Capital Amaravati
-
అమరావతి పార్టనర్.. ఈశ్వరన్‌కు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట జరిగిన భూ దోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్వదేశంలో అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) విచారణలో నిగ్గు తేలింది. ఈశ్వరన్ అవినీతికి పాల్పడినట్టు న్యాయ విచారణలో కూడా నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. జూనియర్ అధికారి నుంచి మంత్రిగా.. 2008లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా ఉన్న ఈశ్వరన్ అనతి కాలంలో ఉన్నత స్థానానికి ఎగబాకారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి ఈశ్వరన్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేల్చింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ – సింగపూర్ పర్యాటక విభాగాల మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీ పోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గత ఏడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన ఈశ్వరన్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్ïÙట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించినట్లు ఒక అభియోగం నమోదైంది. బాబు భూ దోపిడీలో పార్టనర్ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం రాజధాని పేరిట యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమిక పోషించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు, ఈశ్వరన్ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది. ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. దీనికి నాటి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా హడావిడి చేసింది. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోనూ చంద్రబాబు గోల్మాల్ చేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306.4 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదట విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం వాటా దక్కనుండగా అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి మాత్రం 91.3 శాతం వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది. ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బృందం బినామీ పేర్లతో కొల్లగొట్టింది. ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్‌లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ ఈశ్వరన్ కీలక పాత్ర పోషించినట్లు అధికారిక, పారిశ్రామిక వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
హైవేతో అమరావతి అనుసంధానం
సాక్షి, అమరావతి: రాజధాని(అమరావతి) ప్రాంతాన్ని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16)తో కలిపేందుకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడి గ్రామాల మీదుగా ఆరు లేన్లతో నాలుగు ప్రధాన రహదారులను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరు లేన్ల రోడ్ల పనులకు సంబంధించి అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సైతం సిద్ధం చేశారు. త్వరలో సీఎం చంద్రబాబుతో సమావేశమై నిర్ణయం తీసుకుని టెండర్లకు వెళ్లాలని సీఆర్డీఏ యోచిస్తోంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గతంలోనే ఈ రోడ్లకు అలైన్మెంట్ కూడా చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే వీటిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అమరావతిలోని ప్రధాన రహదారులను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ–1 నుంచి ఈ–16 వరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్–1 నుంచి ఎన్–18 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ–5, ఈ–11, ఈ–13, ఈ–15 రోడ్లు నిర్మించి.. పడమర వైపు ఉన్న ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు. కాగా, రాజధాని నుంచి గ్రామాల మీదుగా వెళ్తున్న ఈ రహదారుల నిర్మాణానికి పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–5 రహదారి ఈ రోడ్డు నిర్మాణం ఉండవల్లి నుంచి ప్రారంభమవుతుంది. ఉండవల్లి, మందడం, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం మీదుగా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. మొత్తం 18 కి.మీలు మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ మార్గం.. గ్రామాల మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–11 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 6.3 కి.మీ మేర.. జాతీయ రహదారితో అనుసంధానించేందుకు మరో 4.50 కి.మీ మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. ఈ రోడ్డును నీరుకొండ, కురగల్లు, నవులూరు మీదుగా మంగళగిరిలోని ఎయిమ్స్ ముందు నుంచి ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు. ఈ–13 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. అనంతరం మంగళగిరి వద్ద ఎన్‌హెచ్–16తో అనుసంధానించేందుకు మరో 2.5 కి.మీ మేర రోడ్డును విస్తరించి ఎయిమ్స్ వెనుక నుంచి జాతీయ రహదారితో కలుపుతారు. ఈ రోడ్డు నీరుకొండ డౌన్ నుంచి నిడమర్రు, ఎర్రబాలెం, నవులూరు, మంగళగిరి మీదుగా వెళుతుంది. ఈ–15 రహదారి నిడమర్రు నుంచి జగనన్న లేఅవుట్, నవులూరు, క్రికెట్ స్టేడియం మీదుగా ఎయిమ్స్ వద్ద ఉన్న పాత హైవేకు అనుసంధానం చేస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు(ఈ–3)ను.. దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 21 కి.మీ.ల మేర నిర్మించతలపెట్టారు. అయితే, దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14 కి.మీ మేర రోడ్డు పూర్తయ్యాక అనేక వివాదాలతో పనులు నిలిచిపోయాయి. రెండో ప్యాకేజీగా బ్యారేజీ నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు 3 కి.మీ మేర రోడ్డును నిర్మించనున్నారు. మరో 4 కి.మీ మేర మార్గంలోని రైతులను ఒప్పించి మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయాలని సీఆర్డీఏ భావిస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో ఈ నెలలోనే టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. -
విరాళాలు, ఆస్తుల అమ్మకం.. ఆ విజన్‌కు ప్రపంచ స్థాయి అట!
సాక్షి, అమరావతి: ‘అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగు జాతికి జగన్ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకోరు. విధ్వంసానికి జగన్ ఒక కేస్ స్టడీ. మాకు రాజధాని లేదు అని చెప్పుకునేంత పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? రాష్ట్రంలో పుష్కలంగా వనరులు ఉన్నాయి. తెలివి గల మానవ వనరులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేశారు’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ఒక టైమ్ బాండ్ అంటూ పెట్టుకోలేదని, పాత ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళతామని స్పష్టం చేయడం చూస్తుంటే.. గత ప్రభుత్వం చెప్పిందే నిజమని స్పష్టమవుతోంది. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదని, రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు అమరావతి పేరును సూచించారన్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుంచి.. దేశంలోని అన్ని పవిత్ర ప్రదేశాల నుంచి నీరు, మట్టిని కూడా తీసుకొచ్చామన్నారు. కుప్పం వారికైనా, ఇచ్ఛాపురం వారికైనా అమరావతి సమదూరంగా ఉంటుందని, అందువల్లే ఇక్కడ రాజధాని నిర్ణయించినట్టు చెప్పారు. బుద్ధి ఉన్న ఏ వ్యక్తీ అమరావతి రాజధానిని వ్యతిరేకించరని, రాజధానికి రెండు వైపులా 12 చొప్పున ఎంపీ స్థానాలు ఉన్నాయని, విభజన అనంతరం శివరామృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటించి కృష్ణా, గుంటూరు లేదా ఆ 2 జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు చెప్పిందన్నారు. ఏటా 3 పంటలు పండే మంచి భూమిని రాజధాని కోసం తీసుకోవడం సరికాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని ఇక్కడ ఆయన వక్రీకరించి అనుకూలంగా మార్చుకున్నారు.హైదరాబాద్‌కు కరెంట్, నీళ్లు.. బాబు ఘనతేనటగతంలో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.15 వేల కోట్లు ఆర్థిక లోటు ఉన్నా, సైబరాబాద్ నిర్మాణ అనుభవంతో అమరావతిని నిర్మించాలని ఆలోచించామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌కు నాడు సరిగా కరెంట్, నీళ్లు లేవని.. రానురాను అన్నీ కలిసొచ్చాయన్నారు. ఎంత మంది ప్రయత్నించినా వీలుపడని కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చామని, 14 రోజుల పాటు అమెరికాలో తిరిగి ఐటీ పరిశ్రమలను కూడా సైబరాబాద్‌కు తీసుకొచ్చినట్టు సీఎం వివరించారు. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చామని, తన హయాంలో సాగు నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఎయిర్ పోర్టులకు భూములు ఇచ్చిన వారు సంతృప్తిగా ఉండేలా చేశానని బాబు గొప్పలు చెప్పుకున్నారు. తొలుత అమరావతికి ల్యాండ్ పూలింగ్ సాధ్యమవుతుందా.. అని అనుమాన పడినా, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను 29,966 మంది రైతులు ఇచ్చారన్నారు. ఈ రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వాలని నిర్ణయించామని, వ్యయసాయ కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్ అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 1నే దాన్ని రూ.5 వేలకు పెంచి అందించామన్నారు. వాస్తవంగా పెన్షన్‌ను పెంచింది గత ప్రభుత్వమనే విషయాన్ని మరచి తన ఖాతాలోకి వేసుకోవడం బాబుకే చెల్లింది.గత ప్రభుత్వంపై ఏడుపువైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభించారని, కనీసం నిబంధనలు కూడా పాటించకుండా ప్రజా వేదికను కూల్చేశారని, తర్వాత మూడు రాజధానులు ప్రకటించారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘జీఎన్.రావు, బోస్టన్ కమిటీ అంటూ ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేశారు. ప్రజావేదిక శిథిలాలను తొలగించవద్దని ఇప్పుడు అంతా చెబుతున్నారు. అది చూస్తే ప్రతి ఒక్కరిలో గత ప్రభుత్వ విధ్వంసం గుర్తుకు రావాలి. జగన్ నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారు. తిరుపతి యాత్రకు వెళితే ఉండటానికి మండపాలు ఇవ్వకుండా వేధించారు. అరసవెల్లి యాత్రకు వెళితే దాడులు చేసి మధ్యలోనే నిలిపేయించారు’ అని సీఎం చంద్రబాబు మొసలి కన్నీళ్లు కార్చారు. గత పాలకులు అధికారంలోకి రాగానే రాజధానిలో అన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారని, వ్యవసాయ కూలీలకు అందించాల్సిన పెన్షన్లు, రైతులకు ఇవ్వాల్సిన కౌలు నిలిపేశారని, మాస్టర్ ప్లాన్ రద్దు చేశారని, రూ.1000 కోట్లు గ్రాంట్ రాకుండా కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేశారని.. ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. సింగపూర్ కన్సార్టియంపైనా ఆరోపణలు చేశారని, 14 ఎకరాల్లో 12 టవర్లతో నిర్మాణం తలపెట్టిన హ్యాపీ నెస్ట్‌ను నాశనం చేశారని, అది పూర్తయితే ప్రభుత్వానికి రూ.57.37 కోట్లు ఆదాయం వచ్చేదని, మున్ముందు రూ.885 కోట్లకు పెరిగేదన్నారు. కానీ దాన్ని కూడా నాశనం చేయడంతో ఇప్పుడు రూ.164.5 కోట్ల నష్టంతో పాటు రాజధాని పరిధిలోని రోడ్లు, భవనాలు దెబ్బ తిన్నాయన్నారు.నిర్మాణ ఖర్చు పెంచడానికే ఈ మాటలు..గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసంతోనే రాజధాని నిర్మాణం ఖర్చు పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పడం చూస్తుంటే మళ్లీ ఎస్టిమేషన్లు పెంచుకోవడం కోసమేనని తెలుస్తోంది. ‘రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లింది. సంపద ఉత్పత్తి పెరగలేదు. అన్ని రంగాలు రివర్స్ అయ్యాయి. నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలో ఉన్న పనులు పూర్తవలేదు. రెవెన్యూ ఆదాయం తగ్గిపోయింది. ఏపీలో భూముల విలువ కూడా తగ్గిపోయింది. హైకోర్టు, హెచ్‌వోడీ, సచివాలయాల భవనాల ఐకానిక్ పునాదులన్నింటినీ నీళ్లలో ముంచేశారు. గెజిటెడ్ అధికారులు, మంత్రులు, జడ్జీల కోసం నిర్మించ తలపెట్టిన వాటిని కూడా అర్ధంతరంగా నిలిపేశారు. నేను పడ్డ కష్టం వృధా అయింది. అది చూస్తే మనసు నిగ్రహం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాజధాని కాలం కూడా అయిపోంది. పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయారు. సింగపూర్ ప్రతినిధులు వస్తారో రారో తెలీదు. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం మనది. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? నన్ను ఇబ్బందులు పెట్టారని నేను మాట్లాడడం లేదు. జగన్ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూడదు. బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతా’ అని అన్నారు.ఉద్యోగ కల్పనకు నిలయంగా రాజధాని రూపకల్పనరాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారికి ఉద్యోగాల కల్పన అమరావతిలో జరుగుతుందని సీఎం చంద్రబాబు మరోసారి చుక్కలు చూపారు. ప్రతి పంచాయతీ సంక్షేమానికి ఇది నిక్షేపంలా ఉంటుందన్నారు. అమరావతి నాది అని చెప్పుకునేలా ప్రణాళిక రూపొందించామని, మాస్టర్ ప్లాన్‌లో మార్పులు లేవని తెలిపారు. గతంలో రూపొందించిన అదే మాస్టర్ ప్లాన్‌ను కొనసాగిస్తామన్నారు. ఇన్ని చెప్పిన బాబు.. అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని, కొన్ని ఆస్తులు అమ్మి సంపద సృష్టిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం ఎన్నో సందేహాలకు తెర లేపింది. ఇక్కడ భూములమ్మిన వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొంటే అక్కడ కూడా విలువ పెరుగుతుందని, ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగి ఉంటే ప్రభుత్వానికి కూడా పన్నులు, జీఎస్టీ రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్నారు. విట్, ఎస్ఆర్, అమృత్ లాంటి యూనివర్సిటీల్లో పేద పిల్లలు చదువుకుంటే కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయని యువతను మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. రాజధాని పునర్నిర్మానంపై కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పారు. రాజధాని పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే పనులు ప్రారంభిస్తామే తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి సెంటు పట్టాలని డ్రామాలాడారని, ఇల్లు లేని వారికి వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ లెక్కన అమరావతిలో పేదలకు స్థానం లేదని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఎయిమ్స్‌కు కూడా నీళ్లివ్వకుండా గత ప్రభుత్వం వేధించిందని, తద్వారా పడకల పెరుగుదలకు అవరోధం ఏర్పడి ఆసుపత్రిలో ఓపీలు కూడా తగ్గాయని చెప్పారు. ఏ లెక్కన చంద్రబాబు ఈ మాట చెప్పారో అర్థం కావడం లేదు. వాస్తవానికి ఎయిమ్స్‌లో ఓపీలు పెరగడం గమనార్హం. గతంలో అనుమతులు పొందిన 132 సంస్థలకు గాను 122 సంస్థలు అమరావతికి రాలేదని చెప్పుకొచ్చారు. ఆ విజన్‌కు ప్రపంచ స్థాయి అట!అమరావతిలో 53,748 ఎకరాలు సేకరించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్లు, ఇతర నిర్మాణాలకు 27,885 ఎకరాలు, రిటర్నబుల్ ప్లాట్ల కింద 11,826, ఇతర అవసరాలకు 14,037 ఎకరాలు పోను ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వద్దనున్న భూమిని విక్రయించి రాజధాని నిర్మాణం చేయొచ్చని ఆలోచించామని, కేంద్ర ప్రభుత్వం కేపిటెల్ గెయిన్ మినహాయింపునిచ్చి రూ.2,500 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుని రూ.1,500 కోట్లు కూడా అందించిందన్నారు. నాడు రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జేఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చాయని, సింగపూర్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. మొదట సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, తర్వాత రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థ అందించిందన్నారు. దేశంలోనే స్మార్ట్ సిటీగా, ప్రపంచ స్థాయి ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్ రూపొందించినట్టు చెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌తో పాటు అన్ని విభాగాలు ఒకేచోట ఉండాలని మాస్టర్ ప్లాన్‌లో నిర్ణయించామన్నారు. దేశంలో ఏ సిటీకి లేనంత మేర నదీ ప్రాంతం అమరావతికి ఉందని, రెండు నదులను అనుసంధానం చేసే కాన్సెప్ట్‌తో నగరానికి రూపకల్పన చేశామన్నారు. రూ.51,687 కోట్లతో రాజధాని పనులకు అంచనా వేసి, రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచామని, అప్పటికే జరిగిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించామని, రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండింగులో ఉందన్నారు. -
అమరావతిపై చంద్రబాబుకే అనుమానాలున్నాయా?
ఏపీ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన,బీజేపీ సభ్యులంతా కలిసి ఆయనను తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే విశాఖను ఆర్దిక రాజధానిగా అభివృద్ది చేస్తామని, కర్నూలును కూడా ప్రగతి పధంలోకి తీసుకు వెళతామని అన్నారు. ఆయన తాను ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల గురించి కాకుండా అమరావతిపైనే ప్రసంగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు పెట్టడం ద్వారా ఏపీ అభివృద్దికి ప్రయోజనం జరుగుతుందని భావించారు. విశాఖ పట్నం అయితే రాష్ట్రం అంతటికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆశించారు. అమరావతి మాదిరి లక్షల కోట్లు ఖర్చుపెట్టవలసిన అవసరం ఉండదని అనుకున్నారు. కాని దానిని తెలుగుదేశం,ఇతర విపక్షాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డాయి. దాంతో జగన్ ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. కాకపోతే తమ విధానం మూడు రాజధానులు అని ఆయన అన్నారు. కాని ఆయన తిరిగి అదికారంలోకి రాలేకపోయారు.విశాఖ, కర్నూలులకు అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ అక్కడి వారిని మోసం చేశారని అంటున్నారు. చంద్రబాబుతో వచ్చిన చిక్కే ఇది. ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడుతుంటారు. ఇందులో జగన్ మోసం చేసింది ఏముంది? ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో గెలిచిన తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తామని ప్రకటించారు. విశాఖను సుందరంగా తీర్చి దిద్దారు. రిషికొండపై ఆకర్షణీయమైన భవంతిని నిర్మించారు. అలాగే కర్నూలులో పలు న్యాయ రంగానికి సంబంధించిన పలు ఆఫీస్ లు ఏర్పాటు చేశారు. లోకాయుక్త ఆఫీస్ ను కూడా అక్కడే నెలకొల్పారు. హైకోర్టు ఏర్పాటు పూర్తిగా ఆయన చేతిలో లేనిది కనుక దానిపై ముందుకు వెళ్లలేకపోయారు. ఈ విషయాలలో జగన్ చిత్తశుద్దిని శంకించనవసరం లేదు.జగన్ ఒకటి తలిస్తే, ప్రజా తీర్పు మరో రకంగా రావడంతో చంద్రబాబుకు అది అడ్బాంటేజ్ అయింది. విశాఖ ప్రజలు కూడా తమకు రాజధాని వద్దని అనుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు తప్పు లేదు. ఎందుకంటే జగన్ ఆ ప్రాంతానికి అంత పెద్ద వరం ఇస్తే ,దానిని వారు ఆదరించలేదు.కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావవల్సి ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యంగా వైఎస్సార్సీపీకి వ్యతిరేక తీర్పు వచ్చింది. తాజాగా చంద్రబాబు అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం లేదు. ఈ నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన విధానాన్ని మార్చుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. వచ్చే ఐదేళ్లు టీడీపీ కూటమి అధికారంలో ఉంటుంది కనుక వారు చేయదలచుకున్నది అంతా అమరావతిలోనే చేస్తారు. ఆ తర్వాత ఎన్నికలలో వైసిపి గెలిచినా, ఇందులో మార్పులు చేయడం కష్టం అవుతుంది. అప్పుడు మళ్లీ మూడు రాజధానులు అన్నా ఉపయోగం ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అమరావతిపై ఇక వివాదాన్ని ముగించడం మంచిది. వైఎస్సార్సీపీ దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. అమరావతికి సంబంధించి కొన్ని చిక్కుముళ్లను చంద్రబాబు విడదీయవలసి ఉంటుంది. 2014 టరమ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కేవలం ప్రాధామిక సదుపాయాల కోసం లక్షతొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని , ఈ నిదులను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యయం ఇంకా భారీగా పెరిగి ఉంటుంది.అంత మొత్తాన్ని ఎలా వెచ్చిస్తారో చెప్పగలగాలి. కేంద్రం ఇప్పుడు ఏమైనా ఆ ప్రకారం ఇస్తే ఇబ్బంది లేదు. అలా ఇవ్వకపోతే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. అప్పట్లో ప్రధాని మోదీ మట్టి,నీళ్లు ఇచ్చి వెళ్లారని చంద్రబాబు విమర్శించేవారు. ఈ విడత టీడీపీపై కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉంది కనుక లక్ష కోట్లను రాజధాని కోసం సాధించగలిగితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది. గత ప్లాన్ ప్రకారం నవ నగరాలన్నింటిని ఇక్కడే నిర్మిస్తారా?లేక వాటిని వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అంతేకాదు. అమరావతి భూముల విషయంలో పలు వివాదాలు ఉన్నాయి. కొంతమంది రైతులు తమ భూములను రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. వారిపై అప్పట్లో కేసులు కూడా పెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించింది. ఆ రోజుల్లో పంటలను దగ్దం చేసి భూములు లాక్కునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. అలాంటి చోట్ల ఏ రకంగా ముందుకు వెళతారో తెలియదు. ప్లాట్ల కేటాయింపుపై కూడా రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవల్సి ఉంటుంది. వారికి రోడ్లు,డ్రైనేజ్, రక్షిత నీరు మొదలైనవాటిని సమకూర్చుకోవాలి. అమరావతిలో పది డిగ్రీల ఉష్ణాగ్రత తగ్గించాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇంటింటికి ఏసీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవన్ని చేయగలిగితే తెలుగుదేశంకి ఖ్యాతి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల వసతుల కోసం ఏభై అంతస్తుల టవర్ లు నిర్మించాలని తలపెట్టారు. అదే ఆలోచనను మళ్లీ చేస్తారో?లేదో తెలియవలసి ఉంది. కృష్ణానది పక్కన ఉండడంతో నేల స్వభావం భారీ భవంతులకు అనువైనది కాదని నిపుణులు చెబుతారు. అందువల్లే రాఫ్ట్ టెక్నాలజీకి వెళుతున్నామని అనేవారు. అది బాగా ఖరీదైనది. అయినా ఖర్చు భరించక తప్పదు. మరో కీలక అంశం సింగపూర్ కంపెనీలకు గతంలో మాదిరే మళ్లీ భూములు కేటాయిస్తారా? లేదా ?అన్నదానిపై నిర్ణయం చేయవలసి ఉంటుంది. వారికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం పక్షాన భూమి ఇవ్వడమే కాకుండా,అవసరమైన రోడ్లు తదితర సదుపాయాలను సమకూర్చడానికి 5,500 కోట్లు వ్యయం చేయడానికి సిద్దపడ్డారు. ఇప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది. సింగపూర్ కంపెనీల నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం బాగా తక్కువగా ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. పైగా వారితో ఏ వివాదం వచ్చినా లండన్ కోర్టులో తేల్చుకోవాలని రాసుకున్నారు. 2019 లో తమ ప్రాజెక్టు వయబుల్ కాదని భావించి సింగపూర్ సంస్థలు దానిని వదలుకున్నాయి. సింగపూర్ సంస్థలకు స్విస్ చాలెంజ్ పద్దతిన భూములు ఇవ్వడం పై ఆనాడు కోర్టులలో వివాదాలు నడిచాయి. కోర్టు సంబంధిత చట్టంలోని కొన్ని క్లాజులను కొట్టివేయగా,వాటిని మార్చి మళ్లీ చట్టాన్ని ఆమోదించారు. నిజానికి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి ముప్పైమూడు వేల ఎకరాల భూమి సమీకరించకుండా ,ప్రభుత్వానికి అవసరమైన వెయ్యి నుంచి ఐదువేల ఎకరాల భూమి తీసుకుని , అందులో భవనాల నిర్మాణం చేపట్టి ఉంటే ఇంత రాద్దాంతం అయ్యేది కాదు. ఆయన ఓవర్ యాంబిషస్ గా దీనిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారన్న అభిప్రాయం వ్యక్తం అయ్యేది. ఇతర జిల్లాలప్రజలు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెడితే ఎలా అని ప్రశ్నించేవారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. అయితే దాదాపు అన్ని జిల్లాల ప్రజలు అమరావతిని ఆమోదించినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి కనుక చంద్రబాబు తన ఇష్టానుసారం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. చంద్రబాబు రాగానే అధికారులు అక్కడ హడావుడి ఆరంభించారు. బహుశా కొన్ని పూర్తి కాని భవనాలకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత మిగిలిన నిర్మాణ పనులు చేపట్టవచ్చు. అమరావతి రాజధాని పూర్తి కావడానికి చాలాకాలం పట్టవచ్చు. నిధుల సమస్య, సాంకేతిక అంశాలు, భూ సేకరణ వంటి వ్యవహారాలు సజావుగా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కృష్ణానదికి ఆవల వైపున ఉన్న అమరావతిలోనే జరుగుతుందని తొలుత ప్రకటించారు. కాని ఏ సెంటిమెంట్ అయినా అడ్డం వచ్చిందేమో తెలియదు కాని, ఈసారి కృష్ణా నదికి ఈవల వైపు అంటే విమానాశ్రయం ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంటే 2014లో అమరావతి వైపు ప్రమాణ స్వీకారం చేయడం అచ్చి రాలేదని భావించి వాస్తు పండితులు ఈ మార్పు చేశారా?అన్న సందేహం వస్తుంది. అమరావతి వాస్తుపైనే అనుమానాలు ఉన్న నేతలు దానిని ఏ రీతిన ముందుకు తీసుకువెళతారన్నది ఆసక్తికరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడారు. "14 ఏళ్లుగా సీఎంగా ఉన్నాను, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. అలాగే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం. అమరావతిని అభివృద్ధి చేస్తాం. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేస్తాం. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ప్రజాహితం కోసం ముందుకెళ్తాం. మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా అజెండా అని అన్నారు.""ఎన్డీయే శాసనాసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ప్రజల తీర్పును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కలిసి పని చేయడం వల్ల కూటమికి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ తీర్పు వల్ల మనకు ఢిల్లీలో ప్రతిష్ట పెరిగింది. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ నన్ను పరామర్శించి పొత్తు పెట్టుకుందామని చెప్పారు. బీజేపీతో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేయడం వల్ల సీట్లు, ఓట్లు వచ్చాయి"అలాగే తన కోసం రాష్ట్రంలో ఎక్కడా ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేను, పవన్ సామాన్యులమే. ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తాం అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు.. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆమోదం తెలిపారు. ఆ వెంటనే టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా చంద్రబాబును తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. -
నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–4
చంద్రబాబుది పైకి అభివృద్ధి మంత్రం.. లోన కుట్ర, కుతంత్రం. అరచేతిలో సింగపూర్‌ను చూపించి.. అమరావతిని చంద్రబాబు అండ్ కో ముక్కలు చేసి పంచుకుంది. పచ్చదండు బినామీలు పచ్చని భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. ఈ డ్రామాలో నారాయణ, లింగమనేని ఇలా ఎవరికి వారే వీర లెవల్లో రక్తి కట్టించారు. క్విడ్ ప్రోకోతో అనుమానం రాకుండా కథంతా నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట లింగమనేనికి భూముల లబ్ధి, నారాయణ కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు ఎసిసోడ్ ఈ డ్రామాకే హైలైట్. బాబు, నారాయణ ద్వయం లింగమనేని రమేశ్‌తో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో బేరం కుదుర్చుకుని క్విడ్ ప్రోకోకు బరితెగించారు. తిలా పాపం.. తలా పిడికెడు.. అన్నట్లు ఈ దోపిడీలో తన దత్తపుత్రుడికీ చంద్రబాబు కొద్దిపాటి వాటా పంచారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను తమకు భూములు కానుకగా ఇచ్చిన వారికి అనుకూలంగా చేయడమే ఈ క్విడ్ ప్రోకో కథ. ప్రతిఫలంగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు, బాబుకు కరకట్టపై బంగ్లా కానుక. రాజధానిలో కాగితాలపై ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్‌మెంట్‌ను ఇష్టమొచ్చినట్టుగా మెలికలు తిప్పుతూ తమ భూముల ధరలు వేల కోట్లకు పెంచుకోవడంలో చంద్రబాబు బరితెగింపునకు బాబోయ్ అనాల్సిందే. లింగమనేని రమేశ్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.887.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చేశారు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలతో సహా వెలికితీసి చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేపీవీ అంజని కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సాగించిన దోపిడీ కాండ గురించి రెండు మూడు సీజన్లతో వెబ్ సిరీస్ తీయొచ్చు. ఈ కుంభకోణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ఘట్టం అత్యంత కీలకం. సీఆర్డీఏ అధికారుల 94 కి.మీ. అలైన్మెంట్ ప్రకారం లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఐఆర్ఆర్ నిర్మించాలి. అయితే చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని ఐఆర్ఆర్ నిర్మించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. దీనిని గోప్యంగా ఉంచిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే డిజైన్ ఉండాలని ఈ కన్సల్టెన్సీకి షరతు విధించారు. అంటే... అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీని అడ్డం పెట్టుకొని ఆమోదించేలా చేశారు. ఇదేం పని నారాయణ! సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగిస్తారు. ఇలాగైతే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాలి. దీంతో సీఆర్డీఏ అధికారులపై నారాయణ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రపురం– కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. హెరిటేజ్‌కు భూ సంతర్పణ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పి లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి క్విడ్ ప్రోకోగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు సమకూరాయి. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకునే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాల లబ్ధి కలిగింది. 2014 జూన్–సెపె్టంబర్ మధ్యలో ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ ఉన్నారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు బహుకరించారు. పవన్ కల్యాణ్‌కు ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు సమీపంలోనే 2.4 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఐఆర్ఆర్లో అవినీతి విశ్వరూపం ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.50 లక్షలుండేది. ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు తర్వాత ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లింగమనేని కుటుంబ సభ్యులకు చెందిన 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్‌తో ఒప్పందం చేసుకున్న మరో 4.5 ఎకరాల విలువ సైతం రూ.24 కోట్లకు చేరుతుంది. -
పేదల ఇళ్లు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేదల ఇళ్ల నిర్మాణాన్ని సైతం వదల్లేదు! రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి వేసిన పథకం ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో బయటపడింది. తాత్కాలిక భవన నిర్మాణాల్లో డొల్ల కంపెనీల పేరుతో రూ.వందల కోట్లు స్వాహా చేసి పక్కా ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదల ఇంటి నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని, అంతేకాకుండా పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని కోరినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. నగదు బదిలీలో ఆ ముగ్గురు.. కోడ్ భాషలో సబ్ కాంట్రాక్టుల ముసుగులో డొల్ల కంపెనీలు హయగ్రీవా, అన్నై, షలఖ కంపెనీల ద్వారా అక్రమంగా నగదును చంద్రబాబు నాయుడుకు తరలించడంలో వినయ్ నంగాలియా, విక్కీ జైన్, అంకిత్ బలదూత కీలకపాత్ర పోషించినట్లు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు ఐటీశాఖ నోటీసుల్లో పేర్కొంది. వీరంతా బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌కు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్‌లో దినార్ల రూపంలో చెల్లించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించాడు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నగదు బదిలీకి కోడ్ భాషలో హెచ్‌వైడీ అని అందులో ఉంది. విజయవాడకు విజయ్ అని, విశాఖపట్నంకు విష్ అని, బెంగళూరుకు బాంగ్ అని కోడ్ భాషల్లో నమోదు చేసుకున్న వివరాలను, ఎక్సెల్ షీటును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డగోలు వాదన ఆపి జవాబు చెప్పు!! చంద్రబాబు అసంబద్ధ వాదనలను కట్టిపెట్టి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పి తీరాల్సిందేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది! సబ్ కాంట్రాక్టుల ముసుగులో దొంగ ఇన్వాయిస్లు సృష్టించి నగదును అక్రమంగా తరలించినట్లు తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలున్నాయని, చట్ట ప్రకారం విచారించే అధికారం తమకు ఉన్నందున లెక్కల్లో చూపని రూ.118 కోట్లకు సమాధానం చెప్పాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ తన రాజగురువు రామోజీ తరహాలో ఏదో ఒక అభ్యంతరాన్ని తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తు ముందుకు కదలకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు అసలు విచారణ పరిధి లేదని ఒకసారి, జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ అధికారి ఈ కేసును సెంట్రల్ ఆఫీసుకు బదిలీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని మరోసారి, అసలు ఐటీ దాడుల్లో సీజ్ చేసిన వివరాలను తనకు తెలియచేయలేదని, అందులో తన పేరు ఎక్కడా లేదంటూ.. ఇలా వరుసగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు అడుగు ముందుకు పడకుండా కేసును సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి లేఖల మీద లేఖలు రాస్తూ నాలుగుసార్లు దర్యాప్తును అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రతిసారి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చుతూ సహనంగా సమాధానాలిస్తోంది. ముందుగా రూ.118 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ పూర్తి సాక్ష్యాధారాలతో మరోసారి సెక్షన్ 153 సీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులతో పాటు మనోజ్ వాసుదేవ్ పార్థసాని (ఎంవీపీ), చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌లపై ఐటీ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎక్సెల్ షీట్లు, వాట్సాప్ మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్, బ్యాంకు లావాదేవీల వివరాలతో పాటు వారు విచారణ సందర్భంగా ఆ నగదును చంద్రబాబుకు ఏ విధంగా చేర్చారో వెల్లడిస్తూ వివరాలను పొందుపరిచింది. తప్పించుకుని తిరుగుతూ.. చంద్రబాబు స్క్రూటినీ కేసును హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్–4 ప్రిన్సిపల్ కమిషనర్ గతేడాది సెక్షన్ 127 కింద హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్–2(4)కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి సెక్షన్ 153 సీ, 143(2)/142(1) కింద విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2022 అక్టోబర్ 10, అక్టోబర్ 27, ఈ ఏడాది జనవరి 31, జూన్ 20న చంద్రబాబు నాలుగు లేఖలు రాశారు. అసలు సెంట్రల్ సర్కిల్ కార్యాలయానికి సెక్షన్ 153 సీ కింద తనకు నోటీసులిచ్చే అధికారం లేదని వాదించగా దీన్ని తోసిపుచ్చింది. జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ ఆఫీసర్ సెక్షన్ 127 కింద ఈ కేసును తమకు బదిలీ చేయడంతో చట్ట ప్రకారం తక్షణం దర్యాప్తు మొదలు పెట్టినట్లు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు వెంటనే సెక్షన్ 127 కింద కేసు బదిలీ కాకుండానే సెంట్రల్ సర్కిల్ ఆఫీసు తనకు నోటీసులు ఇచ్చిదంటూ వాదించగా దానికి కూడా స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇచ్చింది. దర్యాప్తులో సీజ్ చేసిన వివరాలను తనకు పూర్తిగా తెలియచేయలేదని ఒకసారి పేర్కొనగా అందులో తన పేరు ఎక్కడా లేదు కాబట్టి తనకు నోటీసులు వర్తించవంటూ మరోసారి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఐటీ శాఖ స్పందిస్తూ మనోజ్ వాసుదేవ్ పార్థసాని వద్ద సోదాల్లో సీజ్ చేసిన వస్తువుల వివరాలన్నీ మీకు (చంద్రబాబుకు) తెలియచేశామని, ముఖ్యమంత్రి హోదాలో కేటాయించిన కాంట్రాక్టుల నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో ఎటువంటి పనులు చేయకుండానే నగదు చంద్రబాబుకు చేరినట్లు బలమైన ఆధారాలను సేకరించడంతో మీ అభ్యంతరాలను కొట్టి వేస్తున్నామని, పూర్తి వివరాలను మరోసారి అందచేస్తున్నామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తునకు సహకరించాల్సిందేనంటూ తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది. 46 పేజీల సుదీర్ఘ నోటీసులో మొత్తం ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందో పూసగుచ్చినట్లు బ్యాంకు లావాదేవీలు, కోడ్ భాషలను క్రోడీకరించి రుజువులతో మరీ వెల్లడించింది. -
పేదల ఇళ్ల స్థలాలపై అడ్డుపడలేం!
‘‘మేం ఉండే చోట పేదలుండటానికి వీల్లేదు!. వాళ్లకు ఇక్కడ స్థలాలిస్తే ‘సామాజిక తూకం’ దెబ్బతింటుంది’’ అంటూ న్యాయస్థానాలకు వెళ్లి ఓడిపోయిన వారు... మరిన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మరిన్ని కోర్టులకు వెళుతున్నారు తప్ప... అవి పేదల ఇళ్లే కదా అని వదిలేయటం లేదు. సోమవారం కూడా వీరు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కనీసం ‘స్టే’ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ తరఫున వాదించడానికి గతంలో భారత సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్‌గా పనిచేసిన హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారంటే... వీరి వెనక ఎంతటి ఆర్థిక బలమున్న మనుషులున్నారో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అసలు రాజధాని రైతుల పేరిట దాఖలు చేస్తున్న పిటిషన్లను ఇంతటి ఖరీదైన న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ హైకోర్టుల్లోను, సుప్రీం కోర్టుల్లోను ఎలా నడిపిస్తున్నారనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. తెలుగుదేశం కూడా వీళ్ల పిటిషన్లకు ఇన్నేసి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చుపెడుతోందో... ఒకవంక అలా చేస్తూ మరోవంక రాజధాని ప్రాంతంలో ఆందోళనల పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి ఎందుకు వెళుతోందో అర్థం కాని విషయం. అసలు ఆ ప్రాంతంలో పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాలివ్వకూడదని చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు? ఇదేమీ ఆయన సొంత రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు కదా? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా ఆయన్ని రామోజీరావు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? రాజధాని ప్రాంతంలో పేదలకు ఓ కాలనీ ఉంటే తప్పా? వారూ అందరితో పాటు అక్కడ బతికితే తప్పేంటి? సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతి ప్రాంతంలో 50 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. సామాజిక న్యాయాన్ని పరిరక్షిస్తూ, రాజధానిలో అన్ని వర్గాల ప్రజలు నివసించేలా సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లే అవుట్లు పేదల ఇళ్ల స్థలాల కోసం శరవేగంగా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్–5 జోన్‌కి వ్యతిరేకంగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఊట్ల శివయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం జస్టిస్ అభయ్.ఎస్.ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం మూడు రాజధానుల పిటిషన్లతో దీన్ని జత చేస్తున్నట్లు పేర్కొంది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదని, హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. అమరావతి భూములకు ఈడబ్ల్యూఎస్ స్కీమ్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందన్నారు. దీన్ని ఏపీ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వ్యతిరేకించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సీజేఐ సూచనల మేరకు.. రాజధానికి సంబంధించి ఇతర వ్యాజ్యాలు మరో ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం ప్రస్తావించింది. ఆయా పిటిషన్లతో వీటిని జత చేస్తామని పేర్కొంటూ శుక్రవారం లోపు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీనిపై సీజేఐ సూచనలు తీసుకుని జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందున్న పిటిషన్లతో కలిపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంది. ఈ కేసులో కేవియట్ దాఖలు చేసిన మస్తాన్ వలీ తరఫు న్యాయవాది అభిజిత్‌సేన్ గుప్తా కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటిషన్లు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పేదల విజయం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడం పేదల విజయమని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సుప్రీంకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలోనే ఉందన్నారు. ఒకసారి భూములిచ్చాక వాటిపై ప్రభుత్వానికే హక్కులుంటాయన్నారు. -
టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు
-
టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: రాజధాని భూముల కేసులో టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా, రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్ భూములను సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని మళ్లించేందుకు ‘ఎన్‌స్పైర’ అనే షెల్ కంపెనీని వాడుకున్నట్లు తేలింది. చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’! -
రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట
సాక్షి, ఢిల్లీ: అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా? ‘‘హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీం పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా కోర్టు.. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది. చదవండి: సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ.. పిటిషన్లో కీలక అంశాలివే.. -
మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: శాస్త్రీయ విధానంతోనే రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదాయం అంతా ఒకేచోట కేంద్రీకృతం కావద్దనేది మా అభిమతం అని తెలిపారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. వికేంద్రీకరణపై మాకు స్పష్టత ఉంది. వికేంద్రీకరణ ఎందుకు అవసరమో మేం స్పష్టంగా చెబుతున్నాం. అమరావతిలోనే రాజధాని ఎందుకుండాలో చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అసహనంతో ఊగిపోతున్నారు. కర్నూలులో ఆయన విన్యాసాలను ప్రజలు చూశారు. చంద్రబాబు తీవ్ర నిస్పృహతో ఉన్నారు. న్యాయరాజధానిపై వైఖరి అడిగితే సమాధానం చెప్పాలి. అంతేకానీ, స్థానిక ప్రజలను బెదిరిస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కర్నూలు వెళ్లినపుడు న్యాయరాజధానిపై ప్రజలు అడగరా?. ప్రజలు అడిగితే సమాధానం చెప్పకుండా బెదిరిస్తారా?. చంద్రబాబు మాటలతో టీడీపీ అంటే తిట్లు, దూషణలు, బూతులు పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. అన్ని చిట్‌ఫండ్స్ మాదిరిగానే మార్గదర్శిలో తనిఖీలు చేస్తే కక్ష సాధింపు అని గగ్గోలుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపాజిట్లు తీసుకుని డైవర్ట్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేయొద్దా?. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?' అని ప్రశ్నించారు. చదవండి: (వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే: స్పీకర్ తమ్మినేని) -
Supreme Court: అమరావతి కేసు విచారణ 28కి వాయిదా
సాక్షి, ఢిల్లీ: అమరాతి కేసు విచారణను సుప్రీంకోర్టు 28కి వాయిదా వేసింది. విభజన కేసులను వేరుగా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సంఘ్వీ కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అని పిటిషన్లో పేర్కొన్నారు. చదవండి: లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి -
సుప్రీంలో అమరావతి రాజధాని కేసు.. అన్నిటిని కలిపే విచారణకు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులన్నింటిని లిస్ట్ చేసి విచారించనున్నారు. రెండు అంశాలపై 35 కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను జస్టిస్ కే.ఎం.జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అని పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోనే కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి. 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు అవసరం. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ.2000 కోట్లతో పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది, ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది అని పిటిషన్లో పేర్కొన్నారు. చదవండి: (సీఎం జగన్ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు: సజ్జల) -
61 సార్లు స్టేషన్‌కు తీసుకెళ్లి.. నరకం చూపి.. పళ్లు రాలగొట్టి..
గుంటూరు: ‘నన్ను చూసి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేశారు. నేనే బ్రాండ్, నాదే ఇమేజ్. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం నా కల. ఆ కలలు పటాపంచలవుతున్నాయ’ని నిత్యం వాపోయే చంద్రబాబు, ఆయన ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో ఎన్నెన్ని అరాచకాలు చేసిందో, గ్రామీణుల మధ్య ఎంతెంత అగాధాలను సృష్టించిందో కళ్లారా చూసినా, చెవులారా విన్నా ‘రియల్’ వ్యవహారాలు బట్టబయలవుతాయి. ఒక్కో ఊరిది ఒక్కో కథ. ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యథ. బాబుకు ఆయన ‘రియల్’ బృందానికి కులం లేదు, మతం లేదు, గ్రామం లేదు. అప్పట్లో భూమి ఇచ్చారా? లేదా? అన్నదే ముఖ్యం. ఇచ్చేస్తే సరి. లేదంటే అంతే మరి.. అన్నట్లుగానే చర్యలు కొనసాగాయి. ఇదిగో ఈ ఫోటోలోని వ్యక్తిని చూశారుగా. బండ్ల బసవయ్య. ఈయనది తుళ్లూరు మండలం అనంతవరం. భూగాధను, శారీరక వ్యథను ఆయన మాటల్లోనే విందాం. మా నాన్న బండ్ల ప్రకాశరావు. శివరామ కృష్ణయ్య నా సోదరుడు. వారసత్వంగా మా ఇద్దరికీ రెండు చోట్ల ఎకరం 20 సెంట్లు సంక్రమించింది. ఎత్తిపోతల పథకం కింద మెట్ట. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వాలంటూ భూసేకరణకు టీడీపీ సర్కారు ప్రకటన జారీ చేసింది. నాతో సహా మా గ్రామానికి చెందిన 46 మంది సుమారు 500 ఎకరాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అప్పటి మంత్రులు పి.నారాయణ, పి.పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, టీడీపీకి చెందిన మండల, గ్రామ స్థాయి నాయకులు అధికారులు, పోలీసులను వెంటపెట్టుకుని నిత్యం రాజధాని గ్రామాల్లో తిరుగుతూ భూసమీకరణకు సామ, దాన, భేద దండోపాయాలన్నీ ప్రయోగించేవారు. చివరకు నా మిత్రులు నయాన, భయాన చెప్పడంతో మా భూమిని ఇవ్వడానికి అంగీకరించక తప్పలేదు. కొలతల పేరిట అంతా మాయే... అనంతవరంలోని సర్వే నంబరు 217లో బండ్ల, ఎడ్లూరి కుటుంబీకులకు 12.68 ఎకరాలు ఉంది. డాక్యుమెంట్ల ప్రకారం ఓ తండ్రి, కొడుకుకు కలిపి 2.03 ఎకరాలు ఉండగా సర్వేలో మతలబులు చేసి 2.20 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. వారివురికి 17 సెంట్లు అదనంగా చేరింది. ఇదేవిధంగా మరొకరికి 17 సెంట్లు కలిపేశారు. మొత్తం మీద మా అన్నదమ్ములకు ఉన్న 1.20 ఎకరాలలో.. ప్రభుత్వం ఇచ్చిన అవార్డు నోటిఫికేషన్ ప్రకారం 25 సెంట్లు, కొలతల్లో 30 సెంట్లు, తుదిగా 34 సెంట్లు తగ్గిపోయినట్లు రికార్డుల పరంగా చూపారు. రూ.కోటి 30 లక్షలు పోయినట్లే.. ఎత్తిపోతల పథకం కింద సాగుభూమి ఎకరం ధర రూ.15 లక్షలు. రాజధాని పేరిట చంద్రబాబు చెప్పిన ప్రకారం రూ.4 కోట్లు పలికింది. ఆ చొప్పున 34 సెంట్లు తగ్గినందుకుగాను రమారమి రూ.1.30 కోట్లను మేం కోల్పోయాం. న్యాయస్థానాల్లో పోరాటం.. భూసమీకరణ ప్రకటనను నిలిపేయాలని 2016లో హైకోర్టుకు వెళ్లా. తప్పుడు కొలతలతో భూమిని తగ్గించేశారని, న్యాయం కోరుతూ 2018లో మంగళగిరి కోర్టును ఆశ్రయించా. ఈ వ్యాజ్యం నడుస్తోంది. కౌలూ ఇవ్వలేదు.. మా భూమిని తీసేసుకున్నారు. సరిహద్దులన్నీ చెరిపేశారు. కనీసం కౌలు కూడా ఇవ్వలేదు. గత ఎనిమిదేళ్లుగా లెక్కగడితే మా అన్నదమ్ములకు రూ.పది లక్షలకు పైగా కౌలు రావాల్సి ఉంది. మా భూమిని పొందిన వారు కొంత అమ్ముకున్నారు. కౌలూ పొందుతున్నారు. మేం మాత్రం అన్యాయమైపోయాం. 61 సార్లు స్టేషన్‌కు తీసుకెళ్లి.. నరకం చూపి.. పళ్లు రాలగొట్టి.. పశ్చిమబెంగాల్‌తో సహా దేశంలో భూ వ్యవహారాలు ఏం జరిగాయో అవగాహన ఉన్నందున భూసమీకరణకు అంగీకరించలేదు. టీడీపీ నాయకులు, అధికారులు, మీడియా వద్ద మాట్లాడిన ప్రతిసారీ నన్ను పోలీసులు అదుపులోకి తీసుకునేవారు. అరెస్టు చేశామంటూ తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు 61 పర్యాయాలు తీసుకెళ్లారు. వ్యూహాత్మకంగా రికార్డులకు ఎక్కకూడదనే ఉద్దేశంతో కేసు నమోదుచేసేవారు కాదు. రేయింబవళ్లు స్టేషన్లో ఉంచేవారు. అన్నం, నీళ్లు కూడా ఉండేవి కావు. అప్పటి ఎస్ఐ (ఇప్పుడు సీఐ) కొట్టడంతో దవడ పళ్లు రాలిపోయాయి. స్టేషన్‌కు తీసుకెళ్లిన ప్రతిసారి భూసమీకరణను వ్యతిరేకించే వారు, గ్రామస్తులు, రైతు నాయకులు యాభై అరవై మందికిపైగా పోగై స్టేషన్ వద్దకు వచ్చేవారు. చివరకు పోలీసులకు నన్ను వదిలిపెట్టక తప్పేది కాదు అని బండ్ల బసవయ్య ‘సాక్షి’కి వివరించారు. అమరావతిలో 5 సెంట్లు అమ్ముకుని... అప్పటి ప్రభుత్వ దమనకాండను అడ్డుకోవడానికి అమరావతిలో విలువైన ఐదు సెంట్ల భూమిని అమ్ముకుని ఖర్చు పెట్టుకున్నా. న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నా. ఇప్పటి ప్రభుత్వానికీ చెప్పుకుంటున్నా. న్యాయం జరగకపోతుందా అని ఎదురుచూస్తున్నా. ఆనాటి ప్రభుత్వ అరాచకాలకు బలైన నాలాంటి వారెందరో రాజధాని గ్రామాల్లో లేకపోలేదు. ఆనాడు భూమి ఇచ్చినందున ఇల్లు ఇస్తామనడంతో ఉన్న దాన్ని పడగొట్టేశా. ఇవ్వలేదు. ఆ ప్రభుత్వ హయాంలో మూడేళ్లు అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికీ నా కుటుంబ దుస్థితి అదే. చివరగా ఒక్కమాట... మేమూ చంద్రబాబు గారి వర్గీయులమే అంటూ బండ్ల బసవయ్య ముక్తాయింపు ఇచ్చారు. -
అమరావతికి వ్యతిరేకం కాదు : జోగి రమేష్
పెడన: రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకేచోట రూ.3 లక్షల కోట్లు ఖర్చుచేస్తే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. కృష్ణా జిల్లా పెడన మార్కెట్ యార్డు ప్రాంగణంలో సోమవారం వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి జోగి రమేష్ పాల్గొని పెడన మండలంలోని 2,121 మంది లబ్ధిదారులకు రూ.3,97,68,750 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన కుటుంబం, బంధువులు, సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే అభివృద్ధి చెందాలనే విధంగా అమరావతిని ఏకైక రాజధాని చేయాలని కంకణం కట్టుకుని అమరావతి–అరసవల్లి పాదయాత్రకు వ్యూహరచన చేశారని దుయ్యబట్టారు. రైతుల పేరుతో చేస్తున్న ఈ పాదయాత్ర చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు. అమరావతి కావాలా.. లేక చేయూత కావాలా.., అమరావతి కావాలా... లేక ఆసరా కావాలా.. అని మంత్రి ప్రశ్నించడంతో తమకు ఆసరా కావాలి.. చేయూత కావాలంటూ మహిళలు నినదించారు. -
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని కాదు
చంద్రబాబు లెక్కల ప్రకారమే ఇక్కడ మౌలిక వసతులకే రూ.1.10 లక్షల కోట్లు పెట్టాలి. కానీ ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన రూ.1.05 లక్షల కోట్లు కేటాయించాలంటే కనీసం వంద సంవత్సరాలు పడుతుంది. కేవలం రోడ్లు, డ్రైనేజీకి, కరెంట్ కోసం పెట్టే రూ.లక్ష కోట్లు వందేళ్లలో ద్రవ్యోల్బణం వల్ల కనీసం రూ.20 లక్షల కోట్ల నుంచి రూ.30 లక్షల కోట్లు అవుతుంది. మనం దీన్ని ఏ రకంగా పూర్తి చేయగలుగుతాం? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘చంద్రబాబుతో పాటు దుష్టచతుష్టయం సభ్యులందరూ వాళ్ల పేపర్లలో, టీవీల్లో కామన్‌గా చెబుతున్నట్లు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని కానే కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వికేంద్రీకరణ అంశంపై గురువారం ఆయన శాసనసభలో జరిగిన చర్చలో స్పష్టమైన సమాధానాలిచ్చారు. ‘ఇక్కడ మొత్తం 5,817 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్, రివర్ కన్జర్వేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలు అంటే కృష్టా నదీ పరీవాహక ప్రాంతాలు దాదాపు 820 ఎకరాలు ఉన్నాయి. లంక భూములు, ఎన్జీటీ, నదీ గర్భంలో ఉన్నవి, కరకట్ట భూములు కూడా ఉన్నాయి. ఆ 820 ఎకరాల భూమి అమ్మాలనుకున్నా ఎన్జీటీ కోర్టు అంగీకరించదు. ఈ భూములు తీసేస్తే 4,997 ఎకరాల భూమి ఉంది. 2019 ఫిబ్రవరి 5న చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే 5,020 ఎకరాలు మాత్రమే కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఉంది అని చెప్పారు. (జీవో కాపీ ప్రదర్శిస్తూ) కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 దొంగల ముఠా సభ్యులందరూ కూడా 10 వేల ఎకరాలు, 20 వేల ఎకరాలు ఉన్నాయని చెబుతున్నారు. అందరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు’ అని సీఎం మండిపడ్డారు. ఈ చర్చలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నిజంగా అంత ధర ఉందా? ► చంద్రబాబు లెక్క ప్రకారం 5,020 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ భూమిని ఎకరాకు రూ.20 కోట్ల చొప్పున అమ్మితేనే రూ.లక్ష కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇవ్వగలం. నిజంగా ఈ రోజు ఇంత ధర ఉందా ? ఇంత ధరకు చంద్రబాబు కొంటారా? పోనీ రామోజీరావు కొంటారా? రాధాకృష్ణ కొంటారా? పోనీ టీవీ–5 నాయుడు కొంటారా? ► ఇంత ధర లేనప్పుడు ఎకరా రూ.10 కోట్లకు కొంటారా? అని వీళ్లు మనల్ని తిరిగి అడుగుతున్నారు. ఈ మధ్య ఈనాడు రాసింది (ఆ పత్రిక క్లిప్పింగ్‌ను స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ). మీరే ఎకరా రూ.10 కోట్లకు ఎవరైనా కొంటారా అని నేను అడుగుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎలా చేయగలుగుతాం? ఈ ప్రాజెక్టు అడుగులు ముందుకు పడకపోతే ఈ ప్రాంతంలో ఉన్న రైతులేం కావాలి? బాబుపై 420 కేసు పెట్టాలి ► చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కేవలం రూ.5,674కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మరో రూ.2,297 కోట్లు బకాయిలు పెట్టి మనల్ని కట్టమని వదిలేశారు. అంతగా భ్రమలు కల్పించి, డిజైన్లు, గ్రాఫిక్స్ చూపించి మోసం చేసినందుకు నిజానికి 420 కేసు పెట్టాలి. ► ఆయన బినామీలందరికీ కూడా ఇక్కడ భూములుండి.. ఇక్కడ అభివృద్ధి చెందితే ఆ భూములకి రేట్లు పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకు రూ.2,297 కోట్లు బకాయిలు పెట్టారు? ► వాస్తవం ఏమిటంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతకన్నా ఎక్కువ పెట్టలేని పరిస్థితి. ఏడాదికి రూ.2 వేల కోట్లు కూడా పెట్టలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో 80 శాతం పైచిలుకు ప్రజలు తెల్లకేషన్ కార్డు మీదే బతుకుతున్న పరిస్థితి. రాష్ట్రం అంటే 8 కి.మీ పరిధి కాదు ► రాష్ట్రం అంటే 8 కిలోమీటర్ల పరిధి మాత్రమే కాదు. రాష్ట్రం అంటే 1,62,967 చదరపు కిలోమీటర్ల భూభాగం. మన రాష్ట్రం అంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం. కేవలం కొందరి లబ్ధి కోసం ఉన్న 50 వేల ఎకరాల భూమి మాత్రమే కాదు. చంద్రబాబు దృష్టిలో రైతులు అంటే కేవలం 35 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మాత్రమే. మన దృష్టిలో రైతులంటే ఈ 35 వేల ఎకరాలిచ్చిన రైతులతోపాటు రైతుభరోసాను అందుకుంటున్న మరో 50 లక్షల మందీ రైతులే. రూ.5 లక్షల కోట్లు కావాలని చంద్రబాబే చెప్పారు అమరావతి ఇటు విజయవాడకు దగ్గరగా లేదు, అటు గుంటూరుకు దగ్గరగాలేదు. దేనికీ దగ్గరగా లేని ఈ ప్రాంతంలో కేవలం రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతులు కోసమే ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున ఖర్చు చేయాలని ఆనాడు చంద్రబాబే లెక్కకట్టారు. అంటే ఈ 53 వేల ఎకరాల అమరావతికి అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని ఆయనే లెక్క తేల్చారు. కేవలం 53 వేల ఎకరాలు అంటే 8 కిలోమీటర్ల పరిధిలో మౌలిక వసతుల కోసమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని వాళ్లే ఇచ్చిన నివేదిక ఇది ( కాపీని స్క్రీన్‌పై చూపించారు). ఇక రాజధాని భవనాలు మిగిలిన వాటిని కూడా కలుపుకుంటే కనీసం రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. -
‘ఇదేం పాలసీ.. నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..?’
సాక్షి, అమరావతి: పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకమే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ నిర్ణయంతో వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. చదవండి: కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో టీడీపీ నేతలు పాత్రధారులు: దేవినేని అవినాష్ ‘‘పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలి. ఇప్పటికైనా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని’’ మంత్రి హితవు పలికారు. 2018కి పోలవరం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి చేతులెత్తేశారు. మాట మీద నిలబడే నైజం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. ‘‘నేను ముఖ్యమంత్రి అయితే తప్ప శాసన సభకు రానని చంద్రబాబు మంగమ్మ శపథం చేశాడు. నేను రాను అంటూనే శాసన సభ ప్రాంగణంలోకి ముర్ముకి ఓటు వేయడానికి వచ్చాడు. నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..? నీది ఒక పాలసీ...నీ పార్టీది ఒక పాలసీ ఉంటుందా?’’ అంటూ అంబటి ఎద్దేవా చేశారు. ‘‘ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే అమరావతి పాదయాత్ర. అమరావతి అనేది ఓ పెద్ద స్కామ్. ఆ కుంభకోణానికి పునాది వేసింది చంద్రబాబే. అమరావతి పాదయాత్రలో ఒక్క రైతు అయినా ఉన్నారా?. వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం. మూడు ప్రాంతాల అభివృద్ధే మాకు ముఖ్యం. అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలనుకోవడం తప్పా?’’ అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. -
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల స్కామ్‌లో ఐదుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని సీఐడీ అరెస్ట్ చేసింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 1100 ఎకరాల అసైన్డ్‌భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అభియోగం. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణకు సంబంధించి ఐదుగురిని సీఐడీ అరెస్టు చేసింది. కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ.. బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్టుగా అభియోగాలు ఉన్నాయి. చదవండి: అరుదైన రికార్డ్.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణా హౌసింగ్ డైరెక్టర్ ఖాతాల ద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని నిర్ధారణ అయ్యింది.ఈకేసులో ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడైంది.ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ – రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. -
ఏ–1 చంద్రబాబు.. ఏ–2 నారాయణ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పేరిట సాగిన మరో భారీ భూబాగోతం బట్టబయలైంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో భారీ భూదోపిడీకి పాల్పడ్డారన్నది వెల్లడైంది. ఇన్నర్‌రింగ్ రోడ్డు డిజైన్‌ను ముందుగానే మాస్టర్‌ప్లాన్‌లో చేర్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి.. రోడ్డు డిజైన్ కోసం కన్సల్టెన్సీని నియమించినట్లుగా డ్రామా ఆడి.. తాము ముందుగా అనుకున్న డిజైన్‌నే ఖరారుచేశారు. ఈ మధ్యలో ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు ఇరువైపులా తమ కుటుంబ వ్యాపార సంస్థలు, సన్నిహితులు, బినామీల భూములు ఉండేలా కథ నడిపించారు. ఆ విధంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ, ఆయన బినామీ లింగమనేని గ్రూప్ సంస్థలు, నారాయణ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు అడ్డగోలుగా వేలకోట్ల ప్రయోజనం కలిగించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి తమ బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ పేరిట సాగిన అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. సీఆర్డీఏ ఫైళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్, హెరిటేజ్ కంపెనీ, లింగమనేని గ్రూప్ సంస్థలతోపాటు మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–3గా లింగమనేని రమేష్‌లతోపాటు 14మందిపై సోమవారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అంతేకాక.. సీఐడీ దర్యాప్తులో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గోప్యంగా ఇన్నర్ రింగ్‌రోడ్డు డిజైన్ టీడీపీ ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్ డిజైన్‌ను ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎలా ఉండనున్నది నిర్ధారణ అయిపోయింది. కానీ, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు నియమించిన ఎస్టీయూపీ అనే మరో కన్సల్టెన్సీకి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలనే షరతు పెట్టారు. ఈ అంశంపై సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ పలు సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు డ్రామా ఆడి ముందుగానే ఖరారుచేసిన ఇన్నర్ రింగ్‌రోడ్డు డ్రాఫ్ట్ ప్లాన్‌ను ఆమోదించారు. అటూ ఇటూ భారీగా భూముల కొనుగోలు ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. రాజధాని పరిధి పెంచుకుంటూ పోయారు అమరావతి ప్రాంతంలోనే రాజధాని వస్తుందని ముందుగా నిర్ణయించిన చంద్రబాబు, ఆయన సన్నిహితులు, బినామీలు ఆ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు వేలాది ఎకరాలు కొనుగోలు చేసి అనంతరం రాజధానిని ప్రకటించారు. అంతేకాదు.. తాము కొనుగోలు చేసిన భూముల విలువ వందల రెట్లు పెరిగేలా అమరావతి పరిధిని అంతకంతకూ విస్తరించుకుంటూపోయారు. ఎలాగంటే.. ► రాజధాని అమరావతి 122 చదరపు కి.మీ. పరిధిలో ఉంటుందని 2014, డిసెంబర్ 30న నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ► తరువాత 2015, జూన్ 9న 217 చదరపు కి.మీ.కు.. అనంతరం 391 చదరపు కి.మీ.కు పెంచారు. అంతేకాదు.. అమరావతిలో ఏ ప్రాంతం భూసమీకరణ పరిధిలోకి వస్తుంది... ఏ ప్రాంతం రాదన్నది కూడా నిర్ణయించారు. చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలకు చెందిన వందల ఎకరాల భూములన్నీ కూడా అమరావతి పరిధిలోనే ఉంటూ కూడా భూసమీకరణ పరిధిలోకి రాకపోవడం గమనార్హం. దాంతో ఎకరా సగటున రూ.25లక్షలకు కొనుగోలు చేసిన భూముల విలువ అమాంతంగా ఎకరా రూ.4కోట్ల వరకు చేరింది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు అండ్ కో అవినీతి బట్టబయలుకావడంతో సీఐడీ తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
మా విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ అనేది మా ప్రభుత్వ విధానం అని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అనే విషయాన్ని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారు. మా విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం. రాజధాని అంటే భూములు, ఓ సామాజిక వర్గం కాదు. ఇతర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా..?. సీఆర్డీఏ చట్టం అమలుకు మేం వ్యతిరేకం కాదు. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా ప్రభుత్వం ఉద్దేశ్యం. హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (సీఆర్డీఏ చట్టం అమలులోనే ఉంది: మంత్రి బొత్స) -
అందరి మాట.. అభివృద్ధి బాట
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): మూడు రాజధానులతోనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావుల ఫోరం అభిప్రాయపడింది. ఫోరం ఆధ్వర్యంలో ‘పరిపాలన వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఆవశ్యకత–ఆంధ్రప్రదేశ్ సమతుల అభివృద్ధి’ అంశంపై జేఎన్టీయూ (కాకినాడ)లో మంగళవారం చర్చావేదిక నిర్వహించారు. ఇందులో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ఫోరం అభిప్రాయపడింది. రాష్ట్రానికి, యువతకు మేలు జరగాలంటే ఈ విధానమే సరైందని విద్యార్థులు, మేధావులు ముక్తకంఠంతో చెప్పారు. జేఎన్టీయూకే సివిల్ విభాగం ప్రొఫెసర్, గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, జిల్లాల సమానాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పెట్టుబడులు, అభివృద్ధి అంతా ఒకేచోట ఉంటే మళ్లీ ప్రాంతాల మధ్య అసమానతలు, విద్వేషాలు రగులుతాయన్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చి, ప్రజల్లో ఉన్న గందరగోళానికి స్వస్తి చెప్పాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి, యువతకు మేలు జరగాలంటే మూడు రాజధానుల అంశంపై ప్రజలను చైతన్యపరచాలని ఫోరం నిర్ణయించింది. కార్యక్రమంలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో పాటు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
అది వంద మందిదే.. అందరిదీ కాదు.. ఢిల్లీ ఎక్కడుంది
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): అన్ని వర్గాల భాగస్వామ్యం లేని అమరావతి రాజధాని ఎలా అవుతుందని రాయలసీమ మేధావుల ఫోరం ప్రశ్నించింది. రాజధాని ఏర్పాటు సమయంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను గత సర్కారు విస్మరించిందని పేర్కొంది. అమరావతిలో 50 నుంచి వంద మంది వ్యక్తం చేసే అభిప్రాయం రాçష్టం మొత్తానికి వర్తిస్తుందా? అని నిలదీసింది. అమరావతి రైతుల పేరుతో చేపట్టిన ఉద్యమంలో నిజాయితీ లేదని, కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే ఉందని ఫోరం స్పష్టం చేసింది. అది ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నాయకులు, ప్రజాభిమానాన్ని కోల్పోయిన పార్టీలు నడిపిస్తున్న పెయిడ్ ఉద్యమమని విమర్శించింది. అమరావతి రైతుల పేరిట రాయలసీమ వాసులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించింది. రాయలసీమకు హైకోర్టు వద్దని అడ్డుపడుతున్న వారు ఎస్వీయూలో బహిరంగ సభ నిర్వహిస్తామంటే ఎలా అనుమతిస్తామని సూటిగా ప్రశ్నించింది. తిరుపతిలో సభ నిర్వహించేందుకు వీలు లేదని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఫోరం ప్రకటించింది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అందరూ స్పందించాలని, ఈ అంశంపై బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్తామని ఫోరం ప్రకటించింది. శ్రీకాళహస్తి, పుత్తూరు, ఎస్వీ యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను జాగృతం చేస్తామని స్పష్టం చేసింది. ‘ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచన – రాయలసీమ ప్రజల మనోగతం’ అనే అంశంపై రాయలసీమ మేధావుల ఫోరం మంగళవారం ఎస్వీయూలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీ ఎక్కడుంది? ‘రాజధాని నడిబొడ్డున ఉండాలన్న నిబంధన ఎక్కడుంది? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉందా?’ అని ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆధారంగా ఏమూల నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. తమిళనాడు నుంచి రాయలసీమకు వస్తున్న పెట్టుబడులను గత ప్రభుత్వం అడ్డుకుని అమరావతిలోనే పెట్టాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసని చెప్పారు. డబ్బులు వెదజల్లి రెచ్చగొట్టే యత్నాలు.. అమరావతి ఒక వర్గానికి సంబంధించిన రాజధాని అని ప్రొఫెసర్ ఎ.సుధాకరయ్య పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఉంటే అమరావతి రైతులకు వచ్చే నష్టం ఏమిటని ప్రొఫెసర్ నాగోలు కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరిట డబ్బులు వెచ్చించి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు జరుగుతున్న కుట్రని చెప్పారు. రాయలసీమలో ఎక్కడ సభ తలపెట్టినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటును ఏనాడు ప్రశ్నించలేదని ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. కోస్తా ప్రజలకు రాజధాని అడిగే హక్కు న్యాయపరంగా, నైతికంగా లేదన్నారు. తాము ఉత్తరాంధ్రతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామన్నారు. సీమవాసుల మద్దతు దుష్ప్రచారమే.. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులు అమరావతికి మద్దతిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీమ ప్రజలు తమ ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నట్లు నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తిరస్కరించిన ఒకరిద్దరు నాయకులు మినహా ఎవరూ అమరావతి ఉద్యమాన్ని అంగీకరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే మోసానికి గురై మద్రాస్, కర్నూలు నుంచి రాజధాని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే దక్కాలని స్పష్టం చేశారు. ఇక్కడ గ్రామీణ వాతావరణం గల పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి రైతులు రాజధానికి భూములు త్యాగం చేశారని కొందరు నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, వ్యాపారమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావాలని గతంలో బీజేపీ, వామపక్షాలు ఒప్పుకున్నాయని, రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గత సర్కారు పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలోసీమకు మెడికల్ సీట్లు రాకుండా నష్టం కలిగించిందని, దీనిపై ఉద్యమిస్తే అడ్డుకుందని గుర్తు చేశారు. -
రూ.149.5 కోట్లతో అసెంబ్లీకి రాజమార్గం
సాక్షి, అమరావతి: శాసన రాజధాని అమరావతికి రాజమార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉండవల్లి అవుట్ ఫాల్ స్లూయిజ్ నుంచి ఎన్–13 రహదారి వరకు 15.52 కిలోమీటర్ల పొడవున.. కృష్ణానది కుడి కరకట్టను వెడల్పు చేసి, పటిష్టపరచి రెండు వరుసల (డబుల్ లేన్) రోడ్డును నిర్మించడానికి నడుంబిగించింది. రూ.149.5 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రహదారి నిర్మాణానికి అవసరమైన కేంద్ర పర్యావరణశాఖ, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), రివర్ కన్జర్వేటర్ తదితర అనుమతులను తీసుకోవడం ద్వారా రహదారి పనులను వేగంగా పూర్తిచేసేందుకు జలవనరులశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీకి రాజమార్గాన్ని నిర్మించడం ద్వారా శాసన రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ నుంచి అమరావతి దారేది? కృష్ణానది కుడి కరకట్ట పక్కన నదీ గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు కరకట్టపై ఒక వరుస రోడ్డుపైనే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయానికి రాకపోకలు సాగించేవారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. విజయవాడతో అమరావతిని అనుసంధానం చేసేలా రోడ్డు నిర్మించే ఆలోచన కూడా చేయలేదు. కళ్లెదుట కనిపిస్తున్న.. రోజూ రాకపోకలు సాగించే రహదారినే అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నానంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం. కరకట్టపై ఒకే వరుస రోడ్డు ఉండటం వల్ల శాసన రాజధాని అమరావతికి రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. దీన్ని గమనించిన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన విజయవాడతో అమరావతిని అనుసంధానం చేసేలా రాజమార్గం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సమతుల అభివృద్ధే లక్ష్యంగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఐదేళ్లు హడావుడి చేసిన చంద్రబాబు చివరకు విజయవాడ నుంచి అమరావతికి కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కల్పించలేక చేతులెత్తేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రిక ఒప్పందాలను గౌరవించి సమతుల అభివృద్ధే ధ్యేయంగా అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తూ చట్టం చేసింది. శాసన రాజధాని అమరావతి అభివృద్ధికి నడుంబిగించింది. అందులో భాగంగానే.. విజయవాడ నుంచి అమరావతికి కృష్ణానది కరకట్ట మీదుగా రాజమార్గం నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపట్టింది. -
రాజధానిలో రూ.3 వేల కోట్ల పనులకు ప్రభుత్వ గ్యారెంటీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు అవసరమైన రూ.3 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మౌలిక వసతుల కల్పన కింద రోడ్లు, మురుగు నీటిపారుదల, నీటి సరఫరా, జాతీయ రహదారికి రాజధాని రోడ్లను అనుసంధానం చేసే పనులు, భూసమీకరణలో రైతులకివ్వాల్సిన ప్లాట్ల లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు రూ.3 వేల కోట్లు అవసరమని ఏఎంఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు మూడు బ్యాంకులు అంగీకరించగా దానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సిఉంది. నిబంధనల ప్రకారం షరతులకు లోబడి గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. రాజధాని పనుల కోసం సాంకేతిక కమిటీ రాజధానిలో పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు అవసరమైన సిఫారసులు, సూచనలు చేసేందుకు తొమ్మిది మంది సభ్యులతో ప్రభుత్వం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ చైర్మన్‌గా, పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ, ఏపీసీపీడీసీఎల్, ఈఎన్సీలు, సీఈలు ఇతర అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైంది.