Latin America
-
Venezuela presidential election: సామ్యవాద కోటలో నారీ భేరి
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది. నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో. అనర్హత వేటేసినా... వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్‌ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం. ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్‌ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది. 40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’ వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత పొందారు! బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా... నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు. ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విప్లవ జ్యోతి
ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన విప్లవ నాయకుడు చే గువేరా. అర్జెంటీనాకు చెందిన ఈ మార్క్సిస్ట్ విప్లవకారుడు... వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకర్త, క్యూబన్ విప్లవంలో ముఖ్యుడు. ఆయన అసలు పేరు ఎర్నేస్తో ‘చే’ గువేరా. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించారు. ఆయనకు ఆస్తమా వ్యాధి వుండేది. ఆ వ్యాధితో బాధపడుతూనే విప్లవ పోరాటాలు చేశారు. లాటిన్ అమెరికాలో పర్యటన సమయంలో అక్కడి పేదరికం చూసి చలించిపోయారు. దీనికి కారణం ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాదాలేనని భావించారు. సమకాలీన వ్యవస్థపై తిరుగుబాటు చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని భావించారు. అందుకే విప్లవం బాట పట్టారు.మెక్సికోలో ఉంటున్న సమయంలో రౌల్, ఫిడెల్ కాస్ట్రోలను కలిశారు. అప్పటి నుంచి వారితో భుజం భుజం కలిపి క్యూబాను బాటిస్టా పాలన నుంచి విముక్తి చేయడానికి పోరాడారు. విప్లవకారుల్లో ముఖ్యమైన వ్యక్తిగా, సైన్యంలో రెండవ స్థానానికి చేరుకుని, నియంతృత్వ బాటిస్టాపై జరిగిన గెరిల్లా పోరాటంలో కీలకపాత్ర పోషించారు. క్యూబా తిరుగుబాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో అనేక ప్రధాన బాధ్యతలను స్వీకరించారు. మంచి వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనికదళాల బోధనా నిర్దేశకునిగా, క్యూబన్ సామ్యవాద దౌత్యవేత్తగా ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేశారు.గెరిల్లా యుద్ధ తంత్రంపై ఆధార గ్రంథాన్ని రాశారు. దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్ మోటార్ సైకిల్ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా పుస్తకం రాశారు. గువేరా 1965లో క్యూబాను వదలి కాంగో కిన్షాసాలోనూ, బొలీవియాలోనూ యుద్ధాలకు నాయకత్వం వహించారు.బొలీవియా యుద్ధంలో పాల్గొని, 1967 అక్టోబర్ 9న అక్కడి సైనికాధికారులకు పట్టుబడి కాల్చివేతకు గురయ్యారు. అలా తాను పుట్టిన దేశం వదలి ప్రపంచ పీడితుల పక్షాన వివిధ దేశాల్లో పోరాటాలు చేస్తూ అసువులు బాసి ఆధునిక విప్లవం మీద తనదైన ముద్ర వేశారు చే!– ర్యాలి ప్రసాద్, కాకినాడ(నేడు చే గువేరా జయంతి) -
భారత ఫుట్‌బాలర్‌కు జాక్‌పాట్
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాలర్ బిజయ్ ఛెత్రి జాక్‌పాట్ కొట్టాడు. లాటిన్ అమెరికా క్లబ్‌కు ఆడే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. తద్వారా ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫుట్‌బాలర్‌గా గుర్తింపు పొందనున్నాడు. మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల బిజయ్‌తో ఉరుగ్వేకు చెందిన కొలోన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఒప్పందం చేసుకుంది. ఇంకా భారత సీనియర్ జట్టుకు ఆడని బిజయ్ 2016లో షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్‌లో చెన్నైయన్ ఎఫ్‌సీ తరఫున ఆడుతున్న బిజయ్ గతంలో ఇండియన్ యారోస్, చెన్నై సిటీ, రియల్ కశ్మీర్, శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తరఫున బరిలోకి దిగాడు. -
సలార్ మేకర్స్ బిగ్ ప్లాన్.. అక్కడ కూడా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతుండడంతో విదేశీ భాషల్లోనూ సలార్ రిలీజ్ చేయనునట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని స్పానిష్ భాషలో రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని స్పానిష్ భాషలో రాస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీంతో సలార్ సీజ్ఫైర్ పార్ట్-1 మార్చి 7న లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల కానుంది. విదేశాల్లోనూ తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ కావడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. #SalaarCeaseFire se estrenará en América Latina el 7 de marzo de 2024, en español, lanzado por @Cinepolis. ¡Prepárate para la acción épica! 💥#SalaarCeaseFire is releasing in Latin America on 7th March 2024, in 𝐒𝐩𝐚𝐧𝐢𝐬𝐡.@IndiaCinepolis#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/B5wV9BVmuM — Hombale Films (@hombalefilms) January 5, 2024 -
పనామా ట్రాఫిక్‌జామ్!
అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌకలు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కారణమేమిటి? పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం. మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’ పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనేట్ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని ముందుకు వాలింది. ► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు. ► 2013 ఏడాదిలో హెచ్కేఎన్డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది. అంత ఈజీ కాదు... నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే... ► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్‌ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది. ► అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి. ► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే. ► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఇదీ పనామా కథ ► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. ► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. ► దీని పొడవు 80 కిలోమీటర్లు. ► పనామా కాలువ మధ్యలో గతూన్ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు ఈ కాలువకు రిజర్వాయర్‌గా ఉంది. ► ఇటు పసిఫిక్ మహా సముద్రం, అటు అట్లాంటిక్ మహా సముద్రం వైపు కరేబియన్ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్ ఆఫ్ పనామను ఆనుకుని పనామా కాలువ ఉంటుంది. ► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది. ► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి. ఏం జరగనుంది? ► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు. ‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’ – మిషెల్ వైస్ బోక్మ్యాన్, లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు -
చైనా నిఘా బెలూన్ వ్యవహారం.. ఆకాశంలో మరొకటి!
వాషింగ్టన్: అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైంది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడంతో తీవ్రంగా పరిగణించిన అమెరికా.. తమ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ‘చైనా పర్యటన’ను వాయిదా వేయించింది. అయితే.. అది నిఘా బెలూన్ కాదని చైనా వివరణ ఇచ్చేలోపే.. ఇప్పుడు మరో బెలూన్ వ్యవహారం వెలుగు చూసింది. లాటిన్ అమెరికా రీజియన్ గగనతలంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో బెలూన్ను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధృవీకరించింది. ఒక బెలూన్ లాటిన్ అమెరికా దిశగా ప్రయాణిస్తున్నట్లు మేం నివేదికలను పరిశీలించాం. ఇది చైనీస్ నిఘా బెలూన్‌గానే భావిస్తున్నాం అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే.. అది చైనాదేనా? లేదా మరేదైనా దేశం నుంచి ప్రయోగించారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు.. ఆ బెలూన్ సంచారాన్ని గమనిస్తే అది అమెరికా వైపుగా పయనిస్తున్నట్లు కనిపించడం లేదని ఓ భద్రతాధికారి చెప్తున్నారు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో దాని సంచారం ఎటువైపు ఉందో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని పెంటగాన్ పేర్కొంది. అంతకు ముందు అమెరికా గగనతలంలో మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఓ బెలూన్.. సంచరించడం కలకలం రేపింది. గురువారం ఏకంగా మోంటానా(అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి ఉంది)లో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అయితే అత్యంత ఎత్తులో ఎగరడం వల్ల విమానాల రాకపోకలకు దానివల్ల అంతరాయమేమీ కలగలేదు. అయినప్పటికీ కీలక సమాచారం లీక్ అయ్యే ఛాన్స్ ఉండడంతో.. అమెరికా జాగ్రత్త పడింది. దానిని పేల్చినా.. కూల్చినా.. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోననే ఆందోళనతో కేవలం నిఘా మాత్రమే పెట్టింది అమెరికా రక్షణ శాఖ. ఈ బెలూన్ వ్యవహారాన్ని పెంటగాన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి తీసుకెళ్లింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. కానీ, ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. -
ఆంధ్రప్రదేశ్‌కు 'క్యూ'
సాక్షి, అమరావతి: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రసాయన రహిత ఉత్పత్తుల ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఈ విధానంలో మన రైతులు అవలంబిస్తున్న సాగు విధానాలను పరిశీలించేందుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం ఈనెల 19 నుంచి వారం రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడంతోపాటు రైతులు, రైతుసాధికార సంస్థ ప్రతినిధులతో జిల్లాల వారీగా సమావేశమై ప్రకృతి సాగు పద్ధతులను అధ్యయనం చేస్తుంది. ప్రకృతి సాగులో దేశానికే ఆదర్శం జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్బీఎన్ఎఫ్) కింద 2016లో శ్రీకారం చుట్టిన ప్రకృతి సాగు ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్)గా అమలవుతోంది. ప్రస్తుతం వరితో పాటు వేరుశనగ, కంది, మినుము, పెసర, పప్పుశనగ, మొక్కజొన్న, రాగి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల తోటలను ఈ విధానంలో సాగుచేస్తున్నారు. 2016లో 700 గ్రామాల్లో 40 వేల మందితో ప్రారంభమైన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రస్తుతం 3,730 గ్రామాల్లో 7.30 లక్షల మంది రైతులు ఆచరిస్తున్నారు. రానున్న మూడేళ్లలో మరో 530 గ్రామాల్లో 1.75 లక్షల మంది రైతుల ద్వారా 4.25 లక్షల ఎకరాలకు విస్తరించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ విధానం ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతోంది. అంతేకాదు.. గాలిలో కర్బన శాతాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ఈ సాగు ఇతోధికంగా దోహదపడుతోంది. దీంతో.. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నాయి. గ్రాండ్స్‌వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో.. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ప్రకృతి సాగుపై అధ్యయనం చేసేందుకు 15 లాటిన్ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలతో పాటు నేపాల్‌కు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శిస్తోంది. అమెరికాకు చెందిన గ్రౌండ్స్వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న రాష్ట్రానికి రానున్న ఈ బృందం రాయలసీమ జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు క్షేత్రాలను పరిశీలిస్తుంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ బ్రేసియా సారథ్యంలో నెదర్లాండ్స్, కొలంబియా, నేపాల్, బ్రెజిల్, మెక్సికో, మాలి, ఘన, సెనెగల్ తదితర దేశాలకు చెందిన 30 మంది వ్యవసాయ రంగ నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఇక ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవుతున్న మహిళా సంఘాల పాత్ర, సాగు విధానాలు, టెక్నాలజీ, ప్రభుత్వ ప్రోత్సాహం, భాగస్వామ్య సంస్థల సహకారం, అమలులో కీలకపాత్ర పోషిస్తున్న సామాజిక సిబ్బంది సేవలు, మార్కెటింగ్ విధానాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. అంతేకాక.. రైతులు, మహిళా సంఘాలతోపాటు రైతు సాధికార సంస్థ జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో బృంద సభ్యులు భేటీ అవుతారు. అనంతరం.. ఈ సాగు అమలు ప్రణాళిక, లక్ష్యాలు, సాధించవలసిన ప్రగతిపై చర్చించి ప్రణాళిక రూపొందిస్తారు. ఏపీకి దక్కిన అరుదైన గౌరవం ప్రకృతి సాగులో ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు మన విధానాలను మోడల్‌గా తీసుకుని వారివారి రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు వివిధ దేశాలు కూడా మనవైపు చూస్తున్నాయి. ఒకేసారి 15 దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రానికి వస్తుండడం మనకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, రైతు సాధికార సంస్థ -
బాప్రే! ఈ పేయింటింగ్ ధర రూ. 260 కోట్లా!!
Frida Kahlo Self Portrait Painting: మెక్సికన్ దిగ్గజ కళాకారిణి ఫ్రిదా కహ్లో వేసిన అరుదైన పెయింటింగ్ న్యూయార్క్ వేలంలో దాదాపు 35 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.260 కోట్లు ) అమ్ముడుపోయింది. అయితే ఈ చిత్రం గొప్పతనమేమిటంటే కళాకారిణి ఫ్రిదా తన స్వీయ చిత్రాన్ని తానే చిత్రించడమే కాక ఆ చిత్రంలో తన భర్త డియెగో రివెరా ముఖం తన నుదిటి పై ప్రతిబింబించేలా చిత్రిస్తుంది. (చదవండి: ఇజ్రాయెల్ అందాల పోటీలో విజేతగా 86 ఏళ్ల బామ్మ) పైగా ఈ పెయింటింగ్‌లో ఆమె విలక్షణమైన కనుబొమ్మలతో చీకటి కళ్ళపై నుండి కొన్ని కన్నీటి చుక్కలు వస్తున్నట్లు చిత్రించింది. అంతేకాదు ఫ్రిదా ఈ పెయింటింగ్‌ని తన భర్త "డియెగో వై యో" పేరుతో చిత్రించడం గమనార్హం. అయితే ఆమె భర్త డియెగో రివెరా మెక్సికన్ నటి ఫెలిక్స్‌తో సన్నిహితంగా మెలగడంతోనే ఆమె ఈ విధంగా తన భర్త ముఖాన్ని తన నుదిటపై మూడవ కన్నుగా చిత్రీకరించిందంటూ కొంతమంది కళాకారులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ పెయింటింగ్ అతను ఆమె ఆలోచనలను ఏ స్థాయిలో హింసించాడో అనేదాన్ని కూడా సూచిస్తుందని అంటున్నారు. ఈ మేరకు ఈ పేయింటింగ్ చరిత్రలో వేలంలో అత్యంత ఖరీదకు అమ్ముడుపోయిన లాటిన్ అమెరికా కళాకృతిగా నిలిచింది. (చదవండి: వామ్మో! మొసలిని కౌగలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!) -
యాపిల్‌కు కలిసొచ్చిన భారత్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు భారత్‌తోపాటు లాటిన్ అమెరికా మార్కెట్లు కలిసొచ్చాయి. దీంతో జూన్ త్రైమాసికంలో కంపెనీ రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో టర్నోవర్ 36 శాతం అధికమై రూ.6,05,616 కోట్లు సాధించినట్టు సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4.43 లక్షల కోట్లుగా ఉంది. నికరలాభం రూ.83,328 కోట్ల నుంచి రూ.1,61,448 కోట్లకు చేరింది. ఏ దేశం నుంచి ఎంత మొత్తం ఆదాయం సమకూరింది వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ‘ఉత్పత్తులు, సేవల విభాగాల్లో అన్ని ప్రాంతాల్లో రెండంకెల ఆదాయ వృద్ధి దక్కించుకున్నాం. ప్రత్యేకంగా భారత్, లాటిన్ అమెరికా, వియత్నాంతోసహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. ఈ మార్కెట్లలో నమ్మశక్యం కాని త్రైమాసికంగా జూన్ నిలిచిపోతుంది’ అని సీఈవో పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో ఐఫోన్ వాటాయే సింహభాగం ౖMðవసం చేసుకుంది. ఐఫోన్ అమ్మకాల ద్వారా కంపెనీకి రూ. 2,93,880 కోట్లు సమకూరింది. వాటా పరంగా మ్యాక్, ఐప్యాడ్, వేరబుల్స్, ఇతర ఉత్పుత్తులు, సేవలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఉబర్ యాప్‌లో ఇక ‘నిఘా ఫీచర్’
సాక్షి, న్యూఢిల్లీ : క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ అడపా దడపా ఫిర్యాదులు వస్తున్న విషయం తెల్సిందే. విదేశాల్లో అయితే క్యాబ్ డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీల నెట్వర్క్ కలిగిన ‘ఉబర్’ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టబోతోంది. అదే ‘వాయిస్ ఆడియో రికార్డింగ్’ ఫీచర్. ఎందుకంటే డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడం కోసం. దీన్ని ముందుగా ప్రయోగాత్మకంగా వచ్చే నెల నుంచి లాటిన్ అమెరికా దేశాల్లో ప్రవేశపెట్టి, ఆ తర్వాత అమెరికాకు విస్తరిస్తామని ఉబర్ యాజమాన్యం తెలిపినట్లు ఓ అమెరికా మీడియా తెలిపింది. కారులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని పేర్కొంది. అదే విధంగా ఈ ఆడియో రికార్డింగ్ డ్రైవర్‌కుగానీ, ప్రయాణికులకుగానీ అందుబాటులో ఉండదని, ట్రిప్పు ముగియగానే ప్రయాణం సౌకర్యంగానే జరిగిందా ? అన్న ప్రశ్న ప్రయాణికులకు వెళుతుందని, వారి నుంచి సానుకూలమైన సమాధానం వచ్చినట్లయితే ఆడియో స్క్రిప్టును ప్రయాణికుల మాటలను విశ్లేషించే అనుబంధ ఏజెంట్‌కు పంపుతారని, ప్రయాణికులకు, డ్రైవర్ మధ్య ఇబ్బందులు, ఘర్షణ పరిస్థితి ఏర్పడితే పోలీసులకు అందజేయడం కోసం ఆడియో రికార్డింగ్‌ను భద్రపరుస్తామని ఉబర్ యాజమాన్యం వెల్లడించింది. అనవసరంగా ఎవరి ప్రైవసీని దెబ్బతీయమని తెలియజేసింది. అమెరికాలో ప్రజల ప్రైవసీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు చట్టాలున్నాయని, డ్రైవర్, ప్రయాణికుల మాటలను రికార్డు చేయాలంటే వారిరువురి అనుమతి తప్పనిసరని మీడియా ఉబర్ యాజమాన్యం దృష్టికి తీసుకపోగా అప్పటికీ ఒకే జాతీయ చట్టం రావచ్చేమోనని వ్యాఖ్యానించింది. ప్రయోగాత్మకంగా అమెరికాలో కూడా ‘ఆడియో రికార్డింగ్ ఫీచర్’ విజయవంతం అయితే ఇతర దేశాలకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని యాజమాన్యం పేర్కొంది. -
సోషలిజానికి సరికొత్త భాష్యం
లాటిన్ అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న విప్లవ తాత్వికవేత్త మార్తా హర్నేకర్. విద్యార్థి దశలోనే ఉద్యమ ధారగా మొదలైన ఆమె జీవితం తత్వవేత్తగా, మార్క్సిస్టు మేధావిగా, మహా రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా ఎదిగిన తీరు ప్రజాస్వామిక కాంక్షాపరులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆమె తెలుగు రాష్ట్రాల్లోని మార్క్సిస్టు అభిమానులకు, ప్రజాస్వామిక ఉద్యమకారులకు పరిచయమున్న విప్లవ కంఠం. ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా మాత్రమే సోషలిజం కల సాకారమవుతుందని ఆమె తేల్చి చెప్పారు. నిత్య సంఘర్షణావాది, నిరంతర సత్య శోధకురాలు మార్తా హర్నేకర్ గతనెల 14వ తేదీన తుదిశ్వాస విడవడం ప్రజాస్వామిక అభిమానులకు తీరని లోటు. ‘‘ప్రపంచంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. భారీ సైనిక శక్తి, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధితో అమెరికాతో సహా అనేక బహుళజాతి కంపెనీలు నూతన దోపిడీ విధానాలను కొనసాగిస్తున్నాయి. దీనితో ప్రజలు మరింత అశక్తులుగా తయారవుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోకి చేరిపోతుండడం వల్ల పేదరికం, వివక్ష మరింతగా పెరిగిపోతున్నది’’ అని ఆధునిక మార్క్సిస్టు మేధావి మార్తా హర్నేకర్ చేసిన వ్యాఖ్యలు ఆధునిక సామాజిక స్థితిగతు లకు అద్దం పడుతున్నాయి. మార్క్సిజాన్ని సమకాలీన సమాజానికి అన్వయించడంలో నిరం తరం కృషి చేసిన గొప్ప తాత్విక వేత్త మార్తా హర్నేకర్. విద్యార్థి దశలోనే ఉద్యమధారగా మొదలైన ఆమె జీవితం తత్వవేత్తగా, మార్క్సిస్టు మేధావిగా, మహా రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా ఎదిగిన తీరు ప్రజాస్వామిక కాంక్షాపరులందరికీ ఆదర్శప్రా యంగా నిలిచింది. మార్తా హర్నేకర్ తెలుగు రాష్ట్రాల్లోని మార్క్సిస్టు అభి మానులకు, ప్రజాస్వామిక ఉద్యమకారులకు పరిచయమున్న విప్లవ కంఠం. తెలంగాణ ఆవిర్భావం తరువాత హైదరాబాద్‌లో 2014 మార్చిలో ఏర్పాటు చేసిన ‘‘సోషలిజం–ప్రజాస్వామ్యం’’ అంతర్జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని నాలుగు రోజుల పాటు ఎన్నో అంశాలపై చర్చించడం తెలంగాణ ఉద్యమకారులకూ, ప్రజాస్వామిక వాదులకూ, విప్లవాభిమానులకూ ఎంతో స్ఫూర్తినిచ్చింది. మార్తాహర్నే కర్ కలం నుంచి వెల్లువెత్తిన సైద్ధాంతిక భేదాభిప్రాయాలూ, సామాజిక అంచనాలూ వంటి వేనవేల రచనలు ఎందరినో ఆలోచింపజేశాయి. ఆమె ప్రపంచ మార్క్సిస్టు మేధావుల్లో ఒక నూతన ఆలోచనలకు పునా దులు వేసిన అగ్రగామి. లాటిన్ అమెరికాలోనే కాక ప్రపంచవాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న విప్లవ తాత్వికవేత్త. మార్తా రాసిన ‘రీ బిల్డ్ ద లెఫ్ట్’ ఎన్నో విమర్శలనెదుర్కొన్నప్పటికీ ప్రపంచవ్యా ప్తంగా కమ్యూనిస్టుల్లో సైద్ధాంతిక చర్చను రేపిన పుస్తకం, మార్క్సిస్టు సైద్ధాంతిక ఆచరణకు సరికొత్త అర్థం చెప్పిన రచన అని చెప్పొచ్చు. అటు వంటి నిత్య సంఘర్షణావాది, నిరంతర సత్య శోధకురాలు మార్తా హర్నే కర్ గతనెల 14వ తేదీన తుది శ్వాస విడవడం ప్రజాస్వామిక అభిమాను లకు తీరని లోటు. మార్తా హర్నేకర్ ఆస్ట్రియన్ మూలాలు కలిగిన కుటుంబంలో 1937లో చిలీలో జన్మించారు. చిలీలోని క్యాథలిక్ విశ్వ విద్యాలయంలో మానసిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత పారి స్లో పోస్ట్ గ్రాడ్యు యేషన్ చేశారు. ప్రముఖ విద్యావేత్త, లూయీస్ ఆల్తూసర్ వద్ద మార్తా హర్నేకర్ శిక్షణ పొందారు. 1963–1968 వరకు పారిస్‌లో ఉన్న మార్తా ఆనాడు ఉధృతంగా సాగిన పారిస్ విద్యార్థి ఉద్యమం నుంచి స్ఫూర్తిపొం దారు. 1968లో చిలీకి తిరిగి వచ్చిన మార్తా హర్నేకర్ చిలీ విశ్వవిద్యాల యంలో చారిత్రక భౌతికవాదం, రాజకీయా ర్థశాస్త్రం అధ్యాపకురాలిగా పనిచేశారు. 1968లోనే చిలీ సోషలిస్టు పార్టీలో చేరి క్రియాశీలకంగా పని చేసిన అనుభవం ఆమెను సైద్ధాం తికంగా, ఆచరణాత్మకంగా మరింతగా రాటుదేలేలా చేశాయి. కేరళ తర్వాత ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం చిలీలోని అలెండి ప్రభుత్వమే. 1970లో చిలీలో అలెండి ఎన్ని కల ద్వారా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చిలీ సోషలిస్టు పార్టీ నేత సాల్వడర్ అలెండి నాయకత్వంలో మార్తా పనిచేశారు. అయితే 1973 సెప్టెంబర్ 11న అమెరికా కుట్రలో సైనిక తిరుగుబాటు జరిపి అలెండి ప్రభుత్వాన్ని కూలదోశారు. అలెండి అనుచరులందరినీ హత్య చేయ డమో, జైల్లో పెట్టడమో జరిగింది. మార్తా మాత్రం చిలీ నుంచి తప్పిం చుకొని క్యూబా చేరుకున్నారు. క్యూబాలో ఒక అధ్యయన సంస్థను స్థాపించి, తన పరిశోధనలను, రచనా వ్యాసంగాన్నీ కొనసాగించారు. అంతకు ముందు మార్తా విద్యార్థి దశలో ఉండగానే 1959లో క్యూబాను సందర్శించారు. అప్పటికే క్యూబా విముక్తిని సాధించింది. క్యూబా విప్లవంలో ‘ఎర్రగడ్డం’ యోధుడిగా పేరుపొందిన మాన్యుల్ పినెరోను మార్తా వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కూతురు. ఆమె పేరు కమిల. మార్తా భర్త పినెరో 1998లో కారు ప్రమాదంలో మరణించారు. క్యూబాలో ఉన్న సమయంలో మార్తా హర్నేకర్ లాటిన్ అమెరికా చరిత్ర, ఉద్యమాలు, అనుభవాలెన్నింటినో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి ద్వారా సేకరించారు. ఆ విధంగా లాటిన్ అమెరికా ఉద్యమాల చరిత్రను ఒక ప్రత్యేక దృష్టితో పరిశీలించారు. మార్క్సిజాన్ని లాటిన్ అమెరికాకు అన్వ యించి ఆమె 80కి పైగా పుస్తకాలు రాశారు. అందులో మొట్టమొదట చెప్పుకోవాల్సింది. ‘చారిత్రక భౌతిక వాదం–ప్రాథమిక సూత్రాలు’ అన్న పుస్తకం. ఈ పుస్తకం 60కి పైగా ముద్రణలు పొందింది. మొదట స్పానిష్‌లో ప్రచురితమైన ఆ పుస్తకం, ఆ తర్వాత ఇంగ్లిష్తో పాటు ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువాదమైంది. ఆమె రచనల్లో ‘ఎ వరల్డ్ టు బిల్డ్’, ‘ఐడియాస్ ఫర్ స్ట్రగుల్’ వెనిజులా విప్లవనాయకుడు చావెజ్ ఇంటర్వ్యూతో రూపొందిన పుస్తకం, ‘రీ బిల్డింగ్ ద లెఫ్ట్’ పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవి. చివరి రెండు పుస్తకాలు తెలుగు లోకి కూడా అనువాద మయ్యాయి. మార్తా మార్క్సిస్టు తాత్విక విష యాల వెలుగులో ఆచరణకు సంబంధించిన విషయాలను ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా మార్క్సిస్టు సిద్ధాంతాలతో పనిచేస్తోన్న రాజ కీయ పార్టీల ఆచరణను మార్తా విమర్శనాత్మక దృష్టితో చూశారు. కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీల సిద్ధాంత సంక్షోభాన్ని ప్రము ఖంగా ఎత్తిచూపారు. ముఖ్యంగా మూడు అంశాలను ఆమె లేవనెత్తారు. కారల్‌మార్క్స్ పేర్కొన్న పెట్టుబడిదారీ విధానానికి ప్రస్తుతం కొనసాగు తోన్న పెట్టుబడిదారీ పద్ధతులకూ ఎంతో తేడా ఉన్నదని, దానిని అర్థం చేసుకోవడంలో మార్కిస్టులుగా మనం విఫలమవుతున్నామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన ఆటోమేషన్, డిజిటల్, కంప్యూ టర్లు, రోబోల పాత్ర గురించి విశ్లేషించుకోవాలని, అవి ఉత్పత్తి నుంచి కార్మిక వర్గాన్ని తొలగిస్తున్న అంశాలను అర్థం చేసు కోవాలని మార్తా అభిప్రాయపడ్డారు. కొద్ది మంది మినహా ప్రపంచం లోని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగి పోతున్నదని చెప్పారు. సమాచార విప్లవం పెట్టుబడిదారీ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళిందని, సామ్రాజ్యవాదం రూపంలో మార్చుకున్నదే కానీ, కను మరుగు కాలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. రెండో అంశంగా, కమ్యూనిస్టుల ఒంటెద్దు పోకడలను ఎత్తిచూ పారు. ప్రపంచంలో కొనసాగుతున్న నయా ఉదారవాదం, ప్రపంచీకర ణకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో కలిసివచ్చే శక్తులన్నిం టితో కలిసి పనిచేయాలని, కేవలం కమ్యూనిస్టు సభ్యులతో మాత్రమే విజయం సాధించలేమని ఆమె పేర్కొన్నారు. సోదరభావం, సమస మాజం ఆశించే వాళ్ళు, కార్మిక వర్గ హక్కుల కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడే వాళ్లందరితో కలిసి పోరాడాలని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా గత ఉద్యమాల నుంచి, గత సోషలిస్టు ప్రభుత్వాలు, వ్యవస్థలు అందించిన అనుభవాలను అధ్యయనం చేయాలని ఆమె సూచించారు. అందుకు గాను లాటిన్ అమెరికాలో గత రెండు వందల ఏళ్ళుగా సాగుతున్న ఉద్యమాలను మార్తా అధ్యయనం చేశారు. మరొక ముఖ్యమైన విషయాన్ని మార్తా పదే పదే చెపుతుండేవారు. మార్క్సిజంలో అత్యంత ముఖ్యమైన చారిత్రక భౌతిక వాదం గురించి ఆమెది ప్రత్యేకమైన అధ్యయనదృష్టి. చరిత్రను భౌతికవాద దృష్టితో చూడాలని మార్క్సిజం చెపుతున్న మాటను ఆమె గుర్తు చేస్తూ, ఇప్పటి వరకూ చారిత్రక భౌతిక వాదాన్ని యూరప్‌కే పరిమితం చేసి చూస్తు న్నామని ఆమె విమర్శించారు. ఏ దేశానికి ఆ దేశ ప్రత్యేక సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని విస్మరించడం వల్ల చాలా దేశాల్లో విప్లవాలు విజయం సాధించలేకపోయాయి. మనదేశంలో ఉన్న సామాజిక సమస్యలు, ప్రత్యేకించి కుల వ్యవస్థ ప్రభావాన్ని ఇప్పటికీ కూడా శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించలేకపోతున్నాము. మార్తా హర్నేకర్ మరొక విషయాన్ని చాలా నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. కార్మిక వర్గ నియంతృత్వం ద్వారానే సోషలిజం సాధ్యమవు తుందనే వాదనను ఆమె తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా మాత్రమే సోషలిజం కల సాకారమవుతుందని ఆమె తేల్చి చెప్పారు. ఆ విధంగా మార్క్సిజాన్ని ఆధునిక ప్రజాస్వామ్య ఆలోచనల వెలుగులో విశ్లేషించి నూతన అధ్య యనానికి పునాదులు వేశారు. ఆమె రచనలు, భావాలు ఆధునిక ప్రపం చంలో ఒక నూతన వెలుగును నింపాయి. మార్తా లాటిన్ అమెరికా ఉద్యమాలు, విప్లవాల వెలుగులో అధ్యయనం సాగించినప్పటికీ ఆమె ఆలోచనలు ప్రపంచం లోని మార్క్సిస్టులందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. ముఖ్యంగా మార్తా హర్నేకర్ జీవితం, ఉద్యమం, నిత్యం సమాజ మార్పు కోసమే సాగాయి. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన మార్తా మూసభావనలకు భిన్నంగా, ప్రవాహంతో కొట్టుకుపోకుండా, మారు తున్న సామాజిక ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సరికొత్త, ఆచరణాత్మక పద్ధుతులతో మున్ముందుకు సాగాలని కోరు కున్నారు. మార్తా అంకిత భావం, పోరాట దీక్ష, శాస్త్రీయ అధ్యయనశక్తి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుందని ఆశిస్తున్నా...! వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
2018; మాకు అత్యంత సానుకూలం.. !
కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కేలండర్లో సంవత్సరం, తేదీలు, వారాలు మారటమే కాదు.. గత కాలపు చేదు స్మృతులు, అనుభవాలను తొలగిస్తుందనే ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టే సందర్భం. ఏంటీ 2018లోకి ప్రవేశించి ఇప్పటికే సుమారు నెల కావస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసేసుకున్నాం కదా.. మళ్లీ ఈ ప్రస్తావన ఎందుకని ఆలోచిస్తున్నారా.. అదేనండీ మీలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం గురించి ఎంతమంది, ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారో తెలుసుకునేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ ఇప్సాసిస్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలేమిటో ఓ సారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో సర్వే నిర్వహించగా మొత్తంగా 76 శాతం మంది ప్రజలు 2017తో పోలిస్తే ఈ ఏడాది తమకు సానుకూలంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వీరిలో ముఖ్యంగా యువత 2018ని అత్యంత ఆశావహ సంవత్సరంగా పేర్కొన్నారు. లాటిన్ అమెరికా దేశాలైన కొలంబియా, పెరూలో 93శాతం మంది సానుకూలంగా స్పందించారు. 88శాతం మంది చైనీయులు 2018కే ఓటు వేశారు. ఇక మన దేశంలో 87శాతం మంది 2018 పట్ల ఆశావహంగానే ఉన్నారు. అమెరికన్లకు గతేడాది అధ్యక్ష ఎన్నికలతో ఎంతో నాటకీయంగా గడిచిపోయింది. డొనాల్డ్ ట్రంప్ పట్ల చాలామంది బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు. 80శాతం మంది అమెరికన్లు కనీసం ఈ ఏడాదైనా మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక యూరప్ దేశాల విషయానికొస్తే... జర్మనీలో 67శాతం, బ్రిటన్‌లో 67శాతం, ఫ్రాన్స్‌లో కేవలం 55శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. ఈ సర్వేలో 44శాతం మందితో జపాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. -
నియంతల గుండెల్లో నిద్రించిన యోధుడు!
ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మను ఎన్నో సినిమాల్లో చూశాం. చాలామంది టీషర్టులపై చూశాం. కానీ... సినిమాలు చూసినవాళ్లలో, ఈ బొమ్మతో ఉన్న టీషర్టులు వేసుకున్నవారిలో ఎంతమందికి ఇతని గురించి తెలుసు?.. చే గువేరా ఏ దేశానికి చెందిన విప్లవ యోధుడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే చే.. ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితమైన వ్యక్తి కాదు. యావత్ ప్రపంచానికి కొత్త శక్తినిచ్చిన నేత. ప్రపంచంలో ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్పందించాలని యువతకు దిశానిర్దేశం చేసి, ఆచరించి చూపించిన మార్గదర్శి. ఊహించని శక్తిగా... 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించిన చే గువేరా బాల్యంలో ఆస్తమా బాధితుడు. దీంతో పసివాడికి ఏమౌతుందో అని భయపడుతూ అతని తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేస్తారని ఎవరైనా ఊహించగలరా? అవును. ఈ పసివాడే నియంతల గుండెల్లో నిద్రపోయాడు. వాళ్లకు నిద్ర లేకుండానూ చేశాడు. జీవితాన్ని మార్చిన ప్రయాణం.. వైద్యవిద్యార్థిగా వున్నప్పుడే లాటిన్ అమెరికా మొత్తం పర్యటించాలని అతని మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని కనీసం చే కూడా ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు. సమాజానికి వైద్యం.. డాక్టర్ పట్టా చేతికొచ్చిన చే గువేరాను చూసి తల్లితండ్రులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆయన ఆలోచనలు వేరుగా వున్నాయని వారికి తెలియదు. దోపిడీ చేస్తున్న నియంతృత్వాన్ని అంతమొందించి... బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్గించాలని అనుకుంటున్నట్లు చే వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు. తన విప్లవానికి మొదట బొలీవియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. క్యూబా నియంతపై చే నడిపిన గెరిల్లా యుద్ధం విప్లవబాటకు కొత్త అడుగులు నేర్పింది. ఆ తర్వాత క్యూబా పునర్నిర్మాణంలో చే పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు క్యాస్ట్రోని ప్రేమించినట్లే చేగువేరాను కూడా ప్రేమిస్తారు. చే గువేరా వర్ధంతికి హాజరైన ఆయన అభిమానులు, మద్ధతుదారులు ఘనంగా వర్ధంతి.. చే గువేరా 50వ వర్ధంతిని పురస్కరించుకొని హవానాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దాదాపు 60 వేల మంది క్యూబన్లు పాల్గొన్నారు. దేశాధినేత రౌల్ క్యాస్ట్రో స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరై చె గొవేరాకు నివాళులర్పించారు. -
ఆయన్ను నిరూపించుకోనివ్వండి: ఒబామా
వైట్ హౌస్ లో ప్రవేశించడానికి ట్రంప్ అనర్హుడని అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాటిన్ అమెరికా పర్యటనలో మాట మార్చారు. రిపబ్లిన్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ కు తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంపై ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. ట్రంప్ గెలుపు అనంతరం ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో ఏమౌతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ పై వ్యతిరేకత చూపాల్సిన పనిలేదని, ఆయనకు ఓ అవకాశమివ్వాలని ఒబామా లాటిన్ అమెరికా, ప్రపంచ దేశాలను కోరారు. అధ్యక్ష హోదాలో తన చివరి పర్యటనకు లాటిన్ అమెరికా వెళ్లిన ఒబామా.. గ్రీస్, జర్మనీల్లో కూడా పర్యటిస్తారు. పెరూలో యుకజనంతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొన్న ఒబామా... ట్రంప్ కు అవకాశమిచ్చి చూడాలని చెప్పారు. ఒకేసారి జడ్జిమెంట్ కు వచ్చేయండం సబబు కాదని అన్నారు. సమస్యలను అర్ధం చేసుకుని సరైన పాలసీలను తెచ్చే వరకూ వేచి చూడాలని చెప్పారు. ప్రచారంలో ఎలా పాల్గొన్నారన్న విషయం కంటే ఎలా పరిపాలన చేస్తారనేది కీలకమని అన్నారు. -
కొలంబియా షాక్!
లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలో అయిదు దశాబ్దాల పైబడి అవిచ్ఛి న్నంగా కొనసాగుతున్న నెత్తుటి పర్వానికి తెర పడనున్నదని కొండంత ఆశతో ఎదురుచూస్తున్న శాంతికాముకులకు నిరాశ కలిగించే పరిణామమిది. దేశంలో అంతర్యుద్ధాన్ని సాగిస్తున్న వామపక్ష కొలంబియా విప్లవ సాయుధ సైన్యం(ఎఫ్ఏఆర్సీ-ఫార్క్)తో ప్రభుత్వం నాలుగేళ్లనుంచి సాగిస్తున్న ఎడతెగని సంప్రదింపులు ఫలించి కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఈ నెల 2న జరిగిన రెఫరెండంలో ఆ దేశ ప్రజలు తిరస్కరించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ సమక్షంలో గత నెల 26న సంతకాలైన ఆ ఒప్పందం తమకు సమ్మతం కాదని పౌరులు తేల్చిచెప్పారు. ఇది ఏక వాక్య రెఫరెండం. నిజానికి ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించినవారికీ, సమర్ధించినవారికీ మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. వద్దన్నవారు 50.21 శాతం ఉండగా, దాన్ని సమర్ధించినవారి శాతం 49.78. ఒప్పందాన్ని మెజారిటీ పౌరులు సమర్ధిస్తున్నారని రెఫరెండానికి ముందు జరిగిన సర్వేలన్నీ చెప్పాయి. తీరా తుది ఫలితం మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది. ఇది విజయం సాధించి ఉంటే అనిశ్చితి ఆవరించిన ఇతర లాటిన్ అమెరికా దేశాలకు మార్గదర్శకమయ్యేది. గత దశాబ్దమంతా వామపక్షాలకు పట్టంగట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన లాటిన్ అమెరికా దేశాల్లో మితవాదుల ప్రాబల్యం ఇటీవల విస్తరించడాన్ని గమనిస్తున్నవారు కొలంబియా పౌరులు సైతం ఆ బాటే పట్టారని తేల్చిచెబుతున్నారు. అయితే అది అర్ధసత్యమే. ఎందుకంటే ఈ రెఫరెండంలో పాల్గొన్న ఓటర్లు కేవలం 37 శాతం మాత్రమే! దేశ మాజీ అధ్యక్షుడు అల్వారో యురిబే నేతృత్వంలోని మితవాద కొలంబియా ఫస్ట్ పార్టీ ఒప్పందాన్ని నిరసిస్తూ చురుగ్గా ప్రచారం చేసింది. ఆ మాటకొస్తే దేశాధ్యక్షుడు జువాన్ శాంటోజ్ సొంత పార్టీ నేషనల్ యూనిటీలోనే ఒప్పందంపై అసమ్మతి ఉంది. కొలంబియా నెత్తుటి చరిత్ర తెలిసినవారెవరైనా శాంతి ఒప్పందం అవసరాన్ని గుర్తిస్తారు. దాన్ని మనస్ఫూర్తిగా సమర్ధిస్తారు. కొలంబియాలో 52 ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధానికి ఇంతవరకూ రెండున్నర లక్షలమంది బలయ్యారు. దాదాపు 60 లక్షలమంది కొంపా గోడూ వదిలి పరారుకావలసి వచ్చింది. స్వస్థలంలో ఇంత పెద్దయెత్తున ప్రజానీకం నిర్వాసితులు కావడం మరే దేశంలోనూ చూడలేం. మిగిలిన లాటిన్ అమెరికా దేశాల తరహాలోనే కొలంబియాలో పేదరికం, నిరుద్యోగం, అవిద్య, అసమానతలు ఎక్కువ. ఇలాంటి రుగ్మతలే అనేక దేశాల్లో వామపక్ష అనుకూల పార్టీలను గతంలో గద్దెనెక్కించాయి. కొలంబియాలో ఫార్క్ గెరిల్లా పక్షానికి ఊపిరిపోశాయి. అక్కడ కేవలం ఒక శాతంగా ఉన్న సంపన్నుల చేతిలో దాదాపు 60 శాతం సాగు భూములున్నట్టు సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. జానెడు భూమి లేని పేదలున్న దేశంలో బహుళజాతి సంస్థలు అడ్డా వేసి లక్షల హెక్టార్ల భూమిని సొంతం చేసుకున్నాయి. కొద్దో గొప్పో భూమి ఉన్న బక్క రైతులను కూడా అవి బతకనివ్వలేదు. మాఫియా ముఠాలు, ప్రైవేటు సైన్యాలు బెదిరించి వారినుంచి భూముల్ని స్వాధీనం చేసుకునేవారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ఫార్క్ ఆవిర్భవించింది. దేశం తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఆ సంస్థ ప్రాబల్యం అధికం. వారి నేతృత్వంలోని ప్రభుత్వం అక్కడి పల్లె సీమలకు సమకూర్చిన మౌలిక సదుపాయాలు తక్కువేమీ కాదు. విద్య, వైద్యం, విద్యుత్, పారిశుద్ధ్యం, నీటిపారుదల సౌకర్యం వంటివి కల్పించింది. వాస్తవానికి 1984లో ఫార్క్ అస్త్ర సన్యాసం చేసి ఎన్నికల్లో పాల్గొంది. మరో రెండేళ్లకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ అప్పటి క్యుర్తాస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ తీర్పును వమ్ము చేసి వారికి అధికారం అప్పగించకుండా హింసాకాండ సృష్టించింది. పర్యవసానంగా ఫార్క్ మళ్లీ అడవి బాట పట్టింది. అధికారం చేజిక్కలేదన్న మాటేగానీ ఫార్క్ ప్రాబల్యం పెరిగింది. దాన్ని కట్టడి చేయడం కోసం 2002లో అమెరికా ప్రత్యక్ష పర్యవేక్షణలో తిరుగుబాటుపై పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది. ఇన్ని దశాబ్దాల అంతర్యుద్ధం పర్యవసానంగా సాధారణ పౌరులు చెప్పనలవికాని ఇబ్బందులు పడ్డారు. తిరుగుబాటుదార్లు, సైన్యం సాగించిన పరస్పర హనన కాండలో సామాన్యులు సమిధలయ్యారు. ఎవర్ని నమ్మాలో, నమ్మొద్దో...ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారో తెలియని అయోమయ పరిస్థితులు రాజ్యమేలాయి. చట్టం, న్యాయం వగైరాలకు అక్కడ తావులేదు. సైన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించి ఫార్క్...తిరుగుబాటుదార్లకు వత్తాసు పలుకుతున్నారని సైన్యమూ సాధారణ పౌరుల్ని ఇబ్బందులపాలు చేశాయి. ఇప్పుడు శాంతి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ అధ్యక్షుడు యురిబె హయాంలో తిరుగుబాటుదార్లు చాలా బలహీనపడ్డారు. ఒకరకంగా అందువల్లే 2012లో ప్రభుత్వంతో చర్చలకు ఫార్క్ అంగీకరించింది. శాంటోజ్ సర్కారు చర్చల ప్రక్రియను ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న యురిబె అవి కాస్తా ఫలవంతం కావడంతో కంగారుపడ్డారు. అంతర్యుద్ధ కాలంలో ఇరువైపులా సాగిన హత్యాకాండపై దర్యాప్తు ప్రారంభమైన పక్షంలో అది తన మెడకు చుట్టుకోవచ్చునన్న భయం ఆయనను వెన్నాడింది. అందువల్లే తిరుగుబాటుదార్లను మట్టుబెట్టడం లేదా పట్టి బంధించడం తప్ప వేరే మార్గం లేదని ఆయన ప్రచారం చేశారు. శాంటోజ్ ప్రభుత్వం శాంతి చర్చల విషయంలో పాటించిన గోప్యత కూడా తుది ఫలితాన్ని ప్రభావితం చేసిందని చెప్పాలి. అదేదో తమ సొంత వ్యవహారంలా ఇరుపక్షాలూ దేన్నీ బయటకు పొక్కనివ్వలేదు. దేనిపైనా చర్చ సాగలేదు. ఆన్లైన్లో ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినా అదంతా మొక్కుబడి వ్యవహారంగా సాగింది. తిరుగుబాటుదార్లు కోరుతున్నదేమిటో, ప్రభుత్వ ప్రతిపాదనలేమిటో ఎవరికీ తెలియదు. అందువల్లే రెఫరెండానికి అత్యధికులు దూరంగా ఉండి పోయారు. ఈ ఫలితం ఒప్పందంలో ఎలాంటి సవరణలకు కారణమవుతుందో, అది ఏ పర్యవసానాలకు దారితీస్తుందో చూడాల్సిఉంది. ప్రజల ప్రమేయంలేని ఏ కార్యక్రమమైనా, అది ఎంత గొప్పదైనా విఫలమవుతుందని చెప్పడానికి కొలంబియా శాంతి ఒప్పందమే తార్కాణం. -
లాటిన్ అమెరికాలో అబార్షన్ల గొడవ షురూ
లండన్: జికా వైరస్ కారణంగా లాటిన్ అమెరికాలో అబార్షన్లకు డిమాండ్ పెరుగుతోంది. బ్రెజిల్లో ప్రస్తుత అంఛనాల ప్రకారం గతంలో ఉన్న అబార్షన్ల కేసులకన్నా ప్రస్తుతం రెండింతలు ఎక్కువయ్యాయంట. ఇక మరికొన్ని లాటిన్ దేశాల్లో ఈ డిమాండ్ మూడింతలు పెరుగుతోంది. జికా వైరస్ కారణంగా చిన్నారులు అంద విహీనంగా పుట్టడమే కాకుండా చిన్న పరిమాణంలో ఉండే బ్రెయిన్‌తో జన్మిస్తున్నందున ఇది మంచి పరిణామం కాదని, సుదీర్ఘకాల సమస్యలు వస్తాయని ఇప్పటికే అన్నిరకాల ప్రభుత్వాలు ప్రజలకు సలహాలు ఇచ్చాయి. ఏ మహిళ కూడా గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. దీంతో ఇప్పటికే గర్భం దాల్చిన మహిళలంతా తమకు అబార్షన్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
అరటి పళ్లు అంతమవుతాయా?
లాటిన్ అమెరికా: ప్రపంచ వ్యాప్తంగా అరటి సంక్షోభం తలెత్తనుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అరటి పళ్లకు ఉరికొయ్యగా మారిన 'ఫుసారియమ్ ఆక్సిస్పోరమ్' అనే ఒకరకమైన ఫంగస్ వల్ల వ్యాపించే 'పనామా వ్యాధి' విజృంభిస్తోంది. ఇతర దేశాలకు దీని బెడద ఎంత ఉందోగానీ.. ఉత్తర అమెరికాకు అతిపెద్ద అరటి పళ్ల ఎగుమతిదారైన లాటిన్ అమెరికాకు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే లాటిన్ అమెరికాకు వచ్చే ఆదాయంలో ఈ వ్యాధి సోకుతున్న కెవండిష్ రకం అరటి పళ్ల నుంచే అధికంగా వస్తోంది. ఆ వ్యాధి ఎక్కడ తమ వద్దకు కూడా అడుగుపెడుతుందో అని గత వారంలో జరిగిన అంతర్జాతీయ అరటి పళ్ల సదస్సుకు కూడా చివరి నిమిషంలో మాత్రమే లాటిన్ అమెరికా ప్రతినిధులు హాజరయ్యారు. ఎందుకంటే ఈ సదస్సుకు వచ్చిన వారిలో పలు దేశాలకు చెందిన వారు ఉండటం.. ఆయా దేశాల్లో అరటి పళ్లకు ఈ పనామా వ్యాధి వచ్చి ఉండటం కారణం. అది కాకుండా ఆ వ్యాధి సోకిన దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల బూట్లకు అంటుకొని ఎక్కడ ఆ ఫంగస్ తమ ప్రాంతంలోకి వస్తుందోనన్న భయంతోనే చివరి సమయంలో హాజరయ్యారు. ఇప్పటికే ఆసియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మధ్యాసియా ప్రాంతాల్లోని అరటి పళ్లకు ఈ పనామా దెబ్బ తగిలింది. అంతేకాకుండా అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ కూడా అరటిని సంరక్షించుకునే విషయంలో ముందు జాగ్రత్తగా ఉండకుంటే పెను ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతకు ముందున్న రకం అరటిని 1960లో వచ్చిన ఒక కొత్త డిసీజ్ తుడిచి పెట్టేయడంతో కొత్తగా కెవండిష్ రకం అరటిని తీసుకొచ్చారు. దీనికి కూడా తెగులు సోకుతుండటంతో మరోసారి ఇంకో కొత్త రకం అరటి రకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఆసియా ప్రాంతాల్లో ఉన్న కెవండిష్ అరటి స్థానంలో ఏ రకం అరటిని తెస్తే మంచిదని అధికారులు, శాస్త్రవేత్తలను రైతులు ప్రశ్నిస్తున్నారు. -
బ్రెజిల్లో రాజకీయ సంక్షోభం
అధ్యక్షురాలు దిల్మా అభిశంసనకు కాంగ్రెస్ దిగువసభ తీర్మానం బ్రసీలియా: లాటిన్ అమెరికాలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ అభిశంసనకు మెజారిటీ ప్రజాప్రతినిధులు ఆదివారం ఆమోదం తెలపటంతో సంక్షోభం తలెత్తింది. బ్రెజిల్ కాంగ్రెస్ (పార్లమెంటు)లోని దిగువ సభలో 513 మంది సభ్యులు ఉండగా.. అధ్యక్షురాలి అభిశంసన తీర్మానానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లభించింది. దీంతో ప్రతిపక్ష సభ్యులు సంబరాలు చేసుకోగా.. దిల్మా మిత్రపక్షాలు ఆగ్రహంగా ప్రతిస్పందించాయి. అధ్యక్షురాలిపై అభిశంసన చేపట్టాలా లేదా అన్న నిర్ణయం ఎగువ సభ అయిన సెనేట్ చేతుల్లో ఉంది. సెనేట్ అభిశంసనకే నిర్ణయం తీసుకున్నట్లయితే.. ఇటీవల దిల్మాతో విభేదించి ఆమెకు కీలక ప్రత్యర్థిగా మారిన ఉపాధ్యక్షుడు మైఖేల్ టేమర్ అధ్యక్ష పగ్గాలు చేపడతారు. అధ్యక్షురాలు బడ్జెట్ అంకెలను అక్రమంగా వక్రీకరించారన్న ఆరోపణలను రుజువు చేయకుండానే అభిశంసనకు ఓటు వేయటం ద్వారా ప్రతిపక్ష నేతలు తీవ్ర నేరానికి పాల్పడ్డారని అధికార కూటమి ఆరోపించింది. దేశంలో 30 ఏళ్ల ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తింది. దిల్మా స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అధికారికంగా ప్రతిస్పం దిస్తారని ఆమె అటార్నీ జనరల్ ఎడ్యురాడో కార్డోజో పేర్కొన్నారు. మరో నాలుగు నెలల్లో రియో డి జెనీరియోలో ఒలింపిక్ క్రీడలు జరగాల్సి ఉండగా బ్రెజిల్ రాజకీయ సంక్షోభంలో చిక్కకుంది. -
ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్
బ్రెజిల్: బ్రెజిల్ లో ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్ కు అక్కడి కోర్టులకు మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. లాటిన్ అమెరికా ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ డియెగో జోడెన్ ను మంగళవారం సావోపోలో లో బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించాల్సిందిగా జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించిన కేసులో అతడిని అరెస్ట్ చేసినట్టు ఫెడరల్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. కోర్టు జారీ చేసిన ఆదేశాలను మళ్లీ మళ్లీ బేఖాతరు చేయడం తీవ్రమైన కోర్టు ధిక్కారణకు కిందకు వస్తుందని ఆరోపిస్తున్నారు. మాదక ద్రవ్యాల కేసు విచారణ సందర్భంగా సెర్జీప్ రాష్ట్ర న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వాట్సాప్ ద్వారా పంపిన సందేశాలు, విడుదల చేయడంలో సంస్థ నిరాకరించిందని, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల కేసుల విచారణలో సహకరించడం లేదని ఆరోపిస్తూ సమన్లు జారీ చేశారు. వీటికి స్పందించకపోవడంతో జోడెన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఖండించాడు. ఇది తనకు చాలా విస్మయాన్ని కలిగించదన్నారు. బ్రెజిల్ లో ఇదొక విచారకరమైన రోజని వ్యాఖ్యానించారు కాగా గత ఏడాది డిసెంబర్ లో మరో బ్రెజిల్ లో కోర్టు వాట్సాప్ పై 48గంటల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఫేస్బుక్ మేనేజ్మెంట్ పరిధిలో ఉన్న వాట్సాప్ యాప్ నేర సంబంధిత విచారణకు సహకరించడంలో విఫలమవుతోందంటూ కోర్టు తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో నిరసనలు వెలువెత్తాయి. -
లాటిన్ అమెరికాలో 'బాహుబలి'
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం బాహుబలి ఇంకా సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ఇప్పటికే భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదుచేసింది ఈ భారీ చిత్రం. ఇండియాతో పాటు, అమెరికా, జపాన్ లాంటి చాలా దేశాల్లో భారీ వసూళ్లను కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన బాహుబలి తాజాగా లాటిన్ అమెరికాలో విడుదలకు రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సన్ డిస్ట్రబ్యూటర్స్, బాహుబలి సినిమాను లాటిన్ అమెరికాలో భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే హక్కులు సొంతం చేసుకున్న ఈ సంస్థ త్వరలోనే లాటిన్ అమెరికాలో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుల చేసేందుకు రెడీ అవుతోంది. అందుకోసం పెద్ద సంఖ్యలో థియేటర్లను బ్లాక్ చేయడానికి సంప్రదింపులు జరుపుతోంది. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కలు లీడ్ రోల్స్‌లో నటించిన బాహుబలి ఇప్పటికే 600 కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ సినిమా రికార్డులను ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ భారీ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. మరింత భారీగా రూపొందుతున్న బాహుబలి 2016 చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
అరటి పండు యుద్ధం
సాక్షి: బనానా (అరటి పండు) అంటే ఇష్టపడని వారు ఉండరు. మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాల్లో అరటి పండ్లను విరివిగా వినియోగిస్తారు. ఎన్నో పోషకాలు కలది కాబట్టి అరటి పండ్లకు డిమాండ్ ఎక్కువే. అమెరికా, ఐరోపాలాంటి అగ్ర దేశాల్లో సైతం అరటి పండ్లను విపరీతంగా ఇష్టపడతారు. అంతర్జాతీయంగా భారీ స్థాయిలో అరటి పండ్ల వ్యాపారం సాగుతోంది. ఒకప్పుడు అనేక దేశాలు ఆర్థిక ప్రగతికి అరటి పండ్ల ఎగుమతి మీదే ఆధారడపడేవి. పలు దేశాల ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అరటి పండ్లే రెండు అగ్ర దేశాల మధ్య వ్యాపార సంక్షోభానికి కారణమయ్యాయంటే నమ్ముతారా? పైగా అది ప్రపంచంలోనే అతి సుదీర్ఘ వ్యాపార సంక్షోభం. దీనికి విశ్లేషకులు పెట్టిన పేరు ‘బనానా వార్’. ప్రపంచ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ‘బనానా వార్’ విశేషాలు తెలుసుకుందాం.. ప్రారంభం.. రెండో ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత ‘బనానా వార్’ మెల్లగా ప్రారంభమైంది. రెండు అగ్ర రాజ్యాలైన యూరోపియన్ యూనియన్, లాటిన్ అమెరికాల మధ్య తలెత్తిన వ్యాపార సంక్షోభమే ‘బనానా వార్’. 1950, 60వ దశకానికి ముందు అనేక ఆఫ్రికా, కరీబియన్, పసిఫిక్ దేశాలు (ఏసీపీ దేశాలు) యూరోపియన్ యూనియన్‌కు వలస రాజ్యాలుగా ఉండేవి. 1960వ దశకానికి వచ్చే సరికి అవన్నీ స్వతంత్ర దేశాలుగా మారాయి. ఈ దశలో తమ మాజీ వలస రాజ్యాలైన ఏసీపీ దేశాలతో వ్యాపార సంబంధాలను బలపరచుకోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలు భావించాయి. దీంతో ఆయా దేశాలతో పన్నులు లేని వ్యాపార ఒప్పందాలకు తెరతీశాయి. ఈఈసీ ఏర్పాటు.. యూరోపియన్ యూనియన్(ఈయూ) లోని ఆరు దేశాలతోపాటు, ఏసీపీ దేశాలు కలిసి స్వేచ్ఛా వాణిజ్యం చేసుకునే ఉద్దేశంతో యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ (ఈఈసీ)గా ఏర్పడ్డాయి. అనంతరం 1973లో బ్రిటన్, ఐర్లాండ్, డెన్మార్క్ దేశాలు కూడా ఈఈసీలో చేరాయి. దీంతో మొత్తం ఈఈసీలో తొమ్మిది ఐరోపా దేశాలు, దాదాపు 50 వరకు వలస దేశాలు చేరాయి. వీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈఈసీ దేశాల మధ్య పన్నులు లేకుండా వ్యాపార కార్యకలాపాలు సాగాలి. ముఖ్యంగా ఏసీపీ దేశాలకు అగ్ర రాజ్యాలైన ఐరోపా దేశాల్లో స్వేచ్ఛా వాణిజ్యం చేసుకునే వెసలుబాటు కల్పించాలి. దీని వల్ల అప్పుడే స్వతంత్రం పొందిన ఆయా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వీలుంటుందనేది వారి ఉద్దేశం. ఆర్థిక తోడ్పాటును అందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం కూడా ఇందులోని లక్ష్యాలు. అరటి పండ్లే ప్రధాన వనరు... పన్నులు తక్కువగా ఉండేలా వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఈఈసీ దేశాల మధ్య వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇందులో ఏసీపీ దేశాల నుంచి ఐరోపా దేశాలకు అధికంగా దిగుమతి అయ్యే పంట అరటి పండ్లే. ఏసీపీ దేశాల్లో అరటి పండ్లు ఎక్కువగా పండడంతో వాటినే అధికంగా ఎగుమతి చేసేవారు. ఆ దేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన వాణిజ్య ఎగుమతులు కూడా అరటిపండ్లే. ఒప్పందం ప్రకారం ఐరోపా దేశాలు ఏసీపీ దేశాల నుంచి దిగుమతి చేసుకునే అరటి పండ్లపై పన్నులు విధించేవారు కాదు. కానీ లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చే అరటి పండ్ల దిగుమతిపై మాత్రం భారీ స్థాయిలో పన్నులు విధించేవారు. ఏసీపీ దేశాల నుంచి వచ్చే అరటి పండ్ల దిగుమతిపై పన్నులు విధించకుండా, అమెరికా దిగుమతులపైనే ఈయూ పన్నులు విధించడంతో రెండు రాజ్యాల మధ్య వ్యాపార సంక్షోభం తలెత్తింది. నష్టపోయిన అమెరికా.. ఈ విధానంతో లాటిన్ అమెరికా దేశాలు భారీగా నష్టపోయాయి. నిజానికి కరీబియన్ దేశాలతో పోలిస్తే అమెరికాలో అరటిపండ్లు ఎక్కువగా పండుతాయి. ఇక్కడ వాటి సాగు వ్యయం కూడా తక్కువే. దీని వల్ల అక్కడ అధికంగా ఉత్పత్తయ్యే అరటి పండ్లు ఐరోపాకు దిగుమతి అయ్యేవి. అయితే ఈఈసీ ఏర్పాటుతో ఐరోపా దేశాలు అమెరికా నుంచి బనానా దిగుమతుల్ని తగ్గించి, ఏసీపీ దేశాల నుంచి దిగుమతులు పెంచుకున్నాయి. ఫలితంగా అమెరికా కంపెనీలు నష్టపోయాయి. పైగా వారి ఎగుమతులపై పన్నులు విధించడంతో ఆ నష్టం మరింత పెరిగింది. అందులోనూ అమెరికాలో ప్రధానంగా ఐదే కంపెనీలే అరటిపండ్లను ఉత్పత్తి చేసేవి. పై చర్యలతో ఆ కంపెనీలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రతిచర్యలు-పరిష్కారం.. అరటి దిగుమతుల విషయంలో ఈయూ అనుసరిస్తున్న ద్వంద్వ వాణిజ్య విధానాన్ని అమెరికా వ్యతిరేకించింది. ఇలా రెండు అగ్రదేశాల మధ్య 1970వ దశకంలో మొదలైన అరటి పండ్ల వాణిజ్య వివాదం దశాబ్దాలపాటు కొనసాగింది. ఈయూ విధానాలకు నిరసనగా అమెరికా కూడా ఐరోపా దేశాల దిగుమతులపై అధిక పన్నులు, కొన్నింటిపై వంద శాతం పన్ను కూడా విధించింది. ఈ వివాదంపై చాలా కాలంపాటు అమెరికా, ఐరోపాల మధ్య చర్చలు కొనసాగినా అంతగా ఫలితాల్నివ్వలేదు. దీంతో ఈయూ విధానాలపై అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)కు ఫిర్యాదు చేసింది. అయితే సుదీర్ఘకాలం పాటు సాగిన వాదనలు, చర్చల అనంతరం ఈయూ, లాటిన్ అమెరికాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. అధిక పన్నులు విధించినందుకు గానూ ఈయూ నుంచి అమెరికా సంస్థలు నష్టపరిహారాన్ని పొందాయి. 1970ల్లో మొదలైన ఈ సంక్షోభానికి దాదాపు 20 ఏళ్ల తర్వాత 1990వ దశకంలో తెరపడింది. అలా ప్రపంచంలో అత్యధిక కాలం కొనసాగిన వాణిజ్య సంక్షోభంగా ‘బనానా వార్’ నిలిచింది. అయితే ఇప్పటికీ ఈ ఒప్పందంలో పలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అతిపెద్ద మార్కెట్.. ప్రపంచంలో అరటి పండ్లకు అతిపెద్ద మార్కెట్‌గా ఐరోపా దేశాలు నిలిచాయి. ప్రతి ఏటా దాదాపు 55 లక్షల టన్నుల అరటి పండ్లను ఈయూ దిగుమతి చేసుకుంటుంది. అరటి పండ్లను ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా, బ్రెజిల్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ దేశాల్లో వీటికి స్థానికంగానే మంచి డిమాండ్ ఉండడంతో ఎక్కువగా ఇక్కడే వినియోగమవుతున్నాయి. విదేశాలకు ఎగుమతి చేసేది తక్కువ శాతమే. కానీ సెంట్రల్ అమెరికా, కరీబియన్ దేశాల్లో ఉత్పత్తి అధికంగానే ఉన్నా వాటిని విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. -
కొమ్ములు తిరిగిన కొట్లాట
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి... కత్తులతో మనుషుల్ని మనుషులు చంపుకునే వికృత క్రీడ ఎప్పుడో కనుమరుగైంది. కానీ అనాదిగా స్పెయిన్‌లో బుల్‌ఫైట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. చావే భయపడేలా అత్యంత క్రూరంగా చంపుతుంటే.. అది చూసి చప్పట్లు చరిచి, ఈలలు వేసే సంస్కృతి వందల ఏళ్లుగా వదలడం లేదు. క్రీడగా చెప్పుకునే బుల్ఫైట్పై ఈ వారం మైదానం ప్రత్యేకం. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ఐదారు వందల కిలోల బరువున్న ఎద్దును ఎదుర్కోవడం ఒక మనిషికి సాధ్యం కాదు.. కానీ అదే ఎద్దును శారీరకంగా, మానసికంగా వేధించి.. రెండు రోజులు కడుపు మాడ్చి.. వీపుపై కత్తుల్లాంటి వాటితో పోట్లు పొడిచి.. రక్తం కారేలా చేసి.. ఇరవై నిమిషాల్లో చంపే వికృత క్రీడ బుల్ ఫైట్.. స్పెయిన్, మెక్సికో లాంటి కొన్ని దేశాల్లో ఈ బ్లడ్ ఫైట్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన సాగుతోంది. వందల ఏళ్లుగా... ఎద్దులతో కొట్లాట అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది స్పెయిన్ బుల్‌ఫైట్. అక్కడ బుల్ ఫైటింగ్ కొన్ని వందల ఏళ్లుగా సాగుతోంది. పురాతన రోమ్ కాలంలో బుల్ ఫైటింగ్‌కు ప్రజాదరణ చాలా ఎక్కువ. ఏళ్లుగా ఇది స్పెయిన్ సంస్కృతిలో భాగమైంది. అయితే స్పెయిన్‌లో ప్రస్తుత తరహాలో జరుగుతున్న బుల్ ఫైటింగ్ 300 ఏళ్లుగా సాగుతోంది. పోటీలకు ప్రత్యేక ఎద్దులు... స్పెయిన్‌లో బుల్ ఫైటింగ్‌కు ఉపయోగించే ఎద్దులు ప్రత్యేక బ్రీడ్‌కు చెందినవి. పశువుల్లో ఉపజాతి అయిన బాస్ టారస్ ఇబెరికస్ ఎద్దును బుల్ఫైటింగ్లో ఉపయోగిస్తారు. వీటిని టోరో బ్రావో, ఇబెరియన్ బుల్ అని పిలుస్తారు. వీటిని దక్షిణ స్పెయిన్‌తో పాటు పోర్చుగల్, లాటిన్ అమెరికా దేశాల్లో పెంచుతారు. ఇవి ఎక్కువగా నల్లగా, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటిలో అసాధారణ స్థాయిలో జన్యువులు, డీఎన్ఏ ఉండటం వల్ల దూకుడుతనం, శక్తి, బలం, సత్తువ అధికంగా ఉంటుంది. వీటినే పోటీల్లో బరిలోకి దించుతారు. మూడు నుంచి నాలుగేళ్ల వయసున్న వీటి బరువు 500 నుంచి 700 కేజీల మధ్య ఉంటుంది. వీళ్లే బుల్ ఫైటర్లు... బుల్ ఫైటింగ్లో ప్రధాన పాత్ర పోషించేది ప్రధాన మెటడారే. ఇతనికి స్టార్ హోదా ఉంటుంది. స్టార్ మెటడార్ కోసమే కొందరు ప్రత్యేకంగా బుల్ ఫైటింగ్ చూస్తారు. బుల్ ఫైటింగ్లో మెటడార్కు మరో ఇద్దరు సహాయకులుగా వ్యవహరిస్తారు. ముగ్గురు బాండెరిల్లేరోస్, ఇద్దరు పికెడార్లు తమ వంతు సాయం చేస్తారు. ఇక ఎద్దును చంపే క్రమంలో వీరందరి పాత్ర ఉన్నా.. చివరికి హీరో మాత్రం ప్రధాన మెటడారే. అప్పుడప్పుడు మనుషుల ప్రాణాలూ... బుల్ ఫైటింగ్ ఉద్దేశం ఎద్దులను చంపడం. అయితే ఈ పోటీల్లో అప్పుడప్పుడు బుల్‌ఫైటర్లు చనిపోతారు. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రెచ్చగొట్టే క్రమంలో కానీ.. లేదంటే వాటి వీపులో పికాను లేదంటే బ్యాండెరిల్లాస్ను పొడిచే క్రమంలో బుల్ఫైటర్లను ఎద్దులు కుమ్మేస్తాయి. ఎద్దుల కుమ్ముడికి బుల్‌ఫైటర్లు చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 1700వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 500లకు పైగా బుల్ ఫైటర్లు చనిపోయినట్లు విశ్లేషకుల అంచనా. ఫైటర్లు.. శిక్షణ.. బుల్ ఫైటింగ్లో ఎద్దును చంపడమంటే మాటలు కాదు.. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రింగ్‌లో చంపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. బుల్ ఫైటర్ల కోసం బుల్ ఫైటింగ్‌ను ప్రోత్సహించే దేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే స్కూళ్లు కూడా ఉంటాయి. చాలా మంది శిక్షణ పొందేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఐదేళ్ల వయసు నుంచి బుల్ఫైటింగ్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇక స్పెయిన్‌లో బుల్ఫైటర్ రింగ్‌లోకి అడుగుపెట్టాలంటే ముందుగా ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాసవ్వాల్సి ఉంటుంది. జంతు ప్రేమికుల సమరం... బుల్‌ఫైట్ చూసే వారికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రతీయేటా ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల కారణంగా 2.5 లక్షల ఎద్దులు చనిపోతున్నాయి. అయితే వీటిని అత్యంత పాశవికంగా చంపడాన్ని నిరసిస్తూ కొన్నేళ్లుగా జంతు ప్రేమికులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం బుల్ ఫైటింగ్ స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, మెక్సికో, కొలంబియా, వెనిజులా, పెరు, ఈక్వెడార్‌లో జరుగుతున్నాయి. అయితే జంతు ప్రేమికుల పోరాటం కారణంగా అర్జెంటీనా, కెనడా, క్యూబా, డెన్మార్క్, ఇటలీ, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో బుల్ ఫైటింగ్‌పై నిషేధం విధించారు. క్రీడనా? కళనా? వందల ఏళ్లుగా జరుగుతున్న బుల్ ఫైటింగ్ క్రీడ అని కొందరు వాదిస్తుంటే.. కాదు కాదు.. ఇదో కళ అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో జరుగుతుండటంతో బుల్ఫైటింగ్పై పెద్దగా దృష్టి సారించడం లేదు. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం ఎద్దులను చంపడమూ ఓ క్రీడేనా? అని సన్నాయి నొక్కులు నొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. బుల్‌ఫైట్ సాగేదిలా... కేవలం 20 నిమిషాల్లో ముగిసే బుల్‌ఫైట్ మూడు దశల్లో సాగుతుంది. ఎద్దును భయపెట్టేలా శబ్దం చేయడంతో పోటీ ప్రారంభమవుతుంది. తొలి దశలో పికెడార్లు గుర్రంపై స్వారీ చేస్తూ ఎద్దును కవ్విస్తారు. అలిసిపోయేలా చేయడమే వారి పని. అదే క్రమంలో వాళ్లు తమ దగ్గరున్న 6 నుంచి 8 అంగళాల పొడవు, 2 అంగుళాల మందం ఉన్న ‘పికా’ అనే ఆయుధంతో వీపు భాగంలో పొడిచి మెడ నరాలు తెగేలా చేస్తారు. దీంతో ఎద్దు శరీరంలోంచి రక్తం కారడం మొదలవుతుంది. ఎద్దు మరణానికి ఇక్కడే కౌంట్‌డౌన్ మొదలవుతుంది. రెండో దశలో సహాయ మెటడార్లు(వీరిని బాండెరిల్లేరోస్ అని కూడా పిలుస్తారు) బ్యాండెరిల్లాస్(ఈటె లాంటి పదునైన కత్తి)తో రంగంలోకి దిగుతారు. ఐదు, ఆరు బ్యాండెరిల్లాస్లను ఎద్దు వీపుభాగంలో లోనికి గుచ్చుతారు. దీంతో అది అలిసిపోతుంది. మూడోది, అంతిమ దశలో ప్రధాన మెటడార్ రింగ్‌లోకి వచ్చి ఎద్దు ప్రాణాలను తీస్తాడు. ఎరుపు బట్టతో ఎద్దును ఆటూ ఇటూ ఆడిస్తూ అది పూర్తిగా కింద పడిపోయేలా చేస్తాడు. ఇదంతా ముగియడానికి 6 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ప్రధాన మెటడార్ ప్రాణాలు తీయడంలో ఇబ్బంది పడితే అతనికి సహాయకుడిగా మరొకరు రింగ్‌లోకి వస్తారు. చివరికది రక్తం కక్కుకుని ప్రాణాలు విడుస్తుంది. పలు దేశాల్లో... బుల్ ఫైటింగ్లో ఎద్దును అత్యంత క్రూరంగా చంపడాన్ని చూశాం... అయితే కొన్ని దేశాల్లో బుల్ ఫైట్‌ను అటు ఎద్దుకు, ఇటు బుల్ ఫైటర్‌కు హాని జరగకుండా పోటీలు నిర్వహిస్తారు. మరికొన్ని దేశాల్లో రెండు ఎద్దుల మధ్య పోటీలను కూడా నిర్వహిస్తారు. పెర్షియన్ గల్ఫ్(ఒమన్, యూఏఈ)లో రెండు ఎద్దుల మధ్య బుల్ ఫైట్ పోటీలు జరుగుతాయి. అమెరికాలో బుల్ ఫైటర్ (రొడియో క్లౌన్) పేరుతో పోటీలు జరుపుతారు. టర్కీ, టాంజానియా, జపాన్లలో ఎద్దుల మధ్య పోటీలు నిర్వహిస్తారు. జల్లికట్టుపై సుప్రీం నిషేధం... భారత్‌లో అత్యంత వివాదాస్పదమైన క్రీడ ‘జల్లికట్టు’.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ ఏడాది మేలో నిషేధం విధించింది. ప్రతీయేటా తమిళనాడులో జరిగే ఈ జల్లికట్టు పోటీలు జరిగిన ప్రతీసారి వివాదాస్పదమే. స్పెయిన్ బుల్ఫైటింగ్లా ఎద్దును ఈ పోటీల్లో చంపరు. అయితే ఇందులో పాల్గొనే వాళ్లు ఎద్దును లొంగదీసుకుంటారు. ఈ ప్రయత్నంలో చాలామంది చనిపోయారు. గత రెండు దశాబ్దాల్లో రెండు వందల మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆ రెండు రోజులూ... బుల్ ఫైట్‌లో రింగ్‌లోకి వచ్చిన ఎద్దు రంకెలేస్తూ కనిపించిన వారిని కనిపించినట్లుగా కొమ్ములతో కుమ్మేయాలన్న కసితో అటూ, ఇటూ పరుగెత్తుతుంది. అయితే సాధారణంగా ఎద్దులు ఎవరికీ హాని చేయవు. కానీ రింగ్‌లోకి వచ్చిన తర్వాత అది పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తుంది. అలా చేయడానికి కారణం ఉంది. బుల్‌ఫైట్‌కు సిద్ధం చేయడంలో భాగంగా రెండు రోజుల పాటు దానికి నరకం చూపిస్తారు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తారు. నీళ్లలో తడిపిన న్యూస్ పేపర్లను దున్నపోతు రెండు చెవుల్లోకి దూరుస్తారు. దీంతో వాటికి ఏమీ వినిపించదు. దూదిని ముక్కు రంధ్రాల్లోకి దూర్చడం ద్వారా శ్వాసక్రియకు ఆటంకం కలిగేలా చేస్తారు. ఫలితంగా అది శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వాజిలిన్‌ను రెండు కళ్లకు రుద్దుతారు. దీంతో వాటికి చూపు మందగిస్తుంది. కాళ్లు కాలిపోతున్నాయనిపించేలా గాఢత ఎక్కువగా ఉన్న ద్రావణాన్ని పూస్తారు. దీనివల్ల ఎద్దు పట్టుతప్పిపోతుంది. ఒకరకంగా అది కింద పడిపోయేలా చేస్తుంది. జననాంగాల్లోకి సూదిని గుచ్చుతారు. బలమైన లాక్సెటీవ్స్ అనే డ్రగ్స్‌ను ఆహారంతో కలిపి పెడతారు. అది తిన్న ఎద్దు విరేచనాలకు లోనవుతుంది. ఫలితంగా నీరసంగా తయారవుతుంది. ఎద్దు బలహీనంగా తయారయ్యేలా (కొన్నిసార్లు బలంగా తయారయ్యేలా) డ్రగ్స్ తినిపిస్తారు. రింగ్‌లోకి పంపే కంటే రెండు రోజుల ముందు ఎద్దును చీకటిగా ఉన్న బాక్స్‌లో ఉంచుతారు. దీంతో అది దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతుంది. రెండు రోజుల తర్వాత ఒక్కసారిగా రింగ్‌లోకి వదులుతారు. బాక్స్‌లోంచి బయటకు వచ్చిన ఎద్దు తనకు ఎట్టకేలకు విముక్తి కలిగిందన్న భావనతో రింగులో కలియ తిరుగుతుంది. అదే సమయంలో తనను చిత్రహింసలకు గురి చేసిన వారిని కొమ్ములతో చంపేయాలన్న కసి దానిలో కనిపిస్తుంది. అందుకే రింగ్‌లో కనిపించిన వారిని కనిపించినట్లుగా కుమ్మేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంది. -
జెన్సర్ టెక్నాలజీస్ చేతికి ‘ప్రొఫెషనల్ యాక్సెస్ ’
న్యూఢిల్లీ: రిటైల్ ఈ-కామర్స్ సొల్యూషన్స్ అందించే ప్రాఫెషనల్ యాక్సెస్ సంస్థను మధ్య తరహా సాఫ్ట్వేర్ సంస్థ జెన్సర్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఫ్రొఫెషనల్ యాక్సెస్(పీఏ) సంస్థతో ఒప్ప ందం కుదుర్చుకున్నామని పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న జెన్సర్ టెక్నాలజీస్ గురువారం తెలిపింది. అయితే ఎంత మొత్తానికి పీఏ సంస్థను కొనుగోలు చేసింది వెల్లడించలేదు. అమెరికా, ఇంగ్లాండ్, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లోని మధ్య, భారీ రిటైల్ సంస్థలకు ఈ-కామర్స్ సొల్యూషన్స్‌ను న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఏ కంపెనీ అందిస్తోందని వివరించింది. ఈ సంస్థ కొనుగోలుకు కావలసిన నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకుంటామని పేర్కొంది. పీఏ ఆదాయం 3.8 కోట్ల డాలర్లని వివరించింది. ఈ డీల్‌కు ఆర్థిక సలహాదారులుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, న్యాయ సలహాదారులుగా భారత్‌లో నిషిత్ దేశాయ్ అసోసియేట్స్, అమెరికాలో స్టాల్ కోవెన్ క్రోలే ఆడిస్ ఎల్ఎల్సీలు వ్యవహరించాయని జెన్సర్ టెక్నాలజీస్ పేర్కొంది. -
నికరాగువాలో పుతిన్ ఆకస్మిక పర్యటన
మనాగువా: పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో లాటిన్ అమెరికా దేశాల్లో తన ప్రాబల్యం తిరిగి పెంచుకునేందుకు రష్స సన్నద్ధమైంది. మిత్రదేశమైన క్యూబాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ నికరాగువాలో ఆకస్మిక పర్యటన జరిపారు. లాటిన్ అమెరికాలో తలపెట్టిన ఆరురోజుల పర్యటనలో భాగంగా పుతిన్ అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలనూ చుట్టిరానున్నారు. బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ దేశాల కూటమి సదస్సుకు హాజరుకానున్నారు. -
ఆ గారడీ నిండా గుండె తడి
మేజిక్ రియలిజమ్ శైలిని సయితం తన ఇంటిలోనే కనుగొన్నాడాయన. బాల్యంలో అమ్మమ్మ చెప్పిన జానపద, కాల్పనిక కథల ద్వారా దానిని సాధించాడు. కొలంబియా రాజకీయ వాస్తవికతలను జానపద పాత్రలతో, మార్మికమైన తీరులో మార్క్వెజ్ అక్షరబద్ధం చేశాడు. లాటిన్ అమెరికా కరీబియన్ సాగర తీరా ల సొగసులనీ, ఆ జాతి ప్రజల పగలనీ, ఉద్వేగాలనీ రంగరించి ఆ ప్రాంతం గాథని అక్షరబద్ధం చేసినవాడు గాబ్రియెల్ గార్షి యా మార్క్వెజ్ (మార్చి 6, 1927-ఏప్రిల్ 17, 2014). మేజిక్ రియలిజమ్తో ప్రపంచ సాహితీ లోకాన్ని మైమరపించిన మార్క్వెజ్ స్పానిష్ భాషకు అసాధారణ గౌరవం తెచ్చి పెట్టాడు. పుక్కిట పురాణగాథలూ, అసాధా రణ ఊహాచిత్రాలూ, వీటితో చేసే గారడీనే మేజిక్ రియలిజమ్ అంటాడాయన. కానీ ఈ అసాధారణ శైలిని లాటిన్ అమెరికా చరి త్ర పుటల నుంచి జారే విషాదాన్ని చెప్పడా నికి ఆ మహా రచయిత ఉపయోగించుకు న్నాడు. అందుకే, లాటిన్ అమెరికా వర్షించే ఉత్తేజంలో మార్క్వెజ్ నిరంతరం తడిసిపో తూనే ఉంటాడు అని క్యూబా విప్లవ నేత ఫైడల్ కాస్ట్రో వ్యాఖ్యానించాడు.కొలంబియాలోని అరాకటాక అనే గ్రామంలో (ఆయన రచనలలోని అద్భుత కల్పిత గ్రామం మకుండో ఇదే) పెరిగిన మార్క్వెజ్ను ప్రభావితం చేసిన స్థానిక అంశాలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. కొలంబియా అంతర్యుద్ధం, అక్కడి ఉద్వేగా లు, విశ్వాసాలు, ఘర్షణలు, లిబరల్ పార్టీ ప్రభావం, తరువాత పెరిగిపోయిన మాఫి యాలు, వారి హింసతో కరీబియన్ తీరాన్ని తడిపేసిన కన్నీళ్లు - అన్నీ ప్రభావితం చేసి నవే. అరాకటాకలో అమ్మమ్మ, తాతయ్యల పెంపకం, తరువాత పత్రికా రచయితగా గడించిన అనుభవాలూ మార్క్వెజ్ సాహి త్యానికి పునాదులయ్యాయి. ‘నేను ఏనాటికీ పత్రికా రచయితనే. ఇన్ని రచనలు చేయగలి గానంటే అదే కారణం. ఆ రచనలలోని ఇతి వృత్తాలు. జర్నలిజం ఇచ్చిన వాస్తవ సమా చారమే’ అంటాడాయన. 30 మిలియన్ ప్రతులు అమ్ముడుపోయి, మార్క్వెజ్ కీర్తిని విశ్వ వీధులలో ఎగురవేసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ (నూరేళ్ల ఏకాం తం, 1967)నవల కథానాయ కుడి పాత్రను తన ఇంటిలోనే వెతికి పట్టుకున్నాడు. ఆ పాత్రకు ప్రేరణ తన తాతగారే. కొలంబి యా అంతర్గత పోరులో ఆయనది కీలక పాత్ర. ఈ నవలలోని ఏడు తరాల బ్యుండి యా కుటుంబ గాథ ఆవిష్కరణకు ఎన్నుకు న్న మేజిక్ రియలిజమ్ శైలిని సయితం తన ఇంటిలోనే కనుగొన్నాడా యన. బాల్యంలో అమ్మమ్మ చెప్పిన జానపద, కాల్పనిక కథల ద్వారా దానిని సాధించాడు. కొలంబియా రాజకీయ వాస్తవికతలను జానపద పాత్ర లతో, మార్మికమైన తీరులో ఆయన అక్షర బద్ధం చేశాడు. అందుకే ఈ నవలలో లాటిన్ అమెరికా జాతీయులు తమ ఆత్మను దర్శించుకోగలిగారన్న ఖ్యాతి వచ్చింది.మిత్రులూ, అభిమానులూ ‘గాబో’అని ఆప్యాయంగా పిలుచుకునే మార్క్వెజ్ ప్రకృ తి సౌందర్యాలనూ, రాజకీయ సామాజిక స్పృహనూ కలిపి మార్మికంగా పెనవేస్తాడు. అదంతా ఆయన లాటిన్ అమెరికా ఐక్యత కోసం, శాంతి కోసం పడిన తపనకు ప్రతి బింబమే. ఆ ప్రాంతంలో అమెరికా జోక్యా న్ని సదా వ్యతిరేకించాడు. ఇదే క్యూబా వి ప్లవ పిత కాస్ట్రోతో మైత్రిని ప్రసాదించింది. తన రాత ప్రతులను ఆ విప్లవ ద్రష్టకు చూపించి అభిప్రాయం తెలుసుకు నేంతగా బంధం బలపడింది. మరో వైపు అమెరికా ఆయన రాక మీద పదేళ్లు నిషేధం విధించింది. తరువాత క్లింటన్ మార్క్వెజ్ మిత్రుడయ్యాడు. తన పద్దెనిమిదో ఏట రచనా వ్యాసం గం ఆరంభించిన మార్క్వెజ్ విశేషమైన సాహిత్య సంపదను ఇచ్చి వెళ్లాడు. ‘ఇన్ ఈవిల్ అవర్’ (1962), ‘ది ఆటమ్ ఆఫ్ ది పేట్రి యార్చ్’ (1975), ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’(1985), ‘ది జనరల్ ఇన్ హిజ్ లెబైరింత్’(1989), మార్క్వెజ్ నవలలు. నవలికలు కూడా ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చాయి. ‘ఐస్ ఆఫ్ ఏ బ్లూ డాగ్’(1947), ‘బిగ్ మామాస్ ఫ్యునరల్’(1962) వంటి పలు కథా సంకలనాలను ఆయన వెలువ రించారు. ‘భగవంతుడు నాకు ఒక్క సెకను అదనంగా జీవితాన్ని ప్రసాదించినా, నా శక్తిని మరింత గొప్పగా ఉపయోగించడా నికే వినియోగిస్తాను’ అని జబ్బు పడిన తరువాత మిత్రులకు రాసిన వీడ్కోలు లేఖ లో మార్క్వెజ్ రాశాడు. కానీ ఆ క్షణం వరకు సృజనాగ్నిలో ఆయన ఎంతగా కాగి పోయా డో రోజూ ఒక పసుపు గులాబీ గమనిం చింది. వేకువనే కొద్దిసేపు పుస్తకం చదువు కుని, తరువాత వార్తాపత్రికలు చదివి, ఆపై నాలుగు గంటలు ఏకబిగిన రచనలు చేసే వాడు మార్క్వెజ్. ఆ సమయానికి నిత్యం ఒక పసుపు గులాబీని తెచ్చి ఆయన రాత బల్ల మీద ఉంచేది ఆయన భార్య మెర్సిడెస్. అక్షరార్చనతో మార్క్వెజ్ గుండె ఎంత అలసిపోయిందో ఆ గులాబీకి తెలుసు. డాక్టర్ గోపరాజు నారాయణరావు