height
-
బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం?
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు ఏదో శాపం ఉన్నట్లుంది. దేశంలో ఇంతలా జాప్యం జరిగిన ప్రాజెక్టు ఇంకోటి ఉండదేమో. ఇన్నేళ్ల తరువాతైనా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ముహూర్తం దగ్గరపడిందని అనుకుంటూ ఉండగానే పిడుగులాంటి వార్త ఇంకోటి వచ్చిపడింది. ప్రాజెక్టు ఎత్తును నాలుగున్నర మీటర్ల మేర తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్న ఈ వార్త ఆందోళన కలిగించేదే. తొలిదశలో నీటిని నిలబెట్టడానికి నిర్దేశించిన ఎత్తునే పూర్తి స్థాయి మట్టంగా కేంద్రం నిర్ణయిస్తే, ఈ ప్రాజెక్టు నుంచి ఆశించిన ఫలితం ఉండదన్న భయం ఏర్పడుతోంది. అలాగే.. డీపీఆర్‌లోని తప్పుల కారణంగా కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ముందుగా ఈ రెండు కాల్వల ద్వారా 17500 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు ప్రవహించాలని అనుకున్నారు. కానీ 2017లో డీపీఆర్ తయారీ సమయంలో జరిగిన తప్పుల కారణంగా కుడి కాల్వలో 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వలో ఎనిమిది వేల క్యూసెక్కుల వరకు పారేందుకు అయ్యే నిర్మాణ ఖర్చును మాత్రమే కేంద్రం ఇస్తానందట. దీంతో ఇప్పుడు కాలువల సామర్థ్యం తగ్గించుకోవడం లేదంటే.. రూ.4500 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కాల్వలను ముందనుకున్న ఆలోచనల ప్రకారం కట్టుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఇప్పటిది కాదు. వందేళ్ల క్రితమే బ్రిటిష్ పాలనలోనే ఆరంభమైంది. పలుమార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఎన్.టి.రామారావు, టంగుటూరి, అంజయ్య వంటివారు ఈ ప్రాజక్టు పురోగతికి ప్రయత్నించారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇది వేగంగా ముందుకెళ్లిందనేది వాస్తవం. నిర్వివాదాంశం. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల సాధన, ముంపు ప్రాంతాల్లో భూ సేకరణ, కుడి, ఎడమ కాల్వల నిర్మాణాల్లో ఆయన చూపిన చొరవ మర్చిపోలేనిది. అప్పట్లో ప్రాజెక్టు పూర్తయితే భూ సేకరణ కష్టమవుతుందన్న అంచనాతో ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలలో భూ సేకరణ చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ తెలుగుదేశం దీన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం వారితో కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించారు. ప్రాజెక్టు లేకుండా కాల్వలు ఏమిటని ఎద్దేవ చేసేవారు. అయినా వైఎస్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దాదాపు అన్ని అనుమతులు వచ్చి, ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే టైమ్‌కు ఆయన మరణించడం ఆంధ్రప్రజల దురదృష్టం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడానికే ఐదేళ్లు తీసుకున్నాయి. అంతలో రాష్ట్ర విభజన సమస్య ముందుకు వచ్చింది. ఆ టైమ్ లో ఆంధ్ర ప్రజలలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంటే దాని అర్థం మొత్తం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు, భూ సేకరణ చేసి, నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చి వారికి ప్రత్యామ్నాయ వసతులు సమకూర్చి పూర్తి చేయడం అన్నమాట. కానీ 2014లో విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో మరింత గందరగోళం ఏర్పడింది. అంతకు ముందు ఎంపికైన కాంట్రాక్టర్‌ను మార్చడం, తమకు కావల్సిన వారితో పనులు చేయించడం, అవి కాస్తా అవినీతి అభియోగాలకు గురి కావడం తదితర పరిణామాలు సంభవించాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీనే ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ మాదిరి మారిపోయిందని వ్యాఖ్యానించడం ఇక్కడ మనం గుర్తుకు చేసుకోవాలి. నిజానికి చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సకాలంలో పూర్తి కావని, ఎన్నికల సమయానికి ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే ఆయన మైనర్ ఇరిగేషన్, ఇంకుడు గుంతలు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే భారీ ప్రాజెక్టులు చేపట్టకపోతే ప్రజలలో అప్రతిష్టపాలు అవుతామని భావించి, వారిని నమ్మించడానికి ఎన్నికలకు కొద్దికాలం ముందు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేవారు.ఆ తర్వాత వాటిని వదలి వేశారు.1999 ఎన్నికలకు ముందు ఇలా ఆయన శంకుస్థాపన చేసి, అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టిన ప్రాజెక్టుల శిలాఫలకాల వద్ద అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూలు పెట్టి వచ్చిన ఘట్టాలు కూడా జరిగాయి. 2014 లో మరోసారి సీఎం. అయిన తర్వాత సోమవారం పోలవారం అంటూ కథ నడిపారు. ఈ ప్రాజెక్టు తన కల అని ప్రచారం చేసుకునే వారు. జయము, జయము చంద్రన్న అంటూ పాటలు పాడించడం, వేలాది మందిని ప్రాజెక్టు సందర్శనకు తీసుకు వచ్చామని చెబుతూ కోట్ల రూపాయల బిల్లులను మాత్రం చెల్లించడం ప్రత్యేకతగా తీసుకోవాలి. స్పిల్ వే పూర్తి కాకుండా, ఒక గేట్ మాత్రం అమర్చి, అప్పర్, లోయర్ కాఫర్ డామ్ ల నిర్మాణం కంప్లీట్ చేయకుండా, డయాఫ్రం వాల్ నిర్మించి కొత్త సమస్యలు తీసుకొచ్చారు. కీలకమైన డామ్ ,రిజర్వాయిర్ మాత్రం పూర్తి కాలేదు. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో సుమారు రూ.800 కోట్ల మేర ఆదా చేసి పనులు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. స్పిల్ వేని పూర్తి చేసి, 48 గేట్లను అమర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అంతలో భారీ ఎత్తున వరదలు రావడంతో చంద్రబాబు టైమ్‌లో కాపర్ డామ్ కోసం వదలిపెట్టిన గ్యాప్‌ల గుండా నీరు ప్రవహించి, డయాఫ్రం వాల్ ను దెబ్బ తీసింది. దానిపై కేంద్ర సంస్థలు కొత్త వాల్ కట్టాలా? లేక పాతదాన్ని పునరుద్దరించాలా అన్న దానిపై తేల్చడానికి ఏళ్ల సమయం పట్టింది. కాఫర్ డామ్ పూర్తిగా కడితే, వెనుక ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతాయి. వారికి పరిహారం చెల్లించలేదు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం జరగలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం గాప్ లను వదలి పెద్ద తప్పు చేసిందని నిపుణులు తేల్చారు. కానీ ఈ మొత్తం నెపాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రయత్నించాయి. జగన్ టైమ్ లో తొలిదశలో 41.15 మీటర్ల వద్ద నీరు నిలిపి ప్రాజెక్టును ఒక దశకు తీసుకు రావాలని తలపెడితే, చంద్రబాబు, ఎల్లో మీడియా నానా రచ్చ చేశాయి. ఏపీకి జగన్ అన్యాయం చేస్తున్నారని దుష్ప్రచారం చేశారు. నిర్వాసితులను వేరే ప్రదేశాలకు తరలించడం, వారిని ఆర్థికంగా ఆదుకోవడం వంటివి చేశాక 45.72 మీటర్ల వద్ద నీటిని నిల్వచేసే విధంగా రిజర్వాయిర్ పనులు సంకల్పించారు. అదే టైమ్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు కూడా వేగంగా సాగాయి. కరోనా రెండేళ్ల కాలంలో కూడా పోలవరం పనులు జరిగేలా కృషి చేశారు. అయినా డయాఫ్రం వాల్ కారణంగా జాప్యం అయింది. ఈ లోగా మళ్లీ ప్రభుత్వం మారింది. అదే టైమ్ లో ఒడిషా, చత్తీస్గడ్ లలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో ఎటూ బిజెపినే అధికారంలో ఉంది. ఆ కూటమిలో టీడీపీ, జనసేన కూడా భాగస్వాములు అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిర్మాణం జరిగితే ఒడిషా, చత్తీస్ గడ్, తెలంగాణలలోని కొన్ని భూ భాగాలు ముంపునకు గురి అవుతాయి. అక్కడ వారికి కూడా పరిహారం ఇవ్వడానికి గతంలోనే అంగీకారం కుదిరింది. చత్తీస్ గడ్ ప్రాంతంలో ముంపు బారిన పడకుండా గోడలు నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.అయినా పూర్తి మట్టం ఒప్పుకుంటే రాజకీయంగా ఆ రాష్ట్రాలలో విపక్షాలు విమర్శలు చేస్తాయని, ఏపీకి సహకరిస్తే రాజకీయంగా తమకు నష్టమని భావించాయి. తెలంగాణలో కూడా దీనిపై కొంత రాజకీయం నడుస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కూటమిలోని టీడీపీ, జనసేనలను లోబరుచుకుని 41.15 మీటర్లకే ప్రాజెక్టును పరిమితం చేయడానికి ఒప్పించాయని భావిస్తున్నారు. అందువల్లే కేంద్ర క్యాబినెట్ ఎత్తు తగ్గించడంపై ఆగస్టు 28 నే తీర్మానం చేసినా, అందులో టీడీపీ క్యాబినెట్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సభ్యుడుగా ఉన్నా, ఆయన నోరు మెదపలేదట. దీనిని టీడీపీ,బీజేపీలు అత్యంత రహస్యంగా ఉంచాయి. ఎలాగైతేనేం అక్టోబర్ ఆఖరు నాటికి ఈ విషయం బయటకు వచ్చింది. దానిపై సమాధానం ఇవ్వడానికి మంత్రి నిమ్మల రామానాయుడు నీళ్లు నమిలారు. మామూలుగా అయితే సుదీర్ఘంగా ఉపన్యాసాలు, మీడియా సమావేశాలు పెట్టే చంద్రబాబు ఈ అంశం జోలికి వెళ్లినట్లు లేరు. దీనిని బట్టే ఎంత గుట్టుగా ఈ వ్యహారాన్ని సాగించాలని అనుకున్నది అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఎత్తు తగ్గించడం వల్ల వరద వస్తేనే ఈ ప్రాజెక్టు నీటిని విశాఖ వరకు తీసుకు వెళ్లడం కష్టసాధ్యం అవుతుందని చెబుతున్నారు. 195 టీఎంసీల బదులు 115 టీఎంసీల నీటి నిల్వకే అవకాశం ఉంటుంది. కేవలం ఒక రిజర్వాయిర్ గానే ఇది మిగిలిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతింటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్పందించే సీఎం కాని, మంత్రులు కాని, దీనిపై నోరు మెదపడం లేదు. ఓవరాల్ గా చూస్తే ఏపీకి సుమారు పాతిక వేల కోట్ల మేర కేంద్రం ఎగవేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు సందేహాలు వస్తున్నాయి. దానికి తోడు పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అంతటికి మేలు జరగాలన్న లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చు. ఇదంతా చూస్తే బీజేపీకి పొరుగు రాష్ట్రాలలో ఇబ్బంది లేకుండా చూడడానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారన్న విమర్శలకు ఆస్తారం ఇస్తున్నారనిపిస్తుంది. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పోలవరం ఎత్తు తగ్గింపు బాబు కుట్రే: అనంత వెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:కరువు మండలాల ప్రకటనలో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేవలం 17 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ విషయమై శుక్రవారం(నవంబర్ 1) ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి. చంద్రబాబు రైతు ద్రోహి. వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతంతో చంద్రబాబు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు చంద్రబాబు కుట్రే. పోలవరం ఎత్తు 45.72 అడుగుల నుంచి 41 అడుగులకు కుదించాలని నిర్ణయించడం ద్రోహమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఏపీకి సాగు తాగు నీటి కష్టాలు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విభజన చట్టాన్ని ఉల్లంఘించటమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ గతంలో బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు’అని అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు.ఇదీ చదవండి: అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు -
ఇటలీ ప్రధాని పొడవుపై కామెంట్స్.. జర్నలిస్టుకు జరిమానా
రోమ్: ఇటలీలో మహిళా జర్నలిస్టు గిలియా కోర్టిస్‌కు కోర్టు రూ.4.5లక్షల(5వేల యూరోలు) జరిమానా విధించింది. ప్రధాని జార్జియా మెలోని పొడవుపై మూడేళ్ల క్రితం ఎక్స్(ట్విటర్)లో కోర్టిస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెలోని కోర్టులో దావా వేశారు. ఈ దావాపై విచారణ పూర్తి చేసిన కోర్టు జర్నలిస్టు కోర్టిస్‌కు ఫైన్ వేసింది. ఫైన్ మొత్తాన్ని మెలోనికి చెల్లించాలని ఆదేశించింది. తనకు జరిమానా విధించడంపై కోర్టిస్ స్పందించారు. ఇటీవలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. స్వతంత్ర జర్నలిస్టులకు ఇటలీలో కష్టకాలం కొనసాగుతోందన్నారు. కోర్టు ద్వారా వచ్చే మొత్తాన్ని మెలోని చారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేస్తారని ఆమె న్యాయవాది తెలిపారు. -
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
సాక్షి,హైదరాబాద్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈసారి 70 అడుగుల వినాయకుడి విగ్రహాన్నిపెట్టనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం(జూన్17) గణేశ్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహ ఏర్పాటు ప్రారంభించామని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని సందర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నా ఎత్తు ఇప్పుడు తెలిసిందా? ప్రియాంకకు సింధియా కౌంటర్
భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ చాలా చోట్ల ఓటమితో వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో తన ఎత్తుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడు స్పందించారు. సింధియా ప్రభావం ఉన్న ప్రాంతంగా భావించే గ్వాలియర్ మాల్వా ప్రాంతంలో బీజేపీ ఆధిక్యాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘నా ఎత్తు గురించి ఎవరో మాట్లాడారు. గ్వాలియర్-మాల్వా ప్రజలు ఎంత ఎత్తులో ఉన్నారో చూపించారు’ అన్నారు. గత నెలలో డాటియాలో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ.. సింధియాపై విరుచుకుపడ్డారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ‘ద్రోహ’ అని ముద్ర వేశారు. ‘వాళ్ల (బీజేపీ) నాయకులందరూ కొంచెం విచిత్రంగా ఉంటారు. ముందుగా మా సింధియా.. నేను యూపీలో అతనితో కలిసి పనిచేశాను. వాస్తవానికి అతని ఎత్తు కొంచెం తక్కువగా ఉంది. కానీ అహంకారంలో మాత్రం ఘనుడు’ అంటూ విమర్శించారు. ఎన్డీటీవీతో సింధియా మాట్లాడుతూ ‘బీజేపీ గెలుస్తుందని నేను ముందే చెప్పాను. మాకు ఇంత పెద్ద మెజారిటీని అందించిన మధ్యప్రదేశ్ ఓటర్లకు ధన్యవాదాలు. బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వం పనిచేసింది’ అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందించిన ప్రజా, సంక్షేమ పథకాలు కూడా పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు. -
హైకోర్టు ఆవరణలో మళ్లీ ఎత్తు పరీక్ష
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత నోటిఫికేషన్లో ‘ఎత్తు’ విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులను తాజా నోటిఫికేషన్ కింద అనర్హులుగా ప్రకటించడంపై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు తమ పర్యవేక్షణలోనే ‘ఎత్తు’ పరీక్ష నిర్వహిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు ప్రాంగణంలోనే దీనికి సంబంధించిన కొలతలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఎత్తు విషయంలో అధికారులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, ఒక్కో పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. తాము ప్రతిపాదించిన విధంగా ఎత్తు కొలిచే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు.. ఎస్సై నియామక ప్రక్రియలో భాగమైన దేహదారు ఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలి చిన అధికారులు అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్లో అర్హులుగా ప్రకటించిన తమను ఎత్తు విషయంలో తాజా నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించారన్నారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు వెల్లడించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై శుక్రవారం జస్టిస్ నరేంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా ఎత్తు కొలిచామని ప్రభుత్వ న్యాయవాది జీవీఎస్ కిషోర్‌కుమార్ ధర్మాసనానికి నివేదించారు. ఈ పరీక్షలో పిటిషనర్లు అర్హత సాధించలేదన్నారు. అయితే, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి సరైన కోణంలో పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ.. 2018లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులు, తాజా నోటిఫికేషన్లో ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం, తమ పర్యవేక్షణలో హైకోర్టు ప్రాంగణంలోనే మరోసారి ఎత్తు పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. -
ఎవరు పొట్టి..పొడుగు
ఇంట్లో, బయటా, ఆఫీసులో, మరో చోట.. ఎక్కడైనా ఎవరో ఒకరిని కలుస్తూ ఉంటాం. కొందరు మనకన్నా పొడుగ్గా ఉంటే.. మరికొందరు పొట్టిగా ఉంటుంటారు. ఇది సాధారణమే. కానీ కొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొట్టిగా, మరికొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొడుగ్గా ఉంటుంటారు. వారిలో తరాలుగా వస్తున్న జన్యువులకుతోడు స్థానిక వాతావరణం, ఉష్ణోగ్రతలు, జీవన విధానం, పని పరిస్థితులు, వైద్యారోగ్య సౌకర్యాలు, పోషకాహారం వంటివి మనుషుల ఎత్తులో తేడాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇన్సైడర్ సంస్థ ప్రపంచంలో ఎత్తు తక్కువ జనాభా ఉన్న 25 దేశాలతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయా దేశాల ఆరోగ్యశాఖలు, వివిధ సర్వేలు, అధ్యయనాలను పరిశీలించి.. దీనిని సిద్ధం చేసింది. ఆయా దేశాల్లో బాగా పొడవుగా ఉన్నవారు కూడా ఉండొచ్చని, తాము సగటు ఎత్తును ప్రామాణికంగా తీసుకున్నామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను పరిశీలిస్తే.. దక్షిణాసియా, మధ్య ఆఫ్రికా దేశాల్లో జనంఎత్తు తక్కువగా ఉన్నారని నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని దేశాల్లో కూడా మహిళల కంటే పురుషుల ఎత్తు ఎక్కువని తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా నెదర్లాండ్స్ దేశస్తుల సగటు ఎత్తు 175.62 సెంటీమీటర్లుకాగా.. అమెరికాలో 172.21, చైనాలో 161.45 సెంటీమీటర్లుగా ఉంది. -
తెలంగాణ: డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. అభ్యర్థుల ఎత్తును 167 సెం.మీ నుంచి 165 సెం.మీకు తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. డీఎస్పీ అభ్యర్థుల ఎత్తు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ఎత్తు ఎక్కువగా ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ డిమాండ్‌కు తలొగ్గి.. ఇప్పుడు ఎత్తు తగ్గించి నిరుద్యోగులకు ఊరట ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చదవండి👉తెలంగాణ పోలీస్ నియామక అభ్యర్థులకు మరో గుడ్‌న్యూస్ -
అతడు 3 అడుగుల ఎత్తు.. ఆమె 5 అడుగులు.. వారికి ఓ చిన్నారి!
సాక్షి, వెబ్‌డెస్క్: అతడు నటుడు.. ఆమె టీచర్.. స్నేహితుల ద్వారా ఓ పబ్‌లో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది... మొదటి చూపులోనే ఆమె.. అతడిని ఇష్టపడింది.. అతడికి కూడా ఆమెపై ప్రేమ చిగురించింది.. ఇద్దరి మనసులు కలిశాకా ఇంకేం ఉంటుంది.. మూడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలాక.. ఓ మంచిరోజు చూసి ఐదేళ్ల కిత్రం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.. వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే రెండేళ్ల చిన్నారి ఒలీవియా. ఇందులో విశేషం ఏముంది.. సాధారణంగా లవ్స్టోరీలన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి కదా అంటారా..! అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఈ జంటను ప్రశంసించక మానరు! యునైటెడ్ కింగ్డంకు చెందిన జేమ్స్(33), చోలే లస్టడ్(27) ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. జేమ్స్ ఎత్తు 109.3 సెంటీమీటర్లు(మూడు అడుగుల 7 అంగుళాలు). ఆయన భార్య చోలే.. 166.1 సెం.మీ.(5 అడుగుల నాలుగు అంగుళాలు) ఎత్తు ఉంటారు. ఇద్దరి ఎత్తులో సుమారు 56.8 సెం.మీ. వ్యత్యాసం ఉంది. ఇదే.. వారు గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేందుకు దోహదం చేసింది. ప్రపంచంలోనే ఎత్తులో అత్యంత తేడా కలిగిన దంపతులుగా ఘనత సాధించేలా చేసింది. నిజానికి జేమ్స్‌కు డ్వార్ఫిజం డయాస్ట్రొఫిక్ డైస్ప్లాఏసియా అనే అరుదైన వ్యాధి వల్ల మరుగుజ్జుతనం వచ్చింది. చిన్న చిన్న లోపాలకే ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని వెళ్లిపోయే ఈ రోజుల్లో.. జేమ్స్‌ను పెళ్లి చేసుకుని, ఆయనతో జీవితాన్ని పంచుకుంటున్న చోలే నిజంగా చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తారని వీరి ప్రేమకథ తెలిసిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలైన ప్రేమ ముందు ఈ రికార్డులు చిన్నబోతాయని అంటున్నారు. ఏదేమైనా గిన్నిస్ రికార్డు సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏంటీ.. ప్రేమ గుడ్డిది అంటారా? కానేకాదు.. ఎదుటి వ్యక్తి మనసుని మనోనేత్రంతో మరింత లోతుగా చూడగలిగే మహోన్నత శక్తి గల పవిత్రమైన భావన.. కాదంటారా?! చదవండి: వధువు వాళ్లు మటన్ వండలేదని పెళ్లికొడుకు ఎంత పనిచేశాడు.. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
పోలీసు పరీక్షల్లో ఎత్తు ఇక పక్కా!
సాక్షి, హైదరాబాద్ : పోలీసు నియామక పరీక్షల్లో అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు అత్యంత ఆధునిక యంత్రాన్ని పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చింది. మెర్క్యురీ బ్యాలెన్స్ అనే అత్యాధునిక యంత్రాన్ని పోలీసు శాఖ కొనుగోలు చేసింది. ఇకపై తెలంగాణ పోలీసు శాఖ భర్తీ చేసే కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల్లో అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించే క్రమంలో దీని సేవలు వాడుకోనున్నారు. సాధారణంగా పురుషులు 167.6 సెంటీమీటర్లు, మహిళలకు 152.5 సెంటీమీటర్లు ఎత్తుగా నిర్ధారించారు. ఇందులో రిజర్వేషన్ల వారీగా కొన్ని వర్గాలకు కాస్త మినహాయింపు ఉంటుంది. గతంలో ఎత్తు విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదా ఎంపిక ప్రక్రియపై తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేసేవారు. ఇలాంటి వ్యవహారాల వల్ల నియామక ప్రక్రియను ప్రభావితం అయ్యే అవకాశముంది. దీనివల్ల ఇటు అభ్యర్థులు, అటు ఉన్నతాధికారులకు సమయం వృథా అవుతోంది. అందుకే, ఇకపై అలాంటి వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మెర్క్యురీ బ్యాలెన్స్ అనే యంత్రాన్ని తెలంగాణ పోలీసులు కొనుగోలు చేశారు. పూర్తిగా పాదరసం ఆధారంగా ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రం అభ్యర్థుల ఎత్తును అత్యంత కచ్చితంగా లెక్కగడుతుంది. అలాంటి ఇబ్బందులు ఇక ఉండవు.. ప్రభుత్వంలోని వేరే శాఖల్లో పనిచేసిన కొందరు అభ్యర్థులు తమ ఎత్తు విషయంలో సమర్పించే సర్టిఫికెట్లలో ఎత్తు విషయంలో వ్యత్యాసాలుంటాయి. సాధారణంగా నిబంధనలకు విరుద్ధంగా మిల్లీమీటర్ తేడా ఉన్నా పోలీసు శాఖలో అంగీకరించరు. కానీ, కొందరు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేసిన వారు, కొన్ని సంస్థల్లో శిక్షణ తీసుకున్న వారు తమ ఎత్తు విషయంలో నిజాలు దాస్తారు. వాస్తవంగా ఒకలా, వారు తెచ్చిన సర్టిఫికెట్లలో మరొకలా ఉంటుంది. వ్యత్యాసం స్వల్పమే అయినా.. వారి వాదన నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. వీరిలో చాలామంది చూపించే వ్యత్యాసం కూడా మిల్లీమీటర్లలోనే ఉంటుంది. ఇకపై అలా వాదించే వారికి మెర్క్యురీ బ్యాలెన్స్ మెషీన్ ఫలితాలనే సమాధానంగా చూపనున్నారు పోలీసులు.. త్వరలో పోలీసు శాఖలో 20 వేల పోస్టుల వరకు భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసు శాఖలో ఉన్న ఖాళీలపై డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీసు శాఖ కూడా సిద్ధంగా ఉంది. ఈసారి 6 లక్షలకు పైగా అభ్యర్థులు 20 వేల పోస్టులకు పోటీ పడవచ్చని అంచనా.. -
ఎవరెస్ట్ ఎత్తుపై చైనా అభ్యంతరం
బీజింగ్: ప్రంపచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ హైట్‌పై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎత్తును ఎక్కువ చెప్తుందని చైనా ఆరోపించింది. ఈ క్రమంలో పర్వతం హైట్‌ను ఖచ్చితంగా కొలవడం కోసం చైనా ఒక సర్వే బృందాన్ని బుధవారం ఎవరెస్ట్ మీదకు పంపింది. ఆరు దశలుగా పర్వతం హైట్‌ను కొలిచిన చైనా బృందం.. నేపాల్ ప్రభుత్వం చెబుతున్న దాని కంటే పర్వతం ఎత్తు 4 మీటర్లు తక్కువ ఉందని తేల్చింది. ప్రస్తుతం ఎవరెస్ట్ హైట్ 8844. 43 మీటర్లు అని చైనా సర్వే బృందం తెలిపింది. ఇప్పటి వరకు నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎత్తును 8,848 మీటర్లుగా చెప్తున్న సంగతి తెలిసిందే. టిబెటన్ భాషలో ఎవరెస్ట్ పర్వతాన్ని చోమో లుంగ్మా పర్వతం అంటారు. ‘ఈ పర్వతం మీద సంభవించే మార్పులు ప్రపంచ భూగర్భ శాస్త్రం, జీవావరణ శాస్త్రం అధ్యయనాలకు కీలకమైనవి. ఇది ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’ అని చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఇంజనీర్ చెన్ గ్యాంగ్ అన్నారు. చొమోలుంగ్మా పర్వతం ఎత్తును ఖచ్చితంగా కొలవడం వల్ల హిమాలయాలు, కింగ్హై-టిబెట్ పీఠభూమిలో సంభవించే మార్పులను అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాతావరణ భౌతిక శాస్త్రవేత్త గావో డెంగి చెప్పారు.(మ్యాపుల వివాదం.. నేపాల్ ప్రధానికి షరతులు!) అంతేకాక చైనా టెక్ సంస్థ హువావే, చైనా మొబైల్‌తో కలిసి ఎవరెస్ట్ శిఖరంపై రెండు 5 జీ స్టేషన్లను నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే గనక సాధ్యమైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన 5 జీ బేస్ స్టేషన్లుగా ఇవి నిలుస్తాయని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా హువావే ప్రాజెక్ట్ మేనేజర్ జాంగ్ బో మాటట్లాడుతూ.. ‘ఎవరెస్ట్‌పై 6,500 మీటర్ల ఎత్తు.. అత్యంత ఎత్తైన ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడే హువావే 5 జీ స్టేషన్‌ను నిర్మించాలని భావిస్తుంది. అయితే సిగ్నల్ 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరం వరకు విస్తరించగలదా, లేదా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నం సఫలం అయయ్యేందుకు మేం కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. -
ఎత్తు పెంచుతామనే ప్రకటనలన్నీ బోగసే
నా వయసు 21 ఏళ్లు. డిగ్రీ చదువుకుంటున్నాను. నా ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు మాత్రమే. నా ఫ్రెండ్స్ అందరూ నాకంటే అంతో ఇంతో ఎత్తుగా ఉన్నవారే. దాంతో ఎంతో ఆత్మన్యూనతకు గురవుతున్నాను. ఎలాగైనా పొడువు పెరగాలని ఉంది. టీవీల్లో ఎత్తు పెంచే అడ్వరై్టజమెంట్లు చూస్తున్నాను. ఆ ప్రకటనల్లో చూపించే మందులు వాడటం ఎత్తు పెరుగుతానా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. మీ వయసులో ఉన్న వారి ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. మీ వయసులో ఇలా అందరితోనూ పోల్చుకుంటూ ఉంటారు. ఐదడుగుల మూడు అంగుళాలంటే మీరు కాస్తంత రీజనబుల్ ఎత్తు ఉన్నట్లే అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మీకంటే కూడా పొట్టిగా ఉంటారు. పొడవునకు సంబంధించిన జన్యువులు తల్లిదండ్రుల నుంచి వస్తాయి. అయినప్పటికీ ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రుల ఎత్తు కాకుండా తాతముత్తాతల ఎత్తు కూడా పిల్లలకు రావచ్చు. అప్పుడు తల్లిదండ్రులు మామూలు ఎత్తులో ఉన్నా తాతముత్తాతల పొట్టిదనమూ పిల్లలకు రావచ్చు. ఇక దాంతోపాటు తినే ఆహారంలోని పోషకాలూ పిల్లల ఎత్తు పెరగడానికి దోహదం చేసే విషయమూ వాస్తవమే. అయితే ఎముకల చివర్లలో ఉండే గ్రోత్ ప్లేట్లలో పొడుగు పెరిగే అంశం వాళ్ల పదహారేళ్ల నుంచి పద్ధెనిమిదేళ్ల వయసులో ఆగిపోతుంది. మీరు మూడేళ్ల కిందటే ఆ వయసు దాటిపోయారు కాబట్టి దీని గురించి అస్సలు ఆలోచించకండి. మీ దృష్టినంతా చదువుపై కేంద్రీకరించండి. ఇక ఎత్తు పెంచుతామంటూ టీవీల్లో వచ్చే ప్రకటనల్లో కనిపించేవన్నీ ఏమాత్రం ప్రయోజనం ఇవ్వని వాణిజ్యపరమైన ఉత్పాదనలు మాత్రమే. వాటితో ఎత్తు పెరగడం అసాధ్యం. మీరు ఇప్పుడున్న ఎత్తు భారతీయ ప్రమాణాల ప్రకారం మీరు మంచి హైటే. కాబట్టి ఇలాంటి బోగస్ వాణిజ్య ప్రకటనలు చూసి మోసపోకండి. -
‘ఈశాన్య’ అభ్యర్థుల ఎత్తు కుదింపు
న్యూఢిల్లీ: భారత పారామిలటరీ బలగాల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసీ యువకులు, గూర్ఖాల చేరికను పెంచేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పారామిలటరీ బలగాల్లో కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే పురుష అభ్యర్థుల కనీస ఎత్తును తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుకు ఆదివాసీ యువకుల కనీస ఎత్తును 162.5 సెంటిమీటర్ల నుంచి 157 సెంటిమీటర్లకు తగ్గించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం(సీఐఎస్ఎఫ్)లో ఏఎస్సై పోస్టుకు ఆదివాసీ, గూర్ఖా యువకుల కనీస ఎత్తు 162.5 సెం.మీ, సబ్ఇన్స్పెక్టర్ పోస్టుకు 157 సెంటిమీటర్లు ఉండాల్సిందిగా నిర్ధారించారు. ఈ నిబంధనలు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సామ్ రైఫిల్స్ వంటి సంస్థలకు వర్తిస్తాయి. -
మందులతో ఎత్తు పెరగరు...
మందులతో ఎత్తు పెంచుతామంటూ ఎవరైనా మిమ్మల్ని మభ్యపెడితే నమ్మకండి. అలా మందులతో ఎత్తు పెరుగుతారనేది ఏమాత్రం నిజం కాదు. ఏ వ్యక్తి ఎంత ఎత్తు పెరగాలన్నది జన్యుపరంగా ముందుగానే నిర్ణయమైపోతుంది. సాధారణంగా తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే పిల్లలూ ఎత్తుగా పెరుగుతారు. ఎత్తు పెంచడానికీ లేదా తగ్గించడానికి మందులేమీ లేవు. పిల్లలు ఎత్తు పెరిగే ప్రక్రియలో రెండు దశలుంటాయి. వాటిని లాగ్ ఫేజ్ అనీ, ల్యాగ్ ఫేజ్ అంటారు. ఇందులో లాగ్ ఫేజ్‌లో పిల్లలు తటాలున ఎత్తు పెరుగుతారు. ఆ తర్వాత వారి ల్యాగ్ ఫేజ్‌లో ఆ పెరుగుదల కాస్తంత మందకొడిగా సాగుతుంది. ఈ దశలో వారు మహా అయితే ఒకటి లేదా రెండు అంగుళాలు పెరిగి... ఆగిపోతారు. అందుకే యుక్తవయస్సులోకి అడుగుపెట్టిన పిల్లలను చాలాకాలం చూడని వారు అకస్మాత్తుగా చూస్తే వాళ్లు బాగా పొడవైనట్లుగా అనిపిస్తుంది. ఈ లాగ్, ల్యాగ్ ఫేజ్‌లు సాధారణంగా 19–21 ఏళ్ల వరకు కొనసాగుతుంటాయి. అంటే... ఎవరిలోనైనా ఎత్తు పెరగడం అన్న ప్రక్రియ సాధారణంగా 21 ఏళ్లు వచ్చేసరికి పెరిగే ఎముక చివర ఫ్యూజ్ అయిపోయి పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి ఆ తర్వాత ఎలాంటి మందులు వాడినా అది ప్రయోజనం ఇవ్వదు. ఈ విషయాన్ని గ్రహించి, మందుల ద్వారా ఎత్తు పెంచవచ్చని మోసపుచ్చే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎత్తుకూ వ్యక్తిగత సామర్థ్యాలకు సంబంధం లేదు. కాబట్టి ఎత్తు పెరగడం అన్న అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. -
తక్కువ ఎత్తుంటే కండక్టర్ ఉద్యోగమివ్వరా!
టీఎస్ఆర్టీసీ చర్యలపై హైకోర్టు విస్మయం సాక్షి, హైదరాబాద్: ఎత్తు తక్కువ ఉన్నారన్న కారణంతో ఓ మహిళకు కారుణ్య నియామకం కింద కండక్టర్ పోస్టు ఇవ్వడానికి టీఎస్ఆర్టీసీ నిరాకరించడంపై ఉమ్మడి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కండర్ పోస్టుకు అవసరమైన ఇతర అర్హతలన్నీ ఉన్నప్పటికీ, ఎత్తు తక్కువ ఉన్నారన్న కారణంతో కారుణ్య నియామకాన్ని తిరస్కరించడానికి వీల్లేదంది. ఎత్తుతో నిమిత్తం లేకుండా బి.అన్నపూర్ణ, రహీమా, కె.అనితకు కండక్టర్ పోస్టులు ఇవ్వాలని ఆర్టీసీకి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు. గతంలో 150 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉన్న మహిళలకు కండక్టర్ పోస్టులు ఇచ్చారని, వారు ఇప్పుడు ఆ పోస్టుల్లో కొనసాగుతున్నారని న్యాయమూర్తి తన తీర్పులో గుర్తు చేశారు. తక్కువ ఎత్తు మహిళలు కండక్టర్ విధులను నిర్వర్తించేటప్పుడు గాయాలపాలయ్యే అవకాశం ఉందన్న ఆర్టీసీ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. మహిళల పట్ల వివక్షను రూపుమాపేందుకు అంతర్జాతీయ ఒప్పందంపై భారత్ సంతకం చేసిందని న్యాయమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కీలకమైన ప్రభుత్వ సంస్థ టీఎస్ఆర్టీసీ ఉద్యోగ కల్పనలో వివక్షను రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎత్తుకు ప్రాధాన్యత లేదు: సింధు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో తాను గెలిచిన ప్రతీ మ్యాచ్ ఒక సవాల్‌గానే ఉందని భారత షట్లర్, రజత పతక విజేత పివి సింధు స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్రపతి భనవ్‌లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందుకున్న సింధు.. తన రియో ఒలింపిక్స్ ప్రస్థానం గురించి వివరించింది. రియో ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయి రజతం సాధించినా, ప్రతీ మ్యాచ్ కూడా తుది పోరు తరహాలోనే ఆడాల్సి వచ్చిందని తెలిపింది. ' రియోలో ప్రతీ మ్యాచ్ నాకు సవాల్‌గానే ఉంది. ఆడిన ప్రతీ మ్యాచ్ ఫైనల్ పోరునే తలపించింది. మ్యాచ్‌లకు ముందు కోచ్ గోపీచంద్‌తో కలిసి గేమ్ వ్యూహంపై చర్చించే వాళ్లం. ఇలా చేయడం మ్యాచ్‌ల్లో విజయం సాధించడానికి చక్కగా ఉపయోగపడింది' అని సింధు తెలిపింది. కాగా, రియో ఒలింపిక్స్‌లో సింధు చక్కటి ఆటతీరుతో ఆకట్టుకోవడం వెనుక ఆమె ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు కూడా ప్రధాన పాత్ర పోషించిందంటూ చర్చలు సాగాయి. దీనిపై స్పందించిన సింధు.. బ్యాడ్మింటన్‌లో ఎత్తు అనేది ఎప్పుడూ ప్రధానం కాదని తెలిపింది. అసలు షట్లర్లకు ఎత్తుతో పనిలేదని సింధు అభిప్రాయపడింది. -
ఎత్తు తక్కువుంటే ‘ప్రిమెచ్యూర్ బేబీ’ ప్రమాదం
మెల్బోర్న్: ఎత్తు తక్కువగా ఉన్న గర్భిణులకు నెలలు నిండకముందే ప్రసవమయ్యే ప్రమాదం.. సాధారణ లేదా పొడవైన మహిళల కన్నా రెండింతలు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఎత్తు తగ్గుతున్న కొద్దీ నెలలు నిండకముందే ప్రసవం జరిగే ప్రమాదం అంతగా పెరుగుతుందని స్వీడన్‌లోని ఉప్సల, న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ వర్సిటీల అధ్యయనం హెచ్చరించింది. 155 సెంటీమీటర్లు అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్న మహిళల పిల్లల్లో 9.4% మంది పూర్తిగా నెలలు నిండకముందే పుట్టినవారు కాగా, 1.1% మంది 8 నెలలు కూడా నిండకముందే జన్మించినవారని, ఇది పొడవైన వారిలో వరుసగా 4.7%, 0.5%గా ఉందని తేలింది. స్వీడన్‌లోని 1.92 లక్షలమంది మహిళలపై ఈ అధ్యయనం చేశారు. -
‘నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి’
ముంబై: ఒడ్డూ పొడువు, ముక్కూ మూతి చక్కంగా ఉన్న టీనేజ్ కుర్రాళ్లకే గర్ల్ ఫ్రెండ్ దొరకడం కష్టం. అటువంటిది ఆరడుగుల ఏడు అంగుళాల పొడవున్న బక్క పలచటి 14 ఏళ్ల యశ్వంత్ రౌత్‌కు గర్ల్ ఫ్రెండ్ కావాలంటే మాటలా! పైగా ఈ కుర్రాడు కచ్చితంగా ఎనిమిది అడుగుల వరకు పొడుగు పెరుగుతాడని డాక్టర్లు చెబుతున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన స్కూల్ బాయ్ యశ్వంత్‌కు తన పెళ్లికి సరిజోడు దొరకదని ఇప్పటి నుంచే బెంగ పట్టుకున్నది. తాను ఎనిమిది అడుగుల వరకు పెరిగితే పెళ్లికి సరిజోడు దొరక్క పోవచ్చని, బహూశ ఆ వయస్సులో పెళ్లి కూడా జరక్క పోవచ్చని బాధ పడుతున్నాడు. కనీసం ఈ ఎత్తుకు ఈ వయస్సులోనైనా గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాగుండునని, తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతున్నదని తనను కలసిని ఓ మీడియాతో వాపోయాడు. ‘నా కాళ్లకు సరిపడ 15 నెంబర్ బూట్లే కష్టంగా దొరికాయి. నాకు టైలర్ ప్యాంట్ కుట్టాలన్నా ఇబ్బంది పడతారు. ఇక నిత్య జీవితంలో నేను పడే ఇబ్బందులు అంతా ఇంతా కావు. స్కూల్ డెస్క్‌లో సరిగ్గా కూర్చోలేను. తరగతి గదిలోకి వెళ్లాలన్నా, ఇంట్లో గుమ్మాలు దాటాలన్నా వంగి, వంగి ఇబ్బంది పడాల్సిందే. మంచం మీద పడుకుంటే చేతులు, కాళ్లు బయటే. బస్సెక్కాలంటే టాప్ లేచిపోద్ది. కారులో సరిగ్గా కూర్చోలేను. నలుగురిలోకి వెళితే అందరూ నావైపే చూస్తారు. కొందరు లంబూ అంటారు. కొందరు అమితాబ్ బచ్చన్ అంటారు. అప్పుడప్పుడు నన్ను వీధిలో నిలబెట్టి ఫొటోలు తీసుకుంటుంటే మాత్రం సెలబ్రిటి అయిపోయాననిపిస్తుంది. పొడుగు పెరగాలని అనుకున్నాను. కానీ మరింతలా కాదు. నా పొడువు బాస్కెట్ బాల్ ఆటకు సరిపోతుంది కనుక బాస్కెట్ బాల్ క్రీడాకారుడిని కావాలని, ఏదో రోజు భారత్ తరఫున ఆడాలని కోరుకుంటున్నాను’ అని యశ్వంత్ తన గురించి తాను చెప్పుకొచ్చాడు. యశ్వంత్ తండ్రి బ్రహ్మదేవ్ రౌత్ ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగుళాలే. తల్లి సుమన్ రౌత్ నాలుగు అడుగుల ఐదు అంగుళాలే. వారికి పుట్టిన యశ్వంత్ ఇంత పొడువు అవుతారని వారు కలలో కూడా అనుకోలేదు. బిడ్డ కడుపులో ఉండగా, ఏం తిన్నావంటూ ఇరుగు పొరుగు వారు అప్పుడప్పుడు తనను అడుగుతుంటారని సుమన్ తెలిపారు. ఏం తిన్నానో తనకే గుర్తు లేదని, ఇక తానేమి చెబుతానని అన్నారు. ప్రస్తుతం సామాజికంగా తన కొడుకుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. అందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాలని వారు సూచించారని తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కెవిన్ బ్రాడ్ఫోర్డ్ 18 ఏళ్ల లోపు కేటగిరీలో గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన పొడవు ఏడు అడుగుల ఒక అంగుళం ఉన్నారు. ఆయన పొడవును క్రాస్ చేశాక యశ్వంత్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఇక భారత్‌లో అత్యంత పొడవైన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 32 ఏళ్ల ధర్మేంద్ర సింగ్. ఆయన పొడవు ఎనిమిది అడుగుల ఒక అంగుళం. -
ఇవి రోజూ తింటే పొడవు పెరుగుతారట!
సరైన ఎత్తు పెరగాలని అందరూ కోరుకుంటారు. టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు దోహదపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.. 1. ఎర్ర ముల్లంగి ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్లు అధికంగా ఉంటాయి. 2. బీన్స్ ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపద ర్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. 3. బెండకాయ ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటవిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. 4. బచ్చలికూర ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. సాధరణంగా దీనిని దక్షణ ఆసియాలో వాడుతారు. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటుంది. 5. బఠాని బఠానిలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటిన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. 6. అరటిపండు బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. 7. సోయాబీన్ ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రే ట్స్ అధిక స్థాయిలో ఉంటాయి. 8. పాలు రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు.దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది. -
ఆదాయంపై ఎత్తు, బరువు ప్రభావం
లండన్ః పర్సనాలిటీని బట్టే ఫలితాలుంటాయంటున్నారు తాజా పరిశోధకులు. పొట్టిగా ఉన్న పురుషులు, లావుగా ఉన్న మహిళలపై సామాజిక, ఆర్థిక, విద్య, వృత్తి పరమైన ప్రభావాలు చూపుతాయంటున్నారు అధ్యయనకారులు. అంతేకాదు వారి ఆదాయంపై కూడా శరీరాకృతి ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగల్గుతారంటారు. దానికి వ్యక్తిత్వం, భావజాలం కూడా, ఓక్కోసారి సహకరిస్తుంటాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు తెలిపాయి. అయితే మాట తీరు మాత్రమే కాదు.. పొట్టి పొడుగులు, లావు సన్నాలు కూడా వారి సామాజిక జీవితంపై ప్రభావం చూపిస్తాయంటున్నాయి తాజా అధ్యయనాలు. ఒక వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితులతోపాటు... ముఖ్యంగా మహిళల శరీర ద్రవ్యరాశి సూచిక అనేక అంశాలు నిర్ణయించడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్తున్నారు బ్రిటన్ ఎక్సెటర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తిమోతి ఫ్రేలింగ్. తమ అధ్యయనాలను బిఎంజె జర్నల్ లో నివేదించారు. వ్యక్తి సామాజిక ఆర్థిక స్థితికి కారణభూతమౌతున్న బాడీమాస్ ఇండెక్స్ పాత్రను పరిశోధకులు పరీక్షించారు. బ్రిటన్ బయోబ్యాంక్ డేటాబేస్ లోని 40 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న సుమారు లక్షా ఇరవై వేలమంది జీవ సంబంధ సమాచారాన్ని సేకరించిన అధ్యయనకారులు... మెండెల్ ర్యాండమైజేషన్ గా పిలిచే సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల ఎత్తు, శరీర ద్రవ్యరాసి సూచికల ప్రభావాలు, జన్యు పరమైన వైవిధ్యాలను విశ్లేషించారు. పాఠశాల, డిగ్రీస్థాయి విద్య ముగిసిన సమయం, ఉద్యోగం, తరగతి, వార్షిక కుటుంబ ఆదాయం, సామాజిక లేమి వంటి ఐదు ప్రధానాంశాలతో పురుషులు, మహిళలపై విడివిడిగా పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా స్థూలకాయులైన మహిళలపై సామాజిక, ఆర్థిక ప్రభావం పడుతోందని, అదే పొడుగ్గా ఉండే పురుషులకు అనుకూలంగా ఉన్నట్లు పరిశోధనల్లో నిర్థారించారు. -
పొడగరులకు కేన్సర్ ముప్పు ఎక్కువట!
పరిపరి... శోధన ఆకర్షణీయంగా కనిపించే పొడగరులను అందరూ అబ్బురంగా చూస్తారు గానీ, వారికి కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందట! ఎదుగుదలను కుదించుకున్నట్లు కనిపించే పొట్టివాళ్లకు ఇలాంటి ప్రమాదమేదీ లేదట! పొట్టిగా ఉండటమా, పొడవు పెరగడమా అనేది మన చేతుల్లో లేదు. అంతా జన్యువుల మహిమ. అయితే, పొట్టి వాళ్లతో పోలిస్తే, కేన్సర్ సోకే ముప్పు పొడగరులకే ఎక్కువగా ఉంటుందని స్వీడిష్ పరిశోధకులు చెబుతున్నారు. సగటు ఎత్తు కంటే అదనంగా పెరిగే పది సెంటీమీటర్లకు ఈ ముప్పు గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. అదనంగా పది సెంటీమీటర్ల ఎత్తు ఉండే మహిళలకు ఈ ముప్పు 18 శాతం మేరకు, పురుషులకు 11 శాతం మేరకు ఎక్కువగా ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందని స్టాక్‌హోమ్ వర్సిటీకి చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. -
ఆ ఎత్తు వేయకపోయుంటే...
మన ఆనంద్ మరోసారి ఓడిపోవడం బాధగా ఉంది. ఈ గేమ్ కోసం అతను చాలా చక్కగా సన్నద్ధమై వచ్చినట్లు ఆరంభంలో కనిపించింది. 26వ ఎత్తు వరకు కూడా మొగ్గు విషీ వైపే ఉంది. అయితే రూక్ని బి4లోకి పంపడం ద్వారా అతను చాలా పెద్ద తప్పు చేశాడు. ఈ ఎత్తు వేయడంతో అతను తొందర పడ్డాడు. దాని టైమింగ్ తప్పు అనేది నా అభిప్రాయం. కాస్త ఆగి ఉండాల్సింది. బహుశా పాన్‌ను ముందుకు తీసుకెళ్లి క్వీన్‌ను చేద్దామనే ఆలోచన కావచ్చు! కానీ బలి అవుతుందని తెలిసినప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి. ఈ ఎత్తు వేసేటప్పుడు ఆనంద్ అతి ధైర్యవంతుడిగా, అతి ఆశావాదిగా కనిపించాడు. బహుశా ఈ సమయంలో తాను అనుకున్న వ్యూహం మర్చిపోయి ఉంటాడు లేదా విజయంపైనే దృష్టి నిలపడం వల్ల ‘డ్రా'కు ఉన్న అవకాశాల గురించి కూడా ఆలోచించలేదేమో. ఇలాంటి అవకాశం ఇస్తే కార్ల్సన్లాంటి ఆటగాడు వదిలేస్తాడా. అందుకే ఎక్కడా పట్టు విడవకుండా, మరో చాన్స్ లేకుండా దూసుకుపోయాడు. చెన్నైతో పోలిస్తే ఈ టోర్నీలో ఆనంద్ ప్రదర్శన చాలా బాగుంది. ఎన్నో సార్లు విజయానికి చేరువలో కూడా వచ్చాడు. కానీ సఫలం కాలేకపోయాడు. ఓటమి విషీని బాధ పెట్టడం సహజమే కానీ అతని గొప్పతనం తగ్గదు. భవిష్యత్ టోర్నీలపై కూడా దీని ప్రభావం ఉండదని నేను భావిస్తున్నా. - పెంటేల హరికృష్ణ, చెస్ గ్రాండ్ మాస్టర్ -
ఎదగడానికెందుకురా తొందర..
ఈ పాట మనోడు విన్నట్లు లేడు.. రోజురోజుకూ రేవులో తాటిచెట్టులా బారుగా ఎదిగిపోతున్నాడు. వీడి పేరు కరణ్ సింగ్. వయసు కేవలం 5 ఏళ్లే. వీడి పక్కన మరుగుజ్జుల్లా కనిపిస్తున్న వాళ్లు కరణ్‌సింగ్ క్లాస్మేట్స్. మామూలుగా కరణ్ వీళ్ల సైజులోనే ఉండాలి. కానీ ఇంతున్నాడు. కరణ్ మామూలోడు కాడు. పుట్టినప్పుడే గిన్నిస్ రికార్డు కొట్టాడు. 2008లో వీడు పుట్టినప్పుడు 7 కిలోల బరువు, 2 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తున్నాడట. దీంతో అప్పట్లో అత్యంత పొడవైన, బరువైన శిశువు కింద గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. మళ్లీ గిన్నిస్ వాళ్లు టేపు పట్టుకుని లెక్కేస్తే.. ప్రస్తుతం ప్రపంచంలో 5 ఏళ్ల వయసున్న పిల్లల్లో కరణే అందరికన్నా ఎక్కువ ఎత్తు ఉంటాడట. వీళ్లింట్లో కూడా అందరూ బాగా హైట్ ఉన్నవారే. కరణ్ తండ్రి సంజయ్ సింగ్ ఎత్తు 6 అడుగుల 6 అంగుళాలు అయితే.. వాళ్లమ్మ స్వెత్లానా హైట్ 7 అడుగుల 2 అంగుళాలు. -
ఎత్తు తక్కువని దిగులేలనోయి!
ఎత్తయిన మగాడికి ఒనగూరుతున్న ప్రయోజనాలు, పొడుగు తక్కువున్న పురుషులు పొందుతున్న లాభాలను పోల్చి చూస్తే పొట్టి వారికి ప్రయోజనాలు ఎక్కువున్నట్లూ, వారి కాపురాలు బాగున్నట్లూ ఓ తాజా సర్వేను బట్టి తెలుస్తోంది. మగాడిని మొగుడిగా చేసుకోవడానికి ఆడవారు ఎక్కువగా చూస్తున్న ప్రధాన లక్షణాల్లో ఎత్తు ఒకటి. ఎత్తుగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇదమిత్థంగా ఆడవారు చెప్పలేకపోయినా కూడా దాన్ని నమ్ముతూ వచ్చారు. కానీ, వారి నమ్మకాన్ని ఇప్పుడు పరిశోధకులు పటాపంచలు చేశారు. పొట్టివాడు గట్టివాడు మాత్రమే కాదు, మంచివాడని కూడా తేల్చారు! పొడుగాటి మొగుడి వల్ల స్త్రీలు ఆశిస్తున్న ప్రయోజనాలు అనేకం. పొడుగాటి భర్త వల్ల సామాజిక గుర్తింపు మాత్రమే కాక, వారి వల్ల భద్రత పరంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతూ వచ్చారు. కానీ, నిజానికి అలాంటి భద్రతాపరమైన ఉపయోగాలు వందమందిలో ఆరేడు మంది స్త్రీలకు కూడా కలగడం లేదట. అంటే, పొడుగాటి భర్త వల్ల భార్యలు ఆశిస్తున్న ప్రధాన ప్రయోజనం నిజంగా నెరవేరడం లేదని తేలిపోయింది. చాప్మాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఫ్రెడరిక్, న్యూయార్క్ విశ్వవిద్యాలయం సోషియాలజిస్ట్ డాల్టన్ కోన్లీ, పరిశోధక విద్యార్థి వెయిజ్ మెన్ వేర్వేరుగా జరిపిన పరిశోధనలు, అధ్యయనాల ఫలితాలు మరో సంగతి కూడా తెలిపాయి. ఈ ఫలితాల క్రోడీకరణ అనంతరం ఎత్తయిన మగాడికి జరుగుతున్న ఒనగూరుతున్న ప్రయోజనాలు, పొడుగు తక్కువున్న పురుషులు పొందుతున్న లాభాలను పోల్చిచూస్తే పొట్టివారికి ప్రయోజనాలు ఎక్కువున్నట్లూ వారి కాపురాలు బాగున్నట్లూ తెలుస్తోంది.ఎత్తయిన వారికి త్వరగా పెళ్లి సంబంధాలు కుదరడం, బాగా చదువుకున్నవారి సంబంధాలు రావడం, మెరుగైన సంబంధాలు రావడం జరుగుతుంటుంది. అయితే వీరికి రిస్కులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కాస్త చైతన్యం ఉన్నవారు, దూకుడుగా ఉన్నవారు వీరికి భార్యలుగా వస్తున్నారట. దీనివల్ల ఈ పొడుగాటి మగాళ్ళలో విడాకుల రేటు కూడా ఎక్కువగా ఉంటోందట. ఎక్కువగా చదువుకున్న వారు సాధారణంగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ భర్తతో హోదా పోలికలు పెట్టుకోవడం కూడా ఈ విడాకుల రేటు పెరగడానికి కారణమట. అంతమాత్రాన పొడుగ్గా ఉన్న వారి కాపురాలన్నీ కూలుతున్నాయని ఈ సర్వే చెప్పడం లేదు. ఇతరులతో పోలిస్తే ఈ వర్గంలో విడాకుల రేటు ఎక్కువ అన్నది వారు ప్రస్తావిస్తున్న విషయం. ఇక తక్కువ ఎత్తున్న పురుషులకు పరోక్షంగా కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి. చాలామంది ఎత్తును లోపంగా చూడడం వల్ల వీరికి పైపై ఆర్భాటాలకు ప్రాధాన్యమిచ్చే సంబంధాలు తప్పిపోయి ఒక రకంగా వీరికి మేలు చేస్తున్నాయి. ఎత్తు తక్కువున్నవాళ్ళు నిజంగా తమ బలహీనత అనుకుంటున్న విషయమే, వారికి ఎక్కువ మేలు చేస్తోంది. ఎత్తు కన్నా ముఖ్యమైన లక్షణాలను తమలో పెంపొందించుకోవడంలో భాగంగా వీరు ఆదాయం, ఇతర విషయాల్లో తమ జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారు. దీంతో పెళ్లిళ్లు కొంత ఆలస్యం అయినప్పటికీ, కాబోయే భార్యాభర్తలిద్దరూ తమ వివరాలను చెప్పుకోవడం వల్ల చాలా విషయాల్లో పెళ్లికి ముందే స్పష్టత వస్తోంది. దీంతో వీరి కాపురాలు నిలబడటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఎత్తును తమ బలహీనతగా భావించే పురుషులు భార్య ప్రేమను పొందడానికి ఇంటిపనులోనూ బాగా సాయమందుకుంటారు. దీనివల్ల కూడా దంపతుల మధ్య బంధాలు మరింత బలపడుతూ దాంపత్యాలు ఎక్కువ కాలం నిలుస్తున్నాయట. 23-45 ఏళ్ళ మధ్య వారిపైనే జరిగిన ఈ సర్వేలో 5 వేల మందికి పైగా మగాళ్లు పాల్గొన్నారు. దాన్నిబట్టి ఐదున్నర అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వారి కాపురాలు మరింత సంతృప్తిగా ఉన్న విషయం తేలింది! అన్నట్లు... ఈ సమాచారం మిమ్మల్ని ఆలోచనలో పడేస్తే వెంటనే న్యూయార్క్ యూనివర్సిటీని సంప్రదించండి గానీ మాకు మాత్రం ఏం సంబంధం లేదండోయ్! - ప్రకాష్ చిమ్మల -
రానా దగ్గుబాటికి షాక్ ఇచ్చిన కుర్రాడు!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి ఓ ప్రత్యేకత ఉంది. దక్షిణాది హీరోల్లో రానా అందరికంటే పొడగరి. ఆ మాటకొస్తే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ కంటే కూడా రానా పొడుగ్గా ఉంటారు. అందుకే ఏ ఫంక్షన్‌కు వెళ్లినా యువ హీరో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటారు. ఇట్టే అందరి దృష్టిలో పడతారు. అలాంటి రానాకు ఈ మధ్య ఓ ఫంక్షన్లో ఓ కుర్రాడు ఎదురుపడ్డాడు. అతణ్ని చూడగానే రానా ఒకింత షాక్‌కు గురయ్యారు. విషయమేంటంటే రానా కంటే ఆ కుర్రాడు చాలా పొడుగ్గా ఉంటాడు. ఆ కుర్రాడిని చూసి అబ్బురపడిన రానా అతని దగ్గరికి వెళ్లి ముచ్చటించారు. రానా ఆ కుర్రాడి భుజాల కంటే తక్కువ ఎత్తు ఉన్నారు. అతనితో కలసి ఫొటో దిగారు.