chandrayangutta
-
చాంద్రాయణగుట్ట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అక్బరుద్దీన్ ముందంజ
-
Hyderabad: ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఇంటిలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాద మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలడంతో అధికారులు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వారంతా పెద్ద పెద్ద నగరాలనే టార్గెట్ చేస్తూ.. మధ్యప్రదేశ్, హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్రదాడులకు పాల్పడే కుట్రలు జరుగతున్నట్లు అనుమానాలు రావడంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్‌లో ఆరుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరో ఇద్దర్ని బాబానగర్, చంద్రాయన్ గుట్టలలో అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. దీంతో అరెస్టయిన నిందితుల సంక్య 19కి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: దేశవ్యాప్తంగా ఏకకాల దాడులకు కుట్ర! పరారీలోనే సల్మాన్.. విచారణలో కీలక విషయాలు.. ) -
Old City: బామ్ ఫ్యామిలీ అరాచకాలు.. యువకుడి బట్టలు తొలగించి దాడి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–రాచకొండ పోలీసు కమిషనరేట్ల సరిహద్దు ప్రాంతంలో బామ్ ఫ్యామిలీ అరాచకాలు చేస్తోంది. బార్కస్ కేంద్రంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అబుబకర్ కాలనీలోని వీరి ఫామ్‌హౌస్‌లో ఓ యువకుడి బట్టలు తొలగించి దాడి చేశారు. ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు బామ్ కుటుంబాల వ్యవహారాలను ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసుల అండదండలతోనే వీళ్లు రెచ్చిపోతున్నారని, వీరిపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదైనా సరైన చర్యలు లేవని స్థానికులు వాపోతున్నారు. 500 మందితో అతి పెద్ద ‘కుటుంబంగా’.. పాతబస్తీలోని పాతబస్తీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బామ్ కుటుంబం చాలా పెద్దదని స్థానికులు చెబుతున్నారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కజిన్స్... ఇలా మొత్తం దాదాపు 500 మంది ఉన్నారని వివరిస్తున్నారు. వీళ్లు ఇటు హైదరాబాద్–అటు రాచకొండ పోలీసు కమిషనరేట్ల సరిహద్దు ప్రాంతాల్లో అరాచకాలు చేస్తున్నారు. దౌర్జన్యాలు, భూ కబ్జాలు, దాడులు ఇలా అనేక ఆరోపణలపై ఫిర్యాదులు, కేసులు సర్వసాధారణంగా మారిపోయింది. గొడవకు దిగాలన్నా, కబ్జాలకు పాల్పడాలన్నా వీళ్లు పథకం ప్రకారం ముందుకు వెళ్తారని బార్కస్ వాసులు చెబుతున్నారు. బార్కస్ బామ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఓ సంస్థను కూడా స్థాపించారని, దీని ముసుగులోనే కబ్జాలు చేస్తున్నారని బార్కస్ వాసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 50కి పైగా కేసులు... ఈ కుటుంబానికి చెందిన సౌద్ బామ్, ఇక్బాల్ బామ్, ఫైసల్ బామ్, అహ్మద్ బామ్, హుస్సేన్ బామ్, అబూద్ బామ్, దావూద్ బామ్, సులేమాన్ బామ్, ఫహద్ బామ్, తయ్యబ్ బామ్, ఒమర్ బామ్, జఫార్ బామ్, ఉస్మాన్ బామ్, ఇబ్రహీం బామ్, జక్రియా బామ్ తదితరులపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. 2010 నుంచి ఆదిబట్ల, బాలాపూర్, చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, పహాడీషరీఫ్ తదితర ఠాణాల్లో వివిధ సెక్షన్ల కింద వీటిలో ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ, సీఐడీల్లోనూ బామ్ కుటుంబీకులపై రెండు కేసులు ఉన్నాయి. వీరి వ్యవహారాలు ఉన్నతా«ధికారుల వరకు వెళ్లకుండా కింది స్థాయి వారిని మ్యానేజ్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే శాంతిభద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచ్, నిఘా విభాగాలకు చెందిన వాళ్లు కూడా ఇక్కడ ఏం జరుగుతోందో ఉన్నతాధికారులకు చెప్పకుండా తప్పుదారి పట్టిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. మేక చోరీకి యత్నించాడని దారుణం... కొన్నాళ్ల క్రితం అబుబకర్ కాలనీలో ఉన్న ఫైసల్ బామ్ ఫామ్ హౌస్‌లో దారుణం చోటు చేసుకుంది. మేకను చోరీ చేయడానికి వచ్చాడనే ఆరోపణలపై ఓ యువకుడిని పట్టుకున్న బామ్స్ నగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. ఆ సందర్భంగా వాళ్లల్లోనే ఒకరు తీసుకున్న వీడియో ఆలస్యంగా బయటకు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడిని నగ్నంగా మార్చి కొట్టడంతో పాటు చుట్టూ నిల్చున్న వ్యక్తులు తమ ఫోన్లలో వీడియోలు చిత్రీకరిస్తుడటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోతో పాటు బామ్ కుటుంబాల వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, రాచకొండలకు చెందిన అధికారులు దీనికోసం బుధవారం రంగంలోకి దిగినట్లు తెలిసింది. చట్టపరంగా పీడీ యాక్ట్ నమోదుకు ఆస్కారం ఉంటే ఆ దిశలో చర్యలు తీసుకోవాలని బార్కస్ వాసులు కోరుతున్నారు. బామ్స్కు భయపడి అనేక మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదని చెప్తున్నారు. పోలీసులు పక్షపాతంతో ఉన్నారు గత నెల 21న సలాలా పీలీ దర్గా సమీపంలోని జిమ్ వద్ద ఘర్షణ జరిగింది. మా సోదరులైన ముగ్గురిపై బామ్ ఫ్యామిలీకి చెందిన దాదాపు 25 మంది దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే మా వాళ్లు ఆత్మరక్షణ కోసం కత్తితో దాడి చేశారు. చాంద్రాయణగుట్ట ఠాణాలో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. మా వాళ్లను అరెస్టు చేసిన పోలీసులు రెండు కేసులు ఉన్నా బామ్ సంబంధీకుల జోలికి వెళ్లట్లేదు. మా సోదరులపై దాడి చేసిన వారిపై మేము ఇచ్చిన ఫిర్యాదుతో పాటు మరో దాన్నీ స్థానిక పోలీసులు పట్టించుకోవట్లేదు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి న్యాయం చేయాలి. – సయీద్ బాయిసా ఆమోదీ, బార్కస్ వాసి -
Hyderabad: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి!
సాక్షి, హైదరాబాద్: కడదాక తోడుంటానంటూ కట్టుకున్న భార్యనే వ్యభిచార కూపంలోకి దింపాడో ప్రబుద్ధుడు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన సాదిక్ (34) గతంలోనే వివాహం జరగగా..2019లో పహాడీషరీఫ్‌కు చెందిన మహిళ(25)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. పెళ్లైన నాటి నుంచే సాదిక్ రెండో భార్యను చంపుతానంటూ బెదిరించి బయటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయించడం మొదలెట్టాడు. ఇది నచ్చని ఆమె భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకుంది. తాజాగా ఈ నెల 2న ఆమె సరూర్‌నగర్ పరిధిలో స్నేహితులతో కలిసి రోడ్డుపై ఉండటాన్ని గమనించిన సాదిక్ కొట్టాడు. దీంతో ఆమె సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అంతటితో ఆగకుండా గురువారం పహాడీషరీఫ్‌లోని అత్తగారింట్లో భార్య లేని సమయంలో అత్తని బెదిరించి కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు బలవంతపు వ్యభిరారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. అతని చెర నుంచి క్షేమంగా బాలుడిని విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా సున్నితమైన కేసు కావడంతో వివరాలు మీడియాకు వెల్లడించలేమని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ కె.కిరణ్ కుమార్ తెలిపారు. చదవండి: పిల్లలు కావాలా?.. సక్సెస్ రేటు కోసం సంతాన సాఫల్య కేంద్రాల అడ్డదారులు -
చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా.. కారణం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌కు కొనసాగింపుగా నిర్మించిన ఎక్స్టెన్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది. మంగళవారం ఉదయం మంత్రి కేటీఆర్ ఫ్లోవర్ను ప్రారంభించాల్సి ఉండగా.. ఓపెనింగ్‌ను ఈనెల 27కు వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీజేపీ కార్యకర్తల ఆందోళన, పాతబస్తీలో ఉద్రిక్తత నేపథ్యంలో కేటీఆర్ పర్యటనను అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట జంక్షన్ వద్ద ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుంది. చాంద్రాయణగుట్ట జంక్షన్ నుంచి వివిధ మార్గాలవైపు వెళ్లేవారికి ఎంతో సదుపాయం కలగనుంది. జంక్షన్ వద్ద వేచిఉండే సమయం తగ్గడంతోపాటు ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గనున్నాయి. ఫ్లైఓవర్ కింద పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారింది. ఫిల్లర్ల నడుమ చక్కటి గార్డెనింగ్‌ను ఏర్పాటు చేశారు. పాత, కొత్త ఫ్లై ఓవర్ల అనుసంధానం కారణంగా పాత ఫ్లై ఓవర్‌ను సైతం మూసేయ్యడంతో ఇన్నాళ్ల పాటు ఇబ్బందులకు గురైన వాహహనదారులకు ఇక ఊరట లభించనుంది. ఇప్పటి వరకు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ దిగగానే సంతోష్‌నగర్ వైపు రోడ్డు ఇరుకుగా (ఒకవైపు దర్గా, మరోవైపు దేవాలయం, దర్గా) ఉండి వాహనాల వేగం తగ్గి ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించేది. దీనికి తోడు కందికల్ గేట్ నుంచి చాంద్రాయణగుట్ట పాత పోలీస్‌స్టేషన్ రహదారి సిగ్నల్ కూడా ఇక్కడే ఉండడంతో సమస్య మరింత జటిలమైంది. ఈ సమస్య పరిష్కారానికి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రతిపాదనతో ఎక్స్టెన్షన్ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. దీంతో మొత్తం ఫ్లై ఓవర్ 980 మీటర్లకు చేరుకుంది. చదవండి: Breaking: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ ఫ్లై ఓవర్ ఎక్స్టెన్షన్ పొడవు: 674 మీటర్లు వెడల్పు: 16.61 మీటర్లు లేన్లు: 4, ప్రయాణం: రెండు వైపులా పాతబస్తీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ పాతబస్తీ అభివృద్ధి కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్లైవర్ల నిర్మాణాలు చేపట్టారు. 2005– 2007మధ్య కాలంలో మలక్‌పేట, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్లను నిర్మించారు. వీటితో పాటు ఉప్పుగూడ, కందికల్ రైల్వేగేట్ల వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి 2007 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. ఇందులో ఒకటి ఆర్ఓబీ, మరొకటి ఆర్యూబీ. ఇవే కాకుండా పాతబస్తీలో ప్రస్తుతం బహదూర్‌పురా, ఫిసల్‌బండ ప్రాంతాల్లోనూ రెండు ఫ్లై ఓవర్లు ఇటీవలే వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఫలక్‌నుమా, డబిర్పురాలలో రైల్వే వంతెనలు కూడా ఉన్నాయి. వాహనదారుల కష్టాలు తప్పాయి.. చాంద్రాయణగుట్టలో వాహనదారుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఫ్లై ఓవర్ నిర్మాణ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారు. చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. – ఫహద్ బిన్ అబ్దాద్, ఉప్పుగూడ కార్పొరేటర్ ట్రాఫిక్ సమస్య దూరం.. టీఆర్ఎస్ సర్కార్ నగరంలో ట్రాఫిక్ సమస్యను దూరం చేసేలా వంతెనలను నిర్మిస్తుండడం సంతోషకరం. ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుండటంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాదు. ముఖ్యంగా కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనదారుల ఇబ్బందులు తొలగుతాయి. – శ్రీనివాస్ గౌడ్, కందికల్ గేట్ ఎస్సార్డీపీ ఫలాలు.. నగరంలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి చేపట్టిన 41 ఎస్సార్డీపీ పనుల్లో చాంద్రాయణగుట్ట ఎక్స్టెన్షన్ ఫ్లైవర్తో 30 పనులు పూర్తయ్యాయి. మిగతా 11 పనులు పురోగతిలో ఉన్నాయి. వీటిల్లో నాగోల్ ఫ్లై ఓవర్ మరో రెండునెలల్లో అందుబాటులోకి రానుంది. శిల్పా లేఔట్, కొండాపూర్ ఫ్లై ఓవర్లు సైతం ఈ సంవత్సరంలో పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులున్నారు. ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు ఇప్పటి వరకు ఏడు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఆరాంఘర్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ వరకు అతి పొడవైన ఫ్లైవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. -
వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే యువతి ఇలా!
సాక్షి, చాంద్రాయణగుట్ట: వారం రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ వివరాల ప్రకారం.. శంషీర్‌గంజ్‌లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన హన్మంత్‌చారి కుమార్తె సాహితి(27) వివాహాన్ని ఈసీఐఎల్‌కు చెందిన యువకుడితో ఈ నెల 14వ తేదీన వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే పెళ్లి పత్రికలు పంచేందుకు హన్మంత్‌చారి దంపతులు లింగంపల్లిలోని బంధువుల ఇంటికి మధ్యాహ్నం వెళ్లారు. సాయంత్రం వచ్చి చూడగా సాహితి ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా..? లేక మరే ఇతర కారణాలున్నాయా..? అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యం
సాక్షి, చాంద్రాయణగుట్ట: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హషమాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీవుద్దీన్, ముష్రత్ అన్సారీ(24) దంపతులు. వీరికి సైదా జైనా ఫాతిమా(5), సైదా జోహ ఫాతిమా (1.5) సంతానం. ఈ నెల 21వ తేదీన భర్త పని నిమిత్తం బయటికి వెళ్లాడు. చదవండి: నా భర్తతో ప్రాణహాని ఉంది.. రక్షించండి అనంతరం ముష్రత్ అన్సారీ సోదరి కౌసర్ అన్సారీ సమీవుద్దీన్కు ఫోన్ చేసి సోదరి ఫోన్ స్వీచాఫ్ వస్తుందని తెలిపింది. దీంతో అతడు ఇంటికి వెళ్లి చూడగా.. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కనిపించలేదు. పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి... -
వివాహేతర సంబంధాలు: 45 రోజులు.. 19 హత్యలు
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత వివాదాలు, ఆధిపత్య పోరు, పాత కక్షలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు... ఇలా కారణం ఏదైనా పర్యవసానం మాత్రం హత్యలే. నగరంలో ఇటీవల కాలంలో తరచూ మర్డర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడచిన 45 రోజుల కాలంలో 19 హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఉదంతంలో మాత్రం బెంగళూరులో చంపేసిన చిన్నారిని తల్లి, ప్రియుడు నగరానికి తీసుకువచ్చి వదిలేశారు. మరో ఉదంతం జూలైలో చోటు చేసుకోగా... శుక్రవారం హత్యగా తేలింది. హత్య కేసులకు సంబంధించి ఈ కాలంలో 27 మంది కటకటాల్లోకి చేరారు. వీరిలో దారుణాలకు ఒడిగట్టిన వాళ్లు, వారికి సహకరించిన వాళ్లూ ఉన్నారు. దారుణాలకు కారణాలనేకం.. ఈ హత్యలు కేవలం ప్రత్యర్థులు, శత్రువుల మధ్య మాత్రమే జరగట్లేదు. అనేక కారణాల నేపథ్యంలో సొంత వాళ్లే కత్తి గడుతున్నారు. ప్రధానంగా ప్రేమ వ్యవహారాలను పెద్దలు వద్దనటం, వివాహేతర సంబంధాలకు భర్తలు అడ్డుగా మారడంతో పాటు ఆస్తి వివాదాలు, ఆర్థిక అంశాలు ఈ దారుణాలకు కారణమవుతున్నాయి. ఇటీవలి హత్యల్లో కొన్ని.. ►రూ.2 వేల రుణానికి సంబంధించిన వివాదం ఫరీర్ వాడలో సోను హత్యకు కారణమైంది. సహజీవనం చేస్తున్న డ్యాన్సర్ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో క్యాబ్ డ్రైవర్ అఫ్సర్ ఆమెను అంతం చేశాడు. చుట్టుపక్కల వారితో తనపై భర్త మురళీధర్‌రెడ్డి చెడుగా చెబుతున్నాడంటూ కుమారుడు చెప్పడంతో భర్తతో వాగ్వాదానికి దిగిన మౌనిక అతడిని చంపేసింది. ►మద్యానికి అలవాటుపడిన ఖదీర్ ఆ మత్తు కోసం, మత్తులో మొత్తం ముగ్గురిని బండరాళ్లతో మోది హత్య చేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంగా మొయినాబాద్‌కు చెందిన జోయాబేగం భర్త ఆదిల్‌ను మరో నలుగురితో కలిసి చంపింది. ఇలాంటి కారణం నేపథ్యంలోనే భర్త ముస్కాన్ పటేల్‌ను భార్య ఫిర్దోష్ బేగం ప్రియుడితో కలిసి హత్య చేసింది. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తున్న ప్రియురాలు నాగచైతన్యను ప్రియుడు కోటి రెడ్డి బలి తీసుకున్నాడు. తన ప్రేమకు అడ్డు వస్తోందనే కారణంతో చింతల్‌మెట్‌కు చెందిన నందిని తన ప్రియుడు రాంకుమార్‌తో కలిసి తల్లి యాదమ్మను చంపింది. గొడ్డలితో నరికి.. చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జహనుమా ఫయీంబాగ్కు చెందిన రంజన్ అలీ కుమారుడు మహ్మద్ షోయబ్ అలియాస్ ఆరీఫ్ అలీ (32) సెల్ఫోన్లు విక్రయిస్తుంటాడు. శనివారం రాత్రి షోయబ్ ఇంటి ఎదుట ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో షోయబ్ తలపై నరికి పరారయ్యారు. ఆస్తి, కుటుంబ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు ఫలక్‌నుమా పోలీసులు అనుమానిస్తున్నారు. -
ప్లాట్ల పేరుతో మోసం.. రూ.5 కోట్లు వసూలు
సాక్షి, హైదరాబాద్: ప్లాట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ప్లాట్ రిజిస్ట్రేషన్ పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఘరానా మోసగాడు అబ్దుల్ రషీద్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ 15 మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి 5 కోట్లు వసూలు చేశాడు. ఆ డబ్బు తీసుకుని ప్లాట్స్ ఇప్పించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. చాంద్రాయగుట్ట పోలీసులు రషీద్ మీద కేసు నమోదు చేశారు. శనివారం అదుపులోకి తీసుకున్నారు. -
జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం చుట్టూ రాజకీయ రంగు
సాక్షి, చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం....అందుకు కారణమైన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన చుట్టూ రాజకీయ రంగు అలుముకుంది. వృద్ధుడిని పోలీసులు డబీర్‌పురాలో అరెస్టు చేసిన సమయంతో పాటు....పోలీస్‌స్టేషన్ నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో భారీ సంఖ్యలో మజ్లిస్ కార్యకర్తలు వెంబడిస్తూ అతనిపై దాడికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.....డబీర్‌పురాకు చెందిన సయ్యద్ సలీం (66) గతంలో ఎంబీటీ, కాంగ్రెస్ పార్టీలో పని చేశాడు. ఆయన తరచుగా మజ్లిస్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఇదిలా ఉండగా చాంద్రాయణగుట్ట గుల్షన్ ఇక్బాల్ కాలనీలో నివాసముండే యూ ట్యూబ్ న్యూస్ చానెల్ ఎడిటర్‌గా కొనసాగుతున్న సయ్యదా నహీదా ఖాద్రీ (39) అనే మహిళా జర్నలిస్టుపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయసాగాడు. ఈ విషయమై ఆమె గత నెల 25న సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. అయినప్పటికీ సలీం తీరు మార్చుకోకుండా ఈ నెల 12న ఫేస్బుక్ లైవ్‌లో ఆమె పట్ల ఇష్టానుసారంగా వ్యాఖ్యానించాడు. అప్పటికే 20 రోజుల నుంచి నిరాశ, నిస్పృహతో ఉన్న ఆమె ఈ ఘటనతో మరింతగా మనస్తాపానికి గురైంది. “నెల రోజులుగా మానసిక్ష క్షోభ అనుభవిస్తున్నానని...పెళ్లి కావాల్సిన ఆడ పిల్లలున్నారని....నాకు ఆత్మహత్యే శరణ్యమంటూ’ సెల్ఫీ వీడియో తీసి...అనంతరం నిద్ర మాత్రలు మింగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఆమె కుమార్తె సయ్యదా నబిహా ఖాద్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మజ్లిస్ హంగామాపై విమర్శలు.. సలీంను అరెస్టు చేసేందుకు డబీర్‌పురాకు వెళ్లిన పోలీసులను మజ్లిస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో అనుసరిస్తూ వెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకున్న వెంటనే తీవ్ర పదజాలంతో దూషిస్తూ...దాడికి యత్నించారు. అక్కడి నుంచి వచ్చాక ఆదివారం రాత్రి 9.30 గంటలకు కూడా చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ నుంచి జైలుకు తీసుకెళుతున్న సమయంలోనూ అదే విధంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం కూడా నాటకమంటూ....మజ్లిస్ పార్టీ పథకంలో భాగంగానే ఈ అరెస్టు కొనసాగిందని మజ్లిసేతర పార్టీలతో పాటు నెటిజెన్లు పేర్కొంటున్నారు. సదరు జర్నలిస్టు సేవా కార్యక్రమాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తుందని...మజ్లిస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందంటున్నారు. లాక్డౌన్ సమయంలో మజ్లిస్ నేతలు, కార్యకర్తలు భారీగా పోగైనా పోలీసులు పట్టించుకోరా..? అంటూ ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. చదవండి: కేసుల సత్వర విచారణ జరపాలి: హిమా కోహ్లి -
ప్రేమ వేధింపులు: అల్లుడిని హత్య చేసిన మామ
చాంద్రాయణగుట్ట: ప్రేమ పేరుతో కూతురును తప్పుదోవ పట్టించడమే కాకుండా....వేధింపులకు గురి చేయడాన్ని భరించలేని ఓ తండ్రి అల్లుడి గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం...ఫలక్‌నుమా అన్సారీ రోడ్డుకు చెందిన అబ్దుల్ షారూక్ (24) మైలార్‌దేవ్‌పల్లికి చెందిన అన్వర్ కుమార్తెను 2020 మే నెలలో ప్రేమ పేరుతో వేధించడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదయ్యింది. అప్పట్లో జైలుకెళ్లిన షారూక్ ఇటీవలే విడుదలయ్యాడు. తాజాగా రెండు నెలల క్రితం సదరు బాలికను తల్లిదండ్రులకు సమాచారం లేకుండా నిఖా చేసుకున్నాడు. ఇటీవలే అత్తగారింటికి ఫోన్ చేస్తూ....తన భార్యను పంపించాలంటూ షారూఖ్ తరచుగా ఫోన్ చేయసాగాడు. షారూఖ్‌కు గతంలోనే పెళ్లి జరగడంతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలుసుకున్న అన్వర్ అల్లుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం షారూక్‌కు ఫోన్ చేసి శాలిబండ వరకు వెళ్దామని పిలిపించాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో యాక్టివాపై అల్లుడు ద్విచక్ర వాహనం నడుపుతుండగా.....వెనుక కూర్చున్న మామ ఫలక్‌నుమా డిపో ఎదురుగా రాగానే తన వద్ద ఉన్న చాకుతో షారూఖ్ గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: 3 రోజులు.. 3 ఎయిర్‌పోర్టులు..285కోట్లు -
అమ్మాయిలను రప్పించి.. చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ
సాక్షి, చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో మజ్లిస్ పార్టీ నాయకులు రేవ్ పార్టీ నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బార్కాస్‌కు చెందిన మజ్లిస్ పార్టీ నాయకుడు పర్వేజ్‌కు గౌస్‌నగర్ ఉందాహిల్స్‌లో ఇంపీరియల్ ఫాం హౌజ్ ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన పర్వేజ్ తన స్నేహితులతో కలిసి ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను రప్పించి రేవ్ పార్టీ నిర్వహించాడు. వీరు విచ్చలవిడిగా నృత్యాలు చేస్తున్న వీడియో రెండు నెలల అనంతరం తాజాగా వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో వైరల్ కావడంతో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్, అదనపు ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మలు ఫాంహౌజ్‌ను పరిశీలించారు. ఈ వీడియోను ఆధారంగా చేసుకొని పర్వేజ్‌తో పాటు వీడియోలో ముఖాలు గుర్తు పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ తెలిపారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై టీడీపీ శ్రేణుల దాడి -
డాన్‌ను అంటూ బెదిరించినందుకే రౌడీషీటర్ హత్య
సాక్షి, చాంద్రాయణగుట్ట: డాన్‌ను అంటూ బెదిరించినందుకే రౌడీషీటర్ ఫర్రూ హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఆరుగురు నిందితులను రెయిన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాలు వెల్లడించారు. జవహర్‌నగర్ సైనిక్‌పురికి చెందిన మహ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రూ డాన్ (26) రియల్ ఎస్టేట్ చేసేవాడు. పలు నేరాలకు పాల్పడటంతో ఇతనిపై జవహర్‌నగర్ పోలీసులు రౌడీషీట్ తెరవడంతో పాటు 2015లో పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. కాగా అతడికి యాకుత్‌పురా చోటాపూల్కు చెందిన షేక్ సులేమాన్‌తో పరిచయం ఉంది. ఈ క్రమంలో వారు ఇబ్రహీంపట్నంలోని గాలేబ్ షా దర్గా వద్ద పేకాట, సట్టా ఆడేవారు. ఈ నెల 8,9 తేదీల్లో ఫర్రూ, సులేమాన్, ఆమూదీ, సర్వర్, అక్బర్, ఆమేర్ పేకాట ఆడారు. ఈ క్రమంలో సులేమాన్ రూ.50 వేలు గెలిచాడు. అయితే ఫర్రూ ఆ డబ్బులను లాక్కొని...తాను గ్యాంగ్స్టర్నని, లోకల్‌గా తనను డాన్ అంటారని బెదిరించడంతో పాటు దుర్భాషలాడాడు. దీనిని అవమానంగా భావించిన సులేమాన్ ఫర్రూను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాగా యాకుత్‌పురా చంద్రానగర్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ ఫెరోజ్ అలియాస్ ఫిట్టల్ ఫెరోజ్(24) బంధువు సాజిద్ అలియాస్ చాచాను 2020లో కొందరు వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనలో ఫర్రూ హస్తం ఉందని అనుమానించిన ఫెరోజ్ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో సులేమాన్, ఫెరోజ్‌తో పాటు తన సోదరులు షేక్ ఇసా, షేక్ అవేజ్, స్నేహితులు సయ్యద్ జమీన్, సయ్యద్ సాదిక్‌తో కలిసి ఈ నెల 9న రాత్రి షేక్ ఇసా ఫర్రూ వద్దకు వెళ్లి ఇబ్రహీం పట్నంలో పేకాట ఆడుదామంటూ స్విప్ట్ కారులో ఎక్కించుకొని బయల్దేరారు. మధ్యలో సులేమాన్ ఫోన్ చేసి తాను కూడా వస్తానని చెప్పడంతో అతడి మాటలు నిజమేనని నమ్మిన ఫర్రూ ఇసా కారులో రాత్రి 9.30 గంటల రెయిన్‌బజార్‌కు చేరుకున్నాడు. పథకంలో భాగంగా ఫర్రూ కారు దిగగానే షేక్ ఫెరోజ్ అతని కళ్లల్లో కారం చల్లాడు. అతడు రోడ్డుపై పడిపోగానే సులేమాన్, ఫెరోజ్ కత్తులతో దాడి చేసి హత్య చేశారు. టాస్క్‌ఫోర్స్, రెయిన్‌బజార్ పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ సయ్యద్ రఫిక్, నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి, రెయిన్‌బజార్, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు పి.ఆంజనేయులు, ఎస్.రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతీకారంతో మరో రౌడీషీటర్.. చాంద్రాయణగుట్ట: రౌడీషీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. డీసీపీ గజరావు భూపాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫలక్‌నుమా ముస్తఫానగర్‌కు చెందిన మహ్మద్ జాబెర్ (27) గత జూలై నెలలో కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మహ్మద్ షానూర్ ఘాజీ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తన సోదరుడిని హత్య చేసిన జాబెర్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని ఘాజీ సోదరుడు మహ్మద్ షానవాజ్ ఘాజీ నిర్ణయించుకున్నాడు. కాగా హత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న సమయంలో జాబెర్‌కు మహ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తితో గొడవ జరిగిందని....అతను కూడా జాబెర్‌పై కోపంతో ఉన్నట్లు షానవాజ్‌కు తెలిసింది. దీంతో షాన్వాజ్ అతడిని సంప్రదించి హత్యకు పథకం పన్నాడు. తన స్నేహితులైన షాహిన్నగర్కు చెందిన సైఫ్ అలీ ఖాన్, కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్ సమీర్, సయ్యద్ హాశం, మహ్మద్ జుబేర్, మరో ఇద్దరు మైనర్లతో కలిసి హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. హత్య అనంతరం బెయిల్, ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానని వారిని ఒప్పించాడు. పథకంలో భాగంగా ఈ నెల 12న అన్సారీ రోడ్డులో జాబెర్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. చదవండి: పాలవ్యాన్ ఢీకొని అన్నదమ్ముల దుర్మరణం -
15 కోట్ల చీటింగ్
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): పాతికేళ్లుగా చిట్టీల వ్యాపారం చేసే వ్యక్తి మోసం చేస్తారని ఎవరైనా ఊహించగలరా..? కానీ, ఓ కి‘లేడీ’నమ్మించి నట్టేట ముంచింది. చిట్టీలు ఎగ్గొట్టి చిక్క కుండా పోయింది. ఆ చిట్టీల విలువ ఎంతంటే.. అక్షరాలా రూ.15 కోట్లు. బాధితులు వందమంది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన బాబురావు, ఆయన భార్య అంజలి బండ్లగూడ పటేల్‌నగర్‌లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. 25 ఏళ్లుగా అంజలి చిట్టీల వ్యాపారం చేస్తోంది. ఎవరెవరిని మోసం చేసిందంటే.. ఆమె వద్ద పలువురు స్థానికులు, చిరుద్యోగులు, ఉద్యోగులు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు వివిధ మొత్తాలకు చిట్టీలు వేశారు. అంజలి తనకు తెలిసిన వారి వద్ద 1 శాతం వడ్డీకి డబ్బులు తీసుకొని ఇతరులకు ఎక్కువ శాతానికి కూడా ఇచ్చేవారు. నాలుగు రోజుల నుంచి అంజలి ఇంటికి తాళం వేసి ఉండటంతోపాటు ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉంది. ఈ విషయమై ఆ నోట ఈ నోట తెలియడంతో బాధితులు శుక్రవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అందరికీ కలిపి రూ.15 కోట్లకుపైగా చిట్టీల డబ్బులు చెల్లించాల్సి ఉందని ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్‌కు విన్నవించగా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. స్థానిక బస్తీల ప్రజలే కాకుండా సీఆర్పీఎఫ్ క్యాంపస్ ఉద్యోగులు కూడా ఈమె వద్ద చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది. వారంతా బయటికి వస్తే బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.10 కోట్లుతో పరారైన అంజలి కోసం గాలింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. అందినకాడికి దండుకుని పరారైన ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే చాంద్రాయణగుట్ట పటేల్ నగర్‌కు చెందిన అంజలి అనే మహిళ స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహించేది. 25 ఏళ్లుగా నమ్మకంగా ఉండటంతో స్థానికులు ఆమె వద్ద పెద్ద మొత్తంలో చిట్టీలు వేసేవారు. (చదవండి: మహిళపై యూట్యూబర్ అఘాయిత్యం.. ఆపై) సుమారు రూ.10 కోట్లు వరకూ చిట్టీల పేరుతో వసూలు చేసి.. ఆ డబ్బుతో రాత్రికి రాత్రే అంజలి బిచాణా ఎత్తేయడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. రెండు వందల మంది బాధితులు చిట్టీలు కట్టి మోసపోయినట్లు తెలుస్తోంది. చాంద్రాయణగుట్ట పోలీసులు ఈ కేసును హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. కాగా చిట్టీల నిర్వహకురాలు అంజలి స్వస్థలం గుంటూరుగా తెలుస్తోంది. పరారైన అంజలి దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: కఠారివారిపాలెంలో ఉద్రిక్తత..) -
ఎంతటి గుండెకైనా గుబులు పుట్టించే దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో నగరంలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ అలుగులు పోస్తున్నాయి. మూసీ ఉగ్రరూపం దాల్చింది. వీధుల్లో వరద నీరు కంటపడ్డ వస్తువులను తనలో కలిపేసుకుని బీభత్సం సృష్టించింది. ఈక్రమంలోనే చాంద్రాయణగుట్టలోని బాబానగర్‌లో శనివారం రాత్రి వెలుగుచూసిన దృశ్యాలు హార్రర్ సినిమాను తలపిస్తున్నాయి. ఒకవైపు కుండపోత వర్షం, మరోవైపు కరెంటు లేకపోవడంతో బాబానగర్ వాసులు బిక్కుబిక్కుమంటూ.. ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్న సమయంలో.. తెల్లవారుజాము మూడు గంటలకు ఒక్కసారిగా ఆ ప్రాంతంలోకి వరద చొచ్చుకువచ్చింది. గుర్రం చెరువు కట్ట తెగిపోవడంతో బాబానగర్‌లోని చాలా ఇళ్లల్లో చూస్తుండగానే 10 అడుగుల మేర నీరు చేరింది. అన్ని దిక్కుల నుంచి వరద చేరి ఇళ్లల్లోని వస్తువులన్నీ సుడులు తిరిగాయి. మరింత లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లో మొదటి అంతస్థు వరకు నీరు చేరింది. అయితే, గుర్రం చెరువు కట్ట తెగిందనే సమాచారంతో స్థానికులు అప్రమత్తం కావడంతో.. మృత్యువులా దూసుకొచ్చిన వరదల నుంచి అందరూ తప్పించుకున్నారు. ఎంతటి గుండె ధైర్యానికైనా గుబులు పుట్టించే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. -
నీటిలో కలిసిన ప్రాణాలు.. కుటుంబాల్లో విషాదం
చాంద్రాయణగుట్ట: ఓ వెంచర్ నిర్వాహకుడి నిర్లక్ష్యమే చాంద్రాయణగుట్టలో ఎనిమిది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ తెలిపిన మేరకు.. బండ్లగూడ గౌస్‌నగర్‌లో మహ్మద్ హిల్స్ వెంచర్ పేరుతో మహ్మద్ పహిల్వాన్ కుటుంబ సభ్యులు వెంచర్‌ను చేస్తున్నారు. ఎత్తైన ప్రదేశంలో గుట్టపై ఉన్న ఈ వెంచర్‌కు ఇటీవలే భారీగా ప్రహారీ నిర్మించారు. కాగా ఈ ప్రహారీని ఎలాంటి పునాది లేకుండా బండరాళ్ల పైనే సిమెంట్ వేసి గ్రానైట్‌తో పైకి లేపారు. అనంతరం మట్టితో చదును చేశారు. అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షానికి మట్టి కూరుకుపోవడంతో పాటు పునాది లేకపోవడంతో ప్రహారీ కూడా పట్టుతప్పి మంగళవారం రాత్రి ఒక్కసారిగా సగం మేర కూలి దిగువన ఉన్న రేకుల ఇళ్లపై పడింది. ఐదారు ఇళ్లపై గ్రానైట్లు పడినప్పటికీ....కేవలం రెండిళ్లపై ప్రభావం ఎక్కువగా చూపి అందులో ఉన్న ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి. ఒకే ఇంట్లో ఐదుగురి మృతి.. గౌస్‌నగర్‌కు చెందిన మహ్మద్ జహంగీర్ తన ఇద్దరు కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, పిల్లలతో సంతోషంగా మంగళవారం రాత్రి నిద్రించాడు. నిద్రించిన కాసేపటికే భారీ శబ్దాలు రావడంతో చిన్న కుమారుడు మహ్మద్ నవాజ్ అఖ్నీ వెంటనే బయటికి పరుగులు తీశాడు. ఇంట్లో ఉన్న జహంగీర్ కుమారుడు పెద్ద కుమారుడు సమద్ రబ్బానీ (35), కోడలు సబా హాష్మీ(26), రెండో కుమార్తె ఫౌజియా నాజ్ (36), ఆమె కుమారులు సయ్యద్ జైన్((3), జొయేద్ (19 రోజులు)లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో కుమార్తె సబియా అనాజ్ (31) తీవ్రంగా గాయపడింది. ఇలా ఒకే ఇంట్లో మొత్తం ఐదు మంది మృతి చెందారు. తల్లి, సంతానాన్ని కోల్పోయిన సిద్దిఖీ జహంగీర్ ఇంటిని ఆనుకునే సిద్దిఖీ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటిపై కూడా ఇదే మాదిరిగా గోడ కూలడంతో సిద్దిఖీ తల్లి జాకీ రా బేగం (50), కుమారుడు సయ్యద్ సాదిక్ (1), కుమార్తె సయ్యదా అన్వారీ (3)మృతి చెందారు. గౌస్‌నగర్‌లో విషాధచాయలు గౌస్‌నగర్‌లో పక్కపక్కింట్లోనే నివాసం ఉండే ఎనిమిది మంది మృత్యువాత పడడంతో స్థానికంగా తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. రాత్రి వర్షం కారణంగా రాలేకపోయిన బంధుమిత్రులు బుధవారం ఉదయమే పెద్ద ఎత్తున ఇళ్లకు చేరుకున్నారు. అనంతరం మృతదేహాలు రాకపోవడంతో పోస్టుమార్టం చేస్తున్న ఉస్మానియా ఆసుపత్రికి బయల్దేరారు. నీటిలో కలిసిన ప్రాణాలు భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. జలం మధ్యలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జనం విలవిల్లాడారు. వరద నీటి సమస్యనుంచి బయటపడే ప్రయత్నంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. విద్యుదాఘాతంతో కార్పెంటర్ మృతి నాగోలు: కాసోజు నారాయణ చారి (35) ఎల్బీనగర్ బైరామల్‌గూడ కేకే గార్డెన్ సాగర్ ఎన్క్లేవ్ కాలనీలో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం కురిసిన భారీ వర్షంతో సాగర్ ఎన్క్లేవ్ కాలనీలో వరద నీరు వచ్చింది. ఇంట్లో స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయగా షార్ట్ సర్క్యూట్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. సెల్లార్ నీటిలో మునిగి చిన్నారి.. చంపాపేట: రమావత్ జితేంద్ర, లక్ష్మి దంపతులు సరూర్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలోని సాహితీ నెస్ట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వీరికి అర్జిత్సాయి (3) అనే కుమారుడున్నాడు. భారీవర్షానికి అపార్ట్మెంట్ సెల్లార్లో వరదనీరు చేరింది. బుధవారం ఉదయం ఆడుకుంటూ సెల్లార్లోకి వెళ్ళిన అర్జిత్సాయి నీటిలోకి ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అర్జిత్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వరదలో కొట్టుకుపోయి మహిళ పహాడీషరీఫ్: మణికొండ ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు భార్య వరలక్ష్మి (32) గోషామహాల్లో జలమండలి కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తుంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో సోదరుడు జోగు శంకర్ వెంట బైక్‌పై ఆదిబట్ల నుంచి శంషాబాద్ వైపు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో వెళుతున్నారు. ఫ్యాబ్‌సిటీ సరస్సు నిండటంతో నీటి ప్రవాహంలో అదుపుతప్పారు. శంకర్ బయటికి వచ్చినా వరలక్ష్మి రాలేకపోయింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం రాత్రి 7 గంటలకు మృతదేహం లభించిందని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సెల్లార్లో నీటిని తోడుతూ.. అంబర్‌పే: బాగ్ అంబర్‌పేట వినాయక్‌నగర్‌లో మహాలక్ష్మి అపార్టుమెంట్ సెల్లార్లో నీరు చేరడంతో చంద్రమౌళి కుమారుడు రాజ్‌కుమార్(33) మోటార్ బుధవారం మోటార్ బిగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని అంబర్‌పేట పోలీసులు తెలిపారు. సెల్లార్లో షాక్.. ప్రైవేట్ ఉద్యోగి మృతి అమీర్‌పేట: గంటా శ్రీనివాస్ (47) ధరం కరం రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఐసీఐసీఐ బ్యాంకు వెనకాల సెల్లార్లో ఉన్న గోల్డెన్ కేఫ్ బార్ ఆండ్ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో వరదనీరు రెస్టారెంట్లోకి వచ్చిన సమయంలో క్యాషియర్ శ్రీనివాస్‌తో పాటు, మేనేజర్ సుబ్బారెడ్డి, మరో బాయ్‌లో లోపలే ఉన్నారు. కరెంటు పోవడంతో జనరేటర్ ఆన్‌చేశారు. తరువాత కరెంటు రావడంతో నీటిలో విద్యుత్ ప్రవహించింది. వరద నీటిలో ఉన్న షాక్ తగిలి పడిపోయాడు. అక్కడే ఉన్న మేనేజర్, బాయ్ పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్‌వైర్లు బయటకు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిని పంపింగ్ చేస్తూ వైద్యుడు.. బంజారాహిల్స్: డాక్టర్ చల్లా సతీష్‌కుమార్ రెడ్డి (49) యోగా, ఫిజియోథెరపి, నేచురోపతి స్పెషలిస్ట్‌గా శ్రీనగర్‌కాలనీలోని ఎస్బీహెచ్ కాలనీలో సేవలందిస్తున్నాడు. సతీష్‌కుమార్‌రెడ్డి ఇంటి సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. బుధవారం ఉదయం నీటిని బయటికి పంపింగ్ చేసేందుకు ఆయన మెట్లు దిగి మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. భయంతో గుండెపోటు..వృద్ధురాలి మృతి బడంగ్పేట్: బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని సాయిబాలాజీ టౌన్షిప్ కాలనీమొత్తం ముంపునకు గురైంది. మంగళవారం రాత్రి ఇంటిలోకి వరదనీరు రావడంతో భయాందోళనకు గురైన రామసహాయం రత్నమాల(65), గుండెపోటుతో చనిపోయింది. అర్ధరాత్రి కాలనీ మొత్తం జలమయం కావడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో రాత్రి మొత్తం ఇతర కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటు గడిపారు. -
చాంద్రాయణగుట్టలో ట్రిపుల్ మర్డర్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. చాంద్రాయణగుట్ట బార్కస్‌లో నలుగురుపై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే... కుటుంబ కలహాలతో అహ్మద్ బా ఇస్మాయిల్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సొంత అక్కచెల్లెళ్లనే దారుణంగా నరికి చంపాడు. ఇస్మాయిల్ గత ఏడాది భార్యను హత్య కేసులో అరెస్ట్ కాగా, ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. (నకిలీ పత్రాలతో బెయిల్ పొందిన శ్యామ్) అప్పటి నుంచి కుటుంబసభ్యుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇవాళ సాయంత్రం ఇస్మాయిల్ ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు, సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఇస్మాయిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ అనే కానిస్టేబుల్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. బైక్‌పై రాంగ్ రూట్లో వచ్చిన ఇద్దరు దుండగులు కర్రలతో కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటను స్థలానికి చేరుకొని కానిస్టేబుల్‌ను హుటాహుటిన డిఆర్డీఏ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ఫలక్‌నుమా ఏసీపీ మజీద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరు..? ఎందుకు దాడిచేశారు..? రాంగ్ రూట్లో వెళ్తున్నారని ప్రశ్నించినందుకు దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. -
పాతబస్తీలో కిడ్నాప్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ముగ్గురు చిన్నారులను రక్షించారు. పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల కిందట చీరల వ్యాపారి ఫజల్ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు మహిళలను పోలీసులు అదులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ముగ్గురు చిన్నారులకు విముక్తి కల్పించారు. ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేసి.. పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నారు. ఇందుకోసం రూ. 10వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నారు. అయితే నిందుతులు ఇంకా ఎవరైనా చిన్నారులను కిడ్నాప్ చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
మొన్న బెల్లి డ్యాన్స్.. నిన్న తల్వార్ డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చాంద్రాయణగుట్ట రౌడీ రాజ్యంగా మారుతోంది. ఈ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు పెళ్లి వేడుకల్లో తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో బెల్లి డ్యాన్స్ పేరిట అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది మరవక ముందే మరో వివాహా వేడుకలో కొందరు తల్వార్ డాన్స్ పేరిట సామాన్య జనాలను బెదిరిపోయేలా చేశారు. చాంద్రాయణగుట్టలోని బండ్లగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫంక్షన్ హాల్ వెలుపల మెయిన్ రోడ్‌పై మూడు గంటలపాటు తల్వార్ డ్యాన్స్‌లు చేశారు. ఇది చూసిన సామాన్య ప్రజలు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇది జరిగి 48 గంటలు గడిచిన ఇప్పటివరకు దీనికి కారణమైన వారిపై పోలీసు శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ ప్రాంతంలో ఇలాంటి కార్యకలపాలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి : చాంద్రాయణగుట్టలో బెల్లి డ్యాన్స్ -
సీసీటీవిలో రికార్డయిన హిజ్రాలపై దాడి దృశ్యాలు
-
చంద్రయాన్‌గుట్టలో హిజ్రాలపై రాళ్ల దాడి;ఒకరు మృతి
-
మైనర్... మృగం!
♦ పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడి ♦ విషయం బయటపడకుండా హత్య ♦ దారుణానికి ఒడిగట్టిన 17 ఏళ్ల మైనర్ హైదరాబాద్: పదేళ్ల బాలుడిపై 17 ఏళ్ల మైనర్ అసహజ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. విషయం బయటపడకూ డదని ఆ పసి మొగ్గను చిదిమేశాడు. మిస్సింగ్‌గా నమోదైన ఈ కేసును దర్యాప్తు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులకు సీసీ కెమెరాల్లో చిన్న ఆధారం దొరికింది. నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. హత్య వెలుగులోకి వచ్చింది. తినుబండారాలు ఎరగా చూపి.. బార్కాస్ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ జమీల్ ఖాన్ కుమారుడు మహ్మద్ ఖాన్(10) స్థానిక లయోలా పాఠ శాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. రంజాన్ నేపథ్యంలో బార్కాస్ బజార్లో ఏర్పాటైన మేళా దగ్గర జూన్ 28న ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు. అక్కడి నుంచి ఖాన్ అదృశ్యం కావడంతో కుటుంబీకులు మరుసటి రోజు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బడీ మసీదు వద్ద ఆడుకుంటున్న ఖాన్‌కు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపిన మైనర్.. అతడిని బార్కాస్ ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పాఠశాల గ్రిల్స్ తొలిగించి భవనంపైకి చేరుకుని, అక్కడే చిన్నారిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తండ్రికి చెపుతా అనటంతో హత్య.. బాలుడు తనకు నొప్పిగా ఉందని, విషయం తండ్రికి చెపుతా ననటంతో మైనర్ తీవ్రంగా భయపడ్డాడు. జూలై 2న తన సోదరి వివాహం ఉండటంతో విషయం బయటకు వస్తే పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉందని భావించాడు. అఘాయిత్యం వెలుగులోకి రాకూడదంటే బాలుడిని హత్య చేయడమే మార్గ మని భావించాడు. అక్కడే ఉన్న రాడ్లు, కర్రలతో బాలు డిపై కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని మా యం చేసే ఉద్దేశంతో కాళ్లు, చేతులు కట్టేశాడు. మృతదేహాన్ని మరో చోటికి మార్చడానికి రెండుసార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. ఉదంతం జరిగింది మూడో అంతస్తుపైన కావడం, పాడు బడినట్లు ఉండే అక్కడికి ఎవరూ వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. సీసీ కెమెరాల్లో దొరికిన ఆధారం.. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్కాస్, చాంద్రాయణ గుట్ట పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బడీ మసీ దు ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్ సాంకేతిక సమస్యతో ఓపెన్ కాలేదు. బుధవారం ఆ ఫీడ్ ఓపెన్ కావడంతో పరిశీ లించారు. 28న మధ్యాహ్నం 1.28 గంటలకు ఖాన్‌ను ఓ యువ కుడు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. బాలుడి తండ్రి ఆ యువ కుడు తన ఇంటి పక్కనే ఉండే మైనర్‌గా గుర్తించారు. ఎనిమిదో తరగతి వరకే చదివిన అతడు ప్రస్తుతం పాన్‌షాప్‌లో పనిచే స్తున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని సీసీ కెమెరా ఫుటేజ్ చూపించడంతో నేరం అంగీకరించాడు. గురువారం ఉదయం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గతంలోనూ ఇదే తరహా ఘాతుకాలు.. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఇప్పటి వరకు 15 మందిపై ఇదే తరహాలో లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. వారందరి నుంచి వాంగ్మూలాలు తీసుకుని మరికొన్ని కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. 20 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తుండటంతో ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసేందుకు బానిసలవుతు న్నారని, దీంతో మైనర్లు కూడా విచక్షణ కోల్పోయి ఘాతుకాలకు పాల్పడుతు న్నారని సౌత్‌జోన్ డీసీపీ వి.సత్యనారాయణ చెప్పారు. తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. -
కార్డన్ సెర్చ్: 50 బైక్‌లు స్వాధీనం