festival season
-
గిగ్ వర్కర్లకు ఫుల్ డిమాండ్
ముంబై: ఈ ఏడాది పండుగల సందర్భంగా తాత్కాలిక కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోల్చితే గిగ్ వర్కర్లు (తాత్కాలిక ఉద్యోగులు)/ఫ్రీలాన్సర్ల డిమాండ్ 23 శాతం పెరిగినట్టు ‘అవ్సార్’ గివ్ వర్కర్స్ నివేదిక వెల్లడించింది. రిటైల్ రంగంలో వచ్చిన మార్పులు, కస్టమర్ల వినియోగం, వారి అంచనాలు పెరగడం, ఈ కామర్స్ సంస్థల విస్తరణ ఈ డిమాండ్‌కు మద్దతునిచ్చినట్టు తెలిపింది. పండుగల సందర్భంగా 12 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు ఏర్పడినట్టు వెల్లడించింది. ఉద్యోగ నియామక సేవలు అందించే అవ్సార్ తన ప్లాట్‌ఫామ్‌పై డేటాను విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు విడుదల చేసింది. లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్, కస్టమర్ సపోర్ట్ రంగాలపై అధ్యయనం చేసింది. ద్వితీయ శ్రేణి పట్టణాలైన సూరత్, జైపూర్, లక్నో తాత్కాలిక పనివారికి ప్రధాన కేంద్రాలుగా మారినట్టు తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు మొత్తం మీద ఉపాధి పరంగా ముందున్నట్టు, మొత్తం డిమాండ్‌లో ఈ మూడు మెట్రోల నుంచే 53 శాతం ఉన్నట్టు వెల్లడించింది. సంప్రదాయంగా మెట్రోల్లో కనిపించే తాత్కాలిక కార్మికుల సంస్కృతి, టైర్ 2 పట్టణాలకూ విస్తరిస్తున్నట్టు పేర్కొంది. పెరిగిన వేతనాలు: నైపుణ్య మానవవనరులను ఆకర్షించేందుకు ఈ సీజన్లో కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేసినట్టు తెలిపింది. ఫీల్డ్ టెక్నీషియన్లకు ప్రతి నెలా రూ.35,000, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, డెలివరీ బాధ్యతలకు రూ.18,000–28,000 వరకు చెల్లించినట్టు వివరించింది. అధిక డిమాండ్ ఉండే నైపుణ్య పనుల నిర్వహణకు మానవ వనరుల కొరత, సేలకు డిమాండ్ అధిక వేతనాలకు దారితీసినట్టు తెలిపింది. ప్రధానంగా లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్ రంగాలు తాత్కాలిక ఉద్యోగులకు ఈ ఏడాది పండుగల సీజన్లో ఎక్కువ ఉపాధి కల్పించినట్టు వెల్లడించింది. దేశ ఉపాధి రంగంపై గిగ్ ఎకానమీ దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. పట్టణాల్లో తగ్గిన నిరుద్యోగం సెప్టెంబర్ త్రైమాసికంలో 6.4%పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 6.4 శాతానికి దిగొచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నిరుద్యోగం 6.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.6 శాతంగా ఉండడం గమనార్హం. నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) 24వ పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను విడుదల చేసింది. పట్టణాల్లో 15 ఏళ్లు నిండిన మహిళల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్ చివరికి 8.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 8.6 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది జూన్ చివరికి 9 శాతంగా ఉంది. 15 ఏళ్లు నిండిన పురుషులకు సంబంధించి పట్టణ నిరుద్యోగం సెప్టెంబర్ చివరికి 5.7 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6 శాతం కాగా, ఈ ఏడాది జూన్ చివరికి 5.8 శాతంగా ఉంది. జూలై–సెప్టెంబర్ కాలంలో కారి్మకుల భాగస్వామ్య రేటు 50.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఏడాది సెప్టెంబర్ చివరికి ఇది 50.1 శాతంగా ఉంది. -
8.5 లక్షల జాబ్స్.. కలిసొచ్చిన ఫెస్టివల్ సీజన్
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. ఓ వైపు ఆటోమొబైల్ కంపెనీ తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలు ఉద్యోగులను పెంచుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 'మీషో' (Meesho) కంపెనీ ఏకంగా 8.5 లక్షల ఉద్యుగులను నియమించుకోవడానికి సన్నద్ధమవుతోంది.పండుగ సీజన్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి మీషో సిద్ధమైంది. ఉద్యోగ నియామకాల్లో 60 శాతం కంటే ఎక్కువ టైర్ 3, టైర్ 4 నగరాల్లో ఉండనున్నట్లు సమాచారం.ఈ కామర్స్ దిగ్గజం మీషో డెలివెరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, షాడోఫాక్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్ వంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం కూడా ఉద్యోగ నియమాలకు పెంచడంలో సహాయపడింది. ఉద్యోగులలో పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, రిటర్న్‌లను నిర్వహించడానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు.ఇదీ చదవండి: ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?ఉద్యోగ నియమాలకు కారణంఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. పండుగ సీజన్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే మీషో ఈ చర్యలు తీసుకుంటోంది. -
పండగ సీజన్‌పై ఫోకస్.. లక్ష ఉద్యోగాలకు అవకాశం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌పై మరింతగా కసరత్తు చేస్తోంది. రాబోయే బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 సేల్ కోసం పెద్ద ఎత్తున నియామకాలు జరపనుంది. కొత్తగా 1 లక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌హౌస్ అసోసియేట్లు, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లు, కిరాణా పార్ట్నర్లు, డెలివరీ డ్రైవర్లు మొదలైన సిబ్బందిని తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.పండుగ సీజన్ కోసం కొత్త వర్కర్లకు అవసరమైన శిక్షణనివ్వనున్నట్లు వివరించింది. ఇప్పటికే తొమ్మిది నగరాల్లో 11 కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్‌సీ) ప్రారంభించినట్లు, దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 83కి చేరినట్లు ఫ్లిప్‌కార్ట్ వివరించింది. సామాజిక–ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్న లక్ష్యంతో ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా ఒకవైపు తమ నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంతో పాటు మరోవైపు ఆర్థిక వృద్ధికి దోహదపడాలని, స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వివరించింది. తమ సరఫరా వ్యవస్థ కార్యకలాపాలు నిరాటంకంగా సాగేలా, పెరుగుతున్న డిమాండ్ ప్రకారం నిల్వల నిర్వహణ, ప్రోడక్టుల లభ్యత మొదలైన అంశాలను మెరుగుపర్చుకునేందుకు వినూత్నమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పండుగల సీజన్లో ఈ–కామర్స్ కంపెనీలు కల్పించే ఉద్యోగాలు సాధారణంగా ఆయా సీజన్లకు పరిమితమైనవిగా ఉంటాయి. -
హోలీ 2024: రంగుల్లో మునిగి తేలిన కుర్రకారు (ఫోటోలు)
-
సంక్రాంతి సెలవులతో సొంతూళ్లకు వెళ్తున్న నగరవాసులు
-
8 వేల టన్నుల కందిపప్పు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రైస్ కార్డుదారులందరికీ సబ్సిడీపై కందిపప్పు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జనవరిలో ఎనిమిదివేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 23వ తేదీలోగా మండలస్థాయి నిల్వ కేంద్రాలకు (ఎంఎల్ఎస్ పాయింట్లకు) సరుకు తరలించనుంది. ప్రస్తుత నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4,604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించింది. గిరిజన ప్రాంతాల్లోని జీసీసీల ద్వారా కూడా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు సాగించేలా ప్రోత్సహించనుంది. ఏడాదిగా మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్రలో భారీవర్షాలకు కందిపంట పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కందిపప్పునకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్తపంట వస్తుండటంతో రేటు నెమ్మదిగా దిగొస్తోంది. ఒకప్పుడు మార్కెట్లో కిలో కందిపప్పు రూ.115 ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేటు రూ.160–170కి పెరిగినా సబ్సిడీని తగ్గించలేదు. మధ్యలో మూడు, నాలుగునెలలు మార్కెట్లో లోటు ఉండటంతో పీడీఎస్‌లో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇకపై నిరంతరాయంగా పంపిణీ చేసేలా పౌరసరఫరాలశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. గోధుమపిండికి డిమాండ్ పీడీఎస్ లబ్దిదారులకు వీలైనన్ని ఎక్కువ పౌష్టికాహార పదార్థాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో ఫోరి్టఫైడ్ (విటమిన్లతో కూడిన) గోధుమపిండిని పరిచయం చేసింది. ప్రజల నుంచి స్పందన బాగుండటంతో నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం నెలకు మూడువేల టన్నుల గోధుమపిండి సరఫరా చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కిలో రూ.16కే అందిస్తుండటం గమనార్హం. లబ్ధిదారులకు దీన్ని మరింత తక్కువ రేటుకు ఇచ్చేలా పౌరసరఫరాలశాఖ కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపనుంది. రైస్ కార్డుదారుల ఇష్టం మేరకు కిలో బియ్యానికి బదులు కిలో గోధుమపిండి ఇవ్వనుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బియ్యం పరిమాణాన్ని తగ్గించుకుని దానికి బదులు గోధుమలను సరఫరా చేస్తుంది. వాటిని ప్రాసెసింగ్ చేసి ఫోరి్టఫైడ్ అనంతరం ప్యాకింగ్, రవాణాకు అయ్యే ఖర్చులను లెక్కించి పౌరసరఫరాలశాఖ ధర నిర్ణయించనుంది. ఈ విధంగా కిలో రూ.11–12కే గోధుమపిండి ఇవ్వొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే నెలకు 1,800 టన్నుల గోధుమలను కేంద్రం అందిస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొత్తం కార్డుదారులకు గోధుమపిండిని అందుబాటులో ఉంచేలా కసరత్తు చేస్తోంది. వీటితోపాటు పంచదార, రాయలసీమలో చిరుధాన్యాల పంపిణీకి అవసరమైన నిల్వలను తరలిస్తోంది. నెలాఖరులోగా కందుల సేకరణ పౌరసరఫరాలసంస్థ ద్వారా స్థానిక రైతుల నుంచి మద్దతు ధరకు కందులు సేకరించడంతోపాటు వాటిని ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసి తిరిగి పీడీఎస్‌లోకి ప్రవేశపెట్టేలా పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ నెలాఖరులోగా ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. అవసరమైతే మార్కెట్ రేటును చెల్లించైనా రైతుల నుంచి 35 వేల టన్నులకుపైగా కందులను సేకరించాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగానే రవాణా, కూలీ, గోతాల ఖర్చులను సైతం రైతులకు ఇవ్వనుంది. కందులు సేకరించిన వారంలోగా రైతుల ఖాతాల్లో మద్దతు ధరను జమచేయనుంది. నాణ్యతలో రాజీలేకుండా ఇప్పటివరకు పీడీఎస్‌లో పంపిణీ చేస్తున్న కందిపప్పు బయట ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నదే. తొలిసారిగా ఏపీలో పండిన పంటను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి మర ఆడించి ప్రత్యేక ప్యాకింగ్‌లో రైస్ కార్డుదారులకు ఇవ్వాలని నిర్ణయించాం. తద్వారా అక్కడక్కడ కందిపప్పు నాణ్యతపై వస్తున్న విమర్శలను అధిగమించవచ్చు. ఏపీ అవసరాలకు తగినంత నిల్వలను ఇక్కడే సేకరిస్తాం. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇకపై జాప్యం లేని పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకేలోని క్షేత్రస్థాయి సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలసంస్థ సిబ్బంది సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించి కందులు కొనుగోలు చేస్తా – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాలశాఖ -
భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే?
భారతదేశంలో వైభవంగా జరుపుకునే పండుగల్లో ఒకటైన 'దీపావళి' సందర్భంగా దేశీయ మార్కెట్లో బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. వాహన అమ్మకాలు, బంగారం, నిత్యావసర వస్తువుల సేల్స్ ఒక ఎత్తయితే, టపాసులు విక్రయాలే మరో ఎత్తుగా సాగుతాయి. రాబోయే దీపావళిని దృష్టిలో ఉంచుకుని భారత్ చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించింది. దీని వల్ల చైనాకు వేలకోట్లు నష్టం వాటిల్లుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చైనా వస్తువులను భారతదేశంలోకి దిగుమతి చేసుకోకూడదని తీసుకున్న నిర్ణయంతో చైనా సుమారు రూ. 50,000 కోట్ల వ్యాపార నష్టాన్ని చవిచూడనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చైనా ఉత్పత్తుల బహిష్కరణకు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలునివ్వడంతో దీపావళి సమయంలో చైనా ఉత్పతుల దిగుమతులు భారీగా తగ్గుతాయి. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచడానికి 'సీఏఐటీ' ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి! 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించాడు. దీపావళి పండుగ సమయంలో వినియోగదారులు సుమారు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తూ.. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి చైనా ఉత్పత్తుల దిగుమతి నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, లక్నో, చండీగఢ్, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోల్‌కతా, రాంచీ, గౌహతి, పాట్నా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మదురై, పాండిచ్చేరి మొదలైన ప్రాంతాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, బదులుగా భారతీయ వస్తువులకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా భారీ నష్టం.. ప్రతి సంవత్సరం పండుగ సీజన్లలో భారతీయ వ్యాపారులు చైనా నుంచి రూ.70,000 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటారని సమాచారం. అయితే భారత్ తీసుకున్న నిర్ణయంతో చైనా.. రాఖీ సందర్భంగా సుమారు రూ.5,000 కోట్లు, వినాయక చవితి సమయంలో రూ. 500 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. -
పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం
విజయదశమితో మొదలైన పండుగ సీజన్ జోరుగా ముందుకు సాగుతోంది. ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించుకోవడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి. ఈ పండుగ సీజన్లో టాటా, మారుతి, హ్యుందాయ్ వంటి కార్ డీలర్లు తమ లైనప్‌లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్.. 👉టాటా ఆల్ట్రోజ్ - రూ. 30,000 👉టాటా టియాగో - రూ. 40,000 👉రెనాల్ట్ క్విడ్ - రూ. 50,000 👉హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ - రూ. 55,000 👉మారుతి సుజుకి బాలెనో - రూ. 55,000 👉మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - రూ. 58,000 👉మారుతి సుజుకి ఇగ్నిస్ - రూ. 65,000 👉మారుతి సుజుకి ఆల్టో కే10 - రూ. 70,000 👉మారుతి సుజుకి సెలెరియో - రూ. 73,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి. -
పండుగ సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్!
పండుగ సీజన్లో కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు, మంచి స్మార్ట్ఫోన్లను కొనటానికి కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ ఫోన్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో మోటరోలా కంపెనీకి చెందిన 'ఎడ్జ్ 40 నియో' ఒకటి. ఇది 6.55 ఇంచెస్ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లే, చిక్ వేగన్-లెదర్ బ్యాక్ డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 64 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030, 6nm ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐకూ జెడ్7 ప్రో (iQOO Z7 Pro) ఐకూ జెడ్7 ప్రో మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో స్మార్ట్‌ఫోన్. దీని ధర కూడా రూ. 25000 కంటే తక్కువే. 125జీబీ, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ పొందుతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. 4,600mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ బ్లూ లాగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. లావా అగ్ని 2 (Lava Agni 2) మన జాబితాలో మూడవ మొబైల్ లావా అగ్ని 2. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కలిగి, 8జీబీ ర్యామ్ పొందుతుంది. వైబ్రెంట్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే వీడియోలు చూడటానికి లేదా గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరా అద్భుతంగా ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro) పోకో ఎక్స్5 ప్రో మంచి డిజైన్, క్వాలిటీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్. ఇది 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్స్ పొందుతుంది. -
రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు
దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కారు కొనాలనుకుంటారు. ఈ కథనంలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 డీజిల్ కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా XUV700 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా XUV700 దీపావళి సందర్భంగా కొనుగోలు చేయదగిన ఉత్తమ SUV. దీని ప్రారంభ ధర రూ. 14.47 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ 185 పీఎస్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా హారియర్ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కంపెనీకి చెందిన హారియర్ కూడా మన జాబితాలో రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారునిలోని 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 170 పీఎస్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. హ్యుందాయ్ ఆల్కజార్ రూ.17.73 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ ఆల్కజార్ కూడా ఈ పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఉత్తమ మోడల్. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 Bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఎంజి హెక్టర్ మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ హెక్టర్ రూ. 17.99 లక్షల ధర వద్ద లభిస్తుంది. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! కియా సెల్టోస్ సౌత్ కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్‌కి చెందిన సెల్టోస్ దేశీయ మార్కెట్లో రూ. 13.60 లక్షల ధర వద్ద లభించే ఉత్తమ మోడల్. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 115 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. -
రూపాయికే బస్ టికెట్..అయితే ఈ చాన్స్ ఎంతమందికి దక్కుతుందో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్ బుకింగ్ యాప్ అభిబస్ ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక్క రూపాయికే టికెట్ పొందే అవకాశం ఉంది. అయితే ఎంత మందికి ఈ చాన్స్ దక్కుతుందనేది కంపెనీ ప్రకటించలేదు. అక్టోబర్ 19 నుంచి 25 మధ్య ప్రయాణ తేదీలకు ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ దక్కని వారిలో రోజుకు 100 మంది లక్కీ విన్నర్స్‌కు బస్ టికెట్ వోచర్స్ ఇస్తారు. ఈ ఆఫర్ ప్రైవేట్ బస్‌లు, ఎంపిక చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్ బుకింగ్స్‌కు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. -
13 బిలియన్ డాలర్ల దీపావళి పండుగ..చిన్న సంస్థలకు మరింత లాభసాటిగా
ముంబై: దేశీ చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఈసారి దీపావళి పండుగ మరింత లాభసాటిగా ఉండనుంది. ఈ–కామర్స్ ద్వారా 13 బిలియన్ డాలర్ల మేర వ్యాపారాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని ఎంఎస్ఎంఈలు మరింత ఎక్కువగా ఆర్డర్లు దక్కించుకుంటున్నాయి. టెక్ ఆధారిత లాజిస్టిక్స్ సంస్థ షిప్‌రాకెట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం ఆర్డర్లలో 10–15 శాతం ఆర్డర్లు తొలిసారిగా ఆన్లైన్లో కొనుగోలు చేసే వారి నుంచే ఉండనున్నాయి. పండుగ అమ్మకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) 28 శాతం వాటాతో అగ్రస్థానంలో, 13 శాతం వాటాతో ముంబై, 7 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ షాపింగ్ వినియోగం పెరిగింది. షిప్రాకెట్కి వచ్చే ఆర్డర్లలో 56 శాతం వాటా మెట్రోయేతర నగరాల నుంచే ఉంటోంది. ఎగుమతులు అప్.. పండుగ సీజన్లో ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువగా కృత్రిమ జ్యుయలరీ, సౌందర్య సంరక్షణ, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, పుస్తకాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, హోమ్ ఫర్నిషింగ్స్ మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూఏఈలో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ అదనంగా మూడు గిడ్డంగులను సమకూర్చుకుంది. ఆర్డర్లను సత్వరం ప్రాసెస్ చేసేందుకు సిబ్బంది సంఖ్యను 50 శాతం మేర పెంచుకుంది. -
చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - రూ.10 వేలు కంటే తక్కువే!
ఇప్పటికే పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఓ కొత్త మొబైల్ తక్కువ ధరలో కొనుగోలు చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారికోసం రూ. 10వేలు లోపు లభించే ఉత్తమ స్మార్ట్ఫోన్లను ఈ కథనంలో చూసేద్దాం. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 రూ. 10 కంటే ధరలో లభించే స్మార్ట్‌ఫోన్. ఇది 6.6-అంగుళాల HD+ డిస్ప్లే కలిగి, 13 మెగా ఫిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ మొబైల్ MediaTek Helio A20 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ 12 మన జాబితాలో తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్ఫోన్ల రెడ్మి 12 ఒకటి. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, పెద్ద సెన్సార్, అధునాతన పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. 2022 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ మొబైల్ MediaTek Helio G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదీ చదవండి: డ్రైవర్‌కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా శాంసంగ్ గేలక్సీ ఎమ్13 బ్యాంక్ ఆఫర్లతో పనిలేకుండానే తక్కువ ధరకు మొబైల్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ధృడమైన ప్లాస్టిక్ బాడీ మరియు ట్రిపుల్-కెమెరా సెటప్, ఎక్సినోస్ ప్రాసెసర్ పొందుతుంది. రియల్‌మి Narzo 50i రియల్మీ Narzo 50i మంచి కలర్ ఆప్షన్స్‌లో లభించే బెస్ట్ మొబైల్. ఇది Unisoc T612 ప్రాసెసర్ కలిగి 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమరా సిస్టం కూడా బాగానే ఉంటుంది. ఈ మొబైల్ ధర కూడా రూ. 10,000 కంటే తక్కువ. -
పండుగ సీజన్లో వాటి కొనుగోళ్లకే మొగ్గు.. డెలాయిట్ సర్వే సంచలన రిపోర్ట్!
న్యూఢిల్లీ: ప్రస్తుత పండుగల సీజన్లో వినియోగదారులు అధిక వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు డెలాయిట్ సర్వే వెల్లడించింది. లగ్జరీ, సెలబ్రేటరీ (వేడుకలకు సంబంధించి) వస్తువుల కొనుగోలు పెరగడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. సమీప భవిష్యత్తులో ఊహించని పెద్ద మొత్తంలో ఖర్చులు వచ్చినా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ‘డెలాయిట్ కన్జ్యూమర్ సిగ్నల్ రీసెర్చ్’ సర్వేలో సగం మంది చెప్పారు. ‘‘భారత్‌లో పండుగల సీజన్ సమీపిస్తోంది. దీంతో వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతోంది. 56 శాతం మంది వేడుకలకు సంబంధించిన (పుట్టిన రోజు, వివాహం తదితర) వస్తువులు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు’’అని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. సమీప కాలంలో వస్త్రాలు, వ్యక్తిగత సంరక్షణ, వినోదం, విహారంపై వ్యయాలు పెరగొచ్చని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని సాధిస్తుండడంతో, వినియోగదారులు విలాస వస్తువులు, ఖరీదైన వస్తువుల కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నట్టు డెలాయిట్ ఆసియా పసిఫిక్ పార్ట్నర్ రాజీవ్‌సింగ్ పేర్కొన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రవాణా, ఆతిథ్యానికి కూడా ఇదే ధోరణి విస్తరిస్తున్నట్టు చెప్పారు. టైర్ 2, 3 పట్టణాల్లోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగం పెరగనుందని, దీంతో రిటైల్, ఆటోమోటివ్, రవాణా, ఆతిథ్య రంగాలు ప్రయోజనం పొందుతాయని వివరించారు. భారత వినియోగదారులు కేవలం విలావవంతమైన కొనుగోళ్లకే పరిమితం కావడం లేదని, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. ఇందుకు నిదర్శంగా దేశీయ, అంతర్జాతీయ విమాన బుకింగ్‌లను పేర్కొంది. -
వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'వినాయక చవితి' ప్రారంభం కానుంది. మరి కొన్ని రోజులు దేశం మొత్తం వాడవాడల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా గణేష్ ఉత్సవాల్లో మునిగి తేలుతారు. గత ఏడాది ఈ పండుగ సందర్భంగా రూ. 300 కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది ఎంత బిజినెస్ జరగవచ్చు? ఎలాంటి వస్తువుల వ్యాపారం ఎక్కువగా ఉంటుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిఏఐటి రిపోర్ట్.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అందించిన సమాచారం ప్రకారం.. ప్రతి సంవత్సరం వినాయకుని విగ్రహాల బిజినెస్ రూ. 20 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తుంది. గతంలో చైనా నుంచి విగ్రహాలు దిగుమతయ్యేవి, కానీ క్రమంగా వీటి దిగుమతి భాగా తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో బిజినెస్ ఊపందుకుంది. ప్రస్తుతం మన దేశంలో పర్యావరణాన్ని కలుషితం చేయకూడదనే ఉద్దేశ్యంతో మట్టి, ఆవు పేడతో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి నిమజ్జనం కూడా చాలా సులభంగా ఉంటుంది. విగ్రహాలు తయారు చేసేవారు సంవత్సరం పొడువునా.. లేదా కొన్ని నెలలు అదేపనిలో నిమగ్నమైపోతారు. అయితే వినాయక చవితి ప్రారంభానికి ముందే దేశంలో బిజినెస్ మొదలైపోతుంది. ఇదీ చదవండి: మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు.. హోండా, కేటీఎమ్, కవాసకి ఈ ఏడాది కూడా అప్పుడే పండుగ శోభ మొదలైపోయింది.. హైదరాబాద్ నగరంలో ఏ వీధిలో చూసిన వినాయక విగ్రహాలు ఏర్పాటు వేగంగా జరుగుతోంది. కేవలం విగ్రహాలు మాత్రమే కాకుండా పూజా సామగ్రి, అలంకార వస్తువుల వ్యాపారం కూడా బాగా ఊపందుకుంటాయి. కొంతమంది బంగారం కొనుగోలు చేయడం కూడా సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇలా గణేష్ చతుర్థి సందర్భంగా కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఈ ఏడాది గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ వ్యాపారం జరుగుతుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈ కామర్స్‌లో కొలువుల పండుగ
హైదరాబాద్: నిరుద్యోగులకు కొలువుల పండుగ రానుంది. పండుగల విక్రయాలకు ముందు ఈ కామర్స్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు చోటు చేసుకోనున్నాయి. ఏటా దసరా, దీపావళి సమయాల్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ తగ్గింపులు, ఆఫర్లతో ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. దీంతో ఏడాది పండుగల సీజన్ సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు అందించేందుకు ఈ కామర్స్ సంస్థలు నెట్వర్క్ బలోపేతంపై దృష్టి సారించనున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కామర్స్ రంగంలో తాత్కాలిక ఉద్యోగాలు పెద్ద ఎత్తున రానున్నాయని నియామక సేవలు అందించే టీమ్‌లీజ్ సరీ్వసెస్ సంస్థ తెలిపింది. పరిశ్రమలో నెలకొన్న ధోరణుల ఆధారంగా ఈ అంచనాకు వచి్చంది. కేవలం దక్షిణాదిలోనే 4 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 7,00,000 తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపింది. హైదరాబాద్‌లో 30 శాతం, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 30 శాతం చొప్పున కొలువులు ఏర్పడతాయని తెలిపింది. పండుగల సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర టైర్–1 పట్టణాల్లో నియామకాలు పెద్ద ఎత్తున ఉంటాయని, కోయంబత్తూర్, కోచి, మైసూర్ తదితర ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం నియామకాలు విస్తరించొచ్చని అంచనా వేసింది. వేర్‌హౌస్ కార్యకలాపాల్లో (గోదాములు) 30 శాతం, డెలివరీ విభాగంలో 60 శాతం, కాల్‌సెంటర్ కార్యకలాపాల కోసం 10 శాతం నియామకాలు ఉంటాయని పేర్కొంది. ‘‘గడిచిన త్రైమాసికం నుంచి ప్రముఖ ఈకామర్స్ సంస్థలు పండుగల సీజన్‌కు సంబంధించి ఆశావహ ప్రణాళికలను ప్రకటించాయి. వినియోగదారులు భారీగా ఉండడం, భారత్‌లో తయారీని కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తుండడం, ఎఫ్‌డీఐ, డిజిటైజేషన్ తదితర చర్యలు దేశంలో తాత్కాలిక కారి్మకుల పని వ్యవస్థను అధికంగా ప్రభావితం చేస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సరీ్వసెస్ బిజినెస్ హెడ్ బాలసుబ్రమణియన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తాత్కాలిక కారి్మకులు దేశవ్యాప్తంగా 25 శాతం మేర పెరుగుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దక్షిణాదిలో అయితే ఇది 30 శాతంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష సీజనల్ ఉద్యోగాలు రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో, వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను అనుగుణంగా తాము సరఫరా వ్యవస్థలో లక్ష తాత్కాలిక (సీజనల్) ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ హబ్‌లలో ఈ నియామకాలు చేపట్టనుంది. స్థానిక కిరాణా డెలివరీ భాగస్వాములు, మహిళలు, వికలాంగులను సైతం నియమించుకోనున్నట్టు తెలిపింది. తద్వారా వైవిధ్యమైన సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ‘‘బిగ్ బిలియన్ డేస్ (డిస్కౌంట్ సేల్) నిజంగా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ కామర్స్‌లో ఉండే మంచి గురించి లక్షలాది మంది కస్టమర్లు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ మంది మొదటిసారి కస్టమర్లే ఉంటున్నారు’’అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రి తెలిపారు. బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయాలు చేపడుతుంటుంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఉండే సంక్లిష్టతలు, స్థాయికి అనుగుణంగా తాము సామర్థ్యాన్ని, నిల్వ స్థాయి, సారి్టంగ్, ప్యాకేజింగ్, మానవవనరులను, డెలివరీ భాగస్వాములను పెంచుకోవాల్సి ఉంటుందని బద్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 40 శాతానికి పైగా షిప్మెంట్లను స్థానిక కిరాణా భాగస్వాములతో డెలివరీ చేసే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. -
పండుగ సీజన్ అదిరింది.. రిటైల్ వ్యాపారులకు లక్ష కోట్లకు పైగా విక్రయాలు!
దీపావళి వస్తే వ్యాపారాలకు పండగే. ఎందుకంటే గృహాలంకరణ, దుస్తులు, టపాకాయలంటూ ప్రజలు భారీగా షాపింగ్ చేస్తుంటారు. అందుకే వ్యాపారులు ఈ సమయాన్ని ముఖ్యంగా భావిస్తారు. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా తెరపైకి వచ్చేస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు, స్థానికంగా ఉన్న వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు మొదలైన వారికి విక్రయాలకు పండగ సీజన్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ ఏడాది పండగ సందర్భంగా సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 23 వరకు, దేశంలో ఇప్పటికే 1.25 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) తెలిపింది. అయితే దీపావళి సేల్‌లో మొత్తం వ్యాపారం 1.50 లక్షల కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. శతాబ్దాలుగా భారతదేశంలోని వ్యాపారులు దీపావళి సందర్భంగా వారి వ్యాపార సంస్థలలో దీపావళి పూజను సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు చాలా వ్యాపారాలు డిజిటల్ టెక్నాలజీ ద్వారా జరుగుతున్నాయి. మరోవైపు జీఎస్టీ పోర్టల్ కూడా తోడవడంతో ఇప్పుడు అన్ని వ్యాపారాలు జీఎస్టీ పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపారులు దీపావళి పూజలో.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లను పూజిస్తారు. మరోవైపు బయోమెట్రిక్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ నగదు టెల్లర్లు, డిజిటల్ చెల్లింపులను మొదలైనవాటిని కూడా దీపావళి పూజలో చేర్చారు. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనల జోరు
-
క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ ఆఫర్లు.. భలే ఉందిగా!
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన క్రోమా దీపావళి పండగ సందర్భంగా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 20% వరకూ క్యాష్‌బ్యాక్, రెండేళ్ల కాలపరిమితితో అతి సులభమైన ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. పలు బ్యాంక్ కార్డులపై పదిశాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా క్రోమా స్టోర్లతో పాటు కంపెనీ వెబ్సైట్లో ఈ ఆఫర్లు అక్టోబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే!
పండుగ సీజన్ సందర్భంగా టెలికం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా ‘జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా‘ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం అక్టోబర్ 18 – 28 మధ్యలో కొత్తగా జియో ఫైబర్ కనెక్షన్లు, ప్లాన్లు తీసుకునే వారికి రూ. 6,500 వరకు విలువ చేసే ప్రయోజనాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వీటిలో 100% వేల్యూ బ్యాక్‌తో పాటు, 15 రోజుల అదనపు వేలిడిటీ ఉచితంగా ఉంటాయని తెలిపింది. రూ. 599 ప్లాన్‌తో 6 నెలల రీచార్జి, అలాగే రూ. 899 ప్లాన్‌తో 6 నెలల రీచార్జి పథకాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ రెండింటితో పాటు నెలకు రూ. 899 చొప్పున మూడు నెలల ప్లాన్‌కి 100 శాతం వేల్యూ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది, కానీ 15 రోజుల అదనపు వేలిడిటీ మాత్రం లభించదు. ఏజియో, రిలయన్స్ డిజిటల్, నెట్‌మెట్స్, ఇక్సిగో వోచర్ల రూపంలో వేల్యూ బ్యాక్ ప్రయోజనాలు లభిస్తాయి. సదరు ప్లాన్లను కొనుగోలు చేసే వారు రూ. 6,000 విలువ చేసే 4కే జియోఫైబర్ సెట్ టాప్ బాక్స్ ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే పొందవచ్చని కంపెనీ తెలిపింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
పండగ సీజన్: తగ్గేదేలే అంటున్న కంపెనీలు, పుల్ జోష్‌లో ఆ రంగం!
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. వినియోగ డిమాండ్‌ను అనుకూలంగా మలుచుకునేందకు తమ ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ కామర్స్, ఫ్యాషన్, అప్పారెల్, ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు ఈ పండుగల సీజన్ కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 15–20 శాతం పెంచాయి. దీన్నిబట్టి కంపెనీలు విక్రయాలకు సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దసరా నుంచి పండుగల సీజన్ మొదలు కాగా, ఇప్పటికే ఈ విభాగాల్లో విక్రయాలు అంచనాలను మించాయి. దీంతో కంపెనీలు సైతం తగ్గేదేలా అంటూ ప్రకటనలకు మరింత ఖర్చు చేస్తున్నాయి. ‘‘ఈ కామర్స్, అప్పారెల్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, బ్యూటీ, వెల్నెస్ ఉత్పత్తులు, వినోద, జ్యుయలరీ సంస్థలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను (నిధుల కేటాయింపులు) 15–20 శాతం పెంచాయి. పండుగల డిమాండ్‌కు అనుకూలంగానే ఇది ఉంది. ఈ కేటగిరీల్లో ఇప్పటి వరకు విక్రయాలు లక్ష్యాలను మించి నమోదయ్యాయి’’అని మీడియా టెక్నాలజీ స్టార్టప్ ఆర్డీ అండ్‌ఎక్స్ నెట్వర్క్ చైర్మన్ ఆశిష్ భాసిన్ తెలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో మాత్రం ప్రకటనల పరంగా ఆచితూచి అనుసరించే ధోరణి ఉన్నట్టు చెప్పారు. ఇక ముందూ కొనసాగొచ్చు.. పండుగల సమయాల్లో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తుంటారు. గత రెండు సంవత్సరాల్లో కరోనా ప్రభావం కొనుగోళ్ల డిమాండ్‌పై చూపించింది. కానీ, ఈ ఏడాది వైరస్ ప్రభావం ఏమీ లేదు. సాధారణ ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో వినియోగ డిమాండ్ పట్టణాల్లో బలంగానే ఉంది. దీంతో విక్రయాలు గణనీయంగానే నమోదవుతున్నాయి. దీపావళి వరకు ఈ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. ఆ తర్వాత పండుగల సీజన్ కూడా కలిసొస్తుందని అన్నారు. విస్తృత స్థాయిలో ఉత్పత్తులు, వాటిపై ఆఫర్లను ఈ సీజన్లో అందిస్తున్నట్టు ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. అన్ని మాధ్యమాల్లో తమ ఉత్పత్తులకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సీజన్లో ఎక్కువే.. ‘‘మా జ్యుయలరీ బ్రాండ్లు తనిష్క్, మియా, జోయ, కార్ట్‌లేన్‌కు సంబంధించి ప్రకటనలపై చేసే ఖర్చు గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో పెరిగింది’’అని టాటా గ్రూపు కంపెనీ టైటాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ చావ్లా తెలిపారు. ఎగువ మధ్య తరగతి, ఖరీదైన విభాగాల్లో వినియోగదారుల ఆసక్తి పెరిగినట్టు చెప్పారు. దీంతో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడం ద్వారా, మెరుగైన వృద్ధి అంచనాలను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగ విభాగంలో ఇప్పటి వరకు డిమాండ్ బలంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రకటనలపై అధిక వ్యయాలకు మద్దతునిస్తున్నట్టు చెప్పాయి. ఫ్రెంచ్ అప్పారెల్ బ్రాండ్ సెలియో సీఈవో సత్యేన్ మొమాయ మాట్లాడుతూ.. దసరా సమయంలో పెట్టుబడులపై మంచి రాబడులు రావడంతో ప్రకటనల బడ్జెట్‌ను 25 శాతం పెంచినట్టు ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
హైదరాబాద్: మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. లేట్ చేయకండమ్మా!
లాట్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లు మొబైల్ రిటైల్‌రంగంలో ఏపీ, తెలంగాణల్లో వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను ప్రారంభించింది. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, హోం థియేటర్ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్ట్ కాలింగ్ వాచ్, టవర్ ఫ్యాన్, టీడబ్ల్యూఎస్ ఎయిర్ పాడ్స్, పోర్టబుల్ స్పీకర్, నెక్‌బ్యాండ్ హోం థియేటర్ కాంబో ఆఫర్లు లభిస్తాయన్నారు. స్మార్ట్ టీవీ రూ.8,999, ల్యాప్టాప్స్ రూ.17,499కే లభిస్తాయని తెలిపారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ పండుగలకు సంప్రదాయంతోపాటు ఆధునికత ఉట్టిపడే సరికొత్త వస్త్రాలతోపాటు నగలనూ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచినట్లు ఆర్ఎస్ బ్రదర్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్వదినాలను తెలుగు మహిళలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. షాపింగ్ చేసిన వారికి 2.5 కేజీల బంగారం, 80 కేజీల వెండి, 150 శాంసంగ్ టీవీలు, 600 గ్రైండర్లు, 1,375 ఎలక్ట్రిక్ కుక్కర్లతోపాటు మరెన్నో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. సౌత్ ఇండియా డిస్కౌంట్లు దసరా, దీపావళి పండుగల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్‌ను అందజేస్తోంది. చీరలు, మెన్స్‌వేర్‌పై డిస్కౌంట్‌తోపాటు అతి తక్కువ తరుగుతో బంగారు ఆభరణాలను, తరుగు, మజూరీ లేని వెండి ఆభరణాలను అందుబాటులో ఉంచినట్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ పి.వి.ఎస్.అభినయ్ తెలిపారు. దసరా–దీపావళి లక్కీ బంపర్‌డ్రాలో భాగంగా రూ.ఆరుకోట్ల విలువైన బహుమతులను రెండువేల మంది విజేతలకు అందజేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా ఈనెల 5న, దీపావళి సందర్భంగా ఈనెల 25న బంపర్‌డ్రా ఫలితాలు వెల్లడించినున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్! -
బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు!
బెంగళూరు: పండుగ సీజన్ కావడంతో ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా సంస్థలు పోటీ పడి మరీ వినియోగదారులకు ఊహించని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో తమ మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తొలి రోజున ఏకంగా 87.6 లక్షల ఆర్డర్లు నమోదు చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మీషో స్పందిస్తూ.. ఒకే రోజున ఇంత భారీ స్థాయిలో ఆర్డర్లు రికార్డు చేయడం ఇదే తొలిసారని, గతేడాదితో పోలిస్తే 80 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. మెగా బ్లాస్టర్ సేల్ మూడు రోజులు పూర్తవగా ఇప్పటికీ కస్టమర్లు నిమిషానికి వేలల్లో ఆర్డర్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పండుగ సీజన్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉన్నట్లు ట్వీట్ చేసింది మీషో. కాగా ఈ సంస్థ ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించడంతో పాటు భారీ స్థాయిలో మెగా బ్లాక్‌బస్టర్ సేల్ గురించి ప్రచారం చేసింది. దీంతో అదే స్థాయిలో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. 85 శాతం పైగా ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే వచ్చినట్లు సంస్థ సీఎక్స్‌వో ఉత్కృష్ట కుమార్ తెలిపారు. ఫ్యాషన్, బ్యూటీ సాధనాలు, చీరలు మొదలుకుని వాచీలు, జ్యుయలరీ సెట్ల వరకూ 6.5 కోట్ల పైగా లిస్టింగ్స్‌ను అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. Customers are placing several thousand orders per minute during the #MeeshoMegaBlockbuster sale. ⏱️🚀 So our sellers have their hands full. 🙌#ecommerce For more seller stories: https://t.co/qyroCn4uxG pic.twitter.com/t9jbqYIX3b — Meesho (@Meesho_Official) September 26, 2022 చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
ఫెస్టివల్ సీజన్ కదా.. చిల్ అవ్వండి, ఉద్యోగులకు 11 రోజులు సెలవులిచ్చిన కంపెనీ!
నగర వాసుల డైలీ లైఫ్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ బిజీగా గడిపేస్తుంటారు. వారమంతా తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు విశాంత్రి అనే మాట మరిచి వీకెండ్లో కాస్త చిల్ అవుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఆ కాస్త రిలీఫ్ అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించిన ఓ కంపెనీ తమ ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండాలని భావించింది. అందుకే ఫెస్టివల్ సమయంలో బిజీగా గడిపిన అనంతరం వారి విశ్రాంతి కోసం ప్రత్యేకంగా పనికి బ్రేక్ పేరుతో సెలవులు ఇచ్చింది. వరుస పండుగల్లో బిజీ విక్రయాలతో ప్రజలు తీరిక లేకుండా ఈ ఫెస్టివల్ సీజన్ గడుపుతారు. అందుకే తమ కంపెనీ తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం మీషో వరుసగా రెండవ సంవత్సరం కూడా 11 రోజుల "రీసెట్ అండ్ రీఛార్జ్ విరామం"ని ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. అందులో.. "మేము వరుసగా రెండవ సంవత్సరం కంపెనీ-వ్యాప్తంగా 11-రోజుల విరామాన్ని ప్రకటించాం! రాబోయే పండుగ సీజన్‌తో పాటు వారి వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, మీషో ఉద్యోగులకు రీసెట్ & రీఛార్జ్ అనేది కొంత అవసరం కాబట్టి వారికి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We’ve announced an 11-day company-wide break for a second consecutive year! Keeping the upcoming festive season & the significance of #WorkLifeBalance in mind, Meeshoites will take some much-needed time off to Reset & Recharge from 22 Oct-1 Nov. Mental health is important. — Sanjeev Barnwal (@barnwalSanjeev) September 21, 2022 చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టిన మార్క్ జుకర్‌బర్గ్! -
Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా!
Huge Crowd On Goa Beach Roads న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్న వేళ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో డిసెంబర్ చివరి వారం నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దీంతో క్రిస్టమస్-న్యూ ఇయర్ పండగ సీజన్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం దాటిందని అధికారులు వెల్లడించారు. కాగా ఉత్తర గోవాలోని రోడ్లపై వందలాది మంది పర్యాటకులు నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి ‘కోవిడ్ వేక్కు ఇది రాయల్ వెల్కమ్’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియో వైరల్ అవుతోంది. గడచిన 24 గంటల్లో గోవాలో 388 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటన్ తెల్పుతోంది. కొత్త కేసులు పెరగడంతో కోస్తా రాష్ట్రంలో 1,81,570కి చేరుకోగా, మరణాల సంఖ్య 3,523కు పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, వేలాది దేశీయ పర్యాటకులు ఈ విధంగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి గోవా బీచ్, పబ్‌లకు తరలిరావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వాల్సిందిగా తాజాగా గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: Visakhapatnam: 2 మృతదేహాలు లభ్యం, మిగతావారి కోసం ముమ్మర గాలింపు.. This was Baga Beach in Goa ,last night. Please take the Covid scenario seriously. This is a Royal welcome to the Covid wave 👋 Mostly tourists. pic.twitter.com/mcAdgpqFUO — HermanGomes_journo (@Herman_Gomes) January 2, 2022