flames
-
ల్యాండవుతున్న విమానంలో మంటలు
కాలిఫోర్నియా: ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్‌కు వచ్చిన ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో దట్టమైన పొగ వ్యాపించింది.విమానం లాస్‌వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. A #FrontierAirlines jet caught fire while landing in #LasVegas. Onlookers captured the dramatic moment as #FrontierFlight1326, arriving from #SanDiego, made a hard emergency landing at #LasVegasInternationalAirport.#planefire #EmergencyLanding pic.twitter.com/7G2nJJ6GmD— know the Unknown (@imurpartha) October 6, 2024విమానంలో మంటలు రావడంతో వెంటనే స్పందించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.మంటలు ఎగిసిపడ్డ సమయంలో విమానంలో మొత్తం 190 మంది ప్రయాణికులు,ఏడుగురు సిబ్బంది ఉన్నారు.వారందరినీ సురక్షితంగా విమానం నుంచి బయటికి తీసుకువచ్చారు.ఇదీ చదవండి: యుద్ధం వస్తే.. ఏ దేశం పవర్ ఎంత..? -
నా ఆటోను కాల్చేశారు: గడ్కరీ
శంభాజీనగర్:కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత రాజకీయాలన్నీ పవర్ పాలిటిక్సేనని తేల్చేశారు.రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం(సెప్టెంబర్27) జరిగిన రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన సమయంలో ఎన్నో సమస్యలొచ్చాయన్నారు. పార్టీ కార్యకర్తగా 20 ఏళ్లు విదర్భలో పనిచేసినట్లు చెప్పారు. ఆ రోజుల్లో తాము నిర్వహించే ర్యాలీలపై ప్రజలు రాళ్లు వేసేవారని గడ్కరీ గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాతి రోజుల్లో తాను ప్రసంగాలు చేయడానికి వాడే ఆటోను కొందరు తగలబెట్టారని చెప్పారు. ఇప్పుడు తనకు వచ్చిన గుర్తింపు తనది కాదని, హరిభౌకిసన్రావ్ బగాడే లాంటి వాళ్ల కారణంగా వచ్చిందేనన్నారు. కాగా, తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని ఇటీవలే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. -
Gates of Hell: నరకద్వారం...!
మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్లోని కారకూమ్ ఎడారి మధ్యలో ఉన్న అగ్ని జ్వాలల గొయ్యి ఇది. ‘దర్వాజా’గా పిలిచే ఈ ప్రాంతం వద్ద 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టారు. ఫలితం లేక వదిలేశారు. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. మీథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో ఇలా నిరంతరాయంగా మంటలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ‘గేట్స్ ఆఫ్ హెల్’గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. -
విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్
అట్లాస్ ఎయిర్ బోయింగ్ కార్గో విమానం ఆకాశంలో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో అమెరికాకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అట్లాస్ ఎయిర్ బోయింగ్ 747-8 కార్గో విమానం టేకాఫ్ అయి ఫ్యూక్టోరికాకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే ఆకాశంలో ఉండగా ఇంజన్లో లోపం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 💥#BREAKING: Atlas Air Boeing 747-8 catches fire with sparks shooting out during mid flight.#Miami | #Florida #boeing7478 #atlasair pic.twitter.com/3IO5xFvMr6 — Noorie (@Im_Noorie) January 19, 2024 విమానంలో మంటలో చెలరేగటంతో ఆ విమానాన్ని వెంటనే సురక్షింగా మియామి ఎయిర్ట్లోనే ల్యాడింగ్ చేయించామని అట్లాస్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కారణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని మియామి ఎయిర్ పోర్టు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఆకాశంలో ఉన్న విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: Israel Hamas War: గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
భారీ అగ్ని ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్లు పేలి..
న్యూయార్క్: అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడు ఆయిల్ ట్యాంకర్లు, ఓ ట్రాక్టర్ ఈ ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. నార్త్ అట్లాంటిక్ ఫ్యూయల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది Our firefighters have responded with mutual aid to this scene at 76 Depot Road in Epping involving multiple oil tankers reported on fire. pic.twitter.com/qCVVvZd7So — Exeter Fire Dept. (@ExeterFire) January 13, 2024 . ఆయిల్ ట్యాంకర్లు మంటల్లో చిక్కుకోవడంతో ప్రమాదం మరింత పెరిగింది. భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. Exeter firefighters along with crews from several communities continue to work the scene of a massive fire involving three oil tankers and a tractor-trailer at North Atlantic Fuels in Epping. pic.twitter.com/mrvIBLGRDc — Exeter Fire Dept. (@ExeterFire) January 13, 2024 ఇదీ చదవండి: అమెరికా, బ్రిటన్ దాడులు.. హౌతీల కీలక వ్యాఖ్యలు -
జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ పేలి..
అమెరికా:అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ పేలింది. దీంతో రహదారిలోని ఎత్తైన భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. BREAKING: Fuel tanker explodes on Philadelphia highway, causing an entire overpass to collapse. pic.twitter.com/iwRVgxJZ41 — The Spectator Index (@spectatorindex) June 11, 2023 నాలుగు లైన్ల ప్రధాన రహదారి. నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి రహదారిపై ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పొగలు తీవ్ర స్థాయిలో కమ్ముకున్నాయి. రహదారిపై ఉన్న ఎత్తైన భాగం కుప్పకూలిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం అయినందున ట్రాఫిక్ పెద్దగా లేదని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. VIDEO/BREAKING: SkyFOX over the section of northbound I-95 that has collapsed in Philadelphia near the Cottman Ave exit. A tanker truck in the underpass beneath 95 caused the North lanes above to collapse & South have buckled down too. pic.twitter.com/0aIqreRlzI — Steve Keeley (@KeeleyFox29) June 11, 2023 ఇదీ చదవండి:నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే.. -
నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే..
ఈజిప్టు: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పర్యాటకుల పడవకు అగ్ని ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈజిప్టు, ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు దగ్గరలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం పడవలో 29 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 15 మంది బ్రిటీష్ పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే..సొర చేపలు, డాల్ఫిన్స్ ఉండే అందమైన ప్రదేశానికి పడవ బయలుదేరింది. ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు చేరగానే ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోట్ల సహాయంతో సిబ్బంది పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ముగ్గురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిపారు. حريق مركب سفاري بطول ٤٠ متر اسمها hurricane في جنوب البحر الأحمر و بالتحديد منطقة Elphinstone و انقاذ معظم السياح فيما عدا ٣ لا يزالوا مفقودين و يعتقد ان جنسيتهم انجليز، نتمني السلامه للجميع و ربنا ينجي المفقودين. المصدر: شهود عيان pic.twitter.com/hRg1YlzNb7 — RedSea_Anglers ⚓ 🚢 🇪🇬🇱🇧🇬🇷 (@HanySadekk) June 11, 2023 షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..! -
రూ.2 కోట్ల స్పోర్ట్స్ కారు.. క్షణాల్లో కాలి బూడిదైంది..
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్షె లగ్జరీ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టి కాలి బూడిదైంది. క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మన్కీరత్ సింగ్(35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఈ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అదపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. మన్కీరత్ ఎలాగోలా కాలిన గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే కారుమాత్రం కాలిబుడిదైంది. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. చక్రాలు ఊడిపోయాయి. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో మన్కీరత్ సింగ్ కారుపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అతను గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్పూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ.. -
సంగారెడ్డి జిల్లాలో తప్పిన ప్రమాదం
-
Viral Video: చేతిపంపు నుంచి మంటలు, ఆ వెంటనే నీరు.. జనం పరుగో పరుగు!
ప్రకృతిలో వింతలు, విడ్డూరాలకు కొదవుండదు. అప్పటిదాకా మామూలుగానే ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా పూర్తి భిన్నంగా మారిపోతుంటాయి. అంతా తమకు తెలిసే జరుగుతుందనుకునే మనిషి ఆ ఊహించని ఘటనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బుక్సువా బ్లాక్, కచ్చర్ గ్రామస్తులకు అలాంటి వింతైన అనుభవమొకటి కలిగింది. చేతిపంపులో నుంచి ఒక్కసారిగా భారీ మంటలు ఆ వెంటనే నీళ్లు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు పరుగులు పెట్టారు. అలా చాలా సేపు కొనసాగడంతో ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు కొందరు. దీంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: స్టూడెంట్ రిపోర్టింగ్‌కు సోనూసూద్ ఫిదా.. నీ కోసం కొత్త స్కూల్ రెడీ అంటూ..) బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. నమ్మశక్యంగాని ఘటనతో స్థానికులు ఎవరికి వారు ఊహించుకున్నారు. తమ కళ్లను అస్సలు నమ్మలేక పోతున్నామని కొందరు అంటుండగా.. కెమికల్ లీక్ వల్లే ఇలా జరిగిందని మరికొందరు చెప్తున్నారు. ఈనేపథ్యంలో స్థానిక నేతలు కొందరు చత్తర్‌పూర్ జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు భూమి లోపలి పొరల్లోంచి మీథేన్ వాయువు వెలువడటంతో మంటలు చెలరేగాయని తెలిపారు. భోపాల్ ప్రభుత్వ సైన్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. బుక్సువా ప్రాంతంలోని భూమి పొరల్లో వృక్ష, జంతు వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగుపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈక్రమంలోనే రసాయన చర్య కారణంగా మీథేన్ వాయువు మండుతూ పైకి చొచ్చుకొచ్చిందని, దాంతోపాటు నీరు కూడా పైకి ఎగజిమ్మిందని చెప్పుకొచ్చారు. (చదవండి: అంబులెన్స్ రాలేదు.. జేసీబీతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు: వీడియో వైరల్) Hand pump spewing fire and water in Kachhar village, Buxwaha,Villagers have informed the concerned officials.Local administration is sending a team to spot#madhyapradesh pic.twitter.com/8M4c7HfRQN — Siraj Noorani (@sirajnoorani) August 25, 2022 -
మొక్కజొన్న మంటల్లో 6గురు చిన్నారుల సజీవ దహనం
పాట్నా: సరదాగా మొక్కజొన్నలు కాల్చుకుంటుండగా ఆ నిప్పు కాస్త పూరి గుడిసెపై పడి ఏకంగా ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుపోయారు. చివరకు ఆ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘోర సంఘటన బిహార్‌లో జరిగింది. అరారియా జిల్లా కబయా గ్రామంలో మంగళవారం చిన్నారులు మొక్కజొన్న కంకులు నిప్పులపై కాల్చుకుంటున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఆ మంటలు వెళ్లి పూరి గుడిసెపై పడ్డాయి. గడ్డితో చేసిన గుడిసెలు కావడంతో వెంటనే మంటలు దావనంలా వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. దీంతో ఆ చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. వారి హాహాకారాలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు మంటలు ఆర్పేందుకు విఫల ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు. సరదాగా మొక్కజొన్నలు తినాల్సిన చిన్నారులు బొగ్గుల్లా మారిపోయారు. ఆ చిన్నారుల వయసు 3 నుంచి 6 ఏళ్లలోపే. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. అయితే అంతకుముందు రోజే బిహార్‌లో కాముడి దహనం చేస్తుండగా ఆ మంటల్లో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల వివరాలు గుల్నాజ్ (3) బర్కాస్ (4) అశ్రఫ్ (5) అలీ హసన్ (5) ఖుశ్ నిహార్ (5) దిల్వార్ (6) చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
విమానం ఇంజిన్‌లో మంటలు..
ముంబై: అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్న గోఎయిర్‌కు చెందిన జీ8–802 విమానం ఇంజిన్‌ను పక్షి ఢీ కొట్టడంతో కుడి పక్క ఇంజిన్‌లో మంటలు రేగాయి. దీంతో విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. అనంతరం విమానాన్ని రన్‌వే నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందులో సిబ్బంది కాకుండా మొత్తం 134 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని గోఎయిర్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. దాదాపు మూడున్నర గంటల తర్వాత మరొక విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు. -
బైక్‌కు మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఆగ్రా : ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల సమయస్పూర్తి ఓ కుటుంబ ప్రాణాలు కాపాడింది. ఆగ్రా హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఓ కుటుంబం ప్రయాణిస్తున్న బైక్‌కు మంటలు అంటుకోవడం గమనించారు. అయితే బైక్ సైలెన్సర్ కింది భాగంలో మంటలు అంటుకోవడంతో దానిపై ప్రయాణిస్తున్నవారు గమనించకుండా అలానే ప్రయాణిస్తున్నారు. దూరం నుండే ప్రమాదం పసిగట్టిన పోలీసులు పెట్రోలింగ్ జీప్‌లో వారిని వెంబడించి, బైక్‌కు మంటలు అంటుకున్న విషయాన్ని చెప్పారు. వారిని బైక్ దూరంగా పంపించి పోలీసులు మంటలు ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో బ్యాగ్ కిందవైపు రోడ్డుకు రాపిడి జరగడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన మొత్తాన్ని షూట్ చేసిన పోలీసులు వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోవైరల్‌గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులను యూపీ డీజీపీ ప్రశంసించారు. -
ఏమిటీ వింత..! భూమి పొరల్లోంచి మంట
-
ఏమిటీ వింత..! భూమి పొరల్లోంచి మంట
సాక్షి, కర్నూలు : జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండా సమీపంలో వింత ఘటన చోటు చేసుకుంది. తండాకు దగ్గర్లోని కొండ ప్రాంతంలో 50మీటర్ల పొడవు, ఒక అడుగు వెడల్పుతో భూమి చీలిపోయింది. అందులో నుంచి మంటలు చెలరేగడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎలాంటి ఉత్పాతం సంభవిస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. కాగా, ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా అక్కడకు చేరుకుంటున్నారు. భూమి పొరల నుంచి వెలువడుతున్న మంటల ప్రభావంతో సమీపంలోని విద్యుత్ స్తంభం కూలిపోయింది. మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అంతుబట్టడం లేదు. స్థానికులు విషయాన్ని తహసీల్దారు సంజీవయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న సంజీవయ్య జియాలాజికల్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రాహుల్‌కు తప్పిన ప్రమాదం
-
రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం
భోపాల్ : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఆదివారం(నిన్న) జబల్పూర్లో 8 కిలోమీటర్ల భారీ రోడ్‌షో నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది కార్యకర్తలు మూడు రంగుల బెలూన్లతో రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ముందుకొచ్చారు. అదే సమయంలో మరికొందరు కార్యకర్తలు యువనేతకు హారతి ఇవ్వడానికి ముందుకొచ్చారు. దాంతో హారతి మంట బెలూన్లకు తాకేసరికి వాటిలో ఉన్న నైట్రోజన్ వాయువు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, కొద్ది సెకండ్లలోనే గ్యాస్ అయిపోవడంతో మంటలు ఆరిపోయాయి. కానీ మంటలను చూసి అక్కడకు వచ్చినవారంతా భయంతో పరుగులు తీశారు. వాహనం మీద ఉన్న రాహుల్ గాంధీ కూడా ఒక్కసారిగా మంటను చూసి భయపడి ఓ పక్కకు జరిగారు. అయితే ఆ మంటలు ఆయన వరకు రాకుండానే ఆగిపోయాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీతో పాటు జ్యోతిరాదిత్య సిందియా, కమల్‌నాథ్ కూడా ఉన్నారు. కాగా, భద్రతా లోపం వల్లే మంటలు చెలరేగాయంటూ వస్తోన్న ఆరోపణలను జబల్పూర్ ఎస్పీ అమిత్ సింగ్ ఖండించారు. ర్యాలీలో భాగంగా వాహనానికి, కార్యకర్తలకు మధ్య కనీసం15 మీటర్ల దూరం కొనసాగించామని తెలిపారు. అంతేకాక హారతి ఇవ్వడానికి వచ్చిన వారు కూడా కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆయన గుర్తుచేశారు. దేశంలోనే అత్యంత భద్రత కలిగిన అతి కొద్దిమంది నాయకులలో రాహుల్‌గాంధీ ఒకరు. కానీ ఇప్పటికే ఆయనకు భద్రత కల్పించే విషయంలో పలు సందర్భాలలో అపశృతులు దొర్లాయి. గతంలో రాహుల్ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది. వాతావరణం అంతా బాగానే ఉన్నా, కావాలనే ఇలా చేశారని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆరోపించింది. గుజరాత్లో కొందరు తనపై రాళ్లు విసిరారని రాహుల్ పార్లమెంటులో ప్రస్తావించారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు పదే పదే భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. గడిచిన రెండేళ్లలో కనీసం వంద సార్లు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడలేదని, విదేశాలకు వెళ్లినపుడల్లా చిట్టచివరి నిమిషంలో ఎస్పీజీకి చెబుతారని, దాంతో అధికారులకు అది సమస్యగా మారుతోందని అన్నారు. 2016, 17 సంవత్సరాలలో రాహుల్‌గాంధీ ఆరు సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లి 72 రోజులు గడిపారని, ఒక్కసారి కూడా ఎస్పీజీ అధికారులను వెంట తీసుకెళ్లలేదని రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో సమాధానమిచ్చారు. -
విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
-
విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం
బీజింగ్: టేకాఫ్ కు సిద్దంగా ఉన్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ చార్జింగ్ కు వాడే పవర్ బ్యాంకు పేలడంతో చైనా సదరన్ ఎయిర్లైస్స్ కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. సిబ్బంది, ప్రయాణికులు సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. చైనాలోని గాంగ్జూ విమానాశ్రయంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 777-300ఈఆర్ రకానికి చెందిన సీజెడ్3539 విమానం గాంగ్జూ నుంచి షాంఘై వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు విమానంలో ఎక్కుతుండగానే ఓవర్‌హెడ్ కంపార్ట్మెంటులో మంటలు గమనించారు. అందులోని ఓ బ్యాగులో నుంచి మంటలు చెలరేగాయి. సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలు ఆర్పివేశారు. ప్రమాదం జరిగినప్పుడు పవర్ బ్యాంకు వినియోగంలో లేకపోయినా ఎందుకు పేలిందనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ బ్యాగు తీసుకువచ్చిన వ్యక్తిని విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఆ విమానాన్ని నిలిపివేసి మరో విమానంలో ప్రయాణికులను పంపించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీకాలేదు. బోయింగ్ 777-300ఈఆర్ విమానంలో కొంత భాగం మాత్రం పాడైంది. మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
బీఎండబ్ల్యూ కారులో మంటలు..
మాస్కో: బీఎండబ్ల్యూ కారుకు ఉన్నట్లుండి మంటలంటుకున్న ఘటన రష్యాలో చోటు చేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెర్మ్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ అజ్ఞాత వ్యక్తి తన మొబైల్లో షూట్ చేశాడు. బీఎండబ్ల్యూ ఎం5 మోడల్ కారులో మంటలను గమనించగానే డ్రైవర్ దానిని వేగంగా ముందుకు నడిపాడు. అనతంతరం అతడివైపు నుంచి మంటలు తగ్గడంతో డోర్ ఓపెన్ చేసి బయటపడ్డాడు. కారులో మంటలు ఎలా వ్యాపించాయి అనే విషయం తెలియరాలేదు. అయితే.. ఈ దృశ్యాలను చూసినవారు మాత్రం ’నిజమైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇది’ అని కామెంట్ చేస్తున్నారు. -
శ్రీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లాల్‌చౌక్ సమీపంలోని కోర్టు రోడ్డులో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధం కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్‌తో పాటు పోస్టాఫీస్‌కు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు ముంబయిలోనూ అగ్నిప్రమాదం జరిగింది. మన్ఖర్ద్ ప్రాంతంలోని ఓ స్క్రాప్ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పెద్దపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
-
పెద్దపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని దామోదర్ టింబర్ డిపోలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా డిపోను మంటలు చుట్టు ముట్టడంతో చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఎవరో గిట్టని వారే డిపోనకు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారులు దాచి ఉంచిన కట్టెల గోదాములో మంటలు చెలరేగి, అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శునకానికి ‘హోమ్టౌన్ హీరో’ అవార్డు
శాన్ ఫ్రాన్సిస్కో: అప్రమత్తతతో వ్యవహరించి, యజమాని ఇంటిని అగ్నిప్రమాదం నుంచి కాపాడిన ఓ శునకానికి అమెరికాలోని మెరీడియన్ నగరం అందించే ‘హోమ్టౌన్ హీరో’ అవార్డు దక్కింది. సాధారణంగా మనుషులకు మాత్రమే అందించే ఈ అవార్డును ఈసారి శునకానికి ఇవ్వడం విశేషం. మెరీడియన్ సిటీలో ఉండే టాడ్ లావోయ్, జాక్సన్ అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆగస్టు 29న అర్ధరాత్రి టాడ్ ఇంటిలో విద్యుత్ తీగలు కాలిపోవడంతో అంతటా మంటలు వ్యాపించడం ప్రారంభించాయి. దీన్ని గమనించిన జాక్సన్, వింతైన, అసాధారణ శబ్దంతో గట్టిగా అరిచింది. ఈ కుక్క కేకలు విన్న యజమాని టాడ్ లేచి చూసేసరికి మంటలు కనిపించాయి. వెంటనే ఇంట్లోని అగ్నిమాపక సిలిండర్ సాయంతో మంటలు ఆర్పేయడంతోపాటు, పవర్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో మంటలు ఆగిపోయాయి. జాక్సన్ మొరగకపోతే, పెద్ద ప్రమాదం జరిగేదని, దాని వల్లే తమ కుటుంబం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగిందని టాడ్ చెప్పారు. జాక్సన్ తన చాకచక్యంతో నగరంలోని ఓ కుటుంబాన్ని కాపాడడంతో, మెరీడియన్ సిటీ మేయర్ టామ్మీ డే ఈ శునకానికి ‘హోమ్టౌన్ హీరో’ అవార్డు అందజేశారు.