gv Prakash Kumar
-
'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్
గతవారం దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కిరణ్ అబ్బవరం 'క', దుల్కర్ 'లక్కీ భాస్కర్' లాంటి తెలుగు మూవీస్‌తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'అమరన్' కూడా హిట్‌గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్ లేకుండా తెలుగులోనూ రిలీజైనప్పటికీ జనాలకు నచ్చేసింది.ఇప్పటికే 'అమరన్' మూవీకి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయిపల్లవి తమదైన యాక్టింగ్‌తో కట్టిపడేశారు. కంటెంట్ కూడా అంతకు మించి అనేలా క్లిక్ అయింది. 'హే రంగులే' లాంటి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్.. సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన జీవీ ప్రకాశ్ కుమార్‌కి హీరో శివకార్తికేయన్ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దాదాపు రూ.3 లక్షల విలువ చేసే టీఏజీ హ్యూయర్ మెన్స్ ఫార్ములా 1 బ్రాండ్‌కి చెందిన స్టెయిన్ లెస్ స్టీల్ స్టైలిష్ వాచీని తనకు ఇచ్చినట్లు జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా హీరోకి థ్యాంక్స్ చెప్పాడు.కశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా 'అమరన్' సినిమా తీశారు. ట్రైలర్ రిలీజైనప్పుడు అడివి శేష్ 'మేజర్'తో పోల్చి చూశారు. కానీ మూవీ రిలీజైన తర్వాత అలాంటివేం వినిపించలేదు. (ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ) -
ఆ అంశాలు ఆకట్టుకుంటాయి: జీవీ ప్రకాష్ కుమార్
‘‘మట్కా’ సినిమా నేను చూశాను. చక్కని యాక్షన్ ఫిల్మ్. అద్భుతమైన కథ, నటన, డైరెక్షన్.. ఈ అంశాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వరుణ్ తేజ్‌గారు ఈ సినిమా కోసం తన కెరీర్లోనే బెస్ట్‌గా నటించారు. ఈ చిత్రం కచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిం చిన చిత్రం ‘మట్కా’.కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ కథకే. ఆ తర్వాత డైరెక్టర్ గురించి ఆలోచిస్తాను. కరుణ కుమార్‌గారు అద్భుతమైన డైరెక్టర్. ‘మట్కా’ పీరియాడికల్ స్టోరీ. మ్యూజిక్ కూడా అదే తరహాలో తీసుకురావడం నాకు పెద్ద సవాల్‌గా అనిపించింది.ఈ మూవీలో రెట్రో జోన్లో చేసిన ‘లేలే రాజా..’ పాట నాకు చాలా ఇష్టం. నిర్మాతలు పెద్ద బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. నెలలో 12 రోజులు నటన కోసం కేటాయిస్తాను. మిగతా రోజులన్నీ సంగీతం కోసం కేటాయిస్తాను. తెలుగులో ‘దసరా’ సినిమాలో ఒక పాత్ర చేయాల్సింది. కానీ, నా డేట్స్ కుదరలేదు. మంచి కథ, క్యారెక్టర్ ఉంటే తెలుగులో నటిస్తాను. వ్యక్తిగతంగా ప్రేమకథలకు సంగీతం ఇవ్వడం నాకు ఇష్టం’’ అన్నారు. -
గోల్డెన్ స్పారో
నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్, ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ‘గోల్డెన్ స్పారో’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలోనే ప్రియాంక, జీవీ ప్రకాష్ అతిథులుగా కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది: జీవీ ప్రకాశ్‌కుమార్
‘‘టెక్నాలజీని మనం ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించి కొందరు ప్రముఖ సంగీత దర్శకులు చేసిన సంగీతం, పాటలు శ్రోతలను ఎందుకు మెప్పించలేకపోయాయి? అనే విషయాలపై నేను మాట్లాడను. కానీ సినిమా స్క్రిప్ట్, అందులో నుంచి వచ్చే సందర్భాలపైనే సంగీత దర్శకులు ఇచ్చే సంగీతం ఆధారపడి ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్. విక్రమ్ హీరోగా నటించిన తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘తంగలాన్’. పా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జీవీ ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ కథ ప్రధానంగా ట్రైబల్స్ నేపథ్యంలో ఉంటుంది. దాంతో ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్ ట్రైబ్స్‌కు చెందిన సంగీతాన్ని కూడా పరిశీలించాను.సినిమా సంగీతానికి, ట్రైబల్స్ సంగీతానికి మధ్యలో నేను ఓ వారధిగా ఉంటూ ఈ సినిమా మ్యూజిక్‌ను ప్రేక్షకులకు చేరువ చేయడం సవాల్‌గా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. విక్రమ్‌గారితో ఇది నా మూడో సినిమా. నా సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్, ఆకాశం నీ హద్దురా!’ లాంటి మ్యాజిక్ ‘తంగలాన్’తో రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను’’ అని అన్నారు. -
విడాకుల తర్వాత మళ్లీ అలా కలిసిన జీవీ ప్రకాశ్, సైంధవి
కోలీవుడ్ యంగ్ హీరో వేమల్ నటించిన SIR సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ విడుదలైంది. బోస్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేమల్తో పాటు ఛాయా దేవి కన్నన్, శరవణన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సాంఘిక డ్రామాగా ఈ చిత్రాన్ని ఎస్ఎస్ఎస్ పిక్చర్స్ పతాకంపై సిరాజ్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందించారు.ఎస్ఐఆర్ (SIR) చిత్రం నుంచి తాజాగా విడుదలైన సాంగ్ కోలీవుడ్‌లో భారీగా వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం జీవీ ప్రకాశ్, ఆయన మాజీ సతీమణి సైంధవి అని చెప్పవచ్చు. వీరిద్దరు కొద్దిరోజుల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసింది. ఆ సమయంలో వారిపై భారీగా ట్రోల్స్ వచ్చాయి. కానీ, వాటిని సున్నితంగానే ఇద్దరూ తప్పుపట్టారు. అయితే, విడాకులు తీసుకున్న తర్వాత జీవీ ప్రకాశ్, సైంధవి కలిసి ఎస్ఐఆర్ (SIR) సినిమా కోసం ఒక పాటకోసం తమ గొంతు కలిపారు. వారిద్దరూ కలిసి పాడిన ఆ సాంగ్ ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 2025లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది.ఈ ఏడాది మే నెలలో సైంధవి, జీవీ ప్రకాశ్ విడిపోతున్నట్లు తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆ సమయంలో ప్రకాశ్ ఇలా చెప్పాడు 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మా ఇద్దరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు. -
విడాకులపై ట్రోల్స్.. అంత దిగజారిపోయారా? అన్న నటుడు
ఇటీవలే కోలీవుడ్ స్టార్ జీవీ ప్రకాశ్ కుమార్, అతని భార్య, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చారు. ఈ సందర్భంగా తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ప్రైవసీకి గౌరవించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ జంటపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే దీనిపై జీవీ ప్రకాశ్ రియాక్ట్ అయ్యారు. తమ విడాకుల విషయంలో కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. ఇద్దరు వ్యక్తులు కలవడం, విడిపోవడంపై సరైన అవగాహన లేకుండా ప్రజలు చర్చించుకోవడం మంచిది కాదు. సెలబ్రిటీలు అనే కారణంతో వ్యక్తిగత జీవితాలపై ఊహాగానాలు రావడం దురదృష్టకరం.. ఇవీ తమకు చాలా ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడం, వారి గురించి కామెంట్స్ చేయడం ఆమోదయోగ్యం కాదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఊహాజనిత కథనాలు ఆ వ్యక్తులపై ప్రభావం చూపుతాయని గ్రహించలేనంతగా తమిళుల సద్గుణాలు దిగజారిపోయాయా?" అని జీవీ ప్రకాశ్ ప్రశ్నించారు. దీనిపై తమిళంలో సుదీర్ఘమైన నోట్‌ను తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.జీవీ ప్రకాశ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. మా ఉద్దేశ్యంతో సంబంధం లేకుండా మీరు చేసే కామెంట్స్ బాధ కలిగించేవిగా ఉన్నాయని చెప్పడానికే ఈ పోస్ట్ చేస్తున్నా. దయచేసి అందరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు. View this post on Instagram A post shared by G.V.Prakash Kumar (@gvprakash) -
11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన సినీ ఇండస్ట్రీ కపుల్ (ఫొటోలు)
-
తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓవైపు సంగీత దర్శకుడిగా, మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. అతడు ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కల్వన్. దీన్ని తెలుగులో చోరుడు పేరిట రిలీజ్ చేయాలని భావించారు. ఈ మేరకు గతేడాది ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వదిలారు. ఇవానా, భారతీరాజా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశే సంగీతం అందించాడు. ఓటీటీ రిలీజ్ డేట్ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తెలుగులో రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మే 14 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నట్లు హాట్‌స్టార్ ప్రకటించింది. అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారికోసం సింప్లీ సౌత్, టెన్కోట్టా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ మూవీ మే 10 నుంచి అందుబాటులోకి రానుంది.ఈ విషయాన్ని వెల్లడిస్తూ టీజర్ కూడా వదిలారు. కల్వన్ సినిమా విషయానికి వస్తే పీవీ శంకర్ దర్శకరచయితగా వ్యవహరించడంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గానూ పని చేశాడు. ఢిల్లీ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సాన్ లోకేశ్ ఎడిటర్‌గా వ్యవహరించాడు.Tamil film #Kalvan @disneyplusHSTam / @Tentkotta / @SimplySouthApp 🎬💥 pic.twitter.com/PbSz2PXu9E— Tamilmemes3.0 (@tamilmemes30) May 7, 2024 -
సూర్య మూవీ వాయిదా.. విక్రమ్ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం!
తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2010లో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన సుధా కొంగర, 2016లో మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంతో సంచలన విజయాన్ని సాధించారు. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్ రియల్ బాక్సర్ రిత్వికాసింగ్ను కథానాయకిగా పరిచయం చేశారు. ఆ తరువాత అదే చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. కాగా 2022లో సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది.ప్రస్తుతం అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కాగా తదుపరి మరోసారి సూర్య హీరోగా పురనానూరు పేరుతో చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మరింత సమయం అవసరం కావడంతో వాయిదా వేసినట్లు, నటుడు సూర్య, దర్శకురాలు సుధాకొంగర సంయుక్తంగా ఓ ప్రకటనను ఇటీవల మీడియాకు విడుదల చేశారు. దీంతో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. అయితే ఇది ఏ బ్యానర్లో రూపొందనుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? వంటి వివరాలు తెలియా ల్సి ఉంది. కాగా ప్రస్తుతం నటుడు ధ్రువ్ విక్రమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
2 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న గురక సినిమా
మరో డబ్బింగ్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మొన్నే రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా రెండు వారాలు తిరగకుండానే అందుబాటులోకి రానుంది. ఇదే ఇక్కడ షాకింగ్‌గా అనిపిస్తుంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చూసిన ప్రేక్షకులు.. ఇంత మాత్రం దానికి థియేటర్లలో రిలీజ్ ఎందుకు చేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఇదే మూవీ? ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందనేది చూద్దాం.తమిళంలో గతేడాది రిలీజైన సినిమా 'గుడ్ నైట్'. గురక వల్ల కొత్తగా పెళ్లయిన జంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్ని ఎంటర్టైనింగ్గా చూపించారు. ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో హిట్ అయింది. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తో తీసిన మరో తమిళ సినిమా 'డియర్'.ఏప్రిల్ 11న 'డియర్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. దాదాపుగా 'గుడ్ నైట్' కథతోనే తీశారు. దానికి తోడు కనీసం ఎంటర్టైన్ చేసే సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. దీంతో సినిమా ఫట్ అయింది. వారం తిరక్కుండానే థియేటర్ల నుంచి మాయమైంది. మరోవైపు ఏప్రిల్ 28 అంటే ఈ ఆదివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అని ప్రకటించేశారు. దీంతో మరీ 17 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురావడం ఏంట్రా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.'డియర్' కథ విషయానికొస్తే.. న్యూస్ రీడర్ అవ్వాలనుకునే అర్జున్ (జీవీ ప్రకాశ్).. చిన్న శబ్దాలకు కూడా నిద్రలో నుంచి లేచిపోయే సమస్యతో బాధపడుతుంటాడు. మరోవైపు గురక సమస్యతో బాధపడుతూ ఉంటుంది దీపిక (ఐశ్వర్యా రాజేశ్). ఒకరి సమస్యలు మరొకరికి తెలియకుండా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏమైంది అనేదే కథ. -
DeAr Movie Review : గురక కాన్సెప్ట్‌తో వచ్చిన ‘డియర్’ ఎలా ఉందంటే?
టైటిల్: డియర్నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులునిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేనిదర్శకత్వం: ఆనంద్ రవించంద్రన్సంగీతం: జీవీ ప్రకాశ్విడుదల తేది: ఏప్రిల్ 12, 2024అర్జున్(జీవీ ప్రకాశ్ కుమార్) ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్(కాళి వెంకట్), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్‌కి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్‌కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి. అర్జున్ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్‌కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొత్త పాయింట్‌తో ఓ సినిమా వచ్చి..అది సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్‌తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్‌నైట్’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్’.‘గుడ్‌నైట్’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్‌నైట్ సినిమాలో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్‌గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో హీరో పేరేంట్స్ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు.పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు. ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్‌కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్‌గా అయినా చూపించారా అంటే అదీ లేదు. తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్‌గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్ మరింత సాగదీతగా ఉంటుంది. పేరెంట్స్‌ని కలిపే ఎపిసోడ్ మెయిన్ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గుడ్‌నైట్ సినిమా చూడనివారిని ఈ సినిమా కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్‌గా జీవీ ప్రకాశ్ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్ పాత్రే. కాళీ వెంకట్, ఇళవరసుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అర్జున్‌కి కనెక్ట్ అయ్యా!
‘‘ఓపెన్ చేస్తే వైజాగ్‌లో అందమైన ఇల్లు...’’ అంటూ నాగచైతన్య ఇచ్చిన వాయిస్ ఓవర్‌తో మొదలైంది ‘డియర్’ చిత్రం ట్రైలర్. జీవీ ప్రకాశ్‌కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన చిత్రం ‘డియర్’. తమిళంలో ఈ నెల 11న, తెలుగులో 12న ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి. పృథ్వీరాజ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంధ్రాలో అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణలో ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. భార్య (ఐశ్వర్యా రాజేశ్) గురక కారణంగా భర్త (జీవీ ప్రకాశ్) సతమతమవుతుంటాడు. ఆ గురక కారణంగా వారి అనుబంధంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది ‘డియర్’ కథాంశం. ‘‘ఈ ప్రపంచంలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? రాత్రిపూట మంచి నిద్ర. ఈ కథను (‘డియర్’కి ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని ఉద్దేశించి) నెరేట్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్ (జీవీ ప్రకాశ్ పాత్ర) భయానికి నేను కనెక్ట్ అయ్యాను. మీరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో ‘డియర్’ ట్రైలర్‌ని షేర్ చేశారు నాగచైతన్య. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
భార్య గురక పెడితే... ఫన్నీగా సినిమా ట్రైలర్
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'డియర్'. తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. నాగ చైతన్య వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ నూతన వధూవరుల పాత్రల్లో జివి ప్రకాష్ కుమార్ , ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో స్నీక్ పీక్ ఇస్తుంది. గుడ్‌నైట్ సినిమాలో భర్తకు గురక ఉంటే ఇక్కడ భార్యకు గురక ఉంది. ఈమె గురక అలవాటు కారణంగా రిలేషన్ షిప్ కాంప్లికేటెడ్ గా మారిన కథాంశం సరికొత్తగా అనిపిస్తుంది. నాగ చైతన్య వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. జగదీష్ సుందరమూర్తి కెమెరా బ్రిలియంట్ గా వుంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామిక్ కోణాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేయనుంది. డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలలో నటించారు. -
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో జతకట్టిన టాలీవుడ్ హీరో కూతురు!
తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరచుకున్న దర్శకుడు పా.రంజిత్. ఆయన చిత్రాల్లో సామాజిక దృక్ప థం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూనే కమర్షియల్ అంశాలు యాడ్ చేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆయనను మించినవారు ఉండరు. ఒకవైపు దర్శకుడిగా రాణిస్తూనే నీలం ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి.. తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథాచిత్రాలను నిర్మిస్తున్నా రు. ఇంతకుముందు దర్శకుడు మారి సెల్వరాజ్ వంటి సక్సెస్ పుల్ దర్శకులను పరిచయం చేశారు. తాజాగా తన మరో శిష్యుడు అకిరన్ మోసెస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో అతనికి జంటగా టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ నటిస్తున్నారు. శ్రీనాథ్ బాజీ, లింగేష్, విశ్వంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్ నిర్మిస్తున్నారంటే ఆ చిత్రానికి కచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆయన రూపొందిస్తున్న చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించడం మరో విశేషం. వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి కథ, తదితర వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తంగలాన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. A start to a new chapter✨ The shoot for our next production begins today with bright smiles and fond memories🎆 Written and directed by @AkiranMoses Produced by @beemji #NeelamProductions Starring @gvprakash @Rshivani1@sreenathbhasi @PasupathyMasi @LingeshActor @EditorSelva… pic.twitter.com/P5KrELtXGX — Neelam Productions (@officialneelam) February 29, 2024 -
కోట్లు ఇస్తామన్నా రిజెక్ట్ చేశా.. హీరో
చల్లని పానీయాల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానన్నా తాను అంగీకరించడం లేదని నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు జీవీ ప్రకాష్‌కుమార్ తెలిపారు. సినీ రంగంలో ప్రతిభను ప్రోత్సహించే విధంగా నరేష్ బృందం స్టార్డా అనే సరికొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. దీనికి జీవీ ప్రకాష్‌కుమార్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నెలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలోనే చిత్ర రంగ ప్రవేశం చేశానన్నారు. హీరోగా 23 సినిమాలు చేశా పలు చిత్రాలకు సంగీతాన్ని అందించానని, అదే విధంగా కథానాయకుడిగా 23 చిత్రాలు చేశానన్నారు. వెట్రిమారన్, ఏఎల్ విజయ్, అట్లీ వంటి పలువురు దర్శకులతో తొలి రోజుల్లో తాను పనిచేసినట్లు చెప్పారు. పనిచేసిన దర్శకుల్లో 17 మంది కొత్త వారేనన్నారు. ఇక్కడ ప్రతిభకు కొరత లేదని, అయితే దానిని ప్రదర్శించడానికి సరైన మార్గం చాలా మందికి తెలియడం లేదన్నారు. ఇలాంటి వారికి ఈ స్టార్డా మంచి ప్లాట్‌ఫామ్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జూదం, కూల్ డ్రింక్స్.. నో! ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసిన నరేష్ బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. శీతల పానీయాలు, జూదం ఆడటం వంటి సంస్థల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానంటున్నారని, అయినా తాను వాటిలో నటించడానికి అంగీకరించడం లేదన్నారు. ఈ స్టార్డా ప్లాట్‌ఫామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని జీవీ ప్రకాష్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: వాలంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్ -
హీరోగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. రిలీజ్ ఎప్పుడంటే?
సంగీతదర్శకుడిగా, కథానాయకుడిగా సక్సెస్ఫుల్ పయనం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జీవీ.ప్రకాశ్‌కుమార్. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో రెబల్ ఒకటి. నూతన దర్శకుడు నికేశ్ ఆర్ఎస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్ విద్యార్థిగా చాలా పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో సంభాషణలు, జీవీ.ప్రకాశ్‌కుమార్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక రెబల్ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా మిలియన్ల సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో మమతా బైజూ, కరుణాస్ సుబ్రమణియ శివ, షాలూ రహీమ్, వెంకటేశ్. వీపీ, ఆదిత్య భాస్కర్, కల్లూరి వినోద్, ఆదిరా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
డూడుం డుక్కుడుం బాగుంది
‘‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు–500143’ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాట బాగుంది. ఈ సాంగ్‌కి క్లాసికల్ టచ్ ఇవ్వడం బాగా నచ్చింది. ఈ సినిమాలోని ఇతర పాటలు ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ అన్నారు. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు– 500143’. కొవ్వూరి అరుణ సమర్పణలో బ్లాక్ యాంట్ పిక్చర్స్‌పై భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాటని జీవీ ప్రకాశ్ కుమార్ విడుదల చేశారు. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ఈ చిత్రానికి కెమెరా: నిఖిల్ సురేంద్రన్, నేపథ్య సంగీతం: కమ్రాన్. -
కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్.. గ్యాంగ్ ఆఫ్ వసీపూర్ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. నటుడిగానూ, పలు చిత్రాలలో యాక్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఇమైకా నొడిగల్ చిత్రంలో విలన్‌గా నటించి తన విలక్షణ నటనను ప్రదర్శించాడు. ఇటీవల విజయ్ కథానాయకుడిగా నటించిన లియో చిత్రంలోనూ చిన్న పాత్రలో మెరిశాడు. ఈయన దర్శకత్వం వహించిన కెన్నడీ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే దర్శకుడిగా ఈయన కోలీవుడ్ ఎంట్రీ షురూ అయినట్లు సమాచారం. ఈయన దర్శకత్వంలో జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. దీని గురించి జీవీ ప్రకాష్ కుమార్ ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌కశ్యప్ తనను హీరోగా నటించమని అడిగారన్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందన్నాడు. కాగా జీవీ ప్రకాష్‌కుమార్ ప్రస్తుతం నటుడిగా, సంగీత దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన రెబల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో పాటు 13, ఇడి ముళక్కమ్, కల్వన్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అదేవిధంగా సైరన్, సియాన్ విక్రమ్ 62వ చిత్రం, శివకార్తికేయన్ 21వ చిత్రం , సూర్య 43వ చిత్రం అంటూ సంగీత దర్శకుడిగానూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. చదవండి: 10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార -
మ్యూజిక్ డైరెక్టర్ కొత్త చిత్రం.. ఆసక్తిగా టైటిల్!
సంగీతం,నటనతో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా ప్రస్తుతం 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కింగ్‌స్టర్ అనే టైటిల్‌ను మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్‌కుమార్‌కు చెందిన పార్లర్ యూనివర్శల్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి కథ, దర్శకత్వం కమల్ప్రకాష్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో జీవీకి జోడీగా నటి దివ్యభారతి నటిస్తున్నారు. ఇంతకుముందు ఈ జంట నటించిన బ్యాచిలర్ మంచి విజయాన్ని సాధించింది. కింగ్‌స్టర్ చిత్రం షూటింగ్‌ను నవంబర్ 10వ తేదీ నటుడు కమలహాసన్ చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో జీవీ ప్రకాష్‌కుమార్ మత్స్యకారుడిగా నటించడం మరో విశేషం. సముద్రంలోని రహస్యాలను కనుగొనే యువకుడిగా ఈయన నటిస్తున్నారు. ఫుల్ కమర్షియల్ ఫార్మాట్లో రూపొందుతోంది. కథానాయకుడి గెటప్ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంది. దీంతో ఆయన అభిమానులు చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింగ్‌స్టర్ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
Rebel Teaser Out: హీరోగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త మూవీ.. టీజర్లో యాక్షన్ మాత్రం
ఆ మ్యూజిక్ డైరెక్టర్.. సంగీతం కంపోజ్ చేస్తూ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు హీరోగానూ డిఫరెంట్ చిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. అలా ఓ వైపు స్టార్ హీరోల మూవీస్ కి పనిచేస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్.. ఇప్పుడు 'రెబల్' అనే కొత్త మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన జీవీ.. 'రెబల్'తో యాక్షన్ ట్రీట్ ఇచ్చాడు. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!) స్టూడియో గ్రీన్ పతాకంపై కే.జి.జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సరసన మమిత బైజు హీరోయిన్గా నటిస్తోంది. కరుణాస్, సుబ్రమణి శివ, షాలు రహీం తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూనే సంగీతం కూడా అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. హీరో సూర్య.. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. View this post on Instagram A post shared by G.V.Prakash Kumar (@gvprakash) ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్.. పంచెకట్టు, చేతిలో కత్తితో సరికొత్తగా కనిపించాడు. టీజర్ అంతా కూడా పోలీస్ స్టేషన్ బయట ఓ ఫైట్ సీన్ చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాపై టీజర్ దెబ్బకు అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారు. (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) -
‘రెబల్’గా వస్తోన్న జీవీ ప్రకాష్
సంగీత దర్శకుడిగా, కథానాయకుడిగా యమా బిజీగా ఉన్నాడు నటుడు జీవీ ప్రకాష్ కుమార్. ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్, విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగలాన్, టాలీవుడ్ నటుడు రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా తాజాగా కథానాయకుడిగా కనిపించిన అడియే చిత్రం ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ పొందింది. తాజాగా జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రెబెల్. కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నికేష్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ జీవీ ప్రకాష్ కుమార్ మంగళవారం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందులో తమిళ సినీ పరిశ్రమలో ఇది గేమ్ చేంజ్ కథా చిత్రంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నవ దర్శకుడు ఎంతో నమ్మకంగా రెబల్ చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం పేరు వింటేనే ఇది యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని పిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ కమర్షియల్ ఎంటర్ టెయినర్ కథాచిత్రాల్లో నటించి చాలా కాలమే అయ్యింది. దీంతో ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. It’s a wrap for #rebel . Will be a game changer in tamil cinema . One promising director is on his way … thanks @kegvraja sir @NikeshRs @Arunkrishna_21 @NehaGnanavel @Dhananjayang @StudioGreen2 pic.twitter.com/A53pTsnRzs — G.V.Prakash Kumar (@gvprakash) October 2, 2023 -
10 ఏళ్ల తర్వాత అలా చేస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
దక్షిణాది సినిమాల్లో జీవీ ప్రకాశ్ కుమార్‌కు ఒక బ్రాండ్ ఉంది. చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, తన 25 ఏళ్లకే 25 చిత్రాలకు మ్యూజిక్ అందించి రికార్డు సాధించాడు. 'డార్లింగ్' మూవీతో హీరోగా మారాడు. అది హిట్ కావడంతో నటుడిగానూ సక్సెస్ అయ్యాడు. అలా మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ గా సత్తా చాటుతున్న జీవీ ప్రకాశ్ కుమార్.. 2013లో నిర్మాతగా ఓ సినిమా తీశాడు. (ఇదీ చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గవర్నర్ పదవి?) ఖదీర్-ఓవియా జంటగా విక్రమ్ సుకుమారన్ దర్శకత్వంలో 'మదయానై కూట్టం' అనే సినిమాని జీవీ ప్రకాశ్ కుమార్ నిర్మించాడు. కోటి రూపాయల బడ్జెట్ పెడితే.. రూ.15 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయినా మరో సినిమాని నిర్మించలేదు. అలాంటిది 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్త మూవీ నిర్మించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాని నిర్మిస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్.. హీరోగానూ నటిస్తున్నాడు. దీనికి 'కింగ్స్టన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది జీవికి నటుడుగా 25వ చిత్రం. కమల్ ప్రకాష్ అనే వ్యక్తి ఈ చిత్రానికి దర్శకుడు.త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: నామినేషన్స్‌లో రైతు బిడ్డ.. ఇంకా ఎవరున్నారంటే?) -
హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అలాంటి కాన్సెప్ట్!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్'. నట్ మెగ్ ప్రొడక్షన్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఆయిరమ్' ఫేమ్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా 'డియర్' షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది. 35 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసినట్లు నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'డియర్' స్టోరీ, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉన్నాయని అన్నారు. జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం, చిత్ర విడుదల తేదీని వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
సెంచరీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్, హీరోగా కొత్త సినిమా
సంగీత దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న బహుముఖ ప్రతిభాశాలి జీవీ ప్రకాష్ కుమార్. ఈయన అతి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు. అలా 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. వెయిల్ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా చిత్రం రంగప్రవేశం చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తమిళంలో డార్లింగ్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన జీవీ ప్రకాష్ కుమార్ మదయానై కూట్టం చిత్రం ద్వారా నిర్మాతగాను అవతారం ఎత్తారు. అలా సంగీత దర్శకుడిగా సెంచరీ కొట్టిన ఈయన కథానాయకుడిగా 25 చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు పరిచయం పరిచయం అవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ నిర్మాతగా కూడా వ్యవహరించనట్లు సమాచారం. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా జీవీ ప్రకాష్ కుమార్ 2013లో నిర్మాతగా మారి మదయానై కూట్టం చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ నిర్మాతగా చేస్తున్న చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: జైలర్‌కు తెలుగు సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు? -
శివ కార్తికేయన్, సాయి పల్లవి కొత్త సినిమా వేడుక (ఫొటోలు)