DCP
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. హైకోర్టుకు మాజీ డీసీపీ
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్‌లో కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు హైకోర్టులో శుక్రవారం(అక్టోబర్18) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు అరెస్టయి రిమాండ్‌లో ఉన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఏ4గా చేర్చారు. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌పై తదుపరి విచారణ ఈనెల 23కు హైకోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. పోలీసులు ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: స్పెల్లింగ్ చెబితే.. రేవంత్‌కు రూ.50 లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తా: కేటీఆర్ -
డీసీపీ ఫిర్యాదు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు
సాక్షి,హైదరాబాద్:హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో శనివారం(సెప్టెంబర్14) కేసు నమోదైంది. అడిషనల్ డీసీపీ హరిచందద్రారెడ్డి ఫిర్యాదుతో బీఎన్ఎస్ఎస్ 132 కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.గురువారం తన ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి తర్వాత కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తనను బెదిరించారని డీసీపీ ఫిర్యాదు చేశారు. కాగా, కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య వాగ్యుద్ధం ముదిరి దాడులు, కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదలం: వెస్ట్‌జోన్ డీసీపీ
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటివారున్నా చట్టపరమైన చర్యలుంటాయని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం(జులై 30) ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులున్నా ఎవరున్నా వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయ్యారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విదేశాల్లో ఉన్న ఆ ఇద్దర్ని రప్పించడానికి చట్టపరంగా ప్రాసెస్ జరుగుతోంది. కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్షాధారాలతో చార్జ్ షీట్ దాఖలు చేశాం. దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు అంగీకరించింది. త్వరలో బలమైన సాక్షాలను సేకరించి అనుమానితులను విచారిస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఒక టీం పని చేస్తోంది. -
రియాల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును చేధించిన పోలీసులు
-
రాధాకిషన్ రావును కరిచిన ‘పిల్లి’.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ టాస్కో ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ‘పిల్లి’కరిచింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్త్రావమైంది. సమాచారం అందుకున్న జైలు అధికారులు అత్యవసర చికిత్స కోసం రాధాకిషన్ రావును నారాయణ గూడ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కంచరపాలెం ఘటనలో ఏం జరిగిందో చెప్పిన DCP
-
బీజేపీ నేత కొడుకు పేర్లు బయటపెట్టిన మాదాపూర్ డీసీపీ
-
హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యాప్తిపై డీసీపీ చెప్పిన సంచలన విషయాలు
-
పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్
-
ఈ కేసులో ఎంతటివారినైనా వదినే ప్రసక్తిలేదు: వెస్ట్ జోన్ డిసిపి విజయ్‌కుమార్
-
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం బదిలీ చేసింది. నాలుగేళ్లుగా టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా రాధాకృష్ణ కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత ఓఓస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ►టీఎస్పీఎస్ఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్ ►టీఎస్పీఎస్ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్ ►సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి ►గ్రే హౌoడ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు ►సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్ ►సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్ ►ట్రాఫిక్ డీసీపీగా ఆర్. వెంకటేశ్వర్లు ►పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్ -
పోలీసులకు హ్యాకర్ వార్నింగ్.. పర్సనల్ డేటా బయటపెడతామంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా పోలీసు ఉన్నతాధికారి ఫోన్ హ్యాకింగ్‌కు గురి కావడం కలకలం సృష్టించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరికొందరు పోలీసుల ఫోన్లను కూడా హ్యాక్ చేసి సమాచారం బయటకు తీస్తామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో పోలీసు యంత్రాంగం నిత్యం తనిఖీలు, బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంది. ఇలాంటి తరుణంలో సైబరాబాద్ పరిధిలోని ఒక డీసీపీ ఫోన్ హ్యాక్ అయ్యింది. శనివారం ఉదయం నుంచి విధి నిర్వహణలో నిమగ్నమైన ఆ డీసీపీ ఫోన్ మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు. దాదాపు 2 గంటల సమయం ఫోన్ పూర్తిగా అవతలి వారి చేతిలోకి చేరినట్టు నిర్ధారించారు. అతికష్టమ్మీద సైబర్ నిపుణులు డీసీపీ ఫోన్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇది హ్యాకర్ల పనేనా?.. లేక ఎవరైనా గిట్టని వారు చేశారా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి అధికారి ఫోన్ హ్యాక్ చేయటం.. పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, నగరంలో ఒక ఐటీ ఉద్యోగిపై సదరు డీసీపీ చేయిచేసుకోవటం వల్లనే ఐటీ నిపుణులు ఫోన్ హ్యాక్ చేసి సమాచారం. ఫోన్లోని వ్యక్తిగత వీడియోలు బయటపెట్టినట్టు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాబోయే రోజుల్లో మరికొందరి పోలీసుల సమాచారం కూడా ఇదే విధంగా వెలికితీస్తామంటూ తమ పోస్టు ద్వారా హెచ్చరించటం గమనార్హం. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. సదరు హ్యాకర్ కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య -
ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవల్లిక (23) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక అశోక్‌నగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ‘‘ఆత్మహత్యపై శుక్రవారం రాత్రి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లాం. ఆమె గదిలో సూసైడ్ లెటర్ దొరికింది. ఆమె సెల్‌ఫోన్ కాల్ రికార్డ్‌లు, వాట్సాప్ చాటింగ్‌లతో పాటు ఆమె స్నేహితులను విచారించాం. ప్రవల్లిక మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన శివరామ్ రాథోడ్‌తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించాం. ప్రియుడితో ఫొటోలు, సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా ఉన్నాయి. తనను మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇరువురి మధ్య జరిగిన చాటింగ్‌లను గుర్తించాం. శివరామ్, ప్రవల్లిక ఇద్దరు కలిసి నగరంలో ఓ హోటల్‌కు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. మరింత విచారణ కోసం మృతురాలి సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్, ప్రవల్లిక చాటింగ్స్ ఆధారంగా శివరామ్ రాథోడ్‌పై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. అలాగే సూసైడ్ నోట్, లెటర్‌పై ఉన్న హ్యాండ్ రైటింగ్ ప్రవల్లికదేనా కాదా అనేది నిర్ధారించేందుకు ఆమె నోట్‌బుక్స్ కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. ఏం జరిగిందంటే.. శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ప్రవల్లిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్ధి సంఘాల నేతలు అడ్డుకున్నారు. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అర్ధరాత్రి వరకూ మృతదేహాన్ని హాస్టల్లోనే ఉంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రేమ వ్యవహారమే ప్రవళ్లిక ఆత్మహత్యకు కారణమని తేల్చారు. పక్షం రోజుల కితమే హాస్టల్లో చేరిక కాగా, 15 రోజుల క్రితం హాస్టల్లో జాయిన్ అయిన ప్రవల్లిక సంధ్య, అక్షయ శ్రుతిలతో కలిసి ఉండేది. ఎక్కువగా ఎవరితో మాట్లాడేది కాదని అంటున్నారు. ప్రవల్లిక ఉరివేసుకున్న రూమ్‌లో సూసైడ్ నోట్‌తో పాటు లవ్ సింబల్స్‌తో ఉన్న ఓ లెటర్‌ను కూడా పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతురాలి సెల్ ఫోన్ లో తాను ప్రేమించిన శివరామ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ఫ్రెండ్స్‌తో చేసిన చాటింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ప్రేమగురించి కుటుంబసభ్యులకు తెలుసు–డీసీపీ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ప్రవల్లిక ఎలాంటి గ్రూప్స్ పరీక్షలకు అప్లయ్ చేయలేదని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎలాంటి పోటీ పరీక్షలు కూడా రాయలేదన్నారు. ప్రవల్లిక ప్రేమ విషయం కూకట్‌పల్లిలో డిగ్రీ చదువుతున్న తమ్ముడు ప్రణయ్‌తో పాటు తల్లిదండ్రులకు కూడా తెలుసే ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. వారి వద్ద మరింత సమాచారం సేకరిస్తామన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆందోళనలు చేసి పోలీసులపై రాళ్లురువి్వన కేసులో బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. నివేదిక కోరిన గవర్నర్.. ప్రవల్లిక ఆత్మహత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టీఎస్పీఎస్సీ కార్యదర్శిలను ఆదేశించారు. ప్రవల్లిక ఆత్మహత్య పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేసిన గవర్నర్, ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. రాహుల్ గాందీ, ఖర్గే సంతాపం ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉదాసీనతే కారణమని ఆరోపించారు. -
కేటుగాళ్లతో ఖాకీల సెటిల్మెంట్లు
హైదరాబాద్: .. అదేంటి? కొట్టేసిన సొమ్మును సైబర్ నేరస్తులు తిరిగి రీ ఫండ్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్కు!! ‘రీ ఫండ్’ తెర వెనక అసలేం జరిగిందంటే.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సాంకేతిక ఆధారాలతో సైబర్ నేరస్తుల ఏ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయ్యిందో గుర్తించారు. నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు నిర్ధారించుకుని, అక్కడికి వెళ్లి 2–3 రోజులు గాలించి నేరస్తుడిని పట్టుకున్నారు. బాధితురాలి నుంచి కొట్టేసిన సొమ్మును రీ ఫండ్ చేస్తే వదిలేస్తామని నిందితుడితో సెటిల్మెంట్ చేశారు. దీంతో కేటుగాడు బాధితురాలి ఖాతాకు నగదును బదిలీ చేశాడు. అరెస్టు, కేసులు లేకుండా చేసినందుకు నిందితుడి నుంచి సదరు పోలీసులు డబ్బు వసూలు చేశారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలికి న్యాయం జరిగిందనే కోణంలో లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చి, కేసును విత్‌డ్రా చేయించారు. ‘లెక్క’ చెప్తేనే దర్యాప్తు.. సాధారణంగా కేసు నమోదు, రిమాండ్ రిపోర్టు, చార్జ్‌షీట్ దాఖలు వంటి అధికారం సివిల్ పోలీసులకు ఉంటుంది. కానీ, రాచకొండ సైబర్ క్రైమ్‌లో మాత్రం ఇతర విభాగానికి చెందిన పోలీసులదే హవా. ఏ కేసు నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలనే నిర్ణయం కూడా వీళ్లదే అంటే అతిశయోక్తి కాదు. ఇతర రాష్ట్రాల్లో దాక్కున్న సైబర్ నేరస్తులను పట్టుకొచ్చేందుకూ సివిల్ పోలీసులు కాకుండా వీరే వెళ్లడం, సెటిల్మెంట్లు చేయడం పరిపాటిగా మారింది. మోసపోయామని ఠాణా మెట్లు ఎక్కే బాధితులతోనూ ‘లెక్క’ మాట్లాడుకున్న తర్వాతే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని, లేకపోతే నిందితులు దొరకడం లేదని 2–3 నెలల తర్వాత కేసులను క్లోజ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా ఒక్కచోటే తిష్ట.. సాధారణంగా పోలీసు విభాగంలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసే వారికి స్థానచలనం ఉంటుంది. అయితే సైబర్ క్రైమ్‌లో మాత్రం ఐదేళ్లకు మించి కానిస్టేబుళ్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం గమనార్హం. ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న ఐదుగురు కానిస్టేబుళ్లను ఇటీవల వేరే స్టేషన్‌కు బదిలీ చేశారు అయితే కనీసం రిలీవ్ ఆర్డర్ కూడా చేతికి అందకముందే ‘పెద్దల’ అండదండలతో మళ్లీ అక్కడే పోస్టింగ్ తెచ్చుకోవటం వీరికే చెల్లింది. ‘కొన్ని నెలల క్రితం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగిని సైబర్ నేరస్తుల వలలో చిక్కి... రూ.లక్షల్లో మోసపోయింది. దీంతో ఆమె సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. తాజాగా సదరు బాధితురాలు ఠాణాకు వచ్చి తాను మోసపోయిన సొమ్ము తిరిగి ఖాతాలో జమైందని, కేసు ఉపసంహరించుకుంటానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులే దగ్గరుండి మరీ లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చారు.’ ఏఆర్ టీంను రిటర్న్ చేయాలని నిర్ణయించాం – అనురాధ, డీసీపీ, రాచకొండ సైబర్ క్రైమ్ ప్రస్తుతం రాచకొండ సైబర్ క్రైమ్‌లో నాతో సహా ఇద్దరు ఏసీపీలు కూడా కొత్తగా వచ్చారు. వారు సైబర్ క్రైమ్‌ల దర్యాప్తు, ఇతరత్రా అంశాలపై సాంకేతికంగా పట్టు సాధించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఏఆర్ టీంను వెనక్కి పంపించాలని నిర్ణయించాం. కొన్ని సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితురాలికి తెలియకుండా వారి కుటుంబ సభ్యులే సైబర్ మోసం చేసినట్లు దర్యాప్తులో గుర్తించాం. ఇలాంటి కేసులలో బాధితుల విజ్ఞప్తి మేరకు విత్‌డ్రా చేస్తున్నాం. -
డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. హైదరబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మధ్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజ, యాగం వంటి కార్యక్రమాలు జరిపించింది. అలా సోషల్ మీడియాలో వెరీ పాపులర్ అయిపోయింది. ఈ బ్యూటీ హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ఆ ట్రాఫిక్ వల్ల ఆమె అసహనానికి గురైంది. దీంతో ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ట్విట్టర్లో ప్రశ్నించింది. (ఇదీ చదవండి: దేవుడు ఉన్నాడు.. వాళ్లు అన్యాయం చేస్తే ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్) అంతటితో ఆగకుండా ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ ట్విటర్ ఖాతాలకు ట్యాగ్ చేసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎదైనా మెడికల్ ఎమర్జెన్స్తో ఉన్న వారు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకొని ఉంటే పరిస్థితి ఏంటి..? ఇంట్లో నుంచి అడుగుపెట్టాలంటే భయం వేస్తుంది. ప్రభుత్వం ఏమైన డీజల్,పెట్రోల్ ఉచితంగా ఇస్తుందా.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇంకేముంది హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కుంటున్న వారు డింపుల్‌ను సపోర్ట్ చేస్తున్నారు. హయాతీ డేరింగ్ చూసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌లో యూ టర్న్ అయ్యే పాయింట్లు కొన్ని మార్చడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ) హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ హయాతిలు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. కొన్నిరోజుల క్రితం వీరిద్దరి మధ్య కార్ పార్కింగ్ వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఆ గొడవ కోర్టు వరకు వెల్లడంతో ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అతన్ని టార్గెట్ చేసేందుకే డింపుల్ ఈ తరహా ట్వీట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. I mean seriously this is getting worse than anything just to reach your house it takes more than an hour now where’s the traffic dcps ? What if there is a medical emergency? Can we even step out in Hyderabad ? We don’t get fuel free dear government. @KTRBRS @TelanganaCMO pic.twitter.com/0Z4oCblc3K — Dimple Hayathi (@DimpleHayathi) July 19, 2023 -
మల్కాజ్గిరి కిడ్నాప్ కేసు: చంపేస్తామని బెదిరించి 2కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉందని డీసీపీ జానకి స్పష్టం చేశారు. కాగా, డీసీపీ జానకి ఈ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి అదృశ్యంపై కేసు నమోదైంది. కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. వాట్సాప్ ద్వారా బాలుడి పేరెంట్స్‌కు కాల్ వచ్చింది. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని కిడ్నాపర్లు బెదిరించారు. ఒకే కాలనీలో ఉండేవాళ్లే బాలుడిని కిడ్నాప్ చేశారు. రవి, శివ నెలరోజులుగా బాలుడి కిడ్నాప్‌నకు ప్లాన్ చేశారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉంది. 8 బృందాలతో 36 గంటల్లోనే కేసును ఛేదించాం. జనగామ జిల్లా రామన్నగూడెం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నాం. ప్రధాని నిందితుడు రవి సహా ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాబు తండ్రి శ్రీనివాస్ కిడ్నాప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిడ్నాపర్ల నుంచి మా బాబును కాపాడిన పోలీసులకు ధన్యవాదాలు. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులకు చెబితే బాబును చంపేస్తామని బెదిరించారు. భారీగా డబ్బు డిమాండ్ చేశారు. మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారని అనుకోలేదు. 1989 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను. నాకు, నా కుటుంబానికి శత్రవులు ఎవరూ లేరు అని తెలిపారు. ఇది కూడా చదవండి: నిఘా ఉన్నా కూడా.. కక్కుర్తిపడి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు -
పెట్టుబడుల పేరుతో మోసగిస్తున్న ముఠా అరెస్ట్
-
డీసీపీతో గొడవ.. బాయ్‌ఫ్రెండ్ మ్యాటర్ లీక్ కావడంతో డింపుల్ అప్సెట్!
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంతో డింపుల్ చాలా అప్సెట్ అయినట్లు తెలుస్తుంది. ఆమె బయటకు కూడా రావడానికి ఇష్టపడటం లేదని స్వయంగా డింపుల్ లాయర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అసలే వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న డింపుల్ ఇప్పుడు ఈ ఇష్యూతో అనసరంగా తన రిలేషన్షిప్ విషయం బయటపడిందని ఫీల్ అవుతుందట. విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో డింపుల్ కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. ఇద్దరూ ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. కానీ ఇంతవరకు ఈ విషయం ఎక్కడా బయటపడలేదు. అయితే డీసీపీతో జరిగిన గొడవలో డింపుల్ బాయ్‌ఫ్రెండ్ గురించి లీక్ అయ్యింది. ఈ విషయంపైనే డింపుల్ చాలా అసహనంగా ఉందట. కాగా డింపుల్ హయతి, ఆమె బాయ్‌ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ ఇద్దరి స్వస్థలం విజయవాడ అని తెలుస్తుంది. అతను గ్రాఫిక్ డిజైనర్ అట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. ఇంతకాలం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా డీసీపీతో తలెత్తిన వివాదంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. -
డింపుల్‌తో డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారు : న్యాయవాది
హీరోయిన్ డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డేల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూపై డింపుల్ న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులను హింసిస్తుంటే డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. ''డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. డింపుల్ పార్లింగ్ ప్లేసులో కావాలనే కోన్స్ పెట్టారు. అయినా రోడ్డుపై వుండాల్సిన సిమెంట్ బారికేడ్స్, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నాం. జంతువులను హింసిస్టుంటే డింపుల్ వారించింది. అందుకే ఆ కక్షతోనే డీసీపీ ఇలా తప్పుడు కేసు పెట్టారు. డింపుల్ ఎక్కడా కారును తన్నిన ఫుటేజీ లేదు. కానీ ఆమెను తప్పుగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. జరిగిన పరిణామాలు చూసి డింపుల్ మానసిక ఒత్తిడికి గురైంది, ఆమె బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతుంది. డీసీపీ నుంచి డింపుల్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే ఆమెకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కేసను న్యాయపరంగా ఎదుర్కొంటాం'' అంటూ ఆమె న్యాయవాది పేర్కొన్నారు. -
'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు'
రామబాణం ఫేం డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హీరోయిన్ డింపుల్ హయాతిపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ ఆరోపించారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారని అన్నారు. అంతే కాకుండా డింపుల్ కారు పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారని రోడ్డు మీద సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ ఆపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాము రెండు నెలలుగా అడుగుతున్నామని తెలిపారు. ఈ విషయంలో తాము లీగల్‌గానే పోరాటం చేస్తామని వెల్లడించారు. (ఇది చదవండి:డింపుల్ హయాతి కేసులో ట్విస్ట్.. కారుకు వరుస చలాన్లు!) డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ మాట్లాడుతూ..'డింపుల్‌పై కావాలనే తప్పుడు కేసు పెట్టారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు రాష్‌గా మాట్లాడారు. డింపుల్ పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారు. డింపుల్ ఒక సెలబ్రిటీ. చాలాసార్లు చెప్పినా వినకపోవడంతో అసహనంతో కోన్స్‌ను కాలుతో తన్నారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతాను అని బెదిరించడంతో.. తిరిగి డింపుల్పైనే కేసు పెట్టారు. ఆమెను వేధించాలనేదే డీసీపీ ఉద్దేశం. క్వార్టర్స్‌లో ఉండకుండా డీసీపీ ఇక్కడ ఎందుకు ఉన్నారు.' అంటూ ఆరోపించారు. #heroinepolicecase #DimpleHayathi పై తప్పుడు కేస్ పెట్టారు అంటున్న #డింపుల్ లాయర్ Advocate questions #ips why cement bricks & traffic #triangles came into apartment parking area. ? Lot of turns & twists in this case against @DimpleHayathi Truth need to comeout.#18fms #18f pic.twitter.com/sn8nScTAZM — Narayana Pragada (@pragada1) May 23, 2023 లీగల్‌గానే ఫైట్ చేస్తాం: సత్యనారాయణ న్యాయవాది మాట్లాడుతూ.. 'సిమెంట్ బ్రిక్స్ తేవాలి అంటే.. చిన్న క్రేన్‌తో తేవాలి. ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో వాటిని ఎలా తెస్తారో ముందు చెప్పాలి. ప్రభుత్వ ప్రాపర్టీని మిస్ యూజ్ చేస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదా?. అమ్మాయి మీదకి వెళ్లి మాట్లాడతారా? ఒక సెలబ్రిటీగా.. అందులోనూ పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు వెనుకాడింది. కానీ ఐపీఎస్ తన డ్రైవర్‌తో కేసు పెట్టించారు. డింపుల్ కూడా ఫిర్యాదు చేసింది.. కానీ తీసుకోలేదు. 4 గంటలు పీఎస్‌లో కూర్చోపెట్టారు. ఈ కేసులో మేము లీగల్‌గానే ఫైట్ చేస్తాం.' అని అన్నారు. (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?) -
కాసేపట్లో హన్మకొండలో డీసీపీ కార్యాలయానికి ఈటెల
-
పలు నకిలీ డాక్యుమెంట్స్‌తో భారీ మొత్తంలో అవినీతి
-
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం బాలసాయిబాబా ట్రస్ట్ భూములను రక్షించే క్రమంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాంను జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు షిఫ్టులు పని చేసేలా నలుగురు గన్మెన్లను రక్షణగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నానని చెప్పారు. భూముల పరిరక్షణకు తరుచూ ఈ ప్రాంతానికి వస్తున్నానని, పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లతో తనకు ప్రాణహాని ఉన్నట్లు తెలిసిందన్నారు. మండలగూడెం రియల్టర్ల చేతిలో ఉన్న 59 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో అక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు. బాలసాయిబాబా కుటుంబ సభ్యులు ఆ భూములను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం ఉందని, భూముల వివరాలు కావాలని మూడు రోజుల కిందట సమాచార హక్కు చట్టం కింద రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓసారి తనపై హత్యాయత్నం జరిగిందని, బాలసాయిబాబా భూములను కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో రక్షణ కల్పించాలని కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాంకు గద్దర్ విన్నవించారు. -
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
-
ఖాజాగూడలో హత్య.. జిన్నారంలో కాల్చివేత
గచ్చిబౌలి: తమ అంతస్తుకు తగ్గట్లుగా ఆర్థికంగా లేడని కూతురు ప్రేమ వివాహన్ని జీర్ణించుకోలేక ఓ తండ్రి సుపారీ ఇచ్చి అల్లుడిని హత్య చేశాడని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ వివాహం చేసుకున్న నారాయణరెడ్డి హత్య కేసు వివరాలను ఆమె వెల్లడించారు. పొదల కొండపల్లి గ్రామం, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లాకు చెందిన శనివారపు మెంకట నారాయణరెడ్డి(25) సాఫ్ట్వేర్ ఇంజనీర్. కేపీహెచ్బీలో నివాసం ఉంటున్నాడు. తన స్వగ్రామానికి చెందిన రవళిని సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకొని ఢిల్లీలో ఉంటున్నారు. రవళిని పంపిస్తే పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తామని రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి నమ్మించి రప్పించారు. రవళిని ఇంటి వద్ద ఉంచుకొని వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వెంకట నారాయణరెడ్డి తనతో భార్య కలిసి ఉన్న ఫొటోలను బందువులకు, తెలిసిన వారికి చూపించి పెళ్లి కాకుండా అడ్డుకుంటున్నాడు. ఈ క్రమంలో ద్వేషం పెంచుకున్న రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి తన కూతురును ప్రేమ వివాహం చేసుకున్న వెంకట నారాయణరెడ్డిని అడ్డుతొలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన బందువైన చైతన్యపురిలో నివాసం ఉంటూ ఐస్‌క్రీం పార్లర్ నిర్వహించే గాజులపల్లి శ్రీనివాస్‌రెడ్డి(20)కి రూ.4.5 లక్షలకు సుపారీ ఇచ్చాడు. అడ్వాన్సుగా రూ.50 వేలు ఇవ్వగా శ్రీనివాస్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ కమలపాటి కాశి(20), షేక్ ఆషిక్(20)లు కలిసి నూజివీడు వెళ్లి కారు అద్దెకు తీసుకున్నారు. తిరిగి కారులో షేక్‌పేటకు వచ్చి లాడ్జిలో అద్దెకు ఉన్నారు. జూన్ 26న కేపీహెచ్‌బీలోని రెడ్ చిల్లీ రెస్టారెంట్‌కు వెంకట నారాయణరెడ్డిని రప్పించారు. కూల్‌డ్రింక్స్‌లో కొద్ది మోతాదులో మత్తు బిల్లలు కలిపి ఇచ్చారు. కొద్ది సేపటికే వెంకట నారాయణరెడ్డి తనకు పని ఉందని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. జూన్ 27న పార్టీ జరుపుకుందామని రాయదుర్గం రావాల్సిందిగా పిలిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ఖాజాగూడ చెరువు వద్ద కారులో ముందు సీట్లో కూర్చున్న వెంకటనారాయణ రెడ్డి మెడకు టవల్, చార్జర్ కేబుల్ బిగించి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి జిన్నారం అటవీ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని కాల్చి వేశారు. అక్కడి నుంచి కర్నూల్‌కు వెళ్లాడు. తన బావమరిది వెంకట నారాయణ రెడ్డి కనిపించడం లేదని, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉందని జూన్ 30న కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి నిందితుడు కాశిని అరెస్ట్ చేశారు. కాశి అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, అషిక్లు కర్నూల్‌కు పారిపోయి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు అస్వస్థతకు గురికావడం గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి రూ.7,160, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.