Hong Kong Open (Badminton)
-
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ
హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. హాంకాంగ్‌లోని కౌలూన్ పట్టణంలో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–9, 21–10తో భారత్ తరఫున బరిలోకి దిగిన తెలంగాణ జోడీ కోనా తరుణ్–శ్రీకృష్ణప్రియపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో గో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా)లతో సిక్కి–సుమీత్ తలపడతారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అశిత్ సూర్య–అమృత (భారత్) జంట 16–21, 20–22తో మింగ్ చె లు–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రియాన్షు రజావత్ (భారత్) 9–21, 21–16, 9–21తో టకుమా ఉబయాషి (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 16–21, 16–21తో సులి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తాన్యా హేమంత్ (భారత్) 16–21, 21–23తో కొమాంగ్ అయు కాయదేవి (ఇండోనేసియా) చేతిలో... ఆకర్షి కశ్యప్ (భారత్) 15–21, 9–21తో అయా ఒహోరి (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
ముగిసిన భారత్ పోరు
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు ఓటమి చవిచూశాయి. గాయత్రి–ట్రెసా 8–21, 14–21తో అప్రియాని రహాయు–సితి ఫాదియా (ఇండోనేసియా)ల చేతిలో... అశి్వని–తనీషా 18–21, 7–21తో టాప్ సీడ్ మయు మత్సుమోటో–వకాన నగహారా (జపాన్)ల చేతిలో పరాజయం పాలయ్యారు. గాయత్రి, అశ్విని జోడీలకు 1,575 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా జోడీ
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బుధవారం అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ మినహా మిగతా భారతీయ క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని–తనీషా ద్వయం 21–19, 21–19తో లి చియా సిన్–టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 16–21, 21–16, 18–21తో చెన్ టాంగ్ జీ–తో ఈ వె (మలేసియా) జంట చేతిలో... సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 10–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–టాన్ వె హాన్ జెస్సికా (సింగపూర్) జోడీ చేతిలో ఓడిపోయాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్య సేన్ బరిలోకి దిగకుండా తన ప్రత్యరి్థకి ‘వాకోవర్’ ఇవ్వగా... ప్రియాన్షు రజావత్ 13–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆకర్షి 18–21, 10–21తో వైయోన్ లీ (జర్మనీ) చేతిలో, మాళవిక 14–21, 12–21తో జాంగ్ యి మాన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ (భారత్) ద్వయం 14–21, 19–21తో సుంగ్ హున్ కో–బేక్ చోల్ షిన్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది. -
గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 54 నిమిషాల్లో 21–15, 16–21, 21–16తో జిలీ డెబోరా–చెరిల్ సీనెన్ (నెదర్లాండ్స్) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ అప్రియాని రహాయు–సితీ ఫాదియా సిల్వా (ఇండోనేసియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి మాళవిక బన్సోద్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందగా... పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి కిరణ్ జార్జి, రవి చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం మెయిన్ ‘డ్రా’కు చేరింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సుమీత్–అశ్విని జోడీ 21–15, 21–14తో అలి్వన్ మొరాదా–అలీసా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ క్వాలిఫయింగ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ 21–16, 21–14తో సిక్కి రెడ్డి–ఆరతి జంటపై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. -
సెమీస్‌లో శ్రీకాంత్
హాంకాంగ్: అదృష్టం కలిసి వస్తుండటంతో... హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌ను శ్రీకాంత్ 21–13తో గెలిచిన తర్వాత... గాయం కారణంగా చెన్ లాంగ్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఓవరాల్‌గా చెన్ లాంగ్‌పై శ్రీకాంత్‌కిది రెండో విజయం. గతంలో ఆరుసార్లు చెన్ లాంగ్ చేతిలో శ్రీకాంత్ ఓడిపోయాడు. ఈ ఏడాది మార్చిలో ఇండియా ఓపెన్ టోర్నీలో సెమీస్ చేరిన తర్వాత శ్రీకాంత్ మరో టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశను అధిగమించడం ఇదే తొలిసారి. నేడు జరిగే సెమీఫైనల్లో లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో ఆడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో లీ చెయుక్ యియు 21–14, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో శ్రీకాంత్ తలపడాల్సింది. అయితే మొమోటా టోర్నీ నుంచి వైదొలగడంతో శ్రీకాంత్‌కు తొలి రౌండ్లో వాకోవర్ లభించింది. మొమోటా చేతిలో శ్రీకాంత్ ఇప్పటివరకు 12 సార్లు ఓడిపోయి, మూడుసార్లు గెలిచాడు. శ్రీకాంత్ చివరిసారి మొమోటాపై 2015లో గెలుపొందడం గమనార్హం. -
సింధు నిష్క్రమణ
హాంకాంగ్: ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట సింధు మళ్లీ నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్లో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... హెచ్.ఎస్.ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ సింధు 18–21, 21–11, 16–21తో తనకంటే దిగువ ర్యాంకులో ఉన్న బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో కంగుతింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–11, 15–21, 21–19తో భారత సహచరుడు సౌరభ్ వర్మపై గెలుపొందాడు. మిగతా మ్యాచ్‌ల్లో హెచ్.ఎస్.ప్రణయ్ 12–21, 19–21తో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూడగా, రెండో సీడ్ చౌతియెన్ చెన్ (చైనీస్ తైపీ) 12–21, 23–21, 21–10తో పారుపల్లి కశ్యప్‌పై చెమటోడ్చి నెగ్గాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 19–21, 12–21తో నాలుగో సీడ్ యుత వతనబె–అరిస హిగషినొ జోడీ చేతిలో కంగుతింది. -
సైనా ఇంటికి... సింధు ముందుకు
హాంకాంగ్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ... హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ సింధు కేవలం 36 నిమిషాల్లో 21–15, 21–16తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. అయితే భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. సైనా 13–21, 20–22తో కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓడింది. సైనా తాను ఆడిన గత ఆరు టో ర్నీల్లో ఐదుసార్లు తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సాయిప్రణీత్ పరాజయం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రపంచ పదో ర్యాంకర్ సాయిప్రణీత్ 21–11, 18–21, 12–21తో మూడో సీడ్ షి యుకి (చైనా) చేతిలో... సమీర్ వర్మ 11–21, 21–13, 8–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. పారుపల్లి కశ్యప్ 21–18, 16–21, 21–10తో కెంటా నిషిమోటో (జపాన్)పై, ప్రణయ్ 21–17, 21–17తో హువాంగ్ జియాంగ్ (చైనా)పై, సౌరభ్ వర్మ 21–11, 21–15తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. శ్రీకాంత్‌కు టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) నుంచి వాకోవర్ లభించింది. సాత్విక్–చిరాగ్ జంట ఓటమి పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాతి్వక్ సాయి రాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–17, 16–21, 17–21తో టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) జంట చేతిలో.... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 13–21, 12–21తో మైకెన్–సారా తిగెసన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యాయి. -
ఓటమి అంచుల నుంచి...
కౌలూన్ (హాంకాంగ్): ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా నాలుగు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ విజయం రుచి చూశాడు. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భాగంగా భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌తో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 18–21, 30–29, 21–18తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను గెల్చుకున్న ప్రణయ్ రెండో గేమ్‌లో నాలుగుసార్లు మ్యాచ్ పాయింట్లు సంపాదించాడు. కానీ పట్టుదల కోల్పోకుండా ఆడిన శ్రీకాంత్ పలుమార్లు స్కోర్లను సమం చేశాడు. చివరకు 30–29తో రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మకు చైనా స్టార్ చెన్ లాంగ్ నుంచి ‘వాకోవర్’ లభించింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు 24–26, 20–22తో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 17–21, 11–21తో లీ యాంగ్–సు యా చింగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జంట 16–21, 15–21తో లీ జె హుయె–లీ యాంగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
సైనా ఇంటికి... సింధు ముందుకు
కౌలూన్ (హాంకాంగ్): ఈ ఏడాది లోటుగా ఉన్న వరల్డ్ టూర్ సూపర్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో హాంకాంగ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింధు శ్రమించి శుభారంభం చేయగా... సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 21–15, 13–21, 21–17తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సైనా 21–10, 10–21, 19–21తో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఒకదశలో 14–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ దశలో యామగుచి విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 16–14తో ముందంజ వేసింది. ఆ తర్వాత సైనా స్కోరును 18–18తో సమం చేసింది. కానీ ఆ వెంటనే రెండు పాయింట్లు కోల్పోయి 18–20తో వెనుకబడింది. సైనా మరో పాయింట్ సాధించినా, ఆ తర్వాత మరో పాయింట్ కోల్పోయి ఓటమిని మూట గట్టుకుంది. ఓవరాల్‌గా యామగుచి చేతిలో సైనాకిది ఏడో పరాజయం కావడం గమనార్హం. సాయిప్రణీత్, కశ్యప్ పరాజయం పురుషుల సింగిల్స్‌లో ఐదుగురు భారత ఆటగాళ్లు బరిలోకి దిగగా... సాయిప్రణీత్, క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–11, 21–15తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై, సమీర్ వర్మ 21–17, 21–14తో సుపన్యు అవింగ్ సనోన్ (థాయ్‌లాండ్)పై, ప్రణయ్ 21–14, 13–21, 21–19తో ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై గెలిచారు. సాయిప్రణీత్ 21–16, 11–21, 15–21తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్) చేతిలో... కశ్యప్ 16–21, 13–21తో ఆంథోనీ గిన్టింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో ఖోసిత్‌పై మూడుసార్లు నెగ్గిన సాయిప్రణీత్ ఈసారి మాత్రం బోల్తా పడ్డాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జంట 21–12, 21–18తో బొదిన్ ఇసారా–మనీపాంగ్ జోంగ్జిత్ (థాయ్‌లాండ్)పై జోడీపై నెగ్గగా... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 19–21, 21–23తో మథియాస్ బో–కార్స్టెన్ మోగెన్సన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21–18, 10–21, 8–21తో రెండో సీడ్ మిసాకి మత్సుమోతో–అయాక తకహాషి (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
సింధు రెండో‘సారీ’
కౌలూన్ (హాంకాంగ్): బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. వరుసగా రెండో ఏడాది ఆమె రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 18–21, 18–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 30,000 డాలర్ల (రూ. 19 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 15,200 డాలర్ల (రూ. 9 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం సింధుకిది రెండోసారి. ఈ సంవత్సరం సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌తో సింధు ఈ సీజన్‌ను ముగిస్తుంది. చివరిసారి గతేడాది రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు చేతిలో ఓడిన తై జు యింగ్ ఆ తర్వాత ఈ హైదరాబాద్ ప్లేయర్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లోనూ తై జు యింగ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తై జు యింగ్ వ్యూహాత్మక ఆటతీరు ముందు సింధు ప్రణాళికలు పనిచేయలేదు. తొలి గేమ్ ఆరంభంలోనే 3–0తో, ఆ తర్వాత 7–2తో ఆధిక్యంలోకి వెళ్లిన తై జు యింగ్ అదే దూకుడుతో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 12–12 వద్ద తై జు యింగ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 18–12తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. -
హాంకాంగ్ ఓపెన్ సిరీస్ ఫైనల్లో సింధూ ఓటమి
కౌలూన్ (హాంకాంగ్) : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెం1 ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో 18-21,18-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం పొందారు. సింధూ తై జు యింగ్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో తై జు యింగ్‌ను చివరిసారి ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో తాజాగా జరిగిన మ్యాచ్‌తో కలిపి నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21–17, 21–17తో ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)ను ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. -
ఇంకొక్కటే...
కౌలూన్ (హాంకాంగ్): బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌ను సొంతం చేసుకునేందుకు భారత స్టార్ పీవీ సింధు మరో విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, గత ఏడాది రన్నరప్ సింధు 21–17, 21–17తో ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3–7తో వెనుకబడి ఉంది. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో తై జు యింగ్‌ను చివరిసారి ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఏడాదిన్నర తర్వాత తొలిసారి రచనోక్‌తో ఆడిన సింధు ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి గేమ్ ఆరంభంలో 6–2తో ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. ఇక రెండో గేమ్‌లోనూ ఈ హైదరాబాద్ అమ్మాయి ఆధిపత్యం చలాయించింది. 10–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ ఏడాది సింధు సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్ షిప్లో రజత పతకం గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో సింధు గెలిస్తే ప్రకాశ్ పదుకొనె (1982లో), సైనా నెహ్వాల్ (2010లో) తర్వాత హాంకాంగ్ ఓపెన్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది. మధ్యాహ్నం గం. 1.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
సెమీస్‌లో సింధు
హాంకాంగ్: భారత టాప్ షట్లర్, రెండో సీడ్ పీవీ సింధు హాంకాంగ్ సూపర్ సిరీస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఐదోసీడ్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన క్వార్టర్స్ పోరులో 21–12, 21–19తో వరుస గేమ్‌లలో విజయం సాధించింది. 36 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. తొలి గేమ్‌లో యామగుచి జోరు పుంజుకోకముందే సింధు నెట్‌గేమ్ ద్వారా 6–1 ఆధిక్యాన్ని సంపాదించింది. సుదీర్ఘమైన ర్యాలీల తర్వాత తొలి గేమ్‌ను 21–12తో ముగించింది. రెండో గేమ్‌లో ఇరువురు ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఇద్దరు ఆటగాళ్లూ నెట్ గేమ్‌కే మొగ్గు చూపారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న యామగుచి డ్రాప్ షాట్లతో సింధుకు చెమటలు పట్టించింది. 8–8తో సమానంగా ఉన్న పరిస్థితినుంచి.. కాసేపటికే 14–8తో జపాన్ షట్లర్ దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో యామగుచిని బ్యాక్ కోర్టు గేమ్‌తో అడ్డుకున్న సింధు.. 18–18తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత దూసుకుపోయిన సింధు వరుస పాయింట్లు సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. సెమీస్‌లో మాజీ ప్రపంచ చాంపియన్, థాయ్‌లాండ్ షట్లర్ ఇంతనోన్ రచనోక్‌తో సింధు తలపడనుంది. -
సింధు క్వార్టర్స్‌కు... సైనా ఇంటికి
కౌలూన్ (హాంకాంగ్): ఈ ఏడాది తన ఖాతాలో మరో సూపర్ సిరీస్ టైటిల్ జమ చేసుకునే దిశగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో అడుగు ముందుకు వేసింది. సీజన్ చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్‌లో ఈ తెలుగు తేజం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–17తో అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆధిపత్యం చలా యించింది. తొలి గేమ్‌లో మొదటి రెండు పాయింట్లు ఒహోరి సాధించగా... ఆ వెంటనే సింధు స్కోరును సమం చేసింది. స్కోరు 4–5 వద్ద సింధు వరుసగా ఐదు పాయిం ట్లు గెలిచి 9–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి దాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు తొలి గేమ్‌ను దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ మొదటి పాయింట్ ఒహోరినే సాధించింది. ఈసారి సింధు వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి ముందంజ వేసింది. అనంతరం సింధు మరింత జోరు పెంచడంతో ఒహోరి తేరుకోలేకపోయింది. ఈ ఏడాది సింధు సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలవడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ 21–18, 19–21, 10–21తో ఎనిమిదో సీడ్ చెన్ యుఫె (చైనా) చేతిలో... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–11, 10–21, 15–21తో సకాయ్ (జపాన్) చేతిలో ఓడిపోయారు. చెన్ యుఫెతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 7–10 వద్ద సైనా వరుసగా 10 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. 7–20తో వెనుకబడిన దశలో సైనా వరుసగా మూడు పాయింట్లు గెలిచి, ఆ తర్వాత పాయింట్ సమర్పించుకొని ఓడిపోయింది. -
క్వార్టర్స్ లో సింధు
కౌలూన్ (హాంకాంగ్):హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-14, 21-17 తేడాతో అయా ఒహోరి (జపాన్)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సింధు ఆద్యంతం పైచేయి సాధించింది. వరుస రెండు గేమ్ లను సునాయాసంగా గెలిచిన సింధు తదుపరి రౌండ్ కు అర్హత సాధించారు. కేవలం 39 నిమిషాల్లోనే సింధు విజయం సాధించి మరొకసారి సత్తాచాటింది. ఒహారీపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డును సింధు 3-0 మరింత మెరుగుపరుచుకుంది. -
కెరీర్ ఉత్తమ ర్యాంకుకు సమీర్‌వర్మ
న్యూఢిల్లీ: సమీర్ వర్మ కెరీర్ ఉత్తమ ర్యాంకు (23)ను చేరుకున్నాడు. గత ఏడాది జాతీయ ఛాంపియన్ షిప్ సాధించడంతో పాటు హాంకాంగ్ సూపర్ సిరీస్ ఫైనల్ చేరిన వర్మ గురువారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకుల జాబితాలో ఏకంగా 11 ర్యాంకులు మెరుగుపరచుకుని 23వ ర్యాంకులో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి అజయ్ జయరాం అత్యుత్తమంగా 19వ, హెచ్ఎస్ ప్రణయ్ రెండు ర్యాంకులు ఎగబాకి 21వ స్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో సింధు తన ర్యాంక్ (5)ను నిలబెట్టుకోగా, సైనా నెహ్వాల్ ఒక ర్యాంక్ కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా – సిక్కి రెడ్డి జోడి 13వ స్థానంలో, పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మను అత్రి – సుమీత్ రెడ్డి జంట 23వ స్థానాల్లో కొనసాగుతున్నారు. -
రన్నరప్‌తో సింధు సరి
-
రన్నరప్‌తో సింధు సరి
కౌలూన్: గతవారం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధుకు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ లో మాత్రం నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ సింధు 15-21, 17-21 తేడాతో మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సింధు.. రెండో గేమ్‌లో కూడా ఆకట్టుకోలేకపోయింది. తొలి గేమ్‌లో 6-3 ముందంజ వేసిన సింధు.. ఆ తరువాత వరుసగా ఆరుపాయింట్లను కోల్పోయింది. దాంతో గేమ్‌పై పట్టు సాధించిన తై జు యింగ్ మరింత ముందుకు దూసుకుపోయింది. కాగా, సింధు 11-18తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించినా ఆ గేమ్‌ను రక్షించుకోలేపోయింది. ఇక రెండో గేమ్‌లో ఇరువురి క్రీడాకారిణుల మధ్య హోరాహోరీ పోరు సాగింది. దాదాపు 10 పాయింట్ల వరకూ నువ్వా-నేనా అన్నట్లు పోరు కొనసాగింది. అయితే ఆ తరువాత అనవసర తప్పిదాలతో సింధు పలు పాయింట్లను చేజార్చుకుంది. రెండో గేమ్ చివర్లో సింధు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏకపక్షంగా సాగిన పోరులో తై జు యింగ్ కచ్చితమైన ప్రణాళికలతో ఆకట్టుకుని సింధును నిలువరించింది. ఇది తై జు యింగ్ కెరీర్లో రెండో హాంకాంగ్ ఓపెన్ సిరీస్ టైటిల్. అంతకుముందు 2014లో తొలిసారి ఈ టైటిల్‌ను తై జు సాధించింది. -
హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో సమీర్ వర్మ
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ పురుషుల విభాగంలో భారత ఆటగాడు సమీర్ వర్మ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో వరల్డ్ నెంబర్ 3 ఆటగాడు జొర్గెన్సెన్పై సమీర్ సంచలన విజయం నమోదు చేశాడు. ఫైనల్లో ఆంగస్ లాంగ్‌తో సమీర్ వర్మ తలపడనున్నాడు. గతవారం చైనా ప్రీమియర్ సూపర్ సిరీస్ గెలుచుకొని మంచి ఫాంలో ఉన్న జోర్గెన్సెన్పై హోరాహోరి పోరులో తొలి గేమ్‌ను 21-19 పాయింట్లతో గెలుచుకున్న సమీర్.. రెండో గేమ్‌ను 24-22 పాయింట్ల తేడాతో గెలుచుకొని వరుస సెట్లలో విజయం సాధించాడు. -
కరోలినా మారిన్‌కు షాక్
కౌలూన్:హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌కు షాక్ తగిలింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో మారిన్ 17-21, 21-14, 16-21 తేడాతో తాయ్ జు యింగ్(తైవాన్) చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో ఓటమి పాలై వెనుకబడిన మారిన్.. రెండో గేమ్‌ను అవలీలగా సొంతం చేసుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మారిన్ అనవసర తప్పిదాలు చేసి ఆ గేమ్‌ను చేజార్చుకుని పరాజయం చెందింది. దాంతో రియో ఒలింపిక్స్ స్వర్ణం తరువాత తొలిసారి ఫైనల్‌కు చేరాలనుకున్న మారిన్ ఆశలకు బ్రేక్ పడింది. గత రెండు వారాల్లో తాయ్ చేతిలో మారిన్ ఓటమి పాలుకావడం రెండోసారి. ఇటీవల జరిగిన చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో మారిన్‌ను తాయ్ ఓడించింది. -
సైనా నెహ్వాల్‌కు నిరాశ
-
సెమీస్‌లో సింధు
సమీర్ వర్మ కూడా ముందుకు క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ కౌలూన్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు తన ఫామ్‌ను కొనసాగిస్తూ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో టాప్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మాత్రం క్వార్టర్స్‌లో ఓడి టోర్నీనుంచి నిష్క్రమించింది. 79 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు 21-17, 21-23, 21-18 స్కోరుతో గ్జియావు లియాంగ్‌పై విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌లలో సునాయాస విజయాలు సాధించిన సింధుకు క్వార్టర్స్‌లో గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను చకచకా గెల్చుకున్న సింధు, రెండో గేమ్‌లో చేజేతులా ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. ఒక దశలో 16-12తో ఆధిక్యంలో ఉన్నా... లియాంగ్ వరుస పారుుంట్లతో దూసుకురావడంతో స్కోరు 18-18 వద్ద సమమైంది. ఆ తర్వాత 21-21కి చేరాక సింగపూర్ అమ్మారుు వరుసగా రెండు పారుుంట్లతో గేమ్ గెల్చుకుంది. మూడో గేమ్‌లో 15-15 వరకు ఇద్దరు సమఉజ్జీలుగా కనిపించినా, కీలక సమయంలో పారుుంట్లతో సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గాయంనుంచి కోలుకున్న తర్వాత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్న సైనాకు మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మూడు గేమ్‌ల పాటు పోరాడిన ఆమె ఈ సారి తలవంచింది. హాంకాంగ్‌కు చెందిన చుంగ్ గాన్ రుు 21-8, 18-21, 21-19తో సైనాను ఓడించింది. 71 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో సైనా పేలవ ప్రదర్శన కనబర్చింది. అరుుతే కోలుకొని రెండో గేమ్ గెలుచుకోగలిగింది. మూడో గేమ్‌లో ఒక దశలో 11-18తో వెనుకబడింది. అరుుతే పుంజుకున్న సైనా వరుసగా ఏడు పారుుంట్లు కొల్లగొట్టి 18-18తో సమం చేసింది. కానీ చివరకు ప్రత్యర్థిదే పైచేరుు అరుుంది. సైనాను ఓడించి చుంగ్ గాన్‌తో సెమీస్‌లో సింధు తలపడుతుంది. సెమీస్‌లో సమీర్ వర్మ... పురుషుల విభాగంలోనూ భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించారుు. భారత ఆటగాడు సమీర్ వర్మ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టగా, అజయ్ జయరామ్ క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో సమీర్ 21-17, 23-21తో ఫెంగ్ చోంగ్ వీపై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో జయరామ్ 15-21, 14-21 తేడాతో ఆంగస్ లాంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. తొమ్మిదో ర్యాంక్‌కు సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్‌సలో పీవీ సింధు తొమ్మిదో ర్యాంక్‌కు చేరగా... సైనా నెహ్వాల్ టాప్-10లోంచి బయటకు వెళ్లింది. గత వారం చైనా ఓపెన్ గెలిచిన సింధు రెండు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ ఏకంగా ఐదు స్థానాలు కోల్పోరుు 11వ ర్యాంక్‌కు చేరింది. -
సైనా నెహ్వాల్‌కు నిరాశ
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సైనా 8-21, 21-18, 19-21 స్కోరుతో చైనా ప్లేయర్ యి చెంగ్ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో ఓడిపోయిన హైదరాబాదీ రెండో గేమ్‌ను గెలిచినా.. నిర్ణాయక మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయింది. కాగా ఈ టోర్నీలో మరో తెలుగుతేజం పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో సింధు 21-17, 21-23, 21-18 స్కోరుతో సింగపూర్ క్రీడాకారిణి లియాంగ్ పై పోరాడి విజయం సాధించింది. -
అదరగొడుతున్న సింధు
కౌలూన్: రియో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు అదరగొడుతోంది. ఇటీవలే చైనా సూపర్ సిరీస్ గెలిచిన ఈ తెలుగమ్మాయి తాజాగా హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోనూ దూసుకుపోతోంది. టైటిల్ కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింగపూర్ క్రీడాకారిణి లియాంగ్ ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 21-17, 21-23, 21-18 స్కోరుతో లియాంగ్ పై విజయం సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్.. చైనా ప్లేయర్ యి చెంగ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో సైనా గెలిస్తే సెమీఫైనల్లో సింధుతో తలపడాల్సి ఉంటుంది. -
క్వార్టర్స్‌కు సైనా
కౌలూన్:భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి-క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సైనా నెహ్వాల్ 18-21, 21-9, 21-16 తేడాతో పదకొండో ర్యాంకర్ సయాకా శాటో(జపాన్)పై గెలిచి క్వార్టర్స్ కు చేరింది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ గేమ్‌లో పెద్దగా తప్పిదాలు ఆస్కారం ఇవ్వని సైనా 21-9 తో గెలిచింది. ఆ తరువాత నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సయాకా నుంచి సైనాకు ప్రతిఘటన ఎదురైంది. కాగా, తను అనుభవాన్ని ఉపయోగించిన సైనా ఎట్టకేలకు సయాకను వెనక్కు నెట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. రియో ఒలింపిక్స్ తరువాత గాయం నుంచి కోలుకున్న సైనాకు ఇది రెండో విజయం. 2010లో హాంకాంగ్ ఓపెన్‌ను సైనా తొలిసారి గెలిచింది. మరోసారి హాంకాంగ్ ఓపెన్ సాధించి తన పూర్వ వైభవాన్ని చాటుకోవాలని సైనా భావిస్తోంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ 21-15, 11-21, 15-21 తేడాతో చాంగ్ వుయ్ ఫెంగ్(మలేషియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇదిలా ఉండగా, సమీర్ వర్మ ప్రి-క్వార్టర్స్ అడ్డంకిని అధిగమించాడు. సమీర్ 19-21, 21-15, 21-11 తేడాతో కజుమసా సాకాయ్(జపాన్)పై గెలిచాడు. -
ఓపెన్ సూపర్ సిరీస్‌లో సైనా, సింధు ముందంజ
-
సైనా, సింధు ముందంజ
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో సింధు అలవోక విజయం సాధించగా, సైనా మూడు గేమ్‌ల పాటు పోరాడాల్సి వచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ సైనా 12-21, 21-19, 21-17 స్కోరుతో ప్రపంచ 12వ ర్యాంక్ క్రీడాకారిణి పోర్న్‌టిప్ బురానాప్రసేర్సుక్ (థారుులాండ్)పై విజయం సాధించింది. చైనా ఓపెన్ తొలి రౌండ్లో పోర్న్‌టిప్ చేతిలోనే ఓడిన సైనా.. వారం వ్యవధిలోనే ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడం విశేషం. గాయంనుంచి కోలుకున్న తర్వాత సైనాకు ఇదే తొలి విజయం. మరో వైపు సింధు 21-13, 21-16 తేడాతో సుశాంతో యూలియా (ఇండోనేసియా)ను చిత్తు చేసింది. పురుషుల విభాగంలో అజయ్ జయరామ్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ కూడా ముందంజ వేశారు. జయరామ్ 21-15, 13-21, 21-16తో ఆంథోనీ సినిసుక (ఇండోనేసియా)పై, సమీర్ వర్మ 22-20, 21-18తో టకుమాపై, ప్రణయ్ 21-16, 21-18తో ఖియో బిన్ (చైనా)పై గెలుపొందారు. మరో వైపు సారుు ప్రణీత్ 18-21, 18-21తో మూడో సీడ్ జుర్గెన్సన్ (డెన్మార్క్) చేతిలో, డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 15-21, 8-21తో సొల్గ్యూ-సుంగ్ యున్ (కొరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. -
ఐఆర్సీటీసీ హాంకాంగ్ యాత్ర
విజయవాడ: ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో హాంకాంగ్ యాత్ర అక్టోబర్ 8న ఉంటుందని ఐఆర్సీటీసీ ప్రాంతీయ అధికారి ఎన్.డి.భుజంగరావు శనివారం తెలిపారు. 5 పగళ్లు, 4 రాత్రులు ఉండే ఈ యాత్రలో హాంకాంగ్ సిటీటూర్‌లో అవెన్యూస్టార్స్ వద్ద లైట్షో డిస్నీలాండ్, షేన్జెన్ సిటీటూర్‌లో మినరల్ మ్యూజియం, లోటస్ స్క్వేర్, మకావు సిటీటూర్‌లో సెయింట్ పాల్ చర్చ్, లోటస్స్క్వేర్ల సందర్శన ఉంటుందని చెప్పారు. 8న హైదరాబాద్‌లో మొదలైన యాత్ర 12వ తేదీ తిరిగి హైదరాబాద్ చేరడంతో ముగుస్తుందన్నారు. టికెట్ ధర, వసతి అన్నీ కలిపి ఒక్కొక్కరికి రూ.73,419 చెల్లించవలసి ఉంటుందని, వివరాలకు 9701360675, 9701360609 నంబర్లకు సంప్రదించాలన్నారు. -
పాకిస్తాన్‌ను వెనుకేసుకొచ్చిన చైనా!
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గౌరవించాలని చైనా పేర్కొంది. ఇటీవల పాకిస్తాన్ భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో తాలిబాన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ మృతి చెందిన విషయం తెలిసిందే. తమ భూభాగంలో అమెరికా డ్రోన్ దాడులకు పాల్పడటాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయమై శుక్రవారం చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి హోంగ్ లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనకు ఎంతగానో కృషి చేస్తున్న పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ప్రపంచదేశాలు గౌరవించాలని పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, యూఎస్‌లతో కూడిన క్వాడ్రీలేటరల్ కొ ఆర్డినేషన్ గ్రూప్(క్యూసీజీ).. ఆప్ఘనిస్తాన్ పునరుద్దరణ లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ విషయంలో ఉమ్మడి ప్రయత్నాలు జరగాలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ దాడిలో మృతి చెందింది ఓ పాకిస్తాన్ డ్రైవర్‌గా పేర్కొంన్న హోంగ్ లీ.. అమెరికా డ్రోన్ దాడిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. -
లీ చోంగ్ వీ హ్యాట్రిక్
* హాంకాంగ్ ఓపెన్‌లోనూ విజేత * కెరీర్లో 60వ టైటిల్ కైవసం కౌలూన్ (హాంకాంగ్): డోపింగ్ నిషేధం గడువు పూర్తయ్యాక బరిలోకి దిగిన మలేసియా బ్యాడ్మింటన్ స్టార్ లీ చోంగ్ వీ తన జోరును కొనసాగిస్తున్నాడు. తాజాగా హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను ఈ మాజీ నంబర్‌వన్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ లీ చోంగ్ వీ 21-16, 21-15తో తియాన్ హువీ (చైనా)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో లీ చోంగ్ వీ ‘హ్యాట్రిక్’ సూపర్ సిరీస్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు అతను ఫ్రెంచ్ ఓపెన్, చైనా ఓపెన్లలో కూడా విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా లీ చోంగ్ వీకిది కెరీర్లో 60వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా డోపింగ్‌లో పట్టుబడిన లీ చోంగ్ వీపై ఎనిమిది నెలలపాటు నిషేధాన్ని విధించారు. నిషేధం గడువు ముగియడంతో ఈ ఏడాది మే నుంచి అతను మళ్లీ రాకెట్ పట్టాడు. ఈ క్రమంలో గత ఏడు నెలల కాలంలో లీ చోంగ్ వీ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. సూపర్ మారిన్... మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) విజేతగా నిలి చింది. ఫైనల్లో మారిన్ 21-17, 18-21, 22-20తో నొజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచింది. ఈ ఏడాది మారిన్కిది ఆరో టైటిల్ కావడం విశేషం. ఆమె ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, మలేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్స్‌ను దక్కించు కుంది. హాంకాంగ్ ఓపెన్‌లో బ్యాడ్మింటన్‌లో సూపర్ సిరీస్ టోర్నీలు ముగిశాయి. డిసెంబరు 9 నుంచి 13 వరకు దుబాయ్‌లో జరిగే సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ టోర్నీలో సీజన్ ముగుస్తుంది. హాంకాంగ్ ఓపెన్‌లో భారత్ తరపున శ్రీకాంత్, సింధు, అజయ్ జయరామ్, ప్రణయ్, జ్వాల-అశ్విని పొన్నప్ప బరిలోకి దిగినా... అందరూ తొలి రౌండ్లోనే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. -
ఈసారైనా శ్రీ‘కాంతు’లీనేనా!
హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ కౌలూన్ (హాంకాంగ్): కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్... సీజన్ చివరి సూపర్ సిరీస్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ పదో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో ప్రపంచ ఐదో ర్యాంకర్ శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 0-4తో వెనుకంజలో ఉన్నాడు. తియాన్ హువీతో ఈ ఏడాది ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ శ్రీకాంత్‌కు పరాజయమే ఎదురైంది. కనీసం ఐదో సారైనా శ్రీకాంత్‌కు విజయం దక్కుతుందో లేదో వేచి చూడాలి. ఈ ఏడాది ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో టైటిల్ సాధించాక శ్రీకాంత్ ఆటతీరు గాడి తప్పింది. తాను బరిలోకి దిగిన 13 టోర్నమెంట్లలో అతను క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో గాయం కారణంగా సైనా నెహ్వాల్ ఈ టోర్నమెంట్ నుంచి చివరి నిమిషంలో వైదొలిగింది. దాంతో అందరి దృష్టి పీవీ సింధుపైనే ఉంది. తొలి రౌండ్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో ఆడుతుంది. -
హాంకాంగ్ ఓపెన్ కు సైనా దూరం
కౌలూన్(హాంకాంగ్): ఈ సీజన్ బ్యాడ్మింటన్ ముగింపు టోర్నీఅయిన హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి భారత స్టార్ షట్లర్, ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వైదొలిగింది. కాలి గాయంతో బాధపడుతుండటంతో హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనడం లేదని సైనా స్పష్టం చేసింది. దీంతో భారత మహిళల టీమ్ కు పివి సింధు, పురుషుల టీమ్ కు కిదాంబి శ్రీకాంత్ లు సారథ్యం వహించనున్నారు. ఈ టోర్నీ నుంచి ముందుగానే సైనా వైదొలగడంతో భారత జట్టు ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే. చివరిసారి 2010 లో హాంకాంగ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సైనా గెలిచింది. బుధవారం నుంచి ఆరంభం కానున్న టోర్నీలో సింధు తన తొలి పోరులో టాప్ సీడ్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్(స్పెయిన్)తో తలపడనుంది. గత నెల్లో జరిగిన డెన్మార్ ఓపెన్ లో మారిన్ ను ఓడించిన సింధు అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కాగా, ఓవరాల్ ముఖాముఖి రికార్డులో సింధు 2-3తో వెనుకంజలో ఉంది. కాగా, పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ లో టియాన్ హౌయి(చైనా)తో తలపడనున్నాడు. గత సంవత్సరం హాంకాంగ్ ఓపెన్ లో శ్రీకాంత్ సెమీ ఫైనల్ వరకూ వెళ్లాడు. -
సీఎం జపాన్ పర్యటనకు తొలి విడతగా రూ.1.70కోట్లు
నేటి అర్ధరాత్రి 1 గంటకు విమానంలో జపాన్ పయనం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం జపాన్, హాంకాంగ్ పర్యటనకోసం తొలి విడతగా రూ.1.70 కోట్లను విడుదల చేసేందుకు ఆర్థికశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. పర్యటన ముగిశాక మిగతా వ్యయానికి సంబంధించి ఆర్థికశాఖ నిధులను విడుదల చేయనుంది. జపాన్ పర్యటనకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం శనివారం అర్ధరాత్రి 1 గంటకు హైదరాబాద్‌నుంచి విమానంలో బయల్దేరనుంది. సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, మున్సిపల్, ఆర్థిక, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు ఎ.గిరిధర్, పీవీ రమేశ్, ఎస్.ఎస్.రావత్, పరిశ్రమల మౌలిక వసతుల కల్పనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ వెళ్లనున్నారు.ఈ పర్యటనలో సీఎం రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని జపాన్ ప్రధానిని ఆహ్వానించనున్నారు. 8వ తేదీ వరకు బాబు బృందం జపాన్‌లోనే పర్యటిస్తుంది.అనంతరం 9, 10 తేదీల్లో హాంకాంగ్‌లో పర్యటిస్తుంది. 10వ తేదీ రాత్రి అక్కడ్నుంచీ బయల్దేరి హైదరాబాద్‌కు తిరిగి రానుంది. జపాన్ పర్యటనలో ప్రముఖులతో భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన జపాన్ పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులు, ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఫ్యూజీ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెంజీ గోటో, సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పోరేషన్ (ఎస్‌ఎమ్‌బీసీ), మిత్సుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. అలాగే 7న కూడా ప్రముఖ బ్యాంకింగ్ అధికారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. నేడు మంత్రివర్గం సమావేశం.. సీఎం అధ్యక్షతన శనివారం ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమెరికాలో నలుగురు మంత్రులు ఇదిలా ఉండగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో పాల్గొనేందుకు నలుగురు మంత్రులు వెళ్లారు. -
సింధు టైటిల్ నిలబెట్టుకునేనా!
మకావు: హాంకాంగ్ ఓపెన్‌లో నిరాశాజనక ఆటతీరు కనబర్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇప్పుడు కొత్త సవాల్‌కు సిద్ధమైంది. మంగళవారంనుంచి ప్రారంభం కానున్న మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో ఆమె రెండో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీ డిఫెండింగ్ చాంపియన్, ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న సింధు తొలి రౌండ్లో హుంగ్ షీ హన్ (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. లక్షా 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో భారత్‌నుంచి తొమ్మిది మంది షట్లర్లు బరిలోకి దిగుతున్నారు. మరో భారత క్రీడాకారిణి పీసీ తులసి కూడా చైనీస్ తైపీకే చెందిన సు య చింగ్‌ను మొదటి రౌండ్లో ఎదుర్కొంటుంది. పురుషుల విభాగం తొలి రౌండ్లో అజయ్ జైరాం... కజుమస సకాయ్ (జపాన్)తో, హెచ్ఎస్ ప్రణయ్... షి కు చున్ (చైనీస్ తైపీ)తో పోటీ పడతారు. యాంగ్ చి చీ (చైనీస్ తైపీ)ని సౌరభ్‌వర్మ ఎదుర్కోనుండగా, అరవింద్ భట్‌కు క్వాలిఫయర్‌తో ఆడే అవకాశం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సాయిప్రణీత్ కూడా ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. వూన్ కాక్ హాంగ్ (మలేసియా)తో ప్రణీత్ మొదటి మ్యాచ్ ఆడతాడు. పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జోడి కూడా బరిలో నిలిచింది. -
క్వార్టర్ లో సైనా,శ్రీకాంత్
విదేశీ గడ్డపై భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, శ్రీకాంత్‌లు అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. తమ అద్వితీయ ప్రదర్శనతో హాంకాంగ్ ఓపెన్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించగా... సింధు మాత్రం నిరాశపర్చింది. * సింధుకు చుక్కెదురు * హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, పి.వి.సింధు నిరాశపర్చింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ తన జైత్రయాత్రను కొనసాగించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ సైనా 21-16, 21-13తో ప్రపంచ 14వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై విజయం సాధించింది. 31 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనాకు ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో 5-5తో స్కోరు సమమైన తర్వాత హైదరాబాద్ అమ్మాయి వెనుతిరిగి చూడలేదు. 17-16 స్కోరు ఉన్న దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సైనా వరుస పాయింట్లతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నిరాశపర్చిన సింధు మరో మ్యాచ్‌లో ఏడోసీడ్ సింధు 17-21, 21-13, 11-21తో ప్రపంచ 48వ ర్యాంకర్ నొజోమి ఒక్హరా (జపాన్) చేతిలో ఓడింది. ఈ మ్యాచ్ గంటకు పైగా సాగింది. తొలి గేమ్‌లో 4-3 వద్ద నొజోమి వరుసగా 8 పాయింట్లు నెగ్గింది. అయితే ఈ దశలో సింధు పోరాట పటిమను చూపి ఆధిక్యాన్ని 17-19కు తగ్గించినా గేమ్‌ను చేజార్చుకుంది. ఇక రెండో గేమ్‌లో వ్యూహాలను మార్చిన హైదరాబాదీ 6-2, 12-5తో ఆధిక్యంలో నిలిచింది. చివరి వరకు దీన్ని కాపాడుకుని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడింది. విరామం వరకు సింధు 11-10 ఆధిక్యంలో ఉన్నా.. ఆ తర్వాత వెనుకబడింది. ఈ దశలో నొజోమి వరుసగా 11 పాయింట్లు గెలిచి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ హవా పురుషుల ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ శ్రీకాంత్ హవా కొనసాగించాడు. 21-19, 23-21తో ప్రపంచ 29వ ర్యాంకర్ తనంగ్సుక్ సెన్సోమ్బూన్స్క్ (థాయ్‌లాండ్)పై నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో హైదరాబాద్ కుర్రాడు ఆకట్టుకున్నాడు. 10-2, 11-3తో ఆధిక్యం సంపాదించాడు. అయితే స్కోరు 14-5 ఉన్న దశలో సెన్సోమ్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గడంతో పాటు 15-15తో సమం చేశాడు. కానీ పట్టు విడవకుండా పోరాడిన శ్రీకాంత్ 16-16 తర్వాత వరుసగా మూడు... ఆ తర్వాత మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌ను ముగించాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్‌లో శ్రీకాంత్ ఒకే ఒక్కసారి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 18-13 ఆధిక్యంలో నిలిచాడు. ఇక ఇక్కడి నుంచి ప్రతి పాయింట్‌కు ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. 21-21 ఉన్న దశలో శ్రీకాంత్ రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. శ్రీకాంత్ @ 10 న్యూఢిల్లీ: ఇటీవల చైనా ఓపెన్ టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించిన శ్రీకాంత్... కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను నమోదు చేశాడు. గురువారం తాజాగా విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో అతను ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 10వ ర్యాంక్‌కు ఎగబాకాడు. పారుపల్లి కశ్యప్ 17వ, హెచ్.ఎస్.ప్రణయ్ 24వ స్థానాల్లో ఉన్నారు. మహిళల విభాగంలో సైనా ఒక్క స్థానం ఎగబాకి 4వ ర్యాంక్‌లో నిలిచింది. సింధు 10వ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి 19వ ర్యాంక్‌లో ఉంది. -
హాంకాంగ్ ఓపెన్ లో సింధు ఓటమి
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ లో తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్న క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూసింది. జపనీస్ క్రీడాకారిణి నోజోమీ ఒకుహరాతో గంటపైగా సాగిన మ్యాచ్ లో 17-21, 21-13, 11-21తో సింధు పరాజయం పాలైంది. నోజోమీతో సింధు తలపడడం ఇది రెండోసారి. 2012లో ఆసియా యూత్ బ్యాడ్మింటన్ అండర్-19 టోర్నమెంట్ లో తొలిసారిగా వీరిద్దరూ పోటీపడ్డారు. -
సైనా, సింధు, శ్రీకాంత్ శుభారంభం
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధు, శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించారు. తొలిరౌండ్లో సైనా 21-17, 21-11 స్కోరుతో జామీ సుబంది (అమెరికా)ను సునాయాసంగా ఓడించింది. మరో మ్యాచ్‌లో సింధు 21-15, 16-21, 21-19తో బుసానన్ ఒంగ్బుంరుంగ్పాన్పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 18-21, 22-20, 21-16తో చో (చైనీస్ తైపీ)ని మట్టికరిపించాడు. -
ఇక ‘హాంకాంగ్'పై గురి
బరిలో శ్రీకాంత్, సైనా హాంకాంగ్: చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించిన శ్రీకాంత్, సైనా నెహ్వాల్ మరో పరీక్షకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో ఈ ఇద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత క్రీడాకారులు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ ఉన్నారు. తొలి రౌండ్లో అబ్దుల్ లతీఫ్ (మలేసియా)తో జయరామ్; హువాన్ గావో (చైనా)తో సౌరభ్ తలపడతారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)తో కశ్యప్; షో ససాకి (జపాన్)తో గురుసాయిదత్ ఆడతారు. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే రెండో రౌండ్లోనే శ్రీకాంత్, కశ్యప్ పరస్పరం తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జామీ సుబంధి (అమెరికా)తో సైనా నెహ్వాల్; ఒంగ్‌బుమ్‌రుంగ్‌పన్ (థాయ్‌లాండ్)తో పి.వి.సింధు పోటీపడతారు. -
నేపాల్ శుభారంభం
హాంకాంగ్‌పై విజయం చిట్టగాంగ్: తొలిసారిగా టి20 ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపాల్ జట్టు ఆ క్రమంలో తొలి విజయాన్ని అందుకుంది. జహూర్ అహ్మద్ చౌదురి మైదానంలో హాంకాంగ్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ అర్హత మ్యాచ్‌లో నేపాల్ 80 పరుగుల తేడాతో నెగ్గింది. జ్ఞానేంద్ర మల్లా (41 బంతుల్లో 48; 4 ఫోర్లు), పరస్ ఖడ్కా (37 బంతుల్లో 41; 4 ఫోర్లు) రాణించడంతో... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 149 పరుగులు సాధించింది. వేగంగా ఆడే క్రమంలో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా... ఖడ్కా, మల్లా కలిసి జట్టు స్కోరును పెంచారు. సమయోచితంగా ఆడుతూ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో నేపాల్ ఆటగాళ్లు వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయారు. ఇందులో రెండు రనౌట్లున్నాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. స్పిన్నర్లు శక్తి గౌచన్ (3/9), రెజ్మీ (3/14) బంతులకు హాంకాంగ్ బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఫలితంగా 17 ఓవర్లలోనే 69 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బాబర్ హయత్ (25 బంతుల్లో 20; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 11 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కూలాయి. ఇరు జట్ల ఆటగాళ్లందరికీ ఇదే తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్. -
సైనా మరో'సారీ'..
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాదిలో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న హైదరాబాదీకి మరోసారి నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో సైనా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ సైనా 17-21, 21-9, 15-21 స్కోరుతో పోర్న్‌టిప్ బురానప్రసెట్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లోనూ భారత ఆటగాడు అజయ్ జయరామ్ 18-21, 12-21తో సోనీ డ్వి కున్కోరొ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ఈ ఏడాదిలో సైనా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. సీజన్ చివర్లోనైనా నెగ్గాలన్న సైనా ఆశలు నెరవేరలేదు. గాయాలు, పేలవ ఫామ్ కారణంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతోంది.