Devadas
-
స్వర్గంలో అడుగుపెట్టి 15 ఏళ్లు: రామ్
తొలి చిత్రమే హిట్టయితే ఆ కిక్కే వేరప్పా.. అదిచ్చిన బూస్ట్‌తో జర్నీని బుల్లెట్ స్పీడ్‌లో నడిపేయొచ్చు. దేవదాసు సూపర్ హిట్ కావడంతో రామ్ పోతినేని కూడా అదే చేశాడు. కానీ కొన్ని చోట్ల సడన్ బ్రేకులు పడ్డాయి, మరికొన్ని చోట్ల బండి నెమ్మదించింది. ఇక మిగతా చోట్ల రేసింగ్ స్పీడులో దూసుకుపోయాడు. అయితే హిట్లు, ఫ్లాపుల లెక్క ఎలాగున్నా క్రేజ్ మాత్రం అంతకు రెట్టింపు అవుతూనే వస్తోంది. పదిహేనేళ్ల వయసులోనే నటించడం మొదలు పెట్టిన ఆయన దేవదాసు చిత్రంతో హీరోగా మారారు. ఈ సినిమా రిలీజై నేటికి 15 ఏళ్లవుతోంది. (చదవండి: ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ రివ్యూ) ఈ సందర్భంగా రామ్ పోతినేని సంతోషం వ్యక్తం చేశారు. తనకు దేవదాసుతో సినీ జీవితాన్ని ప్రసాదించిన దర్శకుడు వైవీఎస్ చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "పదిహేనేళ్ల వయసులో టాలీవుడ్ అనే స్వర్గంలోకి అడుగు పెట్టాను. దేవదాసు రిలీజై సరిగ్గా పదిహేనేళ్లు అవుతోంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఎంటర్టైన్ చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను కూడా! అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. దేవదాసు పోస్టర్‌ను సైతం పంచుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ రెడ్‌బుల్ ఎనర్జీ స్టార్ రామ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేవదాసు నుంచే నీకు అభిమానులమైపోయాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రామ్ 'రెడ్' చిత్రం జనవరి 14న రిలీజవుతోంది. ఏడు భాషల్లో అనువదించనున్న ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ నటిస్తున్నారు. కన్నడ వెర్షన్ ఈ నెల 14నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాం. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నాం. (చదవండి: రెడ్ ట్రైలర్: ఈ సారి మంట మాములుగా లేదు) -
‘జెర్సీ’లో ‘యూటర్న్’ భామ..!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం జెర్సీ. ఇటీవల దేవదాసు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. షార్ట్ గ్యాప్ తరువాత జెర్సీ సినిమా షూటింగ్‌కు హాజరు కానున్నాడు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. కన్నడలో యూటర్న్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్.. జెర్సీలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి రెబ్బా మోనికా జాన్ మరో హీరోయిన్గా నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్నన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. -
‘దేవదాస్’ డిలీటెడ్ సీన్
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ దేవదాస్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. నాగార్జున కెరీర్లోనే బిగెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. తాజాగా ఈ సినిమాలోని డిలీడెట్ సీన్‌ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. సినిమాలో డాక్టర్ దాస్, డాక్టర్ భరద్వాజ్ ల మధ్య జరిగే సన్నివేశాన్ని నాని ట్వీట్ చేశాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించారు. -
షార్ట్ ఫిలింలో లక్కీ హీరోయిన్
టాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఛలో, గీత గోవిందం సినిమాలతో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ భామ ఇటీవల దేవదాస్‌తో మరో సక్సెస్‌ను అందుకుంది. దీంతో రష్మికను లక్కీ హీరోయిన్గా భావిస్తున్నారు తెలుగు స్టార్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న రష్మిక ఓ షార్ట్ ఫిలింలో సందడి చేసింది. ‘ఎవ్రీ నాన్ తెలుగు ఫ్రెండ్ ఎవర్’ పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం రష్మిక తెలుగు రాని కన్నడ అమ్మాయిగా కనిపించింది. తనకు తెలుగు రాకపోవటంతో ఎవరైన తెలుగులో మాట్లాడిన విషయాలను తెలుసుకునేందుకు తన ఫ్రెండ్ సాయం తీసుకోవటం, సినిమాలకు తన ద్వారా డబ్బింగ్ చెప్పించుకోవటం లాంటి సీన్స్‌ను ఫన్సీగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ దమ్ము సినిమా చూసి రష్మిక ఇచ్చిన రియాక్షన్స్ సూపర్బ్. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. -
నాగ్ గురించి వికీపీడియా తప్పు చెబుతోందా?
టాలీవుడ్ మన్మథుడు, నిత్య యవ్వనుడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు అసూయపుట్టేలా చేస్తున్నాడు కింగ్ నాగార్జున. వయసు ఆరుపదులకు దగ్గరవుతున్నా.. ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే ఉన్నాడు నాగ్. గురువారం రిలీజైన దేవదాస్ మూవీలో దేవ పాత్రలో నాగ్ నటన అందరినీ మెప్పించింది. అయితే నాగ్ ఫిట్‌నెస్‌పై యంగ్‌హీరో కార్తికేయ (ఆర్ఎక్స్ 100 ఫేమ్) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘వికీపీడియా తప్పు చూపిస్తోందా? ఈ మనిషికి 59 సంవత్సరాలని చూపిస్తోంది. ఆయన ఫిట్నెస్తో యంగ్ హీరోలకు చాలెంజ్ విసిరుతున్నాడు. ఏమ్ ఉన్నాడ్రా బాబు’ అంటూ దేవదాస్లోని నాగ్ పిక్‌ను పోస్ట్చేశాడు. ఆర్ఎక్స్ 100తో విజయం సాధించిన కార్తికేయ.. తదుపరి చిత్రంగా ‘హిప్పీ’ని పట్టాలెక్కిస్తున్నాడు. Is wikipedia wrong ?coz it says this man is 59yrs old .#Devadasu .@iamnagarjuna sir 🙏🙏🙏 challenging actors in 20s with his fitness levels.Em unnadra babu🙏🙏 pic.twitter.com/5D1tcZ75t8 — Kartikeya (@ActorKartikeya) 27 September 2018 -
‘దేవదాస్’ మూవీ రివ్యూ
టైటిల్ : దేవదాస్ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న, కునాల్ కపూర్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య నిర్మాత : అశ్వనీదత్ సీనియర్ హీరో నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా దేవదాస్. చాలా కాలం తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ స్వయంగా నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. భలే మంచి రోజు, శమంతకమణి లాంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య.. నాగ్, నాని లాంటి స్టార్లను డైరెక్ట్ చేస్తుండటంతో దేవదాస్‌పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను శ్రీరామ్ ఆదిత్య అందుకున్నాడా..? మల్టీస్టారర్‌గా తెరకెక్కిన దేవదాస్ సక్సెస్ అయ్యిందా..? నాగ్,నానిల కాంబినేషన్ ఏ మేరకు అలరించింది..? కథ ; దేవ (నాగార్జున) ఓ మాఫియా డాన్. తనను ఆదరించి పెంచిన దాదా(శరత్ కుమార్)ను ప్రత్యర్థులు చంపేయటంతో పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న దేవ బయటకు వస్తాడు. దేవ సిటీకి తిరిగి వస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు ఎలాగైన దేవాను పట్టుకోవాలని స్కెచ్ వేస్తారు. అదే సమయంలో దాదాను చంపిన డేవిడ్(కునాల్ కపూర్) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ట్రై చేస్తుంది. ఓ పోలీస్ అటాక్‌లో గాయపడిన దేవకు డాక్టర్ దాస్ (నాని) ట్రీట్మెంట్ చేస్తాడు. తాను క్రిమినల్ అని తెలిసినా పోలీస్‌లకు పట్టివ్వని దాస్ మంచితనం చూసి, దేవ అతనితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా దాస్ కూడా దేవకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. మనుషులను చంపటం తప్ప ప్రేమించటం తెలియని దేవ.. మనుషులను అమాయకంగా నమ్మటం, ప్రేమించటం మాత్రమే తెలిసిన దాస్‌ల మధ్య స్నేహం ఎలా కుదిరింది..? దేవ పోలీసుల నుంచి డేవిడ్ గ్యాంగ్నుంచి ఎలా తప్పించుకున్నాడా..? దాదాను చంపిన వారి మీద పగ తీర్చుకున్నాడా..? ఈ ప్రయాణంలో దేవ, దాస్‌లు.. ఎవరు ఎవరిలా మారిపోయారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; కింగ్ నాగార్జున మరోసారి తనదైన స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశాడు. గత చిత్రం ఆఫీసర్‌తో పోలిస్తే ఈ సినిమాలో మరింత యంగ్‌గా కనిపించాడు. యాక్షన్, రొమాన్స్‌లతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో అలరించాడు. యంగ్ హీరో నాని కూడా తనదైన నేచురల్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. అమాయకుడిగా కనిపిస్తూనే మంచి టైమింగ్‌తో కామెడీ పండించాడు. ముఖ్యంగా నాగ్, నానిల మధ్య వచ్చే సన్నివేశాల్లో వారిద్దరి కెమిస్ట్రీ సినిమాను మరింత ఎంటర్టైనింగ్గా మార్చింది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఇద్దరి నటన సూపర్బ్. సినిమా అంతా దేవ, దాస్‌ల చుట్టూనే తిరుగడంతో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఉన్నంతలో ఆకాంక్ష సింగ్, రష్మికలు ఆకట్టుకున్నారు. విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నా.. ఆ పాత్రను పెద్దగా ఎలివేట్ చేయలేదు. ఇతర పాత్రల్లో నరేష్, వెన్నెల కిశోర్, సత్య, మురళీశర్మ, అవసరాల శ్రీనివాస్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; ఇంతవరకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన అనుభవం లేకపోయినా.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దేవదాస్‌ను బాగానే డీల్ చేశాడు. తను అనుకున్న కథకు తెర రూపం ఇవ్వటంలో విజయం సాధించాడు. అయితే కథనం మాత్రం పడుతూ లేస్తూ రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగుతుంది. హీరోలుగా నాగ్, నానిలను ఎంచుకున్నప్పుడే సగం విజయం సాధించిన ఈ యువ దర్శకుడు వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ దేవ, దాస్‌ల మధ్య ఫ్రెండ్షిప్, కామెడీ ఆకట్టుకున్నా.. ప్రేమకథలు ఆసక్తికరంగా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అయిన తరువాత కథనం బాగా స్లో అయ్యింది. అయితే దేవ క్యారెక్టర్ ఎలివేషన్, కామెడీతో అన్ని మర్చిపోయేలా చేశాడు దర్శకుడు. చాలా రోజులు తరువాత ఓ స్టార్ హీరో సినిమాకు సంగీతమందించిన మణిశర్మ తన మార్క్ చూపించాడు. నేపథ్య సంగీతం విషయంలో మణిశర్మకు తిరుగులేదని దేవదాస్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్ కలర్‌ఫుల్ గా చూపించేందుకు శ్యామ్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; నాగార్జున, నానిల నటన కామెడీ సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ ; ప్రీ క్లైమాక్స్ కొన్ని బోరింగ్ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మీ ట్వీట్ స్ట్రెస్ నుంచి రిలీఫ్‌నిచ్చింది: నాని
దేవ చేసిన ట్వీట్‌తో తన ఒత్తిడి పోయిందంటున్నాడు దాసు.. ఈ దేవ, దాసు ఎవరనుకుంటున్నారా అదేనండి కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవదాస్’ మూవీలోని పాత్రలు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున ‘ఇప్పుడే దేవదాస్ సినిమా చూశాను. విజయం నా పాకెట్ లో వుంది. ఆ ధైర్యం, ఆనందంతోనే హైదరాబాద్ విడిచి ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళుతున్నాను. ఇక ముందున్నది హాలిడే లైఫే. థ్యాంక్స్ టూ లెజెండరీ వైజయంతీ మూవీస్. అమేజింగ్ నాని అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ నాని.. ‘చాలా ఒత్తిడితో కూడుకున్న ఈ రోజును మీ ట్వీట్‌తో నా రోజుగా మలిచారు సర్.. నేను రేపు అభిమానులతో కలిసి సినిమా చూస్తాను. మీ ప్రయాణం బాగా జరగాలి. మీరు తిరిగొచ్చిన తర్వాత కలుస్తా’ అని పేర్కొన్నాడు. ఇక నాని సైతం బిగ్‌బాస్ ఫైనల్ అనంతరం కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతానని ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ.. వైజయంతీ మూవీస్ నిర్మించగా మణిశర్మ సంగీతం అందించారు. Quite a stressful day it was and your tweet made my day Sir ..I will be watching it tomorrow with the audience ... Have a great trip and see you soon when you are back 🤗 @iamnagarjuna https://t.co/cmruzaM7QW — Nani (@NameisNani) September 26, 2018 -
గుండమ్మ కథ గుర్తొచ్చింది : అశ్వనీదత్
నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా కథానాయికలు. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం పలు విశేషాలు పంచుకున్నారు. అశ్వనీదత్ మాట్లాడుతూ – ‘‘మహానటి’ సినిమా ప్రొడక్షన్ మొత్తం నా కూతుళ్లే చూసుకున్నారు. ‘దేవదాస్’ సినిమాతో వైజయంతీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంకా ముందుకు వెళ్లడానికి, నన్ను, మా పిల్లలను ఆశీర్వదించండి. నా కెరీర్లో చాలా మల్టీస్టారర్లు చేశాను. ‘దేవదాస్’ గురించి వేరేవాళ్ల దగ్గర చెబుతూ, ‘గుండమ్మ కథ’ను రిఫర్ చేశాను. ఆ సినిమాలో రామారావుగారు, నాగేశ్వరరావుగారు కలిసి చేసిన విధానం గుర్తొచ్చింది. అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జున, నానీల అనుబంధం చూసినప్పుడు ఆ సినిమా గుర్తొచ్చింది. సినిమాని ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ – ‘‘అశ్వనీదత్‌గారు పని విషయంలో ‘ఆఖరి పోరాటం’ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు, అల్లుడు కూడా తోడయ్యారు. నాలో వచ్చిన మార్పేంటంటే పంక్చువల్ అయినట్లున్నాను. నానీకి, నాకు మధ్య ఫ్రెండ్షిప్ కీలకంగా ఈ సినిమా సాగుతుంది. టైటిల్ ముందు అనుకోలేదు. నా పేరు దేవ అని ముందే అనుకున్నాం. నానీ పేరు కృష్ణ. కాని తర్వాత దాస్ చేర్చి కృష్ణదాస్ చేశాడు దర్శకుడు. అలా దేవదాస్ అయింది. ఇంత చిన్న వయసులో అంతమంది స్టార్స్‌ని సెట్లో హ్యాండిల్ చేయడం గ్రేట్. ఈ సినిమా మొన్నే చూశాను. ఓ నెల రోజుల ముందు కంప్లీట్ అయ్యుంటే మార్పులు చేర్పులకు అవకాశం ఉండేది’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘ఇది చాలా ప్రెషర్గా ఫీలయ్యే వీక్. దేవదాస్ రిలీజ్, బిగ్‌బాస్ ఫైనల్‌తో ఫుల్ టెన్షన్. అలానే ఎగై్జటింగ్‌గా ఉంది. ఈ ఆదివారం పూర్తయితే ప్రశాంతంగా కాశీకి వెళ్లాలనుంది (నవ్వుతూ)’’ అన్నారు.‘‘మల్టీస్టారర్, సింగిల్ స్టార్ అని తేడా ఉండదు. ఇది ఏ హాలీవుడ్ సినిమాకు రీమేక్ కాదు. లొకేషన్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. స్టార్స్‌ని డీల్ చేస్తున్న భావన కలగలేదు’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. -
ఈ వారం తర్వాత ఏ కాశీకో వెళ్లిపోతా: నాని
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన సినిమా దేవదాస్. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనిదత్ నిర్మించారు. మణిశర్మ సంగీతమందించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. ‘మహానటి అప్పుడు నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు. ఈ సినిమాకు మాత్రం పెద్ద హీరోలు నాకు తోడుగా, అండగా.. వాళ్ల భుజాలపై వేసుకుని నడిపించిన సినిమా కాబట్టి మీ ముందుకు వచ్చాను. చాలా ఏళ్ల తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి ప్రతిష్మాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వించే సినిమా ఇది అవుతుంది’ అన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. ‘అశ్వినీదత్ గారు ఆఖరి పోరాటం అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ ఇంకా అలాగే ఉంది. దేవ క్యారెక్టర్ ఇంటర్నేషనల్ డాన్ క్యారెక్టర్‌గా తీసుకున్నాం. దాంట్లో వయోలెన్స్ కానీ.. మాఫియా యాక్టివిటీస్ కానీ పెద్దగా చూపించలేదు. దాస్ తో దేవ స్నేహమే దేవదాస్ సినిమా. ఒకరిని ఇంకొకరు ఎలా ఇన్ఫ్లూయెన్స్ చేస్తారనేది సినిమాలో మెయిన్ పాయింట్. సినిమాలో సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కెమెరామెన్ శ్యామ్ తో మరోసారి వర్క్ చేయాలని ఉంది’ అని అన్నారు. హీరో నాని మాట్లాడుతూ.. దాస్ చాలా ఇన్నోసెంట్. సాఫీగా సాగుతున్న లైఫ్ లోకి ఊహించకుండా ఎవరూ లైఫ్ లో చూడని ఓ వ్యక్తి ఫ్రెండ్ గా వస్తే వాడి లైఫ్ ఎలా మారిపోతుంది అనేది కారెక్టర్. ఫోన్ విషయంలో కూడా ఎప్పుడూ తాను చేతిలో పట్టుకునే ఉంటానని నాగ్ సర్ వీడియో చేసారు. అయితే నాగార్జున గారు పక్కనే ఉన్నపుడు అలాంటి ధైర్యం చేయలేదు కానీ వీడియో చేసే సరికి అది వైరల్ అయిపోయింది. నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడమే అదృష్టం. నా లైఫ్ లో మోస్ట్ హెట్టిక్ వీకెండ్ ఇది. మోస్ట్ స్ట్రెస్ ఫుల్ వీక్.. ఎక్సైటింగ్ వీక్ కూడా ఇదే. బిగ్‌బాస్ ఫైనల్ కూడా ఇదే వారం ఉండటంతో ఒత్తిడి ఉంది. ప్లస్ మైనస్ రెండూ ఉన్నాయి. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతాను’ అన్నారు. హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. ‘నా కారెక్టర్ ఇందులో గాల్ నెక్ట్స్ డోర్ లా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని చెప్పారు. మరో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ‘నాగార్జున గారు సీన్ విషయాల్లో చాలా హెల్ప్ చేసారు. ఆయన చెప్పిన టిప్స్ అద్భుతంగా పనిచేసాయి. ఆయనతో పనిచేయడం.. స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని చెప్పారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘సెట్ లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్స్ నాగార్జున గారు. మామూలు సినిమా, మల్టీస్టారర్స్ అని తేడా నాకు ఉండదు. మల్టీస్టారర్ అంటే ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఒకేసారి ఇద్దరు హీరోల బెటర్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఇది ఏ సినిమా రీమేక్ కాదు. సొంత కథతోనే దేవదాస్ తెరకెక్కించాను. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కింది. చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లు ఎన్ని ఉంటాయనేది సినిమా చూసి తెలుసుకోండి’ అని చెప్పారు. -
మరో ప్రయోగం చేస్తున్న నాగ్..!
కింగ్ నాగార్జున మరో ఆసక్తికర ప్రయోగానికి రెడీ అవుతున్నారు. మన్మథుడు ఇమేజ్ ఉన్న నాగ్ మధ్యలో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాల్లోనూ ఆకట్టుకున్నారు. అదే సమయంలో అతిథి పాత్రల్లోనూ మెప్పించారు. తాజాగా నానితో కలిసి మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న దేవదాస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా తరువాత కూడా ప్రయోగాలకే ఓటేస్తున్నారు నాగ్. చాలా కాలం తరువాత బ్రహ్మాస్త్రతో బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. అదే సమయంలో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ సినిమాలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం దేవదాస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ధనుష్ దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 600 ఏళ్ల క్రితం జరిగిన కథతో రూపొందనుందని తెలిపారు. ఈ సినిమాలో నాగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముందుగా ఈ పాత్రను రజనీకాంత్‌తో చేయించాలనుకున్న ధనుష్, డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో నాగార్జున సంప్రదించారు. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. -
సెన్సార్ పూర్తిచేసుకున్న ‘దేవదాస్’
టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దేవదాస్. క్రేజీ మల్టిస్టారర్గా రూపొందిన ఈ చిత్రంపై బాగానే హైప్ క్రియేట్ అయింది. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్ పొందినట్లు నిర్మాతలు ప్రకటించారు. రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మించగా.. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. "U/A" for #Devadas Grand Release on September 27th@iamnagarjuna @NameisNani @iamRashmika @aakanksha_s30 @SriramAdittya @VyjayanthiFilms pic.twitter.com/qg1sphXczB — Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 24, 2018 -
నాగార్జునను విసిగిస్తున్నాడట!
టాలీవుడ్లో మల్టిస్టారర్ హవా కొనసాగుతోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దేవదాస్’ విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నాని, నాగార్జునలు ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేపనిలో ఉన్నారు. నాగార్జున దాసు గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ట్వీట్‌తో పాటు వీడియోను పోస్ట్ చేస్తూ.. పక్కన అందమైన అమ్మాయి ఉన్నా.. ఎప్పుడూ ఫోన్ చూస్తూనే ఉంటాడు అంటూ నాని గురించి చెప్పాడు. తనకు చిరాకు తెప్పించే స్నేహితుడు దాసు అని.. మరి మీకు చిరాకు తెప్పించే స్నేహితుడు ఎవరో ట్యాగ్ చేయండి అని నాగ్ ట్వీట్ చేశాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. My annoying friend Dr.dasu ..tag urs #DevaDasOnSept27th pic.twitter.com/BB1oKffw8E — Nagarjuna Akkineni (@iamnagarjuna) 23 September 2018 -
ఆ ఇద్దరికీ నేను ఫిదా
‘‘ ఏ సినిమా చేయాలన్నా క్యారెక్టర్ నచ్చాలి. అదే ముఖ్యం. నాగార్జున, నానీల బ్రోమాన్స్ (నవ్వుతూ) ఈ సినిమాకు హైలైట్. నేనైతే వాళ్లిద్దరి కాంబినేషన్ చూసి ఫిదా అయిపోయాను. వైజయంతీ మూవీస్ లాంటి బ్యానర్లో నటించే అవకాశం వచ్చినప్పుడు నమ్మలేదు. సినిమా ప్రమోషన్స్ అప్పుడు పర్సనల్ విషయాలు డిస్కస్ చేస్తే న్యూస్ డైవర్ట్ అయిపోతుంది. అందుకే వ్యక్తిగత విషయాలు చెప్పను’’ అని రష్మికా మండనా అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా కథానాయికలు. అశ్వనీదత్ నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా రష్మిక పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘దేవదాస్’ సినిమాలో నానీగారు డాక్టర్లా కనిపిస్తారు. నేను ఆయన పేషెంట్‌ని. రోజూ ఏదో ప్రాబ్లమ్ అని చెప్పి క్లినిక్‌కి వెళ్తుంటాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు పూజ. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ► ఇది మల్టీస్టారర్ అయినప్పటికీ నా పాత్ర బావుంటుంది. ‘గీత గోవిందం’లో నాది హీరోకు సమానంగా ఉండే పాత్ర. కానీ ఈ సినిమా కథ మొత్తం నాగార్జున, నానీగార్ల చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ పాత్రలకు స్క్రీన్ టైమ్ తక్కువ ఉన్నా సర్ప్రైజ్ విషయాలు ఉంటాయి. ► నాని సార్‌తో వర్క్ చేయడం లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతి సీన్‌ను ఎలా ఇంప్రూవ్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఏ హెల్ప్ కావల్లన్నా నానీగార్ని అడిగేదాన్ని. ► నాగార్జున గారితో పని చేసింది కేవలం రెండు రోజులే. కానీ రెండు రోజులూ నవ్వుతూనే ఉన్నాం. ఆయన చాలా సరదా మనిషి. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ► ఏ సీన్ అయినా నా దర్శకుడు, హీరో, కెమెరామేన్ ఓకే అన్నాకే మానిటర్లో చూసుకుంటాను. వాళ్లకు నచ్చాలి అన్నది మెయిన్ పాయింట్ అని నమ్ముతాను. ► నెక్ట్స్ విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ చేస్తున్నాను. అందులో క్రికెటర్‌గా నటిస్తున్నాను. పాత్రకోసం ప్రిపేర్ అవుతుంటే చిన్న గాయం అయింది. మళ్లీ మొదలెట్టాలి. కన్నడంలో ఓ సినిమా చేస్తున్నాను. వేరే సినిమాలున్నాయి. వాటి గురించి ప్రొడక్షన్ హౌజ్‌లు అనౌన్స్ చేస్తాయి. తమిళంలో ఆఫర్స్ వస్తున్నాయి. కానీ కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాం అంటే ఆ అంచనాలు అందుకునే స్క్రిప్ట్ రావాలని అనుకుంటున్నాను. -
‘దేవదాస్’ ఆడియో వేడుక
-
శ్రీకాంత్ అడ్డాలతో నాని?
నాని మంచి జోరు మీదున్నారు. సినిమాలతో పెద్ద తెర, ‘బిగ్ బాస్ 2’తో చిన్ని తెర ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. నాగార్జునతో కలిసి నాని నటించిన ‘దేవదాస్’ ఈ 27న రిలీజవుతుంది. ఇలా ఈ చిత్రం రిలీజవుతుందో లేదో మరో కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు చేశార ట నాని. ఆల్రెడీ ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటించను న్నారు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారట. ‘కొత్త బంగారులోకం’,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో బ్రహ్మాండమైన కథ తయారు చేశారట. ఆ కథకు నాని హీరో అని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. -
నాగ్ పక్కన ఓ అందమైన అమ్మాయి!
టాలీవుడ్ కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టిస్టారర్ దేవదాస్. దేవ పాత్రలో డాన్‌గా నాగార్జున, దాసు పాత్రలో డాక్టర్‌గా నాని నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ‘దేవదాస్’ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పాత్రను పరిచయం చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందంటూ ట్వీట్ చేశాడు నాగ్. సోమవారం సాయంత్రం వీరిద్దరికి సంబంధించిన ఓ డ్యూయెట్ లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ కానున్నట్లు ట్వీట్ చేశాడు నాగ్. ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. చాలా రోజులు తరవాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి!! Yaayy romance again😊#Akanksha_s30 #devadasonsept27th lyrical video this evening 👉👉👉 pic.twitter.com/rWSLPOuE6O — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 17, 2018 -
మేము రెడీ.. మీరు రెడీనా అంటోన్న నాని
టాలీవుడ్లో మల్టిస్టారర్ హవా మళ్లీ మొదలైంది. పెద్ద హీరోలు, యువ హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాబోతోన్న మల్టిస్టారర్‌లో కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నానిలు కలిసి చేస్తున్న దేవదాస్ మూవీ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ‘దేవదాస్’లోని వినాయక చవితి స్పెషల్ సాంగ్ డ్యాన్స్‌ను చాలెంజ్‌గా విసిరారు. మేము రెడీ మీరు రెడీనా అంటూ వీడియో సాంగ్ ప్రోమోను నాని షేర్ చేశారు. మీరు కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన డ్యాన్సింగ్ వీడియోను ట్యాగ్ చేస్తే... దేవదాస్ టీమ్ తరపున సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ పొందగలరని ట్వీట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. Memu ready Meeru ready aa ? 🤗#DevaDas https://t.co/pzdhrZYhyy — Nani (@NameisNani) September 15, 2018 -
‘దేవదాస్’తో బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ..!
ముంబాయి కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 మీడియా ప్రతిష్టాత్మక వైజయంతి సంస్థతో చేతులు కలిపింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో నిర్మిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ దేవదాస్ చిత్రానికి వయాకామ్ 18 భాగస్వామిగా దక్షిణాది చిత్ర సీమలో అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ, వయాకామ్ 18తో భాగస్వామి గా కావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. దేవదాస్ తో దక్షిణాది చిత్ర సీమ లోకి ప్రవేశిస్తున్న వారికి టాలీవుడ్ తరపున ఘన స్వాగతం పలుకుతున్నాం’ అన్నారు. వయా కామ్ 18 సీఓఓ అజిత్ అంధారే మాట్లాడుతూ, ‘అశ్వినిదత్ గారి ప్రఖ్యాత వైజయంతి మూవీస్ సంస్థ భాగస్వామ్యం లో భారీ చిత్రం దేవదాస్ తో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. మా సంస్థ తెలుగులో అనేక దశాబ్దాల అనుభవం ఉన్న దత్ గారు, వైజయంతి మూవీస్ భాగస్వామ్యం తో మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తాం. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిల కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న, అందరూ ఎంత గానో ఎదురు చూస్తున్న దేవదాస్ తో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంద’న్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దేవదాస్ : వినాయక చవితి స్పెషల్ సాంగ్
కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్, లిరికల్ వీడియోలతో సందడి చేస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా మరో సాంగ్‌ను విడుదల చేశారు. మా పండుగ కొంచెం ముందే మొదలయ్యింది అంటూ లక లక లకుమీకర లంభోదర అంటూ సాగే వినాయక చవితి పాటను రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘దేవదాస్’కు బైబై చెప్పిన చిత్రయూనిట్
మల్టిస్టారర్ల హవా కొనసాగుతున్న ఈ టైమ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దేవదాస్. టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాచురల్‌స్టార్ నాని కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. నాగార్జున ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. డాన్‌గా దేవ పాత్రలో నాగ్ నటిస్తుండగా, డాక్టర్‌గా దాసు పాత్రలో నాని నటిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందాన్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. దేవదాస్ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. And it’s a wrap for #Devadas !!! Thank uuuuuu team DevaDas 🙏...it was amazing!!! pic.twitter.com/uzcLPD3pmF — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 11, 2018 -
మామా అల్లుళ్ల సవాల్
కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చాలా రోజుల క్రితమే దేవదాస్ యూనిట్ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజాగా అక్కినేని వారసుడు నాగార్జున మేనల్లుడు సుమంత్ మామాతో పోటికి సై అంటున్నాడు. మళ్ళీరావా సినిమాతో ఫాంలోకి వచ్చిన సుమంత్ ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఇదం జగత్ సినిమాలో నటిస్తున్నాడు. సుమంత్ తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28 న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో మామా అల్లుళ్ల మధ్య పోటి తప్పేలా లేదు. మరి ఈ మామా అల్లుళ్లు వెండితెర మీద బరిలో దిగుతారా లేక ఎవరైన పక్కకు తప్పుకుంటారా చూడాలి. -
వయసు పెరగలేదు
ఇక్కడున్న స్టిల్ చూశారు కదా! నాగార్జున వయసు తగ్గినట్లుగా అనిపిస్తోంది కదూ. నిజానికి ఈరోజు (ఆగస్ట్ 29) ఆయన వయసు పెరిగింది. అయినా పెరిగినట్లు కనిపించడంలేదు. యస్.. ఇవాళ నాగ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘దేవదాస్’లోని ఆయన కొత్త స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. వైజయంతి మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాన్ ‘దేవ’గా నాగ్, దాస్ పాత్రలో నాని నటిస్తున్నారు. ఫొటోలో కౌబాయ్ గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి ఎనర్జీతో పాటు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నట్లుగా ఉన్నారు నాగార్జున. ఈ మధ్య విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాగ్ సరసన ‘గురు’ ఫేమ్ ఆకాంక్షా సింగ్ నటిస్తుండగా నాని సరసన రష్మికా మండన్నా నటిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. -
కలిసి మందేసిన నాగ్, నాని!
కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఈ చిత్ర టీజర్ శుక్రవారం విడుదలైంది. టీజర్లో ఏం చెప్పకున్నా.. సినిమా ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. టీజర్లో నాగ్, నాని కలిసి మందేయడం నవ్వులు పూయిస్తోంది. నాగార్జున ముందు నాని ఇచ్చిన అమాయక ఎక్స్ప్రెషన్స్.. దాసు ఏంటీ సంగతి అని నాగ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచాయి. మల్టీ స్టారర్ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్, నానికి జోడీగా రష్మికా మండన్నా యాక్ట్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. -
చిన్న పెగ్గుతో ‘దేవదాస్’!
మల్టిస్టారర్ల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో రాబోతోన్న దేవదాస్ ప్రత్యేకతను చాటుకుంటోంది. నాటి క్లాసికల్ హిట్ మూవీ దేవదాస్ టైటిల్‌తో రాబోతోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డాన్‌గా దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్‌గా దాసు పాత్రలో నాని నటిస్తోన్న విషయం తెలిసిందే. రేపు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. స్మాల్ పెగ్ లాంటి టీజర్‌తో రేపు సాయంత్రం ఐదు గంటలకు రానున్నట్లు ప్రకటించారు. రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. It's time to say CHEERS as the first teaser #SmallPeg from #Devadas is releasing tomorrow at 5 pm. Stay tuned for #DevadasTeaser - https://t.co/AEDNZ358RI#Devadas *ing @iamnagarjuna, @NameisNani, @iamRashmika & @aakanksha_s30 Music by #ManiSharma Directed by @SriramAdittya pic.twitter.com/RryBaoIUqJ — Vyjayanthi Movies (@VyjayanthiFilms) 23 August 2018 -
బ్యాంకాక్‌లో దేవదాస్
హైదరాబాద్ టు బ్యాంకాక్ మధ్య చెక్కర్లు కొడుతున్నారట హీరో నాని. ఇటు బిగ్‌బాస్ సీజన్ 2 షూటింగ్ కోసం హైదరాబాద్‌లో, ‘దేవదాస్’ సినిమా కోసం బ్యాంకాక్‌లో బిజీ బిజీగా ఉన్నారాయన. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. డాన్ దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్ దాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. శాంతాభాయ్ మెమోరియల్ హస్పిటల్ చుట్టూ కథనం సాగుతుందట. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యేందుకు నటుడు మురళీ శర్మ కూడా బ్యాంకాక్ వెళ్లారు. రీసెంట్గా రిలీజైన ఫస్ట్ లుక్కు విశేష స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.