hunter
-
కుమారుడు హంటర్‌కు దేశాధ్యక్షుడి హోదాలో క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్. విమర్శించిన డొనాల్డ్ ట్రంప్
-
కుమారుడికి క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించుకున్నారు! పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉండటంతో పాటు రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్‌కు పూర్తిగా బేషరతు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ‘‘నా కుమారుడు హంటర్‌కు క్షమాభిక్షపై ఈ రోజు సంతకం చేశాను’’ అని ఒక ప్రకటనలో తెలిపారు. హంటర్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోబోనని ఇటీవలి దాకా బైడెన్ పదేపదే చెబుతూ వచ్చారు.క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకోబోనని అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అనూహ్య నిర్ణయం కలకలానికీ, రాజకీయ వివాదానికీ దారితీసింది. అయితే తన నిర్ణయాన్ని బైడెన్ పూర్తిగా సమర్థించుకున్నారు. హంటర్‌ను కావాలనే అన్యాయంగా ప్రాసిక్యూట్ చేశారని తాజా ప్రకటనలో ఆయన ఆరోపించారు. ‘‘కేవలం హంటర్ నా కుమారుడు కాబట్టే ప్రాసిక్యూట్ చేశారు.రాజకీయ ప్రత్యర్థులు నాపై దాడికి, నా ఎన్నికను వ్యతిరేకించడానికి మాత్రమే హంటర్‌పై ఆరోపణలు చేశారు. నేను న్యాయ వ్యవస్థను నమ్మి ఎంతగా పోరాడినా, ఆ ప్రక్రియను రాజకీయాలు ప్రభావితం చేశాయి’’ అని పేర్కొన్నారు. ‘‘అందుకే క్షమాభిక్ష నిర్ణయం తీసుకున్నా. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికన్లు అర్థం చేసుకుంటారు’’ అని చెప్పుకొచ్చారు. ఇది పూర్తి బేషరతు క్షమాభిక్ష కావడంతో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీన్ని రద్దు చేయలేరు. దీనిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బైడెన్‌ది పూర్తి అధికార దుర్వినియోగమంటూ దుయ్యబట్టారు.ఆరేళ్ల కథకు ముగింపుమాదకద్రవ్యాల వాడకంతో పాటు అక్రమంగా తుపాకీ ఉన్న అభియోగాల్లో హంటర్‌ను జ్యూరీ గత జూన్‌లో దోషిగా తేల్చింది. ఆయన 14 లక్షల డాలర్ల పన్నులు చెల్లించకపోవడమే గాక తొమ్మిది పన్నుల ఎగవేతకు పాల్పడ్డారని పేర్కొంది. యూఎస్ అటార్నీగా ట్రంప్ నియమించిన ప్రత్యేక న్యాయవాది డేవిడ్ వీస్ 2018లో హంటర్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ఆయనపై 2023లో మరో రెండు అభియోగాలు దాఖలు చేశారు. అక్రమాయుధం కేసులో డిసెంబర్ 12న, పన్ను కేసులో డిసెంబర్ 16న విచారణ జరగాల్సి ఉంది. క్షమాభిక్ష నేపథ్యంలో ఆ కేసులను న్యాయమార్తులు రద్దు చేస్తారు. హంటర్ 2014 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 1 వరకు హంటర్ ఎలాంటి నేరాలకు పాల్పడి ఉన్నా వాటన్నింటికీ క్షమాభిక్ష వర్తిస్తుంది!ట్రంప్ ప్రతీకారానికి భయపడే!అధికార పత్రాల లీకేజీ కేసులో ట్రంప్‌పై దర్యాప్తు సందర్భంగా న్యాయ శాఖ దూకుడుగా వ్యవహరించడం తెలిసిందే. ఆయన నివాసాల్లో పదేపదే తనిఖీలు జరిగాయి. ట్రంప్ భార్య మెలానియా వార్డ్ రోబ్‌లను కూడా వదలకుండా గాలించారు. బైడెన్ ఆదేశాల మేరకే అధికారులు ఇలా చేశారని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ‘‘ఇవన్నీ మనసులో పెట్టుకుని ట్రంప్ పగ్గాలు చేపట్టాక తన కుటుంబంపై కక్షసాధింపుకు పాల్పడతారని బైడెన్ ఆందోళన చెందారు.ముఖ్యంగా హంటర్‌పై కేసుల దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని భయపడ్డారు. ప్రస్తుత కేసుల నుంచి బయట పడేసినా ఇంకేమైనా అభియోగాలు మోపవచ్చని భావించారు. అందుకే కుమారునికి క్షమాభిక్ష ఏకంగా పదేళ్ల కాలానికి వర్తించేలా జాగ్రత్త పడ్డారు’’ అని పరిశీలకులు అంటున్నారు. ‘‘అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గెలిస్తే బైడెన్ బహుశా ఇలా క్షమాభిక్ష నిర్ణయం తీసుకునేవారు కాదు. ట్రంప్ గెలవడంతో తన కుటుంబంపై కచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతారని భావించారు’’ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.న్యాయవ్యవస్థ దుర్వినియోగం: డొనాల్డ్ ట్రంప్క్షమాభిక్ష నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. సొంత కుమారుని కోసం అధ్యక్ష అధికారాలను బైడెన్ పూర్తిగా దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇది న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమే నని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. 2021లో యూఎస్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి కేసులో తన మద్దతుదారులకు క్షమాభిక్ష ఎందుకు ప్రసాదించలేదని బైడెన్‌ను ట్రంప్ ప్రశ్నించారు.తప్పులు దిద్దుకుంటా: హంటర్తనకు లభించిన క్షమాభిక్ష తప్పులను దిద్దుకోవడానికి, జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి అవకాశంగా హంటర్ అభివర్ణించారు. ‘‘క్షమాభిక్షను తేలికగా తీసుకోను. బాధల్లో ఉన్నవారికి సాయపడేందుకు నా జీవితాన్ని అంకితం చేస్తా’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసుల విషయంలో కాంగ్రెస్, రిపబ్లికన్ల ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ తనను లక్ష్యంగా చేసుకున్నారని హంటర్ మొదటి నుంచీ వాదిస్తున్నారు. ‘‘వ్యసనాల బారిన పడిన చీకటి రోజుల్లో చేసిన తప్పులను నేను అంగీకరించా. వాటికి బాధ్యత తీసుకున్నా. అయినా నన్ను రాజకీయంగా బలి చేయడానికి, నా కుటుంబాన్ని అవమానించడానికి నాపై కేసులను వాడుకున్నారు’’ అని ఆరోపించారు.వియ్యంకునికి ట్రంప్ క్షమాభిక్షఅమెరికాలో అధ్యక్షులు ఇలా కుటుంబీకుల కోసం పదవీ విరమణకు ముందు క్షమాభిక్ష అధికారాన్ని వాడటం ఇది తొలిసారేమీ కాదు. బిల్ క్లింటన్ కూడా అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి ముందు తన సోదరునికి క్షమాభిక్ష పెట్టారు. ట్రంప్ కూడా తన అల్లుడు జరేద్ కుష్నర్ తండ్రికి క్షమాభిక్ష పెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇలా కుటుంబీకులకు క్షమాభిక్ష పెట్టడం కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని అమెరికన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ క్రౌచ్ అన్నారు. దేశాధ్యక్షులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్నేహితులు, కుటుంబీకులు, మిత్రపక్షాలకు సాయం చేయడానికి ఇలా తమ అధికారాన్ని ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. -
కుమారుడికి ఊరట.. బైడెన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుందనగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు,ట్యాక్స్ అక్రమాల కేసుల్లో తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు.హంటర్‌కు క్షమాభిక్ష ఇవ్వబోనని అతడు దోషిగా తేలిన సందర్భంలో స్పష్టంగా పేర్కొన్న బైడెన్ ఇప్పుడు మాట మార్చడం గమనార్హం. అక్రమంగా తుపాకీ కొనుగోలు,ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్,కాలిఫోర్నియాలో హంటర్‌పై నమోదైన కేసుల్లో అతడికి ఇప్పటికే కోర్టులు శిక్ష విధించాయి.ఒక తండ్రిగా,అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని బైడెన్ తన నిర్ణయంపై వివరణ ఇచ్చారు. కాగా,ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
అమెరికా అధ్యక్ష భవనంలో కొకైన్.. బైడెన్ కొడుకుపైనే ఆరోపణలు!
అమెరికాలోని శ్వేత సౌధంలో అధికారులు కొకైన్ గుర్తించిన నేపధ్యంలో దీనివెనుక అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ప్రమేయమందంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హంటర్ బైడెన్ మాదక ద్రవ్యాలు తీసుకుంటూ గతంలో బహిరంగంగా దొరికిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. తండ్రి జో బైడెన్ హాలిడే వీకెండ్‌కు వెళ్లిన సమయంలో జోహంటర్ ఇక్కడకు వచ్చారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో హంటర్ బైడెన్‌పై పలు మీమ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. #HunterBiden is a disgrace and embarrassment to our nation. He is a degenerate, lowlife criminal who has direct access to American power and state secrets. WHEN will something be done about him? WHEN? pic.twitter.com/ILh1s2xVwu — Giordano Bruno (@GioBruno1600) July 4, 2023 ఈ మాదకద్రవ్యాలను హంటర్ బైడెన్ అక్రమంగా వైట్‌హౌస్‌లోకి తీసుకువచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌పై అమెరికా న్యాయ విభాగం.. ఫెడరల్ టాక్స్ ఎగవేత, మారణాయుధాలు కలిగివున్నాడన్న ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలో హంటర్ తాను అక్రమంగా ఆయుధాలు కలిగివున్నానన్న విషయాన్ని అంగీకరించారు. దీనికి తోడు హంటర్ బైడెన్ 2017, 2018లలో 1.5 మిలియన్ డాలర్ల అధిక ఆదాయంపై తన ఆదాయపు పన్నురిటర్న్లను దాఖలు చేయలేదు. DNC 2020: Joe Biden says 'character and decency are on the ballot' #whiteHouse #HunterBiden #BidenCrimeFamilly pic.twitter.com/ozXRlDmNow — Don_Vito 🇺🇸 (@Don_Vito_08) July 4, 2023 అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు చెందిన ల్యాప్‌టాప్ నుంచి 9 వేల ఫొటోలను గతంలో మార్క్పోలో పబ్లిష్ చేసింది. వీటిలో హంటర్ డ్రగ్స్ తీసుకున్నవి, వేశ్యలతో ఉన్నవి, నగ్నంగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. డైలీమెయిల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫొటోలు బీచ్‌లలో హంటర్ ఎంజాయ్ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. అలాగే హంటర్ స్మోకింగ్చేస్తూ, స్పీడ్ డ్రైవింగ్ చేస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతిష్టాత్మక వైట్ హౌస్‌లో కొకైన్ లభ్యమైన దరిమిలా ట్విట్టర్లో పలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వైట్ హౌస్‌లో కొకైన్ కనిపించడం వెనుక ప్రధాన కారణం హంటర్ బైడెన్? అని, హంటర్ బైడెన్ దేశానికి చీడపురుగు, నేరగాడు అంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. Crack House discovered on Pennsylvania Ave in Washington DC#CocaineFoundInWhiteHouse #HunterBiden 🗻🚬🔥💨🥃🤧 pic.twitter.com/grchpyXjkf — Don_Vito 🇺🇸 (@Don_Vito_08) July 4, 2023 ఇది కూడా చదవండి: వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం..అధికారులు అప్రమత్తం -
Royal Enfield Hunter 350: అమ్మకాల్లో ఇది రాయల్ బండి
భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' గత సంవత్సరం 'హంటర్ 350' బైక్ లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కంపెనీ ఇప్పటికి లక్ష యూనిట్లను విక్రయించింది. దీనికి సంబంధించిన సమాచారం కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో, మెట్రో అనే రెండు వేరియంట్స్‌లో విక్రయించబడుతోంది. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు, రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ మొదటి 50,000 యూనిట్లను విక్రయించడానికి నాలుగు నెలల సమయం పట్టింది, ఆ తరువాత కేవలం రెండు నెలల్లో మరో 50,000 యూనిట్లను విక్రయించింది. హంటర్ 350 బైక్ 349 సీసీ సింగిల్ సిలిండర్ టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి 20.2 బిహెచ్పి పవర్, 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 114 కిమీ, కాగా మైలేజ్ 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్ వెనుకవైపు ట్విన్ షాక్‌లను కలిగి పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 110/70-17 54P ఫ్రంట్, 140/70-17 66P రియర్ ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉండి, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. హంటర్ 350 బైక్ ఫ్యాక్టరీ బ్లాక్, ఫ్యాక్టరీ సిల్వర్, డాపర్ వైట్, డాపర్ యాష్, డాపర్ గ్రే, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ అనే ఎనిమిది కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇది 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1,055 మిమీ ఎత్తు, 1,370 మిమీ వీల్‌బేస్ కలిగి 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కూడా సొంతం చేసుకుంది. కంపెనీ అమ్మకాలలో ఇప్పటికే ఇది మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. -
కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి..
సాక్షి, కామారెడ్డి: అడవిలో షికారుకెళ్లి గుట్టల మధ్య ఇరుక్కుపోయిన రెడ్డిపేటకు చెందిన చాడ రాజు సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు 43 గంటలుగా గుహలోనే తలకిందులుగా ఉన్న రాజును.. పోలీసులు, గ్రామస్తులు 18 గంటల పాటు శ్రమించి గుహ నుంచి బయటకు తెచ్చి, ప్రాణాలు కాపాడారు. డ్రిల్లింగ్ మిషన్స్, జిలిటెన్ స్టిక్స్‌తో బండలను పేల్చుతూ, నాలుగు జేసీబీలతో మట్టిని బండరాళ్లను తొలగించుకుంటూ పక్కా ప్లాన్ ప్రకారం రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌ను విజయవంతం చేసింది. రాజును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కాగా, రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్‌లు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి షికారు కెళ్లారు. ఈ క్రమంలో గుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చాడు. కానీ చాడ రాజు అందులోనే చిక్కుకుపోవడంతో మహేశ్ కూడా రాత్రంతా అక్కడే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు రాజుకు మహేశ్ నీళ్లు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. అప్పటికీ అతను బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు.. రెడ్డిపేట, సింగరాయపల్లి గ్రామస్తులతో కలిసి రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చదవండి: (షికారుకెళ్లాడు.. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడు..) -
48 గంటలుగా గుహలో నరకం.. రాజు రెస్క్యూ ఫొటోలు
-
షికారుకెళ్లాడు.. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడు..
రామారెడ్డి (ఎల్లారెడ్డి): అడవిలో షికారుకెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు గుట్టల మధ్య ఇరుక్కుపోయిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్‌లు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి షికారుకెళ్లారు. ఈ క్రమంలో గుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చాడు. కానీ చాడ రాజు అందులోనే చిక్కుకుపోవడంతో మహేశ్ కూడా రాత్రంతా అక్కడే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు రాజుకు మహేశ్ నీళ్లు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. అప్పటికీ అతను బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించగా వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు, రెడ్డిపేట, సింగరాయపల్లి గ్రామస్తులు చేరుకొని రాత్రి పొద్దు పోయే వరకు జేసీబీ సహాయంతో రాజును బయటకు తీసేందుకు శ్రమించారు. జేసీబీతో గుట్టలను పక్కకు తీసేందుకు వీలు కాకపోవడంతో లైటింగ్ ఏర్పాటు చేసి కామారెడ్డి నుంచి 210 ఈటాచీ తెప్పించారు. రాజు ఉన్న చోట చార్జింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేయడంతో పాటు వైద్యుల సలహాల మేరకు పండ్ల రసాలను అందజేస్తున్నారు. ఈ గుట్టల మధ్య ఉడుములు, కుందేళ్లు ఉంటాయని వీటిని పట్టుకునే క్రమంలోనే గుట్టల మధ్య రాజు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. జంతువుల కోసం వచ్చినట్లు విచారణలో తేలితే కేసు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: Hyderabad: బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్‌కు జరిమానా -
ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర
సాక్షి, హైదరాబాద్: బీహార్‌లో వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్) ఫారెస్ట్‌లో మ్యానీటర్‌గా మారి, 10 మందిని పొట్టన పెట్టుకున్న రాయల్ బెంగాల్ టైగర్ శనివారం హతమైంది. ఈ ఆపరేషన్‌లో బీహార్‌కు చెందిన పోలీసు కమాండోలతో పాటు నగరంలోని రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్ సైతం కీలక పాత్ర పోషించారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు అటవీ శాఖ సలహాదారుడిగా ఉన్న ఆయన ఇప్పటి వరకు 24 మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టారు. కొన్ని మ్యానీటర్లకు సంబంధించిన ఆపరేషన్స్‌లో షఫత్ కుమారుడు అస్ఘర్ అలీ ఖాన్ సైతం కీలకంగా వ్యవహరించారు. నవాబ్ షఫత్ అలీ ఖాన్ చిన్నప్పటి నుంచి తుపాకులు, గుర్రాల మధ్య పెరిగారు. ఆయన తాత బహదూర్ బ్రిటిష్–ఇండియాకు ఫారెస్ట్ అడ్వయిజర్‌గా వ్యవహరించారు. బ్రిటీష్ హయాంలో ఏనుగులతో ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో బహదూర్ 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు. 1976లో 19 ఏళ్ల వయస్సున్న అలీ ఖాన్ తొలి ‘తూటా’ పేల్చారు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని హెచ్డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. అలా మొదలైన ‘వేట’ ఇప్పటికీ కొనసాగుతోంది. షఫత్ అలీ ఖాన్ బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు అటవీ విభాగం అడ్వయిజర్‌గా పని వ్యవహరించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు కొనసాగుతున్నారు. ఆయా రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులకు శిక్షణ ఇచ్చి వస్తుంటారు. మ్యాన్–మానిమల్ కన్ఫ్లిక్ట్, తుపాకీ వినియోగాల్లో తరీ్ఫదు ఇవ్వడంతో ఈయనకు ప్రత్యేకత ఉంది. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి, మ్యానీటర్లు–మదపుటేనుగుల్ని మట్టుపెట్టే అలీ ఖాన్ పలుమార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఈ వేటగాడిలో జంతు ప్రేమికుడు దాగి ఉన్నాడు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్ టు సేవ్ ది టైగర్’ పేరుతో అధ్యయనం చేస్తున్నారు. ‘ఆడపులి కేవలం 111 రోజులకే కాన్పు చేస్తుంది. ఒక కాన్పులో కనీసం 3 నుంచి 4 పిల్లలు పుడతాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 1970ల్లో 20 వేలున్న పులుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. అందుకే దీనిపై అధ్యయనం చేస్తున్నా’ అన్నారాయన. పులులు అంతరించిపోకుండా కొన్ని పరిష్కారాలనూ చూపుతూ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు షఫత్ అలీ ఖాన్ చేసిన ‘వేట’ల సంఖ్య 24కు చేరింది. వీటిలో 17 మ్యానీటర్లే కావడం గమనార్హం. 1976 నుంచి ‘వేటాడుతున్న’ ఈయన గతంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఏడు ఏనుగు లు, ఐదు పులులు, 14 చిరుతల్ని హతమార్చారు. (చదవండి: కాశీ యాత్రకు ‘రైలు’ కష్టాలు!) -
సిటీ హంటర్ చేతిలో మరో మ్యానీటర్ హతం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఏసీ గార్ట్స్ ప్రాంతానికి చెందిన ప్రముఖ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ సుదీర్ఘ విరామం తర్వాత మరో ఆపరేషన్ చేపట్టారు. బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్) ఫారెస్ట్‌లో మ్యానీటర్‌గా మారిన రాయల్ బెంగాల్ టైగర్‌ను శనివారం హతమార్చారు. మూడేళ్ల వయస్సున్న ఈ మగ పులి గడచిన ఆరు నెలల్లో పది మందిని పొట్టన పెట్టుకుంది. గత నెల 27న చేపట్టిన ఆపరేషన్‌లో షఫత్ అలీ ఖాన్ తొలుత ఆ పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకోవడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో పాటు శుక్రవారం తల్లీకుమారుడిని ఆ పులి చంపేయడంతో బీహార్ పోలీసు కమాండోలతో కలిసి దాన్ని కాల్చి చంపారు. అలీ ఖాన్‌కు గతంలో దేశ వ్యాప్తంగా ఎన్నో మ్యానీటర్లు, మదగజాలను చంపిన, బంధించిన రికార్డు ఉంది. ఈ పులితో కలిపి ఇప్పటి వరకు ఆయన మొత్తం 17 మ్యానీటర్లను చంపారు. కొన్ని ఆపరేషన్స్‌లో ఆయన కుమారుడు అస్ఘర్ అలీ ఖాన్ సైతం పాల్గొన్నారు. ► వీటీఆర్ అడవిలో ఓ రాయల్ బెంగాల్ టైగర్ ఆరు నెలల క్రితం మ్యానీటర్‌గా మారింది. దీని బారినపడి గత నెల ఆఖరి వారం వరకు ఆరుగురు చనిపోగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ పులిని బంధించడానికి బీహార్ అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వాళ్లు తమకు సహకరించాల్సిందిగా షఫత్ అలీ ఖాన్‌ను కోరారు. ► బీహార్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ప్రభాత్ కుమార్ ఆహ్వానం మేరకు అలీ ఖాన్ గత నెల 27న అక్కడికి వెళ్లి ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం వీటీఆర్ ఫారెస్ట్‌లో మొత్తం 40 పులులు, 9 కూనలు ఉన్నాయి. దీంతో ఆ అడవి వాటికి ఇరుకుగా మారి అనేక ఆడ పులులు బయటకు వస్తున్నాయి. సమీపంలోని మాస నది ఒడ్డున ఉన్న చెరుకు పొలాల్లో పిల్లలను కంటున్నాయి. ఇలాంటి వాటిలో కొన్ని కూనలు తిరిగి అడవిలోకి వెళ్లకుండా పొలాలు, ఊర్ల సమీపంలో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడేళ్ల వయస్సున్న ఓ మగ పులి ఆరు నెలల క్రితం అనుకోకుండా పొలాల్లోకి వచ్చిన ఓ యువకుడిని చంపింది. అప్పటి నుంచి మ్యానీటర్‌గా మారి అవకాశం దొరికినప్పుడల్లా గ్రామస్తులపై దాడి చేసి హతమారుస్తోంది. శుక్రవారం ఉదయం వరకు కలిపి మొత్తం పది మందిని చంపేయడంతో పాటు మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. గత నెల ఆఖరి వారంలో రంగంలోకి దిగిన షఫత్ అలీ ఖాన్ ఆ పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకోవడానికి, సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ల వదలడానికి ఈ ఆపరేషన్ చేపట్టారు. దీనికోసం పట్నా జూకు చెందిన బృందంతో కలిసి పని చేసినా ఫలితం దక్కలేదని, ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం షఫత్ అలీ ఖాన్‌తో కలిసి బీహార్ పోలీసుల కమాండోలు దాన్ని హతమార్చారు అని అక్కడి అటవీ శాఖ ప్రకటించింది. చదవండి: టప్పాఖానాలకు కొత్త రూపు -
పోలీసుల కళ్లుగప్పి స్టేషన్లోనే పిట్టల వేటగాడు దొంగతనం
అనపర్తి: అనపర్తి పోలీస్ స్టేషన్లో గతేడాది సెప్టెంబర్‌లో మిస్సయిన తుపాకీ బుధవారం బయటపడింది. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ఓ వ్యక్తి దీనిని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. సీఐ ఎన్వీ భాస్కరరావు బుధవారం ఈ విషయం విలేకర్లకు తెలిపారు. 2019 సాధారణ ఎన్నికల సందర్భంగా కర్రి దొరయ్యరెడ్డి అనే వ్యక్తి తన రెండు తుపాకులను పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేశారు. వాటిని 2020లో అనపర్తి లాకప్‌లో భద్రపరిచారు. అందులో డీబీబీఎల్ తుపాకీ కనిపించలేదు. ఈ సంఘటనలో అప్పటి ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, ఏఎస్సై గురవయ్య, కానిస్టేబుళ్లు అబ్దుల్ దురాని, జె.వరప్రసాద్‌లు సస్పెండయ్యారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ ఇటీవల దీనిపై దృష్టి పెట్టారు. లోతుగా ఆరా తీశారు. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన సంగడాల శ్రీను, వెదరుపాక సావరానికి చెందిన వెలుగుపూడి లోవరాజుతో పాటు మరో మైనర్‌ను గతేడాది అక్టోబర్ 5న అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కరోనా సమయంలో తిరగవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. వీరిలో తుపాకీతో పిట్టలను వేటాడే సంగడాల శ్రీను లాకప్‌లో ఉన్న డీబీబీఎల్ తుపాకీని పోలీసుల కన్నుగప్పి తీసుకువెళ్లాడని తాజా విచారణలో తేలింది. తుపాకీ స్వా«దీనం చేసుకున్నారు. శ్రీనుతోపాటు మరో ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
పాముతో ఫైట్, వీడు మామాలోడు కాదు!
ఫ్లోరిడా: సాధారణంగా మనలో చాలా మంది చిన్న బల్లిని చూస్తేనే అరచి గోల గోల చేస్తుంటారు. అలాంటిది పామును చూస్తే కచ్చితంగా పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఒక వ్యక్తి 17 అడుగుల భారీ పైథాన్‌తో పోరాడి దానిని పట్టుకున్నాడు. ఫ్లోరిడాలోని మైక్ కిమ్మెల్ కాంట్రాక్ట్ వేటగాడిగా పని చేస్తున్నాడు. అతడు ఎవర్‌గ్లేడ్స్‌లో ఒక భారీ పామును కనుగొన్నాడు. అయితే దానిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డానని, ఆ సమయంలో తనకి చాలా గాయాలయ్యాయని మైక్ కిమ్మెల్ తెలిపాడు. పైథాన్‌ను ఎలా పట్టుకున్నాడు, తరువాత ఏం జరిగింది అనే దానిని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరితో పంచుకున్నాడు. (వైరల్ వీడియో: ఇద్దరిపై చిరుత పంజా!) ‘నేను భయంకరమైన 17 అడుగుల భారీ పైథాన్ ఎవర్‌గ్లేడ్స్‌లో ఉందని తెలుసుకొని దానిని పట్టుకోవడానికి చిత్తడి నేలలలోకి బయలుదేరాను. ఉదయం 11 గంటలకు అది ఎక్కడ ఉందో తెలుసుకోగలిగాను. అది వెంటనే నాతో పోరాడటం మొదలు పెట్టింది. నాపై దాడి చేసింది. నన్ను గడ్డిలో పడేసింది. దానిని ఓడించడం చాలా కష్టతరంగా మారింది. అది నన్ను కాటు కూడా వేసింది. నా ముంజేతిని, భుజాలను ఆ పైథాన్ గాయపరిచింది. సుదీర్ఘ పోరాటం తరువాత నేను దానిని విజయవంతంగా పట్టుకోగలిగాను’ అని మైక్ కిమ్మెల్ పేర్కొన్నాడు. సోషల్ మీడియా పోస్ట్‌లో తన చేతికి అయిన గాయాన్ని, రక్తంతో ఉన్న తన ఫోటోను పైథాన్‌తో సహా షేర్ చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘రాక్షసిలా ఉంది. దీనిని పట్టుకున్నందుకు ధన్యవాదాలు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ఇది కచ్చితంగా చాలా భయంకరమైనది అని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలిపారు. మైక్ కాంట్రాక్ట్ స్నేక్ హంటర్ కావడంతో అతనికి పాము పొడవు, ఆకృతి ఆధారంగా బోనస్ లభిస్తుంది. పాములతో పాటు ఆకుపచ్చ ఇగువానా, ఈజిప్టు పెద్దబాతులు, ఫెరల్ హాగ్స్ వంటి ఇతర జాతులను ట్రాప్ చేయడంలో కూడా మైక్ సహాయం అందిస్తుంటాడు. (సూపర్ పవర్స్ చిన్నారి, వీడియో వైరల్!) యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, స్థానికేతర బర్మీస్ పైథాన్లు దక్షిణ ఫ్లోరిడాలో వాటి సంతతిని పెంచుకొని అక్కడ ఉంటే స్థానిక జీవులను చంపేస్తున్నాయి. వీటి కారణంగా ఆ ప్రాంతంలో చాలా ప్రాణులు మరణించాయి. దీంతో సౌత్ ఫ్లోరిడా వాటర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ పైథాన్ ఎలిమినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 2,970 పైథాన్లను పట్టుకొని బంధించారు. View this post on Instagram Yesterday’s solo #Everglades islands python hunt was another one for the books! At 8am I headed out into the swamp on my 14’ jon boat in search of an invasive #ManEater and at 11am I found her.... she wasn’t coming without a fight lol. I noticed her almost immediately as soon as we crossed paths, I could barely contain my excitement. She definitely was not afraid of me and started to slowly cruise through the vegetation as I carefully walked next to her trying to gauge exactly how large she was... because of all the grass and weeds it was hard to tell but I could tell she was an absolute monster. Her being tangled in vegetation makes the capture that much more difficult, a snake this size will use the vegetation as leverage and can literally pull you into the swamp, no stopping 150lbs of SOLID muscle. I knew going for her head first would be the easiest and safest capture method but I couldn’t turn down the chance to grab her by the tail and dance with the devil herself! As soon as I grabbed ahold of her I sealed my fate lol... no turning back now, she was coming for me! She immediately started to battle it out, taking strikes and pulling me into some tall grass with her, making it difficult to dodge her strikes... she was able to successfully get a bite on me. Only got me once but that’s all it took... I was punctured quite deep on my bicep and forearm, piercing an artery and hitting some nerves, I was lucky she didn’t latch on and that I was able to pull out of it. After loosing about a gallon of blood, lol, I was able to tire her out and get her under control. I then used a snake bag I had on my waist to tourniquet my arm because I was getting worried about how much blood I was loosing, better safe then sorry. I then had to drag all 150lbs of her alive, working to control my breathing so I didn’t pass out from blood loss and the extreme heat that day, I would have been screwed. After getting her to my boat, where my suppressed .22 pistol was, I was able to euthanize her before leaving (I didn’t have the proper bags for live transport because she was too large lol). Unofficial measurement: 17’ WITH kinks #RECORDBREAKER? Videos and more info to come!! A post shared by Trapper Mike (@pythoncowboy) on Jun 9, 2020 at 5:33am PDT -
నల్లమలలో వేటగాళ్ల హల్చల్
సాక్షి, కర్నూలు(ఆత్మకూరురూరల్) : నల్లమలలో గురువారం రాత్రి వేటగాళ్ళు రెచ్చిపోయారు. వేటగాళ్ళు నాటుతుపాకీతో రెండు పొడదుప్పు(స్పాటెడ్ డీర్) లను కాల్చి చంపి మాంసంగా మార్చి తరలిస్తూ అటవీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బైర్లూటీ ఎఫ్ఆర్ఓ శంకరయ్య తెలిపిన మేరకు నలమలలో అలజడి రేపిన ఈ ఘటన వివరాలు.. ఆత్మకూరు అటవీ డివిజన్లోని రుద్రకోడు అటవీ సెక్షన్లో ఉన్న సీతమ్మ పడె ప్రాంతంలో గురువారం రాత్రి గస్తీ తిరుగుతున్న అటవీ సిబ్బందికి కొందరు వేటగాళ్లు సైకిల్‌పై మాంసాన్ని తరలిస్తూ కనిపించారు. అటవీ సిబ్బంది వారిని వెంటాడి పట్టుకునే యత్నం చేయగా ఇరువురు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన డేరంగుల మురళి సైకిల్‌పై తరలిస్తున్న సుమారు 50 కేజీల దుప్పి మాంసం, ఒక ఎస్బీ ఎంల్ (సింగిల్ బ్యారల్ మజిల్ లోడ్) నాటు తుపాకీతో పట్టుబడ్డాడు. అతన్ని అటవీ అధికారులు ప్రశ్నించగా సిద్దాపురం గ్రామానికి చెందిన కుంచాల రంగన్న, ఆనంద్‌లతో కలసి నాటుతుపాకితో దుప్పుల మందపై కాల్పులు జరపగా రెండు దుప్పులు మృతిచెందినట్లు తెలిపాడు. వాటిని ముక్కలుగా కట్ చేసి గ్రామాల్లో విక్రయించేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నాడు. రుద్రకోడు ఎఫ్బీలో శ్రీనివాసులు నిందితులపై పీఓఆర్ నమోదు చేశారు. పశువైద్యాధికారి రాంసింగ్ దుప్పుల శరీర భాగాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం నిందితుడు మురళిని నంద్యాల జెఎఫ్ఎంసీ ముందు హాజరు పరిచగా జూనియర్ సివిల్ జడ్జీ 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. వేటగాళ్లను అరెస్టు చేసిన అధికారుల బృందంలో ఎఫ్‌ఎస్‌ఓలు వెంకటరమణ, తాహీర్, ఎఫ్‌బీఓలు శ్రీనివాసులు, మహబూబ్ బాషా ఉన్నారు. -
కలవరపెట్టిన పాక్ సబ్‌మెరైన్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక సబ్‌మెరైన్ ఒకటి భారత అధికారులను తీవ్రంగా కలవరపెట్టింది. చాలాకాలం నుంచి భారత్ పాక్ నేవీ కదలికలపై నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలో బాలాకోట్ దాడుల తర్వాత పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా 60కిపైగా యుద్ధనౌకలు, విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అంతర్జాతీయ సముద్ర జలాల్లో మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్ నేవీకి చెందిన అగొస్టా క్లాస్ సబ్‌మెరైన్ ‘పీఎన్ఎస్ సాద్’ కరాచీకి సమీపంలో అదృశ్యమైపోయింది. ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్’ సాంకేతికత ఉన్న ఈ పీఎన్ఎస్ సాద్ మిగతా సబ్మెరైన్ల కంటే ఎక్కువరోజులు సముద్రగర్భంలో ఉండిపోగలదు. దీంతో భారత్‌పై దాడికి పాక్ పీఎన్ఎస్ సాద్ ను పంపిందన్న అనుమానం భారత అధికారుల్లో బలపడింది. పీఎన్ఎస్ సాద్ గుజరాత్ తీరానికి 3 రోజుల్లో, ముంబైకి 4 రోజుల్లో చేరుకోగలదని నేవీ నిపుణులు అంచనా వేశారు. దాన్ని అడ్డుకునేందుకు అణు సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ కల్వరితో పాటు పీ–8ఐ విమానాలను రంగంలోకి దించారు. వీటితోపాటు ఉపగ్రహాల సాయంతో 21 రోజుల పాటు గాలించారు. భారత జలాల్లో ప్రవేశించి లొంగిపోకుంటే సాద్‌ను పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరికి 21 రోజుల తర్వాత పాక్‌కు పశ్చిమాన ఉన్న సముద్రజలాల్లో పీఎన్ఎస్ సాద్‌ను భారత నేవీ గుర్తించింది. ఈ విషయమై నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధం తలెత్తితే రహస్యంగా దాడి చేసేందుకు పాక్ సాద్‌ను వ్యూహాత్మకంగా అక్కడ మోహరించిందని తెలిపారు. కానీ భారత దూకుడు, అంతర్జాతీయ ఒత్తిడిలతో పాక్ తోకముడిచిందని వెల్లడించారు. దీంతో మక్రాన్ తీరంలోనే ïసాద్ అగిపోయిందని పేర్కొన్నారు. -
‘అవని’ కూనలు సురక్షితం
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని యవత్మాల్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న మ్యానీటర్ (ఆడపులి) ‘అవని’ని వేట జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని మట్టుపెట్టిన హైదరాబాదీ షార్ప్‌షూటర్ నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్, ఆయన తండ్రి నవాబ్ షఫత్ అలీ ఖాన్‌లను కేంద్ర మంత్రి మేనకగాంధీ సహా అనేక మంది విమర్శించారు. అవనిని చంపడంతో దాని రెండు కూనలు దిక్కుతోచని స్థితికి చేరతాయని, వేటాడటం సైతం చేతకాక చనిపోయే ప్రమాదం ఉందంటూ వేలెత్తి చూపారు. అయితే కూనలు రెండూ పూర్తి స్థాయిలో సేఫ్ అని, వాటికి వేటాడటంపై పట్ట వచ్చిందని షఫత్ అలీ ఖాన్ సోమవారం పేర్కొన్నారు. ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘ఆదిలాబాద్‌కు 60 కిమీ దూరంలో మహారాష్ట్రలో తిప్పేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ళ వయస్సున్న అవని అనే ఆడపులి 20 నెలల క్రితం గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్మాల్ వరకు వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న అడవి నుంచి పొలాల్లోకి వెళ్ళి ఆహారం కోసం వెతుక్కుంది. ఈ నేపథ్యంలో అక్కడకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. అప్పటి నుంచి ఆ పులి మ్యానీటర్‌గా మారి పంజా విసురుతూనే ఉంది. దాదాపు 11 నెలల క్రితం దీనికి జన్మించిన రెండు పులి పిల్లలు దీంతో కలిసే సంచరించాయి. ఈ మూడూ కలిసి యవత్మాల్ చుట్టూ ఉన్న 12 కిమీ పరిధిలో తమ ‘సామ్రాజ్యాన్ని’ విస్తరించాయి. తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలిసి మృతదేహాన్ని పీక్కు తింటున్నాయి. ఇలా ఆ మ్యానీటర్ చేతిలో 14 మంది చనిపోయారు. అక్కడి అటవీ శాఖ కోరిక మేరకు అస్ఘర్, నేను సెప్టెంబర్ రెండో వారంలో అక్కడకు చేరుకుని వేట మొదలెట్టాం. బంధించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ నెల 3న అవనిని మట్టు పెట్టాల్సి వచ్చింది. దీనిపై మేనకగాంధీతో పాటు అనేక మంది జంతు ప్రేమికులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ కూనల గతేంటంటూ ప్రశ్నించారు. దీంతో వాటి స్థితిని అధ్యయనం చేయడానికి ఉపక్రమించాం. అక్కడి కంపార్ట్మెంట్ నెం.655 వద్ద మేక, గుర్రం పిల్లల్ని ఎరగా వేశాం. ఆ కూనలకు వేటాడే శక్తి ఉంటే వచ్చి మేకను, బలమైన శక్తిని సముపార్జిస్తే గుర్రం పిల్లను పట్టుకు వెళ్తాయి. అక్కడ కెమెరా ట్రాప్ సైతం ఏర్పాటు చేశాం. శనివారం రెండు కూనలూ కెమెరాకు చిక్కాయి. ఆదివారం రాత్రి గుర్రం పిల్లను వేటాడి తినేశాయి. దీన్ని బట్టి ఆ రెండింటికీ ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టమైంది. ఇదే విషయాన్ని అక్కడి అటవీ శాఖ సైతం గుర్తించింది. ఈ పరిణామంతో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న అవని కూనల వల్ల ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, వాటిని బంధించాల్సిన అవసరమూ ఇప్పటికి లేదని తేలింది’ అని వివరించారు. -
వేటగాళ్ల రుణం తీర్చుకోలేం!
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని యవత్మాల్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న మ్యానీటర్ (ఆడపులి) ‘అవని’ని వేట జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదమైంది. దీనిని మట్టుపెట్టిన హైదరాబాదీ షార్ప్‌షూటర్ నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్, అతడి తండ్రి నవాబ్ షఫత్ అలీ ఖాన్‌లను కేంద్ర మంత్రి మేనకగాంధీ సహా అనేక మంది విమర్శించారు. అయితే యవత్మాల్కు చెందిన రైతులు, సామాన్యులు మాత్రం మీ రుణం తీర్చుకోలేమంటూ ఈ తండ్రీకొడుకులను ఘనంగా సన్మానించారు. మంగళవారం రాత్రి సావర్‌ఖేడా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరితో పాటు సహకరించిన వారందరికీ జ్ఞాపికలు అందజేశారు. ఆదిలాబాద్‌కు 60 కిమీ దూరంలో మహారాష్ట్రలోని తిప్పేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ల వయస్సున్న అవని అనే ఆడపులి 20 నెలల క్రితం గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్మాల్ వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో ఇతర జంతువుల కంటే మనుషులను వేటాడటం తేలికని గుర్తించిన పులి మ్యానీటర్‌గా మారి పంజా విసురుతూనే ఉంది. ఈ ఆడపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ మూడూ కలిసి యవత్మాల్ చుట్టూ ఉన్న 12 కిమీ పరిధిలో సంచరిస్తూ... తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలిసి మృతదేహాలను పీక్కు తింటున్నాయి. ఇలా ఇప్పటి వరకు వీటి చేతిలో 14 మంది చనిపోయారు. అక్కడి అటవీ శాఖ కోరిక మేరకు అస్ఘర్, షఫత్ సెప్టెంబర్ రెండో వారంలో అక్కడికి వెళ్లి వేట మొదలెట్టారు. బంధించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ నెల 3న అవనిని మట్టు పెట్టారు. దీనిపై మేనకగాంధీతో పాటు అనేక మంది జంతు ప్రేమికులు విమర్శలు గుప్పించారు. బాహ్యప్రపంచం ఈ వేటను వివాదాస్పదం చేసినా... యవత్మాల్ చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు మాత్రం వీరి రుణం తీర్చుకోలేమని చెబుతున్నారు. కొన్ని నెలలుగా తమకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మ్యానీటర్‌ను చంపిన అస్ఘర్, షఫత్లతో పాటు సహాయకుల్నీ మంగళవారం సావర్‌ఖేడాకు ఆహ్వానించారు. 12 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు వీరిని ఘనంగా సన్మానించారు. మ్యానీటర్ వల్ల వారు పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఓ పులి మహిళపై దాడి చేసి తల వేరు చేసినట్లు ఉన్న జ్ఞాపికను వీరికి అందజేశారు. అదే ప్రాంతంలో సంచరిస్తున్న అవని కూనలను బంధించాల్సిందిగా వీరిని కోరారు. -
నాగసాధువుగా...
సైఫ్ అలీఖాన్ కళ్లు ఆగ్రహంతో నిండాయి. ఎవరిపై కోపం అంటే.. ‘హంటర్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటివరకూ కనిపించని విభిన్నమైన గెటప్‌లో సైఫ్ కనిపించబోతున్న చిత్రం ఇది. ‘ఎన్‌హెచ్ 10’ ఫేమ్ నవదీప్‌సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రాజస్థాన్‌లో పూర్తయింది. ఇప్పుడు సెంకడ్ షెడ్యూల్‌ను ముంబైలో స్టార్ట్ చేశారు. ఇందులో సైఫ్ నాగసాధువు పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రలో కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇక్కడ గడ్డంతో కనిపిస్తున్నారు కదా... అది నకిలీ కాదు. నిజమైన గడ్డం అట. నటుడిగా తననే కొత్తగా ఆవిష్కరించే ఈ సినిమా కోసం ఏ కష్టమైనా పడటానికి రెడీ అన్నట్లుగా ఉన్నారట సైఫ్. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఆ బ్యాక్టీరియా అతని శరీరాన్ని తినేస్తోంది..
న్యూజెర్సీ : మాంసం తినే బ్యాక్టీరియా పీతల వేటగాడి పాలిట శాపంగా మారింది. శరీరంలోని భాగాలను కొద్ది కొద్దిగా తింటూ అతన్ని చావుకు దగ్గర చేస్తోంది. ఈ సంఘటన న్యూజెర్సీలోని మ్యాట్స్ ల్యాండింగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీకి చెందిన ఏంజెల్ పెరెజ్ అనే పీతల వేటగాడు జూలై 2వ తేదీన మోరైస్ నదిలో వేటకు వెళ్లి పీతలు పట్టి ఇంటికి చేరుకున్నాడు. ఆ మరుసటి రోజు అతని కుడికాలు కొద్దిగా వాపుకు గురై బొబ్బలతో ఎర్రగా మారింది. అతడికి ఇదివరకే పార్కిన్సన్స్ అనే వ్యాధి ఉండటంతో కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. ఆస్పత్రిలో చేరినప్పటికి.. దాన్ని ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా భావించిన వైద్యులు ఏవో మందులు రాసి అతన్ని ఇంటికి పంపించారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇన్ఫెక్షన్ పెరెజ్ రెండో కాలికి కూడా సోకింది. దీంతో మళ్లీ అతను ఆస్పత్రిలో చేరగా అతని పరిస్థితిని గమనించిన వైద్యులు ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. విబ్రియో అనే మాంసం తినే బ్యాక్టీరియా అతని శరీరంలోకి ప్రవేశించి కొద్ది కొద్దిగా అతని కాళ్లను తింటోందని తేలింది. ఆ ఇన్ఫెక్షన్ రెండు కాళ్లకు పూర్తిగా వ్యాపించి అతని ప్రాణానికే ముప్పగా మారింది. ప్రస్తుతం ఏంజెల్ పెరెజ్ 24గంటల అత్యవసర విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
ఒక్క తూటాతో చిరుత హతం!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని థూలే జిల్లాలో బీభత్సం సృష్టించిన మ్యానీటర్‌ను హైదరాబాదీ హంటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ మట్టుబెట్టారు. రెండు నెలల పాటు జనావాసాలపై దాడులు చేసిన ఈ ఆడ చిరుత ఏడుగురిని చంపడంతో పాటు మరో ఎనిమిది మందిని తీవ్రంగా గాయపరిచింది. ఆ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆహ్వానం మేరకు షఫత్ అలీ ఖాన్ అతికష్టమ్మీద శనివారం రాత్రి దాని ఆచూకీ కనిపెట్టగలిగారు. ఆకలి, ఆగ్రహంతో ఉన్న ఆ చిరుత దాడికి ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి చంపినట్లు అలీ ఖాన్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ఆహారం కోసం బయటకు వచ్చి... మహారాష్ట్రలోని థూలే జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో అనేక చిరుత పులులు ఉంటున్నాయి. చాలీవ్ గావ్ పరిసరాల్లో నివసించే ఓ ఆడ చిరుతకు అడవిలో ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆహారాన్ని వెతుక్కుంటూ మూడు నెలల క్రితం చాలీవ్ గావ్ పరిసరాల్లోకి వచ్చింది. తొలినాళ్లల్లో అక్కడి పొలాల్లో ఉండే అడవి పందుల్ని చంపి తినేది. ఆపై గ్రామంలోకి ప్రవేశించి కుక్కలు, మేకలు, పశువులు.. ఆపై మనుషులపైనా దాడులు చేయడం మొదలెట్టింది. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో... మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత ఈ చిరుతను మత్తు మందు ఇవ్వడం (ట్రాంక్వలైజింగ్) ద్వారా పట్టుకోవాలని భావించింది. 15 గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆడ చిరుతను పట్టుకోవడానికి ఏడు ట్రాంక్వలైజింగ్ బృందాలు 20 రోజుల పాటు తీవ్రంగా శ్రమించాయి. అయినా ఫలితం లేక ఆ రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ హైదరాబాద్‌కు చెందిన షఫత్ అలీఖాన్‌ను ఆహ్వా నించారు. దేశవ్యాప్తంగా 23 మ్యానీటర్ల, మదపు టేనుగుల్ని చంపిన అనుభవం ఉన్న అలీఖాన్ ఈ మ్యానీటర్ కోసం ఈ నెల 4న రంగంలోకి దిగారు. మత్తు మందిచ్చే ఆస్కారం లేక... రాత్రి వేళల్లో గ్రామాలపై దాడి చేసి, పగటిపూట సమీపంలోని అటవీ ప్రాంతంలో దాక్కునే ఈ మ్యానీటర్పై సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసిన అలీఖాన్ శనివారం ఉదయం వర్కేడ్ గ్రామ పరిసరాల్లో చిరుత కదలికల్ని గుర్తించారు. దాదాపు 12 గంటల వెదుకులాట తర్వాత రాత్రి 10.15కి మ్యానీటర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన అలీఖాన్ ‘ఆ మ్యానీటర్‌ను ట్రాంక్వలైజ్ చేయాలనే ఉద్దేశంతోనే సెర్చ్ ఆపరేషన్ చేశాం. అయితే రాత్రి వేళ హఠాత్తుగా తారసపడిన చిరుత దాడికి యత్నించింది. ఈ నేపథ్యంలో కాల్చిన తొలి తూటాకే నేలకొరిగింది’అని అన్నారు. -
కోటలో వేటగాడు!
► డబ్బున్నోళ్ల ఆట.. రిసార్ట్ ముసుగులో వేట.. ► సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అడవుల్లో వన్యప్రాణుల వేట ♦ రిసార్ట్ పేరుతో విచ్చలవిడి వ్యవహారం ♦ అడవి జంతువులను వధించి వాటి మాంసంతో విందులు ♦ ధనవంతులు, బడా వ్యాపారులు, వారి పిల్లల ఆటవిక క్రీడ ♦ అడవిని ఆనుకుని రిసార్ట్.. సాయంత్రమైతే చొరబాటు ♦ ‘షికారు’ పేరిట ఈవెంట్‌గా వేట ♦ దుప్పులు, కొండ గొర్రెలు, నెమళ్లు మాయం ♦ విషయం తెలిసీ పట్టించుకోని అటవీ శాఖ అధికారులు ♦ మామూళ్ల మత్తులో పోలీసు అధికారులు అదో అటవీ ప్రాంతం.. దుప్పులు, కొండ గొర్రెలు, నెమళ్లు వంటి ఎన్నో వన్యప్రాణులకు నిలయం.. అలాంటి అడవిలోకి ఓ రిసార్ట్ చొరబడింది.. గండికోటలా అన్ని విలాసాలతో ధనవంతులు, బడా వ్యాపారులు, వారి పిల్లల ఆటవిక క్రీడలకు నిలయంగా మారింది. డబ్బులు కడితే చాలు అక్రమంగా అడవిలోకి ప్రవేశించి.. ఇష్టమొచ్చినట్లుగా వన్యప్రాణులను వేటాడవచ్చు! వాటి మాంసంతో విందులూ ఆరగించవచ్చు.. సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అటవీ ప్రాంతంలో రిసార్ట్ ముసుగులో జరుగుతున్న వ్యవహారమిది. విషయం తెలిసినా పోలీసులు, అటవీ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోకపోవడంతో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అటవీ ప్రాంతంలో ఆధునిక హంగులతో ఓ రిసార్ట్ కట్టారు. దాదాపు 170 ఎకరాల విస్తీర్ణంలో అడవికి ఆనుకుని ఏర్పాటు చేశారు. అడవిలో కలసిపోయి ఉండటంతో నెమళ్ల గుంపులు, వన్యప్రాణులూ ఇందులోకి వస్తుంటాయి. ఈ రిసార్ట్‌లో రాచరిక కాలం నాటి తరహాలో ఆకర్షించే భవనాలు, పట్టుపాన్పులు, పంచభక్ష్య పరమాన్నాలు, చెలికత్తెలు, సేవకులు.. ఇలా అన్నీ సిద్ధం. కాస్త ఖర్చుపెడితే రోజంతా రాజుల్లా గడపొచ్చు. మరి రాజు అన్నాక వేట కూడా ఉంటుంది కదా!.. అందుకే అన్నట్లుగా పేజ్‌త్రీ పర్యాటకులను ఆకర్షించడం కోసం వేటను ‘షికారు’ పేరిట ఒక ఈవెంట్‌గా పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రిసార్టుకు వచ్చేవారు దానికి ఆనుకుని ఉన్న అడవిలోకి వెళ్లి జంతువులను వేటాడుతున్నారని.. అలా వేటాడి తెచ్చిన వాటిని వండి వడ్డిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల పిల్లలను ఆకర్షించడం కోసం ఈ వేటకు బాటలు వేసినట్టు తెలుస్తోంది. స్థానిక రైతులు ఈ వేట వివరాలను ‘సాక్షి’ప్రతినిధికి వెల్లడించారు. సాయంత్రం ఆరు నుంచి మొదలు సాధారణంగా అడవి జంతువులు సాయంత్రం వేళలో వాటి ఆవాసాల నుంచి బయటికి వచ్చి సంచరిస్తుంటాయి. దీంతో రిసార్ట్ యాజమాన్యం షికారు పేరుతో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేట నిర్వహిస్తోంది. వేట కోసం ప్రత్యేకంగా కుక్కలను పెంచుతున్నారు. రిసార్టు సిబ్బంది, పర్యాటకులు ఆ వేట కుక్కలను పట్టుకుని అడవిలోకి వెళతారు. అక్కడక్కడా ఎంచుకున్న చోట్ల ఇనుప కంచెల బోనులు ఏర్పాటు చేస్తారు. తర్వాత కాస్త ముందుకు వెళ్లి వన్యప్రాణులను కర్రలతో వెంటాడి ఆ బోనుల వైపు వచ్చేలా తరుముతారు. బోనుల్లో చిక్కుకున్న వన్యప్రాణులను రిసార్టుకు పట్టుకువచ్చి వధిస్తున్నారు. వాటి మాంసంతో వంటకాలు తయారుచేసుకుని తింటున్నారు. ఇక అడవిలోంచి రిసార్టులోకి వస్తున్న నెమళ్ల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమే. కొండ గొర్రెలు, దుప్పులను వేటాడి.. కొంత కాలంగా గుట్టుగా సాగుతున్న వన్యప్రాణుల వేట వ్యవహారం ఇటీవలే బయటకు పొక్కింది. మే నెల మూడో వారంలో రిసార్టు సిబ్బంది, పర్యాటకులు కలసి మూడు కొండ గొర్రెలు, ఒకదుప్పిని వేటాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాటిలో దుప్పిని, ఒక కొండ గొర్రెను అదే రోజున వధించి.. వాటి మాంసంతో విందు భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మిగతా రెండు కొండ గొర్రెలను రిసార్టు ఇనుప కంచెలో ఉంచగా.. కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారని తెలిసింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. ఆ రోజున సిబ్బందితో కలసి రిసార్టుకు వెళ్లారని, కానీ కేసు నమోదు చేయకుండానే వెనుదిరిగారని సమాచారం. అప్పటిదాకా ఇలాంటి రిసార్టు ఒకటి ఉందనే విషయం స్థానికంగా కూడా పెద్దగా తెలియకపోవడం గమనార్హం. అయితే ఆలస్యంగా సమాచారం అందుకున్న సిద్దిపేట ఫారెస్టు రేంజర్ శ్యాంసుందర్‌రావు తన సిబ్బందితో కలసి ఆ రిసార్టుపై దాడి చేశారు. రెండు కొండ గొర్రెలను స్వాధీనం చేసుకుని, రిసార్టు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కేసులు పెట్టి వదిలేశారు అటవీ అధికారులు రిసార్టుపై దాడి చేసిన వెంటనే రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఎలాంటి కేసులు పెట్టకుండా నిందితులను వదిలేయాలంటూ వారు అధికారులపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. దానికి తలొగ్గిన అధికారులు సాధారణ సెక్షన్ల కింద కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారు. దర్యాప్తును గాలికొదిలేశారు. స్వాధీనం చేసుకున్న కొండ గొర్రెలను నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తికి చూపించి.. నర్సాపూర్ అడవుల్లోనే వదిలేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా మళ్లీ రిసార్టు ముసుగులో వేట కొనసాగుతున్నట్లు తెలిసింది. మరోవైపు రిసార్టు కేసు వివరాల కోసం ‘సాక్షి’ప్రతినిధి సిద్దిపేట డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, రేంజర్ శ్యాంసుందర్రావులకు విజ్ఞప్తి చేసినా, వారం రోజుల పాటు తిరిగినా.. వారు వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే రిసార్టులో కొండ గొర్రెలను బంధించిన మాట నిజమేనని, వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామని శ్యాంసుందర్‌రావు చెప్పారు. -
ఆమెను కాపీ చేయలేదు
‘‘హిందీ ‘హంటర్’లో రాధికా ఆప్టే చేసిన పాత్రను, తెలుగులో నేను చేశా. అడల్ట్ కామెడీ ‘హంటర్’లో మెయిన్ పాయింట్‌ను మిస్ చేయకుండా దర్శకుడు నవీన్ కథలో కొన్ని మార్పులు చేసి, తెలుగులో పూర్తి వినోదాత్మకంగా, విభిన్నంగా తీశారు’’ అన్నారు మిస్తీ చక్రవర్తి. అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ‘బాబు బాగా బిజీ’లో మిస్తీ ఓ హీరోయిన్. సుప్రియ ఐసోల, తేజస్వి మదివాడ, శ్రీముఖి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజవుతోంది. మిస్తీ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నా పేరు రాధ. నటిగా ఏదైనా కొత్తగా ప్రయత్నించే ఛాన్స్ దక్కుతుందని ఈ సినిమా చేశా. రాధికా ఆప్టే నటనను కాపీ చేయకుండా నా స్టైల్లో చేశా. అవసరాల కాంబినేషన్లో నాకు ఎక్కువ సీన్లు ఉన్నాయి. సినిమాలో అతను చేసిన పాత్రకు, నిజజీవితంలో పాత్రకు చాలా తేడా ఉంటుంది. వెరీ గుడ్ కో–స్టార్. అవుట్‌పుట్ కూడా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుందనే నమ్మకముంది. నేను చేస్తున్న మరో తెలుగు సినిమా ‘శరభ’ చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న చిత్రమది’’ అన్నారు. -
మహదేవపూర్ అడవుల్లో జింకల వేట
⇒ వేటగాళ్లను వెంటాడిన అటవీ అధికారులు ⇒ తుపాకీతో బెదిరించి వేటగాళ్లు పరార్ మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు రెండు జింకలను చంపేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అటవీ శాఖాధికారులు వేటగా ళ్లను వెంబడించి రెండు జింకల మృతదేహాలతోపాటు ఒక ఇండికా కారును స్వాధీ నం చేసుకున్నారు. అటవీ అధికారులను వేటగాళ్లు తుపాకీతో బెదిరించి తప్పించుకుపోయారు. వారు వదిలివెళ్లిన (ఏపీ13 ఏఈ 2752) ఇండికా కారులో ఫజల్ మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఫొటోలు, ఆధార్‌కార్డు, మరో యువకుడి ఫొటోతో పాటు జంగిల్ నైఫ్ తదితరాలు లభించినట్లు మహదేవపూర్ రేంజర్ రమేశ్ వెల్లడించారు. మహదేవపూర్ అడవుల్లో వన్యప్రాణులను వేటాడినట్లు ఆదివారం రాత్రి జిల్లా అటవీ అధికారులకు సమాచారం అందడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పలిమెల రేంజ్ అధికారి నర్సింహమూర్తి, మహదేవపూర్ రేంజ్ అధికారి రమేశ్‌లను అప్రమత్తం చేశారు. వేటగాళ్ల వాహనాన్ని లెంకలగడ్డ అడవిలో ఫారెస్ట్ అధికారులు నిలువరించే ప్రయత్నం చేయగా వారు ఆపకుండా దూసుకుపోయారు. దీంతో అంబట్పల్లి పొలిమేరల్లో మాటు వేసి వాహనాన్ని అడ్డుగా పెట్టారు. అయినా వేటగాళ్లు ఆగకుండా రేంజర్ వాహనాన్ని ఢీకొట్టి అంబట్‌పల్లిలోని అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి పశువుల కొట్టంలోకి తీసుకెళ్లారు. టైర్ల అచ్చుల ఆనవాల్లతో ఆ పశువుల కొట్టం వద్దకు అటవీ అధికారులు వెళ్లగా.. ఒక వేటగాడు రేంజర్‌పై తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామని బెదిరించాడు. ఆ వెంటనే వారు పారిపోయారు. ఇంతలో అంబట్పల్లికి చేరుకున్న అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు కారును, జింకలతో సహా వదిలి వేయాలని, కేసు నమోదు చేయొద్దని రేంజర్ రమేశ్‌పై ఒత్తిడి తెచ్చి నట్టు తెలిసింది. దానికి అంగీకరించని ఆయన.. సర్పంచ్, గ్రామపెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించి వాహనాన్ని మహదేవపూర్‌లోని ప్రభుత్వ కలప డిపోకు తరలించారు. పశువైధ్యాధికారి మల్లేశం పోస్ట్‌మార్టం నిర్వహించి కాల్చి చంపినట్లు నిర్ధారించారు. కాగా, వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసి మంథని కోర్టులో నివేదించామని, జడ్జి ఆదేశాల మేరకు జింకల కళేబరాలను దహనం చేశామని రేంజర్ రమేశ్ తెలిపారు. -
వేటగాళ్ల ఉచ్చులో ఎలుగు బంటి
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ బైర్లూటి రేంజ్‌లోని రామయ్య కుంట బేస్ క్యాంపు సమీపంలో శనివారం.. ఎలుగు బంటి వేటగాళ్లు ఏర్పాటు చేసుకున్న ఉచ్చులో చిక్కింది. సమీపంలో ఉన్న నీటి వనరు వద్దకు దాహం తీర్చుకునేందుకు వచ్చే వన్య ప్రాణులు లక్ష్యంగా గుర్తు తెలియని వేటగాళ్లు ఈ ఉచ్చు పన్నారు. దాహం తీర్చుకోడానికి వచ్చిన మగ ఎలుగు బంటి ఉచ్చుకు చిక్కింది. ఉచ్చు బిగుసుకుంటూ ఉంటే ఉక్కిరిబిక్కిరై పెద్ద ఎత్తున అరవడంతో సపమీపంలో ఉన్న రామయ్య కుంట బేస్ క్యాంపు సిబ్బంది అప్రమత్తమయ్యారు. రేంజర్ శంకరయ్య సంఘటనా స్థలానికి వెళ్లి ఉచ్చు విడిపించేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉండే వైల్డ్ లైఫ్ రెస్క్యూ వ్యాన్‌ను పిలిపించారు. అందులో ఉన్న నిపుణులు ఎలుగు బంటిపై తుపాకి ద్వారా మత్తు సూదిని ప్రయోగించి స్పృహ పోగొట్టారు. తరువాత ఉచ్చునుంచి తప్పించి ఎలుగును బోనులోకి చేర్చారు. అనంతరం పశు వైద్యాధికారిని పిలిపించి ఎలుగుబంటిని పరీక్షించారు. జంతువు తీవ్రమైన అతిసారానికి గురయిన విషయాన్ని గమనించిన వైద్యుడు.. వైద్యం చేశారు. మరో 10 గంటల పర్యవేక్షణ అనంతరం ఎలుగు బంటి స్థితిని బట్టి అడవిలో వదిలివేసే అంశం డీఎఫ్‌వో సెల్వం పరిశీలనలో ఉంది. కాగా.. ఎలుగు బంటి ఉచ్చులో పడిన అంశంపై అటవీ శాఖ అతి గోప్యతను పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
శోభన్ బాబు టైటిల్‌తో అవసరాల
దర్శకుడిగా రెండు విజయాలు అందుకున్న అవసరాల శ్రీనివాస్, నటుడిగానూ అదే జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే కామెడీ, క్యారెక్టర్ రోల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్ త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్లో తెరకెక్కిన అడల్ట్ కామెడీ 'హంటర్' సినిమా తెలుగు రీమేక్‌తో హీరోగా మారుతున్నాడు అవసరాల శ్రీనివాస్. ఓ కుర్రాడి సెక్సువల్ ఫాంటసీలకు సంబంధించిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సోగ్గాడు అనే టైటిల్‌ను పరిశీలుస్తున్నారట. 70లలో శోభన్ బాబు, జయసుథ హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టైటిల్ సొగ్గాడు. తరువాత అదే టైటిల్ తోతరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిన ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి అదే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. యాంకర్ శ్రీముఖి, మిస్తీ చక్రవర్తిలతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే కమెడియన్‌గా, దర్శకుడిగా సక్సెస్ అయిన అవసరాల శ్రీనివాస్, ఈ సినిమాతో హీరోగానూ హిట్ కొడతాడేమో చూడాలి. -
చెరువులో మునిగి మత్యకారుడు మృతి
సిరిసిల్ల టౌన్ : నాలుగు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ఆదివారం చెరువులో శవమై తేలాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణ ంలోని బోయివాడకు చెందిన కూర రాములు(40) గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. ఆరోజు రాత్రి వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం మధ్యాహ్నం దామెరకుంట చెరువు వద్ద రాములు సైకిల్, దుస్తులు ఉండటంతో ఈతగాళ్లు చెరువులో గాలించారు. అయినా జాడ కనిపించలేదు. చెరువులోని తామర పూల ఊబిలో చిక్కుకుని ఉంటాడని భావించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రాములు మృతదేహం చెరువులో తేలియాడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అక్కడే పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రాములుకు భార్య అనిత ఉంది.