ganja seized
-
గంజాయి అమ్ముతూ నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, కూకట్పల్లి: ఏపీ నుంచి సిటీకి గంజాయి తెచ్చి అమ్ముతున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ పార్కులో గంజాయి విక్రయిస్తున్న వీరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్ డీమార్ట్ సమీపంలోని పార్కులో నలుగురు యువకులు గంజాయి విక్రయిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది.పోలీసులు వెంటనే పార్కు వద్దకు చేరుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. కవర్ ప్యాకెట్లలో గంజాయి లభించింది. గంజాయి విక్రయిస్తున్న వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్ (24), రమేశ్ కృష్ణ (27), నక్కా నాగవంశీ (23), పల్నాడు జిల్లాకు చెందిన జంపనీ సాయిగోపీ విహారి (26) ఉన్నారు. ఈ నలుగురు యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులని, కేపీహెచ్‌బీ హాస్టల్లో ఉంటూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా రాజమండ్రి నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
851 కిలోల గంజాయి పట్టివేత
కొయ్యూరు : రూ.20 లక్షలకు పైగా విలువ చేసే 851 కిలోల గంజాయిని సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గంజాయితోపాటు ఒక బైక్, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బూదరాళ్ల రహదారి నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు గంజాయితో రెండుకార్లు వస్తున్నాయన్న ముందస్తు సమాచారంతో చీడిపాలెం జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.అయితే, కార్లు రావడానికి ముందు పైలట్‌గా బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూడగానే పారిపోయారు. అదే సమయంలో ఒక కారులో ఉన్న ముగ్గురు, మరో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా పరారయ్యారు. డ్రైవర్లు సైతం పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు రెండు కార్ల డ్రైవర్లను పట్టుకున్నారు. వాటిని వెనక్కి తీసుకెళ్లే క్రమంలో స్మగ్లర్లు కారును వేగంగా డ్రైవ్ చేస్తుండగా దొడ్డవరం వెళ్లే మలుపు వద్ద కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో కారును వదిలి వారు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న కారు నుంచి 185 గంజాయి ప్యాకెట్లు, మరో కారు నుంచి 94 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్ మాఫియా: వినూత్న మార్గాల్లో గంజాయి రవాణా..
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డ్రగ్ మాఫియా వినూత్న మార్గాల్లో గంజాయి రవాణాకు పాల్పడుతోంది. బీరువాల తరలింపు మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీసులు అడ్డుకున్నారు. ఏపిలోని చింతూరు నుంచి కర్ణాటకలోని బీదర్‌కు తరలిస్తుండగా గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ మాఫియాపై జిల్లా ఎస్పీ డా.వినీత్, ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. డ్రగ్ మాఫియా ముఠా.. ప్రత్యేకంగా రూపొందించిన బీరువాల్లో గంజాయి పేర్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని తెలిపారు. రూ. 30లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒక వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారని అన్నారు. ఈ మఠాలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ కేసుపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో గంజాయిని అమ్ముతున్న ఏడుగురు యువకుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. యువకుల నుంచి 7 గంజాయి ప్యాకెట్లు, మూడు ఆటోలు,సెల్ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకుట్లు పోలీసులు తెలిపారు. యువకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సదాశివపేట పోలీసులు పేర్కొన్నారు. నిజామాబాద్‌లో తొలిసారి కొకైన్ లభ్యం.. నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో తొలిసారి కొకైన్ ఇతర మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. డిచ్పల్లి మండలం నడిపల్లి వద్ద ఢిల్లీ నుంచి వచ్చిన స్కోడా కారులో కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇద్దరు యువకులు ఢిల్లీ వ్యక్తి రాహుల్ ద్వారా తెచ్చుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒక కారు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్ -
గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
పీలేరు : నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీఐ ఎన్. మోహన్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సీఐకు అందిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్ వద్ద దాడి చేశారు. మదనపల్లెకు చెందిన సయ్యద్ సుల్తాన్ (28) గంజాయి కలిగి ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయితోపాటు ఒక ఫోన్, రూ. 400 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారణ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెడు వ్యసనాలకు బానిసై అక్రమంగా డబ్బు సంపాదించాలని పలువురితో కలిసి గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. విశాఖపట్నం వెళ్లి అక్కడ పాడేరుకు చెందిన ఏ–3 నిందితుడు మహేష్ వద్ద గంజాయి కొనుగోలు చేసి రైలులో అక్రమ రవాణా చేసి మదనపల్లెకు తీసుకుని వచ్చే వాడు. చిన్న పొట్లాలుగా కట్టి విక్రయించే వాడు. అలాగే బెంగళూరుకు చెందిన ఏ–2 నిందితుడు ఖాజాకు గంజాయి పెద్దమొత్తంలో సరఫరా చేసే వాడు. సయ్యద్ సుల్తాన్‌పై మదనపల్లె–1 టౌన్, అలిపిరి, కర్ణాటక రాయపూర్ పోలీస్ స్టేషన్లలో దోపిడీ, హత్యాయత్నం, హత్య లాంటి నేరారోపణలపై కేసులు ఉన్నాయి. మదనపల్లె–1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కేసు ఉంది. బెంగళూరుకు చెందిన ఖాజా, పాడేరులోని మహేష్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. -
గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
దేవరాపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇతర రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల విలువ చేసే 556 కేజీల గంజాయిని దేవరాపల్లి పోలీసులు బుధవారం శ్రీరాంపురం వై.జంక్షన్ వద్ద పట్టుకున్నారు. వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎస్ఐ పి.సింహాచలంతో కలిసి చోడవరం సీఐ సయ్యద్ ఇలియాస్ మహ్మద్ వెల్లడించారు. జీనబాడు చెక్‌పోస్టు దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా సంచరిస్తున్నట్టు ఎస్ఐ పి.సింహాచలంకు పక్కా సామాచారం రావడంతో తన సిబ్బందితో వెళ్లి అక్కడ పాడేరు మండలం బొడ్డాపూట్‌కు చెందిన రేగం గోవింద, కొర్రా నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్న విషయం బయటపడింది. తక్షణమే పోలీసులు సమీపంలో మాటు వేసి గంజాయితో వస్తున్న బొలెరో వ్యాన్‌ను అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో వ్యాన్ డ్రైవర్, యజమానితో పాటు ద్విచక్ర వాహనంపై వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 40 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు బొలెరో వ్యాన్‌ను, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నలుగురు వ్యక్తుల కోసం గాలిస్తున్నామన్నారు. గంజాయి తరలింపులో కచ్చితమైన సమాచారాన్ని ముందస్తుగా సేకరించిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 501 కిలోల గంజాయి పట్టివేత పెదబయలు : మండలంలోని సీతగుంట జంక్షన్లో బుధవారం తెల్లవారు జామున పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా 501 కిలోల గంజాయి, లారీని స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్థానిక ఎస్ఐ పులి మనోజ్‌కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తున్నట్టు గమనించిన లారీ డ్రైవర్ లారీని నిలిపివేసి పరారయ్యాడని, లారీలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లారీని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. లారీ విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రాంతానికి చెందినదిగా గుర్తించామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మోతుగూడెంలో ఐదుగురు అరెస్టు మోతుగూడెం: మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయితో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోతుగూడెం ఎస్ఐ వి.సత్తిబాబు తన సిబ్బందితో సాయంత్రం తనిఖీలు చేస్తుండగా మోటార్ బైక్ వస్తున్న ఇద్దరు యువకుల్ని ఆపారు. దీంతో కారులో ఉన్న నలుగురిలో ఒకరు కారు దిగి పారిపోయాడు. దీంతో పోలీసులు కారులో ఉన్న ముగ్గురిని, బైక్ వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా 20 కేజీల గంజాయి లభించింది. మధ్యవర్తుల రిపోర్టులో గంజాయిని, ఒక బైక్, కారు, ఐదు సెల్ఫోన్లు, నగదును సీజ్ చేసినట్టు ఎస్ఐ తెలిపారు. డొంకరాయి సమీప అటవీ ప్రాంతం నుంచి గంజాయిని ఖమ్మం జిల్లా ఎల్లందుకు తీసువెళ్తుండగా పట్టుబడినట్టు తెలిపారు. పట్టుబడిన వారిలో కొత్తగూడెం జిల్లా ఎల్లందు చెందిన ముక్కు శ్రీవ్యాస్, సిరిమల్ల రాజేష్, గర సాంధల లింగారెడ్డి, మల్కన్‌గిరి జిల్లా చెందిన తుమ్మా చరణ్, పలాస ఇంద్రలను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఒడిశాకు చెందిన పలాస పాపారావు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న మహిళ, మరొకరి అరెస్టు
కడప అర్బన్: కడప నగరంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం రాయల్థియేటర్ నుంచి గుర్రాల గడ్డకు వెళ్లే దారిలో పూల సరస్వతితో పాటు, మహమ్మద్ ఉమర్ అనే ఇద్దరు గంజాయిని విక్రయిస్తుండగా సీఐ ఎన్.వి నాగరాజు తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1 కిలో 200 గ్రాముల గంజాయి, మోటార్‌సైకిల్, రూ. 13,370 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ నిందితుల వివరాలను తెలియజేశారు. మాసాపేటకు చెందిన పూల సరస్వతి గతంలో కూడా గంజాయిని విక్రయిస్తూ పట్టుబడిందన్నారు. ప్రస్తుతం తారకరామనగర్‌లో ఉంటూ, అక్కాయపల్లెకు చెందిన మహమ్మద్ ఉమర్‌తో కలిసి గంజాయిని విశాఖ జిల్లా నుంచి తెప్పించుకుని, మత్తుకు అలవాటైన యువతకు సరఫరా చేస్తున్నారనే సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సిబ్బందిని సీఐ అభినందించారు. -
రూ.90 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్ అధికారులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.90 లక్షల విలువైన 300 కేజీల గంజాయి పట్టుబడింది. వివరాలివి. ఎక్సైజ్ సీఐ రహీమున్నీసా బేగం సిబ్బందితో కలిసి శనివారం తెల్లవారుజామున కూనవరం రోడ్డులో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించగా ఆగకుండా దూసుకుపోయింది. దీంతో ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ అధికారుల వాహనం ముందు భాగం దెబ్బతింది. అక్కడి నుంచి పారిపోయిన నిందితుల వాహనం కోసం గాలిస్తుండగా రామాలయం వద్ద కనిపించింది. దాన్ని తనిఖీ చేయగా 300 కేజీల గంజాయి లభించడంతో సీజ్ చేశారు. పట్టుబడిన వాహనం జార్ఖండ్ రాష్ట్రానికి చెందినదని గుర్తించామని, నిందితులు పారిపోయారని సీఐ తెలిపారు. -
780 కేజీల గంజాయి పట్టివేత
గొలుగొండ: గొలుగొండ ఎస్ఈబీ పోలీసులు బుధవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండలంలో మారుమూల గ్రామం నిమ్మగెడ్డలో బలోరా వ్యాన్‌లో తరలించడం కోసం దాచి ఉంచిన 780 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఇంత పెద్ద మొత్తంలో గంజాయి దొరకడం ఇదే మొదటిసారి. ఏజెన్సీ నుంచి బలోరా వ్యాన్‌లో 38 బ్యాగ్‌ల్లో 780 కేజీల గంజాయి రవాణాకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గొలుగొండ ఎస్ఈబీ సీఐ రాజారావు, ఎస్ఐ గిరి మాట్లాడుతూ ఇటీవల గంజాయి రవాణా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఒక్కో బ్యాగ్‌లో 20 కేజీల చొప్పున 38 బ్యాగ్‌ల్లో గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో దాడి చేశామని తెలిపారు. బలోరా వ్యాన్ మాత్రమే నిమ్మగెడ్డ పరిసర ప్రాంతాల్లో ఉందని వాహనంలో ఎవరూ దొరకకపోవడంతో వ్యాన్ యజమానిని గుర్తించి అతనిపై కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. గంజాయిని, వాహనాన్ని సీజ్ చేశామన్నారు. రూ 3లక్షల విలువైన గంజాయి స్వాధీనం నాతవరం : వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3 లక్షల విలువ చేసే గంజాయి పట్టుబడిందని నాతవరం ఎస్ఐ దుంçపల శేఖరం తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు నర్సీపట్నం తుని మధ్య డి.యర్రవరం జంక్షన్లో బుధవారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ముందు బైక్ దాని వెనుక కారును వదిలి నిందితులు పరారయ్యారని తెలిపారు. దీంతో కారులో సోదా చేయగా 80 కేజీలు గంజాయి లభ్యమైందన్నారు. బైక్‌ను, కారును పోలీసుస్టేషన్‌కు తరలించామన్నారు. బైక్, కారు తెలంగాణ రాష్ట్రానికి చెందినవిగా గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.3 లక్షలకు పైగా ఉంటుందన్నారు. -
రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
చింతూరు: ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా లారీలో తరలిస్తున్న 530 కిలోల గంజాయిని శనివారం చింతూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ యాదగిరి తమ సిబ్బందితో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మోతుగూడెం వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా గుమ్మడికాయల కింద దాచి రవాణా చేస్తున్న గంజాయి లభ్యమైంది. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరవ్‌కుమార్, ప్రతాప్‌కుమార్, ఒడిశాకు చెందిన కొర్రా సన్యాసిరావు, కిలో అర్జున్‌లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ వెయ్యి నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయం.. 410 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం, ఏజెన్సీ ప్రాంతంలో కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి... అక్రమంగా ముంబైకి తరలించి రూ.12 వేలకు విక్రయిస్తున్న గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 410 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ కే మురళీధర్‌తో కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం వివరాలు వెల్లడించారు. ♦నాగర్‌కర్నూల్ జిల్లా, బైరాపూర్ గ్రామానికి చెందిన గుడ్లనారం వెంకట్ నారాయణ తుర్కయాంజల్‌లోని ఏబీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత మూడేళ్లుగా గంజాయి వ్యాపారం ఇతనికి పలు రాష్ట్రాల్లోని గంజాయి కొనుగోలుదారులతో సంబంధాలు ఉన్నాయి. భద్రాచలం, ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. ఈ దందాలో అతడికి మండలి శ్రీనివాస్, దబ్బడి రజనీకాంత్, యాచహరం నాగరాజు సహకరించేవారు. ♦ ముంబైకి చెందిన షాహీన్, మాజిద్ నుంచి ఆర్డర్ అందడంతో వీరు నలుగురు కలిసి ఈనెల 20న రెండు వాహనాలతో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సత్తిబాబు అనే వ్యక్తి నుంచి 410 కిలోల గంజాయి కొనుగోలు చేసి వాటిని కారు లోపల సీట్ల కింద దాచిపెట్టారు. పోలీసుల తనిఖీల నుంచి త ప్పించుకునేందుకు వెరిటో కారును పైలట్ వా హనంగా వినియోగిస్తూ భద్రాచలం నుంచి ఓఆర్ఆర్ మీదుగా ముంబై బయలుదేరారు. ♦ బుధవారం దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, కీసర పోలీసులు కీసర టోల్గేట్ వద్ద వాహనాలను అడ్డగించి తనిఖీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 410 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకట్‌పై పాత కేసులు కూడా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకట్ నారాయణపై గతంలో రెండు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. 2019లో విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది. నల్లగొండ జిల్లా, చిట్యాల పోలీస్ స్టేషన్లో నమోదైన మరో గంజాయి కేసులో వెంకట్‌తో పాటు ఏఓబీ ప్రాంతానికి చెందిన సత్తి బాబు నిందితులుగా ఉన్నారు. వెంకట్‌ను పాత కేసుల్లో కూడా రిమాండ్‌కు తరలించి, కోర్టు ఎదుట హాజరుపరుస్తామని సీపీ తెలిపారు. వారిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామన్నారు. -
82 కిలోల గంజాయి స్వాధీనం
బూర్గంపాడు: ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈమేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర వద్ద 82 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఆయన వెల్లడించారు. శనివారం ఉదయం మోరంపల్లి బంజర వద్ద బూర్గంపాడు ఎస్సై జితేందర్ వాహ నాలను తనిఖీ చేస్తూ రెండు ద్విచక్ర వాహనా లను ఆపుతుండగా వాటిపై ఉన్న నలుగురు పారిపో యేందుకు యత్నించారు. దీంతో వారిని వెంబ డించి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. మహా రాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రాజేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ విలాస్ భలేరావు, ఉమేశ్ రమేశ్ సావ్లే, ఆకాశ్ సుధాకర్ భలేరావు ఏపీలోని సీలేరులో సురేశ్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసు కెళ్తున్నట్లు విచారణలో వెల్లడించారు. కాగా, ఔరం గాబాద్‌కు చెందిన సందీప్ సాటే వీరిని గంజా యి కోసం పంపించినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకు న్న గంజాయి విలువ రూ.16.48 లక్షలు ఉంటుం దని ఏఎస్పీ తెలిపారు. పెద్ద వాహనాలైతే పట్టుబ డతామనే భావనతో వీరు గంజాయి తర లింపునకు ద్విచక్ర వాహనాలను ఎంచుకున్నారని తెలిపారు. సమావేశంలో పాల్వంచ సీఐ సత్యనారాయణ, బూ ర్గంపాడు ఎస్సై జితేందర్, ట్రైనీ ఎస్సై విజయలక్ష్మి, ఏఎస్సై ఖాజా మొయినుద్దీన్ పాల్గొన్నారు. -
గంజాయి స్వాధీనానికి వెళ్లి.. కాల్పులు జరిపి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాలే కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాపై నల్లగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో ఏవోబీ(ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు)లో భారీ గంజాయి సాగు ప్రాంతాలను గుర్తించి దాడులు చేశారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక బృందాల దాడిలో 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. 20 మంది స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకొస్తున్న క్రమంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపై మరికొందరు స్మగ్లర్లు రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో పోలీస్ వాహనం ధ్వంసం కాగా, ఇద్దరు స్మగ్లర్ల కాళ్లకు గాయాలైనట్లు తెలిసింది. గంజాయి హబ్‌గా.. హైదరాబాద్‌లోని సింగిరేణి కాలనీలో గంజాయికి బానిసైన వ్యక్తి ఆరేళ్ల బాలికను చిదిమేసిన ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యచరణ కు దిగింది. ఈ క్రమంలో ఇటీవల అరెస్టు చేసిన స్మగ్లర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నల్లగొండ డీఐజీ, ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచనతో 13 బృందాలు ఈ నెల 14 నుంచే రంగంలోకి దిగాయి. ఒక్కో సీఐ నేతృత్వంలో ఆరుగురు పోలీసులతో కూడిన బృందాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో లంబసింగి, నర్సీపట్నం, దారంకొండ, అన్నవరం, గంగవరం, సీలేరు, కొండరాయి ప్రాంతాల్లోని గంజాయి క్షేత్రాలపై దాడులకు దిగాయి. ఆదివారం 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని, 20 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విడిపించుకునేందుకు ఆ ముఠాలోని మరికొందరు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. లంబసింగి ఘాట్‌రోడ్డులో రోడ్డుకు టిప్పర్‌ను అడ్డుపెట్టి రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు జిల్లా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి హానీ జరుగలేదని, ఇద్దరు స్మగ్లర్లకు కాళ్లకు గాయాలైనట్లు పేర్కొన్నాయి. పక్కా వ్యూహంతో.. వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ కీలక స్మగ్లర్ ఇచ్చిన సమాచారంతో నల్లగొండ పోలీసులు పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నా రు. గంజాయి సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, హైదరా బాద్ ప్రాంతాల్లోని వ్యక్తులనూ అదుపులోకి తీసుకున్నారు. వీరితో గంజాయి సరఫరా చేసే ముఠా సభ్యులకు ఫోన్ చేయించారు. కొనుగోలుదారుల పేరుతో రంగంలోకి దిగి.. గంజాయి కావాలని బేరం కుదుర్చుకున్నారు. అలా ఆప రేషన్ కొనసాగించి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దాడులను ఏపీ పోలీసులతో సంయుక్తంగా నిర్వహించామని నల్లగొండ ఎస్పీ చెబుతుండగా, విశాఖ ఎస్పీ మాత్రం నల్లగొండ పోలీసులు వచ్చిన సమాచా రమే తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ఆత్మరక్షణ కోసమే కాల్పులు ‘విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గంజాయి కేంద్రాలపై దాడులకు జిల్లా పోలీసు బృందాలు వెళ్లింది వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో గంజాయి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాం. అది కొనసాగుతున్న క్రమంలో స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపాయి. ఘటనలో ఏ ఒక్క పోలీస్‌కు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు’. – నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ 20 మంది వరకు అరెస్టు... ‘విశాఖ లంబసింగి సమీపంలో ఆదివారం సాయంత్రం గంజాయి స్మగ్లర్ల నుంచి ఆత్మరక్షణ కోసమే నల్లగొండ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నల్లగొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు తీగలాగుతూ గంజాయి స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు విశాఖ వచ్చాయి. ఆదివారం సాయంత్రం దాదాపు 20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా.. దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీస్ వాహనం ధ్వంసం అయ్యింది. అయితే, అనుకోకుండా ఇద్దరు గంజాయి స్మగ్లర్లకు గాయాలయ్యాయి. గంజాయి స్మగ్లర్లపై కేసు నమోదు చేశాం’ – విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు వెల్లడి -
టాస్క్‌ఫోర్స్ తనిఖీ.. 800 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, విజయవాడ : నగర శివారులో 800 కిలోల గంజాయిని బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రామవరప్పాడు వద్ద తనిఖీలు చేపట్టగా... లారీలో తరలిస్తున్న సుమారు 80 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం నుంచి కొయంబత్తూరుకు లారీలో మొక్క జొన్న పిండి బస్తాల చాటున తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, లారీని సీజ్ చేసినట్లు ఆయన (గంజాయి రవాణా చేసే నార్త్ ముఠాకు చెక్) కూకట్‌పల్లిలో నలుగురు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్ : గంజా విక్రయిస్తున్న నలుగురు యువకులను బుధవారం కూకట్‌పల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో గంజా అమ్మడానికి సిద్ధంగా ఉన్న యువకులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నవీన్ కుమార్, ఆనంద్, అనంత్ కుమార్, శ్రవణ్ అరెస్టు అయ్యారు. వీరు ఖమ్మం సత్తుపల్లి నుంచి 3.5 కిలోల గంజా సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని ఎస్ఓటీ పోలీసులు.. కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు. (భర్తకు గండం ఉందని వివాహిత మెడలో తాళి కట్టి..) -
500 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, వరంగల్: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 500 కిలోల గంజాయి, రెండు నాటు తుపాకులు, 11 రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, బొలెరో వాహనం, ఐదు సెల్ఫోన్లు, రూ.1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. నిందితుల్లో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన దండెబోయిన సుమన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అన్నవరానికి చెందిన వంతల విజయ్, గిమ్మెల రంగారావు, వంతల నర్సింగరావు, మరో నిందితుడు బాల నేరస్తుడు ఉన్నాడని చెప్పారు. -
130 కేజీల గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, మహారాష్ట్ర నుంచి గంజాయిని అక్రమంగా తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును వనస్థలిపురం పోలీసులు రట్టు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మొత్తం 130 కేజీల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. ముఠాలో ప్రధాన సూత్రధారిగా బానోత్ సుధాకర్‌గా గుర్తించామని అన్నారు. మహారాష్ట్రలో గంజాయిని కేజీ రూ. 2 వేలకు ఖరీదు చేసి, నగరంలో రూ. 7వేలకు అతడు విక్రయించేవాడు. ఇందులో భాగంగా 130 కేజీల గంజాయిను తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసు బృందం వీరిని సోమవారం వలపన్ని పట్టుకుంది. అయితే ఎవరి వద్ద నుంచి గంజాయి రిసీవ్ చేసుకున్నారో తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల పట్టుబడుతున్న ముఠాలు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్మకాలు చేస్తున్నారనీ, అలాంటి ముఠాలపై 'ఎన్డీపీసీ' యాక్ట్‌తో శిక్షలు పడేలా చూస్తున్నామని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో అనేక కేసుల్లో నిందితులకు శిక్షపడే శాతం పెరిగిందనీ, అలానే గంజాయి అక్రమ రవాణా చేసేవారికి పూర్తి స్థాయిలో చెక్ పెడతామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. -
160 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, పశ్చిమ గోదావరి: నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద పోలీసుల వాహన తనిఖీలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి గుట్టు రట్టయింది. నర్సీపట్నం నుంచి హైదరాబాదు 80ప్యాకెట్లలో దాదాపు 160కిలోల గంజాయిని నీలిరంగు క్రిటా కారులో తరలిస్తుండుగా గురువారం సాయంత్రం పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. ఈగంజాయి అక్రమ రవాణాలో ఒక మహిళ, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న టీఎస్ 07 యూహెచ్ 3658 నీలిరంగు క్రిటా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఈ కారు నర్సీపట్నం నుంచి బయలుదేరి తణుకు, తాడేపల్లిగూడెం బైపాస్ మీదుగా వెళ్తుండుగా చేబ్రోలు వద్ద వాహన తనిఖీలు జరుగుతున్నట్టు ఈ ముఠాకు సమాచారం అందడంతో తాడేపల్లిగూడెం రూరల్ మండలం నుండి తెలికిచెర్ల–అనంతపల్లి–కొయ్యలగూడెం మీదుగా ఖమ్మం వెళ్ళేందుకు ప్లాను చేసుకున్నారు. అనంతపల్లి సెంటర్లో కారును రోడ్డుపక్కన పెట్టి టీ తాగేందుకు ఆగారు. అటుగా వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ళు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో విషయం బయటపడింది. తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు, నల్లజర్ల ఎస్ఐ కె.చంద్రశేఖర్ కేసునమోదు చేసారు. ముద్దాయిలను అరెస్టు చేయాల్సి ఉంది. -
గిరి కింద నా సామీ!
సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం గంజాయి రవాణా, విక్రయాలకు అడ్డాగా మారిందా? నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రాన్ని సురక్షిత స్థావరంగా గంజాయి స్మగ్లర్లు భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వచ్చేలా వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇక్కడ గంజాయి పట్టుబడింది. గత ఆదివారం స్థానిక సినిమాహాలు సెంటర్లోని సత్యదేవ లాడ్జిపై దాడి చేసిన పోలీసులు 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వనపర్లి భరత్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆ విషయం ఇంకా మరచిపోకముందే శుక్రవారం ఉదయం అన్నవరం శివార్లలోని మండపం సెంటర్ వద్ద ఆటోలో తరలిస్తున్న 40 కేజీల గంజాయిని అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయిను తరలిస్తున్న విశాఖ జిల్లాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. రూ.లక్ష విలువైన 40 కేజీల గంజాయి స్వాధీనం ఆటోలో గంజాయి తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు అన్నవరం జాతీయ రహదారిపై మండపం సెంటర్ వద్ద ఓ ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో 22 ప్యాకెట్లలో తరలిస్తున్న 40 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు ప్రత్తిపాడు సీఐ ఏ సన్యాసిరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.లక్ష ఉంటుందని తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ ఆటోలో గంజాయిని తరలిస్తున్న విశాఖ జిల్లాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చింతపల్లి మండలం కోడగుమ్మాల గ్రామానికి చెందిన తెంబెల్లి ప్రసాద్, అదే గ్రామానికి చెందిన పాంగి యోహన్ కుమార్, అరకులోయ మండలం గొందివలస గ్రామానికి చెందిన పొంగి బంగార్రాజు, కొయ్యూరు మండలం మరిపాలెం గ్రామానికి చెందిన పోలిన నరసింహమూర్తి, అదే మండలంలోని కొండిసంత మూల పేట గ్రామానికి చెందిన కోలా అప్పారావు, మాకవారి పాలెం గ్రామానికి చెందిన పళ్యా నాగరాజు ప్రయాణికుల్లా ఆటోలో ఉండి గంజాయి తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని తెలిపారు. వీరు గంజాయిని చెన్నైకు తరలిస్తున్నట్టు తెలిపారని సీఐ వివరించారు. పట్టుబడిన వారందరూ గంజాయి రవాణా చేసేవారేనని తేలిందని తెలిపారు. వీరికి అసలు వ్యాపారులు తెలియదని, అప్పగించిన పని పూర్తి చేయడం వరకే వీరి భాధ్యత అని తెలిపారు. వీరిపై మాదకద్రవ్యాల తరలింపు చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు తెలిపారు. చాలామంది అమాయకులు కూలి డబ్బులకు ఆశపడి గంజాయి రవాణా చేస్తున్నారని తెలిపారు. గుట్కా, ఖైనీ ప్యాకెట్టు అమ్మినా కేసు తప్పదు గుట్కా, ఖైనీ ప్యాకెట్లు అమ్మినా, కలిగి ఉన్నా కేసు తప్పదని సీఐ ఏ సన్యాసిరావు తెలిపారు. ఈ నెల మూడో తేదీన జాతీయరహదారిపైన ఒక పాన్‌షాపులో విక్రయిస్తున్న 2,200 గుట్కా, విమల్, రాజీ ఖైనీ, ఏ1, ఎన్సీ, చైనా ఖైనీ పాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ షాపు యజమాని మలిరెడ్డి నాగేశ్వరరావు పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సమావేశంలో అన్నవరం ఎస్సై మురళీమోహన్, ఇతర పోలీసులు పాల్గొన్నారు. -
రూ. 1.88 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : నగర శివార్లలో భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 944 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు 1.8 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. కొబ్బరి కాయల లోడ్ ముసుగులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. -
మూడు రోజులు..రెండున్నర కోట్లు
సాక్షి, జయపురం: స్థానిక పట్టణ పరిధిలో దాదాపు మూడు రోజుల వ్యవధిలో పలు కేసుల్లో సుమారు రూ.2.5 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారిణి సాగరిక నాథ్ విలేకరుల సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. గత రెండు రోజుల వ్యవధిలో జయపురం, బొరిగుమ్మ, బొయిపరిగుడ పోలీస్స్టేషన్ల పరిధుల్లో సుమారు 1015 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఒక యువతి సహా దాదాపు 11 మంది నిందితులను అరెస్టు చేశామని ఆమె వెల్లడించారు. మల్కన్‌గిరి జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన గంజాయిను ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నారని ఆమె వివరించారు. విజయవాడ–రాంచీ కారిడార్‌లో గురువారం జరిపిన పోలీసుల తనిఖీల్లో దాదాపు 110 కేజీల గంజాయి పట్టుబడిందని ఆమె తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌కు చెందిన దాదాపు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో చందన నమాలి(25), అనూప్ గౌతమ్, హరిశంకర దువన్యాన్, స్థానికుడైన విష్ణు సాహు ఉన్నారని తెలిపారు. అలాగే అంబాగుడ సమీపంలో ఒక వాహనం ఒక వ్యక్తిని ఢీకొని వెళ్లిపోయిందన్న స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు నిందితులు పరారీ కాగా, వాహనంలోని సుమారు 280 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసు నుంచి తప్పించుకున్న వారిలో అనుగూలు వాసి భజనన్ సాహు, మల్కన్‌గిరికి చెందిన రామ ఖెముండులుగా పోలీసులు గుర్తించారు. 10 బస్తాల్లో.. అలాగే జయపురం సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 26వ నంబర్ జాతీయ రహదారిలో నిర్వహించిన తనిఖీల్లో 10 బస్తాల్లో తరలిస్తున్న గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాష్నాయి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాకేష్‌కుమార్ బర్మన్, రాజవిశ్వ బర్మలను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2500 నగదు, 2 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బొయిపరిగుడలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు 400 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌కుమార్, టింకు కుమార్, మురతధజ్ శుక్లాలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ గంజాయి మల్కన్‌గిరి–కొరాపుట్ ప్రాంతాల నుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆమె వెల్లడించారు. గంజాయి తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. సమావేశంలో జయపురం పట్టణ పోలీసు అధికారి బాలేశ్వర గిడి, సదర్ పోలీసు అధికారి ధిరెన్ కుమిర్ బెహరా, అంబాగుడ పంటి అధికారి నారాయణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ముమ్మరం చేసిన ఎక్సైజ్, పోలీస్ యంత్రాంగానికి పెద్దఎత్తున గంజాయి పట్టుబడుతోంది. జిల్లాలోని బిసంకటక్ ప్రాంతంలో భారీగా గంజాయి తరలిస్తున్న వాహనాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా గురువారం జరిపిన తనిఖీల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, వాటిల్లో తరలిస్తున్న సుమారు 193 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం జరిపిన వాహన తనిఖీల్లో దాదాపు 100 కేజీల గంజాయి తరలిస్తున్న ఒక కారును పోలీసులు పట్టుకున్నారు. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయికి రక్షణగా నలుగురు వ్యక్తులు మోటారు సైకిల్‌తో ప్రయాణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయమై ఆ నలుగురు వ్యక్తులను పట్టుకుని, విచారణ చేపట్టగా వారంతా పద్మపూర్, గజపతి, పుటాసింగి, గుణుపురం, మునిగుడ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారి వద్ద ఉన్న సెల్ఫోన్ల ఆధారంగా గంజాయి దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఐఐసీ అధికారి జశ్వంత్ హీయల్ తెలిపారు. అయితే ముఖ్యంగా యువతకు ఉపాధి లేకపోవడంతో పాకెట్ మనీ కోసం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను యువత అన్వేషిస్తోందని, ఈ క్రమంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేలా చేస్తే చాలావరకు ఇలాంటి దుశ్చర్యలను అరికట్టవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. -
భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. ఇబ్బడిముబ్బడిగా నగరంలో పలుచోట్ల గంజాయి దొరకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కూకట్పల్లి పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి మెట్రో దగ్గర్లో ఎర్రెల్లి రాజు అనే గంజాయి సరఫరాదారుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద పన్నెండున్నర కిలోల గంజాయిని మేడ్చల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హయత్‌నగర్‌లో గంజాయి ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని హయత్‌నగర్‌లో ఓ గంజాయి ముఠా గుట్టు రట్టైంది. శుక్రవారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుమారు ఏడు క్వింటాళ్ల గంజాయిని పట్టుకుని, ఓ లారీని సీజ్ చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా... మరికొంత మంది పరారీలో ఉన్నారు. -
ఆరు కిలోల ఎండు గంజాయి పట్టివేత
నారాయణఖేడ్: మండలంలోని అనంతసాగర్ గ్రామంలో కుమ్మరి పుండ్లిక్ ఇంటిపై దాడి చేసి ఆరు కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన కుమ్మరి పుండ్లిక్ ఇంటిపై దాడి చేసినట్లు తెలిపారు. అతడి ఇంటిలో ఆరు కిలోల 100 గ్రాముల ఎండుగంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు న మోదు చేసినట్లు చెప్పారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కేసును ఖేడ్ ఎక్సైజ్ సీఐ మహేష్, ఎస్ఐ కిరణ్‌కుమార్ గౌడ్లకు అప్పగించామని సీఐ వివరించా రు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుళ్లు అలీం, సిద్ధయ్య, జాకబ్, సోమయ్య పాల్గొన్నారు. -
గంజాయి మాఫియా గుట్టురట్టు
సాక్షి, బరంపురం: ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు అక్రమంగా కారులో గంజాయిని రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి మాఫియా ముఠాను గంజాం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి కారు, 244 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని దిగపండి పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె.నువగాం పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి సుజిత్ నాయక్ మాట్లాడుతూ గంజాం, గజపతి జిల్లాల సరిహద్దుల్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని హైదరాబాద్ నుంచి అద్దెకు తీసుకున్న కారులో 244 కిలోల గంజాయి ప్యాకెట్లను ఎక్కించుకుని ఒడిశా-ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు తరలిస్తుండగా కె.నువగాం పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేశారన్నారు. అరెస్టయిన వారి దగ్గర నుంచి కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిని గొళంతరాకు చెందిన రవీంద్ర గౌడ, కె. నువగాంకు చెందిన విద్యాధర్ ప్రధాన్, మహేష్ దేశాయి, ముంబైకి చెందిన మోహిత్ వర్మ, సూరజ్ విజయ్ మిశ్రాలుగా గుర్తించామని ఐఐసీ తెలియజేశారు. -
పట్టుబడ్డ గంజాయి
-
పట్టుబడ్డ గంజాయి
గంట్యాడ(గజపతినగరం): గంజాయిని అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు సరికొత్త ప్రయోగం చేసి మరోసారి పోలీసులకు పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి, గిరిజన ప్రాంతాల మీదుగా అరుకు, అనంతగిరి, బొడ్డవర, గంట్యాడ మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు గంజాయి అక్రమ రవాణా దందా కొన్నాళ్లుగా కొనసాగుతుంది. దీనిపై నిఘా పెంచిన గంట్యాడ పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గురువారం గంట్యాడలో వాహనాల తనిఖీలలో భాగంగా కొబ్బరి బొండాల లోడుతో వస్తున్న లారీ, ముందు, వెనుక వెళ్తున్న మరో మూడు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు పరారీ అయ్యేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జన సంచారం ఎక్కువ కావడంతో కొందరు నిందితులు వాహనాలను విడిచిపెట్టి తప్పించుకు పారిపోయారు. కొబ్బరి బొండాల లోడుతో ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేయగా బొండాల కింద 21 బస్తాలతో ఉన్న 800 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకొని సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ పి.నారాయణరావు విచారణ చేపట్టారు. గంజాయి నిల్వలను, వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. తేడాలు రావడంతోనే... కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా ఇటీవల తరచుగా పోలీసులకు పట్టుబడుతుంది. దీనికి వ్యాపారుల మధ్య విభేదాలే కారణమని తెలియవచ్చింది. గతంలో పాడేరు, సీలేరు మీదుగా ఆంధ్రా, తెలంగాణ మీదుగా గుట్టు చప్పుడు కాకుండా దందా జరిపేవారు. ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం కావడంతో రోజుకో మార్గంలో ఇప్పుడు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో సుమారు ఐదు వేల కిలోల గంజాయి పట్టుబడిందంటే వీటి రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధమవుతుంది. గంట్యాడ మండలంలో ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులో సుమారు 850 కిలోల గంజాయి పట్టుబడింది. ఇప్పుడు మళ్లీ ఇలా దొరకడంతో సంచలనమైంది.