hashtag
-
సోషల్ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్,Cలు నిండిపోయాయి. సాధారణంగా ఎక్స్‌లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. లైవ్ సభల్లో టాప్.. ‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్‌లో ఎన్టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్‌పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనవడి కోసం వచ్చాను మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. – అద్దంకి వేదిక వద్ద ప్రైవేట్ డ్రోన్ ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. -
ట్రెండింగ్‌లో ‘సిద్ధం’
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియా (సామాజిక మధ్యమాలు)లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయింది. సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వైఎస్సార్సీపీ అభిమానులు భారీ ఎత్తున ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు చేశారు. జనసంద్రాన్ని తలపిస్తున్న ‘సిద్ధం’ సభా ప్రాంగణం, సభకు హాజరైన ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్న జనం ఫొటోలతో సామాజిక మాధ్యమాలు నిండిపోయాయి. వైఎస్ జగన్ ఎగైన్, ఎండ్ ఆఫ్ టీడీపీ హ్యాష్‌ట్యాగ్‌లతోనూ ‘సిద్ధం’ సభ విశేషాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ అభిమానులు హోరెత్తించారు. తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి మరోమారు దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. -
#HBDYSJagan : ట్రెండింగ్‌లో దుమ్ము రేపిన సీఎం జగన్ బర్త్‌డే విషెస్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ చరిష్మా ఏపాటిదో గురువారం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సీఎం పుట్టినరోజునాడు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రపంచ వ్యాప్తంగా అభినందల వెల్లువతో రికార్డులు సృష్టించింది. హెచ్‌బీడీ వైఎస్ జగన్ పేరుతో ఏర్పాటు చేసిన హ్యాష్ ట్యాగ్ ద్వారా ఎక్స్ (ట్విటర్) వేదికగా 3.50 లక్షల మందికి పైగా శుభాకాంక్షలు తెలుపడం ద్వారా ఇండియా ట్రెండింగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ జగన్ పుట్టిన రోజు సందేశం 18.1 కోట్ల మందికి చేరినట్లు ఎక్స్ గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డంకీ, సలార్ వంటి సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ఒక రాజకీయ పార్టీ అధినేత పుట్టిన రోజు ఇంత ట్రెండింగ్ కావడం విశేషం. 2 గంటల పాటు ఎక్స్ ఇండియా సర్వర్ షట్‌డౌన్ అయినప్పటికీ ఈ స్థాయిలో ట్వీట్లు రావడం గమనార్హం. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి పోస్ట్‌లు వెల్లువెత్తాయి. Twitter Is Back 😎 Lets Fill This TL With @ysjagan Anna Videos 🔥 Mine 👇👇 Qoute Yours 🫡#HBDYSJagan pic.twitter.com/SZjyPSiOmf — Satish Reddy (@ReddySatish4512) December 21, 2023 దీంతో ప్రపంచ వ్యాప్తంగా 5వ స్థానం, ఆసియాలోనూ 5వ స్థానంలో హ్యాపీ బర్త్‌డే వైఎస్ జగన్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ 55 నెలల పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చూపేలా రూపొందించిన ఫొటోను వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గురువారం విడుదల చేసింది. ఓ వైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలతో ఈ ఫొటో ఆకర్షణీయంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రం వైరల్ అయ్యింది. Next Level..🙏🏻 #HBDYSJaganpic.twitter.com/9RJbOHNZEU — 𝐴𝑎𝑛𝑎𝑛𝑦𝑎 𝑅𝑒𝑑𝑑𝑦 (@Ananyareddy_law) December 21, 2023 -
మెలోనీ ‘మెలోడీ’కి మోదీ ఫిదా
న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన ‘మెలోడీ’కి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నెటిజన్లంతా ఫిదా అయ్యారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానులిద్దరి మధ్య నడిచిన పోస్టులు వైరల్‌గా మారాయి. శుక్రవారం దుబాయ్‌లో కాప్28 సదస్సు సందర్భంగా వారిద్దరూ భేటీ కావడం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘కాప్28 సదస్సులో మంచి మిత్రులు’అనే క్యాప్షన్‌తో పాటు, తామిద్దరి పేర్లనూ అందంగా కలుపుతూ ‘మెలోడీ’అంటూ హాష్టాగ్ జత చేశారు. దాంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. చూస్తుండగానే దానికి ఏకంగా 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనికి మోదీ కూడా సరదాగా స్పందించారు. ‘మిత్రులతో కలయిక ఎప్పుడూ ఆహ్లాదకరమే’అనే క్యాప్షన్‌తో మెలోనీ సెల్ఫీని రీపోస్ట్ చేశారు. వారి పోస్టులు ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. జీ20 నుంచీ ట్రెండింగ్‌లోనే.. నిజానికి ‘మెలోడీ’ హా‹Ùటాగ్ గత నెలలో భారత్ తొలిసారి ఆతిథ్యమిచి్చన జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగినప్పటి నుంచీ ఇంటర్నెట్లో వైరలైంది. సోషల్ సైట్లలో తెగ తిరుగుతోంది. ఆ సదస్సు ఆద్యంతం మోదీ, మెలోనీ పరస్పరం స్నేహపూర్వకంగా మెలిగిన తీరు అందరి దృష్టినీ బాగా ఆకర్షించింది. ఆతిథ్య దేశ సారథిగా మిగతా దేశాధినేతలతో పాటు మెలోనీని కూడా మోదీ సాదరంగా సదస్సుకు ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆమె మోదీతో కరచాలనం చేశారు. కాసేపు ముచ్చటించుకుని ఇరువురూ నవ్వుల్లో మునిగి తేలారు. ఇదే ఒరవడి తాజాగా కాప్28 సదస్సులోనూ కొనసాగింది. -
మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని
న్యూఢిల్లీ: మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం, గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద మనకు గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం సాగించిన ప్రయత్నాల ఫలితంగానే మన యువతకు సంస్కృతితో బంధం బలపడిందని అన్నారు. శనివారం ఆయన ట్విట్టర్లో ‘9ఇయర్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ కల్చర్’పేరుతో హాష్‌ట్యాగ్ చేశారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు ట్వీట్లు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. -
నారీ శక్తికి సలాం: మోదీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో మహిళలు అమూల్య పాత్ర పోషిస్తున్నారంటూ కొనియాడారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. మన్ కీ బాత్‌లో క్రోడీకరించిన మహిళల స్ఫూర్తి గాథలను షేర్ చేశారు. నారీశక్తి ఫర్ న్యూ ఇండియా అంటూ హాష్‌ట్యాగ్ జత చేశారు. భారత మహిళల స్ఫూర్తిదాయకత్వంపై ‘హర్ స్టోరీ, మై స్టోరీ...’ శీర్షికతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాసిన వ్యాసాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు. ‘‘త్రిపుర నుంచి తిరిగొస్తూ వ్యాసం చదివా. ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. అతి సాధారణ స్థాయి నుంచి దేశ అత్యున్నత అధికార పీఠం దాకా ఎదిగిన ఒక స్ఫూర్తిదాయక మహిళ ప్రయాణాన్ని కళ్లకు కట్టిన ఆ వ్యాసాన్ని అందరూ చదవాలి’’ అని సూచించారు. అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ కూడా కొనియాడారు. -
‘గెట్‌అవుట్‌రవి’.. వాకౌట్ చేసిన గవర్నర్‌పై తమిళుల నిరసన గళం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగం పాఠాన్ని పలు చోట్ల విస్మరించడంతో వివాదం రాజేసింది. ద్రవిడ దిగ్గజాల పేర్లను ఆయన ప్రస్తావించకపోవడం, తమిళనాడు పేరు మార్చాలని వ్యాఖ్యనించటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవికి వ్యతిరేకంగా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ‘గెట్‌అవుట్‌రవి’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్లో పోస్టులు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. చెన్నైలో ట్విట్టర్ నంబర్ 1 ట్రెండింగ్ గెట్‌అవుట్‌రవి అనే పోస్టర్లు వెలిచాయి. పోస్టర్‌పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా డీఎంకే పార్టీ నేతల ఫోటోలతో పోస్టర్లు ఉన్నాయి. గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన వారికి డీఎంకే నేతలు కృతజ్ఞతలు తెలిపారు. This one is ultimate #GetOutRavi pic.twitter.com/Q1B080wW0N — Vignesh Anand (@VigneshAnand_Vm) January 9, 2023 ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ‘వాకౌట్’ -
ట్విట్టర్ లో వైఎస్ జగన్ బర్త్ డే ట్రెండింగ్
-
CM Jagan Birthday: ట్విటర్ టాప్ ట్రెండింగ్‌గా #HBDYSJagan
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ట్విటర్లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌గా వైఎస్ జగన్ బర్త్‌డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు దేశ, విదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4లక్షల ట్వీట్లు దాటాయి. Happy birthday to a truly magnificent leader @ysjagan anna. Your approach and passion to achieve what you set out to do for the people of Andhra Pradesh are so remarkable. you will be our forever inspiration and we stand by u till our last breath.#HBDYSJagan pic.twitter.com/nDAXudwGvm — Dr.Anil Kumar Yadav (@AKYOnline) December 21, 2022 ఇందులో భాగంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ట్విటర్లో సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 100K Tweets 🔥#HBDYSJagan pic.twitter.com/Mga1mdzrgP — Kodali Nani (@IamKodaliNani) December 20, 2022 కృతజ్ఞత చాటుకుంటున్న ప్రజలు.. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే నెరవేర్చారు. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! My heartiest birthday wishes to the young & dynamic @AndhraPradeshCM Sh Y.S. Jaganmohan Reddy. May blessings of Lord Venkateshwara always be upon you, and may you continue to take #AndhraPradesh to new heights of growth & development.#HBDYSJagan pic.twitter.com/9oFhE5yJCN — Parimal Nathwani (@mpparimal) December 21, 2022 వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్ జగన్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: (సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు) -
‘టిమ్‌కుక్’ను ట్రోల్ చేయాలనుకుంది, పాపం..అడ్డంగా దొరికిపోయిన గూగుల్?
అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థను, ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌ను కార్నర్ చేయాలని సెర్చ్ ఇంజిన్ గూగుల్ మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టి ట్రోలర్ చేతికి చిక్కింది. ఇంతకీ గూగుల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటని అనుకుంటున్నారా? యాపిల్ సీఈవో టిమ్ కుక్ కొత్త యాపిల్ ప్రొడక్ట్‌లను పరిచయం చేస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. #TakeNote అనే హ్యాష్ ట్యాగ్‌ను యాడ్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్‌ను తరచుగా ట్విట్టర్లో NBA ఫుట్‌బాల్ టీమ్ ఉటా జాజ్ ఉపయోగిస్తుందని పేర్కొన్నారు. యాపిల్ ప్రొడక్ట్ గురించి ట్వీట్ చేస్తూ #TakeNote,NBA టీం గురించి ఎందుకు ప్రస్తావించారనే విషయాన్ని వెల్లడించలేదు. ఆ ట్వీట్‌కు గూగుల్ స్పందించింది. గూగుల్ తన అఫీషియల్ ట్విట్టర్ నుంచి టిమ్‌కు రిప్లయి ఇచ్చింది. ఏమని? “హ్మ్మ్మ్ ఒకే ,నేను నిన్ను చూస్తున్నాను. #TakeNote @NBA అభిమానులు...#టిమ్ ఫిక్సెల్ మిమ్మల్ని మీకు ఇష్టమైన టీమ్‌కి చేరువ చేసేందుకు ఇక్కడ ఉంది. మీ NBA టీంను గుర్తించి అలెర్ట్ చేస్తుందంటూ సెటైర్లు వేసే ప్రయత్నం చేసింది. కానీ అక్కడే గూగుల్ ఇరుక్కుపోయింది. ఎందుకంటే గూగుల్ పై ట్వీట్ చేసి యాపిల్ ఐఫోన్‌తో. ఇది గమనించిన నెటజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి👉‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
World Emoji Day: సరదా నుంచి సందేశం వరకు...
అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి... కోవిడ్ సమయంలో... మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్‌కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఇమోజీలు తీసుకువచ్చింది. చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది. -
‘మోదీ హేట్స్ తెలంగాణ’: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ హేట్స్ తెలంగాణ’ అంటూ బుధవారం ట్యాగ్ చేసిన ట్వీట్లో మోదీ ప్రసంగం రెండు విషయాలను స్పష్టం చేసిందని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, ఇందులో టీఆర్ఎస్ పాత్ర లేదని మోదీ చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణకు బీజేపీ చేకూర్చిన ప్రయోజనం శూన్యమని, మొదటి నుంచీ బీజేపీ తెలంగాణ పట్ల ద్వేషభావాన్ని ప్రదర్శి స్తోందని విమర్శించారు. తెలంగాణ అమర వీరుల ఆత్మలు క్షోభించేలా, వారి త్యాగాలను కించపరిచేలా మోదీ వ్యాఖ్యలున్నాయని, ఆయన తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని తన ట్వీట్లో డిమాండ్ చేశారు. -
#JusticeforPunjabiGirl ట్రెండింగ్
#JusticeforPunjabiGirl ఈ హ్యాష్‌టాగ్ ఇప్పుడు ట్విటర్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. పంజాబ్ యువతికి న్యాయం చేయాలని నెటిజన్లు ట్విటర్ వేదికగా నినదిస్తున్నారు. పంజాబ్ అమ్మాయిని మోసం చేసిన వాడిని జైలు ఊచలు లెక్కించేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌పై రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. ‘రిప్లబిక్’ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లో జనసేన పార్టీ నాయకుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి సోమవారం స్పందించారు. టాలీవుడ్లో సినిమా అవకాశాల కోసం వచ్చిన పంజాబ్ యువతిని ప్రముఖ వ్యక్తి ఒకరు మోసం చేశాడని పోసాని వెల్లడించారు. అంతేకాకుండా ఈ విషయం బయటపెడితే చంపేస్తానని ఆమెను బెదిరించాడని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేస్తే పవన్‌కల్యాణ్‌కు గుడి కడతానని పోసాని మీడియా ముఖంగా ప్రకటించారు. పంజాబ్ యువతికి న్యాయం చేయించండి.. పవన్‌కల్యాణ్‌కు గుడి కడతా పోసాని ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. పంజాబ్ యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు పెట్టాలని, బాధితురాలికి న్యాయం చేయాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. దీంతో #JusticeforPunjabiGirl హ్యాష్‌టాగ్ ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ వార్త రాసే సమయానికి 42 వేలకు పైగా ట్వీట్లు నమోదయ్యాయి. రెండు సార్లు అబార్షన్.. చాలా డిప్రెషన్‌కు లోనయ్యా: నటి -
‘ఈ పథకం మాకొద్దు’- ట్విటర్‌ను హోరెత్తించిన ఉద్యోగులు
మరణమా.. రణమా అన్నంత ఉత్కంఠతో ఉద్యోగులు తమకు పాత పింఛను పథకం పునరుద్దరణ మాత్రమే శరణ్యమనీ.. మరో మారు తేల్చి చెప్పారనీ భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. అసాధారణ పోరాట పటిమతో మదిలో మాటను విశ్వ విదితం చేశారని, ఆ సంగతి సీపీఎస్ శ్రేణుల గుండె చప్పుడుతో దద్దరిల్లిన ట్విటర్ సాక్షిగా సుస్పష్టం అయిందని చెప్పారు. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న న్యూపెన్షన్ స్కీమ్ ఉద్యోగ వర్గాల సామాజిక మాధ్యమ ఉద్యమం అద్భుతంగా విజయం సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. నెల రోజుల ముందు నుంచే యావత్ భారతం మానసికంగా సిద్ధమై ఈ రోజు అవకాశం కోసం వేచి చూసిన నిరీక్షణ ఫలితమే ‘రిస్టోర్ ఓల్డ్ పెన్షన్’ ఆవిష్కృతమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి నాయకులు కూడా మున్ముందు జూమ్ సమావేశాలు నిర్వహించి ఎన్పీఎస్ కు చరమ గీతం పాడేలా ఉద్యోగ సంఘాలను సమాయత్తం చేశాయన్నారు. సీపీఎస్టీఈఏటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ సూచన మేరకు సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు ట్విటర్ ఖాతాల ద్వారా పాత పింఛను సాధన తమ లక్ష్యం అని గళం వినిపించారన్నారు. వారణాసి రామకృష్ణ ఆధ్వర్యంలో జలసౌధ లో ఇంజనీర్లు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారని చెప్పారు. కొత్త పింఛను పథకం రద్దే ఏకైక లక్ష్యం అని, వెసులు బాట్లు , సౌకర్యాల తో తమను ఏ మర్చలేరని లక్షలాది గొంతుకలు ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటాయన్నారు. దేశ వ్యాప్తంగా 70 లక్షలపై చిలుకు ఉద్యోగులు కొత్త పింఛను పథకం లో ఉండగా.. బుధవారం నాడు పది లక్షల ఉద్యోగుల హృదయ స్పందన ట్విటర్ సాక్షిగా మాకు కావాల్సింది పాత పింఛను పథకం మాత్రమే అన్న విషయం అటు పాలకులకు ఇటు జన బాహుళ్యానికి తేట తెల్లమైందని వివరించారు. కరోనా మూలంగా కేవలం సామాజిక మాధ్యమం అస్త్రంగానే పోరు జరిగిందని, కోవిడ్ తగ్గాక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు. -
రిజైన్‌మోదీ హ్యాష్‌ట్యాగ్ వివాదం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వమే ఈ సంక్షోభానికి కారణమంటూ రిజైన్‌మోదీ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్బుక్ ఈ హ్యాష్‌ట్యాగ్ పోస్టులను కొన్ని గంటలసేపు బ్లాక్ చేయడం కలకలం రేపింది. అయితే ఆ తర్వాత హ్యాష్‌ట్యాగ్‌ను పునరుద్ధరించిన ఫేస్బుక్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము ఈ పని చేయలేదని, పొరపాటున జరిగిందని వివరణ ఇచ్చింది. ‘‘మేము తాత్కాలికంగా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను బ్లాక్ చేశాము. ఇది మా పొరపాటే తప్ప కేంద్రం మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. పొరపాటున గుర్తించిన వెంటనే దానిని పునరుద్ధరించాం’’అని ఫేస్బుక్ అధికార ప్రతినిధి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రిజైన్‌మోదీ హ్యాష్‌ట్యాగ్‌ని బ్లాక్ చేసినట్టుగా మొట్టమొదట అమెరికాకి చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులను నిరోధించడం సామాజిక మాధ్యమాలకు ఇది తొలిసారి కాదు. ఇప్పటికే ట్విటర్ వాటిని ఫేక్ న్యూస్ అని పేర్కొంటూ కొన్ని వేల ప్రభుత్వ వ్యతిరేక మెసేజ్‌లను తొలగించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించాలంటూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ‘‘ఇలాంటి సంక్షోభ సమయాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమైనది. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్యులతో సమానంగా మీడియా కూడా కరోనాపై పోరాటంలో పాల్గొనాలి. మనందరం సమష్టిగా పోరాటం చేయాలి’’అని ఆ ట్వీట్లో పేర్కొంది. -
#ResignModi బ్లాక్.. పొరపాటు జరిగిందన్న ఫేస్బుక్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఓ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఫేస్బుక్లో నడుస్తున్న ఓ హ్యాష్‌ట్యాగ్‌ను ఆ సంస్థ తాత్కాలికంగా తొలగించడమే దీనికి కారణం. ఫేస్బుక్లో కొన్ని రోజులుగా #ResignModi అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ను ఊహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవడమే గాక ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్ల వంటి కనీస వైద్య సదుపాయాలను కరోనా రోగులకు అందించలేక పోయింది. దీనంతటికీ నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ తన పదవి నుంచి దిగిపోవాలంటూ నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేశారు. కేంద్రం పూర్తిగా విఫలమైంది: నెటిజన్ల మండిపాటు అయితే ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న పోస్టులను ఫేస్బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో కొన్ని గంటల తర్వాత #ResignModi హ్యాష్‌ట్యాగ్‌ని మళ్లీ రీస్టోర్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఫేస్బుక్ తొలగించిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందిస్తూ ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ హ్యాష్‌ట్యాగ్ తాత్కాలికంగా బ్లాక్ అయ్యింది. పొరపాటు వల్లే ఇలా జరిగింది తప్ప భారత ప్రభుత్వం ప్రమేయమేమీ లేదని ఫేస్బుక్ కమ్యూనికేషన్ల విభాగ అధికారి ఆండీ స్టోన్ బుధవారం సాయంత్రం ఒక ఇమెయిల్ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్‌ను రిస్టోర్ చేశాము, అలాగే బ్లాక్ కు గల కారణాలను పరిశీలిస్తున్నామం’అని స్టోన్ ట్విటర్లోనూ పేర్కొన్నారు. #ResignModi తో ఉన్న పోస్ట్‌లలో కొన్ని కంటెంట్ పరంగా ఫేస్బుక్ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆండీ స్టోన్ తెలిపారు. ఇదిలాఉండగా.. దేశంలో కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ కారణంగా సోషల్ మీడియాలోని కంటెంట్‌పై ఆంక్షల దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. రోజుకు 3 లక్షలకుపైగా కోవిడ్ కేసులు నమోదువుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 30 లక్షలు దాటింది. ( చదవండి: కేంద్రం గాలికొదిలేసింది.. ప్రియాంక భావోద్వేగ పోస్ట్! ) -
#Shweta.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ గురూ!
సోషల్ మీడియాపై లుక్కేస్తే గురువారం అంతా ఓ పేరుతో కూడిన హ్యష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఎవరనుకొని వెంటనే ట్విటర్ పిట్టలో వెతికితే మీరు గుర్తు పట్టలేకపోవచ్చు ఎందుకంటే ఆ పేరు ఏ ప్రముఖ హీరోదో లేక రాజకీయ వేత్తదో, క్రికెటరో అనుకుంటే పప్పులో కాలేసినట్లో.. ఆమె ఎవరికి పరిచయం లేని శ్వేతా అనే అమ్మాయి. అవును.. ప్రస్తుతం #Shweta ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. ఏ విషయం గురించి మాట్లాడిన ముందు ఈ హ్యష్‌ట్యాగ్ తగిలించే మ్యాటర్ చెబుతున్నారు నెటిజన్లు. ఇంతకీ అసలు ఎందుకు శ్వేతా ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.? ఆ పేరు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా.. అసలు దీని సంగతేంటి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ హ్యాష్‌ట్యాగ్ మీద క్లిక్ చేస్తే ఓ ఆడియో క్లిప్ వైరల్ అయినట్లు దర్శనమిస్తుంది. 111 మంది ఉన్న జూమ్‌లో ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నప్పుడు శ్వేతా అనే అమ్మాయి తన ఫ్రెండ్‌తో జరిగిన సంభాషణలను స్నేహితులకు పూస గుచ్చినట్లు వివరిస్తూ ఉంటుంది. అయితే పాపం శ్వేతా అనుకోకుండా తన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయడం మరిచిపోయి.. దానికి బదులుగా స్పీకర్‌ను మ్యూట్ చేసినట్లు ఈ ఆడియో క్లిప్‌లో వినిపిస్తుంది. దీంతో ఇంటి గుట్టు బజారులో పెట్టినట్లు ఆమె తన ఫ్రెండ్ సీక్రెట్స్ అన్ని క్లాస్ మొత్తానికి చెప్పేస్తుంది. శ్వేతా ఈ వీడియోలో తన స్నేహితుడు తన రహస్యాలన్నింటినీ ఎలా పంచుకున్నాడో వివరంగా చెబుతుంది. లైంగిక వాంఛ కలిగిన తన గర్ల్ ఫ్రెండ్‌ను ఎన్నిసార్లు ఔటింగ్‌కు తీసుకెళ్ళాడో చెప్పాడని.. అతను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని.. ఆ అమ్మాయి మాత్రం అతడిని ఉపయోగించుకుంటోందని శ్వేతా అంటుంది. ” నాకు కూడా తెలియదు. అతను ఆమెను చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, అయితే ఆమె ఓ సెక్స్ బానిస… అతడు ఎట్రాక్షన్ వల్ల ఆమెకు ఆకర్షితుడయ్యాడు. సెక్స్ కూడా చేశాడు.” అని శ్వేతా తెలుపుతుంది. ఓ వైపు శ్వేతా చెబుతుంటే ఆన్లైన్ జూమ్ క్లాసులో ఉన్న మిగతా క్లాస్మేట్స్ ఈ అంశంపై శ్వేతాని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమెకు వినబడదు. ఎందుకంటే ఆమె తన స్పీకర్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇక ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు వరుస మీమ్స్‌తో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనితో శ్వేతా ఓవర్‌నైట్‌లోనే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. మరి ఆ మీమ్స్‌పై మీరు కూడా ఓ కన్నేయండి. చదవండి: మలాలను చంపేస్తాం.. సంచలన హెచ్చరిక! 111 participants on the zoom call listening to #Shweta pic.twitter.com/mLj1qH6XAt — thegauravsharma (@Gaurav_3129) February 18, 2021 111 participants on the zoom call listening to #Shweta pic.twitter.com/mLj1qH6XAt — thegauravsharma (@Gaurav_3129) February 18, 2021 111 participants on the zoom call listening to #Shweta pic.twitter.com/mLj1qH6XAt — thegauravsharma (@Gaurav_3129) February 18, 2021 Just because of one #Shweta now all boys will feel unsecure while sharing their feelings to a girl bestie. pic.twitter.com/SJwRXKFQnh — saurabh sagar (@s11saurabh) February 18, 2021 #Shweta when asked to keep something secret. pic.twitter.com/dh6KXgEwuJ — Billi'Am Shakespeare (@Billiam_Shake) February 18, 2021 #Shweta discussing about a sex addicted girl pic.twitter.com/7VlQC8W7bU — Varsha saandilyae (@saandilyae) February 18, 2021 After watching #Shweta on twitter trending Me to YouTube: pic.twitter.com/XzdhM7DX67 — Middle Class Boi (@Navodayavala) February 18, 2021 -
యూజర్లకు షాక్ ఇచ్చిన ఇన్స్టాగ్రామ్
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ తమ యూజర్లకు షాక్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి పలు సమస్యల కారణంగా సోషల్ మీడియా క్రాష్ అయిందని ట్విట్టర్లో #InstagramCrashing హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయింది. కాసేపటి వరకూ పనిచేయకుండా పోయిన ఇన్స్టాగ్రామ్ కాసేపటికి సెట్ అయింది. ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిన కాసేపటికే ఇంటర్నెట్లో యూజర్లు మీమ్స్, రియాక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ చేశారు. యూజర్లు పెరిగిపోవడంతోనే ఇలా జరిగినట్లుగా నిపుణులు అభిప్రయపడుతున్నారు. సమస్య తీరిపోయిందని చెప్తున్నా.. ఇంకా చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ యాప్ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ఇదే వారం మొదట్లో గూగుల్ సర్వీసులు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. -
ఐపీఎల్ జట్ల ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్ విడుదల
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 కోసం ఉత్కంఠగా ఎదురుచేస్తున్న క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2020 టోర్నీలోని ఎనిమిది టీమ్స్‌కు ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్‌ను ట్విట్టర్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 2020 సీజన్ గురించి ట్విట్టర్లో చర్చ మొదలవగా.. ట్విటర్ ప్రకటనతో అభిమానులకి కొత్త అనుభూతి లభించనుంది . అయితే ఇంగ్లీష్‌తో పాట వివిధ ప్రాంతీయ భాషల్లో క్యాప్షన్లున్న ఎమోజీలు, హ్యాష్టాగ్స్లను ట్విటర్ విడుదల చేసింది. -
సినిమాను కాపాడండి
‘‘సినిమాను కాపాడండి’’ అంటున్నారు థియేటర్స్ యాజమాన్యాలు. ‘సేవ్ సినిమా’ (సినిమాను కాపాడండి), సపోర్ట్ మూవీ థియేటర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్లో ట్రెండ్ ఆరంభించారు. ఈ విషయం గురించి ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పలు ట్వీట్స్‌లో ఇలా పేర్కొంది. ‘‘మన దేశ సంప్రదాయాల్లో సినిమా థియేటర్స్‌లో సినిమాకు వెళ్లడం ఓ పద్ధతి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సినిమా థియేటర్స్ చాలా కీలకం. ఎన్నో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. చాలా దేశాల్లో సినిమా థియేటర్స్ తెరవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. భారత ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించాలని, సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సినిమా చూడటానికి ప్రేక్షకులు వచ్చేలా చేసే బాధ్యత మాది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉంటాం. విమానయానాలు, మెట్రో ట్రైన్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేసేందుకు అనుమతించినట్లుగానే సినిమా హాళ్లకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొంది. ఈ విషయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరికొంతమంది సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. -
జీమెయిల్ సర్వీసులకు అంతరాయం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన జీమెయిల్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి చాలాసేపు జీమెయిల్ సహా గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ మీట్ మొదలైన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడింది. లాగిన్ కాలేకపోవడం, అటాచ్మెంట్స్ చేయలేకపోవడం, మెసేజ్‌లు అందకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జీమెయిల్ హ్యాష్‌ట్యాగ్ చాలాసేపు ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా నిల్చింది. మరోవైపు, ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఉదయం వెల్లడించిన గూగుల్ ఆ తర్వాత సర్వీసులను పునరుద్ధరించినట్లు సాయంత్రానికి ప్రకటించింది. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఓర్పు వహించినందుకు, మద్దతుగా నిల్చినందుకు ధన్యవాదాలు. వ్యవస్థ విశ్వసనీయతకు గూగుల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఎప్పటికప్పుడు మా వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుంటున్నాం‘ అని పేర్కొంది. సర్వీసులకు అంతరాయం కలగడంపై దర్యాప్తు చేస్తున్నట్లు తమ సేవల వివరాలను తెలియజేసే ’జీ సూట్’ స్టేటస్ డ్యాష్‌బోర్డు ద్వా రా ఉదయమే గూగుల్ వెల్లడించింది. కొందరు యూజర్లకు సర్వీసులను పునరుద్ధరించినట్లు, మిగతా యూజర్ల సమస్యలనూ సత్వరం పరిష్కరించనున్నట్లు పేర్కొంది. గూగుల్ వివరణ ప్రకారం.. ఈ–మెయిల్స్, మీట్ రికార్డింగ్, డ్రైవ్‌లో ఫైల్స్ క్రియేట్ చేయడం, గూగుల్ చాట్‌లో మెసేజ్‌లు పోస్ట్ చేయడం వంటి అంశా ల్లో సమస్యలు తలెత్తాయి. అయితే, సేవల అంతరాయానికి కారణమేంటన్నది తెలియరాలేదు. కంపెనీ నిర్దిష్టంగా వివరాలు వెల్లడించనప్పటికీ డౌన్‌డిటెక్టర్ (వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫాంల సేవల్లో అంతరాయాల వివరాలను తెలిపే సంస్థ) డేటా ప్రకారం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా యూజర్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. -
నేనెంతో లక్కీ
హీరో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ‘‘ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి మీరందరూ నా మీద చూపించే ఈ ప్రేమ నేనెంత అదృష్టవంతుడినో నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంగా మీరు (కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు) పంపిన అభినందనలకు, దీవెనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు మహేశ్‌బాబు. వరల్డ్ రికార్డ్... మహేశ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్లో ‘హ్యాపీ బర్త్‌డే మహేశ్ బాబు’ అనే హాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేశారు. 24 గంటల్లో 60.2 (6 కోట్లు) మిలియన్ ట్వీట్స్‌తో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హాష్ ట్యాగ్‌గా రికార్డ్ సృష్టించింది. ట్విట్టర్లో తమ అభిమాన హీరో సాధించిన ఈ వరల్డ్ రికార్డ్‌తో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. -
ట్రెండింగ్‌లో ‘స్టూడెంట్స్ లైవ్స్ మేటర్’
న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్ భారత్‌లో పంజా విసురుతోంది. ఇప్పటికే 2.5 లక్షల కరోనా కేసులతో మనదేశం ప్రపంచ పట్టికలో ఇటలీని దాటేసి ఆరో స్థానంలో నిలిచింది. ఇక అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూసి ఉన్న సంగతి తెలిసిందే. పరీక్షలు సైతం నిర్వహించలేమని చాలా రాష్ట్రాలు వాయిదా వేశాయి. అయితే, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు మాత్రం విద్యా సంస్థలు బంద్ ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి లోకం సోషల్ మీడియా వేదికగా గళమెత్తింది. తమ ప్రాణాలను రిస్కులో పెట్టి పరీక్షలు రాయలేమని స్పష్టం చేసింది. విద్యార్థులంతా #StudentLivesMatter హాష్‌టాగ్‌తో ఆయా ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేయడంతో అది ట్రెండింగ్‌లో ఉంది. అన్నీ మీరే చెప్పారు.. ఇప్పుడేమో! ‘వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వచ్చేలా లేదని, భౌతిక దూరంతోనే కోవిడ్‌ను దూరంగా తరిమేయొచ్చని ఎందరో నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వాలు కూడా అదే విషయాన్ని చెప్పి లాక్డౌన్ విధించాయి. ఇప్పుడేమో అన్నిటికీ తలుపులు బార్లా తెరిచారు. విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఇక మాస్కు ధరించడం.. వ్యక్తిగత పరిశుభ్రత అందరూ పాటిస్తారనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో.. పరీక్షలు అవసరమా’ అని విద్యార్థులు మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, దేశంలో కోవిడ్ నిలయంగా మారిన మహారాష్ట్ర.. కేసుల్లో చైనాను అధిగమించిన సంగతి తెలిసిందే. (చదవండి: కరోనా: అవసరం లేకపోయినా చికిత్స.. ) ట్విటర్లో మరిన్ని కామెంట్లు ‘పరీక్షలు నిర్వహిస్తే.. చూపులేని వారు, కంటి సమస్యలతో బాధపుడుతన్నవారి పరిస్థితేంటి’ అని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. ‘ప్రొఫెసర్లకు కరోనా సోకిందని మీరే యూనివర్సిటీ మూసేస్తారు. మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలా’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. పరీక్షల కోసం తమ ప్రాణాలను, కుటుంబాన్ని రిస్కులో పెట్టలేమని మరో విద్యార్థి తేల్చిచెప్పారు. ‘ముందుగా పార్లమెంట్ తెరవండి. తర్వాత కాలేజ్‌లను ఓపెన్ చేద్దురు గాని’ అని ఇంకో యూజర్ వ్యగ్యాంస్త్రం సంధించారు. ‘స్కూళ్లు, కాలేజీలు పూర్తిగా శానిటైజ్ చేశామని ప్రభుత్వాలు చెప్పలగలవా. మా కోసం, కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం. పరీక్షలకు భయపడి కాదు’ అని మరో విద్యార్థి పేర్కొన్నారు. కాగా, ఒడిశాలో జూన్ 11 నుంచి పాఠశాల, కాలేజీ విద్యార్థుల పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇక గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ అనుమతితో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. -
సంచలనం రేపుతున్న ‘ధోని రిటైర్మెంట్’
హైదరాబాద్: ప్రస్తుత భారత క్రికెట్లో ఎక్కువగా చర్చకు దారితీస్తున్న అంశం ‘ధోని రిటైర్మెంట్ ఎప్పుడు?’. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ అనంతరం ధోని ఇప్పటిరకు మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత తొలి రెండు నెలలు ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలలు క్రికెట్‌కు విరామమిచ్చాడు. ఆర్మీ ట్రైనింగ్ ముగిసిన అనంతరం కూడా ధోని తిరిగి టీమిండియాలో చేరలేదు. అయితే ధోని తనంతట తాను ఆడటం లేదా లేక సెలక్టర్లే అతడిని పక్కకు పెడుతున్నారా అనే ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి. ఇక ధోని వీడ్కోలుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్విటర్లో ఓ హ్యాష్ ట్యాగ్ సంచలనం సృష్టిస్తోంది. మంగళవారం అనూహ్యంగా ట్విటర్లో ధోని రిటైర్మెంట్(#Dhoniretires) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ధోని సాధించిన ఘనతలు, రికార్డులను గుర్తుచేస్తూ రిటైర్మెంట్ హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తున్నారు. దీనితో పాటు #ThankYouDhoni అనే మరో హ్యాష్ ట్యాగ్ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ధోని అభిమానులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. అయితే జార్ఖండ్ డైనమెట్ వీడ్కోలు వార్తలను ఖండిస్తున్నారు. అంతేకాకుండా అతడికి మద్దతుగా నిలుస్తూ #NeverRetireDhoni అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తున్నారు. ఇక ధోని వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు ధోని ఆడాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ధోనికి ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన యువ సంచలనం రిషభ్ పంత్ ఏ మాత్రం ఆకట్టుకోకపోవడంతో.. సెలక్టర్లు సైతం ఈ సీనియర్ ఆటగాడిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ధోనిపై ఓ క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. అయితే రిటైర్మెంట్ విషయం ధోని వ్యక్తిగతమని, ఆ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరని గంగూలీ సింపుల్‌గా తేల్చిపారేశాడు. ఇక ధోనికి ఫేర్వెల్ మ్యాచ్ ఆడించి ఘనంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఇవ్వాలని సెలక్టర్లకు క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. -
బాలీవుడ్‌కు షాక్ ఇచ్చిన సౌత్!
సౌత్ సినిమా తన పరిధిని విస్తరించుకుంటూ పోతుంది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలో నార్త్‌లో హవా చూపించగా, సాహోతో మరోసారి సౌత్ సినిమా బలం చూపించేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. శనివారం హ్యాష్‌ట్యాగ్ డే సందర్భంగా ట్విటర్ ఇండియా గత ఆరు నెలల కాలంలో ట్రెండ్ అయిన టాప్ ఐదు హ్యాష్‌ట్యాగ్‌లను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో అజిత్ విశ్వాసం (#Viswasam) మొదటి స్థానంలో నిలిచింది. మరోసౌత్ సినిమా మహర్షి (#Maharshi) నాలుగో స్థానం సాధించటం విశేషం. రెండు మూడు స్థానాల్లో లోక్‌సభ ఎలక్షన్స్ 2019(#LokSabhaElections2019), క్రికెట్ వరల్డ్ కప్ 2019(#CWC19) ట్యాగ్లు నిలిచాయి. ఐదో స్థానంలో #NewProfilePic అనే హ్యాష్‌ట్యాగ్ నిలిచింది. ఈ ఐదు స్థానాల్లో రెండు సౌత్ సినిమాలకు స్థానం దక్కగా ఒక్క బాలీవుడ్ సినిమా కూడా కనిపించకపోవటం విశేషం.