club
-
Mumbai Dating Scam: అమ్మాయిలనే ఎరగా వేసి.. యువతకు బురిడి
డేటింగ్ యాప్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువకులను కొందరు కిలేడీలు ట్రాప్ చేసి మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఘటనలు జరుగుతున్నాయి. అమాయకుల ఆశనే అసరాగా తీసుకుని.. మాటలతో మాయ చేసి అందిన కాడికి దోచుకుని మాయమవుతున్నారు. మ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ జేబులను ఖాళీ చేసుకొని చివరకు పోలీస్ స్టేషన్లకు పరుగెడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోవెలుగుచూసింది. డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని గాడ్‌ఫాదర్ క్లబ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. పలు డేటింగ్ యాప్‌ల ద్వారా అందమైన అమ్మాయిలతో కనెక్టివిటీ చేస్తారు. అనంతరం అమ్మాయిలు.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. ఫలానా హోటల్‌కు వెళ్దామంటూ తీసుకెళ్తారు. ముందుగా ఆమెకు నచ్చిన పదార్థాలు బుక్ చేసుకుంటుంది. మద్యం హుక్కా, ఖరీదైన ఫుడ్ ఆర్డర్చేస్తుంది. ఆర్డర్లు వచ్చాక ఇప్పుడే వస్తానంటూ యువతులు మధ్యలో జారుకుంటారుఇక బిల్లు చూడగానే గుండె చిల్లు పడినట్లు అవుతుంది. ఏకంగా వేలల్లో బిల్లు రావడం చూసి షాక్ అవుతుంటారు. ఇలా ముంబైలో జరిగిన ఘటనలో పలువురు బాధితులు రూ. 23,000 నుంచి రూ.61, 743 వరకు బిల్లులు కట్టారు. ఒకవేళ బిల్లు కట్టని వారిని క్లబ్ సిబ్బంది, బౌన్సర్లు బెదిరింపులకు పాల్పడతారు. దీంతో భయం, అవమానంతో బిల్లు కట్టేస్తుంటారు. ఇలా ప్రతి రోజూ కొంత మంది అబ్బాయిలు మోసపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది. 🚨 MUMBAI DATING SCAM EXPOSE 🚨THE GODFATHER CLUB ANDHERI WEST◾BRAZEN SCAMMING EVERYDAY◾12 victims in touch◾Trap laid through Tinder, Bumble◾Bill amounts 23K- 61K◾3 men trapped by same girl@MumbaiPolice @CPMumbaiPolice @mymalishka @CMOMaharashtra@zomato pic.twitter.com/qGOacFCE9f— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 23, 2024 ఇలా గాడ్‌ఫాదర్ క్లబ్ మాత్రమే కాదు ముంబైలో పలు క్లబ్‌లు మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ వైరల్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత క్లబ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా ఈ సంస్థలు పీఆర్ సిబ్బందిని నియమించుకుంటాయి. వారు డేటింగ్ యాప్‌లలో పురుషులను ఎర వేయడానికి యువతులను నియమించుకుంటారు. అబ్బాయిలను ముగ్గులోకి దింపేందుకు ఖరీదైన వస్తువులు లేదా, వ్యక్తిగత ఫోటోలతో ఎరవేస్తారు. అయితే ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. జూన్‌లో, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1.2 లక్షల బిల్లులను చెల్లించి ఓ సివిల్ సర్వీస్ అభ్యర్థి కూడా మోసపోయిన విషయం విదితమే. -
కలిసి ‘కూర్చోవడానికి’ కాని కాలం!
క్లబ్బులు స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇతరులతో కలిసి కూర్చోవడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. క్లబ్బు లోపలికి మీరు ఒక్కరిగానే వచ్చి ఉండవచ్చు. కానీ ఒక సంతోషకరమైన బృందంలో ఒకరిగా కలిసిపోతారు. క్లబ్బు సభ్యులు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారనే భావన అంతర్లీనంగా ఉంటుంది. అలాంటి పెద్ద మనుషులను చిన్నబుచ్చే సంగతి ఇది. దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ జింఖానా క్లబ్బు సభ్యుల ఖాతాలలో ‘పాజిటివ్ క్రెడిట్ బ్యాలెన్స్’ ఉండాలంటోంది. గుప్పెడుమంది డబ్బులు ఎగ్గొట్టి ఉండొచ్చు. మరీ అనుమానాస్పదంగా కనిపిస్తే తప్ప తినేందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఏ రెస్టారెంటూ అడగదు. అలాంటిది ఇంత పెద్ద క్లబ్బే ఇలా చేస్తే? కానికాలం అంటే ఇదే!మీరు కనుక ఒక క్లబ్బులో సభ్యుడై ఉన్నట్లయితే, అలా ఉండటం ఎంతో ప్రత్యేకమైనదని మీకు తెలిసి ఉంటుంది. సమస్థాయి వ్యక్తులు కలుసుకోవడానికి, సేద తీరేందుకు, అక్కడ తాము మాట్లాడేవి, చేసేవి బయటికి బహిర్గతం అవుతాయనే భయం లేకుండా ఒక సమూహంగా మసలుకునేందుకు బ్రిటిష్‌వాళ్లు ప్రవేశపెట్టినవే ఈ క్లబ్బులు. నిర్వచనం ప్రకారం అవి ఆంతరంగికమైనవి, గోప్యనీయతను కలిగి ఉండేవి. బహశా అందువల్లే సభ్యులకు తమ క్లబ్బులు ప్రియమైనవిగా ఉండి, వారు తరచు వాటి పట్ల అపరిమితమైన విధేయతను కలిగి ఉంటారు. దాంతోపాటుగా క్లబ్బు సభ్యులు ‘పెద్ద మనుషులు’గా పరిగణన పొందుతారు. మహిళా సభ్యుల విషయంలోనూ ఇది నిజం. ఒక అలిఖిత – అయితే అందరూ ఎరిగిన – ప్రవర్తనా నియమావళి క్లబ్బుల్లో అమలులో ఉంటుంది. క్లబ్బు సభ్యులు ఎల్లప్పుడు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారనే భావన అంతర్లీనంగా ఉంటుంది. సభ్యతగల పనులే చేస్తారని వారిపై నమ్మకం ఉంచవచ్చు. సంప్రదాయం ప్రకారం, క్లబ్బు సభ్యులు సభ్యత్వ నియమావళి మేరకు తామక్కడ పొందే సేవలకు డబ్బు చెల్లిస్తారు. అది బారులో డ్రింక్స్‌కి అయినా, డైనింగ్ హాల్లో విందుకైనా; లేదా క్రీడల సదుపాయాలను వినియోగించుకున్నా, వాటిల్లో పాల్పంచుకున్నా అందుకు అయిన ఖర్చును కచ్చితంగా, పూర్తిగా చెల్లించవలసి ఉంటుందనటంలో సందేహం లేదు. మొత్తమ్మీదైతే, ఈ మర్యాదస్తులు తమ చెల్లింపు నిబంధనలను గౌరవిస్తారు. పాడు కాలం, ఇప్పుడేమైందంటే దేశ రాజధానిలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, సభ్యత్వానికి అపరిమితమైన డిమాండును కలిగి ఉన్న ఢిల్లీ జింఖానా క్లబ్ ఇక మీదట మునుపటిలా ఉండబోవటం లేదు. ఆ క్లబ్బు తన సభ్యత్వానికే అవమానకరంగా, అసంబద్ధంగా – సభ్యులు తాము పొందబోయే సేవలకు గాను ముందుగానే డబ్బును డిపాజిట్ చేయాలన్న పద్ధతిని ప్రవేశపెట్టింది! క్లబ్బు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి క్లబ్బు బారులో తాగాలన్నా, క్లబ్బు డైనింగ్ హాలులో తినాలన్నా ఇకపై క్లబ్బు సభ్యుల ఖాతాలలో ‘పాజిటివ్ క్రెడిట్ బ్యాలెన్స్’ ఉండి ఉండాలి. అంటే మిగులు డబ్బులు ఉండాలి. వార్షిక సభ్యత్వ రుసుము కడుతున్నాం కదా అంటే ఇప్పుడు అదొక్కటే సరిపోదు. విషయం ఏంటంటే, మనకు ఇష్టమైనప్పుడు క్లబ్బుకు వెళ్లి కూర్చోవడానికి సదుపాయం కల్పించటమనే క్లబ్బు ప్రధాన ప్రయోజనాన్ని ఈ కొత్త పద్ధతి నెరవేరకుండా చేస్తుంది. మీరు మీ క్లబ్బు ఖాతాలో మిగులు డబ్బు లేకుండా తినలేరు. తాగలేరు. అప్పుడిక పక్క వారి మీద పడిపోవటమొక్కటే మీకుండే మార్గం. అది అధ్వాన్నమైన పరిస్థితి. క్లబ్బులు అనేవి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇతరుల కోసం మీరు డ్రింక్స్ కొనడానికి, లేదా వారితో కలిసి విందులో కూర్చోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. లోపలికి మీరు ఒక్కరిగానే వచ్చి ఉండవచ్చు. కానీ చివరికి మీరు ఒక సంతోషకరమైన బృందంలో ఒకరిగా కలిసిపోతారు. అయితే మీరు డిపాజిట్ చేసిన అడ్వాన్సు చాలినంతగా లేనప్పుడు మీరలా డ్రింక్స్‌ని కొనివ్వలేరు. లేదా ఫ్రెండ్ ఇచ్చిన డిన్నర్‌కు మీరు బిల్లు చెల్లించలేరు. ఆఖరికి వాణిజ్యపరమైన రెస్టారెంట్లు కూడా తమ అతిథులతో ఇంతకన్నా గౌరవంగా, సాదరంగా వ్యవహరిస్తాయి. అక్కడ తినటం ముగించి, వెళ్లటానికి సిద్ధం అయ్యాకే బిల్లు చెల్లిస్తారు. తినటానికి ముందే వాళ్లేమీ అడ్వాన్సు డిపాజిట్ చేసి ఉండనక్కర్లేదు. మీరు మరీ అనుమానాస్పదంగా, నమ్మదగనివారిగా కనిపిస్తే తప్ప మీరేం తినదలచుకున్నారో దానిని తినేందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఏ రెస్టారెంటూ మిమ్మల్ని అడగదు. అయినప్పటికీ జిమ్ – జింఖానాను ముద్దుగా సభ్యులు ఇలాగే పిలుచుకుంటారు – ఇకపై కొత్త పద్ధతి అమలు చేయబోతోంది. తన సభ్యత్వం పట్ల ఈ విధమైన అమర్యాదకర వైఖరికి క్లబ్బు చూపిస్తున్న సాకు ఏమిటంటే – కొంతమంది సభ్యులు తమ బిల్లులు చెల్లించటం లేదని! దురదృష్టవశాత్తూ, ఆ మాట నిజం. బకాయి పడిన వారి పేర్ల జాబితాను అందరికీ కనిపించేలా ఉంచినప్పటికీ కూడా వారికి చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. కానీ సభ్యులలో అలాంటి వారు కొద్ది మంది, లేదంటే కొంత భాగం. సభ్యత్వపు విధి విధానాలకు కట్టుబడి, బహుశా పది వేల మందికి పైగా ఉన్న సభ్యుల జాబితాలో అదే పనిగా, తీరు మార్చుకోకుండా బకాయి పడుతుండే సభ్యులు వందకు మించి ఉండరు. తరచు న్యాయబద్ధమైన, ఆమోదయోగ్యమైన కారణాల వల్ల బాకాయిలను ఆలస్యంగా చెల్లిస్తుండేవారిని ఉద్దేశపూర్వకంగానే నేను ఈ జాబితాలో చేర్చటం లేదు. ఇప్పుడు, మిగతా ప్రతి ఒక్కరూ – గౌరవప్రదంగా, అధిక సంఖ్యాకంగా ఉండేవారు – బకాయి పడుతున్న కొద్దిమంది విషయమై ప్రతిస్పందించటానికి క్లబ్బు ఇంతకన్నా మెరుగైన, ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనలేక పోయిన కారణంగా ఇబ్బంది పడాలా?చూస్తుంటే క్లబ్బు సమాధానం ‘అవును’ అన్నట్లే కనిపిస్తోంది. అలా కనిపించటమే క్లబ్బు యాజమాన్యం గురించి ఆందోళన కలగటానికి కారణం. క్లబ్ అంటే ఏమిటో, అదెలా ఉండాలని కోరుకుంటారో యాజమాన్యం అర్థం చేసుకోలేక పోయింది.ఏదేమైనా, ఇందుకు – దాటవేశారని చెప్పటానికి వీల్లేని – మరొక పరిష్కారం ఉంది. క్లబ్బు యాజమాన్యం నిజంగానే బిల్లు చెల్లింపులను బకాయి పెట్టే సభ్యుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన చెందుతున్నట్లయితే బయటి రెస్టారెంట్లలో మాదిరిగా తాగిన వెంటనే, లేదా తిన్న వెంటనే బిల్లు చెల్లించాలని వారిని కోరవచ్చు. నిజానికి లండన్‌లోని చాలా క్ల్లబ్బులు ఈ పనే చేస్తున్నాయి. అది మరింత చిత్తశుద్ధిగా, మర్యాదగా ఉంటుంది. ఢిల్లీ జింఖానా క్లబ్ అటువైపుగా ఎందుకు ఆలోచించలేక పోయింది?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎక్స్‌ప్లోరింగ్.. ది హిడెన్ టాలెంట్!
సాక్షి, హైదరాబాద్: కొందరికి హాబీ.. మరికొందరికి ప్యాషన్.. ఇంకొందరికి అభిలాష.. కారణమేదైనా వారందరినీ ఒకే దగ్గరికి చేర్చింది. వారి టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసుకునే అవకాశం కలి్పంచింది. వారి ఐడియాలను షేర్ చేసుకునే వీలునిచ్చింది. అదే ది మూన్‌షైన్ ప్రాజెక్టు వేదికగా ఆదివారం ట్రీ హగ్గర్స్ క్లబ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేఅఫేయిర్ ప్రోగ్రాం. టు షో ఆఫ్ స్కిల్స్.. యువతలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. చదువుల వెంట పరుగెడుతూ.. వారిలోని ఔత్సాహికతను, నవ్యాలోచనలను బయటపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఇంట్లోని నాలుగు గోడల మధ్యే మిగిలిపోకుండా ఉండేలా వారి స్కిల్స్‌ను చాటిచెప్పేందుకు ఇదో అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. గత 11 సంవత్సరాలుగా ట్రీ హగ్గర్స్ క్లబ్ పేరిట కమర్షియల్ వాసనలకు దూరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుప్రీత అనే ఔత్సాహికురాలు ఈ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. టాలెంట్‌ను వెలికితీసేందుకు.. యువతలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఈ క్లబ్ ఏర్పాటు చేశాం. ఎంతోమంది కళలకు సరైన ప్రోత్సాహం, అవకాశాలు దొరక్కపోవడంతో ఎంతోమంది తెర వెనుకే ఉండిపోతున్నారు. అలాంటి వారి అరుదైన కళలను వెలుగులోకి తీసుకురావాలనేదే మా కోరిక. కమర్షియల్‌గా కాకుండా ఆర్ట్‌లో ఉన్న ఫ్రీడమ్ వారు ఎంజాయ్ చేసేందుకు ఇలాంటి వేదికలు ఏర్పాటు చేస్తుంటాం. – సుప్రీత ఆమంచెర్ల, ఫౌండర్, ట్రీ హగ్గర్స్ క్లబ్ఫ్యాషన్తో ప్రారంభంచిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఏదో ఒక ఆర్ట్ వర్క్ చేయడం అలవాటు. ఎప్పుడూ ఏదో కొత్తగా ఆలోచిస్తూ ఉంటాను. ఆర్ట్‌లో ఒక ఫ్రీడమ్ ఉంటుందనేది నా భావన. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి డిజైనింగ్ నేర్చుకున్నాను. ఇందులో భాగంగానే లిటిల్ బోటో పేరుతో ప్రాజెక్టు ప్రారంభించాను. కలరింగ్ బుక్స్‌ను స్వయంగా రూపొందిస్తుంటాను. – విశ్వ సింధూరి నేతి, లిటిల్ బోటో ప్రాజెక్టుఇంట్లోనే బేకరీచిన్నప్పటి నుంచి చెఫ్ కావాలనేది నా లక్ష్యం. అందుకు అనుగుణంగానే నా ఆలోచనలు ఉండేవి. కాకపోతే బేకరీ ఏర్పాటు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బంది. అందుకే నేను నేర్చుకున్న కళతో ఇంటి నుంచే కేక్స్, పేస్టరీస్, కప్ కేక్స్ తయారు చేస్తుంటాను. చాలామంది వారికి నచి్చన థీమ్‌తో కేక్స్ తయారు చేయించుకుంటారు. డబ్బుల కన్నా వాళ్లు నా పనితీరును మెచ్చుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. –మనిక ఖట్టర్, ఇంపర్ఫెక్షన్ బేకర్స్ -
కేవ్ క్లబ్ డ్రగ్స్ కేసు.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓహియో రాష్ట్రంలోని ఓ నైట్ క్లబ్లో గుర్తు తెలియని అంగతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ గ్రెగ్ బోడ్కర్ ప్రకారం..అవలోన్ డాన్స్ క్లబ్లో తెల్లవారుజామున సుమారు 1:45 గంటలకు క్లబ్‌కు వచ్చిన వారి మధ్య వాగ్వాదం తలెత్తిందని, దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బాధితుల పరిస్థితి విషయం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ కాల్పులు జరిపింది ఎవరు? అందుకు కారణాలు. నిందితులు వివరాల గురించి స్పష్టత రావాల్సి ఉండగా.. మరణించిన బాధితుల వయస్సు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానిక పోలీసులు వెల్లడించారు. -
హైదరాబాద్ శరత్ సిటీ మాల్ లో అత్యాధునిక థీమ్ తో A19 క్లబ్, కిచెన్ ప్రారంభం (ఫొటోలు)
-
రూ.16,195 కోట్ల టాక్స్ నోటీసుపై హైకోర్టు స్టే
డెల్టాకార్ప్ సంస్థకు జారీ చేసిన రూ.16,195 కోట్ల జీఎస్టీ నోటీసుపై తుది ఉత్తర్వులు ఇవ్వకూడదని బొంబాయి హైకోర్టు గోవాబెంచ్ తేల్చి చెప్పింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనంతో డెల్టాకార్ప్ షేర్ హోల్డర్లకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. గత నెలలో డెల్టాకార్ప్‌తో పాటు అనుబంధ సంస్థలకు దాదాపు రూ.23,000 కోట్ల మేర పన్ను చెల్లింపునకు సంబంధించిన నోటీసులు అందాయి. ముందస్తు అనుమతి లేకుండా రూ.16,195 కోట్ల పన్ను నోటీసుపై తుది ఉత్తర్వులు జారీ చేయరాదని బొంబాయి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 23న కంపెనీ, దాని అనుబంధ సంస్థలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను బాంబే హైకోర్టు పరిశీలించింది. గేమింగ్, క్యాసినో వ్యాపారాలపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో జీఎస్టీ పన్ను రేట్లను సైతం భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీ పన్ను నోటీసులతో సతమతమవుతున్నాయి. -
అవగాహనే అస్త్రం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమైన ‘స్కూల్ కన్జ్యూమర్ క్లబ్’లను ప్రస్తుత వైఎస్ జగన్ సర్కార్.. ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 8, 9 తరగతుల విద్యార్థులతో దాదాపు 6 వేలకు పైగా వినియోగదారుల క్లబ్‌లను ఏర్పాటు చేయించింది. ఒక్కో క్లబ్లో కనీసం 100 మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ.. సుమారు 6 లక్షల మందిని వినియోగదారుల హక్కుల పరిరక్షకులుగా తీర్చిదిద్దబోతోంది. విద్యార్థులే వినియోగదారులుగా తమ హక్కులను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని తమ కుటుంబసభ్యులకు, గ్రామాల్లోని నిరక్షరాస్యులకు, తోటి విద్యార్థులకు బోధించేలా ప్రభుత్వం ఈ క్లబ్‌లకు రూపకల్పన చేసింది. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు దోపిడీకి గురికాకుండా సమగ్ర పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇద్దరు మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది. ఈ మాస్టర్ ట్రైనర్లు రాష్ట్రంలోని అన్ని క్లబ్‌ల టీచర్ గైడ్లకు దశలవారీగా, క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వనున్నారు. పుస్తకాలు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వినియోగదారుల హక్కులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘మేము సైతం’ పేరుతో శిక్షణ మాడ్యూల్ పుస్తకాన్ని వెలువరించారు. త్వరలోనే వినియోగదారుల హక్కుల పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి, క్లబ్‌లు చేపట్టిన కార్యకలాపాలను అప్లోడ్ చేయడానికి వీలుగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుంది. క్లబ్‌ల కార్యక్రమాల ఆధారంగా అవార్డులతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. పోస్టర్లతోనూ విస్తృత ప్రచారం వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పిం చేలా 10 రకాల పోస్టర్లతో కూడా ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించనుంది. వస్తువు కొనుగోలులో వినియోగదారులకు ఉండే హక్కులు, బాధ్యతలు, ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ బంకుల్లో పొందే హక్కులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై అవగాహన, సమస్య వస్తే వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసే విధానం, బిల్లు ఆవశ్యకత తదితర అంశాలను వివరించనుంది. అలాగే వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశాలతో ‘మేలు కొలుపు’ పేరుతో మాస పత్రికను కూడా ప్రచురిస్తోంది. నెలకు సుమారు 9 వేల కాపీలను విడుదల చేస్తుండగా వీటిని వినియోగదారుల క్లబ్‌లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో వినియోగదారుల అవగాహన కార్యక్రమాల నిర్వహణకు జాయింట్ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించారు. విద్యార్థులతోనే చైతన్యం.. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదంటే సేవను పొందేటప్పుడు వినియోగదారుడికి చట్టం కొన్ని హక్కులు కల్పిం చింది. వీటి ద్వారా మోసాల నుంచి కొనుగోలుదారుడు తనను తాను రక్షించుకోవచ్చు. కానీ, ఎన్నో ఏళ్లుగా వినియోగదారులు తమ హక్కులు తెలుసుకోవడంలో వెనుకబడిపోయారు. అందుకే ప్రభుత్వం పాఠశాల విద్య దశలోనే ఈ అంశంపై సమగ్ర అవగాహన కల్పిం చేందుకు కృషి చేస్తోంది. విద్యార్థుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు. అందుకే సమస్య వస్తే వినియోగదారుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియజేయడంతో పాటు మోసపోకుండా సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నాం. – హెచ్.అరుణ్ కుమార్, వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ -
లండన్‌లోని ఇండియా క్లబ్ ఎందుకు మూతపడింది? స్వాతంత్య్రోద్యమంతో లింక్ ఏమిటి?
లండన్‌లోని చారిత్రాత్మక ఇండియా క్లబ్‌ను 2023, సెప్టెంబర్ 17న శాశ్వతంగా మూసివేశారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారతీయులకు ఈ క్లబ్ విశ్రాంతి స్థలంగా ఉండేది. ఇక్కడి రెస్టారెంట్లో భారతీయ వంటకాలు లభించేవి. బ్రిటన్‌లో భారతదేశంతో సంబంధం కలిగినవారు ఇక్కడ తరచూ కలుసుకునేవారు. పలువురు బ్రిటిష్ వారితో పాటు భారతీయ రాజకీయ నాయకులు ఇక్కడకు తరచూ వచ్చేవారు. గత కొన్నేళ్లుగా ఇండియా క్లబ్ చుట్టూ ఉన్న వాణిజ్య ఆస్తుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ క్లబ్ లండన్‌లోని స్ట్రాండ్ కాంటినెంటల్ హోటల్లో ఉంది. దీనిని 1951లో ఇండియా లీగ్ ప్రారంభించింది. ఇది ఒక బ్రిటిష్ సంస్థ. ఇది భారత స్వాతంత్ర్యం, స్వరాజ్యానికి మద్దతుగా నిలిచింది. స్వాతంత్య్రానంతరం, ఈ క్లబ్ ఇండో-బ్రిటీష్ స్నేహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. పీటీఐ నివేదిక ప్రకారం ఆసియా కమ్యూనిటీకి సేవలందిస్తున్న లీగ్ వంటి గ్రూప్‌లకు ఇండియా క్లబ్ అనతికాలంలోనే స్థావరంగా మారింది. క్లబ్ లండన్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్, ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, ఇండియన్ సోషలిస్ట్ గ్రూప్ ఆఫ్ బ్రిటన్ తమ ఈవెంట్లు, కార్యకలాపాల కోసం ఇండియా క్లబ్‌ను ఉపయోగించుకునేవి. బ్రిటన్‌లోని ఆసియన్ల రోజువారీ జీవితం కష్టతరంగా ఉన్న సమయంలో లండన్ క్లబ్ ఉపఖండంలోని ప్రవాస సంఘాలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. జర్నలిస్ట్ చందన్ థరూర్ ఇండియా క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన కుమార్తె స్మితా థరూర్ ఇప్పటికీ లండన్‌లోనే ఉంటున్నారు. స్మిత తరచూ తన సోదరుడు శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ),ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లండన్ క్లబ్‌లకు వెళ్లేవారు. లండన్ క్లబ్‌కు వచ్చిన విశిష్ట సందర్శకులలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారని స్మిత తెలియజేశారు. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్‌లోని ఒక కథనం ప్రకారం క్లబ్‌ను సందర్శించిన వారిలో భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి బ్రిటీష్ ఇండియన్ ఎంపీ దాదాభాయ్ నౌరోజీ, తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. ఇండియా క్లబ్ స్థాపనలో దౌత్యవేత్త, మాజీ భారత రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్ పాత్ర కూడా ఉంది. సెంటర్ ఫర్ మైగ్రేషన్ అండ్ డయాస్పోరా స్టడీస్ వ్యవస్థాపక చైర్ పార్వతి రామన్ మాట్లాడుతూ భారతీయ యువతను ఆదుకునేందుకు, రాజకీయాలను చర్చించడానికి ఇండియా క్లబ్ ఉపయోగపడాలని మీనన్ భావించారన్నారు. మీనన్ తదుపరి కాలంలో యునైటెడ్ కింగ్డమ్కు భారత మొదటి హైకమిషనర్‌గా మారారు. రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం పార్సీ సమాజానికి చెందిన యాద్గార్ మార్కర్.. గోల్డ్‌సాండ్ హోటల్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా 1997 నుండి తన భార్య ఫ్రాంనీ, కుమార్తె ఫిరోజాతో కలిసి లండన్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన లండన్ క్లబ్‌ను కాపాడేందుకు ‘సేవ్ ఇండియా క్లబ్’ పేరుతో పబ్లిక్ అప్పీల్‌ను కూడా ప్రారంభించారు. 2018లో భవనం పాక్షిక కూల్చివేతను నిరోధించడానికి ఈ ఉద్యమం దోహదపడింది. లండన్ క్లబ్ నిర్వాహకులు హోటల్‌ను ఆధునికీకరించాలంటూ భూస్వాముల నుండి నోటీసు అందుకున్నారు. అయితే వెస్ట్‌మినిస్టర్ సిటీ కౌన్సిల్ విస్తరణ ప్రణాళిక దరఖాస్తును తిరస్కరించింది. దీనికి అనుమతి మంజూరు చేయడమంటే ఒక సాంస్కృతిక స్థలాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది. కోవిడ్-19 లాక్డౌన్ యూకేలోని పలు రెస్టారెంట్ల వ్యాపారాలను దెబ్బతీసింది. దీనికితోడు జీవన వ్యయ సంక్షోభం మధ్య అద్దెలు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్థితిలో ఇండియా క్లబ్‌ను నిర్వహించడం దాని యజమానులకు కష్టతరంగా మారింది. ఇండియా క్లబ్ మేనేజర్ ఫిరోజా మార్కర్ మీడియాతో మాట్లాడుతూ రెస్టారెంట్ తరలించేందుకు సమీపంలోని మరో ప్రదేశం కోసం వెదుకుతున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ పాత భవనాన్ని ఏం చేయనున్నారు? 10 పాయింట్లలో పూర్తి వివరాలు.. I am sorry to hear that the India Club, London, is to close permanently in September. As the son of one of its founders, I lament the passing of an institution that served so many Indians (and not only Indians) for nearly three-quarters of a century. For many students,… pic.twitter.com/bwyOB1zqIu — Shashi Tharoor (@ShashiTharoor) August 19, 2023 -
మీకు తెలుసా! ఆ చారిత్రాత్మక రెస్టారెంట్ హఠాత్తుగా మూతపడుతోంది!
యూకే రాజధాని లండన్‌లో భారత్‌కి చెందిన ఓ ఐకానిక్ రెస్టారెంట్ మూతపడుతోంది. దీన్ని "ఇండియా క్లబ్" అని కూడా పిలుస్తారు. ఇది సెంట్రల్ లండన్‌లో రద్దీగా ఉండే రహదారిలో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉంది. ఇది దశాబ్దాలుగా నగరంలోని దక్షిణాసియా ప్రజలకు బాగా సుపరిచితమైనది. ఎన్నో రకాల దక్షిణ భారతదేశ వంటకాలను సుపరిచితం చేసిన ఈ రెస్టారెంట్ అనూహ్యంగా మూతపడుతోంది. స్వాతంత్య్రం కోసం పోరాడిని ఎందరో త్యాగధనులకు ఆతిధ్యం ఇచ్చింది. భారతదేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం అయిన ఈ రెస్టారెంట్ ఎందుకు మూతపడనుందంటే.. నిజానికి 1950 దశకంలో భారతీయ వలసదారులను కలుసుకునేందుకు ఓ ప్రదేశం ఏర్పాటయ్యింది. ఇది సెంట్రల్ లండన్‌లో రద్దీగ ఉండే రహదారిలో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉంది. దీన్ని ఇండియా లీగ్ సభ్యులు ప్రారంభించారు. బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ 1900లలో ఈ క్లబ్లో భారతదేశానికి స్వాతంత్య్రం కోసం ప్రచారం చేసింది. అలాగే భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ఈ క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1990లలో పరిపాలనాధికారులు దీన్ని లీజుకు కొనుగోలు చేశారు. స్వాతంత్య్ర కార్యకర్తలు దీన్ని సమావేశ స్థలంగా ఉపయోగించుకున్నారు. 1950, 60లలో భారతీయులు తమ భాష మాట్లాడే వారు, తమ దేశ ఆహారం తినడం కోసం ఇక్కడకు వచ్చేవారని క్రమం తప్పకుండా సందర్శించే చరిత్రకారురాలు కసూమ్ వడ్గామ చెప్పారు. ప్రజలు పుట్టిన రోజులు, వివాహాలు, దీపావళి వంటి పండుగలను జరుపుకోవడానికి తరుచుగా ఇక్కడకు వచ్చేవారు. వడ్గామా తూర్పు ఆఫ్రికా వలస పాలనలో పెరిగారు. చదువుకోవడానికి యూకే వెళ్లారు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత సంవత్సరాలలో చాలామంది ప్రజలు యూకేకి వలస వచ్చారు. అయితే లండన్‌లో భారతీయ ప్రవాసుల కోసం సాంస్కృతిక సంస్థలు ఏవీ లేవు. ఆ లోటును ఈ ఇండియన్ క్లబ్ పూరించింది. ఈ రెస్టారెంట్లో దోశలు, పప్పులతో చేసే మసాల కర్రీలు, బట్టర్ చికెన్, కూరగాయాల వడలు, కాఫీ, మసాలా చాయ్ తదితర భారతీయ వంటకాలను అందించేది. ఈ క్లబ్ ఇంటీరియర్ కూడా భారతదేశంలోని కాఫీ షాపులను అనుకరించేలా రూపొందించారు. 70 ఏళ్ల క్రిత ఏర్పాటు చేసిన స్ట్రెయిట్ బ్యాక్డ్ కుర్చీలనే వాడుతున్నారు. ఇంకా మారలేదు. అంతేగాదు నాటి సామాజికి రాజకీయ చరిత్రకు గుర్తుగా గోడలపై భారతీయ బ్రిటీష్ వ్యక్తుల చిత్రాలు ఉన్నాయి. దాదాభాయ్ నౌరోజీ నుంచి తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ వరకు, జర్నలిస్ట్‌లు, వలసదారులకు ప్రసిద్ధమైన ప్రాంతంగా ఉంది. ఎందుకు మూతపడుతోందంటే.. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న అలాంటి క్లబ్ మూతపడుతోంది. ఆ భవనం ఉన్న ప్రదేశంలోని యజమానులు నిర్మాణంలో కొంత భాగాన్ని కూల్చివేయాలని కోరుతున్నారు. మరింత ఆధునికరించిన హోటల్‌గా మార్చాలని డిసైడ్ అయ్యారు. క్లబ్‌ని మూసివేయడం వల్ల నగర చరిత్రలో కొంత భాగాన్ని కోల్పోతుందని చాలామంది ఆవేదనగా చెబుతున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కూడా. ఆ క్లబ్ యజానులు యాద్గార్ మార్కర్, అతని కుమార్తె ఫిరోజా ఈ స్థలాన్ని కాపాడేందుకు మద్దతు కోసం వేలాది మంది నుంచి సంతకాలను తీసుకుని కూల్చివేత పోరాటంలో విజయం సాధించారు కూడా. అయితే గతవారమే వారు క్లబ్ తెరిచి ఉండటానికి సెప్టెంబర్ 17 చివరి రోజు అని ఆవేదనగా ప్రెస్‌తో చెప్పడం గమనార్హం. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
ఈత రావాలి ప్రాణం నిలవాలి
ఇది వానల కాలం. వరదల కాలం. కేరళలో ఈ సమయంలో పడవ ప్రమాదాలు సాధారణం. ప్రమాద తీవ్రత కంటే ఈత రాకపోవడం వల్ల జనం మరణిస్తున్నారని సాజి వెలస్సిరల్ అనే వ్యక్తికి అనిపించింది. చిన్న ఫర్నిచర్ షాపు నడుపుకునే ఇతడు గొప్ప ఈతగాడు కూడా. ఇంకేముంది. ఊళ్లో ఉన్న పెరియార్ నదిని స్విమ్మింగ్ పూల్‌గా చేసుకుని అందులోనే ఈత నేర్పుతున్నాడు. ఇప్పటికి 6000 మంది ఈత నేర్చుకున్నారు. వీళ్లందరి ప్రాణాలను నీళ్ల నుంచి ఇతడు రక్షించినట్టే. ప్రతి చోటా ఇలాంటి వాళ్లుంటే వేల ప్రాణాలు బతుకుతాయి. గత మే నెలలో కేరళలోని తానురు దగ్గర బ్యాక్ వాటర్స్‌లో పడవ మునిగి 27 మంది చనిపోయారు. ‘వాళ్లకు ఈత వచ్చి ఉంటే అందరూ బతికి ఉండేవారు. తుఫాను లేదు.. సముద్రమూ కాదు. ఈత వచ్చి ఉంటే పడవ బోల్తా పడినా ఆ బ్యాక్ వాటర్స్‌లో హాయిగా ఈదుకుంటూ గట్టెక్కవచ్చు. లేదా సహాయకబృందాలు చేరేవరకూ మెల్లగా తేలుతూనే ఉండొచ్చు’ అంటాడు సాజి వెలస్సిరల్. ఈ ప్రమాదం కాదు ఇరవై ఏళ్ల క్రితం ఇతడు చూసిన ప్రమాదమే ఇతడి మనసు మార్చింది. కుమర్కోమ్లో పడవ బోల్తా పడి 29 మంది చనిపోయారు. అప్పుడు సాజి యువకుడు. తండ్రి మంచి స్విమ్మర్ కావడంతో ఆయన నుంచి ఈత నేర్చుకుని అద్భుతంగా ఈదుతున్నాడు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారికి ఈత వచ్చి ఉంటే ప్రాణాలు మిగిలి ఉండేవి అనిపించింది. ‘ఈత ఎందుకు రాదు’ అని ప్రశ్నించుకున్నాడు. ‘నేర్పేవారు లేకపోవడం వల్ల’ అనే జవాబు వచ్చింది. ‘నేనెందుకు నేర్పకూడదు’ అనుకున్నాడు. అలా అతని ఈత సేవ మొదలైంది. పెరియార్ నదిలో సాజి వెలస్సిరల్ అలువా అనే చిన్న ఊరిలో ఉంటాడు. ఇది ఎర్నాకుళంకు 40 నిమిషాల దూరం. ఆ ఊళ్లో చిన్న ఫర్నీచర్ షాపు నడుపుకుంటూ జీవిస్తుంటాడు సాజి. అయితే అదే ఊరి నుంచి పెరియార్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు నిలువ నీరులా ఉంటుంది ప్రవాహం. ‘దీనినే స్విమ్మింగ్‌పూల్‌గా చేసుకుని ఈత నేర్పిస్తాను’ అని నిర్ణయించుకున్నాడు సాజి. ‘ముందు నా కుటుంబం నుంచే మొదలెట్టాలి’ అనుకుని తన ఇద్దరు పిల్లల్ని, స్నేహితుడి పిల్లల్ని తీసుకుని నదిలో ఈత నేర్పడం మొదలెట్టాడు. మూడు వారాల్లోనే పిల్లలు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు (780 మీటర్లు) ఈదడం నేర్చుకున్నారు. దాంతో ఊరి దృష్టి సాజి మీద పడింది. అతడి దగ్గర ఈత నేర్చుకోవడానికి అందరూ క్యూ కట్టారు. వెలస్సిరల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్ నేర్చుకునేవారు పెరిగే కొద్దీ సాజికి ఉత్సాహం వచ్చింది. తన ఈత కేంద్రానికి వెలస్సిరల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్ అనే పేరు పెట్టాడు. ప్రత్యేక దినాల్లో, పండగ వేళల్లో సామూహిక ఈత కార్యక్రమాలు నిర్వహిస్తాడు. నది ఈదే పోటీలు నిర్వహిస్తాడు. విశేషం ఏమిటంటే 70 ఏళ్ల ఆరిఫా అనే మహిళ ఇతని దగ్గర ఈత నేర్చుకుని చేతులు వెనక్కు కట్టుకుని మరీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈదింది. శారీరకమైన అవకరాలు ఉన్నవారికి కూడా ఈత నేర్పే టెక్నిక్స్ ఇతని దగ్గర ఉన్నాయి. ఇతను ఈత నేర్పేటప్పుడు ఒక అంబులెన్సు ఒడ్డున, నదిలో రక్షణకు ఒక పడవ సిద్ధంగా ఉంటాయి. ‘ఈత నేర్వాలి. ప్రాణాలు నిలుపుకోవాలి. ప్రమాదవశాత్తు నీళ్లల్లో పడితే ఈదలేక మరణించడం దురదృష్టకరం’ అంటాడు సాజి. అతని హెచ్చరిక వినదగ్గది. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్..ఇందులో చేరాలంటే..
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన క్లబ్‌లలో డిస్నీలాండ్‌కు చెందిన క్లబ్–33 ఒకటి. దీనిలో సభ్యత్వానికి ప్రవేశ రుసుముగా 50 వేల డాలర్లు (రూ.41.02 లక్షలు), వార్షిక రుసుముగా 15 వేల డాలర్లు (రూ.12.30 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత విలక్షణమైన డిన్నర్ క్లబ్బులలో ఒకటిగా ఇది పేరు పొందింది. తొలుత దీనిని 1967లో ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఫ్లోరిడాలోని డిస్నీలాండ్ పార్కులోను, టోక్యో, షాంఘై సహా పలు నగరాల్లోని డిస్నీ పార్కుల్లోనూ ఈ క్లబ్ శాఖలను ఏర్పాటు చేశారు. న్యూ ఆలీన్జ్ స్క్వేర్‌లోని 33 రాయల్ స్ట్రీట్‌లో ఉన్న డిస్నీపార్కు చిరునామా ఆధారంగా ఈ క్లబ్‌కు క్లబ్–33 అని పేరు పెట్టారు. క్లబ్ తొలి శాఖను ఇక్కడే నెలకొల్పారు. తొలిరోజుల్లో ఈ క్లబ్ డిస్నీలాండ్ కార్పొరేట్ స్పాన్సర్లకు మాత్రమే పరిమితంగా పనిచేసేది. వాల్ట్ డిస్నీ మరణానంతరం ఇందులో ఇతర వీఐపీలకు కూడా సభ్యత్వం కల్పించడం ప్రారంభించారు. సామాన్యుల కంట కనబడకుండా ఉండటానికి హాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ఇక్కడ డిన్నర్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. (చదవండి: 13 ఏళ్ల అమ్మాయి..తల్లిదండ్రులకు ఓ రేంజ్లో షాక్ ఇచ్చింది!) -
మహిళ దుస్తులు చింపి, అనుచిత దాడి...కాదు దోపిడి అంటున్న యజమాని
న్యూఢిల్లీ: ఒక క్లబ్‌లోని బౌన్సర్లు ఒక మహిళ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. సదరు మహిళ బట్టలు చింపి, దారుణంగా దాడి చేశారు. దీంతో సదరు మహిళ ఇద్దరు బౌన్సర్లు తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదులు చేసింది. సెప్టంబర్ 18న ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... సదరు బాధిత మహిళ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. తాము సంఘటన స్థలానికి వచ్చేటప్పటికీ మహిళ దుస్తులు చిందరవందరగా ఉన్నట్లు గుర్తించామన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కి తరలించామని తెలిపారు. అలాగే సదరు క్లబ్‌లోని బౌన్సర్ల వివరాలను సేకరించడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ స్నేహితులతో కలిసి క్లబ్‌కి వచ్చానని, ఎంట్రీపై వాగ్వాదం చోటు చేసుకోవడంతో బౌన్సర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కానీ విచారణలో క్లబ్ యజమాని సురేంద్ర్ సింగ్ చౌదరి మరో కథ చెబుతన్నాడు. తాము ప్రతినెల స్థానిక పోలీస్ సిబ్బందికి దాదాపు రూ. 5 లక్షలు చెల్లించాల్సి వస్తుందని తెలిపాడు. ఐతే తాను చెల్లించడానికి ప్రస్తుతం నిరాకరించడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పోడియం వద్ద నుంచి బలవంతంగా సుమారు రూ. 1.5 లక్షలు తీసుకుని పోలీసులకు ఫోన్ చేశారని తెలిపాడు. చచ్చిన ఆ పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, ఇవ్వకపోతే తీవ్ర పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారని వివరిస్తూ..స్పెషల్ సీపీకి లేఖ రాశాడు. అలాగే పోలీసులు తమ క్లబ్ సిబ్బందిలో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాదు సదరు క్లబ్ యజమాని తమ క్లబ్లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం) -
హైదరాబాద్: కెపిహెచ్బి క్లబ్ మస్తీ పబ్‌లో అశ్లీల దందా
-
బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అశ్లీల కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్‌లో నిర్వహిస్తున్న క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతులతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ అనుమతుల ను తీసుకున్న క్లబ్ మస్తీ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా తెల్లవారుజాము వరకు పబ్‌ను నిర్వహిస్తూ యువతీ యువకులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేశారు. అప్పటికే హోరెత్తించే డీజే శబ్దాల నడుము యువత మద్యం సేవించి నృత్యాలు చేస్తూ కనిపించా రు. మప్టీలో ఉన్న పోలీసులు వారి ఫొటోలు, వీడియోలను తీయడంతో అనుమానం వచ్చిన పలువురు యువకులు పరుగులు తీశారు. దీంతో అందరినీ ఒకచోటకు చేర్చి వారి వివరాలను సేకరించారు. అనంతరం పబ్‌లో సేవిస్తున్న మద్యం వివరాలు, హుక్కా వివరాలు సేకరించి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు సేవించారా? అనే విషయమై ఆరా తీశారు. డ్రగ్స్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హుక్కా సేవించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పబ్ మస్తీ యాజమానులైన శివప్రసాద్‌రెడ్డి, మేనేజర్ విష్ణు, నిర్వాహకుడు కృష్ణ పరారీలో ఉండగా, డ్యాన్స్‌లు చేస్తూ పట్టుబడిన తొమ్మిది మంది యువతులతో పాటు మేనేజర్ ప్రదీప్‌కుమార్, డ్యాన్సర్ ప్రవీణ్, డీజే ఆపరేటర్ ధన్‌రాజ్, సాయిసంతోష్లను అదుపులోకి తీసుకున్నారు. ప బ్లోని డీజే మిక్సర్, కంట్రోలర్, క్రాస్ ఓవర్ పరికరాలను సీజ్ చేశారు. అనంతరం వీరిని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీ సీఐ కిషన్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలోనూ ఇక్కడి బార్ అండ్ రెస్టారెంట్‌పై పలువురు ఫిర్యాదు చేయగా కొద్ది రోజుల పాటు పబ్ కార్యకలాపాలను నిలిపివేసిన యజమానులు తిరిగి ఇటీవల కాలంలో మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిసింది. ప్రధానంగా యువతులను ఎరవేసి యువకులను పబ్‌కు రప్పిస్తున్నారన్న ఆరోపణలు పబ్ నిర్వాహకులపై ఉన్నాయి. -
కూకట్ పల్లి పబ్ లో చీకటి గుట్టు రట్టు
-
ముంబైలో దారుణం.. బ్రిటిష్ మహిళపై అత్యాచారం
ముంబై: ముంబైలోని బాంద్రాలో బ్రిటిష్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న బ్రిటిష్ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. మంగళవారం బాంద్రాలోని ఓ క్లబ్లో జరిగిన ఘటన ఆలస్యం గా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ (44) ముంబైలోని బ్రిటిష్ రాయబార కార్యాలయంలో గత కొన్నేళ్లుగా పనిచేస్తోంది. మంగళవారం తన భర్త, మరికొంతమంది స్నేహితులతో కలసి ఆమె బాంద్రాలోని ఓ క్లబ్ కు వెళ్లింది. సుమారు రాత్రి 11.30 గంటల సమయంలో సదరు మహిళ బాత్రూమ్కు వెళ్లగా...అక్కడ 35 ఏళ్ల యువకుడు ఆమెను వెంబడించి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే బయటకొచ్చి జరిగిన విషయం తన భర్తకు, స్నేహితులకు చెప్పగా వారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు నగరానికి చెందిన ఘనశ్యామ్ లాలాచంద్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. లాల్ చంద్‌పై ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఎ), 509 కింద కేసు నమోదు చేశారు. -
బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన
అనకాపల్లి: సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ సమయం.. పశుపక్ష్యాదులకు గడ్డుకాలం. పల్లెల్లో పక్షులకు ఏదో రూపంలో ఆహారం, నీరు సమకూరుతాయి. పట్టణ ప్రాంతాల్లో జంగిల్ కాంక్రీట్ పుణ్యమా అని నీరు లభించడమే కష్టమవుతోంది. అందుకే పక్షి ప్రేమికులు వాటి కోసం విలక్షణంగా ఆలోచించారు. పట్టణాల్లో కూడా ఆహారం, నీరు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణకు విశేష సేవలందించిన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ ఆధ్వర్యంలో సేవామూర్తులు పక్షులకు అండగా నిలుస్తున్నారు. చదవండి👉: 11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది.. పక్షి జాతిని కాపాడుకుందామని ప్రదర్శన చేస్తున్న విద్యార్థినులు నూనె డబ్బాను నాలుగు అరలుగా అమరిక చెట్ల వద్ద ఆహారం, నీటి సౌకర్యం గ్రీన్‌క్లబ్ వ్యవస్థాపకుడైన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తాను పని చేసే పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దే అలవాటు ఉన్న శ్రీధర్ మాస్టారు.. పర్యావరణ పరిరక్షణలో కూడా ముందుంటారు. వేసవి నేపథ్యంలో పట్టణంలో అక్కడక్కడా ఉండే చెట్ల వద్ద అలమంటించే పక్షులకు ఆహారం, నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నూనె డబ్బాలను సగానికి కోసి దాంట్లో నాలుగు అరలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అరలో కొర్రలు, గంట్లు వంటి ఆహార పదార్థాలను, మరో అరలో నీటిని వేసి చెట్లకు కట్టించారు. నీటి బాటిళ్లను మట్టిపాత్రలకు అమర్చి పలు చోట్ల ఏర్పాటు చేశారు. పక్షిజాతిని కాపాడుకోవాలని పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొక్కకు అమర్చిన మట్టిపాత్ర పక్షుల కోసమే.. ఇప్పటికే చాలా పక్షిజాతులు అంతరించిపోయాయి. వేసవికాలంలో అవి పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నగరాల్లో పక్షులకు ఆహారం, మంచినీరు అందించే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. పక్షి జాతులకు ఎంతో కొంత సహాయం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ మహాయజ్ఞంలో చాలా మంది పాలు పంచుకుంటున్నారు. – ఫణిభూషణ్ శ్రీధర్, క్లబ్ వ్యవస్థాపకుడు -
సికింద్రాబాద్ క్లబ్ వెనుక చెప్పలేని చరిత్ర
-
నాణ్యతకు ఇదే సాక్షి
సాక్షి, హైదరాబాద్: సాక్షి దినపత్రిక మరో అరుదైన ఘనత సాధించింది. కలర్ఫుల్గా వెలుగులు విరజిమ్ముతూ రంగుల ముద్రణా నాణ్యతలో తనకు సాటిలేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ కలర్ క్వాలిటీ క్లబ్ (ఐసీక్యూసీ)లో సభ్యత్వాన్ని సాధించింది. 2018–20 సంవత్సరాలకుగాను సాక్షి ఈ ఘనతను సాధిం చినట్లు వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ (వాన్–ఇఫ్రా) శుక్రవారం ప్రకటించింది. ఐసీక్యూసీలో సభ్యత్వం కోసం సాక్షి మీడియా గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లోని 22 ముద్రణా కేంద్రాల తరఫున పోటీలో పాల్గొంది. అన్ని ప్రింట్ సెంటర్లకు ఐసీక్యూసీలో విజయవంతంగా సభ్యత్వాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ఒక వార్తా పత్రిక తమ ముద్రణా కేంద్రాల న్నింట్లోనూ అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఐసీక్యూసీలో సభ్యత్వం కోసం పోటీ పడి దానిని సాధించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. వాన్–ఇఫ్రా ఐసీక్యూసీ పోటీలో ఏకంగా 22 ఎడిషన్లలో సభ్యత్వాన్ని సాధించిన ప్రపంచంలోని ఏకైక సంస్థ సాక్షి మాత్రమే. వార్తా పత్రికలు, పబ్లిషింగ్ సంస్థలు ముద్రణలో ఎంతవరకు నాణ్యతను పాటిస్తున్నాయో శాస్త్రీయంగా పరిశీలిస్తూ వస్తోంది వాన్ ఇఫ్రా. 1994 నుంచి ముద్రణకు సంబంధించి పోటీలు నిర్వహిస్తూ ముద్రణా ప్రమాణాలకు అనుగుణంగా పాయిం ట్లు ఇస్తోంది. ఈ పోటీలో పాల్గొని ముద్రణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించిన దినపత్రికలకు ఐసీక్యూసీలో సభ్యత్వాన్ని ఇస్తోంది. పాఠకుల్ని, అడ్వర్టయిజర్లను ఆకట్టుకోవాలం టే ముద్రణలో నాణ్యతా ప్రమాణాలు అత్యంత ముఖ్యమని భావించిన ఇఫ్రా ఈ పోటీ ప్రారంభించింది. రంగుల ముద్రణలో నాణ్యతను పరీక్షించేందుకు ఇఫ్రా ప్రతిపాదించిన ‘క్యూబాయిడ్‘ను వార్తాపత్రికలు తమ రెగ్యులర్ ఎడిషన్లలో నెలకు 5 రోజులచొప్పున 3 నెలలపాటు ముద్రించి.. ఆ ప్రతుల్ని వాన్–ఇఫ్రాకు పంపించాలి. ఆ సంస్థ నిపుణులు ముద్రణలో నాణ్యతను అంచనా వేసి సభ్యత్వాన్ని ఇస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే కార్యక్రమంలో సాక్షికి సభ్యత్వాన్ని ఇవ్వనున్నారు. -
పొదుపు.. మదుపు.. అదే భవితకు మేలిమలుపు
మదుపరులకు నిపుణుల హితవు సాక్షిమైత్రీ ఇన్వ్స్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదుపరుల సదస్సు భానుగుడి (కాకినాడ): పిల్లల్ని బాగా చదివించాలి.. పెళ్లిళ్లు చేయాలి.. చక్కని ఇల్లు కొనుక్కోవాలి.. పదవీవిరమణ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలి. ఇవీ ప్రతీఒక్కరి కోరికలు. ఈ కోరికలు తీరాలంటే పొదుపు ఎంతముఖ్యమో మదుపు కూడా అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. పెట్టుబడులు ఎలా ఉండాలి? స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? డీమాట్ తదితర అంశాలపై సందేహాలను తీరుస్తూ నిపుణులు మదుపుదారులకు అవగాహన కల్పించారు. సాక్షి మైత్రీ ఇన్వెస్టర్స్ క్లబ్, సీడీఎస్ఎల్, ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ సంయుక్తంగా కాకినాడ ఆర్ఎల్ గ్రాండ్లో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సు దీనికి వేదిక అయింది. ‘40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికీ రెండు ఆదాయాలు ఉండాలి. అలా ఉండాలంటే పొదుపు ఒక్కటే సరిపోదు. భవిష్యత్తులో ధరలను తట్టుకునేలా రాబడి వచ్చే సాధనాల్లో దాన్ని మదుపు చేయాలి.’ అని సీడీఎస్ఎల్ రీజనల్‌మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి అన్నారు. స్టాక్ మార్కెట్లో మదుపుచేయాలంటే... స్టాక్ మార్కెట్ అనగానే చాలామందికి జూదమనే భావన ఉంది. అయితే ఈ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మందు అన్నింటిపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. ఆతర్వాతే ఎంతకాలానికి మార్కెట్లో మదుపు చేస్తామనే వ్యూహంతోనే అడుగు వేయాలి. ట్రేడింగ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కొన్నిసార్లు షేర్ల ఎంపికలో పొరపాట్లు జరగవచ్చు. రెండు షేర్లు కొంటే ఒకదాని ధర పడిపోయి మరోటి పెరిగితే సాధారణంగా పెరిగిన షేర్లను అమ్ముతుంటారు. తగ్గిన షేరును వదిలించుకోవడం ద్వారా మరింత నష్టపోకుండా ఉంటాం. కంపెనీ మూలాలు బలంగా ఉంటే తగ్గినా పెరిగే అవకాశం ఉంది. వాటిని వదులుకోవద్దు. స్టాక్మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి మందుగా ఉండాల్సింది డీమ్యాట్ఖాతా. పాన్‌కార్డు ఉన్న వారెవరైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను భద్రపరచుకోవచ్చు. – షేర్ మార్కెట్లోకి రూ.500తో ప్రవేశించవచ్చు. మదుపరులు తమ వయస్సు, నష్టాన్ని భరించే సామర్థ్యం ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. – చాలామంది 25–60 ఏళ్ళ మధ్యనే సంపాదిస్తారు. 60 ఏళ్ళ తర్వాత ప్రశాంత జీవితం గడపాలంటే పెట్టుబడులను సవ్యమైన రీతిలో పెట్టడం ముఖ్యం. ––షేర్లు కొన్నాక క్రమం తప్పక సమీక్షించుకుని పనిచేయని వాటిని వదిలించుకోవాలి. రాజీవ్‌గాంధీ ఈక్విటీ పొదుపు పథకం కొత్తగా స్టాక్ మార్కెట్లో ప్రవేశించే వారికి రాజీవ్‌గాంధీ ఈక్విటీ పొదుప పథకం అందుబాటులో ఉంది. వార్షికాదాయం రూ.12 లక్షల లోపు ఉండి డీమ్యాట్ ఖాతా లేనివారు పెట్టుపబడులు పెట్టనివారు ఇందులో చేరేందుకు అర్హులు. దీని ద్వారా నవరత్న, మహారత్న, మినీరత్న కంపెనీలు నిర్దేశిత మ్యూచువల్ ఫండ్ ప«థకాల్లో మదుపు చేయవచ్చు. పెట్టుబడిలో 50 శాతం మేరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సిజీజీ కిందపన్ను మినహాయింపు వర్తిస్తుంది. గరిష్టంగా రూ.50 వేలు వరకు మదుపుచేయవచ్చు. 1990 నుంచి ఇప్పటివరకు 17 శాతం సీఏజీఆర్ రిటర్న్స్ వచ్చాయి. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ప్రతి ఒక్కరూ సులభంగా ఇన్వెస్ట్చేయవచ్చు. నిపుణులైన ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో మదుపరులు సొమ్మును నిప్టీలో టాప్ 50కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణలో కొనసాగుతుంటాయి. మదుపరుల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. 80సీ సెక్షన్ కింద రూ.1.5లక్షల వరకు మ్యూచువల్ ఫండ్స్‌తో పెట్టుబడి చేసి పన్ను ప్రయోజనాలు సైతం పొందవచ్చు. సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(ఎస్ఐపీ) ఎస్ఐపీల ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం లేకుండా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. నెలకు రూ. 5 వేలు చొప్పున 10 ఏళ్ల పాటు ఎస్ఐపీతో మ్యూచువల్ ఫండ్స్‌తో రూ.6లక్షలు ఇన్వెస్ట్ చేస్తే సుమారు రూ.17లక్షలు రిటర్న్స్ వస్తాయి. నెలకు రూ.5వేలు చొప్పున 15ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే సుమారు రూ.63 లక్షల రిటర్న్స్ వస్తాయి. ప్రయోగాత్మక డీమ్యాట్ చిన్న ఇన్వెస్టర్లను దృష్టిలో ఉంచుకొనిబేసిక్ డీమ్యాట్ అకౌంట్ (బీఎస్‌డీఏ )2012 అక్టోబర్ ప్రారంభించారు.డీమ్యాట్ అకౌంట్లో రూ.50వేల లోపు పోర్టు పోలియోలో ఉంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్(ఏఎంసీ) చెల్లించనవసరం లేదు. రూ.50వేలు నుంచి రూ.2లక్షలలోపు సంవత్సరంలో ఒక్కరోజు ఉన్నా రూ.100ఏఏంసీ చెల్లించాలి. అదే రోజు రెండు లక్షల రూపాయల పైబడి ఉంటే రెగ్యులర్ ఏఎంసీ చెల్లించాలి. ఈ సదుపాయాలన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మదుపరులకు ఒకే ఒక్క డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించిన అకౌంట్ స్టేట్ మెంట్లను కూడా డీమ్యాట్ అకౌంట్లోకి మార్చుకోవడానికి వీలుంది. అలాగే ఎక్సేంజ్ ప్లాట్‌ఫాం ద్వారా మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు అమ్మకాల చేసుకోవడానికి అవకాశం ఉంది. మన ఖాతాను నిలుపుదల చేయాలనుకున్నపుడు ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏఎస్ఐ అనే సదుపాయం ద్వారా డీమ్యాట్ అకౌంట్ హోల్డర్ తన స్టేట్మెంట్ను నేరుగా సీడీఎస్ఎల్ వెబ్సైట్లో చూసుకునే అవకాశం కల్పిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రయోజనమే.. బ్యాంక్ డిపాజిట్స్, పీపీఎఫ్, ఈపీఎఫ్, పోస్టాఫీసులో చేసే పెట్టుబడులపై 8నుంచి 9శాతం ఆదాయం వస్తుందని,మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక ఆదాయం ఆర్జించవచ్చని ఎల్.కృష్ణకుమార్( సీనీయర్ మేనేజర్ ఎస్బీఐ,మ్యూచువల్ ఫండ్స్)అన్నారు. 1980 నుంచి ఇప్పటివరకు 17శాతం సీఏజీఆర్ రిటర్న్స్ వచ్చాయన్నారు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ప్రతి ఒక్కరూ సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. నిపుణులైన ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో మదుపరుల సొమ్మును నిఫ్టీలో టాప్ 50 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారన్నారు. మ్యూచువల్ ఫండ్స్‌తో సెబీ నియంత్రణలో కొనసాగుతుంటాయని, దీనివల్ల మదుపరుల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. 80సీ సెక్షన్ కింద రూ. 1.5లక్షల వరకు పెట్టుబడి పెట్టి ప్రయోజనం పొందవచ్చన్నారు. ఇన్వెస్ట్మెంట్ అలవాటు చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ కల్చర్ అలవాటు చేసుకుంఏ మదుపర్లకు ఎంతో మంచిదని టి.జగన్మోహనరెడ్డి (కాకినాడ ఏరియా మేనేజర్ ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీ)పేర్కొన్నారు. స్టాక్మార్కెట్లో పెట్టుబడులపై అవగాహన వచ్చిన తర్వాత తెలిసిన కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేయడం ఉత్తమమని ఆయన సూచించారు. ఎస్బీఐ షేర్లు, బాండ్లు, ఇతర మదుపు పథకాలను వివరించేందుకు ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. మంచి అవగాహన వచ్చింది. షేర్లను కొనేముందు, కొన్న తర్వాత పాటించాల్సిన విషయాలపై మంచి అవగాహన వచ్చింది. ఇలాంటి సదస్సులను సాక్షి మరిన్ని నిర్వహించి మదుపుదారులకు మార్గదర్శకంగా నిలవాలి. ఎస్బీఐ అందిస్తున్న సేవలను చాలా చక్కగా ఏరియా మేనేజర్లు వివరించారు. వాసిరెడ్డి శ్రీనివాస్, కాకినాడ షేర్లు భద్రపరుచుకోవడంపై అవగాహన కుదిరింది షేర్లను భద్రపరుచుకునే విధానంపైఈ సదస్సు ద్వారా అవగాహన ఏర్పడింది. షేర్‌మార్కెట్‌ను కళ్ళముందుంచారు. ఏ సమయంలో ఏవిధంగా స్పందిస్తే లాభదాయకమన్న విషయాలు తెలిశాయి. ఇటువంటి సదస్సులు గ్రామాల్లో విస్తరించాలి. - సీహెచ్ సురేష్, కాకినాడ. మరింత నేర్చుకున్నాను. షేర్‌మార్కెట్ అనేది క్షణాల్లో మారిపోతుంటుంది. దీనికోసం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మన దగ్గర ఒక నిపుణుడు ఉండాలి. వారి సలహాలు ప్రతీసారీ అవసరమౌతాయి. నాకు సాక్షి మైత్రీ ద్వారా నిపుణుల సమూహాన్ని కలిసే అవకాశం వచ్చింది. నాలో దాగిన అనేక సందేహాలను నివృత్తి చేసుకోగలిగాను. - పీఎంరావు, కాకినాడ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసింది. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ సదస్సు ద్వారా అవగాహన కలిగింది. ఎక్కడ ఫండ్స్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయో తెలిసింది.ఇలాంటి సదస్సుల ద్వారా మాలాంటి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్న సాక్షికి థ్యాంక్స్. - పి.రాంబాబు పెట్టుబడులపై అవగాహన వచ్చింది పెట్టుబడులు పెట్టే విధానంలో అవలంబించాల్సిన పద్ధతులపై శివప్రసాద్ తెలిపిన అంశాలు చాలా బాగున్నాయి. పెట్టుబడులపై పూర్తి అవగాహన కలిగింది. ఎంఎస్ నారాయణ, మదుపుదారు తెలియని విషయాలు తెలిశాయి. పెట్టుబడులు, ఇతర విషయాలకు సంబంధించి తెలియని విషయాలు చాలా తెలిశాయి. షేర్ మార్కెట్‌పై ఉన్న చెడ్డ అభిప్రాయం ఈ సదస్సు ద్వారా పోయింది. జాగ్రత్తలు పాటిస్తే పెట్టుబడులు ఎక్కడ పెడితో మంచిదో అర్ధమయ్యింది. డీమ్యాట్ గురించి నిపుణులు తెలిపిన విషయాలు అద్భుతం. - శివకుమార్, మదుపుదారు -
club closed
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎట్టకేలకు పేకాట క్లబ్ మూతపడింది. ఉంగుటూరు మండలం నారాయణపురంలో టీడీపీ నేతలు పేకాట క్లబ్ నెలకొల్పిన వైనాన్ని ’ఆడుకో పేక.. ఆపేవారు లేరిక’ శీర్షికన ’సాక్షి’ శుక్రవారం సంచికలో వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. దీనిపై స్పందించిన పోలీసులు తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ క్లబ్ నిర్వాహకులను తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో క్లబ్‌కు తాళాలు శుక్రవారం వేశారు. ఈ నిర్ణయం పేకాటరాయుళ్లకు మింగుడు పడలేదు. అధికార పార్టీ నేతల అండదండలు, వారికి నెలవారీ మామూళ్లు ఇవ్వడానికి సిద్ధపడినా ప్రయోజనం లేకుండా పోవడంపై వారు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. క్లబ్‌ను తెరిపించేందుకు ఉన్నత స్థాయిలో ఒత్తిళ్తు ప్రారంభమైనట్టు సమాచారం. కొత్త క్లబ్‌కు సమీపంలో ఉన్న పాత క్లబ్‌లోనూ ఎటువంటి జూదం నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేయటంతో అసలుకే మోసం వచ్చిందంటూ నిర్వాహకులు నెత్తీనోరు బాదుకుంటున్నట్టు సమాచారం. -
అమాత్యా..ఇది తగునా?
అనుమతి లేని క్లబ్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేటటౌన్: అనుమతులు లేకుండా నిర్మించిన క్లబ్ భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ప్రారంభించారు. అదేమన్నా ప్రజలకు ఉపయోగపడేదా అంటే కానే కాదు. జేబుల్లో డబ్బు ఖాళీచేసే పేకాట క్లబ్ భవనం. మంత్రి అనుచరుడి సారధ్యంలో పేకాటరాయుళ్ల కోసం అధునాతన సౌకర్యాలతో రూ.కోట్లు వెచ్చించి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన భవంతి అది. గతంలో ఘనమైన చరిత్ర .... చిలకలూరిపేట పట్టణంలోని సీఆర్ క్లబ్ (చిలకలూరిపేట రిక్రియేషన్ క్లబ్) కు గతంలో ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. 1942లో ప్రారంభించబడిన ఈ క్లబ్లో డాక్టర్లు, లాయర్లు, సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. టెన్నిస్, షటిల్, చెస్ వంటి క్రీడలను పోత్సహిస్తూ రిక్రియేషన్ అనే పదానికి నిర్వచనంగా ఉండేది. కేవలం క్లబ్ సభ్యులకు మాత్రమే అనుమతించిన రమ్మీ (13 ముక్కల పేకాట) ఆడుకొనేవారు. మంత్రి అనుచరుడి పెత్తనంలో ... 2015 సంవత్సరంలో క్లబ్ నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంత్రి ముఖ్యఅనుచరుడు కార్యవర్గంలో కీలక పదవి చేపట్టాడు. అప్పటి నుంచి క్లబ్ స్వరూపమే మారిపోయింది. పేకాట నిలయంగా మారింది. సాధారణంగా క్లబ్లో సభ్యులు మాత్రమే రమ్మీ ఆడుకోవచ్చు. కానీ ప్రస్తుతం సొసైటీల చట్టం ద్వారా రిజిస్టర్ అయి ఉన్న ఈ క్లబ్లో బైలాకు విరుద్దంగా గెస్ట్ వ్యవస్థకు ద్వారాలు తెరిచారు. క్లబ్లో సభ్యుడు కాని వ్యక్తి నెలకు మూడు వేలు చెల్లించి గెస్ట్ సభ్వత్వం పొందే అవకాశం కల్పించారు. దీంతో ఈ క్లబ్‌కు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పేకాట రాయుళ్లు క్యూ కడుతున్నారు. రోజు లక్షల్లో ఇక్కడ పేకాట జరుగుతుందన్నది బహిరంగ రహస్యం. క్లబ్‌కు పేకాట ద్వారా భారీగా లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలోనే క్లబ్ ఓపెన్ ఆడిటోరియం ప్రాంగణంలో సుమారు రూ. రెండుకోట్లు వెచ్చించి ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మించి మంత్రితో ప్రారంభింపచేశారు. సొసైటీ యాక్టు ద్వారా నిర్వహిస్తున్న ఈ క్లబ్లో వచ్చే ఆదాయవ్యయాల వివరాలను అధికారికంగా చూపించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి వివరాలు లేకుండా, అనుమతులు పొందకుండా భవనం నిర్మించి ప్రారంభించారు. ఈ విషయమై ఆదాయపన్నుశాఖ అధికారులు దృష్టి సారిస్తే ఇక్కడ జరుగుతున్న తతంగం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. అనుమతులు లేవు.. నామా కనకారావు, మున్సిపల్ కమిషనర్ క్లబ్ ప్రాంగణంలో నిర్మించిన భవనానికి ఎలాంటి అనుమతులు లేవు. ఆ భవంతిపై వందశాతం అదనంగా పన్ను విధిస్తాం. భవనం ఉన్నంతకాలం నిబంధనల ప్రకారం వందశాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. –––––––––––––––––––––––––––––––––––– 02సికెపిటి08–13020005: కొత్తగా సీఆర్క్లబ్లో ప్రారంభమైన భవనం 02సికెపిటి09–13020005: భవనం ప్రారంభిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు -
కళాకారుల ఆశాసౌదం యంగ్మ్న్స్ హేపీ క్లబ్
నేడు క్లబ్ శత వసంతోత్సవ వేడుకలు కాకినాడ కల్చరల్ : ది యంగ్మెన్స్ హేపీ క్లబ్. చితామణి, భక్తరామదాసు, కృష్ణ లీల, లోబి, డాటర్, నాటకాలు ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చి ఎనలేని కీర్తిని పొందింది. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకట్రావు, అంజనీదేవి, సూర్యకాంతం వంటి నటులు ది యంగ్మ్న్స్ క్లబ్ నుంచి వచ్చినవారే. క్లబ్ వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాకారం కూడా అందజేస్తుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు రాష్ట్రమంతటా నాటకోద్యమం జరుగుతున్న తరుణంలో ఆ సంస్కృతికోత్సవంలో భాగంగా కాకినాడ నగరంలో 1913లో పల్లె హనుమంతరావు, యరగల సత్తిరాజు యువజన ఆనంద సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని 1916లో యంగ్మ్న్స్ హాపీ క్లబ్‌గా దంటూ సూర్యారావు, గండికోట జోగినాధం, మాదిరెడ్డి రామానుజల నాయుడు, ఖాశిం సాహెబ్ మార్పు చేశారు. కళాకారులు, కళాభిమానుల శ్రమదానంతో ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ ప్రదర్శనశాల నిర్మాణం జరిగింది. దంటు సూర్యారావు తదనంతరం ఆయన సోదరులు దంటూ భాస్కరావు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి క్లబ్‌కు జవసత్వాలు అందించారు. ఔత్సాహిక నటీనటులను రప్పించి, శిక్షణ ఇప్పించి ప్రొత్సాహాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం దంటు సూర్యారావు అధ్యక్షత వహిస్తున్నారు. క్లబ్ శత వసంతోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహిస్తున్నారు. సినీ, టీవీ, ఇంటర్నెట్లకు పోటీగా రంగ స్థలానికి సాంకేతిక విజ్ఞానాన్ని జత చేసి అద్భుత ప్రదర్శనలు అందించాలనే సంకల్పంతోనే ఆడిటోరియం నిర్మాణం చేపట్టినట్టు దంటు తెలిపారు. -
ఎల్వీయార్ క్లబ్ క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: కాకినాడలో ఈనెల 9వ తేదీ నుంచి 17 వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ బిలియర్డ్స్, స్నూకర్ టోర్నమెంట్లో ఎల్వీఆర్ క్లబ్‌కు చెందిన క్రీడాకారులు ఎస్.శంకరరావు బిలియర్డ్స్ విభాగంలో, ఎస్.రమాకాంత్ స్నూకర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సా«ధించారు. మంగళవారం కొరిటెపాడులోని ఎల్వీఆర్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో వీరిని ఘనంగా సత్కారించారు. కార్యక్రమంలో క్లబ్ పాలక వర్గ సభ్యులు పులివర్తి వెంకటేశ్వరరావు(అజార్), మాదాల వెంకటేశ్వర్లు, క్లబ్ సభ్యులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.