komatireddy venkat reddy
-
మార్కులు కొట్టి... ‘మార్కెట్’ పట్టి...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అనుకోకుండా లభించిన అవకాశాన్ని ఓ మహిళ సద్వినియోగం చేసుకున్నారు. అడిగిన ప్రశ్నలకు మెప్పించేలా సమాధానం ఇచ్చారు. ఏకంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు. మార్కెట్ కమిటీ పదవికి ప్రశ్నలేంటి? జవాబులేంటి? చైర్ పర్సన్‌ను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది కదా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయా? అలాంటి సందేహాలు నిజమే..అలాగే ప్రశ్నలకు సరైన జవాబులివ్వడం ద్వారా చైర్ పర్సన్ పదవికి ఎంపికైంది కూడా వాస్తవమే. కామారెడ్డి జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈ వినూత్న ప్రయోగం చేశారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎంపికకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన యువతిని పదవికి ఎంపిక చేశారు. ప్రశ్నపత్రం రూపొందించి.. పరీక్ష నిర్వహించి.. సాధారణంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు ను అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేనో లేదా ఆ పార్టీ ముఖ్య నాయకులో ప్రభుత్వానికి ప్రతిపాదించి నామినేట్ చేయిస్తారు. కానీ లక్ష్మీకాంతారావు ఇందుకు భిన్నంగా ఈ పదవికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఎక్కువ మార్కులు సాధించిన వారినే చైర్మన్‌గా నియమిస్తామని ప్రకటించారు. దీనికి మార్కెట్ కమిటీ పరిధిలోని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ మండలాల నాయకులు కూడా సరే అన్నారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ పదవికి నిర్వహించిన మౌఖిక పరీక్షకు స్థానిక నేతల కుటుంబాలకు చెందిన 15 మంది మహిళలు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక పార్టీ నేతలతో కలిసి ఓ ప్రశ్నపత్రం రూపొందించారు. మార్కెట్ కమిటీల విధులు, బాధ్యతలు, అభివృద్ధికి సంబంధించిన 15 ప్రశ్నలను పొందుపరిచారు. సెప్టెంబర్ 29న నిర్వహించిన ఈ పరీక్షకు ఆ 15 మందీ హాజరయ్యారు. వీరిలో జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన అయిల్వార్ సౌజన్య అత్యధిక మార్కులు సాధించారు. దీంతో ఆమె పేరును ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వానికి పంపించారు. ఆ మేరకు ప్రభుత్వం తాజాగా సౌజన్యను చైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 ప్రశ్నలకు 12 సరైన జవాబులిచ్చిన సౌజన్య సౌజన్య ఎంఎస్సీ బీఈడీ చదివారు. పరీక్షలో 15 ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారు. ఈ పరీక్షకు ఆయా మండలాలకు చెందిన పూజా సందే, నమేవార్ పద్మ, జి.పార్వతి, వాగ్మారే ప్రియాంక, నమేవార్ అనిత, వాగ్మారే సోని, సంగీత తుకారాం, గైక్వాడ్ రాజాబాయి, కర్మల్కార్ సంగీత, అర్పిత అంజనీకర్, ఎడికే రాంబాయితో పాటు మరో ముగ్గురు హాజరయ్యారని సమాచారం. కాగా రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును, చైర్ పర్సన్‌గా నియమితులైన అయిల్వార్ సౌజన్యను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, నాయకులు మంత్రిని కలిశారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రయతి్నస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం: సీఎం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం.. పదవుల ఎంపికలో నయా దృక్పథం..ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం..ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మన ఆడబిడ్డ సౌజన్య మద్నూర్ మార్కె ట్ కమిటీ చైర్ పర్సన్‌గా ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం. తొలిసారిగా ఇంటర్వ్యూ పద్ధతిలో, ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ, మహిళల చదువుకు.. ఆత్మస్థైర్యానికి ప్రోత్సాహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించింది..’అని సీఎం పేర్కొన్నారు. పారదర్శక విధానంలో ఈ పదవికి సౌజన్యను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. -
కేటీఆర్ అలా మాట్లాడటం సిగ్గుచేటు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,సంగారెడ్డి జిల్లా: ప్రజా ఆశీర్వాదంతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జహీరాబాద్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లు పాలించి రాష్ట్రంలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసం సృష్టించారు. అభివృద్ధిని విస్మరించి స్నో, పౌడర్ ఖర్చులకు 50 వేల కోట్లు అప్పులు చేశారు. అధికారం పోయిన రెండో రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. మాజీలమని మరిచి కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. లగచర్ల ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం వెనక బీఆర్ఎస్ శ్రేణులు కుట్ర ఉంది. కలెక్టర్‌పై దాడి చేసిన సురేష్ తన మనిషేనని కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజా ఆశీర్వాదంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు.పైసా పైసాకు కూడబెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. జహీరాబాద్‌లో అధునాతన మోడల్ ప్రభుత్వ అతిథి గృహం నిర్మిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న అన్ని రహదారులకు మరమ్మత్తులు పూర్తి చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. -
Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వద్దంటే కాంగ్రెస్ లోకి వస్తున్నారు
-
‘గుంతలు లేని రోడ్లు కోసం వ్యూహాత్మక ప్రణాళిక’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్ర రహదారులను నిర్మించలేదని, జాతీయ రహదారుల మంజూరుకు ప్రయత్నించలేదన్నారు.గాలికి దీపంపెట్టి దేవుడా అని మొక్కినట్లు కేసీఆర్ రూలింగ్ చేశారని, తాము ఇప్పుడు రహదారుల మరమ్మత్తుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో 9 వేల కిలో మీటర్ల మేర రహదారులపై గుంతలు పూడుస్తామన్నారు. -
రోజుకో స్కామ్ బయటకి..కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
-
కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని, ఆయన ఒక జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం(అక్టోబర్22) మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ‘పార్లమెంట్లో ఒక్క సీటు రాకున్నా,అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు మా ప్రభుత్వం ఇస్తోంది. కేంద్ర మంత్రులు సంజయ్,కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కి ఎంత నిధులు తెచ్చారు’అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.పార్లమెంట్ సెంట్రల్‌హాల్ తరహాలో అసెంబ్లీ..‘రూ.49కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీని ఆధునికీకరిస్తోంది. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నారు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహలో అసెంబ్లీ,కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికిల్‌లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంది. రెండూ ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుంది’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. -
‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని నాలుగు కార్పొరేషన్లుగా విభజించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. ఈ విషయమై శనివారం(అక్టోబర్ 5) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ మహా నగరంలో జనాభా కోటిన్నరకు చేరింది.జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా చేసిన తర్వాత నలుగురు మేయర్లు ఉంటారు.రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఈ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచేందుకు రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను నిర్మిస్తాం.అమెరికా తర్వాత అత్యధికంగా ఎంఎన్సీ కంపెనీల హెడ్‌క్వార్టర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్నాయి’అని కోమటిరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: హోం మంత్రి పదవి ఇవ్వాలని.. -
ఆ ఇద్దరు మంత్రులు దద్దమ్మలు: జగదీష్‌రెడ్డి
సాక్షి,నల్లగొండజిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు దద్దమ్మ మంత్రులున్నారని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సాగర్ జలాలపై ఈ మంత్రులకు అవగాహన లేకపోవడంతో ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేటలో మంగళవారం(సెప్టెంబర్24) నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు.ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు అధికంగా తరలించడం వల్లనే ఎడమ కాల్వకు గండి పడిందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న మంత్రుల మాటలు విని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ ఇంకా 30 శాతం కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: సాగర్‌కాలువ గండి పూడ్చడం చేతకాదా..? -
గత ప్రభుత్వంలో స్కాములు తప్ప అభివృద్ధి లేదు
లింగోజిగూడ: గత ప్రభుత్వ పాలనలో స్కాము లు తప్ప అభివృద్ధి జరగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం మదర్ డెయిరీ ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ పోస్టులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో శనివారం నూతన చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని హయత్‌నగర్ మదర్ డెయిరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నూతన చైర్మన్‌గా ఎన్నికైన గుడిపాటి మధుసూదన్‌రెడ్డితో పాటు గెలుపొందిన డైరెక్టర్లకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు బినామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాలలో లడ్డూల తయారీకి హరీశ్‌రావు తన బినామీ కంపెనీల ద్వారా నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ఇక నుంచి దేవాలయాలకు అవసరమైన నెయ్యి, పాలను మదర్ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని మంత్రి కొండా సురేఖను కోరతానని ఆయన తెలిపారు. -
కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటి రెడ్డి
హైదరాబాద్,సాక్షి : ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం నిన్న తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. చివరికి అరెస్ట్‌లకు దారితీసింది. ఈ తరుణంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అని అరికెపూడి గాంధీ చెప్పారు. సచ్చి పోయిన పార్టీని బ్రతికించడం కోసం నాటకాలు అడుతున్నారా? సర్పంచ్‌కి పనికి రాని కౌశిక్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు.ఆంధ్రప్రాంత ప్రజల్ని తిట్టడం బీఆర్ఎస్ విధానామా ’ అని ప్రశ్నించారు.వాళ్లు లేకుంటే బీఆర్ఎస్కు ఇన్ని సీట్లు వచ్చేవా? జీహెచ్ఎంసీలో ఎలా ఎలా గెలిచారు? అని మండిపడ్డారు. హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బ తీయాలనేది వాల్ల ఉద్దేశం.కాంగ్రెస్ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. ఇదీ చదవండి : ఈ తండ్రంటే కూతురికి అసహ్యం -
జూబ్లీహిల్స్‌లో ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు, మెగాస్టార్ సందడి (ఫొటోలు)
-
Raksha bandhan 2024 : ప్రముఖుల రక్షాబంధన్ వేడుక (ఫొటోలు)
-
అనాధ బాలికకు అండగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి
-
బీఆర్ఎస్ ఆఫీస్‌ను కూల్చేయండి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆదేశాలు
సాక్షి నల్గొండ జిల్లా: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆఫీస్‌ను నిర్మించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి.. తాను గతంలోనే అధికారులకు ఈ విషయంపై ఆదేశాలిచ్చాను కదా వ్యాఖ్యానించారు.‘‘నేను అమెరికాకు వెళ్తున్నా.. ఆగస్టు 11న తిరిగి వస్తాను.. వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలి.. లేకపోతే అధికారులపై యాక్షన్ తీసుకుంటా అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. -
'పవర్' ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్’ పద్దుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ప్రకంపనలు రేపింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, సవాళ్లు– ప్రతిసవాళ్లు, ఆరోపణలు– ప్రత్యారోపణలు, రాజీనామా డిమాండ్లతో సభ అట్టుడికింది. అదే సమయంలో ఇరుపక్షాల నేతల మధ్య వ్యక్తిగత దూషణలూ చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఏడాది విద్యుత్ రంగానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని ఆక్షేపించారు. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, ఆ కథంతా వెలికి తీస్తామని పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచామంటూ పలు గణాంకాలను వివరించారు. అవినీతి అంటూ కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఈ దశలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోని విద్యుత్ ఒప్పందాలన్నీ అవినీతిమయమంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా జగదీశ్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ఇరుపక్షాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో శాసనసభ దద్దరిల్లింది. -
సభలో సవాల్.. జగదీష్ రెడ్డి Vs మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్, మంత్రులు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో, ఆరోపణలు నిజమైతే రాజీనామాలకు సిద్ధమని జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేసుకున్నారు.కాగా, విద్యుత్ అంశంపై చర్చలో భాగంగా గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌కు కౌంటరిచ్చారు.జగదీష్ రెడ్డి కామెంట్స్..సంచుల మూటలు పట్టుకుని దొరికిన వ్యక్తి.చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.మేము తెలంగాణ కోసం ఎన్నో మంచి పనులు చేశాను. జగదీష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్..జగదీష్ రెడ్డి సూర్యాపేటలో దారుణాలు చేశారు.ఆయనపై మర్డర్ కేసులు కూడా ఉన్నాయి.మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.దీంతో, సభలో గందరగోళం నెలకొంది.నేను చెప్పిన కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు. జగదీష్ రెడ్డి కౌంటర్..నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను.సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి.నాపై కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కేసులు పెట్టింది.మూడు కేసుల్లో కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది.సభలో ఆరోపణలపై హౌస్ కమిటీ వేయండి.మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడు.మీలాగా డబ్బుల సంచులు పట్టుకుని తిరగలేదు.కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. కోమటిరెడ్డి కామెంట్స్..జగదీష్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను.నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.నేను చేసిన ఆరోపణలను నిరూపిస్తాను.ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అంతకుముందు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.జ్యుడీషియల్ కమిషన్ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.కానీ, మీరు కమిషన్ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.కమిషన్ ఛైర్మన్‌ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తాం.తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి మాత్రమే.సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్ సమస్య నుంచి గట్టెక్కింది.లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను. దీంతో, నన్నుమార్షల్స్ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు. సోలార్ పవర్లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్ ఉత్పత్తి పెరిగింది. సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్‌లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.ఆఖరికి అటెండర్ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడేవిచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదు.ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది. -
హైదరాబాద్-విజయవాడ హైవేని సిక్స్ లైన్‌గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆగస్టు 15వ తేదీలోపే తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదిహేనేళ్లు అధికారంలో ఉంటామనేది పెద్ద జోక్ అంటూ కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి కోమటిరెడ్డి భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ..‘భువనగిరి, ఆలేరు ప్రజలకు ఇన్నాళ్లు తాగడానికి నీరు కూడా లేక మూసీ నీరు తాగుతున్నారు. నాలుగు నెలల్లోనే మూసీ నదిని శుద్ధి చేస్తాం. ఆగష్టు 15వ తేదీలోపే రైతులకు రుణమాఫీ చేస్తాం. హైదరాబాద్-విజయవాడ హైవేని ఆరు లైన్లుగా మారుస్తాం. తెలంగాణలో కేసీఆర్ పదిహేనేళ్లు అధికారంలో ఉంటామనేది ఓ పెద్ద జోక్. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఏడు చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను పట్టించుకోవద్దు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రెండు నెలల్లో ప్రారంభం.. రెండేళ్లలో పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిర్మించబోయే తెలంగాణ భవన్ దేశానికి ఐకానిక్‌గా ఉంటుంద ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. రెండు నెలల్లోగా పనులు ప్రారంభించి రెండేళ్లలోపు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. హంగూ, ఆర్భా టాలనేవి భవన్ నిర్మాణంలో కనిపించవని.. అయితే ఢిల్లీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆగి మరీ భవ న్ను చూసేలా మోడ్రన్‌గా నిర్మిస్తామని వివ రించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిజైన్‌ను ఖరా రు చేసిన వెంటనే పనులు ప్రారంభమవు తాయ ని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఏపీ జితేందర్ రెడ్డి బాధ్య తల స్వీకారం కార్యక్రమానికి వచ్చిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అదిరిపోయేలా నిర్మాణంపదేళ్లుగా తెలంగాణకు ఢిల్లీలో భవన్ లేకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి పేర్కొ న్నారు. సుమారు రూ.400–500 కోట్ల బడ్జెట్‌తో తెలంగాణ భవన్ అదిరిపోయేలా నిర్మిస్తామని చెప్పారు. రెండు కంపెనీలు బిల్డింగ్ నిర్మాణం గురించి ప్రజెంటేషన్ ఇచ్చాయన్నారు. వాళ్లు గోపురం టైపులో నిర్మిద్దామనే డిజైన్ ఇవ్వడంతో..తాను కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. సింపుల్ లుక్‌లో భవన్ అదిరిపోయేలా ఉండాల ని సూచించినట్లు తెలిపారు. అందుకు తగ్గ డిజై న్లు వచ్చిన వెంటనే 2 నెలల్లోపే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని వివరించారు. హైదరా బాద్ హౌజ్ పక్కన గవర్నర్, సీఎం బంగ్లాలు నిర్మించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ వల్లే పరిష్కారమైందిరాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సంబంధించిన 19 ఎకరాల ఆస్తుల్లో 42% వాటా తెలంగాణకు రావాల్సి ఉందని కోమటిరెడ్డి తెలిపారు. ఈ ఆస్తులను సాధించుకోవడంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పటౌడీ హౌజ్, హైదరాబాద్ హౌజ్‌ల పక్కన స్థలాలు తెలంగాణకు కేటాయించాలంటూ అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను తాను కోరడంతో ఆయన వెంటనే ఓకే చేసినట్లు చెప్పారు. ఆ వెంటనే అప్పటి సీఎస్ జవహర్ రెడ్డితో కూడా మాట్లాడి ఏపీ, తెలంగాణకు కేటాయించాల్సిన ఆస్తులపై చర్చించి కేంద్రానికి తెలిపామన్నారు. కేంద్రం కూడా స్థలాల్ని రెండు రాష్ట్రాలకు విభజన చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడి సాధించుకుంటామన్నారు. హైదరాబాద్ – విజయవాడ బుల్లెట్ ట్రైన్, కృష్ణా– గోదావరి ట్రిబ్యునల్ వ్యవహారం వంటి సమస్యలకు కేంద్రం నుంచి పరిష్కారాన్ని సాధిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ పై కోమటి రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. కోమటిరెడ్డికి హరీశ్‌రావు కౌంటర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మతిభ్రమించిందని.. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అంటూ ధ్వజమెత్తారు. తాను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లింది వాస్తవం.. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను’’ అని హరీశ్‌రావు చెప్పారు.‘‘నేను అమెరికా వెళ్లి, ప్రభాకర్‌రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం. రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలి. నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్లో ఉన్నాను తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనం.’’ అంటూ హరీశ్‌రావు దుయ్యబట్టారు.కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తున్నాను. ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. కోమటిరెడ్డి చెప్పిన తేదీన, చెప్పిన టైంకి అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తాను, మీ ఆధారాలతో మీరు రండి. చిల్లర వ్యాఖ్యలు చేయడంమాని పాలనపై దృష్టి సారించాలి. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి తన హుందాతనాన్ని నిలుపుకోవాలి’’ అంటూ హరీశ్‌రావు హితవు పలికారు. -
నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడని.. ప్రభాకర్‌ను కలిసేందుకే హరీశ్‌రావు అమెరికా వెళ్లారని.. ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పొచ్చారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.‘‘ఏ విమానంలో వెళ్లారో.. ఎక్కడ కలిశారో నిరూపిస్తా. ప్రభాకర్‌రావును కలవలేదని హరీశ్ ప్రమాణం చేస్తారా?. నేను దేనికైనా సిద్ధమే’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. -
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
-
కాంగ్రెస్‌లో ఏక్నాథ్ షిండేలు?.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్గొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదేళ్లే కాదు మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఏక్నాథ్ షిండేలు లేరని స్పష్టం చేశారు. తమ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఏక్నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ పార్టీ అని మండిపడ్డారు. కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఈ మేరకు నల్లగొండలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దళితున్ని ప్రతిపక్ష నేతగా సహించని పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబటారు. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదన్న హరీష్‌రావు మాటల్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో అయిదు గ్రూపులు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అనడం తప్పని అన్నారు. బీఆర్ఎస్.. హరీష్ రావు, మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడాలని, కోమటిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని పడగొడతామన్న మాటలు బంద్ చేయాలని అన్నారు. ‘ప్రతిసారి మహేశ్వర్ రెడ్డి నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు. బండి సంజయ్‌ను దింపి కిషన్ రెడ్డిని ఎందుకు సీట్లో కూర్చోబెట్టారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా?. 39 సీట్లకే పరిమితం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు జ్ఞానోదయం కావట్లేదా?. ప్రతిపక్ష నేతలు విజ్ఞతతో మాట్లాడాలి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస 14 సీట్లను గెలవబోతుంది’ అని తెలిపారు. చదవండి: Congress: కాంగ్రెస్‌లో ఆ ముగ్గురు ఎవరు? -
గచ్చిబౌలి: ఓఘ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన డింపుల్ హాయతి
-
దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రిగా ఉండి సికింద్రాబాద్‌కు కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘సభకు 10 లక్షల మందిని తరలిస్తాం. ఏప్రిల్ ఎనిమిదో తేదీన నాంపల్లిలో ఫిరోజ్‌ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుంది. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. భువనగిరి, నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తాం. సికింద్రాబాద్‌లో కూడా దానం నాగేందర్‌ను గెలిపిస్తాం. దానం గెలుపు బాధ్యత మాదే. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఈసారి గెలిచాం. బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన. మాజీ మంత్రి హరీష్‌రావు మాటలకు అర్ధం లేదు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు కూడా పడటం లేదు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నాడు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్‌ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. కేంద్రమంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ను పట్టించుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. కాంగ్రెస్ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ఇక, దానం నాగేందర్ మాట్లాడుతూ..‘సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నేను గెలవడానికి అందరి సహకారం కావాలి. తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి సమావేశమయ్యాం’ అని వ్యాఖ్యలు చేశారు.