Meerpet
-
HYD: మీర్పేట్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం మీర్పేట్లో సోమవారం(అక్టోబర్7) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నందన వనం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.టూ వీలర్‌ను లారీ ఢీకొనడంతో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మీద నుంచి లారీ వెళ్లడంతో వారి మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. ఇదీ చదవండి: భారీగా సైబర్ నేరగాళ్ల అరెస్ట్ -
వర్షం ఎఫెక్ట్.. మీర్పేట్లో ఇళ్లలోకి వరద నీరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మీర్పేట్ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ పరిధిలోని మిథిలా నగర్, సత్యసాయి నగర్ సహా పలు కాలనీల్లోకి చెరువు నీరు వచ్చి చేరుతోంది. నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక.. ఎస్ఎన్డీపీ నాలా మూసుకుపోవడంతో మ్యాన్‌హోల్స్ నుంచి నీరు ఉప్పొంగుతోంది. రాత్రి నుంచి క్రమంగా నీరు పెరిగి ఉదయానికి నీరు ఇళ్లలోకి చేరుకుంది.ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గత ముడు రోజులుగా మా కాలనిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. బయటికి రాలేము, ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. వర్షాల కారణంగా మంత్రాల చెరువు, పెద్ద చెరువు నిండి వరదనీరు కాలనీలోకి వస్తోంది. వరద నీటి కోసం గతంలో వేసిన ట్రాంక్ పైప్ లైన్లు మూసుకుపోవడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కానీ.. శాశ్వత పరిష్కారం లేదని తెలిపారు. -
అందుకే చెప్పకుండా వచ్చేశా.. మిస్సింగ్ బాలుడి ఆచూకీ లభ్యం
సాక్షి, తిరుపతి: హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడిని తిరుపతి రైల్వేస్టేషన్లో గుర్తించారు. బాలుడు మహీధర్‌రెడ్డి ఆచూకీ మలక్‌పేట రైల్వేస్టేషన్లో ఫుటేజ్ ద్వారా లభ్యమైంది. బాలుడిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బంధువులు తీసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం మీర్పేట్లో ట్యూషన్‌కు వెళ్లి బాలుడు కనిపించకపోయిన సంగతి తెలిసిందే.ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చానని.. తిరుమల నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడానని బాలుడు తెలిపాడు. ఆ బాలుడిని చైల్డ్ హోంకు తరలించిన పోలీసులు.. కర్నూలు నుంచి మేనమామ వస్తున్నాడని.. ఆయనకు అప్పగిస్తామని తెలిపారు.జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపంతుల కుమారుడు మహిధర్‌రెడ్డి(13) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతన్నారు. రోజుమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు తన అన్నతో కలిసి సర్వోదయనగర్‌లో ట్యూషన్‌కు బయలుదేరాడు. వీరు నిత్యం లిఫ్ట్ అడిగి వెళ్తుంటారు. ఓ బైక్ ఆపగా.. అన్నను వెళ్లమని చెప్పిన మహిధర్ తాను తర్వాత వస్తానన్నాడు. అనతరం మరో స్కూటీని లిఫ్ట్ అడిగి మీర్పేట్ బస్టాండ్ వద్ద దిగి అక్కడ నుంచి మిథాని డిపోకు చెందిన ఉమెన్స్ కాలేజీ బస్‌లో మలక్‌పేట్ రైల్వే స్టేషన్ బస్టాప్‌లో దిగాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుని రైలు ఎక్కాడు. ముందుగా కిడ్నాప్ అనుకుని.. ట్యూషన్‌కు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిడ్నాప్ అనుకుని మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లిన్నట్లు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా బాలుడు తనంతట తానే లిఫ్ట్ అడిగి.. బస్ ఎక్కి, అనంతరం రైలులో వెళ్లిన్నట్లు గుర్తించారు. సొంతూరు కర్నూల్ వెళ్లి ఉంటాడని భావించి అక్కడి పోలీసులు, బంధువులను అప్రమత్తం చేశారు. ఏసీపీ కాశిరెడ్డి మీర్‌పేటకు వచ్చి సీసీ పుటేజీ పరిశీలించా.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. -
ఏసీబీ వలలో మీర్‌పేట ఎస్ఐ
హైదరాబాద్: నోటరీ ప్లాటు విక్రయ సెటిల్మెంట్ వ్యవహారంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు అడ్డంగా దొరికిపోయాడు. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాదర్గుల్కు చెందిన షేక్ నజీముద్దీన్ గత డిసెంబరులో సర్వే నంబర్ 197లోని తన 200 గజాల నోటరీ ప్లాటును గుర్రంగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాదాని సుభాష్‌కు రూ.4.80 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సుభాష్ రూ.2.10 లక్షలు బయానా చెల్లించి ప్లాటుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ ప్లాటు కొంత కాలంగా కోర్టు వివాదంలో ఉండడం, తాజాగా కోర్టు కేసు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో నజీముద్దీన్ తన ప్లాటును తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తేగా సుభాష్ అంగీకరించలేదు. దీంతో నజీముద్దీన్ ఈ నెల 23న మీర్‌పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ బొడ్డుపల్లి సైదులుకు ఫిర్యాదు చేశాడు. సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసు అధికారి సుభా‹Ùను స్టేషన్‌కు పిలిపించి ప్లాటు పత్రాలు వెనక్కి ఇవ్వకపోతే, అవి పోయినట్లు దొంగతనం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన సుభాష్ ప్లాట్ కాగితాలు నజీముద్దీన్కు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసి ఎస్ఐ సుభాష్‌కు రూ.1.40 లక్షలు ఇప్పించాడు. ఇందులో తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.5వేలు ఇస్తానని ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత ఓసారి మధ్యవర్తి ముత్యంరెడ్డితో కలిసి స్టేషన్‌కు వచ్చాడు. రూ.10 వేలు ఇస్తామని చెప్పడంతో ఎస్ఐ ఓకే చెప్పాడు. ఈ వ్యవహారాన్నంతా బాధితుడు ముందుగానే సెల్ఫోన్లో రికార్డు చేసి ఏసీబీ అధికారులకు పంపాడు. శనివారం పీఎస్‌కు వచ్చిన సుభాష్ నుంచి ఎస్ఐ రూ.10 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్ఐ సైదులును మేజి్రస్టేట్ ఎదుట హాజరు పర్చడంతో పాటు తన ఇంట్లోని ఫైళ్లను తనిఖీ చేశామని తెలిపారు. 2021లో సరూర్‌నగర్ పీఎస్‌లో విధులు నిర్వర్తించిన సమయంలోనూ ఇలాంటి కేసులోనే ఎస్ఐ సైదులు సస్పెండ్ అయ్యాడని స్పష్టంచేశారు. లంచం కోసం ఇబ్బంది పెడితే 1064 ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
యజమాని వేధింపులు..శానిటైజర్ తాగిన యువతి
-
సెలూన్ యజమాని లైంగిక దాడి..శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: మీర్పేట్ టీచర్స్ కాలనీలోని గత కొంతకాలంగా సెలూన్లో పనిచేస్తున్న దివ్య అనే యువతి (18)పై యజమాని మురళి(35) లైంగిక దాడికి పాల్పడుతుండటంతో ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఓ సెలూన్ లో పని చేస్తున్న దివ్యను యజమాని మురళి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమాచారం. మంగళవారం 2024 జనవరి 30న మరళి సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్య(18)ను తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నం చేయగా.. దివ్య బయటికి వచ్చి అరవడంతో మురళి అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. గతంలో పలుమార్లు మురళి దివ్యను లైంగిక దాడి చేశాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి రాజ్‌భవన్ వర్గాల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్న ఆమె.. ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, డీసీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని.. నందనవనం కాలనీలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. బాలిక ఇంట్లోకి దూరి మరీ ఆమె సోదరుడి ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు గంజాయి బ్యాచ్ అని, మత్తులోనే అఘాయిత్యానికి తెగబడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఇక భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS), రంగారెడ్డి జిల్లా శాఖ, బాధితురాలి ఇంటిని సందర్శించి, ఆమె కుటుంబానికి అవసరమైన అన్నివిధాల సహాయాన్ని వెంటనే అందించాలని గవర్నర్ సౌందరరాజన్ ఆదేశించారు. -
హైదరాబాద్: ప్రాణం తీసిన బీరు
సాక్షి, క్రైమ్: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు మీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. బీర్ బాటిల్స్ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేశారు. మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించారు పోలీసులు. జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్.. బీరు బాటిల్స్ కొనుక్కుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. అతన్ని అడ్డుకుని బాటిల్స్ తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు. బీర్ బాటిల్ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మీర్ పేట్ పోలీసులు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్‌లను నిందితులుగా నిర్ధారించారు. -
మీర్పేట్లో దారుణం.. కన్న బిడ్డలపై తల్లి కర్కశం, ఇద్దరు పిల్లల్ని చంపి..
సాక్షి, రంగారెడ్డి: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్‌డే రోజే ఓ తల్లి ఘోరానికి పాల్పడింది. క్షణికావేశంలో 9 నెలలు మోసి కన్న పేగు బంధాన్ని తెంచుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను వాటర్ బకెట్లో ముంచి వారిని తిరిగిరాని లోకాలకు పంపించింది. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మీర్పేట్లో నివాసముంటున్న శ్రీను నాయక్‌కు తన భార్య భారతి(26)తో ఇటీవల గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన భారతి భర్త మీద కోసం ఆదివారం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తను ఆత్మహత్యాయత్నం చేయగా.. పక్కనే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి.. -
కార్పొరేటర్ భర్త హంగామా.. కారుతో ఢీకొట్టి.. ఆపై దాడి చేసి..
సాక్షి, హైదరాబాద్: బైక్‌పై వెళుతున్న వారిని కార్పొరేటర్ భర్త కారుతో ఢీకొట్టి ఆపై దాడి చేసిన ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట 28వ డివిజన్ కార్పొరేటర్ జిల్లెల అరుణ భర్త ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి కారులో ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో న్యూ బాలాజీనగర్‌కు చెందిన బలరామకృష్ణ మీర్‌పేట చౌరస్తా నుంచి మరో వ్యక్తి డానియల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. శివసాయినగర్ కాలనీ పార్కు వద్దకు రాగానే ప్రభాకర్‌రెడ్డి తన కారుతో బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడ్డారు. దీంతో బలరామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభాకర్‌రెడ్డి.. బలరామకృష్ణపై దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. తనపై దాడి చేసిన ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాలరామకృష్ణ మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నన్ను, నా భార్యను బలరామకృష్ణ బూతులు తిట్టాడని ప్రభాకర్‌రెడ్డి కూడా ఫిర్యాదు చేశాడు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. పరస్పర ఆరోపణలు తనను చంపేందుకే ప్రభాకర్‌రెడ్డి కారుతో ఢీ కొట్టాడని బాలరామకృష్ణ ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే చేస్తే మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా తనపై రాజకీయంగా బురద జల్లేందుకే బాలరామకృష్ణ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రోడ్డుకు ఎడమ వైపు కుక్క పిల్లలు ఉండడంతో వాటిని తప్పించబోయి కుడివైపు వస్తున్న బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొనడం జరిగిందని తెలిపారు. అంతేగానీ ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదన్నారు. కావాలనే బలరామకృష్ణ నన్ను, నా భార్యను బూతులు తిట్టాడని జిల్లెల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్: మీర్పేట్ కార్పొరేటర్ భర్త వీరంగం
-
మొన్న పూజిత.. నేడు అమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇటీవల 4వ తరగతి విద్యార్థిని పూజిత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. తాజాగా 2వ తరగతి చదువుతున్న మరో చిన్నారి ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, వచ్చి ఆపాలని రాత్రి 11 గంటలకు డయల్ 100కు కాల్ చేసిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రశాంతిహిల్స్ రోడ్ నం–6కు చెందిన అమీక్ష (7) టీచర్స్‌కాలనీలోని భారతి స్కూల్లో 2వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఇద్దరి కూలీలు గొడవ పడుతున్నారు. గొడవ జరుగుతున్నట్లు గ్రహించిన చిన్నారి అమీక్ష రాత్రి 11 గంటలకు తండ్రి సెల్‌ఫోన్ తీసుకొని డయల్ 100కు కాల్ చేసి ఇక్కడ గొడవ జరుగుతుంది.. వెంటనే వచ్చి గొడవను ఆపాల్సిందిగా కోరింది. బాలిక ఫిర్యాదు చేయడంతో మీర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు కూలీలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. తొందరగా స్పందించినందుకు థ్యాంక్యూ అంకుల్ అని చిన్నారి చెప్పినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. అమీక్షను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఆపద వచ్చినా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. -
మీర్పేట్లో దారుణం.. వివాహితపై ఎస్బీ కానిస్టేబుల్ అత్యాచారం
సాక్షి, హైదరాబాద్(మీర్‌పేట): మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు.. తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, లేదంటే న్యూడ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించిన ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసిన మీర్పేట్ పోలీసులు బుధవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు గతంలో మాధన్నపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. వీరి ఇంటి సమీపంలో నివాసముండే బాధిత మహిళ (34) కుటుంబం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండేవారు. వేంకటేశ్వర్లు గతంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా ఆమె తిరస్కరించినప్పటికీ మానసికంగా, శారీరకంగా వేధిస్తుండడంతో 25 జనవరి, 2021న సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో పోలీసులు అతనికి కౌన్సె లింగ్ ఇచ్చారు. అయినా వెంకటేశ్వర్లు తన బుద్ధి మార్చుకోకుండా మరలా మహిళను వేధించడంతో పాటు లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేయడం మొదలుపెట్టాడు. దీంతో విసుగు చెందిన ఆమె మరోసారి సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. 2021, మేలో వెంకటేశ్వర్లును రిమాండ్ చేశారు. ఆతర్వాత సదరు మహిళ ఫోన్ నంబర్‌తో పాటు తమ నివాసాన్ని మొదట ఈసీఐఎల్‌కు, అక్కడినుంచి మీర్‌పేట సీతాహోమ్స్కు మార్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అనంతరం మహిళ ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ తెలుసుకుని భర్త, పిల్లలు లేని సమయంలో ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించాడు. 2022, ఆగస్టు 17న మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి తనతో సహజీవనంచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీశాడు. ఈ నెల 14న మళ్లీ వెళ్లి.. గతంలో తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశాడు. పరుష పద జాలంతో ధూషిస్తూ లైంగిక దాడికి యత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు నీ నగ్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో వెంకటేశ్వర్లుపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: చదివేది బీటెక్, సీఏ.. చేసే పనులేమో చైన్ స్నాచింగ్‌లు..) -
హైదరాబాద్‌లో దారుణం.. రెచ్చిపోయిన మృగాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో దారుణం జరిగింది. కొందరు దుండగులు లెనిన్‌నగర్‌లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణ ఘటన నవంబర్ 5వ తేదీన జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల ప్రకారం.. మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడియత్నం చేశారు. కాగా, లెనిన్‌నగర్‌కు చెందిన బాధితురాలు.. తన రాత్రి సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం, బైక్‌పై ఎక్కించుకుని బడంగ్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాల వెనుకకు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడియత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల రాకను గమినించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, లైంగికయత్నంలో నిందితులు.. బాధితురాలిని బెదిరింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. తమ గురించి ఎవరికైని చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
సంబంధంలేని గొడవలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు
సాక్షి, హైదరాబాద్: గొడవతో సంబంధం లేదు... గొడవ పడుతున్న వారితోనూ ఎటువంటి స్నేహం లేదు.. స్నేహితుడి ఇంటి వద్ద దించేందుకని వచ్చిన యువకుడు సంబంధం లేని తగాదాలోకి వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకున్న విషాదకర సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఇన్చార్జి సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. జిల్లెలగూడ బాలాజీకాలనీలో అద్దెకు ఉండే మణికంఠ తన స్నేహితులైన నరేందర్, నవీన్, సాయికుమార్, జైపాల్‌తో కలిసి శ్రీశైలం వెళ్లి ఆదివారం రాత్రి 11 గంటలకు కర్మన్‌ఘాట్ గ్రీన్‌పార్కు కాలనీకి వచ్చి ప్రవీణ్, భార్గవ (21)లతో కలిసి నిర్మానుష్య ప్రదేశంలో అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత మణికంఠ తనను ఇంటి వద్ద దించేందుకు టీకేఆర్ కమాన్ వద్ద నివాసముండే మరో స్నేహితుడు శరత్‌కు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. దీంతో శరత్ తన ద్విచక్ర వాహనంపై మణికంఠను తీసుకుని బాలాజీకాలనీలోని ఇంటికి వచ్చి తలుపు ఎంత కొట్టినా మణికంఠ తల్లి సంధ్యారాణి తలుపు తీయలేదు. ఇద్దరి సెల్ఫోన్లలో బ్యాలెన్స్ లేకపోవడంతో అదే వీధిలో నివాసముండే రమాదేవి తన మనువరాలి తొట్టెల శుభకార్యం (21వరోజు) చేసుకుంటున్నారు. దీంతో మణికంఠ, శరత్‌లు అక్కడికి వెళ్లి మా అమ్మపేరు సంధ్యారాణి.. తలుపు ఎంతకూ తీయడం లేదు. మా సెల్ఫోన్లలో బ్యాలెన్స్ అయిపోయిందని ఫోన్ ఇస్తే కాల్ చేసుకుంటామని రమాదేవిని అడిగారు. దీంతో రమాదేవి బంధువు అయిన మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రూపేష్‌కుమార్ ఈ అర్ధరాత్రి వేళ వచ్చి సెల్‌ఫోన్ అడుగుతున్నారు ఎందుకని ప్రశ్నించాడు. శరత్, రూపేష్ కుమార్ల మధ్య మాటమాట పెరిగి వాగ్వివాదం జరగడంతో అందరూ కలిసి కావాలనే అల్లరి చేస్తున్నారని శరత్, మణికంఠను కొట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. చదవండ: వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ ఇరువర్గాల మధ్య ఘర్షణతో.. అనంతరం ఇద్దరు కలిసి చందన చెరువు కట్ట వద్దకు వెళ్లి అక్కడే జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారి వద్ద నుంచి.. శరత్ సెల్‌ఫోన్ తీసుకుని బాలాపూర్ సాయినగర్‌కు చెందిన నరేందర్‌కు ఫోన్ చేసి తమపై దాడి చేశారని చెప్పాడు. తనను ఇంటి వద్ద దించేందుకు వెంట వచ్చిన భార్గవతో కలిసి వెంటనే నరేందర్ చెరువు కట్ట వద్దకు చేరుకున్నాడు. దీంతో పాటు శరత్ మరో స్నేహితుడైన ప్రవీణ్ ఇంటికి వెళ్లి బైక్‌పై ఎక్కించుకుని వచ్చాడు. ఐదుమంది కలిసి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో శుభకార్యం జరుగుతున్న రమాదేవి ఇంటికి వెళ్లారు. అంతా మద్యం సేవించి ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎక్సైజ్ కానిస్టేబుల్ రూపేష్‌కుమార్‌పై ఇటుకతో దాడి చేయగా బంధువులంతా కోపోద్రిక్తులై యువకులను చితకబాదారు. పారిపోతున్న క్రమంలో భార్గవ కిందపడగా తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని ఓవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడు భార్గవ సైదాబాద్ వాసి అని, మెడికల్ డిస్ట్రిబ్యూషన్లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తుంటాడని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి దాడికి పాల్పడిన రూపేష్‌కుమార్, రమాదేవితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ యాదయ్య పేర్కొన్నారు. -
మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి..
సాక్షి, రంగారెడ్డి: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ బాలాజీనగర్‌లో నివసించే ఆవుల శివకుమార్(30), హారికలు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల పాప ఉంది. శివకుమార్ టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన శివకుమార్ బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోకుండా మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య మహిళా సంఘాల నాయకులతో కలిసి ఇంటి ఎదుట ఆందోళనకు చేపట్టింది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి వేణుకుమార్ (46), కల్పన (42)కు 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా బడంగ్‌పేట శివనారాయణపురంలో నివాసమున్నారు. వేణుకుమార్ నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వేణు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని భార్య కల్పన ఆరోపిస్తూ గతంలో వరంగల్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వేణుపై కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో మెయింటెనెన్స్ కేసు నడుస్తోంది. తనను దూరం పెట్టాలనే ఉద్ధేశంతో మూడేళ్లుగా తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని కల్పన శుక్రవారం స్థానిక మహిళా సంఘాల నాయకులతో కలిసి శివనారాయణపురంలోని భర్త ఇంటికి వచ్చి బైఠాయించి పోలీసులు, కోర్టు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ ఫిర్యాదులు చేయగా కేసు విచారిస్తున్నామని సీఐ తెలిపారు. చదవండి: బిహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి -
జానియర్పై లైంగిక దాడి.. వేధింపులు మితిమీరడంతో..
మీర్‌పేట: పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బాలికపై అత్యాచారం చేశాడు. వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్‌పేటకు చెందిన బాలిక (17) బర్కత్‌పురాలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న తోటి విద్యార్థి గుడ్డె అమిత్‌వర్ధన్ (19) సదరు బాలికను పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని చెప్పాడు. మొదట నిరాకరించిన ఆమె తర్వాత సన్నిహితంగా మెలిగింది. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో అమిత్‌వర్ధన్ బడంగ్‌పేటలోని బాలిక ఇంటికి వచ్చి నీతో మాట్లాడాలని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. చదవండి: (భర్తతో విడాకులు.. మరొకరితో ప్రేమ.. విధులకు వెళ్తుండగా..) వీడియోను తరచూ బాలికకు చూపించి తాను చెప్పినట్లు చేయాలని, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. వేధింపులు మితిమీరడంతో బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు అమిత్వర్ధన్ను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్: ఇంట్లోనే వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మీర్‌పేట సర్వోదయనగర్ కాలనీకి చెందిన నిర్వాహకురాలు వాసిరెడ్డి సుధారాణి తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకురాలు సుధారాణి, దిల్సుఖ్నగర్ కృష్ణానగర్‌కాలనీకి చెందిన విటుడు గట్ల రాజు (37)తో పాటు ఓ యువతిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సుధారాణి గతంలోనూ ఇదే కేసులో పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. కోర్టు భవనం -
వివాహేతర సంబంధం.. మహిళతో న్యూడ్ కాల్స్.. వాటిని రికార్డ్స్ చేసి!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసి చివరకు హత్యచేయించింది. మీర్‌పేటలో ఫోటోగ్రాఫర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితురాలైన ఓ మహిళతో పాటు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి ప్రకారం... నగరంలోని భాగ్ అంబర్‌పేటకు చెందిన మల్కాపురం యష్మాకుమార్ (32) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఈయనకు 2018లో మీర్‌పేట నందిహిల్స్‌కు చెందిన వివాహిత బుచ్చమ్మగారి శ్వేతారెడ్డి (32)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణలు కొనసాగడంతో సన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. కాగా యష్మాకుమార్ శ్వేతారెడ్డికి ఫోన్ చేసి న్యూడ్ కాల్స్ చేయమన్నాడు. వాటిని రికార్డ్ చేసుకున్న యష్మాకుమార్ నెల రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతారెడ్డిపై ఒత్తిడి పెంచాడు. లేదంటే న్యూడ్ ఫొటోలు, వీడియో కాల్స్‌ను బంధువులకు పంపుతానని బెదిరించసాగాడు. ఆందోళనకు గురైన శ్వేతారెడ్డి యష్మాకుమార్ను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందుకు కృష్ణాజిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కొంగల అశోక్ (28), ఎలక్ట్రీషియన్ కొత్తపల్లి కార్తీక్(30) సాయం కోరింది. పథకం ప్రకారం శ్వేతారెడ్డి ఈ నెల 3న యష్మాకుమార్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. దీంతో అతను అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రశాంతిహిల్స్ వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ మాటువేసిన అశోక్, కార్తీక్ సుత్తితో యష్మాకుమార్ తలపై బలంగా దాడి చేశారు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హత్య చేసిన తరువాత యష్మాకుమార్వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని రావాలని శ్వేతారెడ్డి తెలుపగా సెల్‌ఫోన్ కనిపంచకపోవడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యష్మాకుమార్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన శ్వేతారెడ్డి ఆమెకు సహకరించి హత్య చేసిన అశోక్, కార్తీక్‌లను బుధవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: ప్రేమించి పెళ్లి.. సంతానం కలగకపోవడంతో.. సోదరుల సమాధుల వద్ద -
'ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుంది'
సాక్షి, మీర్‌పేట (రంగారెడ్డి): అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఇచ్చిన డబ్బుకు పదింతలు అధికంగా ఇస్తానని నమ్మించి రూ.11 లక్షలతో ఓ మహిళ, కొందరు వ్యక్తులు ఉడాయించిన సంఘటన మీర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపురం కస్తూరికాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (43) వృత్తిరీత్యా వ్యాపారి. నందిహిల్స్‌లో నివాసముండే ఇతని స్నేహితుడు మహేశ్.. రాజు అనే ఓ వ్యక్తిని శ్రీనివాస్‌రెడ్డికి పరిచయం చేశాడు. రాజుకు తెలిసిన నగరంలోని ఓ మహిళకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుందని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని స్నేహితులైన మరో ఏడుగురు కలిసి రూ.11 లక్షలు పోగు చేశారు. మధ్యవర్తులుగా ఉన్న రాజు, వినోద్, మహమ్మద్‌ఖాన్‌ల ద్వారా ఈ నెల 1వ తేదీన రాత్రి సదరు మహిళను హస్తినాపురం విశ్వేశ్వరయ్య కాలనీలోని శ్రీనివాస్‌రెడ్డి సోదరుడి షెడ్డుకు పిలిపించి పూజలు చేయించారు. ముందుగా రూ.5 వేలు పూజలో పెడితే రూ.50 వేలుగా మారుస్తానని మహిళ చెప్పగా.. వారు ఆ నగదు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత వాటిని రూ.50 వేలుగా చేసి చూపించింది. చదవండి: (వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్) నమ్మకం కలిగించిన తర్వాత మిగతా డబ్బును కూడా పూజలో పెట్టాలని చెప్పగా శ్రీనివాస్‌రెడ్డి, అతని స్నేహితులు రూ.11 లక్షలు పూజలో పెట్టారు. పథకం ప్రకారం సదరు మహిళ అందరం కలిసి భోజనం చేద్దామని వారికి చెప్పింది. భోజనం చేస్తుండగా 15 మంది వ్యక్తులు రెండు కార్లలో అక్కడికి వచ్చి పోలీసులమని బెదిరించి శ్రీనివాస్‌రెడ్డి, అతని స్నేహితులపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం సదరు మహిళ పూజలో ఉంచిన రూ.11 లక్షలు తీసుకుని కారులో వచ్చిన వారితో పాటే పారిపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్: కార్పొరేటర్ తనయుడి నిర్వాకం.. ప్రేమించాలంటూ బాలికకు..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించాలంటూ ఓ బాలికను వేధిస్తున్న కార్పొరేటర్ తనయుడిపై మీర్‌పేట పోలీసులు పోక్సో, నిర్భయ కేసులు కేసు నమోదు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లెలగూడ మల్రెడ్డి రంగారెడ్డి కాలనీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు, మీర్‌పేట బీజేవైఎం అధ్యక్షుడు బచ్చనమోని ముఖేష్‌యాదవ్ స్థానికంగా నివసించే ఓ బాలిక (15)ను ప్రేమించాలంటూ కొంత కాలంగా వేధిస్తున్నాడు. తరచూ మెసేజ్‌లు పంపుతూ, ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బాలిక సమీపంలోని కిరాణాషాప్‌నకు వెళ్తుండగా ముఖేష్‌యాదవ్ వెంబడించి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముఖేష్‌యాదవ్‌పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ముఖేష్‌పై మరో కేసు కూడా నమోదైందని, విచారణ జరుగుతోందని సీఐ తెలిపారు. చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం -
రియల్ ఎస్టేట్ వ్యాపారం.. మరోవైపు పేద యువతులు, మహిళలతో వ్యభిచారం
సాక్షి, మీర్‌పేట: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్‌పేట లక్ష్మీనగర్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే పిల్లలమర్రి వేణు (33) ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ బద్యానాయక్ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం ఇంటిపై దాడి చేశాడు. ఈ దాడిలో నిర్వాహకుడు వేణుతో పాటు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యువతి (24), వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీకి చెందిన విటుడు కొల్లా బలరాముడు (52)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వెయ్యి రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఉపాధి పేరిట ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద యువతులు, మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్టు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీసుల అదుపులో నిందితులు చదవండి: మహిళకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి లాగేందుకు యత్నం.. చివరికి -
సులభ్ కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం..
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బడంగ్పేట్లో స్థానికంగా ఉండే పండ్ల వ్యాపారి కూతురుపై పక్కనే ఉండే సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవిందర్ అనే వ్యక్తి 10 ఏళ్ల బాలికను సులభ్ కాంప్లెక్స్ లోపలికి తీసుకెళ్లి న్యూడ్ వీడియో చూపిస్తూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే ఇంతలో తన కూతురు కనపడటం లేదని గుర్తించిన తల్లి.. అనుమానంతో సులభ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లి వెతకగా చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే డోర్ తీయడంతో రవిందర్ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాదారు. అనంతరం మీర్పేట్ పోలీసులకు అప్పగించారు. చదవండి: ఇద్దరితోనూ సన్నిహితం.. అక్కపై మరిగిన నూనె పోసిన చెల్లెలు -
HYD: భర్తతో గొడవలు.. మరో వ్యక్తితో పరిచయం.. ఇద్దరు పిల్లలతో కలిసి
సాక్షి, మీర్‌పేట: భర్తతో గొడవపడిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పదర గ్రామానికి చెందిన కుమార్, రాధ (30) భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఏడేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో రాధ భర్తను వదిలేసి జిల్లెలగూడ అంబేడ్కర్‌నగర్‌కు వచ్చి ఓ అపార్ట్మెంట్లో వాచ్‌ఉమన్‌గా పనిచేస్తూ ఇక్కడే ఉంటోంది. తరచూ భర్త వచ్చి వెళ్తుండేవాడు. రాధ కూలీ పనులకు కూడా వెళ్తుండేది. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో రెండు నెలలుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న భర్త కుమార్ గత నెల 4న కుటుంబసభ్యులతో కలిసి అంబేడ్కర్‌నగర్‌కు వచ్చి రాధను మందలించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అర్ధరాత్రి అందరూ నిద్రించిన తర్వాత రాధ తన ఇద్దరు కుమారులు రవి (10), గణేష్ (12)ను తీసుకుని దుర్గాప్రసాద్‌తో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. వారి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్