర నగదు ఇవ్వడానికి ఆర్బీఐ ఒప్పుకోవడం లేదు. సీనియర్ సిటిజన్లకు ఆరోగ్యపరమైన సమస్యలు అధికంగా ఉంటారుు కాబట్టి బ్యాంకులు దీన్ని దృష్టిలో ఉంచుకుని రూ.25 వేలు చిల్లరనోట్లు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 28 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. -
పెద్ద నోట్ల రద్దుపై నిరసన
అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు పలుచోట్ల ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు దహనం నిజామాబాద్ : పెద్ద నోట్ల చెలామణి రద్దును నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగారుు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ వంటి పట్టణాలతోపాటు పలు మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగారుు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నేతలు కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీలు, రాస్తారోకోలు జరిగారుు. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యూ) తదితర పార్టీలు, అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులు నగరంలోని స్థానిక గాంధీచౌక్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్ పార్టీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. నిజాంసాగర్ కాలువ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. నందిపేట్‌లో బస్టాండ్ ఎదుట ర్యాలీ, ధర్నా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. మాక్లూర్ మండలంలో సీపీఎం(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, మోదీ బొమ్మను దగ్ధం చేసారు. బోధన్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. రెంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. వర్ని మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అఖిల పక్ష నేతలు ర్యాలీ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కోటగిరి మండలంలో ర్యాలీ జరిగింది. డిచ్‌పల్లిలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో, సిరికొండలో న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. మోర్తాడ్‌లో రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో 64వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. -
రియల్ బిజినెస్‌పై నోట్ల దెబ్బ
జిల్లా అంతటా నిలిచిన {Mయవిక్రయాలు వ్యాపారం కుదరక రద్దవుతున్న అగ్రిమెంట్లు స్తంభించిన రూ.200 కోట్ల వ్యాపారం కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జిల్లాలోని రియల్ బిజినెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. రెండు వారాలుగా జిల్లా అంతటా భూ క్రయవిక్రయాలు స్తంభించారుు. ఎక్కడా సెంటు భూమి కొన్న దాఖలాలు లేకుండా పోయారుు. దీంతో కోట్లు కుమ్మరించి రియల్ వ్యాపారం చేస్తున్న వ్యాపారుల పరిస్థితి తారుమారైంది. భూముల కొనుగోళ్లు, డెవలప్మెంట్ ఛార్జీలకు పెట్టుబడిగా పెట్టిన వందల కోట్ల వ్యాపారాన్ని నోట్ల రద్దు ప్రకటన శరాఘాతంలా తాకింది. తిరుపతి: రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, సత్యవేడు, నగరి, చిత్తూరు, కాణిపాకం, రంగంపేట, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో వ్యాపారులు పెద్ద ఎత్తున రియల్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా వ్యాపారులు మొత్తం 3వేల ఎకరాల్లో కొత్త వెంచర్లు ప్రారంభించి అమ్మకాలు మొదలు పెట్టారు. తిరుపతి, తొండవాడ, ఏర్పేడు, వికృతమాల, పాడిపేట, చంద్రగిరి, రంగంపేట ప్రాంతాల్లో 60కి పైగా వెం చర్లు వెలిశారుు. జిల్లాలోని సగానికి పైగా లే అవుట్లకు అనుమతులుండగా, మిగతా వాటికి లేవు. అరుునప్పటికీ వ్యాపారులు క్రయవిక్రయాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ నెల 8న కేంద్రం పెద్ద నోట్లరుున రూ,500, 1000 లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉన్నపళంగా రియల్ వ్యాపారం స్తంభించింది. మరుసటిరోజు నుంచే కొనుగోళ్లు ఆగిపోయారుు. గడచిన రెండు వారాలుగా జిల్లాలో ఎక్కడా సెంటుభూమి కొన్నవా రుగానీ, అమ్మినోళ్లుగానీ లేకుండాపోయారు. ప్రభావం ఇలా... సాధారణంగా భూములు గానీ, ఖాళీ ప్లాటుగానీ కొనుగోలు చేసిన వ్యక్తి మొదట్లో ధర కుదుర్చుకుని కొంత అడ్వాన్సు రూపేణా చెల్లింపులు జరుపుతారు. కొనుగోలు చేసే భూ విలువలో నాలుగో వంతు చెల్లించి అగ్రిమెంట్లు రారుుంచుకుంటా రు. ఈ విధంగా జిల్లాలో వందల కొద్దీ భూముల అగ్రిమెంట్లు జరిగారుు. అగ్రిమెంటు రారుుంచుకున్న వ్యక్తి లేదా కొనుగోలుదారుడు ఒప్పందం ప్రకారం 40 రోజులకో, 60 రోజులకో రిజిస్ట్రేషన్ చేరుుంచుకోవాలి. రిజిస్ట్రేషన్ చేరుుంచుకోవాల్సిన గడువు దగ్గరపడ్డా అటు కొనుగోలుదారు గానీ, ఇటు భూమి విక్రరుుంచిన వ్యాపారిగానీ ముందుకు రావడం లేదు. కారణమేమంటే ...భూమికి గల గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మాత్రమే అధికారిక నగదు చెల్లింపులు ఉంటారుు. మిగతా చెల్లింపులన్నీ నల్లధనం కింద కనిపిస్తుంది. ఉదాహరణకు ..ప్రరుువేటు రూ.1 లక్ష విలువ గల భూమికి గవర్నమెంట్ విలువ రూ.25 వేలే ఉందనుకుంటే, కొనుగోలు చేసే వ్యక్తి రూ.25 వేలనే అధికారికంగా చెల్లిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఈ మొత్తానికే చెల్లిస్తారు. మిగతా రూ.75 వేలూ నగదు రూపేణా చెల్లిస్తుంటారు. అప్పుడు ఈ నగదు నల్లధనంగా పరిగణించాల్సి వస్తుంది. పైగా నోట్ల రద్దు నిర్ణయానికి ముందు అగ్రిమెంట్లు చేసుకున్న వారంతా రిజిస్ట్రేషన్లు జరిగితే పెద్ద నోట్లు ఇస్తున్నారు. ఈ నోట్లను వ్యాపారులు తీసుకోవడ లేదు. ఒకవేళ తీసుకున్నా బ్యాంకుల్లో మార్చుకోవడం కష్టం. దీంతో భూ క్రయవిక్రయాలు చాలా వర కూ ఆగిపోయారుు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20కి పైగా అగ్రిమెంట్లు రద్దరుునట్లు ‘రియల్ వ్యాపారులు’ చెబుతున్నారు. జిల్లాలో సుమారు రూ.200 కోట్ల వ్యాపారం నిలిచిపోరుునట్లు రియల్ వర్గాల అంచనా. తడిసి మోపెడవుతున్న వడ్డీలు జిల్లాలో చాలా మంది రియల్ వ్యాపారులు బిజినెస్ ప్రారంభ సమయంలో భూముల కొనుగోలుకు కోట్లాది రూపాయలు అప్పుగా తెచ్చారు. లే అవుట్లు, డిజైన్లు, అనుమతులతో పాటు రోడ్లు వేసి, మొక్కలు నాటడం వంటి అభివద్ధి పనులకు లక్షలు ఖర్చు పెట్టారు. సకాలంలో అమ్మకాలు జరిగి నగదు చేతిలో పడితేనే తీసుకున్న అప్పులు చెల్లించడం జరుగుతుంది. నోట్ల రద్దు కారణంగా రెండు వారాల నుంచి బిజినెస్ ఆగిపోరుుంది. చేతిలో నగదు చెలామణి నిలిచిపోరుు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. -
అల్పజీవుల అస్త్రం.. హర్తాళ్
పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా నేడు దేశవ్యాప్త నిరసన మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖపట్నం: నల్ల కుబేరుల అణచివేతకేనన్నారు.. పెద్ద నోట్ల రద్దుతో మేలు జరుగుతుందన్నారు.. పెద్దలంతా సర్దుకోగా చిన్నవాళ్లకు అష్టకష్టాలు మిగిలాయి. బతుకులు రోడ్డునపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. మూడు వారాలు కావస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. అందుకే సోమవారం దేశవ్యాప్త హర్తాళ్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రతిపక్షాలు, వామపక్షాల నేతృత్వంలో సామాన్య ప్రజలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించనున్నారు. నల్లధనాన్ని వెలికి తీయడానికంటూ కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి నేటికి సరిగ్గా ఇరవై రోజులు. ఈ ఒక్క నిర్ణయం దేశ వ్యాప్తంగా పెనుసంచలనమవ్వడంతోపాటు జనానికి కష్టాలు మొదలయ్యారుు. కొద్ది రోజులే కదా సర్దుకుంటుంది అనుకున్నా సమస్య పెద్దదైంది తప్ప సద్దుమణగలేదు. ముందు చూపు లేకపోవడంతో ఏటీఎంలు మొరారుుస్తున్నారుు. నగదు ఉపసంహరణకు పరిమితి విధించడంతో చిన్న వాళ్ల పనులు ఆగిపోయారుు. జిల్లా వ్యాప్తంగా 738 బ్యాంక్ బ్రాంచ్‌ల వద్ద జనం బారులుదీరారు. గంటలు, రోజులపాటు నోట్ల మార్పిడి కోసం పడిగాపులు కాస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, బాలింతలు నరకం చూస్తున్నారు. చివరికి ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే శుభకార్యాలు రద్దు చేసుకునే వరకూ వెళ్లింది. చిరు వ్యాపారాలు కుదేలయ్యారుు. సామాన్య మధ్యతరగతి వారికి ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఇదే అదనుగా కొందరు స్వార్ధ పరులు నోట్ల మార్పిడికి అడ్డ దారులు చూపిస్తామంటూ సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆర్టీసీ, రైల్వే, పెట్రోల్ బంక్‌లలో పాత నోట్లు అనుమతిస్తారన్నప్పటికీ చిల్లర లేకపోవడంతో అక్కడా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో స్పష్టత కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. గడిచిన 20 రోజుల్లో ఒక్క నల్ల కుబేరుడైనా బ్యాంకుల వద్ద క్యూలో నిలబడ్డాడా అని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనకు ప్రతీకగా నేడు జిల్లా వ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించనున్నారుు. -
ఊపిరి బంద్!
నోట్ల రద్దుతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాణాలు చిత్తు కాగితాలయ్యాయి. ఇంకెన్నో సామాన్యుల జీవితాలకు... ఊపిరి బంద్ అయింది. నోటు రద్దయింది... పెద్ద నోటు రద్దయింది.పెద్దవాళ్లకు కష్టం వచ్చిందా? ఏమో! ఇప్పటి దాకా పెద్దవాళ్లెవరూ క్యూలో కనపడలేదు. లాఠీ దెబ్బలు తినలేదు. గుండెపోటుతో చనిపోలేదు. అయినవాళ్లను... ఆసుపత్రుల గడప దగ్గర పోగొట్టుకోలేదు. మరి పెద్ద నోటు రద్దయి... ఎవరి చావుకొచ్చింది? చిల్లరతో సాగించే జీవితాల చావుకొచ్చింది. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు... అసలు వాళ్లకేం కాలేదు కానీ... అత్తెసరు వాళ్ల ఉసురుకొచ్చింది! ఒక శుభ నిర్ణయం తీసుకున్నప్పుడు పరిణామాలు కూడా శుభప్రదంగా ఉండాలి కదా! టైస్టుల దగ్గరున్న దొంగనోటు ఖతం అవ్వాల్సిందే... అలాగని సగటు మనిషి టైకు గురి కావడం కరెక్టు కాదేమో! లేబర్‌కి కూలీ దొరకడం లేదు. రైతుకు గంజి నిలవడం లేదు. మధ్యతరగతికి మర్యాద మిగలడం లేదు. రోగికి మందు... పెళ్లికి మేళం... చావుకు డప్పు... ఊ(హు(! ఇంత పెద్ద నిర్ణయానికి ప్రణాళిక, ముందుచూపు... మానవత్వం... ఏమయ్యాయి? నల్లధనం మకిలీయే. దాంతో ఆడుకోవడం వెకిలియే. ఓటుకు నోటు... థూ!! ఉండకూడదు దానికి చోటు! నీతులు చెప్పే నాయకులపై, వాళ్లకు బాకాలూదే నాయాళ్లపై... పడాలి వేటు. ఈ పచ్చకామెర్లగాళ్లని కడిగేయాలి. పచ్చనోటుకు పట్టిన మకిలిని కడిగేయాలి. దాని వల్ల జబ్బు పడ్డ ఆర్థిక వ్యవస్థను నయం చేయాల్సిందే. పారలల్ ఎకానమీకి పాడె కట్టాల్సిందే. పవర్ఫుల్ డెసిషన్లు తీసుకోవాల్సిందే. ఫైట్ చేయాల్సిందే! కానీ, పెద్దోడికో నీతి, పేదోడికో నీతి ఉండకూడదు. పెద్దోడికి స్పెషల్ ట్రీట్మెంట్, మనలాంటోళ్లకి స్ట్రీట్ ట్రీట్మెంట్ నహీ చలేగా! సైన్యంలా పోరాడటానికి జనం సిద్ధం... తయార్ హై! మంచి నిర్ణయానికి అందరం సమ్మతులమే, సైనికులమే. మరి పోరాడాలంటే సైనికుడికి కూడా... కూడు కావాలిగా! ప్రభుత్వాలు సైనికుడికి ఇచ్చినంత పోషణ మనకూ కలిగించాలి. పెరిషబుల్ ప్రాడక్ట్స్లా... అంటే... ఆకుకూరలు, టమాటాల్లా... జనం వాడిపోకూడదు, కుళ్లిపోకూడదు కదా! అన్నం లేక, మందుల్లేక, వైద్యం అందక, పాల డబ్బాలు లేక వెన్నూదన్నూ లేక, కాలసర్పాల్లాంటి క్యూలలో నిలబడ లేక మనబోటి సామాన్యులైన దేశభక్తులు కూలబడిపోతుంటే, కొందరు కాటికెళ్లిపోతుంటే కుఛ్ కరో... కుఛ్తో కరో. మా డబ్బుల్లోంచే మాకు... కొంత చిల్లర ఇవ్వండి మహాప్రభో! ప్రాణం తీసిన పోపుల పెట్టె ఆమె వేదన ఆమె ప్రాణం తీసింది. ఆమెను పోగొట్టుకున్న భర్త ఒంటరి వాడయ్యాడు. పెద్ద నోట్ల రద్దు ఒక దంపతుల జీవితంలో తుపాను రేపుతుందని ఊహించామా? అనంతపురం జిల్లా తనకల్లు మండలం బాలసముద్రంలో నివసించే 28 ఏళ్ల రెడ్డెమ్మ పొదుపు మనిషి. ఏ కష్టం ఎప్పుడొస్తుందో... ఇంట్లో నాలుగు డబ్బులు పొదుపు చేసి ఉంచడం మేలు కదా అని... తినీ తినక, ఆడంబరాలకు పోక దాదాపు రూ. 40 వేలు దాచింది. ఆ డబ్బును పెద్ద నోట్లలోకి మార్చి పోపులడబ్బాలో దాచుకుంది. కానీ, నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడ్డాక ఆమె సతమతమయ్యింది. చివరకు భర్తకు ఈ విషయం తెలియచేసి డబ్బును ‘ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్’ (ఏ.పి.జి.బి)లో తన ఖాతాలో వేయాల్సిందిగా కోరింది. కానీ, ఆమె భర్త కొండప్పలో ఎన్నో భయాలు రేగాయి. అప్పటికే భార్య పేరున ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు మంజూరైంది కనుక బ్యాంకులో ఈ డబ్బు కడితే మంజూరైన ఇంటిని రద్దు చేస్తారా? పన్నులు వేస్తారా? వంటి సందేహా లతో ఆ డబ్బును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంగతి తెలిసిన రెడ్డెమ్మ కష్టపడి దాచిన సొమ్ము తన చేతి కింద లేకపోవడంతో కలత చెందింది. భర్తతో గొడవ పడింది. నవంబర్ 20 ఆదివారం రాత్రి భర్త కొండప్ప వ్యాపారం పని మీద ధర్మవరం వెళ్లగా జీవితం మీద విరక్తి పుట్టి ఉరి వేసుకుంది. మధ్యలో లేచిన పిల్లలు అమ్మను అలా చూసి కేకలు పెట్టినా ఫలితం లేకపోయింది. పెద్ద నోట్ల రద్దు బాధలు, కుటుంబ కష్టాలు భరించలేక పండంటి కాపురాన్ని వదులుకోని ఆ తల్లి వెళ్ళిపోయింది. ఇంట్లో అత్య వసరాల నిమిత్తం ఆడవాళ్లు దాచుకునే ప్రతి పైసా ఎంతో విలువైనది. దాని మీద సర్వహక్కులు వారివే. పెద్దనోట్ల రద్దుతో ఇలాంటి గృహిణులు ఎందరో తమ డబ్బు మీద హక్కు కోల్పోయారు. ప్రాణం ఒదులుకున్నారు. కూర వండమన్నాడు... అన్నం తినలేదు! నవంబర్ 16. చిత్తూరుకి చెందిన రిటైర్డ్ టీచర్ రత్నపిళ్లై ప్రాణం విడిచిన రోజు. మరణానికి కారణం- బ్యాంకు ముందు క్యూ. ఆ రోజు అతనికి ఇంట్లో అద్దెకున్న వాళ్లు అద్దె డబ్బు పదివేలిచ్చారు. అదివరకే దాచుకున్న 40 వేల డబ్బు కూడా ఉండింది. అదంతా 500, 1000 నోట్లే. ఆ డబ్బుతో బ్యాంకులో కుదవ పెట్టిన బంగారాన్ని విడిపించాలని నిర్ణయించుకుని ఆ ఉదయం నడుచుకుంటూ వెళ్లి చికెన్ తెచ్చిచ్చాడు. కూర వండిపెట్టమని కొడుకుతో స్కూటర్లో బ్యాంకుకు వెళ్లాడు. ఆ తరువాత భార్యకు ఫోన్. క్యూలో నిలబడి... నిలబడి... ఉన్నట్టుండి కూలబడిపోయాడని వార్త. హాస్పిటల్‌కు తీసుకుని పోతే అప్పటికే ప్రాణం పోయిందన్నారు. ‘ఇదిగో వస్తానని చెప్పినాయన మాటామంతీ లేక కట్టెలా నా ముందు కనిపిస్తే ఏం చేసేది! మా కుటుంబంలో పెద్ద దిక్కు ఆరి పోయినాది. నోట్ల మార్పిడి దేశాన్ని మార్చిందో లేదో తెలీదు కానీ మా కుటుం బాన్ని దిక్కులేకుండా చేసి రోడ్డున పడేసినాద’ని దుఃఖిస్తోంది భార్య జ్ఞానేశ్వరి. బతుకు ఖరీదు 4 వేలు డెబ్భై మూడేళ్ల సాయిల్ల అయిలయ్యది సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పంచాయితీ లోని సంగుపల్లి. అతని దగ్గర నాలుగు వేల రూపాయల పాత నోట్లున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ నెల 16న తన దగ్గర ఉన్న ఆ నోట్లను మార్పిం చుకోడానికి గజ్వేల్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్‌కి వెళ్లాడు. గంటల తరబడి క్యూలో నిలుచోలేక సొమ్మసిల్లి పడిపోయాడు. కుడి కాలు తుంటి విరిగింది. రోజు రోజుకూ నొప్పి ఎక్కువైంది. బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితి. నాలుగు వేలు ఏమైపోతాయో అని బెంగ. దీంతో ఆవేదనకులోనై వారం క్రితం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని చనిపోయాడు. పాతనోటు... గుండెపోటు కరీంనగర్ జిల్లాకు చెందిన అంజాద్ ఆలీ వ్యవసాయ మార్కెట్లో సెక్యూరిటీ గార్డు. వచ్చే జీతంతో ఇంటి అవసరాలు తీరక, పదివేలు అప్పు చేశాడు. అప్పు వడ్డీతోపాటు పెరుగుతోంది. ఇంకా ఎప్పుడు తీరుస్తావంటూ అప్పు ఇచ్చిన వాళ్లు నిలదీస్తున్నారు. విధి లేక చెల్లెలింటికి వెళ్లాడు ఆలీ. అప్పులోళ్లు ప్రాణం నిలవనివ్వడం లేదని, ఆదుకోమన్నాడు. అన్న బాధ చూడలేక తన దగ్గరున్న పదివేలు ఇచ్చిందామె. ఆ డబ్బుతో అప్పు తీరుద్దామని వెళ్లాడు ఆలీ. అయితే ఆ సమయంలోనే ఐదు వందలు, వెయ్యి నోట్లు చెల్లవనే ప్రకటన వచ్చింది. ఈ నోట్లు నాకొద్దు, కొత్త నోట్లతో అప్పు తీర్చమన్నారు అప్పులవాళ్లు. చేతిలో డబ్బు ఉంది... అప్పు తీరడం లేదు. ఆ నోట్లు మార్చడానికి చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాలేదు. రోజు రోజుకీ ఆందోళన పెరిగిపోయింది. అది గుండెపోటు రూపంలో అతడి ప్రాణాలను బలి తీసుకుంది. బ్యాంకుతో యమగండం రమాబాయి, చంద్రమణి ఆలుమగలు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని చిన్న పల్లె వాళ్లది. 20 రోజుల కిందట భర్త చంద్రమణికి సుస్తి చేసింది. భార్య చంద్రమణి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎన్ని దవాఖానాల్లో చూపించినా గుణం కనిపించలేదు. చివరకు ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకుపోతే చంద్రమణి రెండు కిడ్నీలు పనిజేస్తలేవని, లివర్ ప్రాబ్లమ్ కూడా ఉందని చెప్పారు. హైదరాబాద్‌కు తీసుకుపోండి అని సలహా ఇచ్చారు. అప్పటికే అయిదు వందలు, వెయ్యి నోట్లు రద్దయినాయి. పైసల్లేకుండా హైదరాబాద్ ఎట్ల పోవాలే అని డబ్బు కోసం బ్యాంక్‌కి పోతే చెక్ ఆమె పెనిమిటి చంద్రమణి పేర్న ఉన్నది కాబట్టి అతడే రావాలని పైసలియ్యకుండా వెనక్కి పంపాడు బ్యాంక్ మేనేజర్. దాంతో ఆమె రిమ్స్కొచ్చి మొన్న 23 తారీఖున ప్రైవేట్ వెహికిల్‌లో భర్తను దీస్కోని, వాళ్ల ఖాతా ఉన్న నార్నూర్ ఎసీబీహెచ్ బ్యాంక్‌కి పోయింది. అతణ్ణి చూసి 24 వేల రూపాయలను రమాబాయి చేతిలో పెట్టారు బ్యాంక్ సిబ్బంది. అది చూసి ఆమె ‘మా ఎక్కౌంట్ల లక్షకు పైనే ఉంటే.. మీరు 24 వేలే చేతిల వెడ్తిరి?’ అని నిలదీసింది. రూల్స్ ప్రకారం అంతే ఇస్తాం అని చెప్పాడు బ్యాంక్ మేనేజర్. ఎంత ప్రాథేయపడినా వినలేదు. చేసేదేమీ లేక ఆ డబ్బుతోనే హైదరాబాద్ చేరుకున్నారు ఆ భార్యాభర్తలు. ఇప్పడు వాళ్ల పరిస్థితి దేవుడికే ఎరుక! వ్యాపారం పోయింది! ఊపిరి ఆగింది!! పోలేపల్లె వెంకట నారాయణ వై.ఎస్.ఆర్ కడపజిల్లా వేంపల్లెలో ఓ చిన్న వ్యాపారి. కూరగాయలు అమ్ముతూ భార్య, ముగ్గురు పిల్లల్ని పోషించు కుంటున్నాడు. సాధారణరోజుల్లోనే వ్యాపారం అంతంతమాత్రమే అనుకుంటే పెద్ద నోట్ల తర్వాత పరిస్థితి పూర్తిగా కుదేలయ్యింది. రూపాయి బేరం రావడం లేదు. పైగా కూరగాయలు కొనడానికి రోజువారీ చేసే అప్పు, దాని మీద వడ్డీ పెరిగిపోసాగాయి. చేతిలో డబ్బు ఆడట్లేదు... ఇంట్లో కుంపటి వెలగడం లేదు. దాంతో అతడు హఠాత్తుగా జబ్బు పడ్డాడు. ‘కూరగాయలు అమ్మగా వచ్చే సొమ్మే మా కుటుంబానికి ఆధారం. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా వ్యాపారాలు పడిపోయాయి. పెద్ద నోట్లు చెల్లని పరిస్థితి. చిన్న నోట్లు దొరకని దుఃస్థితి. మా ఆయన అప్పటికే వ్యాపారం కోసం లక్ష రూపాయల దాకా అప్పులు చేశారు. అవన్నీ మా ఆయనను బాగా కుంగ దీశాయి’ అని వెంకట నారాయణ భార్య జ్యోతి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. కడపలో చికిత్స చేయిస్తున్న సమయంలోనే వెంకట నారాయణ పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే కన్నుమూశాడు. భార్య, పసివాళ్ళయిన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి అగమ్యంగా మారింది. నోట్ల ఉపసంహరణతో వ్యాపారాలు లేక, ప్రాణాల మీదకొచ్చిన ఇలాంటి కుటుంబాల కథలు దేశవ్యాప్తంగా ఎన్నెన్నో! -
నో చెలా‘మనీ’
నిజామాబాద్ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. నవంబర్ 8న పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సర్కారు.. వ్యాపారంలో అవవసరం కోసం పాతనోట్లను గురువారం వరకు తీసుకోవచ్చని ప్రకటించింది. కేంద్ర నిర్ణయం ముగియడంతో బ్యాంక్ కౌంటర్లలో కూడా తీసుకోవద్దని కేంద్రం ప్రకటించింది. బ్యాంకు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం మాత్రం కల్పించినట్లు సమాచారం. పక్షం రోజులుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నోట్ల మార్పిడికి బ్యాంకులు, ఏటీఎంల ఎదుట బారులు తీరారు. మరోవైపు పాతనోట్లు రద్దు చేయడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రూ.850 కోట్ల మార్పిడి జరిగింది. ఆర్బీఐ నుంచి ఇప్పటి వరకు రూ.410 కోట్లు వచ్చారుు. సామాన్యులు నోట్ల మార్పిడి కోసం పాట్లు పడుతుండగా.. పెద్దలు మాత్రం అంతర్గతంగా కొత్తపాత నోట్ల మార్పిడిలు పర్సంటేజీలలో జోరుగా కొనసాగుతోంది. గంటల్లోనే ఏటీఎంలు ఖాళీ నోట్ల రద్దు ఫలితంగా ఏటీఎంల ఎదుట వినియోగదారులు బారులు తీరడంతో ఏటీఎంల్లో డబ్బులు గంటల్లో ఖాళీ అవుతున్నారుు. జిల్లాలో 336 బ్యాంకులు ఉన్నారుు. వీటి పరిధిలో 338 ఏటీఎంలు ఉన్నారుు. ఒక్కో రోజు ఒక్క ఏటీఎంలో రూ.2.50 లక్షలు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం నోట్ల రద్దు నేపథ్యంలో రెండుసార్లు ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్క ఏటీఎంలో రోజుకు రూ.5 లక్షలు పెడుతున్నా సరిపోవడం లేదు. డబ్బుల కోసం వినియోగదారులు పోటీపడుతున్నారు. బ్యాంకు అధికారులు, ఏటీఎంలు, బ్యాంకుల్లో డబ్బుల వివరాలను వెల్లడిస్తున్న తొందరగా ఖాళీ కావడంపై అనుమానాలు నెలకొంటున్నారుు. ఒక్కో ఖాతాదారుడు ఏటీఎం నుంచి ప్రస్తుతం రూ.2 వేల డ్రా చేయగలుగుతున్నాడు. అరుునా డబ్బులు సరిపోవడం లేదు. కొందరు ఖాతాదారులు ఏటీఎంల నుంచి రూ.100 నోట్లు తీసుకుని రద్దరుున పాత నోట్లు కమిషన్ రూపంలో తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నారుు. బ్యాంకుల్లో సైతం ఖాతాదారులు నోట్ల మార్పిడికి బారులు తీరుతున్నారు. చాల చోట్ల బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో వెనుతిరుగుతున్నారు. కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తే తప్ప సమస్య కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం యాసంగి సమయం కావడంతో రైతులు పంటలు వేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. రద్దు అరుున నోట్లతో ప్రజలు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయలేక విలవిలాడుతున్నారు. అంతర్గతంగా మార్పిడి కొత్త, పాత నోట్ల మార్పిడి జోరుగా కొనసాగుతున్నారుు. 30 నుంచి 35 పర్సంటేజీలు తీసుకుంటూ నోట్ల మార్పి చేస్తున్నారు. కొందరు గ్రూపుగా ఏర్పడి బడాబాబులను సంప్రదిస్తు మార్పిడికి తెరలేపారు. ఒక్కో గ్రూపు వద్ద కొత్త నోట్లు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వినాయక్‌నగర్, గంగాస్థాన్ ప్రాంతాల్లో రాత్రివేళలో వ్యవహారాలు కొనసాగుతున్నారుు. రాజకీయ నాయకులు, డాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నోట్ల మార్పిడిలో ప్రధానంగా ఉన్నారు. ఐటీ డేగకన్ను మరోవైపు అధిక లావాదేవీలు కొనసాగిస్తున్న వారిపై ఆదాయపన్ను శాఖ కన్నెసింది. జిల్లా కేంద్రంలోనే ఒక బృందం ఈ లావాదేవీలపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే అధిక లావాదేవీలు కొనసాగించిన వారిని గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే తనిఖీలు చేసే అవకాశం ఉంది. మరోవైపు బ్యాంకు అధికారులు రోజువారిగా నోట్ల మార్పిడి, ఖాతాదారులు ఎంత వరకు డ్రా చేశారన్న వివరాలను బయటకు పొక్కనివ్వడం లేదు. వీటన్నింటిని ఉన్నతాధికారులు సమ్రగంగా పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. భారీగా పన్నుల వసూలు జిల్లాలో పన్నులు మాత్రం భారీగా వసూలయ్యాయి. నవంబర్ 9 నుంచి గురువారం వరకు ఆయా విభాగాల్లో వసూళ్లు పెరిగాయి. కరెంటు బిల్లులు రూ.4.70 కోట్లు వసూలయ్యాయి. ఇంటి పన్నులు రూ.2.85 కోట్లు వసూలు చేశారు. చివరి రోజైన గురువారం ఒక్కరోజే అత్యధికంగా రూ.39 లక్షలు వసూలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యం రూ.32.76 కోట్లు లక్ష్యం నిర్ధేశించుకోగా.. నేటి వరకూ రూ.6.37 కోట్లు వసూలు చేశామని డీపీవో కృష్ణమూర్తి తెలిపారు. నగర కార్పొరేషన్‌కు రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది. ఆస్తిపన్నుతోపాటు వివిధ పన్నులను నగర ప్రజలు రెట్టింపు స్థాయిలో చెల్లించారు. -
ఆర్టీసీలో చిల్లర దందా
చక్రం తిప్పుతున్న ఓ యూనియన్ నేత రోజూ కండక్టర్లు తెచ్చే టిక్కెట్ల సొమ్ము పాత నోట్లతో మార్పిడి ఆ చిల్లర టీడీపీ నేతలకు సమర్పణ ఇందుకుగాను 15 శాతం కమీషన్! రోజుకు రూ.4 లక్షలు పక్కదారి పెద్ద నోట్ల రద్దు దాదాపు అన్ని వర్గాలను కుదిపేస్తోంది. చిల్లర, కొత్త నోట్ల కోసం పడిగాపులు పడేలాచేస్తోంది.. కానీ అధికార టీడీపీకి చెందిన కొందరికి మాత్రం ఇవేవీ వర్తించవు.. ఎందుకంటే చిల్లర నోట్లు వారి కాళ్ల వద్దకే వచ్చి వాలుతున్నారుు.. నిల్వ ఉన్న ‘నల్ల’ నోట్లు కూడా తెల్లబడి పోతున్నారుు. ఇదంతా ఈ నేతలతో అంటకాగుతున్న ఓ ఆర్టీసీ యూనియన్ నేత చేతి చలవతో చక్కగా సాగిపోతోంది..ఫలితంగా ఆయనగారికి కమీషన్ ముడుతుండగా.. చిల్లర నోట్లు వాస్తవంగా చేరాల్సిన ఆర్టీసీకి పాత నోట్లే అందుతున్నారుు.. చిల్లర పాట్లు కొనసాగుతున్నారుు. విశాఖపట్నం : పెద్ద నోట్ల రద్దు ఆర్టీసీలో ఓ యూనియన్ నేతకు కాసులు కురిపిస్తోంది. లక్షల రూపాయల అక్రమార్జనకు దోహదపడుతోంది. అధికార టీడీపీకి అంటకాగుతున్న ఆయన ఆ పార్టీకి చెందిన కొంతమంది పెద్దల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే బాధ్యతను తలకెత్తుకున్నారు. వాల్తేరు డిపోలో పనిచేస్తున్న ఆయన పేరుకే కండక్టర్. నాయకుని ముసుగులో ఆయన విధుల కంటే నిధులపైనే ఎక్కువ దృష్టి సారిస్తారన్న పేరు గడించారు. యూనియన్ నేత కావడంతో అధికారులు, సాటి కండక్టర్లు, డ్రైవర్లు ఆయన ఏంచేసినా పట్టించుకోరు. దాన్ని ఆసరాగా చేసుకుని ఆ నేత ఇప్పుడు పెద్ద నోట్ల రద్దును బాగా ’క్యాష్’ చేసుకుంటున్నారు. డిపోకు కండక్టర్లు తెచ్చిన చిల్లర సొమ్మునంతటినీ పోగేసుకు పోతున్నారు. పక్షం రోజుల నుంచి ఈ వ్యవహారాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. చిల్లర సేకరణ ఇలా.. : బస్సులు డిపోకు చేరుకున్నాక కండక్టర్లు డిపో కౌంటర్లలో వసూలైన డబ్బును జమ చేయాలి. కానీ ఆ నేత తన వద్ద ఉన్న రూ.500, వెరుు్య నోట్లను షిఫ్టుల వారీగా తన సొంత మనుషుల ద్వారా కండక్టర్లకిచ్చి.. వారు తెచ్చిన చిల్లర నోట్లను తీసుకెళ్లిపోతున్నారు. వాటిని కారులో తరలించుకుపోతున్నారు. ఆర్టీసీ సిబ్బంది ఆయన ఇచ్చిన పెద్ద నోట్లను మారుమాట్లాడకుండా తీసుకొని బ్యాంకులో జమ చేసేస్తున్నారు. సదరు నేత తన పథకాన్ని ఈ డిపో నుంచి పాతపోస్టాఫీసు లింకు కేంద్రానికి విస్తరించారు. అక్కడ ఓ క్లీనర్‌ను తన కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నాడు. వాల్తేరు డిపోకు చెందిన కొన్ని బస్సుల కండక్టర్లు, డ్రైవర్లు అక్కడే డ్యూటీలు మారుతుంటారు. ఆ సమయంలో ఆ క్లీనరు ద్వారా రూ.500, వెరుు్య నోట్లు పంపి కండక్టర్ల వద్ద ఉన్న చిల్లర మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఇందుకోసం క్లీనరు షర్టుకు ఓ పెద్ద జేబును కూడా కుట్టించినట్టు చెబుతున్నారు. అంతటితో ఆగని యూనియన్ నేత నోట్ల మార్పిడికి మరో ఎత్తుగడ వేశారు. కండక్టర్లు డ్యూటీ ఎక్కేటప్పుడు చిల్లరగా రూ.100, రూ.150 వరకు ఇస్తుంటారు. ఆ మొత్తంతో పాటు కండక్టరు వద్ద ఉండే పాకెట్ మనీ (సొంత సొమ్ము) వివరాలను ఎస్సార్‌లో రాస్తారు. కానీ ఇప్పుడు పెద్ద నోట్లు రద్దయ్యాక ఈ నేత ఆ డిపో కండక్టర్లకు ఏకంగా రూ.2 వేల నుంచి 3 వేల వరకు రూ.500, వెరుు్య నోట్లను ఇస్తున్నట్టు కండక్టర్లు చెబుతున్నారు. కండక్టర్లు ప్రయాణికుల నుంచి వచ్చిన చిల్లర స్థానంలో పెద్ద నోట్లను ఉంచి, ఆ సొమ్మును ఆ నేతకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎస్సార్‌లో రూ.500కి మించి నమోదు కాకుండా తాజాగా చర్యలు తీసుకున్నారు.