Hawala
-
రూ. 200 కోట్ల హవాలా గుట్టు రట్టు.. ఆ పార్టీ పనేనా..?
చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.200 కోట్ల హవాలా గుట్టు రట్టు చేశారు. మలేషియా నుంచి వచ్చిన హవాలా ట్రేడర్ వినోత్‌కుమార్ జోసెఫ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న ఐటీ అధికారులు అతడి నుంచి రూ.200 కోట్ల హవాలాకు సంబంధించి విస్తుపోయే విషయాలను కనిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులోని ఓ ప్రముఖ పార్టీ కోసం రూ.200 కోట్ల హవాలా సొమ్మును దుబాయ్ నుంచి తీసుకురావడానికి ప్లాన్ చేసినట్లు వినోత్ వాట్సాప్ చాట్ల ద్వారా ఐటీ అధికారులు కనిపెట్టారు. వినోత్ లాప్టాప్, మొబైల్‌ఫోన్, ఐ పాడ్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. అప్పు, సెల్వం, మోనికవిరోల, సురేశ్‌లు వినోత్ బృందంలో పనిచేస్తున్నట్లు బయటపడింది. ఈ హవాలా కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అప్పగించనున్నారు. కాగా, తమిళనాడులో ఉన్న అన్ని లోక్‌సభ సీట్లకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత -
రూ.55 వేలకోట్ల దావూద్ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. పాకిస్థాన్‌లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో అనేక కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ నివేదికలపై ఎలాంటి ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు. దావూద్ కరాచీలో ఉంటున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మూడు దశాబ్దాలుగా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాకిస్థాన్ అడ్డాగా దందాలు, అక్రమ వ్యాపారాలను నడుపుతున్నాడు. దావూద్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది. అతని భార్య జుబీనాజరీన్, సోదరుడు అనీస్ సహకారంతో ఇదంతా నడుస్తోందని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. 1980-90 మధ్య కాలంలో దావూద్ వ్యభిచారం, డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వ్యాపారాలతో కోట్లు గడించాడు. ప్రపంచ ఉగ్రవాద సంస్థ డీ-కంపెనీకి అధిపతిగా మారాడు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు నిర్వహిస్తున్న కొన్ని వ్యాపారాలు ఈ కింది విధంగా ఉన్నట్లు సమాచారం. చమురు, లూబ్రికెంట్లు: ఒయాసిస్ ఆయిల్ & లూబ్ ఎల్సీసీ అనే దుబాయ్ ఆధారిత కంపెనీ చమురు, లూబ్రికెంట్ల వ్యాపారం సాగిస్తోంది. ఇది డీ-కంపెనీల్లో ఒకటిగా ఉన్నట్లు తెలిసింది. డైమండ్స్: అల్-నూర్ డైమండ్స్ అనేది దుబాయ్‌లోని వజ్రాల వ్యాపార సంస్థ. ఇది డి-కంపెనీకి మనీలాండరింగ్‌కు సహకరిస్తుందని గతంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పవర్: ఒయాసిస్ పవర్ ఎల్సీసీ దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సెక్టార్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది డీ-కంపెనీకి సహకరిస్తుందని నమ్ముతుంటారు. నిర్మాణ రంగం: డాల్ఫిన్ కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం, రియల్ ఎస్టేట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది డీ-కంపెనీకి మద్దతు తెలుపుతుందని కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఎయిర్‌లైన్స్: ఈస్ట్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ను దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం స్థాపించాడు. ఈ సంస్థను స్మగ్లింగ్, పన్ను ఎగవేత ఆరోపణలతో 1996లో మూసివేశారు. ఇవి దావూద్ ఇబ్రహీం, అతడి డీ-కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కొన్ని కంపెనీలని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి నిర్థారణలు లేవు. దావూద్ పాకిస్థాన్, యుఏఈ, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కొందరు చెబుతుంటారు. అతను హవాలా మనీతో ఈ సమ్రాజ్యాన్ని సృష్టించారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, గన్ సప్లైతో దావూద్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఫోర్బ్స్ ప్రకారం గ్యాంగ్స్టర్లలో దావూద్ అధిక ధనవంతుడిగా నిలిచాడు. 2015లో అతని ఆస్తుల నికర విలువ 6.7 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం అప్పట్లోనే రూ.55 వేల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్ ఇదే.. దావూద్ పేరుపై ఒక హోటల్ కూడా ఉంది. ఇప్పటికే దావూద్‌కు చెందిన అనేక ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పైగా ఇండియాలో ముంబైతో పాటు ఇతర నగరాల్లో సైతం ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. 2జీ స్పెక్ట్రమ్ సహా అనేక కుంభకోణాల్లో దావూద్ పాత్ర ఉందని తెలిసింది. -
మైత్రీ మూవీ మేకర్స్‌కు రూ.700 కోట్ల విదేశి పెట్టుబడులు..!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పెట్టుబడులపై ఆదాయపన్ను శాఖ కీలక సమాచారం రాబట్టింది. మైత్రీ సంస్ద లోకి రూ.700 కోట్ల విదేశి పెట్టుబడులు వచ్చినట్లు గుర్తించింది. ఇవి తొలుత ముంబై బేస్డ్ కంపెనీకి బదిలీ అయినట్లుగా నిర్ధరించింది. ఆ తర్వాత ఈ డబ్బును ఏడు కంపెనీలకు తరలించినట్లు ఐటీ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. వాటి నుంచి మైత్రీకి పెట్టుబడుల రూపంలో వచ్చినట్లు ఐడెంటిఫై చేసినట్లు పేర్కొన్నారు. హవాలా ద్వారా బాలీవుడ్ దర్శకుడికి మైత్రీ సంస్థ రూ.150కోట్ల చెల్లించినట్లు వెల్లడించారు. తాజాగా ఈ సంస్థ తీస్తోన్న ఓ సీక్వెల్ మూవీలో హీరోకు సైతం హవాలా రూపంలోనే పేమెంట్స్ ఇచ్చినట్లు సమాచారం. మైత్రీ సంస్థ గత రెండేళ్లలో ఇద్దరు బడా హీరోలకు సైతం అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే హీరోల ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ హీరోలను విచారణ నిమిత్తం ముంబైకి పిలిచే అవాకశం ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. చదవండి: రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయే బిడ్డ ఎవరంటే? -
హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు
సాక్షి, హైదరాబాద్: హ్యాండ్ గ్రెనేడ్లతో దసరా వేడుకల్లో హైదరాబాద్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని పథకం వేసి నగర పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులకు గతంలో నగదు సమకూర్చిన ఫైనాన్షియర్ తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. హవాలా రూపంలో వచ్చిన ఈ నగదు సరఫరాలో కీలక పాత్ర పోషించిన ఆపరేటర్ల కోసం సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేసింది. ఈ నగదు సమకూర్చిన వారిలో కీలక నిందితుడు, పాతబస్తీకి చెందిన హవాలా ఆపరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖలీమ్‌ను సీసీఎస్ నేతృత్వంలోని సిట్ గురువారం అరెస్ట్ చేసింది. ఉగ్ర కుట్ర అమలుకు రూ.40లక్షలు గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా బాంబులు పేల్చి భారీ ప్రాణనష్టం కల్పించి, తద్వారా హైదరాబాద్‌లో మతకలహాలు సృష్టించి అశాంతిని రేకిత్తించేందుకు భారీ కుట్ర జరిగింది. ఈ కేసులో గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ పోలీసులు లష్కరే తోయిబా ఉగ్రవాదులైన అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను స్వా«దీనం చేసుకున్నారు. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు జమ్మూ కశీ్మర్ సరిహద్దుల ద్వారా మన దేశంలోకి వచ్చాయి. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్దిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్‌లు ఇచ్చిన ఆదేశాలతో ఆ ముగ్గురూ ఉగ్రకుట్ర ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఉగ్రకుట్రను విజయంతం చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయం హైదరాబాద్‌లో ఉన్న నిందితులకు హవాలా ద్వారా అందింది. హవాలా మార్గంలో రూ.40 లక్షలు ఇచ్చేందుకు పాతబస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖలీమ్ సహకరించినట్లు తేలడంతో తాజాగా సిట్ అరెస్ట్ చేసింది. అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులకు సహకరించిన మరో 8 మందిని కూడా పోలీసులు మొదట్లోనే విచారించారు. అందులో కొందరు తెలిసి, మరికొందరు తెలియకుండా వారికి సహకరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఉగ్రవాదులకు సాయం చేసిన వారిపై సిట్ కన్ను దర్యాప్తులో ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించిన వారిపై ఇప్పుడు సిట్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే హవాల మార్గంలో డబ్బు పంపించాలని ఎవరు ఆదేశించారు, డబ్బు ఎవరు ఇచ్చారు, ఎన్నిసార్లు ఆ డబ్బును ఖలీమ్ సమకూర్చాడు అనే విషయాలపై ఇప్పుడు సిట్ దృష్టి పెట్టింది. ఇదిలాఉండగా వచ్చిన డబ్బుతో ముగ్గురు ఉగ్రవాదులు రెండు ఇన్ఫీల్డ్ బైక్‌లు కొనడంతో పాటు ఒక కారును కూడా కొన్నారు. హైదరాబాద్‌లో దసరా వేడుకలలో నరమేధం సృష్టించేందుకు బైక్‌లు, కార్లలో వెళ్లి గ్రెనేడ్లను పేల్చాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. పోలీసుల నిఘాలో ఈ కుట్ర బయటపడడంతో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు, ఈ నేపధ్యంలో అరెస్టైయిన ఉగ్రవాదులకు ఖలీమ్‌తో ఎన్నాళ్లుగా సంబంధాలున్నాయనే విషయంలో లోతైన దర్యాప్తు జరిపేందుకు నిందితుడిని కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ఈ ఘటనపై ఎన్ఐఏ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు బెయిల్ నిరాకరణ -
ఉత్తరాది గ్యాంగ్స్టర్లు దక్షిణాది జైళ్లకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్ల ఆగడాలను చెక్‌పెట్టేందుకు, వారి విస్తృత నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. మూసావాలా హత్యతో అలర్ట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తిహార్‌లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్‌స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్టర్లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్‌లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్‌లో 107 శాతం ఖైదీలున్నారు. -
హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టివేత
-
హవాలా సొమ్ము ఎవరిది ఎక్కడికి తరలించారు? ఈడీ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: క్యాసినోవాలా చీకోటి ప్రవీణ్ హవాలా మార్గంలో మళ్లించిన సొమ్మెవరిది? అంత మొత్తంలో నగదు ఏ దేశానికి తరలించారన్న వివరాలను రాబట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం అతనితో పాటు మరికొందర్ని ప్రశ్నించింది. ఐదు రోజులక్రితం చీకోటితో పాటు, మాధవరెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చీకోటితో పాటు మాధవరెడ్డి, బాబులాల్ అగర్వాల్, గౌరీశంకర్, సంపత్ బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ అర్ధరాత్రి వరకు కొనసాగింది. క్యాసినో కాకుండా.. విశ్వసనీయ సమాచారం మేరకు.. నేపాల్, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లో క్యాసినో ఆడిస్తూ చేసిన హవాలాతో పాటు మరికొన్ని లావాదేవీలపై చీకోటితో పాటు మాధవరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ఒకేసారి రూ.27 కోట్ల మేర జరిపిన లావాదేవీలు ఎవరికి సంబంధించినవి, అవి క్యాసినో వ్యవçహారంలోనివా? లేక విదేశాలకు తరలించేందుకు ఎవరైనా ఇచ్చిన డబ్బా? అన్న కోణంలో లోతుగా ప్రశ్నించింది. జనవరి నుంచి జూలై వరకు కస్టమర్లను తీసుకెళ్లి క్యాసినో ఆడించగా వచ్చిన డబ్బుతో పాటు ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలు రాబట్టింది. చిట్‌ఫండ్ డబ్బు ఎక్కడికెళ్లింది? వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిట్‌ఫండ్ సంస్థకు సంబంధించిన డబ్బును హవాలా ద్వారా ఎక్కడికి మళ్లించారని అడిగింది. ఈ వ్యవహారంతో చిట్‌ఫండ్ యజమానితో పాటు ఉమ్మడి కరీంనగర్‌లోని ఓ నూతన జిల్లా జెడ్పీ చైర్మన్‌కున్న లింకులపై ఆరా తీసింది. ఆ జెడ్పీ చైర్మన్, చిట్‌ఫండ్ యజమాని ఈడీ సోదాలకు ఒక్కరోజు ముందు చీకోటితో ఆయన నివాసంలోనే భేటీ అయినట్టు ఈడీ గుర్తించింది. పెద్ద మొత్తంలో నగదును హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి హవాలా ద్వారా మళ్లించినట్టు అనుమానిస్తోంది. ఆ చిట్‌ఫండ్ చాటున జరుగుతున్న చీకటి దందా ఏంటన్న దానిపై ఆరా తీసింది. సంపత్తో డీల్స్ ఏంటి? చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి మొబైల్స్‌లోని వాట్సాప్ మెసెంజర్లలో హవాలా లావాదేవీలకు సంబంధించి కోడ్ భాషల్లో జరిగిన వ్యవహారంపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. అందులో భాగంగా సంపత్ అనే వ్యక్తితో చాటింగ్‌ను గుర్తించింది. సంపత్, మాధవరెడ్డి, ప్రవీణ్ మధ్య నిత్యం డబ్బు లావాదేవీలకు సంబంధించిన సందేశాలున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో సంపత్ ఎవరు? అతడితో జరుగుతున్న డీల్ ఏంటన్న దానిపై ఆరా తీసింది. హవాలా కోసం డబ్బును సంపత్‌కు అందించేవారా? లేక సంపత్ కేంద్రంగానే హవాలా జరిగిందా? అన్న వ్యవహారంపై మరింత క్లారిటీ కోసం ఈడీ ఈ ఇద్దరిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దేశాలు దాటిన మొత్తమెంత? మరోవైపు చీకోటి, సంపత్‌ను ఎదురెదురుగా కూర్చోబెట్టి మరీ ఈడీ విచారించింది. రూ.27 కోట్ల వ్యవహారంతో పాటు క్యాసినోలకు సంబంధించిన డబ్బు ఎవరికిచ్చారు? ఎంత మొత్తంలో హవాలా ద్వారా దేశాలు దాటించారు? తదితర అంశాలపై ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా గౌరీ శంకర్‌ను మరో ఈడీ అధికారి ప్రశ్నించారు. చీకోటి వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే గౌరీ శంకర్‌ను కూడా హవాలా వ్యవహారంపైనే ప్రశ్నించింది. జిగ్రీదోస్త్ బాబులాల్ అగర్వాల్.. క్యాసినోల నిర్వహణతో పాటు పేకాట ఆడించడంలో చీకోటికి కీలక అనుచరుడిగా కొన్నాళ్ల పాటు కొనసాగిన అతని ఆప్తమిత్రుడు బాబులాల్ అగర్వాల్‌ను ఈడీ విచారించడం ఆసక్తికరంగా మారింది. 2017లో ట్యాంక్‌బండ్‌లోని మ్యారియట్ హోటల్లో పేకాట ఆడిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చీకోటితో పాటు బాబులాల్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాబులాల్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కాగా తాజా కేసులో వెలుగులోకి రావడం, ఈడీ ప్రశ్నించడంతో.. అగర్వాల్ పాత్ర ఉత్కంఠ రేపుతోంది. అగర్వాల్‌కు చాలామంది పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులతో మంచి పరిచయాలున్నాయి. అతన్ని ఈడీ ప్రశ్నిస్తుండటంతో వీరందరిలో కలవరం మొదలైనట్టు తెలిసింది. ప్రముఖులకు పారితోషికాలపై దృష్టి చీకోటి, మాధవరెడ్డికి చెందిన 6 బ్యాంకు ఖాతాలను ఈడీ గుర్తించింది. వాటి స్టేట్మెంట్లతో పాటు లాకర్ల వ్యవహారంపై కూడా దృష్టి సారించింది. మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సినీ సెలబ్రిటీలకు చెల్లించిన పారితోషికాల వ్యవహారంపై కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. చీకోటి మొబైల్ వాట్సాప్ సందేశాల ప్రకారం ప్రస్తుతం నలుగురు ప్రముఖులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. -
Casino: ఈడీ సోదాలపై స్పందించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో నిర్వహిస్తూ కోట్ల రూపాయల హవాలాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ స్పందించాడు. క్యాసినో విషయంలోనే ఈడీ అధికారులు సోదాలు చేసినట్టు మీడియాతో చెప్పాడు. మనదేశంలోని గోవాలో క్యాసినో లీగల్ అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. దీంతోపాటు నేపాల్, ఇండోనేషియాలో క్యాసినో లీగల్ అని తెలిపాడు. తాను చేసింది లీగల్ వ్యాపారమేనని అన్నాడు. తానొక సామాన్య వ్యక్తినని ప్రవీణ్ వ్యాఖ్యానించాడు. ఈడీ అధికారులకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. అందుకే వాళ్లు వివరణ అడిగారని చెప్పాడు. వాళ్లు కొన్ని ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పానని అన్నాడు. వారికి ఏమేం వివరాలు కావాలో చెప్తానని ప్రవీణ్ మీడియాతో వెల్లడించాడు. సోమవారం మరోసారి విచారణకు రమ్మన్నారని, హాజరవుతానని పేర్కొన్నాడు. (చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..) -
హైదరాబాద్: చికోటి ప్రవీణ్ ఈడీ కేసులో కీలక అంశాలు
-
హవాల ద్వారా చంద్రబాబు అవినీతి సొమ్మును విదేశలకు పంపారు
-
హుండీ దందా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి ముంబైకి రవాణా చేయాలని చూసిన హుండీ నగదును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ.5 కోట్ల నగదును సీజ్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2 దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడీని హవాలా అని, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అని అంటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన హర్షద్ భాయ్ పటేల్, ఉమేష్ బోథ్ పి.ఉమేష్ చంద్ర అండ్ కంపెనీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. కాచిగూడలోని ఆ సంస్థ ఆఫీస్‌లో గుజరాత్‌కు చెందిన విపుల్ కుమార్ పటేల్ మేనేజర్‌గా, శైలేష్ భాయ్, విపుల్, ఉపేంద్ర కుమార్ పటేల్, పటేల్ చేతన్‌కుమార్‌లు క్యాష్ ట్రాన్స్‌పోర్టర్స్‌గా, అర్జున్ లభూజీ కారు డ్రైవర్‌గా, రాజేష్ రమేశ్ భాయ్ పటేల్ పార్సిల్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఈ దందాలో కమీషన్‌గా రూ.లక్షకు రూ.600 తీసుకుంటారు. పట్టుబడ్డారిలా.. ఇటీవల నగరంలో వసూలు చేసిన రూ.5 కోట్లను ముంబై కార్యాలయానికి తరలించాల్సిందిగా వీరికి ఆదేశాలు అందాయి. దీంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రాంతం నుంచి డబ్బు తీసుకున్న ఈ ఏడుగురూ రెండు కార్లలో ముం బైకి బయలుదేరారు. దీనిపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు బి.దుర్గారావు, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, మహ్మద్ ముజఫర్ తమ బృందాలతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వల పన్నారు. ఆ మార్గంలో వచ్చిన కార్లను తనిఖీ చేసి రూ.5 కోట్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
వీరు అడగరు.. వాళ్లు ఇవ్వరు..
సాక్షి, సిటీబ్యూరో: మాదకద్రవ్యాలు, పేకాట శిబిరాలు, హవాలా గ్యాంగ్స్... ఇలాంటి వాటిపై నిత్యం కన్నేసి ఉంచుతున్న నగర పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ చెప్తున్నారు. ఈ కేసులను అధికారికంగా ‘క్యాష్’ చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏటా ప్రోత్సాహకాల రూపంలో రావాల్సిన రూ.కోట్లు నగర పోలీసు విభాగం నష్టపోతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆయా కేసుల్లో ప్రోత్సాహకాలు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. హుండీ ముఠాలకు కేరాఫ్... ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతూ రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా గాను, దేశంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగే మార్పిడిన హుండీ వ్యాపారంగా పేర్కొంటారు. నగరంలో హుండీ వ్యాపారం జోరుగా సాగుతుంటోంది. పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ మార్గంలో లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి ‘పన్ను పోటుతో’ పాటు అసాంఘికశక్తులు, మాఫియా, ఉగ్రవాదులకు అనువుగా ఉందని భావించిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తుంటారు. శాంతిభద్రతల విభాగం అధికారులు అప్పుడప్పుడు ఈ గ్యాం గ్స్‌ను పట్టుకుంటూ ఉంటారు. ఏటా రూ.5 కోట్లకు పైగానే హుండీ/హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. గత ఏడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ మొత్తం రూ.13 కోట్లకు చేరింది. పది శాతానికి అవకాశం ఉన్నా... ఆదాయపుపన్ను శాఖ నిబంధనల ప్రకారం ఆదాయానికి మించిన/అక్రమ ఆస్తులు, హవాలా, హుండీ తదితర వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఇచ్చి, వాటి గుట్టును బయటపెడితే సదరు ఇన్ఫార్మర్కు పది శాతం కమీషన్‌గా ఇస్తారు. ఈ అవకాశం చట్టమే వారికి కల్పించింది. ఏటా నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులే హుండీ/హవాలాలకు సంబంధించిన అనేక ముఠాల గుట్టును రట్టు చేస్తున్నారు. వీరి నుంచి రూ.కోట్లల్లో నగదు స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగిస్తున్నారు. గత ఏడాది పట్టించిన రూ.13 కోట్లల్లోనూ నగర పోలీసులకు కనీసం రూ.1.3 కోట్లు రావాల్సి ఉంది. ఏటా ఈ స్థాయిలో రాకపోయినా కనీసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వచ్చే ఆస్కారం ఉంటోంది. ఆ రెండు కేటగిరీల్లోనూ ఆస్కారం... హవాలా/హుండీ ముఠాలే గాక, పేకాట శిబిరంపై దాడి చేసినా, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నా నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు పొందే ఆస్కారం ఉంది. మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న అనేక ముఠాలు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, శాంతిభద్రతల విభాగం అధికారులకు చిక్కుతూ ఉంటాయి. వీరి నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటుంటారు. వీరితో పాటు గంజాయి ముఠాలు, పేకాట శిబిరాలపై దాడులు చేసి నిందితులకు చెక్ చెబుతూ ఉంటారు. ఈ కేసుల్లోనూ ఆయా విభాగాల నుంచి ప్రోత్సాహకం పొందే ఆస్కారం ఉంది. డ్రగ్స్ కేసుల్లో పట్టుకున్న మాదకద్రవ్యం విలువలో 15 శాతం, పేకాట (గాంబ్లింగ్) కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తంలో 10 శాతం ప్రోత్సాహకంగా అందించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. పట్టుకున్నంత అప్పగించడమే... ఈ హుండీ ముఠాలు ఉత్తరాది కేంద్రంగానే పని చేస్తున్నాయి. ప్రధాన సూత్రధారులు అక్కడే ఉంటున్నా నగరంలోని ఏజెంట్ల ద్వారా ఫోన్ కాల్స్‌తో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లపై తమ వేగుల ద్వారా సమాచారం అందుకుంటున్నటాస్క్‌ఫోర్స్, ఇతర విభాగాల అధికారులు వారిని పట్టుకుని, భారీగా నగదుస్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల లింకు ఉన్నట్లు ఆధారాలు లభిస్తే తప్ప మిగిలిన కేసుల్ని ఆపై దర్యాప్తు, విచారణ చేసే అధికారం మాత్రం పోలీసులకు లేదు. ఈ నేపథ్యంలోనే పట్టుకున్న ప్రతి ముఠాను స్వాధీనం చేసుకున్న నగదుతో సహా తక్షణం ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించాల్సిందే. ఆ తరవాత వ్యవహారమంతా వారే చూసుకుంటారు. తదుపరి పురోగలి ఏమిటనేది కూడా వారు పోలీసులకు వెల్లడించరు. ఆసక్తి చూపని అధికారులు ఈ కేసుల్లో అత్యధికం టాస్క్‌ఫోర్స్ అధికారులే పట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాలు ఇన్ఫార్మర్లుగా పిలిచే వేగుల్ని ‘నిర్వహించడానికి’ అవసరమైన ఖర్చుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో ఉన్న ప్రోత్సాహకాల అవకాశాన్ని వినియోగించుకుని, తమకు రావాల్సిన మొత్తాన్ని ఆదాయపుపన్ను శాఖతో పాటు ఇతర విభాగాలను అడగడానికి మాత్రం ఆయా వింగ్స్, ఉన్నతాధికారులు ఆసక్తి చూపడం లేదు. ఐటీ అధికారులైనా నగర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమని, వారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఇచ్చినట్లే అనే కోణంలో ఆలోచించట్లేదు. ఫలితంగా అందాల్సిన ప్రోత్సాహకాలు అందట్లేదు. ఇకనైనా అధికారులు స్పందించి నిబంధనల ప్రకారం రావాల్సిన, వచ్చే అవకాశం ఉన్న ప్రోత్సాహకాల్ని నగర పోలీసు, టాస్క్‌ఫోర్స్ విభాగాలకు లేదా పోలీసు సంక్షేమ నిధికి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందని సిబ్బంది పేర్కొంటున్నారు. -
ఆ డబ్బు ఎవరు పంపారు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు కేసులో పోలీస్‌శాఖ విచారణను వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు పెంబర్తి చెక్‌పోస్టు వద్ద రూ.6 కోట్ల నగదును పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ బేగంబజార్‌కు చెందిన హవాలా వ్యాపారి అగర్వాల్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించారు. ముగ్గురు నేతలకు ఆ డబ్బును తీసుకెళ్తున్నట్టు అగర్వాల్ విచారణలో బయటపెట్టాడని వరంగల్ పోలీసులు తెలిపారు. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్ ఈస్ట్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్రకు ఈ నగదును తరలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పట్టుబడ్డ డబ్బు అగర్వాల్‌కు ఎక్కడి నుంచి వచ్చింది.. హవాలా ద్వారా అభ్యర్థులకు డబ్బు పంపించింది ఎవరన్న దానిపై వరంగల్ పోలీసులు దృష్టి సారించారు. మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు వరంగల్ యంత్రాంగాన్ని ఆదేశించినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో నోటీసులు: హవాలా డబ్బులు తెప్పించిన వ్యవహారంలో ముగ్గురు నేతలు నామా నాగేశ్వర్రావు, కొండా మురళి, రవిచంద్రకు ఫిబ్రవరి మొదటి వారంలో నోటీసులు జారీ చేయనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. డబ్బు కోసం ఎవరిని సంప్రదించారు.. ఎక్కడ్నుంచి ఆ డబ్బు వచ్చింది.. తదితర అంశాలపై విచారించేందుకు వరంగల్ పోలీసులు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఇంత మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం వెనుక వ్యూహకర్త ఎవరన్న దాని పైనా వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించనున్నట్టు తెలుస్తోంది. విశాఖ నుంచే వచ్చిందా? హవాలా ద్వారా హైదరాబాద్ వచ్చిన సొమ్మును కారు వెనుక సీట్లో కింద ప్రత్యేక అమరికలో తరలించిన విధానం చూస్తుంటే లింకు పెద్దదిగా ఉన్నట్టు వరంగల్ పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన నగదు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి అగర్వాల్ ద్వారా డబ్బులు పంపించారు.. ఎవరెవరికి ఎంత అందింది.. అన్న లెక్కలు కూడా బయటపడే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అయితే ఆ డబ్బు వచ్చింది ఏపీలోని విశాఖపట్నం నుంచే అని విచారణలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో విశాఖపట్నంలోనూ విచారణ జరిపేందుకు రెండు బృందాలను పంపనున్నట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ ముగ్గురు నేతలతో పాటు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వారి అనుచరుల ఫోన్ కాల్‌డేటాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఇటు అగర్వాల్‌తో పాటు అతడి సోదరులు, వారి అసిస్టెంట్ల కాల్‌డేటాలను సైతం అనాలసిస్ చేస్తున్నట్టు తెలిసింది. దీని ద్వారా విశాఖలో ఎవరి నుంచి డబ్బు వచ్చిందన్న వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఆ డబ్బు పచ్చపార్టీదేనా? తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తుల నుంచే ఈ రూ.6 కోట్లు హవాలా ద్వారా వచ్చి ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేసిన స్థానాలతో పాటు పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు సైతం పచ్చ పార్టీ నుంచే కోట్ల రూపాయలు రవాణా అయినట్టు ఆరోపణలున్నాయి. పట్టుబడ్డ డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో టీడీపీ నేత నామా నాగేశ్వర్రావు పేరుండటం సంచలనంగా మారింది. అయితే వరంగల్ పోలీసులు కేసు విచారణలో వేగం పెంచడంతో పక్క రాష్ట్రంలోని పచ్చపార్టీ నేతలు వణికిపోతున్నారని తెలిసింది. -
ఆంగాడియాలతో హవాలా!
అహ్మదాబాద్: డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో నల్లధనం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. ఓ వైపు పారదర్శకత, అవినీతి లేని రాజకీయాలు అంటూనే...అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం విధించిన పరిమితిని రాజకీయ నాయకులు గాలికొదిలేశారు. అయితే నల్లధనాన్ని రవాణా చేస్తున్నప్పుడు తనిఖీల్లో పట్టుబడకుండా, అధికారుల కళ్లుగప్పేందుకు నేతలు ఇక్కడ కొత్త అడ్డదారులు వెతుక్కున్నారు. వజ్రాభరణాలు రవాణా చేసే ఆంగాడియాల కొరియర్ నెట్‌వర్క్‌ను హవాలా మార్గంలో డబ్బు పంపడానికి పార్టీలు వాడుకుంటున్నాయి. ఈ సంచలన విషయాలు ‘ఇండియా టుడే’ రహస్య పరిశీలనలో వెల్లడయ్యాయి. ఎలా జరుగుతుంది..? రాజకీయ నాయకులు ఎక్కడికైనా డబ్బును పంపాలంటే ముందుగా ఆ మొత్తాన్ని స్థానిక ఆంగాడియా కార్యాలయానికి తరలిస్తారు. ఇక్కడ భౌతికంగా నగదు రవాణా ఉండదు. నేతలు ఇచ్చిన డబ్బును ఆంగాడియాలు తమ దగ్గరే పెట్టుకుంటారు. ఆ తర్వాత నగదు ఏ ఊరికి పంపమని చెప్పారో, అక్కడ ఉన్న తమ ఆంగాడియా కార్యాలయానికి ఫోన్ చేస్తారు. ఫలానా మనిషి వస్తాడు, డబ్బు ఇచ్చేయండి అని చెబుతారు. ఇలా భౌతికంగా నగదు రవాణా లేకపోవడంతో తనిఖీల్లో పట్టుబడే అవకాశం కూడా తక్కువ. రాజకీయ నాయకులతోపాటు కొంతమంది అధికారులు కూడా డబ్బును హవాలా ద్వారా పంపడానికో లేదా అక్రమ సంపాదనను దాయడానికో ఆంగాడియాలను ఉపయోగించుకుంటూ ఉంటారట. ఇలా డబ్బు సరఫరా చేయడానికి కొన్ని ఆంగాడియాలు ఒక రోజు వ్యవధి తీసుకుంటూ ఉండగా, మరికొంత మంది మాత్రం గంట నుంచి రెండున్నర గంటల్లోపే అవతలి పార్టీకి డబ్బు అందజేస్తున్నారు. ఓ ఆంగాడియా కార్యాలయంలోని ఏజెంట్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ వద్ద ఈ వ్యాపారం జోరుగా సాగుతుందని చెప్పారు. ఇంతకుముందు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా తాము ఇక్కడ నుంచి డబ్బు అక్కడకు పంపామనీ, ఒక రాష్ట్రంలో డబ్బు తీసుకుని మరో రాష్ట్రంలో అందజేయాలంటే కోటి రూపాయలకు కమీషన్‌గా రూ.40,000...అదే ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపాలంటే రూ.కోటికి రూ.15 వేలు కమీషన్ తీసుకుంటామని ఏజెంట్ వివరించారు. -
భారత్‌లో విధ్వంసానికి ఐసిస్ నిధులు
తిరువనంతపురం: గల్ఫ్ దేశాలను గడగడలాడించి ప్రాబల్యం కోల్పోయిన ఐసిస్ భారత్‌లో పాగా వేసేదిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లుస్తోంది. ఈ పథకంలో భాగంగా భారతీయులకు భారీగా డబ్బును ఎరగా వేస్తోంది. కేరళ నుంచి పారిపోయి ఐసిస్‌లో చేరిన కేరళ యువతకు పెద్ద మొత్తంలో నిధులను అందిస్తోంది. తద్వారా భారీ విధ్యంసానికి ప్రణాళికలు రచిస్తోంది. సిరియా, ఇరాక్‌ల్లో ప్రాభల్యం కోల్పోయిన ఐసిస్ భారత్‌లో పాగా వేయడానికి కేరళను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా కేరళ నుంచి వెళ్లి ఐసిస్‌లో చేరిన సానుభూతిపరులకు పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. దీనికి హవాలాను ప్రధాన మార్గంగా ఎంచుకుంది. అయితే ఐసిస్ ప్రణాళికలను కేరళ పోలీసులు భగ్నం చేశారు. ఇంటలిజెన్స్ రిపోర్ట్‌తో ఐసిస్ భారీ విద్వంసానికి నిధులు సమకూరుస్తోందన్న సమాచారం అందుకున్న కేరళ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదును హవాలా రూపంలో పీఎఫ్ఐ సభ్యుడు తస్లీంకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచే ఐసిస్ సానుభూతిపరులకు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
కదిలిన హవాలా డొంక!
‘బిల్ ఆఫ్ ఎంట్రీ’ ఆధారంగా దర్యాప్తు - ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో హెచ్డీఎఫ్సీ ఫిర్యాదు - రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ - గత నెలలో ముగ్గురు నిందితుల అరెస్టు - ‘పీటీ వారెంట్’పై విచారించిన చందానగర్ పోలీసులు - నిందితుల వాంగ్మూలం ఆధారంగా మరో ఇద్దరి అరెస్టు సాక్షి, హైదరాబాద్: ‘బిల్ ఆఫ్ ఎంట్రీ’తీగ లాగితే సిటీ కేంద్రంగా సాగుతున్న హవాలా వ్యాపారం డొంక కదిలింది. కరెంట్ ఖాతాల ద్వారా విదేశాలకు నగదు పంపిన వ్యాపారులు దీనిని దాఖలు చేయకపోవడంతో అనుమానం వచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్– ఇండియాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), చందానగర్ పోలీసులు మొత్తం ఐదు గురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. వీరందరూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులే కావడం గమనార్హం. చైనా, హాంకాంగ్ నుంచి నగరానికి భారీ స్థాయిలో సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి అవుతు న్నాయి. అయితే వ్యాపారులు సరుకు విలు వను సగానికి తగ్గించి రికార్డుల్లో చూపిస్తు న్నారు. ఈ మొత్తానికే పన్నులు చెల్లిస్తూ మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల ద్వారానే హవాలా రూపంలో విదేశాల్లో ఉన్న సరఫరా దారులకు పంపుతున్నారు. ఇందుకు బోగస్ ఇన్వాయిస్లు, కరెంట్ ఖాతాలకు వినియో గిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో సూత్రధారి... హాంకాంగ్‌లో ఉంటున్న వ్యాపారి పవన్ అగ ర్వాల్ ఈ దందాకు సూత్రధారిగా వ్యవహ రిస్తున్నాడు. నగరంలోని కిషన్‌గంజ్ ప్రాంతా నికి చెందిన కాస్మోటిక్స్ వ్యాపారి మహేం ద్రకుమార్ ఖత్రి అతడికి హవాలా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడికి పరిచయస్తులైన బీ పురోహిత్, జూరారాం పురోహిత్, బాబూ లాల్ హరిసింగ్ రాజ్ పురోహిత్‌లకు రుణాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి గుర్తింపుకార్డులు, పాన్‌కార్డులు, ఓటర్ ఐడీలు తీసుకున్నాడు. వీటి ఆధారంగా మహరాజ్‌గంజ్ చిరునామాతో శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ, జీఎస్ ట్రేడర్స్, కోఠి బ్యాంక్ స్ట్రీట్ చిరునామాతో వినాయక ఎంటర్ప్రైజెస్ పేరుతో బోగస్ ఖాతాలు తెరి చాడు. వైశ్యా బ్యాంకు ఉద్యోగి సీహెచ్ దుర్గా ప్రసాద్‌కు రూ.2 లక్షలు చెల్లించి ఈ మూడు సంస్థలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సులు తీసుకున్నాడు. అంబర్‌పేటకు చెందిన ధరణి సాయికిరణ్ సహకారంతో వివిధ చిరునా మాలతో బోగస్ రెంటల్ అగ్రిమెంట్లు, స్టాంపు పేపర్లు సేకరించి పని పూర్తి చేశాడు. ఈ ట్రేడ్ లైసెన్సుల ఆధారంగా ఖత్రి చందానగర్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదిం చాడు. రిలేషన్ షిప్ మేనేజర్ చక్రవరం రఘుపతిరాజుకు ఈ పత్రాలు దాఖలు చేసిన ఖత్రి.. మూడు కరెంట్ ఖాతాలు తెరిచాడు. ఈ వ్యవహారం మొత్తం 2014లోనే జరిగింది. సరుకు లేకపోవడంతో లేని ‘ఎంట్రీ’... విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకును పరిశీలించే కస్టమ్స్ అధికారులు దాని విలువకు సరిపడా పన్ను విధించి వసూలు చేస్తారు. ఆపై ఈ బిల్ ఆఫ్ ఎంట్రీని వ్యాపారికి అందిస్తారు. అయితే ఖత్రి చేయించిన నగదు బదిలీలు హవాలా రూపంలో పంపిన డబ్బునకు సంబం ధించినవి కావడంతో దీనికి సంబంధించిన సరుకు రావడం, బిల్ ఆఫ్ ఎంట్రీ లభించడం అనేది ఉండదు. దీంతో నిర్ణీత సమయంలో బ్యాంకు అధికారులకు బిల్ ఆఫ్ ఎంట్రీలు దాఖలు కాలేదు. అప్రమత్తమైన బ్యాంకు అధి కారులు.. క్షేత్రస్థాయి పర్యటన చేయగా రికార్డు ల్లో ఉన్నవి బోగస్ చిరునామాలుగా తేలింది. 2015లోనే ఎస్టీఆర్ నమోదు... ఈ తతంగం మొత్తం 2015లో జరిగింది. శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ, జీఎస్ ట్రేడర్స్, వినాయక ఎంటర్ప్రైజెస్ చేసిన విదేశీ లావా దేవీలను అనుమానం వ్యక్తం చేస్తూ హెచ్డీ ఎఫ్‌సీ అధికారులు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్యూఐ)–ఇండియాను ఆశ్ర యించారు. 2015 నవంబర్ 4న ఎఫ్యూఐలో సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ (ఎస్టీఆర్) నమోదు చేశారు. ఈ లావాదేవీలన్నీ విదే శాలతో జరిగినవి కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్ ఉండి ఉంటుందని అనుమానిం చిన ఈడీ రంగంలోకి దిగింది. దర్యాప్తు చేప ట్టిన ఈడీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ఈ ఏడాది జూన్ 23న ఖత్రి, వినోద్, ఆనంద్‌కుమార్‌ను అరెస్టు చేశారు. మరోపక్క బోగస్ పత్రాలతో తమ శాఖలో బ్యాంకు ఖాతా లను తెరిచారంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ కె.శైలజ.. చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసు కున్న పోలీసులు అప్పటికే ఈడీ అరెస్టు చేసిన ముగ్గురినీ పీటీ వారెంట్‌పై తమ కేసులో అరెస్టు చేశారు. న్యాయస్థానం అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత ఈ నెల 1న దుర్గాప్రసాద్, సాయికిరణ్‌లను కటక టాల్లోకి పంపారు. ఈ వ్యవహారాన్ని సీరియ స్‌గా తీసుకున్న ఈడీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. మరో ఇద్దరి సహకారంతో ‘బదిలీ’ బోగస్ కరెంట్ ఖాతాలు సిద్ధం చేసిన ఖత్రి వీటిలోకి ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయించడానికి వినోద్ ఓఝా, రాణిగం జ్‌కు చెందిన స్టీలు వ్యాపారి ఆనంద్ కుమార్ బిద్రకర్ను సంప్రదించాడు. తాను తెరిచిన బోగస్ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేందుకు వీరితో ఒప్పందం కుదుర్చుకు న్నాడు. వీరి సాయంతో ఖత్రి బోగస్ బ్యాంకు ఖాతాల ద్వారా 40 రోజుల్లో రూ.31.6 కోట్ల నగదును విదేశీ ఖాతాల్లోకి మళ్లిం చాడు. హాంగ్‌కాంగ్‌లో ఉన్న పవన్ అగ ర్వాల్ నుంచి ఎల్ఈడీ లైట్లు, ఇతర ఉప కరణాలు దిగుమతి చేసుకున్నట్లు నకిలీ ఇన్వాయిస్లు పొందిన ఖత్రి వీటి ఆధారంగా నగదు బదిలీల ప్రక్రియ పూర్తి చేశాడు. ఈ తరహాలో విదేశాలకు నగదు బదిలీ చేసిన కరెంట్ ఖాతాదారులకు సంబంధించి ఫెమా చట్టం ప్రకారం... నగదు బదిలీ జరిగిన 180 రోజుల్లోపు ఖాతాదారులు బ్యాంకునకు బిల్ ఆఫ్ ఎంట్రీని దాఖలు చేయాల్సి ఉంటుంది. -
డొల్ల కంపెనీలపై సీఐడీ ఆరా
► హవాలా కుంభకోణం దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు ► కీలకపత్రాలు అందజేసిన ఈడీ ఆధికారులు అల్లిపురం (విశాఖ దక్షిణ): కోట్ల రూపాయల హవాలా కుంభకోణంలో డొల్ల కంపెనీలపై ఏపీ సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని విశాఖలో తప్పుడు చిరునామాల్లో ఏర్పాటు చేసిన కంపెనీలపై విచారణ చేపట్టారు. అదే విధంగా కోల్‌కతాలో కంపెనీల అడ్రస్లపైనా ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. నిందితుడు వడ్డి మహేష్ ఆర్థిక లావాదేవాలపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చైనా, సింగపూర్, హాంకాంగ్‌లలో కేసుకు సంబంధించిన ఐటీ కంపెనీలపైన కూడా వీరు ఆరా తీయనున్నారు. సీఐడీ ఐజీ అమిత్‌గార్గ్ మంగళవారం ఉదయం నుంచి అధికారులతో వరుసగా సమీక్షించారు. ఇప్పటికే ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆధారాలు అందజేసిన ట్లు సమాచారం. ఎన్ఫోర్సుమెంట్ అధికారు లు కీలకమైన పత్రాలను సీఐడీ అధికారులకు అందజేశారు. విశాఖ పోలీసులు తమ దర్యాప్తు వివరాలను ఇచ్చారు. కేసు విచారణను సీఐడీ అదనపు ఎస్పీ నాగేశ్వరరావుకు అప్పగించారు. ఈ కేసు గురించి అధికారులను అడిగినా ఎవరూ మాట్లాడటంలేదు. నిందితులు వడ్డి మహేష్ తండ్రి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, రాజేష్‌లను నగర పోలీసులు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లతోపాటు కేసులో కీలకం గా వ్యవహరించిన దిల్లీకి చెందిన మరో ముగ్గు రు నిందితుల వివరాలను ఆరా తీస్తున్నారు. విశాఖలోనే అధికంగా బ్యాంకు లావాదేవీలు జరగడంతో వాటిని పరిశీలిస్తున్నారు. -
ఏపీ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం!
-
రూ. వేల కోట్ల హవాలా!
► విశాఖ హవాలా కుంభకోణంపై సీఐడీ అంచనాలు ► ఇందులో బడాబాబులు, బ్యాంకర్ల పాత్ర సాక్షి, విశాఖపట్నం: ఇప్పటిదాకా వందల కోట్లకే పరిమితమైందనుకుంటున్న విశాఖలో వెలుగు చూసిన హవాలా కుంభకోణం విలువ రూ.వేల కోట్లు ఉంటుం దని ఏపీ సీఐడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వడ్డి మహేష్ కింది స్థాయిలో వ్యవహారం నడిపాడని, ఆయనకన్నా పై స్థాయిలో ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బ్యాంకర్ల పాత్ర ఉండవచ్చని భావిస్తున్నారు. సీఐడీ ఐజీ అమిత్‌గార్గ్ పర్యవేక్షణలో కేసు విచారణ ప్రక్రియ మొదలయింది. ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ను సోమవారం ఉదయం కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారు. మహేష్‌ను కస్టడీకి తీసుకొని విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఏపీ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం! మహేష్ తండ్రి శ్రీనివాసరావే కొడుకును ఇందులో సూత్రధారులకు పరిచయం చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతున్నారు. మరోవైపు గోయల్, గోయంకా, గుప్తా అనే హవాలా వ్యాపారులను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. ఈ కేసును ఛేదించేందుకు సీఐడీ అధికారులు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని తీసుకోనున్నారు. నకిలీ కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియపైనా సీఐడీ దృష్టి సారించనుంది. ఈ కంపెనీల సంబంధిత డైరెక్టర్లను అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని సీఐడీ భావిస్తోంది. మరోవైపు ఈ కుంభకోణంలో పెద్దల పాత్ర ఉందన్న వీరు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటిదాకా రూ.1,369 కోట్ల హవాలా కుంభకోణం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చినా మున్ముందు ఇది వేల కోట్లకు చేరుకుంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోవచ్చని అంటున్నారు. 12 కంపెనీలు.. 30 ఖాతాలు హవాలా కుంభకోణంలో 12 బోగస్ కంపెనీలను సృష్టించారని, 30 బ్యాంకు ఖాతాలను తెరిచారని, నకిలీ పాన్‌కార్డులు, డాక్యుమెంట్లను రూపొందించి మోసానికి పాల్పడ్డారని విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ చెప్పారు. ఆయన సోమవారం కమిషనరేట్‌లో విలేకరులకు కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు మహేష్ ఆయా కంపెనీల ఉద్యోగులతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి హవాలా సొమ్ముతో రూ.680.94 కోట్ల లావాదేవీలు నిర్వహించారని తెలిపారు. ఈ కంపెనీలు రూ.569.93 కోట్ల మేర విదేశీ మారకద్రవ్యాన్ని భారత్‌కు నష్టం కలిగించాయని చెప్పారు. అంతేగాక.. కోల్‌కతా బ్యాంకుల్లో మరో రూ.800 కోట్ల సొమ్మును జమ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారన్నారు. 2014 నుంచి మొదలైన ఈ వ్యవహారం పెద్దనోట్ల రద్దు వరకు వేగంగా సాగిందన్నారు. సమావేశంలో డీసీపీ నవీన్ గులాటీ, స్పెషల్ బ్రాంచి ఏడీసీపీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ గదిలో కోట్లు కురిశాయి
► కోల్‌కతాలో చిన్న గది నుంచి కార్యకలాపాలు ► హవాలా రూపంలో తరలిన వందల కోట్లు సాక్షి, విశాఖపట్నం: కోల్‌కతాలో ఓ చిన్న గది.. అయి తేనేం అందులోనే రూ.వందల కోట్ల విలువైన కంపెనీలున్నాయి.. కానీ అవి కంటికి కనిపించవు... కేవలం పేపర్లపైనే కనిపిస్తాయి.. హవాలా యువకుడు మహేష్ గురించి ఆరా తీస్తున్న ఐటీ, పోలీస్ అధికారులకు విస్తుపోయే విషయాలెన్నో తెలుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురంలో పుట్టి, ఉల్లిపాయల వ్యాపారం చేసుకుని బతికే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహేష్ రూ.వందల కోట్ల హవాలా రాకెట్‌ను నడిపే స్థాయికి ఎదిగాడు. శ్రీకాకుళంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ స్టోన్ క్రషింగ్ మిషన్ నడుపుతున్నట్లు జనాన్ని నమ్మించి కోల్‌కతా నుంచి హవాలా నడిపిస్తున్నాడు. కోల్‌కతా నుంచి విశాఖ బ్యాంకు అకౌంట్లకు నగదును మళ్లించి ఇక్కడినుంచే సింగపూర్, చైనా, హాంకాంగ్ దేశాలకు తరలించి హవాలా చేస్తున్నారు. నల్లధనాన్ని చెక్కుల రూపంలో తీసుకుని 12 షెల్ కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ సొమ్మును మరికొన్ని కంపెనీల్లోకి మళ్లిస్తున్నారు. విశాఖలోని 22 బ్యాంకుల్లో తప్పుడు పత్రా లతో ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయలు వాటిలో జమచేస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు పంపి స్తున్నారు. ఇలా ఒకే బ్యాంకు అకౌంట్లో వివిధ అకౌంట్ల నుంచి రూ.570 కోట్లు జమ అయినప్పటికీ అధికారుల కు అనుమానం రాలేదు. ఆ ధైర్యంతోనే మరో రూ.97 కోట్లు అదే ఖాతాలో జమచేశారు. వాటిని చూసిన అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. నెల రోజులుగా నిఘా మహేష్ లావాదేవీలపై నెల రోజుల పాటు నిఘా పెట్టా రు. ఈ నెల 9న రంగంలోకి దిగి షెల్ కంపెనీల కోసం జల్లెడ పట్టారు. బెంజ్ కారు కొనుగోలు చేయడానికి ఖాతా నుంచి డబ్బులు తీయడంతో మహేష్ గుట్టు కనిపెట్టారు. తొలుత అతని తండ్రి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మహేష్‌ను అదుపులోకి తీసుకుని విశాఖ తీసుకు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలికి చెందిన అన్న దమ్ములు రాజేష్, హరీష్‌లను కూడా అదుపులోకి తీసుకు న్నారు. వీరందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఇంత భారీగా నల్లధనాన్ని మార్పిడి వెనక కచ్చితంగా చాలా పెద్దవాళ్ల హస్తమే ఉంటుందని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. హవాలా’ మహేష్ అరెస్ట్ వందల కోట్ల రూపాయల హవాలా కేసులో ప్రథమ నిందితుడు వడ్డి మహేష్‌ను అరెస్ట్ చేసినట్లు విశాఖ పోలీసులు ఆదివారం ప్రకటిం చారు. అతడిని సోమవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును సీఐడీకి బదలా యించినట్లు తెలిపారు. -
మా పిల్లల తప్పేమీ లేదు
► హవాలా కేసు నిందితుల తల్లిదండ్రులు విశాఖపట్నం: హవాలా కేసులో విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్న పెరవలికి చెందిన ఆచంట రాజేష్, హరీష్‌ల తప్పేమీ లేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే వీరి తండ్రి జయకృష్ణ పెరవలిలో రాయల్ హోటల్‌ను నడిపేవారు. నష్టాలు రావడంతో దానిని కొంతకాలంగా మూసివేశారు. దీంతో హరీష్, రాజేష్‌లు ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలో హవాలా కేసులో అసలు సూత్రధారిగా భావిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన మహేష్ తండ్రి వీరికి రూ.20 వేలు జీతం ఇస్తానని వారిని తీసుకెళ్లారని హరీష్, రాజేష్‌ల తల్లిదండ్రులు వివరించారు. ఇటీవలే వారు అక్కడ మానేసి వచ్చేసారని, ఇపుడు పోలీసులు కేసులు అంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుల తప్పేమీ లేదంటున్న తల్లితండ్రులు మీడియాతో మాట్లడటానికి నిరాకరించారు. -
హవాలా వెనుక నల్ల కుబేరులెవరు?
- బడా నేతల పాత్రపై అనుమానాలు - ఓ ఏపీ మంత్రి, ఎంపీ అండతోనే వ్యవహారం - ఇప్పుడేమీ చెప్పలేమంటున్న ఖాకీలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ హవాలా రాకెట్ వెనుక సూత్రధారులెవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాఖ కేంద్రంగా బోగస్ కంపెనీల పేర్లతో సుమారు రూ.1,500 కోట్లను హవాలా రూపంలో తరలించిన ముఠా వెనుక ఎవరున్నారన్నది కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. అన్ని వంద ల కోట్లెవరివి? అవి హవాలా మార్గంలో ఎటు తిరిగి ఎటొచ్చాయి? అనే దానిపెనే ఇప్పుడు వారు ప్రధానంగా కూపీ లాగుతున్నారు. విశాఖలోని ఎంవీపీ కాలనీ కేంద్రంగా శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పాండురంగాపురంలోని బాలముకుంద వేర్‌హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు డొల్ల కంపెనీల పేరిట నగరంలోని 20 బ్యాంకు ఖాతాల ద్వారా హవాలా లావాదేవీలు సాగించిన ఘరానా ముఠాకు ఇక్కడ ఎవరు అండగా ఉన్నారనే అంశంపైనే పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. అత్తిలి టు కోల్‌కతా వయా శ్రీకాకుళం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన వడ్డి శ్రీనివాసరావు 20 ఏళ్ల క్రితమే కోల్‌కతాకు వలస వెళ్లాడు. అక్కడ ఉల్లిపాయల ఏజెంట్‌గా పనిచేసి సంపాదించిన డబ్బుతో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురిడిలో కొంతకాలంగా శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట క్రషర్ నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం ఏడాదిన్నరగా శ్రీకాకుళం పట్టణం ఎల్బీఎస్ కాలనీలో భార్యతో కలసి నివాసముంటున్నాడు. ఇతని కొడుకు వడ్డి మహేష్ కోల్‌కతాలోనే ఉంటూ హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బును విదేశాలకు పంపడంలో దిట్టగా పేరొందాడు. ప్రభుత్వాలకు పన్ను చెల్లించకుండా ఎగవేసే నల్లకుబేరులకు చెందిన కోట్లాది రూపాయల సొమ్మును బినామీ కంపెనీల ద్వారా విదేశాలకు పంపి వైట్ చేసి పెడుతూ కమీషన్లు దండుకుంటున్నాడు. విశాఖతోపాటు హైదరాబాద్, కోల్‌కతాల్లోని మొత్తం 30కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా బడా వ్యాపారుల సొమ్మును విదేశాలకు పంపుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. బెంజ్‌తో దొరికేశాడు.. రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాను మహేష్ కొన్న కొత్త బెంజి కారు బట్టబయలు చేసింది. ఓ చిన్న స్టోన్ క్రషర్ యజమాని కొడుకు ఖరీదైన బెంజ్ కారు కొనడంతో అనుమానం వచ్చిన ఐటీ అధికారులు అతని బ్యాంకు లావాదేవీలపై కన్నే శారు. విశాఖ, శ్రీకాకుళం, కోల్‌కతాల్లో సోదాలు నిర్వహించి 4 రోజుల క్రితమే మహేష్‌ను కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతను ఇచ్చిన సమాచారంతోనే శ్రీకాకుళంలో నివాసముంటున్న తండ్రి వడ్డి శ్రీనివాసరావును, కారు డ్రైవర్‌ను, ఇంట్లో పనిచేసే వంట మనిషిని సైతం అదుపులోకి తీసుకుని విశాఖలో విచారిస్తున్నారు. తెర వెనుక ఎవరు? హవాలా వ్యాపారంలో ఆరితేరిన మహేష్ విశాఖ కేంద్రంగా బ్యాంకు ఖాతాలు తెరవడం, ఇక్కడి నుంచే వందల కోట్ల డబ్బు పంపడం వెనుక కచ్చితంగా ఉత్తరాంధ్ర రాజకీయ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిండా పాతికేళ్లు కూడా లేని యువకుడు రూ.కోట్ల హవాలా రాకెట్ నడిపాడంటే అధికార పార్టీ నేతల అండదండలు లేకుండా సాధ్యం కాదని పోలీసులే భావిస్తున్నారు. పక్కాగా ధ్రువీకరించడం లేదు కానీ.. ఏపీకి చెందిన ఓ మంత్రి, మరో ఎంపీ పాత్రపైనే పోలీసులు కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ హవాలా వెనుక ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ తండ్రి శ్రీకాకుళంలోనే ఎందుకు మకాం వేశాడు? కోల్‌కతా నుంచి శ్రీకాకుళానికి ఎందుకు మకాం మార్చాడు? క్రషర్ పేరిట అక్కడ ఆయన చేస్తున్న వ్యవహారాలేమిటి? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తునారు. మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావుల ఫోన్ కాల్ లిస్టును పరిశీలిస్తున్నారు. అధికార పార్టీ ప్రముఖుల పాత్ర ఉండొచ్చని భావిస్తున్న ఈ కేసులో పోలీసులు పక్కాగా విచారణ చేçపడతారా.. లేదంటే దొరికిన వారితోనే సరిపెట్టేస్తారా అన్నది త్వరలో తేలనుంది. -
హవాలా, ఉగ్రవాదంపై నోట్లదెబ్బ
• సగం తగ్గిన హవాలా వ్యాపారం • కశ్మీర్లో 60% తగ్గిన ఉగ్ర హింస న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం హవాలా వ్యాపారాన్ని పెద్ద దెబ్బతీసిందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్లో ఉగ్రవాదులకు నిధులు ఆగిపోవడంతో హింస 60 శాతం తగ్గినట్లు అంచనా వేసింది. నోట్ల రద్దు తర్వాత చట్టవ్యతిరేక, తీవ్రవాద కార్యకలాపాల్ని విశ్లేషించి నిఘా వర్గాలు ఈ నివేదిక విడుదల చేశాయి.. హవాలా మధ్యవర్తుల మధ్య ఫోను సంభాషణలు సగానికి సగం తగ్గాయని విశ్లేషణలో వెల్లడైంది. ఈ లెక్కల ప్రకారం హవాలా వ్యాపారం సగం తగ్గిందని అంచనా. కశ్మీర్లో అల్లర్లను రెచ్చగొడుతూ హింసను ప్రేరేపిస్తున్న ఉగ్రవాదులకు కూడా నిధులు నిలిచిపోయాయి. ఉగ్రవాద సానుభూతిపరులకు కూడా చెల్లింపులు ఆగిపోయాయి. ఉగ్రవాదులకు నిధుల అందించేందుకు రద్దైన నోట్లనే వాడేవారు. అలాగే పాకిస్తాన్‌లోని క్వెట్టా, కరాచీ ప్రింటింగ్ ప్రెస్‌ల్లో ముద్రించిన నకిలీ నోట్లు కూడా చలామణి చేసేవారు. నోట్ల రద్దు నిర్ణయంతో అవన్నీ చెల్లకుండా పోవడంతో నగదు లేక ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌లోని ఉగ్రవాదులు తక్షణ నగదు చెల్లింపులపైనే ఆధారపడ్డారు. నోట్ల రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద సంబంధ హింస 60 శాతం తగ్గిందని నిఘా అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా గత కొద్ది వారాలుగా పెరిగాయని విశ్లేషిస్తున్నారు. మావోలకూ దెబ్బే.. మావోయిస్టులకు నిధుల సేకరణ కష్టంగా మారింది. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్, జార్ఖండ్‌లో రద్దైన నోట్లను మార్చాలంటూ మావోయిస్టులు స్థానికుల్ని సంప్రదించినట్లు ఆరోపణలు ఉన్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్ 9 అనంతరం మావోయిస్టులతో పాటు వారి మద్దతుదారుల నుంచి రూ. 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయేందుకు నోట్ల రద్దు నిర్ణయం సాయపడిందని, ఈశాన్య భారతంలోని చొరబాటు గ్రూపులు కూడా భారీగా నష్టపోయాయనేది నివేదిక సారాంశం. -
హవాలా వ్యాపారులపైకి సీబీఐ అస్త్రం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో హవాలా వ్యాపారం పెరగడంతో ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దింపింది. నవంబరు 8 అనంతరం భారీగా నగదు జమ అయిన బ్యాంకు ఖాతాలను పరిశీలించి అక్రమార్కులను గుర్తించే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. ఇందుకోసం గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏకే అరుణ్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ)కి వచ్చే ఫిర్యాదులనూ ఈ బృందమే స్వీకరిస్తుంది. ప్రస్తుతం శర్మ సీబీఐలో ‘బ్యాంకింగ్ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్స్ సెల్’విభాగాధిపతిగా ఉన్నారు. -
హవాలా....హవాలా...నోట్ల హవాలా...
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం నాడు అనూహ్యంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని ఆయన మద్దతుదారులు ‘సర్జికల్ స్రై్టక్స్’గా అభివర్ణించారు. చాలా మంది ప్రజలు అవును కాబోలు అనుకున్నారు. పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టుల శిబిరాలపై జరిపిన సర్జికల్ దాడులు సరైన లక్ష్యం, సరైన సమయంలో, సరైన రీతిలో జరిగిన దాడులే కావచ్చు. అనూహ్యంగా ఈ నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేయడంలో మాత్రం సరైన లక్ష్యం, సరైన సమయం, సరైన రీతి మూడు తప్పేనని రెండు రోజుల్లోనే తేలిపోయింది. ‘దో దిన్ రుక్ జాయే హవాలా రేట్స్ హాజాయింగే’ ఓ సీనియర్ జర్నలిస్ట్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యానం ఇప్పుడు నిజమవుతోంది. రేట్లు ఇప్పటికీ బయటకు రాలేదుగానీ హవాలా దళారులు మాత్రం బయటకు వచ్చారు. 20 శాతం కమిషన్‌పై నల్ల కుబేరులు బొక్కల్లో దాచిన బోషాణంలోనుంచి తీసిస్తే వాటిని ప్రభుత్వం కళ్లుగప్పి తెల్లబజారులోకి తేట తెల్లగా తెస్తామని చెబుతున్నారు. బ్యాంకుల్లో రెండున్నర లక్షలకు మించి నిషేధించిన నోట్లను డిపాజిన్ చేస్తే వారిపై నిఘా వేసి ఆ డబ్బు కూపీలు లాగుతామని, నల్లడబ్బని తెలిసినా, చూపిన సోర్స్‌కు టాలీ కాకపోయినా పన్నుతోపాటు రెండు వందల రెట్లు జరిమానా విధిస్తామని రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ ఆదియా స్వయంగా ప్రకటించి హవాలా దందాకు తలుపులు బార్లా తెరిచారు. రెండున్నర లక్షలకు పైగా డిపాజిట్ చేసే ఖాతాదారుల వివరాలన్నింటిని పరిశీలించే శక్తి సామర్ధ్యాలు, తగిన సిబ్బంది ఆదాయం పన్ను శాఖకు ఉందా అన్న సందేహం తప్పకుండా వస్తోంది. రెండున్నర లక్షల డిపాజిట్‌దారుల జోలికి వెళ్లమని పరోక్షంగా ఆదిలోనే చెప్పగా, ఆ విషయాన్ని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ మరింత గట్టిగా ధ్రువీకరించారు. లక్షల సంగతి దేవుడెరుగు బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్‌కు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువలేని వారు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. వారిలో వీలైనంత మందికి పదో, పరకో ఇచ్చి నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చేందుకు హవాలాదారులే కాకుండా బ్యాంక్ దళారులు కూడా కాచుకొని కూర్చున్నారు. ఎంత డబ్బయినా నిషేధించిన నోట్ల రూపంలో తీసుకుంటామని, బంగారం కొంటే చాలంటూ బంగారు షాపుల యజమానులు, వస్త్రవ్యాపారులు, జిమ్‌లు, సెలూన్లు, క్లబ్బులు సరికొత్త ఆఫర్లతో ముందుకు రావడం వెనకనున్న ఆంతర్యం ఏమిటో ప్రభుత్వానికి అవగాహన ఉందా? తులం బంగారాన్ని యాభై వేల రూపాయలకు అమ్ముతున్నారంటే నల్లడబ్బుకు తెల్లవన్నె తెచ్చే విద్య వారికేదో తెలిసే ఉంటుందికదా? నోట్ల నిషేధ నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే ఎలా తెల్సిందంటూ ప్రతిపక్షం ప్రశ్నించదంటే అర్థం ఏమిటీ? బడా బాబులు ముందే ఈ విషయాన్ని తెలుసుకొని ఈపాటికే నల్లడబ్బును సర్దేసుకొని ఉండరా, అచ్చం ఇలాంటి వారికోసమే మోదీ ప్రభుత్వం వెయ్యి నోటు స్థానంలో రెండు వేల నోటును తెచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన విమర్శల్లో నిజం లేదంటారా? దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు బారులు తీరిన జనాల్లో ఒక్క నల్ల కుబేరుడన్నా కనిపించారా? దొడ్డితోవ హవాలా మార్గాలు తలుపులు తెరచి ఉండగా వారెందుకు బ్యాంకుల వద్దకు వస్తారు? ఏదేమైనా మోదీ గారు అధికారికంగా యాభై రోజుల పాటు హవాలా మార్గాన్ని రాజమార్గం చేశారని పలు వర్గాల వారు విమర్శిస్తున్నారు. విదేశీ కరెన్సీనే అధికారుల కళ్లుగప్పి చేరాల్సిన చోటుకు చేర్చే హవాలాదారులకు దేశీయ నోట్లను మార్చడం పెద్ద కష్టమా?