Lok Satta Party
-
ఇదెక్కడి మేధావితనం?
గతంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో, ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి!’ అనే నినాదం గోడల మీద విస్తృతంగా దర్శనం ఇచ్చేది. ఆ నినాదం నిజమైందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రపంచంలో ఉన్న ఒక వర్గం ‘మేధావులంతా ఏకం కండి!’ అనే నినాదాన్ని అంది పుచ్చుకొని వాళ్లంతా ఏకమవుతూ తమ సర్వశక్తుల్నీ ఒడ్డుతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అలియాస్ జేపీ హైదరాబాదు నుంచి విజయవాడ విచ్చేసి, ప్రెస్‌మీట్ పెట్టి తన మద్దతు ఎన్డీయే కూటమికే అంటూ దానికి బహు నిర్వచనాలు ప్రవ చించారు. అంతటితో ఆగకుండా ‘గాంధీ మహాత్ముడు, అంబేడ్కర్లకు కులం అంటగడతామా?’ అంటూ పరోక్షంగా తను కూడా అంతటి మహాత్ము డినే అని ప్రకటించుకున్నారు. అక్కడే చంద్రబాబుతో అంటకాగడంలో అపరాధ భావం ప్రస్ఫుట మవుతోంది. ఇంకా త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి పంతులు పేర్లు కూడా ఉటంకించారు. అసలు ఆయన మాట్లాడేదానికీ, ప్రస్తుత రాజకీయాలకూ; నాటి సంఘ సంస్కర్తలూ, భాషా వేత్తలైన త్రిపురనేని, గిడుగులకు సంబంధం ఏంటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఈ జేపీ లోక్‌సత్తా పార్టీని ఎప్పుడో చుట్ట చుట్టే శారు. లోక్ సత్తా ఇకపై రాజకీయ పార్టీ కాదని ప్రకటించేశారు కూడా! అయితే, చంద్రబాబు కోసం అర్జెంటుగా మళ్లీ పార్టీని వెలుగులోకి తెచ్చారు కాబోలు! నిజానికి ఈ పార్టీ పుట్టుక పరిశీలిస్తే, ఒక దశలో చంద్రబాబు నాయుడుతో రామోజీరావుకి తేడాలు వచ్చి, ‘‘నేను కింగ్ మేకర్ని. ఎన్టీఆర్ నుంచి పీఠాన్ని అప్పజెప్పింది నేను. అటువంటిది నాకే ‘మింగుడు పడకపోతే’ ఎలా? మీలాంటి వాడిని జాతీయ స్థాయిలో మరొకడిని తయారుచేస్తా!’’ అని ఈ జేపీని తెర మీదకు లోక్‌సత్తా పేరుతో తీసుకురావ డంలో రామోజీరావు కీలక పాత్ర వహించారని అంటారు పరిశీలకులు. అందుకే కాబోలు! అప్పట్లో ‘ఈనాడు’లో జేపీ వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చేవి. ఆ పబ్లిసిటీ ప్రభావంతో విద్యావంతులు చాలా మంది లోక్‌సత్తా పట్ల ఆకర్షితులయ్యారు. అయితే జేపీ ‘హై వోల్టేజ్ యారగెన్సీ’కి షాక్ అయి స్వల్పకాలంలోనే జారుకున్నారు. జేపీని ఒకసారి గెలిపించిన హైదరాబాద్ కుకట్పల్లి ప్రజలు కూడా అతడి మేధా అహంకారానికి బెదిరిపోయారు. కాగా, మల్కాజ్‌గిరిలో మైండ్ బ్లాక్ అయ్యే జవాబు ఇచ్చారు జనం. దాంతో రాజకీయాలకు దూరంగా తన మేధాతనాన్ని అప్పుడప్పుడు మాత్రమే ప్రదర్శిస్తూ రోజులు గడుపుతున్నారు జేపీ. ఎంతైనా పబ్లిసిటీకి అలవాటైన ప్రాణం కదా! పైగా తను పేద్ద లౌకిక వాదినని కూడా చాటుకోవాలయ్యె! అందుకే, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఒకసారి పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ అంటూ నాలుగు రోజులు హడావిడి చేసి మళ్లీ సైలెంట్ అయి పోయారు. ఆ మధ్య జగన్ ప్రభుత్వంలో పథకాలను ప్రశంసించారు. ఇప్పుడు మళ్లీ ‘ప్రపంచ మేధా వులారా ఏకం కండి!’ అన్న నినాదాన్ని అంది పుచ్చుకొని చంద్రబాబుకు మద్దతుగా ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే, గాంధీ, అంబేడ్కర్, వైశ్య కులం, దళిత కులం; త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి అంటూ మోకాలికీ బోడి గుండుకీ ముడిపెడుతూ తన మేధాతనాన్ని ప్రదర్శించడానికి చాలా ప్రయాసపడ్డారు. ప్రకటన వికటించింది. చంద్రబాబుకి వర్గ పరంగా బహిరంగ మద్దతు ఇస్తున్నాను అని ఆయన ప్రకటిస్తే ఎవరికీ పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఏదేదో మాట్లాడేసేసి, ఆంధ్ర ప్రదేశ్‌లో ఏదో అరాచకం జరిగి పోతుందని తన భాషా ప్రావీణ్యమంతా ప్రదర్శించే సరికి, ఆయన మీద విమర్శల జడి మొదలైంది. పాపం జేపీని చూసినప్పుడల్లా విదు రుడు చెప్పిన పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది. ‘‘ధనమును, విద్యయు, వంశంబును, దుర్మతులకు మదంబు ఒనరించును / సజ్జను లైన వారికి అణకువయును, వినయము ఇవియే తెచ్చును ఉర్వీ నాథా!’’ అంటాడు. ధనం, విద్య, ఉత్తమ కులంలో పుట్టాననే భావన దుష్టులకు మదాన్నీ, అహంకారాన్నీ కలిగిస్తాయి. ఇవే శిష్టులకు అణకువ, వినయం కలిగిస్తాయి అని విదురుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు. ఈ పద్యం చదివితే జేపీ ఏ బాపతు మేధావో చెప్పనవసరం లేదనుకుంటాను. జనానికి ఏమి కావాలో అది చెప్పాలి.లేదంటే నేల విడిచి సాము చేసినట్టు ఉంటుంది. జనం ఏమైనా ‘జేపీలా’? పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
బరిలో డిగ్గీ సొంత సైన్యం!
సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష ‘ఇండియా’ కూటమిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కలిసి పని చేసే పరిస్థితి లేనప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపే అంశాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. తమతో వారి (కాంగ్రెస్) ప్రవర్తన లాగే వారితో తమ ప్రవర్తన ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను మోసగిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 స్థానాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బీజేపీ లాభపడుతుందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లో తమకు తగిన బలం ఉందని, గతంలో రెండో స్థానంలో నిలిచామని అఖిలేష్ యాదవ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, చివరకు మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. 'మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలపై తన పట్టును మాజీ రాజ కుటుంబీకుడు దిగ్విజయ్‌సింగ్ మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది.' 'మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇటీవల విడు దల చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయా లపై తన పట్టును మా జీ రాజ కుటుంబీకుడు దిగ్వి జయ్సింగ్ మరో సారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది...తొలి జాబితా చాలా కారణాలతో వార్తల్లో నిలిచింది. అయితే అందరినీ ఆకర్షించింది మాత్రం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం! వివాదాస్పదుడైన సోదరుడు లక్ష్మణ్‌సింగ్‌తో పాటు కుమారుడు జైవర్ధన్, అల్లుడు ప్రియవ్రత్, అదే వరుసయ్యే అజయ్‌సింగ్ రాహుల్ పేర్లకు జాబితాలో చోటు దక్కింది.' - దిగ్విజయ్ '68 ఏళ్లు. దిగ్విజయ్‌కి వరసకు కోడలి భర్త. రక్త సంబంధీకుడు కాకున్నా డిగ్గీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఐదుసార్లు ఎమ్మెల్యే. వింధ్య ప్రాంతంలో గట్టి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సిద్ధి జిల్లాపై పలు దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం ఆయన కుటుంబానిదే. మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వగలిగింది కేవలం కుటుంబ పాలన మాత్రమేనని దిగ్విజయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. నా కుమారుడు ఆకాశ్ తనకు టికెటివ్వొద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇవీ మా పార్టీ పాటించే విలువలు!’ - అజయ్‌సింగ్ రాహుల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో పార్టీ సీనియర్ నేత. '68 ఏళ్లు. దిగ్విజయ్ తమ్ముడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీనీ వదలకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు! 2004లో బీజేపీలో చేరి రాజ్‌గఢ్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. 2010లో నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని విమర్శించి బహిష్కారానికి గురయ్యారు. 2018లో రాష్ట్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు.' - లక్ష్మణ్‌సింగ్ '45 ఏళ్లు. దిగ్విజయ్ మేనల్లుడు. కిల్చీపూర్ సంస్థాన వారసుడు. ఆ స్థానం నుంచే 2003లో అసెంబ్లీకి వెళ్లారు. అభివృద్ధి పనులతో ఆకట్టుకుని 2008లో మళ్లీ నెగ్గారు. 2013లో ఓడినా 2018లో మంచి మెజారిటీతో గెలిచారు. కమల్‌నాథ్ మంత్రివర్గంలో ఇంధన శాఖ దక్కించుకున్నారు.' - ప్రియవ్రత్‌సింగ్ '37 ఏళ్లు. దిగ్విజయ్ కుమారుడు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో సింధియాల కంచుకోటలను చేజిక్కించుకోవడంపై ఈసారి దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయుల్లో పలువురిని ఇటీవల కాంగ్రెస్ గూటికి చేర్చారు. డూన్ స్కూల్లో చదివిన ఆయన కొలంబియా వర్సిటీలో మాస్టర్స్ చేశారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమ మాజీ సంస్థానమైన రాఘవ్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి 59 వేల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. 2018లో దాన్ని 64 వేలకు పెంచుకోవడమే గాక కమల్‌నాథ్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు.' - జైవర్ధన్‌సింగ్ -
ఎడ్యుకేట్ చేయాలి
‘‘సినిమా అనేది ఎంటర్టైన్ చేయడంతో పాటు ఎడ్యుకేట్ చేయాలి. అలా ఎడ్యుకేట్ చేసే సినిమాలను ప్రొత్సహించాలి. యువత రాజకీయాల్లో తిరుగుతూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అలాటి అంశానికి వినోదం జోడించి తీసిన ‘రామన్న యూత్’ని ఆదరించాలి’’ అని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డా. జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ ΄ోస్టర్‌ని జయప్రకాశ్ నారాయణ్ ఆవిష్కరించారు. ‘‘గ్రామీణ ్రపాంతాల్లో రాజకీయ నాయకుల కోసం యువత ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు? రాజు అనే ఒక యువకుడు ΄÷లిటికల్ లీడర్‌గా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు అభయ్ నవీన్. -
ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది
వేటపాలెం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని లోక్‌సత్తా నేత ఎన్.జయప్రకాష్ నారాయణ చెప్పారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెంలోని బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాల్లో రెండో రోజు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకోసం ఒక్కో విద్యార్థికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం అత్యధికంగా ఒక్కొక్క విద్యార్థికి రూ.90 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇది అభినందించాల్సిన విషయమన్నారు. విద్యా, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ బండ్ల బాపయ్యశెట్టి నెలకొల్పిన విద్యాసంస్థలో చదువుకున్న ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నతస్థాయిల్లో ఉన్నారని చెప్పారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని రాణించాలని సూచించారు. ఎన్‌ఏటీసీవో డైరెక్టర్ చెంగపల్లి వెంకట్, నటుడు అజయ్‌ఘోష్, విద్యాసంస్థ అధ్యక్షుడు బండ్ల అంకయ్య, ఉపాధ్యక్షుడు కోడూరి ఏకాంబేశ్వరబాబు, కార్యదర్శి బండ్ల శరత్‌బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ గొల్లపూడి సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పురోగమిస్తున్న విద్య, వైద్య రంగాలు
గుణదల (విజయవాడ తూర్పు): ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గుణదల ఈఎస్ఐ రోడ్డులోని రోటరీ క్లబ్ భవనంలో లోక్ సత్తా పార్టీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పురోగమిస్తున్నాయని అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించాలని కోరారు. అనంతరం సర్వసభ్య సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. -
సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా: జేపీ
విశాఖ: విద్యా, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభినందించారు. ఏపీలో విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్న జేపీ.. ఇది అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ సంకల్పాన్ని అభినందించాలన్నారు. విశాఖలో అందరికీ ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ... ‘విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్నా. విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్సార్ దేశానికే ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్‌ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయం: జేపీ
ఒంగోలు మెట్రో: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయమని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ ప్రశంసించారు. ప్రకాశం జిల్లా నామకరణ స్వర్ణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నపురి తెలుగు అకాడెమీ ఆధ్వర్యంలో డాక్టర్ తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలువరించిన ‘స్వర్ణ ప్రకాశం’, ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, ‘ఒంగోలు గురించి ఒకింత’ తదితర పుస్తకాల ఆవిష్కరణ సభ శనివారం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘స్వర్ణ ప్రకాశం’ పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించి ప్రసంగించారు. కేవలం కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆగిపోకూడదని, అధికార వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు వెలకట్టే సమాజం బాగుపడదని, ఓటుకు, నిరసనకు మధ్య పరిమితమైతే అది బూటకపు ప్రజాస్వామ్యమవుతుందన్నారు. కాగా, ఉన్నం జ్యోతివాసు రచించిన ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, మారేపల్లి సూర్యకుమారి రచించిన ‘ఒంగోలు గురించి ఒకింత’ పుస్తకాలను ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. -
సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. పైసా ఖర్చు లేకుండా ప్రజలందరికీ వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘అందరికి వైద్యం హక్కుగా వైద్య సేవలు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ మాట్లాడుతూ.... ప్రాధమిక దశలో ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థాను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భవ వంటి పథకాలను ద్వితీయ, తృతీయ స్థాయిల్లో అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ.1900 కోట్లు అదనంగా కేటాయిస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు బాగానే ఉన్నా అవి ఎంతమాత్రం సరిపోవని, వైద్య సేవలు మరింతగా మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సదుపాయాలన్నీ విడిగా ఉన్నాయని వాటన్నింటినీ అనుసంధానం చేసి సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాలన్నారు. స్వాతంత్య్రం అనంతరం నుంచి ఇప్పటివరకు ప్రజారోగ్యం పట్ల పాలకులు పెద్దగా శ్రద్ధగా చూపలేదని ఇప్పటికీ అయినా సమయం మించిపోలేదు. ఆరోగ్య వ్యవస్థ పట్ల దృష్టిని సారించాలని కోరారు. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ఆకుల నరేష్‌బాబు, డాక్టర్ చింతల రాజేందర్, వర్కింగ్ ప్రసిడెంట్ సత్యప్రకాష్, కటారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ ఆరోగ్య నమూనాలో ఏముందంటే...
సాక్షి, హైదరాబాద్: అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేలా ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎఫ్డీఆర్), లోక్‌సత్తా సంయుక్తంగా రూపొందించిన ‘టువర్డ్స్ వయబుల్ యూనివర్సల్ హెల్త్‌కేర్’ ఆరోగ్య నమూనాను లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా.. ► అన్ని రకాల ఔట్ పేషెంట్ సేవలకూ ప్రజలు తమకు నచ్చిన డాక్టర్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, వైద్య సేవల మధ్య పోటీతో ఫ్యామిలీ ఫిజీషియన్ నేతృత్వంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ. ఇది పైస్థాయి ఆస్పత్రి సేవలకు అనుసంధానమై ఉంటుంది. ఆస్పత్రి చికిత్స అవసరమనుకుంటే ఫ్యామిలీ ఫిజీషియనే సిఫార్సు చేస్తారు. ప్రభుత్వం నిధుల్ని సమకూరుస్తుంది. చదవండి: అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు ► ద్వితీయ, తృతీయ స్థాయి చికిత్సల ఆస్పత్రులు ఇన్‌పేషెంట్ సేవలకు మాత్రమే పరిమితం. అయితే అత్యవసరాలు మినహాయించి అన్ని కేసుల్లో కింద స్థాయి వైద్యుని నుండి సిఫార్సు (రెఫరల్) తప్పనిసరి. ► ఆయుష్మాన్ భారత్ నుండి తృతీయ స్థాయి వైద్య సేవలను మినహాయించి, ఆ పథకాలు అన్ని ద్వితీయ స్థాయి చికిత్సలకూ అందరు పౌరులకూ వర్తించేలా వాటి పరిధిని విస్తరించటం. తృతీయ స్థాయిలో నాణ్యమైన, ఖర్చుకు తగ్గ ఫలితాలనిచ్చే వైద్య సేవలందించేలా దేశంలోని జిల్లా, ప్రభుత్వ బోధనాస్పత్రులను అభివృద్ధి చేయటం. అదనపు వనరుల్ని సమకూర్చటం. ►ఈ నమూనాను అమల్లోకి తేవటానికయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరిస్తున్నా, ప్రైవేట్ రంగానికి కూడా కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యాలు, ఆర్థిక వనరుల సేకరణకు వినూత్న పద్ధతులతో ఈ నమూనా రూపొందింది. ►దేశవ్యాప్తంగా ఈ నమూనా అమలుకు అదనం గా అయ్యే వ్యయం ఏడాదికి సుమారు రూ. 85 వేల కోట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అదనపు వ్యయం వరుసగా సుమారు రూ.1,900 కోట్లు, రూ. 2,600 కోట్లు ఉంటుంది. ► ఈ సంస్కరణల అమలు ఆవశ్యకతను తెలియచెప్పి ఒప్పించే క్రమంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్, ఆర్థిక సలహా మండలి, పార్లమెంటు సభ్యులు, మీడియా, ఈ రంగంలో పనిచేస్తున్న ఇతర అనేక సంస్థలు, వ్యక్తులు ఇలా సంబంధితుందరికీ ఎఫ్డీఆర్ వివరాలను అందించింది. ► ఆరోగ్య రంగం రాష్ట్రాల జాబితాలోని అంశం కాబట్టి, అంతిమంగా సంస్కరణలు రాష్ట్రాల నుండి ప్రారంభం కావాలి. కాబట్టి ఎఫ్డీఆర్ ఈ నమూనాను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులు, ఇతర సంబంధిత ఉన్నతాధికారులకు పంపింది. ► ఈ సంస్కరణలను అమలు చేసేలా ప్రభుత్వాలను ఒప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషాతో మొదలు పెట్టి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని వ్యక్తిగతంగా కూడా కలవాలని లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ భావిస్తోంది. -
హామీలను వెంటనే అమలుచేస్తే అప్పుల ఊబిలోకే..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం క్లిష్ట స్థితిలో ఉందని.. ఈ సమయంలో కొత్త ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీల జోలికి వెళ్తే రాష్ట్రం మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం ఖాయమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో గొప్ప ప్రజాభిమానాన్ని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంకటంలో ఉంది. నిరుద్యోగులు ఉపాధి కోసం చూస్తున్నారు. డబ్బుల్లేవు. అందరూ సంఘటితంగా తెలుగు ప్రజలకు న్యాయం చేయడం.. నిజమైన అభివృద్ధిని సాధించడం ఎలాగా.. అన్నవాటిపై దృష్టిపెట్టాలి. ఢిల్లీ నుంచి రావాల్సిన వాటిని ఎలా రాబట్టుకోవాలో చూడాలి. మనం చెల్లించాల్సిన రుణాలను కేంద్రం మాఫీ చేయాలి.. అంతేకాక, ఏపీ అభివృద్ధి కోసం ప్రత్యేక బాండ్లను జారీచేసి, ఆ డబ్బులు రాష్ట్రానికిచ్చి, వాటిని తీర్చే బాధ్యత కేంద్రం తీసుకోవాలి. జగన్మోహన్రెడ్డిని అన్ని పక్షాలు కోరేది ఒక్కటే.. విభేదాలు వదిలి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోండి. జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది. జాగ్రత్తగా చేసుకుంటే రాష్ట్రంలో చాలా అవకాశాలున్నాయి’.. అని జయప్రకాష్ నారాయణ అన్నారు. -
ఇవి ఎన్నికలు కాదు.. వేలం పాటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ ఇప్పుడు జరుగుతున్నవి ఎన్నికలు కాదని, అవి వేలం పాటల్లా సాగుతున్నాయని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో జరిగిన లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోనూ, దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది పరిపాలన కూడా కాదు, ఆ పేరుతో కలెక్షన్లు చేస్తున్నారని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు వసూళ్లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మొన్న ముగిసిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే చూశాం. ఏపీలోనూ చూడబోతున్నామని చెప్పారు. ఓట్లు కోసం రాజకీయ పార్టీలు పోటీపడి వరాలు ఇస్తున్నాయన్నారు. ఇలాంటి చిల్లర, మల్లర కార్యక్రమాల వల్ల ప్రజలకు నిజమైన ఫలితాలు అందకపోగా, వాటిలో నుంచే అవినీతి పుడుతుందన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలన్నా ప్రాంతీయ పార్టీలే కీలకమని, వచ్చే 25 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ పోటీ చేస్తుందా అన్న ప్రశ్నకు తమ పార్టీ పొలిట్ బ్యూరో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని బదులిచ్చారు. లోక్‌సత్తా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన జయప్రకాష్ నారాయణ, ఈ ఎన్నికల సమయంలో దానిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. -
ఏకపక్ష నివేదికతో ఎవరికి మేలు?
కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాల్ని పొందుపరచకుండా ఏపీకి కేంద్రం నుంచి 85 వేల కోట్లు రావాలంటూ లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఎన్నికల ముందు ఒక నివేదిక ఇవ్వడం కొన్ని రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించటమే అవుతుంది. జేపీ నిపుణుల కమిటీ నివేదిక విడుదల సమయాన్ని చూస్తే తెలియకుండానే వారు ఒక రహస్య ఎజెండాకు దోహదం చేశారా అని అనుమానమేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా కమిటీ నివేదిక తయారైంది. ఏపీకి చెందిన అన్ని అంశాల్లో కేంద్రాన్ని దోషిగా చూపెట్టడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నానికి ఊతమిచ్చే రిపోర్ట్ గానే ఇది మిగిలిపోతుంది. పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టును విడుదల చేసి ఈ మార్చి నెలకు సరిగ్గా ఒక సంవత్సరం. ఆ రిపోర్టు విడుదలైన వెంటనే జయప్రకాష్ నారాయణ ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో కొంతమంది నిపుణులతో మరి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏర్పడిన తొలి రోజులలో కమిటీ కార్యక్రమాలకు ప్రసార మాధ్యమాలలో విస్తృత ప్రచారం లభించింది. కానీ ఆ పైన ఈ కమిటీ ఏం చేస్తోంది అనేది చాలా గోప్యంగా ఉంచారు. సరిగ్గా పది నెలల తరువాత ఒక వారం క్రితం జేపీ విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి 85 వేల కోట్లు రావాలని ప్రకటించేవరకు ఈ పది నెలల కాలం ఈ కమిటీ ఏం చేస్తున్నది ఎవరికీ తెలియదు. కమిటీలో ఉన్న వారందరూ వివాద రహితులు వారి వారి రంగాలలో నిష్ణాతులు. కానీ ఈ కమిటీ నివేదిక విడుదల చేసిన సమయాన్ని, విధానాన్ని బట్టి చూస్తే వారికి తెలియకుండానే వారు ఒక రహస్య ఎజెండాకు దోహదం చేశారా అని అనుమానం కలుగక మానదు. పవన్ కళ్యాణ్ ఏర్పాటుచేసిన నిజ నిర్ధారణ కమిటీలో చర్చల సందర్భంగా ఒక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కమిటీకి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సమాచార హక్కుల చట్టం క్రింద ఒక పత్రం సమర్పించడం తప్పితే, కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకురావటానికి కానీ సంప్రదింపులు జరపటానికి కానీ కమిటీ పెద్దగా కృషి చేయలేదు. అటువంటి పరిస్థితులలో కమిటీ నివేదికలో ఈ మొత్తాలు కేంద్రం నుంచి రావాల్సిన మొత్తాలుగా చూపెట్టడం భావ్యం కాకపోవచ్చని నేను పేర్కొన్నాను. ఈ వాదనను కమిటీ అంగీకరించి తదనుగుణంగా నివేదికలో ఈ నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవలసిన నిధులుగా పొందుపరచడ మైంది. ఇదే అంశాన్ని ఆరోజు విలేకర్ల సమావేశంలో కూడా నేను ప్రస్తా వించాను. కానీ, జేపీ ఇవి కేంద్రం నుంచి రావాల్సిన మొత్తాలుగా పేర్కొ నటంతో ఆ నివేదికలో పొందుపరచిన అంశాలకు భిన్నంగా ఆ అభి ప్రాయం జనబాహుళ్యంలోకి వెళ్ళింది. ఈ అంశం ఈ నిపుణుల కమిటీ నివేదికకు కూడా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యంతో వర్తిస్తుంది. నిపుణుల కమిటీ తన అధ్యయనాన్ని పది నెలల సుదీర్ఘ కాలం కొనసాగించింది. ఈ సమయంలో కేంద్ర ప్రభు త్వాన్ని వారి విధానాన్ని కూడా తెలియజేయవలసిందిగా కమిటీ కోరి ఉండి ఉంటే వారి అభిప్రాయాలు కూడా కమిటీ పరిశీలించి తమ నివేదికలో పొందుపరిచే అవకాశం ఉండి ఉండేది. అప్పుడు కమిటీ నివేదికకు విశ్వసనీయత ఉండేది.అటువంటి ప్రక్రియ కమిటీ చేయలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని మూలంగా తీసుకొని కమిటీ తన నివేదికను తయారుచేసింది. ఇటువంటి ఏకపక్ష నివేదిక వల్ల ఒనగూరే ప్రయోజనం ఉండక పోవచ్చు.ఇక రెండవ అంశం జేఎఫ్ఎఫ్సీ నివేదిక ఇచ్చిన కొన్ని రోజులకే ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. పరిశీలించవలసిన అంశాలు క్లిష్టమైనవీ, బహుళమైనవీ కావు. రెండు మూడు నెలలలోపు ఈ కమిటీ రిపోర్టు వచ్చి ఉంటే దీని మీద నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశం ఉండేది. కానీ, ఎన్నికల ముందు కేంద్ర ప్రభు త్వాన్ని సంప్రదించకుండా వారి అభిప్రాయాల్ని పొందుపరచకుండా కేంద్రం నుంచి 85 వేల కోట్లు రావాలంటూ ఒక నివేదిక ఇవ్వడం కొన్ని రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించటమే అవుతుంది. ఇక కమిటీ నివేదికలోని ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తే చాలా అంశాల్లో స్పష్టత హేతుబద్ధత కనిపించటం లేదు. ఎక్కడా కూడా ప్రత్యేక హోదా అంశాన్ని కమిటీ ప్రస్తావించ లేదు. ఈ విధంగా ఒక ప్రధానమైన, రాష్ట్రంలో ఆవేశపూరితంగా మారిన ఒక అంశంపై కమిటీ నివేదిక నీళ్లు చల్లినట్లయింది. ప్రత్యేక సహాయాన్ని గురించి ప్రస్తావిస్తూ రూ.16,447 కోట్ల మొత్తాన్ని ఈఏపీ స్కీమ్‌ల ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, ఈ సహాయాన్ని ఇవ్వటానికి ఇతర మార్గాలు అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ అంశంలో నిధులు ఇవ్వటానికి ప్రత్యా మ్నాయ మార్గాలు అన్వేషించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు యూటర్న్ తీసుకుని భీష్మించుకుని కూర్చొని ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆవిధంగా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని కేంద్రం నుంచి రావాల్సిన నిధు లుగా చూపెట్టడంలో అర్థం లేదు. ఈ మొత్తాన్ని రాష్ట్రం తీసుకోవడానికి ఇష్టపడని మొత్తంగా చూపెట్టాల్సి ఉంటుంది. ఇక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ గురించి పేర్కొంటూ బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహాలో కేంద్ర ప్రభుత్వం రూ. 24,350 కోట్లు ఇవ్వాలని సూచించింది. అయితే బుందేల్‌ఖండ్ ప్యాకేజీలో.. అప్పటికే అమల్లో ఉన్న ఉపాధి హామీ పథకం లాంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు భాగంగా చేయడం జరిగింది. ఆ మొత్తాన్ని తొలగించిన తర్వాత చేసిన ఎటువంటి పోలిక అయినా సమంజసంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్యాకేజీలోనూ కేటాయింపులకు, చివరికి ఇచ్చే విడు దల మొత్తాలకు వ్యత్యాసాలు ఉంటాయి. మనకు జిల్లాకు 50 కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం వచ్చిందీ విడుదలైన మొత్తాలూ. వీటిని పోల్చాలి అంటే బుందేల్‌ఖండ్ ప్యాకేజీలో కూడా మిగిలిన పథకాలలోని మొత్తాలను మినహాయించిన తర్వాత విడుదలైన నిధులను తీసుకొని పోలిక చేయాల్సి ఉంటుంది. పైపెచ్చు బుందేల్‌ఖండ్ ప్యాకేజీ 13 జిల్లాలకు వర్తిస్తుంది. మన వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ 7 జిల్లాలకే వర్తిస్తుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా బుందేల్ ఖండ్ ప్యాకేజీని పేర్కొని రూ. 24 వేల కోట్ల దాకా రావాల్సి ఉంటుందని పేర్కొనడం సరైంది కాకపోవచ్చు. ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి చర్చించేటప్పుడు కమిటీ మరో ప్రధాన అంశాన్ని ప్రస్తావిం చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అనే వాస్తవాన్ని పేర్కొంటూ రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య కోస్తా ప్రాంతానికి సమానంగా అభివృద్ధి చెందాలంటే బయట నుంచి వచ్చే పెట్టుబడిలో 85 శాతం ఈ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. అలాంటప్పుడు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకృతంగా మొత్తం పెట్టుబడులను రాజ ధాని ప్రాంతంలోనే చేయడాన్ని కమిటీ ప్రస్తావించలేదు ప్రశ్నించలేదు. 85 శాతం కొత్తగా వచ్చే పెట్టుబడులన్నీ వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లా లని అన్నప్పుడు అది కేవలం కేంద్రం నుంచి వచ్చే సహాయంతోనే జర గదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను పెట్టే పెట్టుబడులను ఒక ప్రణాళిక ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశాన్ని ఎందుకనో కమిటీ పూర్తిగా విస్మరించింది. ఇక 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ లోటు విషయంలో ఆ సంవత్సరం కాగ్ నిర్ధారించిన మొత్తం రూ. 16 వేల 78 కోట్లు. దీనికి అదనంగా 2015–16 సంవత్సరంలో అయిన ఖర్చు రూ. 6,800 కోట్లు కలిపి మొత్తం రూ. 23 వేల కోట్ల దాకా 2014–15 సంవ త్సరం లోటుగా తేల్చి, దానిలో రూ. 10,300 కోట్ల దాకా ఇంతవరకు భర్తీ చేసిన మొత్తంతో కలిపి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని కమిటీ సూచించడం జరిగింది. ఈ అంశంపై కేంద్రం ఇప్పటికే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని తీసుకొని సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. కమిటీ ఈ అంశంమీద కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇక పరిశ్రమల కేంద్ర కార్యాలయాలు హైదరాబాదులో ఉండ టంతో భవిష్యత్తులో కట్టవలసిన పన్నులు అక్కడ కట్టడం వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని రూ. 3,800 కోట్లుగా నిర్ధారించారు. ఇది ఆంధ్రప్రదేశ్ తప్పకుండా రావాల్సినటువంటి మొత్తం. కానీ ఇంతవరకు ఈ మొత్తాన్ని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కేంద్రాన్ని అడగలేదు. కేవలం చట్టాన్ని సవరించాలని మాత్రమే కోరింది. సవరణ సాధ్యం కాదని కమిటీ తేల్చినందువలన ఈ మొత్తాన్ని వెంటనే చెల్లిం చవలసిందిగా రాష్ట్రం కేంద్రాన్ని అభ్యర్థిస్తే బాగుంటుంది. పోలవరం విషయంలో కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచా రాన్ని విశ్లేషించకుండా నమ్మి నివేదికను రూపొందించింది. 2019 సంవ త్సరానికి 41 మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని కమిటీ ఎట్లా నమ్మిందో అర్థం కావటం లేదు. మొదటి నాలుగేళ్లు పని మందకొడిగా నడవడానికి కారణాలు, అనూహ్యంగా అంచనాలు పెంచ డానికి కారణాలను కొంత లోతుగా అధ్యయనం చేసి ఉంటే బాగుండేది. జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు కేంద్రానికి కొత్త కాదు. ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన దానికన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంలో అలసత్వం ఉందా అనే అంశాన్ని పరిశీలించి వ్యాఖ్యానించి ఉంటే బాగుండేది. ఆ పని చేయకుండా కొన్ని సంవత్సరాల్లో రావాల్సిన మొత్తం అంతటిని గంపగుత్తగా ఒకేసారి రావాలి అనేవిధంగా నివేదికలో రూపొందించటం కేవలం వాస్తవాలను వక్రీకరించడమే. ఇక రాజధాని అంశాన్ని వివిధ మౌలిక సదుపాయాల కల్పనను కమిటీ ప్రస్తావించింది. గత సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా కేంద్రాన్ని దోషిగా చూపెట్ట డమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రం వైఖరి ఆ విధంగా ఉన్న ప్పుడు ఈ నివేదిక సమస్య పరిష్కారానికి తోడ్పడదు. కేంద్రాన్ని దోషిగా చూపెట్టడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నానికి ఊతమిచ్చే రిపోర్ట్ గానే ఇది మిగిలిపోతుంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
రాష్ట్రంలో అవినీతి ప్రజ్వరిల్లుతోంది : జయప్రకాష్ నారాయణ
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అవినీతి ప్రజ్వరిల్లుతుందని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎలాంటి సిఫార్సు లేకుండా నేరుగా పనులు చేయించుకునే వ్యవస్థ ఎప్పుడు వస్తుందోనని ఆశాబావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎ౦తో నమ్మకంతో ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటే ఎన్నో పన్నులు కడుతున్నా ఎ౦దుకు మళ్లీ ఎదైనా పనులు చేపించుకోవాలనుకున్నప్పుడు లంచాలు ఇవ్వాల్సి వస్తుందని మండిపడ్డారు. భారత పార్లమెంట్లో అన్ని పార్టీలు కలసి దారుణమైన చట్టాలు తీసుకు వచ్చాయని, లంచం ఇస్తే ఏడు ఏళ్ళ శిక్ష కనీసం మూడేళ్ళు... అదే లంచం తీసుకున్న వాడికి ఎలాంటి కేసు ఉండదు అనే చట్టం తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పనులు గడువులోపల ఆ పని జరిగేలా చట్ట బద్ద౦ చెయ్యాలని చెప్పారు. వీటన్నిటిని అధికమించాలంటే నిజమైన ప్రతిపత్తికల లోకాయుక్త రావాలి అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తికల ఎవ్వరినైనా నిలదీసి శిక్షించగల లోకాయుక్త కావాలని ఆయన తెలిపారు. తెలగాణ ప్రజల్ని ఒక్కటే కోరుతున్న లంచం వేధింపులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎర్పడితే ఎమి లాభం లేదని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతవ్వడం పై ఈసీ రజత్ కుమార్ క్షమాపణ చెప్పడం సరియైంది కాదని అన్నారు. ఓట్లు గల్లంతుపై ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోతోందని, దీనిపై పోస్టాఫీసులను నోడల్ ఎజన్సీలుగా ఏర్పాటు చేసి ఓటర్లు ఎప్పుడైనా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఈసీది ఘోరమైన తప్పిదమేని జయప్రకాశ్ ఆరోపించారు. -
ఉత్తుత్తి హామీల్ని నమ్మకండి..
తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఊకదంపుడు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాయని, వీటిని ప్రజలు ఆమోదించకుండా...స్పష్టమైన ఎజెండాతో ఆయా పార్టీ నేతల నుంచి హామీ తీసుకోవాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలకు భద్రత, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, ఆదాయం పెంపునకు మార్గాలు చూపే పార్టీలకే ఓటేస్తామని చెప్పాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు డిమాండ్ చేయాల్సిన ఆరు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటిలో పౌరసేవల చట్టం ఒకటిగా పేర్కొన్నారు. దీన్ని ప్రజల హక్కుగా డిమాండ్ చేయాలన్నారు. ఇక విద్యార్థికి ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని, ప్రతి కుటుంబానికీ ఉచిత వైద్య వసతి కల్పించాలన్నారు. మహిళల భద్రతకు స్థానికంగానే కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక రుణమాఫీ వంటి పథకాలను కాకుండా రైతులకు వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం వచ్చేలా చూడాలని జేపీ సూచించారు. గిట్టుబాట ధర కల్పించడం, తక్కువ వడ్డీతో రుణాలివ్వడం, దళారులు లేని మార్కెట్ వ్యవస్థ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఇక పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్ నుంచే తలసరి కేటాయింపులు జరపాలని ఆయన సూచించారు. ఈ అంశాలపైనే ప్రజలు నేతల నుంచి హామీలు పొందాలని జయప్రకాశ్ నారాయణ్ కోరారు. -
కొండగట్టు ప్రమాదంపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా: కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి కరీంనగర్ లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో మృతిచెందిన 60 మందికి రూ.20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని హక్కుల కమిషన్‌ను కోరారు. -
లంచం ఇచ్చిన వారికి శిక్ష సబబు కాదు: జేపీ
హన్మకొండ: లంచం ఇచ్చిన వారికి శిక్ష విధించేలా రాజ్యసభలో తీసుకున్న నిర్ణయం మెడ మీద తలకాయ ఉన్నోడు తీసుకునేది కాదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన పౌరులను జ్వాలా అవినీతి వ్యతిరేక పోరాట సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండలో శుక్రవారం అశ్వరథంపై ఊరేగించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేపీ మాట్లాడారు. రాజ్యసభలో ఆమోదం పొందిన అవినీతి నిరోధక సవరణ బిల్లుపై ఆయన స్పందిస్తూ లంచం కావాలని ఎవరూ ఇవ్వరని, సంపన్నులు, పలుకుబడి ఉన్నవారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులవుతున్నాయని, పేదలు, సామాన్యులు ఆఫీసుల చూట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. పనుల కోసం లంచాలు ఇచ్చే వారికి శిక్ష విధించడం సరికాదన్నారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయి గత్యంతరం లేక లంచం ఇచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పని నిర్ణీత సమయంలోపు చేయని అధికారులు, ఉద్యోగులకు జరిమానాలు విధిస్తే లంచాలు ఇవ్వాల్సిన అవసరం రాదని చెప్పారు. -
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేయాలని, అప్పుడే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధికి అవకాశం ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ‘ఇండియా నెక్ట్స్’సదస్సు శనివారం ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో ఐక్యతను చాటే కొన్ని రాజ్యాంగ సంస్థలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలకలుగా మారాయని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలకు అధికారాలు కల్పించే విషయాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, గతంలో సీఎంలుగా పని చేసేటప్పుడు చేసిన డిమాండ్లను నేడు ప్రధానులుగా తిరస్కరిస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నరేంద్ర మోదీ అధికారాల వికేంద్రకరణపై చేసిన డిమాండ్లను ఇప్పుడు ప్రధానిగా ఆయనే తిరస్కరిస్తున్నారని తప్పుపట్టారు. కేంద్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి విధానాలను దెబ్బతీస్తూ, కొత్త విధానాలను తమకు నచ్చినట్టుగా పొందుపరుస్తున్నాయని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా... సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వాలు అధికారాలన్నింటినీ తమ చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ అన్నారు. గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సొంత మనుషులను రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కూడా కొన్ని అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని మార్చి రాష్ట్రాలకు, జిల్లాలకు, స్థానిక సంస్థలకు నేరుగా అధికారాల వికేంద్రీకరణ చేయాలని ఆయన సూచించారు. జీఎస్టీతో దేశంలో ఒకే పన్ను అమల్లోకి రావడం వల్ల రాష్ట్రాలకు కొంత మేలు జరుగుతోందని, గతంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు 32 శాతం వచ్చే నిధులు ఇప్పుడు 42 శాతానికి పెరిగాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత సూర్యారావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే ఇలాంటి సంస్కరణలు ఇంకా రావాల్సి ఉందన్నారు. సదస్సులో ‘ఇండియా నెక్ట్స్’సంస్థ అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎం.అమరేంద్ర పాల్గొన్నారు. -
వ్యవస్థలో మార్పు అవసరం: జేపీ
సాక్షి, హైదరాబాద్: వ్యవస్థలో మార్పు రావాలని లోక్‌సత్తా అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం రాసిన ‘మేలుకొలుపు’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. కులం, మతం, ప్రాంతం సమాజాన్ని నిట్ట నిలువునా చీలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ చాలాచోట్ల చట్టబద్ధ పాలన సాగడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా ఏ పనీ జరిగే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటే అన్నింటికీ పరిష్కారమార్గమని చెప్పారు. చిత్తశుద్ధి, నిజాయితీకి మారుపేరైన అజయ్ కల్లం ప్రజలను మేలుకొలుపే విధంగా పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతిపై సమరానికి మేలుకొలుపు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో అవినీతి పెరిగిపోయిందన్నా రు. సమస్యలపట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అజయ్ కల్లం మాట్లాడుతూ పాలనావ్యవస్థ నిలువెల్లా కుళ్లిపోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ, రాజకీయ విలువలు హరించుకుపోతుం డటంతో చట్టసభలు, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ వంటి కీలక పాలనాయంత్రాంగాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ సచివాలయాలు అవసరమన్నారు. సమాజంపట్ల బాధ్యతను గుర్తు చేసేందుకు జిల్లాలవారీగా ‘మన కోసం మనం’అనే అంశంపై చర్చావేదికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అనంతపురం నుంచి చర్చావేదికలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. మాజీ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. -
జేపీ అలా చెప్పడం హాస్యాస్పదం
అనంతపురం జిల్లా : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులపై లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ చెప్పటం హాస్యాస్పదంగా ఉందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బలపర్చాలని కోరటం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం కిందకే వస్తుందన్నారు. ఈనెల16న ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ, వామపక్షాలు చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని కోరారు. బంద్ అవసరం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, హోదా ఉద్యమన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. శివరామకృష్ణయ్య నివేదిక బుట్టదాఖలు చేశారని, ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు రాజధాని, పోలవరం పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
రాజకీయ దురుద్దేశంతోనే ఓట్ల తొలగింపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల జరిగిన ఓటర్ల రివిజన్ ప్రత్యేక సమ్మరీ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని, అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్టు అధికారులు వ్యవహరించి వాస్తవిక ఓటర్లకి ఓటు లేకుండా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, ఉభయ కమ్యూనిస్టు, లోక్‌సత్తా పార్టీ ప్రతినిధులు మండిపడ్డారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని బుధవారం తన ఛాంబర్లో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రీజనల్ కో ఆర్టినేటర్ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇంతలా ఓట్లు రద్దయిన ప్రక్రియ జరగలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా రెండు వేల మంది ఓట్లను తొలగిస్తే.. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోనే సుమారు 28 వేల ఓట్లను రద్దు చేయడం దారుణమన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రాజకీయ దురుద్దేశంతోనే అధికారులకు చెప్పి, ఓట్లను తొలగించారన్నారు. తమ పార్టీ బలంగా ఉన్న చోట వందలాది ఓట్లును తొలగించారన్నారు. హెచ్‌బీ కాలనీ, చిన్నబరాటం వీధి, మాజీ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి ఉన్న ప్రాంతంలోనూ, వివిధ ప్రాంతాల్లో వందల సంఖ్యలో గత 30 ఏళ్లుగా నివాసం ఉన్నవారు, గతంలో పలు పదవులు చేసినవారి పేర్లు సైతం ఈ కొత్త జాబితాలో లేవన్నారు. పూర్తి వివరాలు, జాబితాను కలెక్టర్‌కు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాల గొప్పదని, ఈ హక్కును రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలకు వెళ్లాలని.. అలాకాకుండా అడ్డదారిలో ఓట్లను తొలగించి ప్రయోజనం పొందాలన్నా దురుద్దేశం మంచిది కాదన్నారు. జిల్లాలోనూ, నగరంలోనూ వేలల్లో ఓట్లు రద్దయినా, స్థానిక శాసన సభ్యురాలు ఉన్న ప్రాంతంలో ఒక్క ఓటు కూడా ఎందుకు పోలేదని, అధికారులు ఎందుకు మార్పులు చేయలేదని కలెక్టర్‌ను ధర్మాన ప్రశ్నించారు. గతంతో పలు పధవులు చేసిన వారి ఓట్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లను సైతం తొలగించారని కలెక్టర్‌కు వివరించారు. పట్టణంలో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని హౌసింగ్ బోర్డు కాలనీ, ఆఫీషియల్ కాలనీ ప్రాంతాలో వేలాది ఓట్లను తొలగించారన్నారు. తొలగించిన వారి వివరాలను కలెక్టర్‌కు నేతలు అందజేశారు. తొలగించిన ఓట్లను తిరిగి చేర్పించాలని కోరారు. తొలగించిన వారి ఓట్లు చేర్పించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇంటింటా సర్వేలు చేసి అర్హులందరికీ ఓటు హక్కును కల్పించాలన్నారు. ప్రజా స్వామ్యానికి అగాధం:తమ్మినేని శ్రీకాకుళం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఓట్ల తొలగింపు ప్రజా స్వామ్యానికి పెద్ద అగాధమన్నారు. రాజకీయాల్లో ఓట్లు తొలగించడం అన్యాయమన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు కూడా ఓట్లను తొలగించడం సరికాదని వ్యాఖ్యానించారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకొకపోతే ప్రతిసారి ఇవే పొరపాట్లు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓట్లు తమకు అనుకూలంగా లేవనే ఇబ్బందితోనే అధికార పార్టీ ప్రమేయంతో 28 వేల ఓట్లను నగరంలో తొలగించడం దారుణమన్నారు. దీనిపై ఎన్నిక కమిషన్ పరిధిలో చర్యలు తీసుకోవాలని, అప్పటికీ చర్యల్లేకపోతే న్యాయస్థానం ద్వారా రక్షణ పొందాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ముందుగానే అ«ధికారులు చర్యలు తీసుకొని, వాస్తవంగా తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని కలెక్టర్‌కు తమ్మినేని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తమ పార్టీ యువ నేత స్వరూప్, తదితరులకూ పూర్తి అవగాహన ఉందని, వారి సాయం తీసుకోవాలని, ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూడాలని కోరారు. సూర్యమహాల్ ప్రాంతంలో దళితులకు చెందిన 250 ఓట్లను తొలగించారని, మాజీ కౌన్సిలర్ రఫీ కుటుంబ సభ్యుల ఓట్లు లేవని, చిన్నబరాటం వీధిలో 321 నుంచి 610 వరకు, శిమ్మ రాజశేఖర్ వార్డు పరిధిలో 168 ఓట్లు లేవన్నారు. హౌసింగ్ బోర్టు కాలనీలో జేఎం శ్రీను, వారి కుటుంబ సభ్యులు ఓట్లు లేవని, కొంతమందిన ఓట్లను ఓ పోలింగ్ కేంద్రం నుంచి దూరంగా ఉన్న మరో కేంద్రానికి పంపించారని కలెక్టర్‌కు తమ్మినే వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, çటెక్కలి, పలాస నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మార్పు ధర్మారావు, పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి ఎంవీ పద్మావతి, జిల్లా అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్, శ్రీకాకుళం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ అందవరపు సూరిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, డాక్టర్ సెల్ జిల్లా కన్వీనర్ పైడి మహేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, కమ్యూనిస్టు పార్టీ నాయకులు బైరి కృష్ణమూర్తి, కోరాడ నారాయణరావు, లోక్ సత్తా నాయకుడు పంచాది రాంబాబు ఉన్నారు. -
మాట తప్పటం సరికాదు: జేపీ
హైదరాబాద్: దేవుడి పెళ్లికి అందరం పెద్దలమేనని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు కోసం ఓ వేదిక ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో జేపీతో సుమారు గంటపాటు పవన్‌కల్యాణ్ సమావేశం అయ్యారు. అనంతరం జేపీ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరు ఏరుదాటాక తెప్ప తగలేసిన మాదిరిగా ఉందని విమర్శించారు. విభజన హామీలను చట్టంలో చేర్చాక, పార్లమెంట్లో లోతైన చర్చ జరిగాక కూడా ఇలా వ్యవహరించటం చాలా ప్రమాదకరమైన పరిణామమని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వాలు, పార్టీలు, పార్లమెంట్‌పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు చట్టంలో లేవని, తమ ఇష్టం అనడం ధర్మం కాదన్నారు.విభజన హామీల అమలుకు సంబంధించి ఏం చేస్తే కేంద్రంలో కదలిక వస్తుందనే అంశాలపై జేపీతో చర్చించినట్లు పవన్‌కల్యాణ్ చెప్పారు. -
లోక్‌సత్తా ప్రజల కోసమే: జేపీ
హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ ప్రజల కోసమే ఆవిర్భవించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) తెలిపారు. శనివారం హైదరాబాద్ మల్కాజిగిరి కృష్ణలీల ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జేపీ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావడానికి సమయం పడుతుందన్నారు. ఇప్పటి రాజకీయాలకు అర్థాలే వేరుగా ఉన్నాయన్నారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించడం కన్నా వసూళ్లకు పాల్పడటం, ఇతరత్రా పనులు చేయడమే రాజకీయం అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో మూడు రాజ్యాంగ సవరణలు, 2జీ స్పెక్ట్రమ్ కేసు, 8 చట్టాలు చేయించిన ఘనత పార్టీకి ఉందన్నారు. రాష్ట్రం లో యజ్ఞాలు చేస్తేనే అన్నీ అయిపోవన్నారు. కేంద్రంలో మోదీ విజ్ఞతతో పనిచేయకపోవడం తో ఆయనపై నమ్మకం పోయిందన్నారు. ఆవు గురించి, తలాక్‌ల గురించి ఆలోచించే నేతలకు కోట్ల మంది జీవితాల గురించి ఆలోచించే తీరిక లేదన్నారు. తెలంగాణలో కూడా త్వరలోనే సురాజ్య యాత్ర నిర్వహిస్తామన్నారు. -
మూడేళ్లలో కనీస అభివృద్ధి కూడా జరగలేదు
లక్కవరపుకోట(శృంగవరపుకోట): దేశంలో గడిచిన మూడేళ్లలో కనీస అభివృద్ధి కూడా జరగలేదని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని జమ్మాదేవిపేటలో సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతం కన్నా ఇప్పడు మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రధాని మోదీ అనడం దారుణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్యం అందక జనం విలవిల లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. -
న్యాయ వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలి
తాడితోట (రాజమహేంద్రవరం): న్యాయ వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. జనం కోసం జేపీ సురాజ్య యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ హాల్లో ‘న్యాయవాదులతో జేపీ’ కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ ప్రపంచ న్యాయ వ్యవస్థలో మన దేశం వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంలో యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఎగువ కోర్టుల తీర్పులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని, తమకు న్యాయం జరిగిందని ఫిర్యాదీ సంతృప్తి చెందే విధంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకుల వత్తిళ్ళతో న్యాయం జరగదనే అసంతృప్తి ప్రజల్లో ఉండకూడదని అన్నారు. ప్రతీపనికీ కాలపరిమితి హక్కు ఉండాలన్నారు. పట్టణీకరణ నేపథ్యంలో మహిళల పై శారీరకంగాను, మానసికంగాను దాడులు జరుగుతున్నాయని, వీటికి తక్షణ శిక్షలు అమలు జరిగేలా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు. రిజర్వేషన్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల పిల్లలకు అవసరం లేదన్నారు. నిజమైన నిరుపేదలకు రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడే రిజర్వేషన్లకు సార్థకత ఉంటుందన్నారు. కొన్ని రాష్ట్రాలలో అభివృద్ధి చెందిన కులాలు కూడా రిజర్వేషన్లు కోరుతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం, కుల వివక్ష, రిజర్వేషన్ల ఘర్షణ, స్థానికసంస్థలకు అధికారాలు లేకపోవడం, లంచాలు, మహిళలపై వేధింపులు, అప్పుల వ్యవసాయం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలనే జరుగుతున్నాయన్నారు. ముమ్మారు తలాక్ అనే ఇస్లామ్ మతాచారం చెల్లదని షరియా చట్టాలను పరిగణనలోకి తీసుకుంటూ దీని పై పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మానవ హక్కులు, మహిళా స్వేచ్ఛ, హేతుబద్ధ భావాలకు లభించిన పెద్ద విజయమని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు, తవ్వల వీరేంద్రనాథ్ తదితరులు ప్రసంగించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి దివాన్‌చెరువు (రాజానగరం):గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని సీబీఎ‹స్ఈ పాఠశాలలకు మూడు రోజులపాటు జరిగే క్లస్టర్ మీట్ – 7 ఖోఖో పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. పై రెండు రాష్ట్రాలకు చెందిన 38 సీబీఎస్ఈ పాఠశాలల నుంచి 754 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్, ప్రిన్సిపాల్ మూర్తి, లోక్‌సత్తా ఉద్యమ జిల్లా అధ్యక్షుడు యు.మాచిరాజు, సురాజ్యయాత్ర రాష్ట్ర సమన్వయకర్త బండారు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కాకినాడ సిటీ: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు. సురాజ్య యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తునిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 650 మంది విద్యార్థులకు గానూ ఆరుగురు లెక్చరర్లు మాత్రమే ఉండగా.. వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని డిగ్రీ కళాశాలలో 50 మంది విద్యార్థులకు 13 మంది లెక్చరర్లు ఉన్నారని చెప్పారు. ఇలాంటి సమస్యలనూ పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వముండటం దౌర్భాగ్యమన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాల్సిన అవసరముందన్నారు.