Maratha reservation
-
మహారాష్ట్ర: మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ముంబై: మరాఠా రిజర్వేషన్ బిల్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించే బిల్లు-2024 అమలులోకి వస్తే.. దశాబ్దం తర్వాత సమీక్షించబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ శుక్రవారమే ప్రభుత్వానికి అందజేసింది. సుమారు 2.5 కోట్ల కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసింది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనకపబడిన మరాఠా సామాజిక వర్గానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ నివేదికలో పొందుపర్చింది. మహారాష్ట్ర మొత్తం జనాభాలో సుమారు 28 శాతం మరాఠాలు ఉన్నారని సీఎం ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. ‘సుమారు 2.5 కోట్ల మంది మరాఠాలపై సర్వే జరిపించాం. మరాఠా రిజర్వేషన్ బిల్లు కోసమే నేడు(మంగళవారం) అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును చట్ట ప్రకారం మరాఠా రిజర్వేషన్ కల్పిస్తాం’ అని సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. మరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబూ అజ్మీ.. రాష్ట్ర అసెంబ్లీ వెలుపల ముస్లింల కూడా విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయటం గమనార్హం. చదవండి: దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? -
తలొగ్గిన సర్కార్.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్స్టాప్
మహరాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఆందోళనకు ఫుల్స్టాప్ పడింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన అన్ని చర్చలు సఫలమవ్వడంతో మరాఠా రిజర్వేషన్ల పోరాటనేత మనోజ్ జరాంగే పాటిల్ నేడు(శనివారం) తన ఆందోళన విరమించనున్నారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని మహా సర్కార్ హామీ ఇవ్వడంతో పాటిల్ ఈ ఉదయం 8 గంటలకు తన నిరాహార దిక్షను విరమించారు. సీఎం ఏక్నాథ్ షిండే నవీ ముంబైలోని దీక్షా శిబిరానికి చేరుకుని మనోజ్ జరాంగేకి పళ్ల రసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. అలాగే, రిజర్వేషన్లపై ప్రభుత్వ హామీలకు సంబంధించిన పత్రాన్ని జరాంగేకు సీఎం అందించారు. అనంతరం సీఎం ఏక్నాథ్ షిండే, మనోజ్ జరాంగే ఇద్దరూ కలిసి నవీ ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చదవండి: Bihar Politics: సీఎం పదవికి నేడు నితీష్ కుమార్ రాజీనామా? #WATCH | Maratha quota activist Manoj Jarange Patil to end his fast today in the presence of Maharashtra CM Eknath Shinde after the government accepted demands, in Navi Mumbai pic.twitter.com/ogLqes3wHL — ANI (@ANI) January 27, 2024 కాగా మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే నేతృత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీరి డిమాండ్లను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం జరాంగే మహారాష్ట్ర ప్రభుత్వానికి కొత్త డిమాండ్ వినిపించారు. #WATCH | Navi Mumbai: Supporters of Maratha quota activist Manoj Jarange Patil celebrate, as he announces an end to the protests today after the government accepted their demands. He will break his fast today in the presence of Maharashtra CM Eknath Shinde. pic.twitter.com/w3e6ve8wLx — ANI (@ANI) January 27, 2024 తమ డిమాండ్లను నెరవేర్చాలని శనివారం ఉదయం 11 గంటల వరకు ప్రభుత్వానికి మనోజ్ జరాంగే అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో ముంబై నగరాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. భారీ ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఆజాద్ మైదాన్ దగ్గర ఆందోళనకు మరాఠా ఉద్యమకారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కసారి అడుగు పడిందంటే వెనక్కి తిరిగి చూసేది లేదు. మా డిమాండ్‌ను సాధించుకున్నాకే తిరిగి ఇంటికి వెళ్తాం’ అని జరాంగే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే గత అర్థరాత్రి ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరాంగేతో చర్చలు జరిపింది. హామీలు నెరవేరుస్తామంటూ ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చింది. ఆ మేరకు ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా విడుదల చేసింది. దీంతో ఆందోళనను విరమిస్తున్నట్లు జరాంగే ప్రకటించారు. ఆయన డెడ్‌లైన్‌కు దిగివచ్చిన మహా సర్కార్.. డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించడంతో వారు దీక్షను విరమించారు. -
మరాఠా రిజర్వేషన్ ఉద్యమం.. ప్రభుత్వానికి అల్టిమేటం
ముంబయి: మహారాష్ట్రాలో మరాఠా కోటా ఉద్యమం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రభుత్వానికి మరాఠా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే అల్టిమేటం జారీ చేశారు. రేపు(శనివారం) ఉదయం 11 గంటల వరకు తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని గడువు విధించారు. మరాఠా కోటా అంశంలో ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని జరాంగే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముంబయిలోని ఆజాద్ మైదానంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశం అనంతరం పొరుగున ఉన్న నవీ ముంబైలోని శివాజీ చౌక్‌లో నిరసనకారులను ఉద్దేశించి జరాంగే ప్రసంగించారు. "నేను రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ మేము ఆజాద్ మైదాన్‌కు వెళితే.. నేను దానిని వెనక్కి తీసుకోను" అని జరాంగే చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు మంజూరు చేసే వరకు నిరసనకారులు ఆందోళనను మధ్యలోనే ఆపేది లేదని ఆయన పిలుపునిచ్చారు. అయితే.. మరాఠా ఉద్యమకారుల డిమాండ్లను ఆమోదించినట్లు మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ చెప్పారు. ప్రభుత్వ విధానాల ప్రకారం వాటిని అమలు చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో నితీష్ మళ్లీ సీఎం? -
మరాఠా రిజర్వేషన్లకు ఓకే : ఏక్నాథ్ షిండే
ముంబై: విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. రిజర్వేషన్ల అమ లు విషయంలో చట్టపరిధిలో విధివిధానాలు ఖరారు చేయడానికి కొంత సమయం అవసరమని చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై మరాఠా ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేపడుతున్న ఆందోళనలు, జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. నిరవధిక దీక్ష విరమించాలని సామాజిక కార్యకర్త మనోజ్ జారంగీని కోరుతూ అఖిలపక్ష భేటీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్‌వర్గం) నాయకుడు అనిల్ పారబ్ తదితరులు సంతకాలు చేశారు. అనంతరం సీఎం షిండే మీడియాతో మాట్లాడారు. హింసకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని రాజకీయ పారీ్టలకు సూచించారు. -
మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్నాథ్ షిండే
ముంబయి: సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. మరాఠా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించడానికి చట్టపరమైన విధానాలు పాటించడానికి ప్రభుత్వానికి సమయం అవసరమని చెప్పారు. మరాఠా రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో నేడు రాష్ట్రంలో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారుడు మనోజ్ జరాండే నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని అఖిలపక్ష నేతలు కోరారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలను ఆకాంక్షించారు. ఈ అఖిలపక్ష భేటీలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) నాయకుడు అనిల్ పరాబ్, శాసనసభా ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ తదితరులు పాల్గొన్నారు. మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్రంలో కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చాలాచోట్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐదు మరాఠా జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ప్రభుత్వ బస్సులను రద్దు చేశారు. ఆందోళనలు వ్యాప్తి చెందకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బుధవారం నుంచి దీక్షను మరింత తీవ్రతరం చేస్తామని నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న మనోజ్ జరాండే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించింది. మరాఠా రిజర్వేషన్లపై మంగళవారం తీవ్రస్థాయికి చేరాయి. ముంబయి-బెంగళూరు జాతీయ రహదారిని ఆందోళనకారులు అడ్డగించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైలు పట్టాలను దిగ్బంధించారు. పట్టాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు, మరాఠా రిజర్వేషన్లకు మద్దతు కోరుతూ నిరసనకారులు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది? -
మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు.. జాతీయ రహదారుల దిగ్బంధం
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కోరుతూ నిరసనకారులు రాష్ట్రమంతటా ఆందోళనలు నిర్వహించారు. రైల్వే ట్రాకులు, జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. నేడు ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు నిరసనకారులు దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు షోలాపూర్‌లో రైలు పట్టాలను దిగ్బంధించారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నిరసనకారులు రైలు పట్టాలపై టైర్లు తగులబెట్టారు. అటు.. జల్నా జిల్లాలో జరిగిన నిరసనల్లో కొందరు వ్యక్తులు పంచాయతీ సమితి కార్యాలయానికి నిప్పుపెట్టారని పోలీసులు మంగళవారం తెలిపారు. రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జల్నాలో జరిగిన మరో ఘటనలో షెల్గావ్ గ్రామంలోని రైల్వే గేట్ వద్ద మరాఠా వర్గానికి చెందిన కొందరు యువకులు రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఆందోళనకారులు రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే అక్టోబర్ 25 నుండి జాల్నా జిల్లాలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి షిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా నిరసనలకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయులు రాజీనామా -
Maratha reservation: మరాఠాల ఆందోళన హింసాత్మకం
ముంబై: మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్‌తో మరాఠాలు చేపట్టిన ఆందోళన మళ్లీ హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు సోమవారం బీడ్ జిల్లా మజల్‌గావ్‌లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యేలు ప్రకాశ్ సోలంకె, సందీప్ క్షీరసాగర్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మజల్గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్‌కు నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. ఛత్రపతి శంభాజీ జిల్లా గంగాపూర్‌లో నిరసనకారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్ పగులగొట్టారు. పలు చోట్ల రహదారులపై బైటాయించారు. మరాఠాలకు ప్రత్యేక కోటా డిమాండ్‌కు మద్దతుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన నాశిక్, హింగోలి ఎంపీలు హేమంత్ గాడ్సే, హేమంత్ పాటిల్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మరాఠాలకు రిజర్వేషన్లు అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి 40 రోజుల డెడ్‌లైన్ పెట్టిన వారు ఈ వ్యవహారం చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారు’అంటూ ఎమ్మెల్యే సోలంకె చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్‌తో మనోజ్ జరంగె అనే వ్యక్తి అక్టోబర్ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సోలంకె..కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, ఇప్పుడు నాయకుడా..అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో మరాఠా సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం మధ్యాహ్నం మజల్‌గావ్‌లోని ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. ఆయన నివాసానికి, కారుకు నిప్పుపెట్టారు, రాళ్లు రువ్వారు. ఘటన సమయంలో ఆ ఇంట్లోనే ఉన్నట్లు ఎమ్మెల్యే సోలంకె ఆ తర్వాత తెలిపారు. బీడ్ నగరంలో మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ నివాసం, ఆఫీసుకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. బీడ్‌లోని ఒక హోటల్‌కు మరాఠా నిరసనకారులు అగ్నికి ఆహుతి చేశారు. జల్నా వద్ద ముంబైకి వెళ్లే సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై బైటాయించారు. షోలాపూర్–అక్కల్కోట్ హైవేపై మండుతున్న టైర్లను వేసి వాహనాలను అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు కర్రలు పట్టుకుని గంగాపూర్‌లోని ఎమ్మెల్యే ప్రశాంత్ కార్యాలయంపై దాడి చేశారు. యావత్మాల్లో తనను ఆందోళనకారులు అడ్డగించి, రిజర్వేషన్ అంశంపై నిలదీశారని హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తెలిపారు. దీంతో, రాజీనామా పత్రం రాశానన్నారు. తన రాజీనామా లేఖ అందినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి రసీదు వచ్చిందని చెప్పారు. రిజర్వేషన్లపై వైఖరి తెలపాలంటూ నాశిక్ ఎంపీ గాడ్సేను కొందరు నిలదీయడంతో ఆయన రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపించారు. -
మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయుల రాజీనామా
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌పై ఆందోళనలు చెలరేగాయి. మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విధేయులు రాజీనామా చేశారు. హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ సోమవారం న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయానికి తన రాజీనామాను సమర్పించారు. నాసిక్ ఎంపీ హేమంత్ గాడ్సే తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ డిమాండ్‌పై తమ వైఖరిని స్పష్టం చేయాలని యావత్మాల్లో ఆందోళనకారులు పాటిల్‌ను అడ్డగించారు. దీంతో పాటిల్ అక్కడికక్కడే తన రాజీనామా లేఖను ఆందోళనకారులకు అందజేశారు. శివసేన ఎంపీ గాడ్సేను నాసిక్‌లో నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నిరసనకారులు ప్రశ్నించగా.. ఆయన కూడా తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపించారు. రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే రాజీనామా స్టంట్స్ చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే వ్యాఖ్యానించడంపై పాటిల్ మండిపడ్డారు. "నేను నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టలేదు. రెండు-మూడు తరాలు అధికారంలో ఉన్నారు. వారే చొరవ తీసుకుని ఉండేవారు. కానీ అదేమీ చేయలేదు. మరాఠా సామాజికవర్గానికి చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఆ వర్గానికి ఏం చేయలేదు" అని పాటిల్ మండిపడ్డారు. మరాఠా రిజర్వేషన్ల కోసం జల్నాకు చెందిన కోటా కార్యకర్త మనోజ్ జరంగే చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. మనోజ్ జరంగే ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో మరాఠా సమాజం మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సభ్యునికి రాజీనామా చేస్తున్నానని గాడ్సే పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు' -
మరాఠా రిజర్వేషన్ల పోరాటం.. ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు..
ముంబై: మహారాష్ట్రలో రిజర్వేషన్ ఉద్యమ నిరసనలు హింసకు దారి తీశాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని నిరసనకారులు ముట్టడించారు. మరాఠా కోటా డిమాండ్ నేపథ్యంలో బీద్ జిల్లాలోని ఎమ్మెల్యే నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బిల్డింగ్ వద్ద ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంటి సమీపంలోని కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రకాశ్ సోలంకి ఇంటి వద్ద భారీగా మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చుట్టుపక్కలా ప్రాంతమంతా దట్టమైన మంటలు వ్యాపించాయి. కాగా ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు, తెలిపారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు. అయితే మరాటా రిజర్వేషన్ల ఉద్యమం గురించి సోలంకే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటిపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ గత అయిదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సోలంకే ఈ దీక్షపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరాఠా రిజర్వేషన్ సమస్యను పిల్లల ఆటగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు ఆగ్రహంతో రగిలిపోయి.. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. చదవండి: ఈడీ ఎదుటకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు #WATCH | Beed, Maharashtra: Maratha reservation agitators vandalised and set the residence of NCP MLA Prakash Solanke on fire. pic.twitter.com/8uAfmGbNCI — ANI (@ANI) October 30, 2023 -
NCP ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
-
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్.. శివసేన ఎంపీ రాజీనామా
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. వివరాల ప్రకారం.. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌కు మద్దతుగా ఎంపీ హేమంత్ పాటిల్ ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నట్టు పాటిల్ తెలిపారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌తో పోఫలి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో నిరసన తెలుపుతున్న వారిని కలుసుకొని హేమంత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారి ఉద్యమానికి హేమంత్ పాటిల్ మద్దతు ప్రకటించారు. అనంతరం.. అక్కడికక్కడే తన రాజీనామా లేఖను స్పీకర్ ఓంబిర్లాకు పంపించారు. కాగా, లేఖలో మరాఠా రిజర్వేషన్ అంశం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. దీనిపై మరాఠా సమాజంలో భావోద్వేగాలు నెలకొన్నాయని పాటిల్ ప్రస్తావించారు. Shiv Sena MP Hemant Patil resigns from the post of MP in support of the ongoing movement in the state demanding Maratha reservation. He sent his resignation written in Marathito Lok Sabha Speaker Om Birla pic.twitter.com/mxI9lDHWTK — MUMBAI NEWS (@Mumbaikhabar9) October 29, 2023 ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని హింగోలి లోక్‌సభ నియోజకవర్గానికి హేమంత్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఓబీసీ కేటగిరి కింద విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరాఠా కమ్యూనిటీ కొద్దికాలంగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తోంది. కోటా యాక్టివిస్ట్ మనోజ్ జారంగే ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తూ, రెండో విడత నిరవధిక నిరాహార దీక్షను అక్టోబర్ 25న ప్రారంభించడంతో మరాఠా ఉద్యమ ఆందోళన ఊపందుకోనుంది. మరోవైపు.. మరాఠా రిజర్వేషన్లపై షిండే ప్రభుత్వం స్పందిస్తూ.. లీగల్ స్క్రూటినీకి లోబడి రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: 'సభలకు అజిత్ పవార్ హాజరు కాట్లేదు.. ఎందుకంటే..?' -
నాన్చకండి.. నిర్ణయం తీసుకోండి: మాజీ బీజేపీ మంత్రి
ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోరుతూ చేస్తోన్న పోరు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బీజీపీ జాతీయ సెక్రెటరీ పంకజా ముండే ఈ అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు హామీలివ్వడం కాకుండా కచ్చితమైన చర్యలు చేపట్టాలని నిరసనకారులతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయాలని కోరారు. కేంద్రానికి అప్పగించండి.. బీజేపీ మాజీ మంత్రి పంకజా ముండే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శివశక్తి పరాక్రమ యాత్రలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె మరాఠా రిజర్వేషన్లపై ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు ఎంతవరకు పెంచవచ్చన్న ప్రణాళిక ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉండే ఉంటుంది కాబట్టి నిరసనకారులతో ధైర్యంగా చర్చలు నిర్వహించాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి 50% కంటే రిజర్వేషన్ ఇవ్వలేమనిపిస్తే అప్పుడు కేంద్రం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్తే వారు రాజ్యాంగబద్ధంగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని అన్నారు. హామీలొద్దు.. మరాఠా సమాజం ఇప్పటికే విసిగిపోయిందని కచ్చితమైన కార్యాచరణ కావాలని అన్నారు. అనవసరంగా మరాఠాలు ఓబీసీలకు మధ్య తగువులు పెట్టవద్దని విన్నవించారు. అదే విధంగా నిరసనకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ... మీ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆందోళనలను విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్లాజ్‌ను తొలగించండి.. ఇటీవల జల్నా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే 11 రోజులుగా దీక్షలో ఉన్న మనోజ్ జరాంగే పాటిల్ దీక్షను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు కుంబీ కుల ధ్రువీకరణ పత్రం పొందుకుని ఓబీసీ రిజర్వేషన్ సాధించాలంటే వంశపారపర్యం ధ్రువీకరణ పత్రం తప్పదంటూ ప్రభుత్వ చేసిన తీర్మానం(జీఆర్) నుంచి ఆ క్లాజ్‌ను తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు గడిచిన వారం రోజుల్లో మరింత ఉధృతం చేశారు నిరసనకారులు . అహ్మద్‌నగర్, , ధారాశివ్, నాందేడ్, జల్నా, హింగోలి, ఔరంగాబాద్, పర్భని జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, బంద్‌లతో ఆయా జిల్లాలు అట్టుడుకుతున్నాయి. ఇది కూడా చదవండి: TS Election 2023: అమిత్‌షా సభ విజయవంతమైనా.. చేరికలు లేక డీలా..! -
Photo Feature: బడులు రెడీ.. విజయవాడ హైవేపై రద్దీ
పంటల సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా రైతు అవతారం ఎత్తి స్వయంగా విత్తనాలు చల్లారు. ఇక తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వానా కాలం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మరిన్ని ‘చిత్ర’విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
Pankaja Munde: మీరు మోసపోలేరు.. సీఎంను కలుస్తా
ముంబై: రిజర్వేషన్లపై మరాఠాలు మోసపోయామని భావిస్తున్నారని కానీ, ప్రస్తుత తరం ప్రజలు మోసపోలేరని బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే వ్యాఖ్యానించారు. గురువారం తన తండ్రి, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ఏడో వర్ధంతి సందర్భంగా ఆమె వర్చువల్ ర్యాలీలో ప్రసంగించారు. ఉద్ధవ్‌ను త్వరలోనే కలుస్తానని, రిజర్వేషన్ల అంశంపై తన సలహాలు, సూచనలు సీఎంకు అందజేస్తానని పంకజ తెలిపారు. విద్య, ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో మరాఠాలు మోసపోయామని అనుకుంటున్నారని, కానీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. ఏ వర్గాల కోసం ప్రణాళిక రూపొందిస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. ఓబీసీ, మరాఠా రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కాగా, బీడ్ జిల్లా పార్లీ నుంచి 2019లో ఎదురైన ఓటమిపై ఆమెను ప్రశ్నించగా ఎన్నికల నష్టం రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిలిచిపోదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికీ తన ఓటమి గురించి మాట్లాడుతారని కానీ, ఆ ఓటమి పూర్తి స్థాయిలో లేదన్నారు. ప్రజలకు తనపై ఇంకా ఆశలు ఉన్నాయని, గ్రామాలకు వెళ్లి వారికి ధైర్యం ఇస్తానని పంకజా తెలిపారు. కాగా, 2018లో బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల వరకు రిజర్వేషన్లకు ఎలాంటి అడ్డంకి రాలేదు. కానీ, మరాఠాలు వెనకబాటుతనంలో లేరని పలువురు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన కోర్టు మరాఠాలకు రిజర్వేషన్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. చదవండి: మీ అయ్య ఇచ్చాడు? ముంబై మేయర్ వ్యాఖ్యలు దుమారం జీరో కరోనా కేసులు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ -
వర్ణ వ్యవస్థను విస్మరిస్తే ఎలా?
రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం అక్షరానికి ఉన్న శక్తిని అందరికీ పంచడమే. మరాఠాలతోపాటు అన్ని శూద్ర వర్గాలు ఈ అంశంలో వెనుకబడి ఉన్నాయి. ఈ కారణం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు విద్యలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితిపై పునరాలోచన జరగాలి. దేశంలో కుల, వర్ణ వ్యవస్థలు అంతరించిపోయేంత వరకూ ఈ పరిమితిపై చర్చ కొనసాగాలి. న్యాయస్థానం శక్తి కూడా అక్షరంలోనే ఉంది. అన్ని సామాజిక వర్గాల వారికీ ఈ శక్తి పంపిణీ కూడా అనివార్యం. లేదంటే సామాజిక, సహజ న్యాయ సూత్రాలకు విఘాతం అనివార్యమవుతుంది! మరాఠాలు మహారాష్ట్ర జనాభాలో దాదాపు 30 శాతం వరకూ ఉండే వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గం. మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చాలావరకు మరాఠాలు కొన్ని ఇతర వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గాల సంక్షేమంపై ఆధారపడి ఉంటుంది. ఇంతటి కీలకమైన సామాజిక వర్గానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 16 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. 1992 నాటి మండల్ కేసు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు అన్నీ 50 శాతం వరకూ ఉండాల్సి ఉండగా.. మరాఠాలకు దీనికంటే ఎక్కువగా కోటా ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అసాధారణ పరిస్థితులేవీ చూపించలేదని ఐదుగురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. అయితే కోర్టు కుల–వర్ణ వ్యవస్థలను పరిగణనలోకి తీసుకోలేదు. మరాఠాల్లాంటి వ్యవసాయాధారిత సామాజిక వర్గాల విషయంలోనూ ఈ కుల – వర్ణ వ్యవస్థ సమానత్వ సూత్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ 2014 నుంచి అధికారంలో ఉన్నప్పటికీ తాము ఇంకా అసమానత బాధితులుగానే మిగిలి ఉన్నామన్న విషయం మరాఠాలకు ఇప్పటికే బోధపడి ఉంటుంది. అఖిల భారత సర్వీసుల్లో కానీ, రాష్ట్ర సర్వీసుల్లో కానీ వీరు శూద్రేతర అగ్రవర్ణాలైన ద్విజులతో వీరు పోటీ పడే పరిస్థితి లేదు. సామాజికంగా ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చేందుకు ఉన్న అవకాశాల్లో ఇవి ముఖ్యమైనవి. మరాఠాల మాదిరిగానే భారత్‌లో వ్యవసాయాధారిత శూద్రులైన జాట్లు, గుజ్జర్లు, పటేల్స్, రెడ్లు, కమ్మలు, నాయర్లు 1992లో వెనుకబడిన కులాల జాబితాలో చేరే నిర్ణయం తీసుకోలేదు. కానీ చారిత్రకంగా సంస్కృత, పార్శీ, ఇంగ్లిషు విద్యాభ్యాసాన్ని చాలాకాలంగా కలిగి ఉన్న బ్రాహ్మణులు, కాయస్తులు, ఖాత్రీలు, క్షత్రియులు, బనియాలతో తాము పోటీ పడలేమని ఇప్పుడు వీరిలో చాలామంది గ్రహిస్తున్నారు. మహారాష్ట్రలో హిందూత్వ ఉద్యమం వైపు జన సామాన్యం ఆకర్షితమయ్యేలా చేయగలిగిన మరాఠాలు ఆర్ఎస్ఎస్/బీజేపీ అధికారం చేపడితే ఢిల్లీలో తమకు అధికార ఫలాలు కొన్నైనా దక్కుతాయని ఆశపడినా.. వారి ఆశలు నిరాశలుగానే మిగిలిపోయాయి. ఢిల్లీ, అధికారం, తమకింకా దూరంగానే ఉందని మరాఠాలు అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. తమ ప్రాభవమంతా మహారాష్ట్రకే పరిమితమని మరాఠాలు మాత్రమే కాదు... మండల్ జాబితాలోకి చేరిన పలు వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గాలూ స్పష్టమైన అంచనాకు వచ్చాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లుగా విడిపోక ముందు ఉన్న స్టేట్ ఆఫ్ బాంబే నుంచి బ్రాహ్మణులు, బనియాలు జాతీయ నేతలు, ఉన్నత ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, మేధావులు చాలామంది జాతీయ స్థాయికి చేరినా మరాఠాలకు మాత్రం ఢిల్లీ అధికారంలో తమ వంతు భాగం దక్కలేదు. శూద్రుల్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పాటిదార్ సామాజిక వర్గం నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగినా మరాఠాలు మాత్రం దాదాపుగా లేరనే చెప్పాలి. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే కాకుండా ఆ తరువాత కూడా తమ వర్గం నుంచి ఎవరినీ ఎదగకుండా ద్విజులు అడ్డుకున్నారని ఇప్పుడు మరాఠాలు భావిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ వ్యాపారాలకు, స్థానికంగానే అధికారాలకు తమను పరిమితం చేసి హిందూ సమైక్యత పేరుతో తమను మైనార్టీలపై కండబలం చూపించే సాధనాలుగా ఆర్ఎస్ఎస్ వాడుకుంటోందన్నది కూడా వీరి అంతరంగం. ఇంగ్లిషు విద్యాభ్యాసమున్న ఉన్నతస్థాయి జాతీయ నేతలు, మేధావులను తయారు చేసుకోవడంలోనూ మరాఠాలు అంతగా విజయం సాధించలేదు. విద్యాభ్యాసం పరంగా వీరందరూ వెనుకబడి ఉన్నారన్నది దీని ద్వారా తేటతెల్లమవుతుంది. చారిత్రకంగానూ శూద్రులు సంస్కృతం చదివేందుకు రాసేందుకు అడ్డంకులు ఉండేవన్నది తెలిసిందే. ముస్లింల పాలనలో పార్శీ విద్యాభ్యాసం విషయంలోనూ ఇదే తంతు కొనసాగింది. అలాగే ఆధునిక ఇంగ్లిషు విద్యకూ మరాఠాలూ దూరంగానే ఉండిపోయారు. ప్రాంతీయ శూద్రులందరిలోనూ ఈ చట్రం నుంచి తప్పించుకోగలిగిన అదృష్టవంతులు కేరళకు చెందిన నాయర్లు మాత్రమే! సుప్రీం ఆలోచన మారాలి... సమానత్వమన్న భావనను ముందుకు తీసుకెళ్లాలంటే కుల వ్యవస్థ తాలూకూ చరిత్ర మొత్తాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శూద్రుల్లోని కొన్ని వర్ణాల వారు ఇప్పటికీ ద్విజుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నా ఆలిండియా సర్వీసుల్లో వారితో సమానంగా ఎందుకు పోటీ పడలేక పోతున్నారన్నది ఇది మాత్రమే వివరించగలదు. చరిత్ర శూద్రులపై మోపిన అతిపెద్ద భారం ఇది. వారందరూ వ్యవసాయం, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారన్న విషయాన్ని దేశ ఉన్నత న్యాయస్థానం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది ఎలా అర్థం చేసుకోవాలి? భారత సుప్రీంకోర్టు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు చేసిన తప్పులే చేయరాదు. వారు భూ యజమానులను మాత్రమే గుర్తిం చారు కానీ.. అక్షరానికి ఉన్న శక్తిని గుర్తించలేకపోయారు. భారత్‌లో శూద్రులకు కొంత భూమి, శ్రమశక్తి ఉన్నప్పటికీ అక్షర శక్తి మాత్రం లేకుండా పోయింది. బ్రిటిష్ పాలనలో బ్రాహ్మణ జమీందారులు శూద్రుల జీవితం మొత్తాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉండే వారంటే అతిశయోక్తి కాదు. ఈ రకమైన శక్తి దేశంలోని ఏ ఇతర కులానికీ లేదు. భూమి కలిగి ఉన్న మరాఠాలు కూడా ఈ రకమైన శక్తి కోసం ఆలోచన కూడా చేయలేకపోయారు. ఈ చారిత్రక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అత్యున్నత న్యాయస్థానమైనా ఆహారోత్పత్తిలో కీలకమైన కులాల భవిష్యత్తు విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది. రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం అక్షరానికి ఉన్న శక్తిని అందరికీ పంచడమే. మరాఠాలతోపాటు అన్ని శూద్ర వర్గాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంగ్లిషు, ఇంగ్లిషు మీడియం విద్యాభ్యాసం విషయాల్లో. అన్ని కేంద్ర, న్యాయ, మీడియా సర్వీసుల్లో అక్షరానికి ఉన్న శక్తి ద్విజులను సానుకూల స్థితిలో నిలబెట్టింది. ఈ కారణం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు విద్యలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితిపై పునరాలోచన జరగాలి. దేశంలో కుల, వర్ణ వ్యవస్థలు అంతరించిపోయేంత వరకూ ఈ పరిమితిపై చర్చ కొనసాగాలి. కుల వర్ణ వ్యవస్థలను రూపుమాపడం ఇప్పుడు ద్విజులకు మాత్రమే కాదు.. హిందువుల్లోని అన్ని కులాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని చెప్పుకునే ఆర్ఎస్ఎస్/బీజేపీల చేతుల్లోనే ఉంది. శూద్రులు, దళితులకు ఆధ్యాత్మిక, సామాజిక న్యాయం కల్పించాల్సిన బాధ్యత కూడా వీరిదే. కానీ దురదృష్టవశాత్తూ వీరు ఈ దిశగా పనిచేయడం లేదు. సుప్రీంకోర్టు చట్టపరంగా అమలు చేయగల తీర్పులు ఎన్నో ఇచ్చినప్పటికీ కులాధారిత జనగణనకు మాత్రం ఒప్పుకోవడం లేదు ఎందుకు? ఇదే జరిగితే ప్రతి సంస్థలోనూ కులాల ప్రాతినిథ్యం ఎలా ఉండాలన్న స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది కాబట్టి! న్యాయస్థానం శక్తి కూడా అక్షరంలోనే ఉంది. అన్ని సామాజిక వర్గాల వారికీ ఈ శక్తి పంపిణీ కూడా అనివార్యం. లేదంటే సామాజిక, సహజ న్యాయ సూత్రాలకు విఘాతం అనివార్యమవుతుంది! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రిజర్వేషన్లు: 50% పరిమితి ఎలా వచ్చింది?
న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. మరాఠా సామాజిక వర్గానికి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. దీంతో మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వపు హక్కును ఇది ఉల్లఘింస్తోందని పేర్కొంది. 50% పరిమితి ఎలా వచ్చింది? 1979లో నాటి జనతా ప్రభుత్వం బిహార్‌కు చెందిన ఎంపీ బీపీ మండల్ నేతృత్వంలో రెండో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1980లో ఆ కమిషన్ నివేదిక వెలువరించింది. ఇతర వెనుకబడిన వర్గాలకు 27%.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు 22.5%, మొత్తంగా 49.5% రిజర్వేషన్లు కల్పించాలని ఆ కమిషన్ సిఫారసు చేసింది. దాదాపు దశాబ్దం అనంతరం ఈ కమిటీ సిఫారసులను అమలు చేస్తూ, ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఇందిర సాహ్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవకాశాల్లో అందరికీ సమానత్వం కల్పిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హామీ ఉల్లంఘనకు గురైందని వాదించారు. వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు కులాన్ని ప్రాతిపదికగా తీసుకోవద్దన్నారు. రిజర్వేషన్లతో ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగుల సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. దాంతో, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. అనంతరం విచారణ కొనసాగింది. ఆ తరువాత, 1992 నవంబర్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను సమర్ధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. వెనుకబాటుతనాన్ని గుర్తించే ఉపకరణంగా కులాన్ని పరిగణించడాన్ని కోర్టు సమర్థించింది. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించడం సరైనదేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల హక్కులకు పరిమితి ఏర్పడింది. రిజర్వేషన్లు 50% పరిమితికి కచ్చితంగా లోబడే ఉండాలని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఓబీసీల్లోని సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించినవారు ఈ రిజర్వేషన్లకు అనర్హులని పేర్కొంది. అయితే, రిజర్వేషన్ల పరిమితి 50 శాతమే ఎందుకన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూ, వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు 11 ఇండికేటర్లను తీర్పులో పేర్కొంది. దేశంలో వెనుకబడిన వర్గాల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే, వారికి కల్పించిన 27% రిజర్వేషన్లు తక్కువేనన్న వాదన ఈ తీర్పు అనంతరం తెరపైకి వచ్చింది. నిజానికి, రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సహకరించే ప్రత్యేక నిబంధనలను రాష్ట్రాలు రూపొందించే ప్రక్రియను అడ్డుకునే అంశాలేవీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 లేదా ఆర్టికల్ 29 క్లాజ్ 2లో కానీ లేవు’అని పేర్కొన్నారు. చదవండి: Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్ చెల్లదు -
Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్ చెల్లదు
న్యూఢిల్లీ: మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వపు హక్కును ఇది ఉల్లఘింస్తోందని పేర్కొంది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సర్వోన్నత న్యాయస్థానం 1992లో ఇచ్చిన మండల్ తీర్పు (ఇందిరా సాహ్నీ కేసులో)ను పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ పరిమితిని పునఃసమీక్షించడానికి విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. రిజర్వేషన్లపై పరిమితి సబబేనని పలుమార్లు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తుచేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఏకగ్రీవంగా అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ కోటాను కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లు సభ్యులుగా ఉన్నారు. మరాఠాలకు ప్రత్యేక కోటాతో 50 శాతాన్ని దాటేసి.. రిజర్వేషన్లు చాలా ఎక్కువ అవుతున్నాయనేది పిటిషనర్ల ప్రధాన అభ్యంతరం. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ 2018 నవంబరు 30న మహారాష్ట్రలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్ల చట్టాన్ని చేసింది. బాంబే హైకోర్టు 2019 జూన్‌లో ఈ చట్టాన్ని సమర్థించింది. అయితే 16 శాతం కోటా సమర్థనీయం కాదని.. ఉద్యోగాల్లో 12 శాతం, విద్యాసంస్థల ప్రవేశాల్లో 13 శాతం సరిపోతుందని తేల్చింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. సరైన భూమిక లేదు ఎంసీ గైక్వాడ్ కమిషన్ సిఫారసుల ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించింది. అయితే మరాఠాలకు ప్రత్యేక కోటాను ఇవ్వడానికి అవసరమైన అసాధారణ పరిస్థితులేమిటో గైక్వాడ్ కమిషన్ ఎత్తిచూపలేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటపుడు రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని అతిక్రమించడానికి సరైన భూమిక లేనట్లేనని పేర్కొంది. మహారాష్ట్ర తెచ్చిన చట్టం సమానత్వానికి భంగకరమని తెలిపింది. అయితే ఈ చట్టం ఆధారంగా మరాఠాలకు (2020 సెప్టెంబర్‌లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించే వరకు) మెడికల్ పీజీల్లో కేటాయించిన సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జరిపిన నియామకాలకు బుధవారం వెలువరించిన తీర్పుతో ఎలాంటి విఘాతం కలగకూడదని తెలిపింది. అంటే లబ్ధిదారులకు ఇబ్బంది ఉండదు, వారి ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు చెల్లుబాటు అవుతాయి. ఇకపై మాత్రం మరాఠాలకు కోటా ఉండదు. రాష్ట్రాలకు కొత్త కులాలను చేర్చే అధికారం లేదు పార్లమెంటు చేసిన 102వ రాజ్యాంగ సవరణ పర్యవసానంగా... సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్తగా ఏ కులాన్నైనా చేర్చే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘రాష్ట్రాలు అలాంటి కులాలను గుర్తించి కేంద్రానికి సిఫారసు మాత్రమే చేయగలవు. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రపతి మాత్రమే ఏ కులాన్నైనా ఎస్ఈబీసీ జాబితాలో చేర్చగలరు. నోటిఫై చేయగలరు’ అని పేర్కొంది. 102వ సవరణ రాజ్యాంగబద్ధతను అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఈ సవరణ సమాఖ్య వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని పేర్కొంది. కొత్త ఎస్ఈబీసీ కులాల జాబితాను నోటిఫై చేయాలని... అప్పటిదాకా పాత జాబితానే అమలులో ఉంటుందని పేర్కొంది. 2018లో చేసిన 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338బి, 342ఏ ఆర్టికల్స్‌ను చేర్చారు. ‘338బి’లో జాతీయ బీసీ కమిషన్ నిర్మాణం, విధులు, అధికారాలను నిర్వచించారు. ‘342ఏ’లో ఏదైనా కులాన్ని ఎస్ఈబీసీ జాబితాలో చేర్చడానికి (నోటిఫై చేయడానికి) రాష్ట్రపతికి ఉన్న అధికారాలను, ఎస్ఈబీసీ జాబితాను మార్చడానికి పార్లమెంటుకున్న అధికారాలను వివరించారు. పలు రాష్ట్రాలు పరిమితిని సడలించాలని కోరినా... రిజర్వేషన్లపై పరిమితిని పునఃసమీక్షించాల్సిన అవసరంపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ ఇదివరకే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 50 శాతం పరిమితిని సడలించాలని, తమ రాష్ట్రాల్లో ఆయా సామాజికవర్గాల సంఖ్య ఆధారంగా కొన్ని కులాలకు, వర్గాలకు రిజర్వేషన్లను కల్పించుకునే వెసులుబాటు తమకు ఉండాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించవచ్చని, మరాఠాలకు కోటా సబబేనని, రాజ్యాంగబద్ధమని కేంద్ర ప్రభుత్వం కూడా వాదించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘మీరు సూచిస్తున్నట్లుగా 50 శాతం పరిమితి లేకపోతే సమానత్వమనే భావనకు విలువేముంది? మేమది చూడాలి. దీనిపై మీరేమంటారు? ఇలా పరిమితి దాటి రిజర్వేషన్లు కల్పిస్తే ఫలితంగా తలెత్తే అసమానతల మాటేమిటి? రిజర్వేషన్లను ఇంకా ఎన్ని తరాలు కొనసాగిస్తారు? అని ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. మొత్తానికి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పరిమితిని విధిస్తూ 1992లో సుప్రీంకోర్టు వెలువరించిన మండల్ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని బుధవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని మార్చాలంటే సమానత్వపు భావనపై నిర్మితమైన సమాజం కాకుండా... కుల పాలిత సమాజం అయ్యుండాలి. ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటితే అది తీవ్ర విపరిమాణాలకు దారితీసే చర్యే అవుతుంది. ఆపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రిజర్వేషన్లను తగ్గించడం దుస్సాధ్యమవుతుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో పొందుపర్చిన సమానత్వపు హక్కును మహారాష్ట్ర చట్టం (ఎంఎస్‌ఈబీసీ యాక్ట్–2018) విస్పష్టంగా ఉల్లంఘిస్తోంది. అసాధారణ పరిస్థితులు లేకుండా 50 శాతం పరిమితిని దాటడం ఆర్టికల్ 14, ఆర్టికల్ 16ల ఉల్లంఘనే కాబట్టి రాజ్యాంగబద్ధం కాదు 102వ రాజ్యాంగ సవరణ.. తమ ప్రాదేశిక పరిధిలోని వెనుకబడిన తరగతులను గుర్తించి, వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసివేసింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 366 (26సి), 342ఏ చేర్చడంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలను (ఎస్ఈబీసీ) గుర్తించే, నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి ఒక్కడికి మాత్రమే దఖలు పడింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ అధికారం రాష్ట్రపతికే ఉన్నట్లుగా భావించాలి. ఎస్ఈబీసీ జాబితాలో ఏవైనా కులాలను చేర్చాలన్నా, తొలగించాలన్నా... ప్రస్తుత ఉన్న వ్యవస్థల ద్వారా లేదా చట్టబద్ధమైన కమిషన్ల ద్వారా రాష్ట్రాలు ఆ మేరకు రాష్ట్రపతికి సూచనలు మాత్రమే చేయగలవు. వెనుకబడిన తరగతులను గుర్తించే, వర్గీకరించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తొలగించిన ఆర్టికల్ 342ఏ సమాఖ్య వ్యవస్థకు భంగకరం కాదు. ప్రతికూల ప్రభావం చూపదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదు 3–2 మెజారిటీ తీర్పులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రం జోక్యం చేసుకోవాలి మరాఠాల రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో కలుగజేసుకోవాలి. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, షాబానో వంటి కేసుల విషయంలో చూపించిన వేగాన్ని ఇందులోనూ చూపించాలి. మరాఠాల కోటాపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. మహారాష్ట్ర ప్రజలు సహనం కోల్పోకుండా శాంతియుతంగా వ్యవహరించాలి – ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలి విద్య, ఉద్యోగాల్లో మరాఠాల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయానికి శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎంపీ గైక్వాడ్ కమిషన్ నివేదిక విషయంలో న్యాయస్థానాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ప్రభుత్వం తరపున న్యాయవాదులు సమర్థంగా వాదనలు వినిపించలేకపోయారు. కోర్టు నిర్ణయం మాకు అసంతృప్తి కలిగించింది – దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర మాజీ సీఎం -
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
Maratha Reservation: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని పేర్కొంటూ రద్దు చేసింది. 50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని పేర్కొంటూ బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనుకున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి చుక్కెదురైంది. కాగా విద్య, సామాజికపరంగా వెనుకబడిన వర్గంగా మరాఠా సామాజిక వర్గాన్ని గుర్తిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్ధల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇక ఈ చట్టాన్ని సమర్ధించిన బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతం మించరాదని, అడ్మిషన్లలో 13 శాతం మించరాదని 2019లో తీర్పునిచ్చింది. ఈ క్రమంలో రిజర్వేషన్ల అంశం, బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో తీసుకువచ్చిన చట్టం సమానత్వపు హక్కును ఉల్లంఘించేదిగా ఉంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు 50 శాతంగా ఉన్న పరిమితిని ఉల్లంఘించడం సరైనది కాదు. 50 శాతం రిజర్వేషన్లు మించరాదనే 1992 నాటి తీర్పును పునఃపరీక్షించలేం’’ అని స్పష్టం చేస్తూ మరాఠా రిజర్వేషన్లను నిలిపివేసింది. చదవండి: బెంగాల్లో హింస, సుప్రీంకోర్టుకు బీజేపీ -
ఉద్యోగాలు, అడ్మిషన్లలో కోటాపై కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : 2020-21లో ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మిషన్లలో మరాఠా కోటాపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరాఠా కోటా చట్టబద్ధతను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. చదవండి : ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత 2018లో ఏర్పాటు చేసిన ఈ కోటా కింద ఇప్పటివరకూ ప్రయోజనాలు పొందిన వారిపై తీర్పు ప్రభావం ఉండదని పేర్కొంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్ధల ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. కాగా ఈ చట్టాన్ని సమర్ధించిన బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతం మించరాదని, అడ్మిషన్లలో 13 శాతం మించరాదని గత ఏడాది పేర్కొంది. -
మరాఠా కోటాపై స్టేకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్ధల్లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు శుక్రవారం సుప్రీం కోర్టు నిరాకరించింది. మరాఠాలకు కోటాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని సుప్రీం కోర్టు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై తాము విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. మరాఠాలకు రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తుది తీర్పుపై కోటాకు సంబందించి మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆధారపడి ఉంటాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా మరాఠాలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో వరుసగా 12, 13 శాతం రిజర్వేషన్‌ను అనుమతించవచ్చని బాంబే హైకోర్టు పేర్కొంది. -
మరాఠాలకు రిజర్వేషన్లు సబబే
ముంబై: మరాఠా వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. అయితే, రిజర్వేషన్లను 16 శాతం బదులు రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్ సూచించిన విధంగా 12 నుంచి 13 శాతం మధ్యలో ఉండేలా చూడాలని సూచించింది. మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతి డాంగ్రేలతో కూడిన ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరించింది. కాగా, ఈ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం ఏప్రిల్‌లోనే ముగించింది. ‘సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ప్రత్యేక తరగతిగా గుర్తించడం, వారికి రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. రాష్ట్రపతి ప్రకటించిన జాబితాలోని వారికే రిజర్వేషన్లు కల్పించాలన్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342(ఎ)కు ఇది వర్తించదు. ఎందుకంటే, రాష్ట్ర బీసీ కమిషన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని రుజువైంది. అయితే, ప్రభుత్వం ఈ కోటాను 16 శాతం బదులు, బీసీ కమిషన్ సూచించిన ప్రకారం 12 నుంచి 13 శాతానికి తగ్గించాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ‘రిజర్వేషన్ కోటా మొత్తం 50 శాతానికి మించరాదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, గణాంకాలను అనుసరించి ఆ పరిమితిని దాటే వీలుంది’ అని ధర్మాసనం వివరించింది. అయితే, 16 శాతం రిజర్వేషన్ కోటా ప్రకారం ఇప్పటికే పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చినట్లు తీర్పు వెలువడిన అనంతరం ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ఏడాదికి 16 శాతం రిజర్వేషన్లనే కొనసాగించాలని కోరింది. దీనిపై ప్రత్యేకంగా మరో పిటిషన్ వేయాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. మరాఠాలకు రిజర్వేషన్ల నేపథ్యం 2017 జూన్: రాష్ట్రంలో మరాఠా వర్గం సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన పరిస్థితుల అధ్యయనం కోసం మహారాష్ట్ర సర్కారు రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్‌ను నియమించింది. 2018 జూలై: రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో మరాఠాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన హింసాత్మక రూపం దాల్చింది. నవంబర్ 2018: బీసీ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నవంబర్ 2018: మరాఠాలను వెనుకబడిన వర్గంగా గుర్తిస్తూ రాష్ట్ర అసెంబ్లీ వారికి 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించింది. బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ సంతకం చేశారు. డిసెంబర్ 2018: మరాఠాలకు రిజర్వేషన్ల మొత్తం కోటా 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమంటూ బాంబే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మార్చి 2019: జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతి డాంగ్రేల ధర్మాసనం ఫిబ్రవరిలో ప్రారంభించిన విచారణను మార్చితో ముగించి, తుదితీర్పును రిజర్వులో ఉంచింది. జూన్ 2019: మరాఠాలకు రిజర్వేషన్లను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. బీసీ కమిషన్ సిఫారసుల మేరకు రిజర్వేషన్లను 12 నుంచి 13 శాతం మధ్యలో ఉండేలా తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. -
‘మహా’ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు చీవాట్లు
ముంబై: ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఉన్నాయంటూ పత్రికల్లో ప్రకటనలు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ అంశానికి సంబంధించి పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా కూడా ఎలా జారీ చేస్తారని తీవ్రంగా మందలించింది. ఇలాంటి బాధ్యతా రాహిత్యమైన చర్యలు మానుకోవాలని, పిటిషన్లను పరిష్కరించేందుకు కోర్టుకు కాస్త సమయం ఇవ్వాలని మండిపడింది. మరాఠాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ ఉందని తెలిసి కూడా ఆదరాబాదరగా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరేశ్ పాటిల్, న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ కర్ణిక్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ బాంబే హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ఇటీవల దాఖలయ్యాయి. మరాఠాలకు రిజర్వేషన్లపై మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలు జారీ చేసిందని పిల్ దాఖలు చేసిన న్యాయ వాది గుణరతన్ సదావర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మరాఠాల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిని ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వీఏ థొరాట్ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు మాత్రమే ఆహ్వానించామని, పరీక్ష 2019 జూలైలో ఉంటుందని వివరించారు. అయితే ప్రకటన ఇవ్వాల్సిన తొందరేం వచ్చిందని, ఇందుకు కొద్ది రోజులు ఆగి ఉండాల్సిందంటూ కోర్టు మందలించింది. సాంకేతికంగా ప్రభుత్వానిది తప్పు కాదని, అయితే ఈ సమస్య తీ వ్రత దృష్ట్యా ప్రభుత్వం వేచి చూడాల్సి ఉందన్నారు. పిల్ వేసిన న్యాయవాదిపై దాడి.. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది గుణరతన్ సదావర్తిపై హైకోర్టు వెలుపల దాడి జరిగింది. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. మరాఠా వర్గానికి చెందిన ఓ వ్యక్తి గుంపులో నుంచి ముందుకు దూసుకొచ్చి ‘ఒక్క మరాఠా లక్షమంది మరాఠాలు’అని నినాదాలు చేస్తూ న్యాయవాదిని కత్తితో పొడిచాడని వివరించారు. అయితే అక్కడున్న న్యాయవాదులు, పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జల్నా జిల్లాకు చెందిన వైజయంత్ పాటిల్‌గా గుర్తించారు. -
మరాఠాలకు రిజర్వేషన్లు
ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం చెప్పారు. ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం’ (ఎస్ఈబీసీ – సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్) కేటగిరీ కింద వారికి రిజర్వేషన్లు ఇస్తామన్నారు. రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించిందనీ, రిజర్వేషన్ ఎంత శాతం ఇవ్వాలనేది మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయిస్తుందన్నారు. తమిళ నాడులో మాదిరిగా 16 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశ ముందని భావిస్తున్నారు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 68 శాతా నికి చేరతాయి. నేడు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది. కీలకమైన మరాఠాలు రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్నారు. గతవారం బీసీ కమిషన్ నివేదిక సమర్పించిన వెంటనే మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయమై ఫడ్నవిస్ సానుకూలగానే స్పందించారు. ఎన్నో ఏళ్లుగా మరాఠాలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలు చాలా తక్కువగా ఉన్నారనీ, కాబట్టి వారిని ఎస్‌ఈబీసీలుగా పరిగణిస్తున్నట్లు బీసీ కమిషన్ పేర్కొంది. రాజ్యాంగంలోని అధికరణం 15 (4), 16 (4)ల ప్రకారం ఎస్‌ఈబీసీలకు రిజర్వేషన్ల ఫలాలను అనుమతించవచ్చు. మరాఠాలకు రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్ల శాతం 50కి పైగా పెరిగితే అది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కాదా అని ప్రశ్నించగా, ఇది ప్రత్యేక అంశమని ఫడ్నవిస్ చెప్పారు. -
కోటా కోసం తనువు చాలించిన బాలిక..
సాక్షి, ముంబై : మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. రాధాబాయ్ కాలే మహిళా కళాశాలకు చెందిన పదకొండో తరగతి విద్యార్థిని కిషోరి బబన్ కకాడే అనే విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుందని ఎస్పీ రంజన్ కుమార్ శర్మ చెప్పారు. మరాఠాలకు కోటా కోరుతూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని బాలిక లేఖలో పేర్కొంది. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో తాను 89 శాతం మార్కులు సాధించినా పదకొండో తరగతిలో సైన్స్ గ్రూపులో అడ్మిషన్ సాధించలేకపోయానని లేఖలో పేర్కొందని ఎస్పీ తెలిపారు. వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే తన తండ్రి రూ 8000 ఫీజు చెల్లించడంతో అడ్మిషన్ పొందానని, ఫీజు చెల్లించడం తన కుటుంబానికి భారమని, రిజర్వేషన్ వర్తించే కులాల్లో 76 శాతం మార్కులు వచ్చినా వారికి కేవలం రూ 1000 ఫీజుతో అడ్మిషన్ లభించిందని లేఖలో బాలిక ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగంలో రిజర్వేషన్లు లేని మరాఠా వర్గానికి చెందడంతో తాను వివక్ష ఎదుర్కొన్నానని బాలిక పేర్కొందని పోలీసులు తెలిపారు. తన మరణంతో మరాఠా ఉద్యమం బలపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బాలిక ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వ తీరును పలు మరాఠా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి.