CPS system
-
కొత్త పెన్షన్ విధానానికి కేంద్రం ఆమోదం.. కీలకాంశాలు..
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్)ను అమలు చేసేలా విధానాలు రూపొందించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ యూపీఎస్ విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. దాంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) స్థానంలో కొత్త యూపీఎస్‌ను అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు చేరుతుందని చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించింది.యూపీఎస్ విధానంలోని కీలకాంశాలు..ప్రస్తుతం అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం మరో 10 శాతం జమచేసి పెట్టుబడి పెట్టేది. ఉద్యోగి పదవీ విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారు. అయితే యూపీఎస్‌లో మాత్రం రిటైర్డ్ అయ్యే 12 నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి 50 శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కనీస సర్వీసు 25 సంవత్సరాలు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హులు. ఒకవేళ 25 ఏళ్లు పూర్తి అవ్వకపోతే దామాషా ప్రకారం 10-25 ఏళ్లలోపు పెన్షన్ లెక్కించి ఇస్తారు.కనీసం 10 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటేనే యూపీఎస్ కిందకు వస్తారు. అలా కేవలం పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు కనిష్ఠంగా రూ.10,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆపై 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న వారికి దామాషా ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. 25 ఏళ్ల సర్వీసు దాటితే పూర్తి పెన్షన్ వస్తుంది.ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కాబట్టి యూపీఎస్ కింద ఇచ్చే పెన్షన్‌లోనూ ఏటా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి ఇస్తారు. దాంతో కిందటి ఏడాది కంటే ప్రస్తుత ఏడాదికి ఎక్కువ పెన్షన్ అందుతుంది.యూపీఎస్ విధానంలో చేరిన పెన్షనర్లు మరణిస్తే అప్పటివరకు తాము తీసుకుంటున్న పెన్షన్‌లో 60 శాతం వారి భాగస్వామికి ఇస్తారు.యూపీఎస్ నిబంధనల ప్రకారం 1/10వ వంతు సుపర్ అన్యూయేషన్(మొత్తం సర్వీసును లెక్కించి చెల్లించే నగదు) చెల్లిస్తారు. బేసిక్ వేతనంలో 1/10వ వంతును పరిగణనలోకి తీసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సర్వీసు పూర్తయిన వెంటనే ఒకేసారి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఈ చెల్లింపునకు, పెన్షన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు.కొత్త యూపీఎస్ విధానానికి మారాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాలను అనుసరించి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ అమలుకు సిద్ధంగా ఉండాలి.నేషనల్ పెన్షన్ స్కీమ్ కంటే యూపీఎస్ కొంత మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ యూపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను భర్తీ చేయదని కొందరు చెబుతున్నారు. ఇదిలాఉండగా, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతుండగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తిరాష్ట్రాల వాటాపై పర్యవేక్షణయూపీఎస్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం కోరుతోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో కొన్ని రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటాను జమ చేయకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కేవలం గ్రాట్యుటీ, పెన్షన్ డబ్బుమీదే ఆధారపడే ఉద్యోగులకు కొత్త విధానం కొంత ఊరట చేకూరుస్తుందనే వాదనలున్నాయి. కానీ ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలు తప్పకుండా వాటి వాటాను సైతం జమచేసేలా పర్యవేక్షణ ఉండాలని విశ్లేషకులు కోరుతున్నారు. -
ఉద్యోగికి ‘గ్యారెంటీ’ భరోసా.. సీపీఎస్‌తో పోలిస్తే మరింత మెరుగ్గా జీపీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాశ్వత, కాంట్రాక్టు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను రూపొందించింది. దీనిద్వారా ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత చేకూరనుంది. రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో 50 శాతం పెన్షన్, ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కరువు భృతి (డీఆర్) ఇవ్వడం ద్వారా మెరుగైన పెన్షన్‌ను అందించనుంది. దీంతోపాటు ఉద్యోగులు అడగకుండానే 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి కీలక అంశాలకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. మాట ప్రకారం సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేర్చారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి భద్రతనిచ్చేలా రూపొందించిన జీపీఎస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి వేణు ఇంకా ఏమన్నారంటే.. ఉద్యోగుల జీతాలను దాటేస్తుంది.. సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లేకపోవడంపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీపీఎస్‌ను రద్దు చేస్తూ సంతకం చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. కానీ ఆ తర్వాత ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. పెన్షన్ల మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది. 2041 నాటికి రాష్ట్ర బడ్జెట్లో రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుంది. రుణాలపై చెల్లింపులతో కలిపి రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లకు చేరుతుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించి సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌ను తీసుకొచ్చాం. సీపీఎస్‌తో అనిశ్చితి.. ప్రస్తుత సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్ ఫండ్‌కు బదిలీ చేస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని 40 శాతం సొమ్మును యాన్యుటీ పెన్షన్ స్కీంలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. ఇదంతా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పడితే రావాల్సిన పెన్షన్‌కూ గ్యారెంటీ ఉండటం లేదు. బేసిక్ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా అది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి వస్తుండటంతో భద్రత ఉండటం లేదు. జీపీఎస్‌తో గ్యారంటీ ఇలా.. సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పూర్తి గ్యారంటీ ఇస్తుంది. ఇందులోనూ సీపీఎస్‌లో చెల్లించినట్లే ఉద్యోగి 10 శాతం పెన్షన్ వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే కడుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. ఇక్కడ సీపీఎస్‌తో పోలిస్తే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తుంది. ఉదాహరణకు రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే అందులో రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి రెండు డీఆర్‌లతో కలుపుకొని ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే 82 ఏళ్ల వయసులో జీపీఎస్ ద్వారా రూ.1,10,000 పెన్షన్‌గా తీసుకుంటారు. తద్వారా రిటైర్డ్ ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లు అవుతుంది. సీపీఎస్‌లో ఇలాంటి వెసులు బాటు లేదు. దేశానికే ఆదర్శంగా జీపీఎస్ దేశంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ ఓపీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించినా అమల్లోకి తీసుకురాలేకపోతున్నాయి. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేసి జీపీఎస్‌ను తీసుకొస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవనుంది. 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వ్యయం క్రమంగా పెరుగుతూ రూ.1,33,506 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వమే బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. మాట ఇచ్చి.. నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కటాఫ్ తేదీకి 10 ఏళ్లు ఉండాలని అధికారులు సిఫార్సు చేస్తే సీఎం జగన్ ఐదేళ్లకు తగ్గించారు. దీంతో మేనిఫెస్టో హామీల్లో 99.50 శాతం అమలు చేసినట్లైంది. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల్లోనూ ఒకేలా హెచ్ఆర్ఏ ఉండేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఏ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా కొన్ని జిల్లా కేంద్రాల్లో 12 «శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ 16 శాతానికి పెరుగుతుంది. 2022 జనవరి 1వతేదీ నుంచి డీఏ, డీఆర్ 2.73 శాతం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. 6,840 కొత్త పోస్టుల మంజూరు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెచ్చింది. వివిధ శాఖల్లో సుమారు 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించింది. వీటిల్లో 3,920 రిజర్వ్ పోలీసు ఉద్యోగాలు సహా నూతన వైద్య కళాశాలలు, పలు విద్యా సంస్థల్లో భారీ ఎత్తున కొత్త పోస్టులను కల్పించింది. ప్రభుత్వంలోకి వైద్య విధాన పరిషత్ ఏపీ వైద్య విధాన పరిషత్ 1986 యాక్ట్‌ను రద్దు చేసి ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’ శాఖగా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలుగా చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య విధాన పరిషత్ స్వయం ప్రతిపత్తి నుంచి ప్రభుత్వంలోకి మారడం ద్వారా 14,658 మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 010 పద్దు కింద వేతనాలను చెల్లించనుంది. -
సీపీఎస్ ఉద్యోగుల ఆందోళన వాయిదా
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దు కోరుతూ సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన వాయిదా పడింది. సెప్టెంబర్ 1న తలపెట్టిన ఛలో విజయవాడ, మిలియన్ మార్చ్ సభ వాయిదా పడ్డాయి. పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ ఒకటిన సీపీఎస్ ఉద్యోగులు ఎవరూ విజయవాడ రావద్దని ఆయన కోరారు. ఆ రోజు స్థానిక కార్యాలయాల్లోనే నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. గత ఏడేళ్లుగా శాంతియుతంగానే సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. పోలీసుల అనుమతితోనే ఇప్పటివరకు వాటిని చేపట్టామన్నారు. అలాగే.. ఛలో విజయవాడ, మిలియన్ మార్చ్ పేరుతో నిర్వహించబోయే సభ, ర్యాలీకి కూడా పోలీసుల అనుమతి కోరామని తెలిపారు. కానీ, పోలీసులు ఏ నిర్ణయం చెప్పలేదన్నారు. మరోవైపు.. తమకు సంబంధంలేని ‘సీఎం ఆఫీసు ముట్టడి’ కార్యక్రమం పేరుతో ఏపీసీపీఎస్ఈఏ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను అడ్డుకున్నారని, కేసులు పెట్టారని తెలిపారు. నోటీసులు, బైండోవర్లు, ముందస్తు అరెస్టులతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని పార్థసారథి పేర్కొన్నారు. దీంతో.. ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11కి వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
జీపీఎస్‌తోనే భద్రత
సాక్షి, అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) చాలా మెరుగైందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. దానిపై చర్చించాలని మరోసారి ఉద్యోగ సంఘాలను కోరింది. సీపీఎస్ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) ప్రభుత్వం తట్టుకునే పరిస్థి తి లేదని, సీపీఎస్ వల్ల ఎలాంటి భద్రత లేదని చెప్పారు. అందుకే మధ్యేమార్గంగా జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిగురించి లోతుగా చర్చించి ఇంకా మెరుగుపరిచేందుకు సల హాలివ్వాలని నేతలను కోరారు. జీపీఎస్ తమకు ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అన్ని అంశాలపై మరింత లోతుగా చర్చించి అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు నష్టం లేకుండా నిర్ణయం తీసుకునేందుకు మరోసారి సమావేశమవుదామని మంత్రులు, ప్రభుత్వ సలహాదారు చెప్పారు. పీఆర్సీకి సంబంధించి ఇంకా విడుదల కావాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులను త్వరగా విడుదల చేసేందుకు చర్య లు తీసుకుంటామని మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కార్యదర్శి ఎన్.గుల్జార్, కార్యదర్శి (సర్వీసెస్) హెచ్.అరుణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయ ణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.ప్రసాద్ పాల్గొన్నారు. -
ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం
-
AP: ఉద్యోగ సంఘాలతో సీపీఎస్‌పై కన్సల్టేటివ్ భేటీ ప్రారంభం
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సీపీఎస్‌పై సంప్రదింపుల (కన్సల్టేటివ్) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, కార్యదర్శి ( జీఎడి సర్వీసెస్) హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు పి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులులు ఎపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ప్రసాద్, ఇతర నేతలు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: ఏపీలో అర్హులందరికీ పథకాలు -
సీపీఎస్ స్థానంలో జీపీఎస్!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సాధ్యమైనంత మేర లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్రంలో గ్యారెంటీ పెన్షన్ పథకాన్ని (జీపీఎస్–గ్యారంటీడ్ పెన్షన్ స్కీం) అమలుచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ ప్రతిపాదనను పూర్తిగా పరిశీలించి తగు సూచనలు, సలహాలిస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తద్వారా ఉద్యోగులకు సాధ్యమైనంత మేలు చేసేలా దీనిని రూపొందిస్తామని చెప్పారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆ సంఘాల నాయకులతో సమావేశమైంది. కమిటీ సభ్యుడిగా రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వోద్యోగులకు సాధ్యమైనంత మేర మేలుచేసే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. అయితే, పాత పింఛను పథకం (ఓపీఎస్) అమలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలుగా పరిణమించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ తరాల ప్రభుత్వోద్యోగులు, ప్రజల సంక్షేమం దృష్ట్యా పాత పింఛన్ పథకం అమలు దుస్సాధ్యమైన అంశంగా ఉందని చెప్పారు. భద్రత కల్పించాలన్నదే ప్రధాన లక్ష్యం: సజ్జల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు సాధ్యమైనంత మేర ఆర్థిక భద్రత కల్పించే విధంగా పింఛను పథకాన్ని రూపొందించి అమలుచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు సాధ్యమైన మేర భద్రత కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. పాత పింఛను పథకం, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రెండింటినీ సమన్వయం చేస్తూ మధ్యే మార్గంగా గ్యారంటీడ్ పెన్షన్ పథకాన్ని (జీపీఎస్) అమలుచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వోద్యోగుల భద్రత దృష్ట్యా మంచి పింఛన్ పథకాన్ని రూపొందించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కోరారు. వాటిని కూడా సాధ్యమైనంత మేర పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులకు మంచి పింఛన్ పథకాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ సీపీఎస్ అంచనాలను ఎందుకు సంస్కరించాలి, పెన్షన్ సంస్కరణ సవాళ్లు, పాత పెన్షన్ పథకం అమలులో ఆర్థిక సుస్థిరత పరిశీలన, నూతనంగా ప్రతిపాదించే ఏపీ హామీ పింఛను పథకం వివరాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, జేఏడీ సర్వీసెస్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల తరఫున ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, ఏíపీటీఎఫ్ అధ్యక్షుడు జి. హృదయరాజు తదితరులు పాల్గొన్నారు. జీపీఎస్ అంటే.. సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానంలో పదవీ విరమణ చేసిన నెల బేసిక్ పే పైన ఎంత పెన్షన్ వస్తుందనేది కచ్చితంగా తెలీదు. అదే జీపీఎస్ కింద కచ్చితంగా 33 శాతం పెన్షన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. పాత పెన్షన్ విధానంలో 50 శాతం పెన్షన్ వచ్చేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడు అది రద్దయి సీపీఎస్ అమల్లోకి వచ్చింది. దీంతో సీపీఎస్ కంటే మెరుగ్గా ఉంటుంది. చివరి నెల జీతంలో 33 శాతం పెన్షన్ వచ్చేలా ప్రభుత్వం జీపీఎస్‌కు రూపకల్పన చేసింది. త్వరలోనే స్పష్టత: మంత్రి బొత్స నెల్లిమర్ల రూరల్: సీపీఎస్‌పై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం కోదండ రామస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి సోమవారం ఇక్కడకు విచ్చేసిన మంత్రి సీపీఎస్ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్రతి అంశాన్ని అవకాశం ఉన్నంత వరకు పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. సీఎం ఇంటిని ముట్టడించడం భావ్యం కాదన్నారు. ఉద్యమంలో జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని బొత్స ప్రశ్నించారు. ఇక సెలవుల రద్దుపై ఉపాధ్యాయులెవరూ స్పందించలేదని, వాళ్లకి లేని బాధ ప్రతిపక్షాలకు ఎందుకని బొత్స మండిపడ్డారు. మంత్రులతో కమిటీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను పరిశీలించడంతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్‌ని కమిటీలో సభ్య కన్వీనర్‌గా నియమించారు. ఈ కమిటీ సీపీఎస్‌ను పరిశీలించడంతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సీపీఎస్‌పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అవసరమైన సిఫార్సులను చేయాల్సిందిగా సీఎస్ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. సీపీఎస్ కంటే జీపీఎస్ మెరుగైంది సీపీఎస్ స్థానంలో ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ మెరుగైందని భావిస్తున్నాం. సీపీఎస్ వల్ల ఉద్యోగికి ఎంత పెన్షన్ రిటర్న్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఉద్యోగి రిటైరైనప్పుడు బేసిక్ పేలో 33 శాతం గ్యారెంటీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం జీపీఎస్‌ను ప్రతిపాదించింది. రాబోయే తరాలకు జీపీఎస్ ఇవ్వండి తప్ప ప్రస్తుత ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం అమలుచేయాలని కోరాం. సీపీఎస్‌వల్ల లాంగ్ టర్మ్‌లో ప్రభుత్వంపై పెను భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అదే జీపీఎస్వల్ల ప్రభుత్వంపై పడే భారం తగ్గుతూ ఉద్యోగికి అదనపు ప్రయోజనం జరుగుతుందని చెబుతోంది. – వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పాత పెన్షన్ విధానమే కావాలన్నాం సీపీఎస్ బదులు జీపీఎస్‌ను ప్రతి పాదించారు. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పాం. జీపీఎస్ పేరిట కొత్త స్కీం ఆమోద యోగ్యం కాదని చెప్పాం. ప్రభుత్వం ఏదో ఒకటి చేసి జీపీఎస్ పెట్టాలని చూస్తోంది. మేం జీపీఎస్‌కు ఒప్పుకోం. సీపీఎస్ రద్దుచేయాలి. – బండి శ్రీనివాస్, ఎపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు జీపీఎస్‌ను ఆమోదించం ప్రస్తుతమున్న సీపీఎస్ విధానం 1.9.2004 తర్వాత చేరిన వారికి ఇబ్బందిగా ఉంది. జీపీఎస్‌పై మా అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం కోరింది. స్టేట్ ఫండ్ ఏర్పాటుచేసి ఫండ్ చెల్లిస్తామని గతంలో టక్కర్ కమిటీ చెప్పినా మేం అంగీకరించలేదు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని కోరాం. జీపీఎస్‌ను ఆమోదించేది లేదని చెప్పాం. పాత పెన్షన్ విధానానికే మేం కట్టుబడి ఉన్నాం. పీఆ ర్సీపై జీఓలు ఇవ్వకపోవడంవల్ల ఉ ద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జీపీఎస్‌ను తిరస్కరించాం పాత పెన్షన్ విధానం స్థిరమైంది కాదని ప్రభుత్వం చెబుతోంది. 33 శాతం ప్రొటెక్షన్‌తో జీపీఎస్ తీసుకువస్తామంది. సీపీఎస్‌లో ఉద్యోగికి 9 శాతం ప్రొటెక్షన్ వస్తుండగా దీన్ని 33 శాతం ప్రొటెక్షన్ ఇస్తామంటోంది. కానీ, జీపీఎస్ స్కీంను తిరస్కరించాం. – సూర్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు -
‘సీపీఎస్’పై త్వరలోనే నిర్ణయం
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం శాసన మండలిలో తెలిపారు. సీపీఎస్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని, లేదా ఎప్పటిలోగా రద్దు చేస్తారో చెప్పాలని పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీలు అడిగిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో వారు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వెంటనే బుగ్గన స్పందించి సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రుల బృందం సీపీఎస్‌పై అధ్యయనం చేసిందని, దానిని అధికారుల కమిటీ కూడా పరిశీలించిందని, కోవిడ్, ఆర్థిక ఇబ్బందులతో జాప్యం జరిగిందని వివరించారు. సీఎం జగన్ ప్రతీవారం సీపీఎస్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారని, దానర్ధం దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశమేనని బుగ్గన తెలిపారు. మంత్రి వివరణపై సంతృప్తి చెందని పీడీఎఫ్, బీజేపీ సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. వారికి టీడీపీ సభ్యులు కూడా జతకలిశారు. కాసేపు సీపీఎస్ రద్దు చేయాలని.. మరికాసేపు కల్తీసారా మరణాలపై చర్చకు అనుమతించాలని నినాదాలు చేస్తూ సభకు అడ్డుపడ్డారు. అదే సమయంలో ఓ సభ్యుడు ఈల వేయగా.. లోకేష్ తదితరులు చప్పట్లు కొడుతూ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. రాద్ధాంతం మధ్యే ప్రశ్నోత్తరాలు ఇక సభ్యుల రాద్ధాంతం మధ్యే మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు బదులిచ్చారు. -
సీపీఎస్ రద్దు ప్రభుత్వ పరిశీలనలో ఉంది
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వం ఏర్పడగానే సబ్‌కమిటీ వేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలో గురువారం జరిగిన ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖరరెడ్డి అభినందనసభలో ఆయన ప్రసంగించారు. సీపీఎస్ రద్దు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కొన్ని సమస్యలున్నా మాటిచ్చినందున సాధ్యాసాధ్యాలను చూడాలని సీఎం చెప్పారన్నారు. కరోనా వంటి కష్టసమయంలో కూడా సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల ఇంటిముంగిటకు తీసుకెళ్లిన ఘనత ఉద్యోగులదేనని, వారందరినీ అభినందిస్తున్నట్లు సీఎం చెప్పమన్నారని తెలిపారు. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు. చంద్రశేఖరరెడ్డి సేవలను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడారు. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి, మద్యవిమోచన సమితి చైర్మన్ లక్ష్మణరెడ్డి, ఎపీఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు చంద్రశేఖరరెడ్డిని సత్కరించారు. -
పెన్షన్ సొమ్మునూ వదలని బాబు, ఇప్పుడు మాత్రం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పెన్షన్ సొమ్మును వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల పాటు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా మళ్లించి ఇప్పుడు ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కార్చడంపై ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు జరపాలని తాము కోరుతుంటే టీడీపీ నేతలు సీపీఎస్, జీపీఎఫ్ గురించి మాట్లాడుతున్నారని పేర్కొంటున్నాయి. 2017-18లో సీపీఎస్ ఉద్యోగులకు చెందిన రూ.730.94 కోట్ల పెన్షన్ సొమ్మును నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా వాయిదా వేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది. నేషనల్ డిపాజిటరీ లిమిటెడ్‌కు బదిలీ చేయనందున వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడటమే కాకుండా ఉద్యోగుల సొమ్మును సరికాని రీతిలో వినియోగించినట్లైందని కాగ్ స్పష్టం చేసింది. దీనివల్ల ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం రేటులో అనిశ్చితి ఏర్పడటమే కాకుండా మొత్తానికి పథకమే విఫలమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. 2018-19లో మార్చి 31 నాటికి సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ సొమ్ము రూ.663.63 కోట్లను గత ప్రభుత్వం నేషనల్ సెక్యురిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా తరువాత సంవత్సరానికి వాయిదా వేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. నిబంధనల మేరకు ఉద్యోగుల చందాకు సమానంగా ప్రభుత్వం కూడా చందా చెల్లించాల్సి ఉంది. అయితే ఉద్యోగుల నుంచి రూ.765.02 కోట్లను వసూలు చేసినప్పటికీ గత ప్రభుత్వం తన వాటా కింద కేవలం రూ.320.58 కోట్లనే చెల్లించిందని, రూ.444.44 కోట్ల మేర తక్కువగా చెల్లించిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. జీపీఎఫ్ డబ్బులూ ఇవ్వకుండా.. పిల్లల వివాహాలు, ఇతర అవసరాలకు అక్కరకు వస్తాయని ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను గత ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు ఇవ్వకుండా వేల సంఖ్యలో బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఉద్యోగులకు డీఏలను కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు పోస్ట్ డేటెడ్ జీవోలు జారీ చేసి మోసగించింది. ఎన్నికల ముందు పీఆర్సీ అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు కాలయాపన చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక పీఆర్సీ నివేదిక రాకపోయినప్పటికీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వడమే కాకుండా చంద్రబాబు సర్కారు పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలను సైతం మంజూరు చేశారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా టీడీపీ నేతలు ఉద్యోగుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
-
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి : కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్), కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీపీఎస్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్ కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని వివరించారు. వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 కాగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 3,295 మంది ఉండగా మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని చెప్పారు. వారికి ఏ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను అధికారులు ప్రస్తావించారు. (గడువులోగా పోలవరం పూర్తి కావాల్సిందే) వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక సిద్దం చేయాలని ఆదేశించారు. అనంతరం కాంట్రాక్ట్ ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. అయితే తన ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ అమలు చేశామని చెప్పారు. అదే విధంగా మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కూడా అమలు చేశామని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
ముట్టడి.. కట్టడి!
కవాడిగూడ: పీఆర్సీ హామీని అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి.. సమాన వేతనం వర్తింప చేయాలని, వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఆందోళనకారులు అసెంబ్లీ వద్దకు చేరు కోకుండా ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. అయితే కొందరు టీచర్లు పోలీసుల కళ్లుగప్పి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్దకు చేరుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. సుమారు రెండు వేల మంది ధర్నా చౌక్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పలువురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్స్టేషన్లకు తరించారు. సాయంత్రం 6 గంటలకు విడిచిపెట్టారు. గోషామహల్ స్టేషన్లో ఓయూ మాజీ పీడీఎస్‌యూ నాయకురాలు పూలన్ ధూంధాం నిర్వహించి ఆడిపాడారు. అరెస్టయిన వారిని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్ పరామర్శించారు. ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీపీటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు. -
సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: బొత్స
సాక్షి, విజయనగరం: అవినీతి రహితపాలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనికి అందరూ సహకరించాలని, తమది స్నేహపూర్వక ప్రభుత్వమని పేర్కొన్నారు. మంగళవారం విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనతో భ్రష్టుపట్టిన వ్యవస్థలను తిరిగి కాపాడాలని వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. చట్టబద్దంగా, రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తున్నామన్నారు. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అందరికి జవాబుదారీగా పనిచేయాలని బొత్స అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగులంతా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ఉద్యోగుల యోగక్షేమాలను ప్రభుత్వం తప్పక చూస్తుందన్నారు. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఉన్నతాధికారులతో చర్చించి అన్ని వర్గాలవారికి న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. కొందరు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. వీటిని ఎవ్వరూ నమ్మొద్దని కోరారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్నవారిని తొలగిస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఎవ్వరినీ తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. ఇది ముఖ్యమంత్రి తమందరితో చెప్పిన మాటని మంత్రి స్పష్టం చేశారు. -
ఉద్యమ బాటలో సీపీఎస్ ఉద్యోగులు
సాక్షి, కరీంనగర్ : ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు.. ఉద్యోగ విరమణ అనంతరం నెలనెలా సరిపడినంత పింఛను వస్తోందని ప్రభుత్వ కొలువులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ప్రస్తుతం అమలవుతున్న సీపీఎస్ విధానం ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా కలచివేస్తోంది. మూడు దశాబ్దాలు ప్రజలకు సేవ చేసి, రిటైర్డు అయిన తర్వాత తమకు, తమ కుటుంబాలకు సామాజిక భద్రత లేకపోవడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. దేశవ్యాప్తంగా 60 లక్షల మంది, రాష్ట్రంలో లక్షా 25 వేల మందికి పైగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 13,000పైగా ఉపాధ్యాయ, ఉద్యోగులు సీపీఎస్ విధానంలో కొనసాగుతున్నారు. భరోసా లేని పెన్షన్ విధానం వల్ల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(జాక్టో) ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు, పాత పెన్షన్ పునరుద్ధరణకు సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చారు. పలుమార్లు ఆందోళనలు.. సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొత్త విధానంతో తమకు భద్రత లేదని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2016 నవంబర్ 29న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద టీఎస్‌యూటీఎఫ్, టీఎస్‌సీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2016 డిసెంబర్ 2న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం అందించారు. సీపీఎస్ విధానం అమలు.. సీపీఎస్ విధానాన్ని కేంద్రం 2004 జనవరి 1 నుంచి అమలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది సెప్టెంబర్ నుంచి అమలు చేసింది. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ), నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మూల వేతనం, డీఏలతో 10 శాతం మొత్తానికి ప్రభుత్వ వాటా, 10 శాతం ఉద్యోగి మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి.. జమ చేసిన మొత్తాన్ని ప్రైవేటు ఫండ్ మేనేజర్లకు అప్పగిస్తారు. వారు వివిధ ఫండ్‌లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఉద్యోగి రిటైర్డ్మెంట్ సందర్భంగా అప్పటి మార్కెట్ విలువల ఆధారంగా ఖాతా నిల్వలోని 60 శాతం మొత్తాన్ని నగదుగా చెల్లిస్తారు. మిగతా 40 శాతం పింఛన్‌గా నిర్ణయిస్తారు. మార్కెట్ ఒడిదొడుకులకు అనుగుణంగా తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. పీఎఫ్ఆర్డీఏ బిల్లులోని 29(ఎఫ్)ప్రకారం రిటరŠన్స్ మీద ఎలాంటి గ్యారంటీ లేదు. రిటరŠన్స్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. అప్పటి ధరకు అనుగుణంగా కరువు భత్యం, పీఆర్సీ పెరుగుదల ఈపీఎస్ పింఛనుదారులకు వర్తించదు. ఒక్కోసారి మార్కెట్ రిటరŠన్స్ వృద్ధి శాతం కనీసం బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న నిల్వకు లభించే వడ్డీ 4 శాతం కూడా ఉంటుందనే భరోసా లేదని ఉద్యోగుల ఆవేదన. పాత పింఛను విధానంతో లాభాలు.. 2004కు ముందు నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వాటా చెల్లించకుండానే విరమణ పొందే సమయంలో తన చివరి మూల వేతనం(బేసిక్ పే)లో 50 శాతం పింఛన్‌గా నిర్ధారించి, ఆ మిగతా 50 శాతానికి అన్ని రకాల భత్యాలు(అలవెన్స్) కలుపుకొని చెల్లిస్తారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వోద్యోగులకు కరువు భత్యం పెంచినప్పుడు పింఛనుదారులకు ఇది వర్తిస్తోంది. ప్రభుత్వాలు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రకటించే వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ద్వారా ఉద్యోగులతో పాటు అప్పటి ధరలకు అనుగుణంగా పింఛన్ మొత్తాన్ని పెంచుతారు. కొత్త పథకం ఎవరికి లాభం? నూతన పింఛన్ విధానంతో ఉద్యోగులకు, అసంఘటిత కార్మికులకు లాభం అన్నది అప్పటి ప్రభుత్వాల వాదన. ఇది నిజం కాదని ప్రభుత్వ ఉద్యోగుల వాదన. పాత పింఛన్ విధానం కన్న మెరుగైన పింఛను విధానం తీసుకొస్తామని, అసంఘటిత కార్మికులకు విస్తరిస్తామని చెప్పిన పాలకులు.. ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్న ఆర్థిక భద్రతను దూరం చేసి సామాజిక భద్రతపై ఆందోళనను రేకేత్తించాయన్న విమర్శలు ఉన్నాయి. హామీలు అమలు చేయాలి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం విచారకరం. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ పెన్షన్ విధానం అమలును ఎత్తివేసి పాతపెన్షన్‌ను పునరుద్ధరించాలి. 2018 మే 16న సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి పదోన్నతులు, పీఆర్సీ వెంటనే ప్రకటించాలి. సెప్టెంబర్1న జరిగే ర్యాలీలు, ప్రదర్శనలు సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు జయప్రదం చేయాలి. – ఎస్. ప్రభాకర్‌రావు, జాక్టో జిల్లా కన్వీనర్ సీపీఎస్ రద్దుకు ఉద్యమిస్తాం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వాలు సవతితల్లి ప్రేమను చూపించడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా ప్రయత్నించాలి. ఉపాధ్యాయుల పదోన్నతులు, పీఆర్సీ, ఐఆర్ లాంటి సమస్యలను నాన్చడం సరికాదు. సెప్టెంబర్ 1న ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన ర్యాలీలు జయప్రదం చేయాలి. – కరివేద మహిపాల్‌రెడ్డి, ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
నాడు తొక్కి..నేడు మొక్కుతారా..!
సాక్షి, బద్వేలు : ఉద్యోగ విరమణ తరువాత భవిష్యత్తుకు భరోసా ఇవ్వని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలనే డిమాండ్‌తో అలుపెరగని పోరాటాలు చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికలు సమీపించిన వేళ సీపీఎస్ రద్దు చేస్తామనడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2004 సెప్టెంబరు నుంచి పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 1.64 లక్షల మంది, జిల్లాలో దాదాపు 15 వేల మంది సీపీఎస్ పరిధిలో ఉన్నారు. 2004 నోటిఫికేషన్ తరువాత జిల్లాలో 12 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉన్నత విద్యామండలి, ఆరోగ్య, పోలీసు తదితర శాఖలలో మరో మూడు వేల మంది ఉద్యోగాలు పొందారు. వీరంతా సీపీఎస్ పరిధిలో ఉన్నారు. నాడు అబద్ధాలు...అరెస్టులు సీపీఎస్ ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వం వారిని తప్పుదోవ పట్టించేందుకు అబద్ధాలు చెప్పింది. తొలుత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఉద్యోగులు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో చేసేది లేక వారి నోళ్లు మూయించేందుకు పోలీసులను ఉపయోగించారు. పలుపర్యాయాలు విజయవాడ, గుంటూరులో జరిగిన ఆందోళనల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులను రోడ్డుపై ఈడ్చుకెళ్లి వ్యాన్‌ల్లో కుక్కారు. మహిళలు అని చూడకుండా లాఠీలతో కొట్టించి తరిమించారు. వైఎస్ జగన్ హామీతో ఊరట రాష్ట్రవ్యాప్తంగా రెండు 1.87 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి కీలకమైన సమస్యకు పరిష్కారం చూపకుండా టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ క్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభంలో సెప్టెంబరు 6న సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. దీంతో చేజారిపోతున్న పెన్షన్ పథకం తిరిగి తమకు అందుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు. పాత పథకాన్ని అమలుచేయాలి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తేనే ఉద్యోగులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం సీపీఎస్ విధానంలో ఉండి పదవీ విరమణ చేసిన వారికి రూ.650 పెన్షన్ రావడం దారుణంగా ఉంది. 35 ఏళ్లుగా ప్రభుత్వానికి సేవలందించి, వయస్సు మీద పడిన తరువాత వచ్చే పెన్షన్ షేర్ మార్కెట్‌పై ఆధారపడటం శోచనీయం. – పుల్లయ్య, సీపీఎస్ నాయకులు పోరాటాలను పట్టించుకోలేదు ఉద్యోగ విరమణ తరువాత పింఛన్ పొందేలా రాజ్యాంగం కల్పించిన హక్కుకు విఘాతం కలిగిస్తున్నారు. సీపీఎస్ రద్దు కోసం ఎన్నో పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడేమో టీడీపీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుండేది. – వెంకటరెడ్డి, సీపీఎస్ ఉద్యోగి -
సీపీఎస్ రద్దు తో భరోసా!
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగం ఆర్థిక భద్రతకు సూచిక. కుటుంబానికి ఆర్థిక, సామాజిక భరోసా. అయితే, ఇది 2004కు ముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి మాత్రమే. 2003లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పేరుతో ఈ ఆసరాపై దెబ్బకొట్టింది. దీంతో 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి ఆర్థిక భద్రత ఎండమావిలా మారింది. సమ న్యాయ సూత్రాలకు, సమాన పనికి సమాన వేతనం నిబంధనకు విరుద్ధమైన దీనిని రద్దు చేసి అందరికీ పాత పింఛను విధానం వర్తింపజేయాలని సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం ససేమిరా అంగీకరించలేదు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం... మన ప్రభుత్వం రాగానే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానం అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. పింఛను అనేది ఉద్యోగులకు సర్కారు పెట్టే భిక్ష కాదు. అది వారి హక్కు, ప్రభుత్వ బాధ్యత. న్యాయస్థానాలు, ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న మాట ఇది. ఒకేచోట ఒకేవిధమైన పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి ఆర్థిక భరోసా ఇస్తూ, మరికొందరికి నిరాకరించడం అన్యాయమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇది సమన్యాయ సూత్రాలకు, సమాన పనికి సమాన వేతనం నిబంధనలకు వ్యతిరేకం. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని 1.86 లక్షల ఉద్యోగ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయం. అందుకే సీపీఎస్ స్థానంలో అందరికీ పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలని ఉద్యోగులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ డిమాండ్‌తో ధర్నాలు, నిరాహార దీక్షలు, ఛలో అసెంబ్లీ తదితర ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రభుత్వ అణచివేతను చవిచూశారు. అయినా పోరాట బాట వీడలేదు. సీపీఎస్ కింద పనిచేస్తూ... మరణించిన ఉద్యోగుల కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఆసరాలేక పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఉద్యోగం చేస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (పేరు మార్చాం) రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన భార్య ప్రసన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలను చదివించడం కూడా ఇబ్బందిగా ఉందని ఆమె వాపోతున్నారు. ప్రసన్నలాంటి కుటుంబాలు ఇలా ఎన్నో ఉన్నాయి. పాత పెన్షన్ విధానంలోని ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మరణించినా వారి జీవిత భాగస్వామికి (భర్త లేదా భార్య) జీవితాంతం పింఛను వస్తుంది. సీపీఎస్ పరిధి ఉద్యోగి మరణిస్తే వారి జీవిత భాగస్వామికి నయా పైసా పింఛను రాదు. వేర్వేరు పెన్షన్ విధానాలెందుకు? ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాంటి సామాజిక, ఆర్థిక భద్రత ఉంటుందో పదవీ విరమణ తర్వాత కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతోనే ఉద్యోగులకు గతంలో ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించారు. ప్రభుత్వ నిధులతోనే ఉద్యోగులకు పింఛను ఇవ్వడం ఇందులో భాగమే. 2003లో చంద్రబాబు కేంద్రంలో మద్దతిచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రతైన పింఛనుకు గండికొడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానం అమల్లోకి తేనున్నట్లు నోటిఫై చేసింది. 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు 2004 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి వర్తింపజేసింది. దీనిప్రకారం ఈ తేదీకి ముందు చేరినవారికి పాత పెన్షన్, తర్వాత చేరినవారికి కంట్రిబ్యూటరీ పింఛను వర్తిస్తుంది. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) బిల్లు ఆమోదించింది. ఉద్యోగుల మూల వేతనంలో పది శాతాన్ని ప్రభుత్వం మినహాయించుకుని అంతే మొత్తాన్ని ప్రభుత్వం జత చేసి, దానిని స్టాక్ మార్కెట్లో పెట్టి ఆ మొత్తంపై వచ్చే రాబడిని పెన్షన్‌గా ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం. ఇది రెండో రకం పింఛను విధానం. పింఛన్లు ఎందుకు ఇవ్వాలంటే! వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనను పిల్లలు పట్టించుకోకపోతే వారి సంగతేమిటి? పనిచేయలేని వయసులో జబ్బులు వస్తే వైద్యానికి డబ్బు సంపాదించలేరు. వారు మంచానపడి చిక్కిశల్యమై పోవాల్సిందేనా? ఇది మంచి సమాజానికి సంకేతం కాదు. ఈ ఉద్దేశంతోనే సామాజిక భద్రతా పింఛన్ విధానాన్ని గతంలో అమలు చేశారు. అల్పాదాయ కుటుంబాల్లోని పేదలు, ఇతర వర్గాలకే సామాజిక భద్రతలో భాగంగా పింఛన్లు ఇస్తున్నప్పుడు దశాబ్దాల తరబడి ప్రత్యక్షంగా సేవలందించి వృద్ధాప్యంలో రిటైరైన ఉద్యోగులకు ఇదే తరహాలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? కచ్చితంగా ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తమకూ పెన్షన్ ఇవ్వాలని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులు చేస్తున్న డిమాండును ముఖ్యమంత్రి చంద్రబాబు అయిదేళ్లుగా ఆమోదించలేదు. అసలీ డిమాండ్ అసంబద్ధమైనదా? అనే ప్రశ్నకు ఔనని కూడా ఆయన చెప్పలేకపోతున్నారు. దీన్నిబట్టి సీపీఎస్ అమలు న్యాయమైనదే అని తెలుస్తోంది. అయినా ఐదేళ్లుగా అమలు చేయకుండా కాలయాపన చేశారు. సాకులతో బాబు కాలయాపన సీపీఎస్ రద్దు చేయాలని నాలుగేళ్లుగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా పోలీసులతో లాఠీచార్జి చేయించారు. మహిళలని కూడా చూడకుండా దారుణంగా కొట్టించారు. ఛలో అసెంబ్లీ ప్రకటించిన ఉద్యోగులను తీవ్రవాదులన్నట్లుగా చితకబాదించారు. ఉద్యోగుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఓ దశలో సమస్యలు చెప్పేందుకు వెళ్లిన సీపీఎస్ ఉద్యోగులకు మొదట ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి అంశమంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారు. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో స్వేచ్ఛ ఉందని ఆధారాలు సహా చెప్పడంతో ఎన్నికలు ఉన్నాయనగా గతేడాది నవంబరులో సాధ్యాసాధ్యాలను పరిశీలనకంటూ కమిటీ వేశారు. ఇప్పటికీ ఈ కమిటీ రిపోర్టు రాలేదు. దీనినిబట్టి కాలయాపన చేసేందుకే కమిటీ వేశారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పెన్షన్ విధానం అమలు చేయాలో నిర్ణయించుకునే అధికారం స్థానిక ప్రభుత్వాలకే ఉంది. అయితే, తమ ఉద్యోగులకు పాత పింఛను అమలు చేస్తామని ముందుగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా పడే ఆర్థిక భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబుకు సీపీఎస్ రద్దు చేయాలనే చిత్తశుద్ధి లేదు. అందుకే అనుమతి కోసం చొరవ చూపలేదు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలపై కొండంత ఆశ సగటు ఉద్యోగులంతా విరమణ తర్వాత తమ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితులపై ఒకింత ఆందోళనగా ఉంటారు. వారి జీవనం సాఫీగా సాగడానికి పింఛనే ఆధారం కాబట్టి ఎంతో ఆశతో లెక్కలేసుకుంటారు. గ్రాట్యుటీ సొమ్ముతో ఇల్లు కొనుక్కోవాలని, ఆడ పిల్లల పెళ్లి చేయాలని భావిస్తుంటారు. వారు ఆర్థికంగా తట్టుకోవడం చాలా కష్టం. పెద్ద జబ్బులు చేసినా, కుటుంబంలో ఏదైనా ఉపద్రవం వచ్చినా తట్టుకుని నిలదొక్కుకునేందుకే పెన్షన్ విధానాన్ని గత ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. వైఎస్ జగన్ హామీతో పెరిగిన విశ్వాసం మన ప్రభుత్వం రాగానే సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమల్లోకి తెస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో రాష్ట్రంలోని 1.86 లక్షల సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా పలు జిల్లాల్లో సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు ఆయనను కలిసి తమ కష్టాలను వివరించి న్యాయం చేయాలని కోరారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను కచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమల్లోకి తెస్తాం’ అని ఆయన భరోసా ఇచ్చారు. ‘సీపీఎస్ రద్దు చేయాలి, పెన్షన్ భిక్ష కాదు– మా హక్కు’ అనే నినాదాలున్న ఫ్లకార్డులు పట్టుకుని కొన్ని జిల్లాల్లో సీపీఎస్ ఉద్యోగులు జగన్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు. వారి సమస్యలు తెలుసుకున్న జగన్ కుటుంబ పోషకులైన ఉద్యోగులను కోల్పోయి ఆర్థికంగా, సామాజికంగా చిక్కుల్లో పడ్డ కుటుంబాలకు సొంతంగా కొంత ఆర్థిక సాయం చేశారు. ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని, 11వ పీఆర్సీని త్వరగా అమలు చేస్తామని కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగ సభలో జగన్ వాగ్దానం చేశారు. మాట ఇస్తే తప్పని వైఎస్ కుటుంబ చరిత్రను గుర్తుచేసుకుంటూ, జగన్ అధికారంలోకి వస్తారని సీపీఎస్ రద్దు చేస్తారని ఉద్యోగులు విశ్వాసంతో ఉన్నారు. రెండింటి మధ్య తేడా ఇది... పాత పింఛను విధానం జీపీఎఫ్ ఖాతాలో మెచ్యూరిటీ మొత్తానికి ఆదాయ పన్ను ఉండదు. విరమణ తర్వాత ఉద్యోగులకు డీఏ పెరిగితే ఆ మేరకు రిటైర్డు ఉద్యోగులకు డీఆర్ పెరుగుతుంది. పింఛనును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లిస్తుంది. ఉద్యోగి ఒక్క రూపాయి కూడా జమ చేయాల్సిన పనిలేదు. సీపీఎస్ విధానం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఉండదు. పింఛను గ్యారంటీ ఉండదు. ఇది స్టాక్‌మార్కెట్ రాబడిపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగి మూల వేతనం నుంచి 10 శాతం పింఛను కోసం చెల్లించాలి. -
బాబూ.. మేము విసిగిపోయాం
సాక్షి, అమరావతి : క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు అందకపోయినా, గ్రామ శివారులో అరాచకశక్తుల అలికిడి వినబడినా, ఉన్నతాధికారులిచ్చిన ప్రోగ్రామ్ సతాయించినా వీటన్నింటికీ బాధ్యులు క్షేత్రస్థాయి ఉద్యోగులే.. ఇలా ఏ చిన్న పొరపాటు జరిగినా అటు ఉన్నతాధికారులు, ఇటు ప్రజలు, పాలకుల వేళ్లన్నీ వీరివైపే చూపిస్తుంటాయి. ఇంత అవమానాలు ఎదుర్కొంటున్నా రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత మాత్రం లేదు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికే అనేక పోరాటాలు చేసినా, నిరసనలు తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం కల్పిస్తానని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని వరాలు కురిపించారు. దీంతో అన్ని శాఖల ఉద్యోగులు తమ జీవితాల్లో చింతలు తీరబోతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ రద్దు పాదయాత్ర ఆరంభంలో తనని కలసి సీపీఎస్ పెన్షన్ విధానం వల్ల ఎదుర్కొంటున్న సమస్యను, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాల గురించి విన్న వైఎస్ జగన్ ఆ రోజే వారికి స్పష్టమైన హామీచ్చారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తానని ప్రకటించారు. మరోవైపు గత ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు చేస్తామని గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేసింది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఓ కమిటీ వేసి, దాని రిపోర్టు కూడా ప్రకటించకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగులు ఎవరూ నమ్మని పరిస్థితి. ఐఆర్ ప్రకటనతో హర్షం ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్)ను అధికారంలోకి రాగానే 27 శాతం ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఉద్యోగుల మనసును గెలుచుకున్నారు వైఎస్ జగన్. పీఆర్సీని కూడా సకాలంలో అమలు చేసి తీరుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు జననేత. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఐఆర్, డీఏలు పెండింగ్‌లో పెట్టడం, పోస్టు డేటెడ్ చెక్కులు ఇవ్వటం వంటి ఉద్యోగలను ఇబ్బందిపెట్టే నిర్ణయాలు ఉండవని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు 10-15 వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాపం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అధికారంలోకి రాగానే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తానన్న బాబు కోర్టు తీర్పులు, నిబంధనలు అంటూ కుంటి సాకులు చెప్పారు. కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సమాన పనికి – సమాన వేతనం వంటి సుప్రీం కోర్టు తీర్పులు చంద్రబాబు పాలనలో అమలు నోచుకోక మూలనపడ్డాయి. హెల్త్‌కార్డులు కావవి.. నాలికబద్దలు! ఉద్యోగులకు హెల్త్‌కార్డుల మంజూరు చేశానంటూ సీఎం చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారుæ. వాటితో కనీసం నాలుక గీసుకోవటానికి కూడా పనికిరావటం లేదు. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అని గొప్పలు చెప్పారు. తీరా ఏ హాస్పిటల్‌కు వెళ్లినా సారీ సార్ మేం ట్రీట్మెంట్ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. పెన్షనర్ల పరిస్థితి మరీ ఘోరం. నాలుగో సింహానికి వారాంతపు సెలవు పోలీసులకు వేళాపాళలుండవు. పండుగలు, వేడుకలు, సెలవులు లాంటివి ఏవీ ఉండవు. వారి బాధలు గుర్తించిన ఏకైక నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాగానే పోలీసులకు వారాంతపు సెలవు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్యం, సంక్షేమం నాది బాధ్యతంటూ భరోసా ఇచ్చారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలివి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణకు చర్యలు అన్నారు. చేయనే లేదు. అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు. ఎన్నికల దగ్గరపడటంతో ఉద్యోగులను నమ్మించటానికి పాలసీని మాత్రమే తయారు చేశారు. ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణాలు. ఆ దిశగా చర్యలు ఏవీ తీసుకోలేదు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వీలైనంత త్వరగా భర్తీ చేస్తాం. ఈ హామీ అమలులో ఘోరంగా విఫలం. లక్షల్లో ఉద్యోగాల ఖాళీ ఉన్నప్పటికీ భర్తీ చేసింది చాలా తక్కువ వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు. ఈ విధానాన్ని కేవలం సచివాలయం, హెచ్వోడీలలో మాత్రమే అమలు చేశారు. ఉద్యోగులకు పదవీ విరమణ రోజు బెనిఫిట్స్ అందించే విషయంలోనూ బాబు పూర్తిగా విఫలమయ్యారు. ఏళ్ల తరబడి తిరిగినా ఆ బెనిఫిట్స్ వారికి అందటం లేదు. పెన్షనర్లకు మెరుగైన క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ హామీ అమలు కాలేదు.పైగా సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 27 శాతం ఐఆర్ మంచి నిర్ణయం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉద్యోగులకు ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత మాకు ప్రస్తుతం 27 శాతం ఐఆర్ ప్రకటించటం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఒకొక్కరికి రూ.5 వేల ప్రయోజనం చేకూరుతుంది. హెల్త్, పెన్షన్ స్కీం వలన ఎంతో మంది ఉద్యోగులకు ప్రయోజనం. –హరినాథ్‌బాబు, రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి, మాచర్ల ప్రభుత్వ ఉద్యోగులు గమనించాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని ఐఆర్‌తోపాటు పెన్షన్ ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. ప్రతిపక్షనేత జగన్ నిర్ణయాలు హర్షణీయం. ఉద్యోగులకు మేలు చేసే వారే మా నాయకులు. మాకు రాజకీయాలతో పని లేదు. – నందా నరసింహయ్య, రిటైర్డ్ తహసీల్దార్, మాచర్ల -
అవమానాలే బహుమానాలు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి... ప్రయివేటు సంస్థలను ప్రోత్సహించడం, ఉద్యోగులను తొలగించడం అనేవి చంద్రబాబు విధానాలు. ఆది నుంచి ఆయన అనుసరించే పద్ధతులు ఇవే. 1999–2004 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు డెయిరీతోపాటు అనేక సహకార డెయిరీలను నష్టాల్లోకి నెట్టి మూయించేశారు. సహకార చక్కెర కర్మాగారాల షట్టర్లు వేయించారు. ఆర్టీసీని కూడా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రణాళిక వేసినా.. ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. అందుకే చంద్రబాబును ప్రపంచబ్యాంకు ఏజెంటు అని వామపక్ష మేథావులు అంటుంటారు. ఆల్విన్, ఏపీ స్కూటర్స్, రిపబ్లిక్ ఫోర్జ్ లాంటి 23 ప్రభుత్వ రంగ సంస్థలు చంద్రబాబు జమానాలోనే మూతపడ్డాయి. దాంతో ఈ సంస్థల్లో పనిచేస్తున్న 26వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. మరో 18 వేల మందిని గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో బలవంతంగా రాజీనామాలు చేయించి ఇళ్లకు పంపించారు. చంద్రబాబు హయాంలో గోల్డెన్ షేక్ హ్యాండ్, వాలంటరీ రిటైర్మెంట్ స్కీం(వీఆర్ఎస్) పేర్లు ఏమైనా.. బలవంతంగా ఉద్యోగులను ఇళ్లకు పంపేవే. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఔట్సోర్సింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. లంచగొండులంటూ ముద్ర ‘వేళాపాళా లేకుండా చంద్రబాబు రోజూ వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలు, వాటికి నివేదికలు అంటూ.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారనేది అత్యధిక మంది ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న ఆవేదన. ఈ పనులవల్ల రాత్రి 10–11 గంటల వరకూ పనిచేసినా.. చిన్న తప్పునకే వేధిస్తారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. ఇవన్నీ చాలవన్నట్లు అధికార పార్టీ నాయకుల నుంచి అడ్డగోలుగా తమ వారికే పనులు చేయాలంటూ.. ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఒత్తిడి ఎక్కువై బీపీ, షుగర్ వ్యాధుల భారిన పడుతున్నాం’ అని చాలామంది ఉద్యోగులు తమ బాధ వెళ్లగక్కుతున్నారు. ఒకవైపు ఉద్యోగుల బదిలీలకు సీఎం కనుసన్నల్లోని మంత్రులు లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటూ.. ఉద్యోగులపై లంచగొండులనే ముద్ర వేస్తున్నారని’ ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 26 మంది ఉద్యోగులపై క్రిమినల్ కేసులు సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండుతో విజయవాడలో ఉద్యోగులు నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు 02–10–2018న 26 మందిపై విజయవాడలో క్రిమినల్ కేసులు పెట్టించారు. సీపీఎస్ రద్దు చేయాలని నాలుగేళ్లుగా ఉద్యమం చేయిస్తున్నారనే కోపంతోనే సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజినేయులును సస్పెండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎవరు హామీ ఇస్తే వారికే రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగ కుటుంబాలు మద్దతు ఇస్తాయని ప్రకటించినందుకు కక్షకట్టి ఆయన్ను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తమ అడుగులకు మడుగులొత్తే ఉద్యోగ సంఘాల నేతలకు సొంత పనులు చేసి పెడుతూ.. ప్రజా సంక్షేమం దృష్టితో తప్పులను ఎత్తిచూపితే మాత్రం సహించలేక తీవ్రస్థాయిలో కక్షసాధింపు చర్యలకు దిగుతారు. ఐఆర్ బకాయిలు రూ.5200 కోట్లు ఎగవేత ‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఎప్పటికప్పుడు ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) పెండింగులో లేకుండా ఇచ్చేశారు. చంద్రబాబు పాలనలో దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు డీఏలను కూడా సకాలంలో అమలు చేయకుండా పెండింగులో పెడుతోంది. 2018 జనవరి ఒకటో తేదీ నుంచి ఒకటి, జులై ఒకటో తేదీ నుంచి మరొకటి, 2019 జనవరి 1 నుంచి ఇంకొకటి వెరసి ప్రభుత్వ ఉద్యోగులకు మూడు కరువు భత్యాలు(డీఏ)లు, పెన్షనర్లకు మూడు డీఆర్లు పెండింగులో ఉన్నాయి. పదో పీఆర్సీకి సంబంధించి 11 నెలల బకాయిలు రూ.5100 కోట్లు ఎగవేశారు. ఓవైపు ఖర్చులు పెరిగిపోతుంటే.. ఇలా పీఆర్సీ బకాయిలు ఎగవేసి, డీఏలు పెండింగులో పెడితే ఎలాగని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఉద్యోగులపై వేధింపులకు నిదర్శనాలెన్నో.. వేతనాలు పెంచాలనే డిమాండుతో 2015లో హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టిన అంగన్వాడీలపై లాఠీచార్జీ చేయించింది చంద్రబాబు ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం పెంచినందున అదే దామాషాలో తమకూ వేతనాలు పెంచాలని గతేడాది చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన అంగన్వాడీలపై లాఠీచార్జీ చేయించారు. ఎన్నికలు సమీపించిన సమయంలో ఓట్లకోసం వారి వేతనాలను స్వల్పంగా పెంచారు. అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాగిస్తున్న ఇసుక దందాను అడ్డుకున్నందుకు మహిళా తహసీల్దారు వనజాక్షిపై దాడికి పాల్పడి ఘోరంగా అవమానించారు. మహిళ అని కూడా చూడకుండా వనజాక్షిపై అందరి ఎదుటే దౌర్జన్యం చేసిన చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా తిరిగి పరిధి దాటారంటూ వనజాక్షికే బెదిరింపులు. ‘మా వాళ్లు ఏం చేస్తున్నా.. చూసీ చూడనట్లు ఉండాలి. మా వాళ్ల వ్యవహారాలను అడ్డుకోవడానికి వీల్లేదు. మీరు కార్యాలయంలో ఉండాలేగానీ ఫిర్యాదు రాగానే పరిగెత్తుకుంటూ అక్కడకు వెళ్లి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం ఏమిటి? జరిగిందేదో జరిగిపోయింది.. రాజీ కండి...’అని చంద్రబాబు హుకుం. 50ఏళ్ల వయసుకే ఉద్యోగులను ఇళ్లకు పంపాలన్న కుట్ర బయటపడిందని ఉద్యోగులపై వేటు. ముసాయిదా జీవోలను బట్టబయలు చేయడంతో అధికార రహస్యాలను బహిర్గతం చేశారంటూ.. ఏమాత్రం సంబంధంలేని సచివాలయ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డితోపాటు సచివాలయ ఉద్యోగి తిమ్మప్ప సస్పెన్షన్. ఏడాదిన్నర తర్వాత సస్పెన్షన్ తొలగింపు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుచేసి.. పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని నిరాహార దీక్షలు చేసిన పాపానికి వారేదో దేశద్రోహ నేరానికి పాల్పడినట్లుగా 26 మందిపై క్రిమినల్ కేసులు. సీపీఎస్ రద్దు చేసినవారికే మద్దతు ఇస్తామని, సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని డిమాండు చేసినందుకు సీపీఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు రామాంజినేయులు యాదవ్‌పై సస్పెన్షన్. వివిధ సందర్భాల్లో అధికారులపై చంద్రబాబు వ్యాఖ్యలు.. ఏయ్... జేసీ నువ్వేం చేస్తున్నావ్. ఏం తమాషాగా ఉందా? ఇదేం అడ్మినిస్ట్రేషన్? ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఎవరినీ వదిలిపెట్టను మీవల్లే ఫెయిలయ్యాం. అధికారులవల్లే మిషన్లలో వైఫల్యం. శాఖల మధ్య సమన్వయం లేదు. గిరిజన ప్రాంతాల్లో చైతన్యం లేదు. తోక జాడిస్తే కత్తిరిస్తా. నేను తలచుకుంటే ఏమి చేస్తానో తెలుసా.. అసలు మిమ్మల్ని సచివాలయంలోకి రానిచ్చింది ఎవరు... పిచ్చిపిచ్చిగా ఉందా? తమాషాలు చేస్తున్నారా...? ప్రతి ఫైలులో ఇష్టానుసారంగా రాస్తారా? ఇలాగైతే పరిపాలన ఎలా చేయాలి? బడ్జెట్లో కేటాయింపుల్లేకుండా నిధులు మంజూరు చేయడం వీలుకాదని ఉన్న నిబంధనలు రాసిన ఆర్థిక శాఖ అధికారిపై సీఎం చిందులు... అధికారుల వల్లే నాకు చెడ్డపేరు. నాకు తెలియకుండా జీవో ఇచ్చారు... అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు –విశాఖపట్నం జిల్లాలో 1,212 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ నిలదీయడంతో.. తనకు తెలియకుండా జీవో ఇచ్చారంటూ అధికారులపై నెపం మోపారు. వాస్తవంగా సీఎం ఆమోదంతోనే ఈ జీవోను అటవీశాఖ ఇచ్చింది. పోరాటానికి బహుమానం ఉద్యోగం నుంచి తొలగింపు సీఎం చంద్రబాబు, ఆయన కోటరీ ఏమి చెప్పినా తలూపాల్సిందే. వారు తప్పు చేయమంటే చేయాల్సిందే. లేదంటే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. ఇందుకు నాతోపాటు ఏలూరులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసి చనిపోయిన వెంకట్రావు ఉదంతాలే ప్రత్యక్ష నిదర్శనాలు. నేను ప్రాణాలతో ఉన్నా. పాపం వెంకట్రావు ఉద్యోగం పోయిందనే మానసిక వేదనతో ప్రాణాలు కోల్పోయారు. ఏలూరులో(రెవెన్యూ) జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే వెంకట్రావు అనారోగ్య కారణాలతో విధులకు హాజరుకాలేకపోయారు. సమస్యను చెప్పినా వినకుండా.. ఆయనను సర్వీసు నుంచి తప్పించారు. దీనివల్ల మానసిక వ్యథతో మరింతగా అనారోగ్యం పాలై వైద్యం కూడా చేయించుకోలేని దుస్థితిలో ప్రాణాలు కోల్పోయారు. దళితులకు చేసే న్యాయం ఇదా? బాబు సర్కారు అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినందుకే నన్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ఏపీఆర్ఎస్ఏ) జిల్లా అధ్యక్షునిగా, అంతకు ముందు ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షునిగా నాకు ఉద్యోగుల్లో పట్టు ఉంది. చంద్రబాబు సర్కారు సాగించిన ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఉద్యమించినందుకు బాబు సామాజిక వర్గానికి చెందిన జిల్లా కలెక్టరు కాటమనేని భాస్కర్ నన్ను 10 –3–2017లో అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఏలూరులో పౌరసరఫరాల విభాగం డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. కక్ష కట్టి లేని సాకులతో నన్ను సస్పెండ్ చేశారు. తర్వాత 10–01–2019న ఉద్యోగం నుంచి తొలగించారు. నేను దళిత క్రిస్టియన్‌ను. దళిత ఉద్యోగుల పట్ల చంద్రబాబు మార్కు ప్రేమ అంటే ఇదీ. –ఏపీఎన్జీవో సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు సాగర్ -
సీపీఎస్ సంఘ నేత రామాంజనేయులు యాదవ్ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. పదవీవిరమణ అనంతరం తమ బతుకులను రోడ్డు పాలుచేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పోరాడుతున్న సీపీఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలెల రామాంజనేయులు యాదవ్‌ను ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు అనంతపురం జిల్లా విద్యాధికారి ద్వారా హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీకి చెందిన వ్యక్తులు కొందరి చేత ‘సీవిజిల్’ ద్వారా ఫిర్యాదు చేయించి బీసీ నాయకుడైన రామాంజనేయులు యాదవ్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈయన అనంతపురం జిల్లా తనకళ్లు మండలం బొంతలపల్లి జడ్పీ హైస్కూల్లో హిందీపండిట్‌గా పనిచేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నా ఉద్యోగులకు న్యాయం చేయడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. దీనిపై రామాంజనేయులు యాదవ్ హర్షం వ్యక్తం చేయడంతో కక్ష కట్టిన ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేయించింది. అశోక్‌బాబుకో రూలు.. మాకో రూలా? ‘ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేలు చేసే మాట వైఎస్ జగన్ చెబితే అభినందించాను. అంత మాత్రాన నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారా? మరి గతంలో అశోక్‌బాబు ఏకంగా చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలోనే పాల్గొన్నారే.. ఆయనను ఎందుకు సస్పెండ్ చేయలేదు. ఆయనకో రూలు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాకో రూలా?’ అని ఏపీ సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ఉద్యోగుల హక్కులను అణగదొక్కడమే... సీపీఎస్ రద్దుపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నందుకు తనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం ఉద్యోగుల హక్కులను, అభిప్రాయాల వ్యక్తీకరణను, ఉద్యమాలను అణగదొక్కడమేనని రామాంజనేయులు యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెనకబడిన కులాలకు చెందిన వ్యక్తులను అవమానించడమేనని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని, ఒక ఉద్యమ నేతగా తన అభిప్రాయాన్ని చెప్పినందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయమని ఖండించారు. చంద్రబాబుకు గుణపాఠం తప్పదు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండు చేసిన పాపానికి రామాంజనేయులు యాదవ్‌ను సస్పెండ్ చేయడాన్ని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ జాతీయ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తీవ్రంగా ఖండించారు. -
ఉద్యోగులకు భరోసా..సీపీఎస్ రద్దు
సాక్షి, శ్రీకాకుళం అర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఇటు కేంద్రప్రభుత్వానికి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొత్తుకున్నా వినే వారే కరువయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యో గ, ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి రాజధాని అమరావతిలో పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి కమిటీ వేసి చేతులు దులుపుకొంది. ఈ తరుణంలో ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట ఆశాకిరణంలా కనిపించారు. సీపీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుని వాటిపై అవగాహన ఏర్పరచుకున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకా కుళం జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత పలు చోట్ల సీపీఎస్ ఉద్యోగులు కలసి వారి సమస్యలను వినతిపత్రం రూపంలో అందజేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు కోసం కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ప్రకటన ఉద్యోగ వర్గాల్లో కొండంత మనోధైర్యం నింపింది. చెల్లింపుల్లో అక్రమాలు..! సీపీఎస్ విధానాన్ని పీఎఫ్ఆర్డీఏ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ), ఎన్ఎస్డీఎల్(నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్) సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల మూలవేతనం, కరువు భత్యంలో పింఛన్ కోసం మినహాయించిన 10శాతం మొత్తానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రయివేట్ ఫండింగ్ ఏజెన్సీ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టి లాభాల ఆధారంగా పింఛన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నష్టాలు వస్తే పింఛన్ ఎలా ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు. జిల్లాలో 2004 తర్వాత సీపీఎస్ విధానంలో 10,600 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 6వేల మంది ఉపాధ్యాయులు ఉండగా 4,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనలతో 12 ఏళ్ల తర్వాత సీపీఎస్ ఉద్యోగుల సంఘంగా ఏర్పడి నిరసనలు, దీక్షలు నిర్వహించారు. వీరికి సంఘీభావం తెలియజేస్తూ పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆం దోళన బాట పట్టాయి. నష్టమే ఎక్కువ.. సీపీఎస్ కారణంగా.. ఉద్యోగి పదవీవిరమణ పొందిన తర్వాత సామాజిక భద్రత ఉండదు. పింఛన్లో కొంత భాగాన్ని కమ్యూటేషన్ చేసుకునే సదుపాయం ఉండదు. ఉద్యోగులు సర్వీసులో మరణిస్తే కారుణ్య నియామకంతో పాటు కుటుంబానికి పింఛన్ ఇచ్చే సదుపాయం ఉండదు. రద్దు కోరుతూ పోరుబాట సీపీఎస్ విధానం రద్దు కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఎప్పటికప్పుడు దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు చేస్తున్న న్యాయమైన పోరాటాలను రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అణచివేత ధోరణికి పాల్పడింది. సీపీఎస్ రద్దు కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపుతూ వారిని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేయించి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం, ముందస్తు హౌస్ అరెస్ట్‌లు, గృహనిర్భందాలకు పాల్పడింది. గత ఏడాది అక్టోబరు 2న ఆమరణ నిరాహార దీక్షకు దిగిన 26 మంది సీపీఎస్ ఉద్యోగులపై కేసులు బనాయించారు. వారిలో జిల్లాకు చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ‘టక్కర్ కమిటీ’తో కాలయాపన.. సీపీఎస్ రద్దు పోరాటం ఉద్ధృతం కావడంతో గత్యంతరం లేని స్థితిలో మూడు నెలల వ్యవధిలో నివేదిక ఇవ్వాలనే నిబంధనతో మాజీ సీఎస్ టక్కర్ అధ్యక్షతన చంద్రబాబు ప్రభుత్వం ‘టక్కర్ కమిటీ’ వేసింది. ఈ కమిటీపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిటీలు కేవలం కాలయాపనకే తప్ప ప్రయోజనం శూన్యమని ధ్వజమెత్తుతున్నారు. చివరి క్యాబినెట్ సమావేశానికి మూడు రోజుల ముందే టక్కర్ కమిటీ నివేదిక ఇచ్చినా దానిని ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడం గమనార్హం. టక్కర్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, చివరి క్యాబినెట్లో సీపీఎస్ రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగులు ఎంతగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులంతా బాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంశం పాత ఫింఛన్ విధానం సీపీఎస్ విధానం 1. కమ్యూటేషన్ 40శాతం ఉండదు 2. డెత్ పెన్షన్ సౌకర్యం కుటుంబ పెన్షన్ ఉండదు 3. నెలవారీ పెన్షన్ 50శాతం బేసిక్ పే ఉండదు 4. పదవీవిరమణ డీఏ ఇస్తారు ఉండదు 5. పీఎఫ్ అర్హత ఉంటుంది. ఉండదు 6. పీఎఫ్ లోన్ ఉంటుంది. ఉండదు 7. హెల్త్‌కార్డు ఉంటుంది. ఉండదు 8. పెన్షన్ గ్యారెంటీ ఉంటుంది ఉండదు 9. పెన్షన్ డిసైడ్ బై ప్రభుత్వం పీఎఫ్ ఆర్డీఏ, షేర్‌మార్కెట్ -
సీపీఎస్ రద్దుకు సై..
సాక్షి, కడప : భాగస్వామ్య పింఛన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేస్తామని ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీపై ఉద్యోగుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. తాము అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. పాత పింఛన్ విధానం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు ఇప్పటికే పలుమార్లు చేసిన ఉద్యమాలను ప్రభుత్వం అణగతొక్కింది. రాష్ట్రంలో 2017, 2018 సెప్టెంబరులో చేపట్టిన మిలియన్ మార్చ్, చలో విజయవాడ కార్యక్రమాలను అణచివేసింది. పలు జిల్లాలు, ప్రాంతాల్లో ఉపాధ్యాయ సంఘ నేతలు, సీపీఎస్ ఉద్యోగులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించిన ఘనతను మూట కట్టుకుంది. సీపీఎస్ రద్దు చేయాలంటూ.. ఏటా సెప్టెంబరు ఒకటిన సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు సామూహిక సెలవుదినాన్ని పాటిస్తున్నారు. ఎన్ని ఆందోళనలు చేపట్టినా, విన్నపాలు ఇచ్చినా ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి, విదేశ పర్యటనలకు ప్రత్యేక విమానాలు, ప్రచార ఆర్భాటాలకు రూ.కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. ఉద్యోగుల విషయానికొస్తే రాష్ట్రం లోటులో ఉందనే సాకులు చెబుతోందని వారు వాపోతున్నారు. మొదటి నుంచి ఆందోళనే.. సీపీఎస్ విధానంలో ఉద్యోగి మూలవేతనం, దినసరి భత్యం నుంచి పది శాతం నిధులను ప్రభుత్వం మినహాయించుకుని, అంతే మొత్తాన్ని జత చేసి దాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతోంది. ఇందులో లాభనష్టాలను మాత్రం ఉద్యోగి భరించాలి. షేర్ మార్కెట్ అనేది జూదం లాంటిదని ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే తమ సీపీఎస్ ఖాతాలో ఎంత మొత్తం ఉందనే విషయం తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఉద్యోగి చనిపోయినా, అలాగే ఉద్యోగం మానివేసినా.. ఆ నగదు ఎలా పొందాలనే దానిపై ప్రభుత్వాలు విధివిధానాలు ట్రెజరీలకు అందించలేదు. దీంతో ఆ నగదును ఉపసంహరించుకునే పరిస్థితి లేక కొందరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము 60 ఏళ్ల వరకు సేవ చేసిన తరువాత ప్రభుత్వం పింఛన్ అందిస్తే.. ఉద్యోగ విరమణ జీవితాన్ని ప్రశాంతంగా ఆర్థిక భరోసాతో గడిపే అవకాశముంటుందని వారు పేర్కొంటున్నారు. జగన్ హామీతో వేలాది కుటుంబాలలో ఆనందం 2004 సెప్టెంబరు నుంచి పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 1.64 లక్షల మంది, జిల్లాలో దాదాపు 15 వేల మంది సీపీఎస్ పరిధిలో ఉన్నారు. 2004 నోటిఫికేషన్ తరువాత జిల్లాలో 12 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉన్నత విద్యామండలి, ఆరోగ్య, పోలీసు తదితర శాఖలలో మరో మూడు వేల మంది ఉద్యోగులు సీపీఎస్ పరిధిలో ఉన్నారు. పాతవిధానం, సీపీఎస్ పోలికలివే.. పాత విధానంలో ఉద్యోగి పింఛను కోసం ఒక రూపాయి కూడా జీతం నుంచి చెల్లించక్కరలేదు. సీపీఎస్‌లో ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా పది శాతం దాచుకోవాల్సి ఉంది. పాత విధానంలో ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆ ఇంట్లో అర్హత గల వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇచ్చేవారు. మరణించిన ఉద్యోగి భార్యకు పింఛను ఇచ్చేవారు. సీపీఎస్ విధానంలో.. ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకాలు ఉండవు. ఉద్యోగి తన భవిష్యనిధిలో దాచుకున్న డబ్బుకు ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సీపీఎస్‌లో దాచుకున్న డబ్బుకు ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత షేర్మార్కెట్లో ఈ పెట్టుబడుల వల్ల హెచ్చుతగ్గులు వచ్చి స్థిరీకరణతో కూడిన పింఛను అందదు. కరువు భత్యం వర్తించదు. ఉద్యోగి ఆరోగ్య కార్డు రద్దవుతుంది. సీపీఎస్ మా పాలిట శాపం ఉద్యోగ భద్రత లేని సీపీఎస్ ఉద్యోగుల పాలిట శాపం. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చేప్పేందుకు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలం సిద్ధంగా ఉన్నాం. – పుల్లయ్య, సీపీఎస్ కమిటీ నాయకుడు, ఎస్టీయూ మా ఆశలు నెరవేరుతాయి పాత పింఛను విధానాన్ని ప్రవేశ పెడతామని వైఎస్ జగన్ చెప్పిన ఒక్క మాటతో లక్షలాది కుటుంబాల ఎదురుచూపులు తీరతాయి. ఎన్నో ఏళ్లుగా సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం ప్రవేశ పెట్టాలని నాయకులను, ప్రజాప్రతినిధులను అడుగుతున్నా పట్టించుకోలేదు. – విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు రద్దు చేసే వారికే మా మద్దతు జగన్ సీపీఎస్ రద్దు హామీ ఇవ్వడం గొప్ప విషయం. ఆయన ఉద్యోగుల కష్టాలు చూసే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. సీపీఎస్ రద్దుకు సహకరించే వారికే మా మద్దతు తెలుపుతాం. జగన్ తీసుకున్న సీపీఎస్ రద్దు నిర్ణయం చారిత్రాత్మకంగా మారడం ఖాయం. – రాజగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు -
ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ
-
ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మరో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. అశోక్‌బాబు, బొప్పరాజు సంఘాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న కారణంగా ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సమాఖ్య ఏర్పాటు చేసినట్లు నూతన జేఏసీ కన్వీనర్ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడకుండా ప్రభుత్వ భజన చేస్తున్నాయని మండిపడ్డారు. ఐఆర్, ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ సన్మానాలు, పాలాభిషేకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ‘ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం అమరావతిలో ఎకరానికి కోటికి పైగా రూపాయలు ఇస్తే.. దానికి సంబరాలు చేసుకున్నారు. ప్రైవేటు సంస్థలకు రూ. 30 లక్షలకు, రూ. 50లక్షలకు ఇచ్చిన ప్రభుత్వం....ఉద్యోగుల దగ్గర కోటి రూపాయలు వసూలు చేసి.. స్థలాలు ఇస్తుందా’ అని ప్రశ్నించారు. మీకసలు సిగ్గుందా? కొత్తగా ఏర్పడే ఉద్యోగ సంఘాల సమాఖ్య ఉద్యోగుల సమస్యలపై పోరాడుతుందన్న వెంకట్రామిరెడ్డి... ‘సీపీఎస్ కోసం అనేక పోరాటాలు చేసాము. అయినా ప్రభుత్వం స్పందించలేదు. 54 సంఘాలు ఇప్పటి వరకు మాకు మద్దతు ఇచ్చాయి. అమరావతి జేఏసీలో ఉన్న ఉద్యోగ సంఘాలు కుడా మద్దతు తెలుపుతున్నాయి. మేము ఏర్పాటు చేస్తున్న సమాఖ్యలో వారంతా కలుస్తున్నారు. కొంతమంది రాజకీయ పదవుల కోసం సిగ్గు లేకుండా ప్రభుత్వం భజన చేస్తున్నారు. అసలు మీకు సిగ్గుందా.. ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... టీడీపీతోనే రాష్ట్రభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. -
ఉద్యోగుల ఉగ్రరూపం
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలంటూ ఉద్యోగులు కదంతొక్కారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు, చొక్కాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్ రద్దు చేసేంత వరకూ పోరాటం చేయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని తీర్మానించారు. పెన్షన్ భిక్ష కాదు అని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు?ను పాలకులు విస్మరించడం బాధాకరమని వాపోయారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖ సిటీ: సీపీఎస్.. ప్రస్తుతం రాష్ట్రంలోని 2 లక్షల మంది ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ప్రైవేటు సంస్థలకు కాసులు కురిపించే కార్పొరేట్ పెన్షన్ స్కీమ్ అంటూ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తుకు భరోసా కల్పించని సీపీఎస్ తమకొద్దంటూ నినదిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఐదు జిల్లాలకు చెందిన సీపీఎస్ ఉద్యోగులు నగరంలో ఆందోళన నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి దారిపొడవునా సీపీఎస్ విధానానికి, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యమించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమావేశమై సీపీఎస్ రద్దు చేసేంత వరకూ పోరాటం చెయ్యడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని తీర్మానించారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు గంట శ్రీనివాసరావు, సంతోష్‌కుమార్ బెహరా, సతీష్, మక్కా సురేష్, రెడ్డి సూరిబాబు, డా.సాంబమూర్తి, డా.సుబ్రహ్మణ్యం, ప్రొ.జానకిరామ్, శేఖర్‌బాబుతో పాటు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీపీఎస్ ప్రకటన జరిగిందిలా సీపీఎస్ విధానంపై 2003 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2004 జనవరి 1 నుంచి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 నుంచి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయ గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, అటానమస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులందరికీ జీవో నంబరు 653, 654,655 కింద 2004, నవంబర్22 నుంచి అమలు చేస్తోంది. దీనిని పెన్షన్ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ), నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) అనే ప్రైవేటు సంస్థల సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అమలు తీరు.. సీపీఎస్ విధానంలో టైర్1, టైర్2 అనే రెండు రకాల ఖాతాలున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయులకు టైర్ 1 ఖాతాలు మాత్రమే అమలు చేస్తున్నారు. టైర్–2లో ఎప్పుడైనా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. తన పొదుపుని తనకు నచ్చిన సంస్థల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతం టైర్–2ని అమలు చెయడం లేదు. ఉద్యోగి చందాకు సమానంగా ప్రభుత్వం తన వాటాను జమ చేయగా వచ్చిన మొత్తంలో ఉద్యోగ విరమణ చేశాక 60 శాతం మాత్రమే సదరు ఉద్యోగికి చెల్లిస్తారు. అందులోనూ 30 శాతానికిపైగా వివిధ రకాల పన్నులు, ఛార్జీల రూపేణా మినహాయించేస్తారు. మిగిలిన 40 శాతం యాన్యుటీ పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ బాండ్ల నుంచి వచ్చే డబ్బును ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నెలలా పెన్షన్‌గా 70 ఏళ్ల వరకూ చెల్లిస్తారు. ఆ తర్వాత మిగిలిన డబ్బు మొత్తం ఆదాయపు పన్ను మినహాయించుకుని ఇస్తారు. నిర్ణయం రాష్ట్ర పరిధిలోనే సీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమాలే జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినందు వల్ల దీన్ని రద్దు చెయ్యలేమని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును కొన్ని రాష్ట్రాలు ఆమోదించిన తర్వాతే కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం త్రిపుర, పశ్చిమ బంగా మొదలైన రాష్ట్రాల్లో ఇంకా పాత పెన్షన్ విధానమే అమల్లో ఉంది. కొంతమంది ఉద్యోగులు సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినప్పుడు ఇది కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసినట్లు పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. వెంటనే సీపీఎస్ రద్దు చెయ్యాలని నెలల తరబడి ఉద్యమాలు, ఆందోళనలు, ఆమరణ దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చెవికెక్కించుకోకపోవడం గర్హనీయమని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీపీఎస్ రద్దు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. లోపాలే.. ఉద్యోగుల పాలిట శాపాలు ♦ 30 నుంచి 35 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి రిటైర్మెంట్ అయితే ఆసరాగా ఉండాల్సిన పింఛను ఎంత వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ♦ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే సీపీఎస్ అకౌంట్లో జమ అయిన డçబ్బులు తిరిగి వచ్చే అవకాశం కష్టం. ♦ ఫండ్ మేనేజర్స్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు చందాదారులైన ఉద్యోగులకు లేకపోవడం గమనార్హం. ♦ ఉద్యోగి తన సర్వీస్ కాలంలో 25 శాతం మాత్రమే విత్ డ్రా చేసుకునే పరిస్థితి ఉంది. అది కూడా పదేళ్ల సర్వీస్ పూర్తయితేనే. ఉద్యోగ కాలంలో మూడు సార్లకు మించి అవకాశం లేదు. ప్రతి రెండు విత్‌డ్రాలకు మధ్య కనీసం మూడేళ్ల విరామం ఉండాల్సిందే. విత్‌డ్రాలు కూడా ప్రత్యేక అవసరాలకు మాత్రమే. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు అంశం రాష్ట్రం చేతిలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సాధ్యమవుతుంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేను. – బాధ్యత గల ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలివి సీపీఎస్ రద్దు అంశం ఉద్యోగుల ప్రాథమిక హక్కు. ఆర్థిక భారమే అయినా ఉద్యోగులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. సీపీఎస్ కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాం– ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేతవైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ