lecturers
-
గందరగోళంగా 'ఉన్నత విద్య'
డాక్టర్ ధనశ్రీ.. బయోకెమిస్ట్రీ లెక్చరర్. కర్నూలు కేవీఆర్‌లో పనిచేసేవారు. లాంగ్ స్టాండింగ్ పేరుతో 2022–23లో గుంతకల్లు డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ ఫైనలియర్లో కేవలం ఆరుగురు మాత్రమే విద్యార్థులున్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత బయో కెమి్రస్టికి ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. విద్యార్థులు లేరు.. పైగా బయోకెమిస్ట్రి అక్కడ తొలగించారు. దీంతో ధనశ్రీ ఖాళీగా ఉన్నారు. పని ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయగా ఆమెను నంద్యాల డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటే లేదు. దీంతో అక్కడ కూడా ఆవిడ పనిలేకుండా ఖాళీగా ఉన్నారు. కేవీఆర్, సిల్వర్ జూబ్లీలో బయో కెమిస్ట్రి విభాగంలో ఖాళీలున్నాయి, విద్యార్థులూ ఉన్నారు. కానీ, వారికి నాణ్యమైన బోధన అందడంలేదు. భారీ వేతనాలిచ్చి సబ్జెక్ట్‌లేని కాలేజీలో పనిలేకుండా అధికారులు ఉంచడం ఎందుకో!?డాక్టర్ రవిశంకర్ శర్మ.. గుంతకల్లు డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. గుంతకల్లులో ఉన్న పోస్టుల కంటే ఎక్కువగా ఫిజిక్స్ లెక్చరర్లు ఉన్నారు. దీంతో పనిలేకుండా ఖాళీగా ఉన్నానని, పత్తికొండలో పోస్టు ఖాళీగా ఉందని అక్కడికి పంపాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయితే, శర్మను అనంతపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ కూడా ఉన్న పోస్టుల కంటే ఎక్కువగానే ఉన్నారు. అక్కడా ఆయన పనిలేక ఖాళీగా ఉన్నారు. పత్తికొండలో మాత్రం ఖాళీ పోస్టును భర్తీచేయలేదు. డాక్టర్ కోటేశ్వరరావు.. గుంటూరు డిగ్రీ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్. 2022లో సర్దుబాటు పేరుతో ఇతన్ని బనగానపల్లిలో వేశారు. అక్కడ పూర్తిస్థాయిలో లెక్చరర్లు ఉన్నా అదనంగా నియమించారు. దీంతో ఏడాది పాటు పనిలేకుండా ఆయన ఖాళీగా ఉన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి అక్కడ నియమించాలని ఇక్కడ తనకు పనిలేదని కోరారు. ఏడాది తర్వాత ఆయన్ను తిరిగి డోన్‌కు పంపారు.డాక్టర్ ఫరీదా ఇంగ్లీషు లెక్చరర్. లాంగ్‌స్టాండింగ్ పేరుతో కేవీఆర్ నుంచి పాణ్యం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ పిల్లలు లేరు. పనిలేకుండా ఫరీదా కూడా ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నారని అక్కడి ప్రిన్సిపాల్ ఫరీదాకు వేతనం నిలిపేశారు. పిల్లలు లేనప్పుడు తానేం చేయాలని, తన అవసరం ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఆవిడ విన్నవించారు. కేవీఆర్‌లో ముగ్గురు కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. రెగ్యులర్ పోస్టు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వారితో విద్యార్థులకు క్లాస్‌లు చెప్పించడం ఏమిటో!?.. ఈ నాలుగు ఉదాహరణలు పరిశీలిస్తే డిగ్రీ కాలేజీలో లెక్చరర్ల నియామకాలు, పనితీరు, విద్యార్థులకు అందుతున్న బోధన, వారి భవిష్యత్తుపై ఉన్నత విద్యాశాఖకు, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత డొల్లగా ఉందో స్పష్టమవుతోంది. సబ్జెక్ట్‌లేని చోట సబ్జెక్ట్ లెక్చరర్‌ను నియమించడం, పిల్లలులేని చోట వారిని ఉంచడం, అవసరమైన చోట ఖాళీలు పెట్టడం చూస్తే అసలు డిగ్రీ కాలేజీల పనితీరుపై, విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్నతాధికారులకు ఏమాత్రం అవగాహనలేదని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, కర్నూలుఫారిన్ సర్వీసులు చేసి వస్తే సరిహద్దులకే..⇒ ఓ లెక్చరర్ విజయనగరం జిల్లా ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేశారు. తిరిగి అతను సొంతశాఖలోకి వస్తే ఖాళీలున్నా అతన్ని మాత్రం పార్వతీపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. ⇒ నంద్యాలలోని ఓ లెక్చరర్‌ను సర్దుబాటు పేరుతో విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి బదిలీ చేశారు. చుట్టపక్కల కాలేజీల్లో ఖాళీలున్నా దూరానికి బదిలీ చేశారు.⇒ కర్నూలు జిల్లాలోని ఓ లెక్చరర్ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేశారు. కర్నూలు జిల్లాలో ఖాళీలు ఉన్నప్పటికీ కడప జిల్లాకు బదిలీ చేశారు. ⇒ కర్నూలు ఎస్ఎస్ఏ ఏపీసీగా పనిచేసిన ఓ కెమిస్ట్రీ లెక్చరర్‌ను కర్నూలులోని రెండు కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు బదిలీ చేశారు. డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తూ ఫారిన్ సర్విసుల కింద బయటకెళ్లిన వారందరినీ ఆయా జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ ఉన్నత విద్యాశాఖాధికారులు వారిని రాష్ట్ర సరిహద్దుల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీ చేస్తున్నారు. దీనికి కారణం వారు ‘ఫారిన్ సర్విసు’లకు వెళ్లడమే. వారిపై ఉన్న కోపంతో దూర ప్రాంతాలకు బదిలీచేసే సమయంలో అక్కడ ఖాళీలున్నాయా? వారి సొంత జిల్లాల్లో ఉన్న ఖాళీల పరిస్థితి ఏంటి? ఆ ఖాళీలను అలాగే ఉంచితే అక్కడున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అని ఆలోచన చేయడంలేదు.దీంతో 13 జిల్లాల్లోని ఏ డిగ్రీ కాలేజీ లెక్చరర్ కూడా ‘ఫారిన్ సర్విసు’కు వెళ్లినా వారిని ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి బదిలీ చేశారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. ఉన్నత విద్యాశాఖలో ఇటీవల బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ అధ్యాపకులు అవసరం? ఎక్కడ అవసరంలేదని గ్రహించకుండా కేవలం ఫారిన్ సర్వీసుకు వెళ్లారు కాబట్టి ‘శిక్ష’గా వీరిని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లుగా ఉంది.రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు ‘కాంట్రాక్టు’ బోధన ఎందుకు?.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 2,400 మంది రెగ్యులర్ అధ్యాపకులున్నారు. 740 మంది కాంట్రాక్టు, వెయ్యిమంది వరకు ఎయిడెడ్ లెక్చరర్లు ఉన్నారు. యూనివర్శిటీ స్థాయి పొందిన కాలేజీలో పీహెచ్డీ చేసిన అధ్యాపకులే యూజీ, పీజీ విద్యార్థులకు బోధించాలి. అయితే, రెగ్యులర్ పోస్టులున్నా వారిని ఇతర జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీచేసి యూనివర్శిటీ పరిధిలో కాంట్రాక్టు లెక్చరర్లతో నడిపిస్తున్నారు. వీరిలో సింహభాగం లెక్చరర్లకు పీహెచ్డీ లేదు. రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు వారిని ఖాళీగా ఉంచి కాంట్రాక్టు లెక్చరర్లపై ఆధారపడటం ఏమిటని మిగిలిన అధ్యాపకులు ప్రశి్నస్తున్నారు. కమిషనరేట్‌లో ఏళ్ల తరబడి డిప్యుటేషన్.. మరోవైపు.. కమిషనరేట్‌లో నలుగురు లెక్చరర్లు డిప్యుటేషన్‌పై 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. వీరు ఉద్యోగానికి వచ్చింది విద్యార్థులకు చదువు చెప్పేందుకా? లేదంటే కమిషనరేట్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగేందుకా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 15 ఏళ్లుగా వారిని ఓ స్థానంలో అదీ డిప్యుటేషన్‌పై ఎందుకు కొనసాగిస్తున్నారని తోటి లెక్చరర్లు ప్రశి్నస్తున్నారు. క్లస్టర్ యూనివర్సిటీపై శీతకన్ను.. కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లి కాలేజీని, నగరంలోని కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీగా గత ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఖాళీలు లేకుండా పోస్టులు కూడా భర్తీచేశారు. అయితే, ఇక్కడ ఉన్న వీసీ సాయిగోపాల్కు, ఉన్నత విద్యాశాఖ నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ కీలక అధికారికి మధ్య వ్యక్తిగత విభేదాలతో ఈ కాలేజీ వారిని బయటికి పంపడం, బయటి వారిని ఇక్కడకు పంపకుండా ఖాళీలు ఉండేలా చేస్తున్నారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. వీసీలకు, ఉన్నతాధికారులకు మధ్య విభేదాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు యూజీ, పీజీపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
Health: స్ట్రెస్.. హెల్త్ మిస్! టీచర్లపై ఒత్తిడి బెత్తం..
టీచర్స్ డే రోజు పూజించుకుంటున్నాం సరే. వారి మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి, ఇంటికి శ్రద్ధ ఉందా? చెప్పాల్సిన క్లాసుల సంఖ్య, సిలబస్‌ల వత్తిడి, విద్యార్థులు నిత్యం తెచ్చే సమస్యలు, స్కూల్లో అరాకొరా వసతులు, స్కూలుకు రానూ పోనూ ప్రయాణ సౌలభ్యం లేని ఆందోళన... ఇవన్నీ టీచర్ల మానసిక ఆరోగ్యం దెబ్బ తీస్తున్నాయి. ఆ అసహనం విద్యార్థుల మీదకు మళ్లితే వారు గాయపడటమే కాక పాఠాలు నడవవు. శాంతంగా, నవ్వుతూ ఉండే టీచర్లు ఎందరు?2023లో బిహార్‌లో టీచర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 75 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 4 లక్షల మంది టీచర్లకు 12 రకాల ప్రశ్నలున్న ప్రశ్నాపత్రాన్ని పంపి వాటికి సమాధానాలు రాయించారు. ఈ సర్వే చేయడానికి ముఖ్య కారణం విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు...– టీచర్లు తరచూ తిడుతూ ఉండటం, కొడుతూ ఉండటం– స్కూలుకు సరిగ్గా రాకపోవడం– సిలబస్ సమయానికి పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వం జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమంటే పిల్లలతో వారు వ్యవహరిస్తున్న తీరులో ఎందుకు తేడా వస్తున్నదో తెలియడానికి ఈ సర్వే చేశారు. కాని సర్వే ఫలితాలను మాత్రం బయట పెట్టలేదు. సర్వేలో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.– మీ ఇంట్లోని ఒత్తిడి స్కూల్లో మీ ఉద్యోగం మీద పడుతున్నదా?– పిల్లల్ని ఎంత తరచుగా తిడుతున్నారు?– సిలబస్ టైమ్‌కి పూర్తి చేయగలుగుతున్నారా?– మీరు ఇంట్లో ఎక్కువ ఒత్తిడి ఫీలవుతారా స్కూల్లోనా?– ఇప్పటి విద్యా వ్యవస్థ మీద సంతృప్తిగా ఉన్నారా?ఈ సర్వేతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఏం చెప్పారంటే మాకు పాఠాలు చెప్పే పని కంటే వేరే పనులు ఎక్కువ చెబుతున్నారు అని. వాటిలో ఎలక్షన్ డ్యూటీలు, సర్వేలు, మిడ్ డే మీల్స్ ఉన్నాయి. సర్వేల పనిలో టీచర్లను పెడితే ఆ సమయంలో టీచర్ల అటెండెన్స్ దారుణంగా పడిపోతోంది. కొందరైతే ‘మిడ్ డే మీల్స్‌ను బయటి ఏజెన్సీకి అప్పగించాలి. చీటికి మాటికి దాని గురించి ఇన్స్పెక్షన్లకు వస్తుంటే ఒత్తిడిగా ఉంది’ అన్నారు.వ్యక్తిగత శ్రద్ధకు సమయం లేదు..స్కూల్లో పాఠాలు, హోమ్‌వర్క్‌లు, పరీక్షలు పెట్టి పేపర్లు దిద్దటాలు, స్కూల్ మేనేజ్మెంట్తో మీటింగ్‌లు, పేరెంట్స్‌తో మీటింగ్‌లు, సిలబస్‌ను పూర్తి చేయడం, వృత్తిపరమైన పోటీ (మంచి పేరు రావడం), స్టూడెంట్ల వ్యవహారశైలితో సమస్యలు... ఇవన్నీ ఒత్తిడి కలిగించేవే. ఇక కుటుంబ పరమైన ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇంటి వొత్తిడి స్కూల్లో స్కూలు ఒత్తిడి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే రెండు చోట్లా టీచర్లకు స్థిమితం ఉండదు. స్థిమితంగా లేని స్వభావంతో పాఠం చెప్పడం కష్టం. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్లు తమ మానసిక స్థితి గురించి శ్రద్ధ పెట్టే ఆలోచన చేయలేకపోతున్నారు.పిల్లలకు ఒత్తిడి..క్లాసురూమ్‌లో కూచోగానే పిల్లలు తలెత్తి చూసేది టీచర్నే. టీచర్ ముఖం ప్రసన్నంగా ఉంటే వారు ప్రసన్నంగా పాఠం వింటారు. చిర్రుబుర్రులాడే టీచర్ ఉండే క్లాసులోని పిల్లల్ని పరీక్షిస్తే వారిలో ‘కార్టిసల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతున్నదని తేలింది. పిల్లల మానసిక ఆరోగ్యం పై స్కూల్ వాతావరణం నెగెటివ్ ప్రభావం ఏర్పరిస్తే వారిలో సమస్యలు వస్తాయి. వీళ్లు మళ్లీ టీచర్‌కు స్ట్రెస్ ఇస్తారు. అంటే ఇదొక సైకిల్‌గా మారుతుంది.వ్యక్తిగత ఒత్తిడి..టీచర్ ఉద్యోగంలో ఉన్నవారికి కుటుంబం నుంచి చాలా సపోర్ట్ ఉండాలి. ఇంటి పని తగ్గించగలగాలి. ఆర్థిక, భావోద్వేగ సమస్యలు తెలుసుకొని మిత్రులు, బంధువులు సపోర్ట్‌గా నిలవాలి. సక్సెస్ఫుల్ విద్యార్థులను తయారు చేయించడంలో ఆమె సక్సెస్ అయ్యేలా తోడు నిలవాలి.చర్యలు తీసుకోవాలి..టీచర్లు, పిల్లలు మంచి మానసిక స్థితిలో ఉంటూ స్కూల్ జీవనం కొనసాగించాలంటే టీచర్ల గురించి ఆలోచించాలి. టీచర్ల కోసం ప్రభుత్వంగాని, ప్రయివేటు యాజమాన్యాలుగాని కింది చర్యలు తీసుకోవాలి.– తరచూ నిపుణులచే కౌన్సిలింగ్ చేయించడం– మెంటల్ హెల్త్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం– సాటి టీచర్ల నుంచి మద్దతు లభించే పని వాతావరణం.– వసతులు, బోధనా సామాగ్రి ఏర్పాటు– ఇంటి పని, ఉద్యోగ బాధ్యత సమతుల్యత గురించిన అవగాహన – యాజమాన్యం, తల్లిదండ్రులు, పిల్లలకు టీచర్లు అనుసంధానకర్తలుగా ఉండేలా చేసి ఆ టీచర్లు చెప్పే సూచనలను పాజిటివ్‌గా చూడటం. -
ఎక్కడికక్కడే సమస్యలు నేటి నుంచి ఇంటర్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ క్లాసులు శనివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంటర్ అధికారులు చేశారు. ప్రస్తుతం వడగాడ్పులు వీస్తున్న నేపథ్యంలో మొదటివారం రోజులూ ప్రభుత్వ, గురుకుల కాలేజీలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో హాజరుశాతంపై అధికారులు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. జూన్ రెండోవారం వరకూ విద్యార్థులు పెద్దగా కాలేజీలకు రాకపోవచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కూడా జూన్ 1 నుంచే మొదలవ్వాలి. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ కారణంగా ఫస్టియర్ విద్యార్థులకు జూన్ ఆఖరు వరకూ క్లాసులు జరిగే అవకాశం లేదు. అయితే, ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పటికే దాదాపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా, చాలాచోట్ల అనధికారికంగానే క్లాసులు నడుస్తున్నాయనే వార్తలొస్తున్నాయి. రెండో సంవత్సరం క్లాసులు కూడా ఇప్పటికే ప్రారంభించారు. 600 కాలేజీలకు పూర్తికాని అఫ్లియేషన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు 3 వేలకుపైగానే ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు 422 వరకూ ఉన్నాయి. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు తీసేస్తే 1400 కాలేజీలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. వీటన్నింటికీ ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, పరిసరాలను జిల్లా అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఈ గుర్తింపు ఇస్తారు. అయితే సరైన డాక్యుమెంట్లు సమరి్పంచని కారణంగా ఇంకా 600 ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు రాలేదు.అయినా ఆ కాలేజీలు అడ్మిషన్లు కొనసాగించినట్టు తెలుస్తోంది. ఒక్కో కాలేజీ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి. వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 72వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులుంటే, ప్రైవేటు కాలేజీల్లో 2.35 లక్షల మంది ఉన్నారు. ఆఖరిదశ వరకూ అప్లియేషన్ల ప్రక్రియ కొనసాగించడం వల్ల ప్రతీ సంవత్సరం విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు.ప్రభుత్వ కాలేజీల్లో సమస్యలెన్నో... ⇒ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ⇒ 225 ఒకేషనల్ అధ్యాపకుల పోస్టులూ ఖాళీనే.ళీ 26 కాలేజీల్లో కీలకమైన సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ⇒394 కాలేజీలకు పక్కా భవనాలున్నా, నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు కావడం లేదు. ⇒ కొత్తగా 26 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసినా, అవసరమైన అధ్యాపకులను ఇవ్వలేదు. మౌలిక వసతులూ కలి్పంచలేదు. ⇒సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై ఇంతవరకూ ఎక్కడా నిధులు ఇవ్వలేదని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. ⇒ అదనపు గదులు లేకపోవడంతో కొన్ని గ్రూపులను కలిపి బోధించే పరిస్థితి ఉంది. ⇒ఇప్పటి వరకూ ఎక్కడా పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదు. ఇంటర్ విద్యపై దృష్టి పెట్టాలి పేద విద్యార్థులు చేరే ప్రభుత్వ ఇంటర్ కాలేజీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. త్వరగా పాఠ్యపుస్తకాలు అందితే బోధన అనుకున్న ప్రకారం జరుగుతుంది. ప్రైవేటు తో దీటుగా ఫలితాలు వస్తాయి. కాలేజీల్లో తాగునీటి సౌకర్యం, ఫరి్నచర్, సరిపడా గదులు ఏర్పాటు చేయాలి. – మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్మిడియట్ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅన్ని సమస్యలూ పరిష్కరిస్తాం జూనియర్ కాలేజీల్లో ఎలాంటి సమస్యలూ లేకుండా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలేజీల అఫ్లియేషన్‌కు ఇంకా సమ యం ఉంది. అన్ని డాక్యుమెంట్లు సమరి్పస్తే కచి్చతంగా గుర్తింపు ఇస్తాం. మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాఠ్య పుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. త్వరలో అందించే ప్రయత్నం చేస్తాం. – శ్రుతి ఓజా, ఇంటర్‌బోర్డు కార్యదర్శి -
తుది తీర్పు మేరకే గురుకుల లెక్చరర్ల నియామకాలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ తుది తీర్పున కు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరాలు తెలు సుకుని చెప్పాలని స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చే యాలంటూ.. విచారణను వాయిదా వేసింది. గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫి కేషన్ ఇచ్చింది. అయితే నోటిఫికేషన్లో ఇచ్చిన నిబంధనలు పాటించకుండా తమను పక్కకు పెట్టడాన్ని సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన గంగాప్రసాద్‌తో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ మూర్తి జస్టిస్ పుల్ల కార్తీ క్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యా యవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ చేసి నా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం చదివి.. ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లు కూ డా ఉన్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని.. నివేదిక వచ్చేదాకా ఆగాలని అధికా రులు సూచించారు. అయితే ఆ నివేదిక రాక ముందే పిటిషనర్లను పక్కకు పెట్టి ఇతరులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదు. మెరిట్ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్టాండింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. -
త్వరలో ఇంటర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. వాస్తవానికి అధ్యాపక సంఘాల నేతలు గత కొంతకాలంగా బదిలీల కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల విద్యలో బదిలీలు చేపట్టడం, ఈ వ్యవహారం కోర్టు స్టేతో ఆగిపోవడం తెలిసిందే. తాజాగా స్పౌజ్ కేసులను పరిశీలించిన కోర్టు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, కాలేజీ సిబ్బందినీ బదిలీ చేయాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. విద్యామంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవల ఇంటర్, కాలేజీ విద్య ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు బదిలీల ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. బదిలీల్లేక ఐదేళ్లు: 2018 జూన్ నెలాఖరులో సాధారణ బదిలీలు చేపట్టారు. అప్పటి మార్గదర్శకాలను అనుసరించి 500 మంది ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. 2016–17లో జూనియర్ లెక్చరర్స్‌కు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతులు కల్పించారు. ఈ విధంగా పదోన్నతులు రావడంతో 2018లో జరిగిన బదిలీల్లో కనీసం రెండేళ్లు పనిచేసిన సర్వీస్ లేకపోవడంతో వారికి బదిలీ అవకాశం రాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 317 జీవో అమలు చేశారు. పదవీ విరమణ వయసును ప్రభుత్వం 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. దీంతో చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటూ, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని కాలేజీ అధ్యాపక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. తాజా నిర్ణయం వల్ల 6 వేల మందికిపైగా న్యాయం జరుగుతుంది. మార్గదర్శకాలపై కసరత్తు: బదిలీలు చేపట్టాలనే యోచన చేసిన నేపథ్యంలో మార్గదర్శకాలపై కూడా స్పష్టత ఉండాలని విద్యాశాఖ కార్యదర్శి అధికారులకు సూచించినట్టు సమాచారం. 317 జీవో తర్వాత ఏర్పడిన పరిస్థితులు, ఎన్ని సంవత్సరాలను కనీస, గరిష్ట అర్హతగా తీసుకోవాలనే అంశాలపై అధికారులు తర్జనభర్జనలో ఉన్నారు. స్పౌజ్ కేసులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి జాబితాను, ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలున్నాయి? అనే అంశాలపై వివరాలు తెప్పిస్తున్నారు. వచ్చేవారం బదిలీలపై స్పష్టత రావొచ్చని చెబుతున్నారు. -
100 శాతం జీఈఆర్ సాధించాలి
సాక్షి, అమరావతి: దేశంలో విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆకాంక్షించారు. సెప్టెంబర్ 2005 నుంచి ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారంతా రాష్ట్రంలోని ఏదో ఒక పాఠశాల/కాలేజీలో నమోదై ఉండాలన్నారు. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేరికలపై చర్చించారు. వచ్చే నెల సెప్టెంబర్ 4 నాటికి రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలంతా ఏదో ఒక పాఠశాలలో చేరి ఉండాలన్నారు. వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, జిల్లా అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి నూరుశాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం జీఈఆర్ సాధన అంశాన్ని తాను సవాలుగా తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యార్థుల విషయంలో స్థానికంగా నమోదైన అంశాల్లో తప్పులు ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చాలెంజ్ విసిరారు. జీఈఆర్ సాధించడంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని.. డేటా అంతా పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరారు. జూలై రెండో వారంలో గుడివాడలో ఒక వలంటీర్ 100 శాతం జీఈఆర్ సాధించారని, ఇప్పుడు 63,993 మంది వలంటీర్లు తమ పరిధిలో 100 శాతం జీఈఆర్ సాధించారని గుర్తు చేశారు. -
మరోసారి కరీంనగర్ చుట్టూ టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం.. మరో ఇద్దరి అరెస్టు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోసారి కరీంనగర్ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. కరీంనగర్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లను సిట్ అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. దీంతో అరెస్ట్‌ల సంఖ్య 53 కు చేరింది. హైటెక్ మాస్ కాపీయింగ్‌లో వీరిద్దరూ పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. డీఈఈ పూల రమేష్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. 10 లక్షలకు డీల్ ఖరారవ్వగా, ప్రశ్నపత్రం ఇచ్చే విధంగా ఏఈఈ, డీఏవో పరీక్షల కోసం ఒప్పందం కుదిరింది. చెరో రూ.5 లక్షలకు కుదిరిన డీల్ చేసుకున్నట్లు సిట్ విచారణలో బట్టబయలైంది. మరో 50 మంది దాకా ప్రశ్నాపత్రాలు లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్ లో నిందితులు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అరెస్టులు జరిగే అవకాశం ఉంది. చదవండి: TSPSC Case: ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసి మాస్ కాపీయింగ్. -
జీతం సరిపోట్లేదు... సమ్మె బాటపట్టిన టీచర్లు, లెక్చరర్లు తపాలా సిబ్బంది..
లండన్: పెరుగుతున్న జీవన వ్యయానికి తగ్గట్లుగా వేతనాలను పెంచాలని కోరుతూ యూకేలో వేల సంఖ్యలో పోస్టల్ సిబ్బంది, యూనివర్సిటీ లెక్చరర్లు, స్కూల్ టీచర్లు గురువారం సమ్మెకు దిగారు. ఇప్పటికే వివిధ రంగాల సిబ్బంది సమ్మెల్లో పాల్గొనడంతో దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వీధుల్లో చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోయింది. ఇటీవల లాయర్లు, నర్సులు కూడా పలుమార్లు విధులను బహిష్కరించారు. గురువారం యూనివర్సిటీల్లో 70 వేల మంది లెక్చరర్లు బోధన విధులను బహిష్కరించారు. ఈ నెల 30వ తేదీన మరోసారి స్ట్రైక్ చేస్తామని తెలిపారు. సమ్మె ప్రభావం సుమారు 25 లక్షల మంది విద్యార్థులపై పడింది. స్కాట్లాండ్లో టీచర్ల సమ్మెతో దాదాపు సూళ్లన్నీ మూతబడ్డాయి. రాయల్ మెయిల్ ఉద్యోగులు గురు, శుక్రవారాలతోపాటు క్రిస్టమస్ రోజున కూడా సమ్మెకు దిగుతామన్నారు. చదవండి: మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతు ఇచ్చిన బద్ధ శత్రువు -
సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిది: పాలిటెక్నిక్ అధ్యాపకులు
కడప(వైఎస్సార్ జిల్లా): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే బోధన సిబ్బందికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి పేస్కేల్–2016 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వటంపై పాలిటెక్నిక్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప పాలిటెక్నిక్ కళాశాలలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. పాలిటెక్నిక్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఈ పేస్కేల్ ద్వారా 84 ప్రభుత్వ పాలిటెక్నిక్, 2 ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన సుమారు 2,500 మంది లెక్చరర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏఎండీఈఆర్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(ఏఎండీఈఆర్).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ అసిస్టెంట్–03, ప్రాజెక్ట్ అసోసియేట్–09. ► ల్యాబొరేటరీ అసిస్టెంట్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 06.08.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.20,000+హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► ప్రాజెక్ట్ అసోసియేట్: విభాగాలు: జియాలజీ, జియోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 06.08.2021 నాటికి 27ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.31,000+హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్(ఆర్) అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(ఏఎండీ), 1–10–153–156, ఏఎండీ కాంప్లెక్స్, బేగంపేట్, హైదరాబాద్–500016, తెలంగాణ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 06.08.2021 ► వెబ్సైట్: https://www.amd.gov.in/app16/index.aspx ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో 20 ఖాళీలు సికింద్రాబాద్‌లోని మనోవికాస్ నగర్లో భారత ప్రభుత్వ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్(ఎన్ఐఈపీఐడీ).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 20 ► పోస్టుల వివరాలు: ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్(రెగ్యులర్)–04, ఎంఎస్‌ఈసీ, నోయిడా (రెగ్యులర్)–01, సీఆర్సీ, దావెనగర్(రెగ్యులర్)–02, సీఆర్సీ, నెల్లూరు(ఏపీ)–09, సీఆర్సీ, రాజ్‌నందగావ్(ఛత్తీస్‌గఢ్)–04. (ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్ బంపర్ ఆఫర్..!) ► ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్ (రెగ్యులర్): పోస్టులు: లెక్చరర్(రిహేబిలిటేషన్ సైకాలజీ, ఒకేషనల్ కౌన్సెలింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్), జూనియర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, స్టెనోగ్రాఫర్. ► ఎంఎస్‌ఈసీ, నోయిడా(రెగ్యులర్): ప్రిన్సిపల్. ► సీఆర్సీ, దావెనగర్(రెగ్యులర్): పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్(మెడికల్ పీఎంఆర్), ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్. ► సీఆర్సీ, నెల్లూరు(ఏపీ): పోస్టులు: డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొస్థెటస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, క్లినికల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేటర్, వర్క్‌షాప్ సూపర్వైజర్, క్లర్క్. ► సీఆర్సీ, రాజ్‌నందగావ్(చత్తీస్‌గఢ్): పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పెషల్ ఎడ్యుకేటర్/ఓరియంటేషన్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్, ప్రొస్థెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, రిహేబిలిటేషన్ ఆఫీసర్. అర్హత ► లెక్చరర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎంఫిల్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఏ, ఎంఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 45ఏళ్లు మించకూడదు. ► జూనియర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్: గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్/బీఈడీ/బీఆర్ఎస్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు. ► స్టెనోగ్రాఫర్: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18–28ఏళ్లు మించకూడదు. ► ప్రిన్సిపల్: మాస్టర్స్ డిగ్రీ, ఎంఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 45ఏళ్లు మించకూడదు. ► అసిస్టెంట్ ప్రొఫెసర్లు: ఎంబీబీఎస్, పీజీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 45ఏళ్లు మించకూడదు. ► ఓరియేంటేషన్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్: గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ► దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021 ► వెబ్సైట్: https://niepid.nic.in -
పిల్లలకు తిండి పెట్టలేని మాకు..ఆత్మహత్యే శరణ్యం!
సాక్షి, చైతన్యపురి: బకాయి జీతాలు చెల్లించాలని... తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చైతన్యపురిలోని శ్రీ చైతన్య కళాశాల పాకాల ప్లాజా బ్రాంచ్ లెక్చరర్ల ఆందోళన మూడో రోజుకు చేరుకుంది. సుమారు 45 మంది లెక్చరర్లు చేస్తున్న ధర్నాకు ప్రైవేట్ లెక్చరర్ల సంఘంతో పాటు పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కూడా తమకు లాక్డౌన్లో చెల్లించాల్సిన సగం జీతం చెల్లించకపోవటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సీనియారిటీ ఉండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లుగా చేయటంలో విద్యాబుద్ధులు నేరి్పన లెక్చరర్లను పక్కన పెట్టి ఫ్రెషర్స్‌ను తీసుకోవటం అన్యాయమని అన్నారు. జీతాలు లేక కుటుంబ సభ్యులను పస్తులుంచాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. లెక్చరర్ ఆత్మహత్యాయత్నం... శ్రీచైతన్య కళాశాల వద్ద నిరాహార దీక్షలో జువాలజీ లెక్చరర్ డాక్టర్ హరినాథ్ బలవన్మరణానికి యత్నించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తోటి అధ్యాపకులు అతడిని అడ్డుకున్నారు. 25 సంవత్సరాలు అధ్యాపకుడిగా సేవలు అందించిన తనకు జీతాలు చెల్లించడం లేదన్నారు. భార్య, పిల్లలకు ఒక్కపూట కడుపునిండా తిండిపెట్టలేని తనకు ఆత్మహత్యే శరణ్యమని హరినాథ్ విలపించాడు. వయసు కారణంగా చూపి కళాశాల డీన్ రవికాంత్ వేధింపులకు గురి చేసి తనను విధుల్లోకి తీసుకోలేదన్నారు. ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హరినాథ్‌ను స్టేషన్‌కు తరలించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో ప్రశాంత్, భగవంత్‌రెడ్డి, చందు, మహేష్, నిర్సింహ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: పేరాల శేఖర్‌రావు చైతన్యపురి: లెక్చరర్లను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు, వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. హరినాథ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్న వారు గురువారం చైతన్యపురి పీఎస్‌కు చేరుకుని ఇన్స్పెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు, లెక్చరర్ల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు కనీసం స్పందించకపోవటం సిగ్గు చేటన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
టీఆర్టీ కంటే ముందే టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెట్ నిర్వహించకుండా పోస్టులను భర్తీ చేస్తే అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహించడంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు 8వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. అయితే వాటిల్లోనూ మార్పులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ పాఠశాలల హేతుబద్దీకరణ చేపడితే పోస్టుల సంఖ్య 5వేలకు మించకపోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అలాగే అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే మాత్రం 12వేలకు పైగా పోస్టులు రావచ్చని వెల్లడించారు. చదవండి: (ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!) లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: డిగ్రీ లెక్చరర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘డిగ్రీ కాలేజీల్లో అర్ధరాత్రి బదిలీలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యా సంవత్సరం మధ్యలో, ప్రభుత్వ ఆమోదం లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బదిలీల వ్యవహారంపై మంగళవారం ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. మరోవైపు ఈ బదిలీల వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా స్పందించారు. బదిలీలు పొందిన లెక్చరర్లను రిలీవ్ చేయవద్దని సోమవారం ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటికే బదిలీ పొందిన లెక్చరర్లంతా కొత్త స్థానాల్లో చేరిపోయారు. దీంతో బదిలీ స్థానాల్లో చేరిన తర్వాత నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని మరికొంతమంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాల్లోకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. -
ఈ కాలేజ్‌లకు లెక్చరర్లే లేరు!
సాక్షి, ఆదిలాబాద్ : ప్రభుత్వ కళాశాలల్లో రెగ్యులర్ లెక్చరర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత కొన్నేళ్లుగా జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ కాకపోవడంతో కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతోనే నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో నాణ్యమైన బోధన లేక కొంతమేర విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ఏటా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరగకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని 13 ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 13 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారంటే ఇంటర్ విద్య పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. అంతేకాకుండా ఒక్కరు కూడా లైబ్రేరియన్, పీడీ లేరు. ఈ పోస్టుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. కనీసం కాంట్రాక్ట్ పద్ధతిన కూడా నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 13 మంది రెగ్యులర్, 138 మంది కాంట్రాక్ట్, 59 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. 2012 నుంచి జూనియర్ లెక్చరర్ల పోస్టులు భర్తీ కావడం లేదు. 2014లో ఇంటర్మీడియెట్ బోర్డులో పనిచేసే ఉద్యోగులకు పీజీ ఉన్నవారికి 10 శాతం కోట కింద పదోన్నతుల ద్వారా కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. దాదాపు ఏడేళ్లుగా జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ లేకపోవడంతో సర్కారు కళాశాలల్లో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్య అందడం లేదని తెలుస్తోంది. దీని ప్రభావం ఇంటర్ ఫలితాలపై పడుతోంది. అయితే జిల్లాలో ఆదిలాబాద్, బేలలో మరాఠీ బోధన, మిగతా కళాశాలల్లో తెలుగు మీడియం తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలల బాట పడుతున్నారు. గతేడాది ఆంగ్ల మాధ్య మం బోధించాలని ఇంటర్‌బోర్డు సూచించినా రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో తెలుగు మీడియంలోనే చదువులు సాగుతున్నాయి. కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతోనే చదువులు.. కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతో కొన్ని కళాశాలల్లో అంతంత మాత్రంగానే చదువులు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పరీక్షల సమయంలో కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షల్లో విద్యార్థులకు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే వేటు పడుతుందనే ఉద్దేశంతో దగ్గరుండి మరీ చీటీలు అందిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో 95 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తుండగా, ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం 30శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత రావడం లేదు. ఇంటర్లో అధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. డిగ్రీలో 25 నుంచి 30 శాతం కూడా ఫలితాలు రావడం లేదంటే ఇంటర్లో పరిస్థితి ఏందో అందరికీ తెలిసిందే. జాడలేని పీడీ, లైబ్రేరియన్ పోస్టులు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఒక్కరు కూడా ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్ లేరు. వ్యాయామ లెక్చరర్లు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవ్వడంతోపాటు శారీరక ధృడత్వాన్ని పొందలేకపోతున్నారు. విద్యాబోధన చేసేందుకు కనీసం కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నా పీడీలు మాత్రం లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అలాగే లైబ్రేరియన్ లేకపోవడంతో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. లైబ్రేరిలో ఉన్న పుస్తకాలు కూడా మూలన మూలుగుతున్నాయి. -
అధ్యాపకుల రాస్తారోకో.. అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, విజయవాడ : జీవో 35ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న అన్ ఎయిడెడ్ అధ్యాపకులు తమ ఆందోళనను ముమ్మరం చేశారు. జీవో 35 రద్దు చేయాలని, తమకు కనీసం వేతనం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని పాలిక్లీనిక్ రోడ్ సమీపంలో రహదారి బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ.. అధ్యాపకులతో వాగ్వాదానికి దిగారు. బలవంతంగా వారిని అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్‌కు తరలించారు. పార్ట్‌టైం అధ్యాపకుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం పార్ట్‌టైం పేరుతో పూర్తి సమయం పనిచేయించుకుంటూ తమ శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న అన్ ఎయిడెడ్ అధ్యాపకులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్మపోరాటం కార్యక్రమం రెండోరోజుకు చేరుకుంది. రెండోరోజు ధర్నాకు విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. -
పార్ట్‌టైం లెక్చరర్ల గౌరవ వేతనం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో పార్ట్ టైం లెక్చరర్లుగా, గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్న లెక్చరర్ల వేతనాలు రెట్టింపు కానున్నాయి. ఏడో వేతన కమిషన్ సిఫారసుల మేరకు ఇటీవల అధ్యాపకుల వేతనాలను పెంచిన ప్రభుత్వం, గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాలను కూడా పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి గౌరవ వేతనాన్ని పెంచుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లకు యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. తాజా పెంపు ప్రకారం గెస్ట్ ఫ్యాకల్టీకి ఒక్కో పీరియడ్‌కు (లెక్చర్) రూ.1,500 చెల్లించాలని, లేదా నెలకు రూ.50 వేల వరకు చెల్లించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని వర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం/గెస్ట్ ఫ్యాకల్టీకి నెట్/సెట్/పీహెచ్డీ ఉన్న వారికైతే ఒక పీరియడ్‌కు రూ.700, ఆ అర్హతలు లేనివారికి రూ.600 చొప్పున వర్సిటీలు చెల్లిస్తున్నాయి. తాజా పెంపుతో నిర్ధేశిత అర్హతలున్న ఫ్యాకల్టీకి ఇకపై ఒక్కో పీరియడ్‌కు రూ.1,500 వేతనం లభించనుంది. వర్సిటీల్లో ఖాళీల మేరకు గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి ఆమోదం తెలిపింది. రెగ్యులర్ పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకునే అర్హతలనే ఈ నియామకాల్లోనూ పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. వైస్ ఛాన్స్లర్ చైర్‌పర్సన్‌గా ఈ నియామకాలకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, డీన్, హెచ్‌వోడీ, సబ్జెక్టు నిపుణులతోపాటు ఎస్సీ/ఎస్టీ/ బీసీ/ మైనారిటీ/ వికలాంగుల కేటగిరీలకు చెందిన అకడమిషియన్ ఉండాలని వివరించింది. గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు గరిష్ట వయస్సు 70 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. -
గుట్టుగా గెస్ట్‌లెక్చరర్ల నియామకాలు
నెల్లిమర్ల: జిల్లావ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ఏడు గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు జూలై నెలలోనే ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం భవనాలు అందుబాటులో ఉన్న మూడు ప్రాంతాల్లో ఈ నెలలో పాఠశాలలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ పాఠశాలలకు సంబంధించిన గెస్ట్ టీచర్ల నియామకాలను మాత్రం అడ్డదారిలో చేపట్టారు. అధికార టీడీపీ నేతల ఒత్తిడితో ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే నియామకాలు చేపట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న సాలూరులో కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే టీచర్లను నియమించారు. సంబంధిత బీసీ సొసైటీ అధికారులు ఈ విషయంలో టీడీపీ నేతలకు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలేమైందంటే... విజయనగరం, కొత్తవలస, గంట్యాడ, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మండలం కారాడ, కురుపాం ప్రాంతాల్లో ఈ విద్యాసంవత్సరంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తవలస, గంట్యాడ, సాలూరు, పార్వతీపురంలో బాలికలు, విజయనగరం, కారాడ, కురుపాంలో బాలుర పాఠశాలలు ప్రారంభించాలని సంబంధిత అధికారులు ముందుకొచ్చారు. భవనాలు అందుబాటులో ఉన్న గంట్యాడ, కారాడ, సాలూరు ప్రాంతాల్లో ముందుగా ఈ నెలలోనే పాఠశాలలను ఏర్పాటుచేయాలని సన్నాహాలు చేశారు. ఈ పాఠశాలల్లో బోధనకు గెస్ట్ టీచర్లను నియమించేందుకు ప్రకటన ఇవ్వాలి. కానీ అదేమీ లేకుండానే సంబంధిత అధికారులు గెస్ట్ టీచర్ల నియామకాలు చేపట్టేశారు. అధికార టీడీపీ నేతలు చెప్పిన అభ్యర్థుల నుంచి బయోడేటాలు తీసుకుని, వారు సిఫారసు చేసినవారినే ఎంపిక చేశారన్న ఆరోపణలున్నాయి. వందిమంది దరఖాస్తు చేసుకున్నారు గెస్ట్ టీచర్ల కోసం మొత్తం వందమంది అభ్యర్థులు స్వతహాగానే దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారిలో 40మంది మాత్రమే ఇంటర్వూ్యలకు హాజరయ్యారని అంటున్నారు. మూడు పాఠశాలలకు సంబంధించి 20మందిని నియమించినట్లు తెలిపారు. అకడమిక్ గైడెన్స్ అధికారితో పాటు గురుకులాల జిల్లా కన్వీనరుతో పాటు ఒక సబ్జెక్ట్ నిపుణుడు కమిటీగా ఏర్పడి టీచర్లను ఎంపికచేసినట్లు చెబుతున్నారు. అయితే ఇదంతా అబద్ధమని, కేవలం టీడీపీ నేతలు చెప్పిన వారినే నియమించినట్లు భోగట్టా. పారదర్శకంగానే నియామకాలు జిల్లాలోని గంట్యాడ, కారాడ, సాలూరులో నెలకొల్పే బీసీ గురుకులాలకు సంబంధించిన గెస్ట్ టీచర్ల నియామకాలను పారదర్శకంగానే చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రకటన ఇవ్వలేదు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు. గంటకు రూ. 148లు చొప్పున నెలకు గరిష్టంగా రూ 14,800 గౌరవ వేతనంగా అందజేస్తాం. రెగ్యులర్ టీచర్లను నియమించగానే వీరిని తొలగిస్తాం.–సత్యారావు, జిల్లా గురుకులాల కన్వీనర్ -
ఆ..32మంది అవుట్
ఎంతోకాలంగా నానుతున్న మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమంగా నియామకమైన అధ్యాపకుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. విచారణ కమిటీల నివేదికలు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని పాలకమండలి సమావేశం నిర్ణయించింది. నిబంధనలను తుంగలోతొక్కి అధ్యాపకులను నియమించారని ‘సాక్షి’ పలు పరిశోధనాత్మక కథనాలను ప్రచురించింది. అటు నివేదికలు, ఇటు పత్రికల కథనాలను పరిగణనలోకి తీసుకుని అక్రమాలు వాస్తవమని తేలడంతో అధ్యాపకులకు ఉద్వాసన పలికింది. ఎంజీయూ (నల్లగొండ రూరల్) : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమంగా నియామకమైన ఆ.. 32 మంది అధ్యాపకులకు ఉద్వాసన పలికారు. ఈ మేరకు వారిని విధులనుంచి తొలగించాలని యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 26మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటీసులు ఇచ్చి తొలగించాలని సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. అభ్యర్థుల అర్హత పరిశీలించకుండా, రిజర్వేషన్ విధానం పాటించకుండా అధ్యాపకుల నియామకం చేపట్టారు. గత పాలక మండలిలలో ఆయా అధ్యాపకుల ప్రొబేషనరీ కాలాన్ని డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం.. పెద్దఎత్తున దుమారానికి తెరలేపింది. దీనిపై కొందరు అభ్యర్థులు సీఎంఓ, గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై విచారణ కమిటీ నియమించడంతోపాటు నిఘా వర్గాలనుంచి సమాచారం సేకరించారు. ఈ అక్రమ నియామకాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. అన్నింటి ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో యూనివర్సిటీ పాలకమండలి వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో ఆ.. 32 మంది అధ్యాపకులకు నోటీసులు ఇవ్వనున్నారు. అయితే ఈ అధ్యాపకుల నియామకాలపై మొదటినుంచీ వివాదాలే ఉన్నాయి. 2011లో నోటిఫికేషన్ ఎంజీ యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకానికి సంబంధించి రెగ్యులర్ ప్రాతిపదికన 2011లో నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. 2012 ఫిబ్రవరిలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 32 మందిని నియమించారు. అయితే ఇంటర్వ్యూలు నిర్వహించిన తీరు వివాదాస్పదమైంది. ఏ ఒక్క నిబంధన పాటించకుండా, యూజీసీ మార్గదర్శకాలను తుంగలో తొక్కి నియామకాలు చేపట్టారు. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్కొక్కరినుంచి రూ.లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరికి ఈ నియామకానికి సంబంధించి సదరు అధ్యాపకులకు చెల్లించిన వేతనాలను రికవరీ చేయాలని ఆడిట్ బృందం కూడా స్పష్టం చేసింది. పోస్టుల మంజూరులో మార్పు జీఓ ఎం.ఎస్ 11 ద్వారా ఒక కోర్సుకు మంజూరైన పోస్టును ఎలాంటి అనుమతీ లేకుండా మరో కోర్సుకు మార్చారు. 2008 వరకు ప్రారంభమైన కోర్సులకు మాత్రమే బోధన సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. కెమిస్ట్రీ కోర్సు 2009లో, 5 ఏళ్ల ఫార్మాస్యూటికల్ కోర్సు 2008లో వచ్చింది. కానీ కెమిస్ట్రీ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లను వారికి అనుగుణంగా మార్చుకున్నారు. అదే విధంగా ఎంబీఏ టీటీఎం, జనరల్ ఎంబీఏలకు కూడా అదే తరహాలో రోస్టర్ నిర్వహించారు. ఇంటర్వ్యూలంతా గందరగోళం కెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలకు 2012 ఫిబ్రవరి 4న ఒకేరోజు 289 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ రోజు వచ్చింది 174 మంది వచ్చారు. వచ్చిన వారిని అడిగింది అభ్యర్థి పేరు మాత్రమే. ఎటువంటి వివరాలను అడగకుండానే ఇంటర్వ్యూలు ముగించారు. ఈ విభాగంలో 174 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, 164 మంది వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఇక్కడ రెండు రికార్డులు మెయింటెన్ చేశారు. ఎంపికైన అభ్యర్థికి ఏపీఐ (అకడమిక్ ఫర్ఫామెన్స్ ఇండికేటర్) స్కోర్ 300 ఉండాలి. కానీ వీరు ఎంపిక చేసిన 32మందిలో ఏ ఒక్క అభ్యర్థికి 30 స్కోర్ మించలేదు. ఇంటర్వ్యూ వీడియో రికార్డు చేస్తామని రూ.85వేల బిల్లు పొందారు. 170 వరకు డీవీడీలు ఉన్నట్లు బిల్లు సృష్టించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆడిట్ బృందానికి ఏవీ చూపించకపోవడంతో అక్రమాలు జరిగాయని తేలిపోయింది. ఏమైందని అడిగితే నియామకాలకు సంబంధించిన ఫైల్ లేదని దాటవేస్తూ వచ్చారు. వెలుగులోకి ఇలా... యూనివర్సిటీలో అక్రమ నియామకాలు భారీగా జరిగాయని అప్పటి ఇన్చార్జ్ వీసీ శైలజారామయ్య.. ప్రిన్సిపాల్ సెక్రటరీకి లేఖ రాశారు. కీలకమైన నియామకాలకు సంబంధించిన ఫైల్ లేదని, 289 మంది అభ్యర్థులకు ఒకే రోజు ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించలేదని, ఇంటర్వ్యూలకు వచ్చినా రానట్లుగా రికార్డులు మెయింట్‌నెన్స్ చేశారని, దీనిపై విచారణకు కమిటీ నియమించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం 2016 అక్టోబర్ 20న ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ వీసీ సులేమాన్ సిద్ధిక్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు, రాంప్రసాద్‌లో కూడిన త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ విచారణ జరిపి 2017లో నివేదిక ఇచ్చింది. అందులో అక్రమాలు జరిగాయని స్పష్టంగా పేర్కొంది. అదే విధంగా ఇటీవల గవర్నర్ నరసింమన్ యూనివర్సిటీ వీసీలతో సమావేశాలు నిర్వహించి కమిటీ నివేదికపై చర్చించారు. అక్రమాలపై ఫిర్యాదు సీఎంఓలో కూడా ఉండడంతో సర్కార్ సీరియస్‌గా పరిగణించింది. అప్పటికప్పుడు ఆమోదం... ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ఎంజీ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం జరిగింది. అధ్యాపకుల నియామక అంశం ఎజెం డాలో కూడా లేదు. దీనిపై స్పందించిన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య అప్పటికప్పుడు టేబుల్ ఎజెండాగా తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన వారిని వెంటనే తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంతోకాలంగా నానుతున్న ఈ అంశాన్ని కాలయాపన చేసేందుకే ఎజెండాలో పెట్టలేదని తెలిసింది. అయితే యూనివర్సిటీకి పాలకమండలి సమావేశమే సుప్రీం. ఇక్కడ చేసిన నిర్ణయాలే అమలులోకి వస్తాయి. యూనివర్సిటీలో ఎలాంటి నియామకాలు చేపట్టాలన్నా, తొలగించాలన్నా, అభివృద్ధి పనులు, కొత్త కోర్సులు, చివరికి గుండుపిన్ను కొనాలన్నా ఈసీ మీటింగ్ ఆమోదం పొందాల్సిందే. దీంతో అధ్యాపకుల తొలగింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆ..32మంది ఇంటిబాట పట్టాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఏం జరుగుతోంది?
-
చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారు
-
హైస్సా.. హైలెస్సా
పామరుడు తన శక్తికి మించిన కార్యం చేస్తున్నప్పుడు దేవుణ్ని ఇలాగే తలచుకుంటాడేమో! ఆ పామరుడికి తను దేవుణ్ణి తలచుకుంటున్నానన్న విషయం కూడా తెలియకపోవచ్చు. హైస్సా.. హైలెస్సా.. అనే ఈ ఐదు అక్షరాలే.. అతడి పంచాక్షరీ మంత్రమేమో! గరికపాటి ఈ సూక్ష్మాన్ని వివరిస్తూ.. ‘పనే దైవం.. శ్రమే దైవ పూజ’ అని వ్యాఖ్యానించారు. శాస్త్రాలు కనపడతాయి. దేవుడు కనపడడు కదా! శాస్త్రాలు దేవుడిని ఏ విధంగా చూపించాయి? వేదంలో దైవాన్ని ‘తత్’ అన్నారు. తత్ అంటే ‘అది’ అంటే వ్యాకరణంలో సర్వనామం. ఈ పదాన్ని వస్తువులకు, మనుషులకు అన్నింటికీ ఉపయోగిస్తాం. ‘అది’ ఒక శక్తి. దానికి తలో రకమైన భావన ఇచ్చుకున్నారు. చూసేవాళ్లు ఎంత మంది ఉంటే ‘అది’ అన్ని విధాలుగా కనపడు తుంది. వైదిక ధర్మంలో దైవానికి రూపకల్పన చేయలేదు. తర్వాత్తర్వాత ఓ రూపం తీసుకున్నారు. దైవాన్ని అంతర్ముఖంగా దర్శించాలే తప్ప బయటకు కనిపించేది కాదు. అంతర్ముఖులు అవడం అందరికీ సాధ్యమయ్యేదేనా? దైవాన్ని ఎలా దర్శించాలి? సాధన చేస్తే ఏదైనా సాధ్యమే! కరెంట్ వైర్లలో విద్యుచ్ఛక్తి ఉంటుంది. కానీ, బయటకు కనిపిం చదు. బల్బు ద్వారా మనకు కరెంట్ ఉన్నట్టు తెలుస్తుంటుంది. అలాగే దేవుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. మనకు కనిపించడు. మంత్రం, బీజాక్షరంతో ఆలయంలో ప్రతిష్టించారు కాబట్టి అక్కడ దైవశక్తి వ్యక్తం అవుతుంది. దేవుడికి రూపం ఇవ్వకపోతే అర్చన, ఆరాధనలకు అనుకూలంగా ఉండవు కాబట్టి ఎవరి మనోభావాలను బట్టి వారు దైవాన్ని ప్రతిష్టించి, పూజించుకుంటున్నారు. ఈ తరహా ఆలోచనకు ముందు మీరు ఏ దైవాన్ని నమ్మేవారు? మా నాన్నగారు కనకదుర్గా ఉపాసకులు. ఆయన ఎప్పుడూ దైవం అనేవారు కాదు. ఏదైనా సమస్య వస్తే ‘అన్నీ అమ్మ చూసుకుంటుంది లేరా’ అనేవారు. మా కుటుంబసభ్యుల్లో అమ్మవారినీ ఒకరుగా భావించేవాళ్లం. అమ్మవారు శక్తి స్వరూపిణి. మనల్ని నడిపిస్తున్నది శక్తిగానే చెబుతాం. అందుకే ఆ శక్తిని అమ్మవారుగా భావించుకుంటాను. నా పద్యాల్లో ఎక్కువ భాగం అమ్మవారు, శివుడి మీదే ఉంటాయి. వెయ్యిమంది పండితులతో అవధానం చేశారు. మీకు అంతటి శక్తి ఎలా వచ్చింది? ఇది కూడా లోపల ఉండే శక్తే. ప్రతి వ్యక్తిలోనూ శక్తి ఉంటుంది. సాహిత్యపరంగా ఉన్న ఆసక్తితో గ్రంథాలు చదవడం, దానిని వినియోగించుకోవడం వల్ల నాకీ «శక్తి వచ్చింది. చిన్ననాటి నుంచే తెలుగంటే అమితాసక్తి. పై తరగతులకు వెళ్లడానికి ముందే వేసవి సెలవుల్లో తెలుగు ఉపవాచకాన్ని కంఠతా చేసేవాడిని. అలా డిగ్రీకి వచ్చేసరికి నాలుగైదు వందల పద్యాలు కంఠస్తం చేశాను. ఫలానావాళ్లు వృద్ధిలోకి వచ్చారంటే వారెంచుకున్న రంగంలో సాధన చేశారన్నది ముఖ్యం. దానికి సమాధానం చెప్పలేనివారు అదృష్టమనో, పూర్వజన్మ సుకృతమనో అంటారు. శాస్త్రాన్ని ఉన్నదున్నట్టు చెప్పాలి కదా! మీరు లౌక్యంగా చెబుతారంటారు నిజమేనా? ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఒకడు బల్లిశాస్త్రం అంటాడు, మరొకడు పుట్టుమచ్చల శాస్త్రం అంటాడు. ఇదంతా మిడిమిడి జ్ఞానం. మహానుభావులు తమ పబ్బం గడుపుకోవడానికి ఎన్నో శాస్త్రాలు పుట్టించారు. అవాస్తవాలను పెంచడం ఈ కాలంలో ఎక్కువైపోయింది. ఈ కాలానికి తగ్గట్టు వాస్తవాలను చెప్పగలగాలి. ఇలా మాట్లాడితే సంప్రదాయవాదులు వ్యతిరేకించరా? బోలెడుసార్లు సవాల్ చేశాను. వివేకానందుడు చెప్పినట్టు సత్యానికి సమాజం తలవంచాల్సిందే! కాదనేవాడిని రమ్మనమనండి. దేవుడు ఎందుకు సంకల్పిస్తాడు? ఎక్కడికో వెళ్లాలనుకుని ప్రయాణం పెట్టుకు న్నాను. కాలుజారి దెబ్బ తగిలి ప్రయాణం వాయిదా పడింది. మన ప్రయాణం వాయిదా వేయడానికి దేవుడికేం అవసరం? ఏ పూజ చేసినా ఆ స్థితి ఆ స్థితియే! నాకున్న ఆధ్మాతికానందం ఇప్పుడు ఎలా ఉందంటే.. భాగవతం చదవడానికి, బట్టలు మడతెట్టుకోవడానికి పెద్దగా తేడా తెలియడం లేదు. ఆ బట్ట కూడా నాకు భగవత్స్వరూపమే! ఆధ్యాత్మిక వేత్త ఆ స్థితికి చేరుకోవాలి. మరి ఈ పూజలన్నీ ఎందుకు? పూజల పేరుతో ఇంత ఖర్చు దేనికి? పూజలు మానకూడదు. పూజ చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. పూజల ఉద్దేశ్యం దృష్టిని దైవం మీద పెట్టడమే. అలాగే, ఈ పూజలన్నింటిలోనూ ఎక్కువగా దానాలుంటాయి. దానం వల్ల పాపం నశిస్తుంది. కానీ, చాలామంది పూజలు అనగానే అర్థాలు తెలియకపోయినా స్తోత్రాలు చదివేస్తూ ఉంటారు. పండితులు వాటికి అర్థాలు చెప్పరు. వీరు తెలుసుకోరు. వందసార్లు విష్ణుసహస్రనామం చదివినా వీళ్లు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. అదే ఒక్కనామానికి అర్థం తెలుసుకుని ఆలోచిస్తే గొప్ప మార్పు వస్తుంది. గుణం తల్లిదండ్రులు ఇచ్చారంటారు. తెలివి దేవుడు ఇచ్చినదేనా? ఇది దైవ సంకల్పమా? దేవుడు నాకు మాత్రమే ధారణ ఇవ్వాలని ఎందుకనుకుంటాడు. నామీదే ఆయనకు ప్రత్యేకమైన ఇష్టం ఏంటి? దైవ సంకల్పం అని ఎందుకంటారు. అలా అనుకుంటే దేవుడు పక్షపాతి కాదా! అలాంటివాడు దేవుడు ఎలా అవుతాడు. అనేకానేక మాయ మాటల్లో ఇదొకటి. కృషి వల్ల వచ్చిందని చెప్పరు. ఇప్పుటిదాకా 11వేల పద్యాలు రాశాను. రోజూ అరగంట పాటు ఆ పద్యాలన్నీ మళ్లీ ఎన్ని వీలైతే అన్ని చదువుకుంటాను. దానికి చేయాల్సిన రాక్షస పరిశ్రమ చేయాలి. అందుకే నన్ను ధారణాబ్రహ్మరాక్షసుడు అన్నారు. దైవసంకల్పం అని ఈ ప్రచారం కూడా మాలాంటి వాళ్లే చేస్తారు. ఇది దైవశక్తి అంటే మాకు గౌరవాలు, పాదాభివందనాలు, దక్షిణలు పెరుగుతాయిగా! మీరు నమ్మే దైవం మీకు మంచి చేసిందని ఎప్పుడు నమ్మారు..? ఎప్పుడూ నమ్ముతాను. అయితే, నా ప్రయత్నం వల్ల కూడా జరగనిది దైవప్రేరణతో జరిగిన ఘటనలు మూడు నాలుగు ఉన్నాయి. సమస్య చేయి దాటినప్పుడు అమ్మవారి ఫొటో ముందుకు వెళ్లి బొమ్మా బొరుసు వేస్తాను. బొమ్మ పడితే ప్రయత్నం విడవను అని. ఇది చిన్నపిల్లవాడి మనస్తత్వంగా భావించవచ్చు. కానీ, దాని వెనకాల ఉన్న విశ్వాసం పెద్దది. హైదరాబాద్‌లో ఇల్లు కొనడం కోసం కాకినాడలో స్థలం అమ్మి బిల్డర్‌కి డబ్బు ఇచ్చాను. ఏడాది చూశాను. ఇల్లు అవడం లేదు, డబ్బులు రావడం లేదు. విసుగొచ్చింది. మరో దారి కన్పించలేదు. అమ్మవారి ముందుకెళ్లి ‘భిక్షాటన చేసైనా ఐదు కోట్లు తెచ్చిస్తా గరికపాటికి నా పాదాలు రాసిచ్చాను అని రిజిస్టర్ చేసి అందరికీ చెప్పు. లేదంటే నేను సంపాదించినదాంట్లో దోషం చూపించు. నా కష్టార్జితం పోతే నేను రేపు నీ గురించి పదిమందికి ఏం చెప్పను’ అన్నాను. ప్రయత్నం చేయమన్నట్టుగా బొమ్మపడింది. ఎలా ప్రయత్నం చేయాలో అర్థం కాలేదు. కానీ, పరిస్థితులు కలిసి వచ్చాయి. వారం రోజుల్లో నా డబ్బు చేతికొచ్చింది. కష్టం వస్తే ‘అమ్మా, కొత్త కష్టాలు వస్తే నే కొత్త పద్యాలు చెబుతానని నీ ఆశా! జీవితాంతం పద్యాలు చెబుతా గానీ, కష్టపెట్టకమ్మా!’ అని చెబుతుంటాను. మొన్నీ మధ్య ఇంట్లో ఎవరూ లేరు. నేను అమ్మవారి దగ్గర కూర్చుని ‘నువ్వు, నేను తప్ప అవనీతలమున ఎవ్వరూ లేరు. నీవు ఒకసారి కనపడితే ఎవరికీ చెప్పను తల్లీ.. అని పద్యరూపకంగా చెప్పాను. ఇది మధురభక్తి. అదో అనుభవం. ఇంతటి మధుర భక్తిని అనుభూతించే మీరు దైవం గురించి విమర్శనా వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు? దైవం గురించి కాదు మూఢభక్తి గురించి. శివుడి గుళ్లో వందల లీటర్ల పాలతో అభిషేకం చేస్తున్నారు. ఎందుకు? నీళ్లతోనే అభిషేకం చేయాలి. అభిషేకాల పేరుతో చాలా శివాలయాలు ఇప్పటికే మూత పడ్డాయి. దేవుడికి ఇవి కాస్టీ›్ల, ఇవి చీప్ అని ఉండదు. అభిషేకానికి నీళ్లే వాడాలి. ధారాపాత్ర గుండా నీళ్లు లింగం మీదుగా పడుతుండాలి. ద్రాక్షారామంలో అలా అభిషేకం జరుగుతుండగా ఉద్వేగానికి లోౖ¯ð ఆశువుగా ‘ధారాపాత్ర నుండి నీరు జారునయట్లు క్షణ క్షణం బతుకు జారిపోవు... అని పద్యం చెప్పాను. వేంకటేశ్వరస్వామికి గడ్డం మీద గాయం వల్ల అయిన మచ్చ ఉంటుంది. ఇప్పటికీ దాని మీద వెన్న రాస్తారు. అంత శక్తి గల స్వామి తన గాయాన్ని ఎందుకు మాన్పుకోలేకపోయాడు. అని ఆలోచన ఎవరూ చేయరు. ఇప్పటికీ మొట్టమొదట గా ఓటికుండలో పెట్టిన అన్నమే స్వామికి నైవేద్యం. ఎందుకు? ఇవేవీ ఆలోచించరు. దేవుడికి కులం, మతం పట్టింపుల్లేవు. అది ఎందుకు గ్రహించరు. ఏది అజ్ఞానం అనిపిస్తే దాన్ని విమర్శిస్తాను. ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయేమో కదా! ఈ రోజుల్లో తొమ్మిదో తరగతి కుర్రాడికీ మనోభావాలు ఉంటున్నాయి. అందుకే వాడికి తోచింది ఫేస్బుక్లో పెట్టేస్తుంటాడు. ఆవుని పూజించమంటారు. ఆవును పూజించేవాళ్లే దూడ పాలు తాగుతుంటే దాన్ని చితగ్గొట్టి పాలు పితుక్కుంటున్నాడు ఇది జీవహింస కాదా! పుణ్యమని గోవు చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. గోవులను వ్యాపారం చేసేవారి గురించి మాట్లాడరెందుకు. ఇలాంటివాటికి మొదట్నుంచీ వ్యతిరేకిని. తప్పుడు భావం అయితే అది ఎలాంటిదైనా ఖండిస్తాను.‘సకలభూత హితాన్ని కోరి చెప్పే మాటలు దైవం మెచ్చును..’ నే చెప్పింది తప్పనిపిస్తే వాస్తవం చెప్పండి. వింటాను. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకున్న సందర్భం? 1978 నుంచి దాదాపు పదేళ్లు చాలా స్ట్రగుల్ పడ్డాను. రోజులు గడవక కాదు. ‘ఏంటీ దేవుడు..’ అని ఆలోచన. వాస్తవా లను గ్రహించడానికి వందల పుస్తకాలు చదివాను. ఉదాహరణకు కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం పుణ్యం అన్నారు. వాస్తవం– ఇంద్రియ నిగ్రహానికి చన్నీటి స్నానం. ఉపవాసం – నవంబర్ మాసానికి పల్లెల్లో గాదెలు ఖాళీ అయ్యేవి. అప్పట్లో ఇంట్లో పది మందికి పైగా ఉండేవారు. చలి వల్ల ఎలాగూ జీర్ణశక్తి మందగిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉపవాసం అన్నారు. మన మనస్సు దేవుడి సన్నిధిలో ఉండాలి. అంతేగానీ, అన్నం మానేస్తే దేవుడు కరుణించడు. పూజలు చిత్తశుద్ధితో చేస్తే ఒకనాటికి మనలో మార్పు వస్తుంది. ఇలా పదేళ్ల పాటు సందిగ్ధావస్థలోనే ఉన్నాను. తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగం మానేసి అవధానాల్లో పాల్గొన్నాను. అవధానంలో ముందు దైవప్రార్థన చేయాలి. నేను నమ్మంది చెప్పను. ఎలా అని ఆలోచించి అమ్మమీద పద్యం చెప్పాను. ఆ పద్యం చెబుతుంటే నా కళ్లు తడిసిపోతున్నాయి, గుండె తడిసిపోతోంది. ఈ స్పందన, భావాలు ఎక్కడనుంచి వస్తున్నాయి? ఈ ఆలోచనలు దైవం వైపుగా నడిపిం చాయి. ఆనందం మనలోనే ఉందని అప్పుడే అర్థమైంది. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
బాబ్బాబు.. మా జాబు!
కాంట్రాక్టు అధ్యాపకుల విషయంలో వెనక్కు తగ్గని ప్రభుత్వం ఆందోళన బాటలో కాంట్రాక్టు అధ్యాపకులు రోడ్డున పడనున్న 300 మంది లెక్చరర్లు ఈనెల 21న చలో గుంటూరుకు పిలుపు నిడదవోలు: బాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే కొత్తజాబుల మాట ఎలా ఉన్నా ఉన్న జాబులు ఊడిపోతున్నాయి. చాలీచాలని జీతాలతో 17 ఏళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏకీకృత సర్వీసు పేరిట వీరిని తొలగించేందుకు సర్కారు కుట్ర పన్నడంతో జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు అందోళన చెందులున్నారు. ఈనెల 21న ’చలో గుంటూరు’ పేరుతో ఉన్నత విద్యా శాఖ కమిషనరేట్ ముట్టడి కార్యాక్రమానికి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఇప్పటికే పిలుపు నిచ్చింది. జీఓ నంబర్ 223 అమలు చేయాలని డిమాండ్ 223 జీఓ ప్రకారం ఏకీకృత సర్వీసుల నుంచి జూనియర్ అధ్యాపకులను మినహాయించి మిగిలిన డైట్ కళాశాలల అధ్యాపకులు, డీవైఈఓ, ఎంఈఓ పొస్టులను భర్తీ చేసుకోవాలని కోరుతున్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్లుకోవాలని జూనియర్ అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జీఓ నం.3 కూడా కనీస వేతనం ఇవ్వాలని చెబుతోంది. దీనిపై కాంట్రాక్టు అధ్యాపకులు 2016 డిసెంబర్ నుంచి 33 రోజుల పాటు సమ్మె చేశారు. దీనిపై స్పందించిన విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రస్తుతం నెలకు రూ.37 వేల కనీస వేతనాన్ని ఇస్తోంది. అయితే ఇక్కడ మాత్రం కేవలం రూ.18 వేలు మాత్రమే ఇస్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో 300 మంది అధ్యాపకులు ఏకీకృత పర్వీసుల పేరుతో కాంట్రాక్టు అధ్యాపకులను తొలగిస్తే జిల్లాలో 300 మంది అధ్యాపకులు రోడ్డున పడనున్నారు. వీరిలో 32 ప్రభుత్వ జూనియర్ కలాశాలల్లో 240 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 60 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తీసేని తమను నడిరోడ్డు మీద నిలబెట్టేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపిస్తున్నారు. 2000లో నియామకం.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యా బోధన చేసేందుకు 2000 సంవత్సరంలో అప్పటి టీడీడీ ప్రభుత్వం వీరిని నియమించింది. మొదట్లో కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రారంభంలో ఏడు నెలలకు ఒక్కసారి జీతాలు ఇచ్చేవారు. అప్పట్లో నెలకు 4,500 ఇచ్చేవారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంట్రాక్టు అధ్యాపకుల వేతనం నెలకు 7,500 రూపాయలకు పెంచుతూ జీఓ జారీ చేశారు. 2010 నవంబర్‌లో విద్యార్థి, ప్రజాసంఘాల మద్దతుతో చేపట్టిన ఉద్యమంతో వేతనాన్ని రూ.18 వేలకు పెంచేలా చేయడంలో విజయం సాధించారు. తగిన గుణపాఠం చెబుతాం గోపే శ్యాంకుమార్, జిల్లా కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ అధ్యక్షుడు కాంట్రాక్టు అధ్యాపకులను తొలగిస్తే రాబోయో ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతాం. అధ్యాపక వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న మా ఉద్యోగాలు తీసేస్తే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న మాకు ప్రస్తుతం కుటుంబ పోషణే కష్టంగా ఉంటోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. -
కష్టాలు + కన్నీళ్లు = కాంట్రాక్ట్ లెక్చరర్లు
విద్యా సంవత్సరం ప్రారంభమైనా రెన్యువల్ కాని పోస్టులు రెండు నెలలైనా విడుదల కాని వేతనాలు రాయవరం(మండపేట) : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు అయోమయంలో పడ్డారు. కళాశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఉన్నత విద్యామండలి నుంచి ఇప్పటి వరకు కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడంతో పాటు జీతాలు విడుదల కాలేదు. దీంతో అధ్యాపకులు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 573 మంది.. జిల్లాలో మొత్తం 543 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరిలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 351 మంది, 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 152 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 70 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 17 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో.. 17ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రై మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. సబ్ కమిటీ వేసి నెల రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామన్నారని.. అయినా సమస్య ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని వారు వాపోతున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించే వరకైనా జీవో 03 ప్రకారం పదో తేదీన సవరణ సంఘం సిఫారసుల మేరకు జీతాలు పెంచాలని కోరుతున్నారు. 2000లో నియామకం.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యాబోధన చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించింది. ప్రారంభంలో వీరికి నెలకు రూ.4,500 ఇచ్చేవారు. అదీ ఏడు నెలలకు ఒక్కసారి జీతాలు ఇచ్చేవారు. 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నెల జీతం రూ.8,500కు పెంచారు. 2010లో అనేక ఆందోళనల అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వీరి జీతం నెలకు రూ.18వేలకు పెంచింది. ప్రసూతి సెలవులు ఇవ్వాలి.. మహిళా కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రసూతి సెలవులు ఇవ్వాలి. 17 ఏళ్లుగా పనిచేస్తున్నా ఇప్పటికీ సర్వీసులు రెగ్యులర్ చేయకపోవడం విచారకరం. అధ్యాపక వృత్తినే నమ్ముకుని పనిచేస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలి. – కె.వినుతకుమారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కిర్లంపూడి వేతనాలు పెంచాలి.. పదో పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలి. 2000లో ఉద్యోగంలో చేరాం. ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తారనే ఆశతో జీవిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – గుమ్మడి వెంకటరమణ, కాంట్రాక్ట్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోకవరం ఉద్యమం చేపడతాం.. కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలి. పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలుపుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలి. – డాక్టర్ వాలుపు కనకరాజు, 475 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు, రాజానగరం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయకుండా కాంట్రాక్టు అధ్యాపకుల శ్రమను దోచుకుంటున్నారు. కమిటీలతో కాలయాపన చేయకుండా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి. – ఎం.శ్రీనివాసరావు, కాంట్రాక్టు అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయవరం -
ఏటా అదే తంతు..
వేసవిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉచిత సేవలు జిల్లాలో 348 మందికి తప్పని అవస్థలు నెరవేరని ప్రభుత్వ హామీ కాంట్రాక్టు అధ్యాపకులు.. విద్యా సంవత్సరం చివరి పనిదినం రోజున వారిని విధుల నుంచి తొలగిస్తారు. అలాగని వేసవి సెలవుల్లో వారిని ఖాళీగా కూర్చోనివ్వరు. ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. సెలవుల్లో వీరితో పనులు చేయించుకున్నారే తప్ప వారికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెబుతున్న ప్రభుత్వం.. వీరి విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తోంది. ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ఇదీ. రాయవరం (మండపేట) : జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 348 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తి కాగానే ఈ ఏడాది మార్చి 28 నుంచి వారిని విధుల నుంచి తొలగించారు. తిరిగి జూన్‌లో రెన్యువల్ చేస్తామంటూ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల నుంచి తొలగించినప్పటికీ పనుల నుంచి మాత్రం తొలగించలేదు. ఏప్రిల్ 7వ తేదీ వరకు వారు ఇంటర్మీడియేట్ మూల్యాంకన విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత విద్యార్థులను కళాశాలల్లో చేర్పించేందుకు క్యాంపైన్లలో నిమగ్నమయ్యారు. కళాశాలలో తగిన విద్యార్థుల సంఖ్య లేకుంటే పోస్టులు ఉండవన్న బెదిరింపుల నేపథ్యంలో, విద్యార్థులను చేర్పించేందుకు వారు కళాశాలల పరిధిలోని గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను జూన్ 15 నుంచి నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలకు వీరే సిద్ధం చేయాలి. ఉత్తీర్ణతా శాతం పెంపుదలకు, సప్లమెంటరీ పరీక్షలకు ఇన్విజిలేటర్ విధులు కూడా వారే నిర్వర్తించాలి. విధుల నుంచి తొలగించిన తర్వాత రెండు నెలలుగా ఇన్ని పనులు చేయించుకుంటున్నారు. ఈ పనులు చేసినందుకు వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. హామీలేమయ్యాయి? కనీస వేతనాలు చెల్లించాలంటూ గతేడాది డిసెంబర్ రెండు నుంచి జనవరి 4వ తేదీ వరకు 32 రోజుల పాటు కాంట్రాక్టు అధ్యాకులు ధర్నాలు, దీక్షలు చేపట్టారు. బెదిరింపులకు దిగినా దీక్షలు విరమించకపోవడంతో చేసేదీమీ లేక కనీస వేతనం, డీఏ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా ఆ హామీ నెరవేర్చలేదు. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించినా.. జీఓ మాత్రం విడుదల కాలేదు. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. తెలంగాణలో కాంట్రాక్టు అధ్యాపకులకు కనీస వేతనం అమలు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేయడంతో ఆ రాష్ట్ర అధ్యాపకులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఇప్పటికే ఒకసారి రూ.18 వేల నుంచి రూ.26 వేలకు వేతనాలను పెంచారు. తిరిగి కనీస వేతనం రూ.37,100 చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మన రాష్ట్రంలో మాత్రం అటువంటి చర్యలు లేకపోవడంతో ఇక్కడి కాంట్రాక్టు అధ్యాపకుల్లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మోసగిస్తోందని కాంట్రాక్టు అధ్యాపకులు మండిపడుతున్నారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నాం.. కాంట్రాక్టు అధ్యాపకులుగా 17 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనానికి నోచుకోలేక పోతున్నాం. ఉద్యోగ భద్రత లేదు. అరకొర వేతనాలతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చెబుతున్న ప్రభుత్వం మా విషయంలో అమలు చేయకపోవడం దారుణం. – పందిరి సాంబశివమూర్తి, 475 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండపేట జీఓ విడుదల చేయాలి.. వేతనాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం జనవరిలో ఇచ్చిన హామీ మేరకు జీఓ విడుదల చేయాలి. పక్క రాష్ట్రంలో జీతాలు పెంచుతున్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సెలవుల్లో విధుల్లో ఉన్నప్పటికీ రెండు నెలలుగా వేతనాలు లేక కాంట్రాక్టు అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. – యార్లగడ్డ రాజాచౌదరి, 461 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, కాకినాడ -
డిగ్రీ స్పాట్ బహిష్కరణ
కర్నూలు (ఆర్యూ): తమ సమస్యలను పరిష్కరించేవరకు స్పాట్ బహిష్కరణ కొనసాగుతుందని డిగ్రీ లెక్చరర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం డిగ్రీ స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూల్యాంకన రెమ్యునరేషన్ కనీస 25 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అమృతకుమార్, బాలస్వామి, వీరేష్, గోపాల్, భాస్కర్,నాగేంద్ర, లలిత, శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
ఆసక్తిగా వ్యవసాయ అధ్యాపకుల క్రీడా పోటీలు
నేటితో ముగింపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, శాస్త్రవేత్తలకు రాజమహేంద్రవరంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండో రోజు శనివారం పలు పోటీలు నిర్వహించారు. ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కొన్ని క్రీడలు పూర్తవగా, మరికొన్ని సెమీఫైనల్, ఫైనల్ దశకు చేరుకున్నాయి. ఆదివారంతో ఈ పోటీలు ముగుస్తాయని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ పి.జయరామిరెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయం అధికారులు విజేతలకు బహుమతులు అందజేస్తారన్నారు. విజేతలు వీరే... షాట్‌ఫుట్ పురుçషుల విభాగంలో డాక్టర్ జి.రఘనాథరెడ్డి (కృష్ణాజోన్), ప్రథమ స్థానం, శ్రీనివాసరాజు (గోదావరి జోన్) ద్వితీయ స్థానం, డాక్టర్ శ్రీనివాసరావు (కృష్ణాజోన్) తృతీయ స్థానం సాధించారు. బ్రిస్క్ వాకింగ్ పురుషుల విభాగంలో వి.శ్రీనివాసరావు (కృష్ణాజోన్), డాక్టర్ డి.చిన్నంనాయుడు (ఉత్తరకోస్తా జోన్), డాక్టర్ ఎస్.దయాకర్ (గోదావరి జోన్) వరుస స్థానాలు సాధించారు. మహిళల విభాగంలో డాక్టర్ వి.విశాలాక్షి, డాక్టర్ సునీత, ఎం.రాజశ్రీ విజేతలుగా నిలిచారు. షటిల్ బ్యాడ్మింటర మహిళల విభాగంలో డాక్టర్ హైమజ్యోతి, డాక్టర్ అనూష, చెస్‌లో డాక్టర్ రాజశ్రీ, డాక్టర్ పి.జమున గెలుపొందారు. టెన్నికాయిట్‌లో కామాక్షి, మాధురి ప్రథమ స్థానం, సునీత, స్పందన ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు.