Christmas 2024
-
ఆ దేవుడు మా కోరిక నెరవేర్చాడు.. అందుకే ఈ పేరు పెడుతున్నాం (ఫోటోలు)
-
క్రిస్మస్ వేడుకల్లో ఫ్యాషన్ ఐకాన్ 'నటాషా' ఫ్యామిలీ (ఫోటోలు)
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సచిన్ టెండుల్కర్, యువీ.. కూతురి కోసం ధోని అలా!(ఫొటోలు)
-
సీక్రెట్ సాంటాతో టాప్ హీరోయిన్ బెస్ట్ క్రిస్మస్.. (ఫోటోలు)
-
గోత్ థీమ్‌తో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్న శ్రుతీ హాసన్
స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసన్ క్రిస్మస్(Christmas) సీజన్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటానికి సిద్ధమైంది. ఈ సెలబ్రేషన్స్ ద్వారా కొత్త సంవత్సరాదిని సరికొత్త ఉత్సుకతలో ప్రారంభించటానికి ఆమె అడుగులు వేస్తున్నారు. క్రిస్మస్ పండుగను శ్రుతీ హాసన్ తనదైన శైలిలో జరుపుకోవటానికి సెలబ్రేషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా గోత్ థీమ్‌తో క్రిస్మస్ను సెలబ్రేట్ చేయటానికి తన స్టైల్‌ను జోడించింది.శ్రుతీ హాసన్(Shruti Haasan), తనదైన స్టైల్లో యూనిక్‌గా నిర్వహిస్తోన్న క్రిస్మస్ పండుగ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రత్యేకమైన శైలిలో హాలీడే సీజన్‌కు స్వాగతం పలుకుతూ ఆమె అభిమానులు సహా అందిరలోనూ ఆనందాన్ని నింపింది.ఇక సినిమాల విషయానికి వస్తే 2023 శ్రుతీ హాసన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ ఏడాదిగా చెప్పొచ్చు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, సలార్ పార్ట్ 1 చిత్రాలు విడుదలై ఘన విజయాలను సాధించాయి.కానీ ఈ ఏడాది మాత్రం ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే అభిమానులు మాత్రం 2025లో సరికొత్త చిత్రాల్లో ఆమెను చూడొచ్చు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా మూవీ కూలీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సలార్ 2 చిత్రం కూడా వచ్చే ఏడాదిలో సందడి చేయనుందని సమాచారం.ఇవి కాకుండా మరిన్న క్రేజీ చిత్రాల్లో శ్రుతీ హాసన్ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె తన అద్భుతమైన నటనతో అభిమానులు సహా ప్రేక్షకులను మెప్పించనున్నారు. -
Christmas 2024: సెలబ్రిటీలు, క్రిస్మస్ ట్రీ , ఇంటి ముస్తాబు
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్.. టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2024) పండగని ప్రతిఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు కూడా రాత్రి నుంచే సెలబ్రేషన్స్ షురూ చేశారు. క్రిస్మస్ టోపీలు పెట్టుకుని, కేకులు కట్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లలో నమ్రత, నివేదా థామస్, కృతిశెట్టి (Krithi Shetty), కావ్య కల్యాణ్ రామ్, ప్రగ్యా జైస్వాల్, ఈషా రెబ్బా, మౌనీ రాయ్, రమ్య పాండియన్, ఆకాంక్ష సింగ్, మంచు విష్ణు (Manchu Vishnu) ఉన్నారు. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by POOJA BEDI (@poojabediofficial) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Rithu Manthra (@rithumanthra_) View this post on Instagram A post shared by Samyuktha Shan (@samyuktha_shan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Nussrat Jahan (@nusratchirps) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) -
మనం సెలవులు తీసుకోవడానికి కుదరదా చంద్ర!?
-
కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్ హీరోహీరోయిన్స్ (ఫొటోలు)
-
Christmas 2024: బిపాసా సెలబ్రేషన్స్,‘బుజ్జెమ్మ’ ఎంత బావుందో!
-
Christmas 2024 : బెస్ట్ నెయిల్ ఆర్ట్ డిజైన్స్..ఇదిగో ఇలా!
యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ భక్తులు క్రీస్తు పుట్టుకను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు అని విశ్వసిస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్ర సపరివారంగా సంబరాలు చేసుకుంటారు. పవిత్ర ఏసును కీర్తిస్తూ చర్చ్‌లలో ప్రార్థనలు చేస్తారు. క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ వచ్చిందంటే ఆ సంబరమే వేరు. విద్యుద్దీప కాంతులతో గృహాలను అలంకరించు కుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు, రకరకాల పిండివంటలతో ఉత్సాహంగా గడుపుతారు. గృహిణులు, కన్నెపిల్లలు అందంగా ముస్తాబవుతారు. మరి పవిత్ర క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ నెయిల్ పెయింట్ క్రియేటివ్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దేమా. మాసిమో (@రెయిన్‌మేకర్1973) ట్విటర్ ఖాతా షేర్ చేసిన వీడియో మీకోసం..Christmas nail art🎄 [📹 the_nail_mannn]pic.twitter.com/9ieWpRXlnn— Massimo (@Rainmaker1973) December 25, 2024 -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు (ఫొటోలు)
-
Christmas 2024 లోక రక్షకుడు
మానవాళి ముక్తికొరకు మనుజావతారుడైన దైవం...జగతిలో భీతి బాపేందుకు దిగివచ్చిన దైవ తనయుడు...సర్వలోకానికి శాంతి సందేశం..దివిలోనూ భువిలోనూ వేడుక...పరలోక దూతావళి పరవశించి పాడిన వేళప్రతి హృదిలో క్రిస్మస్ ఆనందం...జగతిలో పాపం నిండినప్పుడు ప్రేమతో కలిసి జీవించాల్సిన ధరణి వాసుల హృదయాలు అసూయ, ద్వేషంతో రగులుతున్నప్పుడు చీకటి జలధిలో మునిగిన వారికి, శృంఖలాల్లో మగ్గేవారికి మరణ ఛాయలో బతికే వారికి ఒక ఆశాకిరణంగా... అరుణోదయ కాంతిగా... విమోచకుడిగా... జగద్రక్షకుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభువు ఈ భువిపైకి అరుదెంచాడు. అదొక సుమనోహర ఘట్టం.. సర్వలోకాన్ని సంభ్రమాశ్చర్యాలతో విశేషంగా ఆకట్టుకున్న మధుర కావ్యం. తమను రక్షించే మెస్సయ్య కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న విశ్వాసుల్లో నింపిన అంతులేని ఆనందం వెరసి స్తోత్ర గీతంగా స్తుతి గానంగా మారిన వైనం.. అందుకు యూదా దేశంలోని బెత్లెహేము వేదిక అయింది.ఆ సమయంలో రాజైన హేరోదు యెరూషలేము రాజధానిగా రాజ్యమేలుతున్నాడు. యూదా ప్రజలంతా తమను విమోచించే మెస్సయ్యా కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఆ భాగ్యం కన్య అయిన మరియకు లభించింది. అప్పటికే గలిలయలోని నజరేతులో దావీదు వంశస్తుడైన యోసేపునకు మరియ ప్రదానం చేయబడింది. పరమ దేవుని ఆజ్ఞ మేరకు ప్రభువు దూత గబ్రియేలు ద్వారా ఈ శుభ వర్తమానం అందింది. ‘దయా ప్రాంప్తురాలా!’... అంటూ గబ్రియేలు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడే యవ్వన్రపాయంలో అడుగుపెడుతున్న మరియ ఎంతో భయపడింది.ఎందుకంటే ఆ కాలంలో దేవుడు కాని ఆయన దూతల దర్శనం అరుదుగా మారింది. ప్రవక్తలకు ప్రవచనాలు నిలిచి పొయాయి. నిశ్శబ్దకాలంగా చెప్పబడింది. అటువంటి తరుణంలో దేవుని దూత మరియ వద్దకు వచ్చి ‘భయపడకుము నీవు ధన్యురాలవు, దేవుని వలన నీవు కృప ΄పొందావు. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆయన సర్వోన్నతుని కుమారుడనబడతాడు. అతని రాజ్యము అంతము లేనిదై వుంటుందని’ పేర్కొన్నాడు. దూత మాటలు మరింత విస్మయానికి భయానికి గురిచేశాయి. ఇది దేవాది దేవుని నుంచి వచ్చిన పిలుపుగా మరియ తెలుసుకుంది. ‘అయ్యో నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఏలాగు సాధ్యం?’ అని అడిగింది.‘మరియా! భయపడకు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడని దేవదూత చెప్పిన మాటలను బట్టి ఇది దైవకార్యంగా గ్రహించి ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి దేవాది దేవుని తన గర్భంలో మోయడానికి సిద్ధపడింది. వాస్తవానికి వివాహం కాకుండా ఆ రోజుల్లో యూదా స్త్రీ గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపే ఆచారం ఉండేది. దేవుని దయ΄పొంది అంతులేని విశ్వాసంతో దేవుని ఆజ్ఞను శిరసావహించడానికి ముందుకు వచ్చింది కాబట్టే మరియ స్త్రీలందరి లో ధన్యురాలిగా కొనియాడబడింది.అయితే మరియ గర్భవతియైన సంగతి తెలుసుకున్న యోసేపు కలత చెందాడు. నీతిమంతుడు కాబట్టి ఆమెను నలుగురిలో నగుబాటు చేయకుండా రహస్యంగా విడనాడాలని నిశ్చయించుకున్నాడు. ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై మరియ గర్భము ధరించింది ఏ పురుషుని వలన కాదని పరిశుద్ధాత్మ వలన జరిగినదని మరియను చేర్చుకొనడానికి ఏమాత్రమూ సందేహపడవద్దని పుట్టబోవు శిశువునకు యేసు అని పేరు పెట్టాలని తన ప్రజలందరి పాపములనుండి ఆయనే రక్షిస్తాడని తెలుపడంతో యోసేపులో ఆవేదన తొలగిపొయింది. అంతేకాదు మరియ యేసుకు జన్మనిచ్చేవరకూ ఆమెను ముట్టకుండా జాగ్రత్త పడ్డాడు.ఇదే సమయంలో ఆరు నెలలకు ముందు మరొక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మరియ సమీప బంధువు రాలైన ఎలీసబెతు ఆమె భర్త జెకర్యా కురు వృద్ధులు. ఆ వయస్సులో దేవుడు వారికి సంతాన ప్రాంప్తి అనుగ్రహించాడు. దేవుని హస్తం వారికి తోడుగా వుండి ఒక మగ శిశువును దయచేసాడు. ఆ శిశువే తర్వాతి కాలంలో బాప్తీస్మం ఇచ్చు యోహానుగా పిలువబడి యేసు ప్రభు పరిచర్యకు ముందు ఆయన మార్గం సరళం చేసే సాధనమయ్యాడు.లేఖన ప్రవచనాలు నెరవేర్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు జననం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినా ఆయన ఆదిసంభూతుడు. ఆల్ఫా ఒమేగా ఆయనే. ఆదియు అంతమునై యున్నాడు. మొదటివాడు కడపటి వాడుగా ఉన్నవాడు. జగత్ పునాది వేయకముందే వున్న యేసు కాలం సంపూర్ణమైనప్పుడు సాతాను చెరలో చిక్కుకున్న మానవుడు పాపానికి బందీగా మారి దేవుని సన్నిధికి దూరంగా వెళుతున్న తరుణంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పతనమై ఏ నిరీక్షణ లేని సమయంలో నిత్య జీవమిచ్చి తిరిగి దేవునితో ఐక్యపర్చేందుకు భూమి మీద దేవుని కుమారుడిగా క్రీస్తు అవతరించాడు.యేసు పుట్టుకను క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మీకా, యెషయా ప్రవక్తలు ప్రవచించడం విశేషం. ‘బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏల బోవువాడు నీలో నుండి వచ్చును’ అని మీకా ప్రవచించగా ‘ఆలకించుడి కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును’ అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థం.యేసు పుట్టుక ఆవశ్యకత గూర్చి యెషయా వివరించాడు. ‘ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయం కలవారిని దృఢ పరచుటకు చెరలో నున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు’ అని యెషయా ప్రవక్త చెప్పిన లేఖనాలు తన రాక ద్వారా నిజమయ్యాయని యేసుప్రభు తనపరిచర్యలో చెప్పడం విశేషం.ప్రజా సంఖ్యలో రాయబడటానికి యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. రెండింటి మధ్య 90 మైళ్ళ దూరం. రెండు వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ప్రయాణ సాధనాలు లేనిరోజుల్లో నిండు చూలాలైన మరియను వెంటబెట్టుకొని బహు ప్రయాస కోర్చి చలికాలంలో బెత్లెహేము చేరుకున్నారు దంపతులు. జన సంఖ్య కోసం ఆ గ్రామం అప్పటికే క్రిక్కిరిసి పొయి ఉండటంతో ఎక్కడా స్థలం లేక ఓ పశువుల కొట్టమే వారికి అశ్రయమైంది. అర్థరాత్రి వేళలో క్రీస్తు జన్మించడంతో పశువుల తొట్టె క్రీస్తు పాన్పుగా మారిపొయింది. పరలోకాన్ని విడచివచ్చి పశువుల కొట్టంలో బాల యేసు పరుండాల్సి వచ్చింది. అతి సామాన్య కుటుంబంలో అతి సామాన్యంగా యేసు జన్మించాడు.యేసు పుట్టుక శుభవార్త మొదట తెలిసింది సామాన్యులకే. ఊరి వెలుపల ΄÷లంలో గొఱె<లను కాచుకుంటున్న పశు కాపరుల వద్దకు ప్రభువు దూత వచ్చి వారి మధ్య నిలచినప్పుడు ప్రభువు మహిమ వారిచుట్టూ ప్రకాశించగా వారెంతో భయపడ్డారు. అందుకు దూత ‘భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తీసుకు వచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అంటూ శిశువు ఆనవాలు తెలియజేయడం జరిగింది. అప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూతల సమూహం ‘సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక’ అంటూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. యేసు పుట్టుక కేవలం యూదా ప్రాంంతానికే పరిమితం కాలేదు. యేసుక్రీస్తు జన్మవిశేషం తెలియజేస్తూ ఆకాశంలో ఓ వింత తార వెలిసింది. దాన్ని చూసిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రోజును వెతుక్కుంటూ యెరూషలేము చేరుకున్నారు. తుదకు బెత్లెహేము లో పుట్టాడని తెలుసుకొని శిశువును పూజించి తాము తెచ్చిన బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలను సమర్పించి అత్యానందభరితులై తిరిగి వెళ్లారు. ఈ విధంగా యేసు పుట్టుక ఒక విశ్వ వేడుకగా మారింది.రక్షణ తెచ్చిన క్రిస్మస్ యేసు పుట్టుక సర్వమానవాళికి రక్షణ అందించిది. యేసు పుట్టుక పరమార్థమే అది. పాప పంకిలమైన మానవ జాతిని రక్షించడానికే యేసు జన్మించాడు. దేవుని ఆజ్ఞ మీరడం ద్వారా దేవుడు సృజించిన తొలి మానవుడు ఆదాము, అతని భార్య హవ్వ ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని తీసుకు వచ్చారు. ఆ పాపానికి ప్రతిఫలంగా నర జాతి మొత్తానికి మరణం సం్రపాప్తించింది. అయితే ఆ శాపాన్ని పాపాన్ని కొట్టివేసి తద్వారా వచ్చిన మరణభయాన్ని తొలగించేందుకు క్రీస్తు అందించిన శిలువ యాగం ద్వారా రక్షణ ΄పొంది నిత్యజీవానికి వారసులై సదా కాలం క్రీస్తుతో నివసించే భాగ్యాన్ని క్రిస్మస్ మనకు అందించింది. క్రిస్మస్ ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి రక్షణార్థం పాపపరిహారార్థ బలిగా శిలువపై తనను తాను సమర్పించుకున్నాడు. యేసు శిలువలో కార్చిన రక్తం ద్వారా పాప విమోచన. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మానవుడు దేవునితో పరలోకంలో ఉండే భాగ్యం అందించడానికి దేవుడు మానవుడిగా అవతరించాల్సి వచ్చింది. అందుకు క్రీస్తు పుట్టుక వేదికగా మారింది. అప్పుడు ఈ ధరిత్రి మీద మానవునిగా జన్మించిన యేసు ఇప్పుడూ నీవు ఆహ్వానిస్తే నీ హృదిలో ఆత్మరూపుడై వసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో నిత్యసంతోషం నింపుతాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సంతోషం... సమాధానం తెచ్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. క్రీస్తు పుట్టుక సమయంలో కురేనియ, సిరియా దేశమునకు అధిపతి అయిన కైసరు ఔగుస్తు మొదటి ప్రజాసంఖ్య ప్రకటించాడు. ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక అంశాలతో తెలియ చేయబడిన క్రీస్తు జననం ఒక కల్పితకథ కాదు ఒక చారిత్రాత్మక సత్యం. ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు. క్రీస్తుకు ముందు... క్రీస్తు తర్వాతగా కాలం రెండుగా విభజింపబడటయే ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ.– బందెల స్టెర్జి రాజన్ సీనియర్ పాత్రికేయులు -
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
వైఎస్సార్, సాక్షి: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని క్రెస్తవులందరికీ వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారాయన.‘‘కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు.... దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయి’’ అని తన క్రిస్మస్(Christmas) సందేశంలో వైఎస్ జగన్(YS Jagan) పేర్కొన్నారు.ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ ఇడుపులపాయలో నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి -
Christmas 2024 నింగికెగిసిన తారలు, కళ్లు చెమర్చే AI ఫోటోలు
-
మొదలైన క్రిస్మస్ సందడి..ముస్తాబైన చర్చ్ లు (ఫొటోలు)
-
నేడు వైఎస్సార్ జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు.ఈ నెల 25న ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళతారు. -
Christmas 2024: శాంటా లవ్, ఈ నైల్ ఆర్ట్ చూశారా? (ఫోటోలు)
-
ఆర్ట్ ఫుల్.. ఫెస్టివల్..
క్రిస్మస్ అంటే దయా, కరుణల జన్మదినం. ఇచ్చి పుచ్చుకోవడంలోని ఆనందం. అంతేనా.. క్రిస్మస్ అంటే కళాత్మకత కూడా అని నిరూపిస్తున్నారు సిటిజనులు. క్రీస్తు జన్మదినానికి కొన్ని రోజుల ముందుగానే నగరంలో మొదలయ్యే వేడుకలు ఆద్యంతం కళాత్మకతకు అద్దం పడతాయి. పండుగ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఇటు వైవిధ్యానికీ అటు సృజనాత్మకతకు పెద్దపీట వేస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ చెట్టు, ఇతర అలంకరణలకు సంబంధించిన సందడి నెల రోజుల ముందునుంచే మొదలవుతుంది.. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు.. క్రిస్మస్ ముందు రాత్రి సమయంలో వచి్చ, అనుకోని విధంగా మంచి పిల్లలకు మాత్రమే బహుమతులు పంచే శాంటాక్లాజ్ పాత్రకు నేపథ్యం చర్చిఫాదర్ సెయింట్ నికోలస్ అని చరిత్ర చెబుతోంది. క్రిస్మస్ వేడుకల కోసం శాంటాక్లాజ్లను తయారు చేయడంలో నగరంలో వివిధ రకాల కొత్త పద్ధతులు, గెటప్స్ పుట్టుకొస్తూన్నాయి. ఎరుపు రంగు దుస్తుల్లో పొడవైన తెల్లని గెడ్డం, క్యాప్... ఈ మూడూ ప్రధానంగా తీసుకుని, మిగిలిన గెటప్స్కూ సృజనాత్మకతను జోడిస్తూ వెరైటీ ‘శాంటా’లను సృష్టిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నారు. పండుగ బీట్.. డిజైనర్ ‘ట్రీ’ట్.. దాదాపు 15వ శతాబ్దపు ప్రాంతంలో క్రిస్మస్ రోజున కుటుంబ సభ్యులు తామే చెట్లు తయారు చేసి దాని చుట్టూ పరస్పరం ఇచ్చి పుచ్చుకునే బహుమతులను ఉంచేవారట. చిన్నా పెద్దా దాని చుట్టూ ఆడిపాడేవారట. వీటిని యులె ట్రీ అని కూడా పిలిచేవారట. అలా ఇది ఒక సంప్రదాయంగా స్థిరపడింది. సాధారణంగా ఈ చెట్టును పీవీసీతో లేదా ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. నగరంలో క్రిస్మస్ ట్రీ రూపకల్పనకు ఆకాశమే హద్దు అన్నట్టు డిజైనర్ ట్రీలు వచ్చేస్తున్నాయ్ ‘రెండు వారాల కిందటే కాలనీలో క్రిస్మస్ ట్రీని తయారు చేశాం. రోజుకో అలంకరణ జత చేస్తున్నాం. పండుగ రోజున దీన్ని అనూహ్యమైన రీతిలో అలంకరించి అందరినీ థ్రిల్ చేయనున్నాం’ అని కూకట్పల్లి నివాసి జెఫ్రీ చెప్పారు. ఎత్తు విషయంలోనూ ఇంతింతై అన్నట్టుగా.. క్రిస్మస్ ట్రీలు 3 నుంచి 30 అడుగుల వరకూ చేరుకున్నాయి. ‘సగటున మేం రోజుకు 20 క్రిస్మస్ చెట్లు అమ్ముతున్నాం. రూ.1000 నుంచి రూ.3000 వరకూ ధర ఉండేవి బాగా అమ్ముడవుతున్నాయి’ అని సికింద్రాబాద్‌లోని ఓ షాపు యజమాని చెప్పారు.స్టార్.. సూపర్.. అవతారపురుషుని రాకకు చిహ్నంగా ముందుగా ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉద్భవించింది. అందుకే ఈ వేడుకల్లో స్టార్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రమార్గం అంటే దేవుని మార్గం. దేవుని వైపు దారి చూపించేదిగా దీన్ని భావిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నగరంలో రకరకాల లైట్ల వెలుతురులో మెరిసిపోయే స్టార్స్ క్రిస్మస్ సందడిని రెట్టింపు చేస్తున్నాయి.ప్రేమ సందేశమే ప్రధానం.. ఈ పండుగ వేడుకల్లో ప్రధానమైన శాంతాక్లజ్, ట్రీ, క్రిబ్.. వంటివన్నీ పండుగ విశిష్టతకు, సేవాభావపు ఔన్నత్యానికి అద్దం పట్టేవే. వీటిని నగరంలో ఎవరికి నచ్చినట్టు వారు అందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచిదే అయినా ఆయా విశేషాలు అందించే ప్రేమ సందేశాలను కూడా తెలుసుకోవడం, తెలియజెప్పడం అవసరం అంటున్నారు సికింద్రాబాద్‌లోని అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ ఉడుముల బాలÔౌరి.విశేషాల క్రిబ్.. వెరైటీలకు కేరాఫ్ ఏసు జని్మంచిన స్థలానికి సంబంధించిన విశేషాలను తెలియపరిచే క్రిబ్.. 1223లో తొలిసారి సెయింట్‌ఫ్రాన్సిస్ అనే వ్యక్తి రూపకల్పన చేశాడంటారు. దీనినే నేటివిటీ సీన్ లేదా మ్యాంగర్ సీన్ వంటి పేర్లతోనూ పిలుస్తారు. పశువులపాకలో ఏసు పుట్టాడనేదానికి సూచికగా దీనిని అందంగా ఏర్పాటు చేస్తుంటారు. పలు జంతువులతో పాటు పేదలు, రాజులు ఇలా అందరూ ఉండే చోట కొలువుదీరేలా దీన్ని నెలకొల్పే విధానం ఆకట్టుకుంటుంది. గడ్డిని తెచ్చి పాకను వేసి చిన్నారి క్రీస్తును కొలువుతీర్చి.. ఇలా చక్కగా డిజైన్ చేసే క్రిబ్ నగర క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. క్రిస్మస్ రోజుల్లో దాదాపు ఒకటి రెండు రోజుల పాటు సమూహాలుగా ఈ క్రిబ్ తయారీలో పాల్గొనడం కూడా చాలా మందికి నచ్చే విషయం. -
బార్బీ డ్రెస్‌లో జాన్వీ కపూర్.. క్రిస్మస్ స్పెషల్ పిక్స్ వైరల్
-
Christmas 2024 ముల్లంగి సంబరం
ప్రపంచంలోనే ఇదొక అరుదైన సంబరం. మెక్సికోలోని వాహాకా నగరంలో జరిగే వేడుక ఇది. ఈ సంబరం జరిగే రోజున వాహాకా నగర వీథుల్లో ఎటు చూసినా ముల్లంగి దుంపలే కనిపిస్తాయి. స్థానిక కళాకారులు ముల్లంగి దుంపలను శిల్పాలుగా తీర్చిదిద్ది ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సంబరం ఏటా డిసెంబర్ 23న జరుగుతుంది. ఇది ప్రధానంగా రాత్రివేళ జరిగే వేడుకే అయినా, ఉదయం నుంచి వాహాకా నగర వీథుల్లో సందడి కనిపిస్తుంది. స్పానిష్ వలసదారులు అడుగుపెట్టే వరకు మెక్సికన్ ప్రజలకు, ఇతర లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు ముల్లంగి తెలీదు. స్పానిష్ వర్తకులు చైనా నుంచి ముల్లంగిని తీసుకువచ్చి, దక్షిణ అమెరికాలోని తమ వలస రాజ్యాల్లో సాగు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ముల్లంగి లాటిన్ అమెరికన్ ప్రజల అభిమాన కూరగాయల్లో ఒకటిగా మారింది. ముల్లంగి సంబరం ఆచారం మొదలవడానికి ముందు వాక్సాకా నగరంలోని క్రిస్మస్ బజారులో కలపతో శిల్పాలు మలచే పోటీలు జరిగేవి. కొందరు ఔత్సాహిక రైతులు 1897 డిసెంబర్ 23న ముల్లంగి దుంపలతో చిత్రవిచిత్రమైన శిల్పాలను మలచి, ప్రదర్శనకు పెట్టారు. దాదాపు వందమంది రైతులు ఆనాటి ప్రదర్శనలో ముల్లంగి శిల్పాలను ప్రదర్శించారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు వీటిని ఎగబడి కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న ‘నోషే డి రబానోస్’ (నైట్ ఆఫ్ రాడిషెస్) సంబరం జరుపుకోవడం ప్రారంభించారు. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది! )మొదట్లో ఈ వ్యవహారం కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికే మొదలైనా, తర్వాత ఇది వాహాకా నగరంలో ఒక పెద్ద సాంస్కృతిక వేడుకలా మారింది. ఈ ముల్లంగి సంబరంలో ముల్లంగి శిల్పాల పోటీలు జరుగుతాయి. విజేతలకు వాహాకా నగర పాలక సంస్థ బహుమతులు అందించి, ఘనంగా సత్కరిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే శిల్పులు క్రీస్తు జననం, శిలువ, చర్చి వంటి ఆకృతులతో పాటు పక్షులు, జంతువులు, మనుషుల బొమ్మలను కూడా ముల్లంగి దుంపలపై మలచి, తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ వేడుకకు విదేశీ పర్యాటకులు వస్తుండటం వల్ల మెక్సికోకు పర్యాటక ఆదాయం కూడా బాగా లభిస్తోంది. -
Christmas 2024: జగద్రక్షకుని జన్మదినం
చీకటిని చీల్చుకుంటూ వస్తున్న సూర్యుడు తన లేత వెచ్చని కిరణాలతో ఆ గ్రామాన్ని నిద్ర లేపాడు. పక్షుల కిలకిలరావాలతో, పట్టణానికి బయలుదేరుతున్న ఎడ్లబండ్ల చప్పుళ్ళతో, గేదెలను తోలుకుంటూ వెళ్తున్న పల్లె పిల్లగాళ్ళ అరుపులతో, నీళ్ళ కోసం బయలుదేరిన అమ్మలక్కల బిందెల చప్పుళ్ళతో దినచర్య ప్రారంభించే ఆ అందమైన గ్రామం ఆరోజు మరింత సందడిగా మారింది.రాత్రంతా తాగుబోతు నాన్న కొట్టిన దెబ్బలకు అల్లాడిపోయి జ్వరంతో మత్తుగా నిద్ర పట్టేసిన సూరి ఈ హడావిడికి ఒక్కసారిగా లేచాడు. ‘అమ్మో! చాలా ఆలస్యమైందే! పండుగ రోజులు కదా, చాలా తొందరగా రావాలి అని నిన్న అమ్మగారు చెప్పారు. ఈరోజు నా పని అయిపోయిందిలే’ అని అనుకుంటూ, కళ్ళు నులుముకుంటూ ‘ఒరేయ్ చద్దన్నమన్నా తిని వెళ్ళరా!’ అని అరుస్తున్న అమ్మ కేకలు కూడా పట్టించుకోకుండా పరుగు పరుగున బయలుదేరాడు. అప్పటికే కారాలు మిరియాలు నూరుతోంది ఆ ఇంటి యజమానురాలు. భయం భయంగా లోపలికి వస్తుండగా, ‘ఆగు!’ అనే మాట విని నిలబడిపోయాడు. అమ్మగారి వంకే చూస్తున్నాడు. ‘అమ్మగారూ! రాత్రంతా జ్వరం..’ అని పరిస్థితిని చెబుదామనే లోపులో దబదబమని బాదింది. ‘పండుగ రోజులు కదా, త్వరగా రావాలి అని చెప్తే లేటుగా వస్తావా?’ అని నోటికొచ్చినట్టు తిట్టింది. అసలే రాత్రి వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బల మీద ఈ దెబ్బలు తగలడంతో మరింత బాధపడుతూ పని దగ్గరకు పరుగెత్తాడు. దుఃఖాన్ని ఆపుకోలేక భోరున ఏడ్చాడు. ఓదార్చేవారెవ్వరూ లేరక్కడ.సూరి వాళ్ళ నాన్న రిక్షా తొక్కుతాడు. సాయంత్రం తాగివచ్చి వాళ్ళమ్మను, చెల్లెళ్ళను, సూరిని చితకబాదుతాడు. ప్రతిరాత్రి పస్తే! వాళ్ళమ్మ జబ్బు చేసి నీరసంగా ఉంటుంది. అందుకని సూరిని ఆ ఊళ్ళో డబ్బున్న కాంతారావు ఇంట్లో పనికి పెట్టింది. సూరి ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఇంట్లో పని చేస్తాడు. వాళ్ళు పెట్టే మిగిలిపోయిన అన్నం, కూరలు తింటూ జీవిస్తున్నాడు. చాకిరి చెయ్యడమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక వంకతో ఆ యజమానురాలు కొట్టే దెబ్బలు, తిట్లు భరిస్తున్నాడు. ఇవన్నీ తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఇల్లు చక్కబెడుతున్నాడు. ‘ఒరేయ్ సూరీ ఎంతసేపురా! ఇటురా!’ అనే కేకతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని వెళ్లాడు. కంటకురాలైన యజమానురాలి హెచ్చరికతో బండెడు గిన్నెలు తోమడం మొదలు పెట్టాడు.అవి క్రిస్మస్ పండుగ రోజులు. కాంతారావుగారి ఇల్లంతా సందడే సందడి. ఇల్లంతా పువ్వులతో, కరెంటు దీపాలతో అలంకరించారు. అమ్మగారు, వాళ్ళ పిల్లలు ఖరీదైన బట్టలు, నగలు ధరించారు. పిండివంటల ఘుమఘుమలతో, ఇంటికొచ్చిన బంధువులు, స్నేహితులతో, పిల్లల కేరింతలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. సూరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. మధ్యమధ్యలో ఈ సందడంతా గమనిస్తూనే ఉన్నాడు. భోజనాల సమయమైంది. అందరూ భోంచేశారు. సూరి ఒక్కడే మిగిలి పోయాడు.పెరట్లో కూర్చుని అమ్మగారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అమ్మగారి కేక వినిపించింది. ‘రారా సూరీ అన్నం తిందువు గాని’.. వెంటనే ఆత్రంగా వెళ్ళాడు. రాత్రి భోజనం లేదు. ఉదయం లేదు గదా ఇప్పుడు పెట్టే పిండి వంటలు ఆరగిద్దామంటూ తనకు పెట్టిన భోజనం వైపు చూశాడు. ఎంత ఆశతో వెళ్లాడో అంత నిరుత్సాహానికి గురయ్యాడు. మాడు అన్నం, వూడ్చి వూడ్చి వేసిన కూర చూసి తినలేక దుఃఖం పొంగుకు వచ్చింది. ఆకలంతా చచ్చిపోయింది. మంచినీళ్ళు తాగి వెళ్ళి, వారంతా తిన్న గిన్నెలన్నీ తోమి, మిగతా పనులన్నీ చక్కబెట్టి ఇంటికి బయలుదేరాడు. ఒళ్ళంతా హూనమైపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. చడీచప్పుడు లేకుండా ఇంటిలోకి అడుగు పెట్టాడు. అప్పటికే వాళ్ళ నాన్న బీభత్సం సృష్టించాడేమో! చెల్లెళ్ళంతా ఏడుస్తూ చలికి దుప్పట్లు లేక కాళ్ళు ముడుచుకొని వణుకుతూ పడుకున్నారు. తల్లి మంచం మీద మూలుగుతోంది. గుడిసె అంతా చిందరవందర. సర్దిపెట్టే ఓపిక లేక తల్లి వద్ద తాను చిన్న గుడ్డ ముక్క పరచుకుని పడుకున్నాడు. పండగపూట కదా! కొడుకు ఏదైనా తెస్తాడని ఆశించిన తల్లి కుమారుని పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. సూరి పడుకున్నాడు గాని నిద్ర పట్టడం లేదు. ఏడుపొస్తోంది. అమ్మకు కనబడకుండా ఏడ్వాలనుకున్నాడు కాని, అదిమి పట్టేకొద్ది ఎక్కువైపోయింది. ఒక్కసారిగా సూరి తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తున్నాడు. ‘ఏంట్రా? నీ బాధేమిటో చెప్పమ్మా’ అమ్మ అడుగుతోంది. ఆ రోజు జరిగినదంతా అమ్మకు చెప్పాడు. తల్లి నచ్చచెప్ప ప్రయత్నించింది. తన్ను తాను తమాయించుకొని, ‘అమ్మా! క్రిస్మస్ అంటే ఏంటమ్మా?’ అని అడిగాడు. వాళ్ళమ్మ చెప్పింది. ‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’.. ‘లేదు నాయనా! దేవుడు అందరికీ దేవుడే! ఈ లోకంలోని ప్రజలందరి కోసం ఆయన పుట్టాడు. మనలాంటి పేదోళ్ళ బతుకులు బాగుపరచడానికి, చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగా చేసి తన రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు!’.. ‘అలా అయితే మనకేంటి ఈ పేద బతుకు?’ దుఃఖంతో అన్నాడు సూరి. ‘లేదు నాయనా! అసలైన పేదరికం భౌతికమైనది కాదు. మనలోని ఆత్మకు సంబంధించినది. పాపంలో బందీయైన ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా దరిద్రుడే! ప్రేమ హీనత, క్షమించలేకపోవడం, అహంభావం, ఇతరులను అవమానించడం లాంటివి ఆధ్యాత్మిక పేదరికానికి నిదర్శనాలు. అలాంటి స్థితిలో ఉన్నవారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేర్చడానికి యేసయ్య కూడా అందరికీ దగ్గరవ్వడానికి పేదవానిగానే వచ్చాడు. బెత్లేహేము గ్రామంలో పశువుల తొట్టెలో పుట్టాడు. ‘అయ్యో! పశువుల తొట్టా? దేవుడు పశువుల తొట్టెలో పుట్టడమేంటమ్మా?’.. ‘ఆయన పశులతొట్టెలో పుట్టాడు కాబట్టే, సామాన్యులైన గొర్రెల కాపరులు ఆయనను మొదట దర్శించుకున్నారు. దేవుడు వారికి ఇంత దగ్గరగా వచ్చినందుకు వారి ఆనందానికి అవధులు లేవు. యేసుక్రీస్తు నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాక అనేకమంది రోగులను బాగుచేశాడు, బీదవాళ్ళను, కుష్ఠు రోగులను అక్కున చేర్చుకున్నాడు. కన్నీరు తుడిచి, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అంతేకాదు! మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. తలలో ముళ్ళు, చేతుల్లో, కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు. కడుపులో బల్లెపు పోట్లు, శరీరమంతా మాంసపు ముద్దగా మారి రక్తాన్ని చిందించాడు. దుర్మార్గులు పొందాల్సినవన్నీ ఆ ప్రేమమయుడు తనపై వేసుకున్నాడు. ఈ ప్రాణత్యాగం చేయడానికి పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. మరో గొప్ప సంగతి. చనిపోయి మూడవరోజు తిరిగి లేచాడు’ అని తల్లి అనేక విషయాలు సూరికి తెలిపింది. ‘అయితే ఇకనుండి నేను ఏడ్వను. మా అమ్మగారిని తిట్టను, నాన్నమీద కోపపడను. వీళ్ళందరినీ ప్రేమిస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా ఫర్వాలేదు. యేసయ్య నాతో ఉన్నారుగా’ అంటూ ఆ చిన్ని హృదయంలోకి ప్రభువును చేర్చుకున్నాడు. తిట్లకు, తన్నులకు, పస్తులకు సూరి భయపడట్లేదు, ఏడ్వట్లేదు. కొన్ని రోజులు గడిచాయి. తాను పనిచేసే ఇంటి అమ్మగారికి జబ్బు చేసింది. ఆమె పిల్లలంతా ఆమెకు సేవ చేయలేక వెళ్ళిపోయారు. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆ సమయంలో సూరి ఆమెకు ఎంతో శ్రద్ధతో çసపర్యలు చేయడం మొదలుపెట్టాడు. చావు బతుకుల్లో ఉన్న ఆమెను బతికించాడు. ఆమె కోసం నిద్రాహారాలు లేకుండా ప్రార్థించాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆమె కోలుకుంది. ఆమె మనస్సంతా కృతజ్ఞతతో నిండిపోయింది. సూరిని దగ్గరకు పిలిపించింది. గట్టిగా కౌగిలించుకొని కన్నీరు కార్చింది. ‘ఒరేయ్ సూరీ! నేనంటే నీకు ఎందుకురా ఇంత ప్రేమ? నిన్ను ఇంతగా బాధలు పెట్టిన నన్ను ఎంత ఆదరించావురా! నా పిల్లలు కూడా నా పరిస్థితిని చూసి నన్ను విడిచి వెళ్ళిపోయారే! నువ్వు మాత్రం నన్ను కంటికి రెప్పలా కాచి మనిషిని చేశావురా’ అని మెచ్చుకుంటుంటే సూరి ‘మా అమ్మగారేనా ఇలా మాట్లాడుతోంది? దేవుడెంత గొప్పవాడు’ అనుకుంటూ దేవున్ని స్తుతించాడు. ‘క్రీస్తు ప్రభువు నాలోకి వచ్చి ఉండకపోతే నేను మిమ్మల్ని ప్రేమించి ఉండేవాణ్ణి కాదు. ఆ యేసయ్య ప్రేమతో పోల్చుకుంటే నేను చూపిన ప్రేమ సముద్రంలో నీటి చుక్క.. మంచినీళ్ళు తెమ్మంటారా?’ అని పైకి లేచాడు. సూరి మాటలకు నిశ్చేష్టురాలైంది. ఔను! బుద్ధిహీనులకు తెలివి కలిగించేది దేవుని వాక్యం. ఎన్ని క్రిస్మస్ పండుగలు వెళ్ళిపోయాయి. దేవుని ప్రేమను ఎంతగా దుర్వినియోగపరచాను. కొంచెం కూడా దేవుని ధ్యాస లేకుండా ఆడంబరాల మీదే మనసు పెట్టి, అసలు ఆశీర్వాదాన్ని కోల్పోయానే! ఈ చిన్న పిల్లవాని ద్వారా దేవుడు నిజంగా నా కన్నులు తెరిచాడు అని దేవునికి తనను తాను అర్పించుకున్నది. ఇంటికి వెళ్ళిన సూరి అమ్మగారిలో వచ్చిన మార్పును తన కుటుంబంతో పంచుకున్నాడు. తెల్లారింది. అమ్మగారింటికి బయలుదేరాడు. ఆమె సాదరంగా సూరిని ఆహ్వానించి కేకు కోయించి, కొత్త బట్టలు ధరింపజేసి, ప్రార్థన చేసింది. ‘అమ్మగారూ! క్రిస్మస్ పండుగ అయిపోయింది కదండీ. మళ్ళీ ఇవన్నీ ఏంటండీ’ అడిగాడు. ‘లేదురా సూరీ! అసలు పండుగ నా జీవితంలో ఇదే! నేను నమ్మిన వారంతా నన్ను మోసం చేశారు. నేను ద్వేషించిన వారు నాకు సహాయం చేసి నిజమైన ప్రేమంటే ఏమిటో చూపించారు’.. ఈ మాటలకు సూరి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన బంధువులు, స్నేహితులు అందరిముందు ‘సూరిని నా కొడుకుగా చేసుకొంటున్నాను. నా తదనంతరం ఈ యావదాస్తికి అతడే వారసుడు. క్రిస్మస్ బహుమానంగా దేవుడు సూరిని నాకు అనుగ్రహించాడు’ అని చెమ్మగిల్లిన కళ్ళతో సూరిని వాటేసుకుంది. ఒక మనిషికి కనువిప్పు కలగడమే నిజమైన పండుగ. క్రైస్ట్, మాస్ అనే రెండు పదాల కలయిక క్రిస్మస్. దీని అర్థం క్రీస్తును ఆరాధించడం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రైస్తవులు క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మన్ జరుపుకుంటారు. క్రీస్తు జననం చరిత్రాత్మకమైనది. సుప్రసిద్ధ చరిత్రకారులు క్రీస్తు చరిత్రను అద్భుతంగా వివరించారు. వారిలో రోమా చరిత్రకారుడు గాయిస్ ప్లినియస్ ఒకడు. ఇతడు రోమా చక్రవర్తి ట్రాజన్ దగ్గర మేజిస్ట్రేట్‌గా క్రీ.శ 98 నుండి 117 వరకు పనిచేశాడు. చక్రవర్తియైన ట్రాజన్‌కు ఇతనికి జరిగిన ఓ సంభాషణ ఆ కాలంలోని క్రైస్తవుల నిబద్ధతలను వెల్లడిచేసింది. ‘క్రైస్తవులు చీకటి పడకముందే ఒక నియమిత సమయానికి కలుసుకొనేవారు. క్రీస్తును దేవునిగా సంబోధిస్తూ పాటలు పాడేవారు. తాము ఎప్పుడూ ఏ దోషము, దొంగతనమును చేయమని, తాము కట్టుబడియున్న పవిత్ర ప్రమాణమును గౌరవిస్తామని తీర్మానించుకున్నారు. తమ మాటను ఎన్నడు అబద్ధముగా మార్చమని, తప్పుడు ప్రమాణము చేయమని చెప్పుకొనేవారు’. పైమాటలను గమనిస్తే యేసుక్రీస్తును అంగీకరించి మారుమనస్సు పొందిన పిదప వారు నమ్మిన వాక్యమునకు దేవుని బిడ్డలు ఏవిధంగా కట్టుబడియున్నారో విశదమవుతుంది.అపొస్తలుడైన పౌలు తన సువార్త యాత్రలో ఒకసారి గ్రీసు దేశమునకు వెళ్ళాడు. గ్రీసు రాజధాని ఏథెన్సు మహానగరం. విశ్వ విజేతగా పేరుపొందిన అలెగ్జాండరు గ్రీకు సామ్రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత తత్త్వజ్ఞానులు సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో ఈ దేశానికి చెందినవారే! అక్కడి ప్రజలు తత్త్వజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ‘గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెదకుచున్నారు’ అని పౌలు ప్రస్తావించుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఏథెన్సులో అరీయొపెగు అనే ప్రాంతం ఉన్నది. దానిని అరీసు కొండయని పిలుస్తారు. ఏథెన్సు మహాసభ వారు అక్కడ కూర్చుండేవారు. ఆ పట్టణంలోని ఘనులు, ధనికులు, అధికారులలోని ముఖ్యులు దీనిలో సభ్యులుగా ఉండేవారు. మొదట్లో దేశంలో జరిగే నేరములను ఈ ప్రాంతంలోనే విచారించి, నేరస్థులకు శిక్షలు విధించేవారు. తరువాతి కాలంలో దేశపాలన విషయాలను, రాజనీతి విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను కూడా తర్కిస్తుండేవారు. ఎవరైనా ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటే, ఆ సభకు వెళ్ళి చెప్పాలి. వారు చెప్పిన వాటిలో సత్యం లేకపోతే, తేలు విషాన్ని వారికిచ్చి అక్కడే వారిని చంపేస్తారు. అక్కడ పలికే ప్రతి మాట చాలా జాగ్రత్తగా పలకాలి. అపొస్తలుడైన పౌలు క్రీస్తును గూర్చిన సత్యాన్ని చెప్పడానికి అరీయొపెగు మధ్యన నిలిచి, నిర్భయంగా ప్రకటించాడు. అనేకమందిని ఆలోచింపచేసిన ప్రసంగమది: ‘‘ఏథెన్సు వారలారా! మీరు సమస్త విషయములలో విశేష భక్తి గలవారై ఉన్నట్లు కనబడుచున్నది. నేను మీ పట్టణములో సంచరించుచుండగా నాకొక బలిపీఠము కనబడింది. దానిమీద ‘మాకు తెలియబడని దేవుడు’ అని వ్రాసియుంది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి గలిగి యున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను’’.. తెలియబడని దేవునికి నిర్మించిన బలిపీఠాన్ని గ్రీకు భాషలో ‘అగ్నోస్టిక్ థియోస్’ అంటారు. క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏథెన్సులో ఒక తెగులు వ్యాపించింది. భయంకరమైన తెగులు ద్వారా ప్రజలు చనిపోతున్నారు. ఎన్నో పూజలు, ప్రయత్నాలు చేసినా, పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆ సమయంలో అక్కడ ప్రజాదరణ పొందిన ఎపిమెనిడెస్, అరాటస్ అను ఇద్దరు తత్త్వజ్ఞానులు ఉండేవారు. ప్రజలు వారి యొద్దకు వెళ్ళి తమ గోడు వెళ్ళగక్కారు. వచ్చిన తెగులు తొలగిపోవడానికి పరిష్కార మార్గాన్ని చూపాలని అడిగారు.అప్పుడు వారు ఈ విచిత్రమైన సలహాను ఇచ్చారు: ‘మీ శక్తి కొలది కొంతమంది దేవుళ్ళను ఆరాధించుచున్నారు. మీకు తెలియని దేవుళ్ళు కూడా ఉండవచ్చు. బహుశా వారు మీ మీద ఆగ్రహించి ఈ తెగులును పంపియుండవచ్చు. ఈ తెగులు అరికట్టాలంటే మీరు ఒక బలిపీఠమును కట్టి దానికి తెలియబడని దేవుడు అని పేరు పెట్టండి. ఆ దేవుడు శాంతించి తెగులును నిలిపివేయవచ్చు’.. ఆ మాటలను లక్ష్యపెట్టిన ప్రజలు తెలియబడని దేవునికి బలిపీఠం కట్టారు. అక్కడ వారు చేసే ప్రార్థనలు తెలియబడని దేవుని దగ్గరకు వెళ్తున్నాయని భ్రమపడేవారు. సరిగ్గా ఆ ప్రజల ప్రశ్నలకు పౌలు చక్కని సమాధానాలను ఇచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు విశిష్ట లక్షణాలను కలిగియుంటాడు. వాటిలో మొదటిది: ‘ఆయన సృష్టికర్త’. తన మహిమ కోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే! రెండవది: దేవుడు మనలో ఏ ఒక్కరికీ దూరంగా ఉండువాడు కాదు. గ్రీకులలో కొందరు జ్ఞానులు దేవుడున్నాడు గాని, ఆయన మనుషులను పట్టించుకోడు అని బోధించేవారు. ఆ ఆలోచనను పౌలు ఖండించాడు. దేవుడు మానవుని పట్ల శ్రద్ధ కలిగియుంటాడు. మనిషికి దగ్గరగా ఉండాలనే మనుష్య రూపంలో ఈ లోకానికి ఏతెంచాడు. మూడవది: దేవుడు మనిషి నుండి మార్పును ఆంకాక్షిస్తున్నాడు. ఆ మార్పు హృదయానికి సంబంధించినది. ఇత్యాది విషయాలను తెలియచేయడం ద్వారా పౌలు అనేకులను సత్యం వైపు నడిపించాడు. క్రీస్తు రాక పుడమిని పులకింపచేసింది. తరతరాల నిరీక్షణ ఫలితమే యేసుక్రీస్తు పుట్టుక. క్రీస్తుకు పూర్వం ఎందరో ప్రవక్తలు ఆయన రాకను కాంక్షిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు పలికారు. వారి ప్రవచనాలు తనలో నెరువేర్చుకుంటూ క్రీస్తు మానవ చరిత్రలో ప్రవేశించారు. ఆయన పుట్టినప్పుడు ఇశ్రాయేలు రాజ్యము రోమా పాలనలో ఉంది. దాస్యం, అన్యాయం, అవినీతి ముమ్మరంగా ఉన్నాయి. వాటి నుండి విముక్తి కోసం మెస్సీయా రావాలని ఆశించారు. అయితే క్రీస్తు రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇవ్వడానికి రాలేదు. అందరికీ ఆధ్యాత్మిక స్వాతంత్య్రం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ కాలంలోని సుంకపు గుత్తదారుడైన మత్తయి యేసుక్రీస్తు చరిత్రను వ్రాసే భాగ్యాన్ని పొందుకున్నాడు. మత్తయి సువార్త ప్రారంభంలో ఇలా ఉంటుంది. పాతనిబంధన గ్రంథంలో అబ్రాహాముకు దావీదుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. అబ్రాహామును యూదులకు తండ్రిగా పిలిచారు. అతడు విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. కల్దీయ దేశాన్ని విడిచి దేవుని పిలుపును బట్టి కనాను దేశానికి వచ్చి దైవ సంకల్పంలో పాలిభాగస్తుడయ్యాడు. అతని కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ ముగ్గురినీ మూలపురుషులు అని పిలుస్తారు. వీరి సంతానమే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది నలభై సంవత్సరాల అరణ్యయాత్ర తదుపరి యెషువా నాయకత్వంలో కనాను దేశాన్ని చేరుకున్నారు. నాలుగు శతాబ్దాలు న్యాయాధిపతుల పాలనలో ఉన్న ఆ ప్రజలు రాజు పాలన కోసం పట్టుబట్టారు. మొదటి రాజుగా సౌలు, తర్వాత దావీదు వారిని పరిపాలించారు. యేసుక్రీస్తు దావీదు వంశంలోను జన్మించి పాతనిబంధన లేఖనాలను నెరవేర్చారు. యేసుక్రీస్తు పుట్టుక అకస్మాత్తుగా జరిగింది కాదు. అది ప్రవచనానుసారం. క్రీస్తు కన్యకకు జన్మిస్తాడని, కన్య గర్భాన ఈ లోకంలోనికి రావడం ద్వారా ఆయన పరిశుద్ధుడుగా జీవిస్తాడని ఎన్నో యేండ్ల క్రితం ఝెషయా అనే ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. పశువుల తొట్టెలో జన్మిస్తాడని యోబు గ్రంథంలోను, బెత్లేహేములో ఉదయిస్తాడని మీకా గ్రంథంలోను, నీతి చిగురుగా వస్తాడని జెకర్యా గ్రంథంలోను స్పష్టంగా ప్రవచించబడ్డాయి. క్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రం కనిపిస్తుందని, జ్ఞానులు ఆయన్ను దర్శించుకుంటారని, ఆయనకు ముందుగా యోహాను అనే భక్తుడు వస్తాడనే ప్రవచనాలు చాలా సంవత్సరాలకు ముందే ప్రవచించబడ్డాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మొదటిగా సామాన్యమైన గొర్రెల కాపరులు ఆయన్ను దర్శించుకున్నారు. ‘మీరు భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూత ద్వారా గొర్రెల కాపరులకు వర్తమానం అందింది. ఆనాడు క్రీస్తు పుట్టిన చోట ఇప్పుడు ఓ గొప్ప దేవాలయాన్ని చూస్తాం. బెత్లేహేము సందర్శించే ప్రతి ఒక్కరూ ఆ దేవాలయంలో క్రీస్తు పుట్టినచోట ఉన్న నక్షత్రాన్ని చూసి వస్తారు. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అని పిలుస్తారు. బేత్లెహేము అనగా రొట్టెల గృహం. ఇది ప్రపంచ నగరాలతో పోలిస్తే చాలా చిన్నది. కాని, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దీనిని గురించి తెలియని వారు లేరు. జస్టిన్ మార్టర్ అనే చరిత్రకారుడు క్రీ.శ 160లో వ్రాసిన పుస్తకాల ఆధారంగా, 3వ శతాబ్దికి చెందిన చరిత్రకారులు ఆరిజన్, యుసేబియస్లు తెలిపిన వివరాల ప్రకారం బేత్లెహేములో ఉన్న ఈ స్థలం క్రీస్తు జన్మస్థలంగా నిర్ధారించబడింది. కాన్స్టెంటెయిన్ తల్లియైన సెయింట్ హెలీనా ఆధ్వర్యంలో క్రీ.శ 339 మే 31న ఈ నిర్మాణం పూర్తయింది. బైబిల్‌ను లాటిన్ బాషలోనికి అనువదించిన చరిత్రకారుడు సెయింట్ జెరోమ్ కూడా క్రీ.శ 384 సంవత్సరంలో ఇక్కడే సమాధి చేయబడ్డాడు. క్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్రస్థలాన్ని అందరూ దర్శించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. క్రీ.శ 614లో పర్షియా దేశస్థులు, ఇశ్రాయేలును ఆక్రమించుకుని ప్రతి దేవాలయాన్ని నేలకూల్చారు. వారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మాత్రం కూల్చలేదు. కారణమేమిటంటే, ఆ చర్చ్‌లో యేసుక్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులలో ఒకరు పర్షియా దేశస్థుడు కావటమే! 6వ శతాబ్దానికి చెందిన జస్టీవియస్ అనే చక్రవర్తి ఈ చర్చిని మరింత అందంగా రూపొందించాడు. ఈ చర్చిలో మరింత ప్రాముఖ్యమైనది స్టార్ ఆఫ్ బేత్లెహేము. ఆ ప్రాంతంలోనే సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది. అక్కడ కన్యయైన మరియ యేసుకు జన్మనిచ్చిన స్థలం అనే అక్షరాలు చెక్కబడియున్నవి. యేసుక్రీస్తు జన్మించిన తదుపరి ఆయన్ను వెదకుచూ తూర్పు దేశపు జ్ఞానులు ఇశ్రాయేలుకు వచ్చారు. యూదుల రాజు అంతఃపురంలో జన్మిస్తాడని భావించి హేరోదు రాజునొద్దకు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆరాధించడానికి వచ్చామని తెలియచేశారు. వారి మాటలు హేరోదు రాజును కలవరపరచాయి. శాస్త్రులను పిలిచి క్రీస్తు జన్మించే స్థలం ఏమిటని ప్రశ్నించాడు. వారు లేఖనాలను పరిశీలించి ఆయన బ్లెత్లేహేములో జన్మిస్తాడని తెలియచేశారు. మీరు వెళ్ళి ఆయన్ను ఆరాధించి తిరిగి నా యొద్దకు రండి అని హేరోదు జ్ఞానులను పంపివేశాడు. వారు వెళ్ళి బాలుడైన యేసును కనుగొని, ఆయన ముందు సాగిలపడి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. వారు దేవుని చేత బోధించబడినవారై మరియొక మార్గమున తమ దేశములకు వెళ్ళారు. బంగారము క్రీస్తు దైవత్వమునకు, రాజరికమునకు, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడని, బోళము ఆయన మానవుల నిమిత్తం పొందబోయే శ్రమలకు సాదృశ్యమని బైబిల్ పండితులు వివరించారు. క్రిస్మస్ ప్రేమ పండుగ. నిజమైన ప్రేమ విశిష్టతను తెలిపే పండుగ. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం అనే ధన్య సత్యాన్ని అర్థం చేసుకొనే ప్రతి ఒక్కరూ క్రిస్మస్ను ఆత్మానుసారంగా పాటిస్తారు. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’– (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నింటిలోనూ మనకు ఎక్కువగా వినిపించేది ‘ప్రేమ’. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరముగా మారిపోయింది. శాశ్వత ప్రేమ, నిజమైన ప్రేమ మానవ ఊహలకు మించినది. ఆ ప్రేమ ‘ప్రేమాస్వరూపియైన’ దేవుని నుంచి మాత్రమే రావాలి. క్రీస్తు ప్రభువు కేవలం ప్రేమిస్తున్నానని చెప్పడమే కాదు ఆ ప్రేమను సిలువలో మరణించుట ద్వారా ఋజువుపరచాడని పౌలు రోమాలో సంఘానికి వ్రాసిన ఉత్తరంలో తెలియచేశాడు. మనమింకను పాపులమై ఉండగానే, శత్రువులమై యుండగానే, బలహీనులమై యుండగానే క్రీస్తు యుక్తకాలమున మనకొరకు మరణించెను. దేవుడు తన ప్రేమను మానవుల పట్ల వ్యక్తపరచి సమసమాజ నిర్మాణానికి చక్కని మార్గాన్ని ఉపదేశించారు. ‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’ అనే జీవనసూత్రాన్ని క్రీస్తు ఉపదేశించారు. ప్రతియేటా డిసెంబర్ 26వ తేదీని ‘బాక్సింగ్ డే’ అని పిలుస్తారు. క్రిస్మస్ తర్వాతి రోజున అవసరతలో ఉన్నవారికి బహుమతులు పంచుతారు. ఎవరి స్థాయిని బట్టి వారు వారికి తెలిసిన వారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి కానుకలు పంపి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ‘నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను’ అని క్రీస్తు పలికిన మాటను క్రైస్తవులు అత్యధికంగా విశ్వసిస్తారు. పాపపు అంధకారంలో చిక్కి, నిత్యశిక్షను మూటకట్టుకున్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు అనుమాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయన రక్షకుడు అని బైబిల్ తెలియచేస్తున్న విషయం. మానవాళి ఎదుర్కొంటున్న ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానమై యుంటాడు. ‘ఓ దేవా! నన్ను అసత్యము నుండి సత్యములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి, పాపము నుండి పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించు’ అని మానవుడు ప్రార్థిస్తే.. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు సత్యమై, వెలుగై, జీవమై, పరిశుద్ధుడుగా తన ఉనికిని వెల్లడిచేశాడు. వెలిగింపబడిన హృదయం నుండి జాలువారిన ఓ మధురమైన పాట ఇది. ‘కొనియాడ తరమే నిను.. కోమల హృదయ.. కొనియాడ తరమే నిను. తనరారు దినకరు బెను తారలను మించు... ఘన తేజమున నొప్పు కాంతిమంతుడ నీవు’.. సర్వలోకంబుల బర్వు దేవుడువయ్యు.. నుర్వి స్త్రీగర్భాన నుద్భవించితి నీవు.. కొనియాడ తరమే నిను’సాక్షి పాఠకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన రోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’‘ఆయన సృష్టికర్త’. తన మహిమకోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే!సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది. -
Christmas 2024 : మైదాలేకుండానే మీ కిష్టమైన కేక్, రెసిపీలు
క్యాలెండర్ చివరికి వచ్చేశాం. హాయ్ చెప్పడానికి క్రిస్మస్ వస్తోంది. కేక్ మీదకు మనసుపోతుంది. బేకరీ కేక్లన్నీ మైదా కేక్‌లే. ఆరోగ్యంగా ఏమీ తినలేమా? పండగ కోసం కొంచెం కష్టపడదాం. మన వంటిల్లు క్రిస్మస్కి సిద్ధమైంది . మీరూ రెడీనా.సెమోలినా కోకోనట్ కేక్ కావలసినవి: బొంబాయి రవ్వ పావు కేజీ; కొబ్బరి తురుము – 125 గ్రాములు; చక్కెర పొడి– 150 గ్రాములు; బటర్– 125 గ్రాములు; పెరుగు– 125 గ్రాములు; పాలు – 125 ఎం.ఎల్; వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్; బేకింగ్ సౌడర్– టీ స్పూన్; బేకింగ్ సోడా– అర టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; బటర్– టీ స్పూన్; బాదం పప్పు – గుప్పెడు (సన్నగా తరగాలి).షుగర్ సిరప్ కోసం: చక్కెర – 125 గ్రాములు; నీరు – 200 ఎంఎల్; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; రోజ్ ఎసెన్స్ – 2 చుక్కలు.తయారీ: మొదట షుగర్ సిరప్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం నాన్‌స్టిక్ పెనంలో చక్కెర, నీరు, దాల్చిన చెక్క, రోజ్ ఎసెన్స్ వేసి కలిపి గరిటెతో కలుపుతూ సన్న మంట మీద వేడి చేయాలి. 8 నుంచి పది నిమిషాలకు మిశ్రమం తీగపాకం వస్తుంది. అప్పుడు స్టవ్ మీద నుంచి దించేయాలి ∙కేక్ ట్రేకి టీ స్పూన్ బటర్ రాయాలి. తర్వాత దళసరి కాగితాన్ని పరిచి సిద్ధంగా ఉంచుకోవాలి ∙ఒవెన్‌ని హీట్ చేయాలి ∙కేక్ తయారీ కోసం తీసుకున్న పదార్థాలలో బాదం పలుకులు మినహా మిలిగిన అన్నింటినీ ఒక పాత్రలో వేసి బీటర్‌తో బాగా చిలకాలి. నురగ వచ్చే వరకు చిలికిన తరవాత మిశ్రమాన్ని ట్రేలో పోసి ఒవెన్‌లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 40 నిమిషాల సేపు ఉంచాలి.∙ఒవెన్‌లో నుంచి కేక్‌ను బయటకు తీసిన తరవాత ముందుగా కలిపి పెట్టిన షుగర్ సిరప్‌ని కేక్ అంతటికీ సమంగా పట్టేలాగ పోసి (దాల్చిన చెక్కను తీసేయాలి), బాదం పలుకులను కూడా చల్లి ట్రేని కదిలించకుండా పక్కన ఉంచాలి. కేక్ చల్లారేటప్పటికి షుగర్ సిరప్ చక్కగా పడుతుంది. చల్లారిన తర్వాత చాకు సహాయంతో కేక్‌ను ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి.కావలసినవి: మెత్తటి ఖర్జూరాలు– 300 గ్రాములు; వాల్నట్ –30 గ్రాములు; పిస్తా– 40 గ్రాములు (రోస్టెడ్, సాల్టెడ్ పిస్తా); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పు– 30 గ్రాములు (సన్నగా తరగాలి); యాలకుల ΄ పొడి– పావు టీ స్పూన్; గసగసాలు – టేబుల్ స్పూన్.ఖజూర్ బర్ఫీ తయారీ: ∙ఖర్జూరాల నుంచి గింజలు తొలగించాలి. వాల్నట్స్ని సన్నగా తరగాలి. పిస్తాను కూడా తరగాలి ∙ఖర్జూరాలను మిక్సీ బ్లెండర్లో వేసి గుజ్జుగా చేయాలి ∙పెనం వేడి చేసి అందులో నెయ్యి, బాదం, వాల్నట్, పిస్తా పలుకులు వేసి సన్న మంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. వేగిన గింజలను ఒక ప్లేట్లోకి తీసుకుని అదే పెనంలో మిగిలిన నెయ్యిలో యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్ వేసి కలుపుతూ వేయించాలి. ఖర్జూరం పేస్ట్ మృదువుగా మారిన తరవాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టిన గింజలను వేసి కలిపి దించేయాలి ఒక దళసరి పేపర్ మీద ఖర్జూర మిశ్రమాన్ని వేసి సమంగా పరిచి పైన గసగసాలను పలుచగా చల్లి పేపర్‌ను రోల్ చేసి మనకు కావల్సిన సైజ్‌లో కట్ చేసుకుంటే ఖజూర్ బర్ఫీ రెడీ. ఇవి మూడు వారాల వరకు నిల్వ ఉంటాయి. వీటిని వేడి తగ్గిన తర్వాత తినవచ్చు, చల్లగా తినాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. -
Christmas 2024 ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది
ఈ భూమి మీద నడిచిన కారుణ్య మూర్తులైన బుద్ధుడు, మహావీరుడు జీసస్ వంటి వారు మానవీయతను ప్రబోధించి శాంతిస్థాపనకు, సమానత్వానికై అజరామరమైన ప్రేమ తత్వాన్ని ఈ లోకానికి బోధించారు. ప్రాక్ పశ్చిమ ప్రపంచంలో నుండి జీసస్ ఒక విభిన్నమైన నైసర్గిక భౌగోళిక పరిస్థితులు ఉన్న ఇశ్రాయేలులోని బెత్లెహాం నందు జన్మించాడు. అది తన చుట్టూ ఉన్న బాబిలోనియా, ఈజిప్ట్ గ్రీక్ దేశాల ఆధునిక, తాత్విక, వైజ్ఞానిక నాగరికతలు, సంస్కృతుల ప్రభావితం కలిగినది.మానవ జీవితంలో 14 సంవత్సరాల ప్రౌఢదశ ఒక ప్రత్యేకమైన శారీరక మానసిక పరిపక్వత గలిగే దశ ్ర΄ారంభం అవుతుంది. సరిగ్గా ఈ దశ మానవుడిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకే జోసెఫ్‌కు క్రీస్తు మానవునిగా 14వ తరంగా కన్య మరియకు జన్మించిన రోజే క్రిస్మస్.క్రీస్తు అత్యంత బాహ్యాంతర సౌందర్యమూర్తి, పరిపూర్ణుడు. నీసాటి వాడు నిన్ను కోపగించుకుంటే నువ్వు ప్రతిగా వారిని కోపగించుకోకు. మళ్ళీ వారిపై క్రోధం పెంచుకుంటే వారికి నువ్వు సహాయపడ్డవాడివి అవుతావు. నీ క్రోధం వాళ్లకు బలం, నీకు బలహీనత. అదే నువ్వు వారిని సహృదయంతో మందహాసంతో స్వీకరిస్తే వారు నిశ్చేష్టులవుతారు, అందుకే జీసస్ నువ్వు నీ శత్రువుని ప్రేమించు అని చెబుతాడు. అయితే ఇక్కడ శత్రువు కన్నా పొరుగువారిని ప్రేమించటమే కొంచెం కష్టం అయినా వారితో ప్రేమపూర్వకంగా మెలగాలి. నీలో ఉన్న అంతర్గత ప్రేమను ఒక ఆలింగనం ద్వారా బహిర్గతం చేయి. వారు ఈ పరిణామానికి తమ తార్కిక జ్ఞానాన్ని కోల్పోవాలి. అటువంటి ప్రేమలో తార్కిక విచక్షణ ఉండదు. కాబట్టి ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది. ఇలాంటి ప్రేమ మార్గానికి పరాకాష్టే జీసస్ స్వరూపం.సరిగ్గా ఈ భావన కొనసాగింపే జీసస్లో మరో ఉదాత్త అంశం నిదర్శనమైనది. అదే ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపించు అనటం. అప్పుడు మరో చెంపని చూపించటం వల్ల అవతలి వాడిని ఆలోచనలో పడేస్తుంది కానీ మొదట్లో ఈ విభిన్న ప్రతిస్పందన యూదు వంశస్థులకు అర్థం అవడానికి చాలా కాలం పట్టింది. అది వారి తర్కానికి అందని దృగ్విషయం, అదొక సందిగ్ధావస్థ. ఈ దశ ప్రేమకు ముందూ, ద్వేషభావానికి తర్వాత ఉంటుంది. ఇది సంఘంలో కొంత పరివర్తనకు నాంది పలికింది. వ్యవస్థలో నెలకొన్న అమానవీయ చేష్టలకు అమూల్యమైన మానవ ప్రాణం బలి కాకూడదని సంకల్పించాడు. అందుకే జీసస్ అత్యంత దయార్ద్ర మానవతామూర్తి గా వెలుగొందాడు. క్రీస్తుకు పూర్వం ప్రజలంతా మోసెస్ న్యాయమార్గాన్ని అనుసరిస్తే ఆ తదుపరి జీసస్ సర్వత్రా తన ప్రేమ మార్గాన్ని చూపాడు.జీసస్ ప్రేమస్వరూపుడు అనటం కాదు, జీసస్ స్వయంగా ఒక ప్రేమ స్వరూపుడు. ఇక్కడ జీసస్ వేరూ ప్రేమ వేరూ కాదు. అది అత్యంత అనిర్వచనీయం. ప్రేమ ఎప్పుడూ సత్యంలాగా భాషలో పలికేది కాదు అది కేవలం వ్యక్తీకరించేది. అందుకే యేసును శిలువ వేసే సమయంలో రోమ్ సైనికాధికారి పిలాట్ ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగితే సత్యం కోసం చేస్తున్నానని సమాధానం ఇస్తాడు, అప్పుడు పిలాతు యేసును మళ్ళీ ప్రశ్నిస్తాడు సత్యం అంటే ఏంటి? అని– ఆ ప్రశ్నకు యేసు మౌనం వహిస్తాడు. ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. అందుకే సంఘం యథార్థవాదులందరినీ లోకవిరోధులుగానే చిత్రీకరిస్తుంది. అందుకు తార్కాణంగా ప్రముఖ గ్రీకు దార్శనికుడు సోక్రటీస్కు రాజ్యం విషం ఇచ్చి మరణశిక్షను విధించింది. అలాగే భారతీయ దార్శనికుల్లో విప్లవాత్మకమైన శాంతి, సత్య తత్వాన్ని అందించిన బుద్ధుని బోధలూ, బౌద్ధం భారతదేశం నుంచి తరిమి వేయబద్దాయి. అదేవిధంగా యూదుల ఆలోచనలను సరిదిద్దే ప్రయత్నంలో జీసస్ కృషి నిరర్థకమే అయింది. వారికి సత్యం, ప్రేమల తత్వం అర్థం కాలేదు. వారు జీసస్ సత్యమార్గాన్ని చేరుకోలేక అపవాదిగా మార్చి సిలువ వేశారు. ఈ దార్శనికులంతా వారి తాత్విక సందేశాలతో సమస్త జీవకారుణ్యతతో ఎటువంటి మారణాయుధాలు లేకుండా ఒక మనిషి మరో మనిషిపై గాని, ఒక జాతి మరో జాతిపైగానీ, ఒకరి భావజాలం మరొకరి భావజాలంపై గాని, సాంస్కృతిక దురాక్రమణలు కానీ, ధర్మం పేరిట యుద్ధాలు, రక్తపాతాలు గానీ సృష్టించలేదు. కేవలం ప్రకృతి ధర్మాలను వివరిస్తూ మనుషుల మధ్య సమతను, సమానత్వాన్ని, ప్రేమ పూర్వక ప్రవచనాలతో, వాత్సల్యపు వాక్యాలతో శాంతి సామ్రాజ్యాల స్థాపనకు ప్రాణత్యాగాలు చేశారు. అందుకు కావలసింది ద్వేషాన్ని, అహంకారాన్ని విడనాడటమే. ఇవి మనలో నుండి మనపైకి అధిరోహించి మనల్ని అథఃపాతాళానికి తొక్కేస్తాయి, కానీ మనమే అహంకారాన్ని అధోపాతాళానికి తొక్కిపెడితే మనం ఆకాశానికి ఎదుగుతాం.ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. - ప్రొ. చెరుకుపల్లి వంశీధర్