Konaseema District
-
మహాసేన రాజేష్‌పై కేసు నమోదు
సాక్షి, కోనసీమ: ఏపీలో మహాసేన రాజేష్‌పై పోలీసు కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మహాసేన రాజేష్, ఆయన అనుచరులు వేధిస్తున్నారని మహిళ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్‌పై కేసు నమోదుచేశారు పోలీసులు. మహాసేన రాజేష్, అతడి అనుచరులు వేధిస్తున్నారని శంకరగుప్తం గ్రామానికి చెందిన శాంతి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, రాజేష్‌తో పాటు నలుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అచ్చెన్నాయుడు సమక్షంలో కూటమి నేతల కుమ్ములాట
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో కూటమి నేతల సమావేశం రసాభాసగా మారింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే కూటమి నేతలు కుమ్ములాటకు దిగారు. జనసేన నేతలను చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ ఫొటో లేకపోవడంపై ఆందోళనకు దిగారు. సమావేశానికి జనసేన నేత కల్వకొలను తాతాజీ డుమ్మాకొట్టగా.. టీడీపీ నేత రమణబాబు సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ.. ఓ జనసైనికుడి ఆవేదన.. వీడియో వైరల్నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పొత్తు ధర్మానికి టీడీపీ నాయకులు తూట్లు పొడుస్తున్నారని, జనసైనికులను పెదగార్లపాడులో బానిసలుగా చూస్తున్నారని జనసైనికుడు ఎన్.వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అవేదనను వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో సోమవారం పొస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వరకు ఈ వీడియో చేరేలా షేర్ చేయాలని ఆయన కోరాడు.టీడీపీ నాయకులు జనసైనికులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో, బానిసలుగా ఎలా చూస్తున్నారో వీడియోలో వివరించాడు. ఎన్నికల వరకు తమతో ఎంతో ఉత్సాహంతో టీడీపీ నాయకులు కలిసి పనిచేశారని, అధికారం వచ్చాక టీడీపీ నేతల నిజస్వరూపం చూపిస్తున్నారని పేర్కొన్నాడు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసైనికులు తొత్తుల్లాగా, బానిసలుగా ఉండాలనే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వాపోయాడు.ఉపాధి అవకాశాలు కల్పించే విషయాల్లో టీడీపీ నాయకులు జనసేనని భాగస్వాములు చేయకుండా అన్ని టీడీపీ నాయకులే తీసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశాడు. ‘అసలు ఎవర్రా మీరు. మీరు వచ్చి మమ్మల్ని అడిగేది ఏందిరా’ అని టీడీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, పదిలో తమకు కనీసం మూడు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరితే కుదరదని నాయకులు చెబుతున్నారని పేర్కొన్నాడు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచి ప్రయాణం కాదని తెలిపాడు.ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
చనిపోయినా నలుగురిలో సజీవంగా నిలిచిన ఉపాధ్యాయురాలు
-
రెండు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్ నియమితులయ్యారు.జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్‌రామ్‌లను నియమించారు.కాగా, పార్టీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే -
భార్యను స్వదేశానికి తీసుకురావాలంటూ వేడుకోలు
అమలాపురం రూరల్: బెహ్రయిన్‌లో తన భార్య ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి తీసుకురావాలంటూ ఓ వ్యక్తి కలెక్టర్‌ను వేడుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడికి చెందిన దుక్కిపాటి పావని ఓ ఏజెంట్ ద్వారా గత నెల 25న బెహ్రయిన్లోని ఓ ఇంట్లో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ అనేక అవస్థలు పడుతున్నట్లు ఆమె ఫోన్లో ఆడియో రికార్డింగ్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి తిండి, నీరు లేక అలమటిస్తున్నానని ఆమె పేర్కొంది. తన ఆరోగ్యం క్షీణించిందని తనను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలని పావని వేడుకుంది. ఈ మేరకు భార్య ఆడియో రికార్డింగ్‌తో భర్త దుర్గాప్రసాద్, ఇద్దరు పిల్లలతో వచ్చి సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు. -
కోనసీమ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం
సాక్షి, కోనసీమ జిల్లా: టీడీపీ నేతల నిర్లక్ష్యం కారణంగా కోనసీమ జిల్లాలో జాతీయజెండాకు అవమానం జరిగింది. 78వ స్వాతంత్య్య దినోత్సవం సందర్భంగా అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం పంచాయతీలో జాతీయజెండాను టీడీపీ నేతలు తిరగేసి ఆవిష్కరించారు. దీంతో వేడుకలకు హాజరైన పలువురు టీడీపీ నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వాతంత్ర దినోత్సవం.. ఎంతోమంది త్యాగమూర్తుల బలిదానాలకు వారి త్యాగాలకు నిదర్శనం.. అందుకే ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగురవేస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఎంతో విశిష్టత కలిగిన మూడు రంగుల జెండా.. పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ.. ఐక్య భావానికి, విజయ గీతానికి సూచికగా నిలుస్తోంది. అలాంటి జాతీయ జెండాను టీడీపీ నేతలు అవమానించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మంత్రి కాన్వాయ్ అడ్డుకుని మందుబాబులు రచ్చ..
-
రాజమండ్రి : గోదావరి ఉగ్రరూపం..నీట మునిగిన లంక గ్రామాలు (ఫొటోలు)
-
కోనసీమ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. యువతి విన్నూత నిరసన
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి వినూత్నంగా నిరసన తెలిపింది. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన సరెళ్ల తేజస్వినిని వివాహం చేసుకుంటానని అదే గ్రామానికీ చెందిన కుక్కల స్టాలిన్ అనే యువకుడు నమ్మించి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తక్షణమే న్యాయం జరగాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన గోడును అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న బాధితురాలు తేజస్విని.. తనను మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని.. లేదంటే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. -
కోనసీమలో భారీ వర్షాలు..నీట మునిగిన లంక గ్రామాలు (ఫొటోలు)
-
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి,అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది.బోర్ బావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్‌ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
రెచ్చిపోయిన జనసేన.. అర్ధరాత్రి విధ్వంసం..
-
నేనున్నాను.. అంబులెన్స్‌లో పేషెంట్‌కు సీఎం జగన్ భరోసా
మండపేట(డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. జననేతకు అడుగడుగునా జనం నీరాజనాలు పడుతూ మేమంతా సిద్ధం అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. భానుడు భగభగమని మండిపోతున్నా జననేతను చూసి తమ మద్దతు తెలిపేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. సీఎం జగన్ బస్సుయాత్రలో ప్రతీ జంక్షన్ సైతం భారీ బహిరంగ సభల్ని తలపిస్తుండటం విశేషం. నేటి(గురువారం) మేమంతా సిద్ధం బస్సుయాత్ర 17వ రోజులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. బస్సుయాత్ర చేపట్టిన దగ్గర్నుంచీ ఇప్పటికే ఎంతో అనారోగ్య బాధితులికి తానున్నానంటూ భరోసా ఇచ్చిన సీఎం జగన్.. ఈరోజు అంబులెన్స్‌లో వచ్చిన ఓ పేషెంట్‌కి సైతం తాను ఉన్నానంటూ మంచి మనసును చాటుకున్నారు. మండపేట నియోజకవర్గం మడికి గ్రామంలోకి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రవేశించగా, ఓ అంబులెన్స్ ఆ యాత్ర మధ్యలోకి వచ్చి ఆగింది విషయం తెలుసుకున్న సీఎం జగన్.. అంబులెన్స్‌లో వచ్చిన పేషెంట్‌ను కలిశారు. అతని బంధువులతో మాట్లాడగా, సహాయం కావాలని వారు సీఎం జగన్‌ను కోరారు. ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్‌కు మరింత సహాయం కావాలని సీఎం జగన్‌కు వారు విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆ పేషెంట్ బంధువులకు తానున్నాననే భరోసా ఇచ్చారు సీఎం జగన్. -
TDP సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ ఫిక్స్
అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చేయడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇలానే 2014లో అలవి కాని హామీలు 650 వరకూ ఇచ్చేసి.. గద్దెనెక్కిన తరువాత వాటిని తుంగలో తొక్కేసిన ఆయన.. మేక వన్నె పులిలా.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వస్తూ సూపర్ సిక్స్ పేరిట గుప్పిస్తున్న హామీలు ఏవిధంగా నమ్ముతామని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ రుణ వాయిదాలు చెల్లించవద్దని చంద్రబాబు ఢంకా బజాయించి మరీ చెప్పారు. బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కూడా చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని గొప్పగా చెప్పారు. చంద్రబాబు మాటలు అమాయకంగా నమ్మిన చాలామంది తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. చివరకు రుణ భారం తడిసి మోపెడై, బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుకుని అవమానాల పాలైన రైతులు, డ్వాక్రా మహిళలు లబోదిబోమన్నారు. తనఖా పెట్టిన బంగారం బ్యాంకుల నుంచి ఇంటికి వచ్చేస్తుందని నమ్మి మోసపోయారు. రైతులకు ‘బాబు’గారి జెల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు సహకార, వాణిజ్య బ్యాంకుల నుంచి ఏటా రూ.3,290 కోట్ల రుణాలు తీసుకుంటారు. వారికి రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. చివరకు అరకొరగా రూ.25 వేల లోపు మాత్రమే చేసి, మధ్యలోనే వదిలేసి, రైతులను నిలువునా ముంచేశారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలను ఏవిధంగా నమ్మాలని రైతులు ప్రశి్నస్తున్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారిలా.. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ ప్రకటించారు. అది నమ్మి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,10,336 స్వయం సహాయక సంఘాల్లోని 10,71,078 మంది మహిళలు అప్పటికి తమపై ఉన్న రూ.1,07,107 కోట్ల రుణాలు మాఫీ అయిపోతాయని సంబరపడ్డారు. తీరా గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు చిల్లిగవ్వ కూడా మాఫీ చేయకుండా దగా చేశారు. దీంతో ఆయనకు ఓట్లేసి మోసపోయామని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు – కుంకుమ పేరిట ప్రతి డ్వాక్రా మహిళకు మూడు విడతలుగా (రూ.2,500, రూ.3,500, రూ.4,000) రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా దానిని కొంతమందికే పరిమితం చేశారు. అది కూడా రూ.2,500, రూ.3,500 మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన రూ.4 వేలకు చెక్కులు ఇచ్చి ఏప్రిల్ చివరిలో మార్చుకోవాలని సూచించారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ చెక్కులు కాస్తా చెల్లుబాటు కాకుండా పోయాయి. వాటిని మహిళలు చిత్తుకాగితాల్లా చెత్తబుట్టలో వేయాల్సి వచ్చింది. నిరుద్యోగులకు కుచ్చుటోపీ 2014 ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చేంత వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, కొంత మందికి మొక్కుబడిగా రూ.1,000 చొప్పున వేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంకా కాపులకు రిజర్వేషన్, ముస్లింలకు ప్రధాన నగరాల్లో హజ్ హౌస్‌లు నిర్మిస్తామంటూ ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు గాలికొదిలేశారు. ఇలా అప్పట్లో ఆయన ఇచ్చిన హామీల్లో దేనినీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా వంచించారు. చివరకు టీడీపీ అధికారి వెబ్సైట్ నుంచి నాడు ఇచ్చిన మేనిఫెస్టోను సైతం మాయం చేసేశారు. అప్పట్లో ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు.. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జనం నిలదీస్తారనే జంకూ గొంకూ లేకుండా ఈ ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పథకాలు అంటూ మరోసారి చేస్తున్న ప్రచారాన్ని నమ్మబోమని ప్రజలు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీల తరఫున టీడీపీ నుంచి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో ఇస్తున్న నాలుగు పేజీల బుక్‌లెట్‌ను చాలామంది ఏమాత్రం చూడకుండా పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు తీరుకు పూర్తి భిన్నంగా గత ఎన్నికల వేళ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేసిన వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ‘ఆడియో’ దుమారం -
కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాజీనామా చేశారు. అమలాపురంలో పార్టీ అధిష్టానం చాలా అన్యాయం చేసిందని రాజబాబు మండిపడ్డారు. అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని.. జనసైనికులు, వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అనైతికంగా సీటు దక్కించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి అమలాపురంలో జనసేన జెండాను నిలబెట్టాను. టీడీపీ జెండా మోయడానికి సిద్ధంగా లేము. పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నాను’’ అని రాజబాబు తెలిపారు. -
ఎన్నికల పాఠం
కోనసీమ జిల్లా: వంద శాతం పోలింగ్ కావాలంటే విద్యార్థుల పాత్ర కీలకం. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారితో ఓటు వేయిస్తారు. అందుకే విద్యార్థి దశ నుంచే సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠం ముద్రితమైంది. ఇది ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నికల వ్యవస్థ నుంచి ఓటుహక్కు వినియోగం వరకు విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశం రూపొందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించగా, ఆ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 92 కోట్లకు చేరింది. 6వ తరగతి నుంచి.. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కు విలువ, ఎన్నికల విశిష్టతను తెలియజేసేందుకు విద్యార్థులకు పాఠ్యాంశాలను సాంఘికశాస్త్రంలో పొందుపర్చారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల దశలోనే విద్యార్థులకు పరిచయం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఇలా పలు అంశాలను విద్యార్థులకు పరిచయం చేశారు. ► 6వ తరగతిలో ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు, అధిక ఓటర్లు తీసుకునే నిర్ణయం, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ఎన్నుకునే విధానం, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే విధానం, నమూనా ఎన్నికల నిర్వహణ గురించి వివరించారు. మెజారిటీ పాలన, ఆర్టికల్ 326, విశ్వజనీన వయోజన ఓటుహక్కు గురించి వివరించారు. ► 7వ తరగతిలో సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, గణతంత్రం, రాజ్యాంగ రూపకల్పనా చరిత్ర, ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతాయుతమైన పౌరసత్వం, దేశభక్తి, స్వీయ క్రమశిక్షణ, శాసనసభ్యుని ఎన్నిక, రహస్య ఓటింగ్ విధానం తదితర భావనలను విద్యార్థులకు పరిచయం చేశారు. ► 8వ తరగతిలో మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం? పార్లమెంట్ ఎలా ఏర్పడుతుంది? రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ఎలా ప్రవేశ పెట్టారు? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, 2004 సాధారణ ఎన్నికల నుంచి వినియోగించిన విధానం, ఈవీఎంల వినియోగించడం వల్ల 1,50,000 చెట్లను రక్షించుకోగలగడం, బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే 8వేల టన్నుల కాగితం ఉపయోగపడిన అంశం తదితర విషయాలను వివరించారు. ► 9వ తరగతిలో ‘ఎన్నికల రాజకీయాలు’ అనే చాప్టర్లో భారతదేశంలో ఎన్నికలను మదింపు చేయడం, వివిధ నియోజకవర్గాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించడం, ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు ఎన్నికల్లో వివిధ దశలను వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడడంలో ఎన్నికల సంఘం పాత్రను వివరించారు. భారతదేశంలో ఎన్నికల విధానం, రిజర్వ్ నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా, అభ్యర్థులు నామినేషన్ వేసే విధానం, విద్యార్హతలు, పోలింగ్ జరిగే విధానం, ఓట్ల లెక్కింపు తదితర విషయాలను ప్రస్తావించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి వివరిస్తూనే ఎన్నికలు ప్రకటన చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల సంఘం నిర్వహించే ప్రతి అంశాన్ని పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. ఎన్నికల సంఘం విధులకు సంబంధించి చక్కటి ఫొటోలతో, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన చేపట్టారు. -
రాష్ట్రమంతా ఒకెత్తు ఆ గ్రామం ఒకెత్తు
-
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్‌నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్‌కుమార్‌తో తేజ రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్‌కుమార్‌లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు. అనుమానం వచ్చిందేమో! కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్‌ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్‌లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అమలాపురం సీటు కోసం సిగపట్లు
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ బరిలో ఈసారి టీడీపీకి అవకాశం లేదనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై జనసేన పార్లమెంటరీ ఇన్చార్జి శేఖర్‌తోపాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ ఆదివారం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అమలాపురం ఆత్మగౌరవానికి సంబంధించిందని వదులుకోవద్దని ఆయనకు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే సీటును జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ నేత ఆనందరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీడీపీ నేతలు వాసంశెట్టి సుభాష్ , గంధం పల్లంరాజు పేరుతో ఆనందరావుకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సుభాష్, పల్లంరాజులు కోనసీమకు అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిన సమయంలో జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్నారని, వారి పేరిట ప్రచారం చేపడితే ఉన్న కాస్త అవకాశాలనూ కోల్పోతామని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
చంద్రబాబు ఝలక్.. జనసేన కౌంటర్!
సాక్షి అమలాపురం: ఓ వైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతారు..మరోవైపు తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు..ఇదీ బాబు మార్కు మిత్ర ధర్మం. రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల అధినేతలూ ప్రకటించారు. కానీ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకూ కొలిక్కి రాలేదు. అయినప్పటికీ టీడీపీ చేపట్టిన ‘రా.. కదలి రా’ సభల్లో మాత్రం తమపార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడం జనసేన నేతలకు, ఆశావహులకు మింగుడుపడడం లేదు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా... కదలిరా..’ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంటరీ జనసేన ఇన్చార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. వాస్తవానికి సభలో టీడీపీ కార్యకర్తలకన్నా జన సైనికుల సందడే అధికంగా ఉంది. ఇంతమంది ఉన్న సభలో చంద్రబాబు.. మండపేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో జనసేన మండపేట ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ అక్కడే ఉన్నారు. సభలో తమ అభ్యర్థి జోగేశ్వరరావు అని బాబు ప్రకటించడంతో లీలాకృష్ణతో పాటు జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. బాబు పక్కనే ఉన్న గంటి హరీష్‌ను మాత్రం పార్లమెంట్‌కు పంపాలని బాబు పిలుపునివ్వకపోవడం గమనార్హం. ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు? సీట్ల సర్దుబాటు ఖరారు కాకున్నా.. చంద్రబాబు ఏకపక్షంగా తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించడం చూసి, జనసేన ఆశావహులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఇలా ఏకపక్షంగా జోగేశ్వరరావును మళ్లీ గెలిపించండంటూ చంద్రబాబే పిలుపునివ్వడంపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా బాబు ప్రవర్తించడంతో టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలెవ్వరూ వెళ్లవద్దంటూ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి లీలాకృష్ణ ఆదేశించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లీలాకృష్ణ తానలా చెప్పలేదన్నా.. జనసేన అనుకూల సోషల్ మీడియాలో టీడీపీపై సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాలాచోట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు తమదే సీటు అంటూ ప్రచారం చేస్తుండడం కూడా జనసేన ఇన్చార్జిలకు మింగుడు పడడంలేదు. ‘మా పార్టీ అధినేత పొత్తుకు వెళ్లినట్టు లేదు.. కాళ్ల బేరానికి వెళ్లినట్టుంది’ అంటూ సగటు జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Prabhala Teertham 2024 Photos: కోనసీమ జిల్లాలో కన్నుల పండువగా ప్రభల తీర్థం (ఫొటోలు)
-
కోనసీమ జిల్లా: టీడీపీ నేతలకు అంగన్వాడీల ఝలక్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో టీడీపీ నేతలకు అంగన్వాడీలు ఝలక్ ఇచ్చారు. ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలను పొమ్మంటూ అంగన్వాడీలు తెగేసి చెప్పారు. తమను గుర్రాలతో తొక్కించి, తమపై దాష్టీకం ప్రదర్శించిన చంద్రబాబు మద్దతు తమకు అవసరం లేదని తేల్చి చెప్పడంతో అంగన్వాడీల రియాక్షన్‌కు టీడీపీ నాయకులు బిత్తరపోయారు. ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ టీడీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా వదిలిపెట్టని అంగన్వాడీలు... మీ మద్దతు మాకు అవసరం లేదంటూ మొహం మదే చెప్పేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు బిక్క మొహంతో వెనుదిరిగారు. ఇదీ చదవండి: అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి -
కోనసీమ ‘ప్రభ’
సాక్షి, అమలాపురం: కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ప్రభల తీర్థం. ఇది సంక్రాంతి పండుగ వేళ జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. దేశ రాజధాని న్యూఢిల్లీలో గతేడాది అట్టహాసంగా జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటంపై కొలువుదీరిన ఈ ప్రభల తీర్థం భారతీయుల మనస్సులను గెలిచాయి. కోనసీమ ‘ప్రభ’ను నలుదిక్కులా చాటి చెప్పాయి. వివరాల్లోకి వెళితే...డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత. తీర్థం జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న రెండు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలకు చెందిన పదకొండు ప్రభలు ఇక్కడకు వస్తాయి. ఇక్కడ జరిగే ప్రభల తీర్థం లోక కల్యాణార్థం అని భక్తుల విశ్వాసం. పెద్దాపురం సంస్థానా«దీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో తొలిసారిగా 17వ శతాబ్ధంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారని చెబుతారు. మహారాజుకు పరమేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి ప్రభల తీర్థం నిర్వహించమని కోరారంటారు. అప్పటి నుంచి ఇక్కడ తీర్థం జరుగుతోందని భక్తుల విశ్వాసం. మరో కథలో.. 17వ శతాబ్దంలో పరమ శివభక్తుడు, ఏకసంధాగ్రాహి అయిన విఠలా జగ్గన్న ఇక్కడున్న కౌశిక నది చెంతన శివ పూజ చేసేవారు. ఇందుకు పెద్దాపురం సంస్థానాధీశుడు అభ్యంతరం చెప్పడంతో హైదరాబాద్ నిజాం నవాబును తన ప్రతిభతో మెప్పించి ఇప్పుడు తీర్థం జరిగే జగ్గన్నతోట వద్ద 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా పొందారని చెబుతారు. ఈ కారణంగానే ఇది జగ్గన్నతోటగా పేరొందిందని నమ్మకం. ప్రభల తీర్థాలు జరిగేదెక్కడంటే.. జగ్గన్నతోటతో పాటు కొత్తపేట సెంటర్, అవిడి డ్యామ్ సెంటర్, కాట్రేనికోన, మామిడికుదురు మండలం కొర్లగుంట వంటి చోట్ల పెద్ద తీర్థాలు జరుగుతాయి. ఇవికాకుండా జిల్లా వ్యాప్తంగా 84 వరకూ తీర్థాలు నిర్వహిస్తారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున ప్రభలు ఉంటాయి. ప్రభలు తయారు చేయడాన్ని యజ్ఞంగా భావిస్తారు. తాటి శూలం, టేకు చెక్క, పోక చెట్ల పెంటిలు, మర్రి ఊడలు, వెదురు బొంగులతో మూడు రోజులపాటు శ్రమించి ప్రభలు తయారు చేస్తారు. రంగురంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వ్రస్తాలతో అందంగా తీర్చిదిద్దుతారు. ప్రభపై పసిడి కుండ ఉంచి చుట్టూ నెమలి పించాలు, జేగంటలు వేలాడదీస్తారు. వరి కంకుల కుచ్చులు, గుమ్మడి, ఇతర కూరగాయలు, పెద్దపెద్ద పూల దండలతో ప్రభకు వేలాడదీస్తారు. వీటిని భక్తులు తమ భుజస్కంధాలపై ఉంచి కిలోమీటర్ల కొద్దీ మోసుకు వస్తారు. కొబ్బరి తోటలు, వరిచేలు, పంట కాలువల మీదుగా సాగే ప్రభల యాత్ర చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయిలో గుర్తింపు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. దీంతో మోదీ తీర్థాన్ని అభినందిస్తూ తిరిగి సందేశం పంపించారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థాన్ని ప్రదర్శించారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గతేడాది ప్రముఖ సినీ నటుడు నాగార్జున నటిస్తున్న ఒక సినిమాలో విజువల్స్ కోసం ప్రభల తీర్థాన్ని చిత్రీకరించారు. యువత ప్రభల తీర్థాలపై పలు లఘు చిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ తీర్థానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. దీంతో ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేర దాటిస్తే ఊరుకు మంచిదనేది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసమని అర్చకుడు చంద్రమౌళి కామేశ్వరశాస్త్రి తెలిపారు. -
Konaseema: ‘ఏపీలో సామాజిక విప్లవం.. సీఎం జగన్ చేతల్లో చూపించారు’
సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో బస్సు యాత్ర సాగింది. మలికిపురంలోని కేఎస్‌ఎన్‌రాజు నివాసంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం రెండు గంటలకు శివకోడు లాకుల నుండి బస్సుయాత్ర ప్రారంభమైంది. మలికిపురం ప్రధాన సెంటర్లో నిర్వహించిన బహిరంగలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరయ్యారు. మలికిపురంలో సామాజిక సాధికార సభ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం జగన్: మంత్రి విశ్వరూప్ సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేర్చారన్నారు. సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో అమలు చేసి చూపించారని, రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తోందని మంత్రి అన్నారు. 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్. అభివృద్ధి చదువు ద్వారానే సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన నాయకుడు. బీసీ, ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన వ్యక్తి జగన్’’ అని మంత్రి కొనియాడారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి వేణు మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గం నాకు పుట్టిల్లు. ఇక్కడ నేతలు కృష్ణంరాజు, జక్కంపూడిల సహకారంతో ఎదిగాను. వైఎస్సార్, సీఎం జగన్ నాకు రాజకీయంగా గుర్తింపునిచ్చారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఆత్మగౌరవం గుర్తించిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. అబద్ధం 14 ఏళ్ల పాటు పాలించింది.. జగన్ అనే నిజం వెలుగులోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చింది’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. వారు తలెత్తుకుని జీవించగలుగుతున్నారు: మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ, పేదల సమస్యల గురించి మాట్లాడే నాయకులను మాత్రమే గతంలో చూశాం.. సమస్యలను పరిష్కరించి, చేతల్లో అభివృద్ధిని చూపిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే. అంబేద్కర్ ఆలోచన విధానాలను అక్షరాల అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. చిన్న వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చెందిన అనేక మందికి సీఎం జగన్ మార్కెట్ చైర్మన్లుగా, దేవాలయాలు చైర్మన్లుగా పదవులిచ్చి సమాజంలో గౌరవం కల్పించారు’’ అని ఎంపీ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు తలెత్తుకుని జీవించగలుగుతున్నారంటే అది వైఎస్ జగన్ వల్లే సాధ్యమైంది. ఈ వర్గాలకు నిజమైన సాధికారత చేకూరింది. ఎవరి దగ్గర చేయి చాచకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు వాళ్ల కాళ్లపై వాళ్లు జీవించగలిగే పరిస్థితిని జగన్ కల్పించారు. దేశంలోని అత్యున్నతమైన రాజ్యసభ పదవులు నలుగురు బీసీలకు జగన్ కట్టబెట్టారు. చంద్రబాబు తన పార్టీలో డబ్బున్న వారికి రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు చిన్నపాటి రాజకీయ హోదా కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయాడు. 2024లో కూడా సీఎంగా జగనే రావాలి’’ అని మోపిదేవి పేర్కొన్నారు. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి
మలికిపురం: స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి దిండి రిసార్ట్స్‌లో ఇరు కుటుంబాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి స్పెయిన్‌లో ఉద్యోగం చేస్తోంది. అదే దేశంలో ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని, సంజనా మనసులు కలిశాయి. ఇరుకుటుంబాల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 3.36 గంటలకు (తెల్లారితే గురువారం) దిండి రిసార్ట్స్‌లో వీరి వివాహం ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. స్పెయిన్ నుంచి వరుడు, వరుడి తల్లిదండ్రులు, మేనత్త, సోదరి, బావతో పాటు 40 మంది బంధువులు ఈ నెల 1న దిండి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఆ రోజు నుంచి తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహ ఘట్టాలను శాస్త్రోక్తం గా జరిపించారు. పెళ్లికి హాజరైన స్పెయిన్ మహిళలు నిండైన చీరలు, మగవారు కుర్తా పైజమా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. వధువు సంజనా కోటేశ్వరి చిన్నాన్న, అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో కుంపట్ల అయ్యప్పనాయుడు. ఆయనే స్థానికంగా పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు.