Explodes
-
సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సికిందరాబాద్‌లో సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలోనివారంతా ఉలిక్కిపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.ఈ ఘటనకు ముందు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో కూడా సిలిండర్ పేలుడు చోటుచేసుకుంది. వెల్కమ్ హోటల్లోని సర్వీస్ కిచెన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. హోటల్లోని నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇదే తరహాలో యూపీలోని ఘజియాబాద్‌లోని తిలా మోడ్ ప్రాంతంలో గల న్యూ డిఫెన్స్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత -
నైజీరియాలో పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 90 మందికి పైగా మృతి
నైజీరియా దేశంలో పెను విపత్తు చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 90 మందికి పైగా మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. ఉత్తర జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.కాగా కనో నుంచి బయల్దేరిన ఓ పెట్రోల్ ట్యాంకర్ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. హైవేపై ట్యాంకర్ వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది.దీంతో పెట్రోల్ అంతా రోడ్డుపై పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు ఇంధనం కోసం ట్యాంకర్ చుట్టూ గుమిగూడారు. వారు పెట్రోల్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది.ఈ ఘటనలో 94 మంది మృతిచెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరో 50 మంది వరకు గాయపడిన్టలు బుధవారం పోలీసు ప్రతినిధి లావాన్ షిసు ఆడమ్ వెల్లడించారు.. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్‌కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడటంతో మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు.వాస్తవానికి నైజీరియాలో సరుకు రవాణాకు రైల్వే వ్యవస్థ లేవు. రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం.. 2020లో మాత్రమే 1,531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 535 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,142 మంది గాయపడ్డారు. గత ఆదివారం నైజీరియాలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 48 మంది మృతి చెందారు. -
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని పాండువా ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం కొంతమంది చిన్నారులు బంతిగా భావించి ఒక బాంబుతో ఆడుతుండగా, అది హఠాత్తుగా పేలింది. గాయపడిన వారిలో ఒకరు కుడి చేయి కోల్పోయినట్లు సమాచారం. కాగా టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇదే ప్రాంతంలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సివుందిఈ పేలుడులో గాయపడిన ఇద్దరు చిన్నారులను రూపమ్ వల్లభ్, సౌరభ్ చౌదరిగా గుర్తించారు. చిన్నారుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం బాధితులు చుంచుర ఇమాంబర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో తిన్నా ప్రాంతంలోని చెరువు దగ్గర పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో సమీపంలోని వారు చెరువు గట్టు వద్దకు పరుగులు తీయగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన స్థితిలో వారికి కనిపించారు. ఈ ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు మృతి చెందారు.ఈ ఘటనపై హుగ్లీ రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన భద్రతా లోపంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక నేత అభిషేక్ బెనర్జీ సమావేశం జరగాల్సిన స్థలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. -
రసాయన కర్మాగారంలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం!
రాజస్థాన్‌లోని జైపూర్ పరిధిలో గల బస్సీలోని షాలిమార్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గాయపడిన ఇద్దరిని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతులను మనోహర్, హీరాలాల్, కృష్ణలాల్ గుర్జార్, గోకుల్ హరిజన్లుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన వారిని ఇంకా గుర్తించలేదు. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. -
పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు!
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి, ఇద్దరు మహిళలతో పాటు ఒక వృద్ధునికి గాయలయ్యాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు,, పక్కనే ఉన్న గోడ కూలిపోయాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి యాసిన్ తాడ్వి తెలిపారు. శాంతి నగర్‌లోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో బ్యాటరీ పేలిపోయిందని అధికారి తెలిపారు. ఛార్జింగ్ కోసం ఇంట్లోనే బైక్ పెట్టుకున్నారా? లేదా అనేది ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనలో 28 ఏళ్ల మహిళ, పొరుగింట్లో ఉంటున్న 66 ఏళ్ల వృద్ధుడు, 56 ఏళ్ల మహిళ గాయపడ్డారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. బ్యాటరీ పేలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
పరీక్ష చేస్తుండగా.. పేలిపోయిన జపాన్ రాకెట్ ఇంజిన్
టెక్నాలజీ పరంగా జపాన్ ఎంతో అభివృద్ది చెందింది. అంతరిక్ష ప్రయోగాల విషయంలోనూ అగ్రదేశాలకు పోటీనిస్తూ వస్తోంది ఈ దేశం. అంతటి పేరు ప్రఖ్యాతులున్న జపాన్‌కు అంతరిక్ష ప్రయోగాల పరంగా మరోసారి అపజయమే ఎదురైంది. జపాన్‌కు చెందిన అంతరిక్ష సంస్థ అభివృద్ది చేస్తున్న ఒక రాకెట్ ఇంజిన్ పరీక్ష సమయంలో పేలిపోయింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. రెండో దశ ఇంజిన్‌కు సంబంధించిన గ్రౌండ్ టెస్ట్ ప్రారంభమైన ఒక నిమిషం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే.. ఖ్యుషు దీవిలో యుచినోరా స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.50 నిమిషాలకుఎప్సిలాన్-6 రాకెట్ రాకెట్ ఇంజిన్‌ను పరీక్షిస్తుండగా పేలిపోయింది. ఈ పేలుడు గురించి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ఉదయం 9.57 గంటలకు అధికారికంగా ప్రకటించింది. అకిటా ప్రిఫెక్చర్‌లోని నోషిరో టెస్టింగ్ సెంటర్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ప్రకారం, పెరుగుతున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ప్రస్తుత ఎప్సిలాన్ సిరీస్‌కు వారసుడిగా ఎప్సిలాన్ S ను అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది ప్రయోగించినప్పుడు విఫలమైన ఎప్సిలాన్-6 రాకెట్‌ను అభివృద్ధి చేసి ‘ది ఎప్సిలాన్-ఎస్ పేరిట జపాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ పరీక్షల దశలో పేలిపోయింది. పేలుడు అనంతరం ఉత్తర ఆకితా ప్రాంతంలోని ఈ పరీక్షా కేంద్రం పరిసరాల్లో భారీ ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. చదవండి గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా? -
ప్రపంచంలోనే భారీ రాకెట్ ప్రయోగం విఫలం..
సాక్షి, హైదరాబాద్: ఎలన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది. మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ రూపొందించిన అతిపెద్ద రాకెట్ నింగిలోకి ఎగిసిన కాసేపటికే.. పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా, స్పేస్ఎక్స్ స్టార్‌షిప్.. భారీ ఖర్చుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత శక్తివంతంగా నిర్మించిన రాకెట్. దీన్ని.. అంతరిక్షంలోకి వ్యోమగాములు, సరకు రవాణా కోసం రూపొందించారు. 400 అడుగులు పొడువున్న భారీ వ్యోమనౌక దాదాపు 250 టన్నుల బరువును మోయగలదు. 100 మందిని అంతరిక్షయానానికి తీసుకెళ్లగలదు. చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు వీలుగా దీన్ని రూపొందించారు. నాసా చంద్రుడి ప్రయోగాలకు పోటీగా.. మస్క్ దీనిని తెరపైకి తెచ్చాడనే చర్చ జోరుగా నడిచింది కూడా. ఈ రాకెట్ టెక్సాస్‌లోని బోకా చికాలోని ప్రైవేట్ స్పేస్ఎక్స్ స్పేస్‌పోర్ట్ అయిన స్టార్‌బేస్ నుండి ప్రయోగించబడింది. ఈ సందర్బంగా విఫలం కావడంతో పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్బంగా రాకెట్ విఫలం కావడంపై స్పేస్ఎక్స్ స్పందించింది. ట్విట్టర్ వేదికగా.. భారీ రాకెట్ భాగాలు విడిపోయే క్రమంలో పేలిపోయినట్టు తెలిపింది. రాకెట్ విఫలమైనట్టు పేర్కొంది. This is the moment SpaceX's Starship - the biggest and most powerful rocket ever built - launched, and then failed before completing its full test. No people or satellites were aboard. https://t.co/DpnSfSGuZn pic.twitter.com/GEYKokG2B7 — The Associated Press (@AP) April 20, 2023 Congrats @SpaceX team on an exciting test launch of Starship! Learned a lot for next test launch in a few months. pic.twitter.com/gswdFut1dK — Elon Musk (@elonmusk) April 20, 2023 -
వైరల్ వీడియో: అతి చేశారు.. ముఖం కాల్చుకున్న పెళ్లికూతురు
-
Electric Scooter Explodes: త్రుటిలో తప్పించుకున్న కుటుంబం
ఎలక్ట్రిక్ స్కూటర్‌కి చార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషంలోనే పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇంటిలోని అన్ని గృహోపకరణాలన్ని దగ్ధమయ్యాయి. ఐతే ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఈ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలో మండ్యా జిల్లాలో ఓ కుటుంబం చార్జింగ్ కోసం అని ఇంటి లోపలే ఎలక్ట్రిక్ స్కూటర్ని పార్క్ చేశారు. వారు ప్లెగ్‌ఇన్ చేసిన కొద్దిసేపటిలోనే స్కూటర్ పేలింది. దీంతో ఇంటిలోని విలువైన వస్తువులన్ని దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబసభ్యులు ఇంటిలోనే ఉన్నారు. ఐతే అందరూ స్కూటర్ దూరంగా ఉండటం వల్ల వారంతా ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ పేలుడు ధాటికి టీవీ, ఫ్రిజ్, డైనింగ్ టేబుల్, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులన్ని ఆహుతైపోయాయి. స్కూటీకి మంటలు అంటుకున్నప్పడు సమీపంలోనే తమ చిన్నారి కూడా ఉన్నాడని, కానీ మంటలను అదుపు చేయలేకపోయామని ఇంటి యజమాని ముత్తురాజ్ చెప్పుకొచ్చారు. తాను రూట్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆరు నెలల క్రితమే షోరూం నుంచి రూ. 85 వేలకు కొనుగోల చేసినట్లు తెలిపారు. (చదవండి: ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ..దించేసినా దక్కని ప్రాణం) -
కేరళలో ఘోర అగ్ని ప్రమాదం..పలువురికి గాయాలు
కేరళలోని ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపార సంస్థల్లోని సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ అడ్నిమాపక సిబ్బంది, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని సివిల్‌స్టేషన్ సమీపంలోని వ్యాపార సంస్థల్లో శుక్రవారం హఠాత్తుగా సిలండర్ పేలుడంతో జరిగింది. దీంతో సంఘటన స్థలానికి సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. మంటలు మరింత వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న దుకాణంలోని గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. దీంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ ప్లగ్ నుంచి వైర్ ముక్క తలకు తగలడంతో మరోక వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. గాయపడ్డ బాధితులను అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేగాదు మిగతా దుకాణాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలకుండా వాటిని తక్షణమే తరలించారు అధికారులు. ఈ మేరకు సంఘటనాస్థలికి మరిన్ని అగ్నిమాపక యంత్రాలు చేరుకుని త్వరిత గతిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఈ ప్రమాదం బారిని పడ్డారనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు) -
టపా టప్!.. పేలుతున్న స్మార్ట్ ఫోన్లు
దేశంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా పెరుగుతోంది. మరీ యువత ఫోన్లు లేకుండా ఒక వారం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కొన్ని కంపెనీల స్మార్ట ఫోన్లు చార్జింగ్ పెడుతున్న సమయంలోనూ, లేదా జేబులు ఉండగానో పేలుతున్నాయి. ఈ తరహా వరుస ప్రమాదాలు మొబైల్ వినియోగదారులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఇటువంటి ఘటనలు పలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో స్మార్ట్ ఫోన్ పేలడంతో కస్టమర్ల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాములపాడులో బుధవారం ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌ని ఇంట్లో చార్జింగ్కు ఉంచిన సమయంలో పేలిపోయింది. వివరాల ప్రకారం.. షేక్‌ముర్తుజా ఈ ఏడాది జూలై 13న నందికొట్కూరులో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఇంట్లో చార్జింగ్ పెట్టి బయటకు రాగా.. శబ్దంతో పేలిందని ఆయన తెలిపారు. ఫోన్ వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని షేక్‌ముర్తుజా కోరారు. మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌లో మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్ పాయింట్స్. లిడ్ యాసిడ్లతో పోల్చితే.. లిథియం ఆయాన్ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. అలాగే ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని నిపుణులు చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. చదవండి: గుడ్ న్యూస్: ఐఫోన్ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో -
పేలిన ఎలక్ట్రిక్ బైక్
సాక్షి, నెల్లూరు: చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన శుక్రవారం కందుకూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణానికి చెందిన ఆరీఫ్ అనే వ్యక్తి ‘ఎకోతేజా’ అనే కంపెనీకి చెందిన విద్యుత్ బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని కొంతకాలం క్రితం రూ.80 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. శుక్రవారం కనిగిరి రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఓ చోట వద్ద వాహనానికి చార్జింగ్ పెట్టాడు. కొద్దిసేపటికే వాహనం బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. బ్యాటరీ పేలిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
అది ఒక బీర్.. కానీ, ఇప్పుడు అదే ఉక్రెయిన్ ‘ఆయుధం’!
ఉక్రెయిన్ నగరం లీవ్.. పోలాండ్ బార్డర్‌కి 70 కిలోమీటర్ల దూరం. ఆ భూభాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న రష్యా దళాలకు రెండు రోజులుగా ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. సైన్యం తుటాలు, బాంబులతో పాటు గాల్లోంచి పడుతున్న బీర్ సీసాలు.. భారీ శబ్ధాలతో పేలిపోతున్నాయి. దీంతో రష్యా బలగాలు అక్కడే ఆగిపోయాయి. ఇంతకీ ఆ బీర్.. ఎందుకలా పేలిపోతున్నాయో చెప్తున్నారు ప్రావ్డా బ్రూవరీ యజమాని యూరై జాస్టనీ. ఉక్రెయిన్ లోని లివ్ పట్టణానికి చెందిన ప్రావ్డా బ్రూవరీ బీర్ల తయారీకి ప్రసిద్ధి. కానీ, యుద్ధం నేపథ్యంలో బీర్ల తయారీని ఆపేసింది ఈ కంపెనీ. అందుకు బదులుగా రష్యా సైన్యం కోసం ప్రత్యేకంగా ‘మొలటోవ్ కాక్ టెయిల్’ తయారు చేస్తోంది. తాగడానికి కాదు.. లేపేయడానికి!. ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగులు హుషారుగా ఈ బాటిల్ బాంబులను తయారు చేస్తున్నారు. ఈ బీర్ బాటిళ్లలో ఆయిల్, పెట్రోల్ మిక్స్ చేసి వాడేస్తున్నారు. అందులో గుడ్డను ముంచి రష్యా బలగాల వైపునకు విసిరేస్తున్నారు. లోపల ఉండే కాక్ టెయిల్ పెట్రోల్, ఆల్కహాల్ మాదిరే మండే స్వభావంతో ఉంటుంది. సీసా మూతభాగంలో ఉన్న వస్త్రానికి అగ్గి రాజేసి శుత్రు సేనలపై విసిరి కొడితే అవతలి వాళ్ల పని మటాషే!. ఉక్రెనియన్ టెర్రిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్‌ల కోసం శనివారం నుంచి తయారు చేస్తున్నారు. 2014 క్రిమియా సంక్షోభం సమయంలోనూ ప్రత్యర్థుల మీద ఈ తరహా దాడులు జరిగాయట. ఆ సమయంలో కంపెనీలో పని చేసిన ఓ వ్యక్తి.. అప్పటి విషయాన్ని గుర్తు చేయడంతో మళ్లీ బీర్ బాటిల్ బాంబులు తయారవుతున్నాయి. ఈ యుద్ధానికి మద్దతుగా మేము మా వంతుగా ప్రతిదీ చేస్తాం. ఎవరో ఒకరు దీన్ని చేయాలి. 2014లోనూ దీన్ని తయారు చేసి వినియోగించిన దాఖలాలున్నాయి. మా ఉద్యోగి ఒకరికి మెలటోవ్ కాక్ టెయిల్ తయారీ గురించి తెలుసు. అందుకే దీన్ని తయారు చేయడం మొదలు పెట్టాం అని చెప్తున్నారు యూరై. ఇదిలా ఉంటే ఈ కంపెనీ గతంలోనూ ‘పుతిన్ ఖుయ్లో’ అంటూ పుతిన్ అవమానిస్తూ గతంలో బీర్లు తయారు చేసింది. అవి భయంకరంగా అమ్ముడు పోయేవి కూడా. -
వైరల్: మరో ఫోన్ పేలింది..నా ఫ్రెండ్ ఫోన్‌కి ఇలా జరిగిందేంటి సార్ అంటూ ట్వీట్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ రియల్ మీకి చెందిన రియల్ మీ ఎక్స్‌టీ ఫోన్ పేలింది. ట్విట్టర్ యూజర్ తన స్నేహితుడి ఫోన్ పేలిందని ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌పై రియల్ మీ యాజమాన్యం స్పందించింది. My friend's phone Realme XT blast in the evening today....@MadhavSheth1 please do something 🙏 pic.twitter.com/CrCnaOKnIK — Sandip Kundu (@SandipK75709658) December 28, 2021 డిసెంబర్ 28న ట్విట్టర్ యూజర్ సందీప్ కుండు తన స్నేహితుడు వారం రోజుల క్రితం కొన్న రియల్ మీ ఫోన్ పేలిందంటూ ట్వీట్ చేశాడు. రియల్ మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ ట్వీట్ కు ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేయడంతో పేలుడు ఘటనపై రియల్‌మి ఇండియా ట్విట్టర్ అఫీషియల్ సపోర్టు అకౌంట్ బాధితుడికి క్షమాపణలు తెలిపింది. అంతేకాదు బాధిత యూజర్ కాంటాక్ట్ వివరాలను పంపాల్సిందిగా కోరింది. కొన్ని గంటల తర్వాత కంపెనీ స్పందిస్తూ.. పేలిన ఫొన్ భాగాలను తీసుకుని దగ్గరలోని అధికారిక రియల్ మి సర్వీసు సెంటర్ కు తీసుకెళ్లాల్సిందిగా సూచించింది. అయితే ఆ ఫోన్ ఎందుకు పేలింది. ఆ ఫోన్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. చదవండి: చిక్కుల్లో యాపిల్..విచారణకు ఆదేశాలు -
రష్యాలో గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
-
రష్యాలో భారీ పేలుడు, 16 మంది మృతి
మాస్కో: రష్యాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మాస్కోకు ఆగ్నేయంగా 170 మైళ్ల దూరంలో ఉన్న రష్యాలో ఉన్న రియాజాన్ ప్రాంతంలోని ఎలాస్టిక్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గన్‌పౌడర్ ప్లాంట్ కావడంతో పేలుడు కూడా సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 17 మంది ఉండగా అందులో ఉన్న 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు 50 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. స్థానిక మీడియా ప్రకారం.. ప్లాంట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: Russia Orders: ఆ వారం రోజులు ఆఫీసులకు వెళ్లకండి.. అయినా జీతాలిస్తాం! -
ఒక్కసారిగా పేలిన బ్లూటూత్ హెడ్‌ఫోన్.. ఆగిన గుండె
జైపూర్: వైర్లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఒక్కసారిగా పేలి ఆ శబ్ధానికి ఓ బాలుడు గుండె ఆగిపోయింది. ఆ పేలుడుతో బాలుడు మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. గుండెపోటుతో బాలుడు మృతి చెందడం దేశంలోనే మొదటిగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా చౌము మండలం ఉదయ్‌పుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేశ్ శుక్రవారం ఒకరితో బ్లూటూత్ హెడ్‌ఫోన్ వేసుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా బ్లూటూత్ పేలిపోయింది. క్షణకాలంలో జరిగిన ఘటనతో బాలుడి గుండె ఆగిపోయి ((కార్డియాక్ అరెస్ట్) అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు సిద్ధివినాయక ఆస్పత్రికి తరలించారు. బ్లూటూత్ పేలడంతో చెవులకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు డాక్టర్ ఎన్ఎన్ రుండ్లా తెలిపారు. ‘గుండెపోటుతో బాలుడు మృతి చెందడం బహుశా దేశంలో ఇదే మొదటి కేసు అయ్యింటుంది’ అని వైద్యులు రుండ్లా వివరించారు. అయితే ఇలాంటి ఘటనే రెండు నెలల కిందట ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. జూన్ నెలలో 38 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి బ్లూటూత్ పేలి మృతి చెందాడు. బ్లూటూత్ పరికరం పేలుడుతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ పేలిన బ్లూటూత్ పరికరం ఏ కంపెనీదో? ఎందుకు పేలుతుందో అనే వివరాలు తెలియడం లేదు. అకస్మాత్తుగా వీటి పేలుళ్లు జరుగుతుండడంతో ప్రజలు బ్లూటూత్ వినియోగించేందుకు భయపడుతున్నారు. -
హ్యాండ్‌బ్యాగ్‌లో ఒక్కసారిగా పేలిన స్మార్ట్‌ఫోన్..!
బెంగళూరు: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 2 5జీఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో ఉండగా ఒక్కసారిగా పేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే..బెంగళూరుకు చెందిన అంకూర్ శర్మ భార్య ఐదు రోజుల క్రితమే వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ ఫోన్‌ను కొనుగోలు చేసింది. రోజువారి దినచర్యలో భాగంగా అంకూర్ భార్య ఆదివారం రోజున ఉదయం సైక్లింగ్ చేస్తూ వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్‌ను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లింది. కొద్ది దూరం వెళ్లగానే ఒక్కసారిగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ పేలింది. దీంతో ఉలిక్కిపడ్డ అంకూర్ భార్యకు యాక్సిడెంట్ జరిగింది. తరువాత తేరుకున్న అంకూర్ భార్య తన బ్యాగు నుంచి పొగలు రావడంతో షాక్‌కు గురైంది. ఈ విషయాన్ని అంకూర్ ట్విటర్ ద్వారా వన్‌ప్లస్ కస్టమర్ సపోర్ట్‌కు రిపోర్ట్ చేశాడు. పేలుడుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై వన్‌ప్లస్ స్పందించింది. అంకూర్ చేసిన ట్విట్‌కు వన్‌ప్లస్ కస్టమర్ సపోర్ట్ రిప్లై ఇచ్చింది. ఫోన్ పేలిపోయినందుకు చింతిస్తున్నామని వన్‌ప్లస్ కస్టమర్ సపోర్ట్ పేర్కొంది. పేలుడుకు సంబంధించిన విషయాన్ని నేరుకు కంపెనీకి మెసేజ్ చేయాల్సిందిగా సూచించారు. ఫోన్లో ఏర్పడిన లోపంను విశ్లేషించి, తిరిగి కొత్త ఫోన్‌ను అందిస్తామని తెలియజేశారు. కాగా ఫోన్ పేలుడుకు సంబంధించి బాధితుడికి ఏమైనా పరిహారం ఇచ్చారా లేదా..! అనే విషయం తెలియాల్సి ఉంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ పేలడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా ఒకసారి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ పేలింది. అప్పుడు కూడా వన్‌ప్లస్ ఇదే రకంగా స్పందించింది. Hi Ankur. We are gutted to hear about your experience. We are deeply concerned and want to make it up to you. We request you to connect to us over a direct message so that we can make amends and turn this around for you. https://t.co/Y6rHuMwu8J — OnePlus Support (@OnePlus_Support) August 1, 2021 -
ఏరులై పారిన రెడ్‌వైన్..
-
ఏరులై పారిన రెడ్‌వైన్.. మందుబాబులు షాక్
ఈ వార్త చదివిన మందుబాబులు.. తాము ఆ సమయంలో అక్కడ ఎందుకు లేమా అన్న ఫీలింగ్‌తో తెగ బాధపడిపోతారు. ఎందుకంటే డ్యామ్ నుంచి నీళ్లను ఎత్తితే ఎంత వేగంగా పరిగెడుతాయో అచ్చం అలాగే రెడ్‌వైన్ నిల్వ ఉంచిన ట్యాంక్ పగిలిపోవడంతో రెడ్‌వైన్ వరదలా పారింది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. రెడ్‌వైన్ ఏరులై పారుతుంటే అక్కడ ఉన్న ఉద్యోగులు చూస్తూ నిలబడ్డారే తప్ప ఏం చేయలేకపోయారు. వరదలా పారుతున్న రెడ్‌వైన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. (చదవండి : వైరల్: గున్న ఏనుగు చిలిపి స్నానం) ఈ వీడియో చూసి మందుబాబులు గుండెలు బాదుకుంటున్నారు. 'దీనమ్మా జీవితం.. ఒక్క చుక్క వైన్ దొరికినా బాగుండు.. ఆ సమయంలో మేం అక్కడా ఉన్న బాగుండు.. ఒక్క చుక్క రెడ్‌వైన్‌ను వదలకుండా తాగేవాళ్లం.' అంటూ కామెంట్లు పెడుతున్నారు.దాదాపు 49 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రక్తం లాగా కనిపిస్తుండడం చూసి కొందరు భయపడిపోతున్నారు. కాగా 1969 నుంచి ఉన్న ఈ వైనరీలో 1,570 హెక్టార్లకు పైగా ద్రాక్షతోటలు ఉన్నాయి. ఈ వీడియోను రేడియో అల్బాసెట్ తన ట్విటర్లో పంచుకుంది. ఈ వీడియోను ఇప్పటికవరకు 8.4 మిలియన్ల మంది వీక్షించారు. -
చార్జింగ్‌లో ఉన్న మొబైల్ పేలి యువకుడి మృతి
స్మార్ట్‌ఫోన్ చార్జింగ్‌లో ఉండగా పేలిన మొబైల్ ఫోన్ ఒకయువకుడి ప్రాణాలుతీసింది. భవన నిర్మాణ కార్మికుడైన కునా ప్రధాన్ (22) తన ఫోన్‌కు చార్జింగ్ పెట్టి, మరో ముగ్గురు కార్మికులతో పాటు గదిలో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాలోని పారాడిప్‌లో ఆదివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. పారాడిప్ పోలీస్ స్టేషన్ అధికారిక ఆర్కె సమల్ అందించిన సమాచారం ప్రకాచరం చార్జింగ్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ప్రధాన్ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని నాయగర్ జిల్లాలోని రాణ్‌పూరి ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ట్రక్ యజమానుల సంఘం చేపట్టిన పారదీప్‌లో ఆలయ నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. -
ఫోరమ్‌మాల్ ఫ్లైఓవర్‌పై ఆక్సిజన్ సిలీండర్ పేలుడు
-
పేలిన రెడ్మీ నోట్–4 ఫోన్
సదుం: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో సోమవారం ఓ రెడ్మీ నోట్–4 సెల్‌ఫోన్ పేలింది. బాధితుడు సుధీర్ తెలిపిన వివరాల ప్రకారంసుధీర్ షామియానా దుకాణం నిర్వహిసున్నాడు. దుకాణంలో సెల్‌ఫోన్ ఉంచి పనులు చూసుకుంటుండగా హఠాత్తుగా పేలిన శబ్దం వినబడింది. లోపలికి వెళ్లి పరిశీలించగా ఫోన్ పేలిపోయి కనిపించింది. 4 నెలల క్రితమే తిరుపతిలో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లు సుధీర్ తెలిపాడు. -
సరిహద్దుల్లో బాంబు పేలుడు : 20 మంది మృతి
డెమాస్కస్: సిరియా - టర్కీ సరిహద్దుల్లోని బద్ అల్ సలమ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు సిరియా తిరుగుబాటుదారులని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. -
పేలుడు పదార్థాల అక్రమ రవాణ ముఠా అరెస్ట్
పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు యువకులను రాజేంద్రనరగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రహదారి పై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌పై పెలుడు పదార్థాలను తీసుకెళుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 150 జిలెటిన్ స్టిక్స్, 150 డిటోనేటర్స్‌తో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల అక్రమ రవాణ కింద కేసు నమోదు చేసిన పోలీసులు వీటిని ఎక్కడికి తీసుకువెళుతున్నారు..? ఎక్కడి నుంచి తెచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.