Duniya Vijay
-
దునియా విజయ్ కేసులో నేడు తుది తీర్పు.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని కన్నడ హీరో దునియా విజయ్ 2018లోనే కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, నేడు తుది తీర్పును కోర్టు వెళ్లడించనుంది. దీంతో ఆయన ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. వీర సింహా రెడ్డి చిత్రంలో విలన్‌గా నటించిన ఆయన తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు.నాగరత్న,దునియా విజయ్, అతని రెండవ భార్య కీర్తి మధ్య అప్పట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఎప్పుడూ వారు వార్తల్లో నిలిచేవారు. కుటుంబ గొడవలు వీధినపడటంతో మంచిది కాదని భావించిన విజయ్ నాగరత్నతో తెగతెంపులు చేసుకోవాలని భావించి బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నాడు. ఆపై 2019లో దునియా విజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు. నాగరత్నతో కలిసి జీవించలేనని పేర్కొన్నాడు. ఆ సమయం నుంచి విజయ్ తన రెండో భార్య కీర్తితోనే ఉన్నాడు. దాదాపు 6 ఏళ్లుగా కోర్టులో వీరి విడాకుల కేసు విచారణ జరుగుతుండగా.. ఈ సాయింత్రం తుది తీర్పు వెలువడనుంది.నాగరత్నతో దూరంగా ఉన్న విజయ్ పిల్లల బాధ్యత మాత్రం తనే తీసుకుంటానని ఆప్పట్లోనే తెలిపాడు. నాగరత్నకు భరణం కూడా చెల్లించినట్లు ఆయన గతంలో చెప్పాడు. అయితే, కోర్టుకు వచ్చిన ప్రతిసారీ తనకు భర్త కావాలని నాగరత్న చెప్పేదని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. విజయ్ తన పిల్లలను ఇతర దేశాల్లోనే చదవించాడు. కొద్దిరోజుల క్రితం విజయ్ పెద్ద కూతురు రితన్య మొదటి సినిమాని ప్రకటించింది. రెండో కూతురు మోనిక విదేశాల్లో చదువుకుంటుంది. కుమారుడు సామ్రాట్ కూటా తన చదువు పూర్తి అయిన తర్వాత సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన స్టార్ హీరో కూతురు
ఏప్రిల్ 26న కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలు తమ గ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. ఈ కోవలో కన్నడ టాప్ హీరో దునియా విజయ్ కూతురు మోనిషా కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే దునియా విజయ్ కూతురు మోనిషా అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతుంది. ఏప్రిల్ 26న ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆమెరికా నుంచి బెంగళూరుకు చేరుకుంది. తండ్రి మాదిరి మోనిషా కూడా సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటుంది. ఈ విషయంపై ఆమె ఇలా చెప్పింది. 'నేనూ, మా చెల్లి మోనికా ఇద్దరమూ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాం. నాన్నకు మొదట నచ్చలేదు. సినిమాల్లోకి వద్దని ఆయన చెప్పారు. కానీ, నా సీరియస్‌నెస్ చూసి ఒప్పుకున్నారు.సినిమా ఇండస్ట్రీకి వస్తే సరైన శిక్షణ తీసుకోవాలని నాన్న గారు సూచించారు. నటనతో పాటు సినిమాల్లోని వివిధ దశలు, సాంకేతికత, మీడియాను ఎలా ఎదుర్కోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. ఇలా అన్నీ సరిగ్గా నేర్చుకుని రావాలని నాన్న సూచించారు. దీంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నన్ను చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాను. కోర్సు పూర్తయ్యాక శాండల్ వుడ్‌కి తప్పకుండా వస్తాను.' అని చెప్పింది మోనిషా.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నాడు. -
ప్రముఖ హీరో మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం ద్వారా కన్నడ హీరో దునియా విజయ్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డిగా ఆయన విలన్ పాత్ర పోషించాడు. అక్కడ చిత్ర సీమలో ఆయనకు తనదైన స్టార్డమ్ ఉంది. దునియా విజయ్ కొద్దిరోజుల క్రితం తన స్వగ్రామం కుంబరనహళ్లిలో పర్యటించారు. తన స్వగ్రామంలో ఎంతో ఉత్సాహంగా ప్రతి వీధి వెంట ఆయన తిరిగాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను అక్కడ స్థానికులతో పంచుకున్నాడు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపాడు. నేడు (జనవరి 20న) తన పుట్టినరోజును స్వగ్రామంలోనే జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా కుంబరహళ్లిలో కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లిన కొన్ని కుటుంబాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. తమ కుటుంబ సభ్యులను జైలు నుంచి విడుదల చేసేలా చూడాలని విజయ్‌ని వారు కోరారు. దీంతో ఆయన వెంటనే తన లాయర్లతో సంప్రదించి తన స్వగ్రామానికి చెందిన 6 మంది ఖైదీలను విడిపించారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలను నటుడు విజయ్ స్వయంగా విడుదల చేపించారు. కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు తమతో లేకుండా జీవించడం చాలా కష్టం. అలాంటి బాధ ఎవరికీ రాకూడదని విజయ్ చెప్పాడు. గతంలో ఒక సినిమా షూటింగ్ కోసం మైసూర్ జైలుకు దునియా విజయ్ వెళ్లాడు. అక్కడ పలువురు ఖైదీలతో మాట్లాడి వారి కష్టాలు, సంతోషాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధ ఖైదీలు జరిమానా చెల్లిస్తే విడుదల చేసేందుకు అనుమతి ఉంది. కానీ వారి వద్ద చెల్లించేందుకు డబ్బు లేదు. ఈ విషయం తెలుసుకున్న విజయ డబ్బు సహాయం చేసి 62 మంది ఖైదీలను అక్కడి నుంచి విడుదల చేపించారు. ప్రస్తుతం వారి స్వస్థలం కుంబరనహళ్లిలోని 6 మంది ఒక కేసులో ఖైదీలుగా ఉన్న వారి పరిస్థితి కూడా అలాంటిదే. శిక్ష కాలం పూర్తి అయినా జరిమానా చెల్లించేందుకు వారి వద్ద డబ్బు లేదు. దీంతో వారు అదనపు శిక్షను అనుభవిస్తున్నారు. తన లాయర్ ద్వారా ఆ డబ్బును చెల్లించి తన స్వగ్రామానికి చెందిన ఆరుగురిని కస్టడీ నుంచి విడిపించారు. సలగ సినిమా ఘనవిజయం తర్వాత దునియా విజయ్ కన్నడ చిత్ర పరిశ్రమలో తనదైన స్టార్‌డమ్‌ని పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ భీమ్ చిత్రంలో నటిస్తున్నాడు. నేడు (జనవరి 20న) దునియా విజయ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో స్వగ్రామంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో తన కోసం ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టవద్దని అభిమానులను ఆయన అభ్యర్థించాడు. -
'వీర సింహారెడ్డి' విజయోత్సవం..(ఫొటోలు)
-
సినిమా మధ్యలో ఆగితే రూ.12 లక్షలు ఇచ్చా, ఇంట్లో గొడవలు..
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా తల్లిదండ్రులే నా దేవుళ్లు. వారి ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్‌కు ముందు అమ్మానాన్న ఇద్దరూ చనిపోయారు. ఈ సినిమా చూడకుండానే నా తల్లి మరణించారన్న బాధ ఉంది. దునియా సినిమా మధ్యలో ఆగిపోతే నేను రూ.12 లక్షలు ఇచ్చాను. అప్పుడు ఇంట్లోవాళ్లతో గొడపడి మరీ ముందడుగు వేశాను. చివరికి సినిమా సూపర్ హిట్ కావడమే కాక నా ఇంటి పేరుగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను. కానీ తెలుగులోకి రావడానికి చాలాకాలం పట్టింది. మొదట తెలుగులో లవకుశ సినిమా ఆఫర్ వచ్చింది కానీ అప్పుడు కన్నడలో బిజీ ఉండి చేయలేకపోయాను. తర్వాత గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమా గురించి సంప్రదించాడు. ముసలిముడుగు ప్రతాప్‌రెడ్డి రోల్ చేయాలన్నారు. ఆ రోల్ గురించి చెప్పగానే ఓకే చెప్పేశా. ఎప్పుడెప్పుడు పాత్ర చేయాలా? అని ఎదురుచూశాను. సినిమా అదిరిపోతుంది' అని చెప్పుకొచ్చాడు దునియా విజయ్. చదవండి: ఆ పాట, ఆ సన్నివేశం నా ఆల్‌టైమ్ ఫేవరెట్: రాజమౌళి -
బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను..ఆయనది గొప్ప వ్యక్తిత్వం
‘‘బాలకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను.. అలాంటిది ఆయనతో కలసి నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్లో చూసినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను.. ఆయనది గొప్ప వ్యక్తిత్వం’’ అని నటుడు దునియా విజయ్ అన్నారు. బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు దునియా విజయ్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ‘వీరసింహారెడ్డి’ లో నా పాత్ర (ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి) గురించి చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. చాలా మొరటుగా ఉండే నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణగారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఎనర్జీ సూపర్.. పనిపట్ల అంకితభావం గొప్పగా ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’ ఆయన అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ. ఒక నటుడిగా అన్ని పాత్రలూ చేయాలని ఉంటుంది. ఈ సినిమా తర్వాత కూడా మంచి పాత్రలు వస్తే విలన్‌గా చేయడానికి సిద్ధమే. నటన, దర్శకత్వం వేర్వేరు. నటుడిగా చేస్తున్నప్పుడు నా దృష్టి కేవలం నటనపైనే ఉంటుంది. దర్శకునిగా చేస్తున్నప్పుడు నా నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ ఉంటుంది. ప్రస్తుతం కన్నడలో ‘భీమ’ అనే చిత్రంలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాను. తెలుగులోనూ కొన్ని చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రానున్న 'మహాబలి'..
Mahabali Ready To Release In Telugu: ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ హీరోగా డా. భారతి, కల్యాణి రాజు హీరోయిన్స్ గా కన్నడంలో రూపొందిన చిత్రం 'జయమ్మన మగ'. ఈ చిత్రానికి రవికిరణ్ వికాస్ దర్శకత్వం వహించారు. ఇటీవలే రిలీజై సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం రూ. 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మార్డురి వెంకటరావు 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మార్డురి వెంకట్రావు మాట్లాడుతూ "100 పర్సెంట్ యాక్షన్ అండ్ లవ్ తో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా కన్నడంలో రూపొందిన 'జయమ్మన మగ' చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని మా శ్రీ జె. వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. హార్రర్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇది మరొక సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఐదు పాటలు చాలా డిఫరెంట్ గా కంపోజ్ చేసాడు. అలాగే రీ రికార్డింగ్ అద్భుతంగా చేసాడు. దర్శకుడు రవికిరణ్ టేకింగ్, దునియా పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హై లైట్ గా నిలిచాయి. భారతీబాబు మాటలు, పాటలు అద్భుతంగా రాసారు. త్వరలో ఆడియో రిలీజ్ చేసి అదే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. -
బాలకృష్ణ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న కన్నడ స్టార్
Duniya Vijay’s First Look In debut Telugu Movie: కన్నడ స్టార్ దునియా విజయ్ తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు దునియా విజయ్. ఈ చిత్రంలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారాయన. ఈ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘‘హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. బాలకృష్ణ కెరీర్లో 107వ చిత్రమిది. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది’’ అని చిత్రబృందం పేర్కొంది.ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషీ పంజాబీ, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కేవీవీ. -
#NBK107తో సరికొత్త విలనిజం చూపెడదాం: మాస్ డైరెక్టర్
Duniay Vijay Plays Vilian Role In Balaksrishna Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపేసారు. అలాగే ఆహా ఓటీటీలో వస్తున్న 'అన్‌స్టాపబుల్ షో'కి హోస్ట్‌గా చేస్తూ 'ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రెడీ' అంటూ సూపర్ జోష్‌లో ముందుకు సాగుతున్నారు. క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాను #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని మాస్ డైరెక్టర్, బాలకృష్ణ మాస్ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో విలన్ ఎవరా అనే ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాలో విలన్ పాత్రకు ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ గోపిచంద్ ప్రకటించారు. 'వేరీ హ్యాపీ టు వెల్కమ్ ది సాండల్‌వుడ్ సెన్సేషన్ దినియా విజయ్. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.' అంటూ ట్వీట్ చేశారు. ఇందులో హీరో విలన్ల మధ్య సీన్లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాయగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించగా ఈ నెల నుంచి సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. Very happy to welcome the Sandalwood Sensation #DuniyaVijay on board to #NBK107 🎉😊 Redefines the Villainism with #NBK107 👍🏻 NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @MusicThaman @MythriOfficial pic.twitter.com/x6mYe37rzu — Gopichandh Malineni (@megopichand) January 3, 2022 ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఈవెంట్‌కు లక్షల్లో అభిమానులు.. 10 ప్రత్యేక రైళ్లు -
‘దునియా’ విజయ్ ఇంట మరో విషాదం
ప్రముఖ నటుడు, కన్నడ హీరో ‘దునియా’ విజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రుద్రప్ప(81) కన్నుమూశారు. ఇటీవల ఆయన తల్లి కూడా మరణించిన సంగతి తెలిసిందే. విజయ్ తండ్రి రుద్రప్ప వయోవృద్ధ సమస్యలతో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందతున్న ఆయన నిన్న(గురువారం) తుదిశ్వాస విడిచారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా ఈ రోజు వారి స్వగ్రామం అనేకల్ తాలుకా కుంబారహళ్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కాగా విజయ్ తల్లి నారాయణమ్మ కూడా ఈ ఏడాది జులైలో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నెలల వ్యవధిలోనే ఆయన తండ్రి కూడా మరణించడంతో విజయ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అయితే కన్నడలో రౌడీ రోల్స్ ఎక్కువగా చేసిన విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. -
NBK107: బాలయ్యకు విలన్‌గా కన్నడ హీరో!
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోయే ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనుందని టాక్. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసిన గోపీచంద్ నటీనటులను సెలెక్ట్ చేసే పనులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలయ్య సరసన శృతి హాసన్‌ను ఖరారైంది. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. చదవండి: బాలయ్యతో జతకట్టనున్న శ్రుతీ ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్‌గా కన్నడ నటుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు దునియా విజయ్. కన్నడలో రౌడీ రోల్స్ ఎక్కువగా చేసిన విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బాలయ్య కోసం ఆయనను విలన్‌గా దర్శకుడు ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి. గతంలో కన్నడ నుంచి వచ్చిన ప్రభాకర్ .. దేవరాజ్ ఇక్కడ విలన్స్‌గా రాణించిన సంగతి తెలిసిందే. చదవండి: Unstoppable Talk Show: చిరంజీవిపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు -
మాస్తిగుడి కేసు: ఐదుగురి అర్జీలు తిరస్కరణ
దొడ్డబళ్లాపురం : 2016లో కన్నడ సినీ హీరో దునియా విజయ్ నటించిన మాస్తిగుడి సినిమా షూటింగ్ మాగడి సమీపంలోని తిప్పగొండనహళ్లి డ్యాంలో చేస్తుండగా అనిల్, ఉదయ్ అనే ఇద్దరు ఫైటర్లు నీటమునిగి మృతి చెందిన కేసు నుండి తమ పేర్లను తొలగించాలని ఐదుగురు నిందితులు పెట్టుకున్న అర్జీలను రామనగర జిల్లా కోర్టు కొట్టివేసింది. 2016లో నవంబర్.7న మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా హెలికాప్టర్ నుండి డ్యాంలోకి పడ్డ ఇద్దరు విలన్ పాత్రధారులు ఉదయ్, అనిల్ నీట మునిగి మృతి చెందారు. ఇదే సమయంలో వారితోపాటు డ్యాంలో పడ్డ హీరో విజయ్ను అక్కడున్నవారు రక్షించారు. ఘటనకు సంబంధించి తావరెకెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో హెలికాప్టర్ నడుపుతున్న ప్రకాశ్ బిరాదార్ పేరును కోర్టు తొలగించింది. బిరాదార్ తరఫు లాయర్ దిలీప్ ఈ ఘటనలో బిరాదార్ తప్పు ఏమాత్రం లేదని అతడి పేరు కేసు నుండి తొలగించాలని వాదించారు. దిలీప్ వాదనలతో ఏకీభవించి కోర్టు బిరాదార్ పేరు తొలగించింది. చిత్రం నిర్మాత సుందర్ పి.గౌడ, డైరెక్టర్ రాజశేఖర్,సిద్ధార్థ్ ఆలియాస్ సిద్ధు, స్టంట్స్ డైరెక్టర్లయిన రవివర్మ, భరత్రావ్లు ఐదుగురు తమను కూడా కేసు నుండి విముక్తులను చేయాలని అర్జీ పెట్టుకున్నప్పటికీ రామనగర జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టు శనివారం సాయంత్రం వాటిని కొట్టివేసింది. -
హీరోకు మరోసారి మహిళా కమిషన్ నోటీసులు
యశవంతపుర: వివాదాస్పద శాండల్‌వుడ్ నటుడు దునియా విజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసు ఇచ్చినా విచారణకు హాజరుకాకపోవటంపై విజయ్‌కు మరో నోటీసును జారీ చేసింది. వారంలోపు తమ ముందు హాజరు కావాలని స్పష్టంచేసింది. భర్త రెండవ పెళ్లి చేసుకుని తనను దూరంగా ఉంచడంతో జీవనం కష్టమైందని మొదటి భార్య నాగరత్న పిల్లలతో కలిసి ఇటీవల కమిషన్‌కు ఫిర్యాదు చేయటంతో కమిషన్ స్పందించింది. సినిమా షూటింగ్లో బీజీగా ఉన్నందున తను హాజరు కాలేక పోతున్నట్లు, కొంత సమయం కావాలని విజయ్ కోరినట్లు తెలిసింది. -
కష్టాల్లో హీరోలు
వెండి తెరపై సాహసోపేతంగా పోరాటాలు చేసి అభిమానులను మైమరిపించే ఇద్దరు సినీ హీరోలు నిజజీవితంలో కేసుల సుడిలో చిక్కుకున్నారు. మీ టూ కేసులో అర్జున్ సర్జా, కూతురు ఫిర్యాదు చేయడంతో దునియా విజయ్‌లకు తాఖీదులందాయి. పోలీసుపై దాడి కేసులో దునియాపై కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైంది. సోమవారం కబ్బన్‌పార్క్ పీఎస్‌కు జెంటిల్మెన్ వస్తారా?, లేదా? అన్నది సస్పెన్స్. సాక్షి బెంగళూరు/ యశవంతపుర : చిత్రసీమలో సంచలనం సృష్టించిన మీ టూ లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రముఖ నటుడు అర్జున్ సర్జాపై నటి శ్రుతి హరిహరన్ దాఖలు చేసిన కేసు విచారణను కబ్బన్ పార్కు పోలీసులు ముమ్మరం చేశారు. అర్జున్ సర్జాకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని అందులో సూచించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌పై కేంద్రీకృతమైంది. అర్జున్ సోమవారం విచారణకు హాజరవుతారా?, లేదా అన్నది తెలియాల్సి ఉంది. రెండేళ్ల కిందట విస్మయ చిత్రం షూటింగ్ సమయంలో అర్జున్ తనపై లైంగికంగా వేధించారని శ్రుతి రెండువారల కిందట ఆరోపించడం తెలిసిందే. ప్రముఖ నటుడు అంబరీష్ సహా సినీపెద్దలు రాజీ ప్రయత్నం చేసినా ఇద్దరూ మెట్టుదిగలేదు. శ్రుతి కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో అర్జున్‌పై ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేశారు. శ్రుతి పేర్కొన్న సాక్షులను కూడా విచారించారు. దునియా విజయ్‌కు మహిళా కమిషన్ నోటీస్ పానిపూరి కిట్టిపై దాడి, మొదటి భార్య, కూతురిపై దౌర్జన్యం తదితర కేసులతో సతమతమవుతున్న హీరో దునియా విజయ్‌కు మహిళ కమిషన్ నోటీసులను జారీ చేసింది. ఇటీవల మొదటి భార్య నాగరత్న, కూతురు మోనికాలతో విజయ్ గొడవ జరగడం తెలిసిందే. తనకు తండ్రి నుండి రక్షణ లేదని ఆరోపిస్తూ కూతురు మోనికా మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 12 లేదా 13న తమ ముందు హాజర్ కావాలని మహిళా కమిషన్ నోటీస్‌లో ఆదేశించింది. దునియా–మోనికా ఇద్దరిని ఒకచోట చేర్చి న్యాయ పంచాయితీ చేసే అవకాశం ఉంది. చార్జిషీటు దాఖలు దర్శకుడు సుందరగౌడను పోలీసులు అరెస్ట్ చేయటానికి వెళ్లగా దునియా విజయ్ పోలీసులకు ఆటంకం కలిగించిన కేసులో చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. తనను అడ్డుకుని దాడి చేశాడని హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌పై 65 పేజీల అభియోగపత్రాన్ని సమర్పించారు. -
హీరో విడాకుల అర్జీ
యశవంతపుర: మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని వివాదాస్పద హీరో దునియా విజయ్ సిద్ధమవుతున్నాడు. నాగరత్న, ఆమె పిల్లలు– దునియా విజయ్, అతని రెండ వభార్య కీర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తుండడం తెలిసిందే. రోజూ తన కుటుంబ గొడవలు వీధినపడడం మంచిది కాదు, నాగరత్నతో తెగతెంపులు చేసుకోవాలని భావించిన దునియా విజయ్ బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. నెల రోజుల నుండి నాగరత్న, పిల్లలతో గలాటాలు జరుగుతుండడంతో విడాకులకు ఇదే అదను అని విజయ్ అనుకున్నాడు. గత రెండేళ్ల క్రితం ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించి విడాకులకు కోర్టుకెళ్లినా, మళ్లీ రాజీకి వచ్చారు. తాజా గొడవలతో విజయ్ మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై నాగరత్న స్పందన తెలియాల్సి ఉంది. -
మళ్లీ వీధికెక్కిన హీరో కుటుంబం
యశవంతపుర : కన్నడ హీరో దునియా విజయ్ మొదటి భార్య నాగరత్న ఉంటున్న కత్రిగుప్పె ఇంటి వద్ద ఆదివారం హైడ్రామా చోటు చేసుకొంది. సెప్టెంబర్ 23న దునియా రెండో భార్య కీర్తిగౌడపై దాడి చేసిన వీడియోను దునియా, కీర్తిగౌడ మాధ్యమాలకు విడుదల చేశారు. విషయం తెలుసుకున్న తక్షణమే గిరినగర పోలీసులు నాగరత్న, మోనికపై కేసు నమోదు చేశారు. విచారణకు పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నాగరత్న, మోనికలు ఇంటికి తాళం వేసుకుని పోలీసులను అడ్డుకున్నారు. కిటికీలో నుండి పోలీసులతో మాట్లాడిన మోనిక తన తల్లి ఇంటిలో లేదని చెప్పి పంపారు. తమను అరెస్టు చేయటానికి వారెంట్ ఏమైనా తెచ్చారా అంటూ మోనిక ప్రశ్నించారు. గిరినగర పోలీసులు మధ్యాహ్నం వరకు నాగరత్న కోసం వేచి ఉండి వెళ్లిపోయారు. అంతలోనే నాగరత్న తరపున లాయర్ ఆదివారం మధ్యాహ్నం నేరుగా స్టేషన్‌కు వెళ్లి నాగరత్న మారణాయుధాలతో దాడి చేయలేదని, చేతితో కొట్టడం వల్లే గాయమైందని, ఆమెకు స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసి వెళ్లిపోయారు. మోనికను అదుపులోకి తీసుకున్న పోలీసులు కీర్తిగౌడపై దాడి చేసినందుకు నాగరత్న ఇంటిలో లేక పోవటంతో దునియా కూతురు మోనికను గిరినగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దునియా విజయ్ రెండో భార్య కీర్తిగౌడతో కలిసి గిరినగర పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. కూతురును పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై దునియా కన్నీరు పెట్టారు. అమ్మ చేసిన తప్పునకు కూతురుకు శిక్షవేయటం మంచిది కాదని, తమను కొట్టేంత ద్వేషం పెచ్చుకోవటం పద్దతికాదన్నారు. ఇంత జరిగినా పిల్లల భవిష్యత్ గురించి నాగరత్న పట్టించుకోవటంలేదని విజయ్ తరపు న్యాయవాది శివకుమార్ పేర్కొన్నారు. పిల్లలను అడ్డు పెట్టుకుని నాగరత్న నాటకాలు తనపై లేనిపోని అరోపణలు చేస్తున్న నాగరత్న పిల్లలను అడ్డం పెట్టుకుని తనను వేధిస్తున్నట్లు దు నియా విజయ్ అరోపించారు. ఇకనైనా బుద్ధిగా పి ల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసుల ముందుకు రావాలన్నారు. అయన ఆదివారం బెం గళూరులో విలేకర్లతో మాట్లాడారు. కీర్తిగౌడపై దా డి వీడియోను విడుదల చేసిన తక్షణం ఆమె ఇంటి నుండి పారిపోయారు. కూతురు మోనికను పోలీ సులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మోనికను ఇలా స్టేష న్కు తీసుకురావటాన్ని తాను చూడలేకపోతున్నా ... చట్టం అందరికీ సమానం అనే విషయంను నా గరత్న మరిచారు. కూతురికి 18 ఏళ్ల నిండుతున్నా యి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు ఉండటం చెడు ప్రభావానికి దారితీస్తుందని మీడియా ముం దు కన్నీరుమున్నీరయ్యారు. కూతురిపై ఆరోపణలు రావటంవల్ల మీరు రాజీఅవుతరా...అంటూ విలేకర్ల ప్రశ్నించగా అన్నింటికి పిల్లలను ముందుపెట్టి నాటకాలుచేయడం మంచిది కాదన్నారు. అరెస్ట్‌కు అదేశం కీర్తిగౌడపై దాడికి సంబంధించి నాగరత్నను అరెస్ట్ చేయటానికి గిరినగర పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 23న దునియాతో కలిసి ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి అసభ్యంగా నిందించటంతో పాటు తనను చెప్పుతో కొట్టినట్లు కీర్తిగౌడ గిరినగర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమెను అరెస్ట్ చేస్తామని డీసీపీ అణ్ణామలై విలేకర్లకు తెలిపారు. -
నాన్న నన్ను కొట్టారు.. హీరో కూతురి ఫిర్యాదు
కర్ణాటక, యశవంతపుర: నటుడు దునియా విజయ్ను వరుస వివాదలు వెంటాడుతున్నాయి. జిమ్ శిక్షకుడు మారుతీగౌడపై దాడి చేసి జైలుకెళ్లి వచ్చిన విజయ్‌పై ఈసారి ఏకంగా కూతురే కేసు పెట్టింది. తనను అసభ్యంగా తిట్టినట్లు విజయ్ కుతూరు మోనిక (14) బెంగళూరు గిరినగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ జైలుకెళ్లిన సమయంలో కూతురు మోనికా తల్లి నాగరత్న జతలో ఉన్నారు. సోమవారం తండ్రి విజయ్ ఇంటికి మోనిక వెళ్లి తనకు చెందిన వస్తువులు, కారు పత్రాలను తీసుకెళ్లారు. అప్పుడు విజయ్ నిన్ను ఎంత బాగా చూసుకున్నా, అయినా అమ్మ వెంట ఉంటావా? అని కోపగించుకుని తిట్టాడు. తనకు కూతురే లేదనుకుంటానని అన్నాడు. తల్లితో కలిసి వెళ్లగా... మళ్లీ కొంతసేపటికి తల్లి నాగరత్నతో కలిసి మోనిక బట్టలు తీసుకురావాలని దునియా ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో విజయ్‌తో పాటు రెండో భార్య కీర్తి గౌడ, హేమంత్, వినోద్, కారుడ్రై వర్ మహ్మద్‌లు తనను తిట్టి, కాళ్లతో తన్ని మారణాయూధాలతో దాడి చేసిన్నట్లు మోనిక గిరినగర పోలీసులకు తండ్రితో పాటు మరో నలుగురిపై ఫిర్యాదు చేసింది. దాడిలో తలకు, చేతికి గాయాలు కావటంతో మోనిక ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన తల్లిని కూడా నోటికొచ్చిన్నట్లు దూషించారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొట్టలేదు: విజయ్ కూతురి ఆరోపణలను విజయ్ ఖండించాడు. మోనికపై చేయి చేసుకోలేదని, దురుద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన్నట్లు వివరణ ఇచ్చాడు. మూడు రోజుల్లో అన్నీ విషయాలను బహిరంగం చేస్తానంటూ తన ఇంటి సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. సహించను: తల్లి నాగరత్న నేను చచ్చినా పర్వాలేదు. నా పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే సహించను. బట్టలు తీసుకెళ్లటానికి వెళ్లిన కూతురిపై కీర్తి మనుషులు దాడి చేశారు. మోనికకు వైద్య పరీక్షలను నిర్వహించాం. గిరినగర పోలీసు స్టేషన్లో ఐదు మందిపై ఫిర్యాదు చేశాం. -
కీర్తి ఏమిటో అన్నీ తెలుసు
సాక్షి, బెంగళూరు: నటుడు దునియా విజయ్ రక్తకన్నీరు సినిమా చూడాలని, ఎవరి జీవితం నాశనమౌతుందో ఈ చిత్రం చూశాకైనా తెలుస్తుందని ఆయన మొదటిభార్య నాగరత్న అన్నారు. ఆయన దగ్గర రక్తకన్నీరు సినిమా సీడీ లేకపోతే తాను ఇస్తానని తెలిపారు. బుధవారం కత్రిగుప్పెలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. తన కుటుంబం వీధిలోకి రావడానికి కారణం కీర్తి అని, ఆమె గురించి తనకు అన్నీ తెలుసని ఎద్దేవా చేశారు. కీర్తి మురికివాడ నుంచి వచ్చిందని, తాను ఇంకా దునియా విజయ్‌కు విడాకులు ఇవ్వలేదని చెప్పారు. విజయ్ ఏడాదికి ఒకరిని తీసుకువస్తారని ఈమె కూడా అలాగే వచ్చిందని వెల్లడించారు. (చదవండి: నటుడి కాపురంలో చిచ్చు) విజయ్ తల్లికి అనారోగ్యం దునియా విజయ్ తల్లి అనారోగ్యం బారిన పడగా బుధవారం ఆమె ఒక్కరే ఆటోలో ఆసుపత్రికి వెళ్లారు. దునియా విజయ్ నిత్యం వివాదాలతో సతమతం కావడంతో అతడి గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు కలత చెందారు. జిమ్ ట్రైనర్‌పై దాడి కేసులో బెయిల్‌పై విడుదలైన దునియా విజయ్ రెండవ భార్య కీర్తితో కలిసి విశ్రాంతి తీసుకోవడానికి మడికెరికి వెళ్లారు. -
నటుడి కాపురంలో చిచ్చు
సాక్షి, బెంగళూరు : జిమ్ శిక్షకుడు మారుతీగౌడపై దాడి చేసి జైలుకెళ్లి బెయిల్‌పై బయట వచ్చిన నటుడు దునియా విజయ్ భార్యల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కీర్తిని తన భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకోలేదని మొదటి భార్య నాగరత్న ఆరోపిస్తున్నారు. నాగరత్న వాదనలు ఇలా ఉండగా తామిద్దరం పెళ్లి చేసుకోని ఒకే ఇంటిలో సంసారం చేస్తున్నట్లు విజయ్, కీర్తిలు తెలిపారు. సోమవారం రాత్రి బెయిల్‌పై విడుదలైన దునియా.. కీర్తితో కలిసి గాళి ఆంజనేయస్వామి దేవస్థానం, దర్గాకు వెళ్లి పూజలు చేశారు. జైలు నుంచి విడుదలైనందుకు స్వీట్ల పంచి వేడుక చేసుకున్నారు. దాడి కేసుకు సంబంధించి తనేమి మాట్లాడన్నారు. బెయిల్ మంజూరు చేసిన జడ్జికి, సహకరించిన తన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు బెయిల్ రాకూడదని శ్రతువులు ఆశించారని, దేవుడి దయతో బెయిల్ దొరికిందని దునియా పేర్కొన్నారు. తాను జైలుకెళ్లటానికి ప్రధాన కారణం అధికారులేనని ఆరోపించారు. దీనిపై బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధమన్నారు. మొదటి భార్య నాగరత్న నాలుగేళ్ల క్రితం తన పరువు తీసి బజారుకు ఈడ్చిందని, తన తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇల్లును ఆమెకు ఇచ్చేశానని, ప్రస్తుతం తాను అద్దె ఇంటిలో ఉంటున్నట్టు చెప్పారు. ఆడ బిడ్డలకు, కొడుకుకు ఉన్న ఆస్తిని రాసిచ్చానని వెల్లడించారు. తాను, తన తల్లిదండ్రులు చచ్చిన రావద్దంటూ విల్లులోనే నాగరత్నకు రాసిచ్చినట్లు తెలిపారు. ఆమె ఒక్క రోజు కూడా నిజం మాట్లాడలేదని విమర్శించారు. మొత్తానికి దునియాకు బయట శత్రువులకంటే ఇంటి పోరే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. -
పరప్పన జైలుకు హీరో..
యశవంతపుర : జిమ్ శిక్షకుడు మారుతీగౌడపై దాడికి సంబంధించి హీరో దునియా విజయ్‌ని ఆదివారం అర్ధరాత్రి పోలీసులు పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈనెల 26 వరకు రిమాండ్‌కు పంపించారు. దీంతో జైలులో విజయ్‌కు 9035 నెంబర్‌ను కేటాయించారు. అయనతో పాటు డ్రైవర్ ప్రసాద్, జిమ్ శిక్షకుడు ప్రసాద్, కోచ్ మణిలకు ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. సోమవారం వీరికి వైద్య పరీక్షలను నిర్వహించారు. నిరాశా, నిస్పృహల్లో దునియా : జరిగిన సంఘటనతో దునియా తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారం. సినిమాల్లో కష్టపడి పైకొచ్చిన దునియా తనను కావాల్సి కుట్రలో ఇరికించినట్లు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 7 గంటలకు నిద్రలేచిన దునియా పులిహోర అల్పహారంగా తీసుకున్నారు. బెయిల్‌కు దరఖాస్తు దాడి కేసులో అరెస్టయిన దునియా విజయ్, అతని అనుచులు ఇక్కడి 8వ ఏసీఎంఎం కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేశారు. సోమవారం వాదనలు జరిగాయి. దునియాపై ఇప్పటికే రెండు క్రిమినల్ కేసులు ఉండటంతో అతనికి బెయిల్ మంజూరు చేయకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించారు. బెయిల్ ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే దునియా, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని, ఇది కుట్రపూరితమైన కేసని నిందితుల తరఫున న్యాయవాది శివకుమార్ వాదించారు. హోంమంత్రిని కలిసిన పానీపురి కిట్టి బాధితుడు మారుతిగౌడ చిన్నాన, పానీపూరి కిట్టి సోమవారం మారుతి గౌడ తల్లిదండ్రులతో కలిసి హోం మంత్రి పరమేశ్వర్‌ను కలిశారు. విద్వత్ కేసులో పీపీగా పనిచేసిన శ్యామ్ సుందర్‌కు ఈ కేసును అప్పగించాలని కోరారు. తన అన్న కుమారుడు మారుతి పెదవికి 14 కుట్లు పడ్డాయని హోం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆయనకు బుద్ధి చెప్పేవారే లేరా ? తన భర్త దునియా విజయ్‌కు మంచి సలహాలు ఇచ్చేవారు లేకనే ఆయన పలుమార్లు జైలుకు వెళ్లినట్లు ఆయన మొదటి భార్య నాగరత్న ఆరోపించారు. ఇలా తరచూ జైలుకు వెళ్తాఉంటే పిల్లలు భవిష్యత్ ఏమిటని ఆమె ఆందోళన వ్యక్త పరిచారు.దునియా విజయ్ రెండో భార్య మోజులోపడి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే విజయ్ రెండో భార్య కీర్తి సోమవారం మధ్యాహ్నం పరప్పన అగ్రహార జైలుకు వచ్చారు. దునియాను కలిసేందుకు ఆమెకు అవకాశం లభించలేదు. -
ప్రముఖ హీరో అరెస్ట్
యశవంతపుర : మాస్తిగుడి దర్శకుడు సుందర పి గౌడను అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసుల విధులకు అటంకం కలిగించిన కేసులో పరారీలో ఉన్న నటుడు దునియా విజయ్‌ని చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులు తమిళనాడులో శుక్రవారం అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకు వచ్చారు. 2016 నవంబర్ 7న తిప్పగొండనహళ్లి చెరువులో మాస్తిగుడి సినిమా షూటీంగ్ చేస్తుండగా వర్తమాన నటులు ఉదయ్, అనిల్ నీటిలో మునిగి మృతి చెందారు. వీరి మృతికి దర్శకుడు సుందర పి గౌడ కారణమంటూ నలుగురిపై తావరకెరె పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై రామనగర కోర్టు అరెస్టు చేయాలని అదేశాలు జారీ చేసింది. అదే కేసుకు సంబంధించి సుందరగౌడను అరెస్టు చేయటానికి వెళ్లిన నటుడు దునియా విజయ్ అడ్డుకున్నారు. అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసుల విధులకు అటంకం కలిగించరంటూ తావరెకెరె పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజు సికే అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే పోలీసులు దునియా విజయ్‌పై కేసు నమోదు చేసిన్నప్పుటి నుండి తప్పించుకు తిరుగుతున్నారు. ఐదు రోజుల పాటు బెంగళురు చుట్టు పక్కల తిరిగిన దునియా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ అధారంగా తమిళనాడులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించారు. శుక్రవారంలోపు కోర్టులో లొంగి పోయాలని రామనగర కోర్టు ఆదేశించింది. అయితే బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా పోలీసు వలపన్ని తమిళనాడు తల దాచుకున్న దునియా విజయ్ను అరెస్టు చేసి 65వ సెషన్స్ కోర్టు ముందు హాజరు పరచగా లక్ష రూపాయిల నగదు పూచీకత్తుపై జామీన్ మంజూరు చేసింది. -
పరారీలో నటుడు
యశవంతపుర : మాస్తిగుడి నిర్మాత సుందర పి.గౌడను అరెస్టు చే యటానికి వెళ్లిన పోలీసుల విధులకు అటం కం కలిగించిన విషయానికి సంబంధించి పరారీలో ఉన్న నటుడు దునియా విజయ్ అరెస్టు చేయటానికి పోలీసులు ప్రత్యేక బృం దాలను రంగంలోకి దించారు. మాస్తిగుడి సిని మాకు సంబంధించి నిర్మాతను మాత్రమే అరెస్టు చేయాటనికి వచ్చిన పోలీసులు ఇప్పుడు నటుడు దునియా విజయ్ను కూడా అరెస్టు చేయాలని గాలింపు ముమ్మరం చేశారు. అయితే నిర్మాత సుందర్ గౌడకు రామనగర జెఎంఎఫ్‌సీ కోర్టు షరుతులతో కూడిన జామీన్ మంజూరు చేసింది. పోలీసుల విధులకు అటం కం కలిగించిన నటుడు దునియా విజయ్‌కు కోర్టు అయనకు బెయిల్‌ను నిరాకరించింది. పోలీసులు కేసు నమోదు చేసిన్నప్పుటి నుండి దునియా విజయ్ పరారీలో ఉన్నాడు. -
హీరో దునియా విజయ్‌పై కేసు
బనశంకరి: పోలీసుల విధులకు అడ్డుపడి మాస్తిగుడి సినిమా నిర్మాత సుందరగౌడ పారిపోవడానికి సహకరించారని కన్నడ హీరో దునియా విజయ్‌పై బెంగళూరులో చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. తావరకెరె హెడ్‌కానిస్టేబుల్ గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏం జరిగిందంటే... వివరాలు... 2016 నవంబర్‌లో తావరకెరె పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిప్పగొండనహళ్లి జలాశయం వద్ద దునియా విజయ్ హీరోగా సుందర్‌గౌడ నిర్మిస్తున్న మాస్తిగుడి సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఈ సమయంలో విలన్లుగా నటిస్తున్న ఉదయ్, అనిల్ ఇద్దరు హెలికాప్టర్ నుంచి జలాశయంలో దూకే సన్నివేశంలో నటిస్తూ నీటమునిగి మరణించడం తెలిసిందే. దీనిపై తావరకెరె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిర్మాత సుందర్గౌడపై జామీను రహిత వారెంట్ జారీ అయింది. బుధవారం తావరకెరె పోలీసులు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పీఎస్ పరిధిలో ఉన్న సుందర్‌గౌడ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అక్కడ కనబడిన దునియా విజయ్ పోలీసులతో మాట్లాడుతుండగా సుందర్‌గౌడ చాకచక్యంగా తప్పించుకున్నారు. సుందర్‌గౌడ పరారీకి దునియా విజయ్ పరోక్షంగా సహకరించడంతో పాటు పోలీసుల విధులకు అడ్డుపడ్డారని హెడ్‌కానిస్టేబుల్ గోవిందరాజు గురువారం పిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎన్టీఆర్ సినిమాలో వివాదాస్పద నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లుగా రాశీఖన్నా, నివేదా థామస్ లను ఫైనల్ చేయగా, అతిథి పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. విలన్ పాత్రకు కన్నడ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు జై లవ కుశ యూనిట్. కన్నడ ఇండస్ట్రీలో వివాదాస్పద నటుడిగా పేరుతెచ్చుకొని, ప్రస్తుతం బ్యాన్ ఎదుర్కొంటున్న దునియా విజయ్.. జై లవ కుశ సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. ఓ సినిమా షూటింగ్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇద్దరు నటులు ప్రాణాలు కొల్పొవడానికి కారుకులైన దునియా విజయ్, ఆయన సినిమా యూనిట్‌పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది. గతంలోనూ విజయ్ పలు వివాదాల్లో తలదూర్చాడు. ఇతర నటీనటులతో దురుసుగా మాట్లాడటం చేయి చేసుకోవటం లాంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. ఎన్టీఆర్‌కు కన్నడ ఇండస్ట్రీతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. అదే పరిచయాలతో దునియా విజయ్‌ని తన సినిమాలో విలన్‌గా నటింప చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ విలన్‌గా నటిస్తే జై లవ కుశకు సాండల్‌వుడ్ మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. -
దాడి కేసులో హీరో అరెస్ట్
సాక్షి, బెంగళూరు: మాస్తిగుడి చిత్రం దుర్ఘటన మరువకముందే కన్నడ హీరో దునియా విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మాస్తిగుడి చిత్రం నిర్మాత సుందర్ పీ.గౌడ సోదరుడు శంకర్, హీరో దునియా విజయ్‌లు తన భర్త జయరామ్‌పై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారని జయరామ్ భార్య యశోదా చెన్నమ్మనకెరె అచ్చుకట్టు కెరె పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాస్తిగుడి చిత్ర నిర్మాత సుందర్ పీ.గౌడ సోదరుడు శంకర్ నగరానికి చెందిన జయరామ్ అనే వ్యక్తి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది కాలానికే అదనపు కట్నం కోసం తన కూతురిని వేధించేవాడని, తన కుమార్తెను చూడటానికి ఇంటికి కూడా రానిచ్చేవాడు కాదని యశోదా ఆమె భర్త జయరామ్‌లు ఆరోపిస్తున్నారు. ఇటీవల జయరామ్ తన కూతురును చూడడానికి ఆమె ఇంటికి వెళ్లగా తమ అల్లుడు శంకర్ అదనపు కట్నం కోసం తన భర్తతో వాగ్వాదానికి దిగాడని అంతటితో ఆగకుండా హీరో విజయ్ను ఇంటికి పిలిపించి ఇద్దరు కలసి తన భర్తపై జయరామ్‌పై దాడికి పాల్పడ్డారని జయరామ్ భార్య యశోదా ఆరోపిస్తోంది. హీరో దునియా విజయ్ తన భర్త జయరామ్‌ను ఛాతిభాగంలో బలంగా కొట్టడంతో ఎముకలు విరిగాయని, ప్రస్తుతం తన భర్త జయరామ్ శేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన భార్య యశోదా తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దునియా విజయ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తర్వాత బెయిల్ పై అతడికి విడిచిపెట్టారు.