Human rights activists
-
నోబెల్ గ్రహీత నర్గీస్ విడుదల
పారిస్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీ బుధవారం ఇరాన్‌లోని టెహ్రాన్‌లోని ఎవిన్ కారాగారం నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాలరీత్యా ఆమెకు మూడు వారాలపాటు శిక్షను నిలుపుదల చేసి జైలు అధికారులు విడుదలచేశారు. తిరిగి జైలులో లొంగిపోయాక ఈ మూడువారాలు అదనంగా శిక్షాకాలంగా అనుభవించాల్సి ఉంటుంది. గత రెండేళ్లలో తొలిసారిగా తన తల్లితో ఫోన్లో మాట్లాడానని పారిస్‌లో ఉంటున్న నర్గీస్ కుమారుడు అలీ రహ్మానీ తెలిపారు. ఆమె జైలు నుంచి విడుదలయ్యాక 2022–2023 నిరసన ఉద్యమ నినాదం అయిన ‘మహిళల జీవితానికి స్వేచ్ఛ లభించాలి’అని నినదించారు. ‘‘ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా మానసికంగా బాగున్నారు. పోరాట పటిమ ఆమెలో అలాగే ఉంది. హిజాబ్ లేకుండా జైలు నుంచి బయటకు రాగలిగా’’అని తన తల్లి చెప్పిందని కుమారుడు రహా్మనీ వెల్లడించారు. మహిళల హక్కులకోసం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె అలుపెరగని పోరాటం కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఇరాన్లో హిజాబ్ ధారణపై అత్యంత కఠిన చట్టాలు, ఇతర నేరాలకు మరణశిక్ష అమలును వ్యతిరేకంగా పోరాడిన నర్గీస్‌ను అరెస్ట్ చేసిన ఇరాన్ పోలీసులు పల సెక్షన్ల కింద దోషిగా తేల్చారు. దీంతో ఆమె 2021 నవంబర్ నుంచి ఎవిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దశాబ్ద కాలంగా జైలు జీవితం గడుపుతున్న ఆమె కొన్నేళ్లుగా కనీసం భర్త, కవల పిల్లలను చూడలేదు. ఆమె కారాగార శిక్ష అమలును 21 రోజులు నిలుపుదల చేశారని, ఆ 21 రోజులను ఆమె తిరిగి జైలుకెళ్లాక అదనంగా శిక్షాకాలాన్ని అనుభవించాల్సి ఉంటుందని ఆమె మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బెయిలును కనీసం మూడు నెలలకు పొడిగించాలని ఆమె మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఆమె అనారోగ్యం కారణంగా వైద్యుల సలహా మేరకు ప్రాసిక్యూటర్ విడుదలకు అనుమతించారని న్యాయవాది ముస్తఫా నీలీ తెలిపారు. ఆమెకు ఉన్న కణితి ప్రాణాంతకం కాదని, అయితే ప్రతి మూడు నెలలకోసారి ఆమెకు వైద్యపరీక్షలు అవసరమని లాయర్ వెల్లడించారు. జైలులోనూ నర్గీస్ పోరాట మార్గాన్ని వీడలేదు. ఎవిన్ జైలు ఆవరణలో నిరసనలు చేపట్టారు. నిరాహార దీక్షలు చేశారు. ఇరాన్లో మహిళలపై జరుగుతున్న దారుణమైన అణచివేతను ఆమె సెప్టెంబర్‌లో జైలు నుంచి రాసిన లేఖలోనూ ఖండించారు. 2022–2023లో అయతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో ఇస్లామిక్ అధికారులను గద్దె దింపాలని కోరుతూ జరిగిన నిరసనలకు నర్గీస్ పూర్తి మద్దతు తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు జూన్‌లో ఆమెకు మరో ఏడాది జైలు శిక్ష పడింది. -
నర్గీస్‌ను చంపేందుకు కుట్ర
టెహ్రాన్: నోబెల్ గ్రహీత, మానవ హక్కుల కార్య కర్త నర్గీస్ మొహమ్మదీని చంపేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె కుటుంబం ఆరోపించింది. కేన్సర్ నిర్ధారణకు అవసరమైన కీలకమైన శస్త్రచికిత్సను నిరాకరించి, నెమ్మదిగా ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమవుతోందని తెలిపింది. ఆమె కుడి కాలు ఎముక గాయా న్ని వైద్యులు ఇటీవల గుర్తించారని, క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన బయాప్సీకోసం శస్త్రచికిత్సకు అవకాశం ఇవ్వకుండా ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కుటుంబం వెల్లడించింది. చికిత్సలో మరింత జాప్యం జరిగితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. సంవత్సరాల తరబడి జైలు జీవితం, సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, కేవలం ఆస్పత్రి సందర్శనలతో చేసే చిన్న చికిత్స ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయలేదని వారు తెలిపారు. కాగా, ఇటీవల ఎంఆర్ఐలో ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి ఉన్నట్లు బయటపడిందని, 2021లో గుండెపోటుకు గురైన తర్వాత ఆమె గుండె ధమనుల్లో ఒకదానికి యాంజియోగ్రఫీ చేయాలని వైద్యులు సూచించారని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు సైతం మొహమ్మదీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నిర్బంధంలో ఉన్న మొహమ్మదీకి అవసరమైన వైద్య సంరక్షణను నిలిపివేస్తూ ఇరాన్ అధికారులు ఆమెను నెమ్మదిగా చంపుతున్నారు’అని హిల్లరీ క్లింటన్ గత శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొహమ్మదీ రెండు దశాబ్దాలుగా టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఇరాన్లో మానవ హక్కులకోసం, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్ 2011లో తొలిసారి అరెస్టయ్యారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందిన ఆమె.. 2015లో మళ్లీ జైలుకు వెళ్లారు. జైలులోనూ ఆమె పోరాటాన్ని ఆపలేదు. మహిళల హక్కులతో పాటు, మరణశిక్ష రద్దు, ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడారు. జైలులో ఉన్నప్పటికీ మొహమ్మదీ మానవ హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఇందుకుగాను 2023 సంవత్సరంలో మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. -
తల్లి తరఫున నోబెల్ శాంతి బహుమతి స్వీకరణ
హెల్సింకీ: ఇరాన్ మానవ హక్కుల మహిళా కార్యకర్త నర్గీస్ మొహమ్మదీకి నోబెల్ కమిటీ ప్రకటించిన శాంతి బహుమతిని ఆమె తరఫున ఆమె కుమారుడు, కుమార్తె అందుకున్నారు. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న 51 ఏళ్ల నర్గీస్‌ను ఇరాన్ ప్రభుత్వం అక్రమ కేసులు మోపి టెహ్రాన్ జైలులో పడేసిన విషయం విదితమే. శనివారం నార్వేలోని ఓస్లోలో నర్గీస్ కవల పిల్లలు అలీ, కియానా రహా్మనీ పురస్కారాన్ని స్వీకరించారు. ‘‘ఇరాన్ సమాజానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన మానవహక్కుల కార్యకర్తలు, నిరసనకారులు, పాత్రికేయుల గొంతుకను సభావేదికగా గట్టిగా వినిపించండి’’ అంటూ నర్గీస్ ఇచి్చన సందేశాన్ని వేదికపై వారు చదివారు. -
అలుపెరగని పోరాటానికి నోబెల్ బహుమతి
-
ఇరాన్ హక్కుల యోధురాలికి నోబెల్ శాంతి
స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మదికి లభించింది. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కులపై అవగాహన, అందరికీ స్వేచ్ఛ, మరణ శిక్ష రద్దు కోసం అలుపెరగకుండా ఆమె చేస్తున్న పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గిస్ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ జైల్లో ఉన్నారు. ‘‘నర్గిస్ చేసిన పోరాటం అత్యంత సాహసోపేతమైనది. మహిళా హక్కుల కోసం ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారు. ఇరాన్లో ఏడాదిగా సాగుతున్న మహిళా హక్కుల పోరాటానికి నోబెల్ శాంతి తొలి గుర్తింపు. జైలు నుంచే ఈ ఉద్యమానికి ఊపిరిలా మారిన వివాదరహితురాలైన నర్గిస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తున్నాం’’అని కమిటీ చైర్ పర్సన్ బెరిట్ రెసి అండర్సన్ వెల్లడించారు. నోబెల్ శాంతి పురస్కారం కింద ఆమెకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (దాదాపుగా 10 లక్షల డాలర్లు) నగదు బహుమానం, 18 కేరట్ గోల్డ్ మెడల్, డిప్లొమా లభిస్తుంది,. డిసెంబర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవం సమయానికి నర్గిస్ జైలు నుంచి విడుదల కావాలని, స్వయంగా పురస్కారాన్ని అందుకోవాలని నోబెల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్లో మహిళా హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నర్గిస్ జైలు నుంచే న్యూయార్క్ టైమ్స్‌కి ఒక ప్రకటన పంపారు. ‘‘నోబెల్ శాంతి పుర స్కారం నాలో మరింత స్ఫూర్తిని నింపింది. మహిళల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ పెరిగింది. ఇరాన్లో మార్పు కోసం పోరాడుతున్న వారి లో మరింత బలం పెరుగుతుంది. ఇక విజయం సమీపంలో ఉంది’’అని ఆ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. 13 సార్లు అరెస్ట్..31 ఏళ్ల జైలు శిక్ష హక్కుల పోరాటంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా నర్గిస్ వెనుకంజ వేయలేదు. ఇరాన్ ప్రభుత్వం ఆమెను ఇప్పటికి 13 సార్లు అరెస్ట్ చేసింది. అయిదు సార్లు దోషిగా నిర్ధారించింది. 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 154 సార్లు కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించి తొలిసారి అరెస్టయి ఏడాది జైల్లో ఉన్నారు. హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరి మళ్లీ అరెస్టయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ మరోసారి అరెస్ట్ చేశారు. ఇరాన్లో మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు 2015లో జైలుకు పంపారు. ఇలా తన జీవితంలో సగభాగం ఆమె జైల్లోనే గడుపుతున్నారు. అన్నీ కోల్పోయినా.... సంప్రదాయం పేరుతో మహిళలపై ఆంక్షలు విధిస్తూ హిజాబ్ కాస్త పక్కకి జరిగినా జైలు పాల్జేయడమో, కొట్టి చంపేయడమో చేసే దేశంలో పుట్టి మహిళా హక్కుల కోసం జీవితాన్ని ధారపోస్తున్న నర్గిస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన సమయంలో నాలుగ్గోడల మధ్య బందీగా ఉన్నారు. వ్యక్తి గత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పణంగా పెట్టి 51 ఏళ్ల వయసున్న నర్గిస్ ఇంకా మార్పు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ‘‘ప్రభుత్వం నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే, ఎంతగా శిక్షిస్తే నాలో పోరాట స్ఫూర్తి అంతకంతకూ పెరుగుతుంది. దేశంలో మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వరకు ఈ పోరాటం ఆగదు’’అని నర్గిస్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇరాన్‌లోని జంజన్ పట్టణంలో 1972, ఏప్రిల్ 21న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక రైతు. తల్లి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రాచరికం రద్దయిందో అప్పుడే నర్గిస్ తల్లి సోదరుడు, మరో ఇద్దరు కుటుంబసభ్యులు జైలు పాలయ్యారు. వారిని ప్రతీ వారం కలుసుకోవడానికి తల్లితో పాటు జైలుకు వెళ్లే చిన్నారి నర్గిస్‌కు తమ బతుకులు ఎందుకంత అణచివేతకు గురవుతున్నాయో అర్థం కాక తీవ్ర సంఘర్షణకు లోనయ్యేది. అది చూసి ఆమె తల్లి తనకున్న అనుభవంతో రాజకీయాలు, వ్యవస్థల జోలికి వెళ్లొద్దని హితవు చెప్పింది. అయినప్పటికీ నర్గిస్లో చిన్నప్పట్నుంచి ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి ఆమెను హక్కుల పోరాటంలో ముందుకు నడిపించాయి. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నాళ్లు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో 2003లో చేరిన ఆమె ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో సహచర విద్యారి్థగా పరిచయమైన ప్రఖ్యాత సామాజిక కార్యకర్త తాఘి రెహమనీను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రెహమనీ తన పిల్లలతో కలిసి పారిస్‌కు ప్రవాసం వెళ్లిపోయారు. తన భర్త, పిల్లలతో మాట్లాడి, ప్రేమతో వారిని అక్కున చేర్చుకొని ఆమెకు ఏళ్లు గడిచిపోయాయి. జైలు నుంచే పోరాటం జైలు నుంచి ఆమె ఎందరిలోనో ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తున్నారు. రాజకీయ ఖైదీలు, మహిళా ఖైదీలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా జైల్లోనే ఆమె ఉద్యమం ప్రారంభించారు. జైల్లో కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో అధికారులు ఆమెపై పలు ఆంక్షలు విధించారు. అయినా ఆమె బెదరలేదు. జైలు నుంచే పలు వ్యాసాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి వాటికి పంపించారు. 2022 సెపె్టంబర్లో హిజాబ్ ధరించనందుకు మాసా అమిని అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేయగా కస్టడీలో తీవ్ర గాయాలపాలై ఆమె మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్లో భారీగా యువతీ యువకులు ఆందోళనలు చేపట్టి రోడ్లపైకి వచి్చనప్పుడు జైలు నుంచే ఆమె తన గళాన్ని వినిపించారు. పోరాడే వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తోటి మహిళా ఖైదీల అనుభవాలతో వైట్ టార్చర్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు విధించే ఇరాన్లో అత్యంత క్రూరమైన ఆ శిక్షను రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని నర్గిస్ ఎలుగెత్తి చాటుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Ales Bialiatski: చెరసాలలో శాంతి కపోతం
అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు ఊహించినట్లే జరిగింది. దేశంలో కల్లోలానికి కారకుడంటూ మానవ హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలెస్ బియాలియాట్ స్కీ(60)కు పదేళ్ల జైలు శిక్ష విధించింది బెలారస్ న్యాయస్థానం. 2020లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అలెస్.. ఆర్థిక సహకారం అందించాడని, తద్వారా ఇతర నేరాలకూ కారకుడయ్యాని ప్రభుత్వం మోపిన అభియోగాలను ధృవీకరించింది కోర్టు. అంతేకాదు ఆ సమయంలో అరెస్టయిన వాళ్లకు న్యాయపరమైన సాయం కూడా అందించాడని నిర్ధారించుకుని.. శుక్రవారం ఆయనకు పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. ► బియాలియాట్ స్కీ.. వియాస్నా మానవ హక్కుల సంఘం సహ వ్యవస్థాపకుడు. శాంతియుత పోరాటాలు నిర్వహిస్తుంది ఈ సంస్థ. 2020లో అలెగ్జాండర్ లుకాషెంకో తిరిగి బెలారస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నిరసనలకు బియాలియాట్ స్కీ.. ఆయన నిర్వహిస్తున్న ఫౌండేషన్ సూత్రధారి అని, నిరసనకారులకు అన్నివిధాలుగా సహకరించారనేది వెల్లువెత్తిన ఆరోపణలు. దీంతో 2021లో ఆయన్ని, వియాస్నా గ్రూప్‌కు చెందిన మరో ఇద్దరు సహవ్యవస్థాపకులనూ బెలారస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ► ఇదిలా ఉండగానే.. 2021 అక్టోబర్‌లో బియాలియాట్ స్కీకి నోబెల్ శాంతి ప్రైజ్(రష్యా మానవ హక్కుల సంస్థతో పాటు ఉక్రెయిన్‌కు చెందిన సంస్థకు సైతం) వరించింది. ► అలెస్ బియాలియాట్ స్కీ.. మానవ హక్కుల ఉద్యమకారుడే కాదు.. సాహిత్యకారుడు కూడా. స్కూల్ టీచర్‌గా, మ్యూజియం డైరెక్టర్‌గానూ ఆయన పని చేశాడు. 1980 నుంచి బెలారస్లో జరుగుతున్న పలు ఉద్యమాల్లో ఆయన భాగం అవుతూ వస్తున్నారు. ► సోవియట్ యూనియన్ నుంచి బెలారస్ స్వాతంత్రం కోసం ఉద్యమించిన ప్రముఖుల్లో ఈయన కూడా ఉన్నారు. ► 1990లో బెలారస్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 1994లో జరిగిన ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకాషెంకో అధ్యక్షుడిగా ఎన్నియ్యాడు. అయితే.. అక్కడ పారదర్శకంగా జరిగిన ఎన్నిక అదొక్కటేనని చెప్తుంటారు మేధావులు. ఆపై దొడ్డిదారిలో ఎన్నికవుతూ.. ఇప్పటికీ ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ► లుకాషెంకో.. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు. రష్యా అండతోనే బెలారస్.. పాశ్చాత్య దేశాలపైకి కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉక్రెయిన్ విషయంలోనూ రష్యాకు మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో తమ దేశంలో రష్యా బలగాలకు ఆశ్రయం కల్పిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ► 2020 అలర్లకు సంబంధించి రాజకీయ ఖైదీలకు.. బియాలియాట్ స్కీ బహిరంగ మద్దతు ప్రకటించారు. అయితే.. జైల్లో వాళ్లు ఎదుర్కొన్న వేధింపులను ఒక డాక్యుమెంటరీ ద్వారా బయటి సమాజానికి తెలియజేశారు. ఆ కోపంలోనే బెలారస్ సర్కార్ ఆయనపై పగ పెంచుకుని.. ఇబ్బందిపెడుతోందన్నది అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల వాదన. ► బియాలియాట్ స్కీ జైలుకు వెళ్లడం ఇదేం కొత్త కాదు. 2011 నుంచి మూడేళ్లపాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. వియాస్నా గ్రూప్ ఫండింగ్‌కు సంబంధించి పన్నుల ఎగవేత నేరంపై అప్పుడు ఆయన శిక్ష అనుభవించారు. అయితే.. ఆ సమయంలోనూ ఆయన నేరారోపణలను ఖండించారు. ► ఇక 2021లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకుగానూ మరోసారి అరెస్ట్ కాగా.. అప్పటి నుంచి చెరసాలలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన అరెస్ట్‌ను మానవ హక్కుల సంఘాలు, బెలారస్ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ బియాలియాట్ అరెస్ట్‌ను ప్రభుత్వ ప్రతీకార చర్యగా అభివర్ణించింది. మొత్తం 23 మానవ హక్కుల సంఘాలు ఆయనకు సంఘీభావంగా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ► తొలుత 12 ఏళ్ల శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు వాదించారు. అయితే.. కోర్టు మాత్రం పదేళ్ల శిక్ష విధించింది. ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరికి.. ఒకరికి ఏడు, మరొకరికి 9 ఏళ్ల శిక్షలు ఖరారు చేసింది. అఆగే ముగ్గురికి లక్ష నుంచి 3 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించింది. ► బియాలియాట్ స్కీ జైలు శిక్ష తీర్పుపై బయటి దేశాల నుంచే కాదు బెలారస్‌లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వాదప్రతివాదాలు సహేతుకంగా జరగలేదని విమర్శించారు బెలారస్ ప్రతిపక్ష నేత, బహిష్కృత నేత స్వియాట్లానా. మరోవైపు ఆయన అరెస్ట్‌కు ఖండిస్తూ.. సంఘీభావంగా పలు చోట్ల శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. -
K.Balagopal: మానవ హక్కుల వకీలు
అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం, మానవీయతా సుగుణం వంటి లక్షణాలన్నింటినీ తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కుల ఉద్యమాలకు ఆయన దశ–దిశని నిర్దేశించి వెన్నుదన్నుగా నిలిచారు. బాలగోపాల్ మధ్య తరగతి పండిత కుటుంబంలో 1952, జూన్ 10 నాడు నాగమణి, పార్థనాథశర్మ దంపతులకు జన్మించారు. అయినా ఆయన నిరంతరం పేద, దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన గణితశాస్త్ర విద్యార్థి అయినా... చరిత్ర, తత్వశాస్త్రం, అర్థశాస్త్రాలను విస్తృతంగా అధ్యయనం చేసి సమాజ పోకడలను సునిశితంగా పరిశీలించారు. రాజ్యాంగంలో హక్కుల అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నా నిరంకుశ ప్రభుత్వాల అణచివేత విధానాల వల్ల పౌరులు ఆయా హక్కులు పొందలేకపోవడాన్ని చూసి చలించిపోయారు. బాలగోపాల్ వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎమ్మెస్సీ అప్లైడ్ మాథ్స్ని అభ్యసించి అక్కడే డాక్టరేట్ చేస్తున్న క్రమంలో రాడికల్ విద్యార్థి సంఘం కార్యకలాపాలను చూస్తూ వాటికి ప్రభావితులయ్యారు. కమ్యూనిస్టులు వాస్తవాన్ని అతిశయం చేసి చెప్తారని మొదట్లో నమ్మిన బాలగోపాల్... కమ్యూనిస్టులు తమ విశ్వాసాల కోసం ప్రాణాలు పణంగా పెట్టడాన్ని గమనించి ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టుల పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. రాడికల్ విద్యార్థి సంఘం నాయకులు సూరపనేని జనార్ధన్ ఎన్కౌంటర్, జన్ను చిన్నాలు హత్యా సంఘటనల తర్వాత ప్రజల కోసం ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేయాలని బాలగోపాల్ బలంగా నిర్ణయించుకొని 1981లో ‘ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం’లో చేరారు. వరంగల్ రాజకీయ పరిస్థితులు లెక్కల మేధావిగా ఉన్న బాలగోపాల్‌ని హక్కుల కార్యకర్తగా తీర్చిదిద్దాయి. 1983లో ఖమ్మంలో జరిగిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర రెండవ మహాసభలో ఆయన ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తాను చేస్తున్న గణితశాస్త్ర అధ్యాపక ఉద్యోగం ఉద్యమాలకు అడ్డు రావడంతో ఆ ఉద్యోగాన్ని సైతం తృణీకరించి పూర్తికాలపు హక్కుల కార్యకర్తగా మారారు. బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చి హక్కుల ఉద్యమంలో నూతన ఒరవడితో ఉద్యమించారు. కానీ కాల క్రమంలో తానే తీర్చిదిద్దిన పౌర హక్కుల సంఘం నుండి ఆయన వైదొలిగి 1998, అక్టోబర్ 11 నాడు ‘మానవ హక్కుల వేదిక’ను స్థాపించారు. బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న సమయంలో బెంగళూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వివేకానంద న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ డిగ్రీని అభ్యసించారు. 1997లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా తన పేరుని నమోదు చేయించుకున్నారు. ఆయన న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించక పూర్వమే చట్టాలు, న్యాయశాస్త్రంలో ఉన్న ఆనుపానులు, తర్కాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడం వల్ల... పెద్దగా సీనియర్ న్యాయవాదుల అవసరం రాలేదు. కాని చట్టం పని విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రొసీజర్ విధానంలో ఆయన సీనియర్ న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దగ్గర సలహాలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు సాగారు. బాలగోపాల్ ప్రధానంగా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో బాధితుల పక్షం నిలబడి చట్ట ఫలితాలను వారికి అందించారు. దళితులు, గిరిజనులు, కార్మికులు, ఉద్యోగులు, భూవివాదాలకు సంబంధించిన అన్ని కేసులను ఆయన వాదించారు. అలాగే లేబర్ కోర్ట్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, లేబర్ కమిషన్ ఆఫీసుల కేసులను కూడా ఆయన వాదించారు. నక్సలైట్లకు సంబంధించి అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లను వేసి సబంధిత వ్యక్తులను కోర్టులకు హాజరుపరిచేలా నిరంతర కృషి చేశారు. చుండూరు హత్యాకాండ కేసులో బాలగోపాల్ బాధిత దళితులకు అండగా నిలబడి హైకోర్టులో అత్యున్నత వాదనలు వినిపించి దళిత హక్కులకు బాసటగా నడిచారు. అదేవిధంగా ‘షెడ్యూల్డ్ ట్రైబల్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్’ని అమలు చేయడం కోసం గిరిజనులు చేసిన పోరాటానికి ఆయన బాసటగా నిలిచారు. కోర్టులో ఆ చట్టాన్ని గెలిపించడంలో అసామాన్యమైన కృషి చేశారు. ఈ చట్టం ద్వారా గిరిజనులకు 2009లో భూములు పంచబడ్డాయి. బాలగోపాల్ చేపట్టిన ముఖ్యమైన కేసులలో అత్యంత ముఖ్యమైన కేసు ఎన్కౌంటర్ల కేసు. ‘పోలీసులకు ప్రాణం తీసే హక్కు లేదనీ, పోలీసులు ఎన్కౌంటర్ల నుండి తప్పించుకోవడానికి వీలు లేదనీ, పోలీసులపై కూడా హత్యాచారం కింద కేసులు పెట్టవచ్చ’నీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఆయన బలమైన వాదనలు వినిపించి ‘పోలీసులపై కూడా న్యాయ విచారణని జరిపించాలి’ అనే తీర్పుని తీసుకురాగలిగారు. ఆ తీర్పు రావడం వెనకాల బాలగోపాల్ 30 ఏళ్ల నిర్విరామ కృషి ఉంది. అనేక హక్కుల సంఘాలు మిళితమైన ఈ కేసులో బాలగోపాల్‌తో పాటు కేజీ కన్నాభిరాన్, బొజ్జా తారకం తదితరులు తమ వాదనలు వినిపించారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) హక్కుల నిరాదరణకు గురైనప్పుడు ప్రజలు చైతన్యంతో గొంతెత్తి ప్రశ్నిస్తే హక్కులు అమలు కాబడుతాయని బాలగోపాల్ విశ్వసించారు. ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన 2009, అక్టోబర్ 8 నాడు తుది శ్వాస విడిచినా ‘చెరగని హక్కుల స్ఫూర్తి’గా వెలుగొందుతున్నారు. (క్లిక్ చేయండి: మంచి అడుగే... మార్పులు అవసరం) - జె.జె.సి.పి. బాబూరావు పరిశోధక విద్యార్థి (అక్టోబర్ 8న కె.బాలగోపాల్ వర్ధంతి) -
చైనా ప్లాన్ మామూలుగా లేదుగా.. ప్రపంచవ్యాప్తంగా రహస్య పోలీస్ స్టేషన్లు!
బీజింగ్: గ్లోబల్ సూపర్‌పవర్‌గా ఎదగాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు చైనా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అభివృద్ధి చెందిన కెనడా, ఐర్లాండ్ వంటి దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అక్రమంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ రహస్య పోలీస్ స్టేషన్లపై సంచలన విషయాలు వెల్లడించింది ఓ నివేదిక. ఈ అంశంపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడా వ్యాప్తంగా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో(పీఎస్బీ) అనుబంధంగానే అలాంటి అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్ రిపోర్టికా..స్థానిక మీడియాతో వెల్లడించింది. చైనా విరోధులను నిలువరించేందుకు ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గ్రేటర్ టొరొంటే ప్రాంతంలోనే ఇలాంటివి మూడు స్టేషన్లు ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. ఈ అక్రమ పోలీస్ స్టేషన్ల ద్వారా పలు దేశాల్లో ఎన్నికలను సైతం చైనా ప్రభావితం చేస్తోందని సంచనల విషయాలు వెల్లడించింది. 21 దేశాల్లో 30 అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చైనాలోని ఫుఝో పోలీసులు తెలిపారని రిపోర్టికా పేర్కొంది. ఉక్రెయిన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాల్లోనూ చైనా పోలీస్ స్టేషన్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారని తెలిపింది. ఆయా దేశాల్లోని పలువురు నేతలు చైనా ప్రబల్యాన్ని ప్రశ్నిస్తున్నారని, మానవ హక్కులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రిపోర్టికా పేర్కొంది. మరోవైపు.. స్వదేశంలో భద్రత పేరుతో ప్రజలను అణచివేస్తున్న తీరుపై అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాపై విమర్శలు గుప్పిస్తున్నారు మానవ హక్కుల ప్రచారకర్తలు. ఇదీ చదవండి: జనంలోకి జిన్‌పింగ్ -
పెగాసెస్‌కు మించి: మరో స్పైవేర్ ‘హెర్మిట్’ కలకలం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెగాసెస్ రేపిన వివాదం చల్లారకముందే మరో స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆండ్రాయిడ్ స్పైవేర్ ‘హెర్మిట్’ను సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తాజాగా గుర్తించారు. వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, కొంతమంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులను ఆయా ప్రభుత్వాలు 'హెర్మిట్' ఎంటర్ప్రైజ్-గ్రేడ్ ఆండ్రాయిడ్ స్పైవేర్ ద్వారా టార్గెట్ చేసినట్టు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు వెల్లడించారు. సైబర్-సెక్యూరిటీ కంపెనీ లుక్అవుట్ థ్రెట్ ల్యాబ్ టీంఈ మాలావేర్ను గుర్తించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను అణిచి వేసిన నాలుగు నెలల తర్వాత ఏప్రిల్‌లో కజకిస్తాన్ ప్రభుత్వం ఉపయోగించినట్టు గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కనుగొన్నామని ఈ బృందం పేర్కొంది. జాతీయ భద్రత ముసుగులో వ్యాపార వేత్తలు, మానవహక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులపై గూఢచర్యం చేయడానికి వారిపై నిఘాకు తరచుగా వాడు కుంటున్నారని పరిశోధకులు హెచ్చరించారు. హెర్మిట్ అనేది మాడ్యులర్ స్పైవేర్. ఆడియోను రికార్డ్, ఫోన్ కాల్ల డైవర్షన్ అలాగే కాల్ లాగ్‌లు, ఫ్రెండ్స్, ఫోటోలు, లొకేషపన్లను లాంటి వాటిని ఎస్ఎంఎస్ ద్వారా డేటాను చోరీ చేస్తుంది. ఈ మాలావేర్ టెలికమ్యూనికేషన్ కంపెనీ, స్మార్ట్‌ఫోన్ తయారీదారుల అప్లికేషన్లను కూడా ప్రభావితం చేశాయని లుకౌట్ బృందం తెలిపింది. 'హెర్మిట్' అని పేరు పెట్టిన ఈ స్పైవేర్‌ను ఇటాలియన్ స్పైవేర్ ఆర్సీఎస్ ల్యాబ్,టెలీ కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ కంపెనీTykelab Srl సహకారంతో అభివృద్ధి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నామని పరిశోధకులు బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. అయితే హెర్మిట్ నిఘా ఇదే మొదటిసారి కాదు. 2019లో అవినీతి నిరోధక చర్యలో ఇటాలియన్ అధికారులు దీనిని ఉపయోగించారట.ఆర్సీఎస్ ల్యాబ్ మూడు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉన్న ప్రసిద్ధ డెవలపర్. ఇది కూడా పెగాసస్ డెవలపర్ ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస్, ఫిన్ఫిషర్ని సృష్టించిన గామా గ్రూప్‌ల మాదిరిగానే అదే మార్కెట్లో పనిచేస్తుంది. అలాగే ఇది పాకిస్తాన్, చిలీ, మంగోలియా, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, తుర్క్మెనిస్తాన్లోని సైనిక, గూఢచార సంస్థలతో నిమగ్నమై ఉన్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. -
హక్కులు కరవైన కార్మిక లోకం
భారతీయ కార్మికవర్గం మొదటినుంచీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకుంటూ వచ్చింది. 1908లో ముంబైలో చేసిన ఆరు రోజుల సమ్మె, 1913లో కెనడాలోని పంజాబీ వలస కార్మికులు స్థాపించిన గదర్ పార్టీ, 1930లో నాలుగురోజుల పాటు నడిచిన సోలాపూర్ కమ్యూన్ లాంటి వాటివల్ల భారత కార్మికవర్గం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1930లో కార్మికులు కలకత్తా కాంగ్రెస్ సెషన్‌లోకి దూసుకెళ్లడం పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకటించడానికి దారి తీసింది. 1937లో కిసాన్ సభ, వర్కర్స్ పీసెంట్స్ పార్టీ కార్యాచరణలు, యునైటెడ్ ప్రావిన్స్ లలో జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానాలకు దారితీశాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ దళాలకు సరఫరాలు తీసుకెళ్లడానికి తిరస్కరించి 1945లో ముంబై, కలకత్తా డాక్ వర్కర్లు చేసిన చర్చలు... చివరకు 1946లో రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు జరిగినప్పుడు కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో ముంబై కార్మిక వర్గం ఇచ్చిన వీరోచిత మద్దతు వంటివి భారీ నిరసనలకు దారి తీశాయి. ఇది బ్రిటిష్ రాజ్‌కి చివరి సమాధి రాయిగా మారింది. మంచి జీవితాన్ని గడిపే హక్కు, సంపదనూ, ఉత్పత్తి సాధనాలనూ కొంతమంది చేతుల్లో కేంద్రీకరించని ఆర్థిక వ్యవస్థ, స్త్రీపురుషులకు సమానవేతనం, ఆర్థిక అవసరాల పేరిట కార్మికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకపోవడం, వృద్ధాప్యం, వ్యాధులు, అంగవైకల్యం వంటి అంశాలలో సాయం చేయడం... ఇలా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల మనోభావాలన్నింటికీ రూపమివ్వడమే కాకుండా సోషలిస్టు అనే పదం కూడా దానికి జోడించారు. కానీ ఆచరణలో వేతనాలు, జీవన ప్రమాణాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, అస్థిరత నుంచి పరిరక్షించే హక్కు వంటివి గగన కుసుమాల్లాగే మారాయి. 1920లో ఏఐటీయూసీ ఏర్పడిన నాటి నుంచీ గత వందేళ్లుగా అనేక పోరాటాలు, అనంత త్యాగాల నుంచే కార్మికులు తమ హక్కులను కాపాడుకుంటూ వచ్చారు. భద్రతా ప్రమా ణాలను నెలకొల్పి, పరిమిత పనిగంటలను కల్పించిన ఫ్యాక్టరీస్ యాక్ట్, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, కనీస వేతనాల చట్టం వంటివి స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభ సంవత్సరాల్లోనే ఏర్పడుతూ వచ్చాయి. పెరుగుతున్న ప్రైవేట్ రంగం, రాజకీయాల్లో ప్రైవేట్ పరిశ్రమ దారుల బలం పెరుగుతూ వచ్చిన క్రమంలో రకరకాల పరిణామాలు సంభవించాయి. ప్రభుత్వ రంగం అనేది సామాజిక, ఆర్థిక సముద్ధరణ లక్ష్యంతో పనిచేయడం కాకుండా లాభాలను సృష్టించే రంగంగా మారిపోసాగింది. శాశ్వత కార్మికులు సోమరులుగా ఉంటున్నారనీ, కూర్చుండబెట్టి మరీ జీతాలు ఇస్తున్నారనే భావాలు కొత్తగా ఏర్పడే క్రమంలో లేబర్ వెసులుబాటు పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకోవడం, ఉద్యోగాల్లోంచి తొలగించడం వంటి పద్ధతులు పుట్టుకొచ్చాయి. 1950ల చివరలో భిలాయి స్టీల్ ప్లాంటులో 96 వేలమంది పర్మనెంట్ కార్మికులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య పదివేలకు పడిపోయింది. వారి స్థానంలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మికులు వచ్చి చేరారు. వీరికి పర్మనెంట్ కార్మికుల జీతాల్లో మూడో వంతు కూడా దక్కడం లేదు. 1974లో చారిత్రాత్మక రైల్వే సమ్మెలో 17 లక్షల మంది పాల్గొనగా 20 రోజులపాటు భారతదేశం స్తంభించిపోయింది. ఎమర్జెన్సీ విధింపునకు, నూతన పాలనకు కూడా ఇదొక కారణమని చెబుతుంటారు. ఈ సమ్మె తర్వాతే రైల్వే కార్మికుల్లో కాంట్రాక్టీరణ శరవేగంతో సాగింది. ఈరోజు లోకో పైలట్లు, టికెట్ ఎగ్జామినర్లు వంటి వివిధ విభాగాల కార్మికులు రైల్వే నియమాకం చేసినవారు కాదు. ఉద్యోగాల వాటా ప్రకారం చూస్తే దేశ అసంఘటిత రంగంలో 83 శాతం మంది ఉండగా 17 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉంటున్నారు. కానీ ఎంప్లాయ్మెంట్ స్వభావం బట్టి చూస్తే, మన దేశంలో 92.4 శాతం మంది కార్మికులు అనియత రంగంలోనే ఉన్నారని బోధపడుతుంది. వీరంతా రాతపూర్వక కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో లేరు కాబట్టి లేబర్ చట్టాలు వీరికి వర్తించవు. 2015 నుంచి 2018 వరకు భారత్‌లో నిజవేతన పెరుగుదల 2.8 నుంచి 2.5 శాతానికి దిగజారుతూ వస్తోందని తెలిపింది. పాకిస్తాన్, శ్రీలంక, చైనా, నేపాల్ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే కూడా భారత్‌లో నిజవేతన పెరుగుదల చాలా తక్కువగా నమోదైంది. ( భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!) ఈరోజు, కార్మికుల్లో చాలా తక్కువమంది యూనియన్లలో ఉంటున్నారు. అసంఘటిత రంగంలోని వివిధ సెక్షన్ల కార్మికులు ప్రత్యేకించి నిర్మాణ కార్మికులు, ఇంటిపని కార్మికులు, సఫాయి కర్మచారీలు, హాకర్లు వంటి వారు తమను కాపాడే చట్టాల కోసం పోరాడుతున్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశంలోని 46 లేబర్ చట్టాలను తొలగించి వాటిస్థానంలో 4 చట్టాలను తీసుకురావాలనుకుంటోంది. అయితే బీజేపీకి చెందిన భారతీయ మజ్దూర్ సంఘంతో సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు ఈ మార్పుల పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తంచేస్తున్నాయి. కానీ కార్మిక సంఘాల కనీసపాటి డిమాండ్ల పట్ల కూడా కేంద్రప్రభుత్వం ప్రదర్శిస్తున్న మౌనం మరింత భయంకరంగా కనిపిస్తోంది. - సుధా భరద్వాజ్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త -
రాజ్యహింసను ధిక్కరించినవాడు
దేశ చరిత్రలో 1975లో విధించిన ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదించడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో రాజ్యానికి వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించారు న్యాయవాది కేజీ కన్నాభిరాన్. డా. బీఆర్ అంబేడ్కర్ దేశ పౌరులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ప్రభుత్వాలు హననం చేస్తుంటే ప్రతిఘటించారాయన. భూమి కోసం, భుక్తి కోసం, న్యాయం కోసం ప్రజల తరపున పోరాడుతున్న వారి ఇళ్లపై దాడులు చేస్తూ రాత్రికి రాత్రే మాయం చేసి, ఎదురు కాల్పుల పేరుతో కాల్చి చంపారు. తూటాలతో, లాఠీలతో, పౌర హక్కుల పోరాటవీరుల సమూహాలపై దాడులు చేసి, భయానక వాతావరణం సృష్టించారు. ఆ నిరంకుశత్వాన్ని నిరసించి, ప్రజల పక్షాన పోరాడిన హక్కుల యోధుడు. సింగరేణి కార్మికుల పోరాట, ఆరాటాలలో కూడా వారికి మద్దతు పలికిన కార్మిక పక్షపాతి. పౌరహక్కుల ఉద్యమనేత, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో వకీలు, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ సంస్థకు సహ వ్యవస్థాపకుడు. కొంతకాలం ఆ సంస్థ అధ్యక్షుడిగా కూడా కన్నాభిరాన్ పనిచేశారు. 1970 ప్రాంతంలో చట్టబద్ధ హక్కుల కోసం పోరాడుతున్నవారిపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం కొనసాగిస్తున్నపుడు న్యాయవాదులందరూ కలసి నక్సలైట్ డిఫెన్స్ క్సౌన్సిల్ను ఏర్పాటు చేసి, ఆ సంస్థకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్, పార్వతీపురం కుట్ర కేసులలో డిఫెన్స్ న్యాయవాదిగా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో తప్పుడు కేసుల పాలైన వారి తరపున వాదించిన ఏకైక న్యాయవాది ఆయనే. పీడితులు, కార్మికులు, హక్కులు, పోరాటాలకు ఆయన ఎప్పుడూ అండగా నిలిచేవారు. పౌరుల జీవించే హక్కుల కోసం కన్నాభిరాన్ జీవితాన్ని అంకితం చేశారు. నవంబర్ 9, 1929న మదురైలో జన్మించిన ఆయన 2010 డిసెంబర్ 30న హైదరాబాద్‌లో తనువు చాలించారు. – డా. ఎస్. బాబూరావు, సీనియర్ జర్నలిస్ట్ (డిసెంబర్ 30న కన్నాభిరాన్ వర్ధంతి) -
హర్ష మందర్ ఇళ్లల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మానవ హక్కుల ఉద్యమకారుడు హర్ష మందర్(66)కు చెందిన ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగానే ఈ సోదాలు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో ఇళ్లు, ఎన్జీఓ కార్యాలయంలో సోదాలు జరిపారు. హర్ష మందర్‌కు సంబంధం ఉన్న రెండు ఎన్జీఓల ఆర్థిక, బ్యాంకింగ్ కార్యకలాపాల పత్రాలను ఈడీ అధికారులు పరిశీలించారు. హర ్షమందర్ గురువారం ఉదయమే తన భార్యతో కలిసి జర్మనీకి పయనమయ్యారు. సామాజిక న్యాయం, మానవ హక్కులపై ఆయన వార్తా పత్రికల్లో సంపాదకీయాలు రాస్తుంటారు. పుస్తకాలు రచిస్తారు. హర్ష మందర్ డైరెక్టర్‌గా ఉన్న సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్(సీఎస్ఈ) అనే సంస్థపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
కరుణ లేని కాఠిన్యం
ఒక మనిషి తన ప్రాణం కోసం కాకుండా, తనకు ప్రాణానికి ప్రాణమైన మనుషుల కోసం తపిం చడం పాపమా? ప్రాణం పోతోందని తెలిసినా, అదేదో తన వాళ్ళ మధ్య ప్రాణాలు వదిలితే బాగుం టుందని కోరుకోవడం నేరమా? నిరూపితం కాని నేరాన్ని సాకుగా చూపి, ఉగ్రవాదం ముసుగు వేసి, నిందితుల ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచడం ఏ చట్టం కిందైనా న్యాయమా? ఆఖరు శ్వాస విడిచేవరకు గిరిజనుల హక్కులైన ‘జల్, జంగిల్, జమీన్’ కోసమే పోరాడి, అన్యాయంగా కన్ను మూసిన క్రైస్తవ సన్యాసి 84 ఏళ్ళ ఫాదర్ స్టాన్ స్వామి గురించి విన్నా, చదివినా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వెంటాడతాయి. కరోనా కేసులు ఎక్కువున్న కిక్కిరిసిన తలోజా జైలు నుంచి మార్చమనీ, అనారోగ్య రీత్యా మధ్యంతర బెయిలు ఇవ్వమనీ కోర్టులో పదే పదే ప్రార్థించినా, ప్రాథేయ పడ్డా ఆయనది అరణ్య రోదన కావడం ఓ విషాదం. చెవులు వినిపించని, శారీరకంగా బలహీనుడైన ఓ మానవతావాది దేశంలో అశాంతి సృష్టించి, ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర చేస్తున్నారని ఎన్ఐఎ కోర్టు భావన. కానీ, అలా తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని ఐరాస ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. స్టాన్ స్వామిది మామూలు మరణం కాదు... ‘వ్యవస్థ చేసిన హత్య’ అని అనేకులు అంటున్నది అందుకే! దళితులు, అడవిబిడ్డల కోసం ఆఖరిదాకా తపించిన మనిషి సోమవారం మధ్యాహ్నం సంకెళ్ళు లేని లోకానికి, ఏ బెయిలూ అవసరం లేకుండానే శాశ్వతంగా వెళ్ళిపోయారు. అనారోగ్యంతో ఉన్నా కూడా ఈ సేవామూర్తి అయినవాళ్ళనుకున్న గిరిజనుల మధ్య ఆఖరు క్షణాలు గడిపేందుకు కాస్తంత కనికరం చూపమనే కోరడం గమనార్హం. జైలు నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి కూడా అధికారులు 10 రోజులు ఆలస్యం చేసిన స్టాన్ స్వామి ఉదంతం కన్నీరు తెప్పిస్తుంది. ఇరవై ఆరేళ్ళ క్రితం సంచలనమైన వివాదాస్పద వ్యాపారవేత్త, ‘బిస్కెట్ కింగ్’ రాజన్ పిళ్ళై కస్టడీ మరణం కేసు అనివార్యంగా గుర్తొస్తుంది. అరెస్టయి, అనారోగ్యంతో బాధపడుతూ, సమయానికి తగిన వైద్యం అందక తీహార్ జైలులో తుదిశ్వాస విడిచిన పిళ్ళై కేసు అనేక పాఠాలు నేర్పింది. జైలు యంత్రాంగం నిర్లక్ష్యానికీ, న్యాయవ్యవస్థ కాఠిన్యానికీ పిళ్ళై మరణం మచ్చుతునక. ఇప్పుడు ‘ఎల్గార్ పరిషత్ కేస్థు’ నిందితులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వాదిస్తున్న ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ), జైలు అధికారుల లోపభూయిష్ఠ వ్యవహారం అందుకేమీ తీసిపోవడం లేదు. ఇదే ఇప్పుడు పలువురి ఆవేదన. స్టాన్ స్వామితో సహా పలువురు విద్యావేత్తలు, న్యాయవాదులు, సాంస్కృతిక కార్యకర్తలపై ఇంతటి కర్కశత్వం అవసరం లేదనేదే వారి వాదన. ‘ఎల్గార్ పరిషత్’ సమావేశం, ‘భీమా – కోరేగావ్’ హింస కేసులో ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (యూఏపీఏ – ఉపా) కింద ఇప్పటికీ మరో 15 మంది జైలు గోడల మధ్య మగ్గుతున్నారు. వారిలో మన విప్లవ కవి వరవరరావు సహా సుధా భరద్వాజ్ లాంటి ప్రజాక్షేత్రంలోని ప్రసిద్ధులు పలువురు ఉన్నారు. వారందరిలోకే కాదు... ‘ఉపా’ చట్టం కింద దేశంలో ఇప్పటి దాకా అరెస్టయినవారిలోనే బహుశా అత్యంత వృద్ధుడు ఫాదర్ స్టాన్ స్వామే! పార్కిన్సన్స్ వ్యాధితో వణుకుతున్న చేతులతో అన్నం తినడానికీ, నీళ్ళు తాగడానికీ వీల్లేక, కనీసం స్ట్రా, సిప్పర్ కావాలని ప్రాథేయపడితే, ఎన్ఐఏ అందుకు 4 వారాల గడువు తీసుకుందంటే విషయం అర్థం చేసుకోవచ్చు. న్యాయపోరాటంలో అలసిపోయిన స్టాన్ స్వామి కథ చివరకు అత్యంత విషాదంగా ముగిసింది. ఇప్పుడిక మిగతా ఖైదీల విషయంలోనైనా సమయం మించిపోక ముందే సరైన నిర్ణయం తీసు కోవడం అవసరం. ఆ కేసు నిందితుల్లో అత్యధికుల శారీరక అశక్తత, ఆరోగ్య, వృద్ధాప్య సమస్యలు గుర్తించాలి. ఒకపక్క దర్యాప్తు, విచారణ కొనసాగిస్తూనే, మానవతా దృక్పథంతోనైనా వారికి మధ్యం తర జామీనివ్వడం న్యాయపరంగా తప్పేమీ కాదు. కఠిన చట్టాల ఉక్కుపాదం మోపి, రుజువు కాని దేశద్రోహం కింద వారిని ఏళ్ళ తరబడి జైలులో మగ్గబెట్టడం మానవీయతా కాదు. ‘అర్బన్ నక్సల్’ అనే కొత్తముద్ర తయారుచేసి, కర్కశత్వానికి కొత్త చిరునామాగా మారిందనే అపఖ్యాతి పాలకులకూ శోభనివ్వదు. ఇప్పటికే ఒకసారి కరోనా బారినపడి, ఆఖరు నిమిషంలో అదృష్టవశాత్తూ బయటపడ్డ వరవరరావు లాంటి వారిని చివరి రోజులైనా ప్రశాంతంగా బతకనివ్వడమే న్యాయం, సమంజసం. రాజన్ పిళ్ళై మరణించిన దశాబ్దిన్నర తరువాత ‘ఆ మరణానికి బాధ్యత ప్రభుత్వానిదే’ అంటూ న్యాయస్థానమే తప్పుబట్టింది. కానీ, అప్పటికే అంతా అయిపోయింది. అమితమైన ఆలస్యమూ అయిపోయింది. ఆలస్యమైన న్యాయం... అక్షరాలా అన్యాయమే! పోయిన ప్రాణానికి బాధ్యత వహించాల్సిన విషతుల్యమే! అందుకే, అతి వృద్ధుడైనా... కనీసం సర్కారు వారి టీకాకు కూడా నోచుకోక, అన్యాయంగా కరోనా కోరలకు చిక్కి కన్నుమూసిన స్టాన్ స్వామి ఆఖరి వీడియో సందేశం ఇక ఎప్పుడు చూసినా గుండె బరువెక్కుతూనే ఉంటుంది. వ్యవస్థలో జరిగిన అన్యాయాన్నీ, కరుణించని న్యాయదేవత కాఠిన్యాన్నీ, సమాజ వైఫల్యాన్నీ గుర్తుచేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులకూ, మానవతావాదులకూ ఇది పాలకులు మిగిల్చిన ఓ శాశ్వతమైన గుండెకోత. స్టాన్ స్వామి వెళ్ళిపోయారు... ఆయన చూపిన బాట, చేసిన పని మాత్రం మిగిలిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఫాదర్ స్టాన్ స్వామీ! మూడు దశాబ్దాల పైగా మీరు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీల మధ్యే తుదిశ్వాస విడవాలన్న మీ ఆఖరి కోరికను తీర్చలేకపోయాం. మన్నించండి! ఇప్పటికైనా వ్యవస్థలో వివేకం మేలుకోవాలని దీవించండి!! -
Stan Swamy: అస్సలు సంబంధం లేని..
ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి.. 84 ఏళ్ల వయసులో.. పైగా కాళ్లు చేతులు గొలుసులతో బంధించి ఉంటాయి. ఇంత కంటే దారుణం ఉంటుందా? అంటూ ఓ ఫొటోను నెట్లో వైరల్ చేస్తున్నారు కొందరు. ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా శిక్ష అనుభవించిన స్టాన్ స్వామి.. గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కొందరు ఓ ఫొటోను వైరల్ చేస్తున్నారు. వైరల్.. గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారు. అలాంటి వ్యక్తిని సంకెళ్లతో బంధించి మరీ చికిత్స అందించారు. ఈ వయసులో ఆయనను అంతలా కష్టపెట్టడం దారుణం. వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో.. అంటూ కొందరు నెటిజన్స్ ఆ ఫొటోను వైరల్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్.. అయితే గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో అది మే నెలలో బాగా వైరల్ అయిన ఫొటోగా తేలింది. ఆ వ్యక్తి పేరు బాబురామ్ బల్వాన్(92). ఓ హత్య కేసులో యూపీ ఉటా జైళ్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో అతన్ని ఆస్పతత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. అయితే ఈ ఫొటో కూడా వివాదాస్పదం కాగా.. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు అప్పుడు. అయినా ఆ వివాదం సర్దుమణగపోకపోవడంతో వార్డెన్‌ను సస్పెండ్ చేశారు కూడా. -
పాక్ హక్కుల కార్యకర్త రెహ్మాన్ మృతి
లాహోర్: ప్రముఖ పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ఐఏ రెహ్మాన్(90) సోమవారం లాహోర్‌లో కన్నుమూశారు. పాక్‌లోని హిందు, క్రైస్తవ మైనారిటీల తరఫున గళం వినిపించి, రాజ్యాంగంలో దైవదూషణకు సంబంధించిన కఠినమైన చట్టాలను రద్దు కోసం పోరాడారు. భారత్–పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు విశేష కృషి చేశారు. డయాబెటిస్‌తోపాటు తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో రెండు రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని కుటుంబసభ్యులు తెలిపారు. రెహ్మాన్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అవిభాజ్య భారత్‌లోని హరియాణాలో 1930లో జన్మించిన రెహ్మాన్ జర్నలిస్ట్‌గా వివిధ పత్రికల్లో 65 ఏళ్లపాటు పనిచేశారు. పాకిస్తాన్–ఇండియా పీపుల్స్ ఫోరం ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ వేదిక వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (హెచ్ఆర్సీపీ)కి రెండు దశాబ్దాలపాటు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన మృతికి హెచ్ఆర్సీపీ చైర్పర్సన్ జోహ్రా యూసఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
భయంతో గుండెపోటు.. మృతి చెందినా వదల్లేదు
టెహ్రాన్: ఇరాన్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఉరికంబం ఎక్కే క్రమంలో గుండెపోటుకు గురై ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయినప్పటికీ ఆమె మృతదేహాన్ని ఉరికి వేలాడదీసి శిక్ష అమలు చేశారు. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. జరా ఇస్మాయిలీ అనే మహిళ భర్త అలీరెజా జమానీ, తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేది. అయితే కొన్నాళ్ల క్రితం భర్తతో విభేదాలు తలెత్తాయి. రోజూ తనను, కూతురిని అసభ్యంగా దూషిస్తూ దిగజారి ప్రవర్తించడంతో భర్తపై కోపం పెంచుకున్న ఆమె, అతడిని హతమార్చింది. ఈ క్రమంలో స్థానిక కోర్టు జరాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించారు. అప్పటి నుంచి రజాయి షహర్ జైలులో జీవితం గడుపుతున్న ఆమెను, ఉరితీసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలుకు కాసేపటి ముందే గుండెపోటుతో ఆమె మరణించింది. ఈ విషయం గురించి జరా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘16 మంది పురుషుల తర్వాత జరాను ఉరి తీసేందుకు నిశ్చయించారు. తన ముందే వారందరూ విలవిల్లాడుతూ మరణించడం ఆమె కళ్లారా చూసింది. గుండె పగిలి కుప్పకూలిపోయింది. అయినప్పటికీ తన మృతదేహాన్ని ఉరికంబం ఎక్కించారు. జరా నిర్జీవ శరీరాన్ని వేలాడదీసి, ఆమె కాళ్ల కింది కుర్చీని తన అత్తగారు తన్నేశారు. ఇది నిజంగా దారుణం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జరా మరణ ధ్రువీకరణ పత్రంలో గుండెపోటు కారణంగానే ఆమె మరణించినట్లు పేర్కొన్నట్లు న్యాయవాది వెల్లడించారు. కాగా ఉరిశిక్షల అమలును మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆటవిక సంస్కృతికి చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉరిశిక్షలను రద్దు చేసేలా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు. చదవండి: ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో -
కోరెగావ్ కేసులో స్టాన్ స్వామి అరెస్ట్
ముంబై: భీమా కోరెగావ్ హింసకు సంబంధిం చి మానవ హక్కుల నేతలు గౌతమ్ నవ్లఖా, 82 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామి సహా 8 మందిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి వారు కుట్ర పన్నినట్లు అందులో ఆరోపించింది. ఇందులో మావోయిస్టులతో పాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉందని పేర్కొంది. ఫాదర్ స్టాన్ స్వామి సహా ఆ 8 మంది సమాజంలో శాంతిభద్రతలకు విఘా తం కల్పిస్తున్నారని 10 వేల పేజీల చార్జిషీట్లో ఎన్ఐఏ వెల్లడించింది. గౌతమ్ నవ్ల ఖాకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయంది. వీరంతా వ్యవస్థీకృత మావోయిస్టు నెట్‌వర్క్‌లో భాగమని, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మావోలకు చేరవేసేవారని తమ దర్యాప్తులో తేలిం దని స్పష్టం చేసింది. స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు ఫాదర్ స్టాన్ స్వామిని రాంచీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చింది. శుక్రవారం ఆయనను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీ షియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఎక్కువ వయస్సున్న వ్యక్తి 82 ఏళ్ల స్టాన్ స్వామినేనని అధికారులు తెలిపారు. మిలింద్ తెల్తుంబ్డే మినహా చార్జిషీట్లో పేర్కొన్న వారందరూ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ చార్జ్‌షీట్ దాఖలుచేయడం ఇది మూడోసారి. తొలిసారిగా పుణె పోలీసులు 2018 డిసెంబర్లో, రెండోసారి 2019ఫిబ్రవరిలో చార్జ్షీట్లు వేశారు. తర్వాత కేంద్రప్రభుత్వం ఈ కేసును ఈ ఏడాది జనవరిలో పుణే పోలీసుల నుంచి ఎన్ఐఏకు బదిలీచేసింది. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని పుణె సమీపంలో భీమా కోరెగావ్ వద్ద జనవరి 1, 2018న జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు రోజు, ఎల్గార్ పరిషత్ సభ్యులు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాల తరువాతనే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని ఎన్ఐఏ పేర్కొంది. వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించా రని అభియోగాలు మోపింది.∙అందుకు తగ్గ సాక్ష్యాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని తెలిపింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మేధావులను ఏకం చేసే బాధ్యతను నవ్లఖా నిర్వహించేవారని చెప్పింది. ఫాదర్ స్టాన్ స్వామి మావో కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారని, ఇతర కుట్రదారులతో సంప్రదింపులు జరుపుతుండేవారని ఎన్ఐఏ ఆరోపించింది. ఈ ఆరోపణలను స్టాన్ స్వామి ఖండించారు. -
మోదీకి పాక్ హక్కుల కార్యకర్తల వేడుకోలు..
ఇస్లామాబాద్ : సింధ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాలని పాకిస్తాన్ హక్కుల కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింధ్ సహా పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనను ఐరాసలో ప్రధాని మోదీ ప్రస్తావించాలని సింధ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పాక్‌లో ప్రముఖ రాజకీయ కార్యకర్త మునవర్ సుఫీ లఘరి ప్రధానిని కోరారు. సింధ్ ప్రాంతంలో ప్రజల్లో అలుముకున్న భయాందోళనలను తొలగించడం పెనుసవాల్‌గా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో పెద్దసంఖ్యల్లో సింధీలు నివసిస్తున్న క్రమంలో వారి సమస్యలను రానున్న ఐరాస సాధారణ సమితి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించాలని కోరారు.మైనారిటీలు, పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రకియ అనే పేరిట జరిగిన మానవ హక్కుల కౌన్సిల్ 42వ సదస్సును ఉద్దేశించి లఘరి మాట్లాడారు. మత స్వేచ్ఛపై అమెరికా మాట్లాడుతున్న తరహాలో కనీసం మానవ హక్కుల గురించి ప్రధాని మోదీ మాట్లాడాలని కోరారు.ఇక పాక్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై పీఓకే, బెలూచిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌లకు చెందిన పలువురు హక్కుల కార్యకర్తలు పాక్ తీరును తప్పుపట్టారు. -
పాక్ మహిళకు ఐరాస పురస్కారం
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66)కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రకటించే ప్రతిష్టాత్మక మానవహక్కుల పురస్కారం–2018 అస్మాను మరణానంతరం వరించింది. పాకిస్తాన్లో సైనిక జోక్యానికి, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అస్మా ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు. న్యూయార్క్‌లో మంగళవారం సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐరాస సాధారణ సభ అధ్యక్షురాలు మారా ఫెర్నాండా ఈ అవార్డును అస్మా కుమార్తె మునైజే జహంగీర్‌కు అందజేశారు. అస్మాతో పాటు టాంజానియాలో బాలికా విద్య కోసం ఉద్యమిస్తున్న రెబెకా గ్యుమీ, బ్రెజిల్లో తొలి ఆదివాసీ మహిళా న్యాయవాది జోనియా బటిస్టా, ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తల కోసం పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ డిఫెండర్స్(ఐర్లాండ్)కు 2018కి గానూ ఈ మానవహక్కుల పురస్కారం లభించింది. -
‘మావో’ లింకులపై బలమైన సాక్ష్యాలు
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలపై బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతోనే ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేశామని మహారాష్ట్ర బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేవలం అసమ్మతి, అభిప్రాయభేదం కారణంగా ఈ అరెస్టులు జరగలేదని స్పష్టం చేసింది. పుణెలోని భీమా కొరేగావ్‌లో గతేడాది డిసెంబర్ 31న ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా చెలరేగిన హింసకు మావోలతో కలసి కుట్రపన్నారంటూ విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖాల వంటి మానవహక్కుల కార్యకర్తలను పుణె పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఐదుగురిని విడుదలచేసి గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఈ సందర్భంగా అసమ్మతి, భిన్నాభిప్రాయం అన్నది ప్రజాస్వామ్యానికి రక్షక కవాటం వంటిదని కోర్టు పేర్కొంది. తాజాగా ఈ హక్కుల కార్యకర్తల అరెస్ట్‌ను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవకి జైన్, సామాజికవేత్త సతీశ్ దేశ్‌పాండే, న్యాయ నిపుణుడు మజా దరువాలాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ‘న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం విచారణ సాగుతుండగానే వీరు ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ కోసం పిటిషన్ దాఖలుచేశారు. మేం అరెస్ట్ చేసిన ఐదుగురు నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో చురుగ్గా పనిచేస్తూ నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారు. వీరు ఎల్గర్ పరిషత్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటుచేశారు. రాజకీయ సిద్ధాంతాలు, భావజాలాల మధ్య భిన్నాభిప్రాయంతో ఈ ఐదుగురిని అరెస్ట్ చేయలేదు. వీరు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు బలమైన సాక్ష్యాలు లభించాయి. తనిఖీల సందర్భంగా వీరి ఇళ్లలోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరి కార్డుల్లో లభ్యమైన సమాచారాన్ని బట్టి వీరు సమాజాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నినట్లు తేలింది’ అని తెలిపారు. ‘రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, ఇతరుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో దేశంతో పాటు భద్రతాబలగాలపై దాడికి ప్రణాళిక, ఇతర కార్యకర్తలతో సమన్వయం తదితరాలపై కీలక సమాచారం లభిం చింది. అంతేకాకుండా వీరు తమ పార్టీలోకి నియామకాలను చేపట్టడంతో పాటు వారిని అండర్‌గ్రౌండ్ శిక్షణకు పంపడం, నిధుల సమీకరణ–పంపకం, ఆయుధాల ఎంపిక, కొనుగోలు, వీటిని దేశంలోకి అక్రమరవాణా చేసేందుకు మార్గాలను ఎంపికచేయడంలో భాగస్వాములయ్యారు. అరెస్టయినవారిలో కొందరు కూంబింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాత్మక పద్ధతులను మావోలకు అందజేస్తున్నట్లు ఆ పత్రాల్లో లభ్యమైంది’ అని పోలీసులు చెప్పారు. ధనరూపంలో వెలకట్టలేనిది జీవితం రేప్ బాధితులపై సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీః జీవితం అమూల్యమైనదని, ఏ కోర్టూ దాన్ని ధనరూపంలో వెలకట్టలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచార, యాసిడ్ దాడి బాధిత మహిళలకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) రూపొందించిన పరిహార పథకంపై విచారణ సందర్భంగా బుధవారం పైవిధంగా స్పందించింది. పైన పేర్కొన్న రెండు నేరాల్లో బాధిత మహిళకు కనిష్టంగా రూ.5 లక్షలు, గరిష్టంగా(మరణించిన పక్షంలో) రూ.10 లక్షలు చెల్లించాలని నల్సా సిఫార్సు చేసింది. ఈ పరిహార పథకాన్ని ఓ లాయర్ ప్రశ్నించగా..‘జీవితానికి వెలను నిర్ధారించలేం. దాన్ని ధనరూపంలో చెప్పలేం’ అని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆమోదించిన నల్సా పరిహార పథకం అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఏపీలో 901 కేసుల్లో ఒక్కరికే... రేప్, యాసిడ్ దాడి బాధితుల్లో కేవలం 5 నుంచి 10 శాతం మందికే పరిహారం అందుతోందని నల్సా ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 901 కేసులు నమోదైతే ఒక బాధితురాలికే పరిహారం దక్కినట్టు వెల్లడించింది. పోక్సో చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1028 కేసులు నమోదైతే కేవలం 11 మంది బాధితులకే పరిహారం అందినట్లు తెలిపింది. -
నిబంధనలకు విరుద్ధం: ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు మానవహక్కుల కార్యకర్తల అరెస్టులన్నీ నిబంధలనలకు విరుద్ధంగా, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరిగాయని కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. ‘మీడియాలో వార్తల ఆధారంగా చూస్తే.. ఈ ఐదుగురి గృహనిర్బంధం నిబంధలకు విరుద్ధంగా జరిగిందని కమిషన్ భావిస్తోంది. ఈ అరెస్టులను మానవ హక్కుల ఉల్లంఘనగానే చూస్తున్నాం’ అని ఎన్‌హెచ్చార్సీ సీనియర్ సభ్యుడొకరు తెలిపారు. నవలఖా ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈ అరెస్టుల విషయంలో కోర్టుకు పోలీసులు సరైన వివరణ ఇవ్వలేదనేది సుస్పష్టమైందన్నారు. ‘ఫరీదాబాద్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సుధా భరద్వాజ్ ట్రాన్సిట్ రిమాండ్ పెండింగ్‌లో ఉంది. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. ఎఫ్ఐఆర్లోనూ తన పేరు లేదని.. కేవలం తన సిద్ధాంతం కారణంగానే అరెస్టు చేసి హింసిస్తున్నారని చెప్పారు’ అని ఎన్‌హెచ్చార్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.జెనీవాలోని ఓ ఎన్జీవో నుంచి కూడా మహారాష్ట్ర పోలీసులు ఈ ఏడాది జూన్‌లో ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తల (సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్ ధావ్లే, షోమాసేన్, మహేష్ రౌత్) ను అరెస్టు చేసినట్లు ఫిర్యాదు అందిన విషయాన్ని కమిషన్ వెల్లడించింది. ఈ అంశంలోనూ మహారాష్ట్ర డీజీపీకి జూన్ 29న నోటీసులు పంపామని, దీనిపై సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. -
ట్విట్టర్లో ‘మీటూ అర్బన్ నక్సల్’ ట్రెండింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల కార్యకర్తలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వీరిపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో పలువురు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీంతో ట్విట్టర్లో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. తొలుత బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ..‘అర్బన్ నక్సల్స్‌కు మద్దతు ఇస్తున్నవారి జాబితా రూపొందించేందుకు చురుకైన యువతీయువకులు కొందరు నాకు కావాలి. సాయం చేయాలనుకున్నవారు నాకు సందేశం పంపండి’ అని ట్వీట్ చేశారు. దీంతో జర్నలిస్టులు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు సహా చాలామంది అగ్నిహోత్రిపై మండిపడ్డారు. హక్కుల కార్యకర్తలకు తమ మద్దతును తెలియజేసేందుకు వేలాది మంది ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాగ్‌ట్యాగ్‌ను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 55,000 మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్ చేశారు. 128 సంస్థలకు మావోలతో సంబంధాలు! మావోలతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలతో 2012లో యూపీఏ ప్రభుత్వం జాబితా రూపొందించిందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కొందరు ఆ సంస్థల సభ్యులు ఉన్నారన్నారు. మావోలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో పౌరహక్కుల కార్యకర్తలను అరెస్ట్‌చేయడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు యూపీఏ నాటి జాబితాను తెర మీదికి తెచ్చారు. ‘మావోయిస్టులతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలను 2012లోనే యూపీఏ ప్రభుత్వం గుర్తించింది. వాటి కోసం పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆనాడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. జాబితాలో ఉన్న సంస్థల కోసం పనిచేస్తున్న వారిలో వరవరరావు, సుధా భరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్సాల్వెజ్, మహేశ్ రౌత్‌లు కూడా ఉన్నారు’ అని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. -
వరవరరావుకు గృహనిర్బంధం..
న్యూఢిల్లీ: భీమా–కోరేగావ్ హింస కేసులో అరెస్టయిన ఐదుగురు మానవహక్కుల కార్యకర్తలకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అరెస్టు చేసిన వారిని సెప్టెంబర్ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. భిన్నాభిప్రాయాన్ని వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని, దీన్ని అణగదొక్కడం సరికాదని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. భీమా–కోరేగావ్ హింస జరిగిన 9 నెలల తర్వాత వీరిని అరెస్టు చేయడంపై మహారాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. ‘ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు సేఫ్టీ వాల్వ్ వంటిది. దీన్ని మీరు అణచాలని చూస్తే ఎప్పుడో ఓసారి అది బద్దలవుతుంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ అరెస్టులను ఖండిస్తూ.. చరిత్రకారురాలు రోమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, దేవికా జైన్ సహా ఐదుగురు వేసిన పిటిషన్ ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కాగా, నవలఖా అరెస్టుపై ఇచ్చిన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సరైన ఆధారాలు చూపకుండానే నవలఖాను ఎలా అరెస్టు చేశారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అటు ఎన్‌హెచ్చార్సీ కూడా ఈ అరెస్టులపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అరెస్టు చేసిన వారందరినీ వారి ఇళ్లకు పంపించాలని పుణే కోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కోర్టుకు మహా విన్నపం అరెస్టయిన ఐదుగురిని విడుదల చేయాలంటూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు అంగీకరించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇప్పటికే పలువురు ఈ అంశంపై వివిధ హైకోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో మహా సర్కారు ఈ అంశాన్ని లేవనెత్తింది. హైదరాబాద్ నుంచి వరవరరావు, ముంబై నుంచి అరున్ ఫెరీరా, వెర్నాన్ గంజాల్వేస్, హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి సుధా భరద్వాజ్, ఢిల్లీ నుంచి గౌతమ్ నవలఖాలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. డిసెంబర్ 31న భీమా–కోరేగావ్ గ్రామంలో జరిగిన ‘ఎల్గార్ పరిషత్’ సభ కారణంగానే దళితులు, అగ్రవర్ణాల మధ్య హింస ప్రజ్వరిల్లిందనే కేసులో ఈ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నవలఖా అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు.. హక్కుల కార్యకర్త నవలఖా అరెస్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేసుకు సంబంధించిన దస్తావేజులను మరాఠీలోనే ఉంచడాన్ని ప్రశ్నించింది. ‘తననెందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటప్పుడు అరెస్టు పేపర్లను ఇంగ్లిషులోకి తర్జుమా చేసి నవలఖాకు ఎందుకు ఇవ్వలేదు?’ అని కూడా ప్రశ్నించింది. దస్తావేజులు వేరే భాషలో ఉన్నప్పటికీ మెజిస్టీరియల్ కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఎలా జారీ చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసు దస్తావేజులను వెంటనే ఇంగ్లిష్‌లోకి మార్చాలని కోర్టు ఆదేశించింది. నవలఖా అరెస్టులో న్యాయపరమైన అంశాలు, పుణే కోర్టుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదివిన తర్వాతే ఈ దిశగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. భీమా–కోరేగావ్ వివాదానికి సంబంధించి మిగిలిన అరెస్టులు సరైనవే అని వెల్లడైతే.. నవలఖా విషయంలోనూ స్పష్టత వస్తుందని కోర్టు పేర్కొంది. కాగా, మరాఠీలో ఉన్న పత్రాలను ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి నవలఖా లాయర్లకు ఇస్తామని మహారాష్ట్ర పోలీసుల తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ కోర్టుకు తెలిపారు. ప్రజాగొంతుక నొక్కేస్తున్నారు: అంబేడ్కర్ ప్రజల గొంతుకను నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. భారతీయ రిపబ్లిక్ పార్టీ బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపించారు. వామపక్ష భావజాలమున్న నేతలను అరెస్టు చేయడం.. ప్రజల గొంతుకను నొక్కడమేనన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ఎన్జీవోలు, రాజకీయేతర సంస్థలు లక్ష్యంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ముంబైలో విమర్శించారు. సనాతన్ సంస్థపై దాడులు జరుగుతున్న సమయంలో కావాలనే ఎల్గార్ పరిషత్ సభ్యులపైనా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. అటు శివసేన కూడా భీమా–కోరేగావ్ హింసకు అసలైన సూత్రధారులను ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమని పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాన్ని అంటగడుతూ అరెస్టులు జరిపే సంస్కృతి దేశవ్యాప్తంగా జరుగుతోందని విమర్శించింది. భారతీయ శిక్షాస్మృతి 153 (ఏ) కింద (మతం, జాతి, పుట్టిన ప్రాంతం, భాష ఆధారంగా వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా వ్యాఖ్యానించడం) ఐదుగురిని పుణే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అరెస్టులకు ముందు చట్టపరమైన అన్ని నిబంధనలు అమలుచేశామని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దీపక్ సర్కార్ తెలిపారు. అన్ని ఆధారాలు ఉన్నందునే అరెస్టులు జరిగాయన్నారు. -
పోలీసు దాడులు: ఎమర్జెన్సీకి చేరువలో ఉన్నాం
సాక్షి, న్యూఢిల్లీ: మంగళవారం తెల్లవారు జామునుంచే ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర పోలీసులు విరుచుకుపడ్డారు. ముంబై, ఢిల్లీ, గోవా, జార్ఖండ్, తెలంగాణ(హైదరాబాద్)లో దళిత, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, లాయర్లు, ఆదివాసీ హక్కుల కార్యకర్తల ఇళ్లు, వారి బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసుల సహాయంతో పుణేకు చెందిన పోలీసు బృందం ఈ సోదాలు నిర్వహించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టడం తీవ్ర ఆందోళన రేపింది. హైదరాబాద్‌కు చెందిన విప్లవ కవి, విరసం నేత వరవరరావును అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. అలాగే జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల ఇళ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులకు దిగడం కలకలం రేపింది. ముంబైలోని అరుణ్ ఫెరీరా, సుసాన్ అబ్రహాం, వెర్నాన్ గోన్సల్వేజ్, ఆనంద్ తెల్తూంద్డే, జార్ఖండ్ లోని ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్‌స్వామి, ఢిల్లీలో గౌతమ్ నవ్లాఖా, ఛత్తీస్‌గఢ్, ఫరీదాబాద్ మానవ హక్కుల న్యాయవాది సుధా భరద్వాజ్ గృహాలను తనిఖీ చేశారు. అనంతరం వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, మొబైల్, పెన్‌డ్రైవ్‌తోపాటు, డైరీలు, కొన్ని ఆడియో సీడీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలు, భీమా-కోరేగావ్ నిరసన సందర్భంగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. చట్టవిరుద్ధ చర్యలు(నివారణ) చట్టం ఐపీసీ సెక్షన్ 153ఏ, 505, 117, 120 కింద అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవి అక్రమ అరెస్టులంటూ వివిధ ప్రజా సంఘాల నేతలు, హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. ఉద్యమానికి సన్నద్ధమవుతునన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల సహాయంతో ప్రజాస్వామ్య గొంతులను అణచివేయడానికి కేంద్రం పన్నిన కుట్రలో భాగమే ఈ అరెస్టులని విరసం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్ ఆరోపించారు. అత్యవసర పరిస్థితికి దగ్గరగా ఉన్నాం: అరుంధతీ రాయ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు తదితరుల ఇళ్లపై పుణే పోలీసుల దాడులపై ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ స్పందించారు. దేశంలో గతంలో ముందెన్నడూ చూడని అత్యవసర పరిస్థితికి చాలా దగ్గరగా ఉన్నామని ఆమె తీవ్రంగా విమర్శించారు. -
హక్కుల ఉద్యమ స్ఫూర్తి అస్మా
నియంతలు దేశాన్ని ఉక్కు పిడికిట్లో బంధించినప్పుడూ... గాలి సైతం భయాన్నే వీస్తున్నప్పుడూ... ఎవరూ నోరెత్తే సాహసం చేయనప్పుడూ ఒక ధిక్కార స్వరం విని పించడానికి కేవలం గుండె ధైర్యం మాత్రమే సరిపోదు. ఆ గుండె నిండా అస హాయులపై అపారమైన ప్రేమాభిమానాలుండాలి. వారికోసం ప్రాణాలొడ్డేంత తెగింపు ఉండాలి. ఆ మాదిరి ధైర్యాన్ని, తెగువనూ కేవలం పద్దెనిమిదేళ్ల వయసు లోనే సొంతం చేసుకుని, రాజీలేని పోరాటాలకు నిలువెత్తు సంతకంలా ఖ్యాతి గడిం చిన పాకిస్తాన్ మానవ హక్కుల నాయకురాలు అస్మా జహంగీర్ శనివారం కన్ను మూశారు. అస్మా అంటే ఉర్దూలో మహోన్నతమని అర్ధం. న్యాయవాదిగా, క్రియా శీల కార్యకర్తగా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా, మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కుల కోసం అలుపెరగని పోరు చేసిన యోధురాలిగా అస్మా సార్ధక నామధేయు రాలయ్యారు. దేన్నయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, పోరాడటానికి సిద్ధపడటం మొదటినుంచీ ఆమె నైజం. ఈ క్రమంలో పర్యవసానాల గురించి ఒక్క క్షణం కూడా ఆమె ఆలోచించలేదు. అది బలూచిస్తాన్ కావొచ్చు, ఆక్రమిత కశ్మీర్ కావొచ్చు. న్యాయబద్ధమైన ఉద్యమాలైనప్పుడు వాటికి అండగా నిలబడటానికి ఆమె వెనకాడలేదు. ఆ రెండుచోట్లా వేలమంది యువకుల్ని పాకిస్తాన్ సైన్యం కను సన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్ఐ మాయం చేసినప్పుడు వారి ఆచూకీ తెల పాలంటూ సాగిన ఉద్యమానికి తోడ్పాటునందించడంతోపాటు అక్కడి సుప్రీంకో ర్టులో ఆ యువకుల కుటుంబాల తరఫున పోరాడారు. ఉదారవాదులకు చాన్నాళ్లక్రితమే దక్షిణాసియా దేశాల్లో సంకట స్థితి ఏర్ప డింది. ఉద్యమిస్తున్నవారి తరఫున పోరాడేవారికి ముద్రలేయడం అన్ని దేశాల్లోనూ రివాజుగా మారింది. శ్రీలంకలో తమిళ టైగర్ల అణచివేతను ప్రశ్నించినవారిని అప్పటి రాజపక్సే ప్రభుత్వం ఉగ్రవాదులుగా ముద్రేసింది. ఇప్పుడు మయన్మార్‌లో రోహింగ్యాల ఊచకోతను నిలదీస్తున్నవారిపైనా అక్కడి ప్రభుత్వం అనేక కేసులు బనాయించి హింసిస్తోంది. మన దేశంలో కశ్మీర్లో హక్కుల ఉల్లంఘనల్ని ప్రశ్నిస్తే ఉగ్రవాద సమర్ధకులుగా, పాకిస్తాన్ అనుకూలురుగా ఎలా ముద్రేస్తారో... పాకి స్తాన్‌లో అస్మా జహంగీర్‌పై కూడా అక్కడి పాలకులు అటువంటి నిందారోపణలే చేశారు. ఆమెను భారత గూఢచార సంస్థ ‘రా’ ఏజెంటుగా అభివర్ణించి ఇబ్బందులు పెట్టాలని చూశారు. అయినా అస్మా కొంచెం కూడా బెదరలేదు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిన ప్రతి సందర్భంలో ఆమె ముందుండి పోరాడారు. మైనారిటీలను వేధించడం కోసం తీసుకొచ్చిన దైవ దూషణ చట్టాన్ని ఖండించడంతో వదిలిపెట్ట లేదు. గరిష్టంగా మరణశిక్ష విధించడానికి ఆస్కారమున్న ఆ చట్టం కింద అరెస్టయిన వందలమంది తరఫున న్యాయస్థానాల్లో వాదించారు. రెండు మూడు కేసుల్లో కింది కోర్టులు విధించిన మరణశిక్షలు సుప్రీంకోర్టు రద్దు చేయడానికి ఆమె వాదనా పటిమే కారణం. ఆ తర్వాత ఆమెకు అనేక బెదిరింపులొచ్చాయి. కొందరు దుండ గులు ఆమెపై హత్యాయత్నం కూడా చేశారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఎప్పుడూ సురక్షితంగా లేదు. అక్కడ పౌర ప్రభు త్వాల పాలన కంటే సైనిక పాలనే అధికంగా సాగింది. మతాన్ని అడ్డం పెట్టుకుని, మతతత్వాన్ని పెంచి పోషించి తమ పాలనను సుస్థిరం చేసుకోవడానికి సైనిక నియంతలు ప్రయత్నించారు. ఆ క్రమంలో సమాజంలో ఛాందసవాదాన్ని పెంచి పోషించారు. జనరల్ అయూబ్‌ఖాన్ మొదలుకొని జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ వరకూ ఇవే పోకడలు. అలాంటి నియంతలను ఎదుర్కొనడం సామాన్యం కాదు. నియంతల్ని ప్రశ్నిస్తే మతాన్ని ప్రశ్నించినట్టు... వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే మత ద్రోహానికి పాల్పడినట్టూ చిత్రించే చోట న్యాయం కోసం నిలబడటం ఎంత ప్రాణాంతకమో అస్మా జీవితం చెబుతుంది. ప్రభుత్వాలు ఆమెపై దొంగ కేసులు బనాయిస్తే, ముల్లాలు ఆమెపై ఫత్వాలు జారీచేశారు. అన్నిటినీ ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. జనరల్ యాహ్యాఖాన్ పాలనలో తన తండ్రిని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పోరాడిన అస్మా జనరల్ జియా ఉల్ హక్ పాలనను ఖండిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వీధుల్లో పోరాడారు. జైలుకెళ్లారు. జనరల్ ముషార్రఫ్ పాలనలో ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. సల్మా మర్యాదస్తురాలిగా మిగిలిపోవాలనుకోలేదు. మీడియా తనను ఆకాశాని కెత్తేసినంత మాత్రాన పొంగిపోలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తెకర్ చౌధరిని ముషార్రఫ్ ప్రభుత్వం తొలగించినప్పుడు జరిగిన న్యాయవాదుల ఉద్య మంలో ఆమెదే ప్రధాన పాత్ర. ఆయనకు తిరిగి ఆ పదవి దక్కాక వెలువరించిన తీర్పులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించినప్పుడు వాటిని ప్రశ్నించడా నికి వెనకాడలేదు. తనను పాలకపక్షాల ఏజెంటుగా పలు సందర్భాల్లో నిందారోప ణలు చేసిన ఎంక్యూఎం అధినేత అల్తాఫ్ హుస్సేన్‌పై లాహోర్ హైకోర్టు ఆంక్షలు విధించినప్పుడు ఆయన తరఫున సుప్రీంకోర్టులో పోరాడి ఆ ఆంక్షలు రద్దయ్యేం దుకు కృషి చేశారు. అల్తాఫ్ కేసును ఎవరూ తీసుకోరాదన్న న్యాయవాదుల తీర్మా నాన్ని ఆమె బేఖాతరు చేశారు. అస్మా కార్యక్షేత్రం పాకిస్తాన్ గడ్డకు మాత్రమే పరిమితమై లేదు. భారత్, పాకిస్తాన్‌లు రెండూ మిత్ర దేశాలుగా మెలగాలని, ఉపఖండంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడాలని ఆమె ఆశించారు. అందుకోసం ప్రజాభిప్రాయాన్ని కూడ గట్టడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పలుమార్లు మన దేశం సందర్శించి ఇక్కడి సభల్లో మాట్లాడారు. తనను భారత్ ఏజెంట్‌గా అభివర్ణిస్తున్నా ఈ కృషిలో ఆమె వెనక్కి తగ్గలేదు. పెషావర్ పాఠశాలపై ఉగ్రవాదులు దాడిచేసి 148 మందిని పొట్టనబెట్టుకున్నప్పుడు ఈ దురంతంలో అసలు దోషులు ఉగ్రవాదులకు అండ దండలిచ్చిన ప్రభుత్వాలేనని ఆమె నిర్మొహమాటంగా చెప్పారు. తన కోసం, తన కుటుంబం కోసం కాక చివరి వరకూ బలహీనుల పక్షాన పోరాడిన సల్మా జహం గీర్ పాక్‌లో మాత్రమే కాదు... వర్ధమాన దేశాల్లోని వారందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారు.