Malavika
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో భర్త పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి.. సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త తేజస్ జ్యోతి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. బిడ్డ చేతిని పట్టుకున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత మాళవిక, తేజస్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ బుల్లితెర ప్రేమజంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మాళవిక ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీపై పోస్టులు పెడుతూనే ఉంటోంది. బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా.. మాళివిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) -
రన్నరప్ మాళవిక
సార్బ్రుస్కెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ మాళవిక 10–21, 15–21తో ప్రపంచ 36వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూసింది. మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల మాళవికకు 7,980 డాలర్ల (రూ. 6 లక్షల 70 వేలు)ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో రన్నరప్‌గా నిలువడం మాళవికకు ఇది రెండోసారి. 2022లో జరిగిన సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీ ఫైనల్లో పీవీ సింధు చేతిలో ఓడిపోయి మాళవిక రన్నరప్‌గా నిలిచింది. -
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో మాళవిక
సార్‌బ్రుకెన్ (జర్మనీ): భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ మాళవిక 23–21, 21–18తో జూలియా జాకబ్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 44 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన మాళవిక ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ముందంజ వేసింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ఏడో సీడ్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో మాళవిక తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుశ్ షెట్టి పరాజయం పాలయ్యాడు. అన్‌సీడెడ్ ఆయుశ్ షెట్టి 17–21, 13–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 28వ స్థానంలో ఉన్న పొపొవ్‌పై 51వ ర్యాంకర్ ఆయుశ్ ఆధిక్యం ప్రదర్శించలేకపోయాడు. 49 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో చక్కటి ప్రదర్శనతో ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చిన ఆయుశ్... రెండో గేమ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. -
కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్
టీవీ సీరియల్స్, టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2 ద్వారా పాపులర్ అయిన మలయాళ కుట్టి మాళవిక కృష్ణదాస్ త్వరలో తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మాళవిక క్లాసికల్ డేన్సర్ కూడా. నటనతోపాటు, శాస్త్రీయ నృత్యంలో కూడా అనేక అవార్డులు రివార్డులుగెల్చుకుంది. 2023లో ‘నాయికా నాయకన్’ కో-కంటెస్టెంట్ తేజస్ జ్యోతిని వివాహం చేసుకుంది. ఇపుడు ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది. -
హైదరాబాద్ హెచ్ఐసీసీలో.. హైలైఫ్ ఎగ్జిబిషన్!
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు. -
ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్ మాళవిక శర్మ (ఫొటోలు)
-
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్‌ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.కొచ్చిలోని ప్రముఖ హోటల్లో మాళవిక-నవనీత్ రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. .@mammukka #yusufAli @PrithviOfficial #Supriya @ #Jayaram’s daughter Malavika’s wedding reception in Kochi pic.twitter.com/ff1VoT9mVk— sridevi sreedhar (@sridevisreedhar) May 5, 2024 -
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు
ప్రముఖ నటుడు జయరాం ఇంట పెళ్లి బాజాలు మోగాయి. జయరాం- పార్వతి దంపతుల కూతురు మాళవిక పెళ్లి ఎంతో సింపుల్‌గా జరిగింది. పాలక్కడ్‌కు చెందిన నవనీత్ గిరీశ్‌తో ఏడడుగులు వేసింది. శుక్రవారం నాడు కేరళలోని గురువాయూర్ ఆలయంలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్ సహా ఇతర రాజకీయ, సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వరుడు నవనీత్ గిరీశ్ విషయానికి వస్తే.. అతడు ప్రస్తుతం యూకేలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.మాళవిక విషయానికి వస్తే.. ఆమె వేల్స్ దేశంలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసింది. మాళవిక- నవనీత్ల ఎంగేజ్మెంట్ కర్ణాటకలోని మడికెరిలో గతేడాది డిసెంబర్లో జరిగింది. -
నకిలీ సబ్ఇన్స్పెక్టర్ మాళవికను పోలీసులు అరెస్ట్ చేశారు
-
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: హీరో గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు. ► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్‌గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను. ► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారాయన. ► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్‌గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు. ► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. -
'చాలా బాగుంది' హీరోయిన్ ఎలా మారిపోయిందో చూశారా?
శ్వేత కొన్నూర్ మీనన్.. ఈ పేరు చెప్పగానే ఎవరబ్బా అనుకునేరు? హీరోయిన్ మాళవిక అసలు పేరిది! 19 ఏళ్ల వయసులోనే ఉన్నాయ్ తేడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్‌స్టర్ కొట్టింది. రోజావనం మూవీతో తన సత్తా నిరూపించుకుంది. ఇంకేముంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ రారమ్మని పిలిచింది. చాలా బాగుంది సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తం, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. రీఎంట్రీకి సిద్ధం తెలుగు, తమిళంతోపాటు మలయాళ, హిందీ, కన్నడ సినిమాలు కూడా చేసింది. 2009లో చివరగా ఆరుపాడై సినిమా చేసింది. అందులో అతిథి పాత్రలో కనిపించింది. 2007లో సుమేష్ మీనన్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయింది. చాలాకాలానికి గోల్మాల్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. 44 ఏళ్ల వయసులోనూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటోందీ బ్యూటీ. మరింత బలంగా మార్చుతుంది తాజాగా తన సోషల్ మీడియాలో యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఈ జర్నీ అంత సులువేం కాదు.. కానీ యోగా పట్ల నీకు ఎంత నిబద్ధత ఉందనేది తెలుస్తుంది. రోజూ యోగా మ్యాట్ నేలపై పరచడమనేది మొక్కకు నీళ్లు పోయడంలాంటిది. ఇది మిమ్మల్ని మరింత బలంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుతుంది. కఠినతరమైన పరిస్థితుల్లో కూడా ఒక్కసారి యోగా చేసి గాఢంగా శ్వాస తీసుకుంటే అది మీ పురోగతికి ఉయోగపడుతుంది. నన్ను నమ్మండి.. ఒక్కసారి కమిట్ అయ్యాక దాన్ని వదిలేయకూడదు.. కట్టుబడి ఉండాలి. ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ఉండాలి. అప్పుడు వచ్చే సానుకూల మార్పులను మీరే చూస్తారు. నన్ను నమ్మండి.. ఇదే నిజం అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. కాగా మాళవిక.. తరచూ తన వర్కవుట్, యోగా వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) చదవండి: ఆ సినిమాలో నేనూ హీరోయిన్నే.. కానీ నన్ను తీసేశారు! -
గల్లీ సౌండుల్లో భీమా
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కేకే రాధామోహన్ నిర్మించిన ‘భీమా’ మార్చి 8న రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లీ సౌండుల్లో..’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. రవి బస్రూర్, సంతోష్ వెంకీ రాసిన ఈ పాటను సంతోష్ వెంకీ పాడారు. ‘‘గోపీచంద్ పాత్ర గురించి చెప్పే ట్రాక్ ఇది. ఈ పాట మాస్‌ని అల రించేలా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
సంక్రాంతి మాకెంతో ప్రత్యేకం
‘సంక్రాంతి పండగ అంటే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటున్నారు పాయల్ రాజ్‌పుత్. ‘సంక్రాంతికి ఫుల్ ఎనర్జీతో భోగి మంటలు వేస్తుంటాను’ అన్నారు మానసా చౌదరి. ‘సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడమంటే చాలా ఇష్టం’ అంటున్నారు మాళవికా శర్మ. ఇలా సంక్రాంతిని తాము ఎలా జరుపుకొంటామో అంటూ ఈ కథానాయికలు సాక్షితో పంచుకున్న విశేషాలు.. ఎన్నో జ్ఞపకాలు ఉన్నాయి – పాయల్ రాజ్‌పుత్ నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. పంజాబీ ఆడియన్స్ కు హ్యాపీ లోహ్రీ. సంక్రాంతి పండగ అంటే నాకు ఎన్నో జ్ఞపకాలు గుర్తొస్తాయి. ప్రతి ఏడాది సంక్రాంతిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. పూజలు చేస్తాం.. ఇష్టమైన వంటకాలు చేసుకుంటాం. చిన్న తనంలో సంక్రాంతి పండక్కి గాలిపటాలను ఎగరవేసేదాన్ని. కానీ, నా జీవితం ఇప్పుడు చాలా మారిపోయింది. కాబట్టి గాలిపటాలను ఎగరవేసే సమయంలో మనలో కలిగే ఆ ఆనందపు అనుభూతిని కొంతకాలంగా మిస్ అయ్యాను. ఈ సారి ఢిల్లీలో నా స్నేహితులతో కలిసి గాలిపటాలను ఎగర వేయాలని ప్లాన్ చేస్తున్నాను. నా సిబ్బందిలో కొంతమంది హైదరాబాదీలు ఉన్నారు. వారితో పాటు సంక్రాంతిని నేను సెలబ్రేట్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. నేను భోజన ప్రియురాలిని. ప్యూర్ వెజిటేరియన్ ని. మసాలా కిచిడీ, లడ్డు అంటే చాలా ఇష్టం. ఇలా మా అమ్మగారు పండక్కి చేసిన వంటకాలను ఇష్టంగా తింటాను. ఇక నేను నటించిన తాజా చిత్రం ‘మంగళవారం’ మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.. నా అభిమానులకు కూడా థ్యాంక్స్. ఓ నటిగా మంచి కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. గాలిపటాలు ఎగరవేయడం చాలా ఇష్టం – మాళవికా శర్మ సంక్రాంతి అంటే ముఖ్యంగా రైతుల పండగ. వారు ఎంతోకష్టపడి పండించిన పంటలు ఈ సంక్రాంతికి వారి చేతికి వస్తాయి. సూర్యభగవానుడికి పూజలు చేయడంతో మా సంక్రాంతి మొదలవుతుంది. మా అమ్మమ్మ మాకు ప్రతి సంక్రాంతికి కొత్త దుస్తులు ఇస్తుంటారు. నువ్వుల లడ్డూలు ఇస్తారు. లక్కీగా మా అమ్మమ్మగారి బర్త్ డే కూడా సంక్రాంతి రోజునే. మేము కూడా స్వీట్స్‌ను పంచిపెడతాం. మేం చేయగలిగినంతలో పేదలకు సాయం చేస్తుంటాం. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరిలానే నాకు గాలిపటాలను ఎగరవేయడం చాలా ఇష్టం. ఆకాశంలో కనిపిస్తున్న రంగు రంగుల గాలిపటాలు.. భూమిపై రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు ప్రతీకగా నేను భావిస్తుంటాను. నాపై తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలకు చాలా రుణపడి ఉంటాను. ముంబై నా జన్మభూమి అయితే హైదరాబాద్ నా కర్మభూమి. ఎందుకంటే.. నేను ఇక్కడే మూవీస్ చేస్తున్నాను. నేను నటించిన గోపీచంద్‌గారి ‘భీమా’, సుధీర్‌బాబుగారి ‘హరోంహర’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల్లో నా పాత్ర చాలా ఎగై్జటింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలే చేయాలనుకుంటున్నాను. సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం – మానసా చౌదరి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరు స్వగ్రామం. నాన్న మధుసూదన్ నాయుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో స్థిరపడ్డారు. మేము చెన్నైలో ఉన్నప్పటికీ ప్రతి ఏడాది సంక్రాంతికి కచ్చితంగా ఊరు వెళతాం. అక్కడ నాన్న, అమ్మ సుజాత, నేను, తమ్ముడు చేతన్ కలిసి మా బంధువులతో ఎంతో సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటాం. కానీ, ఈ ఏడాది ఊరు వెళ్లలేకపోయాను. మా బంధువులు, కజిన్స్ ఫోన్ చేసి.. ‘ఏంటి? హీరోయిన్ అయిపోయావని ఊరికి రావా?’ అంటున్నారు. అయితే ఆదివారం భోగి పండగని చెన్నైలోనే జరుపుకొన్నాను. మేము ఉన్న వీధిలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉంటారు.. సెలబ్రేట్ చేసుకుంటాం. ► సంక్రాంతి పండగలో తొలిరోజు వచ్చే భోగి అంటే మరీ ఇష్టం. తొలిరోజు కాబట్టి ఫుల్ ఎనర్జీతో ఉంటా. ఉదయాన్నే లేచి పెద్ద భోగిమంటలు వేసేవాళ్లం. ఆ తర్వాత ఆయిల్ బాత్ చేసి, కుటుంబమంతా కలిసి సరదాగా మాట్లాడుకునేవాళ్లం.. థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూస్తాం. ఆ తర్వాత మకర సంక్రాంతిన పొంగల్ చేయడం ఇష్టం. నేను నాన్ వెజ్ బాగా తింటాను. ప్రత్యేకించి నాటుకోడి కూరతో రాగిసంకటి తినడం చాలా ఇష్టం. అలాగే మటన్ నా ఫేవరేట్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఎవరైనా గాలిపటాలు ఎగర వేస్తుంటే చూస్తుంటాను. కానీ నేను గాలిపటాలు ఎగరవేయలేదు. తెలుగులో ‘బబుల్గమ్’ సినిమాకి ముందే నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి.. కానీ, చేయలేదు. ‘బబుల్గమ్’ తర్వాత కథలు వింటున్నాను. అయితే నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది కెరీర్లో ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్లాలనుకుంటున్నాను. -
Malavika Jayaram Engagement: అల వైకుంఠపురములో నటుడు జయరాం కూతురి నిశ్చితార్థం (ఫొటోలు)
-
అల వైకుంఠపురములో నటుడి ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్!
మాలీవుడ్ స్టార్ కపుల్ జయరామ్, పార్వతిల కూతురు మాళవిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ప్రియుడైన నవనీత్ గిరీష్‌తో మాళవిక ఎంగేజ్మెంట్ చేసుకుంది. కాగా.. ఇటీవలే మాళవిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ రిలేషన్ గురించి అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతన్ని అభిమానలకు పరిచయం చేసింది. కాగా.. ఆమె తల్లిదండ్రలైన జయరాం, పార్వతి ఇద్దరు నటీనటులే. ఆమె తండ్రి జయరాం టాలీవుడ్ మూవీలోనూ నటించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంలో జయరాం కీలక పాత్ర పోషించారు. మలయాళంలో స్టార్ అయిన జయరాం ఈ ఏడాది శివరాజ్‌కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రంలో నటించారు. అంతే కాకుండా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1లోనూ కనిపించారు. అయితే నెల రోజుల క్రితమే జయరాం కుమారుడు కాళిదాస్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కాళిదాస్ మోడల్, తన ప్రియురాలైన తరిణిని పెళ్లాడనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2021లో మూడో రన్నరప్‌గా తరిణి నిలిచింది. అయితే కుమారుడు కాళిదాస్ పెళ్లి కంటే ముందే మాళవిక పెళ్లి జరుగుతుందని పార్వతి వెల్లడించింది. View this post on Instagram A post shared by Chakki (@malavika.jayaram) View this post on Instagram A post shared by Kochi Raaj (@kochiraaj) -
కిడ్నాప్ చేయడం ఓ కళ
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్ (కిడ్నాప్ చేయడం అనేది ఓ కళ). సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పోస్టర్లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగార్లు చేతిలో గన్‌తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్లో శ్రద్ధా దాస్ చేతిలో గన్‌తో స్టయిలిష్‌గా కనిపించారు. -
వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్ రీ ఎంట్రీ
సీనియర్ నటి మాళవిక గుర్తుందా? 1990- 2000 దశకం కిడ్స్‌కు ఈ భామను అంత ఈజీగా మరిచిపోలేరు. తెలుగులో శ్రీకాంత్,వడ్డే నవీన్ సూపర్ హిట్ సినిమా అయిన 'చాలాబాగుంది' చిత్రంతో వెండితెరపై మెరిసింది. తర్వాత చంద్రముఖి,ఆంజినేయులు వంటి చిత్రాల్లో మెరిసింది. తమిళంలో చిత్తిరం పేసుదడి చిత్రంలో వాలమీనుక్కమ్ అనే ప్రత్యేక పాటలో మాళవిక డాన్స్ చాలా పాపులరైంది. ఈమె 1999లో అజిత్‌కు జంటగా ఉన్నై తేడా చిత్రం ద్వారా కథానాయికిగా కోలీవుడ్‌లో పరిచయమైంది. ఆ చిత్రం విజయంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ మాళవిక నాయకిగా నటించి పాపులర్ అయ్యింది. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఛాన్సులు ఆమెకు దక్కాయి. అలా ఐదేళ్లపాటు కథానాయకిగా కొనసాగిన ఈమెకు ఆ తర్వాత ఆశించిన అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఆమైపె వివాదాస్పద నటి అని ముద్ర పడడమేననే ప్రచారం జరిగింది. దీంతో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. 2007లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయింది మాళవిక. కాగా ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె మళ్లీ చిత్రాల్లో నటించడానికి రెడీ అనే సిగ్నల్ ఇచ్చింది. సుమారు 14 ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీకి రెడీ అయింది. అందులో భాగంగా తమిళ్లో సూపర్ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ టీవీలో ప్రసారమవుతున్న 'ఊ సొల్రియా ఊ ఊ సొల్రియా' అనే కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంటోంది. త్వరలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో రీ ఎంట్రీ అయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) -
గోపీచంద్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు, ఎవరంటే?
గోపీచంద్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఫీసర్ భీమ పాత్రలో నటిస్తున్నారు గోపీచంద్. భీమాకు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మలను ఎంపిక చేసినట్లు గురువారం చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘కుటుంబ భావోద్వేగాలు మిళితమైన యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేజీఎఫ్ నటి.. ఫోటో వైరల్
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్‌వుడ్‌లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్‌పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర?
Malavika Sharma- Fashion Brands: ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది మాళవిక శర్మ. చేసిన కొద్ది సినిమాల్లోనే వైవిధ్యమైన పాత్రలు పోషించి నటన పట్ల తనకున్న అభిరుచిని చాటుకుంది. ఫ్యాషన్ పట్లా తన టేస్ట్ భిన్నమైనదేనని తెలుస్తోంది ఆమె ఫాలో అవుతున్న ఈ బ్రాండ్స్‌ను చూస్తుంటే! స్తోత్రం సంప్రదాయ కట్టుకు పాశ్చాత్య సౌందర్యాన్ని తీసుకు రావడంలో ‘స్తోత్రం’ పెట్టింది పేరు. అంతేకాకుండా అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్‌ది ప్రత్యేక ముద్ర. దీని డిజైన్స్‌కు విదేశాల్లోనూ మంచి డిమాండే ఉంది. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. PC: Malavika Sharma Instagram ఫైన్ షైన్ జ్యూయెలరీ చెన్నైకి చెందిన అనిల్ కొఠారి .. తొలుత తన కెరీర్‌ను ‘బ్రౌన్ ట్రీ – యువర్ హెల్త్ ఫుడ్ స్టోర్ ’ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా మొదలుపెట్టాడు. కొద్ది నెలల్లోనే అదే కంపెనీకి సీఈఓగా ఎదిగి సక్సెస్ఫుల్ బిజినెస్‌మన్‌గా నిలిచాడు. తర్వాత అతని దృష్టి ఫ్యాషన్ రంగం మీదకు మళ్లింది. అప్పుడే ఈ ‘ఫైన్ షైన్ జ్యూయెలరీ’ని ప్రారంభించాడు. అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు తన బ్రాండ్ నగలను స్పాన్సర్ చేశాడు. ప్రధాన కస్టమర్లు సెలబ్రిటీలే. అందుకే వీటి ధరలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. PC: Malavika Sharma Instagram బ్రాండ్ వాల్యూ చీరబ్రాండ్: స్తోత్రం ధర: రూ. 68,500 జ్యూయెలరీ బ్రాండ్: ఫైన్ షైన్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అందుకే లాయర్ కావాలనుకున్నా.. నల్లరంగు అంటే చాలా ఇష్టం. అందుకే లాయర్ కావాలనుకున్నా.. – మాళవిక శర్మ -దీపిక కొండి చదవండి: Kajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్ -
‘ఆదిపురుష్ దర్శకుడికి రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు
ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ టీజర్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది టీజర్ అద్బుతంగా ఉందంటూ ప్రశసిస్తుండగా మరికొందరు కార్టూన్ సినిమా మాదిరి ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయోధ్య వేదికగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన టీజర్ నిరాశ పరిచిందంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్‌పై బీజేపీ అధికార ప్రతినిధి, నటి మాళవిక అవినాష్ మండిపడ్డారు. ఓం రౌత్ రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే సినిమా తీశారంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చదవండి: రిపోర్టర్‌పై నటి హేమ ఫైర్.. ‘భక్తి కోసం వచ్చా కాంట్రవర్సికి కాదు’ ఆమె ట్వీట్ చేస్తూ.. ‘లంకకు చెందిన రావణుడు శివ భక్త బ్రాహ్మణుడు. 64 కళల్లో ప్రావీణ్యం సంపాదించాడు. వైకుంఠాన్ని కాపాడుతున్న జయ శాపం కారణంగా రావణునిగా అవతరించాడు. కానీ మన చరిత్రను, రామాయణంను బాలీవుడ్ దర్శకులు తప్పుగా చూపిస్తున్నారు. ఇక దీన్ని ఆపండి’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. అలాగే ‘‘బహుశా డైరెక్టర్ ఓం రౌత్. వాల్మీకి రామాయణం, తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర ఎలా ఉంటుందో అధ్యయనం చేయలేదనుకుంటా. కనీసం తెలుగు, తమిళంలో ఇదివరకు తెరకెక్కిన పౌరాణిక సినిమాల్లో రావణుడి పాత్ర ఎలా ఉందో పరిశీలించాల్సింది. ‘భూకైలాస’లో సీనియర్ ఎన్టీఆర్ లేదా సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు చేసిన రావణుడి పాత్రను చూసి అర్థం చేసుకోవచ్చు. టీజర్లో రావణుడు నీలి కళ్లతో లెదర్ జాకెట్ వేసికున్నట్లు చూపించారు. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదు. రామాయణం మన దేశ ప్రజల నాగరికతను కాపాడుతుంది. అలాంటి రామాయణాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలో రావణుడి పాత్రను వక్రీకరించినందుకు చాలా బాధగా ఉంది’’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ టీజర్ రిలీజైన అనంతరం ఇది యానిమేటెడ్ చిత్రంలా ఉందని, వీఎఫ్ఎక్స్ అసలు బాగాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. Ravana,a Shiva-Bhakta Brahmin from Lanka had mastered the 64 arts!Jaya(Vijay) who was guarding Vaikunta descended as Ravana owing to a curse! This may be a Turkish tyrant but is not Ravana! Bollywood,Stop misrepresenting our Ramayana/History!Ever heard of the legend NTRamaRao? pic.twitter.com/tGaRrsSQJW — Malavika Avinash (@MalavikaBJP) October 3, 2022 -
సోదరుడి లైంగిక వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి
(వరంగల్) మహబూబాబాద్: లైంగిక వేధింపులతో మండలంలోని ల్యాదెళ్ల గ్రామానికి చెందిన మాళవిక(19) ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఎస్సై హరిప్రియ, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మాళవిక ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన సంగాల సాయి, మాళవిక ఒకర్నొకరు ప్రేమించుకున్నారు. మూడు నెలల క్రితం వీరిద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ఏకాంతంగా ఉన్న సమయంలో సాయి ఆమె ఫొటోలు తీసుకున్నాడు. మాళవిక ఆచిత్రాలను తొలగించాలని వేడుకుంది. సాయి తొలిగిస్తానని నమ్మబలికి ఆవీడియోలు, ఫొటోలను తన మిత్రుడైన తాళ్ల ప్రణయ్ అలియాస్ ఢిల్లీకి పంపించాడు. ప్రణయ్ మాళవికకు వరుసకు సోదరుడవుతాడు. ఫొటోలు, వీడియోలను ఆసరాగా చేసుకున్న ప్రణయ్ ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ప్రణయ్ వేధింపులు భరించలేక మాళవిక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డి మందు తాగింది. అనంతరం వాంతులు చేసుకుంటున్న క్రమంలో బంధువులు గమనించి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. యువతి తల్లి ఇందిర ఫిర్యాదు మేరకు సంగాల సాయి, తాళ్ల ప్రణయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ప్రణయ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సైనా నెహ్వాల్, అష్మిత, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. శ్రీకాంత్ 18–21, 21–10, 21–16తో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. సౌరభ్ వర్మ 20–22, 12–21తో తోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సాయిప్రణీత్ 12–21, 13–21తో వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్) చేతిలో, ప్రణయ్ 17–21, 21–15, 15–21తో డారెన్ లూ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–19, 18– 21, 21–18తో లారెన్ లామ్ (అమెరికా)పై... మాళవిక 17–21, 21–15, 21–11తో ఉలితినా (ఉక్రెయిన్) పై నెగ్గగా.. సైనా 21–11, 15–21, 17–21తో కిమ్ గా ఉన్ (కొరియా) చేతిలో, ఆకర్షి 13–21, 18–21 తో మిచెల్లి (కెనడా) చేతిలో, అష్మిత 10–21, 15– 21తో రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడారు. -
ఏఆర్ రెహమాన్ మెచ్చుకున్న సింగర్.. ఎవరామే?
అక్కడే విని...అప్పుడే మరిచిపోయేట్లు ఉండకూడదు. అది నీడలా మన వెంటపడాలి’ అని అనడమే కాదు నిరూపించింది మాలి ‘కొందరు కళాకారుల అంకితభావం వ్యక్తిత్వంలోనే కాదు వారి సృజనాత్మకప్రక్రియలోనూ బలంగా కనిపిస్తుంది. అది వారిని మరింత పైకి తీసుకెళుతుంది. అలాంటి వారిలో ఒకరు...మాళవిక మనోజ్’ అని ఏఆర్ రెహమాన్ మెచ్చుకోవడం తనకు లభించిన అత్యున్నత పురస్కారం అంటుంది మాళవిక మనోజ్. చెన్నైలోని మలియాళి దంపతులకు జన్మించిన మాళవిక మనోజ్‌కు సంగీతం అనేది బాల్యనేస్తం. తల్లిదండ్రులు సంగీతకారులు కానప్పటికీ సంగీతప్రేమికులు. పాత, కొత్త, స్వదేశ, పరదేశ...అనే తేడా లేకుండా ఆ ఇంట్లో సంగీతం నిరంతరం ప్రతిధ్వనించేది. అయిదు సంవత్సరాల వయసులో మాళవికను స్విమ్మింగ్ క్లాస్‌లతో పాటు పియానో, భరతనాట్యం, డ్రాయింగ్ క్లాస్‌లకు పంపేవారు తల్లిదండ్రులు. కొంతకాలం తరువాత పియానో క్లాస్‌లకు తప్ప మిగిలిన క్లాసులకు బంక్ కొట్టేది మాళవిక. పదహారు సంవత్సరాల వయసులో పాటలు రాయడం మ్యూజిక్ కంపోజింగ్ చేయడం మొదలు పెట్టింది. పదిహేడు సంవత్సరాల వయసులో గిటార్ వాయించడం నేర్చుకుంది, ఆమె ఫస్ట్ సింగింగ్ పర్ఫామెన్స్ గురించి చెప్పుకోవాలంటే... పన్నెండు సంవత్సరాల వయసులో ఒక విందులో ప్రఖ్యాత అమెరికన్ జాజ్ సింగర్ ఎల్లా ఫిజ్జెరల్డ్ పాట పాడింది. విశేషం ఏమిటంటే ఆ పాటను విందుకు అన్వయించి పాడడం ద్వారా ‘శబ్బాష్’ అనిపించుకుంది మాళవిక. చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బిబిఏ) చేసిన మాళవిక పై చదువుల కోసం ఫ్రాన్స్‌కు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగివచ్చిన తరువాత ముంబైకి వెళ్లింది. మంచి ఉద్యోగం వెదుక్కోవడానికి కాదు.. మ్యూజిక్‌లో కెరీర్ వెదుక్కోవడానికి!. బేస్–ఇన్–బ్రిడ్జి అనే మ్యూజిక్ బ్యాండ్‌లో చేరడం ద్వారా తొలి అడుగువేసింది. తన స్టేజ్ నేమ్ ‘మాలి’ అయింది. డెబ్యూ ఆల్బమ్ ‘డిసెప్టివ్’తో వావ్ అనిపించింది. ఏఆర్ రెహమాన్‌లాంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేసింది. యూరో ఇండీ మ్యూజిక్చార్ట్లో తన పాట ఫస్ట్ ర్యాంకులో నిలిచింది. తనకు పాప్గర్ల్గా గుర్తింపు ఉన్నప్పటికీ సంగీతంలో రకరకాల జానర్స్ వినడం, వాటి నుంచి ఇన్స్పైర్ కావడం అంటే ఇష్టం. ‘అతిగా ఆలోచించడం అనేది నా బలం, నా బలహీనత. ఆ ఆలోచనల్లో నుంచే సంగీతం పుడుతుంది’ అంటున్న 28 సంవత్సరాల మాళవిక మనోజ్, సంగీతంలో మరిన్ని ప్రయోగాలు చేయాలనుకుంటోంది. -
తొలి సినిమా డైరెక్టర్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Senior Heroine Malavika Re Entry With Director Sundar C Movie: ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. 1999లో సుందర్. సి డైరెక్షన్లో అజిత్ హీరోగా 'ఉన్నై తేడి' మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైంది మాళవిక. తర్వాత 2007లో సురేష్ మేనన్ అనే వ్యక్తిని వివాహమాడి వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. చదవండి: 'పేరెంట్స్ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా' కోలీవుడ్‌కు ఏ డైరెక్టర్‌తో పరిచయమైందో ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది మాళవిక. ఈ సినిమాలో ఆమె 'మంగమ్మ' అనే పాత్రలో అలరించనుంది. ఇందులో మాళవికకు జోడిగా దర్శకుడు మనోబాలా కనిపించనున్నారు. హీరోలుగా జై, జీవా, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న మాళవిక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. pic.twitter.com/VoZNpvLkRx — Manobala (@manobalam) April 2, 2022 చదవండి: ఆమె బయోపిక్‌లో నటించాలనుంది: మాళవిక మోహనన్