Knight Frank report
-
లోన్ పట్టు.. ఇల్లు కట్టు!
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’అన్నారు పెద్దలు. జీవితంలో ఆ రెండు ఘట్టాలు దాటిన వారు సప్త సముద్రాలు దాటినట్టే లెక్క. అయితే ఈ తరంలో ఇల్లు యజమాని కావడం అంటే ఆషామాషీ కాదు. అయినా కూడా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. కలల సౌధం నిర్మించుకుని.. ఓ ఇంటి వాడయ్యేందుకు ప్రతిక్షణం కష్టపడుతున్నారు. - సాక్షి, హైదరాబాద్నగరాల్లో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎప్పుడో పోయింది. కాస్తో కూస్తో.. కుదిరితే ఏ అపార్ట్‌మెంట్‌లోనో ఓ ఫ్లాట్ కొనుక్కుని బతుకు బండి లాగిద్దామనుకునే వారే ఎక్కువ మంది. దానికి కూడా కూడబెట్టుకున్న కాస్త డబ్బుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొత్తింట్లో అడుగుపెడుతున్నారు. తాజాగా నైట్ ఫ్రాంక్ అనే సంస్థ విడుదల చేసిన ‘బ్యాంకింగ్ ఆన్ బ్రిక్స్’అనే సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.ఇదీ చదవండి: అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్79% రుణాలపైనే భారం దేశవ్యాప్తంగా నగరాల్లో సొంతింటి కల నెరవేర్చుకున్నవారిపై లండన్‌కు చెందిన నైట్ ఫ్రాంక్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దాదాపు 1,629 మంది పాల్గొన్న ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 79 శాతం మంది ఇల్లు కొనుక్కునేందుకు బ్యాంకు రుణాన్ని ఆప్షన్‌గా ఎంచుకున్నట్టు తెలిపారు. 52 శాతం మంది అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్వైపు మొగ్గు చూపగా, 19 శాతం మంది స్టూడియో (చిన్నపాటి) అపార్ట్మెంట్లు, 17 శాతం మంది మాత్రం ఇండిపెండెంట్ ఇళ్లు కోరుకున్నారు. 7 శాతం మంది గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు కొనేందుకు, 5 శాతం మంది మాత్రం ఖాళీ భూమి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు.సొంతిళ్లే కావాలి సర్వేలో పాల్గొన్నవారిలో 80 శాతం మంది తమకు సొంతిల్లు అవసరమని చెప్పారు. 19 శాతం మంది మాత్రం సొంతిల్లు కన్నా అద్దెకు ఉండటమే బెటర్ అని భావిస్తున్నారు. 1 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. సొంతిల్లు విషయంలో ఒక్కో తరాన్ని బట్టి ఒక్కో విధంగా ఆలోచనలు ఉన్నాయి. బేబీ బూమర్స్ (1946–1964 మధ్య పుట్టిన వారు) 79 శాతం మంది సొంతిల్లు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. జెన్ ఎక్స్ (1965–1980 మధ్య పుట్టిన వారు)లో 80 శాతం మంది, మిలీనియల్స్ (1981–1996 మధ్య పుట్టినవారు)లో 82 శాతం మంది సొంతిల్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే వెరైటీగా జెన్–జీ (1997–2012) మధ్య జన్మించిన వారిలో 71 శాతం సొంతిల్లు ఉండాలని భావిస్తుండగా, ఏకంగా 27 శాతం మంది అద్దె ఇంట్లో ఉంటేనే బెటర్ అని భావిస్తుండటం గమనార్హం.సొంతిల్లు ఎందుకంటే? సొంతిల్లు కావాలని చాలా మంది కోరుకుంటున్నా.. అందుకు కారణాలపై మాత్రం ఒక్కో తరం వారిలో ఒక్కో ఆలోచన ఉంది. బేబీ బూమర్స్ జెనరేషన్‌కు చెందినవారు ఇల్లు కొనుక్కోవడం అనేది ఓ పెట్టుబడిగా ఆలోచిస్తున్నారు. అదే మిలీనియల్స్ జెనరేషన్ వాళ్లు మాత్రం వారి సంపదను మరింత పెంచుకోవడంలో భాగంగా ఇల్లు కట్టుకుంటున్నారని సర్వేలో తేలింది. బేబీ బూమర్స్‌లో 29 శాతం మంది ఇల్లు కొనడాన్ని పెట్టుబడిగా భావిస్తే.. 15 శాతం మంది మాత్రం రిటైర్మెంట్ ప్లాన్‌గా కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలుసర్వేలో పాల్గొన్న వారందరిలో 37 శాతం మంది ఉన్న ఇంటిని లగ్జరీ ఇళ్లుగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ కొన్ని నగరాల్లోనే ఉండగా, ఇప్పుడు దేశంలోని ప్రథమ శ్రేణి నగరాలన్నింటిలో కనిపిస్తోంది. 32 శాతం మంది మాత్రం తొలిసారిగా ఇల్లు కొన్నామని, జీవితాంతం అదే గృహంలోనే ఉంటామని చెప్పారు. 25 శాతం మంది పెట్టుబడిగా కొనుక్కున్నామని, 7 శాతం మంది రిటైర్మెంట్, రెండో ఇల్లు ఉండాలని, వెకేషన్ కోసం అంటూ పలు కారణాల వల్ల ఇల్లు కొన్నామని వివరించారు.ప్రీమియం వైపు ఆలోచనలు..దేశంలో ఇల్లు కొనేవారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. తాజాగా మేం జరిపిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేలింది. దాదాపు 80 శాతం మంది సొంతిల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రీమియం, లగ్జరీ ఇళ్లు కట్టుకోవాలనే ట్రెండ్ పెరుగుతోంది. కేవలం దేశ ఆర్థిక వృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనకు మాత్రమే దేశ స్థిరాస్తి రంగం ఉపయోగపడదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా కొనేవారి ప్రాధాన్యాలను కూడా అంచనా వేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. – శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా, చైర్మన్, ఎండీఇదీ చదవండి: థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్ -
ఒక్క నెలలో రూ.3,617 కోట్ల ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్‌లో అక్టోబర్ నెలలో ఇళ్ల అమ్మకాలు పెరిగినట్లు నైట్‌ఫ్రాంక్ నివేదించింది. మొత్తం 5,894 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ నమోదైనట్లు పేర్కొంది. వాటి విలువ సమారు రూ.3,617 కోట్లు ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు నైట్‌ఫ్రాంక్ తెలిపింది.నైట్‌ఫ్రాంక్ నివేదిక ప్రకారంహైదరాబాద్‌లో అక్టోబర్ 2024లో మొత్తం రూ.3,617 కోట్ల ఇళ్లు అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 14%, ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 28% వృద్ధి కనబరిచింది.అక్టోబర్‌లో మొత్తం 5,894 యూనిట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది ఏడాదివారీగా 2%, నెలవారీగా 20% పెరుగుదల నమోదు చేసింది.సెప్టెంబర్ 17-అక్టోబర్ 2, 2024 తర్వాత రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి.ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!హైదరాబాద్‌లో రూ.50 లక్షల లోపు విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇటీవల రూ .ఒక కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల అమ్మకాలు పెరుగుతున్నాయి.ప్రీమియం ఇళ్ల విక్రయాల వాటా అక్టోబర్ 2024లో 10% నుంచి 14%కి పెరిగింది. రూ.కోటి పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 36 శాతం పెరిగాయి.జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ జరిగిన మొత్తం ఇళ్ల సంఖ్య 65,280. ఇది ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరుగుదలను నమోదు చేసింది.జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రూ.40,078 కోట్ల విలువై ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 32 శాతం అధికం. -
ఇళ్ల ధరల జోరులో ముంబై నంబర్ 2
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగదలలో ముంబై రియల్టీ మార్కెట్ రెండో స్థానం నిలిచింది. ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నట్టు జూన్ త్రైమాసికానికి సంబంధించిన నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 44 ప్రముఖ నగరాల్లోని ఇళ్ల ధరల పెరుగుదల వివరాలను నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 2.6 శాతానికి పరిమితమైనట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో పెరుగుదల రేటు 4.1 శాతంగా ఉండడం గమనార్హం. ఇళ్ల ధరల పెరుగుదలలో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 26 శాతం మేర వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల ధరలు 13 శాతం మేర జూన్ త్రైమాసికంలో పెరిగాయి. దీంతో ఏడాది క్రితం ఆరో ర్యాంక్‌లో ఉన్న ముంబై 2కు చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 10.6 శాతం పెరగడంతో, ఏడాది క్రితం ఉన్న 26వ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. బెంగళూరులో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో వార్షికంగా 3.7 శాతం మేర పెరిగాయి. దీంతో 15వ ర్యాంక్ సొంతం చేసుకుంది. టాప్–10లో ఇవే.. లాస్ ఏంజెలెస్‌లో 8.9 శాతం (4వ ర్యాంక్), మియామీలో 7.1 శాతం (5వ ర్యాంక్), నైరోబీలో 6.6 శాతం (ఆరో స్థానం), మ్యాడ్రిడ్‌లో 6.4 శాతం (ఏడో స్థానం), లిస్బాన్లో 4.7 శాతం (ఎనిమిదో స్థానం), సియోల్‌లో 4.6 శాతం (తొమ్మిదో స్థానం), శాన్ ఫ్రాన్సిస్కోలో 4.5 శాతం (10వ స్థానం) చొప్పున జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దుబాయిలో 2020 సంవత్సరం నుంచి ఇళ్ల ధరలు 124 శాతం పెరగ్గా.. జూన్ క్వార్టర్లో 0.3% మేర తగ్గాయి. వియన్నాలో 3.2%, బ్యాంకాక్‌లో 3.9 శాతం చొప్పున ఇదే కాలంలో ఇళ్ల ధరలు తగ్గాయి. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జూమ్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి–జూన్) బలమైన పనితీరు నమోదు చేసిందిజ ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 21 శాతం పెరిగి 18,573 యూనిట్లకు చేరాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతులకు డిమాండ్ 71 శాతం పెరిగి 5 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–జూన్ కాలంలో 11 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. 1.73 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఎనిమిది నగరాల్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 33 శాతం పెరిగి 34.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బలంగా ఉండడం బలమైన ఆర్థిక మూలాలాలను, స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. దీని ఫలితమే ఇళ్ల అమ్మకాలు, కార్యాలయ వసతుల లీజింగ్ దశాబ్ద గరిష్ట స్థాయికి చేరుకోవడంగా పేర్కొన్నారు. 2024 తొలి ఆరు నెలల్లో మొత్తం అమ్మకాల్లో 34 శాతం ఖరీదైన ఇళ్లే ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడం ఆఫీస్ వసతుల డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపించింది. స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులకు తోడు, ప్రస్తుత వృద్ధి జోరు ఆధారంగా 2024 సంవత్సరం మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు, వాణిజ్య వసతుల లావాదేవీలు బలంగా నమోదవుతాయనే అంచనా వేస్తున్నాం’’అని బైజాల్ వివరించారు. పట్టణాల వారీగా గణాంకాలు.. → ముంబై నగరంలో ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో 47,259 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలి్చచూస్తే 16 శాతం అధికం. ఇక ఆఫీస్ వసతుల లీజింగ్ పరిమాణం 79 శాతం వృద్ధితో 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం పెరిగి 28,998 యూనిట్లుగా ఉన్నాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 11.5 శాతం పెరిగి 5.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 27,404 యూనిట్లకు చేరాయి. కార్యాలయ స్థలాల లీజింగ్ 21 శాతం పెరిగి 8.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → పుణెలో 24,525 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది 13 శాతం వృద్ధికి సమానం. ఆఫీస్ వసతుల లీజింగ్ 88 శాతం పెరిగి 4.4 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → చెన్నైలో 12 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 7,975 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ వసతులకు డిమాండ్ 33 శాతం తగ్గి 3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. → కోల్‌కతాలో 9,130 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 25 శాతం పెరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజు సైతం 23 శాతం వృద్ధితో 0.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 17 శాతం వృద్ధితో 9,377 యూనిట్లకు చేరాయి. ఆఫీస్ వసతుల లీజింగ్ భారీ వృద్ధితో 1.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.సానుకూల పరిస్థితుల అన్ని ధరల విభాగాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా ఉన్నట్టు గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. అధిక వృద్ధికితోడు, మౌలిక వసతుల అభివృద్ధి డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. సొంతిల్లు కలిగి ఉండాలనే అభిలాష, కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు ఈ వృద్ధిని ప్రధానంగా నడిపిస్తున్నాయని ప్రాపర్టీ ఫస్ట్ రియల్టీ వ్యవస్థాపకుడు, సీఈవో భవేష్ కొఠారి అభిప్రాయపడ్డారు. -
దేశంలో పెరిగిపోతున్న ఘోస్ట్ మాల్స్.. ఏంటివి?
దేశంలోని ప్రధాన నగరాల్లో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరిగిపోతున్నాయి. 40 శాతం కంటే ఎక్కువగా ఖాళీలు ఉండే షాపింగ్ మాల్స్‌ను ఘోస్ట్ మాల్స్ అంటారు. అటువంటి మాల్స్ సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక, 'థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024' సూచిస్తోంది.నివేదిక ప్రకారం.. ఘోస్ట్ షాపింగ్ మాల్స్ సంఖ్య 2023లో 64కి పెరిగింది. ఇది 2022లో 57గా ఉండేది. ఇది రిటైల్ రంగంలో ఒడిదుడుకుల ధోరణిని ప్రతిబింబిస్తోంది. 2023లో మొత్తం 13.3 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజు విస్తీర్ణంలో 64 షాపింగ్ మాల్స్.. 'ఘోస్ట్ షాపింగ్ సెంటర్స్'గా వర్గీకరించినట్లు నివేదిక వెల్లడించింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే విస్తీర్ణంలో 58 శాతం పెరుగుదలను సూచిస్తుంది.నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ఢిల్లీలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ సంఖ్య అత్యధికంగా ఉంది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఘోస్ట్ షాపింగ్ సెంటర్ స్టాక్‌లో 19 శాతం క్షీణత నమోదు కావడం విశేషం.విలువపై ప్రభావం:ఘోస్ట్ షాపింగ్ సెంటర్ల పెరుగుదల కారణంగా 2023లో దాదాపు రూ. 6,700 కోట్లు లేదా 798 మిలియన్ డాలర్ల విలువను కోల్పోవచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. ఇది రిటైల్ రంగంపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని సూచిస్తుంది. భూ యజమానులు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తోంది.దుకాణదారులకు మెరుగైన రిటైల్ అనుభవం ప్రాముఖ్యతను నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ నొక్కి చెప్పారు. "గ్రేడ్ ఏ మాల్స్ ముఖ్యంగా రాణించాయి, బలమైన ఆక్యుపెన్సీ, ఫుట్ ట్రాఫిక్, కన్వర్షన్ రేట్లను సాధిస్తున్నాయి. తద్వారా తమ వినియోగదారులకు విలువను అందిస్తున్నాయి" అన్నారు.మరోవైపు దేశవ్యప్తంగా 8 కొత్త రిటైల్ కేంద్రాలను చేర్చినప్పటికీ, 2023లో 16 షాపింగ్ కేంద్రాలు మూసివేయడంతో, టైర్1 నగరాల్లో మొత్తం షాపింగ్ కేంద్రాల సంఖ్య 263కి తగ్గింది. డెవలపర్లు నివాస లేదా వాణిజ్యపరమైన అభివృద్ధిని చేపట్టడం వంటి వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉండే, ఆదాయం లేని షాపింగ్ కేంద్రాలను కూల్చివేశారు. కొన్నింటిని శాశ్వతంగా మూసివేశారు. -
వర్క్‌స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత్‌కు అవుట్సోర్సింగ్ చేస్తుండటంతో దేశీయంగా ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో తెలిపింది. 2023లో మొత్తం వర్క్ స్పేస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థల వాటా 46 శాతంగా నమోదైందని వివరించింది. ‘ఆసియా పసిఫిక్ హొరైజన్: హార్నెసింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఆఫ్‌షోరింగ్‘ రిపోర్టు ప్రకారం భారత్‌లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా పెరిగింది. గ్లోబల్ ఆఫ్‌షోరింగ్ మార్కెట్లో 57 శాతం వాటాను దక్కించుకుంది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిర్వహణ సామరŠాధ్యలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను లేదా సర్వీసులను ఇతర దేశాల్లోని సంస్థలకు అవుట్సోర్స్ చేయడాన్ని ఆఫ్‌షోరింగ్‌గా వ్యవహరిస్తారు. దీన్నే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో)గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో జీసీసీలు, గ్లోబల్ బిజినెస్ సర్వీసులు (జీబీఎస్) మొదలైనవి ఉంటాయి. కంపెనీలు వేరే ప్రాంతాల్లో అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే యూనిట్లను జీసీసీలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.. ► 2023లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమలో మొత్తం లీజింగ్ పరిమాణం 27.3 మిలియన్ చ.అ.గా నమోదైంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 26 శాతం పెరిగింది. జీసీసీలు 20.8 మిలియన్ చ.అ., థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థలు 6.5 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్‌ను లీజుకి తీసుకున్నాయి. ► భారత ఎకానమీకి ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా తోడ్పడుతోంది. 2023లో మొత్తం సేవల ఎగుమతుల్లో దీని వాటా దాదాపు 60 శాతంగా నమోదైంది. సర్వీస్ ఎగుమతులు 2013లో 63 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023లో మూడు రెట్లు వృద్ధి చెంది 185.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆఫ్‌షోరింగ్ సేవలు అందించే గ్లోబల్ సంస్థల్లో 42 శాతం కంపెనీలకు భారత్‌లో కార్యకలాపాలు ఉన్నాయి. ► 2023 నాటికి దేశీయంగా జీసీసీల సంఖ్య 1,580 పైచిలుకు ఉంది. దేశీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీల్లో వీటి వాటా 2022లో 25 శాతంగా ఉండగా 2023లో 35 శాతానికి చేరింది. జీసీసీల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల వాటా గణనీయంగానే ఉన్నప్పటికీ తాజాగా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వృద్ధికి సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఫార్మా తదితర రంగాలు కారణంగా ఉంటున్నాయి. ► రాబోయే దశాబ్ద కాలంలో ఆఫీస్ మార్కెట్‌కు జీసీసీలే చోదకాలుగానే ఉండనున్నాయి. 2030 నాటికి దేశీయంగా వీటి సంఖ్య 2,400కి చేరనుంది. -
6,268 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రభావం స్థిరాస్తి రంగం మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. గత నెలలో హైదరాబాద్‌లో రూ.3,741 కోట్ల విలువ చేసే 6,268 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 8 శాతం, గతేడాది నవంబర్‌తో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ప్రాపర్టీ విలువలలో అక్టోబర్‌తో పోలిస్తే 18 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ► ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్యకాలంలో నగరంలో 64,658 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.34,205 కోట్లు. గతేడాది ఇదే కాలంలో రూ.30,429 కోట్ల విలువ చేసే 62,208 యూనిట్ల రిజిస్ట్రేషన్లయ్యాయి. అంటే ఏడాది కాలంలో 12 శాతం వృద్ధి నమోదైందన్నమాట. 2021 జనవరి–నవంబర్‌లో చూస్తే రూ.33,531 కోట్ల విలువ చేసే 75,451 ప్రాపరీ్టల రిజి్రస్టేషన్స్ జరిగాయి. ► గత నెలలో జరిగిన ప్రాపర్టీ రిజి్రస్టేషన్లలో అత్యధిక వాటా మధ్యతరగతి గృహాలదే. రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల వాటా 61 శాతంగా ఉండగా.. రూ.50–75 లక్షలు ధర ఉన్నవి 17 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 9 శాతం, రూ.కోటి పైన ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 13 శాతంగా ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌లోనే.. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోనే రిజిస్ట్రేషన్ల హవా కొనసాగుతుంది. గత నెలలోని రిజిస్ట్రేషన్లలో ఒక్కో జిల్లా వాటా 43 శాతం కాగా.. హైదరాబాద్‌లో 14 శాతంగా ఉంది. గత నెల రిజి్రస్టేషన్లలో 1,000–2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 71 శాతంగా ఉండగా.. 1,000 చ.అ. లోపు ఉన్న గృహాలు 15 శాతం, 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ప్రాపరీ్టల వాటా 14 శాతంగా ఉన్నాయి. ► గత నెలలోని టాప్–5 రిజి్రస్టేషన్లలో బేగంపేటలో రూ.10.61 కోట్ల మార్కెట్ విలువ చేసే ఓ ప్రాపర్టీ తొలి స్థానంలో నిలిచింది. బంజారాహిల్స్‌లో రూ.7.78 కోట్లు, రూ.7.47 కోట్ల విలువ చేసే రెండు గృహాలు, ఇదే ప్రాంతంలో రూ.5.60 కోట్లు, రూ.5.37 కోట్ల విలువ చేసే మరో రెండు ఇళ్లు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ ఐదు ప్రాపరీ్టల విస్తీర్ణం 3 వేల చ.అ.లుగా ఉన్నాయి. -
అత్యధికంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నది అక్కడే.. కొనడం కష్టమే!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా ఇళ్ల ధరలు పెరుగుతున్న నగరాల జాబితాలో భారత్‌కు చెందిన నగరాలు ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ (Knight Frank) విడుదల చేసిన ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరం ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో నాలుగో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 6.5 శాతం పెరుగుదలతో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో ఉన్న 22వ ర్యాంక్ నుంచి ఈసారి 18 స్థానాలు ఎగబాకింది. అలాగే న్యూ ఢిల్లీ, బెంగళూరు నగరాలు కూడా తమ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో మెరుగుదలను నమోదు చేశాయి. న్యూ ఢిల్లీ ఎన్సీఆర్ 4.1 శాతం వృద్ధితో ఏడాది క్రితం 36వ ర్యాంక్ నుంచి ఈ ఏడాది 10వ స్థానానికి ఎగబాకిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. బెంగళూరు ర్యాంక్ గతేడాది 27 నుంచి ఈ ఏడాది 2.2 శాతం వృద్ధితో 17కి పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 12 నెలల కాలంలో 46 మార్కెట్లలో వార్షిక ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో సగటు పెరుగుదల 2.1 శాతంగా నమోదైంది. ఇది గతేడాది మూడో త్రైమాసికం నుంచి నమోదైన అత్యంత బలమైన వృద్ధి రేటు. మొత్తంగా 67 శాతం నగరాలలో ఇళ్ల ధరలు పెరుగుదలను నమోదు చేసినట్లుగా నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. టాప్‌లో మనీలా ఫిలిప్పైన్స్ దేశ రాజధాని మనీలా 21.2 శాతం వార్షిక ధరల పెరుగుదలతో ఈ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బలమైన దేశ, విదేశీ పెట్టుబడులు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గత ఎనిమిది త్రైమాసికాల నుంచి వరుసగా అగ్రస్థానంలో ఉంటూ వస్తున్న దుబాయ్ ఈసారి టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. ఈ ఏడాది కేవలం 15.9 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. ఇక ఈ జాబితాలో శాన్ఫ్రాన్సిస్కో అట్టడుగున నిలిచింది. -
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5 శాతం పెరిగాయి. 8,325 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 7,900గా ఉన్నాయి. ఇళ్ల ధరలు సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో ఇళ్ల విక్రయాలు 12 శాతం పెరిగి 82,612 యూనిట్లుగా ఉన్నాయి. త్రైమాసిక అమ్మకాలు ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇళ్లకు బలమైన డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎనిమిది పట్టణాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 73,691 యూనిట్లుగానే ఉన్నాయి. పట్టణాల వారీగా అమ్మకాలు ముంబైలో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్ త్రైమాసికంలో 4 శాతం పెరిగాయి. 22,308 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 13,981 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోలిస్తే 27 శాతం వృద్ధి నమోదైంది. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 13,619 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13,013 యూనిట్లతో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగాయి. పుణె మార్కెట్లో 20 శాతం వృద్ధితో 13,079 ఇళ్లు అమ్ముడయ్యాయి. చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో 3,870 ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. కోల్‌కతాలో అమ్మకాలు 3,772 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 1,843 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో 6 శాతం అధికంగా 4,108 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ధరల్లోనూ పెరుగుదల డిమాండ్‌కు అనుగుణంగా వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరల పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ఎనిమిది ప్రధాన పట్టణాల్లో అత్యధికంగా హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు 11% పెరిగాయి. కోల్‌కతాలో 7%, బెంగళూరు, ముంబై మార్కెట్లలో 6% చొప్పున, పుణెలో 5%, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్లో 4%, చెన్నై మార్కెట్లో 3% చొప్పున ధరలు పెరిగాయి. ‘‘డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తుండడంతో ఇళ్ల నిల్వలు (అమ్ముడుపోని) గణనీయంగా పెరిగాయి. ఇళ్ల అమ్మకాలు బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. మొత్తం మీద మార్కెట్లో ఆరోగ్యకర పరిస్థితి నెలకొంది’’అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. -
ఆగస్టులో రిజిస్ట్రేషన్లు‘ భూమ్’! టాప్-5 లిస్ట్ ఇదే!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది. గత నెలలో రూ.3,461 కోట్లు విలువ చేసే 6,493 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఈ ఏడాది ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ జరగడం ఇది రెండోసారి. మార్చిలో అత్యధికంగా 6,959 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. జూలై నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్స్‌లో 17 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 15 శాతం ఎక్కువని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీల విలువల పరంగా చూస్తే జూలైతో పోలిస్తే 20 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 22 శాతం ఎక్కువ. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) 68 శాతం వాటా ఈ గృహాలదే.. ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధిక వాటా రూ.50 లక్షల లోపు గృహాలదే. ఈ ఇళ్ల వాటా 68 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.25 లక్షలు లోపు ధర ఉన్న ప్రాపర్టీల వాటా 16 శాతం కాగా.. రూ.25-50 లక్షలు మధ్య ధర ఉన్న ప్రాపర్టీల వాటా 52 శాతం, రూ.50-75 లక్షలవి రూ.16 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 8 శాతం, రూ.కోటి నుంచి రూ.2 కోట్లు ధర ఉన్నవి 7 శాతం, రూ.2 కోట్లకు మించి ధర ఉన్న ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది. 2 వేల చ.అ. లోపు విస్తీర్ణ ఇళ్లు... ♦ గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీ వాటా 70 శాతంగా ఉంది. 2 వేల నుంచి 3 వేల చ.అ. మధ్య ఉన్న ఇళ్ల వాటా 9 శాతం, 3 వేల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన యూనిట్ల వాటా 2 శాతంగా ఉంది. ♦ అత్యధిక రిజిస్ట్రేషన్లు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోనే జరిగాయి. ఈ జిల్లా వాటా 43 శాతం ఉండగా.. రంగారెడ్డిలో 39 శాతం, హైదరాబాద్‌లో 17 శాతం రిజిస్ట్రేషన్ వాటాను కలిగి ఉన్నాయి. టాప్-5 రిజిస్ట్రేషన్లన్స్ ఇవే.. ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో టాప్–5 జాబితాలో బేగంపేట, బంజారాహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాలలోని ప్రాపర్టీలు నిలిచాయి. అత్యధికంగా బేగంపేటలో రూ. 8.20 కోట్ల మార్కెట్ విలువ గల రిజిస్ట్రేషన్ జరగగా.. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో రూ.7.47 కోట్లు, రూ.5.60 కోట్లు, రూ.5.60 కోట్ల ప్రాపర్టీలు, ఖైరతాబాద్‌లో రూ.4.76 కోట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆయా యూనిట్ల విస్తీర్ణం 3 వేల చ.అ.లకు మించి ఉన్నవే. -
రియల్టీ మార్కెట్ భారీగా విస్తరణ: 2047 నాటికి
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా విస్తరించనుంది. గతేడాది నాటికి ఈ మార్కెట్ 477 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2047 నాటికి 12 రెట్ల వృద్ధితో 5.8 లక్షల కోట్ల డాలర్లకు వృద్ధి చెందుతుందని నరెడ్కో–నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలియజేసింది. ఇండియా రియల్ ఎస్టేట్: విజన్ 2047’ పేరుతో రియల్టర్ల మండలి నరెడ్కో, ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. (మూన్‌పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!) ప్రస్తుతం దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 7.3 శాతం వాటా కలిగి ఉండగా, 2047 నాటికి 15.5 శాతానికి చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నూరేళ్లకు (2047) దేశ జీడీపీ 33 ట్రిలియన్ డాలర్ల నుంచి 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. నివాస గృహాల మార్కెట్ 299 బిలియన్ డాలర్ల నుంచి 3.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని తెలిపింది. (అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా?) ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 40 బిలియన్ డాలర్ల నుంచి 473 బిలియన్ డాలర్లకు, వేర్ హౌసింగ్ మార్కెట్ విలువ 2.9 బిలియన్ డాలర్ల నుంచి 34 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని వెల్లడించింది. 2023 సంవత్సంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు క్రితం ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరిగి 5.6 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. భారీ అవకాశాలు ‘‘2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించడానికి రియల్ ఎస్టేట్ రంగం చేదోడుగా నిలవనుంది. ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు విస్తరించడంతో అది రియల్ ఎస్టేట్‌లోని అన్ని విభాగాల్లోనూ డిమాండ్‌కు ఊతమిస్తుంది. పెరుగుతున్న అవసరాలు, వినియోగానికి అనుగుణంగా ఎన్నో రెట్లు వృద్ధిని చూస్తుంది’’అని నరెడ్కో ఇండియా ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ వివరించారు. ఆర్థిక వ్యవస్థలో అనుకూల వాతావరణం, మౌలిక రంగ వృద్ధి ప్రణాళికలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి దోహదపడతాయని నరెడ్కో వైస్ చైర్మన్ నిరంజన్ హిరనందానీ తెలిపారు. ‘‘వచ్చే 25 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో రూపాంతరం చూడనున్నాం. అధిక జనాభా, మెరుగైన వ్యాపారం, పెట్టుబడుల వాతావరణం, తయారీ, ఇన్ఫ్రాకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు అనుకూలతలు’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. ‘‘కరోనా తర్వాత హౌసింగ్ రంగం మరింత బలంగా, ఆరోగ్యంగా మారింది. విక్రయాలు బలంగా నమోదవుతున్నాయి. ధరలు పెరగడమే కాకుండా, అదే సమయంలో విక్రయం కాని యూనిట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం బలాన్ని, మెరుగైన భవిష్యత్తును తెలియజేస్తున్నాయి’’అని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. -
ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్న నగరాలేంటో తెలుసా?
పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావం గృహ రుణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అత్యధిక వడ్డీ రేట్ల కారణంగా వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది. అయినప్పటికీ దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్‌లో ఇళ్లను కొనుగోలు చేసే సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో పూణే, కోల్‌కతాలు ఉన్నాయి. ఇంటి ధరను, ఏడాదికి ఓ కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వారి ఆదాయంతో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఎక్కడ ఇళ్లను కొనుగోలు చేసే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుందో వివరిస్తుంది. వాటిలో 23 శాతం నిష్పత్తితో పుణె, కోల్‌కతా 26 శాతం చొప్పున ఉన్నాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఈ సందర్భంగా ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్న 8 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిల్లో ముంబై, ఢిల్లీ - ఎన్సీఆర్, బెంగళూరు,చెన్నై, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్‌లు మోస్ట్ అఫార్డబుల్ ఇండెక్స్ జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నాయి. నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఒక నగరంలో ఇల్లు కొనుగోలు స్థాయి 40 శాతం అంటే, ఆ నగరంలోని కుటుంబాలు ఆ యూనిట్ కోసం హౌసింగ్ లోన్ ఈఎంఐకి చెల్లించేందుకు వారి ఆదాయంలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందని సూచిస్తుంది. 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐ ఆదాయ నిష్పత్తి భరించలేనిదిగా పరిగణిస్తుంది. -
హైదరాబాద్‌లో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. 2023 ఆర్ధిక సంవత్సరంలో నగరంలో 51 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. అయితే 2022 ఆర్ధిక సంవత్సరంలోని 54 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3 పీఎల్), ఈ–కామర్స్ సంస్థల లావాదేవీలలో తాత్కాలిక మందగమనమే ఈ క్షీణతకు ప్రధాన కారణమని పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్‌మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని తెలిపింది. వేర్‌హౌస్ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతుంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన గిడ్డంగుల లీజుల మాన్యుఫాక్చరింగ్ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్ 21 శాతం, ఈ–కామర్స్ 17 శాతం, రిటైల్ రంగం 14 శాతం, ఎఫ్ఎంసీజీ 5 శాతం, ఎఫ్ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మేడ్చల్ క్లస్టర్లో వేర్‌హౌస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2022 ఆర్ధిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60 శాతం ఉండగా.. 2023 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్ క్లస్టర్లో క్షీణత, పటాన్చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్చెరు క్లస్టర్ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. హైదరాబాద్ అనేక రంగాలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ ఏర్పడిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు. నగరంలోని ప్రధాన గిడ్డంగుల క్లస్టర్లు ఇవే మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, షామీర్పేట్, పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్. ఆయా ప్రాంతాలలో గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్–బీ అయితే రూ.16–19గా ఉంది. -
కళ్లు తిరిగేలా.. దేశంలో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: ఖరీదైన నివాస గృహాల ధరల పెరుగుదలలో అంతర్జాతీయంగా ముంబై నగరం 6వ స్థానంలో నిలిచినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. 2023 సంవత్సరం మొదటి మూడు నెలల కాలానికి సంబంధించి ఈ సంస్థ ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ1, 2023’ను విడుదల చేసింది. ఈ కాలంలో ముంబైలో ఖరీదైన ఇళ్ల ధరలు 5.5 శాతం పెరిగాయి. అలాగే, బెంగళూరు, న్యూఢిల్లీలోనూ సగటున ధరలు పెరిగాయి. ఖరీదైన ఇళ్ల ధరల పెరుగుదల పరంగా 2022 మొదటి త్రైమాసికం జాబితాలో ముంబై 38వ ర్యాంకులో ఉండగా, ఏడాది తిరిగేసరికి 6వ స్థానానికి చేరుకున్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో గతేడాది ఇదే కాలంలో 37వ ర్యాంకులో ఉన్న బెంగళూరు తాజా జాబితాలో 16కు, న్యూఢిల్లీ 39 నుంచి 22వ ర్యాంకుకు చేరుకున్నాయి. ‘‘ముంబైలో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు 5.5 శాతం పెరగ్గా, బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరిగాయి. న్యూఢిల్లీలో ఈ పెరుగుదల 1.2 శాతంగా ఉంది’’అని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 46 పట్టణాల్లో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరల పెరుగుదల ఆధారంగా వాటికి ర్యాంకులకు కేటాయిస్తుంటుంది. స్థానిక కరెన్సీలో సాధారణ ధరలను ప్రామాణికంగా తీసుకుంటుంది. ముంబైలో ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరగడమే సూచీలో మెరుగైన ర్యాంకుకు తీసుకెళ్లినట్టు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ముంబై ఇళ్ల మార్కెట్లో అన్ని విభాగాల్లోనూ డిమాండ్ బలంగానే ఉందని, ఖరీదైన ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా దుబాయిలో ఖరీదైన ఇళ్ల ధరలు 44.2 శాతం పెరగడంతో, ఈ నగరం మొదటి స్థానంలో నిలిచింది. చదవండి👉 సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా? -
సంపదలో 6 శాతం పుత్తడికి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌తోపాటు చైనాకు చెందిన అల్ట్రా–హై నెట్ వర్త్ వ్యక్తులు (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) గత సంవత్సరం పెట్టుబడి పెట్టదగిన సంపదలో 6 శాతం బంగారంలో ఉంచారని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ‘8 శాతం కేటాయింపులతో ఆస్ట్రేలియాకు చెందిన యూహెచ్ఎన్డబ్ల్యూఐలు తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా సగటు 3 శాతం కాగా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది 4 శాతంగా ఉంది. పెట్టుబడి పెట్టదగిన సంపదలో బంగారానికి భారతీయులు చేసిన కేటాయింపులు 2018లో 4 శాతం నమోదైంది. సంవత్సరాలుగా పుత్తడి అందించిన గణనీయమైన రాబడి ఈ పెరుగుదలకు కారణం. 2018–19 నుంచి 2022–23 మధ్య పసిడి 69 శాతం కంటే ఎక్కువగా రాబడిని అందించింది. మహమ్మారి తక్కువ వడ్డీ రేటుకు దారితీసింది. అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు అనుసరించిన సులభ నగదు లభ్యత వ్యూహం ధరలను భారీగా పెంచింది’ అని నివేదిక వివరించింది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో స్థిరత్వాన్ని అందించే, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే సాధనాలను ఆశ్రయిస్తున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. -
రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు
న్యూఢిల్లీ: భారత్‌లో జనవరి–మార్చిలో ఎనమిది ప్రధాన నగరాల్లో స్థిరాస్తి రంగం స్థిర డిమాండ్‌ను నమోదు చేసిందని రియల్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ‘2022 తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో గృహాల విక్రయాలు 1 శాతం ఎగసి 79,126 యూనిట్లు నమోదయ్యాయి. గృహాల అమ్మకాలు హైదరాబాద్‌లో 19 శాతం పెరిగి 8,300 యూనిట్లు, చెన్నై 8 శాతం వృద్ధితో 3,650 యూనిట్లుగా ఉంది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) కార్యాలయాల స్థూల లీజింగ్ 5 శాతం దూసుకెళ్లి 1.13 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ 46 శాతం క్షీణించి 8 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఎనమిది నగరాల్లో గృహాల ధరలు 1–7 శాతం అధికం అయ్యాయి. బెంగళూరులో 7 శాతం, ముంబై 6, హైదరాబాద్, చెన్నైలో 5 శాతం ధరలు పెరిగాయి. ఆఫీసుల అద్దె 2–9 శాతం హెచ్చింది. కోల్‌కతలో 9 శాతం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో 5 శాతం దూసుకెళ్లాయి. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) బలమైన ఆర్థిక వాతావరణం కారణంగా 2023లో ఆఫీస్ మార్కెట్ సానుకూలంగా అడుగు పెట్టడానికి సహాయపడింది. 2023 మొదటి త్రైమాసికంలో అమ్మకాల స్థాయి నిలకడగా ఉన్నందున పెరుగుతున్న వడ్డీ రేట్లు, ధరల నేపథ్యంలో గృహాల మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. కొన్ని నెలలుగా గృహ కొనుగోలుదార్ల కొనుగోలు సామర్థ్యం ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ సొంత ఇంటి ఆవశ్యకత డిమాండ్‌ను పెంచుతూనే ఉంది. మధ్య, ప్రీమియం గృహ విభాగాలు ఈ నగరాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ఈ ఏడాది కూడా పరిమాణం పెంచుతాయని ఆశించవచ్చు’ అని వివరించింది. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) -
రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్: టాప్-5లో హైదరాబాద్ ఉందా?
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఐదు అత్యుత్తమ పనితీరు చూపించిన నివాసిత ప్రాపర్టీ మార్కెట్లలో ముంబై, బెంగళూరు చోటు సంపాదించాయి. వార్షికంగా నివాస ధరల వృద్ధి ఈ రెండు పట్టణాల్లోనూ 7 శాతం మేర ఉంది. ‘ఆసియా పసిఫిక్ రెసిడెన్షియల్ రివ్యూ ఇండెక్స్’ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో వార్షిక ధరల వృద్ధి పరంగా టాప్-5లో బెంగళూరు, ముంబై ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం 23 పట్టణాలకు గాను 14 పట్టణాల్లో వార్షికంగా ధరలు పెరిగాయి. ఈ జాబితాలో వార్షికంగా 24 శాతం ధరల వృద్ధితో మెట్రో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. 9.3 శాతం ధరల వృద్ధితో సింగపూర్, 9 శాతం వృద్ధితో టోక్యో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 6.8 శాతం పెరగ్గా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టాప్–10లో చోటు సంపాదించుకుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ మార్కెట్లలో వచ్చే 12 నెలల్లో ఇళ్ల ధరలు మోస్తరుగా ఉండొచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేస్తోంది. బెంగళూరులో ఇళ్ల ధరలు 3–5 శాతం మధ్య, ముంబై, ఢిల్లీలో 3–4 శాతం మధ్య పెరగొచ్చని పేర్కొంది. (ఇదీ చదవండి: పెంట్ హౌస్ రూ.240 కోట్లా.. ఎక్కడో తెలుసా?) -
రియల్టీ వృద్ధి: ద్రవ్యోల్బణం ప్రభావం ఎంత?
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ (రియల్టీ) రంగంలో వచ్చే ఆరు నెలల కాలానికి వృద్ధి పట్ల డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు ఆశావహ అంచనాలతో ఉన్నాయి. అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, మోర్ట్గేజ్ రేట్లు పెరుగుల ప్రభావం ఉన్నా కానీ, వృద్ధి పట్ల సానుకూల సెంటిమెంట్ నెలకొంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్, రియల్ ఎస్టేట్ డెవలపర్ల మండలి నరెడ్కో సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ క్యూ3, 2022’ నివేదికలో వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో సెంటిమెంట్ స్కోరు 62 ఉంటే, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 61కి తగ్గింది. ఈ స్కోరు 50కి పైన ఉంటా ఆశావహంగాను, 50 స్థాయిలో ఉంటే తటస్థం, అంతకు దిగువన ఉంటే నిరాశావాదంగా పరిగణిస్తారు. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్) స్వల్ప క్షీణత ‘‘అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణం, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సెంటిమెంట్ స్కోరు అతి స్వల్పంగా తగ్గింది. రియల్ ఎస్టేట్ రంగం, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఈ రంగంలో ఇప్పటికీ సెంటిమెంట్ సానుకూలంగా ఉంది’’అని నైట్ ఫ్రాంక్ తెలిపింది. వచ్చే ఆరు నెలల కాలానికి భాగస్వామల అంచనాల ఆధారంగా నిర్ణయించే భవిష్యత్ సెంటిమెంట్ స్కోరు ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 62 ఉంటే, సెప్టెంబర్ త్రైమాసికంలో 57కు తగ్గింది. ‘‘ద్రవ్యోల్బణం అధికంగానే ఉంది. దీనికితోడు మానిటరీ పాలసీ చర్యలు కఠినతరం అవుతున్నాయి. దీంతో వచ్చే ఆరు నెలల కాలానికి సంబంధించిన సెంటిమెంట్ స్కోరుపై ప్రభావం పడింది’’అని నైట్ ఫ్రాంక్ వివరించింది. (ఇన్వెస్టర్లకు రాబడులు: ఎల్ఐసీకి కేంద్రం సూచనలు) అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రతిఫలించలేదని రియల్ ఎస్టేట్ భాగస్వాములు భావిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ప్రస్తుత, భవిష్యత్తు అంచనాల విషయంలో కొంత అప్రమత్త ధోరణితో ఉన్నట్టు పేర్కొంది. రెపో రేట్ల పెంపు తర్వాత ఇళ్ల అందుబాటుపైనా ప్రభావం పడినట్టు తెలిపింది. ‘‘రియల్ ఎస్టేట్‌లో ఇళ్ల అమ్మకాలు గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం నెలకొన్నప్పటికీ ఈ రంగం బలమైన పనితీరు చూపిస్తోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు రియల్టీలో పెట్టుబడులు కొనసాగిస్తారు’’అని నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ వివరించారు. -
సస్టెయినబిలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్
న్యూఢిల్లీ: వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన సస్టెయినబిలిటీ నిబంధనల అమలులో.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ సహా నాలుగు భారత పట్టణాలు స్థానం సంపాదించుకున్నాయి. టాప్ 20 పట్టణాల్లో హైదరాబాద్ 18వ స్థానంలో ఉంటే, బెంగళూరు 14వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ 17, ముంబై 20వ స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు ‘ఏపీఏసీ సస్టెయినబిలిటీ ఇండెక్స్ 2021’ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. సస్టెయినబిలిటీ అంటే సులభంగా పర్యావరణానికి, సమాజానికి అనుకూలమైన నిర్మాణాలని అర్థం. సింగపూర్, సిడ్నీ, వెల్లింగ్టన్, పెర్త్, మెల్బోర్న్ ఇండెక్స్‌లో టాప్–5 పట్టణాలుగా ఉన్నాయి. పట్టణీకరణ ఒత్తిళ్లు, వాతావరణ మార్పుల రిస్క్, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ చర్యలను ఈ ఇండెక్స్ పరిగణనలోకి తీసుకుంది. ‘‘నూతన మార్కెట్ ధోరణలు భారత్‌లో సస్టెయినబిలిటీ అభివృద్ధికి ప్రేరణగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రపంచం కర్బన ఉద్గారాల తటస్థ స్థితి (నెట్ జీరో)కి కట్టుబడి ఉండడం అన్నది పర్యావరణ అనుకూల భవనాలకు డిమాండ్ కల్పిస్తోంది. దీంతో భారత డెవలపర్లు ఈ అవసరాలను చేరుకునే విధంగా తమ ఉత్పత్తులను రూపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. సస్టెయినబిలిటీ, పర్యావరణ అనుకూల ప్రమాణాలతో కూడిన భవనాలకు డిమాండ్ పెరిగితే ఈ సదుపాయాలు సమీప భవిష్యత్తులోనే అన్ని ప్రాజెక్టులకు సాధారణంగా మారతాయన్నారు. -
సంపన్నులు... తగ్గేదేలే!
న్యూఢిల్లీ: దేశంలో అల్ట్రా హెచ్ఎన్ఐ (అధిక విలువ కలిగిన వ్యక్తులు)ల సంఖ్య 2021లో 11 శాతం పెరిగి 13,637కు చేరుకుంది. 30 మిలియన్ డాలర్లు (రూ.225 కోట్లు) అంతకంటే ఎక్కువ కలిగిన వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా పరిగణిస్తారు. గడిచిన ఏడాది ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం, డిజిటల్ విప్లవం హెచ్ఎన్ఐల వృద్ధికి తోడ్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. 2021లో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ మూడో స్థానంలోఉన్నట్టు పేర్కొంది. 748 బిలియనీర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే, 554 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. భారత్‌లో 145 మంది బిలియనీర్లు ఉన్నారు. ‘ద వెల్త్ రిపోర్ట్ 2022’ను నైట్ ఫ్రాంక్ మంగళవారం విడుదల చేసింది. ► 2021లో అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య అంతర్జాతీయంగా 9.3 శాతం పెరిగి 6,10,569కు చేరింది. అంతకుముందు సంవత్సరంలో వీరి సంఖ్య 5,58,828. ► భారత్‌లో అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 2020 చివరికి 12,287గా ఉంటే, 2021 చివరికి 13,637కు పెరిగింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే వృద్ధి ఎక్కువగా నమోదైంది. ► బెంగళూరు నగరంలో వీరి సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. గతేడాది ఈ నగరంలో అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 17 శాతం వృద్ధి చెంది 352గా ఉంది. ► ఆ తర్వాత ఢిల్లీలో 12.4 శాతం పెరిగి 210కి, ముంబైలో 9 శాతం పెరిగి 1,596కు అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య చేరింది. ► దేశంలోని సంపన్నుల్లో 69 శాతం మంది సంపద 2022లో 10 శాతం పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ అంచనా. ► ఆసియా బిలియనీర్ల క్లబ్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి ఉన్న బిలియనీర్లలో 36 శాతం మంది ఆసియాలోనే ఉన్నారు. ► అంతర్జాతీయంగా 1,35,192 అల్ట్రా హెచ్ఎన్ఐలు తాము సొంతంగా సంపాదించి ఈ స్థితికి చేరినవారు. వీరిలో 40 ఏళ్లలోపు వారు 20 శాతంగా ఉన్నారు. ► ఇలా స్వయంగా పైకి ఎదిగిన అల్ట్రా హెచ్ఎన్ఐల వృద్ధి విషయంలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. ► వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయంగా హెచ్ఎన్ఐల సంఖ్య 28 శాతం పెరుగుతుందని అంచనా. అలాగే భారత్‌లో 2021–2026 మధ్య అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 39 శాతం పెరిగి 19,006కు చేరుకోవచ్చు. ఆభరణాలు, క్లాసిక్ కార్లు, కళాఖండాలు అల్ట్రా హెచ్ఎన్ఐలు తమ పెట్టుబడుల్లో 11 శాతాన్ని లగ్జరీ వస్తువులకు కేటాయిస్తున్నారు. క్లాసిక్ కార్లు, ఆభరణాలు, పెయింటింగ్‌లు, కళాఖండాలు, వాచీలు, హ్యాండ్‌బ్యాగుల కొనుగోలుకు మొగ్గు చూపిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే అల్ట్రా హెచ్ఎన్ఐలు వీటి కోసం తమ పెట్టుబడుల్లో 16 శాతం కేటాయిస్తున్నట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలియజేసింది. అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల్లో 29 శాతం మంది 2021లో ఈ తరహా ప్యాషన్ పెట్టుబడులపై ఎక్కువ వెచ్చించారు. ప్యాషన్ పెట్టుబడులన్నవి.. రాబడుల కంటే కూడా వాటిల్లో వాటా ఉందన్న ఆనందాన్నిచ్చేవి. వీటిల్లోనూ కళాఖండాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటే, ఆభరణాలు, క్లాసిక్ కార్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు, వైన్ గతంలో మొదటి స్థానంలో ఉంటే, అవి ఇప్పుడు 5, 7వ స్థానాలకు వెళ్లాయి. కళాత్మక ఉత్పత్తులు 2021లో 13 శాతం రాబడులను ఇవ్వగా, గత పదేళ్లలో 75 శాతం రాబడిని ఇచ్చాయి. వైన్ 16 శాతం, అరుదైన విస్కీ బ్రాండ్లపై పెట్టుబడి 9 శాతం వృద్ధి చెందింది. ప్రాపర్టీలపై 29 శాతం అల్ట్రా హెచ్ఎన్ఐలు గతేడాది తమ సంపదలో 29 శాతాన్ని ప్రాథమిక, ద్వితీయ ఇళ్ల కోసం కేటాయించారు. వీరు పెట్టుబడుల మొత్తంలో 22 శాతాన్ని వాణిజ్య ఆస్తులు (కార్యాలయం, వాణిజ్య భవనం) కొనుగోలుకు వెచ్చించారు. 8% సంపదను రీట్ తదితర సాధనాల్లో పెట్టుబడులకు వినియోగించారు. ఇక భారత అల్ట్రా హెచ్ఎన్ఐ ప్రాపర్టీల్లో 8% విదేశాల్లో ఉన్నాయి. 10% మంది ఈ ఏడాది ఇల్లు కొనుగోలు ప్రణాళికతో ఉన్నారు. మన దేశం తర్వాత బ్రిటన్, యూఏఈ, అమెరికాల్లో ప్రాపర్టీల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రిప్టోల్లోనూ పెట్టుబడులు భారత్‌లోని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల్లో 18 శాతం మందికి క్రిప్టోల్లో పెట్టుబడులు ఉన్నాయి. వీరిలో 10 శాతం మంది క్రిప్టోకరెన్సీలు, క్రిప్టో టోకెన్లలో పెట్టుబడులు పెడితే, 8 శాతం మంది ఎన్ఎఫ్టీలను కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా చూస్తే 18 శాతం అల్ట్రా హెచ్ఎన్ఐలు క్రిప్టో పెట్టుబడులు కలిగి ఉన్నారు. వీరిలో 11 శాతం మంది నాన్ ఫంజిబుల్ టోకెన్లలో (ఎన్ఎఫ్టీలు) ఇన్వెస్ట్ చేశారు. -
రియల్టీకి కలిసొచ్చిన 2021.. హైదరాబాద్ తర్వాతే ముంబై
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 8 ప్రముఖ పట్టణాల్లో గతేడాది ఇళ్ల విక్రయాలు అధికంగా నమోదయ్యాయి. 2020లో విక్రయాలతో పోలిస్తే గతేడాది 51 శాతం పెరిగాయి. 2020లో 1.54,534 యూనిట్లు అమ్ముడుపోగా, 2021లో 2,32,903 యూనిట్లు విక్రయమయ్యాయి. కానీ, 2019లో విక్రయాలతో పోలిస్తే గతేడాది అమ్మకాలు 5 శాతం తక్కువగానే ఉన్నాయి. 2011లో నమోదైన గరిష్ట విక్రయాలతో పోలిస్తే 37 శాతం తక్కువ. ఈ వివరాలను నైట్‌ఫ్రాంక్ ఇండియా ‘ఇండియా రియల్ ఎస్టేట్ 2021’ నివేదిక రూపంలో విడుదల చేసింది. ఆఫీస్ స్పేస్ కార్యాలయ స్థలాల విభాగంలో స్థూల లీజు (ఆఫీసు స్పేస్ కిరాయికి ఇవ్వడం) పరిమాణం 38.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. 2020లో ఇది 39.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ‘‘కార్యాలయ స్థలాల మార్కెట్‌పై కరోనా రెండో విడత ప్రభావం పడింది. 2019లో లీజు స్థలం 60.6 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే గతేడాది తక్కువగానే నమోదైంది. కరోనా కల్పించిన అసాధారణ పరిస్థితులు, లాక్డౌన్లు ఉన్నప్పటికీ 2021లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ బలమైన పనితీరు చూపించింది’’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. హైదరాబాద్‌లో రెండు రెట్లు అధిక విక్రయాలు హైదరాబాద్ మార్కెట్లో 2021లో 24,318 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు అధికం. కార్యాలయ స్థలాల లీజు మార్పు లేకుండా(ఫ్లాట్‌గా) 6 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ముంబై మార్కెట్లో ఇళ్ల విక్రయాలు 29 శాతం పెరిగి 62,989 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో విక్రయాలు 48,688 యూనిట్లు కావడం గమనార్హం. చదవండి:హైదరాబాద్‌కి షాకిచ్చిన జేఎల్ఎల్ ఇండియా వార్షిక ఫలితాలు -
ధరల్లో తగ్గేదేలే..! హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా..
కోవిడ్ కారణంగా సామాన్యుల్లో సొంతిల్లు కొనుగోలు చేయాలని కోరిక పెరిగింది. దీనికి తోడు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో గృహాల కొనుగోళ్లు, అదే సమయంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ మూడో త్రైమాసికానికి సంబంధించి ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సైతం ఇదే విషయం వెల్లడైంది. అంతేకాదు గృహాల ధరల పెరుగుదలలో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 128వ స్థానంలో ఉంది. భారతీయ నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఏడాదిలో భాగ్యనగరిలో ఇళ్ల ధరలు 2.5 శాతం అధికం అయ్యాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. చెన్నై 131, కోల్‌కత 135, అహ్మదాబాద్ 139వ స్థానంలో ఉంది. ఈ మూడు నగరాల్లో ఇళ్ల ధరలు 0.4–2.2 శాతం పెరిగాయి. బెంగళూరు 140, ఢిల్లీ 142, పుణే 144, ముంబై 146 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ నగరాల్లో ధరలు 0.2–1.8% తగ్గాయి. జాబితాలో టర్కీలోని ఇజ్మీర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కొత్త ఇల్లు కొనే ముందు.. ఈ 3/20/30/40 ఫార్ములా గురించి తప్పక తెలుసుకోండి? -
ఇళ్ల ధరలు: భారత్ ఎన్నో స్థానంలో అంటే..
న్యూఢిల్లీ: ఇళ్ల ధరల సూచీలో 55 దేశాలకు గాను భారత్ 54 వ స్థానంలో నిలిచినట్టు నైట్‌ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్‌లో ఇళ్ల ధరలు 0.5 శాతం తగ్గినట్టు పేర్కొంది. ఈ ఏడాది (2021) మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్ 55వ స్థానంలో ఉండడం గమనార్హం. టర్కీలో ఇళ్ల ధరలు 29.2 శాతం పెరగడంతో ర్యాంకుల్లో ఈ దేశం మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌లో ధరలు 25.9 శాతం వృద్ధి చెందడంతో రెండో స్థానంలోనూ, యూఎస్ మూడో స్థానంలో (ఇళ్ల ధరలు 18.6 శాతం పెరుగుదల) ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరలను ‘గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్’ కింద నైట్‌ఫ్రాంక్ పరిగణనలోకి తీసుకుని ఈ వివరాలను ప్రతీ త్రైమాసికానికి విడుదల చేస్తుంటుంది. 2021 రెండో త్రైమాసికంలో 18 దేశాల్లో ఇళ్ల ధరలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. ఇళ్ల ధరలు కేవలం భారత్, స్పెయిన్‌లో మాత్రమే తగ్గాయి. రానున్న త్రైమాసికాల్లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ విశ్లేషించారు. చదవండి: ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
భారత్‌లో తగ్గిన ఇళ్ల ధరలు
దేశంలో గృహాల ధరలు పడిపోయాయి. గతేడాది జనవరి-మార్చితో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో ధరలు 1.6 శాతం మేర క్షీణించాయి. వార్షిక ధరల వృద్ధి ప్రాతిపదికన ప్రపంచ ర్యాంకింగ్‌లో ఇండియా 55వ స్థానంలో ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ రిపోర్ట్ ‘గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ క్యూ1, 2021’ తెలిపింది. మొత్తం 56 దేశాలలోని గృహాల ధరల వృద్ధిని పరిశోధన చేయగా.. చిట్ట చివరి స్థానంలో 1.8 శాతం ధరల క్షీణతతో స్పెయిన్ నిలవగా.. దానికంటే ముందు ఇండియా నిలిచింది. గతేడాది జనవరి-మార్చిలో గ్లోబల్ ధరల సూచికలో ఇండియాది 43వ స్థానం. ఏడాదిలో 12 స్థానాలకు పడిపోయింది. కరోనా సెకండ్ వేవ్, కొత్త వేరియంట్ల ముప్పు, వ్యాక్సినేషన్లలో హెచ్చుతగ్గులతో విక్రయాలు, ధరల పెరుగుదలపై ఒత్తిడి ఉందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. ఈ ఏడాది క్యూ1లో దేశంలో గృహాల విక్రయాలలో రికవరీ కనిపిస్తుందని.. దీంతో ధరలు స్థిరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. 56 దేశాలలో ఈ ఏడాది క్యూ1లో నివాస ధరలు 7.3 శాతం మేర వృద్ధి చెందాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 32 శాతం ధరల వృద్ధితో టర్కీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 22.1 శాతం వృద్ధితో న్యూజిలాండ్ రెండో స్థానంలో, 16.6 శాతం వృద్ధితో లక్సెంబర్గ్ మూడో స్థానంలో నిలిచాయి. 2005 నుంచి యూఎస్ అత్యధిక వార్షిక ధరల వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఏటా ఇక్కడ గృహాల ధరలలో 13.2 శాతం వృద్ధి నమోదవుతుంది. చదవండి: కోవిడ్ ఔషధాల ధరలు తగ్గేనా? -
ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా
ముంబై, సాక్షి: రెసిడెన్షియల్ విభాగంలో ఈ కేలండర్ ఏడాది(2020) ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా నమోదైంది. జులై-డిసెంబర్ మధ్య కాలంలో దేశీయంగా రూ. 50 లక్షల విలువకు పైబడిన ఇళ్ల అమ్మకాల వాటా 57 శాతాన్ని తాకింది. ఇదే సమయంలో అందుబాటు ధరల గృహ విక్రయాలు 43 శాతానికి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ప్రభావం చూపినట్లు రియల్టీ రంగ విశ్లేషణ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలియజేసింది. (రియల్టీ రంగానికి స్టీల్ షాక్) హైఎండ్‌లో ఈ ఏడాది విలాసవంత విభాగంలో గృహాల కొనుగోలుకి వినియోగదారులు అధిక ఆసక్తిని చూపినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. మార్కెట్లో ప్రవేశించేందుకు 2020 అనుకూలమని అత్యధికులు భావించినట్లు తెలియజేసింది. దీనికితోడు ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్న వర్గాలకు హౌసింగ్ రుణాల అందుబాటు తదితర అంశాలు జత కలసినట్లు వివరించింది. దీర్ఘకాలిక రుణ చెల్లింపుల సామర్థ్యం కలిగిన వ్యక్తులు గృహ కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు అభిప్రాయపడింది. (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) హైదరాబాద్ టాప్ రెసిడెన్షియల్ విభాగంలో అధిక పరిమాణంలో అమ్మకాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో రియల్టీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఈ విషయంలో త్రైమాసిక ప్రాతిపదికన ముంబై, పుణే 121 శాతం పురోగతిని చూపినట్లు పేర్కొంది. అయితే కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టడంలో హైదరాబాద్ 480 శాతం వృద్ధితో తొలి ర్యాంకులో నిలిచినట్లు పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో మొత్తం 1,46,228 యూనిట్ల ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు తెలియజేసింది. అయితే ఇవి అంతక్రితం ఏడాదితో పోలిస్తే 34 శాతం తక్కువేనని తెలియజేసింది.