joinings
-
సీఎం జగన్ సమక్షంలో భారీగా చేరికలు (ఫొటోలు)
-
గుంటూరు వెస్ట్‌లో టీడీపీకి భారీ షాక్
కాకినాడ,సాక్షి: ఎన్నికల వేళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్జగన్ మోహన్‌రెడ్డి వారందరినీ ఆప్యాయంగా పలుకరించి, కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం మేమంతా సిద్ధం బస్సు యాత్ర నైట్ స్టే పాయింట్ వద్ద చేరికల కార్యక్రమం జరిగింది. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో మాజీ కార్పొరేటర్ ఎస్.కెసైదా, మొండి బండ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ, టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మాధవయాదవ్ తదితరులున్నారు. ఇదీ చదవండి.. మేమంతా సిద్ధం.. 18వ రోజు సీఎంజగన్‌కు ఘన స్వాగతం -
సీఎం జగన్ సమక్షంలో YSRCPలోకి కీలక చేరికలు
సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ.. అభివృద్ధి మంత్రం వైపు పలు పార్టీ నేతలు ఆకర్షితులవుతున్నారు. గత కొన్నాళ్లుగా ప్రతిపక్షాలకు షాక్ తగిలేలా.. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి కేడర్ మొదలు.. మాజీ మంత్రులు, కీలక నేతల దాకా అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా.. ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్డీ కండువా కప్పుకున్నారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నేతలు సైతం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని), వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ళగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్ రెడ్డి. కిషోర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ… pic.twitter.com/fktBuN4W2R — YSR Congress Party (@YSRCParty) March 4, 2024 ‘‘భూమా అఖిల ప్రియ ఓ క్రిమినల్. ఆమె.. ఆమె భర్త కలిసి కిడ్నాప్‌లు, దొంగ తనాలు, కబ్జాలు చేస్తున్నారు. అలాంటి అరాచక వాదులు గెలవకూడదు అని వై ఎస్సార్ కాంగ్రెస్ లో చేరాను. ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. గంగుల నానిని గెలిపించడం కోసం భూమా కుటుంబం పనిచేస్తుంది. భూమా కుటుంబ మొత్తం అఖిల ప్రియకి వ్యతిరేకంగా పనిచేస్తాం. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరాను. ఏపీలో బీజేపీ నాయకులు టీడీపీ ఇచ్చే సీట్ల కోసం ఎదురు చూస్తున్నారేగానీ.. నేతల, కార్యకర్తల మనోభావాలను పట్టించుకోవడం లేదు’’ భూమా కిషోర్ అన్నారు. వైఎస్సార్సీపీలోకి ఏపీసీపీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ సీఎం జగన్ సమంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పీవీ మిథున్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు
-
పరిటాల ఫ్యామిలీకి ఎదురుదెబ్బ..ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీలోకి భారీ చేరికలు
-
చేరికలపై దూకుడు.. టీ కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్..
సాక్షి, హైదరాబాద్: చేరికలపై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడానికి టీ కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ చేరికలను కాంగ్రెస్ నేతలతో కాకుండా న్యూట్రల్ పర్సన్స్‌తో ఆపరేషన్ ఆకర్షగా కంప్లీట్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. వరంగల్ మోదీ సభ రోజే ఒకరిద్దరు కీలక నేతలను చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ చేసింది. ప్రియాంక హాజరుకానున్న సభలో మరికొందరు కీలక నేతలను చేర్చుకునే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. యెన్నంశ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్‌రావు, ఖాజీపేట లింగయ్య, పవన్‌కుమార్‌రెడ్డి, రమేష్ రాథోడ్, రవీంద్రనాయక్, తీగల కృష్ణారెడ్డిలతో మంతనాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ నేతలు కలుసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడంపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డికి ఘర్ వాపసిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు. చదవండి: సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ! కాగా, అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలు సమయం ఉండగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. రాజకీయ వర్గాలు ముందుగా ఊహించినట్టుగానే ఖమ్మం గడ్డపై నుంచి ఆ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ జనం నడుమ ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ ఎన్నికల ప్రచార సభను తలపించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు జోరు
-
జానారెడ్డి ఎక్కడ?.. ఆ కమిటీ ఉన్నట్లా? లేనట్లా?
తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. టీ.కాంగ్రెస్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చిందా? రాలేదా? పార్టీల మధ్య జంపింగ్‌లు భారీగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి టీ.కాంగ్రెస్ చేరికల కమిటీ ఉన్నట్లా? లేనట్లా? చేరికల కమిటీ ఛైర్మన్ జానారెడ్డి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్నవారితో చర్చిస్తున్నారా? కొత్తవారిని పట్టించుకోవడం మానేశారా? ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీల మధ్య కుండమార్పిళ్ళు సహజమే. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి కప్పగెంతులు భారీగానే జరుగుతుంటాయి. అందుకే ప్రతి పార్టీలోనూ చేరికల కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ బాధ్యతను పార్టీలో ఒక సీనియర్‌కు అప్పగిస్తారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరైనా కాంగ్రెస్‌లో చేరాలంటే ఈ కమిటీయే తుది నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో చేరదామనుకుంటున్నవారితో చర్చించి ఫైనల్ చేస్తుంది. ఇటువంటి కీలకమైన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న జానారెడ్డి ఇంతవరకు సమావేశమే ఏర్పాటు చేయలేదు. కమిటీ ఏర్పాటయ్యాక కొత్తవారు ఎవరూ కాంగ్రెస్‌లో చేరింది లేదు. ఎవరితోనూ కమిటీ చర్చించిందీ లేదు. పెద్దలు జానారెడ్డి చేరికల కమిటీ ఉనికినే ప్రశ్నార్థకం చేయడంతో..అసలు ఈ కమిటీ ఉందా లేదా అని గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌లోకి వద్దామని ఎవరైనా అనుకుంటే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనో.. లేక సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోనో చర్చిస్తున్నారు గాని.. జానారెడ్డిని ఎవరూ పట్టించుకోవడంలేదు. మరోవైపు చేరికల కమిటీకి పీసీసీ నేతలే విలువ ఇవ్వడంలేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు చేరికల కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇతర పార్టీ నేతలను ఆకర్షించడంలో ఫెయిలయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో చర్చించి కాంగ్రెస్‌లోకి తీసుకురావడం చేరికల కమిటీ పని. కానీ జానారెడ్డి ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే చేయలేదనే అభిప్రాయాలు కాంగ్రెస్‌లోనే వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు బీజేపీ చేరికల కమిటీ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలోకి నేతలను ఆహ్వానిస్తుంటే.. టీ కాంగ్రెస్ చేరికల కమిటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదనే అసహనం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్నుంచి సస్పెండైన సీనియర్ నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కొద్దిరోజులుగా చౌరస్తాలో నిలబడి ఏ పార్టీలో చేరాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇలాంటి సమయంలో వారితో సంప్రదింపులు జరపాల్సిన చేరికల కమిటీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. పార్టీలో చేరాలనుకునే వారు కావాలంటే తమ దగ్గరకే వస్తారు..తాము ఇంకొకరి దగ్గరికి వెళ్ళేది ఏంటనే ధోరణిలో టీ కాంగ్రెస్ చేరికల కమిటీ వ్యవహరిస్తోంది. గాంధీభవన్ నేతల తీరుతో పార్టీలో చేరాలనుకునే వారు కూడా కాంగ్రెస్ పట్ల విముఖత చూపుతున్నారు. గతంలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న సమయంలో కూడా చేరికల కమిటీ సకాలంలో రియాక్ట్ కాకపోవడం వల్లే ఈటల బీజేపీలోకి వెళ్ళారనే విమర్శ ఉంది. చదవండి: ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ ఇక్కడి నుంచేనా..? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా చేరికల కమిటీ యాక్టీవ్ గా పనిచేయాలని సూచిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన జానారెడ్డి చేరికల కమిటీని యాక్టివ్ చేయాలని కోరుతున్నారు. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో వారి ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు జరపాలని.. లేదంటే పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రారని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
EPFO: డిసెంబర్లో కార్యాలయాల కళకళ..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డిసెంబర్ 2022లో 14.93 లక్షల మంది కొత్త సభ్యత్వం నమోదయ్యింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 2 శాతం (32,635 మంది) అధికమని కార్మిక మంత్రిత్వశాఖ 2022 డిసెంబర్‌కు సంబంధించి విడుదల చేసిన (తొలి) గణాంకాలు పేర్కొన్నాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఈపీఎఫ్ఓలో చేరిన 14.93 లక్షల మందిలో దాదాపు 8.02 లక్షల మంది కొత్త ఉద్యోగులు. వీరు మొదటిసారి సామాజిక భద్రతా వ్యవస్థ– ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చారు. అంటే మొదటిసారి వ్యవస్థాగతమైన ఉపాధిని వీరు పొందారన్నమాట. ► కొత్తగా చేరిన 8.02 లక్షల మందిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు 2.39 లక్షల మంది. 22–25 సంవత్సరాల మధ్య వారు 2.08 లక్షల మంది. 18 నుంచి 25 సంవ త్సరాల మధ్య వయస్సు కలవారు మొత్తం సంఖ్యలో (8.02 లక్షల మంది) 55.64% మంది. ► సమీక్షా నెల్లో 3.84 లక్షల మంది ఈపీఎఫ్ఓ నుంచి బయటకు వెళ్లగా, 10.74 లక్షల మంది బయ టకు వెళ్లి మళ్లీ కొత్త ఉద్యోగాల్లో చేరారు. తద్వా రా తిరిగి ఈపీఎఫ్ఓలో సభ్యత్వం పొందారు. ఈఎస్ఐసీలోనూ భారీ పెరుగుదల కాగా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో కూడా 2022 డిసెంబర్లో కొత్త ఉద్యోగులు 18.03 లక్షల మంది చేరాయి. 2021 డిసంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య 14.52 లక్షలు పెరగడం గమనార్హం. ఈఎస్ఐసీ కింద డిసెంబర్ 2022లో 27,700 కొత్త సంస్థలు రిజిస్టరయ్యాయి. కొత్తగా చేరిన 18.03 లక్షల మంది ఉద్యోగుల్లో 25 సంవత్సరాలపైబడినవారు 8.30 లక్షల మంది. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈఎస్ఐ స్కీమ్‌లో చేరినవారిలో 80 మంది ట్రాన్స్జెండర్లు. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
2024 నాటికి టీడీపీ ఖాళీ.. ముఖ్య నేతలు టచ్‌లో ఉన్నారు: విజయసాయిరెడ్డి
-
వైఎస్సార్సీపీలో చేరిన గుంటూరు మాజీ ఎమ్మెల్యే
సాక్షి, తాడేపల్లి: గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జియాఉద్దీన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. జియా ఉద్దీన్ గుంటూరు-1 మాజీ ఎమ్మెల్యే. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా జియాఉద్దీన్ బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ఇక పార్టీలో చేరిన అనంతరం జియాఉద్దీన్ మాట్లాడుతూ.. మైనారిటీలకు నిజమైన న్యాయం చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడని చెప్పారు. వారి అభీష్టం మేరకే తాను వైఎస్సార్సీపీలో చేరినట్లు పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలో పని చేయడమే తనకు దక్కే హోదా అని వెల్లడించారు. టీడీపీ హయాంలో మైనారిటీ మంత్రిని కూడా పెట్టని ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. తన కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. తన సోదరుడు మరణించాక పదవులు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఓ ఏడాది ఉందనగా మైనారిటీ కార్పొరేషన్ ఇచ్చాడని గుర్తుచేశారు. మైనారిటీలకు నిరంతరం న్యాయం జరగాలంటే వైఎస్ జగన్ చిరకాలం సీఎంగా ఉండాలని జియాఉద్దీన్ తెలిపారు. తాను ఎటువంటి పదవులు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. -
దీదీకి షాక్.. బీజేపీలోకి మరో ఎమ్మెల్యే!
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సొంతపార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. త్వరలోనే టీఎంసీకి చెందిన ఎమ్మెల్యే అరిందం భట్టాచార్య బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నాడియా శాంతిపూర్ నియోజకవర్గానికి చెందిన భట్టాచార్య బుధవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియాను కలిశారు. దీంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమపార్టీ నేతలు బీజేపీలోకి చేరుతుండటంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై టీఎంసీ పూర్తిగా దృష్టిని సారించింది. (వ్యూహాత్మక ఎత్తుగడ: బీజేపీకి దీదీ సవాల్) మరోవైపు ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని కమలదళం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అంచనావేస్తూ, తృణమూల్ కాంగ్రెస్‌ను ధీటుగా ఢీ కొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. వీరేగాక ఇంకా 41 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కైలాష్ విజయవర్గియా ఇటీవల వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. (బెంగాల్‌పై కాషాయం కన్ను) -
విద్యార్థులకు అన్యాయం జరగరాదు
సాక్షి, అమరావతి: డైట్‌సెట్ రాయకుండా డైట్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకుని విద్యనభ్యసించిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. డైట్‌సెట్ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించని విద్యార్థులు, అసలు పరీక్షకే హాజరు కాని విద్యార్థులను సైతం ప్రైవేటు డైట్ కళాశాలల యాజమాన్యాలు చేర్పించుకున్నాయి. అలా చేరిన వేలాది మంది విద్యార్థులను ప్రస్తుతం కోర్సు పూర్తయ్యాక పరీక్షలకు అనుమతించని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇదే అంశం గురువారం మంత్రివర్గ సమావేశంలో అధికారిక అజెండా ముగిశాక మంత్రుల మధ్య చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి వద్ద ఓ మంత్రి ఈ విషయం ప్రస్తావించగా యాజమాన్యాలు చేసిన పనికి విద్యార్థులను శిక్షించరాదని జగన్ అభిప్రాయపడినట్లు సమాచారం. అక్రమంగా విద్యార్థులను చేర్చుకున్న యాజమాన్యాలపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో విద్యార్థులకు నష్టం జరక్కుండా ఈ ఏడాదికి చూడాలని ముఖ్యమంత్రి అన్నారని తెలిసింది. నిబంధనలను ఉల్లంఘించి యాజమాన్యం కోటాలో అర్హత లేని విద్యార్థులను చేర్చుకున్న కళాశాలల అనుమతి రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ 24 తర్వాత అసెంబ్లీ? అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే తేదీల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిసింది. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు గత జూన్‌లో జరిగాయి. ఆరు నెలలలోపు అంటే ఈ ఏడాది డిసెంబర్ 14వ తేదీలోపు మళ్లీ సమావేశాలు నిబంధనల ప్రకారం జరగాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 24వ తేదీ తర్వాత నిర్వహించే విషయం పరిశీలించాలని, ఆ మేరకు తేదీలను ఖరారు చేసే బాధ్యతను ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్–19 ముప్పు తీవ్ర స్థాయిలోనే ఉన్నందున, ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తేదీలను ఖరారు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలున్నట్లు చెబుతున్నారు. -
పర్చూరులో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు
-
టీడీపీ ఇన్చార్జి పుట్టాకు పెద్ద షాక్..!
సాక్షి, చాపాడు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ను ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఊహించని పెద్ద షాక్ తగిలింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన మండల టీడీపీ నాయకుడు వెంకటసుబ్బయ్య అనుచరగణంతో సోమవారం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసి మెజార్టీ ఓట్లు తెప్పించిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.మండలంలోని నక్కలదిన్నె పంచాయతీలోని తిప్పిరెడ్డిపల్లెకు చెందిన మల్లెం వెంకటసుబ్బయ్య యాదవ్‌తో పాటు 80 కుటుంబాలకు చెందిన టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలను వేసిన వెంకటసుబ్బయ్య వర్గీయులను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటసుబ్బయ్యతో పాటు చిన్న ఎల్లయ్య, గంగరాజు, పామిడి రామసిద్దయ్య, కొండయ్య, ఓబయ్య, సి, విజయుడు, బిర్రు ఆంజనేయులుతో 80 కుటుంబాలకు చెందిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లో వచ్చిన పుట్టా సుధాకర్‌యాదవ్ తమ సామాజిక వర్గానికి చెందిన వాడనే అభిమానంలో రఘురామిరెడ్డిని కాదని టీడీపీలో చేరారు. ఎన్నికల సమయంలో వెంకటసుబ్బయ్యపై దాడులు కూడా జరిగాయి. ఎన్నికల్లో చిన్న గ్రామమైన తిప్పిరెడ్డిపల్లె టీడీపీకి మెజార్టీ ఓట్లు తెప్పించారు. అనుచరులతో కలిసి టీడీపీలో చేరడాన్ని పుట్టా వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసింది. రెండేళ్లుగా అవమానాలు భరిస్తూ వచ్చానని ఇక విలువల్లేని పుట్టా వద్ద వద్దనుకుని వైఎస్సార్సీపీలో చేరినట్లు వెంటకసుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎంపీపీ వెంకటలక్షమ్మ భర్త లక్షుమయ్య, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, నాయకులు రామచంద్రయ్య, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, రాజు, మురళీ, కిట్టయ్య, రమణారెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
పుట్టిన రోజునాడే టీడీపీ నేతకు షాక్..!
సాక్షి, వైఎస్సార్: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి నేతలు వరుస షాక్‌లిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే వరకు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో ఈపరిణామం పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి పుట్టిన రోజునే ఆయన ముఖ్య అనుచరులు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కడప జిల్లాలో మరికొంత మంది టీడీపీ సీనియర్ నాయకులు పార్టీని వీడారు. వేంపల్లి మెదటి వార్డు మెంబర్ కొరివి రామ సుబ్బారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైస్సార్సీపీలో చేరారు. సతీష్ అనుచరులు జేరిపిటి సుధాకర్‌తో సహా 30 కుటుంబాలు టీడీపీని వీడారు. వైఎస్సార్సీపీ మాజీఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. ఆయన రాక సందర్భంగా అభిమానులు పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. టీడీపీ సీనియర్ నేత రాజీనామా.. మరోవైపు నెల్లూరులో వైఎస్సార్సీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీ సీనియర్ నాయకుడు కండ్లగుంట మధుబాబు నాయుడు టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ నేతల తీరుతో మనస్తాపం చెందిన మధుబాబు టీడీపీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు 26వ వార్డు కౌన్సిలర్ గంగినేని పద్మావతి కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
వైఎస్సార్సీపీలోకి ఏపీ టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్/పిడుగురాళ్లటౌన్ : ఏపీవ్యాప్తంగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్ అధినేత వున్నం నర్సింహారావు, ఆయన కుమారుడు వున్నం నాగమల్లికార్జునరావు బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వారితో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ కాసు మహేశ్‌రెడ్డి, నరసరావుపేట పార్లమెంటు ఇన్చార్జి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పార్టీ నేతలు జంగా వెంకటకోటయ్య, రేపాల శ్రీనివాసులు తదితరులున్నారు -
వైఎస్సార్సీపీలోకి వలసల వరద..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ఓ వైపు తిరుగులేని ప్రజాదరణ లభిస్తుంటే.. మరోవైపు, ఈ సంకల్పంలో మేమూ భాగస్వాములమవుతాం అంటూ రాజకీయ సీనియర్ నేతలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారు కొందరైతే, ఏ రాజకీయ పార్టీలకూ సంబంధం లేకుండా జనజీవితంతో మమేకమై ఉన్న వారు మరికొందరు. మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డు డీఐజీ మహ్మద్ ఇక్బాల్ పశ్చిమగోదావరి జిల్లాలో జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. ఇక్బాల్ ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరించారు. కడప జిల్లాకు చెందిన మరో ఐపీఎస్ మాజీ అధికారి ఎస్.లక్ష్మీరెడ్డి కూడా పార్టీలో చేరారు. మాజీ డీఐజీ ఏసురత్నం, పాయకరావుపేటకు చెందిన విజిలెన్స్ రిటైర్డు ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు విశాఖ యాత్రలో పార్టీలో చేరారు. డీఆర్డీఏ పీడీగా ఉన్న తలారి రంగయ్య, గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన కడపల శ్రీకాంత్‌రెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి ఎం.క్రిష్ణప్ప పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయ చేరికలు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజా కన్నబాబు, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వివిధ ప్రాంతాల్లో జగన్‌ను కలుసుకుని పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ రంగనాథరాజు, మద్దాల సునీత, మోచర్ల జవహర్‌వతిలు జగన్ తమ జిల్లా పర్యటనలో ఉండగానే పార్టీలో చేరారు. అదే విధంగా మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్ కూడా పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కూడా పార్టీలో చేరారు. అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్‌రెడి ప్రధాన అనుచరుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి పార్టీలో చేరారు. గుంటూరుకు చెందిన వైశ్య ప్రముఖుడు పాదర్తి రమేష్ గాంధీ, సత్తెనపల్లె టీడీపీలో యాదవ నేత నిమ్మకాయల రాజనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి సత్యనారాయణ, గురజాల టీడీపీ నేత ఎనుముల మురళీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. వీరేకాక.. పాదయాత్రలో దారిపొడవునా పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ , వివిధ సామాజిక వర్గాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. నెల్లూరుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా వైఎస్సార్సీపీలో చేరారు. -
వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న చేరికలు
పిఠాపురం: ప్రజా సంకల్పయాత్రలో భాగంలో పాదయాత్ర చేస్తోన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జీ, శ్రీ సంస్థానం మాజీ చైర్మన్ రామకృష్ణతో పాటు మరో ఆరుగురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి వైఎస్ జగన్, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జీ మాట్లాడుతూ..టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలతో మోసపోయామని, మాజీ చైర్మన్ అయిన తనకే రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో మరికొంత మంది చేనేత సంఘాల ప్రతినిధులు కలిసి తమ ఇబ్బందులు వైఎస్ జగన్‌తో చెప్పుకున్నారు. జీఎస్టీతో ఇబ్బందులు పడుతున్నామని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు చేయాలని విన్నవించుకున్నారు. పిఠాపురం జాతీయ రహదారిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. 2014 ఎన్నికలకు ముందు తమకు కూడా ఇళ్ల స్థలాలు, డెత్ బెనిఫిట్స్ మంజూరు వంటి అనేక హామీలు చంద్రబాబు ఇచ్చాడని వైఎస్ జగన్‌కు చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజల్లానే తమను కూడా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు స్టైఫండ్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ జగన్‌కు న్యాయవాదులు వినతిపత్రం సమర్పించారు. -
ప్రజలకు వైఎస్సార్ సీపీ భరోసా
జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సీహెచ్ గున్నేపల్లిలో పార్టీలో 350 కార్యకర్తల చేరిక ముమ్మిడివరం : ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు భరోసా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. మండలంలోని సీహెచ్ గున్నేపల్లిలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 350 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కన్నబాబు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీకి కంచుకోటగా ఉండే సీహెచ్ గున్నేపల్లి గ్రామంలో మూకుమ్మడిగా టీడీపీ కార్యకర్తలు చేరడంతో పార్టీలో నూతనోత్సవం వెల్లివిరిసింది. ఆ గ్రామ ప్రజలు వైఎస్సార్ సీపీ నాయకులకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మాటలకు మోసపోయిన ప్రజలు ఎన్నికలు వస్తాయోనని ఎదురు చూస్తున్నారన్నారు. అధికారం కోసం ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతుంటే ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తిరిగి తీసుకురావడం పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ను అడ్డదారిలో అధికారంలోకి తీసుకువచ్చాడని ఎద్దేవా చేశారు. టీడీపీ కంచుకోటలాంటి గ్రామాలలో కార్యకర్తలు టీడీపీ గోడలు పగలుకొట్టి వైఎస్సార్ సీపీలో చేరుతుండడం శుభ పరిణామమన్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ అధినేత సీఎం కావాలనే లక్ష్యంతో కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శలు మెండగుదిటి మోహన్, పెయ్యల చిట్టిబాబు, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ హరినాథ్‌బాబు, జగతా పద్మనాభం (బాబ్జీ), రాష్ట్ర కార్యదర్శి అడ్డగళ్ళ సాయిరాం, పుణ్యమంతుల కాళీ తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులను సహించం...అక్రమ కేసులకు భయపడం
కలసికట్టుగా ప్రజాసమస్యలపై పోరాడుదాం వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నేతల ఉద్ఘాటన పార్టీలో 600 మంది చేరిక వందలాది మందితో సాగిన బైక్ ర్యాలీ అమలాపురం టౌన్/పి.గన్నవరం (పి.గన్నవరం) : చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జిల్లాల్లో పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తోందని.. వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యర్తలను టార్గెట్ చేసి పాల్పడుతున్న వేధింపులను ఇక సహించబోమని, అక్రమ కేసులకు భయపడబోమని పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు హెచ్చరించారు. పి.గన్నవరంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు అధ్యక్షతన వైఎస్సార్ సీపీ బహిరంగ సభ జరిగింది. నియోజకవర్గం నుంచి యువజన నాయకులు ఉలిశెట్టి బాబి, పిల్లి శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో 600 మంది వైఎస్సార్ సీపీలో చేరడం.. ఉవ్వెత్తున లేచిన కెరటంలా అంబాజీపేట నుంచి పి.గన్నవరం దాకా సాగిన యువకుల బైక్ ర్యాలీతో నియోజకవర్గ పార్టీకి కొత్త ఊపు, ఉత్సాహం చోటుచేసుకుంది. బహిరంగ సభకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి వంటి నేతలు పాల్గొని తమతమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తలతో కొత్త ఉత్సాహాన్ని నింపారు. పార్టీ అద్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని తనయుడు మంత్రి లోకేష్ పనితీరే మనకు రేపు అవకాశాలు కల్పిస్తున్నట్టుగా సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని రౌడీ షీటర్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. జిల్లాలో పోలీసు కేసుల పరంగా ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా మొత్తం జిల్లా పార్టీ అండగా నిలిచి వారికి మానసిక భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తనకు అనుకూలమైన మీడియాతో మన పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని కన్నబాబు అన్నారు. వీటిని వ్యూహత్మకంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో ప్రతి కార్యకర్త ఒక మీడియాగా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర యువజన విభజన అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో మాదిరిగా ఈ సారీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అతి విశ్వాసం, అతి నమ్మకానికి పోవద్దని హితవు పలికారు. ఈ సారి ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా మనం సంఘటితంగా పనిచేయాలని సూచించారు. పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేది వైఎస్సార్ సీపీ మాత్రమే ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం గ్రేటర్ పార్టీ కన్వీనర్ మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగాయని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు మిండుగుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, కర్రి నాగిరెడ్డి, కొల్లి నిర్మలాకుమారి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడ్డగళ్ల వెంకట సాయిరామ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ముమ్మిడివరం, మండపేట నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్య, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు హరినాథ్‌బాబు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దొమ్మేటి వెంకట శివరామన్, రాష్ట్ర నాయకులు దొమ్మేటి సాయికృష్ణ, కొర్లపాటి కోటబాబు, పేరి శ్రీనివాస్, జక్కంపూడి వాసు, గుత్తుల నాగబాబు, మెల్లం మహలక్ష్మి ప్రసాద్, నల్లి డేవిడ్ తదితరులు సభలో ప్రసంగించారు. పార్టీలో చేరికలు, మోటర్ సైకిళ్ల ర్యాలీలు నియోజకవర్గానికి చెందిన దాదాపు 600 మంది టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, రాష్ట్ర నాయకులు రాజా, చిట్టబ్బాయిల సమక్షంలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ నాయకులు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు అంబాజీపేట సెంటర్ నుంచి మాచవరం, ముంగండ, పోతవరం మీదుగా పి.గన్నవరం వరకూ భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాల రెపరెపల మధ్య జై జగన్ అనే నినాదాలు హోరెత్తాయి. -
హోంమంత్రి ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ
- బెదిరింపులకు దిగినా ఆగని వలసలు - ఇటీవల పెద్దాపురం పట్టణ కార్యదర్శి తాళాబత్తుల - తాజాగా యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కొల్లుబోయిన సాక్షిప్రతినిధి, కాకినాడ : హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇలాకాలో తెలుగు దేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేతల వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేస్తున్న నేతలపై పోలీసు కేసులతో వేధింపులకు గురిచేస్తూ కుట్రలు పన్నుతున్నా వలసలను మాత్రం నిరోధించలేక చేతులెత్తేస్తున్నారు. బలవంతంగానైనా ఆపాలని తెలుగు తమ్ముళ్లు వేసిన ఎత్తులు, కుట్రలు, కిడ్నాప్ యత్నాలు బెడిసికొడుతున్నాయి. చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలపై విసుగెత్తిపోయిన పలువురు తెలుగు తమ్ముల్లు ఒకరొకరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇటీవల ఆ పార్టీ నమ్మినబంటు టీడీపీ పెద్దాపురం పట్టణ కార్యదర్శిగా పనిచేసిన తాళాబత్తుల సాయి పార్టీ నుంచి బయటకురాగా తాజాగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు, టీడీపీ నేత కొల్లుబోయిన అరుణా శ్రీనివాస్ యాదవ్ టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌కు ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. బీసీల నుంచి బలమైన నేతగా ఆయన రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురంలో మరింత బలపడనుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. హోం మంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గంలో అతని నాయకత్వాన్ని ఎదిరించి ఆ పార్టీని వీడటంతో టీడీపీలో మసలం ప్రారంభమయింది. అందునా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ అఖిలభారత యాదవ మహాసభలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో టీడీపీకి తీరని నష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కిడ్నాప్‌నకు యత్నం... శుక్రవారం బయటకు వెళ్లిపోతున్నారనే సమాచారంతో ఏదోరకంగా శ్రీనివాస్ యాదవ్ బయటకు పోకుండా అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు చివరకు కిడ్నాప్ చేసేందుకు సైతం వెనుకాడ లేదు. వైఎస్సార్సీపీలోకి శ్రీనివాస్ యాదవ్ చేరికకు ఒక రోజు ముందు గురువారం రాత్రి అతనితో తమ్ముళ్లు మంతనాలు సాగించి పార్టీ వీడ వద్దని, ఏదైనా ఉంటే మాట్లాడుకుందామంటూ కిడ్నాప్ చేసేందుకు పెద్దాపురం కుమ్మరివీధిలో నాలుగు కార్లు ఏర్పాటు చేశారు. ఇంతలో విషయం తెలుసుకుని వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు తన అనుచరులు హుటాహుటిన శ్రీనివాస్ యాదవ్‌ను వేరే గ్రామానికి తరలించారు. పెద్దాపురం మట్టే వారి కల్యాణ మండపంలో జరిగిన పార్టీలో శ్రీనివాస్ యాదవ్‌తోపాటు మరో 500 మంది చేరికలు సందర్భంగా నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. భారీ ర్యాలీతో... శ్రీనివాస్ యాదవ్ చేరిక సందర్భంగా శుక్రవారం రాత్రి పెద్దాపురం మట్టేవారి కల్యాణ మండపంలో కో ఆర్డినేటర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపింది. అధికారపార్టీ నుంచి వచ్చిన ప్రలోభాలు, బెదిరింపులను సైతం లెక్క చేయకుండా పెద్దాపురంలో సుమారు రెండు గంటలపాటు సాగిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీకి తరలివచ్చిన యువత, జనంతో పురు వీధులన్నీ కిక్కిరిసి పోయాయి. సుధా కాలనీ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన ర్యాలీ ఎం.ఆర్. కాలేజీ, మున్సిపల్ సెంటర్, కుమ్మరవీధి, మరిడమ్మ ఆలయం, దర్గా సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా సాగింది. దారిపొడవునా పార్టీ శ్రేణులకు స్థానికులు ఎక్కడికక్కడ స్వాగతం పలికారు.ముందుగా ముహూర్త ప్రకారం ఉదయం 10.25 గంటలకు శ్రీనివాస్‌యాదవ్‌కు కోఆర్డినేటర్ నాయుడు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. క్యాడర్లో ఉత్సాహం... రాత్రి జరిగిన సమావేశంలో పార్టీ నేతల ప్రసంగాలు ఆధ్యంతం కేడర్‌లో మనోధైర్యాన్ని నింపాయి. అసలే హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై వేధిపుల కేసులకు లెక్కేలేదు. ఈ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి తరలిరావడం పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీపై నెలకొన్న వ్యతిరేకతకు అద్దం పట్టిందని నేతలు చర్చించుకోవడం కనిపించింది.దివంగత నేత తోట గోపాలకృష్ణ మెట్ట ప్రాంతానికి చేసిన సేవలను నేతల ప్రసంగాల్లో కొనియాడిన సందర్భంలో పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. మెట్ట ప్రాంతంలో చక్రం తిప్పిన గోపాలకృష్ణ రాజకీయ వారసుడిగా నాయుడికు మద్ధతు ఇవ్వడం ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని నేతలు ఉద్బోధించారు. తూర్పు మార్పునకు నాంది పలుకుతుందని, అది ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని, కేసులకు భయపడవద్దని తామున్నామంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వంటి నేతలు ధైర్యాన్ని నింపారు. చంద్రబాబుకు, వైఎస్‌కు మధ్య ఉన్న తేడాను పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తన ప్రసంగంలో పేర్కొన్నారు. పార్టీ ప్రచార సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తనదైన శైలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఉన్న ప్రతి రంగు, చుట్టూ ఉన్న సంక్షేమ పథకాల గుర్తులు సోదాహరణంగా వివరించిన తీరు ఆకట్టుకుంది. -
ఎన్నికలెప్పుడొచ్చినా విజయం మనదే
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు జిల్లా యాదవ సంఘ నాయకులు పార్టీ చేరిక పెద్దాపురం/సామర్లకోట : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీ జిల్లా అ«ధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా యువజన అధ్యక్షులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆయన అనుచరులు సుమారు 500 మంది పార్టీ చేరిక సందర్భంగా శుక్రవారం పెద్దాపురం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నబాబు మాట్లాడుతూ శ్రీనివాస్‌యాదవ్ చేరికతో పెద్దాపురం నియోజకవర్గంలో ఉత్సాహకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ యాదవ సంఘ నాయకులు పార్టీలో చేరుతున్న సందర్భంగా విజయోత్సవ సభలా ఉందన్నారు. నాటి రాజశేఖరరెడ్డి పాలన జగన్‌తోనే సాధ్య పడుతుందని మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ టీడీపీని నిలదీసినా, ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మండపేట, రాజమండ్రి, జగ్గంపేట, కాకినాడ టౌన్ కో ఆర్డినేటర్లు లీలాకృష్ణ, ఆకుల వీర్రాజు, ముత్యాల శ్రీనివాస్, ముత్తా శశిధర్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయమని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, సభాధ్యక్షులు తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకులు నియోజకవర్గంలో దండుకుంటున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారావు మిడుగుదింటి మోహన్, రాష్ట ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంతబాబు, రాష్ట్ర కార్యదర్శి కర్రి వీర్రెడ్డి, రాజమండ్రి ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి ప్రసంగించారు. అనంతరం కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ అరుణ దంపతులతో పాటు సుమారు 500 మంది యాదవ సోదరులకు పార్టీ కండువాలు కప్పి కన్నబాబు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి తోట సత్య, రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర్రాఘవరావు. జిగిని వీరభద్రరావు. కౌన్సిల్ ప్రతిపక్ష నేతలు, ఆయా వార్డుల కౌన్సిలర్లు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ యూత్ కమిటీ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువజన విభాగం ప్రధాన కార్యదర్శులుగా తిరుపతయ్య, గంగాధర్, హనుమంతురెడ్డి, సిరి రవి.. కార్యదర్శిగా దుబ్బాక సంపత్, జీహెచ్ఎంసీ యూత్ ప్రధాన కార్యదర్శిగా మన్నెం సుధాకరరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడిగా వందాల సతీశ్ నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్ ఆధ్వర్యంలో నియామకాలు జరిగినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్సీపీ కరీంనగర్ జిల్లా ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శిగా బందెల వినోద్‌కుమార్ నియమితులయ్యారని పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ తెలిపారు. -
వైఎస్సార్సీపీలోకి పలువురు టీఆర్ఎస్ నేతల చేరిక
నిజామాబాద్: తెలంగాణలో వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజాహిత ఆందోళనలకు ఆకర్షితులై ఎంతోమంది పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని వైఎస్సార్సీపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, యూత్ కాంగ్రెస్, నాయీ బ్రాహ్మణ సంఘాలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. చేరికల సందర్భంగా సిద్దార్థరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ ఆశయాల సాధనకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారన్నారు. వారి అడుగుజాడల్లో నడిచేందుకే పలువురు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా కమిటీలు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.