CBFC
-
కంగనా 'ఎమర్జెన్సీ'కి లైన్ క్లియర్! అందుకు ఓకే అంటేనే..
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ను ఇటీవలే ఆదేశించింది. సెప్టెంబర్ 25లోగా ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. తాజాగా ఈ అంశంపై బుధవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది.సెప్టెంబర్ 30కి విచారణ వాయిదామీ దగ్గర ఏదైనా గుడ్‌న్యూస్ ఉందా? అని జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం సీబీఎఫ్‌సీని అడిగింది. సినిమాలో కొన్ని కట్స్ సూచించామని, అవి అమలు చేస్తే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని, సినిమా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చని సీబీఎఫ్సీ తెలిపింది. దీంతో నిర్మాణసంస్థ జీ స్టూడియోస్.. తమకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని కోరింది. బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కు వాయిదా వేసింది. సోమవారం అయినా ఎమర్జెన్సీ సినిమాకు చిక్కులు తొలగిపోతాయేమో చూడాలి!ఎమర్జెన్సీఎమర్జెన్సీ మూవీ విషయానికి వస్తే.. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ 2023 నవంబర్ 24న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల -
దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు: రాహుల్‌పై కంగన మండిపాటు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బాలీవుడ్ నటి, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించారు.భారత్‌లో కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావన ఆరెస్సెస్‌లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కంగన తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ప్రజలందరికీ తెలుసని అన్నారు అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా ఆయన వెనుకాడరని విమర్శలు గుప్పించారు.అనంతరం తన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల వాయిదాపై కంగనా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ చిత్రాన్ని నేను ఏవిధంగా తెరకెక్కించానో నాకు తెలుసు. చిత్రబృందం నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇదొక భారీ బడ్జెట్ మూవీ. జీ, కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో దీనిని నిర్మించాను. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతున్నకొద్దీ మేము ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. మా చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్‌పై ఉంది’’ అని ఆమె చెప్పారు. -
విశాల్ ఆరోపణతో సంచలన నిర్ణయం తీసుకున్న సెన్సార్ బోర్డు
విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని CBFC (Central Board of Film Certification)పై ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ. 6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన చెప్పారు. ఈ విధంగా ముంబయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందంటూ నటుడు విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ అత్యవసర బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశం అనంతరం సెన్సార్ బోర్డు ఒక కీలక నిర్ణయంతో పాటు విశాల్ ఆరోపణలపై కూడా స్పందించింది. (ఇదీ చదవండి: ఆ తెలుగు డైరెక్టర్ ప్రేమలో సంఘవి.. దీంతో కెరియరే నాశనమైందా..?) విశాల్‌ను లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డు సభ్యులు కాదని కేంద్ర సెన్సార్ బోర్డు ప్రకటించింది. ఆయన నుంచి డబ్బు తీసుకుంది థర్డ్‌పార్టీ వారని వెల్లడించింది. ఈ కేసు విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెన్సార్ బోర్డులో ఇలాంటి పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఇకనుంచి ఆన్లైన్లోనే సినిమాల సెన్సార్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సెంట్రల్ సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఈ- సినీప్రమాన్‌లో దర్శక, నిర్మాతలు రిజస్టర్ చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియలో కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రతి సంవత్సరం CBFC వద్దకు సుమారు 18వేల చిత్రాలు సెన్సార్ సర్టిఫికెట్ కోసం వస్తుంటాయని.. అన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుంది అని గుర్తుచేసింది. కాబట్టి నిర్మాతలు కూడా తమ సినిమాకు ముందుగా సెన్సార్ ఇవ్వాలని కోరరాదని తెలిపింది. నిబంధనల ప్రకారమే ఇక నుంచి ఆన్లైన్లో సెన్సార్ కోసం ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
విశాల్ దెబ్బతో అక్కడ మొదలైన ప్రకంపనలు
సౌత్ ఇండియా స్టార్ హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డ్ లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో రిలీజ్ చేశారు. విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా స్పందించి.. ఈ విషయం చాలా దురదృష్టకరమని, త్వరలోనే విచారణ చేపడుతామని ఒక సీనియర్ అధికారిని ముంబైకి కూడా పంపించింది. తర్వాత విశాల్ కూడా ఈ విషయాన్ని అంతటితో ఆపేశాడు. (ఇదీ చదవండి: 'పవన్ కల్యాణ్ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్ తిరిగి నిలబెట్టాడు') ఐతే ఈ వ్యవహారం అంతటితో ముగియలేదని తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో కూడా సెన్సార్ బోర్డు అధికారులపై పలు విమర్శలు రావడంతో.. కేంద్ర స్థాయిలో సెన్సార్ బోర్డు మీద వస్తున్న అవినీతి ఆరోపణల పట్ల నిగ్గు తేల్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విశాల్ ఆరోపణలపై చర్చించారని తెలుస్తోంది. సెన్సార్ బోర్డులో అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించినట్లు సమాచారం. త్వరలో అన్ని రాష్ట్రాల సెన్సార్ బోర్డు ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నారట. విశాల్ చేసిన ఆరోపణలు నేషనల్ మీడియాలో కూడా ప్రధానంగా రావడంతో దేశం మొత్తం సంచలనంగా మారింది. దీంతో ముంబై సెన్సార్ బోర్డులో కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికి విశాల్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. -
నా ప్రధాని మోదీతో పాటు ఆయనకూ కృతజ్ఞతలు: విశాల్
సౌత్ ఇండియా హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డ్ వారు రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఇందుకు గాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకోసం ఒక సీనియర్ అధికారిని విచారించమని ముంబైకు కూడా పంపింది. అంతేకాకుండా CBFC వేధింపులకు ఎవరైనా గురై ఉండుంటే తగు సమాచారాన్ని తెలిపేందుకు jsfilms.inb@nic.inను ఉపయోగించుకోవల్సిందిగా కేంద్ర సమాచార శాఖ తెలిపింది. (ఇదీ దచవండి: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) ఈ విషయంపై తాజాగా హీరో విశాల్ స్పందించాడు. 'కేంద్ర సమాచార, ప్రసార శాఖకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముంబైలో అవినీతి సమస్యకు సంబంధించిన ఈ ముఖ్యమైన విషయంపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాడం చాలా సంతోషం. నా ఫిర్యాదుపై వెంటనే స్పందించి తగు చర్యలు ప్రారంభించారు. మీకు చాలా ధన్యవాదాలు. లంచం తీసుకున్నవారిపై తప్పక తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా.. ఇదీ అవినీతిలో భాగమైన ప్రతి ప్రభుత్వ అధికారికి ఒక ఉదాహరణగా ఉంటుందని ఆశిస్తున్నాను. దేశంలో అవినీతికి అడుగులు పడకుండా నిజాయితీ గల సేవా మార్గాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను. నా ఫిర్యాదుతో వెంటనే రియాక్ట్ అయ్యేలా చూసిన నా ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్షిండేలకు మరోసారి నా కృతజ్ఞతలు. ఈ కేసు విషయంలో తక్షణమే చొరవను తీసుకురావడం వల్ల నా లాంటి సామాన్యుడికి, ఇతరులకు ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది. జై-హింద్..' అంటూ విశాల్ రియాక్ట్ అయ్యాడు. విశాల్ తనకు జరిగిన అన్యాయాన్ని మొదట X (ట్వటర్)లో తెలుపుతూ నరేంద్ర మోదీతో పాటు మహారాష్ట్ర సీఎం సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్) I sincerely thank @MIB_India for taking immediate steps on this important matter pertaining to corruption issue in #CBFC Mumbai. Thank you very much for the necessary action taken and definitely hoping for this to be an example for every government official who intends to or is… — Vishal (@VishalKOfficial) September 30, 2023 -
విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్
సౌత్ ఇండియా స్టార్ హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డ్ లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పీఎం నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లాలని వీడియోలో పేర్కొన్నారు. విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా స్పందించి.. ఈ విషయం చాలా దురదృష్టకరమని ఇలా పేర్కొంది. (ఇదీ చదవండి: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) 'CBFCలో జరిగిన అవినీతిపై విశాల్ బయటపెట్టిన అంశం చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై విచారణ జరిపేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ అధికారిని వెంటనే ముంబయికి పంపాం. తప్పు జరిగినట్లు తేలితే శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరూ మంత్రిత్వ శాఖకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. CBFC వేధింపులకు సంబంధించిన ఏదైనా విషయాలను గురించి సమాచారాన్ని తెలిపేందుకు jsfilms.inb@nic.inను ఉపయోగించుకోవల్సిందిగా కోరుతున్నాము'. అని సమాచార మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపింది. (ఇదీ చదవండి: అదిరిపోయే కాంబినేషన్లో 'హిట్లర్'గా వస్తున్న విజయ్ ఆంటోనీ) అయితే సమాచారా, ప్రసారాల మంత్రిత్వ శాఖ పోస్టుపై పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు స్పందించాయి. తమకు ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని పేర్కొన్నాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ స్పందిస్తూ.. ‘సీబీఎఫ్సీ, సమాచార-ప్రసారాల మంత్రిత్వ శాఖ రెండింటితోనూ తమకు మంచి సంబంధాలు ఉన్నాయి. 2001 నుంచి ఎంతో దగ్గరగా చూస్తున్నాం.. సెన్సార్ బోర్డు వారు ఎంతో పారదర్శకతగా పనిచేస్తున్నారు. తమ తొలి చిత్రం దిల్ చహ్తా హై దగ్గర నుంచి ఇటీవల విడుదలైన ఫక్రే 3 సినిమా వరకు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. మరోవైపు ఇదే విషయంపై బాలీవుడ్ దర్శకుడు అశోక్ పండిట్ కూడా స్పందించారు. విశాల్ పేర్కొన్న ఎం రాజన్, జిజా రాందాస్ ఆ ఇద్దరూ CBFC ఉద్యోగులు కారని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా విశాల్ చేస్తున్న ఆరోపణల తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. ఈ విషయంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ స్పందనపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. సౌత్ పరిశ్రమ నుంచి బాలీవుడ్‌పై ఎలాంటి కామెంట్ చేసినా తట్టుకోలేరని పలు కామెంట్లు చేస్తున్నారు. The issue of corruption in CBFC brought forth by actor @VishalKOfficial is extremely unfortunate. The Government has zero tolerance for corruption and strictest action will be taken against anyone found involved. A senior officer from the Ministry of Information & Broadcasting… — Ministry of Information and Broadcasting (@MIB_India) September 29, 2023 -
'సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చా'.. విశాల్ సంచలన వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశారు. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం లంచం తీసుకున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఈ అనుభవం ఎదురైందని వెల్లడించారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పీఎం నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అంతే కాకుండా ట్వీట్‌తో పాటు మనీ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్స్ నంబర్లతో సహా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) విశాల్ ట్వీట్లో రాస్తూ..' వెండితెరపై సైతం అవినీతిని చూపిస్తున్నారు. దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఆఫీసులో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన 2 లావాదేవీలు చేశా. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, రెండు సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ రోజు సినిమా విడుదలైనప్పటి నుంచి మధ్యవర్తికి చాలా ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకోస్తున్నా. నేను ఇలా చేయడం నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశమే లేదు. అందరి కోసమే నా వద్ద ఉన్న సాక్ష్యాలు కూడా పెడుతున్నా. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. #Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l — Vishal (@VishalKOfficial) September 28, 2023 -
అసలు ఆ డైలాగ్స్ ఏంటి.? ఆలియా భట్ మూవీపై తీవ్ర అభ్యంతరం!
బాలీవుడ్ భామ ఆలియా భట్, రణ్వీర్ సింగ్ జంటగా తెరకెక్కించిన తాజా చిత్రం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కథ'. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. రణ్వీర్ సింగ్, ఆలియాభట్ ప్రస్తుతం ముంబయిలో బిజీ బిజీగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని కొన్ని పదాలు, డైలాగ్స్ తొలగించాలని ఆదేశించింది. (ఇది చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) సినిమాలో ఉపయోగించిన 'కస్' పదాన్ని మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మేకర్స్‌ను ఆదేశించింది. అంతేకాకుండా లోక్‌సభ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై డైలాగ్స్ తొలగించాలని సూచించింది. దీంతో కొన్ని అభ్యంతరకర పదాలు, డైలాగ్స్ తొలగించడానికి చిత్రబృందం అంగీకరించగా.. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతి ఇచ్చింది. ఈ సినిమాలో చాలాసార్లు ఎక్కువగా వినియోగించిన బ్రా, ఓల్డ్ మాంక్ అనే పదాలను మారుస్తామని చెప్పడంతో సెన్సార్ బోర్డ్ అనుమతించింది. లోక్ సభ డైలాగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన డైలాగ్స్‌ను పూర్తిగా తొలగించాలని మేకర్స్‌ను కోరింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సన్నివేశంలో అభ్యంతకర పదాన్ని తొలగించాలని ఆదేశించింది. మహిళల లోదుస్తుల షాప్ సన్నివేశాల్లో 'బ్రా' అనే పదం వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పదాలు వాడితే స్త్రీలను కించపరచడమేనని చిత్రబృందంపై సెన్సార్ బోర్డ్ మండిపడింది. (ఇది చదవండి: బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!) రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వయకామ్18 స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. కాగా.. జులై 28, 2023న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. -
కనీసం చనిపోయినవారికైనా గౌరవం ఇవ్వండి: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ ఆమోదం తెలపలేదంటూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)లో ఒక సభ్యుడు కాబట్టే సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా యధాతథంగా రిలీజ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనిపై వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. 'దయచేసి ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని ఆపేయండి. కాస్త విరామం తీసుకోండి. కనీసం చనిపోయిన వారికైనా గౌరవమివ్వండి' అని ట్వీట్ చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మార్చి 11న విడుదలైంది. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. బాలీవుడ్ నటీనటులు అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. Please stop spreading fake news, like always. Take a little break. At least to respect the dead. https://t.co/hZflsTUbOk pic.twitter.com/yvOKhGieDX — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 20, 2022 చదవండి: ఆల్‌టైం బ్లాక్‌బస్టర్: వంద కోట్ల క్లబ్బులో 'కశ్మీర్ ఫైల్స్' -
తెనాలిలోనే సినిమా పేర్ల రిజిస్ట్రేషన్
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని సీమాంధ్ర ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ నోటిఫికేషన్ నుంచి అనుమతి లభించింది. స్థానిక చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కల్యాణమండపంలో శుక్రవారం సీమాంధ్ర ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా వివరాలను వెల్లడించారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ ఆమోదంతో సినిమాలకు టైటిల్స్, బ్యానర్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ క్లియరెన్సులు, లాబ్ లెటర్లు, డ్యూరేషన్ సర్టిఫికెట్లను జారీ చేసే అవకాశం తమ సంస్థకు లభించిందని చెప్పారు. తాము ఆమోదించిన టైటిల్స్‌కు కేంద్ర సెన్సార్ కార్యాలయం అనుమతిని ఇస్తుందన్నారు. అక్టోబరు మొదటి వారం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు దిలీప్‌రాజా వెల్లడించారు. నిర్మాత చదలవాడ హరిబాబు, సినీ హీరోయిన్ మౌనికరెడ్డి, మిలటరీ ప్రసాద్, బి.జయకుమార్ ఉన్నారు. చదవండి: పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. -
సెన్సార్షిప్ అడ్డుపుల్లలు.. భగ్గుమంటున్న మేకర్లు
న్యూఢిల్లీ/చెన్నై: కేంద్రం జారీ చేసిన సినిమాటోగ్రఫీ(సవరణ బిల్లు 2001)పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కొత్త సవరణల ప్రకారం.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) సర్టిఫై చేసిన సినిమాపై ఎవరైనా (ఒక్కరైనా సరే) అభ్యంతరం గనుక వ్యక్తం చేస్తే. మళ్లీ రీ సర్టిఫికేషన్ కోసం అడిగే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాదు పైరసీకి సంబంధించిన శిక్షలతో పాటు ఏజ్ బేస్డ్ సర్టిఫికేషన్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే సర్టిఫికెట్ గండం దాటేందుకు మేకర్లు నానా తంటాలు పడుతున్న టైంలో.. కొత్త సవరణలు పెద్దతలనొప్పిగా మారే అవకాశం ఉందని సినీ పెద్దలు భావిస్తున్నారు. ప్రముఖ ఫిల్మ్‌మేకర్ శ్యామ్ బెనగల్ నేతృత్వంలోని కమిటీ గతంలో కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. ఏదైనా సినిమాను చూసే సభ్యులు దానికి ఏజ్ సర్టిఫికేట్ ఇవ్వాలే తప్ప.. సినిమాను సెన్సార్ చేసే హక్కు ఉండకూడదని కమిటీ సూచించింది. కానీ, కేంద్రం దానిని పెడచెవిన పెట్టింది. ఇప్పటికీ అభ్యంతరకరం పేరుతో దృశ్యాలను తొలగించడం, డైలాగులను మ్యూట్ చేయడం నడుస్తోంది. ఇక సీబీఎస్సీ రెండు ప్యానెల్లు(ఎగ్జామైనింగ్ కమిటీ, రివైజింగ్ కమిటి) గనుక సర్టిఫికేషన్‌ను నిరాకరిస్తే.. ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పలేట్ ట్రిబ్యునల్’ ఫిల్మ్ మేకర్లకు ఊరట ఇచ్చేది. కానీ, ఏప్రిల్‌లో ఆ ట్రిబ్యునల్‌ను నిషేధిస్తున్నట్లు కేంద్రం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కత్తెరల పంచాయితీపై నిర్మాతలు ఇకపై కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కంట్రోల్ చేస్తున్నారా? ఇక సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952కు చేసిన తాజా సవరణలు చాలావరకు సినిమా రిలీజ్ టైంలో అడ్డుపడేందుకు వీలున్నవే. పైగా వ్యక్తిగత కక్క్ష్యలతో, రాజకీయ దురుద్దేశంతో అడ్డుతగిలే అవకాశం ఉందని పలువురు సినీ పెద్దలు భావిస్తున్నారు. ఓటీటీకీ సెన్సార్, ఫీచర్ ఫిల్మ్ సెన్సార్ నిబంధనలను సంక్లిష్టంగా మారుస్తూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరోసారి తీసుకున్న నిర్ణయం పై పలువురు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. కేరళ మూవీ అకాడమీ చైర్పర్సన్ కమల, కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఆనంద్ పట్వార్దాన్ తదితరులు తాజా నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ‘సినిమా తీసేవాళ్లను ఈవిధంగా నియంత్రించాలని చూస్తున్నారు.. ఇది రాజ్యాంగవిరుద్ధం’ అని కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ మండిపడ్డాడు. ఈ విషయంపై తమిళనాడు దర్శకుల అసోషియేషన్ కార్యదర్శి ఆరే సెల్వమణితో మాట్లాడిన వెటట్రి.. బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశాడు. యుబైఎలోనూ వయసువారీగా.. ప్రధానంగా సినిమాలను ‘యు’, ‘యు/ఎ’, ‘ఎ’ ‘ఆర్’ సర్టిఫికెట్లుగా ఇస్తూ వస్తున్నారు. ‘యు’ అంటే అందరూ చూడదగ్గ చిత్రం, ‘యు / ఎ’ అంటే పెద్దల సమక్షంలో పిల్లలు చూడదగ్గ చిత్రం, ‘ఎ’ అంటే 18 సంవత్సరాల పైబడిన వారు చూడదగ్గ చిత్రం. అయితే తాజా సవరణలతో ‘యు/ఎ’ సర్టిఫికెట్‌నూ మూడు కేటగిరీలుగా విభజించారు. యు /ఎ 7 ప్లస్, యు /ఎ 13 ప్లస్, యు /ఎ 16 ప్లస్ అని. అంటే పెద్దల సమక్షంలో కూడా ఏడు సంవత్సరాలు, పదమూడు సంవత్సరాలు, పదహారు సంవత్సరాల పైబడ్డ వారు చూసే చిత్రాలుగా విజభించారు. సెన్సార్షిప్ అడ్డుపుల్లలతో ఫిల్మ్మేకర్లను గిచ్చిగిల్లుతున్న కేంద్రం.. మరోవైపు కొత్తసవరణలపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలువు ఇవ్వడం కొసమెరుపు. చదవండి: సెన్సార్.. సెన్సార్.. సెన్సార్ -
ఫుడ్ పాయిజన్: రక్తపు వాంతులు.. 28 రోజులు ఆస్పత్రిలోనే
ముంబై: ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాను.. రక్తపు వాంతులయ్యాయి.. దాదాపు 28 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నాను అని ప్రముఖ నిర్మాత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీ తెలిపారు. ఓ రెస్టారెంట్ నుంచి తీసుకువచ్చిన ఆహారం తిన్న తర్వాత తనకు రక్తపు వాంతులయ్యాయని.. 28 రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాను అని బాలీవుడ్ హంగామాకు తెలిపారు. తనకు ఎదురైన ఈ భయానక అనుభవం గురించి పహ్లాజ్ నిహలానీ వర్ణిస్తూ.. ‘‘నెల రోజుల క్రితం నేను ఒక్కడినే ఇంటిలో ఉన్నాను. నా భార్య వేరే ఊరు వెళ్లింది. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా మహమ్మారి సమయంలో నేను నిర్మించిన ఓ సినిమా యూనిట్ సభ్యులు మా ఇంటికి వచ్చారు. పిచ్చపాటి మాట్లాడుతూ కూర్చున్నాం. బాగా ఆలస్యం అయ్యింది. ఆ సమయంలో వారిని ఊరికే పంపిచడం భావ్యం కాదని భావించి తిని వెళ్లమని చెప్పాను. అప్పటికే నా కోసం మా ఇంట్లో ఆహారం తయారు చేశారు. కానీ అది అందరికి సరిపోదు. దాంతో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను’’ అన్నారు. తింటున్నప్పడే తేడా కొట్టింది ‘‘వారి కోరిక మేరకు చికెన్ ఐట్సం ఆర్డర్ చేశాను. ఇక మాంసాహారంలో నేను చికెన్ మాత్రమే తింటాను. దాంతో వారు నన్ను కూడా తమతో జాయిన్ కావాల్సిందిగా కోరారు. వద్దనడం మర్యాద కాదని భావించి సరే అన్నాను. ఆ తర్వాత కొంచెం చికెన్ తీసుకుని తిన్నాను. అప్పుడే ఏదో తేడా కొట్టింది. దాని గురించి వారికి చెప్పాను. వాళ్లు పర్లేదు బాగానే ఉంది.. ఏం కాదు తిను అని హామీ ఇవ్వడంతో తిన్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు రక్తపు వాంతులు ‘‘ఆ తర్వాత కాసేపటికే నాకు కాస్త అసౌకర్యంగా అనిపించడమేక కాక వాంతికి అయ్యింది. ఆపై కాస్తా బాగానే అనిపించింది.. నీరసంగా అనిపించడంతో వెంటనే పడుకున్నాను. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాకు మరోసారి వాంతికి అయ్యింది. చాలా రక్తం పోయింది. వెంటనే నా కొడుక్కి కాల్ చేశాను. తను సేమ్ బిల్డింగ్‌లో ఉంటున్నాడు. తను నన్ను ఆస్పత్రికి తరలించాడు. 28 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాను’’ అన్నారు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను ‘‘ఆస్పత్రిలో చేరిన గంటలోనే నాకు అన్ని టెస్ట్‌లు చేశారు. ఇక 28 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాను. మహమ్మారి సమయం కావడంతో నా దగ్గరకు ఎవరిని రాన్వివలేదు. కానీ నేను చాలా అదృష్టవంతుడిననే చెప్పాలా. జాగ్రత్తగా చూడటానికి కుటుంబ సభ్యులు దగ్గర లేరు.. సరైన వైద్య సిబ్బంది కూడా లేరు. మరణం అంచుల వరకు వెళ్లి.. క్షేమంగా తిరిగి వచ్చాను’’ అని తెలిపారు. రెస్టారెంట్‌పై కేసు పెడతాను ‘‘ఇక నా ఆరోగ్యం ఇంతలా క్షీణించడానికి కారణం అయిన సదరు రెస్టారెంట్ మీద కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నాతోపాటు భోంచేసిన మిగతా వారు అస్వస్థతకు గురయ్యారు. కానీ నా పరిస్థితి తీవ్రంగా మారింది. ఆరోజు తిన్నదే నా చివరి భోజనం అనుకున్నాను. ఈ క్రమంలో నేను మీ అందరిని కోరేది ఒక్కటే. ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. బయట ఫుడ్ తీసుకుని ఇలా ఇబ్బంది పడకండి అన్నారు. పహ్లాజ్ నిహలానీ 29 సంవత్సరాల పాటు పిక్చర్స్ మరియు టీవీ ప్రోగ్రాం నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు మరియు 2009 లో ఈ పదవికి రాజీనామా చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్ పదవికి 19 జనవరి 2015 న పదవీవిరమణ చేశారు. 2017లో ఆయన స్థానంలో ప్రసాన్ జోషి నియమితులయ్యారు. చదవండి: ప్రాణాలు తీసిన జొన్నరొట్టె -
ట్రిబ్యునల్ రద్దుతో సినీ నిర్మాతలకు చిక్కులే
గప్‌చుప్‌గా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 4న కొన్ని అప్పిలేట్ ట్రిబ్యునళ్లను రద్దు చేసింది. అందులో సినిమా సెన్సార్ బోర్డుకు చెందిన ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఒకటి. సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరిస్తూ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్థానంలో హైకోర్టును చేర్చారు. దేశంలో ఇన్ని హైకోర్టులు ఉన్నపుడు ప్రత్యేకంగా ఒక్కో విభాగానికి మళ్ళీ ట్రిబ్యునళ్లు ఎందుకని కేంద్రం ప్రశ్న. వీటిని తొలగించడం వల్ల సత్వరన్యాయం దూరమవడంతో పాటు కోర్టు ఖర్చులు మోయవలసి వస్తుందని సినీవర్గాలు అంటున్నాయి. అప్పిలేట్ ట్రిబ్యునల్ అంటే ఒక కోర్టులాంటిదే, అయితే అది ప్రత్యేక విషయానికే పరిమితమై పనిచేస్తుంది. దేశంలో ఆదాయపు పన్ను, జీఎస్టీ, విద్యుత్తు, సైన్యం, సైబర్ నేరాలు ఇలా చాలా విభాగాలకు సొంత ట్రిబ్యునళ్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన వ్యాజ్యాలపై కోర్టుకు వెళ్లనవసరం లేదు. ట్రిబ్యునల్‌కు ఒక రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్‌గా మరి కొందరు సభ్యులు ఉంటారు. ఏ ఖర్చూ లేకుండా వారి ముందుకు వచ్చిన పిటిషన్‌కు తుది తీర్పు చెబుతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు 2017లో భాగంగా క్రమబద్ధీకరణ పేరిట దేశంలో ఉన్న 26 ట్రిబ్యునళ్లను 19కు కుదించింది లేదా తగ్గించింది. మళ్ళీ ఈసారి వివిధ చట్టాలను సవరిస్తూ వాటికి అనుబంధంగా ఉన్న ఐదు చిన్న కోర్టులను రద్దు చేసింది. వీటిలో సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, కస్టమ్స్ చట్టం 1962, ఎయిర్ పోర్ట్ చట్టం 1994, ట్రేడ్ మార్క్ చట్టం 1991, మొక్కల పరిరక్షణ రైతుల హక్కు చట్టం 2001 ఉన్నాయి. ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ రద్దు చేసి సెన్సార్ బోర్డుపై ఫిర్యాదు ఉంటే హైకోర్టుకు వెళ్ళమనడం పట్ల సినీ నిర్మాతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణపై కోర్టుకెళితే ఆ కేసు తేలేదెన్నడు, సినిమా విడుదల అయ్యేదెన్నడు అని తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైనా ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన దేశంలో సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం 1952లో సెన్సార్ బోర్డు ఏర్పడింది. సినీ నిర్మాతలు సెన్సార్ సమస్యలను సులువుగా తేల్చుకొనేందుకు చట్టంలోని సెక్షన్ డి ప్రకారం 1983లో బోర్డుకు అనుబంధంగా ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. సెన్సార్ బోర్డులో మూడు వ్యవస్థలుంటాయి. మొదటిది ఐదుగురు సభ్యులుండే ఎగ్జామినింగ్ కమిటీ, చాలా సినిమాలు ఇక్కడే సర్టిఫికెట్ పొందుతాయి. రెండోది రివైజింగ్ కమిటీ. మొదటి కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసిన సినిమాలకు కొన్ని తొలగింపులతో ఇది విడుదలకు అనుమతినీయవచ్చు. వీటికి ఒప్పుకొని సినిమా సర్టిఫికెట్ తెచ్చుకోనేవారు కూడా ఉంటారు. సెన్సార్ కటింగ్స్‌తో సినిమా విడుదల చేయడం వ్యర్థమని భావించి వాటిని ఒప్పుకోని నిర్మాత చివరి ప్రయత్నంగా ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తలుపు తడతాడు. ఈ ట్రిబ్యునల్‌కు ఒక రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా ఉంటారు కాబట్టి దీని నిర్ణయం కోర్టు తీర్పుతో సమానం. పై రెండు కమిటీలు దీని మాటకు కట్టుబడి ఉండాల్సిందే. దీని తీర్పు నచ్చని నిర్మాత బయట కోర్టుల్లో సవాలు చేయవచ్చు. ఇక్కడ ప్రభుత్వానికి మింగుడుపడనిది, సినిమావాళ్ళకు ఇష్టమైనది ఏమిటంటే సామాజిక, రాజకీయ అంశాలపై విమర్శనాత్మకంగా వచ్చిన ఎన్నో సినిమాల విడుదలకు ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ మార్గాన్ని సుగమం చేస్తోంది. పాలక పక్ష అనుయాయులను బోర్డు చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టినా ఫలితం శూన్యం. ట్రిబ్యునల్ ఉండడం వల్ల ప్రభుత్వాన్ని, సామాజిక కట్టుబాట్లను, విశ్వాసాలను విమర్శించే ప్రగతిశీల, అభ్యుదయ సినిమాలు బయటికి వస్తున్నాయి. ట్రిబ్యునల్ రద్దు చేసి ఇలాంటి సినిమాలు తీసేవారిని కోర్టుల చుట్టూ తిప్పితే కష్ట నష్టాలపాలై విమర్శనాత్మక సినిమాలు తీయడానికి ముందుకు రారు అని ప్రభుత్వం భావిస్తోందని సినీజీవులంటున్నారు. 1994లో ‘బాండిట్ క్వీన్’ విడుదలకు రెండు కమిటీలు ఒప్పుకోకున్నా ట్రిబ్యునల్ ప్రమేయంతో మన దేశంలో రిలీజ్ అయింది. 2017లో ‘లిప్‌స్టిక్ అండర్ మై బురఖా’ ట్రిబ్యునల్ తీర్పు మూలంగానే తెర మీదికొచ్చింది. 2016లో శ్యామ్ బెనెగల్ కమిటీ ట్రిబ్యునల్ అధికారాలను మరింత పెంచాలని సిఫారసు చేసింది. షర్మిలా ఠాగూర్ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్‌గా ఉన్నప్పుడు తాను ట్రిబ్యునల్ ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తెచ్చానని, రద్దు విషయంలో సినీ ప్రముఖులతో చర్చించి ఉండాల్సిందని అంటున్నారు.. ప్రజలకు అవసరం లేవని, ప్రభుత్వానికి భారమని భావించే ట్రిబ్యునళ్ల తొలగింపుపై కనీసం ఏకసభ్య కమిటీ అయినా వేసి అంతిమ నిర్ణయాలు తీసుకోవాలి. లక్షలాది మందికి ఉపాధికి, కోట్ల రూపాయల పన్నుకు మూలమైన చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పించాలి తప్ప ఉన్న సదుపాయాలను దూరం చేయవద్దు. వ్యాసకర్త :బి. నర్సన్ కవి, విశ్లేషకులు మొబైల్ : 94401 28169 -
‘ఇది మన సమాజం ఆలోచన తీరు’
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ తాజాగా నటించిన వెబ్‌సిరీస్ ‘రాస్భరి’. అయితే దీనిలోని ఓ సన్నివేశం పట్ల సినీ గేయ రచయిత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చీఫ్ ప్రసూన్ జోషి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగి ఉన్న పురుషుల ముందు ఓ చిన్న అమ్మాయి వారిని రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేస్తుందని.. పిల్లలను ఇలాంటి సన్నివేశాల్లో నటింపజేయడం అవసరమా అని ప్రసూన్ జోషి ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘రాస్భరి’ టీమ్‌తో పాటు దీనిలో ప్రధాన పాత్రలో నటించిన స్వరా భాస్కర్‌ను ఉద్దేశిస్తూ ప్రసూన్ జోషి ట్వీట్ చేశారు. ‘‘రాస్భరి’ వెబ్‌సిరీస్‌లో ఓ చిన్న పాప తాగుబోతులను రెచ్చగొడుతూ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను చూస్తే చాలా విచారం కలిగింది. ‘రాస్భరి’ టీం ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటి సన్నివేశాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకేతాలా లేక దోపిడీ స్వేచ్ఛకు ఉదాహరణలా’ అనే దాని గురించి ప్రేక్షకులు, మేధావులు ఆలోచించుకోవాలి. వినోదం కోసం చిన్నారులను ఇలాంటి సన్నివేశాల్లో నటింపజేయడం ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రసూన్ జోషి ట్వీట్ చేశారు. (బరువు పెరుగుతున్నా!) Saddened byWebseries #Rasbhari’s irresponsible content portraying alittle girl child dancing provocatively in frontof men drinking.Creators& audience need 2seriously rethink Freedomof expression or freedom of exploitation?Let’s spare children in thedesperate need4 entertainment. — Prasoon Joshi (@prasoonjoshi_) June 26, 2020 దీనిపై స్వరా భాస్కర్ స్పందించారు. ‘బహూశా ఈ సీన్ అపార్థానికి దారి తీస్తుందేమో. కానీ ఈ సన్నివేశం మీరు ఊహించిన దానికి పూర్తిగా భిన్నం. ఆ పాన తన ఇష్టానుసారం డ్యాన్స్ చేస్తుంది. అది చూసి ఆమె తండ్రి సిగ్గుపడతాడు. అంతే తప్ప ఇక్కడ ఆ చిన్నారి డ్యాన్స్ ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశంతో తీయలేదు. సమాజం తనను కూడా లైంగిక దృష్టితో చూస్తుందనే విషయం పాపం తనకు తెలియదు. ఇది మన సమాజపు ఆలోచన తీరు’ అంటూ ఘాటుగా స్పందించారు స్వరా భాస్కర్. వెబ్‌సిరీస్‌లో ఈ సన్నివేశం స్వరా చిన్నప్పటి వెర్షన్లో వస్తుంది. ఓ స్టూండెట్ తన టీచర్ వెంటపడే కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌పై ఇప్పటికే చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. (అమ్మా తప్పు చేశానా?) -
మసీదుల్లోకి మహిళల వ్యాజ్యం కొట్టివేత
న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పబ్లిసిటీ కోసమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్న కేరళ హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి అసలు మీరెవరు? ఇది మీపై ఎలా ప్రభావం చూపుతుంది? బాధిత వ్యక్తులను మా ముందుకు తీసుకురండి’అని పిటిషన్‌దారుడితో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు, ఆర్టికల్ 15 చిత్రంలో కుల విద్వేషాలు, పుకార్లను పెంచే అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నందున సీబీఎఫ్సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. -
793 చిత్రాలపై నిషేధం విధించిన సెన్సార్ బోర్డ్
లక్నో: గత 16 ఏళ్లలో 793 సినిమాలపై నిషేధం విధించినట్టు సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) తెలిపింది. లక్నోకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నూతన్ ఠాకూర్ దాఖలు చేసిన ఆర్జీపై సెన్సార్ బోర్డ్ ఈ సమాచారం అందజేసింది. దీనిపై నూతన్ ఓ వార్తసంస్థతో మాట్లాడుతూ.. 2000 జనవరి 1 నుంచి 2016 మార్చి 31 వరకు సెన్సార్ బోర్డ్ 793 సినిమాల ప్రదర్శనకు అనుమతి నిరాకరించదని తెలిపారు. అందులో 586 భారతీయ చిత్రాలు కాగా, 207 విదేశీ చిత్రాలు ఉన్నాయని అన్నారు. ఈ కాలంలో 231 హిందీ, 96 తమిళ్, 53 తెలుగు, 39 కన్నడ, 23 మళయాళ, 17 పంజాబీ, 12 బెంగాలీ, 12 మరాఠి చిత్రాలు సెన్సార్ బోర్డ్ నిషేధానికి గురయ్యాయి. అత్యధికంగా 2015-16 ఏడాదికి గానూ 152 చిత్రాల ప్రదర్శనకు సెన్సార్ బోర్డ్ అనుమతి నిరాకరించింది. సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించినవాటిలో అశ్లీలత, నేర ప్రవృత్తి, వివాదాస్పద కథాంశాలు కలిగిన చిత్రాలు ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ నటించిన మోహల్లా అస్సీ చిత్రంలో మత భావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదులు రావడంతో సెన్సార్ బోర్ట్ ఈ చిత్రాన్ని 2015లో నిషేధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఈ చిత్రం 2018 నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
‘సంజు’కు భారీ షాక్...
సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ చిత్రం బాక్సాఫీస్‌ల వద్ద కలేక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా కేవలం ఒక్క భాషలోనే 4000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ సినిమాకు ఇంతలోనే భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం సంజు సినిమానూ వదల్లేదు. ప్రస్తుతం ‘సంజు’ పైరసీ కాపీ, అది కూడా హెచ్డీ ప్రింట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అది కూడా పూర్తి నిడివి చిత్రం కావడం గమనార్హం. ఇది గమనించిన సోషల్ మీడియా యూజర్లు ఆ వెబ్సైట్ లింక్‌ను స్క్రీన్ షాట్స్ తీసి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. సినిమా లీక్ అయిన విషయం తెలుసుకున్న రణ్‌బీర్ కపూర్ అభిమానులు మాత్రం ఈ విషయం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ‘నిజమైనా సిని అభిమానులు ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రోత్సాహించరు. వారు థియేటర్‌కి వెళ్లి, టిక్కెట్ కొని సినిమా చూస్తార’ని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘సంజు లీక్ అయ్యింది. దయచేసి ఈ లింక్‌లను ఎవరికీ షేర్ చేయకండి’ అంటూ రణ్‌బీర్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఈ విషయం గురించి సీబీఎఫ్‌సీని విమర్శిస్తున్నారు. గతంలో సంజు సినిమాలోని టాయిలెట్ దృశ్యాలు విడుదలయినప్పడు సీబీఎఫ్సీ నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఉటంకిస్తూ ‘టాయిలెట్ సీన్లు విడుదలైతే దేశ గౌరవాన్ని కించపరిచామని వాదించిన వారు ఇప్పుడు సినిమా మొత్తం లీక్ అయింది. అయినా ఎందుకు మాట్లడటం లేదు’ అని విమర్శిస్తున్నారు. -
‘సంజు’పై ఫిర్యాదు; ఇండియా పరువేంగాను?
న్యూఢిల్లీ: రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమాపై ఫిర్యాదు నమోదైంది. ‘సంజు’ ట్రైలర్లో చూపించిన ‘జైలు టాయిలెట్ లీకేజీ సీన్ల’ను తక్షణమే తొలగించాలని, లేకుంటే సినిమా విడుదలపై స్టే కోరుతూ కోర్టుకు వెళతామని ఫృథ్వీ మస్కే అనే స్వచ్ఛంద కార్యకర్త.. సెన్సార్ బోర్డును హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషికి ఫిర్యాదును అందజేశారు. ఇండియా పరువేంగాను?: ‘‘సంజు సినిమా ట్రైలర్లో టాయిలెట్ లీకేజీ సీన్ చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆ సీన్ వల్ల ఇండియాలోని జైళ్ల నిర్వహణ, అధికారుల పనితీరుపై ప్రపంచానికి తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకు ముందు చాలా సినిమాల్లో జైల్ సీన్లు ఉన్నప్పటికీ, ఇలా టాయిలెట్ లీకేజీని చూపించిన దాఖలాలు లేవు. వాస్తవానికి అలాంటి సంఘటనేదీ జరిగినట్లు ఎక్కడా నమోదుకాలేదు’’ అని ఫృథ్వీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు సీన్‌పై సెన్సార్ బోర్డు స్పందించకుంటే, సినిమా విడుదల నిలిపేసేలా కోర్టుకు వెళతానని తెలిపారు. కాగా, ఈ ఫిర్యాదుపై సీబీఎఫ్సీ స్పందన ఇంకా వెలువడాల్సిఉంది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 29న ‘సంజు’ విడుదలకానుంది. సంజు ట్రైలర్ -
హీరో స్వయంవరం.. సెన్సార్‌బోర్డుకు నోటీసులు
సాక్షి, చెన్నై : కోలీవుడ్ ఓ రియాల్టీ షో కోర్టు మెట్లెక్కింది. నటుడు ఆర్య స్వయంవరం పేరిట ఈ షోను నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలను ఎంపిక చేసి ఇందులో గెలిచిన వారిని ఆర్య వివాహం చేసుకుంటాడంటూ ఈ షోను నిర్వహిస్తున్నారు. అయితే దీనిని నిలిపివేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. షో నిర్వాహకులతోపాటు సెన్సార్‌బోర్డుకు కోర్టు నోటీసులు దాఖలు చేసింది. ‘ఎంగ వీటు మాపిల్లై’ పేరిట ఆర్య తన స్వయంవరం షోను ప్రకటించాడు. కలర్స్ తమిళ్ ఛానెల్లో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. నటి సంగీత ఈ రియాల్టీ షోకు హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఈ షో మహిళల గౌరవానికి దెబ్బతీసేలా ఉంటోందని.. పైగా కంటెస్టెంట్లను కించపరిచేలా షోలో పనులు చేయిస్తున్నారంటూ జానకిఅమ్మల్ అనే ఉద్యమకారిణి ఆరోపణలకు దిగారు. ఈ మేరకు షోను నిలుపుదల చేయాలంటూ ఆమె సెన్సార్ బోర్డు, కేంద్ర సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన మధురై బెంచ్.. షో నిర్వాహకులకు, సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శితోపాటు, ఈ షోకు అసలు అనుమతి ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకు నోటీసులు దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 18కు వాయిదా వేసింది. అయితే అప్పటిదాకా షో నిర్వాహణను నిలుపుదల చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. -
తెలుగు ‘మెర్సల్’ ; సెన్సార్ బోర్డుపై విమర్శలు దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : వారాలకు వారాలు వాయిదా పడుతూ వస్తోన్న ‘అదిరింది’(మెర్సల్ తెలుగు డబ్బింగ్) సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ‘మెర్సల్’ లోని ప్రభుత్వ వ్యతిరేక డైలాగులపై వివాదం చెలరేగిన దరిమిలా, సెన్సార్ బోర్డు కవాలనే సినిమాను అడ్డుకుంటోందని నిర్మాతలు ఆరోపించారు. దీంతో సెన్సార్ బోర్డు తీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే, సినిమా ఆలస్యానికి తాము ఏమాత్రమూ కారణం కాదని, అనవసరంగా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి వాపోయారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘అదిరింది’ ఆలస్యంపై వివరణ ఇచ్చారు. ‘‘సెన్సార్ బోర్డు నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. ఏ రాజకీయ కారణమో, వాణిజ్యపరమైన అంశమో మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ‘మెర్సల్’ సినిమా తెలుగు డబ్బింగ్ ‘అదిరింది’ కి సర్టిఫికేట్ జారీ చేయడంలేదని మాపై విమర్శలు చేయడం దారుణం. తమిళ మాత్రుకకు ఎలాగైతే నిబంధనల ప్రకారమే సర్టిఫికేట్ ఇచ్చామో, తెలుగుకు కూడా అలానే ఇస్తాం. అయితే, మా పనిలో ఆలస్యం తలెత్తడం సహజం. నిజానికి సర్టిఫికేషన్‌కు గరిష్టంగా 68 రోజులు పడుతుంది. కానీ మేం సాధ్యమైనంత తొందరగానే పని పూర్తిచేసేస్తాం. కొన్నిసార్లు సెలవులు కూడా తీసుకోకుండా కష్టపడతాం. అలాంటిది మావల్లే సినిమా విడుదల ఆలస్యమవుతోందని విమర్శలు చేయడం సరికాదు’’ అని ప్రసూన్ జోషి వివరణ ఇచ్చారు. మెర్సల్‌కు ఊరట : వివాదాస్పద ‘మెర్సల్’ను నిషేధించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీని విమర్శిస్తూ ‘మెర్సల్’లో డైలాగులు ఉండటాన్ని తమిళనాడు బీజేపీ తప్పుపట్టడంతో మొదలైన వివాదం క్రమంగా దేశాన్ని కుదిపేసే స్థాయికి వెళ్లింది. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ‘మెర్సల్’ మద్దతు పలికాయి. అంతలోనే విజయ్ క్రైస్తవుడు కాబట్టే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటూ కొందరు కాషాయ నేతలు వ్యాఖ్యానించడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. తమిళంలో రూపొందుకున్న ఈ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో అనువదించారు. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించినా, తెలుగులో అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చింది. -
ఆడదానివై ఉండి.. ఈ సినిమా ఎలా తీశావ్!
నిర్మాతపై సెన్సార్ బోర్డు సభ్యురాలి షాకింగ్ కామెంట్స్ 'నువ్వు ఒక మహిళవై ఉండి.. ఇలాంటి సినిమాను ఎలా తీశావు?' ఇది కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) నుంచి నిర్మాత కిరణ్ ష్రఫ్‌కు ఎదురైన ప్రశ్న. నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా కిరణ్ ష్రఫ్ 'బాబుమోషాయ్ బందూక్‌బాజ్' సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఏకంగా 48 కత్తెర్లు వేసిన పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సీబీఎఫ్సీ.. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు తనను కూడా దుర్భాషలు ఆడిందని నిర్మాత కిరణ్ ష్రఫ్ తెలిపారు. 'సినిమాను చూసిన తర్వాత సీబీఎఫ్సీ సభ్యులు దాదాపు గంటసేపు తమలో తాము చర్చించుకున్నారు. మొదట మా సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అనంతరం సినిమాలో 48 కట్లు ఉంటాయని చెప్పారు. సినిమా పెద్దల కోసమే అయినప్పుడు అన్ని కట్లు ఎందుకు అని మేం వాదించాం. వాళ్లు అది ఏమీ పట్టించుకోలేదు. తాము ఎందుకు కట్ చేస్తున్నామో వివరించుకుంటూ పోయారు' అని నిర్మాత కిరణ్ ష్రఫ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. 'ఈ దశలో సెన్సార్ బోర్డులోని ఓ మహిళా సభ్యురాలు నావైపు తిరిగి.. 'మీరు ఆడవారై ఉండి ఇలాంటి సినిమాను ఎలా తీశారు?' అని ప్రశ్నించింది. దీనికి మరో సభ్యుడు కలుగజేసుకుంటూ.. 'చూడండి ప్యాంటు, షర్ట్ వేసుకుంది. మహిళ ఎలా అవుతుంది' అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో నాకు దిమ్మతిరిగిపోయింది. ఇది తిరోగమన ఆలోచన. నిర్మాతలు ఈ తరహా అవమానాలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. ధరించే దుస్తుల ఆధారంగా మహిళలను జడ్జ్ చేసే వ్యక్తులు.. నా సినిమాకు ఎంతమేరకు సర్టిఫికేట్ ఇవ్వగలరో గ్రహించవచ్చు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకు పెద్ద ఎత్తున కత్తెర్లు వేయడంపై దర్శకుడు కుషాన్ నందీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో తిట్లు అన్ని ఎత్తివేయాలని, 80శాతం రొమాంటిక్ సీన్లను కట్ చేయాలని సీబీఎఫ్సీ ఆదేశించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. -
సెన్సార్ బోర్డుకు ఆ 'సినిమా' తిప్పలు!
చెన్నై: ఓ బాలిక(13) సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కు పరీక్ష పెట్టింది. కొన్ని నెలల కిందట ఇంటి నుంచి పారిపోయిన బాలికను పోలీసులు గతవారం గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక పేరెంట్స్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ ప్రకారం కోర్టులో బాలికను పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా బాలిక చెప్పిన విషయాలు విని న్యాయమూర్తులు, పోలీసులు, బాలిక తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తాను తమిళ చిత్రం కళవని మూవీ చూసి ప్రభావితురాలినయ్యానని కోర్టుకు బాలిక విన్నవించింది. ఆ మూవీ ఎఫెక్ట్ వల్లనే ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు మైనర్ చెప్పింది. ప్రస్తుతం ఆ బాలిక గర్భవతి. అయితే ఆ మూవీకి సీబీఎఫ్సీ కేవలం యూ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని చెన్నై కోర్టు తప్పుపట్టింది. 2010లో సీబీఎఫ్సీ కళవని మూవీకి యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించి సీబీఎఫ్సీ అధికారికి చెన్నై కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సినిమాకు ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చారు, యూ సర్టిఫికేట్ ఎలా డిసైడ్ చేశారు.. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎందుకు ఎంకరేజ్ చేశారని కోర్టు ప్రశ్నించింది. నిర్మాత సహా మూవీకి పనిచేసిన కీలక వ్యక్తుల నుంచి వివరణ తీసుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం వరకు గడువిచ్చింది. -
సెన్సార్ బోర్డు అధికారాలకు కత్తెర!
ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాలకు కారణం అవుతున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అధికారాలకు కత్తెర వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం పహ్లజ్ నిహలానీ దాని చైర్మన్‌గా అధికారం చేపట్టినప్పటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. దాంతో సినిమాలను సెన్సార్ చేసే విషయంలో ఈ సంస్థకు ముకుతాడు వేయాలని కేంద్ర సర్కారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త సినిమాటోగ్రఫీ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ భావిస్తోంది. దీన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అది గనక చట్టరూపం దాలిస్తే.. సీబీఎఫ్‌సీకి ఇక కేవలం సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వడం తప్ప సెన్సార్ చేసే అవకాశం ఉండదు. ఉడ్తా పంజాబ్ సినిమాకు ఏకంగా 90 కట్లు చెప్పడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు కోర్టుకు వెళ్లడం, చివరకు సుప్రీంకోర్టు కేవలం ఒకే ఒక్క కట్‌తో సినిమా విడుదలకు అంగీకరించడం లాంటి పరిణామాలతో సీబీఎఫ్సీ పరువు గంగలో కలిసిపోయింది. దాంతో ఇక దాని అధికారాలకు కత్తెర వేయక తప్పదని కేంద్రం నిర్ణయించింది. సినిమాలను వాటి కంటెంట్ ఆధారంగా వివిధ విభాగాలుగా చేయడం తప్ప సీన్లు, డైలాగులు కట్ చేయాలని చెప్పే అధికారం సీబీఎఫ్‌సీకి ఉండకూడదని భావిస్తోంది. సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే సీబీఎఫ్సీ.. స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తోంది. -
ముద్దు సీన్లకు 'సెన్సార్' ఓకే!
న్యూఢిల్లీ: ముద్దు సీన్ల విషయంలో ఫిలిం మేకర్స్‌కు , సెన్సార్ బోర్డుకు మధ్య చెలరేగుతున్న వివాదాలకు తెరపడినట్లేనా? హైకోర్టు అక్షింతలతో బోర్డు తన తీరు మార్చుకుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. హృతిక్ రోషన్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన 'మొహెంజొదారో' లో రొమాంటిక్ ట్రాక్ తోపాటు మూడు లిప్ లాక్ సీన్లు ఉన్నప్పటికీ.. సెన్సార్ బోర్డు ఆ సినిమాకు ఒక్కటంటే ఒక్క కట్ కూడా చెప్పకపోవడం విశేషం. సింగిల్ కట్ లేకుండా 'మొహెంజొదారో'కు యూ/ఏ సర్టిఫికేట్ జారీ అయనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. (అతనితో ముద్దుకి సిగ్గుపడలేదు!) ఎపిక్ అడ్వెంచర్ డ్రామాగా అశుతోష్ గొవారికర్ తెరకెక్కించిన 'మొహెంజొదారో' ఆగస్టు 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తమ సినిమా సెన్సార్ చిక్కులను సులువుగా దాటిరావడంతో దర్శకనిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. సినిమాల్లో ముద్దు సీన్లపై దర్శకనిర్మాతలు, సెన్సార్ బోర్డుకు మధ్య వివాదాలు ఇటీవల తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జేమ్స్ బాండ్ సినిమా 'స్పెక్ట్రే' మొదలు దీపికా- రణ్ బీర్ ల 'తమాషా', కాజల్ అగర్వాల్- రణదీప్ హుడాల 'దో లబ్జోంకీ కహానీ' తదితర సినిమాల్లో ముద్దు సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. కాగా, ఇటీవల 'ఉడ్తా పంజాబ్' సినిమా విడుదల సమయంలో సెన్సార్ బోర్డు తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'సీన్లు కత్తిరించడంకాదు.. సర్టిఫికెట్ జారీ వరకే మీ బాధ్యత. సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం' అని హైకోర్టు బోర్డును మందలించింది. -
'పవర్ ఆఫ్ పాటీదార్' కు సెన్సార్ చిక్కులు!
సూరత్ః పవర్ ఆఫ్ పాటీదార్ పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలో గుజరాత్ రాష్ట్రంలో చెలరేగిన పాటీదార్ ఆందోళన ఆధారంగా తెరకెక్కనున్న గుజరాతీ సినిమా విడుదలకు అనుమతి నిరాకరించింది. రాళ్ళు రువ్వుకోవడం, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారి నిజమైన పేర్లను వాడటం వంటి అనేక కారణాలతో సినిమా విడుదలకు తిరస్కరించింది. పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో గతంలో గుజరాత్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆందోళనల నేపథ్యంలో తీసిన గుజరాతీ సినిమా 'పవర్ ఆఫ్ పాటేదార్' విడుదలకు సీబీఎఫ్సీ అనుమతి నిరాకరించింది. గుజరాత్ లో జరిగిన ఆందోళనల్లో రాళ్ళు రువ్వుకోవడం వంటి సన్నివేశాలతోపాటు, ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ మొదలైనవారి పేర్లను సినిమాలో వాడటమే కాక, ఆందోళన సమయంలో హార్థిక్ కు సహాయకులుగా ఉన్నవారే సినిమాలో పాత్రలు ధరించడంపై కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే సెన్సార్ బోర్డు ఇప్పటిదాకా సినిమాలో అభ్యంతరకర సీన్లు కట్ చేయడంపై తమకు ఎటువంటి రాత పూర్వక ఆదేశాలు జారీ చేయలేదని, అటువంటి ఆదేశాలు అందితే సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సినిమా నిర్మాత మహేష్ పటేల్ తెలిపారు. సినిమాలో హార్థిక్ పటేల్ తో సహా ఆందోళనలోపాల్గొన్న అనేకమంది నాయకులకు చెందిన పేర్లను వాడటంతోనే సీబీఎఫ్సీ అడ్డు చెప్తున్నట్లు పటేల్ తెలిపారు. అంతేకాక పాటీదార్ టైటిల్ పై కూడా సీబీఎఫ్సీ అభ్యంతరం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్ ఆందోళన, హార్థిక్ పటేల్ కు సంబంధించిన కథలు తెరకెక్కితే.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ అటువంటి సినిమాలు రాకుండా చేసేందుకు ఇది.. ప్రభుత్వం చేస్తున్నప్రయత్నంలో భాగంలానే ఉందని పటేల్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఆనందీ బెన్ క్యారెక్టర్ ను సినిమాలో పెట్టడం కూడా అభ్యంతరానికి మరోకారణంగా తెలుస్తోందన్నారు. ఒకవేళ బోర్డు.. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు కట్ చేసేందుకు ఆదేశిస్తే అందుకు తాము సిద్ధమేనని, కానీ సినిమా మొత్తానికే సమస్యాత్మకం చేస్తున్నారని, ఇప్పటికే కేసర్ భవానీ ఫిల్మ్ ప్రొడక్షన్ సమర్పణలో 12 కు పైగా గుజరాతీ సహా ఇతర భాషా చిత్రాలను నిర్మించిన 'పవర్ ఆఫ్ పాటీదార్' నిర్మాత పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు.