-
లెహంగా లుక్కే వేరు! ధరిస్తే ఏ వేడుకైనా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే!
టాప్ వేడుకలలో ప్రత్యేకంగా వెలిగిపోవాలన్నా.. యంగ్లుక్తో మెరిసిపోవాలన్నా.. ఆధునికతతో జోడీ కట్టాలన్నా.. సంప్రదాయంతో జత చేరాలన్నా ..అన్నింటికీ ఒకే ఆన్సర్‌గా సమాధానం లెహంగా టాప్ అనేది నవతరం మాట. దానికి తగ్గట్టు ఇండోవెస్ట్రన్ లుక్‌తో మెరిసిపోయే ఈ డిజైన్స్ రానున్న పెళ్లిళ్ల సీజన్‌కు మరింత వైవిధ్యంగా ముస్తాబై రానున్నాయి. ఏ పట్టు, జార్జెట్, బ్రొకేడ్... మెటీరియల్ ఏదైనా లెహంగా గ్రాండ్‌గా వెలిగిపోతుంది. దానిమీదకు ధరించే టాప్ మాత్రం కాలర్టైప్, పెప్లమ్, సింగిల్ షోల్డర్ .. వంటి డిజైన్స్ అయితే మోడర్న్‌గా ఆకట్టుకోవచ్చు. సంప్రదాయ వేడుకలకు ప్రత్యేక కళను తీసుకురావచ్చు. ఏ లెహంగా టాప్ ఒకే కలర్లో ఎంచుకున్నప్పుడు దానికి తగిన ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్, మెటీరియల్‌ను బట్టి స్పెషల్‌గా క్రియేట్ చేయచ్చు. ఏ ప్లెయిన్ కాలర్ నెక్ టాప్ ఎంచుకున్నప్పుడు కొద్దిపాటి ఎంబ్రాయిడరీ డిజైన్‌తో మెరిపించవచ్చు. దీనికి ప్లెయిన్ లెహంగా లేదా ప్రింటెడ్ లెహంగా సరైన కాంబినేషన్ అవుతుంది. ఏ గ్రాండ్‌గా ఉన్న లెహంగాకి సింగిల్ షోల్డర్ కేప్ స్టైల్ టాప్ ప్రత్యేకతను తీసుకువస్తుంది. (చదవండి: పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!) -
బాక్టిరియాతో డ్రెస్సింగ్.. గాయలను త్వరగా తగ్గిస్తుంది!
మన శరీరంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే బ్యాండేజీ వేసుకుంటాం. ఇక గాయం మానడానికి చాలా రోజులే పడుతుంది. ఈ క్రమంలో బాక్టీరియా చేరకుండా వైద్యుల సూచనతో డ్రెస్సింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ కొత్తరకమైన డ్రెస్సింగ్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఏకంగా గాయాన్ని మాయం చేస్తుందట. దీర్ఘకాలిక గాయాలకు చికిత్స చేస్తున్నప్పుడు వాటికి బాక్టీరియా దరిచేరకుండా నిత్యం డ్రెస్సింగ్ చేయడం మనకు తెలిసిందే. అయితే ప్రతిసారి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు పేషెంట్స్‌కి నొప్పి కలగడం సహజమే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్తరకం డ్రెస్సింగ్ గాయాలను త్వరగా మానేలా చేస్తుందట. గాయపడిన ప్రాంతంలో నొప్పి కలిగించే బయోఫిల్మ్‌లను నాశనం చేసేలా MIT, స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్. కున్ రెన్ నేతృత్వంలోని సైంటిస్టులు బయో-కె+ అనే అక్వాసెల్ను కనుగొన్నారు. ఇందులో మూడు రకాల లాక్టోబాసిల్లి ప్రోబయోటిక్ అనే బాక్టిరియా ఉంటుందట. ఇది బయోఫిల్మ్ pH స్థాయిపై దాడిచేసి దానిని నాశనం చేస్తుందట. ఈ కొత్తరకమైన డ్రెస్సింగ్ టెక్నాలజీతో 99.999% వ్యాధికారకాలను చంపేసి గాయం తాలూకూ నొప్పిని తగ్గించిందని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఇందులోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా..గాయాన్ని త్వరగా మానేలా చేయడమే కాకుండా కొత్త చర్మం రావడానికి సహాయపడిందని సైంటిస్టులు తెలిపారు. -
చీరకట్టు.. ఇలా స్టైల్ చేసుకుంటే పార్టీలో హైలైట్ అవ్వాల్సిందే
ఎవర్గ్రీన్ డ్రెస్‌గా ఎప్పటికీ శారీ ముందు వరసలో ఉంటుందని తెలిసిందే. అయితే, చీరకట్టు అందం గురించి రొటీన్ మాటలు కాదు..ఇంకాస్త సృజనను జోడించి స్టైలిష్ లుక్ తీసుకురావాల్సిందే అనుకునేవారిని ఇట్టే ఆకట్టుకుంటోంది శారీ ఓవర్ కోట్. పట్టు చీరల మీదకు ఎంబ్రాయిడరీ లాంగ్ జాకెట్స్ ధరించడం తెలిసిందే. కానీ, అవి సంప్రదాయ వేడుకలకే పరిమితం. వెస్ట్రన్ పార్టీలకూ శారీ స్టైల్‌ను పరిచయం చేయాలనుకుంటే ఈ ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని హ్యాపీగా ట్రై చేయచ్చు. శారీ మీదకు ఓవర్‌కోట్‌ను ధరించి కాన్ఫిడెంట్ లుక్స్‌తో కలర్ఫుల్గా వెలిగిపోవచ్చు. సేమ్ టు సేమ్ శారీ–ఓవర్ కోట్ ఒకే కలర్ ప్యాటర్న్‌లో ఉంటే ఆ స్టైల్ సూపర్బ్ అనిపించకుండా ఉండదు. ఆభరణాల జిలుగులు అవసరం లేని ఈ ప్యాటర్న్ స్టైల్ పార్టీలో ప్రత్యేకంగా వెలిగిపోతుంది. ధోతీ శారీ సాధారణంగానే ధోతీ శారీ ఓ ప్రత్యేకమైన లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక దాని మీదకు ఫ్లోరల్ ఓవర్ కోట్ ధరిస్తే ఎక్కడ ఉన్నా మరింత స్పెషల్‌గా కనిపిస్తారు. ఎంబ్రాయిడరీ కోట్స్ సిల్క్ ప్లెయిన్ శారీస్‌కి ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్ హుందాతనాన్ని తీసుకువస్తుంది. ఈ స్టైల్ ధోతీ శారీస్‌కు కూడా వర్తిస్తుంది. నీ లెంగ్త్ కోట్స్ మోకాళ్ల దిగువ భాగం వరకు ఉండే ట్రాన్స్పరెంట్ ఓవర్ కోట్స్ లేదా కేప్స్ నేటి యువతరపు మదిని మరింత ఆత్మవిశ్వాసంగా మార్చేస్తుంది. -
కాలం కార్ఖానా
కాలం ఒక కార్ఖానా. మనం నేల మీద పడిన క్షణం నుంచి కాలం కార్ఖానాలో మన కోసం ఉత్పత్తి మొదలైపోతుంది. ఆ ఉత్పత్తులలో మనకు కావలసిన రకరకాల ఆహార్యాలు, ఆలోచనలు, రుచులు, అభిరుచులు, అలవాట్లే కాదు; వాటిని నియంత్రించే హద్దులూ ఏర్పడిపోతాయి. పుట్టిన మరుక్షణం నుంచి కాలం మనకు తెలియకుండానే మనతో కలసి నడుస్తుంది, మనల్ని నడుపుతుంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం, మనల్ని మనమే నడుపుకుంటున్నామనుకుంటాం. అంతా మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని కేలండర్‌గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉంటుంది. కాలంలో ఒకానొకనాడు మనిషి నగ్నత్వాన్నే ఒంటికి చుట్టుకున్నాడు. తర్వాత తర్వాత ఒళ్ళంతా వస్త్రంతో కప్పుకోవడమే సంస్కారంగా, నాగరికతగా మారింది. మొన్నటికి మొన్న, తగినంత తిండికీ, చాలినంత ఆచ్ఛాదనకూ నోచుకోని ఈ దేశంలోని కోట్లాది నిరుపేదల బతుకు టద్దంగా మారుతూ మోకాళ్ళు దాటని అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకోవడం ఆదర్శం కాదు, అవసరమనుకున్నాడు మహాత్మా గాంధీ. ఆ తర్వాత స్త్రీ పురుష వస్త్రధారణ అనేకానేక మార్పుల మలుపులు తిరుగుతూ ఒంటినిండా కప్పుకోవడమనేది ‘అనాగరికం’గా మారి గాంధీగారి అంగవస్త్రంలా మోకాళ్ళు దాటని షార్ట్స్ ధరించడం అతి నవీనమైన పోకడగా మారింది. కాలం చేసే చిత్రాలు అలా ఉంటాయి. అది మన పట్టు తప్పించుకుంటూ ముందుకే కాదు, వెనక్కీ, పక్కలకీ కూడా పరుగులెడుతూ మనతో ఆడుకోగలదు. కాలం అఖండంగా ఉంటూనే నిన్న, నేడు, రేపు రూపంలో ఖండితంగానూ ఉంటుంది. కానీ మన ఊహాపోహలకు, జీవనగమనానికి మేకులు దిగేసి వర్తమానమనే కట్టుకొయ్యకు బంధించి ఉంచుతుంది. కవి ఎంత క్రాంతదర్శి అయినా ఆ మేకుబందీ నుంచి పూర్తిగా తప్పుకోలేడు. రేపటి కాలంలో పోస్ట్ మ్యాన్ ఆరోవేలుగా మారబోతున్నాడని తెలిసి ఉంటే దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రసిద్ధ కవిత ‘తపాలా బంట్రోతు’ ఏ రూపం దిద్దుకొని ఉండేదో! ‘దేశాంతరగతుడైన ప్రియుడి వార్త’ మొబైల్ రూపంలో అరచేతి దూరంలో ఉన్న ఈ రోజున, ఏ అమ్మాయీ ‘పద్దెని మిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్లెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించా’లనే ఆశతో, ‘చూపులు తుమ్మెద బారులు కట్టి’ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేదు. చిరునవ్వుతోనే కబురు లేదని చెప్పి వెళ్లిపోతున్న తపాలా బంట్రోతు వెనుక ఆ కళ్ళు ‘విచ్చిన రెండు కల్హార సరస్సులు’ కావలసిన అవసరమూ లేదు. అలాగని ప్రియుడి వార్త కోసం పడుచు దనం పడే ఆరాటం కాలభేదాలకు అతీతంగా నిత్యనూతనమూ అవుతుంది కనుక ఒక అపురూప భావస్పందన కలిగించే కవితగా అది భవిష్యత్తులోకి తన అస్తిత్వాన్ని పొడిగించుకుంటూనే ఉంటుంది. మరోపక్క గతకాలపు చరిత్ర శకలంగానూ మారుతుంది. గతంపై మసక తెర కప్పి మాయ చేయడం కాల స్వభావాలలో ఒకటి. మన పాదముద్రలు గతంలోకి వ్యాపించి ఉన్నాయన్న ఎరుక తప్పి, మన నడక వర్తమానంలోనే మొదలైందని అపోహ పడతాం. నేడు మన కళ్ళముందు ఉన్నవే నిత్యాసత్యాలు కావనీ, మొదటి నుంచీ ఈ ప్రపంచం ఇలాగే లేదనీ కొంత తెలిసినా కొంత తెలియనట్టే భ్రమావలయంలో గడుపుతూ ఉంటాం. ఎన్నో రకాల నియంతృత్వాలను దాటి ప్రజాస్వామ్యంలోకి వచ్చామనీ, అది కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది తప్ప పూర్తిగా పాదుకోలేదనీ, నేటి మన అనేకానేక సమస్యలు, సంక్షోభాల మూలాలు గతంలో ఉన్నాయనీ, వాటి పరిష్కారాల వెతుకులాటలో వందలు, వేల సంవత్సరాల గతంలోకి మన చూపుల నిడివి పెంచుకోవాలనే ఊహ రాకుండా మన బుద్ధికి కాలం దడి కడుతుంది. వర్తమానాన్ని ఒక మత్తుమందులా అలవాటు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాఙ్మయ పరిణామ క్రమాన్నే కనుక చూస్తే, క్రతు సంబంధమైన తంతు నుంచి మూకాభినయమూ, దాని నుంచి నాట్యమూ, నాట్యం నుంచి నాటకమూ ఎలా అభివృద్ధి చెందాయో; క్రతు సందర్భ గానం నుంచే పాట పుట్టి కావ్యస్థాయికి ఎలా పెరిగిందో; అనేకమంది అజ్ఞాతకర్తలు కలిగిన మౌఖిక సంప్రదాయం నుంచి, ఏక కర్తృకమైన లేఖన సంప్రదాయానికి వాఙ్మయం ఎలా పరివర్తన చెందిందో చెప్పే ఆసక్తికరమైన అధ్యయనాలు ఈరోజున అందు బాటులో ఉన్నాయి. అయినాసరే, నాట్యం, నాటకం, పాట, పద్యం, వచనపద్యం, గద్యం, కథ, నవల వంటి వివిధ ప్రక్రియలను పరస్పర సంబంధం లేని భిన్న రూపాలుగా విడదీసి చూడడాన్ని కాలం మనకు అలవాటు చేసింది. మౌఖిక సంప్రదాయానికి, అనేక కర్తృకానికి చెందినవాటిని కూడా లిఖిత సంప్రదాయం నుంచీ, ఒక్కరే రచించారన్న భావన నుంచీ చూడడం కూడా కాలం మప్పిన అలవాటే. కాలం పోయే చిత్రగతులు మనిషిని మొదటినుంచీ తికమకపెడుతూ ఆలోచనకు లోనుచేస్తూనే ఉన్నాయి. మహాభారత కథకుడు కాలానికి చెప్పిన భాష్యంలో అసాధారణమైన లోచూపు కనిపించి ఆశ్చర్యచకితం చేస్తుంది. భూత, భవిష్యత్, వర్తమానాలకు చెందిన అన్ని భావాలూ కాలనిర్మితాలేనంటాడు. భావాలు మనిషివే కనుక మనిషీ కాలనిర్మితుడే నన్నమాట. కాలం గురించిన తెలివిడితోనే దాని మాయాజాలం నుంచి ఏ కొంచెమైనా తప్పించుకోగలం. -
అదిరేటి డ్రెస్సు.. యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్
-
ఫ్యాషన్ టాక్: స్టైలు మారింది, డిజైన్ అదిరింది
డ్రెస్సింగ్‌లో ఎప్పుడూ యునిక్‌గా ఉండాలనే ఆలోచన నేటి యూత్‌ది. వారి అభిరుచికి తగినట్టుగా అందుబాటులోకి వచ్చింది. వన్‌సైడ్ లాంగ్ స్టయిల్. టాప్ లేదా కుర్తీ ఒక వైపు పొడవుగా, మరోవైపు పొట్టిగా ఉండటం ఈ స్టయిల్ ప్రత్యేకత. రెండు రంగులు భిన్నం కావచ్చు. రెండు ఫ్యాబ్రిక్స్ కూడా వేర్వేరువి అయి ఉండవచ్చు. కుర్తా లేదా టాప్ డిజైన్‌లో ప్రత్యేకత కనిపించాలంటే ఓ చిన్న మార్పు తీసుకురావాలి. డిజైనర్స్ చేసిన ఓ చిన్న ఆలోచన యూత్‌ని మరింతగా ఆకట్టుకుంటుంది. వెస్ట్రన్ నుంచి ఇండియన్ వేర్‌లోకి ఈ డిజైన్ కొత్తగా ఆకట్టుకుంటోంది. వెస్ట్రన్ పార్టీలో ప్రత్యేకతను చాటడమే కాదు, స్ట్రీట్ స్టయిల్గానూ మార్కులు కొట్టేస్తోంది ఈ డిజైన్. -
శ్రీరంగ సూక్తులు పలుకుతున్న భజ్రంగీ భాయిజాన్
-
అమ్మాయిల దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేత వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకరమైన బట్టలు(డర్టీ క్లాత్స్) ధరించే అమ్మాయిలు రామాయణంలో శూర్పణఖ మాదిరి కనిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహవీర్ జయంతి సందర్భంగా జైన సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను ఆయన తప్పుపట్టారు. రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులు కనిపిస్తుంటారని.. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.. వారిని చూస్తుంటే గట్టిగా చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలను మనం దేవతలా ఆరాధిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అసభ్యకరంగా దుస్తులు ధరించిన కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే శూర్పణఖలా కనిపిస్తారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్దులు నేర్పాలి’ అని సూచించారు. అయితే విజయ్‌వర్గియా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల ద్వేషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలతో పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ నేతలు ఇలా మాట్లాడటం సరికాదని.. బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కైలాష్ విజయవర్గియా ఇంలాటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదంలో ఇరుకున్నారు. చదవండి: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం.. BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1 — Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023 -
FIFA WC: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ చూడడానికి వచ్చే అభిమానులకు కఠినమైన కండీషన్స్ పెట్టారు నిర్వాహకులు. మాములుగా ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగితే యువతుల గ్లామర్ షో ఎక్కువగా ఉండడం సహజం. మందు, విందు, చిందు కూడా కామన్‌గా కనిపిస్తాయి. ఫిఫా లాంటి మెగా టోర్నీలో అయితే ఇక చెప్పనవసరం లేదు. పొట్టి దుస్తులు ధరించి క్లీవేజ్ షో చేస్తూ తమ అంద చందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ అరబ్ దేశమైన ఖతర్‌లో ఇలాంటివి నిషేధం. ఇస్లాం మతం ఎక్కువగా ఆచరించే దేశంలో మహిళలు అసభ్యకర దుస్తులు ధరించడానికి వీల్లేదు. అందుకే ఫిఫా వరల్డ్‌కప్‌కు వచ్చే యువతులు, మహిళలలు ఎట్టి పరిస్థితుల్లోనూ కురచ దుస్తులు వేసుకొని రావొద్దని.. అనవసరంగా క్లీవేజ్ షో చేసి జైలుపాలు కావొద్దని ముందే హెచ్చరించింది. అంతేకాదు మ్యాచ్ చూడడానికి వచ్చే మహిళా అభిమానులు ఫుల్ డ్రెస్ వేసుకొని రావాలని.. తప్పనిసరిగా మెడచుట్టు స్కార్ఫ్ వాడాల్సిందేనని పేర్కొన్నారు. అయితే క్రొయేషియాకు చెందిన మోడల్ ఇవానా నోల్ మాత్రం తనకు ఈ నిబంధనలు ఏ మాత్రం వర్తించవని ధైర్యంగా పేర్కొంది. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో హాటెస్ట్ ఫ్యాన్‌గా ముద్రపడిన ఇవానా నోల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అందాల ప్రదర్శన చేయడం సంచలనం కలిగించింది. క్రొయేషియా, బెల్జియం మ్యాచ్‌కు హాజరైన ఇవానా నోల్.. స్టేడియంలోకి సాధారణంగానే ఎంట్రీ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతుండగానే ఇవానా నోల్ తాను వేసుకున్న డ్రెస్ పైపార్ట్ తొలగించి క్లీవేజ్ షో చేసింది. ఫిఫా నిర్వాహకుల సంగతి ఏమో తెలియదు కానీ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులు మాత్రం ఆమె అందాల ప్రదర్శనను బాగా ఎంజాయ్ చేశారు. అయితే తన అందాల ప్రదర్శనే ఇప్పుడు ఇవానా నోల్కు సమస్యను తెచ్చిపెట్టింది. ఖతర్ వీధుల్లో ఇవానా నోల్ ఫోటోలను దగ్దం చేసిన స్థానిక యువకులు వెంటనే ఆమెను దేశం నుంచి బహిష్కరించాలని లేదా జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఇవానా నోల్ మాత్రం తన అంద చందాలతో ఖతర్‌లో సెగలు పుట్టించింది. చదవండి: నాలుగుసార్లు ఛాంపియన్.. ఇదంతా గతం; మాకు జరగాల్సిందే View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) -
డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు
సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది బిగ్‌బాస్ శివంగి బిందు మాధవి. అవకాయా బిర్యానీ, బంపర్ ఆఫర్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది బిందు. తెలుగు అమ్మాయి అయిన బిందు ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ కంటెస్టెంట్‌గా దర్శనం ఇచ్చింది. హౌజ్‌లో తనదైన ఆట, యాటిటూడ్, మాటలతో గట్టి పోటి ఇస్తూ చివరికి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ గెలిచింది. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. అంతేకాదు సంప్రాదాయమైన దుస్తులనే ధరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిందుమాధవి తన తాజా పోస్ట్‌లో కాస్తా ట్రెండి డ్రెస్‌లో కనిపించింది. ఈ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయగా ఓ నెటిజన్ తన డ్రెస్సింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అందరు శరీరం కరిపించేలా డ్రెస్స్‌లు వేసుకుంటే.. తను మాత్రం కేవలం సంప్రదాయమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బిందు మాధవి అంటే రెస్పాక్ట్ పెరిగింది. కానీ ఇప్పుడు అది పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే తను హౌజ్‌లో అలా ఉంది’ అంటూ విమర్శించారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! Why this narrow minded people judge a women by her dressing they like a women by her clothes and not by her character. In telugu der is a saying "ఆడదానికీ ఆడదే శత్రువు" this is apt 4 dis girl🤨 Bindu gave slipper shot answer 👏 you go girl more power to you 🔥#BinduMadhavi pic.twitter.com/78NhUznHO3 — SiriKota (@SiriKota_04) August 2, 2022 దీంతో సదరు నెటిజన్ కామెంట్స్ బిందు స్పందించి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘హో.. మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే.. అలాంటి గౌరవం నాకు వద్దు’ అంటూ నెటిజన్ నోరు మూయించింది ఈ ఆడపులి. ప్రస్తుతం బిందు మాధవి సమాధానం నెట్టింట చర్చనీయాంశమైంది. బిందు ఇచ్చిన రిప్లైకు ఓ నెటిజన్ ఫిదా అయ్యాడు. ఈ కామెంట్సకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేస్తూ బిందుకు మద్దుతు తెలిపాడు. -
అదేం డ్రెస్సింగు? ఐఏఎస్‌కు మందలింపు
పాట్నా: ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, కోర్టు ప్రోటోకాల్ ఫాలో కాక జడ్జి చేతిలో తిట్లు తిన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. బీహార్ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆనంద్ కిశోర్. సీఎం నితీశ్ కుమార్ ఆయన దగ్గర కూడా. ఓ కేసులో ఈమధ్యే ఆయన పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వేసుకున్న దుస్తులు జడ్జి పీబీ భజంత్రీకి చిరాకు తెప్పించాయి. ‘‘ఇదేమైనా సినిమాహాల్ అనుకుంటున్నారా? సాధారణ డ్రెస్సింగ్‌లో రావడానికి!. సివిల్స్ సర్వెంట్లు ఎలాంటి డ్రెస్‌లో కోర్టుకు రావాలో మీకు తెలియదా? ఎక్కడ శిక్షణ తీసుకున్నారు మీరు? ముస్సోరీ ట్రైనింగ్‌లో ఈ విషయాలేవీ మీకు చెప్పలేదా? మెడ కనిపించకుండా కాలర్ బటన్స్ పెట్టుకోవాలని, కనీసం మీద కోట్ అయినా ధరించాలి అని తెలియదా? అంటూ ఆ సీనియర్ అధికారిపై జడ్జి అసహనంగా వ్యక్తం చేశారు. -
‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): ‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ అంటూ అమ్మాయిలు పాడటం ఇప్పుడు కొత్త కాదు. అందం, ఆకట్టుకునే లుక్కు, డ్రెస్సింగ్ వంటి విషయాల్లో మగువలతో మగమహారాజులూ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు దసరా బుల్లోడు డ్రెస్సు వేస్తే గొప్ప. తరువాత ఎన్టీ రామారావు బెల్‌బాటమ్ ఫ్యాంట్.. దానికి అడుగున జిప్పులో ఒక భాగం కుట్టడం ప్యాషన్. కొంతమంది శోభన్‌బాబు స్టైల్లో తలలో ఓ పాయ తీసి నుదుటి మీదకు రింగులా పెట్టుకొని మురిసిపోయేవారు. ఆ తరువాత చిరంజీవి స్టెప్పు కటింగ్, బ్యాగీ ఫ్యాంట్లు, జర్కిన్లు.. పంక్ హెయిర్ స్టైల్.. ఇలా ఎన్నో.. 1996లో వచ్చిన ప్రేమదేశం సినిమా యువతను ఉర్రూతలూగించింది. చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి కొత్త ఫ్యాషన్ వైపు పరుగు తీయించింది. ఆ సినిమాలో హీరో అబ్బాస్ తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌తో యువతను మెప్పించాడు. యువకుల దృష్టిని సౌందర్యం వైపు మళ్లించాడు. యువత ఆహార్యంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐదేళ్లుగా వస్తున్న మార్పులు అన్నీ ఇన్నీ కావు. రకరకాల హెయిర్ స్టైల్స్.. జుట్టుకు రంగులు.. ఫేస్ ప్యాక్‌లు అన్నీ ఇన్నీ కావు. పనిలో పనిగా నాజూకైన శరీరాకృతి కోసం కొందరు.. సల్మాన్‌ఖాన్‌లా కండలు పెంచేందుకు మరికొందరు.. ఇలా యువత మంచి లుక్కు కోసం సమయం, ధనం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లంటే కేవలం మహిళల కోసమే. కానీ ఇప్పుడు పురుషుల బ్యూటీ పార్లర్లకు సైతం ఆదరణ పెరిగింది. నగరాలు, పట్టణాలే కాదు.. చివరకు ఒక మోస్తరు పల్లెల్లో సైతం మెన్స్ బ్యూటీ పార్లర్లు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి పట్టణాలతో పాటు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, రాజోలు, తాటిపాక, అంబాజీపేట, పి.గన్నవరం వంటి గ్రామాల్లో కూడా ఇటువంటి బ్యూటీ పార్లర్లకు డిమాండ్ ఏర్పడింది. హెయిర్ స్టైల్‌కే తొలి ప్రాధాన్యం యువకులు హెయిర్ స్టైల్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు సెలూన్‌కు వెళ్తే రెండు రకాల స్టైల్స్‌లో హెయిర్ కటింగ్ చేయించుకోవడం, గెడ్డం గీయించుకోవడం లేదా ట్రిమ్మింగ్‌తో సరి. ఇప్పుడలా కాదు. పార్లర్లలో మూడు నాలుగు గంటలు పైగా గడుపుతున్నారు. రకరకాల హెయిర్ స్టైల్స్.. అందుకు తగినట్టుగా రంగులు వేయిస్తున్నారు. వారం వారం ఫ్యాషన్ మారిపోతోంది. పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్.. గూగుల్‌లో వెతికితే ఎన్నో ఫొటోలు, ఇంకెన్నో వీడియోలు. ఇంకేముంది! పుర్రెకో బుద్ధి అన్నట్టు యువత చెలరేగిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా 210 పాపులర్ హెయిర్ స్టైల్స్ ఉండగా, వీటిలో సుమారు 35కు పైగా మన వద్ద ఆదరణ ఉందని బ్యూటీ పార్లర్ల యజమానులు చెబుతున్నారు. రంగుల విషయానికి వస్తే పల్పీ, ఫ్రంక్ కలర్స్‌కు ఆదరణ ఎక్కువగా ఉంది. పనిలో పనిగా ఫేస్‌ప్యాక్, ఫేషియల్‌ను కూడా వదలడం లేదు. ఒక్కో ఫేషియల్కు రకాన్ని బట్టి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక మొత్తం బాడీ న్యూలుక్ కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చవుతోందంటే వీటికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిమ్‌లకు పెరుగుతున్న ఆదరణ మరోవైపు జిమ్‌లకు సైతం యువకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు కేవలం బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేవారు మాత్రమే ఎక్కువగా జిమ్‌లకు వచ్చేవారు. కరోనా తరువాత ఆరోగ్య స్పృహ పెరగడంతో పాటు అందమైన ఆకృతి కోసం జిమ్‌లకు వస్తున్నారు. పెద్దపెద్ద బరువులు ఎత్తి, సిక్స్‌ప్యాక్, ఎయిట్ ప్యాక్‌ల కోసం ప్రయాసపడే వారి కన్నా అందమైన బాడీ షేప్‌లకు వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారు. 60లో 20ల్లా ఉండాలని.. నడియవస్సు వారు సైతం యువకుల్లా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. జట్టుకు, మీసాలకు రంగులు వేయించడం ఒక్కటే కాదు.. రకరకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. ఫేస్‌ప్యాక్‌ల విషయంలో కూడా రాజీ పడటం లేదు. శుభకార్యానికి వెళ్లాల్సి ఉంటే ముందుగా బ్యూటీ పార్లర్లు, సెలూన్ల వైపు పరుగు తీస్తున్నారు. నడివయస్సులో జిమ్‌లకు వెళ్లే వారు తక్కువే అయినా ఉదయం నడక, చిన్నచిన్న కసరత్తులతో నాజూకుగా మారిపోతున్నారు. విభిన్నంగా ఉంటేనే గుర్తింపు విభిన్నంగా ఉంటేనే మమ్మల్ని నలుగురూ గుర్తిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐటీ సెక్టార్లో అవకాశాలు పెరిగాక, చాలామంది యువత అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కూడా మాకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి. – గాదిరాజు హరీష్‌వర్మ, అంబాజీపేట కొత్త ఫ్యాషన్ నేర్చుకుంటున్నాం మా పెద్దలు సెలూన్లు నిర్వహించేటప్పుడు కటింగ్, గెడ్డం గీయడంతో సరిపోయేది. మహా అయితే ట్రిమ్మింగ్ చేసి, రంగు వేసేవారు. ఇప్పుడు సెలూన్ల నిర్వహణ మొ త్తం మారిపోయింది. కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా హెయిర్ కటింగ్ స్టైల్స్ నేర్చుకుంటున్నాం. ఫేషియల్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. ఒక్కోసారి హైదరాబాద్ వెళ్లి శిక్షణ పొందుతున్నాం. షాపుల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. – అనిల్‌కుమార్, సెలూన్ యజమాని, అమలాపురం నాజూకుతనానికి.. ఒకప్పుడు జిమ్‌లకు ఎక్కువగా బాడీ బిల్డర్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు నాజూకుతనం కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మజిల్స్, బాడీ కటింగ్ కోసం చిన్నచిన్న కసరత్తులు ఎక్కువగా చేస్తున్నారు. కరోనా తరువాత, యువతలో వస్తున్న ఫ్యాషన్ మార్పుల కారణంగా జిమ్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగింది. – కంకిపాటి వెంకటేశ్వరరావు, హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్, అమలాపురం -
పుతిన్-జెలెన్స్కీ.. వాటి వెనుక బోలెడంత కథ!
దేశం కోసం అంటూ ఒకరు, తన సరిహద్దుల్లో నాటో వద్దంటూ మరొకరు.. విరామం లేకుండా యుద్ధంలో మునిగిపోయారు. ఉన్నబలగానికి ధైర్యం ఇస్తూ ఒకరు.. బలమైన బలగాలకు అధ్యక్ష భవనం నుంచే ఆదేశిస్తూ మరొకరు మొత్తం ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేశారు. ఇక్కడ తప్పొప్పులు ఎవరివి? నష్టం ఎటువైపు ఎక్కువ ఉంటోంది అనే విషయాలను పక్కనపెడితే.. వాళ్ల ఆటిట్యూడ్‌కు సంబంధించిన విషయం ఒకటి ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. అదే వాళ్ల డ్రెస్సింగ్.. మామూలురోజుల్లో సూట్ బూట్లో సందడి చేసే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. ఈ నెలరోజుల యుద్ధంలో కనిపించిన ప్రతీసారి సాదాసీదాగా గ్రీన్‌కలర్ టీషర్టులో కనిపిస్తున్నాడు. తద్వారా దేశంతో సమానమైన బాధను పంచుకుంటున్నాననే సందేశాన్ని పంపిస్తున్నాడాయన. ఫ్యాషన్ హిస్టారియన్స్ అంచనా ప్రకారం.. పిరికితనానికి ఎరుపు, తెలుపు, నీలం దుస్తులను ప్రతీకగా భావిస్తారు. కానీ, ఒలివ్, గ్రీన్ కలర్ టీషర్టుల్లోనే జెలెన్స్కీ ఎక్కువ దర్శనమిస్తున్నాడు. ఇవి యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్న సైన్యానికి సంకేతం. కీవ్ నుంచి పారిపోనంటూ ఇచ్చిన ప్రకటన.. ఉక్రెయిన్ ప్రజల తెగువ, పోరాట పటిమకు నిదర్శనం. అందుకే ప్రపంచానికి అర్థమయ్యేలా సాదాసీదా దుస్తుల్లోనే దర్శనమిస్తున్నాడు. తన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. పలు దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. పుతిన్ సంగతికొస్తే.. రష్యా మిలిటరీ చర్య మొదలైన తర్వాత.. పోయిన వారం ఓ పబ్లిక్ ఈవెంట్లో హాజరైన పుతిన్ ఓ ఫ్యాషనబుల్ కోట్లో దర్శనమిచ్చాడు. ఇటలీ నుంచి దిగుమతి అయిన ఆ కోట్ ఖరీదు సుమారు 14 వేల డాలర్లు. అంటే.. మన కరెన్సీలో అది 10 లక్షల రూపాయలకు పైనే. తద్వారా ప్రపంచానికి తన దర్శం, యుద్ధ కాంక్షను, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని పుతిన్ భావించాడు. అయితే ఇక్కడే బెడిసి కొట్టిందేమో అనే చర్చ మొదలైంది?. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నేతల్లో పుతిన్ ఒకరు. విలాసాలతో పాటు దానగుణంలోనూ ఆయనకు ఆయనే సాటి. కానీ, ఉక్రెయిన్ పరిణామాలు ఆ పరిస్థితుల్ని మార్చేశాయి. రష్యా ఆర్థిక పతనం తర్వాత.. రూబుల్స్(కరెన్సీ)విలువ దారుణంగా పతనం అయ్యింది. దీంతో అధ్యక్షుడిగా పుతిన్‌కు అందుతున్న జీతంలోనూ కోత పడింది. పైగా రష్యా సైన్యానికి ఆర్థిక తోడ్పాటు కష్టంగా అందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ధనికదేశమనే సంకేతాలు ప్రపంచానికి పంపడం సరికాదనేది విశ్లేషకుల మాట. డ్రెస్సులోనే అంత ఉంది పరిస్థితులకు తగ్గట్లు వస్త్రధారణ ఉండాలనేది కొత్త విషయం ఏం కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. యూకే అధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్ సైరన్ సూట్‌ను ధరించేవాడు. వైమానిక దాడి జరిగినప్పుడు మీరు త్వరగా తప్పించుకునేందుక వీలుగా అది. ►ఇక అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్.. మిలిటరీ దుస్తుల్లో సైన్యానికి సపోర్ట్‌గా కనిపించేవారు. ►ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ది ఈ విషయంలో మరో తరహా వైఖరి. తానొక నియంత అని చెప్పుకోవడానికి వీలుగా.. తనలాంటి జాకెట్లు మరెవరూ ధరించకూడదన్న ఉద్దేశంతో నిషేధాజ్ఞలు, ధరించిన వాళ్లకు శిక్షలు అమలు చేయించాడు. ►ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్.. ఎయిర్‌ఫోర్స్ హూడీ ద్వారా సాదాసీదాను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండడంతోనే.. జెలెన్స్కీని కాపీ కొడుతూ.. ఇలా సింప్లిసిటీ డ్రామాలు ఆడుతున్నాడంటూ సోషల్ మీడియాలో మాక్రోన్‌పై ట్రోలింగ్ నడుస్తోంది. -
దీపిక డ్రెస్సింగ్‌పై ట్రోల్స్.. 'రణ్వీర్ డిజైన్ చేసాడేమో'..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డ్రెస్సింగ్‌పై ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ ఎక్కువవుతుంది. తాజాగా తన తర్వాతి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన దీపిక బిగుతైన రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించింది. క్యాప్, హ్యాండ్‌బ్యాగ్ కూడా ఎరుపు రంగులో ఉన్నాయి. దీనికి తోడు హై హీల్స్ వేసుకుంది. అవి కూడా రెడ్ కలర్లోనే ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు దీపికాను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అచ్చం జొమాటో డెలివరీ గర్ల్‌లా ఉందని, ఎప్పటిలాగే ఆమె డ్రెస్సింగ్ స్టైల్లో విఫలమైందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రణ్వీర్ సింగ్ వింత ఫ్యాషన్ దీపిక పాటిస్తుందని, ఈ డ్రెస్ కూడా రణ్వీర్ డిజైన్ చేసి ఉండొచ్చని ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్గా గెహ్రియాన్తో హిట్ అందుకున్న దీపిక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కే' లో నటిస్తుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక అలా కనిపించేసరికి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
Rashmika Mandanna Spotted In Airport, Fans Trolls On Her Dress Sense: ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భావ రష్మిక మందన్నా. ఆ తర్వాత గీత గోవిందంతో గుర్తింపు పొందిన ఈ భామ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. రీసెంట్గా వచ్చిన పుష్పతో మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకొని సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న డెనిమ్ షార్ట్ మరీ పొట్టిగా ఉండటంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రష్మిక డ్రెస్సింగ్ మరీ ఓవర్‌గా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తూ.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? ఇంక నువ్వు బట్టలు వేసుకోవడం దేనికి అంటూ ఈ అమ్మడిపై ఫైర్ అవుతున్నారు.స్కిన్ షో చేయొచ్చు కానీ, ఇది టూ మచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. #RashmikaMandanna #DilKoKaraarAaya 💕🤩🔥#Rashmika #Rash #Mumbai #Srivalli #cutenessoverloaded pic.twitter.com/EEo9koiIPE — team_rashmika_mandanna (@MandannaTeam) January 24, 2022 -
అది నా వ్యక్తిగతం..ఆ హక్కు ఎవరికీ లేదు: స్టార్ హీరోయిన్ ఫైర్
I am not stupid, cannot live according to people: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా ఆమె సుపరిచితమే. 48 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఆమె ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఆమె ధరించే దుస్తులు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఈ భామ సినిమాల కంటే డ్రెస్సింగ్ విషయంలోనే ఎక్కువగా ట్రోల్ అవుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డ్రెస్సింగ్ తనపై వచ్చిన విమర్శలపై స్పదించింది. ‘ఒక స్త్రీని ఎల్లప్పుడూ ఆమె ధరించే స్కర్ట్ పొడవు లేదా ఆమె నెక్‌లైన్‌ని బట్టి అంచనా వేస్తారు. జనాల అభిప్రాయాలకు అనుగుణంగా నా జీవితాన్ని గడపలేను. ఎందుకంటే డ్రెస్సింగ్ అనేది నా వ్యక్తిగత ఎంపిక. మీరు ఒక నిర్దిష్ట విధానంలో ఆలోచించవచ్చు కానీ అది నా కోసం కాకపోవచ్చు. కాబట్టి నేను ఎవరికీ అలాంటి విషయాల గురించి చెప్పను. నాకు నా సొంతంగా ఆలోచనలు, ఎంపికలు ఉంటాయి. అందుకే నేను ఎవరి డ్రెస్సింగ్ గురించి మాట్లాడను. నేను ఎలాంటి దుస్తులు ధరించాలి? ఏ డ్రెస్ సెట్ అవుతుందో, ఏది బాగోదో నాకు బాగా తెలుసు. రేపు ఇది బాలేదు అని నాకు అనిపిస్తే నేను అది చేయను. కానీ అప్పుడూ కూడా అది నా ఎంపిక. కాబట్టి దాని గురించి నాకు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నా వయసుకి, నేను ధరించే దుస్తుల పట్ల నాకు సౌకర్యంగానే ఉంది. నేను తెలివితక్కువదానిని కాదు. ఎలా ఉండాలో, ఏం చేయాలో నాకు తెలుసు. నాకు నచ్చినట్లుగా నేను ఉంటా’అంటూ మలైకా చెప్పుకొచ్చింది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో మలైకా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత వీరికి కొడుకు పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం మలైకా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉంది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవచ్చనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. -
అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!
మన స్నేహితులు లేక మన బంధువులో మనల్ని భయపెట్టేలే చేసే పనులు ఒక్కోసారి మనల్ని చాలా భయభ్రాంతులకు గురిచేస్తాయి. పైగా ఆ సంఘటన నుంచి మనకు తేరుకోవడానికి కూడా చాలా టైమ్ పడుతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన స్నేహితుడినిఅచ్చం బొమ్మలా ప్రాంక్ చేసి భయాందోళనకు గురిచేశాడు. (చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...) అసలు విషయంలోకెళ్లితే...పాల్కీన్ అనే వ్యక్తి తన స్నేహితుడు పాల్ వుడ్‌ని ఆటపట్టించాలనే ఉద్దేశంతో బొమ్మ మాదిరిగా దుస్తులు ధరించి ఒక గదిలో మూలన ఉన్న బొమ్మల మధ్య దాక్కొని ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి అతని స్నేహితుడు పాల్వుడ్ ఆ గదిలోకి వచ్చి మూలన పడి ఉన్న బొమ్మను తరలించే నిమిత్తం ఒక్కో బొమ్మను ఎత్తకుంటాడు. అంతే పాల్వుడ్ క్లీన్‌ని తాకిన వెంటనే వుడ్‌ని భయపెట్టేలా క్లీన్ లేచి నుంచుంటాడు. దీంతో వుడ్ ఒక్కసారిగా భయపడి కింద పడిపోతాడు. పైగా తాను చాలాసేపు ఇలా పడుకుని ఉన్నానంటూ క్లీన్ చెప్పుకొస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ తాజాగా ఆ వీడియో మళ్లీ నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీంతో నెటిజన్లు ‘ఆ వ్యక్తికి గుండె ఆగినంత పనైంది కదరా! తమాషాలకు కూడా అద్దూ అదుపు ఉండాలి. నీ ప్రాంక్ తగలెయ్య’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో దోస్తాన్లో ఇవన్నీ కామన్ అని కొట్టిపడేస్తున్నారు. వీడియో చూసి ఎంజాయ్ చేశామని అంటున్నారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) View this post on Instagram A post shared by YouTube (@youtube) -
‘వామ్మో ఏంటా బట్టలు.. ముందు ఫ్లైట్ దిగు’
ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ.. దెనిజ్ సెపినర్(26).. టర్కీ ఫిట్నెస్ మోడల్. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్‌లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్నెస్ మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్‌గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట. కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్ చేసింది దెనిజ్. ట్విస్ట్ అయితే దెనిజ్ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె. -
‘స్త్రీలు పొట్టి దుస్తులు ధరిస్తే.. మగవారి మనసు చలించదా?’
ఇస్లామాబాద్: మహిళల వస్త్రధారణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ధరించే దుస్తుల వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా చేస్తున్నారని.. ఫలితంగా అత్యాచార కేసులు పెరుగుతున్నాయంటూ ఇమ్రాన్ ఖాన్ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే.. మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. స్త్రీలు తమ శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే మగవారి మనస్సు చలిస్తుంది. పురుషులు రోబోలు అయితే తప్ప.. వారు చలించకుండా ఉండరు. ఎందుకంటే మనం నివసిస్తున్న సమాజం పూర్తిగా భిన్నమైంది. ఇక్కడ ఎలా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం మనకే ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. పాకిస్తాన్లో పెరిగిపోతున్న అఘాయిత్యాలను మహిళల వస్త్రధారణతో ఇమ్రాన్ మరోసారి ముడిపెట్టడం చాలా దారుణం అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని ఇమ్రాన్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ అన్నారు. ఇమ్రాన్ అన్నదానిని పూర్తిగా చెప్పకుండా కేవలం ఒక వాక్యాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో.. లైంగిక వాంఛలు ఏ స్థాయికి వెళ్లాయో ప్రధాని చెప్పారన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసుపాలయిన సంగతి తెలిసిందే. చదవండి: ట్రోలింగ్: దెబ్బకు వీడియో డిలీట్ చేసిన పాక్ ప్రధాని! -
‘‘నీ డ్రెస్ చాలా చిన్నగా ఉంది.. ఈ టీ షర్ట్ తీసుకో’’
వాషింగ్టన్: ఆడవాళ్ల మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే చాలు వెంటనే అందరి దృష్టి వారి వస్త్రధారణ మీదకు వెళ్తుంది. సందు దొరికితే చాలు మహిళల దుస్తులు, నడక, నడత గురించి అనర్గళంగా ఉపన్యసించే వారు మన సమాజంలో కోకొల్లలు. అప్పుడప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ వ్యక్తులు కూడా వచ్చి చేరుతుంటారు. కంపెనీలు కూడా ఇలాంటి విషయాల్లో అనుచితంగా ప్రవర్తించి.. ఆపై లెంపలు వేసుకుంటాయి. తాజాగా ప్రసిద్ధ సంస్థ డిస్నీ వరల్డ్ ఈ జాబితాలో చేరింది. పార్క్‌కి వచ్చిన ఓ మహిళ డ్రెస్ చాలా చిన్నగా.. అసభ్యంగా ఉందని.. ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిందని భావించిన కంపెనీ ఆమెను లోపలికి అనుమతించలేదు. అంతేకాక తన గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఓ టీషర్ట్‌ని ఉచితంగా ఇచ్చి.. తన పెద్ద మనసుతో పాటు.. మహిళలు కనిపిస్తే చాలు మా చూపులు వారి శరీర భాగాల మీదనే ఉంటాయనే తన వక్రబుద్ధిని పరోక్షంగా ప్రకటించింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి మహిళ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. అమండ డిమియో అనే టిక్‌టాక్ యూజర్‌కు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమెకు 8 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె డిస్నీ పార్క్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె చాలా చిన్నగా ఉన్న క్రాప్‌టాప్ ధరించింది. అమండ డ్రెస్ అసభ్యంగా, అశ్లీలంగా ఉందని భావించిన పార్క్ యాజమాన్యం ఆమెను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఓ టికెట్‌ని ఇచ్చింది. దాని మీద పక్కనే ఉన్న తమ గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఉచితంగా ఓ టీ షర్ట్ పొందవచ్చని రాసి ఉంది. పార్క్ యాజమాన్యం తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన అమండ ఏం మాట్లాడకుండా గిఫ్ట్ షాప్‌కి వెళ్లి.. టీషర్ట్ తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత తనకు ఎదురైన ఈ అనుభవం గురించి వివరిస్తూ ఓ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్ డిస్నీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. మీరు ఎక్స్పోజ్ చేసేలా చిన్న దుస్తులు ధరించి మ్యాజిక్ కింగ్‌డమ్‌లోకి ప్రవేశిస్తే.. వారు మీకు ఒక టికెట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్‌లో ఇస్తే.. మీకు 75 డాలర్లు విలువ చేసే టీ షర్ట్ ఫ్రీగా ఇస్తారు’’ అని వీడియో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరవలవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 మిలియన్ల మంది వీక్షించారు. చాలా మంది ఈ ట్రిక్ని ఉపయోగించుకున్నట్లు కామెంట్స్ చేశారు. చదవండి: భారత్‌లో మిస్టరీ రాయి.. ఏలియన్స్ పనేనా? వైరల్ స్టోరీ: లైఫ్ ఈజ్ వెరీ ఈజీ -
'రషీద్ బాగున్నావు.. నీ ప్యాలెస్ సూపర్‌గా ఉంది'
కాబుల్: అప్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ రంజాన్ మాసం సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. నీలం రంగు కుర్తా, ప్యాంట్ వేసుకొని రాజసం ఉట్టిపడేలా రషీద్ ఇచ్చిన ఫోజు.. దానికి తోడూ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్యాలెస్‌లో రెండు వైపులా మెట్లు కనిపించడం.. నేల మీద పరిచి ఉన్న తివాచీ ఆ ఫోటోకు మరింత అందాన్నిచ్చింది. కాగా రషీద్ షేర్ చేసిన ఫోటోపై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ స్పందించింది. ''వారెవ్వా వాటే ప్యాలెస్.. రషీద్ నీ డ్రెస్సింగ్ సూపర్..'' అంటూ కామెంట్ చేసింది. టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రషీద్ ఫోటోపై కామెంట్ చేశాడు.''క్యా బాత్ హై.. రషీద్.. ఇలాంటి ఫోటోలు మరిన్ని ఉంటే నాకు పంపించు.. ఎదురుచూస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్ ఖాన్ ఐపీఎల్ 14వ సీజన్లో తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 7 మ్యాచ్‌లాడిన రషీద్ 10 వికెట్లు మాత్రమే తీశాడు.. ఎకానమీ రేటు మాత్రం ఎక్కువ లేకుండా చూసుకున్నాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో దారుణ ప్రదర్శన నమోదు చేసింది. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచి.. మిగతా ఆరు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇక బయోబబూల్కు కరోనా సెగ తగలడంతో ఐపీఎల్ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా లీగ్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. చదవండి: పాకిస్తాన్‌కు ఆడాల్సింది కాదు.. తప్పు చేశా View this post on Instagram A post shared by Rashid Khan (@rashid.khan19) -
మానస సంచరరే...
ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలిచిన అమ్మాయి అనగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మనసులలో ఒకటే నామం, ఒకటే రూపం కదలాడుతోంది. మది మదిన సంచరిస్తున్న ఆమే మానస వారణాసి. ఈ భారతీయ సుందరికి డ్రెస్ డిజైన్స్ చేసినవారిలో హైదరాబాదీ డిజైనర్ శ్రవణ్‌కుమార్ ఉన్నారు. మానస వారణాసి సంప్రదాయ, ఇండోవెస్ట్రన్ స్టైల్ వేషధారణ గురించి ఈ డిజైనర్ చెప్పిన వివరాలు. డ్రెస్ డిజైన్స్. మిస్ ఫ్యాషన్ కూడా... తెలుగు అమ్మాయిల్లో అరుదైన అందం మానసది. తనకు నేను పలు మార్లు డిజైన్స్ అందించాను. తను బాగా ఫ్యాషన్ స్పృహ ఉన్న అమ్మాయి. ఇండియన్, వెస్ట్రన్, అఫిషియల్, ఫార్మల్... ఇలా ఏ డ్రెస్ అయినా బాగా క్యారీ చేయగలదామె. తను తప్పకుండా మిస్ వరల్డ్ అవుతుంది. ఎందుకంటే... ఆమె ఇండియన్ బ్యూటీ, టెక్నికల్ ఇండియన్ బ్యూటీ... ప్యూర్ ఇండియన్ బ్యూటీ... రైట్ బాడీ, రైట్ యాటిట్యూడ్ లతో నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. – శ్రవణ్‌కుమార్, ఫ్యాషన్ డిజైనర్ టమరీ గాడీగా కాకుండా రెండు రంగులతో చేసిన మ్యాజిక్ వినూత్న అందాన్ని తీసుకువచ్చింది. బంగారు రంగు పెద్ద అంచు ఉన్న వంగపండు లెహంగా అదే రంగు బ్లౌజ్, దుపట్టా, లెహంగాకు సెట్ టాజిల్స్.. ఓ ప్రత్యేక ఆకర్షణ. టవెస్ట్రన్ జంప్‌సూట్ నుంచి డిజైన్ చేసిన మోడల్ డ్రెస్. మేని రంగును డ్రెస్ రంగు మరింతగా ఎలివేట్ చేస్తుంది. టవెస్ట్రన్ షార్ట్ గౌన్‌కి ఇండియన్ సంప్రదాయ చీర అంచు మరింత అందాన్ని తీసుకువచ్చింది. -
అప్పుడు చాలా బాధ కలిగింది : సమంత
దక్షిణాదిన మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సమంత. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. ప్రత్యూష ఫౌండేషన్ పేరిట ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి సమంత.. హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2019 జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ టైమ్స్‌తో సమంత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగచైతన్యతో పెళ్లైన తర్వాత తన వస్త్రధారణకు సంబంధించి ఎదురైన ట్రోలింగ్ గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లైన కొత్తలో నేను సోషల్ మీడియాలో చేసిన పోస్టులను(దుస్తుల గురించి) కొందరు దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఇది నాకు చాలా బాధ అనిపించింది. నేను రెండోసారి అలాంటి దుస్తులు ధరించిన ఫొటోలను పోస్ట్ చేసినప్పుడు ట్రోలింగ్ కాస్త తగ్గింది. ఏదైనా తొలి అడుగు వేసేటప్పడే కష్టంగా ఉంటుంది. తొలుత ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆ సమయంలో ట్రోలింగ్ చేసే వారి ఆలోచన మార్చాలని అనుకున్నాను. అందుకోసం నా వంతు చేయగలిగింది నేను చేయబోతున్నాను’ అని తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తన ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. అలాగే సామాజిక అంశాలతో పాటు మూగజీవాలకు సంబంధించిన పోస్ట్‌లు కూడా చేస్తుంటారు. చదవండి : పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి -
కట్టుబాట్లు
కుర్తీ మోకాళ్ల కింది దాకా ఉండాలి.. మోచేతుల దాకా స్లీవ్స్ ఉండాలి..చున్నీ వేసుకోవాలి..జీన్స్ మీదకి టీ షర్ట్ కూడదు..చున్నీ ఏది?ఆడవాళ్ల వస్త్రధారణ మీద ఎందుకంత పట్టు?ఏం వేసుకోవాలి? ఎలా వేసుకోవాలి?అనే ఆంక్షలు వాళ్ల మీదే ఎందుకు?సంస్కృతీసంప్రదాయ పరిరక్షణ భారం వాళ్ల నెత్తి మీదే ఎందుకు?ఏ అవమానం ఎదురైనా.. ప్రమాదంజరిగినా వాళ్ల దుస్తులకే ఎందుకు శిక్ష?కట్టూబొట్టూ తీరు నుంచి లైంగికేచ్ఛదాకా స్త్రీల స్వేచ్ఛ, హక్కుల కోసంపోరాడుతున్న కొంతమంది కళాకారుల గురించి... అవతలి వ్యక్తి క్రమశిక్షణారాహిత్యాన్ని, అహంకారాన్ని, మానసిక చపలత్వాన్ని అమ్మాయిలు తాము వేసుకునే బట్టలతోనే అడ్డుకోవాలి.. వీలైతే ఆ డ్రెస్కోడ్తోనే వాళ్లను సంస్కరించాలి.. ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా?’’అంటారు కొందరు సామాజిక విశ్లేషకులు. ‘ఆడపిల్లలకు డ్రెస్ కోడ్ పెట్టినట్టు.. మగవాళ్లకు ప్రవర్తనా నియమావళి ఎందుకు ఉండదు?’ అని ప్రశ్నిస్తోంది ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని. ‘‘అమ్మాయిల కట్టు, బొట్టు, మాట, నడక.. అన్నిటి మీద రిస్ట్రిక్షన్సే.. వాటిని కాదని నచ్చినట్టు ఉంటే క్యారెక్టర్ లేదని.. ఫలానా అని.. లేబుల్స్ వేస్తారు’’ ఇంకో అమ్మాయి అసహనం.కరెక్ట్ పాయింట్ దగ్గరే అసహనం వెలిబుచ్చిందీ అమ్మాయి.. లేబ్లింగ్! ‘‘ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు టాపిక్‌ను? డ్రెస్ కోడ్‌కి లేబ్లింగ్‌కు లింక్ ఏంటి? మంచి బట్టలు వేసుకుని రండి అనడం కూడా తప్పేనా’’ అని విరుచుకు పడొద్దు. ‘‘మంచి అమ్మాయి’కి పురాణాలు, కావ్యాలు, కథలు, సినిమాలు ఇప్పుడైతే సీరియల్స్ ఇచ్చే నిర్వచనం.. నిండుగా బట్టలు వేసుకొని, వంచిన తల ఎత్తకుండా, నవ్వును పెదవులు దాటనివ్వకుండా, దుఃఖాన్ని మాత్రం పొంగి పొర్లిస్తూ, ఆత్మవిశ్వాసం అనే పదం తెలియకుండా, వెన్ను మీద పరాధీనతను మోస్తూ జీవితాంతం వంగి ఉండడం! దీనికి భిన్నంగా ఏ ఆడపిల్ల కనిపించినా ‘లేబుల్’ వేయడమే! ఆడవాళ్లు తమ చట్రంలోనే ఉండాలంటే ‘లేబుల్’ బూచీ చూపించాల్సిందే. దానికి డ్రెస్ కోడ్ మంచి ఊతం. తమ శరీరం, తమ అభిరుచి అనే స్వేచ్ఛను హరించాల్సిందే! వీటికి పైన చెప్పిన ‘కళ’లన్నీ వంత పాడినవే! చట్రాన్ని మరింత బిగించినవే. అసలు ఆ లేబుల్‌కు రూపమిచ్చినవే అవి. ఆ కళలతోనే ఆ సంప్రదాయాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది కళాకారిణులు. ఈ సందర్భంగా వాళ్ల పరిచయం.. హాటీ కాదు స్మార్ట్ ‘‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్, చోళీ కే పీచే క్యా హై’’ అంటూ ఆడవాళ్లను వస్తువులుగా, సెక్స్ సింబల్స్‌గా చేసి పాటలు రాయడం.. స్టెప్పులు వేయించి.. కాసులు కురిపించుకోవడం భారతీయ సినిమా అలవోక వ్యవహారం. ఇలాంటి వాటికి తన ర్యాప్‌తో ఝలక్ ఇచ్చింది లిల్లీ సింగ్. ఆడవాళ్ల శరీరాకృతిని కాదు ఆమె ఆత్మవిశ్వాసాన్ని వర్ణించమని.. ఆబ్జెక్ట్‌లా కాదు మనిషిలా చూడమని.. కట్టూబొట్టూ తీరుతో జడ్జ్ చేయొద్దని.. లేబుల్ వేయొద్దని.. మగవాళ్ల నిగ్రహలేమికి ఆడవాళ్ల కట్టూబొట్టూ తీరుని కారణంగా చూపొద్దని.. రంగు, కొలతలతో బేరీజు వేయొద్దని.. ఎలా ఉన్నా ఆమె ఇష్టాన్ని అభిరుచిని, వ్యక్తిత్వాన్ని గౌరవించమని చాలా ఘాటుగా జవాబిచ్చింది. లిల్లీ సింగ్. ‘సూపర్ ఉమన్’ అనే పేరున్న యూట్యూబర్ ఆమె. కెనడాలో పుట్టి పెరిగిన భారతీయురాలు. తన రచనలు, షోలతో ఫోర్బ్స్ ప్రతిభావంతుల జాబితాలో పేరు సంపాదించుకుంది. బై సెక్సువల్నని తన సెక్సువాలిటీని బాహటంగా ప్రకటించుకున్న ధీశాలి. ఎన్బీసీ (నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ) నైట్ షోకి హోస్ట్‌గా ఎంపిక చేసింది ఆమెను. ఎన్బీసీ నైట్ షోను నిర్వహించబోతున్న తొలి మహిళ లిల్లీ సింగ్. ఇందాక చెప్పుకున్న తాజా ర్యాప్ ‘‘కాల్ మీ స్మార్ట్ బిఫోర్ యు కాల్ మీ హాటీ’’ అనే వీడియోతో వార్తా విశేషంగా మారింది. స్టీరియోటైప్ భావాలు, భావనలు, అభిప్రాయాలను బ్రేక్ చేస్తోంది. బ్రేక్ ది సైలెన్స్ అంటోంది ఝీల్ గొరాడియా. పాతికేళ్ల ఈ ఆర్టిస్ట్.. స్త్రీల పట్ల వివక్షను, జరుగుతున్న అన్యాయాన్ని తన పెయింటింగ్స్ ద్వారా ఎత్తి చూపుతోంది. ముంబైలోని వీధులనే కాన్వాస్‌గా చేసుకొని నిరసన రంగులను అద్దుతూ ‘‘బ్రేక్ ది సైలెన్స్’ అనే పేరుతో క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. సామాన్య జనాలకు తేలిగ్గా అర్థమయ్యేందుకు బాలీవుడ్ చిత్రీకరిస్తున్న స్త్రీ పాత్రలనే తన కళకు థీమ్‌గా మలచుకుంటోంది. ‘‘మహిళలు తమ హక్కుల గురించి మాట్లాడకుండా వాళ్ల నోరు నొక్కేస్తుంది సమాజం. ‘‘అందుకే నా క్యాంపెయిన్ పేరు ‘బ్రేక్ ది సైలెన్స్’ అని పెట్టా. సోషల్ జస్టిస్కోసం గళమెత్తాల్సిందే’’ అంటుందీ ముంబై వాసి. రైట్ టు ప్లెజర్ ‘‘స్త్రీ శరీరం గుడి కాదు. పవిత్రం, అపవిత్రాలకు చోటు లేదు. లైంగికేచ్ఛను బయటకు చెప్పుకునే హక్కు వాళ్లకూ ఉంది. సంతోషం, ఆనందం వాళ్లకూ కావాలి. అవి వాళ్లకు చెందనీయకుండా ‘‘బరితెగింపు’ అనే లేబుల్‌తో భయపెడుతోందీ సమాజం’’ అంటుంది ప్రియా మాలిక్. డెహ్రాడూన్‌లో పుట్టి పెరిగిన ప్రియా ఆస్ట్రేలియాలో ఉంటారు. టీచర్, స్లామ్ పొయెట్, స్టాండప్ కమెడియన్ కూడా. 2014లో ఆస్ట్రేలియా ‘బిగ్ బ్రదర్’ షోలో పాల్గొని ఫైనల్ వరకూ ఉన్నారు. అలాగే మన దగ్గర ‘‘బిగ్‌బాస్ సీజన్ 9’లోనూ పాల్గొన్నారు. ‘‘రైట్ టు ప్లెజర్’’ పేరుతో ఆమె చదివిన కవిత సంచలనం సృష్టించింది. అంతేకాదు ‘‘మై బాడీ ఈజ్ నాట్ ఎ టెంపుల్’’ అనే హ్యాష్ ట్యాగ్ ఉద్యమాన్నీ నిర్వహిస్తున్నారు.కట్టూ, బొట్టూ తీరు చెప్పి గడపకే కట్టిపడేయాలనే తలపులను, చేతలను ఎప్పటికప్పుడు అచేతనం చేస్తూ సమానత్వం కోసం పోరాడాలనే చేతన కలగచేస్తున్న ఇలాంటి కళాకారులు ఇంకెందరో! -
యాంకర్ వస్త్రాధారణపై విమర్శలు
సూరత్: ఇటీవల బీజేపీలో చేరిన బాలీవుడ్ నటి మౌస్మీ చటర్జీ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఓ మహిళ యాంకర్ వస్త్రాధారణపై ఆమె విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే.. సూరత్‌లోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశానికి మౌస్మీ హాజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభంలో అతిథుల పేర్లు చదువుతున్న యాంకర్ చేతిలో నుంచి మైక్ లాక్కున్న మౌస్మీ, ఆమె వస్త్రాధారణను తప్పుబట్టారు. యాంకర్ ప్యాంట్ ధరించడం సరికాదని మౌస్మీ వ్యాఖ్యానించారు మౌస్మీ యాంకర్‌తో మాట్లాడుతూ.. ‘నువ్వు ధరించిన దుస్తులు సరిగాలేవు. నువ్వు చీర కానీ, డ్రెస్(చుడీదార్) కానీ ధరించాల్సింది. పబ్లిక్ ఈవెంట్లకు హాజరయ్యేటప్పుడు డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేను నీకు ఇది ఓ తల్లిగా భావించి చెబుతున్నాను. పబ్లిక్‌లో నా కూతుళ్లు ఇలాంటి డ్రెస్స్‌లు ధరించడాన్ని నేను అంగీకరించన’ని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే తాను ఈ సమావేశానికి హాజరయినట్టు ఆమె మీడియాకు తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మరో రెండ్రోజులు వానలు
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
రోజు రూ.2 కోట్లకుపైగానే..
టీబీ నియంత్రణకు కృషిచేయాలి
కేంద్రాల వద్ద టార్పాలిన్లు కరువు..
చెంచుల అభిప్రాయం మేరకే ముందుకు..
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
అన్నదాతల అగచాట్లు
రోజు రూ.2 కోట్లకుపైగానే..
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement