Jaspreet bumra
-
లిటిల్ బూమ్ బూమ్..ఈ చిన్నోడిని గుర్తు పట్టారా? ఫోటోలు వైరల్
ఇండియన్ క్రికెట్లో అద్భుతమైన జంట అనగానే గుర్తొచ్చే స్వీట్ కపుల్ జస్ప్రీత్ బుమ్రా,సంజనా గణేశన్. క్రికెటర్‌గా బుమ్రా చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందిస్తే, డిజిటల్ ఇన్‌సైడర్‌గా మ్యాచ్ తర్వాత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను ఇంటర్వ్యూ లతో ఆ విజయాన్ని మరింత సెలబ్రేటీ చేసే మీడియా పర్సన్ సంజనా గణేశన్.తాజాగా చిన్ని సంతోషాలు అందమైన క్షణాలు అంటూ భర్త జస్ప్రీత్ బుమ్రాతో గడుపుతున్న ఫోటోలు, జూనియర్ బుమ్రా ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశారు సంజనా. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బ్యూటిఫుల్ పిక్స్, లవబుల్ ఫ్యామిలీ అంటూ కమెంట్స్ చేశారు. క్యూట్ అంగద్, లిటిల్ బూమ్ బూమ్ అంటూ ఈ చిన్నోడి ఫోటోలను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.this little life 🩷 pic.twitter.com/8PXpKnrx2i— Sanjana Ganesan (@iSanjanaGanesan) July 2, 2024కాగా ఇటీవల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో మెన్ఇన్బ్లూ ఘన విజయం తర్వాత బుమ్రాను, సంజనా ఇంటర్వ్యూ చేయడం, తరువాత బుమ్రాను ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతోపాటు, అంగద్‌ను ముద్దాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బుమ్రా
ముంబై: శ్రీటీఎంటీ స్టీల్ ఉత్పత్తుల తయారీ సంస్థ దేవశ్రీ ఇస్పాత్ తాజాగా భారతీయ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. గత 50 ఏళ్లుగా ఉక్కు రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నామని కంపెనీ ఎండీ ప్రకాశ్ గోయెంకా తెలిపారు. నాణ్యత, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తమ బ్రాండ్‌కి బుమ్రా సముచిత ప్రచారకర్త కాగలరని ఆయన పేర్కొన్నారు. శ్రీటీఎంటీతో జట్టు కట్టడంపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశారు. -
ఐపీఎల్ 2022: 8 మ్యాచ్‌ల హైలైట్స్
-
Virat Kohli: ఇప్పుడు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు.. గర్వం అణిగిందా?
Virat Kohli Misses 2nd Test: దక్షిణాఫ్రికాతో వాండరర్స్ టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి దూరమవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెటేతర కారణాల వల్లే అతడు ఆఖరి నిమిషంలో వైదొలిగాడా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వెన్ను నొప్పి కారణంగానే దూరమైతే... ఆదివారం నాటి పత్రికా సమావేశంలో ఎందుకు అప్డేట్ ఇవ్వలేదంటూ ఆరాలు తీస్తున్నారు. కాగా రెండో టెస్టు కోసం కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా. ఈ నేపథ్యంలో ప్రొటిస్‌తో మ్యాచ్‌లో సెంచరీ బాది సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ... టాస్ సమయంలో జట్టుకు కోహ్లి దూరమయ్యాడన్న వార్త బయటకు వచ్చింది. వెన్ను నొప్పి కారణంగా అతడు రెండో టెస్టు నుంచి తప్పుకొన్నట్లు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. దీంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో హేటర్స్ మాత్రం కోహ్లి ఫిట్‌నెస్‌పై సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు.. ‘‘కోహ్లి ఫిట్నెస్ నుంచి అభిమానులు గొప్పలు చెప్పుకుంటారు కదా.. ఇప్పుడు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు. కొత్త ఏడాది మొదటి మ్యాచ్‌కే మీ కెప్టెన్ దూరమయ్యాడు. ఇప్పుడేమంటారు.. గర్వం అణిగిందా. ముఖాలు మాడిపోయాయా’’ అంటూ వ్యంగ్య రీతిలో స్పందిస్తున్నారు. ఇక కోహ్లి స్థానంలో హనుమ విహారి జట్టులోకి రాగా... కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా, బుమ్రా అతడికి డిప్యూటీగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: Rahul Dravid - Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్‌కోచ్! Kohli fans were bragging about his fitness and now their faces are in mud .. poetic justice#INDvsSA#INDvSA#SAvsIND#SAvIND — Mishra 🇮🇳 (@itsAKMishra__) January 3, 2022 Toota hai Virat Kohli ki fitness ka ghamand pic.twitter.com/XpABP8xgXq — Sudhanshu Ranjan Singh (@memegineers_) January 3, 2022 Virat shared pictures, trained at nets. No way he has a fitness issue. No mention of it in yesterday's PC. #Kohli — Arpan (@ThatCricketHead) January 3, 2022 Kohli's century drought has now extended to him not being able to play his 100th Test on time #INDvSA — AayushKataria (@aayush11kataria) January 3, 2022 -
ఆజమ్ కంటే రిజ్వాన్ బెటర్... భారత్ నుంచి ఒక్కడే.. నా ఫేవరెట్ జట్టు ఇదే!
ఈ ఏడాది కొన్ని క్రికెట్ జట్లకు మధురానుభూతులు పంచితే.. మరికొన్ని టీమ్‌లకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ముఖ్యంగా తమకు అందని ద్రాక్షగా ఉన్న టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి ఆస్ట్రేలియా పండుగ చేసుకుంటే.. టీమిండియా కనీసం మెగా టోర్నీ సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది. మరోవైపు భారత దాయాది జట్టు పాకిస్తాన్ మాత్రం ఈ మేజర్ ఈవెంట్ టైటిల్ గెలవలేకపోయినా.. పూర్తి స్థాయి పోరాటపటిమ కనబరించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి గానూ తన అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే... ఇద్దరు పాక్ ఆటగాళ్లకు చోటిచ్చాడు. టీమిండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే అవకాశం ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో చాట్ సందర్భంగా.... జట్టు ఎంపికలో తాను పరిగణనలోకి తీసుకున్న అంశాలను ప్రస్తావించాడు. ‘‘బాబర్ ఆజమ్.. మహ్మద్ రిజ్వాన్ ఇద్దరి గణాంకాలు బాగానే ఉన్నాయి. ఇద్దరి స్ట్రైక్ రేటు దాదాపుగా.. 130 ఉంది. ఇద్దరికీ ఈ ఏడాది చాలా బాగా కలిసివచ్చింది. అయితే, పవర్‌ప్లేలో స్ట్రేక్ రేటును బట్టి వీరిద్దరిలో నేను రిజ్వాన్ వైపే మొగ్గు చూపుతాను. ఇక ఆల్‌రౌండర్ల విషయానికొస్తే ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్‌ను ఎంపిక చేసుకుంటాను. బౌలర్లలో రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, బుమ్రాను ఎంచుకుంటాను. ఓపెనర్లుగా జోస్ బట్లర్, రిజ్వాన్ నా ఛాయిస్’’ అని హర్షా బోగ్లే చెప్పుకొచ్చాడు. హర్షా బోగ్లే 2021 అత్యుత్తమ టీ20 జట్టు: జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్, మిచెల్ మార్ష్, మొయిన్ అలీ, గ్లెన్ మాక్స్వెల్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: David Warner: ఎంతైనా వార్నర్ కూతురు కదా.. ఆ మాత్రం ఉండాలి -
Virat Kohli: వాళ్లంతా ఐపీఎల్లో ఓకే.. మరి టీ20 ప్రపంచకప్‌లో..?
T20 World Cup 2021: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి వరల్డ్ టీ20 మొట్టమొదటి జగజ్జేతగా నిలిచిన టీమ్... మేటి ఆటగాళ్లు గల జట్టు... అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న వైనం... అన్నింటికీ మించి.. మెంటార్‌గా... చివరి నిమిషంలో కూడా ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసి, ఊహకందని వ్యూహాలు రచించగల.. చాణక్యం తెలిసిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని... వెరసి ఈసారి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది విరాట్ కోహ్లి సేన. సామాన్య క్రీడాభిమానులే కాదు... ఎంతో మంది దిగ్గజాలు, పోటీలో పాల్గొనే జట్లకు చెందిన స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు సైతం టైటిల్ ఫేవరెట్ టీమిండియానే అని చెబుతున్న తరుణం... మరి ఇన్ని అంచనాల నడుమ దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో వరల్డ్‌కప్ వేట మొదలుపెడుతున్న భారత జట్టులో ఎవరి రికార్డు ఎలా ఉంది? కెప్టెన్‌గా మొట్టమొదటి.. చివరి టీ20 ప్రపంచకప్ ఆడనున్న కోహ్లికి ఈ టోర్నీ మధుర జ్ఞాపకంగా నిలుస్తుందా?! ►ఐసీసీ మెగా టోర్నీ సూపర్ 12 దశకు నేరుగా అర్హత సాధించిన టీమిండియా.. గ్రూప్-2లో ఉంది. 15 మంది సభ్యులతో బీసీసీఐ ప్రకటించిన జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, దీపక్ చహర్, అక్షర్ పటేల్. మెంటార్: ఎంఎస్ ధోని ►ఇలా మొత్తంగా ఐదుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఒక వికెట్ కీపర్(రిషభ్ పంత్).. ఇలా సమతౌల్యమైన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. వారే ఓపెనర్లు.. వార్మప్ మ్యాచ్‌లలో ఓపెనింగ్ స్థానాల్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లను బరిలోకి దించారు. అయితే, మేజర్ టోర్నీలో కేఎల్, హిట్‌మ్యాన్‌ను పంపుతామని ఇప్పటికే కోహ్లి ప్రకటించాడు. విరాట్ కోహ్లి(కెప్టెన్)(Virat Kohli) కెప్టెన్‌గా పలు చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు కోహ్లికి ఉంది. అయితే, బ్యాటర్‌గా మాత్రం అతడికి తిరుగులేదు. ముఖ్యంగా... టీ20 ఫార్మాట్.. వరల్డ్‌కప్ ఈవెంట్లలో కోహ్లికి మంచి రికార్డు ఉంది. 2014, 2016 టోర్నీలలో ఈ ‘రన్ మెషీన్’ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం విశేషం. అయితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సుదీర్ఘ కాలం టాప్‌లో కొనసాగిన కోహ్లి.. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. చాలా రోజులుగా అతడి ఖాతాలో సెంచరీ లేకపోవడం గమనార్హం. ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడైన కోహ్లి.. ఈ సీజన్లో 15 మ్యాచ్‌లలో 15 ఇన్నింగ్స్ ఆడి 405 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు: 72 నాటౌట్. ఇక తొలి మ్యాచ్‌లో భాగంగా.. టీ20 మెగా టోర్నీలో పాకిస్తాన్‌పై కోహ్లి అజేయ రికార్డు కలిగి ఉండటం తొలి మ్యాచ్‌లో కలిసి వచ్చే అంశం. ఇప్పటి వరకు పాక్‌తో మూడు మ్యాచ్‌ల(2012, 2014,2016)లో ఆడిన కోహ్లి ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. వరుసగా 78, 38, 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)(Rohit Sharma) హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. స్ట్రైక్‌రేటు పరంగా చూసినా... అనుభవం దృష్ట్యా.. హిట్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేగాక సారథిగానూ ఐపీఎల్లో అత్యద్భుత రికార్డు రోహిత్ శర్మ సొంతం. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత అతడిది. ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి స్థానంలో రోహిత్ టీ20 పగ్గాలు చేపట్టడం లాంఛనమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి.. రోహిత్ శర్మ.. కేఎల్ రాహుల్‌తో కలిసి మెరుగైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు నమోదు చేస్తే టీమిండియా దూసుకుపోవడం ఖాయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరో విశేషం ఏమిటంటే... ఇప్పటి వరకు జరిగిన 6 టీ20 వరల్డ్‌కప్‌లలో టీమిండియా తరఫున ఆడిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్‌కు ఉన్న అపార అనుభవం అదనపు బలం. కేఎల్ రాహుల్(KL Rahul) బ్యాటర్‌గా తన సత్తా ఏమిటో ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021 సీజన్లో మరోసారి నిరూపించాడు కేఎల్ రాహుల్. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన అతడు... 13 మ్యాచ్‌లలో 13 ఇన్నింగ్స్ ఆడి.. 626 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్. కేఎల్ రాహుల్ ఫామ్ గురించి చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. ఏ స్థానంలోనైనా ఆడగల సమర్థత రాహుల్‌కు ఉండటం అదనపు బలం. అవసరమైన సమయాల్లో వికెట్ కీపర్‌గా కూడా తన సేవలు అందించగలడు. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఐపీఎల్లో తనను తాను నిరూపించుకున్న సూర్యకుమార్ యాదవ్ అందరితో పోలిస్తే కాస్త ఆలస్యంగానే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా ఉన్న సూర్య... ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. శ్రీలంక పర్యటనతో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఈ ఐపీఎల్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ(317 పరుగులు).. టోర్నీ చివర్లో ఫామ్‌లోకి రావడం, వార్మప్ మ్యాచ్‌లోనూ రాణించడంశుభపరిణామం. అయితే, తొలిసారి ఐసీసీ టోర్నీ ఆడుతున్న ఒత్తిడిని సూర్య ఎలా అధిగమిస్తాడో చూడాలి! రిషభ్ పంత్(Rishabh Pant) టీమిండియా యువ సంచలనం రిషభ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా సత్తా చాటుతూ... ఎంఎస్ ధోని వారసుడిగా పేరొందాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను టేబుల్ టాపర్‌గా నిలిపి సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు పంత్. బ్యాటర్‌గానూ 419 పరుగులతో సత్తా చాటాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ పాత్ర కీలకం. టెస్టు, వన్డే, టీ20.. ఇలా అన్ని ఫార్మాట్లలో తను మంచి రికార్డు కలిగి ఉన్నపటికీ... కొన్నిసార్లు అనవసర షాట్లు ఆడి.. వికెట్ సమర్పించుకోవడం అతడి బలహీనత. ఇషాన్ కిషన్(Ishan Kishan) శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్. ముంబై ఇండియన్స్ తరఫున సుదీర్ఘకాలంగా ఐపీఎల్ ఆడుతున్న ఇషాన్ కిషన్... ఈసారి(241 పరుగులు) పెద్దగా రాణించలేదు. కానీ, తనదైన రోజు చెలరేగి ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చగల సత్తా అతడికి ఉంది. ఇటీవలి వార్మప్ మ్యాచ్‌లోనూ ఇరగదీసి తన విలువేంటో నిరూపించుకున్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఓపెనర్‌గా ఎంపికయ్యావని కోహ్లి తనతో వ్యాఖ్యానించినట్లు వెల్లడించిన ఇషాన్ కిషన్.. అన్నీ కుదిరితే రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం లేకపోలేదు. అన్నట్టు ఇషాన్ కిషన్‌కు ఇదే తొలి వరల్డ్‌కప్. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు జడేజా. ఇటు బౌలింగ్‌లోనూ.. అటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటడమే కాదు.. ఫీల్డింగ్‌లోనూ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకోగలడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో 227 పరుగులు చేసిన జడ్డూభాయ్... 13 వికెట్లు తీసి.. చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగోసారి చాంపియన్‌గా నిలిచే క్రమంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇలా జడేజా ఫామ్‌లో ఉండటం శుభపరిణామం. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీమిండియా స్టార్ ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. విధ్వంసకర షాట్లతో విరుచుకుపడటం సహా... పదునైన బంతులతో బ్యాటర్లను తిప్పలు పెట్టగల ప్రతిభ అతడి సొంతం. అయితే, గాయం కారణంగా కొన్ని రోజులు జట్టుకు దూరం కావడం... ఇటీవలి ఐపీఎల్(బౌలింగ్ చేయలేకపోయాడు)లోనూ పెద్దగా రాణించకపోవడం కాస్త ఆందోళనకరంగా పరిణమించింది. అయితే, తనదైన రోజున బ్యాటర్‌గా రాణించగల హార్దిక్ ప్రతిభపై కోహ్లి నమ్మకం ఉంచితే తుదిజట్టులో అతడిని చూసే అవకాశాలు ఉంటాయి. శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలలో మెరుగ్గా రాణించి తన విలువేమిటో నిరూపించుకున్నాడు శార్దూల్ ఠాకూర్. అంతేకాదు ఐపీఎల్-2021లో విశ్వరూపం ప్రదర్శించి 21 వికెట్లతో చెలరేగాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచిన ‘షేర్’దూల్.. చెన్నై చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించి సీఎస్కే కెప్టెన్, టీమిండియా టీ20 మెంటార్ ఎంఎస్ ధోని నమ్మకం చూరగొన్న అతడు... చివరి నిమిషంలో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో 15 మంది సభ్యుల్లో ఒకడిగా చేరాడు. రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) వాస్తవానికి టీ20 వరల్డ్‌కప్ జట్టులో అశ్విన్‌కు చోటు దక్కడం అనూహ్యమనే చెప్పాలి. సుమారు నాలుగేళ్ల క్రితం భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఆడిన అశూను ఎంపిక చేయడం సామాన్యులనే కాదు... క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ టూర్(టెస్టు)లో అశ్విన్‌కు సరైన అవకాశాలు లభించలేదనే కారణంతోనే.. ఇప్పుడు అవకాశం ఇచ్చారా అంటూ కొందరు మాజీలు ప్రశ్నించడం గమనార్హం. అయితే, అత్యుత్తమ స్పిన్నర్‌గా అశ్విన్‌కు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతోనే అతడిని ఎంపిక చేశారనడంలో సందేహం లేదు. కానీ... తుదిజట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడే ఓ అంచనాకు రాలేం. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) యార్కర్ల కింగ్ బుమ్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన బంతులు విసురుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో దిట్ట. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడం బుమ్రా బలం. ఇక ఐపీఎల్-2021లో ముంబై తరఫున 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా... టీ20 ప్రపంచకప్‌లోనూ తన సత్తా చాటడం ఖాయంగానే కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) స్వింగ్ కింగ్‌గా భువీకి పేరుంది. మ్యాచ్ ఆరంభ, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఒత్తిడికి గురిచేయడం అతడి బలం. అయితే, ఐపీఎల్-2021లో భువీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఎస్ఆర్హెచ్ తరఫున 11 ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. అయితే, అనుభవం దృష్ట్యా భువీ వంటి పేసర్ తమకు ఎప్పుడూ అవసరమేనని, తన ఎంపిక సరైందనేని కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు కెప్టెన్ల సమావేశంలో చెప్పడం భువనేశ్వర్ విలువేమిటో చాటుతోంది. మహ్మద్ షమీ(Mohammed Shami) ఐపీఎల్లో సుదీర్ఘకాలంగా ఆడుతున్న షమీ.. కచ్చితత్వంతో వేగంగా బంతులు విసరడంలో తనకు తానే సాటి. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021లోనూ పంజాబ్ తరఫున ఆడిన షమీ 19 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ చహర్(Rahul Chahar) రాహుల్ చహర్ ఎంపిక సైతం క్రీడాభిమానులను, కొంతమంది మాజీ ఆటగాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక బౌలర్ అయిన యజువేంద్ర చహల్‌ను కాదని... రాహుల్‌ను ఎంపిక చేయడమే ఇందుకు కారణం. ఫామ్ లేమిని కారణంగా చూపి.. తనను పక్కన పెట్టిన సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పని నిరూపించేలా.. ఐపీఎల్-2021లో ఆర్సీబీ తరఫున 18 వికెట్లు తీసి మెరుగ్గానే రాణించాడు చహల్. అదే సమయంలో... రాహుల్(13 వికెట్లు).. చహల్ స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్‌ను అని నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. మరి సెలక్టర్లు తన మీద ఉంచిన నమ్మకాన్ని అతడు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారతాడని చాలా మంది మాజీ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. తన బంతులతో బ్యాటర్లను తికమక పెట్టగల వైవిధ్యమైన బౌలింగ్ శైలి అతడి సొంతం. ఐపీఎల్-2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున మైదానంలో దిగిన వరుణ్ చక్రవర్తి... 18 వికెట్లతో సత్తా చాటాడు. ఇక వార్మప్ మ్యాచ్‌లలో వరుణ్‌ను ఆడించకపోవడం చూస్తుంటే... ప్రధాన ఆయుధాన్ని దాచి.. అసలైన సమరంలో అతడిని రంగంలోకి దించి మెరుగైన ఫలితాలు రాబట్టడమే వ్యూహమని తెలుస్తోంది. - సాక్షి వెబ్‌స్పెషల్ మరి... 2007లో విజేతగా నిలిచినా.. ఆ తదుపరి వరల్డ్‌కప్ అంటే 2009లో తొలి రౌండ్లో వెనుదిరిగిన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది టీమిండియా. అయితే 2010, 2012లో సూపర్ 8, 2014లో రన్నరప్, 2016లో సెమీస్‌కు చేరి సత్తా చాటింది. మరి... కెప్టెన్‌గా కోహ్లికి, కోచ్‌గా రవిశాస్త్రికి చివరిదైన ఈ టీ20 వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలుస్తుందంటారా?! మీ అభిప్రాయం చెప్పండి. -
WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్‌దే గెలుపు!
న్యూఢిల్లీ: ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకునే బుమ్రా.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌కు కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. ఒకవేళ అతడు గనుక ఫాం కొనసాగిస్తే న్యూజిలాండ్‌పై భారత్ గెలిచే అవకాశాలు మరింతగా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా పేస్ దళంలో బుమ్రా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే 83 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేకాదు.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి జట్లపై టెస్టు ఫార్మాట్లో ఐదు వికెట్లు(ఒకే ఇన్నింగ్స్) తీసిన తొలి ఆసియా బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సబా కరీం మాట్లాడుతూ... ‘‘ 3-4 ఐపీఎల్ మ్యాచ్‌లు చూశాను. బుమ్రా మంచి ఫాంలో ఉన్నాడు అనిపించింది. తనొక ప్రత్యేకమైన బౌలర్. మూడు ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. టీమిండియాకు ప్రస్తుతం ఉన్న ప్రధాన పేసర్ తను. షార్ట్ బంతులు సంధించి వికెట్లు పడగొట్టగలడు. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న బుమ్రా.. డబ్ల్యూటీసీలో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది. తను ఫాంలో ఉంటే మనకు గెలిచే అవకాశాలు పెరుగుతాయి.’’ అని మాజీ సెలక్టర్ సబా కరీం అభిప్రాయపడ్డాడు. కాగా జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైఎస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాదవ్ -
‘ఎ’ ప్లస్‌లోనే ఆ ముగ్గురు.. ఏడాదికి రూ.7 కోట్లు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 2019–2020 కాంట్రాక్ట్ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా... తాజా కాంట్రాక్ట్ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఉంటుంది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గ్రేడ్ ‘ఎ’ ప్లస్’లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్లు చొప్పున చెల్లిస్తారు. హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, పంజాబ్ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ తొలిసారి కాంట్రాక్ట్‌లను అందుకున్నారు. వీరిద్దరికి గ్రేడ్ ‘సి’ లో చోటు కల్పించారు. వీరిద్దరికి రూ. కోటి చొప్పు న కాంట్రాక్ట్ మొత్తం లభిస్తుంది. 2017–2018 తర్వాత స్పిన్నర్ అక్షర్ పటేల్ (గుజరాత్) మళ్లీ కాంట్రాక్ట్ జాబితాలో చోటు సంపాదించాడు. అక్షర్ పటేల్‌కు గ్రేడ్ ‘సి’లో స్థానం ఇచ్చారు. గాయాల బారిన పడ్డ భువనేశ్వర్ కుమార్ గ్రేడ్ ‘ఎ’ నుంచి ‘బి’కి పడిపోయాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గ్రేడ్ ‘బి’ నుంచి ‘ఎ’కు... పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్‌కు గ్రేడ్ ‘సి’ నుంచి ‘బి’కి ప్రమోషన్ లభించింది. గత ఏడాది గ్రేడ్ ‘సి’ కాంట్రాక్ట్ పొందిన కేదార్ జాదవ్ (మహారాష్ట్ర), మనీశ్ పాండే (కర్ణాటక) ఈసారి మొండిచేయి లభించింది. వీరిద్దరూ తమ కాంట్రాక్ట్‌లను కోల్పోయారు. కుల్దీప్ యాదవ్ ‘ఎ’ నుంచి ‘సి’కి... గ్రేడ్ ‘ఎ’లో 10 మందికి చోటు కల్పించారు. గత ఏడాది గ్రేడ్ ‘ఎ’లో ఉన్న ‘చైనామన్’ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గ్రేడ్ ‘సి’కి... గ్రేడ్ ‘బి’లో ఉన్న యజువేంద్ర చహల్ గ్రేడ్ ‘సి’కి పడిపోయారు. 2019 ప్రపంచకప్ తర్వాత వీరిద్దరు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. వరల్డ్‌కప్ తర్వాత కుల్దీప్ యాదవ్ కేవలం మూడు టి20 మ్యాచ్‌లు ఆడగా... చహల్ 17 మ్యాచ్‌లు ఆడి కేవలం 16 వికెట్లు తీశాడు. టెస్టు ఫార్మాట్లోనూ కుల్దీప్ యాదవ్‌పై టీమ్ మేనేజ్మెంట్ అంతగా నమ్మకం పెట్టుకోలేదు. 2018–2019 ఆస్ట్రేలియా పర్యటనలో హెడ్ కోచ్ రవిశాస్త్రి నుంచి భారత నంబర్‌వన్ స్పిన్నర్ అంటూ కితాబు అందుకున్న కుల్దీప్ యాదవ్‌కు ఆ తర్వాత కేవలం ఒకే ఒక్క టెస్టులో ఆడాడు. కొత్త కాంట్రాక్ట్ జాబితా గ్రేడ్ ‘ఎ’ ప్లస్ (రూ. 7 కోట్లు) విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా. గ్రేడ్ ‘ఎ’ (రూ. 5 కోట్లు) రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా. గ్రేడ్ ‘బి’ (రూ. 3 కోట్లు) వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్. -
వైరల్: సంగీత్‌లో స్టెప్పులేసిన బుమ్రా- సంజూ!
న్యూఢిల్లీ: టీమిండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ వివాహానికి సంబంధించిన విశేషాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట సోమవారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆది నుంచి తమ బంధం గురించి ఎక్కడా బయటపడని ఈ సెలబ్రిటీ కపుల్.. ఏకంగా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురైనా, కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ హల్చల్ చేస్తున్నారు. వీరి పరిణయానికి సంబంధించిన ఏ చిన్న వీడియో దొరికినా తమ ఖాతాల్లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా , బుమ్రా- సంజూ తమ సంగీత్‌లో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇద్దరూ కలిసి తన్మయత్వంతో స్టెప్పులేస్తూ చిరునవ్వులు చిందిస్తున్న వీడియో కన్నుల పండుగా ఉందంటూ యార్కర్ కింగ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక బుమ్రా ప్రాతినిథ్యం వహిస్త్ను ముంబై ఇండియన్స్ సైతం వీరి వెడ్డింగ్లోని మధుర జ్ఞాపకాలకు సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. కాగా పుణెకు చెందిన సంజనా గణేశన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ను గెలుచుకున్నారు. అదే విధంగా, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు. ఆ తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా అవతారమెత్తిన సంజన, బుమ్రాను ప్రేమించి, ఇరు కుటుంబాల సమక్షంలో అతడిని పెళ్లాడారు. ఫొటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: బుమ్రానే బౌల్డ్ చేసింది.. ఎవరీ సంజన?! అయ్యో మయాంక్.. బుమ్రా భార్యను తప్పుగా ట్యాగ్ చేసి And one moreeee here... 💐🎉🍾👸🤴🥳... Adorable 👀👀...#yorkerking#bumrahthegoat#JaspritBumrah#IndianCricketTeam#TeamIndia#MumbaiIndians#icc#bcci#INDvsENG#bumrahwedding#jaspritbumrahmarriage#jaspritbumrahwedding@Jaspritbumrah93@SanjanaGanesan pic.twitter.com/cOttQnPWeh — Jasprit bumrah.fc (@bumrahthegoat) March 16, 2021 View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
బిర్యానీని బాగా తగ్గించాను: సిరాజ్
బ్రిస్బేన్ టెస్టు మూడో రోజు... వాషింగ్టన్ సుందర్ అవుటై పెవిలియన్‌కు తిరిగి వస్తున్నాడు. అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ నుంచి కిందకు దిగి వచ్చి బౌండరీ వద్ద టాప్ స్పిన్నర్ అశ్విన్ నిలబడ్డాడు. సుందర్ రాగానే ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని అభినందించాడు. తన స్థానంలో బరిలోకి దిగిన ఆటగాడి అద్భుత ప్రదర్శనకు అతను ఇచ్చిన కితాబు అది. మ్యాచ్ నాలుగో రోజు... పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇలాగే ఒక్కడే ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఐదు వికెట్ల ప్రదర్శన అనంతరం సహచరుల అభినందనల మధ్య ముందుగా నడుస్తూ వచ్చిన సిరాజ్‌ను ఎంతో ఆప్యాయంగా హత్తుకొని తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఈ దృశ్యం సోమవారం హైలైట్‌గా నిలిచింది. తాను గాయంతో దూరం కావడంతో బౌలింగ్ భారం మోసిన ఆటగాడు అంచనాలకు మించి రాణించడం, ఐదు వికెట్లతో తిరిగి రావడం బుమ్రాలో కూడా సంతోషం నింపిందనడంలో సందేహం లేదు. క్యాచ్ పట్టి సిరాజ్ ఐదో వికెట్ ప్రదర్శనకు కారణమైన శార్దుల్ ఠాకూర్ చప్పట్లతో నవ్వుతూ అతడి వెంట నడవటం... ఐదో వికెట్ తీశాక ఆకాశం వైపు చూస్తూ సిరాజ్ తన తండ్రిని గుర్తు చేసుకున్న క్షణాన మయాంక్ అగర్వాల్ అదే తరహాలో అందులో భాగం కావడం... ఇవన్నీ సగటు భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. ఈ సిరీస్ ఆసాంతం భారత క్రికెటర్లలో ఒక రకమైన ప్రత్యేక అనుబంధం కనిపించింది. సాధారణంగా ఆటలో వినిపించే ‘టీమ్ స్పిరిట్’ మాత్రమే కాదు... ఇది అంతకంటే ఎక్కువ. వీరంతా సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ వచ్చారు. సహచరులు తప్ప మరో ప్రపంచం లేకుండా పోయింది. సిరీస్‌లో వేర్వేరు దశల్లో ప్రతికూలతల నడుమ వారంతా గొప్ప పోరాటపటిమ కనబర్చారు. అందరి లక్ష్యం మాత్రం ఆసీస్‌ను మట్టికరిపించడమే. రెండేళ్ల క్రితం కూడా ఆస్ట్రేలియాలో మన జట్టు సిరీస్ గెలిచినా... ఇప్పటి పరిస్థితులు భిన్నం. ముఖ్యంగా టాప్–4 పేస్ దళంలో ఒక్కరు కూడా లేకుండా బ్రిస్బేన్ టెస్టుకు సిద్ధమైన వేళ జట్టు మరింత పట్టుదలగా నిలబడింది. ఈ జట్టులో ఇప్పుడు సీనియర్, జూనియర్ ఎవరూ లేరు. అంతా ఒక్కటే! ఒక్కో ఆసీస్ వికెట్ తీస్తున్న సమయంలో మన ఆటగాళ్ల సంబరాలు చూస్తే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా సిరాజ్‌కు కష్టకాలంలో జట్టు మొత్తం అండగా నిలబడింది. తండ్రి అంత్యక్రియలకు వెళ్లరాదని అతను తీసుకున్న నిర్ణయం నిజంగానే కెరీర్‌ను మార్చేసింది. మెల్బోర్న్ నుంచి బ్రిస్బేన్ చేరే వరకు అతని ఆట మరింత మెరుగైంది. తన మూడో టెస్టులోనే సహచర పేసర్లకు సూచనలిస్తూ కనిపించిన సిరాజ్ స్వయంగా ఐదు వికెట్లతో మార్గనిర్దేశనం చేశాడు. సిరాజ్ తండ్రి మరణ వార్త తెలిసిన రోజున ‘మీ నాన్న ఆశీస్సులు నీ వెంట ఉంటాయి. ఈ టూర్లో ఏదో ఒక దశలో మ్యాచ్ ఆడతావు. ఐదు వికెట్లు కూడా తీస్తావు’...అని హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాట అక్షరసత్యమైంది. ఇప్పుడు సచిన్ మొదలు క్రికెట్ దిగ్గజాలంతా అతని అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అభినందనలకు సిరాజ్ అర్హుడనడంలో ఎలాంటి సందేహం లేదు! బిర్యానీని బాగా తగ్గించాను సిరీస్‌లో తీసిన 13 వికెట్లలో ఈ రోజు తీసిన స్మిత్ వికెట్ నాకు అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్నిచ్చింది. నాపై నమ్మకముంచి పదే పదే తన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిన రహానేకు కృతజ్ఞతలు. నాన్న దీవెనలతోనే ఐదు వికెట్ల ప్రదర్శన సాకారమైందని భావిస్తున్నా. నా స్పందనను మాటల్లో చెప్పలేను. లాక్డౌన్ సమయం నుంచి టెస్టు క్రికెట్‌కు కావాల్సిన ఫిట్నెస్ను సాధించడంలో ఫిట్నెస్ ట్రైనర్ సోహమ్ దేశాయ్ ఎంతో సహకరించారు. ఈ క్రమంలో నేను తినే బిర్యానీని బాగా తగ్గించారు. నన్ను నేను సీనియర్ బౌలర్‌గా భావించుకోలేదు. దేశవాళీలో, ‘ఎ’ జట్టు తరఫున ఆడటం నాకు మేలు చేసింది. బుమ్రా లేకపోవడంతో అదనపు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. మొహమ్మద్ సిరాజ్ -
అతడి బౌలింగ్‌లో డివిల్లియర్స్ ఏడ్చేశాడు: అక్తర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ సీమర్ మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ ఏడుపు లంకించుకున్నాడంటూ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఏషియన్ టెస్టు చాంపియన్‌షిప్ సమయంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఆసిఫ్ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చాడు. భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఓ స్పోర్ట్స్ చానెల్లో మాట్లాడిన అక్తర్.. మహ్మద్ ఆసిఫ్ తర్వాత తాను చూసి అత్యంత స్మార్ట్ బౌలర్ బుమ్రా అంటూ కితాబిచ్చాడు. గాలివాటుని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా బంతుల్ని విసిరే టెక్నిక్‌ను తాను, వసీం, వకార్ ఉపయోగించేవాళ్లమని, ఇప్పుడు బుమ్రా సైతం అదే తరహాలో బౌలింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. (చదవండి: గంగూలీపై ఒత్తిడి తెచ్చి వాడుకోవాలని చూస్తున్నారు!) డివిల్లియర్స్ కంటతడి పెట్టాడు ‘‘పాక్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్‌లో పరుగులు చేయలేక ఏబీ డివిల్లియర్స్ కంటతడి పెట్టాడు. వీవీఎస్ లక్ష్మణ్ అయితే.. ‘‘ఇలాంటి బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి’’ అని వాపోయాడు. వసీం అక్రం కంటే ఆసిఫ్‌కే ఎక్కువ భయపడేవారు. ఇప్పుడు టీమిండియా బౌలర్ బుమ్రాను చూస్తే నాకు అతడే గుర్తుకువస్తాడు. ఆసిఫ్ తర్వాత అంత స్మార్ట్‌గా బౌలింగ్ చేసే ఫాస్ట్‌బౌలర్ తను. ఫిట్నెస్ పరంగా టెస్టు క్రికెట్‌కు అతడు పనికివస్తాడా అని చాలా మంది సందేహపడేవారు. అయితే నేను గమనించింత వరకు.. ఏదైనా అనుకుంటే దానిని కచ్చితంగా సాధించాలనే పట్టుదల అతడి సొంతం. ఫాస్ట్‌బౌలర్‌గా తను పర్ఫెక్ట్. తనో అసాధారణ ఆటగాడు. గొప్ప బౌలర్. ఫిట్నెస్ సాధిస్తే సుదీర్ఘకాలం పాటు సంప్రదాయ క్రికెట్లో కొనసాగుతాడు’’ అని అక్తర్ ప్రశంసలు కురిపించాడు. కాగా బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొత్తంగా బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీసి సత్తా చాటడంతో భారత్ ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.(చదవండి: టీమిండియానే ఈ సిరీస్ గెలవాలి: పాక్ క్రికెటర్) -
బూమ్ బూమ్ బ్యాటింగ్
బుమ్రా అంటే భారత బౌలింగ్ తురుపుముక్క. పేస్ దళానికి ఏస్ బౌలర్. పదునైన బంతులతో నిప్పులు చెరగడం, యార్కర్లతో వికెట్లను కూల్చడం అతనికి బాగా తెలిసిన పని. మరి బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీ చేయడం మనమెప్పుడు చూడలేదు కదా! ఇప్పుడు ఆ ముచ్చట కూడా చూపించేశాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నాడు. తర్వాత తన బౌలింగ్ విన్యాసంతో ఆసీస్ ‘ఎ’ పతనంలో భాగమయ్యాడు. దీంతో తొలి రోజే ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి. సిడ్నీ: డే అండ్ నైట్ టెస్టుకు సన్నాహకంగా నిర్వహిస్తున్న పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా (57 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2 వికెట్లు) అనూహ్యంగా ఆల్‌రౌండర్ అవతారం ఎత్తాడు. బ్యాటింగ్‌లో అజేయంగా రాణించిన అతను భారత ఇన్నింగ్స్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బౌలింగ్‌లోనూ నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌ను వర్షం ఆటంక పరచడంతో సుమార గంటపాటు మ్యాచ్ సాగలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 32.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. క్యారీ (32; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. షమీ, సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఆల్‌రౌండ్ ప్రాక్టీస్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (2) ఎక్కువసేపు నిలువలేకపోయినా... పృథ్వీ షా (40; 8 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (43; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నడిపించారు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక ఇన్నింగ్స్ గతి తప్పింది. హనుమ విహారి (15), గిల్, కెప్టెన్ అజింక్య రహానే (4), పంత్ (5), సాహా (0), షమీ (0) టపటపా వికెట్లను పారేసుకున్నారు. దీంతో 14 పరుగుల వ్యవధిలోనే భారత్ 6 వికెట్లను కోల్పోయింది. అయితే పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బుమ్రా, సిరాజ్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా బుమ్రా ధాటిగా ఆడాడు. సదర్లాండ్ వేసిన బౌన్సర్‌ను హుక్ షాట్‌తో సిక్సర్‌గా తరలించిన అతను అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఆఖరి వికెట్‌కు 71 పరుగులు జోడించాక సిరాజ్ అవుటవ్వడంతో 200 పరుగులకు ముందే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ ‘ఎ’ విలవిల భారత్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ ‘ఎ’ జట్టులో ఎంతో సేపు నిలువలేదు. ఓపెనర్ బర్న్స్ (0)ను బుమ్రా... బెన్ మెక్‌డెర్మట్ (0)ను షమీ ఖాతానే తెరవనీయలేదు. మరో ఓపెనర్ హారిస్ (26; 4 ఫోర్లు) కాసేపు, కెప్టెన్ క్యారీ కాసేపు ఆడినా... వాళ్లిద్దరిని అవుట్ చేసేందుకు భారత సీమర్లకు ఎంతో సేపు పట్టలేదు. దీంతో 56 పరుగులకే ఐదు వికెట్లను... వందకంటే ముందే 9 వికెట్లను ఆతిథ్య జట్టు కోల్పోయింది. కోహ్లి దూరం 12 రోజుల వ్యవధిలో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఊహించిన విధంగానే ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. మ్యాచ్ ఆడకపోయినా...సిడ్నీ ప్రధాన స్టేడియం బయట నెట్స్‌లో కోహ్లి సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాడు. అనూహ్యంగా భారత్ నలుగురు పేసర్లతోనే ఆడింది. అయితే ఇందులో సీనియర్ ఉమేశ్ యాదవ్‌కు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) సదర్లాండ్ 40; మయాంక్ (సి) బర్న్స్ (బి) అబాట్ 2; శుబ్‌మన్ (సి) క్యారీ (బి) గ్రీన్ 43; విహారి (బి) విల్డర్మత్ 15; రహానే (సి) క్యారీ (బి) విల్డర్మత్ 4; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విల్డర్మత్ 5; సాహా (సి)సదర్లాండ్ (బి) అబాట్ 0; సైనీ (సి) మ్యాడిన్సన్ (బి) కాన్వే 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; బుమ్రా నాటౌట్ 55; సిరాజ్ (సి) హరిస్ (బి) స్వెప్సన్ 22; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (48.3 ఓవర్లలో ఆలౌట్) 194. వికెట్ల పతనం: 1–9, 2–72, 3–102, 4–102, 5–106, 6–111, 7–111, 8–116, 9–123, 10–194. బౌలింగ్: అబాట్ 12–6–46–3, కాన్వే 11–3–45–1, సదర్లాండ్ 9–0–54–1, గ్రీన్ 6.1–2–20–1, విల్డర్మత్ 8–4–13–3, స్వెప్సన్ 2.2–0–15–1. ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: హారిస్ (సి) శుబ్‌మన్ (బి) షమీ 26; బర్న్స్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మ్యాడిన్సన్ (సి) సాహా (బి) సిరాజ్ 19; మెక్‌డెర్మట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 0; క్యారీ (సి) పంత్ (బి) సైనీ 32; అబాట్ (సి) పంత్ (బి) షమీ 0; విల్డర్మత్ (సి) పంత్ (బి) బుమ్రా 12; సదర్లాండ్ (సి) శుబ్‌మన్ (బి) సైనీ 0; ప్యాట్రిక్ నాటౌట్ 7; స్వెప్సన్ (సి) సాహా (బి) సైనీ 1; కాన్వే రనౌట్ 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–6, 2–46, 3–46, 4–52, 5–56, 6–83, 7–84, 8–97, 9–99, 10–108. బౌలింగ్: షమీ 11–4–29–3; బుమ్రా 9–0–33–2, సిరాజ్ 7–1–26–1, సైనీ 5.2–0–19–3. గ్రీన్ దిమ్మదిరిగింది టెస్టు సిరీస్‌కు ముందు అసలే గాయాలతో సతమతమవుతున్న ఆసీస్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన బుమ్రా... ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ బుర్ర బద్దలయ్యే షాట్ ఆడాడు. గ్రీన్ బౌలింగ్‌లో బుమ్రా కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ తలకు బలంగా తగిలింది. దీంతో గ్రీన్ ఒక్కసారిగా పిచ్‌పైనే కూలబడ్డాడు. నాన్ స్ట్రయిక్‌లో ఉన్న సిరాజ్ పరుగును, బ్యాట్‌ను పక్కన పడేసి గ్రీన్ వద్దకు పరుగెత్తాడు. ఆసీస్ జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లి పరీక్షించింది. అతని స్థానంలో ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా బ్యాట్స్‌మన్ ప్యాట్రిక్ రోవ్‌ను బరిలోకి దిగాడు. -
వరల్డ్ బెస్ట్ టి20 బౌలర్ ‘బుమ్రా’
దుబాయ్: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బౌలర్ అని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ కితాబిచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అతని ఆటను చూడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. గురువారం జరిగిన క్వాలిఫయర్స్–1లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఇండియన్స్ చిత్తు చేయడంలో ట్రెంట్ బౌల్ట్ (2/9)తో కలిసి బుమ్రా (4/14) కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా బాండ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘బుమ్రా ఆట చూడటం గొప్ప గౌరవం. అతను ప్రపంచ అత్యుత్తమ టి20 బౌలర్. 2012 నుంచి బౌల్ట్ ఆటను ఆస్వాదిస్తున్నా. అతనో విధ్వంసక బౌలర్. టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు’ అని వీడియోలో పేర్కొన్నాడు. -
‘అర్జున’కు బుమ్రా, ధావన్!
న్యూఢిల్లీ: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నాడు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు బుమ్రా పేరును బీసీసీఐ నామినేట్ చేయనున్నట్లు సమాచారం. 2018లోనే బుమ్రా ఈ అవార్డు బరిలో నిలిచినా... సీనియారిటీ ప్రాతిపదికన రవీంద్ర జడేజా ‘అర్జున’ను కైవసం చేసుకున్నాడు. పురుషుల విభాగంలో ఒకరికంటే ఎక్కువ మంది పేర్లను నామినేట్ చేయాలని బీసీసీఐ అధికారులు భావిస్తే బుమ్రాతో పాటు సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు ఈ జాబితాలో చోటు దక్కే అవకాశముంది. రెండేళ్ల క్రితమే శిఖర్ ధావన్ పేరును బీసీసీఐ సిఫారసు చేసినప్పటికీ అవార్డుల కమిటీ మహిళల విభాగంలో స్మృతి మంధానకు మాత్రమే ఈ గౌరవాన్ని అందించింది. భారత్ తరఫున నాలుగేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న 26 ఏళ్ల బుమ్రా 14 టెస్టుల్లో 68 వికెట్లు, 64 వన్డేల్లో 104 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. ‘బుమ్రా కచ్చితంగా ఈ అవార్డుకు అర్హుడు. అతను ఐసీసీ నంబర్‌వన్ బౌలర్‌గానూ నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ గడ్డలపై ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు దక్కించుకున్న ఏకైక ఆసియా బౌలర్’ అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మహిళల విభాగానికొస్తే ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, పేసర్ శిఖా పాండే పేర్లను బోర్డు పరిశీలించే అవకాశముంది. -
ఆసీస్‌కు బూమ్రా, సైనీ హెచ్చరికలు..!
కీలకమైన ఆస్ట్రేలియాతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. బలమైన బ్యాటింగ్, బుల్లెట్‌లాంటి బౌలింగ్ దళంతో బరిలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే ఇటీవల పునరాగమనం చేసిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అందరి దృషి ఉంది. అతన్ని ఎదుర్కోవడం ఎంత కష్టమో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కీలకమైన ఆసీస్‌తో పోరుకు ముందు ఇండియన్ పేసర్లు బూమ్రా, నవదీప్ సైనీ బౌలింగ్‌కు మరింత పదును పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఆసీస్ ఆటగాళ్లను బోల్తా కొట్టించేందుకు పదునైన అస్త్రాలు సిద్ధంచేస్తున్నారు. వికెట్ల ముందు షు పెట్టి నెట్స్‌లో యార్కర్లు సాధన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇదికాస్తా వైరల్‌గా మారింది. (అసలు సమరానికి సై) ప్రత్యర్థికి హెచ్చరికలుగా.. బూమ్రా బుల్లెట్లు వస్తున్నాయాంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లను ఈ ద్వయం ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మూడు వన్డేల సిరీస్‌లో నేడు వాంఖడే మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. -
బుమ్రాకు ఎన్సీఏ షాక్..!
బుమ్రా ‘సొంత’ ఉత్సాహంపై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నీళ్లుచల్లింది. తనకు తానుగా చేసుకున్న పునరావాసంపై ఫిట్నెస్ టెస్టు నిర్వహించలేమని సూటిగా, సున్నితంగా చెప్పింది. తద్వారా ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా ఎన్సీఏనే పెద్దదిక్కని చెప్పకనే చెప్పింది. ముంబై: భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) షాక్ ఇచ్చింది. స్టార్ పేసర్‌కు ఫిట్నెస్ టెస్టు నిర్వహించలేమని సుతిమెత్తగా చెప్పింది. వెన్ను గాయం నుంచి కోలుకున్న అతను పునరాగమనం చేయాలంటే ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్టు పాస్ కావాల్సిందే. ఈ టెస్టు రిపోర్టు ఆధారంగానే సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటుంది. గాయం నుంచి కోలుకునేందుకు బుమ్రా అకాడమీని కాదని, తన పునరావాసాన్ని తను చూసుకోవడం తగదని... అతనెలా పురోగతి సాధించాడో తెలియకుండా, క్రమం తప్పకుండా సమీక్షించకుండా... ఉన్నపళంగా ఫిట్నెస్ టెస్టు నిర్వహించడం కుదరదని రాహుల్ ద్రవిడ్ డైరెక్టర్‌గా ఉన్న ఎన్సీఏ సున్నితంగా ఆ పేసర్‌కు చెప్పేసింది. ఇక బరిలోకి దిగడమే తరువాయి అనుకుని, ఇటీవల విశాఖపట్నంలో భారత జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో పాల్గొన్న బుమ్రాకిది ఊహించని పరిణామమే! నిజానికి బుమ్రాకు ఫిట్నెస్ పరీక్ష పెట్టేందుకు ఎన్సీఏ టీమిండియా ట్రెయినర్ నిక్ వెబ్‌ను బెంగళూరుకు పిలవాలనుకుంది. కానీ ఎక్కడైనా... ఎప్పుడైనా వ్యవస్థలో ఓ పద్ధతిని అనుసరించే ద్రవిడ్ బుమ్రా ‘సొంత’ తెలివితేటలపై గుర్రుగా ఉన్నాడు. అంతా బాగయ్యాక ఇక ఇక్కడెందుకు పరీక్షని భావించాడు. పేసర్‌కు టెస్టు నిర్వహించడం లేదని టీమిండియా అసిస్టెంట్ ట్రెయినర్ యోగేశ్ పర్మార్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై ద్రవిడ్ స్పందన తెలుసుకునేందుకు మీడియా ప్రయతి్నంచగా అతను అందుబాటులోకి రాలేదు. ఇటు బుమ్రా వివరణ కోరేందుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అసలేం చేయాలి... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాంట్రాక్టు ప్లేయర్ ఎవరైనా గాయపడితే ఎన్సీఏ పునరావాస శిబిరంలో పాల్గొనాల్సిందే. ఇక్కడ అకాడమీ డైరెక్టర్ నేతృత్వంలో అనుభవజ్ఞులైన ఫిజియో బృందం, వైద్య సిబ్బంది గాయపడిన ఆటగాడిని ఓ క్రమపద్ధతిలో బాగుచేస్తుంది. గాయాలకు గల కారణాలను విశ్లేషిస్తుంది. దీనివల్ల ఆ క్రికెటర్ మళ్లీ గాయపడకుండా ఎన్సీఏ బృందం సమష్టిగా చర్యలు తీసుకునే వీలుంటుంది. అంటే ఇక్కడ ఆ క్రికెటర్ కెరీర్ చాలా కాలం కొనసాగేందుకు అవసరమైన సూచనలు ఇస్తుంది. అతనేం చేశాడు... కానీ బుమ్రా గాయం నుంచి ఇప్పుడు బాగయ్యేదాకా అంతా సొంత టీమ్ సహకారంతోనే కోలుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తానొక బోర్డు కాంట్రాక్టు ఆటగాడినన్న సంగతే మరిచాడు. పూర్తిగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చెప్పినట్లు నడుచుకున్నాడు. వారు చెప్పినట్లుగా ఢిల్లీ క్యాపిటల్ ట్రెయినర్ రజనీకాంత్ శివజ్ఞానం ఆధ్వర్యంలో ముంబైలో శిక్షణ తీసుకున్నాడు. ఎన్సీఏ వర్గాలను సంప్రదించడం గానీ, సూచనలు పాటించడంగానీ ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్సీఏ చివరాఖరికి ఓ ఫిట్నెస్ టెస్టు పెట్టి పాస్ మార్క్‌లు వేస్తే, మళ్లీ అతని గాయం తిరగబెట్టినపుడు అప్పుడంతా ఎన్సీఏను, పునరావాస శిబిరం తీరుపై తప్పుబడతారనేది ద్రవిడ్ అభిప్రాయం. గాయాలకు ‘ఎన్సీఏ’ చికిత్స తప్పనిసరి: దాదా ‘అసలు ఏం జరిగిందో ద్రవిడ్‌ను అడిగి తెలుసుకుంటాను. సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకొని పరిష్కరిస్తా. నేను బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ద్రవిడ్‌తో ఎన్సీఏ విషయమై భేటీ అయ్యాను. కుర్రాళ్లను తీర్చిదిద్దే అంశంలో అకాడమీలో అతని పరిధిని కూడా పెంచాను. అయితే గాయాలకు ఎన్సీఏనే చికిత్స చేస్తుంది. పునరావాస శిబిరాలు ఎన్సీఏ ఆధ్వర్యంలోనే జరగాలి. భారత ఆటగాడు ఎవరైనా ఇదే పాటించాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... తన సహచరుడు ద్రవిడ్‌ను సమర్దించాడు. -
బుమ్రా వచ్చేశాడు
సాక్షి, విశాఖపట్నం: వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో ఒకే ఒక ఆటగాడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అయితే అతను జట్టు సభ్యుడు కాదు, ఈ మ్యాచ్‌కు బరిలోకి దిగడం లేదు! ఆ వ్యక్తి స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. వెన్ను గాయంతో కొంత కాలంగా జట్టుకు దూరమైన అతను తొలిసారి టీమిండియా సాధనలో భాగమయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో గత కొంత కాలంగా బుమ్రా సొంతంగా నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ వచ్చాడు. కానీ మొదటిసారి అతను ఒక సిరీస్ సందర్భంగా జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. మంగళవారం బుమ్రా బౌలింగ్‌ను కోచ్ రవిశాస్త్రి, సెలక్టర్ దేవాంగ్ గాంధీ పర్యవేక్షించారు. రిషభ్ పంత్, పాండే, మయాంక్‌లకు బుమ్రా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. బంతులు విసిరే సమయంలో ఏ రకంగానూ అతను ఇబ్బంది పడినట్లు కనిపించలేదు. బుమ్రా ఫిట్నెస్ స్థాయిని బట్టి చూస్తే త్వరలోనే అతను జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాడు పృథ్వీ షా కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యాడు. డోపింగ్ నిషేధం ముగిసిన తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగిన షా త్వరలోనే పునరాగమానాన్ని ఆశిస్తున్నాడు. తన ఫిట్‌నెస్‌కు సంబంధించి ట్రైనర్ నిక్ వెబ్‌తో ఎక్కువ సేపు అతను సంభా షించాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌తో కలిసి అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. మరోవైపు మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ కావడంతో భారత కెపె్టన్ కోహ్లి, వైస్ కెపె్టన్ రోహిత్, ఓపెనర్ రాహుల్ మాత్రం సాధనలో పాల్గొనలేదు. -
బలంగా తిరిగొస్తా: బుమ్రా
న్యూఢిల్లీ: అనూహ్య గాయంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా... బలంగా పునరాగమనం చేస్తానని అంటున్నాడు. వెన్నులో చీలిక కారణంగా బుమ్రా దాదాపు రెండు నెలలు క్రికెట్ ఆడలేని పరిస్థితిలో ఉన్నాడు. ‘గాయాలు ఆటలో భాగం. నేను కోలుకోవాలని సందేశాలు పంపిన అందరికీ ధన్యవాదాలు. ఈ ఎదురుదెబ్బను అధిగమించి బలంగా తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అని బుమ్రా ట్వీట్ చేశాడు. -
'వెన్ను'లో వణుకు
టీమిండియాకు కొత్త సమస్య...! చూచాయగా ఓ హెచ్చరిక...! వైవిధ్యం, వేగం కలబోతతో నిప్పులు చెరుగుతూ స్థిరంగా రాణిస్తున్న జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడు. దేశం ఏదైనా, పిచ్ ఎలాంటిదైనా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపుతూ క్రికెట్ మేధావుల నుంచి ప్రశంసలు పొందుతున్న అతడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. పైకి చెప్పకున్నా బుమ్రా గాయం తీవ్రంగా పెద్దగానే కనిపిస్తోంది. నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కూ కష్టమే అంటుండటమే దీనికి నిదర్శనం. ఈ రెండూ జరగబోయేది స్వదేశంలోనే కాబట్టి ఇప్పటికిప్పుడు ఇది పెద్ద సమస్య కాకున్నా... వెన్నెముక మీద తీవ్ర భారం పడే క్లిష్టమైన బౌలింగ్ శైలి రీత్యా బుమ్రా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందిని ప్రత్యేక దృష్టితో చూడాల్సిందే. కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగా చాలామంది పేసర్లు ఈ విధంగానే గాయాలకు గురై తర్వాత లయ తప్పారు. మరింత జాగ్రత్త పడకుంటే బుమ్రా విషయంలోనూ ఇలాగే జరిగే ప్రమాదం ఉంది. బహు పరాక్! న్యూఢిల్లీ: టీమిండియా నంబర్‌వన్ పేసర్ బుమ్రా ‘స్వదేశంలో తొలిసారి టెస్టు’ ఆడాలన్న స్వప్నం నెరవేర్చుకోవడానికి మరికొంత కాలం ఆగక తప్పడం లేదు. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం నుంచి ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లలో 12 టెస్టులాడిన ఈ పేసర్... అదే దక్షిణాఫ్రికాపై భారత్‌లో మొదటిసారి సుదీర్ఘ ఫార్మాట్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో అనూహ్యంగా వెన్ను గాయానికి గురయ్యాడు. వెన్నెముకలో స్వల్ప పగులు (స్ట్రెస్ ఫ్రాక్చర్)తో ఇబ్బంది పడుతున్న అతడిని సఫారీ సిరీస్ నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తప్పించింది. ‘తనపై మరింత భారం పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. బుమ్రా జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస శిబిరానికి వెళ్తాడు. అతడిని బోర్డు వైద్యుల బృందం పరీక్షిస్తుంది’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ఆటగాళ్లకు తరచూ నిర్వహించే స్కానింగ్ ద్వారా బుమ్రా సమస్య గురించి తెలిసినట్లు చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఉమేశ్ యాదవ్‌ను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు తొలుత ఉమేశ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా బోర్డు ఎలెవెన్ జట్టులో చోటిచ్చారు. గాయం పెద్దదే(నా) గతంలో మరో పేసర్ భువనేశ్వర్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయాల విషయంలో దాగుడుమూతలు ఆడిన బీసీసీఐ...ఇప్పుడూ అదే తీరున వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. బుమ్రా దాదాపు రెండు నెలలు పోటీ క్రికెట్ ఆడలేని పరిస్థితి ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మాత్రమే పాల్గొనడని చెబుతోంది. బోర్డులోని అధికార వర్గాల మాట మాత్రం భిన్నంగా ఉంది. బుమ్రా నవంబరు నెలలో జరిగే మూడు టి20లు, రెండు టెస్టుల బంగ్లాదేశ్ సిరీస్‌కూ కష్టమేనని ఓ అధికారి పేర్కొన్నారు. ‘వైద్య నివేదికల ప్రకారం చూస్తే జస్ప్రీత్ ఏడు నుంచి ఎనిమిది వారాలు... అంటే నవంబరు వరకు ఆట కు దూరం కావొచ్చు. వాస్తవానికి ముందుగానే గుర్తించినందుకు రెండు నెలలతో సరిపోయింది. లేకుంటే కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టేది’ అని ఆ అధికారి స్పష్టం చేశారు. దీన్నిబట్టి ఆటగాళ్ల గాయాలపై బోర్డు మళ్లీ తప్పుదోవ పట్టిస్తోందని అర్ధమవుతోంది. ఎంత జాగ్రత్త పడినా... భారత్‌లో జరుగబోతున్న సిరీస్ కాబట్టి బుమ్రా దూరమవడం కోహ్లి సేనకు పెద్దగా ఇబ్బంది కాదు. కానీ, గాయం నేపథ్యాన్ని బట్టి చూస్తే ఆటగాడిగా బుమ్రాకు, అతడిపై ఆధారపడుతున్న జట్టుకు ఓ హెచ్చరికే. 20 నెలల కాలంలోనే ప్రపంచంలోనే ప్రమాదకర బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ఈ పేసర్ 12 టెస్టుల్లో 62 వికెట్లు పడగొట్టి ఇప్పటికే అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయి చేరుకున్న భారతీయ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాల్గొన్న నాలుగు విదేశీ పర్యటనల్లోనూ ఒక ఇన్నింగ్స్‌లో ఐదేసి చొప్పున వికెట్లు తీసి ఔరా అనిపించాడు. గాయాల బెడద ఉండటంతో అతడిని టీమిండియా మేనేజ్మెంట్ అవసరమైన మేరకే ఆడిస్తూ జాగ్రత్త పడుతోంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి సాధ్యమైనంత విశ్రాంతి ఇస్తోంది. అయినా మరోసారి మైదానానికి దూరమై ప్రపంచ చాంపియన్íÙప్లో భాగమైన ఓ కీలక టెస్టు సిరీస్‌కు దూరం చేసింది. 2018లో ఐర్లాండ్‌తో టి20 సందర్భంగా బొటనవేలి గాయానికి గురైన బుమ్రా ఆ తర్వాత ఇంగ్లండ్‌తో రెండు టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. అంటే అటుఇటుగా ఏడాదిలో రెండుసార్లు గాయానికి గురైన అతడు నవంబరు నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ వరకు జట్టుకు సేవలందించలేడు. -
టెస్టుల్లో నా ముద్ర చూపించాలనుకున్నా!
ముంబై: టి20 స్పెషలిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత వన్డేల్లోనూ జస్ప్రీత్ బుమ్రా భారత కీలక బౌలర్‌గా ఎదిగాడు. అయితే టెస్టుల్లో అతను రాణించడంపై అందరికీ సందేహాలు ఉండేవి. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తొలిసారి ఎంపిక చేసినప్పుడు కూడా వెంటనే తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చని చాలా మంది భావించారు. కానీ కేప్‌టౌన్ టెస్టుతో అరంగేట్రం చేసిన అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు దేశాల్లో కూడా ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న బుమ్రా తన కెరీర్ ఆరంభంలో టెస్టులే తొలి ప్రాధాన్యతగా భావించేవాడినని చెప్పాడు. ‘కేవలం టి20లు, వన్డేలు మాత్రమే ఆడిన క్రికెటర్‌గా నేను మిగిలిపోదల్చుకోలేదు. నా దృష్టిలో టెస్టులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. టెస్టులు ఆడటం మాత్రమే కాదు, నాదైన ముద్ర చూపించాలని బలంగా భావించేవాడిని. నా ఫస్ట్‌క్లాస్ స్థాయి ప్రదర్శనను టెస్టుల్లో కూడా చూపగలనని నాపై నాకు నమ్మకముండేది. రెండేళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత సఫారీ గడ్డపై తొలి టెస్టు ఆడినప్పుడు నా కల నిజమైనట్లు అనిపించింది’ అని బుమ్రా చెప్పాడు. ఇప్పటి వరకు 12 టెస్టులే ఆడిన బుమ్రా 62 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 2 నుంచి జరిగే టెస్టు సిరీస్‌తో బుమ్రా తొలిసారి సొంతగడ్డపై బరిలోకి దిగబోతున్నాడు. ‘భారత్‌లో టెస్టులు ఆడటం ఒక కొత్త సవాల్‌వంటిది. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. సుదీర్ఘ కాలం రంజీ ట్రోఫీతో పాటు ఇతర టోరీ్నల్లో ఎర్రబంతితో క్రికెట్ ఆడాను కాబట్టి నాకు పిచ్‌లు, పరిస్థితులు కొత్త కాదు’ అని బుమ్రా విశ్లేషించాడు. ప్రముఖ మద్యం ఉత్పత్తి సంస్థ ‘రాయల్ స్టాగ్’కు బుమ్రా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. -
‘ధోని బెస్ట్ ఫినిషర్.. మరో రెండేళ్లు ఆడాలి’
ప్రపంచకప్‌లో స్లో బ్యాటింగ్ కారణంగా మిస్టర్ కూల్ ధోనిపై విమర్శల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాటోర్నీ తర్వాత ధోనీ ఆటకు స్వస్తి చెబుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ ధోనికి అండగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ తనే బెస్ట్ ఫినిషర్ అని కితాబిచ్చాడు. ధోని మరో రెండేళ్ల పాటు క్రికెట్లో కొనసాగాలని ఈ ఫాస్ట్ బౌలర్ ఆకాంక్షించాడు. ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు వచ్చే అవకాశమైతే లేదు గానీ.. యువ ఆటగాళ్లు అతడి ఆట నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. చదవండి : ఈ ఫొటో చూశాకైనా ధోనీ అంటే ఏంటో అర్థమైందా?! ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన సహచర ఆటగాడు, ముంబై ఇండియన్స్ యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాపై కూడా మలింగ ప్రశంసలు కురిపించాడు. ఆత్మవిశ్వాసం ఉండటమే బుమ్రా ప్రధాన బలమని.. ఈ కారణంగానే ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నాడని పేర్కొన్నాడు. ‘ నైపుణ్యం ఉన్న ఆటగాడు ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు. నైపుణ్యానికి... ఏ ప్రాంతంలో బంతులు విసరాలనే కచ్చితత్వం తోడైతే ప్రతీ బౌలర్ విజయవంతమవుతాడు. బుమ్రా కూడా అలాంటి వాడే. యార్కర్లు ఎవరైనా సంధించగలరు. కానీ దానిని అమలు చేసే విధానంలో తేడా ఉంటుంది. అలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాడు బుమ్రా. 2013లో తనను చూసినపుడు నేర్చుకోవాలనే కసి కనిపించింది. ఫలితంగా ఇప్పుడు ఓ స్టార్ బౌలర్‌గా ఎదిగాడు’ అని బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. చదవండి : కోహ్లి సేనకు ఇంగ్లండ్ గండం తప్పాలంటే... టీమిండియాకే అర్హత! ప్రపంచకప్ ట్రోఫీ సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయని మలింగ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి ఆటగాళ్లతో నిండి ఉన్న ప్రస్తుత జట్టు.. నాడు ధోని సారథ్యంలోని 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేస్తుందని జోస్యం చెప్పాడు. మెగాటోర్నీ అనంతరం బోర్డుతో మాట్లాడి.. 2020 టీ20 వరల్డ్ కప్‌నకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నానని తన భవిష్యత్ ప్రణాళికలను మలింగ వెల్లడించాడు. -
వీరి ఆట... మెరుపుల తోట
ప్రపంచ కప్ అంటేనే ఆయా జట్ల స్టార్ల సంగమం. తమ ఆటతో అదరగొట్టి... ఇమేజ్ను అమాంతం పెంచుకుని... దిగ్గజాలుగా పిలిపించుకునేందుకు వారికి ఇది ఓ అవకాశం. ఆనాటి కపిల్, ఇమ్రాన్ నుంచి మొన్నటి రణతుంగ, పాంటింగ్, నిన్నటి ధోని, క్లార్క్ వరకు ఇలా ఎదిగినవారే. ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణించినా, ముక్కోణపు టోర్నీల్లో అదరగొట్టినా, బహుళ దేశాల చాంపియన్‌షిప్‌లలో చెలరేగినా రాని పేరును ఈ కప్ ద్వారా కూడగట్టుకోవచ్చు. పనిలోపనిగా తమ దేశ హీరోలుగా చరిత్రలో నిలిచిపోవచ్చు. నాలుగేళ్లకోసారి వచ్చే ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే కప్‌లో తమ జట్ల భాగ్య రేఖను మార్చి రారాజుగా నిలిచేదెవరో మరి? విశ్వ సమ రంలో భారత్‌ను మూడోసారి విజేతగా నిలపాలని విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా... ఇంగ్లండ్‌కు తొలి కప్ అందించి చరిత్రకెక్కాలని జాస్ బట్లర్, బెన్ స్టోక్స్... దక్షిణాఫ్రికా కల ఈసారైనా నెరవేర్చాలని డికాక్, డు ప్లెసిస్... ఆస్ట్రేలియా పట్టు మరింత బిగించాలని స్మిత్, వార్నర్... ఇలా చెప్పుకొంటూ పోతే ప్రపంచ కప్‌లో తమ ముద్ర బలంగా వేసేందుకు ప్రతి జట్టు నుంచి ఇద్దరు, ముగ్గురు స్టార్లు తహతహలాడుతున్నారు. వీరిలో కొందరికి ఇప్పటికే కప్‌లో ఆడిన అనుభవం ఉండగా మరికొందరు తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దేశాలవారీగా పరిశీలిస్తే... భారత్: ఈ త్రయంపై ఎన్నో ఆశలు బ్యాటింగ్‌లో కోహ్లి, బౌలింగ్‌లో బుమ్రా, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా... మూడు విభాగాలకు మూల స్తంభాలైన వీరిపైనే ఈ కప్‌లో భారత్ భారమంతా వేసింది. కుర్రాడిగా ఉన్నప్పుడు కప్ గెలిచిన జట్టులో భాగస్వామి అయిన కోహ్లి కెప్టెన్‌గానూ ఆ ఘనత సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కెప్టెన్‌కు హార్దిక్ హిట్టింగ్ తోడైతే స్కోరు పైపైకి వెళ్తుంది. ఐదో బౌలర్‌గానూ ఇతడు ఓ చేయి వేస్తాడు. తర్వాత 140 కి.మీ. పైగా వేగం, పదునైన పేస్‌తో బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పని పడతాడు. తొలిసారి ప్రపంచ కప్ ఆడబోతున్న వీరిద్దరూ ఇటీవల ఐపీఎల్లో అదరగొట్టారు. ఇంగ్లండ్: కల నెరవేరుస్తారని... ఎన్నోసార్లు అందినట్లే అంది చేజారిన కప్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ ఈసారి చాలా ఆశలే పెట్టుకుంది. జట్టంతా బలంగా ఉన్నా... ముఖ్యంగా ఓపెనర్ జేసన్ రాయ్, కీపర్ బట్లర్, ఆల్‌రౌండర్ స్టోక్స్ ఈ కల నెరవేరుస్తారని భావిస్తోంది. రాయ్, బట్లర్ విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అద్భుతమైన ఫామ్‌లోనూ ఉన్నారు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా స్టోక్స్ పాత్ర మరింత కీలకం. సొంతగడ్డ అనుకూలతను సద్వినియోగం చేసుకుంటూ వీరు రెచ్చిపోతే... ఇంగ్లండ్ జగజ్జేత కావడం ఖాయం . ఆస్ట్రేలియా: మచ్చ చెరిపేసుకోవాలని బాల్ ట్యాంపరింగ్‌తో వ్యక్తిగతంగా, ఆటపరంగా చాలా నష్టపోయారు వార్నర్, స్మిత్. సీనియర్లు ఫించ్, ఖాజా, మార్‡్ష, జూనియర్లు హ్యాండ్స్కోంబ్, టర్నర్ల మధ్య జట్టులో చోటు నిలబెట్టుకోవడానికి, ట్యాంపరింగ్ మచ్చను చెరిపేసుకోవడానికి వీరికిది సువర్ణావకాశం. దూకుడుగా ఆడే వార్నర్ ఐపీఎల్‌తో ఫామ్‌ను చాటుకోగా, స్థిరంగా రాణించే స్మిత్ కివీస్‌తో సన్నాహక మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నాడు. పేస్ గుర్రం కమిన్స్ ఈ కప్‌లో గమనించదగ్గ ఆటగాడు. స్వింగ్‌తో పాటు వేగంతో అతడు భారత పర్యటనలో మెరిశాడు. న్యూజిలాండ్: వీరి తరం అవుతుందా? కప్ గెలిచేంత స్థాయి లేకున్నా... గట్టి పోటీ ఇచ్చే జట్టు న్యూజిలాండ్. అలాంటి కివీస్‌కు ఏ పిచ్‌పైనైనా పరుగులు సాధించే కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ పెద్ద దిక్కు. ఫామ్ కొంత కలవరపరుస్తున్నా, ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్ అయిన వారికి అదేమంత ఇబ్బంది కాబోదు. ఈ ఇద్దరు ఎంత బాధ్యతగా ఆడితే కివీస్ అంత బలంగా ఉంటుంది. పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా సత్తా ఉన్నవాడే. ఎడంచేతి వాటం కావడంతో అతడిని ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా: ఈ నలుగురు ప్రపంచ కప్‌లో దురదృష్టం వెంటాడే దక్షిణాఫ్రికా పెద్ద స్టార్లంటూ ఎవరూ లేకుండా ఈసారి బరిలో దిగుతోంది. ఆమ్లా, తాహిర్, మిల్లర్ వంటివారున్నా... కెప్టెన్ డు ప్లెసిస్, బ్యాట్స్‌మన్ డికాక్, పేసర్లు స్టెయిన్, రబడల పైనే ఎక్కువ అంచనాలున్నాయి. ఐపీఎల్లో అదరగొట్టిన డికాక్, డు ప్లెసిస్ ఫామ్ చాటుకున్నారు. గాయం బెడద లేకుంటే.... వేగం, కచ్చితమైన యార్కర్లు వేసే రబడను ఎదుర్కొనడం ప్రత్యర్థులకు సవాలే. ఐపీఎల్ లీగ్ దశ వరకే 25 వికెట్లు పడగొట్టాడు ఈ యువ బౌలర్. మిగతా జట్టు నుంచి ప్రోత్సాహం ఉంటే ఈ నలుగురు దక్షిణాఫ్రికాను మెరుగైన స్థితిలో నిలపగలరు. పాకిస్తాన్: నవతరం ప్రతాపం ఎంత అద్భుతంగా ఆడగలదో అంత అధ్వానమైన ప్రదర్శనా చేయగలదు పాక్. కాబట్టి ప్రపంచ కప్ సాధించలేదని కూడా చెప్పలేం. ఈ ప్రయాణంలో విజయవంతం కావాలంటే ఓపెనర్ ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్, పేసర్ ఆమిర్ విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లండ్ వాతావరణానికి అలవాటైన జమాన్, ఆజమ్ భారీగా పరుగులు సాధిస్తూ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటున్నారు. తొలుత జట్టులో చోటివ్వకున్నా... ఆమిర్ లేని తమ బౌలింగ్ ఎంత పేలవమో గుర్తించిన పాక్ తక్షణమే పిలిపించింది. ఇదే అతడి ప్రత్యేకత ఏమిటో చెబుతోంది. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆమిర్ స్వింగ్ ప్రతాపం 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కళ్లకు కట్టింది. శ్రీలంక: ఎవరో ఒకరు.. మాజీ చాంపియన్, రెండుసార్లు వరుసగా ఫైనల్ చేరిన ఘనత ఉన్న శ్రీలంక... తమ కాబోయే స్టార్‌ను ఈ ప్రపంచ కప్‌లో వెతుక్కోనుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా ఎవరి ఫామ్ మీద నమ్మకం లేని పరిస్థితి. మంచి ఫామ్‌లో ఉంటే మాజీ కెప్టెన్, నాణ్యమైన ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ గురించి ఇక్కడ చెప్పుకోనే వీలుండేది. యువ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్ కాస్తోకూస్తో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ప్రధాన పేసర్ లసిత్ మలింగ, పెరీరా ద్వయం తిసారా, కుశాల్లపై నమ్మకం పెట్టుకోవచ్చు. పేలనున్న అఫ్గాన్స్... టి20 లీగ్‌లలో అదరగొడుతున్న అఫ్గానిస్తాన్ కుర్రాళ్లకు ఈ ప్రపంచ కప్ ఓ సువర్ణావకాశం. ముఖ్యంగా తాము ప్రపంచ శ్రేణి బౌలర్లమని చాటుకునేందుకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్లకు. ధాటిగా ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ షెహజాద్ ఎంతవరకు మెరుస్తాడో చూడాలి. రౌండ్ రాబిన్ లీగ్ కాబట్టి... అఫ్గాన్ నుంచి కనీసం ఒకరైనా పరుగులు లేదా వికెట్ల గణాంకాల పట్టికలోకి ఎక్కే వీలుంది. విండీస్: స్వర్ణయుగానికి ప్రయత్నం ఏ రోజైనా విరుచుకుపడే క్రిస్ గేల్, ఆఖర్లో ఊడ్చిపెట్టేసే ఆండ్రీ రసెల్, దూకుడైన యువ హెట్‌మైర్... ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ పైనే వెస్టిండీస్ ప్రపంచ కప్ ప్రస్థానం ఆధారపడి ఉంది. చివరి ప్రపంచ కప్ ఆడుతున్న గేల్ పట్టుదలతో నిలిస్తే ప్రత్యర్థులకు వణుకే. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్ గేల్‌లో ఇంకా వన్డేలు ఆడగల సత్తా ఉందని చాటింది. రసెల్... గత కప్‌లో కొంత మెరిసినా అదంతగా వెలుగులోకి రాలేదు. ఈసారి మరింత రాటుదేలిన అతడు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హెట్‌మైర్‌కు ఈ కప్ సువర్ణావకాశం. ఎంతైనా బౌలింగ్ బలం తోడైతేనే వీరి మెరుపులకు అర్థం ఉంటుంది. బంగ్లాదేశ్: భళా అనిపించేదెవరో! సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్, షకీబుల్ హసన్... ఇలా జట్టులో పలు ప్రపంచ కప్‌లు ఆడిన వారున్నా, ఇంతవరకు ఎవరూ పెద్ద స్టార్ కాలేకపోయారు. ఈసారి యువ బ్యాట్స్‌మెన్ షబ్బీర్ రెహ్మాన్, మొసద్దిక్ హుస్సేన్‌లపై ఓ కన్నేసి ఉంచొచ్చు. సీనియర్ల దన్నుతో వీరు రాణించే వీలుంది. గాడిన పడితే... పేసర్ ముస్తాఫిజుర్ ప్రమాదకారి అనడంలో సందేహం లేదు. -
‘వీసాలు చూపించండి.. అతనో పనికిరాని వ్యక్తి’
ఆసీస్ క్రికెటర్లకే కాదు ఆ దేశానికి చెందిన క్రికెట్ అభిమానులకు కూడా నోటి దురుసు ఎక్కువేనని మరోసారి రుజువైంది. భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆతిథ్య జట్టు పతనాన్నిశాసించి.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోపే అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఉన్న భారత అభిమానులు, ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడాన్ని ఓర్చుకోలేని ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకారంతో రెచ్చిపోయారు. ‘ మీ వీసాలు చూపించండి.. మీ కెప్టెన్ ఓ పనికిరాని వ్యక్తి’ అంటూ టీజ్ చేశారు. బాక్సింగ్ డే టెస్టు మొదలైన నాటి నుంచి వీరు ఇలాగే ప్రవర్తిసున్న నేపథ్యంలో... వారి మాటలను రికార్డు చేసిన ‘ఈఎస్పీన్క్రిక్ఇన్ఫో’ ... ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు ఫిర్యాదు చేసింది. వీటిని రుజువు చేసేందుకు ఇందుకు సంబంధించిన వీడియోను కూడా జత చేసింది.(పంత్‌పై నోరుపారేసుకున్న టిమ్ పైన్) ఈ విషయంపై స్పందించిన సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ క్రికెట్ ఆస్ట్రేలియా జాత్యహంకార చర్యలను, వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించదు. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు, అభిమానులు, సిబ్బంది ఇలా ఎవరినైనా సరే ఇలాంటి పిచ్చి చేష్టలతో బాధపెడితే సహించబోము. ఈ విషయం గురించి బాధితులు అక్కడున్న భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు. విక్టోరియా పోలీసులు ఎంసీజీ వద్ద సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన వారిని పోలీసులు బయటికి పంపించి వేశారు కూడా’ అని సమాధానమిచ్చారు. ఇలాంటి చర్యలు శ్రుతిమించితే వాళ్లు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అభిమానులపై సీఏ చర్యలు తీసుకోవడం బాగుంది... కానీ కవ్వింపు చర్యలతో భారత క్రికెటర్ల ఏకాగ్రతను దెబ్బతీసే వారి ఆటగాళ్లను మాత్రం అదుపు చేయలేదు ఎందుకో అంటూ టీమిండియా అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
‘బూమ్’లా దూసుకొచ్చి...
జొహన్నెస్‌బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు... నాటింగ్‌హామ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు... అడిలైడ్ టెస్టులో ఆరు కీలక వికెట్లు... ఈ ఏడాది భారత జట్టు విదేశీ గడ్డపై సాధించిన మూడు టెస్టు విజయాల్లో కూడా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఆడింది ఏడు టెస్టులే... కానీ అతను చూపించిన ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ఆడిన ప్రతీ టెస్టులో కనీసం మూడు వికెట్లయినా తీసిన బుమ్రా ఇప్పటి వరకు 24.44 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో, ముఖ్యంగా ఐపీఎల్లో యార్కర్ స్పెషలిస్ట్‌గానే ఆరంభంలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బౌలర్ అమిత వేగంగా టెస్టు బౌలర్‌గా పరిణతి సాధించాడు. అతని వైవిధ్యమైన శైలికి వేగం కూడా తోడవడంతో బుమ్రా ప్రమాద కరంగా మారిపోయాడు. ఇలాంటి బౌలర్ తమ జట్టులో కూడా ఉంటే బాగుండేదని అన్ని జట్లు కోరుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. సాక్షి క్రీడా విభాగం: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా 153.26 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. ఈ మ్యాచ్‌లో అన్నింటికంటే వేగవంతమైన బంతి ఇదే. అటువైపు స్టార్క్, కమిన్స్‌లాంటి మెరుపు వీరులకు కూడా సాధ్యం కానిది అతను చేసి చూపించాడు. అంతకు కొద్దిసేపు ముందు కూడా 144.8 నుంచి 148.7 కిలోమీటర్ల మధ్య అతను నిలకడగా బంతులు వేశాడు. మ్యాచ్‌లో అతని సగటు వేగం 146 కావడం గమనార్హం. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న షాన్ మార్‡్షను రెండు ఓవర్ల పాటు కేవలం వేగంతో ఆడుకున్న తీరు అసాధారణం. ఆ తర్వాత అద్భుతమైన ఔట్ స్వింగర్‌తో అతడిని ఔట్ చేసి విజయానికి బుమ్రా బాటలు పరిచాడు. అనంతరం పైన్, కమిన్స్‌లను కూడా బుమ్రానే పెవిలియన్ పంపించడంతో గెలుపు దాదాపుగా ఖాయమైంది. చిన్నపాటి రనప్‌తోనే బుమ్రా అంత వేగం రాబడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన నాటి నుంచి ప్రతీ దశలో నేర్చుకుంటూ ఆటను మెరుగుపర్చుకుంటున్న ఈ గుజరాతీకి ఏ సవాల్ కూడా పెద్దదిగా అనిపించడం లేదు. ఐపీఎల్‌తో దూసుకొచ్చి... 2013 ఐపీఎల్లో తన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సహా మూడు వికెట్లు తీసినప్పుడు ముంబై ఇండియన్స్ ‘కొత్త స్టార్ ఉదయించాడు’ అని వ్యాఖ్య పెట్టింది. అయితే ఎవరూ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఐపీఎల్ ప్రవాహంలో వేగంగా దూసుకొచ్చి అంతే వేగంగా కనుమరుగైపోయే అనేక మంది ఆటగాళ్లలో ఒకడిగా ఇతనూ చేరతాడని అంతా భావించారు. అంతకు ముందే ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్నా, గుజరాత్ తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించినా అతడిపై ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. అయితే 2016 ఆరంభంలో భారత టి20 జట్టులోకి ఎంపికై, అనుకోకుండా వన్డే మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కించుకున్న బుమ్రాకు మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రధాన బౌలర్‌గా అతను భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆరంభ ఓవర్లలో, డెత్ స్పెషలిస్ట్‌గా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ తీయాలంటే అది బుమ్రాకే చెల్లింది. జోరు కొనసాగింది... సంప్రదాయానికి భిన్నమైన బౌలింగ్ శైలి, బుమ్రా బంతిని వదిలే తీరు బ్యాట్స్‌మెన్‌ను గందరగోళంలో పడేస్తాయి. సాధారణంగా బౌలర్ బంతి గ్రిప్‌ను బట్టి అది ఎలాంటి బంతో అంచనా వేయగల మేటి ఆటగాళ్లు కూడా అతని బౌలింగ్‌లో ఇబ్బంది పడిపోతున్నారు. కచ్చితమైన యార్కర్లకు తోడు ప్రధానంగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించడం బుమ్రా ప్రత్యేకత. తెలివైన బౌలింగ్‌కు తోడు ఇప్పుడు వేగం కూడా వచ్చి చేరడంతో అతని అమ్ములపొదిలో అస్త్రాలు పెరిగిపోయాయి. సఫారీ సిరీస్ తర్వాత గాయంతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన బుమ్రా నాటింగ్హామ్కు రాగానే తన ప్రభావం చూపించాడు. అతని బౌలింగ్‌ను ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడి ఒత్తిడికి గురైన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగుల భారీ ఆధిక్యం సమర్పించుకొని ఓటమిని ఆహ్వానించింది. ఇంగ్లండ్‌లో పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్న అతను తర్వాతి రెండు టెస్టుల్లో కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి తన ముద్రను ప్రదర్శించాడు. సవాల్ విసురుతూ... బుమ్రాను టెస్టులకు ఎంపిక చేయడం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. కొన్నిసార్లు స్కోరు బోర్డులో వికెట్ల సంఖ్య వద్ద అతని పేరు కనిపించకపోయినా అతను జట్టుకు చేకూరుస్తున్న విలువ అమూల్యం. ఒక విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఎదురుగా ఉంటే ప్రత్యర్థి బౌలర్లు ఎలా భయపడతారో... బుమ్రా బంతిని ఆడేందుకు కూడా బ్యాట్స్‌మెన్ అదే తరహాలో తడబడుతున్నారు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చినా బుమ్రాపై సిరీస్‌కు ముందు భారీ అంచనాలే ఉన్నాయి. అడిలైడ్‌లో అతను తనేమిటో చూపించాడు. ఇప్పుడు పేసర్లకు స్వర్గధామమైన పెర్త్‌లో కూడా అతను మరింత ప్రమాదకారి కాగలడు. ఇప్పటి వరకు చేసిన ప్రదర్శనను బట్టి చూస్తే భారత అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా నిలిచే సత్తా బుమ్రాకు ఉందని ఖాయంగా చెప్పవచ్చు. అనూహ్యపిలుపుతో... నలుగురు రెగ్యులర్ పేస్ బౌలర్లు జట్టులో ఉండగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేయడమే ఆశ్చర్యం కలిగించింది. అప్పటి వరకు 26 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో బుమ్రా 89 వికెట్లు తీశాడు. ఇది అద్భుత ప్రదర్శన ఏమీ కాదు. ఎర్ర బంతితో క్రికెట్ ఆడి అతను సంవత్సరమైంది. అయినా అనుభవం కోసం తీసుకెళుతున్నారు తప్ప ఆడించకపోవచ్చని కూడా వినిపించింది. కానీ ప్రత్యర్థిని ఆశ్చర్యపరిచేందుకు కేప్‌టౌన్ టెస్టులో బుమ్రా అనే కొత్త ఆయుధాన్ని కోహ్లి బయటకు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒక వికెట్ తీసినా అది అద్భుతమైన బంతితో డివిలియర్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసింది కావడం విశేషం! భారత్‌లోని పిచ్‌లపై వేసినట్లు సరైన ‘లెంగ్త్’ కుదరక ఇబ్బంది పడ్డాడు. అయితే తప్పుల నుంచి తొందరగా పాఠాలు నేర్చుకుంటాడని జట్టులో అతనికి మంచి పేరుంది. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకున్న బుమ్రా వరుస ఓవర్లో రెండు అద్భుత బంతులతో డు ప్లెసిస్, డి కాక్‌లను ఔట్ చేశాడు. ఈసారి కూడా తెలివైన బంతితో డివిలియర్స్‌ను బోల్తా కొట్టించగలిగిన తనపై సెలక్టర్లు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. జొహ న్నెస్‌బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను తీసిన ఐదు వికెట్లతోనే భారత్‌కు ఆధిక్యం దక్కింది. -
భువీ, బుమ్రా వచ్చేశారు
న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలింగ్ ప్రధాన అస్త్రాలైన భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా వెస్టిండీస్‌తో జరుగనున్న మిగతా మూడు వన్డేలకు జట్టులోకి వచ్చారు. సెలక్షన్ కమిటీ గురువారం జట్టును ప్రకటించింది. ఇందులో ఉమేశ్ యాదవ్ చోటు కాపాడుకోగా... మొహమ్మద్ షమీని తప్పించారు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టును యథాతథం గా కొనసాగించారు. గాయం నుంచి కోలుకున్నా కేదార్ జాదవ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. మొదటి రెండు వన్డేలకు భువీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. జాదవ్‌కు చోటు లేదు! ప్రస్తుత సిరీస్‌లో అనుకూల పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ చెలరేగుతుండటంతో ఇరు జట్ల బౌలర్లు చేసేదేమీ లేకపోతోంది. ముఖ్యంగా హిట్టింగ్‌కు పేరుగాంచిన విండీస్ బ్యాట్స్‌మెన్‌ను మన పేసర్లు, స్పిన్నర్లు అనుకున్నంతగా కట్టడి చేయలేకపోతున్నారు. రెండు వన్డేల్లో కలిపి ఉమేశ్ 142, షమీ 140 పరుగులిచ్చారు. అయితే, తొలి మ్యాచ్‌లో విఫలమైన షమీ... విశాఖపట్నంలో మెరుగ్గా (1/59) బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లలో యార్కర్లతో పరుగులు నిరోధించాడు. ఈ విషయంలో ఉమేశ్ కంటే మెరుగైన షమీని తప్పించడం ఆశ్చర్యకరంగా ఉంది. మరోవైపు బౌలింగ్ ఇలాగే ఉంటే వన్డే సిరీస్ నెగ్గడం కష్టమని భావించారో, ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టు కుని పూర్తి స్థాయి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అనుకున్నారో కాని భువీ, బుమ్రాల విశ్రాంతిని ముగించారు. ఇక, ఫిట్నెస్ సంతరించుకుని గురువారం దేవధర్ ట్రోఫీలో భారత్ ‘ఎ’ తరఫున బ్యాట్‌తో రాణించి, ఐదు ఓవర్లు కూడా వేసిన జాదవ్‌ను తీసుకోకపోవడమూ కొంత చర్చకు తావిచ్చింది. నన్నెందుకు తీసుకోలేదో?: జాదవ్ విండీస్‌తో తదుపరి మూడు వన్డేలకు ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ నుంచి తనకెలాంటి సమాచారం లేదని ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. ఢిల్లీలో దేవధర్ ట్రోఫీ ఆడుతోన్న అతడిని... టీమిండియాలోకి తీసుకోకపోవడం గురించి మీడియా అడగ్గా ‘ఈ విషయం మీ ద్వారా ఇప్పుడే తెలిసింది. నన్నెందుకు ఎంపిక చేయలేదో ఆలోచించాల్సి ఉంది. జట్టుతో లేను కాబట్టి వారి ప్రణాళికలేమిటో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించాడు. తాను పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నట్లు తెలిపాడు. గాయాల నుంచి కోలుకున్నట్లు ఎన్సీఏ ప్రకటిస్తేనే ఏ టోర్నీ అయినా ఆడిస్తారని అన్నాడు. గురువారం భారత్ ‘ఎ’ తరఫున ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ ఆడిన జాదవ్... 25 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ను ముగ్గురు జాతీయ సెలక్టర్లు వీక్షించడం గమనార్హం. కేదార్ జాదవ్ గాయాల చరిత్రే కారణం: ఎమ్మెస్కే కేదార్ జాదవ్‌ను టీమిండియాలోకి తీసుకోకపోవడానికి అతడి గాయాల చరిత్రే కారణమని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ‘గతంలో కోలుకొని జట్టులోకి వచ్చిన వెంటనే జాదవ్ గాయాలకు గురయ్యాడు. ఇటీవల ఆసియా కప్‌లో కూడా అదే జరిగింది. దీంతో పాటు దేవధర్ ట్రోఫీలో భారత్ ‘ఎ’ గురువారం నెగ్గి ఉంటే... అతడికి ఫైనల్ రూపంలో మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉండేది. అప్పుడు తన ఫిట్‌నెస్‌పై మేం పూర్తి భరోసాకు వచ్చేవాళ్లం. నాలుగో వన్డేకు భారత జట్టులోకి అదనపు ఆటగాడిగా తీసుకునేవాళ్లమేమో. జట్టు ఎంపిక సందర్భంగా మేం ఓ పద్ధతి అనుసరిస్తున్న తీరును ఆటగాళ్లు అర్థం చేసుకోవాలి’ అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.