cyberabad police
-
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. బాణసంచా పేల్చడానికి 10 గంటల వరకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. ఎవరు నిబంధనలు అతిక్రమించినా హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయన్నారు.In view of maintaining public order, peace & tranquility in the limits of Cyberabad @CPCyberabad hereby notify for the information of the general public that Bursting of Fireworks/Crackers on Public roads & public places is strictly prohibited during the celebration of Deepavali. pic.twitter.com/miNJERiaOW— Cyberabad Police (@cyberabadpolice) October 31, 2024 -
పండక్కి ఊరెళుతున్నారా.. మీ ఇల్లు జరభద్రం
సాక్షి, హైదరాబాద్ : దసరా సెలవులు వచ్చేశాయి. క్రమంగా నగరవాసులు సొంతూర్లకు పయనమవుతున్నారు. ఇదే చోరులకు సరైన సమయం. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది దసరా పండుగ నేపథ్యంలో గ్రేటర్లో అధికంగా ఇళ్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈసారి పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పోలీసులు నైట్ పెట్రోలింగ్ పెంచారు. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వ్యక్తిగత గృహాలపై నిరంతరం నిఘా పెట్టారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులు, నేపాలీ పని మనుషుల కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.పండగ సమయాల్లో అధికంగా చోరీలు.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు, స్థానికంగా ఇతర జిల్లాల్లో ఉండే చోరులు పండుగ సమయాలను అనువుగా భావిస్తుంటారు. రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకొని, శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటారు. రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే పండగ వేళ చోరీలు అధికంగా నమోదవుతున్నాయి. ఎక్కువగా శివారు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలో సైకిల్, నైట్ పెట్రోలింగ్‌లతో గల్లీగల్లీలో నిఘా పెట్టాలని, నిరంతరం సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.సైబరాబాద్ పోలీసుల సూచనలివీ.. u బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. u సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ తాళం ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. u మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేయండి. నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డుగా నియమించుకోవాలి. u మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు వంటివి జమ కానివ్వకుండా చూడాలి. వాటిని గమనించి ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. u ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది. u సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. -
గంజాయి సీజ్: సినిమాటిక్ రేంజ్ లో మత్తుపదార్థాలు రవాణా
-
ఖాతాదారుకు తెలియకుండా రూ.40 కోట్లు బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఖాతాదారుకు తెలియకుండా రూ.40 కోట్ల నగదును మ్యూల్ అకౌంట్లలోకి మళ్లించాడు ఓ బ్యాంక్ మేనేజర్. దీంతో మేనేజర్ సహా ముగ్గురిపై సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి ఖాతా ఉంది. బ్యాంక్ అంతర్గత ఆడిట్లో భాగంగా ఈ అకౌంట్ నుంచి శంషాబాద్‌లోని మధురానగర్ బ్రాంచ్‌కు రూ.15 కోట్లు, రూ.25 కోట్లుగా రెండు విడతల్లో రూ.40 కోట్ల నగదు బదిలీ అయినట్లు బ్యాంకు ప్రతినిధులు గుర్తించారు. ముంబైలోని ప్రధాన కార్యాలయం అనుమతి లేకుండా అనధికారికంగా ఈ నగదు బదిలీ జరిగినట్లు తేలడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతా పథకం ప్రకారమే.. రూ.40 కోట్ల నగదుతో ఈ ఏడాది జులై మొదటి వారంలో కొత్తగా తెరిచిన ఓ ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి బదిలీ అయింది. ఇక్కడి నుంచి దేశంలోని జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల్లోని 20 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో బ్రాంచ్ మేనేజర్‌తో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందని ప్రాథమిక విచారణలో సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ అనుమానాస్పద లావాదేవీలపై బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించగా అతని బ్యాంక్‌కు రావడం మానేశాడు. అప్పటి నుంచి అతను పరారీలోనే ఉన్నాడు. ఖాతాదారుకు తెలియకుండా డబ్బు ఎలా మళ్లించారనే కోణంలో దర్యాప్తు సాగుతోందని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు తెలిపారు.సత్వర స్పందనతో రికవరీ.. అనధికారిక నగదు బదిలీని గుర్తించిన బ్యాంకు ప్రతినిధులు సత్వరమే స్పందించి నేషనల్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్ (ఎన్సీసీఆరీ్ప) ద్వారా సైబర్ మోసాన్ని ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర సైబర్ పోలీసులు దేశంలోని 11 బ్యాంకు ఖాతాలకు బదిలీ అయిన రూ.32.89 కోట్లను ఫ్రీజ్ చేశారు. లేకపోతే మహారాష్ట్రలో సైబర్ మోసాల్లో ఇది అతిపెద్ద కేసుగా నిలిచేది. నిందితులు మరో రూ.4.24 కోట్ల నగదును వివిధ ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన రూ.2.87 కోట్ల నగదును గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యాభర్తల చీటింగ్
సాక్షి, హైదరాబాద్: అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని మోసం చేసిన భార్యభర్తలను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాదాపూర్‌కు చెందిన పాలడుగు రఘురాం, పాలడుగు సునీత భార్యభర్తలు. వీరికి సైబరాబాద్‌కు చెందిన చాట్ల సంజీవ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సంజీవ్ కుమారుడికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు ఇప్పిస్తామని పాలడుగు దంపతులు సంజీవ్‌ను నమ్మించారు. అమెరికాలోని వైట్ హౌస్‌లో పనిచేసే సుమంత్ అనే వ్యక్తి తమకు బాగా పరిచయమని, ఇతను అడ్మిషన్ ఇప్పిండంలో మనకు సహాయం చేస్తాడని మాయమాటలు చెప్పారు. అడ్మిషన్‌కు కొంత ఖర్చు అవుతుందని చెప్పి, రూ.3.25 కోట్లను వసూలు చేశారు. అడ్మిషన్ కోసం అమెరికా వెళ్లి సుమంత్‌ను కలిసి వస్తామని చెప్పి డబ్బు తీసుకొని భార్యభర్తలిద్దరూ కలిసి అమెరికాకు కాకుండా మైసూర్‌కు చెక్కేశారు. కొత్త సిమ్ కార్డును తీసుకొని యూఎస్‌లో ఉన్నామని బాధితుడిని నమ్మించి వాట్సాప్ చాట్‌లో మాత్రమే సంభాంచేవారు. నకిలీ అడ్మిషన్ పత్రాలను సృష్టించి, సంజీవ్‌కు పంపించారు. తీరా అవి నకిలీ పత్రాలను తేలిపోవడంతో డబ్బు వెనక్కి ఇవ్వాలని రఘురాంను సంప్రదించగా తప్పించుకొని తిరిగే వాడు. దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు రఘురాం, సునీతలను అరెస్టు చేశారు. -
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఈ ఫ్లైఓవర్లపై నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ వేను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైతలాపూర్, బాలానగర్ ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు వంతెనలను 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేస్తామని వెల్లడించారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా క్యాబ్, ఆటో డ్రైవర్లకు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను వాట్సప్ నెంబర్ 94906-17346కు ఫిర్యాదు చేయవచ్చనని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్‌లలో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో తాగి రోడ్డు ప్రమాద మరణానికి కారణం అయితే వారిపై మర్డర్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. . చదవండి: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు -
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను వైఎస్సార్ ప్రారంభించారు
-
హైదరాబాద్ ORRపై కొత్త రూల్స్.. బీఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది సైబరాబాద్ పోలీస్ శాఖ. పైగా కొత్త రూల్స్ నేటి నుంచి(జులై 31వ తేదీ నుంచి) అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. లైన్ 1 అండ్ 2ల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లొచ్చు. ఆ మధ్య స్పీడ్ లిమిట్‌ని అనుమతిస్తారు. ఈ లైన్లలో కనిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల చొప్పున ఉండొచ్చు. అలాగే.. లైన్ 3 అండ్ 4 లో గరిష్టంగా గంటకు 80, కనిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ORRలో కనీస వేగం గంటకు 40 కి.మీ. ఇంతకన్నా తక్కువ వాహనాలను ఓఆర్ఆర్పైకి అనుమతించరు. 🛣️ ఇక.. లేన్ల మధ్య వాహనాల జిగ్-జాగ్ కదలిక అనుమతించబడదు. 🛣️ పై వేగం ప్రకారం లేన్లను మార్చాలనుకునే అన్ని వాహనాలు ఇండికేటర్ లైట్లను ఉపయోగించిన తర్వాత మాత్రమే చేయాలి. 🛣️ అలాగే.. లేన్లను మార్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 🛣️ ఓఆర్ఆర్లోని నాలుగు లేన్లలో ఏ వాహనం కూడా ఆగకూడదు. 🛣️ ఏ ప్రయాణీకుల వాహనాలు ORRలో ఆపి ప్రయాణికులను ఎక్కించకూడదు. 🛣️ ORRపై టూవీలర్స్, అలాగే పాదచారులకు అనుమతి లేదు ORRలో ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు లక్ష్యం పెట్టుకుంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. కొత్త నియమాలు డ్రైవింగ్ క్రమశిక్షణను తీసుకువస్తాయని, అలాగే.. గందరగోళాన్ని తగ్గిస్తాయని, పైగా.. ORRలో ప్రయాణాలు సాఫీగా సాగేందుకు ఉపకరిస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆ నోటిఫికేషన్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్లలో వాళ్లకు నో ఎంట్రీ -
ఒక డైరెక్టర్, ఇద్దరు హీరోయిన్లు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 82.75 గ్రాముల కొకైన్‌ను సరఫరా చేస్తూ సైబరాబాద్ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. నిందితుడు కేపీ చౌదరి నుంచి స్వాదీనం చేసుకున్న నాలుగు సెల్ఫోన్లలోని డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలతో ఫొటోలు, పార్టీ వీడియోలను పోలీసులు గుర్తించారు. గోవాతో పాటు హైదరాబాద్‌లో కిస్మత్‌పూర్‌లోని విల్లాలో కూడా ప్రైవేట్ పార్టీలు నిర్వహించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆయా ప్రముఖులు, సెలబ్రిటీల జాబితాను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఎలా దొరికాడంటే..: గత నెల 5న మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం, రాయదుర్గం పోలీసు లు నానక్‌రాంగూడ సమీపంలో 300 గ్రాముల కొకైన్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితు డు రాకేష్ రోషన్ వాట్సాప్ ద్వారా కేపీ చౌదరి లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కదలికలపై నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు.. బుధవారం కిస్మత్పూర్ క్రాస్ రోడ్లో కొకైన్‌ను సరఫరా చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 900 మందికిపైగా కస్టమర్లు: రాకేష్, కేపీ చౌదరిల నుంచి స్వాధీనం చేసుకున్న 9 సెల్ఫోన్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. వీటిల్లో 900 మందికి పైగా కస్టమర్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక డైరెక్టర్, ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులతో వాట్సాప్ చాటింగ్‌లు, పలు లావాదేవీలు సైతం జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరికి డ్రగ్స్ సరఫరా చేసిన నైజీరియాకు చెందిన గ్యాబ్రియల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నకిలీ కాల్ సెంటర్‌తో ఖాతాలు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా, కెనడా దేశవాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. పేట్బషీరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, నేరాలు చేస్తున్న 13 మంది నిందితులను అరెస్ట్‌చేశారు. ఈమేరకు మేడ్చల్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ ఎంఏ రషీద్, అదనపు డీసీపీ శోభన్ కుమార్‌లతో కలిసి మేడ్చల్ జోన్ డీసీపీ సందీప్ బుధవారం మీడియాకు వెల్లడించారు. లండన్‌లో పెడితే దొరికిపోతామని... హనుమకొండలోని కిషన్‌పురకు చెందిన బైరిక్ ప్రమోద్ రెడ్డి లండన్‌లో ఏ1 ఎక్స్‌ప్రెస్ సూపర్ మార్కెట్ నిర్వహించేవాడు. వ్యాపారం పెద్దగా సాగకపోవటం, అప్పులు మీద పడటంతో అక్రమ మార్గంలో సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. లండన్‌లో ఉంటున్న స్నేహితులు వరంగల్‌కు చెందిన కుంచాల అజయ్ కుమార్, రామకృష్ణా రెడ్డి, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రబీష్ కుమార్ ప్రసాద్ అలియాస్ రాహుల్, సర్బేష్ కుమార్ గుప్తా అలియాస్ ఆమెన్లకు విదేశీయులను మోసం చేసే పథకం గురించి చెప్పాడు. అయితే లండన్‌లో నకిలీ కాల్ సెంటర్ పెట్టి మోసాలు చేస్తే సులువుగా పట్టుబడతామని గ్రహించిన ముఠా.. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించింది. ‘ఎనీ డెస్క్’ద్వారా కూడా.. నెల రోజుల క్రితం పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని వీఎస్ఎస్ అపార్ట్మెంట్లో ఈ ముఠా సభ్యులు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సాంకేతిక సేవలు అందిస్తామనే నెపంతో ఆస్ట్రేలియా, కెనడా దేశస్తులను టార్గెట్ చేసుకున్నారు. ఆయా దేశాలకు చెందిన పౌరుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆకాశ్, వెస్లీల నుంచి కొనుగోలు చేశారు. టెలికాలర్లుగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముకేష్ రజాక్ అలియాస్ మార్క్, కర్మా షీపాల్ అలియాస్ జాక్, ఎండీ ముస్తఫా అలియాస్ డానియల్, అన్మోల్ ప్రదాన్ అలియాస్ స్టీఫెన్, రాయ్ రిష్కాంత్ అలియాస్ ర్యాన్, ఐడీపీఎల్ బాలానగర్‌కు చెందిన మహ్మద్ సమీర్ అలియాస్ సామ్ మహ్మద్ హాజీ, బొల్లారంకు చెందిన గుంజి పవన్ కుమార్ అలియాస్ కెవిన్, నిర్మల్‌కు చెందిన సాయి వీర ప్రసాద్ అలియాస్ జేమ్స్, జీడిమెట్లకు చెందిన నయాకోటి బస్వరాజులను నియమించుకున్నాడు. వీరు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా విదేశీయులకు ఫోన్ చేసేవారు. మీరు వినియోగించే అమెజాన్ ప్రైమ్ యాప్ నకిలీదని, హ్యాక్ అయిందని, భద్రతా లోపాలున్నాయని చెప్పి నమ్మించేవారు. సాంకేతిక సేవలను అందించేందుకు కొంత రుసుము చెల్లించాలని చెప్పి మొబైల్‌కు లింక్‌లు పంపించి బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసేవారు. గిఫ్ట్ కార్డుల రూపంలో ఆస్ట్రేలియా బ్యాంకు ఖాతాలకు సొమ్మును బదిలీ చేయించుకునేవారు. కొన్ని సందర్భాల్లో బాధితుల సెల్ఫోన్లో ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి, దాని ద్వారా బ్యాంకు ఖాతా వివరాలను తస్కరించి ఖాతా ఖాళీ చేసేవారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్లో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రామకృష్ణా రెడ్డి, ఆకాశ్, వెస్లీల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 13 కంప్యూటర్లు, సీపీయూలు, హెడ్ సెట్లు, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, మెమొరీ కార్డు, సిమ్ కార్డులు, సెల్ఫోన్లు, చేతి గడియారాలు, కారు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
డేటా లీకుపై 'ఈడీ ఆరా'
సాక్షి, హైదరాబాద్: దేశంలోని సగం జనాభా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయించిన కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిసారించింది. 70 కోట్ల మంది ప్రజలు, సంస్థలకు చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని చోరీ చేసిన ఫరీదాబాద్ (హరియాణా)కు చెందిన వినయ్ భరద్వాజ్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే 17 కోట్ల మంది డేటా లీకు కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు నితీశ్ భూషణ్ కుమార్, పూజా కుమారి, సుశీల్ తోమర్, అతుల్ ప్రతాప్ సింగ్, ముస్కాన్ హసన్, సందీప్ పాల్, జియా ఉర్ రెహ్మాన్‌లపై పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని అతిపెద్ద డేటా లీకు కేసులో ప్రధాన సూత్రధారి వినయ్ భరద్వాజ్‌పై కూడా ఈడీ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు రక్షణ, టెలికం, విద్యుత్, ఇంధనం, జీఎస్టీ వంటి ముఖ్యమైన ప్రభుత్వ శాఖల కీలక సమాచారాన్ని నిందితులు తస్కరించి, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నిందితుల కార్యకలాపాల్లో ఆర్థిక లావాదేవీల నిర్వహణతోపాటు ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు మనీలాండరింగ్ కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం ఆంధ్రపదేశ్, తెలంగాణతోపాటు 24 రాష్ట్రాలకు చెందిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని నిందితులు విక్రయానికి పెట్టారు. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసులను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. వినయ్ భరద్వాజ్ ఏడాది కాలంగా ఫరీదాబాద్ కేంద్రంగా డేటా నిల్వ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇన్స్పైర్ వెబ్జ్ వెబ్సైట్ ద్వారా ఇప్పటివరకు 50 మందికి డేటాను విక్రయించినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లతోపాటు బ్యాంకు లావాదేవీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఏడాది కాలంగా నిందితులు డేటా చోరీ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. ఏ రాష్ట్ర పోలీసులకు చిక్కకపోవటం గమనార్హం. ఈ–కామర్స్ కంపెనీలు, బ్యాంకులకు నోటీసులు ఈ–కామర్స్, ఐటీ కంపెనీలు వినియోగదారుల సమాచారంలో గోప్యత, భద్రత పాటించకపోవడం వల్లే డేటా లీకైనట్టు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. యూజర్ల సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ (ఎస్పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆయా ఈ–కామర్స్ కంపెనీల చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, అస్ట్యూట్ గ్రూప్, యాక్సిస్ బ్యాంకు, మాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంకు అఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలకు సెక్షన్ 91 కింద నోటీసులు జారీ చేశారు. -
డేటా చోరీ సూత్రధారి దొరికాడు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం కేసులో కీలక సూత్రధారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ జనాభాలో 50 శాతం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి విక్రయిస్తున్న ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన సుమారు 70 కోట్ల మంది రహస్య సమాచారాన్ని తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. రక్షణ, విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీవోలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితుడు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలివే.. వెబ్ డిజైనర్ నుంచి... హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ వెబ్ డిజైనర్‌గా పనిచేసేవాడు. ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయంతో డేటా సమీకరణ, విక్రయం గురించి తెలుసుకున్నాడు. వెబ్ డిజైనింగ్ కోసం తన వద్దకు వచ్చే కస్టమర్ల వివరాలను మార్కెటింగ్ ఏజెంట్లకు, సైబర్ నేరస్తులకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. అప్పనంగా డబ్బు వస్తుండటంతో ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని సైతం తస్కరించాలని నిర్ణయించుకున్నాడు. డేటా సమీకరణ కోసం ఏకంగా 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ఇందులో అమీర్ సొహైల్, మదన్ గోపాల్‌లు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. విక్రయం కోసం వెబ్సైట్.. తస్కరించిన డేటాను విక్రయించేందుకు ఇన్స్పైర్ వెబ్జ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాడు. క్లౌడ్ డ్రైవ్ లింక్‌ల ద్వారా మాత్రమే డేటాను విక్రయించేవాడు. ఇలా గత 8–12 నెలలుగా నిందితుడు డేటా తస్కరణ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వినయ్ నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అమీర్, మదన్‌ల కోసం సైబరాబాద్ పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి నెల క్రితం ఓపెన్ సోర్స్ వెబ్సైట్లో తన వ్యక్తిగత సమాచారం చూసి కంగుతిన్నాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమాచారం ఎలా బహిర్గతమైందో కూపీ లాగారు. 10 రోజుల క్రితం రెండు కేసులలో 16 మంది డేటా చోరీ నిందితులను పట్టుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. వినయ్ భరద్వాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు. ఈ డేటాతో ఏం చేసేవారంటే.. మార్కెటింగ్ బృందాలు, ఏజెన్సీలు, సైబర్ నేరస్తులు నిందితుడి నుంచి డేటాను కొనుగోలు చేసేవారు. ఉత్పత్తుల ప్రచారం, మార్కెటింగ్ కోసం బల్క్ మెసేజ్‌లు పంపించడం కోసం ఏజెన్సీలు డేటాను కొనుగోలు చేశాయి. సైబర్ నేరస్తులు కొనుగోలు చేసిన డేటాతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడేవారు. ఎవరెవరి డేటా లీకైంది? ఏ సంస్థ, వ్యక్తులు లీకు చేశారు? వంటి సమస్త సమాచారాన్ని ప్రజలకు ఎలా చేరవేయాలనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నామని సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ శింగేన్వర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల డేటా కూడా.. నిందితుడు విక్రయించిన డేటాలో తెలంగాణ, ఏపీ ప్రజల డేటా కూడా ఉంది. హైదరాబాద్‌కు చెందిన 56 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2.10 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను నేరస్తుడు విక్రయానికి పెట్టాడు. పన్ను చెల్లింపుదారులు, కంపెనీ సెక్రటరీలు, ఆడిటర్లు, ఉద్యోగస్తుల డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో వ్యక్తుల పేరు, ఫోన్ నంబరు, చిరునామా, ఈ–మెయిల్ ఐడీలు తదితర వివరాలున్నాయి. రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం లీక్.. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన 2.55 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారాన్ని నేరస్తుడు తస్కరించి విక్రయానికి పెట్టాడు. ఇందులో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతోపాటు ర్యాంకు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలున్నాయి. దీంతోపాటు ఎల్ఐసీ, విద్యుత్, ఇంధన శాఖ వంటి ప్రభుత్వ సంస్థల సమాచారం కూడా ఉంది. అలాగే 1.26 లక్షల మంది ప్రవాసులు, 5 లక్షల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)ల డేటా కూడా అంగట్లో విక్రయానికి పెట్టేశాడు. విద్యార్థుల డేటా నేరస్తుల చేతుల్లో.. విద్యాసంస్థలతోపాటు విద్యార్థుల డేటా కూడా నేరస్తుల చేతుల్లోకి చేరింది. బైజూస్, వేదాంతు వంటి ఆన్లైన్ విద్యాసంస్థలకు చెందిన 18 లక్షలు మంది విద్యార్థులు, 1.8 లక్షల మంది నీట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 30 లక్షల మంది సీబీఎస్ఈ (10, 12వ తరగతి), 3.5 కోట్ల మంది ఇతర విద్యార్థుల డేటాను నేరస్తులు విక్రయానికి పెట్టారు. -
డేటా లీకు మూలం ‘పునరుద్ధరణే’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది డేటా లీకు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రక్షణ శాఖతో పాటు టెలికం, విద్యుత్, ఇంధనం వంటి కీలకమైన ప్రభుత్వ సంస్థల వ్యక్తిగత సమాచారం కూడా తస్కరణకు గురికావటాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల నుంచే ఈ కీలక సమాచారం బహిర్గతమైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల రెండో రోజు కస్టడీ విచారణపూర్తిగా ప్రభుత్వ సంస్థల డేటా లీకు మూలాలను కనుక్కొనే దిశలోనే సాగింది. వెబ్సైట్ల పునరుద్ధరణ నుంచే లీకు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖతో పాటు పలు కేంద్ర సంస్థలకు చెందిన వెబ్సైట్లను పునరుద్ధరణ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల నిర్వహణ సేవలను థర్డ్ పార్టీలకు అందిస్తుంటాయి. ఇదే తరహాలో కేంద్ర సంస్థల వెబ్సైట్ల రీడెవలప్ సేవలు కూడా ఆయా యాజమాన్యలు ఐటీ కంపెనీలకు అందించాయి. నోయిడా, ముంబైకి చెందిన ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచే ఈ వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు.. నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, వెబ్సైట్లను సైబరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ పోలీసు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (టీఎస్పీసీసీ) విశ్లేషించి.. పలు కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. పలు అనుమానిత ఈ–మెయిల్స్, వెబ్‌పేజీలను వినియోగించే చిరునామా యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (యూఆర్ఎల్)లను గుర్తించారు. వీటిని నిర్ధారించేందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ)లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం గొలుసుకట్టు తరహాలో ఉండటంతో మరింతమంది ఈ కేసులో అరెస్టయ్యే అవకాశాలున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఉగ్రకోణం ఉంటే కేసు ఎన్ఐఏకు బదిలీ? బహిరంగ మార్కెట్లో నిందితులు అమ్మకానికి పెట్టిన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖకు చెందిన వ్యక్తిగత సమాచారం కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటికే పలుమార్లు సైబరాబాద్ పోలీసులతో హైదరాబాద్, ఢిల్లీకి చెందిన రక్షణ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) అధికారులు కూడా భేటి కానున్నట్లు తెలిసింది. సైబర్ మోసాల కోసమే డేటా చోరీ చేశారా లేక ఏమైనా ఉగ్రకోణం దాగి ఉందా అని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉగ్రకోణం అంశాలు వెలుగులోకి వస్తే గనక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఏడుగురిలో నాగ్‌పూర్‌కు చెందిన జియా ఉర్ రెహ్మాన్ కీలకమని పోలీసుల విచారణలో తేలింది. ఇతను ముంబైకి చెందిన ఓ వ్యక్తి నుంచి డేటాను కొనుగోలు చేసి, జస్ట్ డయల్, డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గ్లోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో, ఇన్‌స్పైరీ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ డేటాను విక్రయించేవాడు. -
అప్పనంగా డేటా ఇచ్చేస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత సాంకేతికత యుగంలో మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పాన్, ఆధార్, ఈ–మెయిల్ అడ్రస్, పాస్వర్డ్లు కేవలం సమాచారం మాత్రమే కావు. మన జీవితాలను నిర్దేశించే అంశాలు. ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి వెళితే బ్యాంకు ఖాతాలో ఉన్న మన కష్టార్జితం క్షణాల్లో హాంఫట్ అవ్వొచ్చు. మన పేరిట లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చు. కోట్ల మంది డేటాను కొల్లగొట్టిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. మన డేటా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనా ఉందని, వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తప్పనిసరిగా అవగాహన ఏర్పరుచుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అమ్మకాలని, క్రెడిట్ కార్డులని, ఇన్స్టంట్ లోన్లని, మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయని, కొత్త రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభోత్సవాలకు విచ్చేయాలంటూ దాదాపు నిత్యం మనకు అపరిచితుల నుంచి ఫోన్‌కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే వారందరికీ మన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్‌లు, ఈ–మెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి. మన వివరాలు మరెవరో కాదు... అప్పనంగా మనమే ఇచ్చేస్తున్నాం! తప్పక డిలీట్ చేయించాలి.. వివిధ అవసరాలు, ప్రభుత్వ పథకాల నిమిత్తం ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌బుక్ మొదటి పేజీ, వివిధ సర్టిఫికెట్ల వంటి వాటిని ఫొటోకాపీ తీయించుకోవడం అనివార్యమవుతోంది. అయితే అలాంటప్పుడు మనం వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిన వివరాలను ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ సెంటర్ లేదా నెట్ సెంటర్ నుంచి డిలీట్ చేయించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేస్ – 01 ‘గుడ్‌మార్నింగ్ సార్. యాదాద్రి దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభం కాబోతోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు. మీ సొంత ప్రాంతానికి వెళ్లే దారిలోనే వెంచర్ ఉంది. తీసుకోండి...’ అంటూ టెలికాలర్ ఫోన్ చేసి తన పేరు, పూర్తి చిరునామా చెప్పడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవాక్కయ్యాడు. కేస్ – 02 ‘సార్.. మీరు వాడుతున్న ఫ్యూరిఫయర్తో పోలిస్తే మా ప్రొడక్ట్ అన్ని విధాలా ఉత్తమ మైనది. మీరు సరే అంటే మా ఏజెంట్‌ను మీ ఇంటికి డెమోకు పంపుతాం. మీ చిరునామా ఇదే కదా..’ అంటూ తన ఇంటి అడ్రస్‌ను ఓ ఉత్పత్తుల సంస్థ ఉద్యోగి ఫోన్లో చెబుతుంటే ఓ ప్రైవేటు ఉద్యోగి నోరెళ్లబెట్టాడు. లాటరీలు, కూపన్ల పేరుతో డేటా సేకరణ... మనం షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు లాటరీల కోసమనో లేదా గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకనో మన వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అలా అడిగిందే తడవుగా రివార్డు పాయింట్ల కోసం, డిస్కౌంట్ల కోసం, గిఫ్ట్ కూపన్ల కోసం ఆశపడి మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇలా పోగేసిన డేటాను కొందరు కేటుగాళ్లు కన్సల్టెన్సీలకు 5 పైసలకు ఒక కాంటాక్ట్ చొప్పున అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కన్సల్టె న్సీలు కొన్ని వేల రూపాయల ఖర్చుతోనే కోట్ల మంది సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల నుంచి సైబర్ నేరస్తులు గంపగుత్తగా డేటాను కొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో ఉండే వ్యక్తిగత వివరాలను కొన్ని ఆన్లైన్ సంస్థలు డేటా ఎనలిటిక్స్ టెక్నిక్‌లతో సేకరించి వివిధ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు అమ్ముకుంటున్నాయి. డేటా ప్రైవసీలో యూరోపియన్ చట్టాలు ఎంతో కఠినం.. యురోపియన్ దేశాల్లో వ్యక్తిగత సమాచారం. వివరాలకు, వ్యక్తి గత గోప్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన వివరాలను అను మతి లేకుండా ఎవరు తీసుకున్నా... వినియోగించినా వెంటనే వారిపై జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం కింద భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించే అవకాశం ఉంది. ఆ తరహా చట్టాలు మన దేశంలోనూ వస్తేనే వ్యక్తిగత వివరాల గోప్యతకు రక్షణ ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇవ్వొద్దు... వీలైనంత వరకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్, పాన్ వంటి వివరాలను ఇతరులకు ఇవ్వొద్దు. ఇలా ఇవ్వడం వల్ల మన డేటాను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఢిల్లీ -
డేటా ఎక్కడి నుంచి లీకైంది?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘వ్యక్తిగత డేటా లీక్’మూలాలను తేల్చేందుకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎక్కడెక్కడి నుంచి డేటా తస్కరణకు గురైంది? నిందితులు దీనిని ఎక్కడెక్కడ దాచి ఉంచారు? దానిని ఎవరెవరు కొనుగోలు చేశారు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. రక్షణ శాఖ, టెలికం వంటి 138 ప్రభుత్వ విభాగాలుసహా 16.8 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించి, విక్రయిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ, పలు ఇతర ప్రాంతాల్లోని పలు కంపెనీల నుంచి డేటా చోరీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించి ఆయా సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కేసుతో వారికి ఉన్న సంబంధాలపై విచారించిన అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకా శం ఉన్నట్టు సమాచారం. ఈ డేటా ఎవరెవరు కొనుగోలు చేశారో కనిపెట్టేందుకు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. క్లౌడ్, హార్డ్ డిస్క్‌లలో డేటా.. ప్రజల వ్యక్తిగత వివరాలను తస్కరించిన నిందితులు డేటాను హార్డ్ డిస్క్‌లతోపాటు క్లౌడ్ సర్వీస్‌లో భద్రపరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఆ క్లౌడ్ సర్వీస్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోరుతూ గూగుల్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటాను తస్కరించినట్టు గుర్తించామని, క్లౌడ్‌లోని డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తే.. దొంగిలించిన డేటా మొత్తం ఎంత అనేది స్పష్టమవుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు అలర్ట్ నీట్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ అధికారులు, బ్యాంకు ఖాతాదారులు, పాన్‌కార్డు వినియోగదారులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన నిపుణులు వంటి 138 కేటగిరీల వారి డేటాను నిందితులు దొంగిలించారు. అయితే వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలూ చోరీకి గురైన నేపథ్యంలో.. ఆయా ప్రభుత్వ శాఖలను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈమేరకు రిజర్వు బ్యాంకు, టెలికం విభాగం, కేంద్ర హోం, రక్షణ శాఖలకు లేఖలు రాశారు. ఏజెన్సీల నుంచే డిఫెన్స్ సమాచారం లీక్? రక్షణ శాఖకు చెందిన 2.6 లక్షల మంది ఉద్యోగుల డేటాను సైతం నిందితులు దొంగిలించారు. వీటిలో డిఫెన్స్ అధికారి పేరు, ఈ–మెయిల్ ఐడీ, దళం పేరు, ర్యాంకు, పనిచేస్తున్న చోటు, చిరు నామా వంటి కీలక వివరాలున్నాయి. రక్షణశాఖకు చెందిన ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారని.. ఆ ఏజెన్సీల నుంచే డేటా చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలున్న బ్యాంకు నుంచి లేదా పేస్లిప్‌లను సిద్ధం చేసే ఏజెన్సీల నుంచి డేటా లీకై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
హైదరాబాద్: డేటా చోరీ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ వ్యవహారంగా సైబరాబాద్ పోలీసులు భావిస్తున్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఈ కేసును సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. ఐపీఎస్ అధికారి పర్యవేక్షణతో సిట్ దర్యాప్తు ముందుకు సాగనున్నట్లు తెలిపారాయన. ఇక కేసులో కీలకంగా ఉన్న జస్ట్ డయల్‌కు నోటీసులు జారీ చేయడంతో పాటు విచారించనున్నట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. సుమారు 16 కోట్ల 80 లక్షల మంది డేటా చోరీ జరిగిందని చెబుతోంది సైబరాబాద్ పోలీస్ విభాగం. మరో పది కోట్ల మంది డేటా కొట్టేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. వక్తిగత వివరాలతో పాటు అంత్యంత గోప్యంగా ఉండాల్సిన వివరాలు, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయని, కేసులో లీడ్స్ ఉన్నాయని, ఎక్కడి నుంచి లీక్ అయ్యిందనే దర్యాప్తులో తేలాల్సి ఉందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. అలాగే.. ఆర్మీకి సంబంధించిన డేటా(సిబ్బంది పేర్లు, ర్యాంకులు, పోస్టింగ్ ఇతర వివరాలు) సైతం లీక్ అయ్యిందని చెప్పారాయన. సాధారణ పౌరుల నుంచి ఎవరైనా కానీ.. డేటా తీసుకున్నప్పుడు సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంచాల్సిన బాధ్యత ఉందని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు పంపి దందాకు పాల్పడుతున్న ఇరువురిని సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖులకు యువతులను నిందితులు సరఫరా చేస్తున్నారు. ముంబై,ఢిల్లీ, బెంగాల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గోవా, బెంగుళూరులో సైతం ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తుంది. చదవండి: రెండేళ్లుగా ఫ్రిజ్లోనే తల్లి శవం..కన్న కూతురికి కూడా తెలియకుండా.. -
మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటీనటుల అరెస్ట్
మోడలింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటుడితో పాటు మరో నటిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపూర్ అశ్విన్, నటాషా కపూర్‌ను అరెస్ట్ చేశారు. చైల్డ్ మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాస్మో పాలిటన్ మోడలింగ్ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఓ వ్యాపార వేత్త నుంచి రూ.20 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తల పిల్లలే నిందితుల లక్ష్యంగా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన బాలీవుడ్ నటీనటుల నుంచి ఎన్ని రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
హైటెక్ సెక్స్ రాకెట్
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో దేశ, విదేశీ మహిళలను ఆకర్షించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పలు వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం 14,190 మంది యువతుల ఫొటోలు, వివరాలు పెట్టి.. కాల్‌సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తున్న ఈ గ్యాంగ్.. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా ఈ దందా సాగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్ సహా 18 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఈ ముఠా వివరాలను ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ దార కవితతో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ కవిత హోటల్ వర్కర్‌గా పనిచేస్తూ వ్యభిచారం దందా వైపు.. బేగంపేటకు చెందిన మహ్మద్ సల్మాన్ ఖాన్ అలియాస్ సమీర్ 2016–19 మధ్యకాలంలో సోమాజిగూడలోని కత్రియా, పార్క్ హోటళ్లలో పనిచేశాడు. అప్పట్లో వ్యభిచార ముఠా బాధితురాలు ఒకరు ఓ హోటల్లో బస చేయడం గమనించిన సమీర్..సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్స్ అలవాటు ఉన్న సమీర్‌కు మరో డ్రగ్ వినియోగదారుడు, మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన మహ్మద్ అదీమ్ అలియాస్ అర్నవ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి 2016 నుంచి సోమాజిగూడ కేంద్రంగా వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టారు. వీరితో పాటు మొత్తం 17 మంది ప్రధాన ఆర్గనైజర్లు వేర్వేరు రాష్ట్రాలలో వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా దందా సాగిస్తున్నారు. ఒక్కో వాట్సాప్ గ్రూప్‌లో 300 మంది ఆర్గనైజర్లు సభ్యులుగా ఉన్నారు. వీటిద్వారా మొత్తం 14,190 మంది యువతులతో వ్యభిచారం సాగిస్తున్నారు. ముఠా దొరికింది ఇలా... ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన యువతులను విచారించిన పోలీసులు.. గత నెల 15న బేగంపేటకు చెందిన సల్మాన్, పీఅండ్‌టీ సన్‌సిటీకి చెందిన మహ్మద్ అబ్దుల్ కరీంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఆర్గనైజర్ల జాబితా వెలుగులోకి వచ్చింది. దీంతో యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ టీమ్‌తో బృందాన్ని ఏర్పాటు చేసి.. సల్మాన్, కరీంతో పాటు పలువురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్‌తో పాటు మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన అర్నవ్, టోలిచౌకికి చెందిన మహ్మద్ సమీర్, సోమాజిగూడకు చెందిన హర్బిందర్ కౌర్ అలియాస్ సిమ్రాన్ కౌర్, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన యరసారి జోగేశ్వర్రావు, బాలానగర్‌కు చెందిన నడింపల్లి సాయిబాబా గౌడ్, సన్‌సిటీకి చెందిన శైలేంద్ర ప్రసాద్, యూసుఫ్‌గూడకు చెందిన మహ్మద్ అఫ్సర్, కూకట్‌పల్లికి చెందిన పసుపులేటి గంగాధరి, ఆసిఫ్‌నగర్‌కు చెందిన రిషీ, బీరంగూడకు చెందిన కోడి శ్రీనివాస్, గోల్కొండకు చెందిన అలీసామ్, అనంతపురానికి చెందిన మహ్మద్ ఫయాజ్, కర్ణాటకకు చెందిన విష్ణు, సాయి సుధీర్, ఒడిశాకు చెందిన సర్భేశ్వర్ రౌట్లు ఉన్నారు. వీరు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లలో 39 కేసులలో నిందితులుగా ఉన్నారు. తాజాగా వీరిపై గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి ఠాణాలలో ఐదు కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.95 వేల నగదుతో పాటు 34 సెల్ఫోన్లు, 3 కార్లు, ల్యాప్‌టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ (మాదకద్రవ్యం)ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఆధార్లు.. విటులతో సంప్రదింపుల కోసం నిర్వాహకులు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కోల్‌కతా, అసోం రాష్ట్రాల యువతులతో పాటు థాయ్‌లాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, రష్యా దేశాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విదేశీ మహిళలకు నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు సృష్టించి వివిధ నగరాలకు తరలిస్తున్నారు. దందా సాగుతోందిలా.. ఆర్గనైజర్ల కింద ఉండే బ్రోకర్లు ఉద్యోగా లిప్పిస్తామంటూ పేద మహిళలకు ఎర వేస్తా రు. వారి వివరాలను సేకరిస్తారు. ఆపై బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతా రు. విటులను ఆకర్షించేందుకు బాధిత అమ్మాయిల ఫొటోలు, ఇతర వివరాలు దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లలో పెడతారు. లొకాంటో, స్కోక్కా, మైహెవెన్మోడల్స్.కామ్ నటాషారాయ్. ఇన్ వంటి కాల్‌గర్ల్స్ వెబ్సైట్లలోనూ వాటిని పోస్ట్ చేస్తారు. వీటిని చూసిన విటులు తమకు నచ్చిన యు వతుల కోసం అందులోని వాట్సాప్ నంబ ర్లకు ఫోన్ చేస్తారు. కాల్ సెంటర్ల ప్రతినిధు లు అమ్మాయిల వివరాలు, రేట్లను తెలిపి.. ఏ హోటల్‌కు వెళ్లాలో సూచిస్తారు. ఓకే అనుకున్నాక ఆ ప్రతినిధి విటుడిని ఆర్గనైజర్‌తో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తారు. డీల్ కుది రాక స్టార్ హోటళ్లలో గదులు, ఓయో రూ మ్స్, అవసరమైతే విమాన టికెట్లు బుక్ చేస్తారు. విటులు నగదు లేదా ఆన్లైన్లో చెల్లింపులు చేయాలి. అందులో 30% యువతికి, 35% అమ్మాయిల ఫొటోలను ప్రచారం చేసేవారికి, కాల్‌సెంటర్ ప్రతినిధులకు ఇస్తా రు. 35 శాతం నిర్వాహకులు వాటాలుగా పంచుకుంటారు. ఈ దందాలో ఒక్కో ఆర్గనైజర్ రూ.40 లక్షల వరకు ఆదాయం ఆర్జించినట్లు డీసీపీ కవిత తెలిపారు. -
HYD: మామూలు ప్లాన్కాదు.. 14వేల మందితో హైటెక్ వ్యభిచారం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులు మరో సెక్స్ రాకెట్ ముఠాను పట్టుకున్నారు. ఈ క్రమంలో 17 మందిని అరెస్ట్ చేసి 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. సైబరాబాద్ పోలీసులు మరో సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ముంబై, ఢిల్లీతో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యా దేశాలకు చెందన బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, 17 మంది సభ్యులు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్, వాట్సాప్ గ్రూపుల్లో స్లాట్స్ బుక్ చేస్తున్నారు. వీరి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 39 కేసుల్లో 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, ఈ ముఠా పలు వెబ్సైట్లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను, మహిళలను ఉపాధి పేరుతో తీసుకువచ్చి వారిని ఈ ముఠా వ్యభిచారం కూపంలోకి దింపుతోందని పోలీసులు వెల్లడించారు. -
చాటింగ్ తెచ్చిన రగడ
శంకర్పల్లి: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు, సైబరాబాద్ కమిషనర్‌కు షేర్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా , శంకర్పల్లి మండలం, దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు. అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత గొడవ వైరల్ చేస్తున్నారు: సీఐ ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. (చదవండి: పుట్టిన ఆసుపత్రికి రూ.కోటి మంజూరు) -
నిందితులను రిమాండ్‌కు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నమో దైన కేసులో నిందితుల రిమాండ్ కోరుతూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై శుక్రవారం కిక్కిరిసిన కోర్టు హాల్లో 40 నిమిషాలపాటు వాదనలు జరిగాయి. గురువారం నిందితుల రిమాండ్ కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. నిరాకరించిన విషయం విదితమే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నలుగురు తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు చేయడం కోసం వచ్చారంటూ అందిన ఫిర్యాదుతో హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్ నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేసిన పోలీసులు నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయ మూర్తి తిరస్కరించారు. నిందితులకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చి న తర్వాతే విచారించాలని సూచించారు. పోలీసుల పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్. సుమలత విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నిందితుల రిమాండ్ అవసరమని పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో ముందే కెమె రాలు ఉన్నాయా?.. మీరు ఏర్పాటు చేశారా?.. కొనుగోలు వ్యవహారం మీకు ముందే తెలుసా? అని ఏజీ న్యాయమూర్తి ప్రశ్నించారు. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు పలు చర్యలు చేపట్టి.. అనంతరం దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులను అదుపులోకి తీసుకున్నారని ఏజీ వెల్లడించారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమా దం ఉందన్నారు. కిందికోర్టు రిమాండ్‌కు తరలింపునకు ఉత్తర్వు లు జారీ చేయకపోవడం చెల్లదన్నారు. అత్యవసరంగా ఈ కేసు విచారణ చేపట్టి నిందితులను రిమాండ్‌కు పంపేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్దన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డ్లిను నిందితులు ప్రలోభపెట్టారని, దీనికి సంబంధించిన సమగ్ర సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని చెప్పారు. సీఆర్పీసీలోని 41(1)(బీ) ప్రకారం దర్యాప్తు అధి కారి సక్రమంగానే చేశారన్నారు. అన్ని కేసుల్లోనూ నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ కేసుల భయం ఉండదని ఎమ్మెల్యేలకు భరోసా కూడా ఇచ్చారని చెప్పారు. ఈ ముగ్గురి వెనుక కీలక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉన్నందని.. నిందితులను రిమాండ్‌కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి డబ్బు దొరకలేదు.. నిందితుల తరఫున సీనియర్ న్యాయ వాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఘటనా స్థలంలో నగదు ఏమీ లభ్యం కాకున్నా, కావాలని కేసులో ఇరికించారన్నారు. సీఆర్పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా రిమాండ్‌కు పంపడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లరని హామీ ఇచ్చారు. సమగ్ర వాదనలకు గడువు కావాలని ఆయన కోరడంతో విచారణ నేటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దు... నిందితులు 24 గంటలపాటు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని న్యాయమూర్తి షరతు విధించారు. శుక్రవారం సాయంత్రం 6గంటల లోపు తమ నివాస ప్రాంత వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సమర్పించాలన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న రోహిత్‌రెడ్డితో పాటు ఇతరులతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంప్రదింపులు జరపవద్దని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
Hyderabad: కేటుగాళ్ల వలలో హైదరాబాదీ.. రూ.62 లక్షలు గోవిందా!
గచ్చిబౌలి: మార్కెట్ బాక్స్... అదో నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్. ఆ యాప్‌లో రిజిస్టర్ అయి లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ఉసిగొల్పి అందిన కాడికి దండుకొని బిచాణ ఎత్తేశారు. ఇలా మోసాలకు పాల్పడిన నలుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైంలో దేశంలోనే మొదటిసారిగా రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముగల్‌సరాయ్‌కి చెందిన కమోడిటీ ట్రేడర్ అభిషేక్ జైన్ (32) మార్కెట్ బాక్స్ అనే ఫేక్ ట్రేడింగ్ యాప్‌ను రూపొందించాడు. వాట్సాప్, టెలి గ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. దేశవ్యాప్తంగా వేలాది మంది రిజిస్టర్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తొలుత రూ.10 లక్షలు ఇందులో పెట్టగా, తిరిగి రూ.14.9 లక్షలు వచ్చా యి. దీంతో ఆయన ఈసారి రూ.62 లక్షలు పెట్టా రు. అయితే, కేవలం రూ.34.7 లక్షలే వచ్చాయి. రూ.27 లక్షలకుపైగా నష్టం వచ్చింది. దీంతో 2021 డిసెంబర్ 4న సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేసి యూపీ, రాజస్తాన్‌కు చెందిన ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇలా వేలాది మందిని మోసగించిన అభిషేక్ జైన్‌తోపాటు కృష్ణ కుమార్ (38), పవన్ కుమార్ ప్రజాపట్ (35), ఆకాశ్‌రాయ్ (39)లను అరెస్ట్‌చేశారు. ఉన్నది లేనట్లుగా చూపించి... మార్కెట్ బాక్స్‌లో మూడువేల మంది రిజిస్టర్ అయ్యారని సీపీ స్టీఫెన్ చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో రిజిస్టర్ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా లాభాల్లో ఉన్నట్లు కనిపించేలా చూపిస్తారన్నారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు ఇచ్చి నమ్మకాన్ని చూరగొంటారని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తరువాత డబ్బు లు కాజేస్తారని వివరించారు. వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి ఒకచోట ఉంచారని, యూపీ పోలీసుల సహకారంతో రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, ఏడీసీపీ రితురాజ్, ఏసీపీ శ్రీధర్, సీఐలు శ్రీనివాస్, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. -
రాజస్థాన్ లో సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్
-
ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరికింది. గంటలకొద్దీ ట్రాఫిక్జాంలో ఇరుక్కుపోకుండా సులువుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ సేవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ సేవలను సైబరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావుతో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగేన్వర్, బాలానగర్ డీసీపీ సందీప్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అడిషినల్ డీసీపీ రియాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, ట్రాఫిక్ అడ్మిన్ బీఎన్ఎస్ రెడ్డి, ఐటీ ఇన్స్పెక్టర్ రమేశ్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ నవీన్ కుమార్, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అడుగడుగునా కెమెరాలు .. బయోమెట్రిక్ అటెండెన్స్ బైక్స్ ప్రత్యేకతలివే: ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ కోసం ఆరు మోటార్ సైకిళ్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక్కో బైక్‌పై ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్‌ఫోర్స్ విధుల్లో ఉంటారు. వీరికి ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారి ఇన్చార్జిగా ఉంటారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది. ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌కు అందించిన బైక్‌లలో ప్రథమ చికిత్స కిట్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ కిట్, హెల్మెట్, బాడీ వోర్న్ కెమెరా, షోల్డర్ లైట్, మాన్ ప్యాక్, కెమెరా, రిఫ్లెక్టివ్ జాకెట్, కళ్లద్దాలు, ఎల్ఈబా బాటన్ తదితర వస్తువులు ఉంటాయి. టాస్క్‌ఫోర్స్ ప్యాట్రోలింగ్ ఇక్కడే.. ►మాదాపూర్ నుంచి ఐకియా రౌటరీ– లెమన్ ట్రీ– మైండ్ స్పేస్ ►కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45 – ఐటీసీ కోహినూర్ టాస్క్‌ఫోర్స్ విధులు ఏంటంటే.. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి బైక్‌లకు ఉన్న ద్విచక్ర వాహనానికి ఉన్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (పీఏఎస్) ద్వారా ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు పెట్రోలింగ్ తిరుగుతుంటాయి. ట్రాఫిక్ జాంలను నివారించడంతో పాటు రోడ్లపై అడ్డుగా నిలిచే వాహనాలను క్లియర్ చేయడం, నో పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న వాహనాలను తొలగించడం వంటివి చేస్తాయి. లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో పనిచేస్తుంటారు. ఏదైనా చైన్ స్నాచింగ్‌లు జరిగినప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ రాగానే వెంటనే అప్రమత్తమై స్నాచర్స్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు రోడ్డు దాటే విషయంలోనూ సహాయం చేస్తారు. ప్యాట్రోలింగ్ చేసే సమయంలో ప్రజలకు వారి వాహనాలకు ఏదేని సమస్య వస్తే మీరు దగ్గరుండి సాయం చేస్తారు.