Kolhapur
-
సురభివారి గాలి మోటార్
కొల్లాపూర్: నేడు విమానాల్లో ప్రయాణించటం పెద్ద విషయమేమీ కాదు. సామాన్యులు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ, ఓ వందేళ్లు వెనక్కు వెళితే? అప్పుడప్పుడే గాల్లోకి ఎగురుతున్న విమానం సాధారణ ప్రజలకు ఒక వింత. డబ్బున్నవాళ్లకు దానిని సొంతం చేసుకోవాలన్న ఆరాటం. నాడు సొంత విమానాలు కలిగి ఉండటమంటే మామూలు విషయం కాదు. కానీ, తెలంగాణలోని ఓ సంస్థానాదీశులు ఆ ఘనతను సాధించారు. జటప్రోలు (కొల్లాపూర్) సంస్థానాన్ని పాలించిన సురభి వంశస్తులు దాదాపు 93 ఏళ్ల క్రితమే సొంత విమానాల్లో తిరిగారు. పైలట్లుగా శిక్షణ పొంది లైసెన్సులూ సంపాదించారు. ఐవీఆర్తో ప్రారంభం క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి కొల్లాపూర్ ప్రాంతాన్ని సురభి వంశస్తులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. 1507 సంవత్సరం నుంచి వారి పాలనకు సంబంధించిన ఆధారాలున్నాయి. 1840లో తమ సంస్థానాన్ని జటప్రోలు నుంచి కొల్లాపూర్‌కు మార్చారు. 1884 నుంచి 1929 వరకు నిజాం నవాజ్వంత్ బహదూర్గా పిలిచే రాజా వెంకటలక్ష్మారావు కొల్లాపూర్‌ను పాలించారు. ఆయన తర్వాత రాణి వెంకటరత్నమ్మ రాజ్యపాలన చేపట్టారు. వెంకటలక్ష్మారావు కుమార్తె సరస్వతీ దేవిని బొబ్బిలి రాజ్యంలోని తిరుపాచారు జమీందారు ఇనుగంటి వెంకటకృష్ణారావు (ఐవీఆర్) వివాహం చేసుకున్నారు.ఆయన విమానాలు నడపాలనే కోరికతో పైలట్‌గా శిక్షణ కూడా పొందారు. 1931 నవంబర్ 11న ఆయన ఢిల్లీలో పైలట్‌గా లైసెన్స్ తీసుకొన్నారు. తమ అల్లుడు ఐవీఆర్ కోసం సురభి రాజులు ఇద్దరు ప్రయాణించగల విమానాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో మద్రాసు ప్రావిన్సులో మాత్రమే ఒక రాజ కుటుంబానికి సొంత విమానం ఉండేది. దక్షిణ భారతదేశంలో సొంత విమానం కొనుగోలు చేసిన రెండో కుటుంబం సురభి రాజులదే. దీనికి వేంకట అనే పెట్టారు. విమానాన్ని నిలిపేందుకు కొల్లాపూర్‌లోని జఫర్ మైదానాన్ని ఎయిర్‌పోర్టుగా వినియోగించారు. హకీంపేటలో నిర్వహించిన విమానాల పోటీల్లో జేఆర్డీ టాటాతోపాటు ఐవీఆర్ కూడా పాల్గొన్నారు.మద్రాసు నుంచి బెంగళూరు వరకు 1,800 అడుగుల ఎత్తులో విమానాన్ని నడిపి ఐవీఆర్ రికార్డు సృష్టించారు. ఇంతటి ప్రతిభావంతుడైన ఐవీఆర్.. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలోనే 1935 ఆగస్టు 25న మరణించారు. ఆయన స్మారకార్థం జఫర్ మైదానం సమీపంలోనే (ఆర్ఐడీ బాలుర జూనియర్ కళాశాల పక్కన, వాలీ్మకి గుడి వద్ద) స్తూపం ఏర్పాటుచేశారు. -
దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసిన రాహుల్
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రంలో ఓ దళిత కుటుంబాన్ని సందర్శించారు. కొల్హాపూర్‌లోని అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే ఇంట్లో వారితో కలిసి వంట చేయడమే కాకుండా భోజనం కూడా చేశారు.వారి ఇంట్లో భోజనం చేయాల్సిందిగా.. రాహుల్ గాంధీని ఆ జంట ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ సోమవారం వారి వద్దకు వెళ్లారు. వారితో పాటు వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. దళితుల సంప్రదాయాల్లోని వివిధ వంటకాలను రాహుల్ గాంధీ రుచిచూశారు. దళితుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సూచించారు.दलित किचन के बारे में आज भी बहुत कम लोग जानते हैं। जैसा शाहू पटोले जी ने कहा, “दलित क्या खाते हैं, कोई नहीं जानता।”वो क्या खाते हैं, कैसे पकाते हैं, और इसका सामाजिक और राजनीतिक महत्व क्या है, इस जिज्ञासा के साथ, मैंने अजय तुकाराम सनदे जी और अंजना तुकाराम सनदे जी के साथ एक दोपहर… pic.twitter.com/yPjXUQt9te— Rahul Gandhi (@RahulGandhi) October 7, 2024 కాగా షాహు పటోలే సనాదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా అనే పుస్తకాన్ని కూడా రాశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ తన ఎక్స్‌లో షేర్ చేశారు.‘ఈనాటికీ దళితుల వంటశాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. షాహూ పటోలే జీ చెప్పినట్లు, దళితులు ఏమి తింటారో ఎవరికీ తెలియదు. వాళ్లు ఏం తింటారు, ఎలా వండుతారు, దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో అజయ్ తుకారాం సనదే, అంజనా తుకారాం సనదేతో మధ్యాహ్నం గడిపాను.తను నన్ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని తన ఇంటికి చాలా గౌరవంగా ఆహ్వానించాడు. వంటగదిలో అతనికి సహాయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. పటోలే ఇంట్లో హర్భర్యాచి భాజీ, పాలకూర, వంకాయలతో తుపర్ పప్పు తయారు చేశాం. దళితలుకు రాజ్యాంగ అనేక హక్కులను కల్పించింది. అయితే ప్రతి భారతీయుడు సోదర భావాన్ని కలిగి ఉన్నప్పుడే సమానత్వం సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నాడు. -
లోక్‌సభ బరిలో ఛత్రపతి శివాజీ వారసుడు..
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఓ వైపు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన సీట్ల షేరింగ్ ఫార్ములాను ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మరోవైపు కాంగ్రెస్ మాత్రం రాజకుటుంబీకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఛత్రపతి షాహూ మహారాజ్‌ను కొల్హాపూర్ నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. కొల్హాపూర్ మాజీ రాజకుటుంబానికి అధిపతిగా ఛత్రపతి షాహూ మహారాజ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అపారమైన గౌరవం ఉంది. రాజకీయంగా కాంగ్రెస్‌తో జతకట్టినప్పటికీ, 1998లో లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యం తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కొల్హాపూర్ రాజర్షి ఛత్రపతి షాహు మనవడైన ఆయనకు మరాఠా ప్రజల్లో ఉన్న గుర్తింపు, స్థాయి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుంది. బీజేపీ మాజీ ఎంపి ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు తండ్రి ఛత్రపతి షాహూ మహారాజ్ మరాఠా సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి కూడా. 2023 జూన్‌లో జరిగిన మతపరమైన అల్లర్ల తరువాత, షాహూ ఛత్రపతి కొల్హాపూర్‌లో 'సద్భావన' ర్యాలీకి నాయకత్వం వహించారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఛత్రపతి షాహూ మహారాజ్ నిర్ణయించుకున్నారని ఆయన కుమారుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ తెలిపారు. తన తండ్రి ఇప్పటికే రేసులో ఉన్నందున తాను పోటీ నుంచి తప్పుకొన్నట్లు స్పష్టం చేసిన ఆయన.. తన తండ్రి విజయానికి సహకరించాలని కార్యకర్తలను కోరారు. -
వృద్ధునిపై గాడిద దాడి.. ఎంతమంది అడ్డుకున్నా..
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఒక వీడియో కలకలం రేపుతోంది. ఒక గాడిద ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే వ్యవహరిస్తుంటాయి. అయితే కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియో గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేస్తోంది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా, అది ఆ వృద్ధునిపై దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో నమోదయ్యింది. ఎన్నో ప్రయత్నాల తరువాతనే.. ఈ ఘటన 2023 జూలై 7,ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ వీడియోలో.. ముందుగా ఒక వృద్ధుడు రోడ్డుపై వెళుతుండటం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డు పక్కగా ఒక గాడిద నిలుచుని ఉంటుంది. అది ఉన్నట్టుండి, ఆ వృద్ధుని దిశాగా పరిగెత్తకుంటూ వచ్చి, అతనిపై దాడికి తెగబడుతుంది. ఆ వృద్ధుడిని కింద పడవేసి తన కాళ్లతో తొక్కివేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనను గమనించిన చుట్టుపక్కల వారు ఆ వృద్ధుడిని గాడిద బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తారు. అయినా ఆ గాడిద తన పట్టువీడక ఆ వృద్ధునిపై దాడి చేస్తూనే ఉంటుంది. తరువాత ఒక వ్యక్తి ఆ గాడిదపైకి రాయి విసిరినా అది ఏమాత్రం అదరదు. మరికొందరు కర్రతో దానిని కొట్టడంతో ఆది తన దాడిని విరమించి పక్కకు వెళ్లిపోతుంది. తరువాత ఆ వృద్దుడు కాస్త తేరుకుని నిలబడతాడు. महाराष्ट्र के #कोल्हापुर में एक गधे ने सड़क पर चल रहे बुजुर्ग पर किया जानलेवा हमला..पूरी घटना CCTV में कैद..घटना गांधीनगर इलाके में 7 जुलाई सुबह 11 बजे की है..पिछले 3 दिनों में गधे द्वारा लोगों पर हमले की यह दूसरी घटना@indiatvnews@KOLHAPUR_POLICE@Dev_Fadnavis pic.twitter.com/WoWt4vCjap — Atul singh (@atuljmd123) July 8, 2023 మూడు రోజుల్లో రెండవ దాడి ఘటన గడచిన మూడు రోజుల్లో స్థానికంగా జంతువుల కారణంగా జరిగిన రెండవ దాడి ఇది. ఈ ఘటన కొల్హాపూర్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికిముందు ఇదే ప్రాంతంలో జరిగిన కుక్కల దాడిలో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఫిర్యాదు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు! -
20న కొల్లాపూర్‌కు ప్రియాంక..?
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం వేదికగా లక్షలాది మందితో జనగర్జన సభ నిర్వహించి కొత్త జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నెల 20న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో సభ నిర్వహించాలని భావిస్తోంది. ఖమ్మం సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్యఅతిథిగా రాగా, కొల్లాపూర్ సభకు ప్రియాంకాగాంధీ హాజరయ్యే అవకాశముంది. ఈ మేరకు కొల్లాపూర్ సభకు హాజరు కావాలని కోరుతూ ప్రియాంకా గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న ప్రియాంక సభ ఖరారైనట్టేనని, అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రియాంక హాజరయ్యే సభలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కీలక ప్రకటనలు కూడా... జూపల్లి చేరిక సభలో ప్రియాంకగాంధీ చేత కీలక ప్రకటనలు ఇప్పించేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ఖమ్మం వేదికగా వృద్ధులు, వితంతువులు, ఇతర వర్గాల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతూ హామీ ఇచ్చినట్టుగానే, కొల్లాపూర్ సభావేదికగా మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా భారీ ఎన్నికల హామీ ఇస్తామని, ఇందుకోసం నాలుగైదు అంశాలను పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సుప్రయాణ హామీని ప్రకటించే అవకాశాలున్నాయని వారంటున్నారు. దీంతోపాటు పావలా వడ్డీరుణాల స్థానంలో మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామని, రూ.లక్ష వరకు ఈ రుణం ఇస్తామని, నామినేటెడ్ పదవుల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీలను కూడా ఇప్పించే అంశాలను టీపీసీసీ ముఖ్య నేతలు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ప్రియాంకాగాంధీ సభ ద్వారా మహిళలకు భారీ ఎన్నికల హామీని ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. -
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2023 విజేత రత్నగిరి జెట్స్
2023 మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ విజేతగా రత్నగిరి జెట్స్ నిలిచింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా పూర్తి మ్యాచ్ సాధ్యపడకపోవడంతో, పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం రత్నగిరి జెట్స్, కొల్హాపూర్ టస్కర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ గురువారమే (జూన్ 29) జరగాల్సి ఉండింది. అయితే ఆ రోజు వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మ్యాచ్‌ను శుక్రవారానికి వాయిదా వేసారు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను ప్రకటించారు. అప్పటికీ వర్షం ఎడతెరిపి ఇచ్చిన ప్రతిసారి మ్యాచ్‌ను నిర్వహించేందుకు నిర్వహకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో 16 ఓవర్ల ఆట కూడా జరిగింది. కేదార్ జాదవ్ నేతృత్వంలోని కొల్హాపూర్ టస్కర్స్ 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ ఆగలేదు. దీంతో పాయింట్ల ఆధారంగా రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. టస్కర్స్‌కు కూడా జెట్స్తో సమానంగా పాయింట్లు ఉండటంతో నెట్ రన్ ఆధారంగా విజేతను డిసైడ్ చేశారు. విన్నింగ్ జట్టు కెప్టెన్ అజీమ్ ఖాజీకి 50 లక్షల చెక్ లభించగా.. రన్నరప్ టస్కర్స్‌కు 25 లక్షల చెక్ అందింది. -
గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో?.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
మహారాష్ట్ర: ఔరంగాబాద్ వివాదాస్పద వాట్సప్ స్టేటస్‌ల వివాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎమ్ఐఎమ్ నాయకుడు అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. ఔరంగజేబు కుమారులు నగరంలో ప్రత్యక్షమయ్యారనే ఫడ్నవీస్ వ్యాఖ్యలకు అసదుద్ధీన్.. గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో తెలుసుకోవాలని? అన్నారు. కొల్లాపూర్‌లో కొందరు యువకులు ఔరంగజేబు, టిప్పు సుల్తాన్లను కీర్తిస్తూ వాట్సప్ స్టేటస్‌లను పెట్టడం వివాదాస్పదమైంది. తీవ్ర స్థాయిలో ఘర్షణలు కూడా జరిగాయి. అయితే.. ఈ వివాదంపై ఫడ్నవీస్.. నగరంలో కొందరు ఔరంగాజేబు కుమారులు ప్రత్యక్షమయ్యారని, వారెవరో తొందరగా గుర్తిస్తామని అన్నారు. వారు ఎవరి మనుషులో? ఎవరు పంపించారో కనుక్కుంటామని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన అసదుద్ధీన్ ఓవైసీ.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 'నాథూరాం గాడ్సే, వామన్ శివరామ్ ఆప్టే కుమారులెవరో తెలుసుకోవాలి. మీకు అన్నీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో మీరు నిపుణులని తెలుసు?' అని అన్నారు. అయితే.. బుధవారం ఈ వివాదంపై జరిగిన ఘర్షణల కారణంగా స్థానికంగా కర్ఫ్యూ విధించారు. అందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం ఏక్నాథ్ షిండే చెప్పారు. ఇదీ చదవండి:ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టు.. మిన్నంటిన ఆందోళనలు -
ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టు.. మిన్నంటిన ఆందోళనలు
మహారాష్ట్ర: వివాదాస్పద సోషల్ మీడియా పోస్టు కారణంగా మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో ఆందోళనలు మిన్నంటాయి. మొఘల్ రాజు ఔరంగజేబును కీర్తిస్తు, మహారాష్ట్ర చిహ్నాన్ని కించపరిచేలా ఆ పోస్టు ఉందనే ఆరోపణలతో ఆందోళనకారులు కొల్లాపూర్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో శివాజీ మహారాజ్ చౌక్ వద్ద ఆందోళనకారులు గుమిగూడారు. వివాదాస్పద పోస్టు చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని, టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై స్పందించిన సీఎం ఎక్నాథ్ షిండే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వ విధి. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: వీడియో: ఆయన మంచి మనిషి.. తల్చుకుని మరీ కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ -
ఆడపిల్ల పుట్టిందని ఏనుగును తెప్పించి... ఆ తండ్రి చేసిన పనికి ఊరంతా షాకయ్యారు!
ముంబై: గతంలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించి తల్లి గర్భంలో ఉన్నప్పుడో లేదా పురిటిలోనే చంపిన ఘటనలు బోలెడు చూశాం. కాలం మారుతోంది.. ఇటీవల తమ ఇంట ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించి కుటుంబాలు వేడుకలు చేసుకుంటున్నాయి. తాజాగా తమ వంశంలో చాలా సంవత్సరాల తర్వాత ఆడపిల్ల పట్టిందని సంబరాలు చేసుకోవడంతో పాటు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలికింది ఓ కుటుంబం. దీన్ని చూసిన ఊరు ప్రజలంతా షాకయ్యారు. ఈ అరుదైన ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌లో చోటుచేసుకుంది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా... ఏనుగును పిలిపించి వివరాల్లోకి వెళితే.. పాచ్గావ్కు చెందిన గిరీష్‌పాటిల్, సుధ దంపతులకు ఐదు నెలల కిందట కుమార్తె పుట్టింది. ఆ చిన్నారికి ఆప్యాయంగా ‘ఐరా’ అని పేరు పెట్టారు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన తన భార్యను శనివారం తొలిసారిగా తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే గిరీష్ వంశంలో దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ ఆడపిల్ల పుట్టింది. ఈ ఆనందాన్ని ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఉండాలని ప్లాన్ చేశాడు. అందుకోసం తన భార్య, పాపను గుజరాత్‌లోని హత్తివరోన్ నుంచి పచ్‌గావ్‌కు తీసుకొచ్చి.. ఘనస్వాగతం పలికాడు. ఊరిపొలిమేర నుంచి డప్పువాయిద్యాలు ఏర్పాటు చేసి పట్టణ శివారు నుంచి ఏనుగుపై తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. చాలా ఏళ్ల తరవాత తమ ఇంట ఆడపిల్ల పట్టడంతో పాటిల్ కుటుంబసభ్యులు సంబరాలు జరుపుకున్నారు. గిరీశ్ పుణెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న గిరీశ్.. బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేశారు. కాగా గతేడాది కూడా మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఫ్యామిలీ సైతం ఏకంగా హెలికాప్టర్‌ను బుక్ చేసి ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు.. -
నగర్ కర్నూల్: కొల్హాపూర్ ప్రభుత్వాస్పత్రిలో కొరవడిన వైద్యం
-
లీనా నాయర్: సమానంగా చూడండి చాలు
ఆమె మహిళ అనో .. సపోర్ట్ లేదనో.. పని మెల్లిగా నేర్చుకుంటుందో... మైనారిటీ వర్గమనో.. సానుభూతి చూపారంటే.. దానినే సవాల్‌గా తీసుకొని మరింత శక్తిమంతంగా ఎదగాలని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది లీనా నాయర్. లీనా నాయర్ బ్రిటిష్ ఇండియన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా అంచెలంచెలుగా ఎదిగిన శక్తి. 30 సంవత్సరాల పాటు ఉద్యోగ నిర్వహణలో ఎన్నో క్రియాశీలక పదవులను చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యునిలీవర్ కంపెనీని జెండర్ బ్యాలెన్స్డ్ కంపెనీగా నిలబెట్టింది. వరల్డ్ వైడ్ లగ్జరీ బ్రాండ్ చానెల్ సీఈవోగా ఉన్న లీనా పుట్టి పెరిగింది మహారాష్ట్రలో. ఇప్పుడు వందకుపైగా దేశాల్లో లక్షలాది మంది ఉద్యోగుల బాధ్యతను సమర్థవంతంగా నడిపిస్తూ మహిళాశక్తిని ఈ తరానికి చాటుతోంది. ► జెండర్ బ్యాలెన్స్.. ఫ్రెంచ్ లగ్జరీ హౌజ్ కోకో చానెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఈ ఏడాది జనవరి నుంచి దిగ్విజయంగా విధులను నిర్వర్తిస్తోంది లీనా నాయర్. అంతకుముందు యూనిలీవర్‌కు నాయకత్వం వహించారు. వందకు పైగా దేశాలలో సుమారు లక్షా యాభై వేల మంది బాధ్యత ఆమె మీద ఉంది. 1990 మొదట్లో నాయర్ జంషెడ్‌పూర్‌లోని హిందూస్థాన్ యూనిలీవర్లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరినప్పుడు, ఆ కంపెనీ ఉద్యోగుల్లో కేవలం రెండు శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఆమె కిందటేడాది బయటకు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్త కంపెనీ నిర్వహణలో లింగ సమతుల్యత ఉందని ప్రకటించింది. అంటే, నాయర్ తనదైన ముద్ర ఏ స్థాయిలో ఆ కంపెనీలో వేసిందనేది స్పష్టం అవుతుంది. ► లగ్జరీ మార్కెట్.. ఫ్యాషన్ దిగ్గజంగా కోకో చానెల్ కంపెనీకి 112 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లగ్జరీ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెటోకి దూసుకెళ్లేలా చేసిన మొదటి వ్యక్తి నాయర్ ఏమీ కాదు. అంతకుముందు అనుభవజ్ఞుడైన ఆంటోనియా బెల్లోని ఉన్నాడు. ఇప్పుడు అతను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అతనితో పాటు మరికొంత నిష్ణాతులైన వ్యక్తులు ఈ నిచ్చెన మీద ఇప్పటికే ఉన్నారు. అంటే, వారందరి మధ్య నాయర్‌కి ఆ పదవిని కట్టపెట్టారంటే ఆమె శక్తి సామాన్యమైనది కాదనేది స్పష్టం అవుతుంది. అంతేకాదు, ఆ పదవి ఆమెకు మరింత సవాల్‌తో కూడుకున్నదన్నమాటే. 53 ఏళ్ల వయసులో ఆమె ఈ ఘనత వహించిన కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సర్వసిద్ధంగా ఉందన్నమాట. ఆమెకు ఇదేమీ కొత్తగాకాదు. ప్రపంచవ్యాప్త యునిలీవర్‌లో 30 సంవత్సరాలు పనిచేసిన మొదటి ఆసియా, మొదటి మహిళ, అతి పిన్న వయస్కురాలు.. అనే రికార్డు ఆమె ఖాతాలో ఉంది. ఆంగ్లో–డచ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలో ఫ్యాక్టరీ ఫ్లోర్ లెవెల్ మేనేజర్‌గా అంతస్తులో పనిచేసిన మొదటి మహిళ, నైట్ షిఫ్ట్‌లో పనిచేసిన మొదటి మహిళగానూ నాయర్‌కు పేరుంది. ► ప్రతిరోజూ సవాల్.. ‘లీనా తను ఏ పని చేసినా దానికో గొప్ప విలువ ఇస్తుంది. ఏ పాత్ర పోషించినా అందుకు తగిన శక్తి సామర్థ్యాలను చూపడంలో దిట్ట. అందుకే ఆమెకు అంతటా అత్యంత గౌరవం. ఆమె తన కొత్త పాత్రలో రాణిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని కోకో చానెల్‌కు ఎంపికైన సందర్భంలో యునిలీవర్ మాజీ చైర్మన్ దాడి సేత్ ఆమె గురించి గొప్పగా చెప్పారు. కిందటేడాది డిసెంబర్లో నాయర్‌ను సీఇవోగా నియమించాలని చానెల్ తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, ఇది పరిశ్రమకే వైవిధ్యమైన మైలురాయిగా అంతా ప్రశంసించారు. ‘నా కెరీర్ ప్రారంభ రోజుల్లో కాలేజీల్లోనూ, కంపెనీల్లోనూ ఒక మహిళగా నా స్థానం ఉండేది. ఉన్నతస్థాయిని సాధించడానికి ప్రతిరోజూ సవాల్‌గా ఉండేది. నామీద ఎవరికైనా సానుభూతి ఉంది అంటే నాకు నేనే అట్టడుగున ఉన్నట్టు అనిపించేది. దానిని నేను చాలా వ్యక్తిగతంగా తీసుకునేదాన్ని. అందుకే, నన్ను నేను ఉన్నతంగా మలుచుకోవడానికి ఇప్పటికీ ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను’ అని సవినయంగా చెబుతారు నాయర్. బహుశా అందుకే ఆమె ఎదుగుదల ఈ రీతిలో సాధ్యమైందేమో! ► చిన్న పట్టణం నుంచి ... మహారాష్ట్రలోని చిన్న పట్టణమైన కొల్హాపూర్‌లో జన్మించిన నాయర్, ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ చేసింది. కాలేజీ పూర్తయిన రోజుల్లో ఒక రోజు కాలేజీ ప్రొఫెసర్ ఆమెను కూర్చోబెట్టి ‘నీవు ఇప్పటికి ఒక అందమైన ఇంజినీర్వే. కానీ, విధి నిర్వహణలో సత్తా చూపగల నైపుణ్యం కలిగి ఉన్నావని భావిస్తున్నాను’ అని చెప్పారట. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరిస్తుంది నాయర్. ఆ తర్వాత పట్టుదలతో ఎంబీయేలో గోల్డ్‌మెడల్ సాధించింది. హిందూస్థాన్ యూనిలీవర్ ఎంపిక చేసుకున్న 15 వేల మంది మగవారిలో అతి కొద్దిమంది స్త్రీలలో ఒకరిగా నాయర్ ట్రైనీగా చేరింది. -
జూపల్లి కృష్ణారావు అడుగులెటు.. ‘కారు’ దిగడం ఖాయమా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీనియర్ రాజకీయ నాయకుడు.. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఓ వెలుగు వెలిగారు. కానీ ఒక్క ఓటమితో పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం.. ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకోవడం.. తదితర పరిణామాల క్రమంలో స్వపక్షంలోనే విపక్షంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. జూపల్లి రాజకీయ భవిష్యత్‌పై పలు రకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కమలమా, కాంగ్రెస్సా, స్వతంత్రంగా పోటీలో ఉంటారా.. అనే ప్రశ్నలకు అతడి మౌనమే సమాధానమైంది. కానీ నిత్యం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ క్రమంలో కృష్ణారావు క్రియాశీలక అడుగులు వేశారు. నియోజకవర్గాల వారీగా మరో ప్రస్థానం పేరిట ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మౌనం వీడినట్లేనని.. ‘కారు’ దిగడం ఖాయమని తేలినట్లు విశ్లేషిస్తున్నారు. ముందస్తు ఖాయమనే అంచనాకు వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటడమే లక్ష్యంగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పూడ్చలేనంత పెరిగిన గ్యాప్.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీరం టీఆర్ఎస్లో చేరడంతో సీన్ మారిపోయింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో జూపల్లికి ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరులు వాదులాటకు దిగడం నుంచి మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి తన వర్గీయులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలో దింపి సత్తాచాటడం వంటి అంశాలు ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీశాయి. ఆ తర్వాత కేటీఆర్ తన ఇంటికి స్వయంగా రావడంతో కొన్ని నెలలు స్తబ్దుగా ఉన్నా.. అనంతరం అభివృద్ధి తదితర అంశాల్లో జూపల్లి, బీరం మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకోవడంతో ఇరువురి మధ్య దూరం గ్యాప్ పూడ్చలేనంతగాపెరిగింది. ఏకం చేసే దిశగా.. మునుగోడులో బీజేపీ గెలిస్తే కమలం గూటికి వెళ్లాలనే యోచనలో ఉన్న జూపల్లి ఫలితం తారుమారు కావడంతో కొంత సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్ ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని స్వతంత్రంగా బరిలో దిగితే గెలిచే అవకాశం ఉందనే ఆలోచనలో జూపల్లి, ఆయన వర్గీయులు ఉన్నట్లు సమాచారం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తనతో పాటు తనను నమ్ముకున్న కార్యకర్తలు, అనుచరులకు నష్టం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్న జూపల్లి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్‌తో పాటు తనకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనానికి పూనుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లో నమ్మకస్తులైన నేతలతో ఇది వరకే రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు అచ్చంపేట నుంచి ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టిన ఆయన పూర్వాశ్రమమైన కాంగ్రెస్‌లోని ముఖ్య అనుచరులు, నాయకులతో పాటు మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం పలికారు. ప్రధానంగా టీఆర్ఎస్లోని అసంతృప్త నాయకులను ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అచ్చంపేటను అందుకే ఎంచుకున్నరా.. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ త్వరలో అచ్చంపేటలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సభకు, గతంలో వనపర్తిలో జరిగిన సీఎం పర్యటనకు గైర్హాజరైన జూపల్లి.. తొలి ఆత్మీయ సమ్మేళనానికి కేసీఆర్ నోటి వెంట వచ్చిన అచ్చంపేటను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫాంహౌస్ ఘటనలో కొల్లాపూర్‌తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫాంహౌస్ ఘటనను ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి జూపల్లి టీఆర్ఎస్ను వీడడం ఖాయంగా కనిపిస్తుండగా.. మాజీ మంత్రి తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జూపల్లి ఆత్మీయ సమ్మేళనం.. ఆయన వేస్తున్న అడుగులను టీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సిట్టింగ్‌లకే సీటు అనడంతో.. ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా ఉండడంతో కొల్లాపూర్‌లో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే నెలరోజులుగా కనిపించడంం లేదని పోస్టర్లు వెలియడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే తాను ఏది చేసినా నియోజకవర్గ అభివృద్ధికేనని ప్రకటించారు. స్పందించిన జూపల్లి.. చేసిన అభివృద్ధి ఏందో చూపించాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఫాంహౌస్ కేసులో మన ఎమ్మెల్యేలే దొంగలను పట్టించారని.. సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన బీరం వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపితే.. జూపల్లి వర్గీయులను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకోవాలని అనుచరులు జూపల్లిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (క్లిక్ చేయండి: మహబూబ్‌నగర్‌లో హద్దులు దాటని కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు అర్థమేంటి?) -
వాటర్ ట్యాంకర్‌పై వధూవరుల ఊరేగింపు... అసలు సంగతి ఇది..
ఈరోజుల్లో వైరల్ అయిపోవడం చిటికేసినంత ఈజీ అయిపోయింది. చేసే పని ఎలాంటిదైనా కెమెరాకి చిక్కితే చాలూ అన్నట్లు ఉంది పరిస్థితి. కావాలని కొందరు.. అనుకోకుండా కొందరు మీమ్ స్టఫ్ అయిపోతున్నారు. అదే సమయంలో చర్చలకు సైతం దారి తీస్తున్నారు మరికొందరు. అలాంటి జంట గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వాటర్ ట్యాంకర్‌పై వధువు వరుడిని ఊరేగించిన ఘటన తాలుకా ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. వీళ్లేదో దేశాన్ని ఉద్దరిస్తున్నారా? అనుకోకండి.. సమస్య మీద పోరాటంలో భాగమే ఈ ఊరేగింపు. మహారాష్ట్ర కోల్హాపూర్‌కు చెందిన విశాల్ కోలేకర్(32) వివాహం అపర్ణ అనే యువతితో గురువారం జరిగింది. వివాహం తర్వాత ఆ ఇద్దరినీ ఓ వాటర్ ట్యాంకర్‌పై ఎక్కించి మరీ ఊరేగించారు బంధువులు. రోడ్లు, వీధుల వెంట వెళ్తున్న ఆ ఊరేగింపును చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే వాళ్లు అలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. కరువు.. చాలాచోట్ల సీజన్‌తో సంబంధంలేని సమస్యగా మారిపోయింది. అధికారులు కూడా నీటి కొరత తీర్చడంలో అసమర్థత ప్రదర్శిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో తమ ప్రాంతానికి నీటి సరఫరా ఉండట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ జంట ఇలా చేసింది. ‘‘నగరంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మా ఏరియా(మంగళ్వార్ పేట్)లో నెలకొన్న సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ, ఫలితం లేకుండా పోతోంది. ప్రిన్స్ క్లబ్ అనే సోషల్ గ్రూప్ తరపున చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నాం.. అయినా నీరు సకాలంలో రావట్లేదు. అందుకే చాలా కుటుంబాలు వాటర్ ట్యాంకర్లనే నమ్ముకున్నాయి’’ అని వరుడు విశాల్ కోలేకర్ వాపోయాడు. Maharashtra | A Kolhapur couple rode a water-tanker on their wedding day, to call attention to the ongoing water crisis in the city. The newly-weds have vowed "not to go on a honey-moon until this crisis ends," according to the message on the tanker. (Source: self-made) pic.twitter.com/1kWM97ogTB — ANI (@ANI) July 9, 2022 ఈ నిరసన ఇక్కడితోనే ఆగిపోలేదు. వివాహ ఊరేగింపులో వాటర్ ట్యాంకర్‌కు ఓ బ్యానర్ కట్టింది ఈ జంట. అందులో నీటి సమస్య తీరేంత వరకు హనీమూన్ కూడా వెళ్లమంటూ పేర్కొన్నారు. విశాల్‌తో పాటు అతని ఆశయానికి అండగా నిలిచిన అపర్ణను చాలామంది అభినందిస్తున్నారు. -
జూపల్లి, బీరం చర్చావేదిక భగ్నం
సాక్షి, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య బహిరంగ చర్చ సాగక ముందే రచ్చరచ్చ అయింది. కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్దిరోజులుగా వారి మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. ఇరువురు నేతల మధ్య చర్చావేదిక నిర్వహించేందుకు ఉదయం చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. పది గంటలకు జూపల్లి ఇంటిని చర్చావేదికగా వారు ఖరారు చేసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచే కొల్లాపూర్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. జూపల్లి నివాసం వద్ద సైతం భారీ బందోబస్తు నిర్వహించారు. హర్షవర్ధన్‌రెడ్డి సుమారు రెండు వేలమంది కార్యకర్తలతో కలసి జూపల్లి ఇంటి వైపు ర్యాలీగా బయలుదేరారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ముందుకు రాగానే పోలీసులు నిలువరించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. దమ్ముంటే నిరూపించాలి: జూపల్లి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలని జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. ఆరోపణలపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తానని, నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తానని అన్నారు. తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్యే పారిపోయారని వ్యాఖ్యానించారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బ్యాంకుల్లో తీసుకున్న రూ.ఆరు కోట్ల అప్పును 2007లోనే వడ్డీతో సహా రూ.14 కోట్లు చెల్లించానని పేర్కొన్నారు. ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని ఎన్జీటీలో కేసు వేసింది ఎవరు? తర్వాత ఎందుకు విత్‌డ్రా అయ్యారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి’అని జూపల్లి ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోను: బీరం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు సింగిల్‌విండో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజల ఆస్తులను, బ్యాంకులను మోసం చేసిన ఘనత నీదే కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఈ రోజు బహిరంగ చర్చకు పిలిచి మొహం చాటేసుకున్నావు. ఇక నుంచి నీ ఆటలు, మాటలు సాగనివ్వబోం’అని జూపల్లిని ఉద్దేశించి హెచ్చరించారు. ఇది కూడా చదవండి: జూపల్లి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు -
కొల్లాపూర్‌లో హై టెన్షన్.. పోలీసుల వార్నింగ్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్ ఉత్కంఠ రేపుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అధికార గులాబీ పార్టీకి చెందిన నేతలిద్దరూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో గులాబీ నేతలిద్దరూ ఓపెన్ చాలెంజ్ చేస్తూ బహిరంగ చర్చకు సిద్దమంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆదివారం కొల్లాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్ కొల్లాపూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్చలకు, ర్యాలీలకు అనుమతిలేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, ఈరోజు ఉదయం కొల్లాపూర్‌లో జూపల్లి ఇంటి వద్దకు ఆయన అనుచరులు రావడంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే హర్షవర్ధన్ ఇంటి వద్ద పోలీసులు బారీకేడ్డు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలను పోలీసులు.. ఇంటికే పరిమితం చేశారు. ఇది కూడా చదవండి: మోదీ సభతో రాష్ట్రంలో పెనుమార్పులు: తరుణ్‌ఛుగ్ -
జూపల్లి కృష్ణారావు ఇంటికి కేటీఆర్
-
కాంగ్రెస్ కు చరిత్ర తప్ప మిగిలింది శూన్యం: మంత్రి కేటీఆర్
-
ఎవడు దద్దమ్మ.. మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
వితంతువులపై గ్రామ పంచాయితీ సంచలన తీర్మానం.. దేశంలోనే తొలి గ్రామంగా
ముంబై: భర్త చనిపోయిన వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించేలా ప్రభుత్వాలు కొత్తగా చట్టాలు తీసుకురావాలని రాష్ట్రంలోని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విధవరాళ్లకు చేసే ఆచారాలను వ్యతిరేకిస్తూ ఇటీవల కొల్హాపూర్ జిల్లాలోని హెర్వాడ్ గ్రామం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించే హక్కును కల్పించేలా కొత్తగా చట్టాన్ని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా వితంతు తిరోగమన పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వితంతు మహిళల పట్ల తిరోగమన ఆచారాలకు వ్యతిరేకంగా ఇటీవల కొల్హాపూర్ జిల్లాలోని హెర్వాడ్ గ్రామంలో ఈనెల 4న చేసిన తీర్మానానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇదేవిధమైన తీర్మానాలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హెర్వాడ్ మోడల్ ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. వింతతు మహిళల పట్ల చేసే ఆచార వ్యవహారాలైన గాజుల విరగ్గొట్టడం, వాటిని తీసివేయడం, మరెప్పుడూ ధరించకుండా నిషేధించడం, బొట్టు (సింధూరాన్ని) తీసివేయడం, మంగళసూత్రాన్ని తెంచివేయడం, కాలి మెట్టెల్ని తీసివేయడం వంటి ఆచారాల్ని ఇకపై పాటించకుండా షిరోల్ తాలూకాలోని హెర్వాడ్ గ్రామ పంచాయతీ తీర్మానించింది. వివాహ వేడుకలు, శుభకార్యాలు, మతపరమైన వేడుకలు, సామూహిక వేడుకల్లో పాల్గొనకూడదనే సంప్రదాయాన్ని హెర్వాడ్ పంచాయతీ తీర్మానంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఇకపై అటువంటి ఆచారాలను వితంతు మహిళలెవరూ గ్రామంలో ఎవరూ పాటించనవసరంలేదని తేల్చిచెప్పింది. ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీ తీర్మానం ఈ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వితంతు మహిళలు మరింత గౌరవంగా జీవించే హక్కును కల్పించడంతో పాటుగా ఇతర గ్రామ పంచాయతీలకు, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. హెర్వాడ్ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వెనుక షోలాపూర్ జిల్లాలలోని సంఘ సంస్కర్త మహాత్మ పూలే సామాజిక సంక్షేమ సంస్థకు చెందిన ప్రతినిధి ప్రమోద్ జింజాడే చాలా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...వితంతు మహిళలు గౌరవంగా జీవించాలని నిర్ణయం తీసుకున్న తొలి గ్రామంగా దేశ చరిత్రలోనే హెర్వాడ్ గ్రామం నిలిచిందని జింజాడే పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని మరో ఏడు గ్రామ పంచాయతీలు అనుసరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఇటువంటి తీర్మానాలు కూడా దురాచారాలను రూపుమాపలేవని, వీటిని పూర్తిగా నిర్మూలించేందుకు చట్టాలు చేసి వాటిని పటిష్టంగా అమలు చేయడమే సమస్యకు అసలు పరిష్కారమని ఆయన తెలిపారు. దీనిపై చట్టాన్ని చేసేందుకు మండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలం గొర్హెతో సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలోని రెండు సభల్లోనూ జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో చర్చకు పెట్టేలా చూస్తాననని ఆమె హామీనిచ్చినట్లు ప్రమోద్ జింజాడే తెలిపారు. చదవండి: రూ.లక్షకి రెండు లక్షలు.. అట్లుంటది మనతోని.. అయితే ఈ విషయానికి సంబంధించి కొత్త చట్టం చేయాలా లేదా పాత చట్టాల ద్వారానే అమలు చేయవచ్చా అనే అంశాన్ని న్యాయ విభాగం ఒకసారి పరిశీలించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వితంతు మహిళలపట్ల ఈ విధమైన దురాచారాలకు పాల్పడే గ్రామస్తులు, బయటవారిపై ఏడాది పాటు జైలు శిక్షను, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించాలని ప్రమోద్ జింజాడే మండలి డిప్యూటీ చైర్మన్ గొర్హెకు ప్రతిపాదించారు. అదే బంధువులైతే 15 రోజుల నుంచి నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.50వేలకు వరకు జరిమానా విధించా లని ఆయన ప్రతిపాదించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆ కమిటీలో 50 శాతం మహిళలే ఉండాలని, అందులో సగంమంది వితంతువులు ఉండాలని పేర్కొన్నారు. -
భర్త చనిపోతే.. బొట్టు, గాజులు తీసేయాలా? శుభకార్యాలకు వెళ్లొద్దా?
భర్త అకాల మరణం చెందితే అది భార్య తప్పా?, అందుకు ఆమె జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందేనా? ముమ్మాటికీ కాదు. అయితే విధవత్వం విషయంలో మాత్రం కట్టుబాట్లనేవి మాత్రం కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. భర్త చనిపోతే.. ఆమె మంగళసూత్రం తొలగించి, గాజులు పగలకొట్టి, నుదిటి మీద తిలకం చెరిపేసి.. అప్పటికే పుట్టెడు బాధలో ఉండే స్త్రీ మూర్తికి మరింత శోకం అందిస్తుంటారు. అయితే ఇకపై అలాంటి ఆచారాలు నిషేధించుకుంది ఇక్కడో పల్లె. మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లా షిరోల్ తాలుకా హెర్వాద్(డ్) అనే గ్రామం.. తాజాగా ఓ తీర్మానం చేసింది. భర్త చనిపోయిన ఆడవాళ్లు.. సంప్రదాయాలను పక్కనపెట్టి నచ్చినట్లుగా, సమాజంలో గౌరవంగా జీవించేందుకు స్వేచ్ఛను ప్రసాదిస్తూ తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానానికి మే 4వ తేదీన గ్రామ పంచాయితీ సైతం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైంలో.. కరోనా టైంలో ఈ ఊరిలో మరణాలు చాలానే సంభవించాయట. అందులో పాతికేళ్లలోపు యువకులే ఎక్కువగా ఉన్నారట. దీంతో చిన్నవయసులోనే ఎంతో మంది వితంతువులుగా మారిన పరిస్థితి. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కూడా వెళ్లకుండా.. వాళ్లు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి గ్రామస్తులు భరించలేకపోయారు. ‘‘తమ తప్పు లేకున్నా.. పశ్చాత్తాపంతో కుంగిపోయిన బిడ్డలను చూశాం. తమ మధ్యే ఉంటూ వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూశాం. అందుకే వాళ్ల జీవితాలను మార్చే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’’ని గ్రామ సర్పంచ్ శ్రీగోండ పాటిల్ చెప్తున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సులువుగా కావడానికి అంగన్వాడీ సేవికాస్, ఆశా వర్కర్ల కృషి ఎంతో ఉందని అంటున్నాడాయన. ఈ తీర్మానం విషయంలో మహాత్మా ఫూలే సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రమోద్ జింగాడే అందించిన ప్రోత్సాహం మరిచిపోలేమని, ఇది షాహూ మహరాజ్‌కు నివాళి అని అంటున్నారు హెర్వాద్ గ్రామ ప్రజలు. ఇక ఈ నిర్ణయంపై జిల్లా పరిపాలన విభాగం సైతం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు మంత్రి సతేజ్ పాటిల్ స్పందిస్తూ.. శివాజీ పుట్టిన గడ్డ మీద ఆడవాళ్ల గౌరవానికి భంగం కలగకూడదని, ఈ మేరకు.. ఇలాంటి నిర్ణయం తీసుకున్న హెర్వాద్ ప్రజలకు వందనాలు అని, కొందరికి ఇది చెంపపెట్టులాంటి సమాధానమని వ్యాఖ్యానించారు. మరికొన్ని గ్రామాలు కూడా ఇలాంటి బాటలో వెళ్తే.. మంచిదని అభిప్రాయపడ్డారాయన. :::సాక్షి ప్రత్యేకం -
రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో రసాయన కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. పూణేకు 250 కిలోమీటర్ల దూరంలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచల్కరంజి నగర శివార్లలోని వస్త్ర పారిశ్రామిక ఎస్టేట్‌లో ఉన్న యూనిట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందడంతో ఉదయం 7.30 గంటలకు నాలుగు అగ్నిమాపక ట్యాంకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయం 11 గంటలకు మంటలు ఆర్పివేసినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బంపర్ ఆఫర్..!
ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నవారికి కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వ్యక్తులకు, హౌసింగ్ సొసైటీలకు ఆస్తి పన్నుపై రాయితీలు ఇవ్వనున్నట్లు కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇటీవల నోటిఫై చేసిన మహారాష్ట్ర ఈవీ పాలసీ 2021 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి సాతేజ్ పాటిల్ ప్రకటించారు. ముంబై, వసాయి-విరార్, నవీ ముంబై, థానే, కళ్యాణ్-డొంబివాలి, నాగ్ పూర్, నాసిక్, పూణే, పింప్రి-చించ్వాడ్, ఔరంగాబాద్ నగరాలతో సహా ఇతర నగరాలలో కూడా ఈ రాయితీ అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. "ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే హౌసింగ్ సొసైటీలు, వ్యక్తులకు ఆస్తి పన్నులో రాయితీలు ఇచ్చిన మొదటి సంస్థగా కొల్హాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ నిలవనుంది. ఇటీవల, మహారాష్ట్ర ప్రభుత్వం 2021 ఈవీ పాలసీని ప్రకటించింది. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీలు) అన్ని కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో 10 శాతం ఉండాలని కూడా ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది" అని పాటిల్ ట్వీట్ చేశారు. కొల్హాపూర్ మునిసిపల్ పరిధిలో నివసిస్తున్న వ్యక్తులు, హౌసింగ్ సొసైటీల వారికి పన్ను రాయితీలు వెంటనే అందుబాటులో ఉంటాయని మంత్రి ప్రతినిధి ధృవీకరించారు. "ఎవరైనా సొంతం కోసం చార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ఆస్తి పన్నుల్లో రెండు శాతం, వాణిజ్య వినియోగం కోసం ఏర్పాటు చేస్తే అయిదు శాతం రాయితీ ఇవ్వనున్నారు" అని ప్రతినిధి తెలిపారు. (చదవండి: వారు చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా!) -
Pratima Joshi: ‘బస్తీ చిన్నది... భలేగున్నది’ అనుకునేలా చేసింది..
Pratima Joshi: Inspirational Work Putting Slums On Map Maharashtra Kolhapur : పిజ్జాబాయ్ బండి మీద రయ్యిమని వచ్చేశాడు. డోర్ కొట్టాడు. డోర్ తెరిచిన ఆ యువతి తాను ఆర్డర్ ఇచ్చిన పిజ్జాను సంతోషంగా తీసుకుంది. దీంట్లో విశేషం ఏముంది? అంటారా! అయితే ఆమె మాటలు వినండి.... ‘ఒకప్పుడు పిజ్జా డెలివరీనే కాదు. ఇంటికి ఉత్తరం రావాలన్నా కష్టమే. ఏవో కొండ గుర్తులు చెప్పాల్సి వచ్చేది. మేమొక చోటు చెబితే వారు వేరే చోటికి వెళ్లేవారు. టైమ్ వృథా అయ్యేది. ఇప్పుడు అలాంటి సమస్య లేదు’ ఇంటి గోడకు అతికించిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఆ ఇంటి అడ్రస్ కనుక్కోవడాన్ని సులువు చేసింది. ఇంత ఆధునిక కాలంలోనూ మొన్న మొన్నటి వరకు మహారాష్ట్రలోని కొల్హాపూర్ మురికివాడల్లో ఇంటి అడ్రస్ కనుక్కోవడం పెద్ద సవాలుగా ఉండేది. దీని వల్ల జరిగిన నష్టాలు తక్కువేమీ కాదు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ప్రతి ఇంటి గోడకు ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అతికించే పని చేయించింది ప్రతిమ జోషి. ప్రతిమ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ‘మన కాలాన్ని ప్రతిబింబిస్తూనే, అన్ని కాలాలకు నచ్చే అందమైన భవనాలను నిర్మించాలి’ అని ఆర్కిటెక్చర్ చెబుతుంది.ఖరీదైన భవనాల్లో మాత్రమే కాదు...ఎవరూ అంతగా చూపు సారించని మురికివాడలకు అందం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రతిమ. మహారాష్ట్రియన్ అయిన ప్రతిమ పెరిగింది మాత్రం చెన్నైలోనే. ‘అన్నా యూనివర్శిటీ’లో ఆర్కిటెక్చర్ చదువుకుంది. ఆ తరువాత ముంబైకి వెళ్లింది. ఒకసారి పుణెలోని మురికివాడకు అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితిని చూసిన వెంటనే ‘భారతదేశంలో రెండు దేశాలు ఉన్నాయి. ఒకటి సంపన్న భారతదేశం, రెండు పేద భారతదేశం’ అనే మాట గుర్తుకు వచ్చింది. ఎటు చూసినా అస్తవ్యస్తం, అపరిశుభ్రత! అందరిలాగా నిట్టూర్చి అక్కడి నుంచి బయట పడలేదు ప్రతిమ. పుణె కేంద్రంగా ‘షెల్టర్ అసోసియేట్స్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సదుపాయం, పరిసరాల పరిశుభ్రత... ఇలా బస్తీలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేసింది. పుణెలోనే కాకుండా ఈ సంస్థ కార్యక్రమాలు నవీ ముంబై, కొల్హాపూర్, థానే...ఎన్నో ప్రాంతాలకు విస్తరించాయి. ‘గూగుల్ ఎర్త్’ను ఎవరు ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నా‘సామాజిక స్పృహ’ కోణంలో ఉపయోగించుకున్న వారిలో ప్రతిమ ప్రథమ వరుసలో ఉంటుంది. ‘పావర్టీ మ్యాపింగ్’ ద్వారా బస్తీలోని పేద ప్రజలకు ఆర్థికంగా చేయూత ఇచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ‘గూగుల్ ఎర్త్ హీరో’ అవార్డ్ కూడా అందుకుంది. ‘రకరకాల వస్తువులు, మందులు ఇప్పుడు ఇంటి దగ్గరకే వస్తున్నాయి. అంబులెన్స్ రావడానికి ఎలాంటి అవరోధాలు లేవు’ అంటున్న ప్రతిమ ‘డిజిటల్ అడ్రసెస్’ అనే ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ప్రతిమ బృందం నగరాల్లోని మురికివాడల్లో నివసించే వారి పూర్తి చిరునామాలను డిజిటల్లోకి తీసుకువచ్చి బ్యాంకులా తయారు చేసింది. దీని ద్వారా ప్రభుత్వసేవాకార్యక్రమాలు బసీ ్తపేదలకు చేరడం సులభం అవుతుంది. ‘షెల్టర్ అసోసియేట్స్’ ఎన్నో మురికివాడల్లో మార్పు తెచ్చింది. ‘ఇదేం బస్తీ నాయనోయ్’ అనుకున్న వాళ్లను ‘బస్తీ చిన్నది... భలేగున్నది’ అనుకునేలా చేసింది. -
‘నిప్పు’లాంటి మనిషి ఒక్క నేస్తం చాలంటాను
ఇంట్లో ముగ్గురూ ఆడపిల్లలే. హర్షళ పెద్దమ్మాయి. మూడేళ్ల క్రితం తల్లి చనిపోయినప్పుడు తనే అంత్యక్రియలు నిర్వహించింది. ఇప్పుడు తండ్రి! కరోనా తో మే 9 న ఆయన హాస్పిటల్లో చనిపోయారు. హర్షళకు, చెల్లెళ్లకు కరోనా! లేచే పరిస్థితి లేదు. హర్షళ తన స్నేహితురాలికి ఫోన్ చేసి తన తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగలవా అని అడిగింది. ఆయేషా ఆ సమయంలో రంజాన్ ఉపవాసాల్లో ఉంది. ‘అలాగే హర్షా..’ అంది. మరి ఆ ‘తుది’ కార్యం?! హర్షళకు ఒక మాట చెప్పి ఆ కార్యాన్నీ తనే సంప్రదాయబద్ధంగా పూర్తి చేసింది! మతాల అంతరాలను చితాభస్మం చేసిన ఆయేషా ఇప్పుడు స్నేహమయిగా సర్వమత దీవెనలకు పాత్రమవుతోంది. కొల్హాపూర్‌లోని ఆస్టర్ ఆధార్ హాస్పిటల్లో సీనియర్ మేనేజర్ ఆయేషా. మహారాష్ట్ర ఇప్పుడు ఎలా ఉందో ఎవరూ వినంది కాదు. ఆస్టర్ ఆసుపత్రి కూడా అలానే ఉంది! డాక్టర్లు, నర్సులతో సమానంగా ఆసుపత్రి సీనియర్ మేనేజర్‌గా ఆయేషా మీద పడుతున్న ఒత్తిడి కూడా సాధారణంగా ఏమీ లేదు. ఆప్తుల్ని కోల్పోయిన వారికి ఓదార్పు నివ్వడం, కొన్నిసార్లు ఆ ఆప్తులకు ‘చివరి’ ఏర్పాట్లు చూడటం కూడా ఆమె పనే అవుతోంది. ప్రస్తుతం ఆమె రంజాన్ ఉపవాసంలో కూడా ఉన్నారు. నిజానికి ఈ పవిత్ర మాసం ప్రారంభం అయిన నాటినుంచే ఆయేషా, ఆమె కుటుంబ సభ్యులు కొల్హాపూర్ నగరంలోని సమాధిస్థలులు, దహన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నవారికి ఉచితంగా పి.పి.ఇ. కిట్లు పంచి పెడుతున్నారు. ఆ పని మీదే ఈ నెల 9న ఆయేషా పంచగంగ శవ దహనశాలలో ఉన్నప్పుడు డాక్టర్ హర్షళావేదక్ నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ఆయేషా.. నాన్నగారు పోయారు’’ అని చెప్పారు హర్షళ. ఆయన పోయింది ఆయేషా పని చేస్తున్న ఆస్టర్ ఆధార్ ఆసుపత్రిలోనే. ఆ ముందు రోజే ఆయన్ని కరోనాకు చికిత్సకోసం అక్కడ చేర్పించారు. ఆయేషా, హర్షళ స్నేహితులు. ఒకే వృత్తిలో ఉన్నవారు. హర్షళ కొల్హాపూర్‌లోనే ఛత్రపతి ప్రమీలారాజే ప్రభుత్వ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయేషాకు ఆమె ఫోన్ చేసే సమయానికి హర్షళ కూడా కరోనాతో బాధపడుతున్నారు. ఆమె ఒక్కరే కాదు, ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా. పైకి లేచే పరిస్థితి లేదు. ఆ సంగతి ఆయేషాకు తెలుసు. ‘‘ఆయేషా.. నాన్నగారికి ఏర్పాట్లు చేయించగలవా?’’ అని అడిగారు హర్షళ. ‘‘తప్పకుండా’’ అని చెప్పారు ఆయేషా. చనిపోయిన హర్ష తండ్రి సుధాకర్ వేదక్ వయసు 81 ఏళ్లు. మూడేళ్ల క్రితమే ఆయన భార్య కన్ను మూశారు. ఇక ఆయనకున్నది ముగ్గురు కూతుళ్లు. ఆ సంగతీ ఆయేషాకు తెలుసు. తనే ఆయన భౌతికకాయాన్ని ‘పంచగంగ’కు తెప్పించి దగ్గరుండి మరీ దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయించారు. అయితే మరింత దగ్గరగా ఉండవలసిన ప్రధాన కార్యం ఒకటి ఉంటుంది కదా. అక్కడ ఆమె ఆగిపోయారు. అది చేయించవలసిన కార్యం కాదు. చేయవలసిన కార్యం. చితికి నిప్పు పెట్టడం. పెడితే కొడుకు పెట్టాలి. కొడుకు లేకుంటే కూతురు. కానీ ఆయన ముగ్గురు కూతుళ్లు కరోనా బెడ్ మీద ఉన్నారు. హర్షళకు ఫోన్ చేశారు ఆయేషా. ‘‘హర్షా, ఎలా?’’ అని. ‘‘నీ చేతుల మీదే కానివ్వు’’ అని హర్షళ అన్నారు. ఆయేషా అప్పటికప్పుడు పి.పి.ఇ. గౌన్ ధరించారు. పురోహితుడు దూరంగా ఉండి.. ఆమె చేతుల మీదుగా ‘జరగవలసిన పని’ని జరిపించారు. ‘‘ఇలా చేసినందుకు మీ ‘వాళ్లు’ , మీ ఇంట్లో వాళ్లు ఏమీ అనలేదా?!’ అనే ప్రశ్న ఆయేషాకు.. ‘‘అలా ఎలా చేయించావ్, మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుందా?!’’ అనే ప్రశ్న హర్షళకు.. ఎదురైంది! ‘‘మేము చేయలేని స్థితిలో ఆయేషాను మా తోబుట్టువనే అనుకున్నాం’’ అని చెప్పారు హర్షళ. ‘‘ఇందులో అనడానికి, అనుకోడానికి ఏముంది?! మనిషికి మనిషి సాయపడటం అన్నది దేవుని ఆదేశమే కదా..’’ అని అన్నారు ఆయేషా. మూడేళ్ల క్రితం ముంబైలో హర్షళ తల్లి క్యాన్సర్‌తో చనిపోయినప్పుడు హర్షళే ఆమెకు అంతిమ సంస్కారాలు జరిపారు. తండ్రి విషయంలో ఆ అవకాశం లేకుండా పోయింది. ‘‘మా అమ్మానాన్న మమ్మల్ని ఆడపిల్లలమన్న వివక్షతో, పాతకాలపు కట్టుబాట్లతో పెంచలేదు. ఆయేషా మా నాన్నగారికి దహన క్రియలు నిర్వహించినంత మాత్రాన ఆయన ఆత్మకు శాంతి కలగకుండా పోదు’’ అని హర్షళ అంటుంటే.. ‘‘నేను స్వీకరించిన నా స్నేహితురాలి బాధ్యతను ఎవరూ హర్షించకుండా లేరు. అలాగైతే మరి కొల్హాపూర్ చరిత్రలో ఎన్ని సామాజిక సంస్కరణల ఉద్యమాలు జరగలేదూ..’’ అంటున్నారు ఆయేషా. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
కరోనా ప్రభావం రైల్వే శాఖపై అధికంగా పడిన సంగతి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ విధించే సమయంలో రైళ్ల రాక పోకలను పూర్తిగా నిలిపివేశారు. అయితే, అన్ లాక్ అనంతరం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే అధికారులు నడుపుతున్నారు. మొదట కేవలం కొన్ని రైళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చిన అధికారులు క్రమంగా వాటి సంఖ్యను పెంచుతూ పోతున్నారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక ప్రకటన చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. సోమ, శుక్రవారాల్లో నడిచే కొల్హాపూర్-నాగ్‌పూర్ రైలు ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు కొల్హాపూర్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుందని తెలిపారు. గురు, శనివారాల్లో నడిచే నాగ్‌పూర్-కొల్హాపూర్ రైలును ఈ నెల 13న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు నాగ్‌పూర్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. ఈ రైలు కొల్హాపూర్‌కు మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. చదవండి: ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ! భారీగా పడిపోయిన బంగారం ధరలు