Education policies
-
ఐబీకి దగ్గరగా ఏపీ విద్యా విధానాలు
సంబేపల్లె: ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తోన్న విద్యా విధానాలు ఇంటర్నేషనల్ బాకలారియట్ (ఐబీ)కి దగ్గరగా ఉన్నాయని ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమల్లోకి రానున్న దృష్ట్యా అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు వెండిగీన్ (అమెరికా) ఎరిక్ బాబర్ (ఇంగ్లండ్) సందర్శించారు. వీరు నాడు–నేడు ద్వారా సమకూరిన తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల గురించి ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అమలవుతోన్న విద్యా విధానం, విద్యార్థుల అభ్యసన విధానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఎలా దోహదపడుతున్నాయనేది పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లను చూసి వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకున్నారు. బైజూస్ ట్యాబ్స్, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద పథకాల ద్వారా తాము ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నామో విద్యార్థులు వీరికి వివరించారు. అంతర్జాతీయ ప్రతినిధులు పాఠశాలలోని జగనన్న గోరుముద్దను తిన్నారు. పాఠశాలలో డిజిటల్ విద్య, ద్విభాష పాఠ్యపుస్తకాలు, లైబ్రరీ, యూనిఫామ్, భౌతిక, జీవనశాస్త్ర ప్రయోగశాలను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రధానోపాధ్యాయుడిని అభినందించారు. ఎస్సీఈఆర్టీ అధ్యాపకుడు గిరిబాబు యాదవ్ మాట్లాడుతూ 2035కి పదోతరగతికి, 2037కి 12వ తరగతికి ఐబీ సిలబస్‌ను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు ఐబీ కరిక్యులం అంతర్జాతీయ ప్రతినిధులు ఏపీలోని పలు పాఠశాలలను సందర్శిస్తున్నారని చెప్పారు. -
పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి.. చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ లాభమేనా?
నేను ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వం నుంచి హెల్త్ రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంది. అయినా కానీ, నేను వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలా? – అమిత్ సోలంకి ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా హెల్త్ స్కీమ్‌ల కింద కవరేజీ ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) కింద రక్షణ లభిస్తుంది. ఉద్యోగులతో పాటు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సైతం ఈ పథకం కింద కవరేజీ లభిస్తుంది. అలాగే, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున హెల్త్ కవరేజీ ఉద్యోగులకు ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్, వెస్ట్ బెంగాల్ హెల్త్ స్కీమ్ ఇందుకు ఉదాహరణలు. ప్రభుత్వ, ఎంపానెల్డ్ ఆస్పత్రుల్లో వైద్య కిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు వీటి పరిధిలో కవరేజీ వస్తుంది. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగ చికిత్సలకూ వీరు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. అత్యవసర చికిత్స/వైద్యం, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగులకు పరిహారం వస్తుంది. కాకపోతే అన్ని రకాల ఆస్పత్రుల్లో చికిత్సలు పొందే వెసులుబాటు ఉండదు. ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితంగా ఉంటుంది. పైగా ప్రభుత్వ ఆమోదిత ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. ప్రధాన పట్టణాల్లోనే ఇవి ఉంటాయి. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉంటుందో ముందు తెలుసుకోండి. అక్కడ ఉండే వసతులు ఏ మేరకో విచారించుకోవాలి. ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన వసతులతో అందుబాటులో లేకపోయినా, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని ఆస్పత్రిలో వైద్యం పొందాలనుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రైవేటు బీమా సంస్థ నుం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి ట్రాక్ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో పే షరతును ఆమోదించాల్సి రావచ్చు. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. కనీసం రూ.5 లక్షల వరకు వ్యక్తిగత హెల్త్ కవరేజీ ప్లాన్‌ను తీసుకోవాలి. పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు లాభదాయకమేనా? – ఆశా పిల్లల కోసం ఏ తరహా పెట్టుబడి అనుకూలంగా ఉంటుంది? వారు చాలా చిన్న వయసులోనే ఉంటే ఈక్విటీ ఫండ్స్ అనుకూలం. మీకు ఈక్విటీల పట్ల తగినంత అనుభవం ఉంటే, వీలైనంత ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. 10–12 ఏళ్లపాటు పిల్లల కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారు కాలేజీలోకి అడుగు పెట్టే సమయం వస్తుంది. దానికి మూడేళ్ల ముందే సన్నద్ధం కావాలి. మొదటి సంవత్సరం కాలేజీకి కోసం కావాల్సిన మొత్తాన్ని మూడేళ్ల ముందే వెనక్కి తీసుకోవాలి. కాలేజీ రెండో సంవత్సరం కోసం కావాల్సిన మొత్తాన్ని ఏడాది విరామం తర్వాత తీసుకోవాలి. ఇలా చేస్తే మార్కెట్లో ఆటుపోట్లు ఉన్నా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎవరైనా కానీ, పిల్లల విద్య కోసం ఈక్విటీల్లో మదుపు చేస్తున్నట్టు అయితే ఈ విధానాన్ని అనుసరించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు అంత అర్థవంతమైనవి కావు. ఎందుకంటే అనవసరమైన నిర్బంధాలు వీటిల్లో ఉండడమే కారణం. -
పిల్లల చదువు కోసం ఎందులో పెట్టుబడులు పెడితే మంచిది?
మార్కెట్లలో అస్థిరతలను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా?– కిరణ్ అస్థిరతలనేవి ఈక్విటీల సహజ లక్షణం. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే గందరగోళ సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. పైగా కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు పదేళ్లలోపే ఉంటుంది. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – విజయశ్రీ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?.. చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సందేహం ఇది. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. ఈక్విటీల్లోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏక మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. -
ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన మన ‘నాడు-నేడు’.. శభాష్ ఏపీ..!
ప్రపంచ గుర్తింపు సాధించిన మన విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధకు అరుదైన గుర్తింపు లభించింది. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల పర్యటనను తమ వెబ్సైట్లో ఐక్యరాజ్య సమితి పబ్లిష్ చేసింది. తద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధలో తీసుకువచ్చిన సంస్కరణలు, నూతన విద్యావిధానాలకు విశ్వవ్యాప్త గుర్తింపును ఐక్యరాజ్యసమితి ఇచ్చినట్టయింది. మన రాష్ట్ర విధాన్ని తన సైట్లో ప్రచురించిన యుఎన్ ప్రపంచశాంతి, సమాజంలో మార్పు కోసం పాటుపడే ఐక్యరాజ్యసమితి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధ, ఏపీలో అమలవుతున్న బాలికా విద్యా, జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ (అందరికి సమానవిద్య) నచ్చి తమ వెబ్ సైట్ లో ప్రమోట్ చేసేందుకు ఒక ఆర్టికల్ ను (సంచికను) ప్రచురించింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన గుర్తింపు మన ఏపీ రాష్ట్రానికి దక్కడం ఎంతో గొప్ప విషయం. దేశచరిత్రలో తోలి సారిగా.. సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకను ప్రపంచ వేదిక, యూఎన్ లో వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున పంపించిన పదిమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల ప్రతిభను గుర్తించి ఐక్యరాజ్య సమితి వెబ్ సైట్ ఇంపాక్ట్ స్టోరీస్ లిస్ట్ లో దీన్ని లిస్ట్ చేశారు యుఎన్ అధికారులు. సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను అమెరికాలోని పలు అంతర్జాతీయ మీటింగ్ ల కోసం పంపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పదిరోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అమెరికా న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ లో జరిగిన SDG సమ్మిట్, యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు నాడు-నేడు స్లాల్‌ను సందర్శించిన లచ్చెజర స్టోవ్ జులైలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు – నాడు - నేడు నవరత్నాల స్టాల్ ను ఏర్పాటు చేశారు యుఎన్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్. ఈ స్టాల్ ను ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చెజర స్టోవ్ సందర్శించి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలను కొనియాడారు. ఏదేమైనా ఏపీ విద్యార్ధుల ప్రతిభను ఐక్యరాజ్య సమితి గుర్తించి తమ వెబ్ సైట్ లో ప్రచురించడం చాలా గొప్ప విషయం. ఇది చదవండి: ‘మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి’ -
సీఎం వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణలు
-
ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు.. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవవనరులు, సదుపాయాలపై వచ్చేనెల జులై 15 కల్లా వర్కింగ్ గ్రూపు నివేదిక ఇవ్వనుంది. సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా, మౌలిసదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకు వచ్చారు. ►దీంట్లో భాగంగా 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతున్నాయి. ►దీనికి అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలో సీఎం జగన్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందించింది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్, సోషల్ స్టడీస్, మాథమెటిక్స సబ్జెక్టుల్లో బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్‌ను అందించింది. ఇంగ్లిషులో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ల్యాబ్స్ కూడా ఏర్పాటుచేసింది. ►మరో అడుగు ముందుకేస్తూ 2021-2౨లో 6వ తరగతి నుంచి 10వ తరగతివరకూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని విద్యార్థులకు అందించింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ పిక్టోరియల్ డిక్షనరీని అందించింది. ►3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. విద్యార్థులకు బోధనలో ఇదొక కీలక మార్పు. ►జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథమెటిక్స్‌లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు మరింత సులువుగా, మరింత సమర్థవంతంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఉండేందుకు ఆడియో, విజువల్ రూపంలో బైజూస్ కంటెంట్‌ను విద్యార్థులకు అందించింది. ►దీనికోసం ఎనిమిదో తరగతి చదువుతున్న 5,18,740 మంది విద్యార్థులకు ట్యాబులు అందించింది. ఇందులో బైజూస్ కంటెంట్ యాప్‌ను లోడ్ చేశారు. అందులో పాఠ్యాంశాలు ఆడియో, వీడియో రూపంలో ఉండడంవల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతున్నారు. ►తదుపరి విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం- పాఠశాలల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది. నాడు-నేడు పూర్తిచేసుకున్న 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ (ఐఎఫ్‌పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం జులై కల్లా ఈ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక మరో 10,038 తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో ఈవచ్చే డిసెంబర్ నాటికి ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌టీవీల ఏర్పాటు చేయనుంది. ►దీంతోపాటు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ పరీక్షలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం. ప్రపంచస్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిషులో పరిజ్ఞానం అన్నది చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీంతోపాటు భవిష్యత్తు టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), ఎల్ఎల్ఎం ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్ ఛాట్ జీపీటీ, వెబ్ 3.O, అగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్ర్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను, మార్పులను సూచించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు. ►విద్యాభ్యాసం తొలినాళ్లనుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ తదితర అంశాలపై ఈ వర్కింగ్ గ్రూపు ద్వారా ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. ►పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాలు, మానవవనరులు, లెర్నింగ్ కంటెంట్, ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్ గ్రూపు ఖరారు చేయనుంది. ► పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ మెంబర్‌గా ఉంటారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్ఈఆర్టీ డైరెక్టర్, మైక్రో సాఫ్ట్ ఇండియాకు చెందిన అశుతోష్ చద్దా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియాకు చెందిన షాలినీ కపూర్, గూగుల్‌కు చెందిన ప్రతినిధి, ఇంటెల్ ఏసియాకు చెందిన షాలినీ కపూర్, నాస్కాం ప్రతినిధి సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు జైజిత్ భట్టాచార్య, నీతి ఆయోగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు అర్చనా. జి.గులాటి వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15, 2023 నాటికల్లా ఈవర్కింగ్ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. చదవండి: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ? -
AP: ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించాను
-
ఈ ప్రభుత్వ పాఠశాల పిల్లల మార్కులను చూస్తే కార్పోరేట్ స్కూళ్లు సిగ్గు పడాల్సిందే
మదనపల్లె సిటీ: కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఇంటర్మీడియట్లో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు సగర్వంగా తలెత్తుకునే రీతిలో మార్కులు సాధించారు. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో చదివే పిల్లలు పాసైతే చాలు అనుకునేవారు. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి, మౌలిక వసతులు కల్పించడంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి అందరి మన్ననలు పొందారు. కార్మికుడి ఇంట.. చదువుల తల్లి మదనపల్లె పట్టణం అవంతి టాకీసు వద్ద నివాసం ఉంటున్న ఖాదర్‌వలి మెకానిక్. షర్మిల గృహిణి. సామాన్య కుటుంబం. కూతురు మెహర్ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తోంది. పదో తరగతి స్థానిక హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివింది. పదిలో 590 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్ బాలికల జూనియర్ కాలేజీలో బైపిసి చేరింది. ఇంటర్లో 968 మార్కులు వచ్చాయి. రైతు బిడ్డ ..చదువులో దిట్ట రైతు కుటుంబంలో పుట్టి చదువులో రాణిస్తోంది.సత్యసాయి జిల్లా కొక్కంటిక్రాస్ నల్లంవారిపల్లెకు చెందిన లింగారెడ్డి పద్మావతిల కుమారై కవిత. లింగారెడ్డి రైతు, పద్మావతి గృహిణి. కవిత మదనపల్లె జీఆర్టీ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్లో పదో తరగతి పాసైంది. ఇంటర్ బాలికల జూనియర్ కాలేజీలో బైపీసీ చేరింది. ఇంటర్లో 965 మార్కులు సాధించింది. కాలేజీ హాస్టల్లో ఉంటూ విద్యలో రాణించింది. వాచ్మెన్ కూతురు..ఇంటర్లో టాపర్ తండ్రి వాచ్మెన్. తండ్రి పడుతున్న కష్టాలు చూసి చదువులో రాణించాలనుకుంది ప్రీతిలతాదాల్. మదనపల్లె ఎస్టేట్‌కు చెందిన దిగంబర్దాల్ ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ప్రీతి లతాదాల్ ప్రభుత్వ కళాశాలలో చదివి సీఈసీలో 948 మార్కులు సాధించించి అందరి మన్ననలు అందుకుంది. దినకూలి ఇంట సరస్వతి పుత్రుడు తంబళ్లపల్లె: ఓ దినసరి కూలీ ఇంట చదువుల తల్లి సరస్వతి కొలువుదీరింది. ఆ ఇంటిలోని ఓ విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభచాటి పలువురి మన్ననలు పొందాడు. మండలంలోని కొటాలకు చెందిన అమరావతి కూలీ పనులతో కుంటుంబ పోషణ సాగిస్తోంది. రెండో కుమారుడు ఇ.అశోక్‌కుమార్ ప్రాథమిక విద్య కొటాల ప్రభుత్వ పాఠశాలలో, గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి పూర్తి చేసి 540 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. అప్పటికే తల్లి పడుతున్న కష్టం చూసి అతనిలో బాగా చదవాలనే పట్టుదల పెరిగింది. తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేరాడు. ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించాడు. అతడి తండ్రి ఈశ్వరయ్య కోవిడ్ తో మృతి చెందాడు. ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం. అందుకే ఇంటర్మీడియట్ సీఈసీ చేరాను. అధ్యాపకులు రెడ్డప్పరెడ్డి సూచనలు,సలహాలతో మంచి మార్కులు సాధించాను. –ప్రీతిలతాదాల్ ఎంబీబీఎస్ చేస్తా ఎంబీబీఎస్ చేయాలని ఉంది. ఇందు కోసం ఎంసెట్,నీట్ ఎంట్రన్స్‌లకు ప్రిపేర్ అవుతున్నా. అధ్యాపకులు ఇచ్చిన సలహాలు, సూచనలతో ప్రతి రోజు 9 గంటలు చదువుతున్నా. –కవిత రాజుపాళెం : మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్ధినులు ప్రభంజనం సృష్టించారు. జమ్మలమడుగు మండలంలో కన్నెలూరు చెందిన సుబన్న, మేరిల కుమార్తె ప్రియాంక ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూపు ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. 10వ తరగతి జమ్మలమడుగు గూడెంచెరువులోని కస్తూరిబా పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. బాలిక తండ్రి బేల్దారిగా పని చేస్తున్నాడు. భవిష్యత్తులో డాక్టర్ అయి పేదలకు సేవచేస్తానని ప్రియాంక చెప్పింది. ప్రియాంక తండ్రి సుబ్బన్న బేల్దారిగా పనిచేస్తున్నాడు, తల్లి మేరి కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్నవుతా నంద్యాల జిల్లా సంజాముల మండలంలోని నొస్సం గ్రామానికి చెందిన బి.నాగేశ్వరరావు కుమార్తె బి.ముని జాహ్నవి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీగ్రూపులో ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల పదదోతరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు చదివింది. బాలిక తండ్రి జూనియర్ లైన్మెన్గా, తల్లి అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్ కావాలని ఉద్ధేశంతో ప్రస్తుతం నీట్‌కు కోచింగ్ తీసుకుంటున్నట్లు మునిజాహ్నవి తెలిపింది. వ్యవసాయ కూలీ బిడ్డ.. చదువులో దిట్ట రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి పామిడి లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని నగళ్లపాడుకు చెందిన వ్యవసాయ కూలి పామిడి శ్రీనివాసులు కుమార్తె లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు 966 మార్కులు సాధించింది.. తండ్రి వ్యవసాయ కూలీ కాగా, తల్లి స్వాతి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో నీట్ కోచింగ్ తీసుకుంటున్నానని, భవిష్యత్తులో డాక్టర్నవుతానని తెలిపింది. బి.ఫార్మసీ చేయాలని ఉంది ఎంసెట్, నీట్ ఎంట్రన్స్ రాస్తా. బి.ఫార్మసీ చేయాలని ఉంది.అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలతో మంచి మార్కులు సాధించా. –మెహర్, మదనపల్లె ఐఏఎస్ చదవాలన్నదే ఆశయం ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి ఐఏఎస్ కావాలన్నదే తన ఆశయమని అశోక్‌కుమార్ తెలిపాడు. నేటి ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు పేద పిల్లలకు ఇస్తున్న భరోసా తనకు ఆనందం కలిగిస్తోందన్నారు. -
విద్యావిధానం అమలులో ఏపీ భేష్
స్విట్జర్లాండ్‌లోని జెనీవా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, విద్యా విధానం బాగున్నాయని కొనియాడారు. మంచి ప్రాథమిక విద్య, శిక్షణ, స్థిరమైన అభివృద్ధికి కీలకం అనే అంశంపై స్విట్జర్లాండ్ దేశం జెనీవా లో ఉన్న ఐక్యరాజ్య సమితి కార్యాలాయంలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియా నుంచి ఐక్యరాజ్య సమితి పర్మినెంట్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ (united nations special consultative status member) పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్ధుల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న విద్య గురించి ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రస్తావించారు. కరోనా తర్వాత దేశాల్లో ఉన్నటువంటి గడ్డు పరిస్ధితులను మీటింగ్‌లో పలువురు ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పధకాల స్టాల్‌ను సందర్శించిన స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ ప్రభుత్వ పధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో విద్య కోసం నాడు-నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలు జరుగుతున్న విద్యాప్రమాణాలను తెలుసుకుని అభినందించారు. నాడు-నేడులో భాగంగా డిజిటల్ లెర్నింగ్, నాణ్యతమైన విద్యలో భాగంగా విద్యార్ధులకు ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కంప్యూటర్ ట్యాబ్‌లు పంపిణీ, శిధిలావస్ధలో ఉన్నటువంటి పాఠశాలలను ఆధునీకరించడం, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతుల్లో నూతన విద్యావిధాన బోధన వంటివి పేదవిద్యార్ధులకు ఎంతో మేలు చేస్తుందని వారన్నారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారన్నారు. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో న్యూట్రీషన్ ఫుడ్ అందించడం వంటివి బాగున్నాయన్నారు. లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ఎస్పెషల్లీ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ అనేది చాలా నచ్చిందన్నారు పాట్రిసియా దన్జీ. యూఎన్ఓలో ఆంధ్రప్రదేశ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాల్‌ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. లింగ అసమానతలను పోగెట్టేలా ఆడపిల్లకు అందిస్తున్న గర్ల్స్ ఎడ్యుకేషన్ విధానాన్ని అభినందించారు. దీని ద్వారా అమ్మాయిలకు విద్య అనేది చాలా ముఖ్యమనదన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ బెస్ట్ గా ఉందన్నారు. బైజ్యూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో విద్యా విధానం అనేది బాగుందన్నారు. -
నెలవారీ సమీక్షలతో ‘తొలిమెట్టు’
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో విద్యాప్రమాణాల మెరుగుకు ఉద్దేశించి చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని జిల్లావిద్యాశాఖ అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. పురోగతిని ప్రతినెలా సాంకేతికంగా నమోదు చేస్తున్నప్పటీకీ, బోధన ప్రక్రియల్లో వినూత్న మెలకువలు అమలు చేస్తున్నా ఇంకా చాలాపాఠశాలల్లో విద్యార్థులు వెనుకబడే ఉన్నారని తెలిపారు. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థులు నిమిషానికి 30 నుంచి 50 పదాలు కూడా ధారాళంగా చదవలేకపోవడాన్ని అధికారులు డీఈవోల దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు పథకం అమలు తీరుపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన శుక్రవారం డీఈవోలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకు సంబంధించి సబ్జెక్టులవారీగా విశ్లేషించి, కొన్ని సూచనలు చేశారు. తెలుగులో... రెండు తరగతుల వరకూ బోధించిన అక్షరా లు, గుణింతాలు ఒత్తులపై స్పష్టత ఇవ్వాలి. గేయాల్లో బట్టీ విధానం కాకుండా, అక్షరాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. ధ్వని ఆధారంగా పదాలు చెప్పేలా చూడాలి. గుం డ్రంగా అక్షరాలు రాసేలా చూడాలి. 3–5 తరగతుల్లో బోధించేపాఠాల్లో అక్షరాల ఆధా రంగా పదాలు తయారు చేసేలా చూడాలి. ఒకటి, రెండు తరగతుల్లో రాయడం, 3–5 తరగతుల్లో చేతిరాత అందంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రమాణాలవారీగా బోధన విధానాలు అమలు చేయాలి. ఇంగ్లిష్‌లో... స్పష్టంగా పదాలు పలికేలా చూడాలి. పదాలకు అనుగుణంగా చిత్రాలు గుర్తించడం, చదివించడం, రాయించడం చేయాలి. ప్రతిరోజూ నిర్ధారించిన బోధనాభ్యసన ప్రక్రియలను ధ్వనులు, గుర్తించడం, రాయించడం ద్వారానే చేపట్టాలి. గణితంలో... ఏ యూనిట్ బోధించినా వాటిలోని గణిత భావనలపట్ల సామగ్రిని ఉపయోగించి అవగాహన కల్పించాలి. చిత్రాలు వాడటం వల్ల తేలికగా అర్థమవుతుంది. సంఖ్యలు నేర్చించడానికి వాచకంలో సరైన విధానాలు, ప్రక్రియలు ఉన్నాయి వాటిని ఉపయోగించాలి. 3–5 తరగతుల్లో బోధన చేసేప్పుడు పూర్వ భావనలను అవగాహన కల్పించి, అభ్యాసం చేయించడానికి ప్రయత్నించాలి. ఇక చేయాల్సింది ఇదీ.. తొలిమెట్టు బోధన విధానాలపై ఇచ్చిన సూచనలను ప్రతీ టీచర్‌కు చేరవేసేందుకు డీఈవోలే చొరవ తీసుకోవాలని, దీనికోసం కాంప్లెక్సు సమావేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు డీఈవోలకు సూచించారు. తొలిమెట్టులో విజయం సాధించిన పాఠశాలలను గుర్తించి వారి అనుభవాలను ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపారు. తొలిమెట్టులో క్రియాశీలపాత్ర పోషించేవారిలో మండలానికి ఒకరి చొప్పున టీచర్‌ను గుర్తించాలని సూచించారు. వారి పురోగతి వివరాలను ఫొటోతోసహా ఈ నెలాఖరుకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. టీచర్లందరికీ సబ్జెక్టులవారీగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఇక నుంచి రాష్ట్రస్థాయిలో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సాహం ఇస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. -
Bharat Jodo Yatra: విద్వేష రాజకీయాల నుంచి యువతను రక్షించాలి
తుమకూరు: విద్వేష రాజకీయాల నుంచి దేశ యువతను రక్షించాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి అవకాశాలను వారికి కల్పించి మంచి భవిష్యత్తును చూపాలన్నారు. యువతను విద్వేషాల మంటల్లోకి నెట్టేవేయడం దేశ భవితను నాశనం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర ఆదివారం తుమకూరు జిల్లాలో రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొందరు యువతీయువకులు పెరుగుతున్న నిరుద్యోగం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. శాంతి, సోదరభావ సందేశాన్ని వ్యాపింపజేసి, దేశాన్ని ఐక్యంగా ఉంచే యాత్రలో పాల్గొనాలని ఆయన వారిని కోరారు. ‘కొన్ని రాజకీయ పార్టీలు తమ విద్వేష రాజకీయాల కోసం వారిని నిరుద్యోగులుగానే ఉంచుతూ తప్పుదోవపట్టిస్తున్నాయి. యువత మన దేశ భవిష్యత్తు. ఉపాధి చూపితే వారు తమ, కుటుంబ, దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. మనదేశాన్ని మునుపటి మాదిరిగా అందమైన దేశంగా తయారు చేసుకుందాం’అని రాహుల్ పేర్కొన్నారు. చిక్కనాయకనహళ్లిలో చిన్నారులతో కలిసి కారులో కాసేపు ముచ్చటించారు. చిన్నారులతో కలిసి కారులో రాహుల్ సరదా -
Teachers Day 2022: మాతృభాషలో బోధనతో ప్రతిభకు పదును
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిలషించారు. మాతృభాషలో బోధిస్తే పిల్లల్లో సైన్స్, సాహిత్యం, సామాజిక శాస్త్రాలకు సంబంధించి నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠ్యాంశాలను వారు సులువుగా అర్థం చేసుకోగలుగుతారన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో పాఠశాల, ఉన్నత విద్యలో భారతీయ భాషలకు ప్రాధాన్యం లభించిందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తమ గ్రామం నుంచి కాలేజీలో చదువుకునేందుకు వెళ్లిన మొదటి బాలికగా నిలవడం వెనుక ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహమే కారణమని చెప్పారు. వారికి తానెంతో రుణపడి ఉంటానన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము 46 మంది ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. -
పట్టా పట్టు.. కొలువు కొట్టు
చదువు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే లక్ష్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందు కోసం ఉన్నత విద్యలో నూతన జాతీయ విద్యావిధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థి దశలోనే వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో అమల్లో ఉన్న ఇంటర్న్‌షిప్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సిద్ధపడిన విద్యార్థులను పరిశ్రమలతో మ్యాపింగ్ పూర్తి చేసింది. నెల్లూరు (టౌన్): ఉన్నత విద్య చదివే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పని సరి చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్ ఉంది. డిగ్రీలో కూడా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తే విద్యార్థులు చదువు పూర్తి కాగానే సులభంగా ఉద్యోగ, ఉపాధి పొందే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తోంది. 10 నెలల ఇంటర్న్‌షిప్ తప్పని సరి డిగ్రీలో 10 నెలల పాటు ఇంటర్న్‌షిప్ తప్పని సరి చేశారు. అకడమిక్ విద్యా సంవత్సరం ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభకు మార్కులు కేటాయించారు. కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో చదువుతో పాటు అనుభవం సంపాదించడం, పరిశ్రమలతో అనుబంధం ఏర్పడేందుకు ఇంటర్న్‌షిప్ ఎంతో ఉపయోగపడుతోంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రెండు సెమిస్టర్ పరీక్షలు అయిన తర్వాత 2 నెలలు పాటు కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో 3, 4 సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. డిగ్రీ తృతీయ సంవత్సరంలో 5వ సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 6 నెలల పాటు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4 ఏళ్లు డిగ్రీ కోర్సు అమలు చేయనున్నట్లు ఉన్నత విద్య అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కోర్సును బట్టి (ఉదాహరణకు బీఏ హానర్స్ పేరుతో) సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. 8,964 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ జిల్లాలో మొత్తం 74 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ–10, ఎయిడెడ్–3, ప్రైవేట్– 61 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో డిగ్రీ 3 సంత్సరాలు కలిపి మొత్తం 45 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 13,547 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 8,964 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 3,883 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు ఆయా పరిశ్రమలు, సంస్థలతో మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన విద్యార్థులు కూడా పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకునేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌తో విద్యార్థుల డేటాను తెప్పించి వర్సిటీలోనే నమోదు చేయిస్తున్నారు. ఇంటర్న్‌షిప్ మీద కళాశాలల యాజమాన్యాలతో పాటు ప్రిన్సిపల్స్‌కు కూడా వర్సిటీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలు నూతన విద్యా విధానాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, మెంబర్‌గా వర్సిటీ వైస్ చాన్సలర్, మెంబర్ సెక్రటరీగా జాయింట్ కలెక్టర్, అడిషనల్ మెంబరు సెక్రటరీగా వర్సిటీ రిజిస్ట్రార్, మెంబర్లుగా డీఐఈపీసీ జనరల్ మేనేజర్, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, విజ్ఞాన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ (చేజర్ల), కృష్ణచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్, ఆదానీ విల్మర్, సీమెన్స్గమేసా, ఆదానీపోర్ట్, ఐఆర్సీఎస్ చైర్మన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, బీఎం ఆర్ గ్రూపు జీఎంలు ఉన్నారు. ఇంటర్న్‌షిప్‌కు అవకాశం డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కోసం తిరుపతి జిల్లా కలెక్టర్‌తో సమావేశ అనంతరం పరిశ్రమలు, సచివాలయాలు, ఆర్బీకేలు, శ్రీసిటీ, స్కిల్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో 4 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పించారు. వచ్చే నెల 6న కమిటీ చైర్మన్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో మాట్లాడి మిగిలిన విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించనున్నాం. – సుందరవల్లి, వైస్ చాన్సలర్, వీఎస్‌యూ -
‘ఫెస్టో ఎక్స్‌పోటైనర్’ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సజ్జల
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండి యురో సింక్రనైజెషన్ స్కిల్ క్లస్టర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఫెస్టో ఎక్స్‌పోటైనర్’ వాహనాన్ని ప్రారంభించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో చల్లా మధుసూదన్ రెడ్డి, ఎస్డీ అండ్ టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు సత్యనారాయణ, ఎండీ APSSDC, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసి రాజశేఖర్ పాల్గొన్నారు. ఫెస్టో ఎక్స్‌పోటైనర్ వాహనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని పేర్కొన్నారు. ‘నూతన జాతీయ విద్యా విధానం వస్తుందంటున్నారు. కానీ దాని కన్నా ముందే ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. చదువుపైన ఆసక్తి ఉన్న వారికి, చదువుకోవాలనే ఆశ ఉన్న వారికి ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించింది. విద్యావ్యవస్థలో ఈ దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తీసుకువచ్చాము. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలకు సంబంధించిన ఫలితాలు అందుతున్నాయి. నైపుణ్యం సాధించడానికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కరోనా వల్ల ఆ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఫెస్టో ఎక్స్పోటైనర్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదీ చదవండి: పాత ఫొటోలతో విష ప్రచారం.. చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల -
నిర్బంధ విద్యపై నిఘా
మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా కళాశాలలు, కోచింగ్ సెంటర్లు నిర్బంధ విద్యకు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు కోచింగ్ సెంటర్ల కార్యకలాపాల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీ (డీఎంఎస్సీ)కి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా సమావేశాలు పెట్టి ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్ల లోపాలపై చర్యలకు సిఫారసు చేస్తే ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది. నెల్లూరు (టౌన్): బలవంతపు చదువులకు స్వస్తి చెబుతూ ప్రశాంత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పర్యవేక్షణ కమిటీలతో శ్రీకారం చుట్టింది. ఇంటర్ నుంచే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్›డ్, నీట్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై బలవంతపు చదువులను రద్దుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఒక సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోనుకాకుండా ప్రశాంతంగా చదువుకునే విధంగా అనువైన పరిస్థితులను ఆయా కళాశాలల్లో కల్పించాలని భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 204 జూనియర్ కళాశాలలు ఉంటే.. వీటిల్లో ప్రభుత్వ యాజమాన్యం 65, ప్రైవేట్ 139 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 57,647 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 28,510, ద్వితీయ సంవత్సరం 29,137 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 20కు పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలను పునః ప్రారంభించారు. పరీక్షల్లో ర్యాంకుల కోసం ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు వీరిని చదివిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. డీఎంఎస్సీ కమిటీ ఏర్పాటు జిల్లాలో జూనియర్ కళాశాలలు, కోచింగ్ సెంటర్లు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీకి గౌరవాధ్యక్షులుగా కలెక్టర్ చక్రధర్‌బాబు వ్యవహరించనున్నారు. కమిటీ అధ్యక్షులుగా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కన్వీనర్‌గా జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి శ్రీనివాసులు, సభ్యులుగా ఆర్ఐఓ వరప్రసాదరావు, డీఈఓ రమేష్, డీఎంహెచ్ఓ పెంచలయ్య, సీడీపీఓ అనూరాధ, ఫుడ్‌సేఫ్టీ అధికారి నీరజ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసరు జాషువా, మానసిక వైద్యులు డాక్టర్ క్రిష్టినా, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ రమ్య ఉంటారు. ఇప్పటికే కలెక్టర్ అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. కమిటీ విధి, విధానాలు కమిటీ సభ్యులు ప్రతి నెలా జిల్లాలో 2 జూనియర్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలి. అక్కడ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తీసుకు వస్తున్నారనే కారణాలను గుర్తించాలి. కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థులతో మమేకమై వారి సాధక బాధలను అడిగి తెలుసుకోవాలి. వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి, విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఆత్మహత్యల నివారణకు మార్గనిర్దేశం ఇవ్వాలి. ఇంటర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించే కళాశాలలను గుర్తించాలి. వాటిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదించాలి. ఇంటర్ విద్యలో సంస్కరణలను సూచించాలి. కళాశాల సందర్శన, పరిశీలన వివరాలతో కూడిన నివేదికను తయారు చేసి ప్రతి నెలా కలెక్టర్‌కు అందజేయాలి. ప్రతి నెలా జేసీ అధ్యక్షతన కమిటీ సభ్యులు కలిసి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలి. అక్కడ గుర్తించిన సమస్యలు, వివరాలను సమావేశంలో వారి దృష్టికి తీసుకెళ్లాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించే కళాశాలలను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తాం. ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో నాణ్యమైన భోజనాన్ని అందించాలి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో అన్ని రకాల వసతులు కల్పించాలి. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా తరగతులు నిర్వహించాలి. – ఎ.శ్రీనివాసులు, డీవీఈఓ, కమిటీ కన్వీనర్ -
YSRCP Plenary 2022: విద్యా రంగంపై తీర్మానం: హైలైట్స్ ఇవే..
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: మంచి చదువులతో పిల్లలను తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని నమ్మి సీఎం వైఎస్ జగన్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా రంగంలో ప్రభుత్వం తెచి్చన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కానుందని చెప్పారు. శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చును దేశాభివృద్ధికి పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. చదవండి: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వేల కోట్ల రూపాయలు విద్యా రంగానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు కొనసాగించాలని సీఎం విద్యా సంస్కరణలను యజ్ఞంలా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా సంస్కరణలను ప్రతిపక్షాలు హేళన చేయడంపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు, అవగాహన లేని నేతలే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తెచ్చిందన్నారు. ఒకప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్క టీచరే ఉండటం వల్ల పిల్లలకు సరైన బోధన అందేది కాదన్నారు. కానీ ఇప్పుడు 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌తో పిల్లలకు బోధన అందేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో నాసిరకమైన విద్య.. గత ప్రభుత్వాలు ప్రైవేటు కళాశాలలి్న, స్కూళ్లను ప్రోత్సహించాయని.. పరీక్షలను చూసి రాయించాయని మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించి భారీగా దోచుకున్నారని మండిపడ్డారు. నాసిరకమైన విద్యను అందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా మన విద్యార్థులకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకని స్థితిని తెచ్చారని నిప్పులు చెరిగారు. ఇలా కాకుండా ఒక కుటుంబంలో విద్యార్థికి మంచి విద్య అందితే ఆ కుటుంబ ఆరి్థక స్థితిగతులు మారిపోతాయన్నారు. ఇది స్నేహపూర్వక ప్రభుత్వమని.. ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన పగ్గాలను చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యా సంస్కరణలపై దృష్టి సారించారని గుర్తు చేశారు. నేడు ప్రైవేటు స్కూల్స్‌ను మించి సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో బడికి వెళ్లే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసాన్ని కల్పించారని పేర్కొన్నారు. హైలైట్స్ ♦విద్యపై పెట్టే ఖర్చు దేశాభివృద్ధికి పెట్టుబడి ♦రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు ♦ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా రంగంలో సంస్కరణలు ♦ అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక ♦ఇంగ్లిష్ మీడియం విద్య.. ♦మా హక్కు అనేది ప్రతి విద్యార్థి భావన ♦రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం ♦ఒక విద్యార్థికి మంచి చదువు లభిస్తే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ♦మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే ♦ ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు 35 శాతం సీట్లు ♦గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటు స్కూళ్లకు, కళాశాలలకు ప్రోత్సాహం ♦ కార్పొరేట్‌కు అనుగుణంగానే గత ప్రభుత్వం చట్టాలు పేద పిల్లల పెద్ద చదువులకు అనేక పథకాలు అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక. పేదల పిల్లలు పెద్ద చదువులు చదివేలా సీఎం వైఎస్ జగన్ అనేక పథకాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. దాన్ని పేదలకు మరింత చేరువ చేశారు. విద్యా రంగంలో సంస్కరణల కోసమే రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. గత ప్రభుత్వాలు విద్యను నిరీ్వర్యం చేశాయి. పాఠశాలల అభివృద్ధిపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు.. ఆయన తల్లిదండ్రుల కమిటీలను అడిగితే వారే చెబుతారు. – కిలారి రోశయ్య, ఎమ్మెల్యే నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. గతంలో ఎవరూ ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని చెప్పి.. మన తలరాతను మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్. అమ్మ ఒడి గొప్ప పథకం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, ఇంకా అనేక కార్యక్రమాలు, పథకాలతో సీఎం సంఘసంస్కర్తగా నిల్చారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా రంగానికి కొమ్ము కాసింది. నారాయణ, చైతన్య యాజమాన్యాలకు అనుగుణంగా చట్టాలు కూడా చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆ చట్టాలను మార్చి ప్రైవేటు వర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు పేదలకు ఇస్తున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అట్టడుగు వర్గాల మేలు కోసమే పథకాలు ఇంగ్లిష్ మీడియం విద్య.. మా హక్కు అని నినదించేలా సీఎం జగన్ పేదల పిల్లలకు ఆంగ్ల మాధ్యమ చదువులను అందిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు మేలు చేయాలన్న తపనతోనే వేల కోట్ల రూపాయలు వెచి్చస్తూ విద్యా పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. రక్తం ధారబోసి అయినా వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. – సుధాకర్‌బాబు, ఎమ్మెల్యే బడుగుల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దా? రామోజీరావు, చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ నేతల పిల్లలు, మనవళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. బడుగుల పిల్లలకు మాత్రం ఇంగ్లిష్ మీడియం అందకూడదన్నట్టు వీరు వ్యవహరిస్తున్నారు. బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లిష్ చదువులకు పనికిరారన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. – నాగార్జున యాదవ్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
HYD: సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. మంగళవారం సాయంత్రం మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుకులాలను ఇంటర్ స్థాయికి ఉన్నతీకరించడంపై ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను.. ఉపాధి శిక్షణా కేంద్రాలుగా మార్చే అంశంపైనా చర్చ కోసం ఈ సమావేశం నిర్వహించారు. నాణ్యమైన విద్యను అందించడం, సంక్షేమ అంశాలపై చర్చ ప్రధానాంశాలుగా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో.. మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భారతీయ విద్యార్ధులకు అమెరికా గుడ్ న్యూస్!
భారతీయ విద్యార్థులకు భారత్‌లోని అమెరికన్ ఎంబసీ కార్యాలయం శుభవార్త చెప్పింది. చట్టబద్దంగా అమెరికాలో చదువుకునేందుకు అర్హులైన విద్యార్ధులు పొందే ఐ-20 పత్రాలు ఉండి, ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్ స్లాట్లు బుక్ చేసుకోవాలని ప్రకటించింది. అమెరికాలో చదువుకునేందుకు వేలాది మంది విద్యార్ధులకు యునైటెడ్ స్టేట్స్‌లోని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సెర్టిఫైడ్ స్కూల్(ఎస్ఈవీఐసీ)లో అడ్మిషన్ లభిస్తుంది. దీని తర్వాత సంబంధిత స్కూల్ నుంచి అర్హులైన విద్యార్ధులకు అధికారులు ఫారమ్ ఐ-20ని పంపుతారు. Student visa appointments are available on our website. If you have an I-20, don't wait! Future F, M, and J appointment openings at the Embassy and Consulates will be for interviews taking place after Aug 14, so if you need to arrive at school by mid-Aug, book an appointment now! — U.S. Embassy India (@USAndIndia) June 24, 2022 అయితే విద్యార్ధులందరూ పైన పేర్కొన్న ఐ-20 ఫారమ్‌ను అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి పొందారు. యూనివర్సిటీతో పాటు అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఇందుకోసం భారత్‌లో ఉన్న యూఎస్ ఎంబసీ విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఆ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కానీ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించలేదు. అందుకే భారత విదేశాంగ శాఖ యూఎస్‌తో చర్చలు జరిపి..భారతీయ విద్యార్ధులకు వీసాలు మంజూరు చేయాలని కోరింది. భారత్ కోరిక మేరకు 2022 జూన్- జులై కావాల్సిన ఇంటర్వ్యూ స్లాట్లను మే నెలలో ఓపెన్ చేసింది. తాజాగా..మరో సారి ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా..త్వరలో యూఎస్ ఎంబసీ, కాన్సలేట్ కార్యాలయాల్లో విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఐ-20 డాక్యుమెంట్లు ఉంటే ఆలస్యం చేయకుండా మేం నిర్వహించే ఇంటర్వ్యూల కోసం స్లాట్లు బుక్ చేసుకోండి. విద్యార్ధులు పొందాల్సిన ఎఫ్, ఎం, జే వీసాల కోసం ఆగస్టు14 తర్వాత ఇంటర్వ్యూలు జరగుతాయి," అని ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ట్వీట్లో పేర్కొంది. -
సెన్సేషన్ జరగాలి.. జరుగుతుంది: తెలంగాణ సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సంచలనం జరగబోతోందని, త్వరలోనే అంతా చూస్తారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ‘‘దేశంలో సెన్సేషన్ జరగాల్సి ఉంది. అది జరిగి తీరుతుంది. దీన్ని మున్ముందు మీరే చూస్తారు’’ అని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్లతో భేటీని ప్రస్తావిస్తూ.. ‘బిజినెస్‌మన్‌తో బిజినెస్ అంశాలే చర్చించినట్టుగా.. రాజకీయ నేతలతో రాజకీయ అంశాలే చర్చించాం’’ అని తెలిపారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా రూపకల్పనలో భాగంగా ఢిల్లీ పర్యటన చేపట్టిన సీఎం కేసీఆర్.. శనివారం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు కొనసాగిస్తున్న విధానాలపై సంఘటితంగా కొట్లాడాల్సిన తరుణం ఆసన్నమైందని ఈ సందర్భంగా కేజ్రీవాల్, అఖిలేశ్‌లతో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. కేంద్రం అవలంబిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయి పోరాటం అవసరమని.. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు కలిసి నడుద్దామని ప్రతిపాదించినట్టు తెలిసింది. కేసీఆర్ నివాసానికి అఖిలేష్ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వచ్చారు. కేసీఆర్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లతో కలిసి అఖిలేష్ భోజనం చేశారు. తర్వాత కేసీఆర్, అఖిలేష్ సుమారు రెండున్నర గంటల పాటు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. ఉమ్మడిగా ఎదుర్కొందాం! ఇటీవలి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎస్పీ ఎదుర్కొన్న తీరు, రైతు సమస్యలపై ఆ పార్టీ చేసిన పోరు, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్డీయే సర్కారును ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్, అఖిలేష్ చర్చించుకున్నట్టు సమాచారం. బీజేపీ మతపరమైన అంశాలను ముందుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతోందని, ఈ విభజన రాజకీయాలను ఎదురించకుంటే దేశ సమగ్రత దెబ్బతింటుందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. మతపరమైన అంశాలను వివాదాస్పదం చేయడం, తద్వారా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాజకీయ లబ్ధి పొందడం బీజేపీకి పరిపాటిగా మారిందని పేర్కొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రైతు అంశాలపైనా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణలో రైతులను ఆదుకునేలా, వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని.. కానీ ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రం సహకరించకుండా ఇబ్బందిపెట్టిందని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. మద్దతు ధర, వ్యవసాయోత్పత్తుల సేకరణ విషయంలో జాతీయ విధానాన్ని తేవాల్సి ఉన్నా.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడినట్టు సమాచారం. రాష్ట్రాల అభిప్రాయాలకు విరుద్ధంగా విద్యుత్ మీటర్ల ఏర్పాటు, కార్పొరేషన్ రుణాలు దక్కకుండా షరతులు, గ్రామ పంచాయతీ నిధుల్లో జోక్యం వంటివాటితో కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ అంశాలన్నింటిపై భావ సారూప్య పార్టీలన్నీ ఉమ్మడిగా కొట్లాడితేనే దేశంలో గుణాత్మక మార్పు వస్తుందని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పినట్టు సమాచారం. వీటన్నింటిపైనా కేసీఆర్ వాదనతో అఖిలేష్ కూడా ఏకీభవించినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అఖిలేష్‌తో భేటీ అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రివాల్తో కేసీఆర్ సమావేశమై చర్చించారు. అయితే పాఠశాలలు, మొహల్లా క్లీనిక్‌ల సందర్శన కార్యక్రమాలు ఉండటంతో.. ఆదివారం చండీగఢ్ పర్యటనలో మరింత లోతుగా చర్చించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించినట్టు సమాచారం. సెన్సేషన్ జరుగుతుంది: కేసీఆర్ కేజ్రీవాల్‌తో కలిసి పాఠశాలను సందర్శించిన సందర్భంగా కేసీఆర్‌ను మీడియా పలకరించింది. అఖిలేష్‌తో భేటీలో ఏమేం చర్చించారని ప్రశ్నించగా.. ‘‘బిజినెస్‌మన్‌తో బిజినెస్ అంశాలే చర్చించినట్టుగా రాజకీయ నేతతో అవే అంశాలు చర్చించాం. దేశంలో సెన్సేషన్ జరగాల్సి ఉంది. అది జరిగి తీరుతుంది. దీన్ని మున్ముందు మీరే చూస్తారు..’’ అని కేసీఆర్ బదులిచ్చారు. ఇంతకుమించి మాట్లాడేందుకు నిరాకరించారు. పాఠశాల ప్రాంగణంలో రాజకీయ అంశాలు మాట్లాడలేనని, వీటిపై మరోసారి మాట్లాడుతానని చెప్పారు. -
కూడు పెట్టే భాష కావాలి!
వచ్చే నెలలో స్కూళ్లు, పాఠాలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇక నుండి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు! దాంతో తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లిష్ మీడియంపై కొందరు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతీ పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా... సంస్కృతి పరిరక్షణ, భాషా పరిరక్షణ పేరిట ఆకలి తీర్చని భాషల్లో చదువు నెందుకు నేర్చుకోవాలి? ఆత్మగౌరవమీయని భాషా సంస్కృతులు; వివక్ష, అసమానతలకు నిలయమైన పురుషాధిపత్య సంస్కృతిని మనదనే పేరిట తలకెత్తుకోవాలా అని మరికొందరు విమర్శిస్తున్నారు. లోకంలో అనేక భాషలున్నాయి. అవన్నీ కాలగతిలో రూపొం దుతూ, మార్పు చెందుతూ ప్రస్తుత రీతిలో వాడకంలో ఉన్నాయి. ఎవరి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇతర భాషల వారితో మాట్లాడడానికి ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుండి 1970 నుండి లక్షలాది ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు. భాష విషయంలో ఏదో రీతిలో అడ్జస్టయి పోయారు. బట్టల మిల్లుల్లో పని చేయడానికి 150 ఏళ్ల క్రితం వలసపోయిన తెలంగాణ ప్రజలు ముంబయి, షోలాపూర్, భివండి వంటి మహారాష్ట్ర ప్రాంతాల్లో; అహమ్మద్ నగర్ వంటి గుజరాత్ ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కున్నారు. ఆయా ప్రాంత భాషలను మాట్లాడుతూ ఉండటమే కాదు, తమ భాషా రక్షణ కోసం కూడా కృషి చేస్తున్నారు. లోకంలో ఇట్లా అవసరా లను అనుసరించి అడ్జస్టయిపోతున్నారు జనం. ప్రజలు ఇలా బతుకుతుంటే భాషావాదులు బయల్దేరి మాతృభాషలోనే పాఠాలు ఉండాలి అంటుంటే... మరోవైపు ఇంగ్లిష్‌లో చదివితే ఎక్కడికి పోయినా ఉపాధి రంగంలో అవకాశాలు పెరుగుతాయనీ, పరస్పర వ్యక్తీకరణలో సౌలభ్యం పెరుగుతుందనీ అంటున్నారు మరికొందరు. ఈ వాదం వల్లనే కొన్ని రాష్ట్రాలలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం పెరిగింది కూడా! ఒక రాష్ట్రంలో వివిధ భాషలు మాతృ భాషలుగా కలిగిన సమూహాలు అనేకం ఉంటాయి. కానీ మెజారిటీ ప్రజలు మాట్లాడే ఒకటి రెండు భాషల్లోనే పాఠ్య పుస్తకాలు ముద్రించి చదువులు చెబుతున్నారు. ఇలా చేస్తే మరి మిగిలిన సమూహాలు మాతృభాషలో చదువుకుంటున్నట్లే భావించాలా? మాతృ భాషలో ఎందుకు చదువుకోవాలట? అని అడిగితే ‘సంస్కృతీ పరిరక్షణ కోసమ’ని అంటారు. భాష మారితే సంస్కృతీ మారి పోతే ... అదేమి సంస్కృతి? అది విశ్వజనీన సంస్కృతి కానట్టే గదా అంటారు ఇంగ్లిష్ చదువులు కావాలనేవారు. కానీ, లక్షలాది మంది ఇంగ్లిష్‌లో విద్యాభ్యాసం చేసినందువల్లే ఉద్యోగాలు పొందారని గణాంకాలు చెబుతున్నాయి. ఏ భాషనైనా బలవంతంగా రుద్దకూడదు. అవసరాలను బట్టి, భవిష్యత్ అవకాశాలను బట్టి ఎటువంటి భాషనైనా కష్టపడి నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్, సైన్సు, టెక్నాలజీ రంగాలలో అవకా శాలను అందిపుచ్చుకోవడానికీ, విదేశాలకు వెళ్లి మంచి ఉద్యో గాలు పొందడానికీ ఇంగ్లిష్ చదువులే ఉపయోగం అని స్పష్టమ వుతున్నది. ఈ వాస్తవాలను గుర్తించి మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ ఇంగ్లిష్ మీడియం చదువులకు పెద్దపీట వేయడం అభినందనీయం. చివరిగా... మొక్కిన వరమీయని వేల్పును, ఎంత చదివినా ఉపాధి దొరకని చదువును గ్రక్కున విడువంగ వలయు... ఏమంటే నేడు కూడా కోటి విద్యలు కూటి కొరకే! కూడు పెట్టని చదువులెందుకు? ముసుగులో గుద్దులాటలెందుకు? అంటున్న తరానికి పరిష్కారాలు అవసరం! వ్యాసకర్త: బి.ఎస్. రాములు సామాజిక తత్వవేత్త మొబైల్: 83319 66987 -
మార్పు ఎందుకు మహాశయా?
దేనికైనా సమయం, సందర్భం ఉండాలి. అదీ కాకుంటే, అత్యవసరమైనా ఉండాలి. అవేవీ లేకుండా సాధారణ అంశాలలో అవసరం లేని మార్పులు చేసి, వాటిని అసాధారణ చర్చనీయాంశాలుగా మార్చడం ఇటీవల ప్రబలుతున్న పాలకుల, పాలనా సంస్థల వైఖరి. దానికి తాజా ఉదాహరణ – పట్టభద్రులయ్యాక వృత్తి బాధ్యతలు చేపట్టే ముందు వైద్యులు చేసే శపథాన్ని మార్చాలంటూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చేసిన సూచన. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వైద్యవృత్తిలోకి వచ్చేవారందరూ ఆనవాయితీగా చేసే హిప్పోక్రేట్స్ శపథాన్ని మన దేశంలో ఆయుర్వేద వైద్య శిఖామణి చరకుడు పేర్కొన్న మాటలతో మార్చాలన్న హఠాత్ సూచన వివాదాస్పదమైంది. ఇకపై కళాశాలల్లో తెల్లకోటు వేసుకొని వృత్తిలోకి వచ్చే వైద్య విద్యార్థులు సర్వసాధారణ ‘హిప్పోక్రేట్స్ ప్రమాణా’నికి బదులుగా ఎన్ఎంసీ వెబ్‌సైట్‌లోని ‘మహర్షి చరకుడి శపథం’ చేయాల్సి ఉంటుంది. దేశంలోని వైద్య కళాశాలలతో ఈ ఫిబ్రవరి 7 నాటి సమావేశంలో ఎన్ఎంసీ ఈ సంగతి చెప్పడంతో తేనెతుట్టె కదిలినట్టయింది. వైద్య విద్య, విధానాలను నియంత్రించడానికి దేశంలోని ‘భారతీయ వైద్య మండలి’ స్థానంలో రెండేళ్ళ క్రితం 2020లో ఎన్ఎంసీని పెట్టారు. పాలకుల ఆశీస్సులతో పుట్టుకొచ్చిన ఈ కొత్త నియంత్రణ వ్యవస్థ వారి భావధారను ప్రవచిస్తూ, ప్రచారంలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ శపథంలో మార్పు కూడా భాగమని విమర్శలు వస్తున్నాయి. 3 లక్షలకు పైగా సభ్యులున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మార్పును వ్యతిరేకించింది. ఇది వైద్యవిద్యను సైతం కాషాయీకరించే ప్రయత్నమని రాజకీయ వాదులు ఆరోపిస్తున్నారు. నిజానికి, ప్రస్తుతం ప్రపంచమంతటా వైద్యులు చేస్తున్న శపథానికీ ఓ చరిత్ర ఉంది. అది ప్రపంచ వైద్యచరిత్రలో ప్రముఖుడిగా భావించే క్రీస్తుపూర్వం 4 – 5 శతాబ్దాలకు చెందిన గ్రీకు వైద్యశిఖామణి హిప్పోక్రేట్స్ తన వైద్యగ్రంథంలో పేర్కొన్న మాటలని భావన. అయితే, అది ఆయన వ్యక్తిగతంగా రాసినది కాకపోవచ్చనే వాదనా ఉంది. ఎవరిదైనప్పటికీ వైద్యంలో నైతిక విలువలపై ప్రాచీన భావవ్యక్తీకరణ అదేననీ, నేటికీ దానికి ప్రాధాన్యం ఉందనీ పాశ్చాత్య ప్రపంచం భావిస్తుంటుంది. రోగి గోప్యతను కాపాడడం, చెడు చేయకపోవడం లాంటి విలువలను ప్రస్తావించే ప్రమాణం అది. ‘రోగి స్వస్థత కోసమే తప్ప, అతనికి నష్టం కలిగించడానికి వైద్యాన్ని వాడను. అడిగినా సరే ఎవరికీ విషమివ్వను. ఎవరి గడపతొక్కినా, అస్వస్థులకు సాయపడేందుకే ప్రయత్నిస్తాను. ఉద్దేశ పూర్వకంగా ఎవరికీ హాని చేయను. ఏ రోగిని కలిసినా, ఆ వ్యక్తి గోప్యతకు భిన్నంగా వివరాలు బయటపెట్టను’ అని సాగుతుంది ఆ శపథం. నైతికత రీత్యా ఆ భావనలన్నీ ఎవరికైనా, ఎప్పటికైనా అనుసరణీయాలే. ఇంకా చెప్పాలంటే, ప్రతిపాదిత ‘చరక శపథం’లోనూ ఇలాంటి మాటలే ఉన్నాయి. ప్రాచీన భారతీయ వైద్యానికి ప్రాతిపదిక ‘చరక సంహిత’లో ఔషధ చికిత్స చరకుడు చెబితే, క్రీ.శ. 4వ శతాబ్దపు శుశ్రుతుడు శస్త్రచికిత్సా విధానాన్ని వివరించాడు. గ్రీకు విధానాల కన్నా మన ఆయుర్వేద పద్ధతులే మెరుగైనవనీ ఓ వాదన. ఆ తులనాత్మక చర్చలోకి వెళ్ళకుండా, చరక సంహితలో భావాలు చూస్తే – వాటికీ, హిప్పోక్రేట్స్ మాటలకూ సారంలో ఆట్టే తేడా లేదు. మంచి మాటలు పేర్కొన్నది హిప్పోక్రేట్స్ అయితేనేం? చరకుడు అయితేనేం? అది గ్రహించకుండా, అందులో ఏం తప్పుందని ఇప్పుడీ మార్పు చేస్తున్నట్టు? ఏ సంకేతాలివ్వడానికి చేస్తున్నట్టు? ప్రపంచమంతటా అక్షరమక్షరం ఒకేలా వైద్య శపథం లేకున్నా, స్ఫూర్తి మాత్రం రోగి గోప్యత, ఆరోగ్య పరిరక్షణే! అమెరికన్, బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్లకూ హిప్పోక్రేట్స్ మాటలే ప్రాతిపదిక. ప్రపంచ మెడికల్ అసోసియేషన్ సైతం 1949లో అంతర్జాతీయ వైద్య నైతిక సూత్రావళిని చేపట్టింది. కాలగతిలో మార్పులు చేసుకుంటూ, నిరుడు మే నెలలో వైద్య ప్రపంచంతో పాటు మొత్తం సమాజానికి ఆధునిక అంతర్జాతీయ సూత్రావళి ప్రతిపాదననూ ప్రచురించింది. మన దగ్గర వైద్యకళాశాలల్లో చేయించే శపథంలోని మాటల్లో ఎడనెడ మార్పులున్నా ‘వైద్యో నారాయణో హరిః’ అనే భావనలో మార్పు లేదు. సాక్షాత్తూ దైవంగా భావించే ఆ ప్రాణదాతల నైతికతలో మార్పు లేదు. వరుస కరోనా వేవ్‌లలో పోరాడుతున్న వైద్యప్రపంచంలో ఇప్పుడీ కొత్త రచ్చ అవసరమా? వైద్య శపథాన్ని మారిస్తే వచ్చే ప్రత్యేక లాభమేమిటో అర్థం కాదు. ప్రభువుల మనసెరిగి ప్రవర్తించడానికో, మనసు చూరగొనడానికో మార్చాలనుకొంటే అంత కన్నా అవివేకమూ లేదు. అయితే, పాలకవర్గాలు సాగిస్తున్న పచ్చి కాషాయీకరణకు ఇది పరాకాష్ఠ అనేది ఆధార రహిత ఆరోపణ అని సంప్రదాయవాదుల మాట. ‘ఎయిమ్స్’ లాంటిచోట వార్షిక స్నాతకోత్సవంలో అనేక ఏళ్ళుగా చరక శపథమే చేస్తున్నారంటున్నారు. అలాగే అనుకున్నా, ఊరంతా ఒక దారి అయితే, ఉలిపికట్టెది ఒక దారిగా ప్రపంచ పోకడకు భిన్నంగా తీసుకుంటున్న హఠాన్నిర్ణయానికి సహేతుకత ఏమిటో అర్థం కాదు. ఆర్థిక సరళీకరణతో ప్రపంచమంతా కుగ్రామంగా మారిన రోజుల్లో ఈ వైద్య శపథంలో మాత్రం అందరి బాట కాదనే అత్యవసరం ఏమొచ్చింది? ఆ మాటకొస్తే ఏ ప్రమాణం చేశామన్నదాని కన్నా, దాన్ని ఏ మేరకు పాటిస్తున్నాం, అలాంటి వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్లలో ఏ మాత్రం తోడ్పాటునిస్తున్నాం అన్నది కీలకం. పాలకులు చూడాల్సింది ఆ ప్రజా సంక్షేమం. అవి చేస్తామని శపథాలు చేసి గద్దెనెక్కి, తీరా ఆ చేతలు వదిలేసి, ఈ చిన్న మాటలు పట్టు కొంటే ఎలా? ఈ కరోనా కష్టకాలంలో పట్టించుకోవాల్సింది – ఆ శపథాలనే కానీ, ఈ శపథాలను కాదు! -
Telangana: అందరిదీ ఆం‘గళమే’
సాక్షి, హైదరాబాద్: ఆంగ్ల భాష ప్రపంచాన్ని శాసిస్తోందన్న విషయం అందరికీ అవగతమైంది. ఇంగ్లిష్‌పై పట్టు ఉంటేనే పిల్లలు పోటీ పరీక్షలు గట్టెక్కగలుగుతారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేజిక్కించుకోవడంలో ముందుంటారనే వాస్తవాన్ని అన్ని వర్గాలు తెలుసుకున్నాయి. ఈ కారణంగానే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియంలో బోధనను కోరుకుంటున్నారు. వ్యయ ప్రయాసలతో కూడినదైనా కుగ్రామాల ప్రజలు సైతం తమ పిల్లల్ని స్కూలు బస్సులు, వ్యానులు ఎక్కించి మరీ, సమీప పట్టణంలోనో, మండల కేంద్రంలోనో ఉన్న ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ విధంగా గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకు పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించిన ప్రభుత్వం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇంగ్లిష్ వైపే ఎక్కువ మంది తెలంగాణలో 42,575 స్కూళ్లుంటే ప్రభుత్వ పాఠశాలలు 31 వేలు ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లు ఎక్కువైనా విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రైవేటు స్కూళ్లకే వెళ్తున్నారు. దీనికి కారణం అక్కడ ఆంగ్ల బోధన ఉండటమే. ప్రైవేటులో ఫీజు కట్టలేని వారే ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. అయితే ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియంలో చదివే విద్యార్థులే ఎక్కువగా ఉండటం గమనార్హం. ‘సక్సెస్’సాధించిన స్కూళ్లు ఇంగ్లిష్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 2008లో సక్సెస్ స్కూళ్ల పేరుతో 6–10 తరగతులకు ఇంగ్లిష్ మీడియం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో 5 వేలకు పైగా స్కూళ్లలో ఇలా సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ స్కూళ్లలో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. తర్వాత 2016లో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన చేపట్టారు. 1,800 ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఉంటే, 4,500 వరకు ప్రాథమికోన్నత ఆపై తరగతుల్లో ఇంగ్లిష్ బోధన ఉంది. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే ఇంగ్లిష్‌కున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో (గురుకులాలు కలిపి) మొత్తం 26,18,413 మంది విద్యార్థులుంటే, ఇందులో 12,35,909 (47.24 శాతం) మంది తెలుగు మీడియంలో చదువుతుంటే 12,72,776 (48.61 శాతం) ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 800 గురుకుల పాఠశాలల్లో ఉన్న 4,29,540 మంది ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో 84,234 మంది ఉంటే, ఇందులో 19,491 (23.14 శాతం) మంది తెలుగు మీడియం, 56,387 (66.94 శాతం) మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్లలో 32,49,344 మంది విద్యార్థులకు గాను కేవలం 42,416 (1.31 శాతం) మంది తెలుగు మీడియంలో ఉంటే, 31,79,633 (97.85 శాతం) మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే ఉన్నారు. లోతైన అధ్యయనం చేయాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు, విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నా కార్యాచరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా బోధించే సత్తా సర్కారీ స్కూళ్ళకు ఉన్నప్పటికీ ఆచరణ లోపాలే సమస్యగా మారుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఇంగ్లిష్ మీడియం అమలుకు కావాల్సిన వనరులేమిటి? సాధ్యాసాధ్యాలేంటి? అనే విషయాలపై ప్రభుత్వం లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే నడుస్తున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు, గతంలో కొన్ని పాఠశాలలు మూతపడ్డానికి కారణాలు పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయుల సంగతేంటి? రాష్ట్రంలో 1.06 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 10 శాతం మాత్రమే ఇంగ్లిష్ నేపథ్యంలో చదువుకున్న ఉపాధ్యాయులున్నారు. మరో 15 శాతం టీచర్లు ఇంగ్లిష్ బోధించగల సామర్థ్యం ఉన్నవాళ్ళని విద్యాశాఖ సర్వేలో వెల్లడైంది. మొత్తం మీద 25 శాతం ఉపాధ్యాయులు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు సంసిద్ధులుగా ఉన్నారు. 2017లో జరిగిన డీఎస్సీలో 980 మందిని మాత్రమే ఆంగ్ల మాధ్యమం కోసం ప్రత్యేకంగా నియమించారు. కాబట్టి 75 శాతం ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలి గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లంతా క్వాలిఫైడే ఉంటారు. కాకపోతే వాళ్ళలో ఎక్కువ మంది తెలుగు నేపథ్యం నుంచి వచ్చారు. ఇంగ్లిష్ భాషపై పట్టు కోసం శిక్షణ ఇస్తే బోధించే సామర్థ్యం వస్తుంది. కాబట్టి మొదట టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. మరోవైపు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తే 22 వేల మంది ఆంగ్ల భాష నేపథ్యం ఉండేవాళ్ళు వస్తారు. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) పేదోడి జీవితమే మారుతుంది ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం ఊళ్ళను వదిలేసి పట్టణాలకు పోతున్నారు. గ్రామాల్లో ఇంగ్లిష్ బోధన అందుబాటులోకి వస్తే పేదవాడి జీవితంలో ఊహించని మార్పులొస్తాయి. ఇలాంటి ఉన్నతమైన చదువును పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించడం అభినందనీయం. దీనిని చిత్తశుద్ధిగా అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఊహించని మార్పులు ఖాయం. – తుపాకుల వెలగొండ, మాజీ సర్పంచ్, విద్యార్థి తండ్రి, వి.కృష్ణాపురం, ఖమ్మం జిల్లా విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు ప్రపంచంతో పోటీపడాల్సిన పరిస్థితుల్లో ఇంగ్లిష్‌పై పట్టున్న విద్యార్థికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. అందరికీ ఆంగ్ల బోధన చేరువ చేసే దిశగా ప్రభుత్వం అడుగులేయడం అభినందనీయమే. చిన్నప్పటి నుంచే ఆంగ్లంపై అవగాహన పెంచితే ఎంతో ఉపయోగపడుతుంది. అయితే అన్ని తరగతులకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమ బోధన అంటే కొంత కష్టం కావొచ్చు. పెద్ద తరగతుల్లో ఒకేసారి ఇంగ్లిష్ మీడియం అంటే విద్యార్థి గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. – కె. శేషగిరి రావు (ఉపాధ్యాయుడు, హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా) -
పకడ్బందీగా పాఠశాల విద్య
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యను మరింత పరిపుష్టం చేసే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. జాతీయస్థాయిలో రూపకల్పన చేస్తున్న నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఎఫ్)కు స్థానిక అంశాలు, పరిస్థితులను జోడించనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనుంది. పిల్లల్లో పునాది స్థాయి నుంచి విద్యాభ్యసన సామర్థ్యాలు పెంచడం ద్వారా పాఠశాల విద్య, ఆపై ఉన్నత విద్య పరిపుష్టం అవుతుందన్న ఉద్దేశంతో తాజాగా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను స్పృశిస్తూ స్థానికుల అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో మేధావులు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులతో పాటు వివిధ వర్గాలకు చెందిన నాలుగు వేల మంది నుంచి విద్యారంగ పురోగతిపై ఈ అభిప్రాయాలను సేకరించనుంది. ఇందుకోసం ఎన్సీఈఆర్టీ ఆయా రాష్ట్రాల విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయిస్తోంది. అభిప్రాయ సేకరణ, నివేదికల రూపకల్పన వంటివన్నీ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించేలా ఏర్పాట్లుచేసింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌సీఎఫ్‌కు నిర్దేశించిన అంశాలు.. పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్య, వయోజన విద్య అనే నాలుగు విభాగాల పరిపుష్టం దిశగా నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ రూపొందనుంది. ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలను ఎన్సీఈఆర్టీ గుర్తించి అన్ని రాష్ట్లాలకు వీటిని నిర్దేశించింది. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ అంశాల్లో అభిప్రాయాలను స్వీకరించనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎస్సీఈఆర్టీలు, ఎన్సీఈఆర్టీ జిల్లా స్థాయిలో సంప్రదింపులు చేపట్టనున్నాయి. వీటి ఆధారంగా 25 ఫోకస్ గ్రూపుల ద్వారా పొజిషన్ పేపర్లను రూపొందించనుంది. ‘మైగవ్.ఐఎన్’ పోర్టల్‌తో పాటు సర్వే కోసం మొబైల్ యాప్‌ను ఏర్పాటుచేసింది. 12 మందితో స్టీరింగ్ కమిటీ ఇక కొత్త జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే 12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. సిలబస్, పాఠ్యపుస్తకాల రూపకల్పన, బోధనా పద్ధతులను రూపొందించి అన్ని రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేయనుంది. ప్రస్తుతం 2005లో రూపొందించిన నాలుగవ జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ ఇప్పటికీ అమల్లో ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో విశ్వవ్యాప్తంగా విద్యారంగం.. దానికి ఆలంబనమైన రంగాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో, సాంకేతిక పరిజ్ఞానంలో, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఈ మార్పులొచ్చాయి. దీంతో కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌కు కేంద్రం ఏర్పాట్లుచేసింది. రానున్న కాలంలో పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధికి అవకాశమున్నందున ఆ దిశగా పిల్లలను తీర్చిదిద్దేలా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిల్లోనే పిల్లల్లో పఠనం, లేఖనం, గణితం అంశాల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలన్నదే లక్ష్యం. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను స్థానిక అంశాలకు, పరిస్థితులకు అనుగుణంగా రూపొందించడం ద్వారానే ఈ లక్ష్యాలను సాధించేలా చర్యలు చేపట్టింది. దీని ప్రకారమే రాష్ట్రాల కార్యక్రమాలకు కేంద్రం నిధులు అందించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి. ప్రతాప్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్సీఈఆర్టీ గుర్తించిన ముఖ్యాంశాలివే.. 5+3+3+4 విధానంలో పాఠ్య ప్రణాళిక, బోధనా విధానం ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషనల్ లిట్రసీ, అండ్ న్యూమరసీ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సెకండరీ తరగతుల్లో సబ్జెక్టు ఎంపిక చేసుకునే సౌలభ్యం కరికులమ్ కుదింపు, కోర్ ఎసెన్షియల్స్ 3, 5, 8 తరగతుల్లో బెంచ్‌మార్కు లెర్నింగ్ లెవెల్స్ వొకేషనల్ విద్య పునర్వ్యవస్థీకరణ బహుభాషా పరిజ్ఞానం 21వ శతాబ్దపు నైపుణ్యాలు.. ఐసీటీ తదితరాలు జీవ నైపుణ్యాలు, పౌరసత్వం, నైతికత, జాతీయ వారసత్వ సంపద, ప్రజా ఆస్తుల పరిరక్షణ, సేవా దృక్పథం సమ్మిళత విద్య– ఆర్ట్స్, క్రాఫ్ట్, టాయిస్, స్పోర్ట్స్– ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇండియన్ నాలెడ్జి సిస్టమ్ పాఠశాల విద్య, ఉన్నత విద్య మధ్య అనుసంధానం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ రిఫారŠమ్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు స్కూల్ కమ్యూనిటీ రిలేషన్ వనరుల వ్యవస్థల బలోపేతం పాఠ్యపుస్తకాల డిజైన్, డెవలప్మెంట్ -
‘విద్య అందుబాటు’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో మన ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో వెనుకబడి ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమేణా అనేక రాష్ట్రాలను అధిగమిస్తూ అగ్రస్థానం వైపు దూసుకెళ్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యలో తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ గురువారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ఫౌండేషన్ విద్య అందుబాటు అంశంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. చిన్న రాష్ట్రాల కేటగిరీలోని వివిధ అభివృద్ధి సూచికల్లో ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇతర అభివృద్ధి సూచికల విషయంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు మాత్రమే సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ఇతరులకు రోల్ మోడల్‌గా నిలుస్తాయి. కానీ, కొన్ని సమయాల్లో సవాళ్లను పరిష్కరించేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేర్చుకోవాలి. చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవచ్చు’ అని పేర్కొంది. దీంతోపాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ), ప్రాథమిక విద్యను అందుబాటులో ఉంచడం అనే అంశంలో రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించింది. ఈ విషయంలో ఏపీ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్, గుజరాత్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ‘విద్య అందుబాటు’లో రాజస్థాన్ 25.67, గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి. నివేదికలోని ఇతర ముఖ్య అంశాలు ఇలా.. ►ఓవరాల్ కేటగిరీని పరిశీలిస్తే.. చిన్న రాష్ట్రాల్లో కేరళ 67.95 స్కోరుతో, పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 58.95 స్కోరుతో అగ్రస్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో లక్షద్వీప్ 52.69 స్కోరుతో, మిజోరం 51.64 స్కోరుతో ముందంజలో ఉన్నాయి. ►అభ్యసన ఫలితాలు, విద్యా మౌలిక సదుపాయాల అంశాల స్కోరులో కేరళకు ఇతర రాష్ట్రాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని నివేదిక పేర్కొంది. దీనిపై ఆయా రాష్ట్రాలు శ్రద్ధ పెట్టాలని సూచించింది. ►ఫౌండేషన్ లిటరీసీ, న్యూమరసీ ఇండెక్స్‌లో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే జాతీయ సగటు కన్నా ఎక్కువ స్కోరు సాధించాయి. ► జార్ఖండ్ 45.28, ఒడిశా 45.58, మధ్యప్రదేశ్ 38.69, ఉత్తరప్రదేశ్ 38.46, బీహార్ 36.81 స్కోరుతో పేలవమైన పనితీరుతో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఫౌండేషన్ విద్య స్థితిగతుల్ని విశ్లేషించిన నివేదిక ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక.. పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును పొందుపరిచింది. ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదమున్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది. విద్య మౌలిక సదుపాయాలు, విద్య అందుబాటు, కనీస ఆరోగ్యం, అభ్యాస ఫలితాలు అనే ఐదు విభాగాల్లో, 41 అంశాలతో నేషనల్ అఛీవ్‌మెంటు సర్వే (ఎన్ఏఎస్), యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) డేటాతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి రప్పించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 తరగతుల్లో అభ్యసనాల మెరుగుకు తీసుకోవలసిన చర్యలను సూచించింది. -
పల్లెల్లో డిజి‘డల్’!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ విద్య పల్లెల వరకు చేరనట్టు కనిపిస్తోంది. గ్రామీణ విద్యార్థులు ఇంటర్నెట్ వేగాన్ని అందుకోనట్టు తెలుస్తోంది. ఆన్లైన్ చదువుకు కావాల్సిన వస్తువుల కోసం ఖర్చు చేసే స్థోమత పల్లె విద్యార్థులకు లేకపోవడం, ఎలాగో కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్తో చదువుకునేందుకు ఇబ్బంది పడినట్టు అనిపిస్తోంది. తాజా ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఈ సందేహా లను లేవనెత్తాయి. కరోనా లాక్‌డౌన్‌తో.. 2020లో కరోనా లాక్డౌన్ పెట్టడంతో సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులూ మారుమూల గ్రామా లకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఆన్లైన్ బోధన తెరమీదికొచ్చింది. కానీ అప్పటికప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం పల్లె విద్యార్థులకు సాధ్యం కాలేదు. ఆన్లైన్ విద్యకు ఉపకరణాలు సమకూర్చుకోవడంలో వెనుక బడ్డారు. ఎలాగోలా కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్, అంతరాయాలతో ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు కూడా ఆన్‌లైన్‌కు అంతగా ఆసక్తి చూపలేదు. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. సంక్షేమ హాస్టళ్లను మూసేయడంతో పేద విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. అప్పటికీ ఇంటర్ సిలబస్ 30 శాతం తగ్గించినా గ్రామీణ విద్యార్థులు వేగంగా ముందుకెళ్లలేక పోయారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎక్కు వుండే సూర్యాపేట, మహబూబాబాద్, వనపర్తి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఇంటర్ ఉత్తీర్ణత 45 శాతం కన్నా తక్కువే నమోదైంది. అరకొరగా పాసైనా వాళ్ల మార్కుల గ్రేడ్ సగటున 50 శాతం దాటలేదు. దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఆన్లైన్ స్పీడ్‌ను అందుకోలేదని ఫలితాలను బట్టి తెలుస్తోంది. పట్టణాలకే పరిమితమైందా? సాధారణంగా ఇంటర్ విద్యకు ఎక్కువ మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకుం టున్నారు. కరోనా వల్ల ప్రైవేటు కాలేజీల్లో ఆన్లైన్ విద్యాబోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులూ పట్టణాల్లో ఉండటంతో నెట్ సమస్యలు రాలేదు. ఆ సమయంలో వచ్చిన కొత్త యాప్‌లూ పట్టణ విద్యార్థులకు ఉపయోగపడ్డాయి. ఫలితంగా పట్టణాల్లో ఉత్తీర్ణత ఎక్కువగా కన్పిస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లలో 50 నుంచి 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీళ్లలో ఎక్కువ మంది 75 శాతం మార్కులతో ‘ఏ’ గ్రేడ్ సాధించారు. దీన్ని బట్టి ఆన్లైన్ విద్య పట్టణాలకే పరిమితమైందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఎవరిదీ వైఫల్యం? 220 రోజులు జరగాల్సిన ప్రత్యక్ష బోధన 60 రోజులే సాగింది. 60 శాతం వరకూ వచ్చే ఫలి తాలు 49 శాతం దగ్గరే ఆగాయి. దీన్నిబట్టి ఆన్ లైన్ బోధన గ్రామీణ విద్యార్థులను చేరుకోలే దని గుర్తించాలి. ఈ వైఫల్యంపై ఆత్మ పరిశీలన జరగాలి. నష్టపోయేది ఊళ్లల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలేనని తెలుసుకోవాలి. – డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి ,(ఇంటర్ విద్యార్థి జేఏసీ చైర్మన్) పాఠం వినే అవకాశమేది? ప్రభుత్వ హాస్టల్లో సీటొచ్చింది. కానీ కరోనా వల్ల మూసేశారు. మా ఊర్లో టీవీ కనెక్షన్లు లేవు. మొబైల్ సిగ్నల్ సరిగా రాదు. ఊరికి దూరంగా వెళ్తేనే సిగ్నల్ వచ్చేది. దీంతో ఆన్ లైన్ క్లాసులకు కష్టమైంది. ఈ మధ్యే కాలేజీలు తెరిచారు. హాస్టళ్లు ఆలస్యమయ్యాయి. దీంతో ఫస్టియర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాను. – ఎ. శంకర్ (అడవి ముత్తారం,కరీంనగర్ జిల్లా)