ED Raids
-
కాంగ్రెస్, బీజేపీ మధ్య "క్విడ్ ప్రో కో".. కేటీఆర్ సంచలన ట్వీట్ ..
-
చంద్రబాబు స్కిల్ స్కామ్ పై ED లెటర్.. వైఎస్ జగన్ రియాక్షన్
-
ఆ పెద్దన్న ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి కాపాడుతున్న పెద్దన్న ఎవరో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకం ఆడుతూ, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అంట కాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలు ఈ అంశంపై మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంపై ఈడీ జరిపిన దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ దాడిలో రూ.వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని, 2 వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ సంఘటన తాలూ కు ఒక్క విషయం బయటకి రాలేదని కేటీఆర్ తెలిపారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన రూ.40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు జరగకపోవడం, దారి మళ్లిన నిధుల తాలూకు అంశంపైనా ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలు సోదా లు జరిపాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం 5:30 గంటల నుంచి జూబ్లీహిల్స్‌లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో మొత్తం 15 ఈడీ అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.విదేశాల నుంచి ఖరీదైన వాచీల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 28న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కస్టమ్స్, డీఆర్ఐ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల రక్షణలో సోదాలు కొనసాగాయి. పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహా పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్ధికలావాదేవీలపైన ఆరా తీసినట్టు సమాచారం. కేసు వివరాలివీ..: హాంగ్‌కాంగ్‌లో నివాసముండే మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన రెండు లగ్జరీ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్‌ను కస్టమ్స్ అధికారులు విచారించగా, మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరు వెల్లడించాడు. ఈ క్రమంలో నవీన్‌కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి ముబీన్ నుంచి దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే ఏడు లగ్జరీ వాచ్‌లను కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై సమాధానం ఇవ్వాలని కస్టమ్స్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతోమనీలాండరింగ్ కోణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈడీ దాడులను ఖండించిన మంత్రి సీతక్క ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ‘ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఈడీ, సీబీఐలను పచ్చిగా దురి్వనియోగం చేస్తోంది. తమకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది’ అని సీతక్క ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులకు సోదాలకు కారణం బీజేపీ కుట్రలేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్రే: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ దాడుల ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈడీ దాడులు.. బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు.మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్ర. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బీజేపీ భయపెట్టాలని చూస్తోంది. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడులు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టి మానసికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది.కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో ముందుకు సాగింది. డీకే శివ కుమార్‌పై కూడా ఇలాగే దాడుల ప్రయోగం చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా వదలకుండా కేంద్రంలోని బీజేపీ.. ఈడీ దాడులు చేయించింది. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత -
పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
-
సందీప్ ఘోష్ తండ్రి నివాసంలో ఈడీ సోదాలు
కోల్‌కతా: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన అనంతరం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు గురువారం ఉదయం కోల్‌కతా, సబర్బన్ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తండ్రి సత్య ప్రకాశ్ నివాసంలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.West Bengal | Enforcement Directorate carrying out search operation in connection with RG Kar Medical College & Hospital financial irregularities case at several places in Kolkata and suburban areas including the residence of former principal of RG Kar Medical College & Hospital…— ANI (@ANI) September 12, 2024 మరోవైపు.. డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ డార్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక.. హత్యాచార ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు సందీప్ ఘోష్ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.చదవండి: జూనియర్ డాక్టర్ల షరతులు.. కుదిరే పనికాదన్న సర్కారు -
2 కేసుల్లో బెయిల్.. ఈడీపై న్యాయమూర్తి ఆగ్రహం
-
ఈడీ దూకుడు.. మరోసారి హీరా గ్రూప్‌పై దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి హీరా గ్రూప్‌పై ఈడీ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నౌహిరా షేక్ ఇల్లు,ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు నిధులు గోల్మాల్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. విదేశీ పెట్టుబడులపై అధికారులు ఆరా తీస్తున్నారు.నౌహిరా ఆస్తులను ఒక్కొక్కటిగా ఈడీ అటాచ్ చేస్తోంది. టోలీ చౌక్‌లోని 81 ప్లాట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ... ఇప్పటి వరకు రూ.380 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మరో రూ.600 కోట్లపై చిలుకు ఆస్తులపై ఈడీ విచారణ జరుపుతోంది. దేశవ్యాప్తంగా నౌహిరా షేక్‌పై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులను కూడా పెట్టుకున్నారని ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నౌహీరా షేక్‌పై గతంలో కేసు నమోదు చేశారు. -
ఈడీ రైడ్స్.. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. రెండు రోజుల పాటు మహేష్ బ్యాంక్‌లో ఈడీ సోదాలు చేపట్టింది. రూ. కోటి నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనర్హులకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. 1800 మందికి డమ్మీ గోల్డ్‌లోన్స్ ఇచ్చినట్లు ఈడీ తేల్చింది.పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించని ఈడీ.. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. బ్యాంక్‌లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ వెల్లడించింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేయడంతో పాటు.. వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని.. బ్యాంక్ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు. -
విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం వేధిస్తోంది
పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. ‘మా పారీ్టలో చేరండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న విధంగా వ్యవహరిస్తోంది’అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డిని హరీశ్‌రావు కలిశారు. గురువారం జరిగిన ఈడీ సోదాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేయడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వర్తించేలా చట్ట సవరణ చేస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. కానీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాట వినకపోతే ఆ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేస్తూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారన్నారు. ఈడీ దాడుల్లో దొరికిందేమీ లేదు.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ చేపట్టిన సోదాల్లో డబ్బు, బంగారం, ఎలాంటి వస్తువులు అక్రమంగా దొరకలేదని హరీశ్‌రావు చెప్పారు. ఆదాయపన్ను చెల్లిస్తున్న ఎమ్మెల్యే వద్ద ఆదాయ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు. లీకేజీకి కారణమైన అధికారులపై ఈడీ, ఐటీ ఎందుకు దాడులు చేయట్లేదని నిలదీశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జెడ్పీ వైస్ చైర్మన్ మంజుశ్రీ పాల్గొన్నారు. -
పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు కీలక పత్రాలు స్వాధీనం
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట ఈడీ సోదాలు
-
ED Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట ఈడీ సోదాలు
Updates..👉 నిజాంపేటలో ఈడీ సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యే అల్లుడి చంద్రశేఖర్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో మూడు కోట్ల రూపాయలతో కారు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే, పలు ఆస్తులను సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.👉ఇక, అంతకుముందు గడువు పూర్తైనా మైనింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో క్వారీలను అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.👉తెలంగాణలో మరోసారి ఈడీ సోదాల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో, తీవ్ర కలకలం చోటుచేసుకుంది. 👉కాగా, ఈడీ అధికారులు ఏక కాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో లక్డారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
గొర్రెల స్కాం లో అసలు దొంగలు దూకుడు పెంచిన ఈడీ
-
సందేశ్‌ఖాలిలో మళ్లీ హింస
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవగానే పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలిలో ఆదివారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసేందుకు అగర్హటి గ్రామానికి వెళ్లిన బలగాలపై మహిళలు దాడికి దిగారు. మహిళా సిబ్బంది గాయపడ్డారు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని విడిపించుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను బలగాలు అడ్డుకున్నాయి. జనవరి 5వ తేదీన రేషన్ కుంభకోణం కేసులో తనిఖీల కోసం సందేశ్‌ఖాలీకి వెళ్లిన ఈడీ బృందంపై దాడి, అనంతరం టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. -
కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు విపించారు. . సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.నేడు ఈడీ, సీబీఐ వాదనలు వినిపించింది. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని ఇంతకముందే న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కింగ్ పిన్ అని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము ఆమెకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.ఈడీ వాదనలుఇండియా ఎహెడ్ ఛానల్లో పెట్టుబడి పెట్టారు.ఫోన్లో డేటాను ధ్వంసం చేశారు.విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేశారు.ఈడీకి ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.డిజిటల్ డేటా ధ్వంసంపై 19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.కవితకు బెయిల్ ఇవ్వొద్దు.సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం.ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు.గోప్యత హక్కును భంగపరచలేదుసీబీఐ వాదనలు:మద్యం విధానంపై కవితిను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం వ్యాపారికి చెప్పారు.భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగింది.ఈ కేసులో కవిత పాత్రపై అనేక సాక్షాలు, వాంగ్మూలాలు ఉన్నాయి.అందుకే కవిత అరెస్టు తప్పనిసరి.మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు.ఈ లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారు.ఆమె సాక్షాలు ధ్వంసం చేస్తుందిసాక్షులను ప్రభావితం చేస్తుందికవితకు కొత్త ఆరోగ్య సమస్యలు ఏవీ లేవుకవిత తరపు న్యాయవాది నితీష్ రానా కౌంటర్ వాదనలు👇ఈడీ కేసులో బుచ్చి బాబును నిందితుడిగా చేర్చక పోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.బుచ్చి బాబు స్టేట్మెంట్లు కోర్టు పట్టించు కోవద్దు.ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్షాలు ఈడీ చూపలేదు.సాక్షాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదు.కవిత తన ఫోన్లు పనిమనుషులకు ఇచ్చారు.190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడి వాదనలో.. ఒక్క పైసా కవిత ఖాతాకు చేరలేదు.దీనిపై ఎలాంటి సాక్షాలు ఈడీ చూపలేదు.కవిత అరెస్టులో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదు.సీబీఐ కవిత అరెస్టుకు కారణాలు చెప్పలేదు. ముగిసిన ఈడి, సీబీఐ వాదనలు, తీర్పు రిజ ర్వ్లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై ముగిసిన ఈడీ, సీబీఐ వాదనలుకవితకు బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన ఈడీ, సీబీఐఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని వాదనలులిక్కర్ స్కామ్ లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని వాదించిన ఈడికవిత కేసులో కీలక పాత్రధారి దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్, ఇతర ఎవిడెన్స్ ఉందన్న ఈడీ.తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ.. -
జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు
-
జార్ఖండ్‌లో ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు
రాంచీ: జార్ఖండ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. సోమవారం రాంచీలోని పలుచోట్ల ఈడీ సోదాలు చేపట్టగా.. మంత్రి అలంగీర్ సన్నిహితుడి ఇంట్లో సుమారు రూ. 25 కోట్ల భారీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.జార్ఖండ్ మంత్రి అలంగీర్ సన్నిహితుల ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి అలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజయ్ లాల్ ఇంట్లోని గది నిండా ఉన్న భారీ నోట్ల కట్టలను ఈడీ స్వాధీనం చేసుకుంది. 70 ఏళ్ల అలంగీర్ ఆలం పాకూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్నారు.‘‘జార్ఖండ్‌లో అవినీతి అంతం కావటం లేదు. ఈ డబ్బును ఎన్నికల్లో పంచాలని ప్రణాళిక వేశారు. దీనిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతూల్ సహదేవ్ అన్నారు. -
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్ సహా అక్కడున్నవారి సెల్ఫోన్లను సీజ్ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్ఏ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్‌కుమార్‌కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు.. ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్ఎస్ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం! కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్ చేయడం అయిపోయింది. అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, మెజి్రస్టేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్లో పడతారు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరికీ అభివాదం చేసి.. సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్‌కుమార్ కారులో వస్తానని చెప్పారు. ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్‌గా శంషాబాద్‌కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. నేడు కోర్టు ఎదుట హాజరు కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం మధ్యాహ్నం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో అరెస్టులు ఇవీ.. సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) సెప్టెంబర్ 27, 2022 శరత్‌చంద్రారెడ్డి (ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్) నవంబర్ 10, 2022 వినయ్‌బాబు (ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ) నవంబర్ 10, 2022 అభిషేక్ బోయినపల్లి (రాబిన్ డిస్ట్రిబ్యూషన్) నవంబర్ 14, 2022 విజయ్ నాయర్ (మద్యం వ్యాపారి) నవంబర్ 14, 2022 అమిత్ అరోరా (బడ్డీ రిటైల్ డైరెక్టర్) నవంబర్ 30, 2022 గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్) ఫిబ్రవరి 9, 2023 గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023 మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023 మనీష్ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023 కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024 నేడు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. -
‘అన్నీ ఊహలు.. అవాస్తవాలే’.. ఎన్నికల బాండ్లపై నిర్మలమ్మ వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయా వివరాలను వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. దాంతో భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అయితే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలిచ్చిన టాప్ 30 కంపెనీల్లో 15 కంపెనీలకుపైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ)వంటి సంస్థల దర్యాప్తు ఎదుర్కొన్నవే కావడం గమనార్హం. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రముఖ మీడియా సంస్థతో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విరాళాలకు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దాడులకు సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ఈడీ కంపెనీలపై రైడ్ చేస్తేనే ఆత్మరక్షణ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారనుకోవడం ఊహాగానమే అవుతుందన్నారు. బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆయా సంస్థలపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ విరాళాలు మొత్తం భాజపాకే వెళ్లాయని చాలా మంది భావిస్తున్నారని, కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా జమైనట్లు తెలిపారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి సమగ్ర సమాచారంతో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించించింది కదా అని ప్రస్తావించగా ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. తనకంటే ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్‌జైట్లీ మునుపటి కంటే మెరుగైనదిగా భావించి ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కొనుగోలు చేసిన బాండ్లు నేరుగా రాజకీయ పార్టీల ఖాతాల్లోనే పడుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ముందుకెళ్లాలన్నారు. ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లను భారీగా కొనుగోలు చేసిన కంపెనీలివే.. ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్నికల బాండ్ల విరాళాల్లో ఎక్కువ మొత్తం బీజేపీకి వెళ్లగా ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీలున్నాయి. -
బీజేపీకి నో చెప్పా... ఈడీ వచ్చింది: జార్ఖండ్ ఎమ్మెల్యే
రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తున్నాయి. చివరి నిమిషంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారేవారికి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాల్లో చోటు దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపపథ్యంలో జార్ఖండ్‌లోని బర్కాగాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందని ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినందుకే తన నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో అర్ధరాత్రి దాడులు చేస్తోందన్నారు. VIDEO | ED raids to break morale ahead of LS polls: Congress MLA Amba Prasad's mother READ: https://t.co/J7UeiSbEIC "I was offered an MP ticket from the BJP for Hazaribagh, which I declined. Some people from the BJP side pressurised me to contest from the side of BJP MP Chatra.… pic.twitter.com/rDocABkLvp — Press Trust of India (@PTI_News) March 12, 2024 ‘నాకు బీజేపీ హజారీబాగ్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. కొందరు బీజేపీ నేతలు నన్ను ఛాత్రా నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు. ఈ ఆఫర్లను నేను తిరస్కరించాను. దీంతో ఈడీని రంగంలోకి దించి నాపై దాడులు చేయిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఎమ్మెల్యే మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అంబ ప్రసాద్‌కు సంబంధించిన 17 ప్రదేశాల్లో ఈడీ మంగళవారం అర్ధరాత్రి సోదాలు ప్రారంభించింది. జార్ఖండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఉన్న అంబ ప్రసాద్ మాజీ మంత్రి యోగేంద్ర సా కుమార్తె. హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అంబప్రసాద్ కుటుంబానికి గట్టి పట్టుండటం గమనార్హం. #WATCH | Ranchi, Jharkhand: The Enforcement Directorate (ED) leaves after conducting raids on the premises of Congress MLA Amba Prasad for almost 18 hours. pic.twitter.com/2vrhhMimsW — ANI (@ANI) March 12, 2024 ఇదీ చదవండి.. పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్‌స్టర్, రివాల్వర్ రాణి -
డీఎల్ఎఫ్లో ఈడీ సోదాలు... ఎందుకంటే?
రియల్టీ రంగ దిగ్గజ సంస్థ అయిన డీఎల్ఎఫ్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మనీలాండరింగ్ కేసులో డీఎల్ఎఫ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. నోయిడాలోని ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా గురుగ్రామ్‌లో ఆస్తులు కొనుగోలు చేయడానికి సూపర్‌టెక్ గ్రూప్ నిధులు సేకరించింది. సంస్థ ఛైర్మన్ రామ్ కిషోర్ అరోరా గృహ కొనుగోలుదారులు, బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.638 కోట్లను మళ్లించారని ఈడీ జూలైలో పేర్కొంది. అయితే సూపర్‌టెక్ గ్రూప్‌తో డీఎల్ఎఫ్ సంస్థకు సంబంధం ఉండడంతో ఈడీ సోదాలు చేసినట్లు సమాచారం. ఈ సోదాలు శనివారం ఉదయం ముగిశాయని, ఈ సందర్భంగా ఈడీ అధికారులు కొన్ని పత్రాలను పరిశీలించారని చెప్పారు. అయితే సూపర్‌టెక్‌కు సంబంధించి డీఎల్ఎఫ్ ఏ మేరకు సహకరించింది, ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయో వివరించలేదు. ఇదీ చదవండి: సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్! ఈ కేసులో ఇప్పటివరకు సుమారు రూ.638.93 కోట్లు నిధులు మళ్లించారని ఈడీ తెలిపింది. దీన్ని సూపర్‌టెక్ గ్రూప్, దాని ప్రమోటర్లు/ డైరెక్టర్లు తమ గ్రూప్ కంపెనీల ద్వారా తక్కువ ధర ఉన్న భూమిని కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును వినియోగించినట్లు ఈడీ వివరించింది. 2013-14లో సర్వ్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేయడానికి కస్టమర్లు, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణం మొత్తం రూ.444 కోట్లు వినియోగించారని ఈడీ తెలిపింది. -
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్‌తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (TACB) దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వినోద్ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. వివేక్ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివేక్, వినోద్ దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి (కాకా) కుమారులు. -
కేజ్రీవాల్‌కు మరో షాక్.. మరో ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) తనిఖీలు చేపట్టింది. దీంతో, ఢిల్లీలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ఈడీ సోదాలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఆప్ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. కాగా, అమానతుల్లా ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించి సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఆప్ ఎమ్మెల్యే మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నది. మరోవైపు, ఈడీ సోదాలపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: ED raids underway at the premises of AAP MLA Amanatullah Khan in connection with a money laundering case. pic.twitter.com/KD0EaQOdjn — ANI (@ANI) October 10, 2023 ఇదిలా ఉండగా.. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, సంజయ్ సింగ్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజులు ఈడీ కస్టడీని విధించింది. దీంతో, లిక్కర్ స్కాం గురించి సంజయ్ సింగ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. #WATCH | Delhi: BJP workers hold protest against Delhi CM and AAP national convenor Arvind Kejriwal, and demand his resignation. pic.twitter.com/9d2pZhExVL — ANI (@ANI) October 10, 2023 ఇక, ఆప్ నేతల ఇళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా కేజ్రీవాల్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఇది కూడా చదవండి: పాలస్తీనాకు మద్దతుగా సీడబ్ల్యూసీ తీర్మానం