iPad
-
ఇది టైప్ చేశారంటే అంతే.. ఐఫోన్ క్రాష్!
ఐఫోన్లు, ఐప్యాడ్లలో కొత్త బగ్ ఒకటి బయటపడింది. కొన్ని అక్షరాలను టైప్ చేస్తే ఐఫోన్లు, ఐప్యాడ్లు క్రాష్ అవుతున్నాయి. “”: తర్వాత ఏదైనా అక్షరం టైప్ చేయగానే స్ప్రింగ్‌బోర్డ్ అని పిలిచే యాపిల్ డివైజ్ ఇంటర్ఫేస్ క్షణంలో క్రాష్ అయ్యి తిరిగి లాక్ స్క్రీన్‌కి వెళ్తోంది.ఈ విషయాన్ని మొదట ఓ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించారు. ఆ తర్వాత టెక్ పబ్లికేషన్ ‘టెక్‌క్రంచ్’ కూడా దీన్ని పరీక్షించింది. సెట్టింగ్స్ యాప్ లేదా యాప్ యాప్ లైబ్రరీలోని సెర్చ్ బార్లో ఈ అక్షరాలను టైప్ చేయగా క్రాష్ అవుతోందని ధ్రువీకరించింది. కొన్ని సందర్భాల్లో డివైజ్ సాధారణ స్థితికి రావడానికి ముందు స్క్రీన్ ఒక సెకను బ్లాక్‌గా ఫ్లాష్ కావచ్చని పేర్కొంది.అయితే ఈ బగ్ భద్రతా ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన రియాన్ స్టోర్జ్ సమస్యను విశ్లేషిస్తూ ఇది మీ డివైజ్ భద్రతకు హాని కలిగించదని నిర్ధారించారు. డబుల్యూ అనే సెక్యూరిటీ స్టార్టప్‌ని స్థాపించిన మరో ఐఓఎస్ నిపుణుడు పాట్రిక్ వార్డ్లే కూడా బగ్ కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినా ప్రమాదకరం కాదని అంగీకరిస్తున్నారు.కాగా ఈ బగ్‌పై యాపిల్ ఇంకా స్పందించలేదు. అయితే వారు భవిష్యత్తు అప్డేట్లో దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అసౌకర్యాన్ని నివారించాలనుకుంటే, మీ ఐఫోన్, ఐప్యాడ్ సెర్చ్ బార్లలో “”: అని మాత్రం టైప్ చేయొద్దు. -
ఐఫోన్, ఐప్యాడ్ వాడుతున్నారా? హై రిస్క్ వార్నింగ్!
ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన సలహా జారీ చేసింది. కొన్ని యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగదారుల భద్రత, గోప్యతకు ముప్పు కలిగించే సాంకేతిక లోపాలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ టీమ్ (CERT-in) గుర్తించింది. ముప్పు ఉన్న పరికరాల జాబితాను విడుదల చేసింది.ఈ లోపాలను వినియోగించుకుని హ్యాకర్లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సెర్ట్ ఇన్ తెలిపింది. స్పూఫింగ్‌పై వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాల వల్ల యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్, ఐప్యాడ్ తదితర పరికరాల సాఫ్ట్వేర్లు ప్రభావితం కావచ్చని ప్రభుత్వం జారీ చేసిన హై రిస్క్ హెచ్చరికలో పేర్కొంది. వీటి నుంచి బయటపడటానికి యాపిల్ నుంచి సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.ముప్పు ఉన్న వెర్షన్లు ఇవే..17.6, 16.7.9కి ముందున్న iOS, iPadOS వెర్షన్లు, 14.6కి ముందు MacOS Sonoma వెర్షన్లు, 13.6.8కి ముందు MacOS వెంచురా వెర్షన్లు, 12.7.6కి ముందు macOS Monterey వెర్షన్లు, 10కి ముందు వాచ్OS వెర్షన్లు, 17.6కి ముందు tvOS వెర్షన్లు, 1.3కి ముందు visionOS వెర్షన్లు, 17.6కి ముందు Safari వెర్షన్లు.Safari versions before 17.6iOS and iPadOS versions before 17.6iOS and iPadOS versions before 16.7.9macOS Sonoma versions before 14.6macOS Ventura versions before 13.6.8macOS Monterey versions before 12.7.6watchOS versions before 10.6tvOS watchOS versions before 17.6visionOS versions before 1.3 -
ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న యాపిల్ భారత్‌లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఇండియాలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపారం సాగించింది. దేశీయంగా ఐఫోన్లు, మ్యాక్బుక్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్లకు భారీ గిరాకీ ఏర్పడిందని కంపెనీ తెలిపింది. ఏడాది వ్యవధిలోనే రూ.2 లక్షల కోట్లు వ్యాపార మార్కును సాధించడానికిగల కారణాలను కంపెనీ విశ్లేషించింది.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడ్డాయి.పాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని తమిళనాడులో ఐఫోన్లను తయారు చేస్తోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా తయారైన రూ.1.35 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను కంపెనీ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. స్థానికంగా రూ.68,000 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు తగిన విధంగా తయారీ పెంచేందుకు ఫాక్స్కాన్తోపాటు విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది.కర్ణాటకలో యాపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్ ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను సిద్ధం చేస్తోంది. ఏటా ఆ ప్లాంట్‌లో దాదాపు 2 కోట్లు యూనిట్లను తయారుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ముంబయి, ఢిల్లీలో అవుట్లెట్లు ఏర్పాటు చేశారు.ఈకామర్స్ ప్లాట్‌పామ్‌లతో జతకట్టి యాపిల్ 42 శాతం ఉత్పత్తులను విక్రయిస్తోంది.ఇదీ చదవండి: చిన్న కిటుకుతో సిబిల్ స్కోర్ పెంపుప్రధానంగా యాపిల్ ప్రీమియం ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెడుతోంది. దానివల్ల మార్జిన్ ఎక్కువగా సమకూరుతుంది.అత్యాధునిక మార్కెటింగ్‌తో పెరుగుతున్న బ్రాండ్ విలువ కంపెనీకి ఎంతో లాభం చేకూరుస్తోంది. -
భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?
భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు యూనిట్లో యాపిల్ ఐఫోన్లను తయారుచేస్తున్న కంపెనీ త్వరలో ఐప్యాడ్లను కూడా అసెంబుల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు త్వరలో కంపెనీ నుంచి ప్రకటన విడుదల కావొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.యాపిల్ భారత్‌లో మరిన్ని ఉత్పత్తులను తయారుచేసేందుకు ఆసక్తిగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ప్రత్యేకంగా యాపిల్ అవుట్లెట్లను ప్రారంభించింది. తమిళనాడులో ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్లను తయారు చేస్తోంది. ఆ యూనిట్‌లోని పరికరాల్లో కొన్నింటిని అప్‌గ్రేడ్ చేసి ఐప్యాడ్లను తయారు చేయవచ్చని నిపుణులు సూచించినట్లు తెలిసింది. అందుకు సంస్థ కూడా ఆమోదం తెలిపిందని కొందరు అధికారులు చెప్పారు. త్వరలో దీనిపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా విభిన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఐప్యాడ్ తయారీలో కొంత భాగాన్ని గత సంవత్సరం వియత్నాంకు మళ్లించారు.తమిళనాడులో కొత్త యూనిట్ కోసం భారత్‌కు చెందిన ఓ సంస్థ రూ.1,200 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ ఫిబ్రవరిలో ప్రకటించింది. బడ్జెట్ 2024-25లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దాంతో దేశీయ తయారీకి ప్రోత్సహం లభించనుంది. యాపిల్ సంస్థ ఫాక్స్‌కాన్ ద్వారా భారత్‌లో ఐప్యాడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తే స్థానికంగా మరింత మంది ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు అంతర్జాతీయంగా భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) వల్ల కూడా దేశీయ తయారీని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!ట్రెండ్‌ఫోర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బోయ్స్ ఫ్యాన్ మాట్లాడుతూ..‘భారత్‌లో ఐప్యాడ్ ఉత్పత్తిని చేపట్టడం వల్ల సప్లై-చైన్ డిమాండ్‌ను భర్తీ చేయవచ్చు. దేశీయంగా యాపిల్ ఉత్పతులకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐప్యాడ్ ఎగుమతులు 49 మిలియన్ల(4.9 కోట్లు)కు చేరుకుంటాయని అంచనా’ అని తెలిపారు. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్‌లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్‌లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్
సాక్షి, ముంబై: యాపిల్ లవర్స్‌కు శుభవార్త. ఫ్లిప్‌కార్ట్ సేల్లోయాపిల్ ఐప్యాడ్‌పై భారీ ఆఫర్ లభిస్తోంది. దాదాపు రూ. 42 వేల విలువైన యాపిల్ ఐప్యాడ్ కేవలం రూ. 8,900కే లభిస్తుంది. త్వరలో జరగనున్న గ్లోబల్ ఈవెంట్లో కొత్త యాపిల్ ఐప్యాడ్‌ను లాంచ్ చేస్తుందన్న అంచనాల మధ్య ఈ ఆఫర్ ప్రముఖంగా నిలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది.రూ. 41,900 వద్ద లిస్ట్ యాపిల్ లేటెస్ట్ యాపిల్ ఐప్యాడ్ (10వ తరం)పై దాదాపు 36వేల రూపాయలకు పైగా డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అంటే కేవలం రూ. 8,900కే కొనుగోలుదారులు దక్కించుకోవచ్చు. (ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు) హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ పూర్తి స్వైప్ లావాదేవీలపై రూ. 3000 తక్షణ క్యాష్‌బ్యాక్.. దీంతో ధర రూ.38,900కి తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారారూ. 30,000 వరకు తగ్గింపు. అంటే అన్ని బ్యాంక్ ఆఫర్లు , డిస్కౌంట్ల తర్వాత, తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 8,900కి లభిస్తుంది.జూన్ 5 నుండి 9 వరకు యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2023) జరగనుంది. మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ న్యూస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ట్విటర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి టెక్ దిగ్గజాలు వేలాది ఉద్యోగులను తొలగిస్తూ వారిని ఆందోళనలోకి నెట్టి వేస్తున్నాయి. ఎపుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని గందరగోళ పరిస్థితి. ఈ తరుణంలో ఒక టెక్ కంపెనీ ఉద్యోగులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ వార్తల్లో నిలిచింది. ఏకంగా సంస్థలో పని చేస్తున్న 21 వేల మందికిభారీ బహుమతిని ప్రకటించింది. ఐటీ సొల్యూషన్స్ కంపెనీ కోఫోర్జ్ దాని Q4 ఆదాయాలలో కీలక మైలురాయిని అధిగమించింది. ఒక బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించిన శుభ సమయంలో సంస్థలోని మొత్తం 21వేల మందిలో ప్రతి ఒక్కరికి యాపిల్ ఐపాడ్‌ను బహుమతిగా ఇస్తుంది. ఇందుకోసం రూ. 80.3 కోట్లు కేటాయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి సేల్స్, మార్కెటింగ్ సిబ్బంది తదిరులను మినహాయించి మొత్తం కంపెనీలో 21,815 మంది ఉద్యోగులున్నారు. త్రైమాసికంలో తమ పనితీరు రెండు కీలక విజయాలు సాధించామని, మొదటిది త్రైమాసిక క్రమానుగత 5 శాతం వృద్ధి. రెండోది బిలియన్ డాలర్ల మార్క్ ఆదాయాన్ని అధిగమించడమని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ వెల్లడించారు. 2024లో కూడా ఇదే వృద్ధిని కొనసాగించనున్నామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కోఫోర్జ్ కంపెనీ ఫలితాలు, డివిడెండ్ గత ఏడాది రూ.1,742 కోట్లుగాగా ఉన్న కోఫోర్జ్ కంపెనీ గ్రాస్ రెవెన్యూ మార్చి 31తో ముగిసిన క్యూ4లో 24.5 శాతం పెరిగి రూ.2,170 కోట్లకు చేరింది. అయితే నికర లాభం క్యూ4లో 48.08 శాతం తగ్గి రూ.116.7 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది అది రూ.224.8 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెర్టికల్ పై సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలడం, గ్లోబల్ బ్యాంకింక్ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపలేదని సంస్థ పేర్కొంది. రానున్న కాలంలో 13 శాతం నుండి 16 శాతానికి వార్షిక ఆదాయ మార్గదర్శకత్వం ఇచ్చింది. అలాగే దాదాపు 50 బేసిస్ పాయింట్ల (bps) స్థూల మార్జిన్ పెరుగుదలను కూడా అంచనా వేసింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ. 19 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీ మే 9గా సంస్థ ప్రకటించింది. 25 డెలివరీ కేంద్రాలతో 21 దేశాల్లో సేవల్ని అందిస్తోంది. -
యాపిల్ యూజర్లకు కొత్త సమస్య..! ఒకే చెప్తే ఫోన్ డెడ్...!
యాపిల్ యూజర్లకు అలర్ట్..! యాపిల్ ఉత్పత్తులోని ఐవోస్లో నెలకొన్న కొత్త సమస్యతో ఆయా యాపిల్ ఉత్పత్తులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ సమస్యతో ఆయా యాపిల్ ఉత్పత్తులు ఒక్కసారిగా ఫ్రీజ్, క్రాష్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమస్య అదే..! హోమ్‌కిట్ కారణంగా పలు ఐఫోన్, ఐప్యాడ్స్ పూర్తిగా పనిచేయకుండా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రముఖ టెక్ నిపుణుడు ట్రెవర్ స్పినియోలాస్ గుర్తించారు. ఐవోస్ 14.7 వెర్షన్‌తో పాటుగా..తాజా ఐవోస్ వెర్షన్లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టులోనే హోమ్‌కిట్ సమస్య ఉన్నట్లు ట్రెవర్ గుర్తించాడు. ఈ సమస్యను ఇప్పటికే యాపిల్‌కు కూడా నివేదించాడు. యాపిల్ కూడా ఈ సమస్యలను 2022లోపు పరిష్కరిస్తామని తెలుపగా ఇప్పటివరకు కంపెనీ పరిష్కారం చూపలేదు. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే యాపిల్ యూజర్లు ఎలాంటి యాదృచ్చిక హోమ్‌కిట్ పరికరాల ఆహ్వానాన్ని అంగీకరించకూడదని ట్రెవర్ సూచించాడు. చదవండి: బీఎండబ్ల్యూ దూకుడు..! భారత్‌లో తొలిసారిగా..! -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త..!
భారత ఐఫోన్ యూజర్లకు ఆపిల్ శుభవార్తను అందించింది. ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్ కొనుగోలులో భాగంగా మూడు కొత్త చెల్లింపు మోడ్‌లను ఆపిల్ ప్రవేశపెట్టింది. యూపీఐ, రూపే, నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ ఆప్షన్లను ఆపిల్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో కేవలం క్రెడిట్, డెబిట్ కార్డులతో యాప్ స్టోర్, ఐట్యూన్స్‌లో చెల్లింపులు జరపడానికి వీలు ఉండేది. తాజాగా ఆపిల్ తీసుకున్న నిర్ణయంతో యూపీఐ, రూపే, నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ ఉపయోగించి చెల్లింపులు జరపవచ్చును. దీంతో అధిక సంఖ్యలో ఆపిల్ యూజర్లకు లాభం జరగనుంది. ఐట్యూన్స్‌లో పాటలను కొనుగోలు చేయడానికి యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. టెక్ దిగ్గజం కుపెర్టినో యాప్ స్టోర్ యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫికేషన్ల ద్వారా తెలిపింది. అయితే ఈ సేవలు అప్డేట్ చేసిన ఐవోస్, ఐప్యాడ్, మాక్ఓఏస్ లో వస్తుందని ఆపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మీ ఐఫోన్, ఐపాడ్లో కొత్త పేమెంట్ అప్షన్లను ఇలా యాడ్ చేయండి..! మీ ఐఫోన్, ఐపాడ్‌లోని సెట్టింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. తరువాత ఆపిల్ ఐడీపై ట్యాప్ చేయండి. తరువాత పేమెంట్ అండ్ షిప్పింగ్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. మరోసారి మిమ్మిల్సి సైన్ ఇన్ అవ్వమని అడుగుతోంది. కొత్త పేమెంట్ విధానాన్ని యాడ్ చేసేందుకు యాడ్ పేమెంట్ మేథడ్ను సెలక్ట్ చేసుకోండి. యూపీఐ, రూపే, నెట్‌బ్యాంకింగ్ వివరాలను యాడ్ చేసేందుకు చూపించే స్టెప్స్‌ను ఫాలో అవ్వండి. అవసరమైతే పేమెంట్ మేథడ్ను పునర్వ్యవస్థీకరించడానికి, తీసివేయడానికి ఎగువ కుడి మూలలో ఉన్న ఎడిట్పై క్లిక్ చేయండి. యూజర్లు ఆపిల్ ఐడీ నుపయోగించి మల్టీపుల్ పేమెంట్ విధానాలతో చెల్లింపులు జరపవచ్చును. -
జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగమైన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోనున్న కంపెనీ సంస్థ సిబ్బందికి ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా నగదును సైతం చెల్లించేందుకు ప్రతిపాదించింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలో కనీసం 95 శాతం టేకోవర్‌కు అనుకూలంగా ఓటింగ్ చేయవలసి ఉంటుంది. ఇలాగైతేనే జెట్ ఎయిర్వేస్ కొనుగోలు బిడ్‌కు క్లియరెన్స్ లభించనుంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను గెలుపొందిన సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది(ఉద్యోగులు, కార్మికులు) ప్రయోజనాల నేపథ్యంలో టేకోవర్ ప్రక్రియకు ఈ నెల 5న ప్రారంభమైన వోటింగ్ ఆగస్ట్ 4వరకూ కొనసాగనుంది. గత నెల 22న ఎన్సీఎల్టీ కొన్ని షరతులతో జలాన్ కల్రాక్ కన్సార్షియంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీ సిబ్బందికి కొన్ని రకాల లబ్ధిని చేకూర్చేందుకు కన్సార్షియం ఆమోదించింది. ఈ అంశాలను జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్లో పొందుపరిచారు. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 17న మూత పడింది. తదుపరి 2019 జూన్ 20న దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఆఫర్ ఇలా..: జెట్ ఎయిర్వేస్ సిబ్బంది(కార్మికులు)కి టేకోవర్ కంపెనీ ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అంతేకాకుండా రూ. 22,800 చొప్పున నగదును చెల్లించనుంది. ఇక ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.11,000 చొప్పున అందించనుంది. జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకునేందుకు జలాన్ కల్రాక్ కన్సార్షియం మొత్తంగా నగదు రూపేణా రూ. 1,375 కోట్లను వెచ్చించనుంది. -
'వింటేజ్'గా ఆపిల్ ఐకానిక్ ప్రొడక్ట్
సాక్షి,న్యూఢిల్లీ: ఆపిల్ తన ఐపాడ్ నానోను వింటేజ్ (వాడుకలో లేని) జాబితాలో చేర్చనుంది. తన ఐకానిక్ నానో లైనప్‌లోని చివరి ఐపాడ్‌ను ‘పాతకాలపు’ ఉత్పత్తుల జాబితాలో చేర్చబోతోందని మాక్‌రూమర్స్ నివేదించింది. ఈ నెల చివరిలో 7వ తరం ఐపాడ్ నానోను వింటేజ్ ఉత్పత్తుల జాబితాలో చేర్చబోతోందని తెలిపింది. ఆపిల్ తన తొలి ఐపాడ్ నానోను సెప్టెంబర్ 2005 లో ప్రారంభించింది. కాలక్రమేణా, అనేక మార్పులు చేర్పులతో ఐపాడ్ నానోను సమీక్షిస్తూ కొత్త డిజైన్లతో అప్ డేట్ వస్తోంది. ఈ క్రమంలో ఆపిల్ 2015లో 7వ జనరేషన్ ఐపాడ్ నానో రిఫ్రెష్ వెర్షన్‌ను విడుదల చేసింది. అయితే దీనికి క్రమేపీ ఆదరణ తగ్గిపోవడంతో విక్రయాలు పడిపోయాయి. దీంతో ఐపాడ్ నానో ఇకపై వాడుకలో లేని పాత ఉత్పత్తుల జాబితాలో చేరనుంది. వింటేజ్ ఉత్పత్తులు ఐదుకంటే ఎక్కువ, లేదా ఏడు సంవత్సరాల వరకు విక్రయానికి నోచుకోని ఉత్పత్తులను వింటేజ్ ఉత్పత్తులుగా లెక్కిస్తారు. ఏడు సంవత్సరాల మార్కును దాటిన తర్వాత, అవి వాడుకలో లేనివిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ ఐపాడ్ నానో వింటేజ్ జాబితాలో చేరనుందని మాక్‌రూమర్స్ అంచనా వేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ భారత మార్కెట్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ కొత్త నూతన ఐప్యాడ్ మోడల్‌ను ఇపుడు భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పెన్సిల్ సపోర్ట్‌తో గత నెలలో విడుదల చేసిన ఐప్యాడ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇపుడు ప్రీ ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. రూ.28వేల ప్రారంభ ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది. అలాగే యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్స్ వద్ద కూడా ఐప్యాడ్ (2018)ను కొనుగోలు చేయవచ్చు. యాపిల్ తీసుకొచ్చిన కొత్త ఐప్యాడ్ ఫీచర్ల విషయానికి వస్తే.. 9.7 ఇంచ్ డిస్ప్లేతో రెండు వేరియంట్లలో ఇది లభిస్తోంది. 32జీబీ వేరియంట్ 28వేల రూపాయలకు, 128 జీబీ వేరియంట్ రూ.37500లకు అందుబాటులో ఉంది.2048 × 1536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, యాపిల్ పెన్సిల్ సపోర్ట్, ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ ఓలియోఫోబిక్ కోటింగ్, యాపిల్ ఎ10 ఫ్యుషన్ చిప్సెట్, ప్రాసెసర్,32/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఓఎస్ 11, 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 1.2ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 10 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు లభిస్తున్నాయి.ఇక ఆఫర్ల విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16వేల ఎక్సేంజ్ ఆఫర కూడా ఉంది. యాక్సిస్‌బ్యాంక్ బిజినెస్ కార్డు ద్వారా (సుమారు 200 రూపాయలుదాకా)5శాతం డిస్కౌంట్. -
ఆ యూజర్లకు వాట్సాప్ కొత్త యాప్
శాన్ఫ్రాన్సిస్కో : ఫేస్బుక్ చెందిన మెసేజింగ్ సర్వీసెస్ వాట్సాప్, ఐప్యాడ్ యూజర్ల కోసం ఓ కొత్త యాప్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతుంది. ఈ విషయాన్ని పాపులర్ వాట్సాప్ ఛేంజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డబ్ల్యూఏబీటాఇన్ఫో ట్వీట్ చేసింది. ఐప్యాడ్ కోసం అప్లికేషన్ రూపొందించేందుకు వాట్సాప్ సిద్దమవుతుందని పేర్కొంది. ''ఐప్యాడ్ డివైజ్ కలిగి ఉన్న వాట్సాప్ యూజర్లకు గ్రేట్ న్యూస్. ఇతర రూమర్లు వాట్సాప్ బిజినెస్, ఫేస్బుక్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ నిజమైన మాదిరి, ఐప్యాడ్ కోసం వాట్సాప్ కొత్త యాప్ కూడా నిజం'' అని డబ్ల్యూబీటాఇన్ఫో ట్వీట్ చేసింది. ఐప్యాడ్ అప్లికేషన్ కోసం వాట్సాప్ డెస్క్‌టాప్ 0.2.6968 యాప్ సంకేతాలను ట్విట్టర్లో పోస్టు చేసింది. అయితే ఇది స్టాండలోన్ అప్లికేషనా? లేదా క్లయింట్ అప్లికేషనా? అనే విషయాన్ని వాట్సాప్ ట్రాకింగ్ వెబ్సైట్ రివీల్ చేయలేదు. వాట్సాప్ ఇటీవల కొత్త కొత్త ఫీచర్లను యూజర్ల కోసం ప్రవేశపెడుతోంది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ను ఇటీవలే వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున గ్రూప్‌లో లేదా ఎవరికైనా మెసేజ్ పంపితే 7 నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్ చేసుకునే వెసులుబాటు ఉంది. -
దొంగలకు కుక్కపిల్ల ఝలక్!
మెల్బోర్న్ : ఎనిమిది నెలల ఓ కుక్కపిల్ల దొంగలకు ముచ్చెమటలు పట్టించింది. యజమాని ఇంట్లో జరిగిన చోరీలో దొంగలు ల్యాప్‌టాప్, ఐపాడ్ సహా పప్పీని ఎత్తుకెళ్లగా మూడు రోజుల తర్వాత దొంగల కళ్లుగప్పి తప్పించుకుంది. తన ఫ్రెండ్ పప్పీ లేదని బెంగపెట్టుకున్న నాలుగేళ్ల చిన్నారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. ఓ కుటుంబం గత సోమవారం బయటకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడ్డారు. ఆభరణాలు, ల్యాప్‌టాప్, ఐపాడ్, లాబ్రడార్ జాతికి చెందిన ఓ కుక్కపిల్ల (సాశా), ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇంటికి రాగానే బాధిత కుటుంబానికి విషయం అర్థమైంది. ఐతే తనఫ్రెండ్ సాశా(కుక్కపిల్ల) ను దొంగలు తీసుకెళ్లారని నాలుగేళ్ల ఓనర్ కూతురు తిండి మానేసి బెంగపెట్టుకుంది. దొంగల్ని పట్టుకుని తమ కుక్కపిల్లను ఇప్పించాలని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన విక్టోరియా పోలీసులు ఓ ట్వీట్ చేశారు. 8నెలల పప్పీ అనే కుక్కపిల్ల కిడ్నాప్ అయిందని, డిటెక్టివ్స్ దర్యాప్తు చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. కుక్కపిల్ల మూడ్రోజుల తర్వాత ఇంటికి వచ్చేసింది. పప్పీ కారణంగా దొరికిపోతామని భయాందోళనకు గురైన దొంగలు ఆ కుక్కపిల్లను ఇంటిదగ్గర వదివెళ్లుంటారని పోలీసులు భావిస్తున్నారు. 'దొంగల నిజాయితీ ఎవడికి కావాలి.. మా పప్పీనే దొంగల కళ్లుగప్పి వచ్చేసింది. దొంగల్ని అరెస్ట్‌చేసి ఇతర విలువైన వస్తువులు తమకు వచ్చేలా చూడాలని' బాధిత కుటుంబం మరోసారి పోలీసులను కోరింది. -
జీఎస్టీ ఎఫెక్ట్: ఐ ఫోన్, ఐ ప్యాడ్ ధరల్లో కోత
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నేటి(జూలై 1) నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల ధరలను ఇండియాలో గణనీయంగా తగ్గించింది. ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ లపై గరిష్ట రిటైల్ ధరల్లో తగ్గింపును ప్రకటించింది. దాదాపు7.5 శాతం ధరలను తగ్గించి భారతీయులకు జీఎస్టీ గిఫ్ట్ అందించింది. కొన్ని మినహాయింపులతో మాక్ లైన్ కంప్యూటర్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. భారతదేశంలో ఐఫోన్ ధరలు ఎలా మారాయో ఇక్కడ చూడండి ఐఫోన్ ఎస్ ఈ 32 జీబీ అసలు ధరరూ. 27,200 ప్రస్తుత ధర రూ. 26,000 128 జీబీ అసలు ధర రూ. 37,200 ప్రస్తుత ధర రూ. 35,000 ఐఫోన్ 6ఎస్ 32 జీబీ అసలు ధర రూ. 50 వేలు, ప్రస్తుత ధర రూ. 46, 900 128 జీబీ అసలు ధర రూ. 60 వేలు ప్రస్తుత ధర రూ. 55,900 ఐఫోన్ 6 ఎస్ ప్లస్ 32 జీబీ అసలు ధర రూ. 60 వేలు, ప్రస్తుత ధర రూ. 56, 100 128 జీబీ అసలు ధర రూ. 70 వేలు ప్రస్తుత ధర రూ. 65వేలు ఐఫోన్ 7 32 జీబీ అసలు ధర రూ. 60 వేలు, ప్రస్తుత ధర రూ. 56, 200 128 జీబీ అసలు ధర రూ. 70 వేలు ప్రస్తుత ధర రూ. 65,200 256 జీబీ అసలు ధర రూ. 80 వేలు ప్రస్తుత ధర రూ.74,400 ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ అసలు ధర రూ. 72వేలు, ప్రస్తుత ధర రూ. 67, 300 128 జీబీ అసలు ధర రూ. 82 వేలు ప్రస్తుత ధర రూ. 76,200 256 జీబీ అసలు ధర రూ. 92 వేలు ప్రస్తుత ధర రూ.85,400 -
మత్తుమందుకు బదులు ఐప్యాడ్
లండన్: సర్జరీల సమయంలో రోగులకు మత్తుమందు ఇస్తారనే విషయం తెలిసిందే. చిన్నపాటి సర్జరీలకు లోకల్ అనస్తీషియా ఇస్తారు. అంటే సర్జరీ చేసే ప్రాంతంమాత్రమే మొద్దుబారిపోయేలా చేస్తుందన్నమాట. అయితే చిన్నపిల్లలకు ఇటువంటి సర్జరీలు చేసే సమయంలో మత్తుమందులకు బదులు వారి చేతిలో ఓ ఐప్యాడ్ పెడితే సరిపోతుందంటున్నారు పరిశోధకులు. వినడానికి విచిత్రంగానే ఉన్న ఈ ఆలోచన చాలా బాగా పనిచేస్తోందట. సర్జరీ సమయంలో ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు పిల్లలు అదోరకమైన ఆందోళనకు గురవుతారు. ఇటువంటి సమయంలో వారికి సంప్రదాయంగా వినియోగిస్తున్న మత్తుమందు ఇచ్చి సర్జరీ చేస్తారు. దీనికి బదులుగా వారి చేతికి ఓ ఐప్యాడ్‌ను ఇస్తే తల్లిదండ్రులు తమవద్ద లేరన్న ఆలోచన రాకుండా ఉంటుందని, అంతగా ఆందోళన చెందరని పరిశోధనలో తేలింది. సాధారణంగా సర్జరీకి ముందు ఇచ్చే మిడాజోలమ్తో పోలిస్తే ఐప్యాడ్ ఎంతవరకు ఆందోళనను తగ్గిస్తుందనే విషయంపై లండన్‌లోని మియర్ ఇన్ఫాంట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ డొమినిక్ పరిశోధనలు జరిపారు. దీంతో తల్లిదండ్రులతో పోలిస్తే పిల్లల్లో ఆందోళనను ఐప్యాడ్ గణనీయంగా తగ్గించిందని తేలింది. పదే పదే మత్తుమందుల వినియోగం కంటే ఇలాంటి పరిష్కారాలను వెతకడం అవసరమని, దీనివల్ల అనేక దుష్ఫలితాలను అధిగమించవచ్చని డొమినిక్ తెలిపారు. -
ఐపాడ్ తో ఆన్ లైన్ సర్జరీ
ఎక్కడో ఉన్న నిపుణులైన అంతర్జాతీయ డాక్టర్లను, మరోచోటికి రప్పించి సర్జరీలు చేపట్టడం చాలా కష్టం. ఒక్కోసారి వారు రాలేకపోవచ్చు. సర్జరీ చేయడానికి వారు కచ్చితంగా అవరమవచ్చు. ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ గాజాలో ఓ రిమోట్ సర్జరీని ఐపాడ్ తో చేసి చూపించారు అమెరికన్ యూనివర్సిటీ బేరూత్ మెడికల్ సెంటర్ డాక్టర్లు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా డాక్టర్లు సర్జరీలు నిర్వర్తించేలా అద్బుతమైన టెక్నాలజీతో ఈ సర్జరీ చేశారు. ప్రాక్సిమి అనే కొత్త సాప్ట్ వేర్ సాయంతో, ఐపాడ్ స్క్రీన్ తో ఈ ఆపరేషన్ చేశారు. స్క్రీన్ పై సర్జికల్ ఫీడ్ ను చూసుకుంటూ, దాన్ని కెమెరాలో బంధించి, ఎక్కడ కత్తెరతో కోసి కుట్లు వేయాలో ఆస్థలాన్ని స్క్రీన్ పై నిర్దేశిస్తూ.. సర్జరీ చేశామని అమెరికన్ యూనివర్సిటీ బేరూత్ మెడికల్ సెంటర్ ప్లాస్టిక్ సర్జరీ అధినేత డాక్టర్. గాసన్ అబూ సితా తెలిపారు. గుండెను తాకకుండానే గుండె సర్జరీ కూడా చేయొచ్చని తెలిపారు. గాజా స్ట్రిప్ లో ప్రాక్సిమి సాప్ట్ వేర్ సాయంతో అబూ సితా ఇప్పటికీ రెండు పెద్ద ఆపరేషన్లు చేశారు. పేలుడు తాలూకు గాయాలకు ఎలా ఆపరేషన్ చేయాలో వందమైళ్ల దూరంనుంచే తన కొలిగ్స్ కు మార్గనిర్దేశం చేస్తూ విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ప్రొసీజర్లకు రెండు స్మార్ట్ ఫోన్లు లేదా టాబ్లెట్లు అవసరమవుతాయని, వాటిని ఇంటర్నెట్ కు కనెక్ట్ చేసి, ఆపరేషన్ ను లైవ్ కెమెరా ఫీడ్ తీసుకోవాలని చెప్పారు. సర్జరీయన్ దాన్ని చూస్తూ.. ఎక్కడైతే కుట్లు అవసరమవుతాయో ఆ స్థలంలో డివైజ్ పై మార్కు చేస్తారు. అలా ఆపరేషన్ స్థలంలో ఉన్న డాక్టర్లకు సహకరించవచ్చన్నారు. ఈ మార్కుల ద్వారా గాజా ఆపరేషన్ స్థలంలో ఉన్న తన కొలిగ్స్ , తాను నిర్దేశిస్తున్న మేరకు కుట్లు వేస్తూ సర్జరీ చేపట్టారని డాక్టర్ అబూ సితా తెలిపారు. ఈ టెక్నాలజీ మెడికల్ విద్యార్థులకు కూడా ఎంతో సహకరిస్తుందని, వారు లైవ్ ఆపరేషన్ తో ఎలా సర్జరీ నిర్వర్తించవచ్చో తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ మెడికల్ నిపుణల ద్వారా కూడా సర్జరీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్ లైన్ లో పొందవచ్చని పేర్కొన్నారు. -
మార్కెట్లోకి రానున్న కొత్త ఐఫోన్లు!
బెంగళూరు: యాపిల్ కంపెనీ వచ్చేనెల 15న కొత్త శ్రేణి ఐఫోన్, ఐప్యాడ్ మోడల్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అదేవారంలో వీటి అమ్మకాలను కూడా ప్రారంభించే అవకాశముందని 9టు5మ్యాక్ బ్లాగ్ వెల్లడించింది. 4 అంగుళాల స్ర్కీన్ ఉన్న ఐఫోన్ మోడళ్లలను యాపిల్ త్వరలో విడుదల చేయనుంది. 'ఐఫోన్ 5ఎస్ఈ'గా పేర్కొంటున్న ఈ మోడల్తోపాట్ సరికిత్త ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌ను ఒకేసారి విడుదల చేసే అవకాశముంది. అయితే వీటి అమ్మకాల కోసం ముందస్తు ఆర్డర్లు తీసుకొనే అవకాశం లేదని తెలుస్తోంది. టెక్నాలజీ దిగ్గజమైన యాపిల్ కంపెనీ ఐఫోన్ల డిమాండ్ తగ్గుతున్నట్టు తాజా ధోరణి స్పష్టం చేసింది. ఐఫోన్ లాంచ్ అయిన 2007 నుంచి ఎన్నడూలేనిది గత ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా డిమాండ్ పడిపోయింది. ఐఫోన్ అమ్మకాల్లో కేవలం 0.4శాతం మాత్రమే నమోదైంది. ఐఫోన్ 6, 6ఎస్ మోడళ్ల తరహాలో పూర్తిస్థాయి హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌తో ఐఫోన్5ఎస్ఈని యాపిల్ ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా స్క్రీన్ సైజ్ పెరగకుండానే ఫాస్టెస్ డివైస్‌ను యూజర్లకు అందించే అవకాశముంది. -
ఐ పాడ్ కన్నా తక్కువ బరువు..
దుబాయ్: నెలలు నిండకుండా పుట్టే శిశువులు బరువు తక్కువగా ఉండటం, వారిని కాపాడటం కోసం వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తెలిసిందే. కాగా పుట్టినప్పుడు ఒక ఐ పాడ్ కంటే తక్కువ బరువుతో ఉన్న శిశువు, సుమారు 110 రోజుల ప్రత్యేక చికిత్స అనంతరం 1.9 కేజీల బరువు పెరగడం విశేషంగా నిలిచింది. కిలోకంటే తక్కువగా కేవలం 530 గ్రాముల బరువుతో పుట్టిన పసికందును దుబాయ్‌లోని వైద్య బృందం కాపాడిన వైనం అద్భుతంగా నిలించింది. ఈ వైద్య బృందంలో ఓ భారతీయ వైద్యుడు కూడా ఉండడం విశేషం. ఇది చాలా అరుదైన ఘటన అంటూ స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. సాధారణంగా 600 గ్రాములపైన బరువుండే ఒక ఐ పాడ్ కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువు... కోలుకొని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఇంటికి వెళ్లడం అద్భుతమని పేర్కొంది. వివరాల్లోకి వెళితే ఫిలిపినా కు చెందిన క్రిస్టోఫర్ శాక్రమెంటో భార్య సూసీ గత అక్టోబర్‌లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 14 వారాల ముందుగానే ప్రసవం జరగడంతో శిశువు, కేవలం 530 గ్రాముల బరువుతో పుట్టాడు. దీంతో ఆస్పత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వద్ద నాలుగు నెలలపాటు ప్రత్యేక చికిత్స అందించారు. దాదాపు వైద్య బృందం కూడా ఆశలు వదిలేసినప్పటికీ అనూహ్యంగా శిశువు పూర్తిగా కోలుకున్నాడు. అతని బరువు, ఆరోగ్యం సంతృప్తికర స్థాయికి చేరడంతో ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీనిపై సూసీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులు తన బిడ్డ నికోలస్‌కు పునర్జన్మను ప్రసాదించారని ఉద్వేగంగా చెప్పారు. -
శామ్ సంగ్ జెయింట్ టాబ్లెట్ టీజర్ లీక్!
మొబైల్ ఫోన్ల విభాగంలో దుమ్ము రేపుతున్న శామ్ సంగ్ మార్కెట్లోకి మరో సరికొత్త ఉత్పత్తిని ఆవిష్కరించనుంది. యాపిల్ ప్రో ఐ-పాడ్ 12.9 ఇంచెస్ స్క్రీన్ కు దీటుగా.. శామ్ సంగ్ గెలాక్సీ 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో టాబ్లెట్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లు గత సంవత్సర కాలంగా రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆన్ లైన్ లో లీక్ అయిన ఓ టీజర్... ఆ విషయాన్ని రూఢి చేస్తూ.. స్మార్ట్ ఫోన్ అభిమానులను ఉవ్విళ్ళూరిస్తోంది. ఆన్ లైన్ లో ఇప్పటికే లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే... 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో గెలాక్సీ ట్యాబ్ అందర్నీ ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యాపిల్ కంపెనీ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ అభిమానుల మనసు దోచుకుంటుండగా వారిని తనవైపు తిప్పుకొనేందుకు శామ్ సంగ్ కంపెనీ మార్కెట్లోకి అతి పెద్ద స్క్రీన్ తో జెయింట్ టాబ్లెట్ ను తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎఫ్ఏ బెర్లిన్ లో శామ్ సంగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీజర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆన్ లైన్ లో విడుదలైన టీజర్ ప్రకారం ఆ జెయింట్ టాబ్లెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే... సుమారుగా లాప్ టాప్ ను తలపిస్తున్న టాబ్లెట్.. ఆకట్టుకునే నల్లని రంగులో ఉంది. దీనికి ఫోల్డబుల్ స్టాండ్ ను కూడ అమర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ టాబ్లెట్ పూర్తి వివరాలను అక్టోబర్ నెలలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు కొన్ని సంస్థలు కూడ చెప్తున్నాయి. ఆన్ లైన్ టీజర్ ప్రకారం 451.8 మి.మీ. వెడల్పు, 275.8 మి.మీ పొడవు తోపాటు 11.9 మందంగా ఈ బ్లాక్ టాబ్లెట్ ఉంది. 18.4 అంగుళాల టీఎఫ్ టి ఎల్సీడీ స్క్రీన్, 1920x1080 రిజల్యూషన్ తో 8 మెగా పిక్సెల్ కెమెరా కలిగిన ఈ పరికరంలో 2.1 మెగా పిక్సెల్ తో మరో కెమెరా ఉంది. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్జినోస్ 7 ప్రాసెసర్, 1.6 గిగాహెట్జ్ రన్నింగ్ కెపాసిటీ తోపాటు.. 2 జీబీ రాం కలిగి ఉంది. ఆ మెగా టాబ్లెట్ మార్కెట్లో నిజంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ సాంసంగ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
'10 వేల మంది ఉద్యోగులకు ఐపాడ్ లు'
-
'10 వేల మంది ఉద్యోగులకు ఐపాడ్ లు'
హైదరాబాద్: మూడేళ్లలో మొత్తం పాలనను ఆన్లైన్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 70 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నట్టు వెల్లడించారు. 10 మంది ఉద్యోగులకు త్వరలో ఐపాడ్ లు ఇస్తామన్నారు. అక్టోబర్ 20 వరకు ఉద్యోగుల బదిలీలు ఉండవన్నారు. అక్టోబర్ 2 నుంచి ఫించన్ లబ్దిదారుల జాబితాను ఆన్లైన్ లో పెడతామని చెప్పారు. ఫించన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. -
ఇక పాలన మొత్తం ఐప్యాడ్ల ద్వారానే!!
రాబోయే కాలంలో పాలన మొత్తం ఐప్యాడ్ల ద్వారానే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఐప్యాడ్లు ఇచ్చామని, త్వరలోనే ఐఏఎస్ అధికారులకు కూడా వాటిని ఇస్తామని ఆయన అన్నారు. తర్వాత క్రమంగా జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులకు కూడా వీటిని అందజేస్తామన్నారు. అలా క్రమంగా మొత్తం పాలనా వ్యవహారాలన్నింటినీ ఎలాంటి పేపర్లు అవసరం లేకుండా ఐప్యాడ్ల ద్వారా చేస్తామన్నారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి జన్మభూమి-మాఊరు కార్యక్రమం నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆధార్ సీడింగ్ వల్ల సంక్షేమ పథకాల్లో 20 శాతం వరకు నిధులు ఆదా అవుతున్నాయని, 65 లక్షల మందికి చెందిన రేషన్ ఇన్నాళ్లుగా పక్కదారి పడుతోందని ఆయన అన్నారు. 2.62 లక్షల పింఛన్లకు ఆధార్ సీడింగ్ కాలేదని, వాళ్లంతా ఇక తమకు పింఛన్లు రావని భావిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రులకు రావాలంటేనే జనం భయపడుతున్నారని, ఆస్ప్రత్రిలో పనిచేసే ఉద్యోగులు, డాక్టర్లు కూడా వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చుచేసే నిధుల్లో 50 శాతం ప్రభుత్వాస్పత్రులకు వచ్చి ఉంటే చాలా మేలు జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు. -
అధికారులూ.. యాపిల్ ఉత్పత్తులు కొనద్దు!
ప్రజాధనంతో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయద్దంటూ చైనా తమ ప్రభుత్వాధికారులను ఆదేశించింది. భద్రతాపరమైన కారణాల వల్లే ఈ నిషేధం విధించినట్లు చెప్పింది. ఐ ప్యాడ్లు, మాక్‌బుక్‌ల లాంటి ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోళ్ల జాబితా నుంచి జూలై నెలలోనే తొలగించారు. జూన్ వరకు వీటిని కొనుగోలు చేసేవారు. ఈ నిషేధంతో చైనా మార్కెట్లో యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలపై గణనీయంగా ప్రభావం పడనుంది. అమెరికాకు చెందిన సిమాంటిక్ కార్పొరేషన్, రష్యాకు చెందిన కాస్పర్స్కీ ల్యాబ్‌ల నుంచి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయొద్దని చైనా ఇటీవలే ప్రభుత్వ శాఖలకు తెలిపింది. అలాగే, ప్రభుత్వ కొనుగోళ్ల నుంచి మైక్రోసాఫ్ట్ విండోస్ 8ను ఈ సంవత్సరం మే నెలలో మినహాయించారు. ఈ జాబితాలో స్మార్ట్ఫోన్లు లేకపోవడంతో ఐఫోన్ మాత్రం నిషేధం నుంచి తప్పించుకుంది. -
'అది చంద్రబాబు ఆలోచన'
హైదరాబాద్: ఏపీలో గిడ్డంగుల నిర్మాణానికి రూ. 250 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్రం నుంచి ఎరువుల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. 4.15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వసామర్థ్యాన్ని పెంపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉందన్నారు. 2.59 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు చెప్పారు. రైతులకు ఐపాడ్లు ఇవ్వాలన్నది సీఎం ఆలోచన అని మంత్రి చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులను చైతన్యపరిచేందుకు ఈ ప్రతిపాదన చేశారని వివరించారు. త్వరలో ఉపాధిహామీకి వ్యవసాయరంగాన్ని అనుబంధం చేసి రైతులకు రూ.5 వేల పెట్టుబడి తగ్గిస్తామన్నారు.