drowned
-
Bihar: విషాదాన్ని మిగిల్చిన పండుగ.. నీట మునిగి 46 మంది మృతి
పాట్నా: బిహార్‌లో జివుతియా పండుగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో 46 మంది నీట మునిగి మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు.కాగా బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ‘జీవిత్పుత్రిక’ పండుగ జరుపుకున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతో పాటు పిల్లలతో కలిసి నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు.వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీసినట్లు విపత్తు నిర్వహణ విభాగం(డీఎండీ) అధికారులు తెలిపారు. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ విషాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని సీఎం నితీష్‌కుమార్ వెల్లడించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. -
అపస్మారక స్థితిలో రాత్రంతా రోడ్డుపైనే..
భవానీపురం(విజయవాడ పశ్చిమ): మందుల కోసం వెళ్లి వరద నీటిలో మునిగిన ఓ యువకుడు.. రాత్రంతా రోడ్డుపైనే ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నక్కా ప్రభుదాస్ తన కుటుంబసభ్యులతో కలిసి వైఎస్సార్ కాలనీ బ్లాక్ 129లో నివసిస్తున్నాడు. బుడమేరుకు వరద రావడంతో సమీపంలో నివసిస్తున్న ఆయన అత్త సామ్రాజ్యం కూడా వారి వద్దకే వచ్చింది. ప్రభుదాస్ కుమారుడు ప్రశాంత్(24) గత ఆదివారం సాయంత్రం అమ్మమ్మ మందుల కోసం వరద నీటిలో ఆమె ఇంటికి వెళ్లాడు. మందులు తీసుకుని తిరిగి వస్తూ నీళ్లలో పడిపోయిన ప్రశాంత్‌ను స్థానికులు కాపాడి.. ఓ పడవలో ఎక్కించారు. ఆ పడవ నడిపే వ్యక్తి ప్రశాంత్‌ను నైనవరం ఫ్లై ఓవర్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అప్పటికే స్పృహ తప్పిన ప్రశాంత్ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. సోమవారం ఉదయం పది గంటలకు తెలిసిన వ్యక్తి.. ప్రశాంత్‌ను గుర్తించి ఇంటికి చేర్చాడు. ప్రశాంత్ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. తన కుమారుడికి వైద్యం కోసం దాతలు సాయం చేయాలని ప్రభుదాస్ కోరుతున్నాడు.పడవలోనే ప్రసవంతల్లీబిడ్డ క్షేమంనిండు గర్భిణికి నొప్పులు వస్తున్నాయని..ఆమెకు సహాయం అందించాలని వీఎంసీ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు సమాచారం వచి్చంది. ఆమెను బోటులో ఆస్పత్రికి తరలిస్తుండగానే అందులోనే డెలివరీ అయ్యింది. వాంబే కాలనీకి చెందిన షకీనాబీకి శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు నొప్పులు వచ్చాయి. ఆమెను సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వరకు తరలించే దారిలో, నొప్పులు అధికంగా రావటంతో విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన బోటులోనే షకీనాబీకి ప్రసవమైంది. విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ వారి బృందం అజిత్ సింగనగర్ ఫ్లై ఓవర్ వద్దకు బోటును తీసుకువచ్చాక అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. –పటమట (విజయవాడ తూర్పు) -
Maharashtra: నీట మునిగిన పురాతన ఆలయాలు
మహారాష్ట్రలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని ముంబైలోని పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పూణే, నాసిక్, సాంగ్లీ, కొల్హాపూర్‌లలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. థానే, లోనావాలా, మహాబలేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నాసిక్‌లోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఆర్మీ బృందాలను సమాయత్తమయ్యాయి.నాసిక్‌లో కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు గంగాపూర్ డ్యామ్ పొంగిపొర్లుతోంది. గోదావరి నది ఉప్పొంగడంతో గోదా ఘాట్ వద్దనున్న పలు చారిత్రక ఆలయాలు నీట మునిగాయి. వరదల దృష్ట్యా నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక యంత్రాంగం సూచించింది. ముందుజాగ్రత్త చర్యగా గోదా ఘాట్‌లోని దుకాణాలను మూసివేశారు. #WATCH | Maharashtra: Various temples were inundated under the Godavari river in Nashik, following incessant rainfall in the region. pic.twitter.com/oHjGYbTvDs— ANI (@ANI) August 5, 2024 -
రావూస్ కోచింగ్ సెంటర్ కేసు.. సీబీఐకి అప్పగించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్లో వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన కేసు దర్యాప్తును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు యాక్టింగ్ సీజే మన్మోహన్, జస్టిస్ తుషార్రావులతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇంత పెద్ద ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని సమాజానికి భరోసా ఇచ్చేందుకే కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు విద్యార్థులు భవనం కింద వరద నీటిలో మునిగి మృతి చెందడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.ఇంకా నయం.. వరద నీటిని అరెస్టు చేయలేదు..విధులు సరిగా నిర్వహించకపోవడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు మందలించింది. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులను విచారించకుండా ఘటన జరిగిన సమయంలో కోచింగ్‌సెంటర్ పక్కనుంచి వెళ్లిన కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేయడమేంటని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టింది. దయతలచి భవనం కిందకు వచ్చిన వరద నీటిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టారని పోలీసులపై కోర్టు సెటైర్లు వేయడం గమనార్హం. -
రష్యాలో భారతీయ వైద్య విద్యార్థుల మృతి
మాస్కో: రష్యాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని ఓ నదిలో భారత్‌కు చెందిన నలుగురు వైద్య విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. వీళ్లంతా బతికే అవకాశం లేదని రెస్క్యూ టీం చెబుతోంది. ఇప్పటికే ఒక మృతదేహానికి వెలికి తీసింది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చేపట్టింది. మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందిన ఈ నలుగురు సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని నోవ్‌గొరోడ్ స్టేట్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత నీటిలో మునిగిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడానికి మిగిలిన స్నేహితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు నదిలో కొట్టుకుపోగా.. ఒక విద్యార్థిని మాత్రం స్థానికులు కాపాడగలిగారు. విద్యార్థుల మృతదేహాల్ని వెలికి తీసి.. వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నామని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. -
శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి, నిజామాబాద్: మహాశివరాత్రి పండుగపూట నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద శుక్రవారం జరిగింది. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరంతా జక్రాన్‌పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు యువకులు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మహాశివరాత్రి నాడు విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు -
బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ముగ్గురు కార్మికులు గల్లంతు
సాక్షి, సిద్దిపేట జిల్లా: జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ కోసం చెరువులో చెత్తను తొలగిస్తుండగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికులు గిరిపల్లి బాబు, గిరిపల్లి భారతి, యాదమ్మల కోసం స్థానికులు గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: కూతురు ప్రేమ వ్యవహారం.. ఉన్మాదిగా మారిన తండ్రి ఏం చేశాడంటే -
సాత్నాల వాగులో రిమ్స్ పీజీ వైద్యుడి గల్లంతు.. మృతదేహం లభ్యం
సాక్షి, ఆదిలాబాద్: సెల్ఫీ సరదా పీజీ వైద్యవిద్యార్ధి ప్రాణాలు తీసింది. ఆదివారం శివ్‌ఘాట్ సందర్శనకు వెళ్లి సాత్నాల వాగులో గల్లంతైన ఆదిలాబాద్ రిమ్స్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్థోపెడిక్ వైద్యుడు భుక్యా ప్రవీణ్ (27) మృతదేహం సోమవారం లభించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రవీణ్ రిమ్స్‌లో పీజీ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం కావడంతో తొమ్మిది మంది మిత్రులు ఆదిలాబాద్ వినాయక్ చౌక్ నుంచి ఆదిలాబాద్ రూరల్ మండలం మీదుగా శివ్‌ఘాట్ వెళ్లారు. పక్కనే ఉన్న సాత్నాల వాగు వద్ద కోటి లింగాలను దర్శించుకున్నారు. అనంతరం వాగు అందాలను సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రవీణ్ ఫోన్ వాగులో పడిపోవడంతో, దాని కోసం అందులోకి దిగాడు. ఈ క్రమంలో ప్రవాహంలో కొట్టుకుపోయా డు. అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు స్నేహితులు వాగులోకి దిగగా ఉక్కిరిబిక్కిరి కావడంతో బయటకు వచ్చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడటంతో గాలింపు కష్టంగా మారినట్లు తెలిపారు. నేడు మళ్లీ ఐదుగురు గజ ఈతగాళ్లతో అన్వేషణ చేపట్టగా ప్రవీణ్ మృతదేహం లభించింది. వాగులో నుంచి బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. కాగా సిరిసిల్లా జిల్లాకు చెందిన తల్లిదండ్రులకు పోలీసులు ప్రవీణ్ గల్లంతు సమాచారం ఇచ్చారు. వారు వాగువద్దకు చేరుకొని కొడుకు మరణ వార్త విని, మృతదేహం చూసి తీవ్రంగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి భరోసానిస్తాడని భావించామని, తీరా ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఇదిలా ఉండగా ప్రవీణ్‌నుక కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుల్లో ఒకరైన కార్తీక్ అస్వస్థతకు గురికావడంతో రిమ్స్‌లో కోలుకుంటున్నాడు. ప్రవీణ్ తప్ప మిగిలిన ఎనిమిది మంది సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
గోదావరిలో పడవ బోల్తా ..ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆచంట: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం బీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. పడవ బొల్తా పడటంతో ఇద్దరు గల్లంతయ్యారు. అధిక కొబ్బరి లోడుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతయిన బాధితులు వల్లురూ గ్రామనికి చెందిన కుడిపుడి పెద్దిరాజు(58), దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సిరగం వెంకటన రమణ(35)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు. సామార్థ్యానికి మించి కొబ్బరి కాయల లోడు ఎక్కించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పడవలో మొత్తం ఐదుగురు ఉన్నారని అందులో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధత) -
నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు
సాక్షి, నల్లగొండ: హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వచ్చిన ముగ్గురు యువకులు నాగార్జున సాగర్‌లో గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని చంద్రకాంత్ (20), నాగరాజు(39), వాచస్పతి(26)గా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరు నల్గొండ వాసులు కాగా, మరొకరు హాలియకు చెందిన వ్యక్తి. ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్నీరుమున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి.. -
కృష్ణానదిలో విద్యార్థుల గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
కృష్ణానదిలో నలుగురు విద్యార్థుల గల్లంతు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కృష్ణానదిలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని విజయవాడ పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. యనమలకుదురు దగ్గర ఘటన జరిగింది. ఈతకు వెళ్లి గల్లంతైనట్టు స్థానికులు గుర్తించారు. ఈ రోజు మధ్యాహ్నం ఈత కొట్టడానికి కృష్ణానది దిగువ పాయలకు విద్యార్థులు వెళ్లారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు వెళ్లినట్టు సమాచారం. క్షేమంగా ముగ్గురు విద్యార్థులు బయటపడ్డారు. గల్లంతైన ఐదుగురిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన నలుగురి ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, అధికారులు చేరుకున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఎంత పనిచేశాడంటే? -
నదిలో మునిగి ఇద్దరు పిల్లల మృతి
మధిర/ పెనుబల్లి: రెండు వేర్వేరుచోట్ల నలుగురు విద్యార్థులు నీటమునిగారు. వీరిలో ఇద్దరు మృత్యువాతపడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద నదిలో మునిగి ఇద్దరు ఖమ్మం జిల్లా పిల్లలు చనిపోగా, ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కాల్వలో పడి గల్లంతయ్యారు. మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో జెల్లా కృష్ణారావు ఆధ్వర్యాన సరస్వతి విద్యాలయం కొనసాగుతోంది. ఈ విద్యాలయానికి చెందిన విద్యార్థులను నాలుగు ఆటోల్లో కృష్ణారావు శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్దకు విహారయాత్ర నిమిత్తం తీసుకువెళ్లారు. వీరితోపాటు తన వద్దకు ట్యూషన్ వచ్చే ఉన్నతపాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి శీలం వెంకట నర్సిరెడ్డి(12) కూడా వెళ్లాడు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలంతా సరదాగా గడిపాక కొద్దిసేపట్లో తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇంతలోనే వెంకటనర్సిరెడ్డి, సరస్వతి పాఠశాలలో నాలుగో తరగతి చదివే జస్వంత్ కలిసి సమీపంలోని మున్నేరు నదిలో ఈతకొట్టేందుకు వెళ్లారు. అక్కడ పొక్లెయినర్‌తో తవ్విన లోతైన గుంతలో ఆ ఇద్దరూ ప్రమాదవశాత్తు పడిపోయారు. స్థానికులు కొందరు ఆ విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి ఒడ్డుకు చేర్చారు. కానీ, అప్పటికే వారు మృతి చెందారు. విహారయాత్రకు వెళ్లిన చిన్నారులు విగతజీవులుగా రావడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకట నర్సిరెడ్డి(ఫైల్), జస్వంత్ (ఫైల్) సాగర్ కాల్వలో పడి.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెన కుంట్లకి చెందిన బీటెక్ విద్యార్థి తల్లపురెడ్డి నరేంద్రరెడ్డి, డిగ్రీ విద్యార్థి అవులూరి నాగనరేందర్‌రెడ్డి శనివారం గ్రామ సమీపంలోని తుమ్మలపల్లి వద్ద నాగార్జునసాగర్ కాల్వలో స్నానం చేయడానికి శనివారం వెళ్లారు. అయి తే, వీరికి ఈత రాకపోవడంతో కాల్వలో పడి గల్లంతయ్యారు. వీరి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విష యం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘటనాస్థలానికి చేరుకుని నీటి ప్రవాహం తగ్గించి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. -
భీమిలీ బీచ్ లో విషాదం ..
-
షాకింగ్ ఘటన.. నాన్నను కాపాడేందుకు వెళ్లి..
తొండంగి(కాకినాడ జిల్లా): సముద్రంలో గల్లంతైన తన తండ్రిని కాపాడేందుకు వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మండలంలోని పెరుమాళ్లపురం పంచాయతీ కొత్తచోడిపల్లిపేట సముద్రతీరంలో గురువారం వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెరుమాళ్లపురం పాత చోడిపల్లిపేటకు చెందిన యదాల వరహాలు (30), చింతకాయలపేటకు చెందిన పిట్ల శ్రీను (28) వినాయక నిమజ్జనంలో భాగంగా సముద్రంలో స్నానానికి దిగారు. స్నానం చేస్తూ మొత్తం పది మంది గల్లంతవ్వగా స్థానిక మత్స్యకారులు శ్రీలం కొండబాబు, యాదాల సుబ్రహ్మణ్యం, కడారి రామారావు, కడారి రాంబాబు, పేకేటి యతిమాని, కడారి రమణలతో పాటు మరో ఇద్దరిని కాపాడారు. వరహాలు, శ్రీను గల్లంతయ్యారు. చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? ముమ్మరంగా గాలింపు గల్లంతైన వారిలో తన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండడంతో కాపాడేందుకు వెళ్లిన వరహాలు గల్లంతయ్యాడు. కాసేపటికి ఇతని మృతదేహం లభ్యంకాగా గల్లంతైన శ్రీను ఆచూకీ కోసం మత్స్యకారులు, అతని బంధువులు గాలిస్తున్నారు. యాదాల వరహాలు తండ్రి సుబ్రహ్మణ్యం కొత్తచోడిపల్లిపేటలో కిరణా షాపు నిర్వహించకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు వరహాలుకు వివాహం కాగా భార్య, రెండున్నరేళ్ల కుమార్తె, 15 రోజుల వయసు గల బాబు ఉన్నారు. చింతకాయలపేటకు చెందిన పిట్ల సుబ్బారావు, సుబ్బలక్ష్మి కుమారుడు పిట్ల శ్రీను, మృతుడు వరహాలు హేచరీలో వర్కర్లుగా పని చేస్తున్నారు. శ్రీనుకు రెండేళ్ల క్రితం అక్క కూతురు ప్రశాంతితో వివాహమైంది. ప్రస్తుతం ప్రశాంతి ఏడు నెలల నిండు గర్భిణి. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతుకావడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని తుని రూరల్ ఎస్సై సన్యాసిరావు, ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్: కొండగావ్ జిల్లాలో విషాదం.. డ్యామ్‌లోకి స్నానానికి దిగిన నలుగురు విద్యార్థుల గల్లంతు
-
విషాదం: బర్త్‌డే వేడుకలకు వెళ్లివస్తూ.. వ్యవసాయ బావిలో పడ్డ కారు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ చౌరస్తా వద్ద గొల్లపల్లి–జగిత్యాల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వ్యవసాయ బావిలో శనివారం రాత్రి సుమారు 11.45గంటల సమయంలో కారు అదుపుతప్పి పడిపోయింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. ఇందులో ఒకరు గల్లంతవగా, నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని మల్యాలకు చెందిన సామల్ల కిశోర్, మరోనలుగురు యువకులు కలిసి కిశోర్ అక్క కూతురు జన్మదిన వేడుకల కోసం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెకు వెళ్లారు. వేడుకల్లో పాల్గొని రాత్రి కారులో తిరిగి వస్తున్నారు. రోదిస్తున్న కుటుంబసభ్యులు ఈక్రమంలో లక్ష్మీపూర్ శివారులోని నల్లగుట్ట కమాన్ వద్ద రోడ్డును ఆనుకుని ఉన్న వ్యవసాయబావిలో కారు అదుపుతప్పి పడిపోయింది. కారుతోపాటు సామల్ల కిశోర్, ఈశ్వర్, సాయిరఘు, గడీల సందీప్, చందు బావిలో పడిపోయారు. సాయిరఘు, సందీప్, చందు, ఈశ్వర్ సురక్షితంగా బయటపడ్డారు. కిశోర్ బావిలో గల్లంతయ్యాడు. నీటిని తోడేస్తున్న అగ్నిమాపక సిబ్బంది బావినుంచి బయటకు వచ్చిన నలుగురు యువకులు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పైపుల ద్వారా నీటిని తోడేస్తూనే క్రేన్ సాయంతో కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, గల్లంతైన కిశోర్(22) కోసం కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రాణాలు తీసిన ఈత సరదా
హయత్‌నగర్: ఈత నేర్చుకునేందుకు బావిలో దిగిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం ఆర్కే నగర్‌కు చెందిన మోదుగుల పరశురాం, మోదుగుల నర్సింహ అన్నదమ్ములు. వృత్తిపరంగా వీరిద్దరూ డ్రైవర్లు. ఇద్దరికీ ఇద్దరు చొప్పున కుమారులున్నారు. నర్సింహ చిన్న కొడుకు దుర్గాప్రసాద్ (12) తట్టి అన్నారం ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. పరశురాం కొడుకు శ్రీకాంత్ (15) అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం నర్సింహ పెద్ద కొడుకు రాఘవేందర్‌తో కలిసి చిన్న కొడుకు దుర్గాప్రసాద్, పరశురాం కొడుకు శ్రీకాంత్‌లు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఈత నేర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లిద్దరూ నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని పసిగట్టి బావిలోనే ఉన్న రాఘవేందర్ కేకలు వేయడంతో సమీపంలోనే పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు హుటాహుటిన వచ్చి దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లను నీటిలోంచి బయటికి తీశారు. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే వీరిద్దరూ మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మొదటి రోజునే దుర్ఘటన జరగడం విద్యార్థుల కుటుంబ సభ్యులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. -
‘ఈత’రాన్ని మింగేసిన చెరువు
ధర్మపురి: ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసులు అందించిన వివరాలివి.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన మారంపెల్లి శరత్ (12), నవదీప్ (12)తో పాటు నల్గొండ జిల్లా దోసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్ (13) ఆదివారం ఉదయం పాఠశాల పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. గతేడాది మిషన్ కాకతీయ కింద చెరువులో మట్టి తీయడంతో నీటి లోతు తెలియలేదు. దీంతో చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. కొంత సమయం తర్వాత గ్రామస్తులకు చెరువు పక్కన చెప్పులు కనిపించడంతో ఆందోళనతో కేకలు వేశారు. సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు.. గ్రామస్తుల కేకలు విని మూడు మృతదేహాలను బయటికి తీశారు. శరత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి, యశ్వంత్ ఎంపీపీఎస్ పాఠశాలలో 4వ, తరగతి, నవదీప్ ధర్మపురిలోని కేరళ ఇంగ్లిష్ మీడియంలో 4వ తరగతి చదువుతున్నారు. బతుకుతెరువు కోసం నవదీప్ తండ్రి కిషన్ రెండేళ్ల క్రితం, శరత్ తండ్రి సత్తయ్య 10 నెలల క్రితం దుబాయ్ వెళ్లారు. యశ్వంత్ తల్లిదండ్రులు వారం క్రితం స్వగ్రామం నల్గొండ జిల్లాకు వెళ్లారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు చెరువు వద్దకు తరలివచ్చి కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. -
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
-
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
సాక్షి, వరంగల్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి (55)కి దుగ్గొండి మండలం అడవిరంగాపురం శివారు రాళ్ల కుంట పక్కనే వ్యవసాయ భూమి ఉంది. అందులో వేసిన మొక్కజొన్న పంట కోసి నూర్పిడి చేశాడు. మొక్కజొన్నలను బస్తాల్లో నింపడానికి కృష్ణమూర్తి, ఆయన భార్య విజయ, కొడుకు నాగ రాజు (34), కోడలు సంధ్య, ఇద్దరు మనవలు దీపక్ (11), కార్తీక్ సెలవు దినం కావడంతో చేను వద్దకు వచ్చారు. పంటను బస్తాల్లో నింపి చేతులు, కాళ్లు కడుక్కోవడానికి కృష్ణమూర్తి, మనవడు దీపక్ ఇద్దరూ కుంట వద్దకు వెళ్లారు. దీపక్ నీటిని చూసి ఉత్సాహంగా అందులోకి దిగి మునిగాడు. వెంటనే గమనించిన తాత కృష్ణమూర్తి మనవడిని రక్షించబోయి తను కూడా మునిగాడు. ఎంతకూ తండ్రి, కొడుకు రాకపోవడంతో కుంట వద్దకు వెళ్లిన నాగరాజు.. ఇద్దరూ మునుగుతూ.. తేలుతుండటం చూశాడు. వారిని రక్షించే క్రమంలో నాగరాజు సైతం కుంటలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు ఒకేసారి మృతి చెందడంతో చిన్న గురిజాల, అడవిరంగాపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించి.. కుంటలోని మృత దేహాలను బయటకు తీయిం చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్ఐ నవీన్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరి శీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుంటలో మునిగి మృతి చెందడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. -
అమరావతి నదిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
సాక్షి, చెన్నై : అమరావతి నదిలో స్నానానికి వెళ్లిన ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తారాపురం ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. వివరాలు.. తిరుప్పూర్ నగరం పరిధి లోని మంగళం ఇడుంబి ప్రాంతానికి చెందిన 13 మందితో కూడిన బృందం దిండుగల్ మాంపారైకు వెళ్లి.. సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో మధ్యాహ్నం వేళ అమరావతి నదిలో స్నానానికి ఈ బృందం సిద్ధమైంది. తారాపురం పరిసరాల్లో అమరావతి నదిలో స్నానానికి నిషేధం విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నా, వాటిని వీరు పట్టించుకోలేదు. చదవండి: Jallikattu: రంకేసిన.. పౌరుషం.. బుసకొట్టిన బసవన్న.. కార్తీక్‌కు కారు గిఫ్ట్ బైపాస్ రోడ్డును ఆనుకుని ప్రవహిస్తున్న నదిలో 8 మంది స్నానానికి దిగారు. హఠాత్తుగా బురదలో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత మరొకరు నీట మునగడాన్ని ఒడ్డు నుంచి చూసిన మిగిలిన వారు కేకలు పెట్టడంతో స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అయితే నది లో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో రక్షించడం కష్టతరంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. సాయంత్రం ఆరు గురి మృతదేహాలను గుర్తించారు. ఇద్దరు కొన ఊపిరితో బురదలో కూరుకుపోయి ఉండడంతో వారిని తారాపురం ఆస్పత్రికి తరలించారు. ఇక మృతి చెందిన వారిలో ఇడంబి ప్రాంతానికి చెందిన మోహన్, రంజిత్, శ్రీధర్, యువన్, అమీర్, చక్రవర్తి ఉన్నారు. వీరి మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్కను రక్షించబోయి.. ఎస్సార్బీసీలో పడి యువకుడు గల్లంతు
అవుకు: శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ)లో పడిన పెంపుడు కుక్కను రక్షించబోయి ఓ యువకుడు నీళ్లలో కొట్టుకోపోయాడు. రామవరం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. రామవరం గ్రామానికి చెందిన నాగరాజు, నారాయణమ్మ కుమారుడు మాసుబాకల నరేష్ (18).. ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో మంగళవారం గేదెలను మేపటానికి వెళ్లాడు. వెంట ఉన్న కుక్క గ్రామ శివారులోని ఎస్సార్బీసీలో పడిపోయింది. దానిని రక్షించటానికి వెళ్లిన ఆయువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న ఓ బాలుడు గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు క్రేన్ సహాయంతో ఈతగాళ్లను కాలువలోకి దించి రాత్రి వరకు గాలించారు. అయినా, యువకుడి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయి ఉంటాడని స్థానికలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. -
స్వర్ణముఖి నదిలో ముగ్గురు చిన్నారుల గల్లంతు
సాక్షి, తిరుపతి: స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతవ్వగా, ఒకరిని స్థానికులు రక్షించారు. గల్లంతైన మరో ముగ్గురు ధోని(17), గణేష్(15), యుగంధర్(14) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నికిత్ సాయి అనే బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. రేణిగుంట మండలం జీ పాలెం వద్ద ఘటన చోటుచేసుకుంది. హరిజనవాడకు చెందిన చిన్నారులుగా గుర్తించారు. చదవండి: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి.. ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి ఆరా.. చిన్నారుల గల్లంతుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరా తీశారు. ఇంఛార్జ్ కలెక్టర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేతో మాట్లాడారు. గల్లంతయిన చిన్నారులను రక్షించేందుకు తక్షణం గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలని మంత్రి ఆదేశించారు. ఘటనపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. ముగ్గురు యువకులు గల్లంతు కావడం బాధాకరమన్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బలగాలు పిలిచామన్నారు. -
కొడిగట్టిన నవ‘దీపం’
అనంతపూర్: ప్రమాదవశాత్తు నీటిలో పడిన బాలుడిని కాపాడబోయి ఓ పండుటాకు రాలిపోయింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ‘నవదీపం’ కొడిగట్టకుండా ప్రాణాలకు తెగింన వృద్ధుడి సాహసమూ గంగ పాలైంది. పెన్నమ్మ ఒడిలో రెండు నిండు ప్రాణాలు శాశ్వతంగా నిద్రపోయాయి. చౌళరు శోకసంద్రమైంది. వివరాలు.. హిందూపురం మండలం చౌళరుకు చెందిన తలారి నరసింహప్ప కువరుడు నవదీప్ (10) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుం ఇంటికి చేరుకున్న బాలుడు.. తోటి స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పెన్నానదిలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి పోయాడు. ఆ సమయంలో చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న వృద్ధుడు నరసింహమూర్తి (65) అప్రమత్తమై వెంటనే నీటిలో దిగాడు. నీటిలోపల బాలుడి కోసం గాలిస్త ఊపిరి ఆడక అతను విగతజీవిగా మారాడు. అప్పటికే చిన్నారుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున పెన్నానదికి చేరుకుని నీటిలో గాలింపు చేపట్టారు. కాసేపటికి వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న హిందూపురం రరల్ పోలీసులు, అగ్నివపక సిబ్బంది, గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకుని నీటి గుంతలో గాలింపు చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. వృద్ధుడి సాహసం వృథా కావడంపై పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహం కనిపించగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.