first list
-
ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే
-
కేజ్రీవాల్ సంచలనం.. ఢిల్లీ ఎన్నికలకు ఆప్ తొలి జాబితా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా గురువారం విడుదల చేసింది. మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.ఛత్తర్పూర్ నుంచి బ్రహ్మ సింగ్ తన్వార్, కిరాడి నుంచి అనిల్ ఝా, విశ్వాస్ నగర్ నుంచి దీపక్ సింగ్లా, రోహతాన్ నగర్ నుంచి సరితా సింగ్, లక్ష్మీ నగర్ నుంచి బీబీ త్యాగి, బదార్పూర్ నుంచి రామ్ సింగ్, సీలమ్పూర్ నుంచి జుబీర్ చౌధురి, సీమాపురి నుంచి వీర్ సింగ్ ధిగాన్, ఘోండా నుంచి గౌరవ్ శర్మ, కర్వాల్ నగర్ నుంచి మనోజ్ త్యాగి, మాటియాలాలో సోమేశ్ షౌకీన్ పేర్లను కేజ్రీవాల్ ఖరారు చేశారు.ఈ జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల ఆప్‌లో చేరిన ఆరుగురు నేతలు ప్రముఖంగా ఉన్నారు. బీజేపీ మాజీ నేతలు బ్రహ్మ్‌సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగితో పాటు కాంగ్రెస్ మాజీ నాయకులు చౌదరి జుబేర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేష్ షోకీన్‌లను అభ్యర్థులుగా ఆప్ ప్రకటించింది. అయితే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్ నిరాకరించింది. -
ఎన్నికల వేళ హరియాణాలో బీజేపీకి షాక్
చండీగఢ్: హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన జరగనున్న ఎన్నికలు అధికార బీజేపీలో కాక పుట్టిస్తున్నాయి. బుధవారం బీజేపీ ప్రకటించిన 67 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాలో తమ పేర్లు లేవనే ఆగ్రహంతో మంత్రి రంజిత్ సింగ్, ఎమ్మెల్యే లక్ష్మణ్‌దాస్ నాపాతోపాటు పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ తిరుగుబాటు ప్రకటించారు. మాజీ డెప్యూటీ ప్రధానమంత్రి దేవీ లాల్ కుమారుడైన రంజిత్ సింగ్ మంత్రి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మద్దతుదారుల అభిప్రాయం మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానని, ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేస్తానని రంజిత్ సింగ్ గురువారం ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న రంజిత్ సింగ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. -
10 మందితో కాంగ్రెస్ తొలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ:వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తొలి విడత కసరత్తును ఏఐసీసీ అగ్ర నాయకత్వం పూర్తి చేసింది. తెలంగాణలోని సుమారు పది స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. ప్రాంతీయ, కుల సమీకరణలు, రాజకీయ నేపథ్యం, సర్వేల్లో విజయావకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. అభ్యర్థుల ప్రకటన ఏక్షణమైనా వెలు వడవచ్చని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. పెద్దపల్లిలో గడ్డం వంశీ, మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డి, నిజా మాబాద్‌లో టి.జీవన్‌రెడ్డి, మహబూబాబాద్‌లో బల రాంనాయక్, చేవెళ్లలో సునీత మహేందర్‌రెడ్డి, నల్ల గొండలో రఘువీర్‌రెడ్డి, కరీంనగర్లో ప్రవీణ్‌రెడ్డిల పో టీకి ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేక పోవ డంతో వారి అభ్యర్థిత్వాలకు సీఈసీ ఆమోదం తెలిపి నట్లు తెలిసింది. జహీరాబాద్ స్థానానికి సురేశ్ షెట్కా ర్, ఉజ్వల్‌రెడ్డిల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గురువారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఏఐసీసీ కార్యాలయంలో భేటీ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తదిత రులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియో జ కవర్గాల నుంచి పరిశీలనలోకి వచ్చిన అభ్యర్థుల వివరాలు, స్క్రూటినీ అనంతరం మిగిలిన అభ్యర్థుల వివరాలను సీఈసీ ముందుంచారు. రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో సునీల్ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివే దికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. మొదటగా సింగిల్ పేర్లతో కూడిన స్థానాలను కమిటీ పరిశీలించింది. మొత్తంగా 8–10 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరిన్ని స్థానాలపై చర్చ మిగతా స్థానాలపై కూడా చర్చించినా, మరోమారు సమావేశమై సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సికింద్రాబాద్‌లో ఇటీవలే పార్టీలో చేరిన బొంతు రామ్మో హన్ దంపతులు, నాగర్‌కర్నూల్‌లో మల్లురవి, సంపత్ కుమార్, వరంగల్‌లో దారా సాంబయ్య సహా మరో పేరు, మల్కాజిగిరిలో చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు, మెదక్‌లో మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు, ఆదిలాబాద్‌లో ఆదివాసీలైన ఇద్దరి పేర్లపై చర్చి జరిగినట్లు తెలిసింది. ఆయా స్థానాలపై వచ్చే వారంలో తుది నిర్ణయం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. -
రేపు తెలంగాణ బీజేపీ తొలి జాబితా
-
BJP: లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా రెడీ..
సాక్షి,ఢిల్లీ: ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ , గుజరాత్, గోవా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నేతలతో బీజేపీ సీఈసీ భేటీ అయింది. #WATCH | BJP Central Election Committee (CEC) meeting concludes; Union Home Minister Amit Shah and BJP national president JP Nadda leave from the BJP headquarters, in Delhi. pic.twitter.com/xOM8KmrNns — ANI (@ANI) February 29, 2024 తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్‌నగర్- డీకే అరుణ, నాగర్‌కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు -
బీజేపీ తొలి జాబితాకు నేడు గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తర ఫున బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాకు శుక్రవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సీఈసీకి పంపే జాబితాకు సంబంధించి గురువారం ఢిల్లీలో వరు సగా భేటీలు, చర్చలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. పార్టీ బలంగా ఉన్న సీట్లు, అభ్యర్థుల బలాబలా లపై పార్టీ పెద్దలతో రాష్ట్ర నేతలు చర్చించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో.. ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో జరిగిన చర్చల అంశాన్ని పార్టీ పెద్దలకు కిషన్‌రెడ్డి వివరించారు. వరుసగా భేటీలతో.. తొలుత గురువారం మధ్యాహ్నం పార్టీ ఎన్నికల ఇన్ చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నివా సంలో రాష్ట్ర కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ నేతలతోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్స ల్లు పాల్గొన్నారు. ఇందులో ఒకే అభ్యర్థి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాపై చర్చించారు. ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్న సెగ్మెంట్లకు సంబంధించి ఆయా అభ్యర్థుల బలాబలాలను సమీక్షించారు. తర్వాత గురువారం సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మరో సారి కోర్ గ్రూప్ భేటీ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇందులో పాల్గొన్నారు. తొలి జాబితా విడుదలయ్యాక ఎలాంటి అసంతృప్త స్వరాలు వినిపించకుండా ఉండేలా.. ఒక్కో నియో జకవర్గానికి సంబంధించి క్షుణ్నంగా సమీక్షించారు. చర్చించే సమయంలో తెలంగాణ అభ్యర్థుల జాబితాలను మూడు కేటగిరీలుగా.. పార్టీ బలంగా ఉన్న స్థానాలు, గట్టి పోటీ ఇచ్చే స్థానాలు, బలం పుంజుకోవాల్సిన సీట్లుగా జాబితాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రచార ప్రణాళికపైనా చర్చ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని దూకుడుగా కొనసాగించే అంశంపై రాష్ట్ర నాయకు లకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఎక్కడ భారీ ర్యాలీలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే ఖరారైన ప్రణాళికను అమిత్ షా, నడ్డాలకు రాష్ట్ర నేతలు వివరించారు. వీటితోపాటు కేంద్ర పెద్దల పర్యట నలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. -
ఆరని అసంతృప్తి జ్వాలలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లో టికెట్లు రాని అసంతృప్తుల ఆందోళనలు ఆగలేదు. తొలిజాబితా ప్రకంపనలు సోమవారం కూడా కొనసాగాయి. టికెట్లు ప్రకటించిన రోజున ఆదివారం హైదరాబాద్ వేదికగా గాందీభవన్‌కు పరిమితమైన ఆందోళనలు రెండోరోజు గన్‌పార్కు వరకు పాకా యి. గద్వాల టికెట్ ఆశించిన ఉస్మానియా విద్యార్థి నాయకుడు కురువ విజయ్‌కుమార్ నేతృత్వంలో గన్‌పార్కు వద్ద నిరసన తెలిపారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ నినాదాలు చేశారు. ఇక, పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, చార్మినార్ స్థానాలను ముస్లిం నాయకులను కేటాయించాలని కోరుతూ వరుసగా రెండోరోజు స్థానిక నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ మెట్లపై ధర్నా చేశారు. కాగా, పార్టీ నేతలపై ఆర్థిక ఆరోపణలు చేసిన కురవ విజయ్‌కుమార్, గాం«దీభవన్ మెట్లపై ధర్నా చేసిన పాతబస్తీ నేత కలీమ్‌లను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నాగం వాట్ నెక్స్ట్ ఇక, నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి స్థానిక కేడర్‌తో సమావేశమయ్యారు. మరోవైపు మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, బలరాం నాయక్, సురేశ్‌షెట్కార్, సిరిసిల్ల రాజయ్యలు మధుయాష్కీ నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ విడుదల చేసిన తొలి జాబితాతో పాటు ఇంకా ఖరారు కాని టికెట్ల వ్యవహారంపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రే బుజ్జగింపుల కోసం రంగంలోకి దిగారు. సోమవారం గాం«దీభవన్‌లోని వార్‌రూంలో ఆయన చాలా సేపు అసంతృప్తులతో మంతనాలు జరిపారు. ఉప్పల్‌తో పాటు నగరంలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఆయనతో భేటీ అయ్యారు. టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించిన ఠాక్రే ఆయా నేతల రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు నేతల సస్పెన్షన్... ఇక, కురువ విజయ్‌కుమార్, కలీమ్‌లను సస్పెండ్ చేయా లని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. సోమవారం గాం«దీభవన్‌లో సమావేశమైన కమిటీ టికెట్ రాలేదన్న ఆక్రోశంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి గాందీభవన్ లో పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, ఫ్లెక్సీలను చించి వేయడం, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలను సీరియస్‌గా పరిగణించింది. టికెట్ల విషయంలో పీసీసీ అధ్యక్షుడిని మాత్రమే బాధ్యుడిని చేయడం కక్షపూరిత చర్యగా భావించిన కమిటీ కురువ విజయ్ కుమార్ (గద్వాల), కలీమ్‌బాబా (బహదూర్‌పుర)లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ టార్గెట్‌గా ఆందోళనలు.. కాగా, అటు గాందీభవన్‌లో, ఇటు గన్‌పార్క్ వద్ద సోమవారం జరిగిన ఆందోళనల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేంద్రబిందువు అయ్యారు. ఉస్మానియా విద్యార్థి నేత కురువ విజయ్‌కుమార్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు కేటాయించాల్సిన గద్వాల టికెట్‌ను రూ.10 కోట్ల నగదు, 5 ఎకరాల భూమికి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఇప్పటివరకు పార్టీ లో 65 టికెట్లను రూ.600 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. దీంతో పాటు గాం«దీభవన్‌లో పాతబస్తీ నేతల ఆందోళనలోనూ రేవంత్‌ను విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. 90 శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉండే స్థానాలను హిందువులకు కేటాయించడమేంటని, పాతబస్తీలో ఎంఐఎంపై గట్టిగా పోటీ చేయాలన్న ఆసక్తి రేవంత్‌కు లేదంటూ çప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమయింది. ఇక, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మళ్లీ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారన్న వార్తల పట్ల స్థానిక డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పార్టీ లో చేరుతున్నారన్న వార్తలు కూడా స్థానిక నాయకత్వంలో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్లున్న తొలి జాబితా విడుదల తర్వాతే ఇంతటి అసంతృప్తి వ్యక్తమయితే ఇక రెండో జాబితా విడుదలయితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
Telangana: నేడు బీజేపీ తొలి జాబితా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) తుది నిర్ణయం తీసుకోనుంది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న సమా వేశంలో రాష్ట్ర పార్టీ నుంచి అందిన జాబితాపై చర్చించి తొలిజాబితా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. లేనిపక్షంలో మంగళవారం ఈ జాబి తా వెలువడవచ్చుననే చర్చ పార్టీలో సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ స్థాయిలో ముసాయిదా జాబి తా కూడా సిద్థమైన నేపథ్యంలో 40–45 మందితో అధ్యర్థుల తొలిజాబితా... లేదా ఏకాభిప్రాయం ప్రాతిపదికన అంతకంటే ఎక్కువ సీట్లకే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తొలి జాబితాలో ఎవరుంటారో? అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో పాటు సగం మందికి పైగా బీ–ఫారమ్‌లు కూడా అందజేయగా, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా 55 మందితో తొలిజాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడో ప్రధానపార్టీ బీజే పీ అభ్యర్థుల జాబితాపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఢిల్లీలో సీఈసీ సమావేశానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు, రాష్ట్ర స్క్రీనింగ్ కమి టీ చైర్మన్ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి హాజరు కానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా అమ్మవారి భవానీ మాలను ధరించి, పదిరోజుల పాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ ఈ భేటీకి హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టతరాలేదు. -
నేడే కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఏ సమయంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా వస్తుందని ఏఐసీసీ వర్గా లు వెల్లడించాయి. ఆ తర్వాత ఇంకొక్క జాబితాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కూ డా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈనెల 18న ఆ జాబితా కూడా వస్తుందని తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా ఒకట్రెండు రోజులేనని, ఈనెల 20లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. కాగా, అభ్యర్థుల ప్రకటన అంశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం 58 మందితో తొలి జాబితా వస్తుందని వెల్లడించడం గమనార్హం. -
60 సీట్లపై బీజేపీ కసరత్తు కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అభ్యర్థుల ఖరారు కసరత్తు కొలిక్కి వస్తోంది. శుక్రవారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో 60 స్థానాల్లో అభ్యర్థులపై (19 ఎస్సీ, 12 ఎస్టీ సీట్లు మినహాయించి) ఒక అభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సీట్లకు సంబంధించి మరోసారి చర్చించి, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని జాబితాల ను పంపాలని నిర్ణయించినట్టు వివరిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆయా స్థానాల్లో ప్రాధాన్యతలు, ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను కీలక నేతలు అందజేయడంతో.. భేటీలో అన్నింటినీ సరిచూసి, కామన్‌గా ఉన్న పేర్లను ముసాయిదా జాబితా కోసం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘ్‌పరివార్ క్షేత్రంలోని వారితోనూ పార్టీ నేతలు సమావేశమై, ఆయా సీట్లకు పేర్లపై స్పష్టత తీసుకున్నట్టు తెలిసింది. కసరత్తు పూర్తయ్యాక 40–45 మందితో తొలిజాబితాను ఢిల్లీలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీనేతలు చెప్తున్నారు. పలు స్థానాలపై స్పష్టత శుక్రవారం జరిగిన భేటీలో హైదరాబాద్ నగరంలోని రెండు ముఖ్యమైన స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. అంబర్‌పేట నుంచి పోటీకి కిషన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయగా.. ముషీరాబాద్ నుంచి బరిలో ఉండేందుకు కె.లక్ష్మణ్ విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ముందుకొచ్చినట్టు తెలిసింది. ఈ నియోజకవర్గంలో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా.. ఒకరు బీఆర్ఎస్లోకి వెళ్లారు. మిగతా నలుగురు కూడా తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుతున్నారు. దీంతో ఈసారి కార్పొరేటర్లకు టికెట్ అవకాశం కల్పించరాదని నిర్ణయించినట్టు తెలిసింది. అందరూ కలసికట్టుగా పనిచేస్తే పార్టీ విజయానికి మార్గం సుగమం అవుతుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. -
బీజేపీ తొలి జాబితాపై ఢిల్లీలో మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలతో మంతనాలు జరిపారు. త్వరలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమోదం కోసం సమర్పించాల్సిన జాబితాపై పెద్ద ఎత్తున కసరత్తు సాగుతోంది. ఇప్పటికే దాదాపు తొలి జాబితా ఖరారు అయినప్పటికీ, జాబితా విడుదల తర్వాత ఎలాంటి అసంతృప్త స్వరాలు వినిపించకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నారు. సుమారు 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన కిషన్‌రెడ్డి, పార్టీ ఇతర పెద్దలను కూడా కలసి తొలి జాబితాపై వారితో చర్చించారని సమాచారం. అంతేగాక రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రచారాన్ని ఏ విధంగా దూకుడుగా తీసుకెళ్లాలన్న అంశంపై కిషన్‌రెడ్డికి అమిత్ షా దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. కాగా, ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి.. ఎక్కడ భారీ ర్యాలీలు చేపట్టాలనే అంశాలపై ఖరారైన ప్రణాళికను కిషన్‌రెడ్డి, అమిత్ షాకు వివరించారు. వీటితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రుల పర్యటనల గురించి చర్చించారు. ముఖ్యంగా ఎన్నికలవేళ తె లంగాణ కోసం గత తొమ్మిదిన్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, అభివృద్ధి పథకా ల గురించి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్య తిరేక విధానాలు, అవినీతి వంటి అంశాలపై ప్రజ లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టా లని అమిత్ షా సూచించారని తెలిసింది. కాగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కూలంకషంగా చర్చించిన తర్వాతే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల తొలి జాబితాను ఢిల్లీ నుంచి కేంద్ర పార్టీ విడుదల చేస్తుందని తెలిసింది. -
15 లేదా 16వ తేదీన బీజేపీ ఫస్ట్ లిస్ట్
సాక్షి , హైదరాబాద్: ఈ నెల 15 లేదా 16వ తేదీన 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య కావడంతో పాటు పితృపక్షం ఉండటంతో, అవి ముగిశాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్‌ను విడుదల చేయాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శని వారం దిల్‌కుశ అతిథిగృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యనేతల భేటీలో 38 స్థానాలు, అభ్యర్థులపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో 21 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా, త్వరలోనే మిగతా 17 సీట్లు, అభ్యర్థులపైనా కసరత్తు పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర ముఖ్యనేతలు డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనేతల నుంచి ఆయా స్థానాలకు వారు ప్రతిపాదించే పేర్లతో జాబితాలు తీసుకుని, ఇతర జాబితాలతో వాటిని సరిపోల్చి కామన్‌గా ఉన్న పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ముఖ్యనేతల సమాచారం. లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపార్టీకి చెందిన ముఖ్యనేతలతో కూడా ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేయించాలనే ఆలోచనతో జాతీయ, రాష్ట్ర నాయకత్వాలున్నాయని చెపుతున్నారు. అయితే కొందరు నేతలు కేవలం లోక్‌సభకు పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయనకు తెలియజేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీచేసే స్థానాల్లోనూ బీజేపీ నుంచి పేరున్న ముఖ్యనేతలను బరిలోకి దించాలనే ఆలోచనతోనూ నాయకత్వమున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా ఆయా స్ధానాల నుంచి ఎవరెవరిని పోటీకి నిలిపితే మంచిదనే దానిపైనా రాష్ట్రపార్టీ కసరత్తు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పార్టీనేతల పేర్లు ఇప్పుడే బయటపెట్టకుండా కొంతకాలం పాటు వేచి చూసే ధోరణిని అవలంబించాలనే ఆలోచనతో ముఖ్యనేతలున్నట్టు తెలుస్తోంది. -
35 మందితో కాంగ్రెస్ తొలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వేగంగా సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలి విడతలో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏకాభిప్రాయం ఉన్న 30–35 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తొలి జాబితాలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, జి.వినోద్, షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వంశీకృష్ణ తదితరులు పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అక్టోబర్ రెండో వారానికి పూర్తి జాబితా... అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి భేటీ జరిపిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రెండో భేటీ నిర్వహించింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన ఈ భేటీలో 119 నియోజకవర్గాల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన 300 పేర్లపై చర్చించారు. అందులో ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలు 30–35 వరకు ఉండగా.. రెండేసి పేర్లున్న స్థానాలు 20–30, ముగ్గురి చొప్పున ఉన్నవి 30–35, నలుగురు, ఆపైన పోటీపడుతున్న స్థానాలు 10–15 వరకు ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ఒకే అభ్యర్థి ఉన్న జాబితాకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తీసుకుని.. ఈ నెలాఖరులోగా ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. అక్టోబర్ తొలివారంలో రెండో జాబితా, రెండో వారంలో తుది జాబితా ప్రకటించాలని యోచనకు వచ్చినట్టు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఓడిన నేతలకు టికెట్లు ఇవ్వకూడదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఇలాంటి నియోజకవర్గాలు 6 నుంచి 8 వరకు ఉన్నట్టు సమాచారం. సర్వేల ఆధారంగా.. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాము చేసిన సర్వేల నివేదికను అందజేసినట్టు తెలిసింది. ఇద్దరు, ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పోటీపడుతున్న స్థానాల్లో ఎవరెవరికి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయ న్న వివరాలను అందజేసినట్టు సమాచారం. దీనిని పరిగణనలోకి తీసుకున్న కమిటీ నేతలు.. అందులో నియోజకవర్గాల వారీగా 35 శాతానికిపైగా గెలుపు అవకాశాలున్న నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటూ షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ నుంచి చేరికలు ఉంటాయన్న అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అలా చేరే అవకాశమున్న స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను వారం పాటు పెండింగ్‌లో పెట్టాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. టికెట్ దక్కని నేతలకు హామీలు! టికెట్ ఆశించి దక్కని నేతలకు వారి ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలతో పార్టీ, ప్రభుత్వ పదవులపై హామీలు ఇప్పించాలని స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ పదవులతోపాటు పారీ్టలో ప్రాధాన్యం కలి్పంచే విషయాన్ని పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీలతో చెప్పించనున్నారని సమాచారం. కాగా, టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి అక్కడే మకాం వేసి ముఖ్య నేతలను ప్రస న్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 6 చోట్ల ప్రాధాన్యత కోరిన పొంగులేటి! స్క్రీనింగ్ కమిటీ భేటీ ముందు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, భట్టిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తన అభి ప్రాయాలను నేతలకు పొంగు లేటి వివరించి నట్టు తెలిసింది. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక నియోజ కవర్గాల్లో తన వర్గం నేతలకు అవకాశం ఇవ్వా లని ఆయన కోరినట్టు సమాచారం. తనతో పాటు పార్టీలో చేరిన తుడి మేఘారెడ్డికి వన పర్తిలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించి నట్టు తెలిసింది. సర్వేలతో పోల్చి చూసి ఖరారు చేస్తామని ఠాక్రే హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
నెలాఖరుకు బీజేపీ తొలి జాబితా?
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరలో జరగనున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ అగ్రనాయకత్వం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తన కసరత్తును వేగవంతం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందుగా గత నెల మధ్యప్రదేశ్‌లో 39 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన బీజేపీ నాయకత్వం తెలంగాణలో కూడా ఈ నెలాఖరులోగా తొలి జాబితా ప్రకటించాలనే దృఢ నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ముగిసినందున, వాటిని జల్లెడ పట్టి ఏకైక అభ్యర్థులు, గట్టి నేతలు ఉన్న 25–30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముందుగా ఏకైక అభ్యర్థులు ఉన్న స్థానాల గుర్తింపు.. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్, శర్బానంద సోనోవాల్, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్య దర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించడంతో పాటు నేతల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 6 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న దృష్ట్యా, ముందుగా ఏకైక అభ్యర్థులు ఉన్న స్థానాలను గుర్తించి ఈ నెలాఖరులోగా అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారు. అలాంటి స్థానాలు 25–30 వరకు ఉంటాయని గుర్తించినట్లు తెలుస్తోంది. తొలిజాబితాలో కిషన్‌రెడ్డి, బండి, ఈటల తదితరుల పేర్లు! ఇదిలా ఉండగా ముఖ్యనేతలైన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి, వివేక్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆచారి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, బూర నర్సయ్యగౌడ్, చింతల రామచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చెన్నమనేని వికాస్, మహేశ్వర్‌రెడ్డిల పేర్లు తొలి జాబితాలో ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇక మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికను వేగిరం చేసే క్రమంలో భాగంగా ప్రతిస్థానం నుంచి ముగ్గురి పేర్లను ఎంపిక చేసి కమిటీకి పంపిస్తే, సర్వేలు, నేతల బలాబలాలు, కుల సమీకరణల ఆధారంగా అక్టోబర్ రెండో వారానికి మిగతా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని సీఈసీలో నిర్ణయించినట్లు సమాచారం. తర్వాత జరిగే సీఈసీ భేటీ, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతపైనే ఉంటుందని తెలుస్తోంది. కాగా, సీఈసీ భేటీకి ముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇన్చార్జిలు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, ఇతర ముఖ్య నేతలతో బీఎల్ సంతోష్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
నీట్ ర్యాంకు 2.38 లక్షలు..ఎంబీబీఎస్‌లో కన్వినర్ సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రచరిత్రలో మొదటిసారిగా కన్వీనర్ కోటాకింద ఎంబీబీఎస్‌లో అధిక ర్యాంకర్‌కు సీటు లభించింది. నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు లభించింది. ఈ విషయాన్ని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఎంబీబీఎస్ కన్వినర్ కోటా మొదటివిడత జాబితాను వర్సిటీ బుధవారం వెల్లడించింది. ఏ కాలేజీలో ఎవరికి సీట్లు వచ్చాయో... విద్యార్థులకు సమాచారం పంపించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న కన్వినర్ సీట్లలో 4,378 సీట్లు విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. ♦ గతేడాది ఓ ప్రైవేట్ కాలేజీలో చివరి (నాలుగో) విడత కౌన్సెలింగ్‌లో 2.28 లక్షల ర్యాంకర్‌కు బీసీ–ఏ కేటగిరీలో కన్వినర్ సీటు లభించగా, ఈసారి మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే 2.38 లక్షల ర్యాంకు సాధించిన ఎస్సీ కేటగిరీ విద్యార్థికి కన్వినర్ సీటు లభించడం విశేషం. ♦ గతేడాది జనరల్ కేటగిరీలో చివరి విడతలో 1.25 లక్షల ర్యాంకుకు సీటు లభించగా, ఇప్పుడు మొదటి విడతలోనే 1.31 లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. ♦ బీసీ– బీ కేటగిరీలో గతేడాది 1.37 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఈసారి మొదటి విడతలోనే 1.40 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ♦ గతేడాది బీసీ–డీ కేటగిరీలో 1.28 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.35 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ♦ అన్ని కేటగిరీల్లోనూ గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా కన్వినర్ కోటాలోనే సీట్లు వచ్చాయి. కన్వినర్ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్ జరుగుతుంది. మొద టి విడతలో సీటు వచ్చినా, జాతీయస్థాయి కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినవారు ఇక్కడ చేరకుంటే, ఆ సీట్లు తదుపరి విడతల్లో కేటాయిస్తారు. అప్పుడు ఇంకా పెద్ద ర్యాంకర్‌కు సీటు వచ్చే అవకాశముంది. పెరిగిన సీట్లు.. ఎక్కువగా అవకాశాలు రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెరిగింది. కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరిగాయి. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అందులో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిలభారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండటం తెలిసిందే. మరోవైపు ప్రైవేట్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ సీట్లకు కూడా త్వరలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. వాటిల్లో భారీ ర్యాంకర్లకు కూడా సీట్లు వస్తాయి. జాతీయస్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన ప్రైవేటు కాలేజీల్లోనూ బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందంటున్నారు. బీడీఎస్‌కు కౌన్సెలింగ్ నేటినుంచి ప్రభుత్వ, ప్రైవేటు దంత కళాశాలల్లో కన్వినర్ కోటా బీడీఎస్ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ నెల 24 ఉదయం 10 గంటల నుండి 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకుు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలు: తొలి జాబితా వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో హడావిడి మొదలైంది. ఈ సందడిలో ప్రధాన ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో వామపక్షాలు ఒక అడుగే ముందే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో ఉమ్మడిగా బరిలో దిగనున్న సీపీఎం, సీపీఐ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం విశేషం. (వరద సాయం; ఈసీ కీలక ఆదేశాలు) ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ప్రజల సమస్యలేవీ తీరలేదంటూ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దుబ్బాక హడావిడి అయిపోక ముందే దొంగచాటుగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం ఏమి చెయ్యమంటే అదే చేస్తుందని వ్యాఖ్యానించారు. రెండు నెలల ముందే ఎన్నికలను ప్రకటించారన్నారు. అలాగే వరద బాధితుల సహాయం నిజమైన వ్యక్తులకు చేరడంలేదన్నారు. మొన్నటి వరకు వరద బాధితులకు 10వేల రూపాయలు ఇస్తే ప్రస్తుతం అందరికి ఇస్తున్నారని,ఎన్నికలకు ముందు ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ గమనించి ప్రజలందరూ తమ పార్టీ ఓటు వెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీపీఎం అభ్యర్థుల మొదటి జాబితా చర్లపల్లి 3 డివిజన్ - పి . వెంకట్ జంగమేట్ 45వ డివిజన్ - ఎ.కృష్ణ బాగ్ అంబర్పేట్ 54వ డివిజన్ - ఎం. వరలక్ష్మి రాంనగర్ 87వ డివిజన్ -ఎం. దశరథ్ అడ్డగుట్ట 142వ డిజిజన్ - టి . స్వప్న సీపీఐ అభ్యర్థుల మొదటి జాబితా హిమాయత్ నగర్ బి. చాయ దేవి షేక్‌పేట్ షైక్ షంషుద్దీన్ అహ్మద్ తార్నాక - పద్మ లలిత బాగ్ - మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఓల్డ్ మలక్‌పేట్ -ఫిరదౌజ్ ఫాతిమా ఉప్పుగూడ - సయెద్ అలీ మరోవైపు దుబ్బాక ఉపఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో జీహెచ్‌హెంసీలో టీఆర్ఎస్ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది హాట్ టాపిక్‌గా మారింది. జనరల్ కేటగిరీ కింద మహిళకు కేటాయించడంతో మేయర్ అభ్యర్థి విషయంలో కేసీఆర్ వ్యూహం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఈ సాయంత్రం 6 గంటలకు పార్టీ జాబితా విడుదల చేయనుంది. దుబ్బాక స్థానాన్ని కైవసం చేసుకున్న జోష్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ ఉత్సాహాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపే లక్ష్యంగా కసరత్తును ముమ్మరం చేసింది. అటు కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ ఎన్నికల హడావిడి కనపించడం లేదు. పార్టీ స్పందన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాంధీ భవన్లో ఎదురు చూస్తున్నారు. పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న గ్రేటర్ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ వైఖరితో పార్టీ కార్యాలయంలో నేతల జాడకోసం గ్రేటర్ ఆశావహులు ఎదురు తెన్నులు చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
నల్లకుబేరుల జాబితా అందింది!
న్యూఢిల్లీ/బెర్న్: భారతీయ పౌరులు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. తమ బ్యాంకుల్లో భారత పౌరుల ఖాతాల వివరాలతో కూడిన మొట్టమొదటి జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం సోమవారం భారత్‌కు అందజేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో అంగీకారం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. రెండో జాబితాను ఒప్పందం ప్రకారం 2020 సెప్టెంబర్‌లో అందజేస్తామని ఎఫ్‌టీఏ అధికారి తెలిపారు. 2018లో కుదిరిన ఆటోమేటిక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్(ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం ప్రస్తుతం మనుగడలో ఉన్న, 2018లో మూసివేసిన అకౌంట్ల వివరాలు ఇందులో ఉన్నాయి. అయితే, ఎన్ని అకౌంట్లు, ఆ అకౌంట్లలో ఎంతమొత్తం ఆస్తులున్నదీ వెల్లడించేందుకు ఎఫ్‌టీఏ నిరాకరించింది. ఇవి భారతీయ పౌరులుగా గుర్తింపు పొంది, వాణిజ్య, ఇతర అవసరాలకు వాడుతున్న అకౌంట్లు మాత్రమే. ఎఫ్‌టీఏ తెలిపిన వివరాల్లో చాలామటుకు వ్యాపారులతోపాటు, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులవేనని పలువురు అధికారులు అంటున్నారు. ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని తెలిపింది. రిటర్నుల దాఖలు సమయంలో పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోని తమ ఆర్థిక ఖాతాల వివరాలను సరిగ్గా సమర్పిస్తున్నారా లేదా అనేది దీని ద్వారా రూఢి చేసుకోవచ్చని ఎఫ్‌టీఏ తెలిపింది. ఎఫ్‌టీఏ అందజేసిన సమాచారంలోని.. ఖాతాదారుల డిపాజిట్లు, లావాదేవీలు, సంపాదన, పెట్టుబడులు, తదితర వివరాలుంటాయి. వీటి సాయంతో బయటకు వెల్లడించని ఆస్తులున్న వారిపై చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాగా, నల్లధనం వెలికితీతకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు ప్రారంభించడం, స్విట్జర్లాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరడంతో దాదాపు 100 మంది భారతీయ కుబేరులు 2018కి ముందే తమ ఖాతాలను రద్దు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఖాతాదారుల్లో ఎక్కువ మంది వ్యాపారులేనని అంటున్నారు. కేంద్రం ప్రత్యేకంగా ప్రస్తావించిన కొందరి ఖాతాదారుల వివరాలను అందజేసే విషయమై ఆగస్టులో స్విస్ బృందం భారత్‌కు వచ్చి, ఆయా వివరాల గోప్యతకు హామీ పొందింది. ఎఫ్‌టీఏలో భారత్ సభ్యత్వం అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎఫ్‌టీఏ కింద 65 సభ్య దేశాలకు చెందిన 31 లక్షల అకౌంట్ల వివరాలను ఇప్పటి వరకు స్విస్ ప్రభుత్వం అందజేసింది. ఆయా దేశాల నుంచి 24 లక్షల మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించింది. -
జనసేన అభ్యర్థులు వీరే
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. 32 శాసనసభ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్లమెంట్ అభ్యర్థులుగా అమలాపురం స్థానానికి డి.ఎం.ఆర్ శేఖర్, రాజమండ్రికి ఆకుల సత్యనారాయణ, విశాఖకు గేదెల శ్రీనుబాబు, అనకాపల్లికి చింతల పార్థసారథి పోటీ చేయనున్నారు. కాగా, జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేడు రాజమహేంద్రవరంలో జరగనుంది. శాసనసభ అభ్యర్ధులు 1. యలమంచిలి- సుందరపు విజయ్‌కుమార్ 2. పాయకరావుపేట- నక్కా రాజబాబు 3. పాడేరు - పసుపులేటి బాలరాజు 4. రాజాం- డాక్టర్ ముచ్చా శ్రీనివాసరావు 5.శ్రీకాకుళం- కోరాడ సర్వేశ్వరరావు 6. పలాస- కోత పూర్ణచంద్రరావు 7. ఎచ్చెర్ల- బాడన వెంకట జనార్ధన్(జనా) 8. నెల్లిమర్ల- లోకం నాగమాధవి 9. తుని- రాజా అశోక్‌బాబు 10. రాజమండ్రి సిటీ- కందుల దుర్గేష్ 11. రాజోలు- రాపాక వరప్రసాద్ 12. పి.గన్నవరం- పాముల రాజేశ్వరి 13. కాకినాడ సిటీ- ముత్తా శశిధర్ 14. అనపర్తి- రేలంగి నాగేశ్వరరావు 15. ముమ్మిడివరం- పితాని బాలకృష్ణ 16. మండపేట- వేగుళ్ల లీలాకృష్ణ 17. తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్ 18. ఉంగుటూరు- నవుడు వెంకటరమణ 19. ఏలూరు- రెడ్డి అప్పలనాయుడు 20. తెనాలి- నాదెండ్ల మనోహర్ 21. గుంటూరు వెస్ట్ - తోట చంద్రశేఖర్ 22. పత్తిపాడు- రావెల కిషోర్‌బాబు 23. వేమూరు- డాక్టర్ ఎ.భరత్ భూషణ్ 24. నరసరావుపేట- సయ్యద్ జిలానీ 25. కావలి- పసుపులేటి సుధాకర్ 26. నెల్లూరు రూరల్- చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి 27. ఆదోని- మల్లిఖార్జునరావు(మల్లప్ప) 28. ధర్మవరం- మధుసూదన్‌రెడ్డి 29. రాజంపేట- పత్తిపాటి కుసుమకుమారి 30. రైల్వే కోడూరు- డాక్టర్ బోనాసి వెంకటసుబ్బయ్య 31. పుంగనూరు- బోడే రామచంద్ర యాదవ్ 32. మచిలీపట్నం- బండి రామకృష్ణ -
తొలి జాబితా నిరాశ పరిచింది: రేణుకా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితా అందరినీ తీవ్రం గా నిరాశపరిచిందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన యువతను విస్మరించారని, అభ్యర్థుల ఎం పికలో కొన్ని అవకతవకలు జరిగినట్టు అనిపిస్తోందన్నారు. ఈ విషయంపై తన పరిధిలో ఉన్నంత వరకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చామని చెప్పడం సరికాదని, కాంగ్రెస్ తరఫున ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘18న ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తా’ సాక్షి, న్యూఢిల్లీ: స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 18న ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ నుంచి ఆ సీటు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి విజయరామారావు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తే నియోజకవర్గంతో సంబంధం లేని వారికి టికెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఇందిరకు టికెట్ ఇవ్వడం శోచనీయమని, ఆమె ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. -
రెండు రోజుల్లో పూర్తి జాబితా: కుంతియా
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పూర్తి జాబి తాను విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఆర్సి.కుంతియా వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామన్నారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు జరుగుతోందని, రెండు రోజుల్లో జాబితా విడుదల చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ టికెట్లు దక్కని వారు అసంతృప్తికి లోను కావద్దని, టికెట్లు దక్కని నేతలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్కు ఆయుధంలా మారింది: పొన్నాల సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడం టీఆర్ఎస్కు ఆయుధం లా మారిందని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఒక సామాజిక వర్గాన్ని దూరం పెట్టిం దని ప్రచారం చేసుకునే అవకాశం టీఆర్ఎస్కు కలిగిందన్నారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న పొన్నాల.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాను టికెట్ కోరిన తర్వాత కాంగ్రెస్ ఇవ్వకపోవడం ఉండదన్నారు. -
ఉమ్మడి జిల్లాలవారీగా ‘కూటమి మంటలు’ ఇలా!
సాక్షి, హైదరాబాద్:కాంగ్రెస్‌పార్టీ తొలిజాబితాపై అసంతృప్తి, నిరసనలు మొదలయ్యాయి. సోమవారంరాత్రి విడుదల చేసిన 65 స్థానాల జాబితాలో చోటు దక్కని నేతలంతా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. కొందరు అనుచరులతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునే పనిలో పడగా, మరికొందరు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుబావుటా ఎగరవేసేందుకు సిద్ధమవు తున్నారు. తొలిజాబితాలో ప్రకటించిన స్థానాలకుగాను 15–20 చోట్ల కాంగ్రెస్‌కు, కూటమి పార్టీలకు అసమ్మతి సెగ తగిలేట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ టికెట్ కోసం చివరి క్షణం వరకు ఎదురు చూసిన నేతలంతా అధిష్టానం మొండిచేయి చూపడంతో ప్రత్యామ్నాయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు. బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఫార్వర్డ్‌బ్లాక్ లాంటి పార్టీల బీ–ఫారాల మీద పోటీ చేయాలనే ఆలోచనలో ముందుకెళుతున్నారు. అయితే, కొందరు మాత్రం ఏ పార్టీలోకి వెళ్లకుండా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ ప్రకటించిన 9 స్థానాల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం. ఉమ్మడి జిల్లాలవారీగా ‘కూటమి మంటలు’ ఇలా! ♦ కరీంనగర్ జిల్లా వేములవాడ టికెట్‌ను ఆది శ్రీని వాస్కు కేటాయించడంపై ఏనుగు మనోహర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మనోహర్‌రెడ్డి వర్గీయు లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మనోహర్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చొప్పదం డిలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ప్రెస్‌మీట్ పెట్టి మరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కూడా రెబెల్‌గా బరిలో ఉండే అవకాశాలున్నాయి. సిరిసిల్ల స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడంపై ఆ స్థానాన్ని ఆశిస్తు న్న కె.కె.మహేందర్‌రెడ్డి అసహనంతో ఉన్నారు. ♦ వరంగల్ వెస్ట్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. లేదంటే ఇండిపెం డెంట్‌గా బరిలో నిలిచే అవకాశముంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో మాజీమంత్రి విజయరామారావు వర్గం అసంతృప్తితో ఉంది. ఆయన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పాలకుర్తిలో సుధీర్‌రెడ్డి కూడా రెబెల్‌గా పోటీ చేయనున్నారు. ♦ గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతియాదవ్ రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు ఇదే స్థానంలో టీడీపీ టికెట్‌ను భవ్య ఆనంద ప్రసాద్‌కు కేటాయించడంపై సొంత పార్టీ నేతలే ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ టికెట్ ఆశించిన మొవ్వా సత్యనారాయణ అనుచరులు మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు హల్చల్ చేశారు. పార్టీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకుంటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు మొవ్వ సత్యనారాయణ సమయాత్తం అవుతున్నారు. కంటోన్మెంట్లో సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్ రెబల్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడ టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ కార్యదర్శి గణేశ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నానని ప్రకటించారు. ముషీరాబాద్‌లో నగేశ్ ముదిరాజ్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ♦ పాలమూరు జిల్లాలో టీడీపీకి కేటాయించిన మక్తల్, మహబూబ్‌నగర్ స్థానాల్లో కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేయాలనే ఆలోచనలో ఉన్నారు. మక్తల్‌లో శ్రీహరి, మహబూబ్‌నగర్‌లో సురేందర్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశాలున్నాయి. ♦ మంచిర్యాల టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పోటీచేస్తానని అంటున్నారు. ఆయన కచ్చితంగా రెబెల్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ♦ రంగారెడ్డి జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. చేవెళ్లలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, వికారాబాద్‌లో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ కూడా రె‘బెల్స్’ మోగించాలనుకుంటున్నారు. ♦ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట టీడీపీకి కేటాయిం చగా కాంగ్రెస్ అభ్యర్థిగా సున్నం నాగమణి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కొత్తగూడెంలో ఎడవెల్లి కృష్ణ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి. ♦ నల్లగొండ జిల్లా కోదాడ స్థానాన్ని పద్మావతికి కేటాయించగా, కూటమి పక్షాన టికెట్ ఆశించిన బొల్లం మల్లయ్యయాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారమే తన అనుచరులతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేశ్‌రెడ్డి నిర్ణయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రెబల్‌గా ఆయన బరిలో ఉంటారా.. లేదా అధిష్టానం చెప్పినట్టు ఎంపీ బరిలో ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. ♦ నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ, జుక్కల్ స్థానాల్లో రెబెల్ అభ్యర్థులు బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంది: రమేశ్‌రెడ్డి సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీపై తనకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ఉంటుందని నాయకులు, కార్యకర్తలు అనుకున్నారని, కానీ దామోదర్‌రెడ్డి పేరును ప్రకటించారన్నారు. కొంతమంది నాయకుల మిస్గైడ్తోనే పేర్లలో కొన్ని మార్పులు జరిగాయని అనుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంపై అధిష్టానం వద్దకు వెళితే నిజమైన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేస్తామని రాహుల్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. కన్నీరు పెట్టిన పటేల్, కుటుంబీకులు.. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి సూర్యాపేటకు చేరుకున్న పటేల్ రమేశ్‌రెడ్డికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. ర్యాలీగా బయలుదేరి ఇంటికి చేరుకున్న పటేల్‌ను చూసి సతీమణి లావణ్య, తల్లిదండ్రులు, సోదరులు కన్నీరుమున్నీరయ్యారు. వీరిని చూసిన అభిమానులు, అనుచరులు కంటనీరు పెట్టుకున్నారు. అందరూ చూస్తుండగా.. పటేల్ వీరాభిమాని పట్టణానికి చెందిన శరత్ పటేల్ రమేశ్‌రెడ్డి నివాసం వద్ద ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు. గమనించిన నాయకులు, కార్యకర్తలు వెంటనే శరత్‌ను అడ్డుకున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన అభిమాని మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నేత బొలగం రాజు పెట్రోలు బాటిల్‌తో జనగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. పొన్నాలకు టికెట్ ఇవ్వాలి.. సీనియర్ నాయకుడికి మోసం చేస్తారా అంటూ పెట్రోలు పోసుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడున్నవారు అడ్డుకున్నారు. పొన్నాలకు టికెట్ వస్తుందని వారు భరోసా ఇచ్చారు. -
యూపీలో బీజేపీ తొలి జాబితా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు బీజేపీ 149 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి లక్ష్మికాంత్ వాజ్‌పేయి, మరో మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మనవడు, పార్టీ జాతీయకార్యదర్శి శ్రీకాంత్ శర్మ తదితరులకు జాబితాలో చోటు దక్కింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జేపీ నడ్డా ఈ జాబితాను సోమవారం విడుదల చేశారు. మొత్తం 403 శాసనసభ స్థానాలుండగా వీటిలో అధిక శాతం సీట్లకు పోలింగ్ తొలి రెండుదశల్లోనే ఉండనుంది. 2002లో యూపీలో అధికారానికి దూరమైన బీజేపీ.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చకోవడం సహా గెలవడానికి అనేక మార్గాలను అనుసరిస్తోంది -
పంజాబ్ బరిలో తొలి ఆప్ వీరులు వీరే
హర్యానా: వచ్చే ఏడాది పంజాబ్ లో జరగనున్న ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే శంకం పూరించింది. ఆ పార్టీ తరుపున బరిలోకి దిగే తొలి అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. మొత్తం 19మందితో ఆప్ జాబితాను ప్రకటించింది. వీరిలో ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఓ సిక్కుల హక్కుల పోరాటయోధుడు, ఓ అర్జున అవార్డు గ్రహీత, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న వైద్యుడు, ఓ బీఎస్పీ మాజీ పార్లమెంటు సభ్యుడు, ఉద్యోగ విరమణ పొందిన సైనికుడు(బ్రిగేడియర్) ఈ పందొమ్మిది మందిలో ఉన్నారు. మొత్తానికి ఆప్ ఏదో ఒక రకంగా సామాజిక సేవల ఉన్నవారికే సీట్లు కేటాయిస్తూ తొలి జాబితాను వెలువరించింది. వీరిలో ప్రముఖ సిక్కుల హక్కుల పోరాట యోధుడు, 2014 ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయిన హెచ్ ఎస్ పుల్కా కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. -
స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదల