Los Angels
-
తగ్గేదేలే.. ఆర్ఆర్ఆర్ మూవీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. తాజాగా అమెరికాలోని 'లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డు దక్కింది. (ఇది చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణిని ఎంపిక చేసింది. ఈ అవార్డ్ అందుకున్న ఫోటోలు ఆర్ఆర్ఆర్ బృందం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కీరవాణికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే ఊపులో ఆస్కార్ అవార్డ్ కూడా తీసుకురావాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. .@mmkeeravaani’s acceptance speech for #RRRMovie’s score at @LAFCA. ❤️🔥🔥🌊 pic.twitter.com/XIDhze3ZkW — RRR Movie (@RRRMovie) January 15, 2023 -
ఒలింపిక్స్‌లో క్రికెట్.. త్వరలోనే ప్రకటన..!
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ త్వరలో విశ్వక్రీడల్లో భాగంగా కానుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసే అంశాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వర్గాలు వెల్లడించాయి. క్రికెట్ సహా మరో 8 కొత్త క్రీడలను ఒలింపిక్స్ క్రీడల తుది జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఈ జాబితాపై ఐఓసీ త్వరలోనే సమీక్ష నిర్వహించి 2028 ఒలింపిక్స్‌లో ఏఏ క్రీడలకు అనుమతి ఇవ్వాలో తేల్చనుంది. వచ్చే ఏడాది ముంబైలో జరిగే సమావేశాల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. క్రికెట్‌తో పాటు బేస్ బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లాక్రోస్సే, బ్రేక్ డ్యాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్ స్పోర్ట్ క్రీడలను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు ఐఓసీ ప్రతపాదించింది. కాగా, 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తొలిసారి విశ్వక్రీడల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ ఎవరంటే..? -
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా సీతారాముల కల్యాణం
లాస్ ఏంజిల్స్‌లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. లాస్ఏంజెసెల్ నగరానికి సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో లాస్ఏంజెలెస్ నగర వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. సిమీ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కల్యాణం అచ్చంగా భద్రచల శ్రీరాముల కల్యాణ మహోత్సవాన్ని తలపించింది. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించి అమెరికాకు తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో మేళతాళాల సాక్షిగా పెళ్లి జరిగింది. అనంతరం ఆడ పడుచుల కోలాటాల మధ్య సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకుంది. దాదాపు 50 మంది తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాదుకలకు పట్టాభిషేకం నిర్వహించారు. గోవింద, రామ నామా స్మరణతో ఆ ప్రాంగణం అంతా మార్మోగి పోయింది. ఈ కార్యక్రమములో పాల్గొన్న వారంతా సంప్రదాయ దుస్తులు ధరించారు. దాదాపు 700 మందికి పైగా భక్తులు కల్యాణోత్సవంలో భాగమయ్యారు. 70 కి పైగ జంటలు సామూహికంగా కళ్యాణం లో పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటలకు పైగా ఈ వేడుకలు జరిగాయి. ఈ కల్యాణోత్సవానికి సహాకరించిన ప్రతీ ఒక్క స్వచ్చంధ సంస్థకి నిర్వాహకులు రామ్ కొడితాల, నంగినేని చందు, టీ కుమార్, ఏ మనోహార్‌లు కృతజ్ఞతలు తెలిపారు. -
టెస్లాకు గట్టి పోటీ.. ఛార్జింగ్ లేకున్నా దూసుకెళ్తుంది!
ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరే చెప్పుకోక ఉండలేదు. టెస్లా కార్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాతనే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది టెస్లా. అలాంటి కంపెనీ నుంచి ఒక కారు వస్తుంది అంటే? దానికి ఉండే క్రేజ్ వేరు. టెస్లా గతంలో సైబర్ ట్రక్ పేరుతో ఒక కారును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఈ కారుని మార్కెట్లోకి తీసుకొని రాలేదు. అయితే, అచ్చం అలాంటి ఒక కారును చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ఎడిసన్ ఫ్యూచర్ కంపెనీ ఈఎఫ్1-టీ పేరుతో రూపొందించింది. అచ్చం టెస్లా సైబర్ ట్రక్ లాగా ఈ ఎడిసన్ ఫ్యూచర్ స్టార్టప్ కంపెనీ ఈఎఫ్1-టీ సోలార్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ కాన్సెప్ట్ ను నవంబర్ 19 నుంచి జరుగుతున్న లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఈ వారం ప్రదర్శించింది. ఇది అచ్చం చూడాటానికి టెస్లా సైబర్ ట్రక్ లాగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సోలార్ ట్రక్కును ఈఎఫ్1-టీ పేరుతో పిలుస్తారు. ఇది రిట్రాక్టబుల్ సోలార్ కవర్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ట్రక్ పగటిపూట ప్రయాణిస్తున్నపుడు దానికి అదే ఛార్జ్ అవుతుంది. సోలార్ రూఫ్ రోజుకు 25 నుంచి 35 మైళ్ల రేంజ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఈ ట్రక్ వెనుక భాగాన్ని మూసినప్పుడు ఈఎఫ్1-టీ పికప్ ట్రక్కు టెస్లా సైబర్ ట్రక్ లాగా కనిపిస్తుంది. ఈఎఫ్1-టీ రిట్రాక్టబుల్ సోలార్ ప్యానెల్స్ పొరల రూపాన్ని కలిగి ఉంటుంది. 724 కిమీ రేంజ్ టెస్లా సైబర్ ట్రక్ లాగా ఈ ట్రక్ గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ అవునా? కాదా అనేది తెలీదు. ఈఎఫ్1-టీ ఎలక్ట్రిక్ సోలార్ పికప్ ట్రక్కు లోపల17.5 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, మిర్రర్ కెమెరా స్క్రీన్లు, డోర్ మౌంటెడ్ టూల్ బాక్స్, రూఫ్ మౌంటెడ్ రీడింగ్ లైట్లు ఉన్నాయి. ఈఎఫ్1-టి ధర ఎంత అనేది తెలీదు, కానీ కంపెనీ 2025లో ట్రక్కును ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది ఈఎఫ్1-టీ ట్రక్ మూడు వేరియంట్స్ లలో అందుబాటులో ఉండనుంది. దీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 724 కిమీలకు పైగా దూసుకెళ్లనుంది. ఇది 0-100 కిమీ వేగాన్ని 3.9 సెకన్లలలో అందుకోనుంది. -
13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్‌కు తండ్రి నుంచి విముక్తి
Britney Spears Release Conservatorship From Her Father: ఎట్టకేలకు తండ్రి చెర నుంచి పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్(39) విముక్తి పొందింది. 2008లో బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతను ఆమె తండ్రి జేమిని స్పియర్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిట్నీ తన తండ్రి జేమీ స్పియర్స్ తన జీవితాన్ని నాశనం చేశాడని, అతని చెర నుంచి విముక్తి కల్పించాలని ఆమె గత జులైలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శుక్రవారం(నవంబర్ 12) ఈ కేసును విచారించిన లాస్ ఎంజిల్స్ కోర్టు తనకు ఊరటనిచ్చింది. చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే.. తన తండ్రి చెర నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ‘నా జీవితంలో ఇదే అత్యుత్తమైన రోజు’ అంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది. దీంతో ఆమెకు మద్దతు తెలిపేందుకు ఆమె ఫ్యాన్స్ లాస్ ఏంజిల్స్ కోర్టుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బ్రిట్నీ తన తండ్రి సంరక్షణలో భౌతికంగా, ఎమోషనల్, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయినట్లు ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదించారు. చదవండి: Kangana Ranaut: అప్పుడేం జరిగిందో చెబితే పద్శశ్రీ తిరిగి ఇచ్చేస్తా వారి వాదనలు విన్న లాస్ ఎంజిల్స్ కోర్టు ఆమెకు ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది. గత 13 ఏళ్ల నుంచి తన తండ్రి వల్ల మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు ఆమె ఇటీవల కోర్టులో పేర్కొంది. సంరక్షణ స్థానం నుంచి తన తండ్రిని తప్పించాలని, ఆయన వద్ద ఉన్న నియంత్రణాధికారాలను తొలగించాలని బ్రిట్నీ కోర్టును వేడుకుంది. 2008 నుంచి పాప్ సింగర్ బ్రిట్నీ తన తండ్రి జేమ్స్ స్పియర్స్ కస్టడీలో ఉంటున్నది. అయితే తనపై తన తండ్రికి ఉన్న న్యాయపరమైన నియంత్రణను తొలగించాలని ఆమె కోర్టును అభ్యర్థించింది. చదవండి: విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..? బ్రిట్నీ ఆర్థిక వ్యవహారాలన్నీ తండ్రి జేమ్స్ చూసుకున్నారు. 13 ఏళ్ల నరకం ఇక చాలు అని, తన జీవితాన్ని తనకు వెనక్కి ఇప్పించాలని ఆమె కోర్టును కోరింది. బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్నదని, ఆమెను తండ్రి చెర నుంచి విముక్తి చేయాలని ఆన్లైన్లో ఫ్రీ బ్రిట్నీ ఉద్యమం కొనసాగించిన విషయం తెలిసిందే. సంరక్షణాధికారాలను తన తండ్రి దుర్వినియోగం చేసినట్లు బ్రిట్నీ ఆరోపించింది. చదవండి: నా జీవితం నాక్కావాలి: కన్నతండ్రిపై సింగర్ సంచలన ఆరోపణలు View this post on Instagram A post shared by Britney Spears (@britneyspears) -
ఇళ్ల మీద కూలిన విమానం.. ఇద్దరు మృతి
వాషింగ్టన్/లాస్ ఏంజెల్స్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. విమానం ఒకటి ఇళ్ల మీద కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ఇళ్లతో పాటు.. పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఫాక్స్ ఐ సాన్ డియాగో రిపోర్ట్ ప్రకారం ఆరు సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్ ట్విన్ -ఇంజిన్ సెస్నా 340, అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరింది. ఒక గంట తర్వాత కాలీఫోర్నియా చేరుకున్న విమానం.. ఉన్నట్టుండి అక్కడ ఉన్న ఇళ్ల మీద కూలిపోయింది. (చదవండి: తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా) ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోగా.. ఇద్దరు మరణించారు. పక్కనే ఉన్న డెలివరీ ట్రక్ కూడా పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. చదవండి: భయానకం: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన విమానం Plane crash in #Santee, #California.pic.twitter.com/btP9TgyFVP — G219_Lost (@in20im) October 11, 2021 -
ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ఊహకందని ట్విస్ట్
లాస్ ఏంజిల్స్/కాలిఫోర్నియా: మనలో చాలామందికి.. రోడ్డు మీద, వీధుల్లో అప్పుడప్పడు కొందరు తారసపడుతుంటారు. చార్జీకి డబ్బులు తక్కువ ఉన్నాయని.. లేదంటే.. పర్సు మర్చిపోయాను.. తింటానికో లేక ఇంటికి వెళ్లడానికి డబ్బులు లేవు.. సాయం చేయమని వేడుకుంటుంటారు. మన దగ్గర ఉంటే సాయం చేస్తాం.. లేదంటే పక్కకు తప్పుకుంటాం. అయితే ఇలా అడిగే వారిలో చాలా మంది నకిలీలే ఉంటారు. అందుకే ఇలాంటి వారికి సాయం చేయాలంటే జనాలు ఆలోచిస్తారు. కానీ పెద్దలు ఓ మాట చెప్పారు. సమస్యలో ఉన్నానని.. సాయం కోరితే.. తిరిగి వారి వద్ద నుంచి ఆశించకుండా మనం సాయం చేస్తే.. తప్పకుండా మనకు మేలు జరుగుతుంది అని. ఈ మాటని నిజం చేసే సంఘటన ఒకటి లాస్ ఏంజిల్స్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని క్రిస్ ఈవాన్స్ అనే ట్విటర్ అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!) ఈ వీడియోలో ఓ మహిళ షాపింగ్ మాల్లో తనకు కావాల్సిన సరుకులు తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమె దగ్గరకు ఓ అపరిచితుడు వచ్చి.. ‘‘నా వాలెట్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను.. బాగా ఆకలి వేస్తుంది.. ఈ పూట మీరు నాకు ఆహారం కొనివ్వగలరా’’ అని సదరు మహిళను ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఇక్కడితో అయిపోలేదు.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. పర్స్ మర్చిపోయాను అని చెప్పిన వ్యక్తి సదరు మహిళకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె కొన్న సరుకులకు అతడే బిల్ కడతానని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆ అపరిచిత వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ.. ‘‘మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మీరు తీసుకున్న ఈ సరుకులన్ని మీకు ఉచితంగా ఇస్తున్నాను. మీకు కావాల్సిన సరుకులన్నింటిని మేమే కొని మీకు ఇస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా మంచివారు.. సాటి మనుషుల పట్ల జాలి, దయ కలిగి ఉన్నారు. నేను ఎవరో తెలియకపోయినా.. నేను చెప్పేది నిజమో.. అబద్ధమో కూడా ఆలోచించకుండా.. నా ఆకలి తీర్చడానికి అంగీకరించారు. మీ మంచి మనసుకు ఈ చిన్న బహుమతి’’ అన్నాడు. (చదవండి: ఈ రాజభవనం అద్దె ఎంతంటే......) తాను చేసిన పనికి ఇంత మంచి ఫలితం లభిస్తుందని ఊహించని సదరు మహిళ.. షాక్‌కు గురవుతుంది. అతడి మాటలు విని ఆనందంతో కన్నీరు పెడుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ‘‘మంచి మనసు ఉన్న వారికి ఎప్పుడు మంచే జరగుతుంది’’.. ‘‘ఫలితం ఆశించకుండా ఎవరికైనా మేలు చేసస్తే.. మనకు కూడా మేలు జరుగుతుంది’’ అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. My allergies are acting up 😢 pic.twitter.com/3hoMuXg63o — chris evans (@chris_notcapn) October 4, 2021 చదవండి: Viral: బట్టలతో మనుషుల్ని చంపేయగలరు తెలుసా? -
కాక్‌పిట్‌లోకి వెళ్లే ప్రయత్నం; విమానం నుంచి దూకేశాడు
లాస్ ఏంజిల్స్: కదులుతున్న విమానం నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేసిన ఘటన లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వివరాలు.. సాల్ట్ లేక్ సిటీకు వెళ్లాల్సిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ విమానం 5365ను స్కై వెస్ట్ నిర్వహిస్తోంది. కాగా సాయంత్రం 7 గంటల తర్వాత డోర్ తీసేందుకు ప్రయత్నించిన యువకుడు విమానంలో నుంచి బయటకు దూకేశాడు. అంతకముందు పైలట్లు ఉన్న కాక్‌పిట్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.ఆ తర్వాత సర్వీస్ డోర్ ఓపెన్ చేయాలనుకోగా.. చివరికి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడంతో అక్కడినుంచి దూకేశాడు. ఇది గమనించిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకుని ట్యాక్సీవేలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో విమానం టేకాఫ్ తీసుకొని మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. అతను విమానం నుంచి దూకేయడం వెనుక ఉన్న కారణాలు తెలియరాలేదు. కాగా ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ చేయనుంది. చదవండి: వార్నీ.. మంచం కింద ఇంత పెద్ద సొరంగమా..! -
‘‘విమానం ల్యాండ్ చేస్తారా.. దూకేయనా’’
వాషింగ్టన్: ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వల్ల విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. లాస్ ఏంజెల్స్ నుంచి నాష్‌విల్లేకు వెళ్లే విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 386 విమానం లాస్ ఏంజెల్స్ నుంచి నాష్‌విల్లేకు వెళ్తుంది. ఈ క్రమంలో దానిలో ఉన్న ఓ ప్రయాణికుడు సడెన్‌గా లేచి.. ‘‘విమానాన్ని ఆపండి.. లేదంటే నేను దూకేస్తాను’’ అంటూ.. లాక్ చేసిన కాక్పిట్ట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇతర ప్రయాణికులు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు. అతి కష్టం మీద అతడిని విమానంలో వెనక సీటులో కట్టి పడేశారు. ఆ తర్వాత విమానాన్ని న్యూమెక్సికోలోని అల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్పోర్ట్కు మళ్లీంచారు. "విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎఫ్‌బీఐ, పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తసుకున్నారు’’ అని డెల్టా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని.. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. అల్బుకెర్కీలోని ఎఫ్బిఐ ప్రతినిధి ఫ్రాంక్ ఫిషర్ తెలిపారు. ఈ ఘటన వల్ల ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అన్నారు. చదవండి: విమానంలో పుట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు! -
పార్టీ పేరుతో రచ్చ..150 మంది అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డ్రైయన్ లోపెజ్ తన 17వ పుట్టిన రోజుకు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. వెంటనే సోషల్ మీడియాలో “అడ్రియన్స్ కిక్‌బ్యాక్” పేరుతో ఆహ్వానాన్ని షేర్ చేశాడు. అయితే స్కూల్ మిత్రుల కోసం పంపిన ఆహ్వానాన్ని లోపెజ్ స్నేహితుడు యాహిర్ హెర్నాండెజ్ (16) తన స్నాప్‌చాట్, టిక్‌టాక్ ఖాతాలలో పోస్ట్ చేశాడు. దీన్ని కొందరు సోషల్ మీడియా సెలబ్రెటీలు షేర్ చేశారు. దీంతో 280 మిలియన్ల నెటిజన్లు “అడ్రియన్స్ కిక్‌బ్యాక్”ను వీక్షించారు. దీంతో దాదాపు 2500 మంది రావడంతో పార్టీని హంటింగ్టన్ బీచ్ నుంచి లాస్ ఏంజల్స్‌లో మరో చోటుకు మార్చారు. అయితే “అడ్రియన్స్ కిక్‌బ్యాక్”లో డబ్బులు పెట్టి టికెన్ కొన్న వారు ఈ విషయం తెలియక అక్కడకు వచ్చి పాటలు పెట్టుకుని..రోడ్డు పై వెళ్లే వాహనాలపై సీసాలు విసరడం మొదలుపెట్టారు. దాంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు లాస్ ఏంజిల్స్‌లో రాత్రిపూట అత్యవసర కర్ఫ్యూ విధించారు. ఆ పార్టీ ప్రారంభించక ముందే పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని మూసివేశారు. దీంతో గుంపులోని నుంచి పోలీసుల పై కాల్పులు జరిపారు. కాగా పోలీసులు పార్టీకి వచ్చిన దాదాపు 150 మందిని అరెస్ట్ చేశారు. (చదవండి: Kamal Nath: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు!) -
గంటకు 140 కిమీ వేగం.. అందుకే ప్రమాదం
లాస్ ఏంజిల్స్: రెండు నెలల కిందట గోల్ఫ్ స్టార్ టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వుడ్స్ కుడి కాలు విరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పోలీస్ అధికారులు కీలకమైన వివరాలను వెల్లడించారు. ఆ సమయంలో టైగర్‌వుడ్స్ గంటకు 87 మైళ్ల (140 కిలోమీటర్లు) వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదే స్పీడుతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. లాస్ ఏంజిల్స్‌లోని రాంచోస్ పాలోస్ వెర్డస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. నిజానికి ఆ ప్రాంతంలో గంటకు 45 మైళ్ల వేగంతో వెళ్లడానికి అనుమతి ఉన్నా.. టైగర్‌వుడ్స్ మాత్రం దానికి రెట్టింపు వేగానికి మించి వెళ్లాడు. విచారణకు సంబంధించిన విషయాలను బయటకు వెల్లడించడానికి వుడ్స్ అంగీకరించినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో వుడ్స్ ఉన్నట్లు కెప్టెన్ జేమ్స్ పవర్స్ చెప్పాడు. అయితే పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నట్లు తేలినా.. అక్కడ పోలీసు అధికారులుగానీ, ప్రత్యక్ష సాక్షులుగానీ లేకపోవడంతో టైగర్‌వుడ్స్‌పై ఎలాంటి క్రిమినల్ కేసూ పెట్టడం లేదు. ఒకవేళ తీవ్ర గాయాలు, మరణం, లేదా మరో వ్యక్తి ఈ ప్రమాదంలో ఉండి ఉంటే.. దీనిపై విచారణ కొనసాగించే వాళ్లమని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ప్రమాదంలో వుడ్స్ కాలు విరగడంతో అతనికి సర్జరీ చేసి రాడ్ వేశారు. దీంతో గురువారం ప్రారంభం కానున్న మాస్టర్స్ టోర్నీకి టైగర్‌వుడ్స్ దూరమయ్యాడు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు -
ల్యారీ కింగ్ కన్నుమూత
లాస్ ఏంజెలిస్: అర్ధ శతాబ్దానికి పైగా ప్రపంచ నేతలు, సినీ రంగ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల దాకా ముఖాముఖిలు నిర్వహించి సరికొత్త అధ్యాయం సృష్టించిన టాక్ షో లెజెండ్ ల్యారీ కింగ్(87) కన్నుమూశారు. లాజ్ ఏంజెలిస్‌లోని సెడార్స్–సినాయ్ మెడికల్ సెంటర్లో శనివారం కింగ్ కన్నుమూశారని ఆయన సహ వ్యవస్థాపకుడుగా ఉన్న ఓరా మీడియా ట్విట్టర్లో తెలిపింది. జనవరి 2వ తేదీన కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని ఆయన కుమారుడు చాన్స్ ధ్రువీకరించారు. 1985 నుంచి 2010 వరకు సుదీర్ఘకాలం రేడియో హోస్ట్‌గా ఉన్నారు. 2010 నుంచి సీఎన్ఎన్లో పనిచేశారు. ఆయన నిర్వహించిన 50వేలకు పైగా కార్యక్రమాలు రేడియో, టీవీల్లో ప్రసారమయ్యాయి.1995లో మధ్యప్రాచ్యం శాంతి చర్చలకు ల్యారీకింగ్ అధ్యక్షత వహించారు. ఎలిజబెత్ టేలర్, మిఖాయిల్ గోర్బచెవ్, బరాక్ ఒబామా, బిల్‌గేట్స్, లేడీ గాగా వరకు ఆయన ఎందరో ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. 1933లో యూదుల కుటుంబంలో జన్మించిన ల్యారీ చిన్నతనంలో ఎన్నో కష్టాలు చవిచూశారు. -
జేమ్స్ బాండ్ 007 నటి మృతి
లాస్ ఎంజెలస్: జేమ్స్ బాండ్ 007 సిరీస్ నటి తన్య రాబర్ట్(65) మృతి చెందారు. ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆమె ఆదివారం కన్నుమూశారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 24న తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్-సినార్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆమె స్నేహితుడు, ప్రతినిధి మైక్ పింగెల్ స్థానిక మీడియాకు తెలిపాడు. దీంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారన్నారు. ఈ క్రమంలో తన్య నిన్న మృత్యువాత పడినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆమె మృతికి కారణం ఇంకా తెలియలేదని, చనిపోవడానికి ముందు తన్య రాబర్ట్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విక్టోరియా లీ బ్లమ్లో జన్మించిన తాన్య రాబర్ట్స్ మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1975లో వచ్చిన హర్రర్ చిత్రం ఫోర్స్డ్తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 1985లో జేమ్స్ బాండ్ 007 చిత్రంలో తన్య అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్టాసే సుట్టన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతో తన్య నటిగా మంచి గుర్తింపు పొందారు. అయితే సినిమాలలో నటించడానికి ముందు ఆమె కొన్ని టెలివిజన్ ప్రకటనలు కూడా చేశారు. -
రిస్క్ చేస్తే ఇలాంటివే జరుగుతాయి
లాస్ ఏంజిల్స్ : రైల్వే ట్రాక్ దాటుతున్న కారును రైలు వేగంగా వచ్చి ఈడ్చుకెళ్లిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో కారును రైలు ఈడ్చుకెళ్లిన దృశ్యం చూస్తే ఎవరికైనా భయం కలగాల్సిందే... అయితే ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయినా డ్రైవర్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడటం విశేషం. ఈ ఘటన లాస్ ఏంజిల్స్‌లో చోటుచేసుకుంది. కాగా ఈ సన్నివేశం మొత్తం అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్ వద్ద గేటు లేకపోతే జరిగే ప్రమాదం ఎలా ఉంటుందనడానికి ఇదే ఉదాహరణ. దీనిని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. ఆ వీడియాలో కారు రైల్వే క్రాసింగ్ దగ్గరకు మెల్లిగానే వచ్చినట్లు తెలుస్తుంది. అయితే గేట్ లేకపోవడంతో మొదటి లెవల్ క్రాసింగ్ వద్దకు రాగానే రైలు వస్తుందో లేదో గమనించి కారును ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక రైలు వేగంగా వచ్చి కారును ఈడ్చుకెళ్లింది. ' ఈ ఘటనను మేం అస్సలు ఊహించలేదు. ప్రమాదంలో కారు మొత్తం నుజ్జయినా డ్రైవర్ మాత్రం చిన్న గాయాలతో బయటపడడం అదృష్టమనే చెప్పాలి. కానీ ఈ సన్నివేశం అందరికి ఒక గుణపాఠం కావాలి. రైల్వే గేటు లేకున్నా.. సిగ్నల్స్, రైలు వస్తుంది..లేనిది గమనించి వెళితే బాగుంటుంది. అనవసర రిస్క్‌లు తీసుకుంటూ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు' అంటూ పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కారు డ్రైవర్‌దే తప్పు ఉందంటూ.. రైలు వస్తుందో..లేదో గమనించి వెళితే బాగుండేదని కామెంట్లు పెడుతున్నారు. -
'మీరిచ్చే ఆఫర్ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది'
ఆస్టిన్ : ఆస్టిన్ నుంచి లాస్ ఏంజిల్స్ వెళ్లడానికి పాట్రిక్ కాసిడీ అనే వ్యక్తి బుధవారం డెల్టా ఎయిర్‌లైన్స్ ఎక్కాడు. కాసిడీ తన సీటులో కూర్చుని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి పని చేసుకుంటున్నాడు. ఇంతలో తన ముందు సీటులో కూర్చున్న వ్యక్తి నిద్రపోవడానికి తన సీటును వెనక్కు వాల్చాడు. దాంతో ల్యాప్‌టాప్ మీద సీటు బరువు పడడంతో కంప్రెస్ అయి స్ర్కీన్ పగిలిపోయింది. అయితే తన ల్యాప్‌టాప్ అలా అవడానికి కారణమైన వ్యక్తిని ఏం అనకుండా కాసిడీ ఆ విషయాన్ని డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి ట్విటర్లో షేర్ చేశాడు. @Delta small note for the suggestion box, maybe have a little warning sign or someway to prevent my laptop from being destroyed when the person in front of me reclines their seat. pic.twitter.com/QHmphXiDhH — Pat Cassidy (@HardFactorPat) February 26, 2020 ' @డెల్టా ఎయిర్‌లైన్స్.. ముందు సీటులో కూర్చున్న వ్యక్తి తన సీటును వెనక్కి వాల్చే ముందు తగిన హెచ్చరికలు బోర్డులు పెడితే బాగుండేది. మీరు అలా పెట్టకపోవడం వల్లే నా ల్యాప్‌టాప్ ద్వంసమైంది' అని పేర్కొన్నాడు. దీంతో పాటు ల్యాప్‌టాప్ ఫోటోను కూడా వారికి షేర్ చేశాడు. అయితే ఈ విషయంపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందించింది. కాసిడి ఫిర్యాదు మేరకు అతని వస్తువుకు భంగం కలిగించినందుకు మా విమానంలో ఎప్పుడైనా సరే 7500 మైళ్లు ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించింది. అయితే కాసిడీ రీట్వీట్ చేస్తూ..' నాకు 7500 మైళ్లు ఉచిత ప్రయాణం ఆఫర్ చేయడం బాగానే ఉంది. కానీ మీరు ఇచ్చిన ఆఫర్ ఒక ఆరేళ్ల పిల్లాడికి ఇచ్చుంటే ఎగిరి గంతేసేవాడు' అని పేర్కొన్నాడు. అయితే కాసిడి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ల్యాప్‌టాప్ ధ్వంసం కావడానికి ఒక వ్యక్తి కారణమైతే డెల్టా ఎయిర్‌లైన్స్‌ను ఆశ్రయించడం ఏంటని....డెల్టా ఎయిర్‌లైన్స్ ఇచ్చిన ఆఫర్ తీసుకుంటే బాగుండేదని కొందరు పేర్కొనగా... మరి కొందరు మాత్రం పాట్రిక్‌కు మద్దతుగా నిలిచారు. Update: @Delta is giving me the equivalent of a $75 gift card and an explanation that you would give a six year old. Cool. pic.twitter.com/etGLUXOOjs — Pat Cassidy (@HardFactorPat) February 29, 2020 -
ఆస్కార్ అవార్డును సీటు కింద దాచిపెట్టాడు
-
ఆస్కార్ అవార్డును సీటు కింద దాచిపెట్టాడు
లాస్ ఏంజెల్స్ : హాలీవుడ్ డైరెక్టర్ టైకా వైటిటి చేసిన ఒక చిలిపి పని ఇప్సుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో జోజో రాబిట్ సినిమాకు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో టైకా వైటిటి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా అవార్డు కార్యక్రమం మధ్యలో తైకా వెయిటిటి తన అవార్డ్‌ను తన ముందున్న సీటు కింద దాచిపెట్టాడు. దీనిని గమనించిన హాలివుడ్ నటి బ్రీ లార్సన్ తన ఫోన్ కెమెరాలో బంధించి ట్విటర్లో షేర్ చేశారు. అయితే తైకా ఈ పని చేస్తుండగా తనకు తెలియకుండానే బ్రీ లార్సన్ కెమెరాకు చిక్కాడు. ఆ తర్వాత తన చేతిలో ఏ అవార్డు లేదంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. అయితే ఇదంతా లార్సన్ తన ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన నెటిజన్లు' టైకా వెయిటి! మీ చిలిపి పని బాగుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. Academy Award Winner @TaikaWaititi 💗 pic.twitter.com/PpZl1PhX8y — Brie Larson (@brielarson) February 10, 2020 -
నాకు నటించడం రాదు: నటుడు
లాస్ ఎంజెల్స్: తనకు ఎలా నటించాలో తెలియదని అంటున్నాడు ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ థామస్ ప్యాటిన్సన్. ‘నిజంగా నాకు ఎలా నటించాలో రాదు. ఏదో ఒక విధంగా నటించి దాన్ని నిజమని ప్రేక్షకులు అనుకునేలా చేయాలనుకుంటాను. నా నటనతో ప్రేక్షకుల్ని కదిలించగలిగితే.. అప్పుడే దానిని నిజం చేయాగలిగానని నమ్ముతాను. అయితే ప్రేక్షకులు భిన్నమైన అనుభూతిని కలిగించే సన్నివేశాల కోసం ఎదురు చూడటం మానేయాలి’ అని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు ఈ హ్యరీ పోటర్ నటుడు. అదే విధంగా నటించేటప్పుడు తన చూట్టు కెమెరాలు ఉన్న విషయాన్ని కూడా మరిచిపోతానని, దాదాపుగా సీన్లు అన్నింటిని సింగిల్ టేక్‌లోనే చేస్తానని, ఇది చూసి డైరెక్టర్లు, నిర్మాతలు కొన్నిసార్లు ఆశ్చర్యపోతారంటూ ప్యాటిన్సన్ చెప్పాడు. అయితే కొన్ని సందర్భాలలో తాను పరాభవాలు చూడాల్సి వస్తుందేమోనని అప్పుడప్పుడూ నిరాశకు గురవుతానని, నిరాశ దృక్పథం కూడా కొన్నిసార్లు ప్రయోజనకరంగా ఉంటుందని ప్యాటిన్సన్ చెప్పుకొచ్చాడు. ‘నేను నిరాశ వాదిని. ఏదో ఒక రోజు జీవితంలో నాకు చేదు అనుభవం ఎదురుపడొచ్చు అని అనుకుంటూ ఉంటాను. ఒకవేళ అది జరిగినా కూడా నాకు సంతోషమే.. దానిని ఎదుర్కొవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే’. అని అన్నాడు. అలాగే ‘ఓ సాధారణ నటుడిలా ఎలా నటించాలో నాకు తెలియదు. అలా అని నేనో గొప్ప నటుడినని కూడా అనుకోను కానీ.. నేను కొన్ని పాత్రలను ఇష్టపడతాను, కొన్ని ప్రత్యేక పాత్రలకు ఆకర్షితుడిని అయ్యాను.’ అంటూ ప్యాటిన్సన్ తెలిపాడు. -
అంతరిక్షం నుంచి కార్చిచ్చు ఫొటోలు
వాషింగ్టన్ : అమెరికా అడవుల్లో మరోసారి కార్చిచ్చు రగులుతోంది. కాలిఫోర్నియా, పశ్చిమ లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు. అక్టోబరు 23న మొదలైన కార్చిచ్చు వల్ల హాలీవుడ్ నటులు సహా దాదాపు 10 వేల మంది వెస్ట్ లాస్ ఏంజెల్స్ నివాసులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర కాలిఫోర్నియా, సోనోమా కంట్రీలో నివసిస్తున్న దాదాపు లక్షన్నర మంది అగ్ని ప్రమాద బాధితులుగా మిగిలిపోయారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన వ్యోమగామి అండ్రూ మోర్గాన్ కార్చిచ్చుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం స్పేస్ స్టేషన్లో ఉన్న అతడు.. ‘ అంతరిక్షం నుంచి కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటల ఫొటోలు తీశాను. ఈ ఘటనలో ఇళ్లు కోల్పోయిన వారి గురించి, వాళ్లను కాపాడిన సాహసవంతుల గురించి ఆలోచిస్తున్నా అని ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా అతడి ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ అంతరిక్షంలో ఇంత స్పష్టత ఉన్న లెన్సులు ఉన్నాయా’ అంటూ కొంతమంది సందేహం వ్యక్తం చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఇంత గొప్ప టెక్నాలజీని ఉపయోగిస్తున్న మనం.. కార్చిచ్చు రగలకుండా మాత్రం జాగ్రత్తపడలేకపోతున్నాం. అమెజాన్.. ఇప్పుడు ఇది ఇలా ఎన్ని అడవులు నాశనమైనా మానవాళి తీరు మారదు’ అని కామెంట్లు చేస్తున్నారు. From @Space_Station I was able to catch these pictures of the California wildfires burning north of the Bay Area. Thinking of the people who have lost their homes and the brave first responders on the front lines protecting them. pic.twitter.com/islV3DP5yM — Andrew Morgan (@AstroDrewMorgan) October 30, 2019 -
అమెరికాలో కత్తిపోట్లు..
లాస్ఏంజెలిస్: దోచుకోవడమే లక్ష్యంగా రెచ్చిపోయిన ఓ వ్యక్తి యథేచ్ఛగా కత్తిపోట్లకు పాల్పడటంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మాన్‌గ్రోవ్ సిటీలో జరిగింది. సిటీకి చెందిన ఓ వ్యక్తి(33) మొదటగా తన అపార్టుమెంట్‌లోని ఓ దుకాణదారును కత్తి చూపి బెదిరించి, దోచుకున్నాడు. ఆపైన ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి అతని వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నాడు. ఈ ఘటనలో ఆ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కత్తి, తుపాకీ చూపి బెదిరిస్తూ సుమారు ఆరు దుకాణాల్లో నగదు దోచుకున్నాడు. మొత్తం ఆరుగురిని గాయపరచగా నలుగురు మృతి చెందారు. రెండు గంటలపాటు చెలరేగి పోయిన అతడిని పక్కనే ఉన్న సాంటాఅనా సిటీలో పోలీసు డిటెక్టివ్లు పట్టుకున్నారు. -
కాలిఫోర్నియాలో మళ్లీ భూకంపం
లాస్ఏంజెల్స్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. లాస్ ఏంజెల్స్‌లో భూకంపం కారణంగా భవనాలు కంపించా యని, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు వాటిల్లాయని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల సంబంధమైన నష్టం అంతగా సంభవించలేదని లాస్ ఏంజెల్స్ కౌంటీ ఫైర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దక్షిణ కాలిఫోర్నియాలో గత రెండు దశాబ్దాల్లో ఇదే అతి పెద్ద భూకంపమని లాస్ ఏంజెల్స్ టైమ్స్ తెలిపింది. జనం ఇళ్లను వదిలిపెట్టారని, ఇళ్ల పునాదులు పగుళ్లిచ్చాయని, అడ్డగోడలు కుంగిపోయాయని శాన్ బెర్నార్డినో ఫైర్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేసింది. లాస్ ఏంజెల్స్‌కు 240 కిలోమీటర్ల దూరంలోని రిడ్జ్‌క్రెస్ట్ అనే చిన్న నగరం ఈ భూకంపం కారణంగా భయంతో వణికిపోయింది. అసలు తాము బతుకుతామనుకోలేదని, భవనం కప్పు కూలి తనపై అక్కడున్న అతిథులపై పడిందని ఆ నగరంలో సూపర్ 8 అనే హోటల్ నడుపుతున్న భారత సంతతికి చెందిన పింకీ పాంచల్ సీఎన్ఎన్కి తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని భూకంపాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
ఆ టైమ్ వచ్చింది
దాదాపు ఏడాది పూర్తి కావొచ్చింది ‘రేస్ 3’ సినిమా విడుదలై. ఒక్క జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తప్ప ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లంతా తమ తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ బ్యూటీ తర్వాతి సినిమాపై ఇంకా ఎందుకు క్లారిటీ రాలేదబ్బా? అని బీటౌన్‌లో ఎంక్వైరీ చేసిన వారికి ‘ఆమె యాక్టింగ్ క్లాసులకు వెళుతోందని, అది కూడా లాస్ ఏంజిల్స్‌లోని ఇవనా చుబ్బుక్ స్టూడియోలో’ అని తెలిసింది. చార్లైజ్ త్రోన్, బ్రాడ్‌పిట్, జేమ్స్ ఫ్రాంకో వంటి హాలీవుడ్ స్టార్లు ఈ స్టూడియోలోనే యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్ల తర్వాత యాక్టింగ్ క్లాసులు ఏంటి? అని జాక్వెలిన్‌ని అడిగితే.. ‘‘దశాబ్దకాలంగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను. నా కెరీర్ తొలినాళ్లలో సినిమాల గురించి అర్థం చేసుకోవడానికి నాకు టైమ్ పట్టింది. కానీ నేనెప్పుడూ యాక్టింగ్ క్లాసులు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ట్రైనింగ్ బాగుంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేశాను. ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్, ఎక్స్పరిమెంట్ .. ఇలా రెండు జానర్లను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయాల్సిన టైమ్ వచ్చిందని తెలిసింది. అందుకే ట్రైనింగ్ తీసుకుంటున్నాను’’ అన్నారు. తాను నటించిన ‘డ్రైవ్’ గురించి మాట్లాడుతూ – ‘‘నేను, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ సినిమా విడుదల ఆగిపోలేదు. త్వరలోనే ఆడియన్స్ థియేటర్స్‌లో చూస్తారు’ అని చెప్పుకొచ్చారు జాక్వెలిన్. -
లాస్ ఏంజెల్స్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
లాస్ ఏంజెల్స్ : 2019 ఎన్నికలో వైఎస్సార్సీపీ విజయదుందిబి మోగించిన సందర్భంగా లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇర్విన్ పట్టణంలోని శ్రీ శివ కామేశ్వరి దేవస్థానం నుండి కారు ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రవాసాంధ్రులు సమావేశమై 9సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ నిర్వహించిన పాదయాత్ర వలన ప్రజల సమస్యలు పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా, జగన్ చూపించిన పరిష్కార మార్గాలు, ప్రజలలో విశ్వాసం కలిగించిందని ఎన్ఆర్ఐలు అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు, కార్యకర్తలు కళ్లముందే పంచభూతాలను కూడా వదలకుండా దోచుకోవడం, ప్రజల ఆగ్రహానికి గురి అయ్యిందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి, సమయం వెచ్చించి, గత ప్రభుత్వ దుర్మార్గాలను, అవినీతి విధానాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించటం సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. వైఎస్సార్సీపీ గెలిచిన సీట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా, ఓట్ల పరంగా చూస్తే ఇంకా కష్టపడవలసిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ప్రపంచ చరిత్రలోనే జరగనంత అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేసినప్పటికీ, కేవలం ఎల్లో మీడియా చూపించినా అసత్యాలు, అర్ధసత్యాలు, అభూతకల్పనల వలన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు 40శాతం ఓట్లు సాధించారన్నారు. రాబోయే రోజుల్లో వారిలో కూడా సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించవలసిన భాధ్యత వైఎస్సార్సీపీ అభిమానులకు ఉందని ఆన్నారు. మహాభారతంలో అభిమన్యుడి వలే ఓడించాలని అందరూ కలసి ప్రయత్నించారని, కానీ వైఎస్ జగన్ అర్జనుడిలా ఎదిరించి విజయం సాధించారని, ఈ విజయానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించారని ఆన్నారు. సూర్య గంగిరెడ్డి, రామ కృష్ణా రెడ్డి భూమా, భాస్కర్ అళ్లూరు, శ్రీనివాస్ రెడ్డి పడిగెపాటి, బయపారెడ్డి దాడెం, ప్రవీళ్ ఆళ్లల ఆధ్వర్యం ఈ కార్యక్రమం జరిగింది. ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అభిమానులకు సూర్య గంగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
బొబ్బింగ్ అండ్ బ్లాకింగ్!
అప్రైట్ స్టాన్స్, సెమీ క్రౌచ్, ఫుల్ క్రౌచ్, జబ్, క్రాస్, హుక్, బొబ్బింగ్, బ్లాకింగ్... ఇదిగో ఈ పదాలనే మార్చి మార్చి పలుకుతున్నారు వరుణ్ తేజ్. స్పోర్ట్స్ గురించి.. అది కూడా బాక్సింగ్ గురించి తెలిసినవారికి ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ ప్రస్తావించిన పదాలన్నీ బాక్సింగ్‌కి సంబంధించినవి అని. హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ సాధన మొదలు పెట్టారు. ఈ ప్రత్యేకమైన శిక్షణ కోసం ఆయన లాస్ ఏంజిల్స్ వెళ్లారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్ర చేయనున్నారు. ‘‘లాస్ ఏంజిల్స్‌లో బాక్సింగ్ శిక్షణ మొదలైంది’’ అంటూ తన ప్రాక్టీస్‌కి సంబంధించిన ఫొటోను బయటపెట్టారు వరుణ్. ఇక కిరణ్ కొర్రపాటి విషయానికి వస్తే... ఇంతకుముందు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మిస్టర్, తొలిప్రేమ’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. వరుణ్‌తో కిరణ్ దర్శకత్వం వహించనున్న తాజా సినిమాకు వరుణ్ తేజ్ కజిన్ అల్లు బాబీ (నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు) ఒక నిర్మాత అని తెలిసింది. -
అందుకే... నువ్వంటే నాకిష్టం!
కొన్ని రోజులుగా శ్రుతీహాసన్ కాస్త మూడీగా ఉంటున్నారు. పనులన్నీ చేస్తూనే ఉన్నారు. అందరితో బాగానే ఉంటున్నారు. కానీ ఎక్కడో ఏదో చిన్న లోటు. కారణం.. మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్ గురించి తెలిసినవాళ్లకు మైఖేల్ పరిచయం లేని పేరు. ఆమె భాషలో చెబితే అతను శ్రుతీ బెస్ట్ ఫ్రెండ్... మన భాషలో చెప్పుకుంటే బాయ్‌ఫ్రెండ్. లండన్‌లో ఉండే థియేటర్ ఆర్టిస్ట్ కోర్సలే. కొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ మధ్యలో వీళ్లిద్దరూ కలుసుకోవడం కుదర్లేదు. టీవీ షో చేస్తూ చెన్నైలో బిజీ బిజీగా గడిపారు శ్రుతీ. దాంతో ఇద్దరికీ మిస్సింగ్ మిస్సింగ్ అయింది. ప్రేమ భాషలో చెప్పాలంటే విరహం. మ్యూజిక్ వర్క్ మీద లాస్ ఏంజెల్స్ వెళ్లారు శ్రుతీ. అక్కడ మైఖేల్‌ను చాలా రోజుల తర్వాత కలిశారు. ఇంకేముంది అవధుల్లేని ఆనందం వచ్చేసింది శ్రుతీకి. ఆ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘నువ్వు నన్ను బాగా నవ్విస్తావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. చాలా రోజుల తర్వాత నా ప్రియమైన వ్యక్తిని కలిశాను’’ అంటూ సెల్ఫీని పోస్ట్ చేశారు శ్రుతి.