Dinesh chandimal
-
SL vs NZ: సెంచరీలతో కదం తొక్కిన శ్రీలంక బ్యాటర్లు
Sri Lanka vs New Zealand, 2nd Test Day 2 Score Final Update: న్యూజిలాండ్‌తో గాలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలిరోజు దినేశ్ చండీమల్ శతకం సాధించగా, రెండో రోజు ఆటలో కమిందు మెండిస్ (250 బంతుల్లో 182 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (149 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీలతో కదంతొక్కారు. దీంతో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 163.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది.ఓవర్‌నైట్ స్కోరు 306/3తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన లంక బ్యాటర్లలో ఎంజెలో మాథ్యూస్ (185 బంతుల్లో 88; 7 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు 10 పరుగులు జోడించి నిష్క్రమించాడు. దీంతో తొలి సెషన్ ఆరంభంలోనే 328 పరుగుల వద్ద నాలుగో వికెట్ కూలింది. ఈ దశలో మరో ఓవర్‌నైట్ బ్యాటర్ కమిందు మెండిస్ కు జతయిన కెప్టెన్ ధనంజయ డిసిల్వా (80 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడటంతో పర్యాటక బౌలర్లకు మళ్లీ కష్టాలు తప్పలేదు. ఈ జోడీని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జట్టు స్కోరు 400 మైలురాయి దాటాక ఎట్టకేలకు తొలిసెషన్ ముగిసే దశలో ధనంజయను ఫిలిప్స్ పెవిలియన్ చేర్చాడు. అరుదైన రికార్డుఅతను అవుటైన 402 స్కోరువద్దే లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. కుశాల్ మెండిస్ క్రీజులోకి రాగా... రెండో సెషన్ మొదలైన కాసేపటికే కమిందు మిండిస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మిడిలార్డర్ బ్యాటర్ అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు.అరంగేట్రం చేసిన టెస్టు నుంచి ఇప్పటివరకు (తాజా 8వ టెస్టు) ప్రతి మ్యాచ్‌లో సెంచరీ, లేదంటే అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా ఘనతకెక్కాడు. మరోవైపు అతనికి జతయిన కుశాల్ కూడా కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో రెండో సెషన్ అసాంతం కష్టపడినా వికెట్ తీయలేకపోయింది. 519/5 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. 602/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ఆ తర్వాత మొదలైన మూడో సెషన్లోనూ ఈ జోడీ క్రీజు వదలకపోవడంతో పాటు పరుగుల్ని అవలీలగా సాధించింది. కమిందు 150 పరుగులు పూర్తి చేసుకోగా... కుశాల్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 602/5 వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. కుశాల్, కమిందు ఇద్దరు అబేధ్యమైన ఆరో వికెట్‌కు సరిగ్గా 200 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట నిలిచే సమయానికి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. శ్రీలంక కంటే 580 పరుగులు వెనుకబడి ఉంది. ఇరు జట్ల మధ్య శనివారం మూడో రోజు మొదలైంది. కాగా తొలి టెస్టులోశ్రీలంక కివీస్‌ను 63 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
చండీమల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఆ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.తుది జట్లు..శ్రీలంక: పథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వికెట్‌కీపర్), మిలన్ రత్నాయక్, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పెరిస్, అసిత ఫెర్నాండోన్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీచదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్‌లకు నో ప్లేస్..! -
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్
శ్రీలంక వెటరన్ బ్యాటర్ దినేశ్ చండీమల్ టెస్ట్ క్రికెట్లో రెండేళ్ల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో చండీమల్ ఎట్టకేలకు సెంచరీ మార్కు తాకాడు. చండీమల్ 2022, మేలో చివరిసారిగా (బంగ్లాదేశ్‌పై) టెస్ట్‌ల్లో మూడంకెల స్కోర్ చేశాడు. చండీమల్కు ఈ సెంచరీ చాలా ప్రత్యేకం. చండీమల్ సెంచరీ చేసిన తొమ్మిదో దేశం న్యూజిలాండ్. చండీమల్ తన కెరీర్లో ఇప్పటివరకు తొమ్మిది వేర్వేరు దేశాలపై (బంగ్లాదేశ్‌పై 5, భారత్‌పై 2, ఆస్ట్రేలియాపై 2, వెస్టిండీస్‌పై 2, ఇంగ్లండ్‌పై 1, ఆఫ్ఘనిస్తాన్పై 1, ఐర్లాండ్‌పై 1, పాకిస్తాన్‌పై 1, న్యూజిలాండ్‌పై 1) 16 సెంచరీలు చేశాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (1), దిముత్ కరుణరత్నే (46) ఔట్ కాగా.. చండీమల్ (106), ఏంజెలో మాథ్యూస్ (35) క్రీజ్‌లో ఉన్నారు. నిస్సంక వికెట్ సౌథీకి దక్కగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు. చదవండి: మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్‌మైర్ -
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. రాణించిన కరుణరత్నే, చండీమల్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక పట్టు సాధించే దిశగా ముందుకెళ్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 202 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.రాణించిన కరుణరత్నే, చండీమల్కరుణరత్నే (83), చండీమల్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది పడింది. పథుమ్ నిస్సంక (2) ఆదిలోనే ఔటైనా వీరిద్దరు రెండో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఏంజెలో మాథ్యూస్ (34), ధనంజయ డిసిల్వ (34) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కమిందు మెండిస్ తక్కువ స్కోర్‌కే (13) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టిన విలియమ్ ఓరూర్కీ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టాడు. అజాజ్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.లీడ్ సాధించిన న్యూజిలాండ్అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.కమిందు సెంచరీ.. ఐదేసిన రూర్కీకమిందు మెండిస్ సెంచరీతో (114) కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేయగలిగింది. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీతో రాణించాడు. నిస్సంక (27), చండీమల్ (30), మాథ్యూస్‌లకు (36) మంచి స్టార్ట్ లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. కెరీర్లో రెండో టెస్ట్ ఆడుతున్న రూర్కీ ఐదు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టాడు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా -
చెలరేగిన చండీమాల్.. 225 పరుగుల లక్ష్యం హాం ఫట్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ఇవాళ (జులై 9) రసవత్తర సమరం జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని క్యాండీ ఫాల్కన్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. పథుమ్ నిస్సంక శతక్కొట్టండతో (59 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.జాఫ్నా ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించాడు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం 225 పరుగుల భారీ లక్ష్య ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ ఆది నుంచే దూకుడుగా ఆడింది. దినేశ్ చండీమాల్ (37 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కమిందు మెండిస్ (36 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (13 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ హరీస్ (18 బంతుల్లో 25; 5 ఫోర్లు) బ్యాట్‌ను పని చెప్పారు. ఫలితంగా క్యాండీ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది. -
52 బంతుల్లో శతక్కొట్టిన లంక ఓపెనర్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మూడో సెంచరీ (టిమ్ సీఫర్ట్, కుశాల్ పెరీరా) నమోదైంది. క్యాండీ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ పథుమ్ నిస్సంక సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిస్సంక మెరుపు శతకంతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది.52 బంతుల్లోనే శతక్కొట్టిన నిస్సంకనిస్సంక కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొన్న నిస్సంక 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేసి ఔటయ్యాడు. నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించడంతో జాఫ్నా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. జాఫ్నా ఇన్నింగ్స్‌లో నిస్సంక, రొస్సో మినహా చెప్పుకోదగ్గ స్కోర్లు ఎవరూ చేయలేదు. కుశాల్ మెండిస్ 26, అవిష్క ఫెర్నాండో 16, కెప్టెన్ చరిత్ అసలంక 2, అజ్మతుల్లా 1, వనుజ సహన్ 0 పరుగులకే ఔటయ్యారు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో క్యాండీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దినేశ్ చండీమాల్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఆండ్రీ ఫ్లెచర్ (13), మొహమ్మద్ హరీస్ (25) ఔట్ కాగా.. చండీమాల్తో (32 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) పాటు కమిందు మెండిస్ (16) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో క్యాండీ గెలవాలంటే 48 బంతుల్లో 88 పరుగులు చేయాల్సి ఉంది. -
5 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వచ్చీ రావడంతోనే సెంచరీ, మొత్తం నలుగురు..!
2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య శ్రీలంక భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 386/4 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించి, 591/6 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆటలో కెప్టెన్ దిముత్ కరుణరత్నే (179), వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (140) భారీ శతకాలు బాదగా.. రెండో రోజు దినేశ్ చండీమాల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104 నాటౌట్) శతక్కొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు సాధించగా.. టెస్ట్‌ల్లో శ్రీలంక ఈ ఫీట్‌ను సాధించడం ఇది నాలుగోసారి. కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సదీరా సమరవిక్రమ ఓ అరుదైన ఘనత సాధించాడు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత లంక టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సమరవిక్రమ.. వచ్చీరాగానే శతకం బాదాడు. ఈ మ్యాచ్‌కు ముందు 4 టెస్ట్‌లు ఆడి కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో జట్టులో చోటు కోల్పోయిన సమర.. ఐర్లాండ్‌తో తొలి టెస్ట్‌లో 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో తొలి సెంచరీ నమోదు చేశాడు. సనత్ జయసూర్య, ఏంజెలో మాథ్యూస్ సరసన చండీమాల్.. రెండో రోజు ఆటలో సెంచరీ చేసిన దినేశ్ చండీమాల్, కెరీర్లో 14వ శతకాన్ని నమోదు చేసి లంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య సరసన చేరాడు. టెస్ట్‌ల్లో లంక తరఫున జయసూర్యతో పాటు ఏంజెలో మాథ్యూస్ కూడా 14 సెంచరీలు బాదారు. తొలి రోజే కెప్టెన్ దిముత్ కరుణరత్నే కెరీర్లో 15వ సెంచరీ నమోదు చేసి, జయసూర్య, మాథ్యూస్‌ల రికార్డును అధిగమించాడు. శ్రీలంక తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16), కరుణరత్నే (15) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. వీరి తర్వాత జయసూర్య, మాథ్యూస్‌లతో కలిసి చండీమాల్ ఏడో ప్లేస్‌లో ఉన్నాడు. 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. రెండో రోజు లంచ్ తర్వాత లంక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్నోయింది. అనంతరం అదే ఓవర్లో రెండో వికెట్ కూడా కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. విశ్వ ఫెర్నాండో బౌలింగ్ ముర్రే కొమిన్స్ (0), కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (4) ఔటయ్యారు. 12 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 35/2గా ఉంది. -
తిప్పేసిన స్పిన్నర్లు.. రెండో టెస్ట్‌పై పట్టుబిగిస్తున్న లంకేయులు
తొలి టెస్ట్‌లో పాక్ చేతిలో దారుణంగా ఓడి కసితో రగిలిపోతున్న శ్రీలంక.. రెండో టెస్ట్‌పై పట్టుబిగిస్తుంది. లంక స్పిన్నర్లు రెచ్చిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో ఉంది. 315 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను (తొలి ఇన్నింగ్స్) ప్రారంభించిన శ్రీలంక.. మరో 63 పరుగులు జోడించి 378 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ డిక్వెల్లా (51) అర్ధసెంచరీతో రాణించగా.. రమేశ్ మెండిస్ (35) పర్వాలేదనిపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. లంక స్పిన్నర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్ట్‌లో అజేయ శతకంతో పాక్‌ను గెలిపించిన అబ్దుల్లా షఫీక్ ఈ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (32), కెప్టెన్ బాబర్ ఆజమ్ (16), వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (24), ఫవాద్ ఆలం (24) లు విఫలం కాగా.. మిడిలార్డర్ ఆటగాడు అఘా సల్మాన్ (62) లంక స్పిన్నర్లకు కాసేపు ఎదురొడ్డాడు. సల్మాన్‌ను ప్రభాత్ జయసూర్య అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించడంతో రెండో రోజు ఆట ముగిసింది. రమేశ్ మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీసి పాక్‌ను కష్టాల్లోకి నెట్టారు. ప్రస్తుతం పాక్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రోజు లంక ఆటగాళ్లు ఒషాడో ఫెర్నాండో (50), చండీమల్ (80) అర్ధసెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే. చదవండి: సూపర్ ఫామ్‌ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి -
సూపర్ ఫామ్‌ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి
గాలే వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 24) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో లంక బ్యాటర్లు సత్తా చాటారు. కుశాల్ మెండిస్ (3) మినహా టాపార్డర్ మొత్తం రాణించడంతో తొలి రోజు శీలంకదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పాక్ బౌలర్ల ప్రభావం నామమాత్రంగా ఉండటంతో లంక బ్యాటర్లు సత్తా చాటారు. Dinesh Chandimal scores his 4th consecutive fifty in Tests. What a purple patch he's having, just been too good. pic.twitter.com/b1mDrKM6ev — Mufaddal Vohra (@mufaddal_vohra) July 24, 2022 ఓపెనర్లు ఒషాడో ఫెర్నాండో (50), దిముత్ కరుణరత్నే (40) తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించగా.. ఆ తర్వాత వచ్చిన శతక టెస్ట్‌ల వీరుడు ఏంజెలో మాథ్యూస్ (42), ధనంజయ డిసిల్వా (33) ఓ మోస్తరుగా రాణించారు. గత కొంతకాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న దినేశ్ చండీమల్ (80) వరుసగా నాలుగో ఇన్నింగ్స్‌లోనూ (206*, 76, 94*, 80) హాఫ్ సెంచరీ బాది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆట చివరి సెషన్లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్వెల్లా (42 నాటౌట్) మెరుపు వేగంతో పరుగులు సాధించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డిక్వెల్లాకు జతగా దునిత్ వెల్లాలగే (6) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, నౌమాన్ అలీ, యాసిర్ షా తలో వికెట్ సాధించారు. కుశాల్ మెండిస్‌ను అఘా సల్మాన్ రనౌట్ చేశాడు. చదవండి: టెస్ట్ క్రికెట్లో అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్ -
షఫీక్ సూపర్ సెంచరీ.. లంకపై పాక్ ఘన విజయం
శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160) అజేయమైన శతకంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోని వెళ్లింది. లంక నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 222/3 స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. అబ్దుల్లా షఫిక్ (406 బంతుల్లో 160; 7 ఫోర్లు, సిక్సర్).. మహ్మద్ నవాజ్ (34 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్) సహకారంతో పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో చండీమాల్ (76) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 4, హసన్ అలీ, యాసిర్ షా చెరో 2 వికెట్లు, నసీమ్ షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బాబర్ ఆజమ్ వీరోచిత సెంచరీ (119) సహకారంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసి ఆలౌటైంది. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/82) పాక్‌కు దారుణంగా దెబ్బకొట్టాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (94 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) 6 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం కలుపుకుని లంక మొత్తంగా 342 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో పాక్ మొదట్లో తడబడినప్పటికీ షఫీక్, కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) ఆదుకున్నారు. వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (40) కూడా జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. వీరిద్దరూ ఔటైనా షఫీక్ టెయింలెండర్ల సహకారంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య (4/135) రాణించాడు. చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
రాణించిన మెండీస్,చండిమాల్.. శ్రీలంక స్కోర్: 329/9
గాలె: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 36/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 329 పరుగులు సాధించింది. దాంతో లంక ఓవరాల్ ఆధిక్యం 333 పరుగులకు చేరింది. ఇక చండీమాల్(86 బ్యాటింగ్),జయసూర్య(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా అంతకుమందు లంక బ్యాటర్లు కుశాల్ మెండీస్(76),ఫెర్నాండో(64), పరుగులతో రాణించారు. ఇక పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 5 వికెట్లు పడగొట్టగా..యాసిర్ షా మూడు, హాసన్ అలీ ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: Ben Stokes: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం! -
చెలరేగిన షాహిన్ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక
శ్రీలంక, పాకిస్తాన్ మధ్య గాలేలో శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో ఒకే రోజు 12 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 66.1 ఓవర్లలో 222 పరుగులకే కుప్పకూలింది. దినేశ్ చండిమాల్ (115 బంతుల్లో 76; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మహీశ్ తీక్షణ (38), ఒషాదా ఫెర్నాండో (35) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...హసన్ అలీ, యాసిర్ షా చెరో 2 వికెట్లు తీశారు. అయితే వెంటనే కోలుకున్న లంక ప్రత్యర్థిని దెబ్బ తీసింది. ఆట ముగిసే సమయానికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. షఫీఖ్ (13), ఇమామ్ (2) వెనుదిరగ్గా... ప్రస్తుతం అజహర్ అలీ (3), బాబర్ ఆజమ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం
ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతూ అట్టుడుకుతున్న ద్వీప దేశం శ్రీలంకకు భారీ ఊరట లభించే వార్త ఇది. గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో లంక జట్టు పటిష్టమైన కంగారూలను ఖంగుతినిపించి 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దినేశ్ చండీమాల్ (206) అజేయ ద్విశతకంతో, అరంగేట్రం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 12 వికెట్లతో (6/118, 6/59) చెలరేగి శ్రీలంకకు చారిత్రక విజయాన్ని అందించారు. నాలుగో రోజు ఆటలో వీరిద్దరితో పాటు రమేశ్ మెండిస్ (2/47), మహీశ్ తీక్షణ (2/28) కూడా రాణించడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 10 wicket haul on a debut ✔️Best figures by a Sri Lankan on a debut ✔️Dream debut for Prabath Jayasuriya 🤩#SLvAUS pic.twitter.com/BeAg9pMZNv— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 For his brilliant performance, Dinesh Chandimal has been named the Player of the Series 👏#SLvAUS pic.twitter.com/VZIIFDSNF1— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 జయసూర్య స్పిన్ మాయాజాలం ధాటికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. లబూషేన్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 431/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే, ఆసీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక.. ఆతర్వాత వన్డే సిరీస్‌ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. చదవండి: SL Vs Aus: చండిమాల్ డబుల్ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు! -
SL Vs Aus: చండిమాల్ డబుల్ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు!
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ దినేశ్ చండిమాల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కెరీర్లో తొలిసారిగా ద్విశతకం నమోదు చేశాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా చండిమాల్ 206 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 326 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా టెస్టుల్లో చండిమాల్‌కు ఇది మొదటి ద్విశతకం. సిక్సర్‌తో ఈ ఫీట్ నమోదు చేయడం గమనార్హం. అదే విధంగా ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు నమోదు చేసిన శ్రీలంక ఆటగాడిగా అతడు నిలిచాడు. ఇక చండిమాల్ అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో ఆతిథ్య శ్రీలంక 554 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ నేపథ్యంలో చండిమాల్‌పై సోషల్ మీడియా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నిన్న రాత్రి సూర్యకుమార్ యాదవ్.. ఈరోజు చండిమాల్.. వేర్వేరు ఫార్మాట్లు.. వేర్వేరు శైలి.. కానీ ఎంతో ఆసక్తిగా మ్యాచ్‌ను తిలకించేలా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు’’ అంటూ ఇండియా- ఇంగ్లండ్ మూడో టీ20, ఆసీస్-లంక టెస్టు మ్యాచ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఇతర ఆటగాళ్లు, నెటిజన్లు సైతం చండిమాల్‌ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా మూడు టీ20లు, 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. టీ20 సిరీస్ పర్యాటక ఆసీస్ సొంతం కాగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య లంక కైవసం చేసుకుంది. ఇక మొదటి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో లంక గట్టిపోటీనిస్తోంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా నాలుగో రోజు ఆటలో లంక బౌలర్ ప్రభాత్ జయసూర్య బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ 151 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు: టాస్: ఆస్ట్రేలియా- బ్యాటింగ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 364-10 (110 ఓవర్లు) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 554-10 (181 ఓవర్లు) ఆసీస్ రెండో ఇన్నింగ్స్: ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 151-10 (41 ఓవర్లు) చదవండి: Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో! Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... Dinesh Chandimal has torn strips off the Aussie attack, scoring an unbeaten 206* - bringing up his double century with two huge sixes, one of which ended up on the streets of Galle 🇱🇰🏏 LATEST 👉 https://t.co/pOShHsRakQ pic.twitter.com/AuBg6KpuIR — Telegraph Sport (@telegraph_sport) July 11, 2022 Dinesh Chandimal Completed his 200 with a Sixxxx #SLvAUS 🇱🇰#Dineshchandimal #lka #SLC #LKA pic.twitter.com/QXZHncw1fX — Talk True With ME (@TalkTrueWithME) July 11, 2022 -
చండీ'క'మాల్ శతకం.. ఆసీస్‌పై లంక పైచేయి
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక పైచేయి సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ దినేశ్ చండీమాల్ అజేయ శతకంతో (118) చెలరేగడంతో ఆతిధ్య జట్టు 67 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. చండీమాల్తో పాటు రమేశ్ మెండిస్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్‌లో చండీమాల్ కాకుండా మరో నలుగురు హాఫ్‌సెంచరీలు సాధించారు. 💯Dinesh Chandimal brings up his 13th Test hundred, reaching the mark in 195 balls 🙌#SLvAUS pic.twitter.com/zLiBKUylBI— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 10, 2022 కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (85), ఏంజలో మాథ్యూస్ (52), కమిందు మెండిస్ (61)లు శ్రీలంక భారీ స్కోర్ సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, మిచెల్ స్వెప్సన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. లంక అరంగేట్రం బౌలర్ ప్రభాత్ జయసూర్య 6 వికెట్లతో ఆసీస్‌ను తిప్పేశాడు. చదవండి: టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 82 పరుగులు..! -
ఏ ముహుర్తానా సిరీస్ ప్రారంభమయిందో.. ఇషాన్ కిషన్ తలకు గాయం
ఏ ముహుర్తానా టీమిండియా, శ్రీలంక సిరీస్ ప్రారంభమైందో తెలియదు కానీ ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. సిరీస్ ప్రారంభానికి ముందే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, సూర్యకుమార్‌లు దూరమయ్యారు. తొలి టి20 తర్వాత రుతురాజ్ కూడా గాయంతో వైదొలిగాడు. తాజాగా టీమిండియా టి20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్ రెండో టి20 మ్యాచ్‌లో గాయపడ్డాడు. టీమిండియా బ్యాటింగ్ సమయంలోనే ఇషాన్ తలకు గాయమైంది. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో లాహిరు కుమారా 147. 6 కిమీ వేగంతో బౌన్సర్ వేశాడు. దానిని డిఫెండ్ చేసే క్రమంలో ఇషాన్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. క్రీజు నుంచి పక్కకు వెళ్లిన ఇషాన్ హెల్మెల్ తీసిన తలను చూసుకున్నాడు. ఇంతలో ఫిజియో వచ్చి ఇషాన్‌ను పరిశీలించాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో మ్యాచ్‌లో కంటిన్యూ అయ్యాడు. ఇక ఈ యువ ఓపెనర్ 16 పరుగులు చేసి లాహిరు కుమారా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే బీసీసీఐ ఇషాన్ కిషన్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం తగిలిందా లేక సాధారణమేనా అన్న కోణంలో సిటీస్కాన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితం ఆదివారం రానుంది. ఇప్పటికైతే ఇషాన్ బాగానే ఉన్నాడని.. అబ్జర్వేషన్లో ఉంచామని డాక్టర్ శుభమ్ తెలిపారు. చదవండి: Ishan Kishan: ఊచకోత అంటే ఇదే.. పూనకం వచ్చినట్లు ఆడాడు ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ మూడో టి20 ఆడేది అనుమానంగా మారింది. అతను ఆడకపోతే రోహిత్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ మూడో టి20లో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇదే మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు దినేష్ చండిమల్ గాయం బారిన పడ్డాడు. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ సందర్భంగా చండిమల్ బొటనవేలుకు గాయమైంది. దీంతో చండిమల్ కూడా కంగ్రా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. వేలికి స్కానింగ్ నిర్వహించామని.. రిపోర్ట్స్ రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా మెరుపులతో 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశారు. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. చదవండి: Rohit Sharma: టి20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త రికార్డు Ishan Kishan: ఇషాన్ అరుదైన ఫీట్.. ధోని, పంత్‌లకు సాధ్యం కాలేదు pic.twitter.com/QhV1bsmuLC — Sports Hustle (@SportsHustle3) February 26, 2022 -
రీఎంట్రీ ఇచ్చాడు.. 'తగ్గేదేలే' అన్నాడు
1st T20 IND Vs SL: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో టి20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశం రానప్పటికి.. బౌలింగ్‌లో జడ్డూ తన మార్క్‌ను చూపించాడు. 4 ఓవర్లు వేసిన జడేజా 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 10 పరుగులు చేసిన వికెట్ కీపర్ చండిమల్‌ను ఔట్ చేసిన జడేజా 'అల్లుఅర్జున్ 'పుష్ప''ను అనుకరించాడు. ఇషాన్ కిషన్ స్టంప్ ఔట్ చేయగానే.. జడేజా తన చేతితో గడ్డాన్ని నిమురుతూ తగ్గేదే లే(మై జూకేకా నహీ) అనడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప సినిమా వచ్చి మూడు నెలల కావొస్తున్నా.. దాని ఇంపాక్ట్ మాత్రం ఇప్పటికి పోవడం లేదు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు. చదవండి: 'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్‌కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే' Ishan Kishan: ఇషాన్ అరుదైన ఫీట్.. ధోని, పంత్‌లకు సాధ్యం కాలేదు Ravindra Jadeja be like:- Jhukega nahi saala #IndianCricketTeam #IndvsSL #CricketLive #GAMEDAY pic.twitter.com/Sbl7H2Pdbn — Rutuja Umale (@rutuja_umale) February 24, 2022 -
ఓపెనర్‌గా వచ్చి నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు
కొలంబొ: శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. తొలి టీ20లో దక్షిణాఫ్రికా 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మక్రమ్ 48 పరుగులతో ఆకట్టుకోవడం.. ఓపెనర్లు డికాక్ 36 పరుగులు, హెండ్రిక్స్ 38 పరుగులుతో రాణించడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు తీయగా.. చమీరా, తీక్షణ, దాసున్ షనక తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Pak Vs NZ: ఆ సిరీస్‌లో నో డీఆర్ఎస్.. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ దినేష్ చండిమల్ (66 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు వికెట్లు తీయకపోయినప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక పరుగులు చేయలేకపోయింది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకముందు జరిగిన వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. చదవండి: India Tour Of South Africa: ఈసారైనా నెగ్గుకొచ్చేనా..? -
బెయిర్ స్టో ప్రతీకారం.. ట్విస్ట్ ఏంటంటే
లండన్: క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్‌గా పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి ఆటలో వివాదాలు.. స్లెడ్జింగ్‌లు సాధారణంగా మారిపోయాయి. ఆటలో సందర్భంగా ఒక్కోసారి జరిగే సంఘటనలు ఫన్నీగా ఉంటూనే సిరీయస్‌గా కనిపిస్తాయి. తాజాగా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో మ్యాచ్‌లో తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. తాను అవుటవ్వడానికి కారణమైన ఆటగాడిని వదిలేసి మరొక ఆటగాడిపై స్లెడ్జింగ్‌కు దిగి అతని ఔట్‌కు కారణమయ్యాడు. ఈ ఘటన ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టెస్టులో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. గాలే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో జానీ బెయిర్ స్టోపై లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా స్లెడ్జింగ్‌కు దిగాడు. 'ఇండియా టూర్‌కు ఎంపిక కాలేకపోయావు.. కానీ ఐపీఎల్ ఆడేందుకు మాత్రం వెళ్తావు.. కేవలం డబ్బుల కోసమే ఆడతావా అంటూ' ట్రోల్ చేశాడు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన బెయిర్ స్టో 28 పరుగుల వద్ద క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. స్లెడ్జింగ్‌కు దిగి తనను అవుట్ చేశారన్న కోపంతో ఉన్న బెయిర్ స్టో అనువైన సమయం కోసం వేచి చూశాడు. చదవండి: 'గిల్ తల దించుకొని ఆడితే బాగుంటుంది' Bairstow: Come on Chandi, throw your wicket away! Chandimal: Say less ❤️#SLvENG pic.twitter.com/znPUZrkWBA — sonali (@samtanisonali1) January 25, 2021 ఈ దశలో లంక రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన లంక కెప్టెన్ దినేష్ చండిమల్‌ను టార్గెట్ చేస్తూ బెయిర్ స్టో స్లెడ్జింగ్‌కు దిగాడు. 'కమాన్ చండీ.. నీ వికెట్‌ను త్వరగా పోగొట్టుకొని పెవిలియన్‌కు వెళ్లిపో అంటూ' పేర్కొన్నాడు. అండర్సన్ వేసిన బంతిని చండిమల్ గాల్లోకి లేపగా.. లాంగాఫ్‌లో ఉన్న జాక్ లీచ్ వెనుకకు పరిగెడుతూ అద్భుతక్యాచ్ అందుకున్నాడు. దీంతో చండిమల్ నిరాశగా క్రీజను వదిలిపెట్టి పెవిలియన్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలను ట్విటర్లో షేర్ చేయగా.. వైరల్‌గా మారాయి. చదవండి: మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే 'బెయిర్ స్టో ప్రతీకారం బాగానే ఉంది.. కానీ వేరొక క్రికెటర్ బలి కావడం బాధగా అనిపించిందని కొందరు పేర్కొంటే.. దెబ్బకు దెబ్బ తీయడం అంటే ఇదే అంటూ' మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. Dickwella’s sledge work against bairstow 😂😂 “ Dropped from the India tour, but going to play the ipl, playing for cash only “ 😂😂 pic.twitter.com/d5zw36ij3h — rizwan (@rizwan68301915) January 24, 2021 -
చండిమాల్‌పై వేటు
కొలంబో: ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ వరకు శ్రీలంక కెప్టెన్‌గా వ్యవహరించిన దినేశ్ చండిమాల్‌కు తర్వాతి సిరీస్‌కు జట్టులోనే చోటు లభించలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే లంక జట్టులో చండిమాల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. ఈ సిరీస్‌కు దిముత్ కరుణరత్నే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 0–2తో లంక ఓడిన సిరీస్‌లో చండిమాల్ వరుసగా 5, 0, 15, 4 స్కోర్లు చేశాడు. దాంతో దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్‌లోకి రావాలని అతనికి సెలక్టర్లు తేల్చి చెప్పారు. మరోవైపు సఫారీ పర్యటనకు నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటిచ్చారు. బ్యాట్స్మెన్లు ఏంజెలో పెరీరా, ఒషాడా ఫెర్నాండోలతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్డెనియా, పేస్ బౌలర్ మొహమ్మద్ షిరాజ్‌లకు తొలిసారి అవకాశం లభించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 13 నుంచి డర్బన్‌లో తొలి టెస్టు జరుగుతుంది. -
కెప్టెన్సీ నుంచి మాథ్యూస్‌కు ఉద్వాసన
కొలంబో: ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన శ్రీలంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్‌పై వేటు పడింది. వన్డే, టి20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి మాథ్యూస్‌ను తప్పిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తెలిపింది. దుబాయ్, అబుదాబిల్లో జరుగుతున్న ఆసియా కప్‌లో లంక అనూహ్యంగా తక్కువ ర్యాంకులో ఉన్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న సంగతి తెలిసిందే. దీంతో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన కోసం అతని స్థానంలో దినేశ్ చండిమాల్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇప్పటికే అతను టెస్టులకు సారథ్యం వహిస్తున్నాడు. తాజాగా ఇక మూడు ఫార్మాట్లకు అతనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత రెండేళ్లలోనే లంక బోర్డు వన్డేల్లో ఆరు మంది కెప్టెన్లను మార్చింది. టెస్టుల్లో, టి20ల్లో నలుగురు చొప్పున కెప్టెన్లను మార్చింది. వన్డేల్లో అసలు స్థిరమైన నాయకత్వమే లేకుండా తరంగ, మాథ్యూస్, కపుగెడెర, మలింగ, తిసారా పెరీరా, చండిమాల్‌లను తరచూ మార్చేసింది. బలిపశువును చేశారు... ఆసియా కప్ వైఫల్యానికి తనను ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ బలిపశువును చేయడం అన్యాయమని మాథ్యూస్ ఆరోపించాడు. ఆ టోర్నీలో అంతా విఫలమైనపుడు తాను మాత్రం చేయగలిగేదేమి లేదని అన్నాడు. తాజా పరిస్థితులపై కలత చెందానని రిటైర్మెంట్ ప్రకటిస్తానని బోర్డును ఉద్దేశించి హెచ్చరించాడు. -
ఆసియాకప్: శ్రీలంకకు ఎదురుదెబ్బ
కొలంబో: ఆసియా కప్ ప్రారంభానికి ముందే శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లంక టెస్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ ఆసియా కప్‌కు దూరం కానున్నాడు. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. దేశవాళీ టోర్నీలో వేలికి అయిన గాయం నుంచి ఇంకా చండిమాల్ పూర్తిగా కోలుకోలేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. దాంతో అతడి స్థానంలో నిరోషన్ డిక్వెలా చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్‌లో దినేశ్ చండీమాల్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలంక తరుపున చండిమాల్ ఇప్పటివరకు 32.69 యావరేజితో 3000కుపైగా పరుగులు చేశాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో చండిమాల్‌పై ఆరు మ్యాచ్‌ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. దాంతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో చండిమాల్ చోటు కోల్పోయాడు. అయితే ఆసియాకప్‌లో పాల్గొనే జట్టులో చండిమాల్‌కు స్థానం కల్పించినప్పటికీ, చివరి నిమిషంలో గాయం కారణంగా అతనికి మరింత విశ్రాంతి అవసరమని ఆ జట్టు మెడికల్ టీమ్ తేల్చిచెప్పింది. దాంతో ఆసియాకప్‌కు చండిమాల్ దూరం కాగా, స్టాండ్ బైగా ఉన్న డిక్వెల్లా 16 మంది సభ్యులతో కూడిన బృందంలో చోటు దక్కింది. ఈ నెల 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ ప్రారంభం కానుంది. -
శ్రీలంక కెప్టెన్‌కు ఐసీసీ భారీ షాక్!
శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. చండిమాల్‌తో పాటు కోచ్ చందికా హతురుసింఘే, మేనేజర్ అశంకా గురుసిన్హాలపై నాలుగు వన్డేలు, రెండు టెస్టుల నిషేధాన్ని విధించింది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘన కింద తీవ్ర నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఐసీసీ ప్రతినిధి హాన్ మైఖెల్ బెలాఫ్ తెలిపారు. ఈ ముగ్గురు 8 సస్పెన్షన్ పాయింట్లు ఎదుర్కొంటున్నారని, ఈ క్రమంలో తీవ్రంగా పరిగణించామని ఐసీసీ ప్రకటించింది. ఈ నిషేధంతో దినేష్ చండిమాల్, కోచ్ చందికా హతురుసింఘే, మేనేజర్ అశంకా గురుసిన్హాలు దక్షిణాఫ్రికాతో జరగనున్న 4 వన్డేలు, 2 టెస్టుల నుంచి వీరిని తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సెయింట్ లూసియాలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఆట ఆరంభంలో మైదానంలోకి రాకుండా సమయం వృథా చేశారని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆరోజు ఆట రెండున్నర గంటలపాటు ఆలస్యమైందని తెలిపారు. దాంతో పాటుగా ఇటీవల విండీస్‌తో రెండో టెస్టులో భాగంగా చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు తేలిందని రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నారు. -
4 గంటల విచారణ.. చండిమాల్‌కు చుక్కెదురు
గ్రాస్ ఐలెట్: తనపై విధించిన టెస్టు మ్యాచ్ సస్పెన్షన్‌ను సవాల్ చేసిన శ్రీలంక క్రికెట్ కెప్టెన్ చండిమాల్‌కు చుక్కెదురైంది. ఈ మేరకు మిచెల్ బెలాఫ్ నేతృత్వలోని ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిషన్.. చండిమాల్ అప్పీల్‌ను కొట్టేసింది. శుక్రవారం నాలుగు గంటల పాటు చండిమాల్‌ను విచారించిన తర్వాత సదరు జ్యుడిషియల్ కమిషన్ అతని అప్పీల్లో ఎటువంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. దాంతో చండిమాల్‌కు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఒక మ్యాచ్ సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా యథావిధిగా అమలవుతుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. చండిమాల్ సస్పెన్షన్‌పై ఎటువంటి మార్పు లేకపోవడంతో వెస్టిండీస్‌తో జరుగనున్న చివరిదైన మూడో టెస్టుకు అతను దూరం కానున్నాడు. విండీస్‌తో రెండో టెస్టులో భాగంగా చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘అతను నోటిలో ఏదో పదార్థాన్ని వేసుకొని నమిలి దాని ద్వారా ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు.. ఇదంతా వీడియో ఫూటేజీలో పరిశీలించిన తర్వాతే అతనిపై చర్యలు తీసుకున్నట్లు’ రిఫరీ తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారమే అతనిపై అభియోగాలు మోపి నిర్ధారించుకున్న తర్వాతే ఒక టెస్టు సస్పెన్షన్ విధించినట్లు వివరించారు. కాగా, తాను ఏ తప్పు చేయలేదని వాదించిన చండిమాల్.. రిఫరీ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లాడు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిషన్.. చండిమాల్ అప్పీల్‌ను తిరస్కరించింది. కెప్టెన్‌గా లక్మల్.. ట్యాంపరింగ్ కారణంగా లంక రెగ్యులర్ కెప్టెన్ చండిమాల్ విండీస్‌తో మూడో టెస్టుకు దూరం కానున్న నేపథ్యంలో అతని స్థానంలో లక్మల్‌ను సారథిగా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మూడో టెస్ట మ్యాచ్‌కు లక్మల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయాన్ని ఎస్ఎల్సీ ఓ ప్రకటనలో తెలిపింది. విండీస్‌తో టెస్టు మ్యాచ్‌కు వెటరన్ రంగనా హెరాత్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఎస్ఎల్సీ తొలుత భావించినా, అతను గాయం కారణంగా ఆఖరి టెస్టులో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాంతో చండిమాల్ స్థానంలో సీమర్ లక్మల్‌ను కెప్టెన్‌గా నియమించారు. -
సస్పెన్షన్‌పై చండిమాల్ అప్పీల్
గ్రాస్ ఐలెట్: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్‌పై ఒక టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు చండిమాల్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత పడింది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో చండిమాల్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో అతనిపై టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో అతను వెస్టిండీస్‌తో మూడో టెస్టుకు దూరం కానున్నాడు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి చండిమాల్ అప్పీలు చేశాడు. బంతి ఆకారాన్ని మార్చేందుకు తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదంటూ తనపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘అతను నోటిలో ఏదో పదార్థాన్ని వేసుకొని నమిలి దాని ద్వారా ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు.. ఇదంతా వీడియో ఫూటేజీలో పరిశీలించిన తర్వాతే అతనిపై చర్యలు తీసుకున్నట్లు’ రిఫరీ తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారమే అతనిపై అభియోగాలు మోపి నిర్ధారించుకున్న తర్వాతే ఒక టెస్టు సస్పెన్షన్ విధించినట్లు వివరించారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ కూడా మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్నే సమర్థించారు. రిఫరీ అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో చండిమాల్ ఐసీసీకి అప్పీలు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండొకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.